Anand Sharma
-
కులగణనపై కాంగ్రెస్ నేత అసమ్మతి వ్యాఖ్యలు
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న దేశవ్యాప్త కులగణన హామీపై ఆ పార్టీ సీనియర్ నేత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఆనంద్ శర్మ తీవ్ర అసమ్మతిని వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రాజకీయాలు చేయలేదని అన్నారు. అదేవిధంగా 1980 ఎన్నికల సమయంలో దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ.. ‘కులాలపై కాదు.. చేతి గుర్తుపైనే ఓటు ముద్ర’ అని నినాదం చేశారని గుర్తుచేశారు. ఆమె కూడా కుల రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ సైతం కులాన్ని ఎన్నికల కోణంలో చూడకూడదని పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఇలా ఇద్దరు నేతలు రాజకీయాల్లో కులతత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ.. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. అదేవిధంగా కులరాజకీయాలను వ్యతిరేకించే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆదర్శనాలను అగౌరవపరిచినట్లు అవుతుందని ఆనంద్ శర్మ అన్నారు. ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లోని కొన్ని పార్టీలు చాలా కాలం నుంచి కుల రాజకీయాలు చేస్తున్నాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో సామాజిక న్యాయం ప్రాతిపాధికన దేశంలో కుల అసమానతలకు తావు ఇవ్వని పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కుల గుర్తింపు రాజకీయలు చేయలేదని తెలిపారు. ప్రాంతం, మతం, కులాలు జాతులతో గొప్ప వైవిధ్యాన్ని కనబరిచే భారత సమాజంలో కులతత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి హానికరమని ఆనంద్ శర్మ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కులాని బదులు.. అసమానతలు లేకుండా పేదలకు పథకాలను అమలు చేసి, సామాజిక న్యాయం అందించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇస్తున్న విషయం తెలిసిందే. ముంబైలో జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు సభలో సైతం రాహుల్ కుల గణన హామీ ఇచ్చారు. -
International Disability Day: నిశ్శబ్ద విజయం
మాట వినకపోతే మాట పలకలేము. మాటతో నిండిన ఈ ప్రపంచంలో మాట లేకపోతే శూన్యతే. సోను ఆనంద్ శర్మ ఆ శూన్యత నుంచే బయలుదేరింది. పూర్తి బధిరత్వం వల్ల మాటకు కూడా దూరమైన సోను ఈ ప్రపంచంతో బ్యాట్‌తోనే మాట్లాడాలనుకుంది. బధిర బాడ్మింటన్ క్రీడాకారిణిగా సోనువి ఘన విజయాలు. ఆ తర్వాత కోచ్‌గా మారి దేశానికి ఎందరో క్రీడాకారులనిచ్చింది. కాని ఇదంతా సులభమా? బధిరత్వం ఉంటే ఇన్ని ఆటంకాలా? దివ్యాంగుల గెలుపు కథల్లో సోను కథ ముఖ్యమైనది. ‘పూర్తిగా వినపడకపోతే ఏమవుతుందో తెలుసా?’ అని అడుగుతుంది సోను ఆనంద్ శర్మ. పూర్తిగా వినపడని వారు దానికి పూర్తి సమాధానం చెప్పలేరు. ఎందుకంటే పూర్తిగా వినపడని వారికే ఆ బాధ తీవ్రత తెలుస్తుంది. ‘వినడం వల్లే భాష మాట్లాడతాం. వాక్యాన్ని నిర్మిస్తాం. గ్రామర్ నేర్చుకుంటాం. పూర్తి వాక్యం రాస్తాం. పూర్తిగా వినపడకపోతే మీరు మాట్లాడలేరు. రాయలేరు. గ్రామర్‌తో సరిగ్గా రాయలేరు’ అంటుందామె. 47 ఏళ్ల సోను ఆనంద్ శర్మ ‘డెఫ్లింపిక్స్’ (బధిరులకు జరిగే ఒలింపిక్స్)లో బాడ్మింటన్ క్రీడాకారిణిగా ఈ దేశానికి పతకాలు తెచ్చింది. ఆ తర్వాత కోచ్‌గా మారి శిష్యులను తయారు చేసి పతకాలను తెస్తోంది. అయినప్పటికీ ఆమె ఒక బధిరురాలిగా వివక్ష ఎదుర్కొంటూనే ఉంది. ‘ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తే ప్రభుత్వం పది లక్షలు ఇస్తుంది. బధిరుల ఒలింపిక్స్‌లో నేను పతకాలు సాధించాను. నా మెడల్స్ కూడా అంతకు సమానమే. అయినా నాకు డబ్బు రాలేదు’ అంటుందామె. అంతే కాదు... క్రీడాకారుల పెన్షన్లు, నజరానాలు అన్నీ కూడా అన్నీ సవ్యంగా ఉన్నవారికే. దివ్యాంగులకు వివక్షే. ‘అయినా సరే నేను నా దేశం కోసం పని చేస్తూనే ఉంటాను’ అంటుంది సోను. సైన్ లాంగ్వేజ్ ఎక్కడ? సోను ఆనంద్ శర్మది న్యూఢిల్లీ. పుట్టు బధిరురాలు. క్లాసుకు వెళితే టీచర్లకు సైన్ లాంగ్వేజ్ వచ్చేది కాదు. ఈమెకు పాఠాలు వినపడేవి కావు. ‘మన దేశంలో ఆరున్నర కోట్ల మంది పూర్తి బధిరులు లేదా పాక్షిక బధిరులు. వారిలో 50 లక్షల మంది పిల్లలు. అయినా మన దేశంలో కేవలం 700 స్కూళ్లలోనే సైన్ లాంగ్వేజ్‌లో చదువు చెప్తారు. సైన్ లాంగ్వేజ్‌ను అధికారిక భాషగా ప్రకటిస్తే సమస్య చాలామటుకు తీరుతుంది. కాని ప్రకటించరు. చదువు రాకపోతే బధిరులు జీవితాంతం ఇబ్బంది పడుతూనే ఉండాలి’ అంటుందామె. ఇప్పుడు ఆమె ఢిల్లీ టూరిజంలో ఉద్యోగం చేస్తుంది. మొత్తం డిజిటల్ కమ్యూనికేషనే జరుగుతుంది. సోను కమ్యూనికేట్ చేస్తుంది కాని భాష మెరుగ్గా ఉండదు. ‘అందుకని నన్ను ఒకలా చూస్తారు కొలీగ్స్’ అంటుందామె. 10 ఏళ్ల వయసు నుంచి పాఠాలు అర్థం కాకపోవడం వల్ల సోను బాడ్మింటన్తో ఆ వెలితి పూడ్చుకోవాలని అనుకుంది. ‘కాని మాకు మంచి కోచ్‌లు దొరికేవారు కాదు. కోచ్‌లు దొరికినా వారి దృష్టి నార్మల్ ఆటగాళ్ల మీద ఉండేది. బధిరుల మీద ఫోకస్ ఉండేది కాదు. అందుకని నన్ను నేను నమ్ముకున్నాను. రోజూ ఉదయం నుంచి రాత్రి దాకా ప్రాక్టీసు చేసేదాన్ని. మాది మధ్యతరగతి కుటుంబం. స్కూటర్ కూడా లేదు. బస్‌లో కోర్టుకు తిరుగుతుంటే మా తల్లిదండ్రులు భయపడేవారు... ఆడపిల్లనని... మాటలు రావని. మా నాన్న ఆఫీస్ నుంచి వచ్చి నా కోసం నేను ప్రాక్టీసు చేసే చోట కాచుకుని కూచునేవాడు’ అని గుర్తు చేసుకుంది సోను. ఆ శ్రమ వృథా పోలేదు. 1997 సమ్మర్ డెఫ్లింపిక్స్ నుంచి 2009 సమ్మర్ డెఫ్లింపిక్స్ వరకూ దేశం తరఫున ఆడి పతకాల పంట పండించింది సోను ఆనంద్ శర్మ. 2014 నుంచి కోచ్ శిష్యుల ద్వారా పతకాలు తెచ్చి పెడుతోంది. బధిర బాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జెర్న్లిన్ అనిక ఈమె శిష్యురాలే. ‘దివ్యాంగులను తక్కువ అంచనా వేయొద్దు. వారి సామర్థ్యాల పై సానుభూతి వద్దు. మమ్మల్ని గ్రహాంతర వాసుల్లా చూడొద్దు. మీలాగే సాటి మనుషులుగా చూడండి’ అంటుంది సోను శర్మ. వారికి అనువుగా సమాజం మారాలి. వారి కోసం కూడా ఈ సమాజం ఉంది. వారి సమాన వాటాను ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుందాం. -
ప్లీజ్ తప్పుకుంటున్నాను.. సోనియాకు షాకిచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత!
దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని వరుస షాక్‌లు తగులుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ(69).. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ట్విస్ట్ ఇచ్చారు. తాను.. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆనంద్ శర్మ.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసినట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నా ఆత్మగౌరవంతోనే తాను బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. దీంతో, సోనియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. Anand Sharma Quits Himachal Congress Post Days After Kashmir Party Revolt https://t.co/Quv6xQMTWy NDTV's Sunil Prabhu reports pic.twitter.com/cOoSGKP6VD — NDTV (@ndtv) August 21, 2022 ఇదిలా ఉండగా.. ఇటీవలే కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ గట్టి షాకిచ్చారు. ఆయనను జమ్మూకశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ సారథిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా.. ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు. అయితే, కొన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి: బీజేపీ సంచలన నిర్ణయం.. ఉమాభారతి సన్నిహితుడికి షాక్! -
బాబోయ్.. ఇవెక్కడి పోలీస్ స్టేషన్లు!!
అంతా టెక్నాలజీమయం. వర్చువల్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. నేరాలు ఎంత టెక్నిక్‌తో జరుగుతున్నాయో.. అంతే కౌంటర్ టెక్నాలజీతో వాటిని చేధిస్తున్నారు పోలీసులు. కీలకమైన పోలీసింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సూపర్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ, ఆ వ్యవస్థను పటిష్టపరిచే అంశంపై మాత్రం పూర్తి దృష్టి పెట్టడం లేదన్న విషయం తెలుసా?. దేశంలో పోలీసు వ్యవస్థ దీనస్థితిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(పీఎస్సీ) నివేదిక వెల్లడించింది తాజాగా.. కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ నేతృత్వంలో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (PSC) ఈ నివేదిక రూపొందించింది. తాజాగా ఈ కమిటీ హోం వ్యవహారాల శాఖకు సమర్పించిన నివేదికలో.. దేశంలో 257 పోలీస్ స్టేషన్లకు ఇప్పటివరకు వాహనాలే లేవట. మరో 638 పోలీస్ స్టేషన్లకు కనీసం టెలిఫోన్ సౌకర్యం కూడా లేదు. ఇక 143 పోలీస్ స్టేషన్లకు వైర్లెస్, సెల్‌ఫోన్ లాంటి సౌకర్యాలు లేవని ఈ కమిటీ వెల్లడించింది. పనిలో పనిగా మోడ్రన్ పోలీసింగ్ వ్యవస్థకు బలమైన కమ్యూనికేషన్ వ్యవస్థ అవసరమని, త్వరగతిన స్పందన కోసం వాహన వ్యవస్థ సమకూరాలని, అత్యాధునిక ఆయుధాల అవసరమూ ఉందని ఈ కమిటీ అభిప్రాయపడింది. 21వ శతాబ్దంలో అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కమ్యూనికేషన్ బలంగా లేకపోవడం మంచిది కాదు, ఆయా రాష్ట్రాలకు ఇంసెన్సిటివ్స్ జారీ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే జమ్ము కశ్మీర్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో వైర్ లెస్ సేవల కొరత మంచిది కాదని తెలిపింది. ఇక పలు రాష్ట్రాల విషయంలో హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖకు కీలక సూచనలు చేసిన ఈ కమిటీ.. కేంద్ర పాలిత ప్రాంతాల విషయంలో అవసరమైన చర్యలు త్వరగతిన చేపట్టాలని కోరింది. లా అండ్ ఆర్డర్ పరిరక్షించే క్రమంలో సిబ్బందికి గాయాలు కాకుండా ఉండేందుకు రక్షణ కవచాల ఆవశ్యకతను కమిటీ గుర్తు చేసింది. అంతేకాదు ఆయా పోలీస్ స్టేషన్ల తీరుతో జనాలు.. పొరుగు ప్రాంతాల స్టేషన్లను ఆశ్రయిస్తున్నారంటూ ఆసక్తికర అంశాన్ని సైతం ప్రస్తావించింది కమిటీ. మొత్తం దేశంలోని 16, 833 పోలీస్ స్టేషన్లను పరిశీలించి.. జనవరి 1, 2020 నాటి పరిస్థితుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది ఈ కమిటీ. అయితే ఈ పరిస్థితుల్లో ఈనాటికీ పెద్దగా మార్పు రాలేదని కమిటీ పేర్కొనడం గమనార్హం. -
టెక్ ఫాగ్ యాప్ కలకలం.. గూఢచర్యం ఆరోపణలు!
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరోసారి గూఢచర్యం ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. టెక్ ఫాగ్ యాప్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఐటీ సెల్‌పై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. పౌరుల గోప్యతకు టెక్ ఫాగ్ యాప్‌తో ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై చర్చ జరపాలని టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌కు లేఖ రాశారు. టెక్ ఫాగ్ యాప్ వల్ల జాతీయ భద్రత, దేశ పౌరుల గోప్యతకు ముప్పు వాటిల్లనుందని తెలిపారు. చదవండి: గోవా బీజేపీకి షాక్ ఈ అంశంపై చర్చించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం భేటీ ఏర్పాటు చేయాలని కమిటీ ఛైర్మన్ ఆనందర్ శర్మను డిమాండ్ చేశారు. బీజేపీ ఐటీ సెల్‌తో సంబంధాలు ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ యాప్‌ను ఉపయోగించి ఇన్‌యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ ఖాతాల నియంత్రణ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రెడింగ్లో ఉన్న విషయాలను హైజాక్ చేస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ ఓ పత్రిక కథనంతో ‘టెక్ ఫాగ్’ యాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
‘ప్రస్తుత ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలి’
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల విశ్వాసం కోల్పోయిన ప్రస్తుత ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం సభ్యులపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం(ఈసీ) సభ్యులు, కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక, నియామకానికి సంబంధించిన విధానాన్ని రూపొందించేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిష్పాక్షికంగా జరిపేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఈ ధర్మాసనం రూపొందించాలన్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవల అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తీరు, ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని సోమవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరపాలన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 పేర్కొన్న ఆదేశాలను ఎన్నికల కమిషన్ ఉల్లంఘించిందని ఆనంద్ శర్మ ఆరోపించారు. బెంగాల్లో ఈసీ చర్యలు పూర్తిగా ఏకపక్షంగా ఉన్నాయనీ, ఇలాంటి తీరు గర్హనీయమని తెలిపారు. బీజేపీకి అనుకూలంగా ఈసీ వ్యవహరించిందనేందుకు పలు ఆధారాలున్నాయన్నారు. ఇటీవలి ఎన్నికల్లో భారీ ర్యాలీలపై నియంత్రణలు విధించని ఈసీని కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘించినందుకు జవాబుదారీగా చేయాలన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ అమలు చేయకుండా, కరోనా వ్యాప్తికి, మరణాలకు కారణమైన ఈసీపై హత్యానేరం కింద కేసులు పెట్టాలని ఇటీవల మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: జైలు నుంచి అసెంబ్లీకి.. -
ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానంపై పోరు తీవ్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అసంతృప్త నేతలు అధిష్టానంపై పోరును తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుత్తున్నారు. పార్టీలో ప్రక్షాళనపేరుతో అధిష్టాన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన జీ–23 నాయకులు కీలక సమావేశాన్ని ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. గులాం నబీ ఆజాద్ జీ–23 లో కీలక సభ్యుడు అయిన కారణంగానే ఆయన రాజ్యసభ పదవీకాలాన్ని పొడిగించకుండా, అధిష్టానం పక్కన పెట్టిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అంతేగాక రాజ్యసభా పక్ష నాయకుడిగా గులాంనబీ పదవీకాలం ముగిసిన తర్వాత సీనియర్ నేత ఆనంద్ శర్మను కాదని, అధిష్టానం రాహుల్‌గాంధీ విధేయుడిగా పేరున్న మల్లికార్జున ఖర్గేకు అప్పగించినప్పటి నుంచి, జీ–23 నేతలు అధిష్టానంపై అసహనాన్ని ఏదో ఒక రూపంలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు. రాజ్యసభ పక్ష నాయకుడి పదవి ఆనంద్ శర్మకు రాకుండా అడ్డుకోవడంలో అధిర్ రంజన్ చౌధరి వంటి వారు కీలకపాత్ర పోషించారని జీ–23 బృందం గట్టిగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే బెంగాల్ ఎన్నికల పొత్తు విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌధరిపై ఆనంద్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఐఎస్ఎఫ్తో పొత్తు కాంగ్రెస్ భావజాలానికి పూర్తి విరుద్ధమని, అలాంటి నిర్ణయం తీసుకునే ముందు పార్టీస్థాయిలో వివరణాత్మక చర్చ జరగాలని ఆనంద్ శర్మ తన ట్వీట్లో అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధిర్ రంజన్ చౌదరిని టార్గెట్ చేశారు. ఆనంద్ శర్మ ట్వీట్ల తరువాత, అధిర్ రంజన్ చౌదరి సైతం ఘాటుగానే జవాబిచ్చారు. వీరి మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత పోరును మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. చదవండి: (ఎమర్జెన్సీ విధించడం తప్పే: రాహుల్ గాంధీ) ఢిల్లీ పీసీసీలోనూ.. మరోవైపు అసమ్మతి వర్గంలో కీలకంగా ఉన్న నలుగురు నేతలు ఢిల్లీకి చెందిన వారు కావడంతో, ఢిల్లీ పీసీసీలోనూ అంతర్గత పోరు మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరుగబోయే కీలక సమావేశంలో పార్టీ అసంతృప్త నాయకుల భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుగనున్నాయి. కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్, ఢిల్లీ పీసీసీ మాజీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్, మాజీ ఉపాధ్యక్షుడు యోగానంద్ శాస్త్రిలు జీ –23లో ఉన్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఢిల్లీ పీసీసీలో ఈ అసంతృప్త నాయకుల జాబితా పెరుగుతోందని సమాచారం. గతంలో 23 మంది.. పార్టీని బలోపేతం చేసే విషయంలో అధిష్టానం తీరు మార్చుకోవాలంటూ గతేడాది సోనియాగాంధీకి 23 మంది అసంతృప్త నేతలు రాసిన లేఖ పార్టీలో పెద్ద ఎత్తున దుమారానికి కారణమైన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం సోనియాగాంధీ నివాసంలో జీ –23 నేతలతో జరిగిన కీలక సమావేశంలో తమ అభిప్రాయాలను పలువురు పార్టీ సీనియర్లు రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీల ముందుంచారు. అయితే ఆ సమావేశం జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం జీ–23 నేతలు చేసిన సూచనలను పట్టించుకున్న దాఖలాలు లేవని, అçసంతృప్తి కారణంగా పార్టీని వీడాలనుకుంటున్న నాయకులతో ప్రత్యేకంగా చర్చించిన పరిస్థితి సైతం లేదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, త్వరలో జరపాలనుకుంటున్న సమావేశం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక బలమైన సందేశాన్ని పంపించాలని ఢిల్లీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. చదవండి: (చిన్నమ్మ కొత్త వ్యూహం.. మూడో కూటమిలోకి నో ఎంట్రీ) -
జీడీపీలో 10% కాదు 1.6 శాతమే!: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అని, జీడీపీలో 10% అని అబద్ధాలు చెబుతూ కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ప్యాకేజీ నికరంగా రూ. 3.22 లక్షల కోట్లు మాత్రమేనని, అది జీడీపీలో 1.6% మాత్రమేనని పేర్కొంది. ప్రధాని మోదీ అవాస్తవాలు చెప్పడం మాని తామేం చేయగలరో స్పష్టంగా చెప్పాలని ఆ పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ప్యాకేజీపై చర్చకు సిద్ధమా? అని ఆర్థికమంత్రికి ఆయన ప్రశ్నించారు. ‘కేంద్రం వైఫల్యం వల్లనే లక్షలాది వలస కూలీలు కాలి నడకన వందలాది కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు వెళ్లే విషాద పరిస్థితి నెలకొంది’అని ఆరోపించారు. నంబర్లాట: లెఫ్ట్: ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ నంబర్లతో ఆడుతున్న మోసపూరిత ఆటలా ఉందని వామపక్షాలు విమర్శించాయి. రుణ పరిమితిలో రాష్ట్రాలు 14% మాత్రమే వాడుకున్నాయంటూ రాష్ట్రాలను ఆర్థికమంత్రి నిర్మల అవహేళన చేశారని సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను అమ్మేసి స్వయం సమృద్ధి సాధించాలనుకుంటున్నారా? అని సీపీఐ నేత రాజా ఆర్థికమంత్రిని ప్రశ్నించారు. -
ప్యాకేజ్ ప్రకంపనలు : కేంద్రానికి కాంగ్రెస్ సవాల్
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పిస్తూ రైతులు, వలసకూలీలు, చిరువ్యాపారులు సహా పలువురిని ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌పై కాంగ్రెస్ పెదవివిరిచింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ 20 లక్షల కోట్లు కాకుండా కేవలం రూ 3.22 లక్షల కోట్ల ప్యాకేజ్‌నే ప్రభుత్వం ప్రకటించిందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన రూ. 3.22 లక్షల కోట్ల ప్యాకేజ్ జీడీపీలో కేవలం 1.6 శాతమేనని, ప్రధాని ప్రకటించిన తరహాలో 10 శాతం కాదని అన్నారు. తాను చెప్పింది తప్పని నిరూపించాలని తాను ఆర్థిక మంత్రి, ప్రధానికి సవాల్ విసురుతున్నానని చెప్పారు. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక ప్యాకేజ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను తప్పుదారిమళ్లించిందని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మాట్లాడాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. వలస కూలీల ప్రాథమిక హక్కులను కాలరాసినందుకు ప్రభుత్వం వారికి క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రణాళిక లేకుండా లాక్డౌన్ అమలు చేయడంతో వలస కూలీలు రోడ్లపై దయనీయస్ధితిలో నడిచివెళ్లేలా చేశారని, వారి దుస్థితిపై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని అన్నారు. ఢిల్లీలో వలస కూలీలతో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ మాట్లాడటాన్ని నిర్మలా సీతారామన్ డ్రామాగా కొట్టిపారవేయడంపై ఆయన మండిపడ్డారు. చదవండి : లాక్డౌన్ 4.0 : కేంద్రం కీలక నిర్ణయం -
దశలవారీగా లాక్డౌన్ సడలింపు
న్యూఢిల్లీ: కోవిడ్–19 కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని, స్థూల జాతీయోత్పత్తిలో కనీసం ఐదారు శాతం మొత్తానికి తక్కువ కాకుండా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కోరింది. కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా కేంద్రం తన బకాయిలు మొత్తాన్ని రాష్ట్రాలకు వెంటనే చెల్లించాలని, దీంతోపాటు ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ వాణిజ్యశాఖ మంత్రి ఆనంద్ శర్మ సోమవారం డిమాండ్ చేశారు. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, పరిశ్రమల నుంచి వచ్చే విరాళాలు ఇచ్చేందుకు అనుమతించాలని, లేదంటే అది రాష్ట్రాల పట్ల వివక్ష చూపినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. పీఎం కేర్స్ ఫండ్‌ను నేషనల్ రిలీఫ్ ఫండ్‌గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఇప్పుడు అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి తీసుకునే చర్యలు కూడా అలాగే ఉండాలి. అందుకే ప్రధాని ఆర్థిక ప్యాకేజీ విషయంలో ఉదారంగా వ్యవహరించాలి. లాక్డౌన్ అనంతర ఆర్థిక వ్యవస్థలోని వేర్వేరు రంగాలు మళ్లీ జీవం పుసుకునేందుకు సాయం చేయాలి’ అని వీడియో ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆనంద్ శర్మ పేర్కొన్నారు. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో పదిహేన శాతం మొత్తాలను ప్యాకేజీలుగా ప్రకటించాయని, అమెరికా పది శాతం మొత్తాన్ని ఖర్చు చేయనుందని గుర్తు చేశారు. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి అంశాల గురించి పట్టించుకోకుండా ప్రభుత్వం కనీసం 5 –6 శాతం జీడీపీ మొత్తాన్ని ఖర్చు చేయాలని అన్నారు. లాక్డౌన్ ప్రకటన ఆకస్మికంగా జరిగిందని, ఎత్తివేత సమయంలో రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలించి, ఆర్థిక వ్యవస్థకు ఊరట కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఫార్మా, బీమా, ఆర్థిక రంగాల్లోని కంపెనీలను విదేశీ కంపెనీలు తమ వశం చేసుకోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ దిశగా సెబీ, ఆర్బీఐలు తగిన చర్యలు తీసుకునేలా కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. చదవండి: పీఎం కేర్స్‌పై పిల్ కొట్టివేత -
‘మీరు స్టార్ క్యాంపెయినర్ కాదు’
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లా వ్యవహరించారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ఆనంద్ శర్మ విమర్శించారు. అమెరికాలో భారత ప్రధాని హోదాలో పర్యటిస్తున్న మోదీ.. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ‘ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత’ పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 50 వేల మంది హాజరైన ఈ కార్యక్రమానికి మోదీ, ట్రంప్ కలిసి వేదిక పైకి వచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ గురించి మోదీ మాట్లాడుతూ.. భారత దేశానికి ట్రంప్ నిజమైన స్నేహితుడు అని.. మరోసారి అమెరికాలో ట్రంప్ సర్కార్ రాబోతుందని వ్యాఖ్యానించారు. అనంతరం వివిధ అంశాలపై ఇరు దేశాధినేతలు ప్రసంగించారు.(చదవండి : భారత్‌కు ట్రంప్ నిజమైన ఫ్రెండ్) ఈ నేపథ్యంలో మోదీ భారత దేశ విదేశాంగ విధానం, నిబంధనలను తుంగలో తొక్కారని ఆనంద్ శర్మ విమర్శించారు. ట్రంప్ తరఫున ప్రచారం చేసి సార్వభౌమ దేశాలైన భారత్, అమెరికా రూపొందించుకున్న ఒప్పందాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. ఈ మేరకు... ‘ మీరు అమెరికా ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ కాదు. భారత ప్రధానిగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ విషయాన్ని మీకు గుర్తు చేయాల్సి వస్తోంది. అమెరికా రాజకీయాల్లో భారత్ ఎల్లప్పుడూ తటస్థ వైఖరినే అనుసరించింది. రిపబికన్లు, డెమొక్రాట్లతో ఒకే విధమైన మైత్రి ఉండేది. కానీ మీరు వాటిని ఉల్లంఘించి ట్రంప్ తరఫున ప్రచారం చేస్తున్నారు. రెండు సార్వభౌమ, ప్రజాస్వామ్య దేశాల విలువలు తుంగలో తొక్కారు. భారత దేశ విదేశాంగ విధానాన్ని అపహాస్యం చేశారు’ అని ట్వీట్ చేశారు. Mr Prime Minister, you have violated the time honoured principle of Indian foreign policy of not interfering in the domestic elections of another country. This is a singular disservice to the long-term strategic interests of India. — Anand Sharma (@AnandSharmaINC) September 22, 2019 -
‘మోదీకి కుటుంబం లేకనే ఎక్కడికీ వెళ్లట్లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరణంలో నేతల మాటలు తూటల్లా పేలుతున్నాయి. రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగత విమర్శల వరకు హద్దులు మీరుతున్నాయి. 1987లో ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను రాజీవ్ గాంధీ దంపతులు తమ వ్యక్తిగత విహార యాత్ర కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ ఘాటైన వ్యాఖ్యలతో స్పందించారు. ‘ ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబంతో విహార యాత్రలకు వెళ్లడం సర్వసాధారణం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఆయన భార్య సోనియా గాంధీతో కలిసి వెళ్లారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి కుటుంబం (భార్య) లేదు కాబట్టి ఎక్కడికీ వెళ్లడంలేదు. కేవలం ఆయనొక్కరే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నారు.’’ అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. కాగా ప్రధాని చేసన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజీవ్ గాంధీ ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేస్తున్నారు. నాడు రాజీవ్ కోసం ప్రత్యేకంగా విరాట్‌ను తీసుకెళ్లడంగానీ, దాని రూట్ మార్చడంగానీ చేయలేదని నావికాదళం ప్రధానాధికారిగా రిటైరైన అడ్మిరల్ రాందాస్ మీడియా ముఖంగా మోదీకి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. విరాట్ నౌక లక్ష దీవులకు వెళుతుందని తెలిసి రాజీవ్ దంపతులు నౌక ఎక్కారని, వారికి తానే అతిథ్యం ఇచ్చానని కూడా ఆయన చెప్పారు. #WATCH Anand Sharma, Congress on PM Modi's comment on INS Viraat: Any PM would do so but this PM has no family,if he had family then he would also be going there, but he goes alone because he has no connect with a family or any respect for family values. (09/05/2019) pic.twitter.com/N9sKN7iQ2D — ANI (@ANI) May 10, 2019 -
ఆ పెట్టెలో ఏముంది?
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన సందర్భంగా ఆయన హెలికాప్టర్లో నలుపురంగు పెట్టెను ప్రైవేటు కారులో తరలించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆ పెట్టెలో ఏముందో ప్రధాని మోదీ వెంటనే చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ‘ఈ నెల 9న చిత్రదుర్గ సభకు మోదీ హెలికాప్టర్‌కు రక్షణగా మరో మూడు హెలికాప్టర్లు వచ్చాయి. ఇవి ల్యాండ్ కాగానే ఓ హెలికాప్టర్ నుంచి నలుపురంగులో ఉన్న పెట్టెను ఇన్నోవా కారులో ఎక్కించారు. ఈ కారు ఎస్పీజీ వాహనశ్రేణిలో భాగం కాదు’ అని తెలిపారు. ఈ పెట్టెలో భారీగా నగదు ఉందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఇది నిజం కాకుంటే మోదీ విచారణకు సహకరించాలన్నారు. ఈ విషయమై కర్ణాటక పీసీసీ ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని ఆనంద్ శర్మ వెల్లడించారు. అంబేడ్కర్ జయంతి రోజున ప్రతిపక్షాలపై విమర్శలు మాని, గత ఐదేళ్లకాలంలో ఏం చేశారో దేశప్రజలకు చెప్పాలని మోదీకి సూచించారు. దమ్ముంటే రఫేల్ ఒప్పందంపై అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేతో జరిగిన సమావేశం మినిట్స్‌ను బయటపెట్టాలని మోదీని డిమాండ్ చేశారు. దీనివల్ల అన్ని ఆరోపణలకు ఒకేసారి తెరపడుతుందని వ్యాఖ్యానించారు. సాయుధ బలగాల త్యాగాలను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంతో అప్పటి ప్రధాన ఇందిరాగాంధీ రాజకీయంగా లబ్ధిపొందారని కేంద్ర మంత్రి వీకే సింగ్ చెప్పడాన్ని తప్పుపట్టిన ఆనంద్ శర్మ, ఈ వ్యాఖ్యలపై సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. -
రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ తాజా బిల్లుపై రాజ్యసభలోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం రాజ్యసభ ముందుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రస్తుత రూపంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని పట్టుబట్టాయి. బిల్లుపై పాలక బీజేపీ, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభ బుధవారానికి వాయిదా పడింది. ట్రిపుల్ తలాక్‌తో విడాకులు ఇచ్చే ప్రక్రియను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రూపొందిన తాజా బిల్లును ఇటీవల లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. కాగా, రాజ్యసభలో ఈ బిల్లుపై విస్తృత చర్చ అవసరమని విపక్షాలు పేర్కొన్నాయి. చట్టబద్ధంగా పరీక్షించకుండా చట్టాలను చేయలేమని లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందినంత మాత్రాన పెద్దల సభలో ఆమోదం పొందలేదని, రాజ్యసభ రబ్బర్ స్టాంప్ కాదని కాంగ్రెస్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. బిల్లును ఎవరూ వ్యతిరేకించడలేదని, దీన్ని పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని యావత్ విపక్షం డిమాండ్ చేస్తోందని చెప్పారు. బిల్లుపై ప్రభుత్వం రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. చర్చకు సిద్ధమే.. మరోవైపు విపక్షాల దాడిని ప్రభుత్వం దీటుగా తిప్పికొట్టింది. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పినా ఈ విధానం కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లుపై విపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ స్పీకర్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. -
రఫేల్‌పై తీర్పును రీకాల్ చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కు తీసుకోవాలని (రీకాల్) కాంగ్రెస్ పార్టీ ఆదివారం కోరింది. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని తప్పుదోవపట్టించేలా వ్యవహరించడంతోపాటు పార్లమెంటు సమగ్రతను దెబ్బతీసిన కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వాలంది. రఫేల్ విమానాల కొనుగోలుకు సంబంధించి కాగ్ తన నివేదికను ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ)కి సమర్పించిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తప్పుగా చెప్పడం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత అనంద్ శర్మ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘అసలు విమానాల కొనుగోలుపై కాగ్ ఇంకా నివేదికే తయారు చేయకపోతే పీఏసీకి ఎప్పుడు అందజేసింది? పార్లమెంటుకు ఎప్పుడు సమర్పించింది’ అని ప్రశ్నించారు. రఫేల్ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చి తీర్పునే ప్రభావితం చేసిన కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసి తీర్పును వెనక్కు తీసుకుని కేసును పునర్విచారించాలని ఆయన కోరారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తమ తప్పును అంగీకరించి, ప్రాయశ్చిత్తంగా గంగా నదిలో మునిగితేలాలని ఆనంద్ శర్మ అన్నారు. అసలు రఫేల్ విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ద్వారానే సాధ్యపడుతుందని ఆనంద్ శర్మ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పే అంతిమం: జైట్లీ రఫేల్‌పై జేపీసీని ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేనే లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. సుప్రీం తీర్పే ఈ విషయంలో అంతిమమనీ, ఆ కోర్టే తమ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చాక జేపీసీ ఎందుకని జైట్లీ ఫేస్బుక్లో ప్రశ్నించారు. రఫేల్‌పై కాగ్ నివేదిక సిద్ధమయ్యాక అది ఎలాగూ పీఏసీ ముందుకు వెళ్లక తప్పదన్నారు. రఫేల్‌పై పార్లమెంటులో చర్చకు ముందుకు రాకుండా సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే కాంగ్రెస్‌కు తెలుసనీ, వారిది విధ్వంసకర పార్టీ అని విమర్శించారు. కాగా, సుప్రీంకోర్టుకు తప్పుడు సమాచారం చేరిన అంశంపై అటార్నీ జనరల్ (ఏజీ), కాగ్‌లకు నోటీసులిస్తామన్న పీఏసీ చైర్మన్ మల్లికార్జున ఖర్గే నిర్ణయాన్ని పీఏసీలోని మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. -
టీఆర్ఎస్, బీజేపీలు ఒకే గూటి పక్షులు
సాక్షి,హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీలు ఒకే గూటి పక్షులని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఉపనేత ఆనంద్ శర్మ అభివర్ణించారు. ఇరుపక్షాలు ఎన్నికల కోసమే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయన్నా రు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అవసరమై న ప్రతిసారీ టీఆర్ఎస్ అండగా నిలుస్తూ వచ్చిం దని దుయ్యబట్టారు. టీఆర్ఎస్, బీజేపీలు కలిసి ఉన్నాయని, భవిష్యత్తులోనూ కలిసి ఉంటాయని జోస్యం చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో పీసీసీ మాజీ అధ్యక్షుడు హన్మంతరావు, మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామి రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. నోట్లరద్దుకు మద్దతు ప్రకటించి వేడుకలు జరుపుకున్న కొద్దిమద్ది సీఎంలలో కేసీఆర్ ఒకరన్నారు. తెలంగాణలో ముస్లిం ఓట్లు కీలకంగా ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాకుండా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడిచేందుకు కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. మోదీ దేశాన్ని లూటీ చేస్తుంంటే కేసీఆర్ రాష్ట్రాన్ని లూటీæ చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పుడున్న 5 సీట్లు కూడా బీజేపీకి రావని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సెమీఫైనల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు. -
హిట్లర్‌తో ఇందిరను పోల్చడంపై..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎమర్జెన్సీ విధించడంపై దివంగత ప్రధాని ఇందిరా గాంధీపై బీజేపీ నేతల విమర్శలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఇందిరను నియంత హిట్లర్‌తో బీజేపీ పోల్చడాన్ని తప్పుపట్టింది. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా దిగ్గజ నేతగా వెలుగొందారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. ఆమెను హిట్లర్‌తో పోల్చడం చరిత్రను వక్రీకరించడమేనని ట్వీట్ చేశారు. ఇందిరా గాంధీని బీజేపీ నేత అరుణ్ జైట్లీ హిట్లర్‌తో పోల్చడం అర్థం చేసుకోదగినదేనని, జైట్లీ ఆరెస్సెస్-బీజేపీ నేపథ్యంలో నుంచి వచ్చిన నేత ఇలానే మాట్లాడతారని అన్నారు. హిట్లర్ వంటి నియంతలు, ఫాసిస్టులను వీరు అనుసరిస్తారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా కూలదోసే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో ఎమర్జెన్సీ విధించారని, దీనికి స్వయంగా ఇందిరా గాంధీయే విచారం వ్యక్తం చేశారని ఆనంద్ శర్మ గుర్తు చేశారు. అరుణ్ జైట్లీ జ్ఞాపకశక్తి కోల్పోయారని, నియంతలు ఎన్నికలు నిర్వహించరని అయితే ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా హుందాగా ఓటమిని అంగీకరించారని అన్నారు. -
‘మోదీకి ప్రచార మోజు’
సాక్షి, న్యూఢిల్లీ : భారత విదేశాంగ విధానానికి మోదీ సర్కార్ తూట్లు పొడిచిందని కాంగ్రెస్ ఆరోపించింది. పార్టీ ప్లీనరీలో సీనియర్ నేత ఆనంద్ శర్మ ఎన్డీఏ విదేశాంగ విధానాన్ని దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం విదేశీ విధానంలో చిత్తశుద్ధి లోపించిందని, సమదృష్టి కొరివడిందని ఆరోపించారు. ప్రధాని తన ప్రచారార్భాటం కోసం పరితపిస్తున్నారని ఆరోపించారు. కీలక దేశాలతో మన సంబంధాలను సజావుగా నిర్వహించడంలో విఫలమయ్యారని విమర్శించారు. పొరుగుదేశాలతో సంబంధాల నిర్వహణ సవ్యంగా లేదని ఆనంద్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు.విదేశాంగ విధానాన్ని మోదీ వ్యక్తిగతంగా ముందుకు తీసుకువెళుతున్నారని ఇది గందరగోళంగా సరైన దిశాదశా లేకుండా సాగుతోందని వ్యాఖ్యానించారు. విదేశాంగ విధానంపై ఆనంద్ శర్మ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మోదీ ప్రచార మోజుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ నేతల పట్ల మోదీ తీరు అభ్యంతరకరమని, ఆయన తీరు కాంగ్రెస్ పార్టీతో పాటు దేశానికి అవమానకరమని ఆక్షేపించారు. -
ఇవాంక సదస్సులో కేసీఆర్ ఉండగా.. మోదీ ఎందుకు?
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకావడాన్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి హాజరవుతుండగా.. మోదీ వెళ్లాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు. ‘ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న కార్యక్రమానికి హాజరవ్వడం ద్వారా నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవిని చులకన చేశారు. ఈ సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు. ప్రధానికి విదేశీయులు, విదేశీ రేటింగ్ ఏజెన్సీల సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తన పాలనపై సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన గుజరాత్ ప్రజలను అడగాలి’ అని ఆనంద్‌శర్మ అన్నారు. జీఈఎస్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడాన్ని తప్పుబడుతూ ఆనంద్ శర్మ చేసిన విమర్శలపై నెటిజన్లు తప్పుబడుతున్నారు. -
ఓట్లకు, సీట్లకు.. పొంతన ఉండాలా? వద్దా?
మెజారిటీ జనామోదం లేకుండానే... ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారు. ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. పోలైన ఓట్లలో 50 శాతానికి మించి ఓట్లు సాధిస్తేనే జనామోదం ఉన్నట్లు పరిగణించాలనేది ఒక వాదన. ఎందుకంటే ఒకతను 50 శాతం పైచిలుకు ఓట్లు సాధించాడంటే సదరు అభ్యర్థికి అక్కడి ఓటర్లలో విస్పష్టమైన ఆదరణ ఉన్నట్లు లెక్క (మరెవరికీ 50 శాతం దాటే అవకాశాలుండవు కాబట్టి). ప్రస్తుతం మనం అనుసరిస్తున్నది ‘ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ (ఎఫ్‌పీటీపీ) విధానం. పరుగు పందెంలో ఎందరు పాల్గొన్నా... మొదట గీత దాటిన వాడే గెలిచినట్లుగా ప్రకటిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అనే పేరు ఈ ఎన్నికల విధానానికి పెట్టారు. అభ్యర్థులందరిలోకి ఎవరికి ఎక్కువ ఓట్లు (ఒక్క ఓటు మెజారిటీ ఉన్నా సరే) వస్తే అతనే గెలిచినట్లు. మొత్తం పోలైన ఓట్లలో అతనికి ఎంత శాతం ఓట్లు పడ్డాయనే దానితో సంబంధం లేదు. త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొన్న సందర్భాల్లో 27 లేదా 28 శాతం ఓట్లు పొంది కూడా ఒక అభ్యర్థి గెలవచ్చు. అంటే మిగతా 72 శాతం అతన్ని తిరస్కరించారనే అర్థం. నియోజకవర్గంలోని మెజారిటీ ప్రజలు అతన్ని తిరస్కరించినప్పటికీ సదరు అభ్యర్థి ఆ నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా చట్టసభలోకి అడుగుపెడతాడు. మన దగ్గర లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎఫ్‌పీటీపీ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. రెండోది... ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ (పీర్ విధానం). ఓట్ల శాతానికి సమానంగా ప్రాతినిధ్యం. అంటే ఒక పార్టీకి ఎంత శాతం ఓట్లు పొలవుతాయో... మొత్తం సీట్లలో అంత శాతం ఆ పార్టీకి కేటాయిస్తారు. ఇందులో మళ్లీ రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో... లిస్ట్ పద్దతి. పార్టీలు మొత్తం స్థానాలకు సరిపడా అభ్యర్థుల పేర్లతో ఒక జాబితాను ఎన్నికలకు ముందే ఈసీకి అందిస్తాయి. ఇందులో అభ్యర్థుల పేర్లను ప్రాధాన్యక్రమంలో పొందుపరుస్తాయి. పార్టీకే ప్రజలు ఓటేస్తారు. వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి... అంతకు సమానశాతం సీట్లను పార్టీ పొందుతుంది. రెండో పద్దతి... సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు. ఓటర్లు బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యక్రమంలో ఓటేస్తారు. ఎవరికైనా 50 శాతానికి మించి తొలి ప్రాధాన్య ఓట్లు పడితే అతను గెలుపొందినట్లే. ఎవరికీ 50 శాతానికి మించి తొలి ప్రాధాన్య ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఉంటుంది. అభ్యర్థులందరిలోకి అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని పోటీ నుంచి తప్పించి సదరు అభ్యర్థికి వచ్చి రెండో ప్రాధాన్య ఓట్లను మిగతా వారికి కేటాయిస్తారు. ఇలా బరిలో ఉన్నవారిలో ఏ ఒక్కరికైనా 50 శాతం పైచిలుకు ఓట్లు వచ్చేదాకా ఎలిమినేషన్ జరుగుతుంది. మన రాష్ట్రపతి ఎన్నికల్లో ఇదే విధానాన్ని అనుసరిస్తాం. చర్చ ఎందుకు? ఆనంద్ శర్మ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పర్సనల్, ప్రజా ఫిర్యాదులు, చట్ట, న్యాయ అంశాలపై) ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఎఫ్‌పీటీపీ విధానం సరైనది కాదేమోననే సందేహాలు కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలను పార్టీల పేర్లు తీసుకోకుండా ఉదహరించింది. 39 శాతం ఓట్లు వచ్చిన పార్టీ (బీజేపీ) 312 సీట్లు (మొత్తం యూపీ అసెంబ్లీ బలం 403) సాధించగా... 22 శాతం ఓట్లు వచ్చిన పార్టీ (సమాజ్‌వాది) కేవలం 47 సీట్లు. 21 శాతం ఓట్లు వచ్చిన పార్టీ (బీఎస్పీ) కేవలం 19 సీట్లు మాత్రమే పొందాయని... గుర్తుచేసింది. జనాదరణకు, వచ్చిన సీట్లకు పొంతన ఉండటం లేదు కాబట్టి... మరేదైనా ప్రత్యామ్నాయ విధానాలు, వాటి అమలులోని సాధ్యాసాధ్యాలను సూచించాలని ఎలక్షన్ కమిషన్‌కు, అన్ని రాజకీయపార్టీలకు లేఖలు రాసింది. పొంతన లేని అంకెలు... బీజేపీ 2014 ఎన్నికల్లో 31 శాతం ఓట్లతో 282 సీట్లు సాధించింది. మన దేశ చరిత్రలో మరే సందర్భంలోనూ ఇంత తక్కువ ఓట్ల శాతంతో సొంత మెజారిటీ ఒక పార్టీకి రాలేదు. ఓట్లశాతంలో బీజేపీ, కాంగ్రెస్‌ల తర్వాత దేశంలోనే మూడోస్థానంలో నిలిచిన బీఎస్పీకి (4.1 శాతం ఓట్లు) ఒక్క సీటు కూడా రాలేదు. అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ 3.8 ఓట్ల శాతంలో 34 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. అన్నాడీఎంకే కేవలం 3.3 ఓట్ల శాతంతో ఏకంగా 37 సీట్లలో గెలిచింది. మరోవైపు 19.3 శాతం ఓట్లు సాధించి కూడా కాంగ్రెస్ 44కే పరిమితమైంది. అదే 2009లో బీజేపీకి 18.5 శాతమే ఓట్లొచ్చినా... ఏకంగా 116 సీట్లు గెలిచింది. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 49.1 శాతం ఓట్లతో ఏకంగా 405 స్థానాల భారీ మెజారిటీ సాధించినా... ఓట్లశాతం పరంగా చూస్తే (వచ్చిన ఓట్ల 50 శాతం దాటలేదు కాబట్టి) మెజారిటీ ప్రజల ఆమోదం ఉన్న ప్రభుత్వం కాదనే వాదనా ఉంది. కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైన పార్టీలు... తక్కువ ఓట్లు వచ్చినా ఎక్కువ సీట్లు నెగ్గుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఉనికి ఉన్నప్పటికీ కొన్ని పార్టీలు తక్కువ సీట్లు గెలుస్తున్నాయి. ఉదాహరణకు సీపీఎం (3.25 శాతం)కు 2014 సాధారణ ఎన్నికల్లోఅన్నాడీఎంకేతో దాదాపు సమానంగా ఓట్ల శాతం వచ్చినప్పటికీ 9 సీట్లే నెగ్గింది. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ విధానం అనుకూలతలు... 1. సులభమైనది. నిరక్షరాస్యులు కూడా తేలిగ్గా అర్థం చేసుకోగలరు. 2. మెజారిటీ ఓటు (50 శాతం పైచిలుకు)తో సంబంధం లేకుండా సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. 3. పార్టీల సిద్ధాంతాలతో పాటు అభ్యర్థి గుణగణాలను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయానికి వచ్చే అవకాశం ఓటరుకు ఉంటుంది. 4. అభ్యర్థికి తనకంటూ ప్రత్యేకంగా ఓ నియోజకవర్గం ఉంటుంది కాబట్టి తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అయినా అభివృద్ధి కోసం కృషి చేయాల్సి ఉంటుంది. 5. అన్ని మతాలు, సామాజికవర్గాలను మెప్పించేందుకు అభ్యర్థులు పనిచేయాల్సి ఉంటుంది. 6. ప్రజల్లో ఆదరణ ఉంటే స్వతంత్య్ర అభ్యర్థిగానూ పోటీచేసి గెలవొచ్చు. ప్రతికూలతలు... 1. దేశవ్యాప్తంగా ఉనికి ఉన్నా... నియోజకవర్గాల్లో పట్టులేని కారణంగా కొన్ని పార్టీలకు పార్లమెంటులో ప్రాతినిధ్యమే లేకుండా పోతుంది. 2014లో బీఎస్పీ విషయంలో జరిగిందిదే. ఇప్పటికీ చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని సామాజికవర్గాలున్నాయి. 2. అభ్యర్థులకు వచ్చిన ఓట్లు బదిలీ చేసే అవకాశం లేదు కాబట్టి ఓట్లు వృధా అవుతాయి. అదే ప్రాధాన్యక్రమంలో ఓటు వేసే అవకాశం ఉంటే... మనం తొలి ప్రాధాన్య ఓటు వేసిన అభ్యర్థి ఓడిపోయినా... మన రెండో ప్రాధాన్య ఓటు ఆ నియోజకవర్గంలో విజేతను తేల్చడానికి పనికి వస్తుంది. ఓటు వృధా కావడమనేది ఉండదు. 3. ఎఫ్‌పీటీపీ విధానంలో సుస్థిర ప్రభుత్వం వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. భారత్ పలు సంకీర్ణ ప్రభుత్వాలనూ చూసింది. 4. ఓట్లశాతంలో స్వల్ప తేడా... కొన్నిసార్లు ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 5. అభ్యర్థులు తమ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు కాబట్టి ఎన్నికల ఖర్చు అధికంగా ఉంటుంది. 6. కుల, మత, ప్రాంతీయ విభజనను ప్రోత్సహించేలా ఉంటుంది. ఓట్ల శాతానికి తగ్గ ప్రాతినిధ్య విధానం... అనుకూలతలు... 1. నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల ఖర్చు చాలా తక్కువ. 2. దేశవ్యాప్త ఉనికి ఉన్న చిన్నపార్టీలు, మైనారిటీ, మహిళల పార్టీలకు వారికి వచ్చిన ఓట్లను బట్టి చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కుతుంది. 3. సమస్యలపై గెలిచిన అభ్యర్థుల్లో ఎవరినైనా సంప్రదించవచ్చు. ఎవరో ఒక ఎంపీకి పరిమితం కానక్కర్లేదు. 4. ఓటర్లలో తమ ఓటు వృధాగా పోయిందనే భావన ఉండదు. నచ్చిన సిద్ధాంతానికి స్వేచ్ఛగా ఓటు వేసుకోవచ్చు. ప్రతికూలతలు... 1. గెలిచిన అభ్యర్థులు మెజారిటీ వర్గాలపైనే దృష్టి పెట్టి... మిగతా వారిని పట్టించుకోకపోవచ్చు. అభ్యర్థిని ఎంచుకొనే స్వేచ్ఛ ఓటరుకు ఉండదు. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారిని అంగీకరించాల్సిందే. 2. సుస్థిరత అంతగా ఉండదు. మెజారిటీ సాధించడానికి సంకీర్ణాలు తప్పవు. 3. ప్రజాప్రతినిధి– ప్రజలకు (ఓటర్లకు) మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండదు. పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తాడు కాని నియోజకవర్గ ప్రజలకు కాదు. కాబట్టి ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించే అవకాశాలుంటాయి. 4. స్వతంత్య్ర అభ్యర్థులకు అవకాశం ఉండదు. ఏదో ఒక పార్టీ పేరుపైన పోటీచేయాల్సిందే. 5. గద్దెనెక్కిన పార్టీల్లో అధికారం ఏ కొద్దిమంది చేతుల్లోనో కేంద్రీకృతమయ్యే అవకాశాలుంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మోదీ ఆ అంశాన్ని ఇప్పుడెందుకు ప్రస్తావించారు?
సర్జికల్ స్ట్రైక్స్ జరిగి ఏడాది అవుతోంది ఆ తర్వాత కూడా దాడులు జరిగాయి న్యూఢిల్లీ: దేశ స్వాతంత్ర్యం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏడాది కింద జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రధాని మోదీ ఇప్పుడెందుకు ప్రస్తావించారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు. పాక్‌లోని ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత కూడా ఉగ్రవాద దాడులు, సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు జరిగాయని గుర్తుచేశారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చాలా గొప్పదని ప్రధాని మోదీ చెప్తున్నారని, కానీ ఇదే బీజేపీ విపక్షంలో ఉన్నప్పుడు జీఎస్టీని ఏడేళ్లపాటు అడ్డుకున్నదని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం విపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి.. రాజ్యాంగసవరణ జరిగేలా చూశాయని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ విస్మరించారని విమర్శించారు. చాలా ఆషామాషీగా ప్రధాని మోదీ గోరఖపూర్ విషాదాన్ని ప్రకృతి వైపరీత్యాలతో పోల్చారని మండిపడ్డారు. -
పార్లమెంటులో ఆనంద్‌శర్మ వర్సెస్ అరుణ్‌జైట్లీ
-
పార్లమెంటులో ఆనంద్‌శర్మ వర్సెస్ అరుణ్‌జైట్లీ
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంపై విమర్శలు కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్‌శర్మ విమర్శలు చేయడంపట్ల పార్లమెంటులో గందరగోళం నెలకొంది. ఆనంద్‌శర్మ వర్సెస్ ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అరుణ్ జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆనంద్ శర్మ వ్యాఖ్యలను వెంటనే రికార్డుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రామ్‌నాథ్ కోవింద్ దేశ నిర్మాతల్లో జవహార్ లాలూ నెహ్రూ ప్రధానమైనవారని, ఆయన పేరును ప్రస్తావించకపోవడంతో ఆయన ప్రసంగం తమను నిరుత్సాహానికి గురిచేసిందని ఆనంద్ శర్మ అన్నారు. 'జాతి నిర్మాతలను ప్రతి దేశం ప్రతి సమాజం గౌరవిస్తుంది. అదే సంస్కృతి భారత్‌లోనూ కొనసాగుతోంది. భారత జాతి నిర్మాతల్లో అగ్రగణ్యులు గాంధీ ఆయనను గౌరవించారు. ఆయనతోపాటు జైలుకు వెళ్లొచ్చిన జవహార్ లాల్ నెహ్రూని మాత్రం వదిలేశారు. నిన్న గాంధీని పండిట్ దీన్ దయాల్ తో పోల్చారు' అని అన్నారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ నేతలంతా అడ్డు చెప్పారు. శర్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బల్లలు చరుస్తూ గందరగోళం చేశారు. ఆగ్రహంతో ఒక్కసారిగా నిల్చున్న అరుణ్ జైట్లీ వెంటనే ఆనంద్ శర్మ చేసిన ప్రసంగం మొత్తాన్ని రికార్డుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మేమంతా కూడా నిన్ననే జన్మించలేదు.. మాకు ఈ విషయాలు తెలియకుండా ఉండటానికి' అని ఆయన అన్నారు. -
‘బిగ్‌బాస్ షో’లోని సన్నివేశాలపై అభ్యంతరం
అలంపూర్ రూరల్: ఒక టీవీ ఛానెల్లో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షోలో హైందవ సంస్కృతిని కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని బ్రాహ్మణ సంఘాల బాధ్యులు డిమాండ్ చేస్తున్నారు. హోమగుండం వద్ద బ్రష్ చేసుకుంటూ చలి మంటలు కాచుకుంటున్నట్లుగా.. అందులో ఆజ్యం పోస్తుండటం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు సరికాదని పేర్కొన్నారు. ఆయా సన్నివేశాలను తొలగించి క్షమాపణ చెప్పాలని జోగుళాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ సేవాసమితి ప్రధాన కార్యదర్శి శ్రీకొండుమాకాంత్ శర్మ సిద్ధాంతి, బ్రాహ్మణ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌శర్మ తదితరులు డిమాండ్ చేశారు. -
'ప్రపంచంలో మాకే చెత్తగా చెల్లింపులు'
చెన్నై: తమ రాష్ట్రంలోని రైతులంతా కూడా రుణమాఫీ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని తమిళనాడు ప్రభుత్వం తమ ఎమ్మెల్యేల జీత భత్యాలను మాత్రం ఒకేసారి రూ.50 వేలు పెంచేసింది. దీంతో ఇక నుంచి వారు నెలకు రూ.1.05లక్షల జీతం అందుకోనున్నారు. ఈ పెంపు కారణంగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు పొందుతున్న పెన్షన్ కూడా రూ.12,000 నుంచి రూ.20 వేలకు పెరిగింది. ఇక తమ నియోజక వర్గాల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్న నిధుల మొత్తం కూడా రూ.2కోట్ల నుంచి రూ.2.6కోట్లకు పెరిగింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఈ పళని స్వామి బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా, మరోపక్క, తమ జీతభత్యాలు కూడా పెంచాలంటూ ఇప్పుడు ఎంపీలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సమాజ్‌వాది పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్, కాంగ్రెస్ ఎంపీ ఆనంద్‌శర్మ జీతభత్యాలు పెంచాలంటూ డిమాండ్ లేవనెత్తారు. 'ప్రపంచంలోని ఒక్క భారత పార్లమెంటే చెత్తగా ప్రతినిధులకు జీత భత్యాలు చెల్లిస్తోంది' అని ఆనంద్‌శర్మ వ్యాఖ్యానించారు. ఒక అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ 'జర్నలిస్టులు, న్యాయ విభాగానికి చెందినవారు మరింత మంచి జీతభత్యాలు ఆపినట్లయితే మేం కూడా ఆపేస్తాం. మాకు చెల్లింపులు పెంచితే ఎందుకు సమస్య? న్యాయమూర్తులే అడుగుతున్నప్పుడు ఎంపీలుగా మేం ఎందుకు చెల్లింపులు పెంచాలని ఎందుకు అడగకూడదు? అని ప్రశ్నించారు. తాము కూడా 7వ వేతన చెల్లింపుల కమిషన్ పరిధిలోకి వస్తామని అందుకే డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.