ఆ డబ్బంతా నల్లధనమేనా? | Anand Sharma initiates demonetisation debate in Rajya sabha | Sakshi
Sakshi News home page

రంగుపోయే రూ.2వేల నోటును నమ్మడం లేదు..

Published Wed, Nov 16 2016 11:52 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

ఆ డబ్బంతా నల్లధనమేనా? - Sakshi

ఆ డబ్బంతా నల్లధనమేనా?

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే ఒక్క ప్రకటనతో పెద్దనోట్లను రద్దు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం రూ.500, 1000 నోట్లేనని ఆనంద్ శర్మ గుర్తు చేశారు. ఈ డబ్బంతా నల్లధనమేనా అంటూ ఆయన సూటిగా ప్రశించారు. నల్లధనం పేరుతో దేశంలో అలజడి సృష్టించారని ఆనంద్ శర్మ వ్యాఖ‍్యానించారు.
 
  • నల్లధనం వెలికితీయడానికి మేం వ్యతిరేకం కాదు
  • బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్ పెరుగుతున్న కొద్ది నగదు విత్ డ్రాను కేంద్రం పెంచుతోంది
  • నగదు రహిత దేశమన్న నేతలు సామాన్యుల కడుపులు నింపే దాబాల్లో కార్డులు చెల్లవని మర్చిపోయారు
  • ఎలాంటి సమయం ఇవ్వకుండా, హెచ్చరిక చేయకుండా పెద్దనోట్లు రద్దు చేశారు
  • రైతుల వద్ద క్రెడిట్ కార్డులు ఉన్నాయా?
  • దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతన్నలు నల్లధనాన్ని ఇంటికి తీసుకువెళుతున్నారా?
  • సామాన్యుల వద్ద ఉన్న రూ.500, 1000నోట్లు నల్లధనమా
  • ప్రతి విషయాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు.
  • ఏమీ చదువుకోకుండానే మీరంతా డాక్టర్లు అయ్యారు
  • నోట్ల రద్దుతో మీరు ఎంపిక చేసుకున్న 15-20మంది పారిశ్రామిక వేత్తలకు సాయం చేశారు
  • రెండున్నరేళ్లలో అప్పు మాఫీ చేసింది ఎవరికీ, రైతులకా? పారిశ్రామికవేత్తలకా?
  • మీకు నచ్చినవాళ్లను నెత్తిన పెట్టుకుంటున్నారు
  • తప్పు చేశారని ప్రశ్నిస్తే నిందిస్తున్నారు
  • ప్రధాని మోదీ మరో గ్రహంలో ఉన్నారా అని ఆలోచన కలుగుతోంది
  • ప్రధాని మోదీ మరో గ్రహంలో ఉన్నారా అని ఆలోచన కలుగుతోంది
  • రంగుపోయే రూ.2వేల నోటును ఎవరూ నమ్మడం లేదు
  • నల్లధనం సూట్కేసుల్లోనూ, కప్ బోర్డులోనూ లేదు
  • వేలకోట్ల నల్లధనవంతులతో మోదీ విమానాల్లో తిరుగుతున్నారు
  • స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవారి పేర్లు బయటపెట్టాలి
  • ఆస్తులు, పెట్టుబడుల రూపంలో 
  • నోట్ల రద్దు వల్ల శుభకార్యాలు నిలిచిపోయాయి
  • దహన సంస్కారాలపై కూడా రద్దు ప్రభావం పడింది
  • సామాన్యులకు ప్రధాని క్షమపణ చెప్పాలి
  • 1946లో తొలిసారి, 1978లో రెండోసారి నోట్ల రద్దు జరిగింది
  • అప్పుడు ఇలాంటి గందరగోళం ఏర్పడలేదు
  • నోట్ల రద్దు పక్షపాతంతో తీసుకున్న నిర్ణయం
  • దేశం మొత్తాన్ని మీరు క్యూలో నిలబెట్టారు
  • బ్యాంకుల ముందు ఎవరైనా ధనికులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement