సాక్షి, న్యూఢిల్లీ : భారత విదేశాంగ విధానానికి మోదీ సర్కార్ తూట్లు పొడిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్టీ ప్లీనరీలో సీనియర్ నేత ఆనంద్ శర్మ ఎన్‌డీఏ విదేశాంగ విధానాన్ని దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం విదేశీ విధానంలో చిత్తశుద్ధి లోపించిందని, సమదృష్టి కొరివడిందని ఆరోపించారు. ప్రధాని తన ప్రచారార్భాటం కోసం పరితపిస్తున్నారని ఆరోపించారు. కీలక దేశాలతో మన సంబంధాలను సజావుగా నిర్వహించడంలో విఫలమయ్యారని విమర్శించారు.
పొరుగుదేశాలతో సంబంధాల నిర్వహణ సవ్యంగా లేదని ఆనంద్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు.విదేశాంగ విధానాన్ని మోదీ వ్యక్తిగతంగా ముందుకు తీసుకువెళుతున్నారని ఇది గందరగోళంగా సరైన దిశాదశా లేకుండా సాగుతోందని వ్యాఖ్యానించారు. విదేశాంగ విధానంపై ఆనంద్ శర్మ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మోదీ ప్రచార మోజుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నేతల పట్ల మోదీ తీరు అభ్యంతరకరమని, ఆయన తీరు కాంగ్రెస్ పార్టీతో పాటు దేశానికి అవమానకరమని ఆక్షేపించారు.
Comments
Please login to add a commentAdd a comment