loksabha adjourned
-
పార్లమెంట్ ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. లోక్‌సభ వాయిదా
ఢిల్లీ : లోక్ సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లు వచ్చింది. ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే క్రమంలో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. దాంతో లోక్‌సభ మార్చి 10 వరకూ వాయిదా పడింది. ఈ ఆదాయపు పన్ను కొత్త బిల్లు సెలక్ట్ కమిటీ పరిశీలన కోసం పంపనున్నారు.కొత్త బిల్లు పన్ను చట్టాలను ఎలా సులభతరం చేస్తుంది?కొత్త బిల్లులో ట్యాక్స్ ఇయర్ అనే పదాన్ని తీసుకొచ్చారు. టాక్స్ ఇయర్ అనేది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ప్రయోజనాల కోసం పరిగణించే 12 నెలల వ్యవధి. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం ట్యాక్స్ ఇయర్ గతంలోలాగే ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 1961 ఆదాయపు పన్ను చట్టంలో ఉపయోగించిన ‘ప్రివియస్ ఇయర్’, ‘అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం)’ స్థానంలో ఈ ట్యాక్స్ ఇయర్‌ను వాడనున్నారు.స్థిరమైన ట్యాక్స్ ఇయర్‌ను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని నివేదించడానికి, పన్నులు చెల్లించడానికి నిర్దిష్ట వ్యవధిని కలిగి ఉంటారు. ఇది విభిన్న ఆర్థిక సంవత్సరాలకు వేర్వేరు అసెస్మెంట్ ఇయర్(మదింపు సంవత్సరం-వచ్చే ఆర్థిక సంవత్సరం)లను కలిగి ఉండటం వల్ల తలెత్తే గందరగోళాన్ని తొలగిస్తుంది.పన్ను చెల్లింపుదారులు తమ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి సులభమైన, స్పష్టమైన భాషను ఉపయోగించాలని కొత్త బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కాలం చెల్లిన నిబంధనలు, వివరణలను తొలగించాలని నిర్ణయించారు.పన్ను విధానాలకు సంబంధించి స్పష్టమైన నిర్వచనాలు, క్రమబద్ధమైన విధానాలతో కొత్త పన్ను చట్టాలు వివాదాలు, లిటిగేషన్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు. దీనివల్ల మరింత పన్ను వసూలుకు వీలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్నుకు సంబంధించి వివాదాలు తగ్గడం వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని చెబుతున్నారు.తరచూ శాసన పరమైన సవరణలు అవసరం లేకుండా పన్ను పథకాలను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)కి ఎక్కువ అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది. -
ముగిసిన 17వ లోక్‌సభ.. పార్లమెంట్ నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పదిహేడవ లోక్‌సభ చివరి సమావేశాలు శనివారం ముగిశాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాలు ముగియడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్ఖడ్ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 17వ లోక్‌సభలో ఈ ఐదేళ్లలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. సమావేశాల చివరిరోజున రామమందిరం నిర్మాణంపై చర్చించారు. దీనిపై ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్‌షా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఐదేళ్లలో సాధించిన విజయాలను ఇరువరు వివరించారు. స్పీకర్ ఓంబిర్లా మాట్లాడుతూ అధికార,విపక్ష బెంచ్‌లను సమానంగా చూశానని, సభా గౌరవం కాపాడేందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చదవండి.. నాథుడు లేని పార్టీకి అందలమెలా..? -
లోక్‌సభలో టియర్ గ్యాస్ అలజడి..పరుగులు తీసిన ఎంపీలు
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో బుధవారం ఉదయం తీవ్ర భద్రతా వైఫల్యం తలెత్తింది. పార్లమెంట్‌పై దాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తయిన వేళ సంచలనం జరిగింది. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు. సభలోకి దూకిన వ్యక్తులు టియర్ గ్యాస్ వదిలారు. దీంతో సీట్లలో ఉన్న ఎంపీలంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. జీరో అవర్ కొనసాగుతుండగా ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. ‘ఇద్దరు వ్యక్తులు గ్యాలరీలో నుంచి కిందకు దూకారు. వారి టియర్ గ్యాస్ చల్లుతూ పరుగులు తీశారు. వారిని ఎంపీలు పట్టుకున్నారు. తర్వాత భద్రతా సిబ్బంది వచ్చి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమే’అని లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. కాళ్లకు వేసుకున్న బూట్లలో టియర్ గ్యాస్ క్యాన్లను దాచుకున్న ఇద్దరు ఆగంతకులు గ్యాలరీలో నుంచి కిందకు దూకిన తర్వాత టియర్ గ్యాస్ వదులుతూ భయ భ్రాంతులు సృష్టించారు. 2001 సంవత్సరంలో ఇదే రోజున పార్లమెంట్ పై కొందరు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పార్లమెంటు ఆవరణలో కాల్పులకు దిగిన టెర్రరరిస్టులను భద్రతా బలగాలు ఎదురు కాల్పుల్లో మట్టుబెట్టాయి. ఈ ఘటనలో అమరులైన భద్రతా సిబ్బందికి ఇవాళ ఉదయం ప్రధాని, రాష్ట్రపతి, ఎపీలు నివాళులర్పిచారు. మళ్లీ ఇదే రోజు పార్లమెంటులో దుండగులు టియర్ గ్యాస్ వదలడం ఒక్కసారిగా భయాందోళనలు రేపింది. — ANI (@ANI) December 13, 2023 #WATCH | Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury speaks on an incident of security breach and commotion in the House. "Two young men jumped from the gallery and something was hurled by them from which gas was emitting. They were caught by MPs, they were brought… pic.twitter.com/nKJf7Q5bLM — ANI (@ANI) December 13, 2023 -
‘ప్రధాని మోదీ రావాలి.. మాట్లాడాలి’
సాక్షి, న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. విపక్ష ఎంపీలు తమ డిమాండ్‌పై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి.. సమాధానం ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెప్పారు. ప్రధానమంత్రి మొండి వైఖరిని నిరసిస్తూ నల్లరంగు దుస్తులు ధరించి పార్లమెంట్‌కు హాజరయ్యారు. విపక్షాల నినాదాలు, ఆందోళనలతో ఉభయ సభల్లో గురువారం సైతం వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. మణిపూర్ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. మోదీ మౌనాన్ని వీడాలని, మణిపూర్ హింసపై నోరు విప్పాలని బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో అధికార బీజేపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యుల నినాదాల హోరు మధ్యే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఖనిజ చట్ట సవరణ బిల్లును, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ జన్‌విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత జన్‌విశ్వాస్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. 76 కాలం చెల్లిన చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. అనంతరం లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఆ భేటీని బహిష్కరించిన ఎంపీలు రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశాన్ని ప్రతిపక్ష ఎంపీలు బహిష్కరించారు. మణిపూర్ అంశంపై ప్రధాని వైఖరికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. రాజ్యసభ బీఏసీలో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ సమావేశాన్ని జైరాం రమేశ్(కాంగ్రెస్), మీసా భారతి(ఆర్జేడీ), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ) బహిష్కరించారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సభ్యుడు కేశవరావు గైర్హాజరయ్యారు. దేశాన్ని విభజిస్తున్నారు: రాహుల్ దేశాన్ని విభజించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలసికట్టుగా కుట్రపన్నుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ప్రజల దుఃఖం బాధ వారికి పట్టడం లేదు. అధికారం తప్ప వారికి మరి దేనిపైనా ఆసక్తి లేదు’ అని అన్నారు. యువజన కాంగ్రెస్ గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆన్లైన్లో పాల్గొని ప్రసంగించారు. ‘బీజేపీ–ఆర్ఎస్ఎస్కి కావాల్సింది అధికారమే. దాని కోసం ఏమైనా చేస్తారు. అధికారం కోసం వారు మణిపూర్‌ను రావణకాష్టంలా మారుస్తారు. యావత్ దేశాన్ని నిప్పుల కుంపటి చేస్తారు. దేశ ప్రజల బాధ, శోకం వారికి పట్టదు’ అని తీవ్ర స్థాయిలో «ధ్వజమెత్తారు. ‘మీరు ఒక వైపు కూర్చొని ప్రేమను పంచుతూ ఉంటారు. దేశానికి, దేశ ప్రజలకి గాయమైతే మీకూ ఆ నొప్పి తెలుస్తుంది. కానీ వాళ్లకి అలాంటి భావాలే లేవు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి ప్రజల బాధ ఏంటో తెలీదు. వాళ్లు దేశాన్ని విభజించే పనిలో బిజీ’ అని అన్నారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. మణిపూర్‌లో మంటలు చెలరేగుతున్నా ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు ప్రయ తి్నస్తుండగా, అధికారపక్ష ఎంపీలు అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. పునఃప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర మంత్రి ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో విపక్షాల తీరును ఆయన తప్పుపపట్టారు. దాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఒక సమయంలో ప్రతిపక్ష సభ్యులు ‘ఇండియా, ఇండియా’ అంటూ నినాదాలు చేయగా, బీజేపీ సభ్యులు ‘మోదీ, మోదీ’ అంటూ నినదించారు. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు మూజువాణి ఓటుతో సభలో ఆమోదం పొందింది. -
లోక్‌సభలో ‘పెగసస్’ మంటలు
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్, కొత్త సాగు చట్టాలపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజు లోక్‌సభ అట్టుడికింది. శుక్రవారం ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి సభా కార్యకలాపాలకు పలుమార్లు అంతరాయం కలిగించడంతో డిప్యూటీ స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. తొలుత ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కొందరు ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించారు. స్పీకర్ ఓంబిర్లా సూచన మేరకు ఆయా పార్టీల సభాపక్ష నాయకులు వారిని వెనక్కి తీసుకెళ్లారు. టోక్యో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడాకారులకు సంఘీభావం తెలియజేస్తూ పలువురు ఎంపీలు నీలం రంగు టీ–షర్టులు ధరించి సభకు వచ్చారు. మన క్రీడాకారులకు మద్దతుగా ఎంపీలు బల్లలు చరిచారు. అనంతరం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన పలువురు ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. ఫోన్ల హ్యాకింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పెగసస్ స్పైవేర్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. పెగసస్ అంశంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. తమ సెల్ఫోన్లను స్పీకర్‌కు కనిపించేలా చూపారు. సీనియర్లు ప్రవర్తించేది ఇలాగేనా? కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని శిరోమణి అకాలీదళ్ సభ్యురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్లకార్డు ప్రదర్శించారు. జసూసీ కర్నా బంద్ కరో(గూఢచర్యం ఆపండి) అంటూ ప్రతిపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. కరోనా వ్యాక్సినేషన్‌పై ఆరోగ్య శాఖ మంత్రి సమాధానం ఇస్తారని, సభ్యులు శాంతించాలని స్పీకర్ పదేపదే కోరినప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు. ఆందోళనలు ఆగకపోవడంతో ఉదయం 11.20 గంటలకు స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ 12 గంటలకు సభ ప్రారంభం కాగానే సభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన సాగించారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కిరీట్ సోలంకి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ వినిపించుకోలేదు. అదేసమయంలో పలు పార్లమెంటరీ కమిటీల్లో కొత్త సభ్యులను నియమిస్తూ తీర్మానాలను ఆమోదించారు. ప్రతిపక్ష సభ్యుల తీరుపై డిప్యూటీ స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. సీనియర్ సభ్యులు సైతం ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. సభను సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ ఎంపీ శంతను సేన్ సస్పెన్షన్ పెగసస్ స్పైవేర్, ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టడంతో రాజ్యసభ నాలుగు సార్లు సభ వాయిదా పడింది. సభ్యుల నిరసనలతో సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. టీఎంసీ సభ్యుడు శంతను సేన్ గురువారం రాజ్యసభలో ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతిలోని పత్రాలను లాక్కొని చింపేసిన విషయం తెలిసిందే. దీంతో శంతను సేన్‌ను సభ నుంచి బహిష్కరిస్తూ శుక్రవారం ఉదయం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. మధ్యాహ్నం 12.30 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు శంతను సేన్ సభకు హాజరయ్యారు. బయటకు వెళ్లిపోవాలని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ ఆదేశించినా ఆయన పట్టించుకోలేదు. -
ఆ డబ్బంతా నల్లధనమేనా?
-
ఆ డబ్బంతా నల్లధనమేనా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే ఒక్క ప్రకటనతో పెద్దనోట్లను రద్దు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం రూ.500, 1000 నోట్లేనని ఆనంద్ శర్మ గుర్తు చేశారు. ఈ డబ్బంతా నల్లధనమేనా అంటూ ఆయన సూటిగా ప్రశించారు. నల్లధనం పేరుతో దేశంలో అలజడి సృష్టించారని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీయడానికి మేం వ్యతిరేకం కాదు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్ పెరుగుతున్న కొద్ది నగదు విత్ డ్రాను కేంద్రం పెంచుతోంది నగదు రహిత దేశమన్న నేతలు సామాన్యుల కడుపులు నింపే దాబాల్లో కార్డులు చెల్లవని మర్చిపోయారు ఎలాంటి సమయం ఇవ్వకుండా, హెచ్చరిక చేయకుండా పెద్దనోట్లు రద్దు చేశారు రైతుల వద్ద క్రెడిట్ కార్డులు ఉన్నాయా? దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతన్నలు నల్లధనాన్ని ఇంటికి తీసుకువెళుతున్నారా? సామాన్యుల వద్ద ఉన్న రూ.500, 1000నోట్లు నల్లధనమా ప్రతి విషయాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు. ఏమీ చదువుకోకుండానే మీరంతా డాక్టర్లు అయ్యారు నోట్ల రద్దుతో మీరు ఎంపిక చేసుకున్న 15-20మంది పారిశ్రామిక వేత్తలకు సాయం చేశారు రెండున్నరేళ్లలో అప్పు మాఫీ చేసింది ఎవరికీ, రైతులకా? పారిశ్రామికవేత్తలకా? మీకు నచ్చినవాళ్లను నెత్తిన పెట్టుకుంటున్నారు తప్పు చేశారని ప్రశ్నిస్తే నిందిస్తున్నారు ప్రధాని మోదీ మరో గ్రహంలో ఉన్నారా అని ఆలోచన కలుగుతోంది ప్రధాని మోదీ మరో గ్రహంలో ఉన్నారా అని ఆలోచన కలుగుతోంది రంగుపోయే రూ.2వేల నోటును ఎవరూ నమ్మడం లేదు నల్లధనం సూట్కేసుల్లోనూ, కప్ బోర్డులోనూ లేదు వేలకోట్ల నల్లధనవంతులతో మోదీ విమానాల్లో తిరుగుతున్నారు స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవారి పేర్లు బయటపెట్టాలి ఆస్తులు, పెట్టుబడుల రూపంలో నోట్ల రద్దు వల్ల శుభకార్యాలు నిలిచిపోయాయి దహన సంస్కారాలపై కూడా రద్దు ప్రభావం పడింది సామాన్యులకు ప్రధాని క్షమపణ చెప్పాలి 1946లో తొలిసారి, 1978లో రెండోసారి నోట్ల రద్దు జరిగింది అప్పుడు ఇలాంటి గందరగోళం ఏర్పడలేదు నోట్ల రద్దు పక్షపాతంతో తీసుకున్న నిర్ణయం దేశం మొత్తాన్ని మీరు క్యూలో నిలబెట్టారు బ్యాంకుల ముందు ఎవరైనా ధనికులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారా? -
లోక్ సభ సమావేశాలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: లోక్ సభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డారు. తొలిరోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇటీవల మృతి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఎంపీ రేణుక సిన్హా మృతికి సభ సంతాపం తెలిపిన వెంటనే సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మరోవైపు రాజ్యసభలోనూ థాయ్‌లాండ్ రాజు మృతికి సంతాపం తెలిపింది. రాజ్యసభలో పెద్దనోట్లపై నిరసన అనంతరం నోట్ల రద్దును నిరసిస్తూ రాజ్యసభ సభ్యులు నిరసనకు దిగారు. ఈ అంశంపై చర్చ జరగాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై అజెండా ప్రకారమే చర్చకు అనుమతి ఇస్తామని డిప్యూటీ స్పీకర్ కురియన్ స్పష్టం చేశారు. నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ నల్లధనం పేరుతో దేశంలో అలజడి సృష్టించారన్నారు. నల్లధనం వెలికి తీయడానికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు. ఒక్కమాటతో 86 శాతం కరెన్సీ పనికిరాకుండా పోయిందని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. -
మూడోరోజు సేమ్ సీన్ రిపీట్...
న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మూడోరోజు సమావేశాలు ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలు, ఆందోళనల మధ్య గురువారం ఉదయం లోక్ సభ మొదలైంది. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దాంతో ప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసి వ్యాపం, లలిత్ మోదీ కుంభకోణాలపై చర్చించాలంటూ కాంగ్రెస్, వామపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చర్చకు స్పీకర్ అంగీకరించకపోవటంతో సభ్యులు నిరసనకు దిగారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దాంతో ఆమె సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలోనూ గందరగోళం కొనసాగుతోంది. వ్యాపం, మోదీ స్కామ్‌పై చర్చించాల్సిందేనంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేపట్టారు. వైస్ ఛైర్మన్ కురియన్ ...విపక్ష సభ్యులకు సర్దిచెప్పి సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.