లోక్‌సభలో టియర్‌ గ్యాస్‌ అలజడి..పరుగులు తీసిన ఎంపీలు | Winter Session: Security Breach In Lok Sabha - Sakshi
Sakshi News home page

లోక్‌సభలో టియర్‌ గ్యాస్‌ అలజడి..పరుగులు తీసిన ఎంపీలు

Published Wed, Dec 13 2023 1:25 PM | Last Updated on Wed, Dec 13 2023 2:27 PM

Security Breach In Loksabha - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో బుధవారం ఉదయం తీవ్ర భద్రతా వైఫల్యం తలెత్తింది. పార్లమెంట్‌పై దాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తయిన వేళ సంచలనం జరిగింది. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు. సభలోకి దూకిన వ్యక్తులు టియర్‌ గ్యాస్‌ వదిలారు. దీంతో సీట్లలో ఉన్న ఎంపీలంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. జీరో అవర్‌ కొనసాగుతుండగా ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

‘ఇద్దరు వ్యక్తులు గ్యాలరీలో నుంచి కిందకు దూకారు. వారి టియర్‌ గ్యాస్‌ చల్లుతూ పరుగులు తీశారు. వారిని ఎంపీలు పట్టుకున్నారు. తర్వాత భద్రతా సిబ్బంది వచ్చి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమే’అని లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు. 

కాళ్లకు వేసుకున్న బూట్లలో టియర్‌ గ్యాస్‌ క్యాన్లను దాచుకున్న ఇద్దరు ఆగంతకులు గ్యాలరీలో నుంచి కిందకు దూకిన తర్వాత టియర్‌ గ్యాస్‌ వదులుతూ భయ భ్రాంతులు సృష్టించారు. 

2001 సంవత్సరంలో ఇదే రోజున పార్లమెంట్‌ పై కొందరు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పార్లమెంటు ఆవరణలో కాల్పులకు దిగిన టెర్రరరిస్టులను భద్రతా బలగాలు ఎదురు కాల్పుల్లో మట్టుబెట్టాయి. ఈ ఘటనలో అమరులైన భద్రతా సిబ్బందికి  ఇవాళ ఉదయం ప్రధాని, రాష్ట్రపతి, ఎపీలు నివాళులర్పిచారు. మళ్లీ ఇదే రోజు పార్లమెంటులో దుండగులు టియర్‌ గ్యాస్‌ వదలడం ఒక్కసారిగా  భయాందోళనలు రేపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement