Tear gas
-
రైతులపైకి టియర్‌గ్యాస్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు ప్రాంతం మళ్లీ రణరంగంగా మారింది. పంటలకు మద్దతు ధరతో సహా పలు డిమాండ్లతో రైతు సంఘాలకు చెందిన 101 మంది రైతులు మధ్యాహ్నం మరోసారి శాంతియుతంగా చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీ వైపు వెళ్లేందుకు వారు ప్రయత్నించడం గత పది రోజుల్లో ఇది మూడోసారి. రైతులను అడ్డుకునేందుకు పోలీసులను భారీగా మోహరించారు. బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. అంబాలా డిప్యూటీ కమిషనర్ రైతులతో సుమారు 40 నిమిషాలసేపు చర్చలు జరిపారు. రైతుల ఆందోళనలకు సంబంధించి 18న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించేవరకు సంయమనం పాటించాలని కోరారు. అయినా రైతులు ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువు, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. దాంతో 17 మంది రైతులు గాయాలపాలైనట్లు సమాచారం. రైతులు తమ సొంత వాహనాల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం శంభు చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఈనెల 17 వరకు మొబైల్, ఇంటర్నెట్‌సేవలు నిలిపివేసింది. హరియాణాకు చెందిన రెజ్లర్, కాంగ్రెస్ నేత భజరంగ్ పునియా శంభు సరిహద్దు చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. డల్లేవాల్ ఆరోగ్యం విషమం ఖన్నౌరీలో 19 రోజులుగా నిరశన దీక్ష సాగిస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఆరోగ్యం విషమంగా మారిందని రైతు నేతలు చెబుతున్నారు. ఆయనకు చికిత్స అందించాలని కేంద్రాన్ని, పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. కానీ చికిత్స తీసుకునేందుకు డల్లేవాల్ నిరాకరిస్తున్నారు. ‘రైతుల కోసం దీక్ష చేస్తున్నా. వారి నడుమే చివరి శ్వాస తీసుకుంటాను’’ అని ఆయన స్పష్టం చేశారు. దాంతో ఆయన బెడ్‌ను శుక్రవారం ఆందోళన వేదిక వద్దకే మార్చారు.16న ట్రాక్టర్ ర్యాలీ రైతులపై పోలీసుల బలప్రయోగాన్ని రైతు సంఘం నేత సర్వాన్ సింగ్ పంథేర్ తీవ్రంగా ఖండించారు. ‘’మార్చ్‌లో భాగంగా ఢిల్లీకి వెళ్లే 101 మంది రైతుల కారణంగా శాంతి భద్రతలకు భంగమెలా కలుగుతుంది? పార్లమెంట్లో రాజ్యాంగం గురించి చర్చిస్తున్నారు. రైతుల ఆందోళనలను అణచివేయాలని ఏ రాజ్యాంగం చెప్పింది?’’ అని మీడియాతో ఆయన అన్నారు. పార్లమెంట్లో రైతుల సమస్యలపై చర్చనే జరగలేదని ఆక్షేపించారు. ‘‘మా కార్యాచరణలో భాగంగా సోమవారం పంజాబ్ మినహా మిగతా చోట్ల ట్రాక్టర్ మార్చ్ ఉంటుంది. 18న మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల దాకా పంజాబ్‌లో రైల్ రోకో చేపడతాం’’ అని ప్రకటించారు. -
కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనకారులపై విరుచుకుపడిన పోలీసులు
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా, విద్యార్థి సంఘాలు ‘పశ్చిమబంగాఛాత్రో సమాజ్’మంగళవారం చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు విరుచుకు పడ్డారు. దీంతో కోల్‌కతా వీధుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.‘నభన్నా అభిజాన్’ పేరుతో హావ్‌డా నుంచి మొదలైన విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. బాష్పవాయువు వాటర్ ఫిరంగులతో విరుచుకుపడ్డారు. దీంతో కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. మరికొందరు బారికేడ్లను తోసుకొని దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. మరోవైపుఈ ర్యాలీ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ర్యాలీ నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి లేదని రాష్ట్ర పోలీసులు చెప్పారు. హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఇది బీజేపీ ప్రేరేపిత కుట్ర అని హింసాకాండతో అల్లకల్లోలం సృష్టించేందుకు పన్నిన పన్నాగమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ర్యాలీ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 6 వేలమంది పోలీసులను మోహరించారు. నిరసనకారులపై నిఘా నిమిత్తం డ్రోన్లను ఉపయోగించారు. బారికేడ్లను తొలగించే అవకాశం లేకుండా, వెల్డింగ్ చేసి గ్రీజు పూయడం గమనార్హం. -
Delhi Chalo: రైతు ఉద్యమం ఉధృతం
న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మరింత ఉధృతమైంది. ఢిల్లీ సమీపంలో శంభు, టిక్రి సరిహద్దుల వద్ద పోలీసుల బారికేడ్లు, ఇనుపకంచెలు, సిమెంట్ దిమ్మెలను దాటేందుకు రైతులు ప్రయతి్నస్తున్నారు. పోలీసుల భాష్పవాయు గోళాలు, జలఫిరంగుల దాడితో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఉద్యమం మొదలై మూడురోజులవుతున్నా అటు రైతులు, ఇటు కేంద్ర ప్రభుత్వం పట్టువిడవడం లేదు. పంజాబ్, హరియాణాల మధ్యనున్న శంభు సరిహద్దు వద్ద వేలాదిగా రైతులు సంఘటితమయ్యారు. టిక్రి, సింఘు, కనౌరీ బోర్డర్ పాయింట్ల వద్దా అదే పరిస్థితి కనిపించింది. వారిని నిలువరించేందుకు మరింతగా బాష్పవాయుగోళాలు అవసరమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. 30,000 టియర్‌గ్యాస్ షెల్స్‌కు ఆర్డర్ పెట్టారు. గ్వాలియర్‌లోని బీఎస్ఎఫ్ టియర్‌స్మోక్ యూనిట్ వీటిని సరఫరా చేయనుంది. ఘాజీపూర్ సరిహద్దు వద్ద సైతం పోలీసులు మొహరించారు. చండీగఢ్‌లో రైతు సంఘాల నేతలు జగ్జీత్సింగ్ దల్లేవాల్, శర్వాణ్ సింగ్ పాంథెర్, ప్రభుత్వ ప్రతినిధులైన వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మధ్య గురువారం రాత్రి మూడో దఫా చర్చలు మొదలయ్యాయి. చర్చల్లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం పాల్గొన్నారు. వాటిలో తేలిందనేది ఇంకా వెల్లడి కాలేదు. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)లో భాగమైన భారతీయ కిసాన్ యూనియన్ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా రైతులు నేడు గ్రామీణ భారత్ బంద్‌ను పాటించనున్నారు. ‘‘రైతులెవ్వరూ శుక్రవారం నుంచి పొలం పనులకు వెళ్లొద్దు. కారి్మకులు సైతం ఈ బంద్‌ను భాగస్వాములవుతున్నారు. ఈ రైతు ఉద్యమంలో ఎంతగా భారీ సంఖ్యలో జనం పాల్గొంటున్నారో ప్రభుత్వానికి అర్థమవుతుంది’’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. భారత్‌బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు హరియాణాలోని నోయిడాలో కర్ఫ్యూ విధించారు. పలు జిల్లాల్లో 17వ తేదీ దాకా టెలికాం సేవలను నిలిపేస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులు సైన్యంలా ఢిల్లీ ఆక్రమణకు వస్తున్నారంటూ బీజేపీ పాలిత హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పంజాబ్‌లోనూ శుక్రవారం దాకా ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. పట్టాలపై బైఠాయింపు నిరసనల్లో భాగంగా గురువారం రైతులు రైల్ రోకో కూడా నిర్వహించారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో అతి పెద్దదైన రాజాపురా రైల్వే జంక్షన్ వద్ద వందలాది మంది రైతులు పట్టాలపై బైఠాయించారు. మధ్యా హ్నం నుంచి సాయంత్రం దాకా రైళ్ల రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. చాలా రైళ్లను దారి మళ్లించగా కొన్నింటిని రద్దు చేశారు. -
Farmers movement, Delhi Chalo: రెండో రోజూ ఉద్రిక్తత
చండీగఢ్: డిమాండ్ల సాధన కోసం రైతు సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ ఉద్రిక్తతలు వరుసగా రెండో రోజు బుధవారం సైతం కొనసాగాయి. ఢిల్లీకి చేరుకోకుండా రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. పంజాబ్–హరియాణా శంభు సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం ఇక్కడికి చేరుకున్న వేలాది మంది రైతులు రాత్రంతా ట్రాక్టర్లపైనే ఉండిపోయారు. బుధవారం ఉదయం రక్షణ వలయాన్ని ఛేదించుకొని, ఢిల్లీవైపు వెళ్లేందుకు ప్రయతి్నంచారు. రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి, తమను అడ్డుకున్న పోలీసులపై నిరసనకారులు ఆగ్రహావేశాలతో రాళ్లు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టడానికి డ్రోన్లతో బాష్ప వాయువు గోళాలు ప్రయోగించారు. ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. శంభు బోర్డర్లో రోజంతా యుద్ధ వాతావరణం కనిపించింది. పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. హరియాణా ప్రభుత్వం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీకి చేరుకొని తమ గళం వినిపించడం తథ్యమని, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రైతులు తేలి్చచెప్పారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదని, ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘం నేత జగజీత్ సింగ్ దలీవాల్ చెప్పారు. మరోవైపు, ఢిల్లీ సరిహద్దుల్లోనూ బుధవారం ఉద్రిక్తత కొనసాగింది. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. డ్రోన్లను కూల్చడానికి పతంగులు శంభు బోర్డర్ వద్ద పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను నేల కూల్చడానికి కొందరు యువ రైతులు వినూత్న ప్రయత్నం చేశారు. పతంగులు ఎగురవేశారు. పతంగుల దారాలతో డ్రోన్లను బంధించి, కూల్చివేయాలన్నదే వారి ఆలోచన. డ్రోన్లతో నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంభు సరిహద్దులో హరియాణా పోలీసులు డ్రోన్లు ప్రయోగించడం పట్ల పంజాబ్ పోలీసులు అభ్యంతరం తెలిపారు. తమ రాష్ట్ర భూభాగంలోకి డ్రోన్లను పంపొద్దని స్పష్టం చేశారు. తమ ఆందోళన కొనసాగిస్తామని, గురువారం పంజాబ్‌లో పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయిస్తామని రైతు సంఘాల నాయకులు చెప్పారు. నేడు మూడో దశ చర్చలు! రైతుల డిమాండ్ల విషయంలో రైతు సంఘాలతో నిర్మాణాత్మక చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా బుధవారం చెప్పారు. చర్చలకు సానుకూల వాతావరణం కలి్పంచాలని, నిరసన కార్యక్రమాలు విరమించాలని రైతులకు సూచించారు. అసాంఘీక శక్తుల వలలో చిక్కుకోవద్దని చెప్పారు. కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల జరిగిన రెండు దశల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చలకు ఇరుపక్షాలు సముఖంగా ఉన్నాయి. మూడో దశ చర్చలు గురువారం మధ్యాహ్నం చండీగఢ్‌లో జరుగనున్నట్లు తెలిసింది. -
రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం
-
పక్కాగా రెక్కీ చేసి దాడికి పాల్పడ్డారా ?..దాడి వెనుక అసలు కథ..
-
పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం ఘటన కేసులో సూత్రధారి అరెస్ట్
-
వైఫల్యమా ?..నిర్లక్ష్యమా ?
-
పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. లోకసభలో గ్యాలరీ నుంచి సభలోకి దూకి, పొగ గొట్టాలు విసిరిన అగంతకులు ..ఇంకా ఇతర అప్డేట్స్
-
పార్లమెంట్ లో టియర్ గ్యాస్
-
Parliment Attack: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం..లోక్ సభలో కి దూకిన ఇద్దరు ఆగంతుకులు (ఫొటోలు)
-
లోక్‌సభ ఘటన.. పక్కా స్కెచ్‌తోనే ఎంట్రీ!
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఇద్దరు యువకులు.. లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు వాళ్లు. అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్లను నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. 👉పాస్‌లు ఎలా పొందారసలు? 🔺సభా కార్యకలాపాలు కొనసాగుతోన్న వేళ లోక్‌సభలోకి దూసుకొచ్చిన దుండుగులు 🔺సందర్శకులుగా వచ్చి దాడికి పాల్పడ్డ దుండగులు 🔺ప్రస్తుతానికి విజిటర్స్ పాస్‌ల జారీపై స్పీకర్ నిషేధం 🔺ఎవరైనా పార్లమెంట్‌ను సందర్శించాలనుకుంటే.. 🔺నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యుడి పేరు మీద అభ్యర్థన చేసుకోవాలి 🔺మొదట ఎంపీలు ఈ అభ్యర్థన చేసుకున్న వ్యక్తులు సమర్పించిన గుర్తింపు కార్డులు తనిఖీ చేస్తారు 🔺భద్రతాపరమైన పరిశీలన కూడా ఉంటుంది 🔺పార్లమెంట్ కార్యకలాపాలు వీక్షించేందుకు మూడు అంచెల భద్రతా వ్యవస్థను దాటాలి 🔺పార్లమెంటు ప్రవేశద్వారం వద్ద మోహరించిన సిబ్బంది, ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా కఠినమైన భద్రతా తనిఖీ తర్వాతే వారు లోపలికి వెళ్తారు 🔺ప్రస్తుతం విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు దుండగులది కర్ణాటక 🔺మైసూర్ ఎంపీ ప్రతాప్ పేరు మీద జారీ అయిన పాస్‌లు 🔺దీంతో రాజకీయ విమర్శలు 🔺పాస్‌లు జారీ బాధ్యతారాహిత్యమని.. క్షమార్హమైంది కాదంటున్న విపక్షాలు 🔺పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వాదన వినిపించనున్న బీజేపీ ఎంపీ 🔺కొత్త పార్లమెంట్ వీక్షిస్తామనే వంకతో వారు పాస్‌లు పొందినట్లు సమాచారం 🔺మూడు నెలలపాటు ప్రయత్నించి ఈ పాస్ పొందినట్లు గుర్తింపు 👉రాజకీయం తగదు: కేంద్ర మంత్రి గోయల్ 🔺లోక్‌సభ ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలంటున్న విపక్షాలు 🔺రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ 🔺దాడి జరిగింది లోక్‌సభనా? రాజ్యసభనా? అని చూడొద్దంటున్న విపక్షాలు 🔺ఘటనపై ఎప్పటికప్పటి సమాచారం.. దర్యాప్తు వివరాలను తెలియజేస్తానని సభ్యులకు రాజ్యసభ చైర్మన్ హామీ 🔺అయినా తగ్గని సభ్యులు 🔺హోం మంత్రి ప్రకటనకై పట్టు 🔺విపక్ష సభ్యుల డిమాండ్‌ను తోసిపుచ్చిన పీయూష్ గోయల్ 🔺పెద్దల సభ.. హుందాగా ఉండాలని పిలుపు 🔺ఇలాంటి సమయాల్లో మనమంతా ఐక్యమనే సందేశాన్ని ఇవ్వాలన్న గోయల్ 🔺కాంగ్రెస్, విపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయని మండిపాటు 🔺ఇది మంచి సందేశం కాదని విమర్శ 👉 దర్యాప్తులో కీలక విషయాలు 🔺పార్లమెంట్ దాడి ఘటన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి 🔺నిందితులు మొత్తం ఆరుగురిగా తేల్చిన అధికారులు 🔺పరారీలో మరో ఇద్దరు 🔺ఇప్పటికే పోలీసుల అదుపులో నలుగురు 🔺పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు 🔺నాలుగు నెలల కిందటే దాడికి ప్లాన్ గీసినట్లు సమాచారం 🔺పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం 👉 ఫుల్‌బాడీ స్కానర్లు పెట్టండి: లోక్‌సభ స్పీకర్ 🔺హోంశాఖకార్యదర్శికి స్పీకర్ ఓం బిర్లా లేఖ 🔺పార్లమెంట్ సెక్యూరిటీని పూర్తిగా ప్రక్షాళన చేయాలి 🔺ఎంట్రీ గేట్ల వద్ద ఫుల్ బాడీ స్కానర్లు ఏర్పాటు చేయాలి 🔺పార్లమెంట్ పరిసరాల్లో భద్రతను పెంచాలని లేఖలో కోరిన స్పీకర్ 🔺పార్లమెంట్ లోక్‌సభ దాడి ఘటనపై సన్‌సద్‌మార్గ్‌లోని పీఎస్‌లో కేసు నమోదు 👉 ముగిసిన అఖిలపక్ష సమావేశం 🔺పార్లమెంట్ సెక్యూరిటీపై సభ్యుల ఆందోళన 🔺హైపవర్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం 👉 లోపలా బయట ఆధారాల సేకరణ 🔺లోక్‌సభ ఘటన నేపథ్యంలో పార్లమెంట్‌కు చేరుకున్న ఫోరెన్సిక్ బృందం 🔺పార్లమెంట్ లోపలా, బయట ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం 🔺నలుగురు నిందితుల్ని విచారిస్తున్న దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులు 🔺రాత్రికల్లా దాడి గురించి స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం 👉 పార్లమెంట్లో మొదలైన అఖిలపక్ష సమావేశం 🔺లోక్‌సభ ఘటన నేపథ్యంలో పార్లమెంట్లో జరుగుతున్న అఖిలపక్ష సమావేశం 🔺వివిధ పార్టీల నుంచి హాజరైన లోక్‌సభ, రాజ్యసభ నేతలు 🔺భద్రతా వైఫల్యం, ఘటన కారణాలపై సమీక్ష 🔺రాజ్యసభలోనూ దాడి ఘటనను ప్రముఖంగా చర్చించిన కాంగ్రెస్ 👉ఎత్తు తగ్గించడం వల్లే..: ఎంపీ గోరంట్ల మాధవ్ 🔺స్పీకర్ చైర్ వైపు అగంతకుడు దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు 🔺దాడి చేసే ప్రయత్నం చేశాడు 🔺అతను బెంచీలు దాటుకొని వచ్చే ప్రయత్నం చేశారు 🔺ఎదురుగా వెళ్లి అతనిని నేరుగా పట్టుకున్నా 🔺పట్టుకున్న వెంటనే బూట్ల నుంచి టియర్ గ్యాస్ బయటకు తీశారు 🔺సందర్శకుల గ్యాలరీ ఎత్తు తగ్గించడం వల్ల సులభంగా లోపలికి ప్రవేశించాడు 🔺సందర్శకుల గ్యాలరీకి గ్లాస్ బిగించాలి 🔺ఇది కచ్చితంగా తీవ్రమైన భద్రత వైఫల్యమే 🔺లోక్‌సభలో అలజడి సృష్టించిన అగంతకుడిని పట్టుకున్న వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ 🔺ఎదురుగా వెళ్లి అగంతకుడిని పట్టుకున్న మాధవ్ 🔺మాధవ్‌తో పాటు ఎంపీ గుర్జిత్, ఇతర ఎంపీలు కూడా ఆగంతకుల్ని నిలువరించే యత్నం 🔺పార్లమెంట్‌కు చేరుకున్న ఫోరెన్సిక్ బృందం VIDEO | Forensics team arrives at Parliament following a security breach inside Lok Sabha earlier today. pic.twitter.com/4jnUIzmweP — Press Trust of India (@PTI_News) December 13, 2023 👉బీజేపీ ఎంపీ పేరు మీదే పాస్! 🔺మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా పేరు మీద పాస్ తీసుకున్న సాగర్ శర్మ! 🔺వివేకానంద ఇనిస్టిట్యూట్‌లో చదువుతున్న సాగర్ శర్మ, మనోరంజన్‌లు 🔺బెంగళూరు వెళ్తున్నామని చెప్పి మూడు రోజుల కిందట ఇంటి నుంచి బయల్దేరిన ఈ ఇద్దరూ 🔺బీజేపీ మైసూర్ ఎంపీ పేరు మీద విజిటర్స్ పాస్ తీసుకున్న వైనం 🔺విజిటర్స్ పాస్‌లు రద్దు చేసిన స్పీకర్ 👉లోక్‌సభ ఘటన నిందితుల గుర్తింపు 🔺పార్లమెంట్ లోపల దాడికి పాల్పడిన ఇద్దరు ఆగంతకుల్ని గుర్తించిన ఢిల్లీ పోలీసులు 🔺సాగర్ శర్మ, మనోరంజన్‌గా గుర్తింపు 🔺బయట రంగుల టియర్‌గ్యాస్‌తో నినాదాలు చేసింది నీలమ్‌కౌర్(హిస్సార్-హర్యానా), ఆమోల్ షిండే(లాతూర్-మహారాష్ట్ర)గా గుర్తింపు 🔺పోలీసుల అదుపులో ఈ నలుగురు 🔺ప్రశ్నిస్తున్న ఢిల్లీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు 🔺దాడికి గల కారణాలపై ఆరా ఇదీ చదవండి: లోక్‌సభలో టియర్ గ్యాస్ అలజడి..పరుగులు తీసిన ఎంపీలు 👉 కాసేపట్లో అఖిలపక్ష భేటీ 🔺పార్లమెంట్లో దాడి ఘటనపై కాసేపట్లో అఖిలపక్ష సమావేశం 🔺భద్రతా వైఫల్యం, ఘటనకు కారణాలపై సమీక్ష 🔺ఇప్పటికే పార్లమెంట్‌కు చేరుకున్న ఢిల్లీ సీపీ, హోం సెక్రటరీ అజయ్‌భల్లా 🔺 దాడి ఘటనతో విజిటర్ పాస్స్ రద్దు చేసిన స్పీకర్ Lok Sabha Speaker Om Birla to meet with Floor leaders of different political parties at 4pm today, over the security breach incident. (file photo) pic.twitter.com/gdp5R6v3wL — ANI (@ANI) December 13, 2023 జీరో అవర్ జరుగుతుండగా గ్యాలరీ నుంచి దూకి మరీ వెల్ వైపు వెళ్లే యత్నం చేశారు. బూట్లలో రంగుల టియర్‌గ్యాస్ బుల్లెట్లను బయటకు తీసి ప్రయోగించారు. లోక్‌సభలో ‘జైభీమ్, భారత్ మాతాకీ జై’ తానా షాహీ బంద్ కరో.. నినాదాలు చేస్తూ వెల్ వైపు వెళ్లేందుకు యత్నించారు. ఆగంతకుల చర్యతో బిత్తరపోయారు ఎంపీలంతా. అయితే అప్పటికే ఎంపీలు, భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యి వాళ్లను పట్టుకున్నారు. ఎంపీల ఆందోళనతో కాసేపు సభను వాయిదా వేశారు స్పీకర్. #WATCH | An unidentified man jumps from the visitor's gallery of Lok Sabha after which there was a slight commotion and the House was adjourned. pic.twitter.com/Fas1LQyaO4 — ANI (@ANI) December 13, 2023 లోక్‌సభలో లోపల దాడికి పాల్పడిన వాళ్ల గురించి తెలియాల్సి ఉంది. అదే సమయంలో పార్లమెంట్ బయట నినాదాలు చేస్తూ కనిపించిన ఇద్దరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పసుపు రంగు టియర్‌గ్యాస్‌తో వీళ్లు ‘‘రాజ్యాంగాన్ని కాపాడాలి..’’, ‘‘నియంతృత్వం చెల్లదు’’ అంటూ నినాదాలు చేశారు. నిందితులను హర్యానాకు చెందిన నీలం కౌర్(42), మహారాష్ట్రకు చెందిన అమోల్ షిండే(25)గా గుర్తించారు. ఈ నలుగురు ఒకే గ్రూప్‌కు చెందిన వారై ఉంటారని.. ఇద్దరు లోపల, ఇద్దరు బయట నిరసనలు తెలియజేసే యత్నం చేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. #WATCH | Delhi: Two protestors, a man and a woman have been detained by Police in front of Transport Bhawan who were protesting with colour smoke. The incident took place outside the Parliament: Delhi Police pic.twitter.com/EZAdULMliz — ANI (@ANI) December 13, 2023 మరోవైపు.. ఘటన తర్వాత కాసేపటికే సభ ప్రారంభమైంది. లోక్‌సభలో అలజడి సృష్టించిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఆగంతకులు వదిలిన పొగ ప్రమాదకరమైంది కాదని.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చూస్తామని.. ఇప్పటికే ఢిల్లీ పోలీసులను ఆదేశించామని, విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఎంపీలతో స్పీకర్ అన్నారు. #WinterSession2023#LokSabha Speaker @ombirlakota's Remarks on Security Breach In Lok Sabha.@LokSabhaSectt @loksabhaspeaker pic.twitter.com/xhfMS1pQoo — SansadTV (@sansad_tv) December 13, 2023 సుమారు రూ.20వేల కోట్లతో నిర్మించిన నూతన పార్లమెంట్ భవన్లో తాజా ఘటనతో భద్రతా వైఫ్యలం బయటపడింది. భద్రతా తనిఖీని తప్పించుకుని వాళ్లు లోపలికి టియర్‌గ్యాస్‌తో ఎలా వెళ్లారనే? ప్రశ్నలు లేవనెత్తుతున్నారు పలువురు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా పేరిట పాస్‌లు తీసుకుని ఆగంతకులు లోపలికి ప్రవేశించినట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. పోలీసులు దీనిని ధృవీకరించాల్సి ఉంది. Lok Sabha chamber of Parliament was attacked right now by 2 individuals who jumped from the visitors’ gallery into the House. Which MP approved their passes? Is he from the BJP? This is shocking especially on the day of the Parliament attack anniversary. BJP constantly has… pic.twitter.com/oPTaMfz1kx — Saket Gokhale (@SaketGokhale) December 13, 2023 ఈ ఘటనపై విపక్ష ఎంపీలు స్పందిస్తూ పార్లమెంట్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఇద్దరు వ్యక్తులు గ్యాలరీ నుంచి వచ్చి పసుపు రంగు గ్యాస్‌ను వదిలారు. ఎంపీలు వెంటనే వారిని పట్టుకున్నారు. ఈ ఘటనతో కొత్త పార్లమెంట్ భవనంలో భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి’’ అని పలువురు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగానే.. విపక్షాలు బీజేపీపై విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. #WATCH | Delhi police commissioner Sanjay Arora reaches Parliament following the security breach incident pic.twitter.com/Hj4rWYzncC — ANI (@ANI) December 13, 2023 ఖలిస్థానీల పనేనా? పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి సరిగ్గా నేటికి 22 ఏళ్లు పూర్తైంది. ఇదే రోజున ఈ దాడి జరగడం గమనార్హం. మరోవైపు త్వరలో భారత్‌లో దాడులకు పాల్పడతామని కెనడాకు చెందిన ఖలీస్థానీ సంస్థలు ప్రకటించాయి. దీంతో ఇవాళ్టి దాడికి, ఖలీస్థానీకి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని అధికారులు అంటున్నారు. -
పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం..
-
లోక్‌సభలో టియర్ గ్యాస్ అలజడి..పరుగులు తీసిన ఎంపీలు
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో బుధవారం ఉదయం తీవ్ర భద్రతా వైఫల్యం తలెత్తింది. పార్లమెంట్‌పై దాడి జరిగి నేటికి 22 ఏళ్లు పూర్తయిన వేళ సంచలనం జరిగింది. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేస్తూ ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక్కసారిగా సభలోకి దూకారు. సభలోకి దూకిన వ్యక్తులు టియర్ గ్యాస్ వదిలారు. దీంతో సీట్లలో ఉన్న ఎంపీలంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. జీరో అవర్ కొనసాగుతుండగా ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే స్పీకర్ సభను వాయిదా వేశారు. ‘ఇద్దరు వ్యక్తులు గ్యాలరీలో నుంచి కిందకు దూకారు. వారి టియర్ గ్యాస్ చల్లుతూ పరుగులు తీశారు. వారిని ఎంపీలు పట్టుకున్నారు. తర్వాత భద్రతా సిబ్బంది వచ్చి ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇది కచ్చితంగా భద్రతా వైఫల్యమే’అని లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. కాళ్లకు వేసుకున్న బూట్లలో టియర్ గ్యాస్ క్యాన్లను దాచుకున్న ఇద్దరు ఆగంతకులు గ్యాలరీలో నుంచి కిందకు దూకిన తర్వాత టియర్ గ్యాస్ వదులుతూ భయ భ్రాంతులు సృష్టించారు. 2001 సంవత్సరంలో ఇదే రోజున పార్లమెంట్ పై కొందరు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పార్లమెంటు ఆవరణలో కాల్పులకు దిగిన టెర్రరరిస్టులను భద్రతా బలగాలు ఎదురు కాల్పుల్లో మట్టుబెట్టాయి. ఈ ఘటనలో అమరులైన భద్రతా సిబ్బందికి ఇవాళ ఉదయం ప్రధాని, రాష్ట్రపతి, ఎపీలు నివాళులర్పిచారు. మళ్లీ ఇదే రోజు పార్లమెంటులో దుండగులు టియర్ గ్యాస్ వదలడం ఒక్కసారిగా భయాందోళనలు రేపింది. — ANI (@ANI) December 13, 2023 #WATCH | Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury speaks on an incident of security breach and commotion in the House. "Two young men jumped from the gallery and something was hurled by them from which gas was emitting. They were caught by MPs, they were brought… pic.twitter.com/nKJf7Q5bLM — ANI (@ANI) December 13, 2023 -
Manipur Violence: నిరసనలతో దద్దరిల్లిన ఇంఫాల్
ఇంఫాల్: మణిపూర్‌లో యువ జంట హత్యతో మొదలైన నిరసనలు గురువారం సైతం కొనసాగాయి. ఆందోళనకారులు ఇంఫాల్ వెస్ట్‌లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయంపై దాడికి దిగారు. అక్కడున్న రెండు కార్లకు నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ బలగాలు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బుధవారం రాత్రి పలు చోట్ల నిరసనకారులు భద్రతా బలగాలపై దాడులకు దిగారు. దీంతో, బలగాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. పోలీసు వాహనానికి నిప్పుపెట్టడంతోపాటు పోలీసు వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కెళ్లారు. థౌబల్ జిల్లా ఖొంగ్జమ్లో బీజేపీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. గురువారం రాత్రి సీఎం బిరేన్ సింగ్ పూరీ్వకుల ఇంటిపై దాడికి జరిగిన ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారు. మా వాళ్ల మృతదేహాలు ఎక్కడున్నాయో గుర్తించండి దుండగుల చేతుల్లో దారుణ హత్యకు గురైన తమ పిల్లల మృతదేహాల జాడ చెబితే అంత్యక్రియలు జరుపుకుంటామని వారి తల్లిదండ్రులు పోలీసులను కోరారు. మెయితీ వర్గానికి చెందిన యువతి, యువకుడు జూన్‌లో గుర్తు తెలియని దుండగుల చేతుల్లో హత్యకు గురి కావడం, వారి ఫొటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం తెలిసిందే. ఈ హత్య ఘటన మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలకు కారణమైంది. మెయితీల ఆచారం ప్రకారం..అంతిమ సంస్కారాలు జరపడానికి మృతులు ధరించిన దుస్తులకు సంబంధించిన చిన్న గుడ్డ ముక్కయినా ఉండాలి. అంత్యక్రియలు జరిపేవరకు వారి ఫొటోల వద్ద మృతుల తల్లులు అగరొత్తులు, క్యాండిల్ వెలిగిస్తూ రోజూ ఆహారం నివేదన చేస్తూ ఉండాలి. వారి లేని లోటు ఎవ్వరూ పూడ్చలేరు. కనీసం వారికి తగు గౌరవంతో అంత్యక్రియలు జరపాలనుకుంటున్నామని యువతి తండ్రి హిజామ్ కులజిత్ చెప్పారు. తాజాగా, సీబీఐ దర్యాప్తుతోనయినా తమ కోరిక నెరవేరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మణిపూర్‌కు శ్రీనగర్ ఎస్ఎస్పీ బల్వాల్ బదిలీ న్యూఢిల్లీ: ఉగ్ర సంబంధ కేసులను డీల్ చేయడంలో సమర్థుడిగా పేరున్న శ్రీనగర్ సీనియర్ ఎస్పీ రాకేశ్ బల్వాల్ను కేంద్రం మణిపూర్‌కు బదిలీ చేసింది. మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, శాంతిభద్రతలు దారుణంగా దెబ్బతినడంతో కేంద్రం ఈ చర్య తీసుకుంది. 2012 ఐపీఎస్ అధికారి అయిన రాకేశ్ బల్వాల్ను డిసెంబర్ 2021లో అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాల కేడర్‌కు మార్చారు. తాజాగా ఆయన్ను మణిపూర్ కేడర్‌కు మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన హోం వ్యవహారాల శాఖ ప్రతిపాదనకు నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మణిపూర్‌లో ఆయన కొత్త బాధ్యతలను చేపడతారని తెలిపింది. జమ్మూలోని ఉధంపూర్‌కు చెందిన బల్వాల్ మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌కు 2017లో సీనియర్ ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. -
Manipur Violence: ఆగని మణిపూర్ అల్లర్లు
ఇంఫాల్: మణిపూర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆదివారం చెలరేగిన హింసాకాండలో పదిహేను ఇళ్లు తగలబడ్డాయి. లంగోల్ గేమ్స్ విలేజ్‌లో అల్లరిమూక దాడులకు తెగబడి ఇళ్లను తగులబెట్టారు. దీంతో భద్రతా సిబ్బంది బాష్పవాయువుని ప్రయోగించి పరిస్థితుల్ని అదుపులోనికి తీసుకువచ్చారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చెకోన్ ప్రాంతంలో దుండగులు వాణిజ్య సముదాయాలను తగులబెట్టారు. మరోవైపు రాజకీయంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్డీయేలో ఇన్నాళ్లూ భాగస్వామ్యపక్షంగా ఉన్న కుకీ పీపుల్స్ అలయెన్స్ బైరన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. లూటీ చేసిన ఆయుధాలు వెనక్కి మణిపూర్‌లో అల్లరిమూకలు భారీగా లూటీ చేసిన ఆయుధాల్ని తిరిగి స్వా«దీనం చేసుకునే కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు లూటీ అయిన ఆయుధాల్లో 1,195 తిరిగి స్వా«దీనం చేసుకున్నట్టు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మణిపూర్ లోయ ప్రాంతం జిల్లాల నుంచి 1,057 ఆయుధాలు , కొండ ప్రాంతం జిల్లాల నుంచి 138 ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. మరోవైపు ఐజీ ర్యాంకు అధికారి ఒకరు ఆయుధాగారాల లూటీకి సంబంధించి విచారణ జరుపుతున్నారు. అయిదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన హేయమైన ఘటనలో అయిదురుగు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ ప్రాంతం పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ సహా అయిదుగురు సిబ్బందిని దీనికి సంబంధించిన వీడియో బయటకి వచి్చన వెంటనే సస్పెండ్ చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ఒక వర్గం ప్రజలు వారి సస్పెన్షన్‌ని వెనక్కి తీసుకోవాలని ప్రతీరోజూ పోలీసు స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నా వెనక్కి తగ్గలేదని చెప్పారు. జంకుతున్న ఎమ్మెల్యేలు ఈ నెల 21 నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడానికి కుకీ వర్గానికి చెందిన అత్యధిక ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి హాజరుకావడానికి విముఖతతో ఉన్నారు. జాతుల మధ్య ఘర్షణలు ఇంకా కొనసాగుతూ ఉండడంతో తమకి భద్రత లేదని వారు భయపడుతున్నారు. శాంతి భద్రతలు అదుపులో లేకపోవడం వల్ల తాము అసెంబ్లీకి హాజరు కావడం లేదని కుకి వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎల్.ఎమ్ ఖాటే చెప్పారు. ఎమ్మెల్యేల ఇంఫాల్ ప్రయాణం సురక్షితం కాదని అన్నారు. -
Manipur: అర్ధరాత్రి సీఎం ఇంటివైపు శవయాత్ర.. తీవ్ర ఉద్రిక్తత
ఇంఫాల్: కల్లోల మణిపూర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. గురువారం అర్ధరాత్రి దాటాక రాజధాని ఇంఫాల్‌లో ఆందోళనకారులు ఓ మృతదేహాంతో ఉరేగింపుగా ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇంటివైపు వెళ్లే యత్నం చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా.. వాళ్లను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయి భద్రతా బలగాలు. కాంగ్పోక్పీ జిల్లాలో గురువారం ఉదయం ఆందోళనకారుల్లోని ఓ వర్గం జరిపిన కాల్పుల్లో.. ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మర్చంట్ నేవీ ఆఫీసర్ కావడంతో ఆగ్రహావేశాలు తారాస్థాయికి చేరాయి. అతని మృతదేహాన్ని ఓ శవపేటికలో ఉంచి.. రాత్రిపూట ఇంఫాల్ నడిబొడ్డున ఖ్వైరాంబంద్ బజార్ సెంటర్‌కు తీసుకొచ్చారు. పూలతో నివాళులు ఘటించేందుకు భారీగా జనం చేరుకున్నారు. అయితే ఆ మృతదేహంతో సీఎం బీరెన్ సింగ్ ఇంటి వైపు శవయాత్రకు మహిళలు సిద్ధపడగా.. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. రోడ్డు మధ్యలో టైర్లను కాల్చి నిరసనలు వ్యక్తం చేశారు వాళ్లు. పరిస్థితి చేజారేలా కనిపించడంతో పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారుల్ని చెదరగొట్టాయి. ఆపై మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుప్రతి మార్చురీకి తరలించాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని బలగాలు ప్రకటించుకున్నాయి. కాంగ్పోక్పి జిల్లా హరోథెల్ గ్రామంలో.. సాయుధ మూక కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మరణించాడని, అనేక మంది గాయపడ్డారని సైన్యం అధికారికంగా ప్రకటించింది. పరిస్థితి అదుపు చేసేందుకు తాము రంగంలోకి దిగినట్లు తెలిపింది ఆర్మీ. కుకీ పనే! కుకి మిలిటెంట్ల కాల్పుల్లో మర్చంట్ నేవీ ఆఫీసర్ వైఖోం నీలకమల్ మృతి చెందానంటూ ఆరోపిస్తోంది అవతలి వర్గం. అదే సమయంలో లీమాఖోంగ్-హరోథెల్లో గురువారం ఉదయం జరిగిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందగా.. మరికొందరు గాయపడినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కల్లోల ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి భద్రతా బలగాలు. ఇదీ చదవండి: మణిపూర్‌లో రాహుల్ గాంధీకి చేదు అనుభవం -
ఇజ్రాయెల్‌లో నిరసన జ్వాల.. ప్రధాని నెతన్యాహూ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో వేలాది మంది ప్రజలు నిరసనబాట పట్టారు. న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో తనను తాను కాపాడుకోవాలని చూస్తున్న ప్రధాని బెంజిమన్ నేతన్యాహూకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. సంస్కరణలు ఆపాలని కోరిన రక్షణమంత్రి యోవ్ గ్యాలంట్ను నెతన్యాహు పదవి నుంచి తప్పించిన మరునాడే జనం రోడ్లెక్కి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ జెండాలు పట్టుకుని అనేక మంది భారీ ర్యాలీగా ఆందోళనల్లో పాల్గొని తమ గళం వినిపించారు. జెరూసలేంలోని నెతన్యాహు నివాసం సమీపానికి చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, సైనికులు వారిపై భాష్పవాయువు గోళాలు ప్రయోగించి చెదరగొట్టారు. Massive protests in Israel against PM Netanyahu’s judicial reforms ie; 1. Method of appointment of judges 2. Restrict court's ability to cancel laws passed by Israel govt. White House however urges a compromise as Israeli consul general in NY quits. pic.twitter.com/xNVILEYhbD — The Poll Lady (@ThePollLady) March 27, 2023 ఇజ్రాయెల్ ప్రభుత్వానికి, న్యాయమూర్తులకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. దీంతో ఓ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహూ జైలు శిక్ష పడకుండా తనను తాను కాపాడుకునేందుకు న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో మార్పులు చేయాలనుకుంటున్నారు. జడ్జీల నియామకం, ప్రభుత్వం ఆమోదించిన చట్టాలను రద్దు చేసే అధికారాన్ని కోర్టులకు తొలగించడం వంటి వివాదాస్పద నిర్ణయాలు ఈసంస్కరణల్లో ఉన్నాయి. వీటిని అమలు చేయొద్దని చెప్పిన రక్షణమంత్రిని కూడా నెతన్యాహూ పదవి నుంచి తొలగించారు. దీంతో రక్షణమంత్రికి మద్దతుగా, న్యాయవ్యవస్థలో సంస్కరణలకు వ్యతిరేకంగా లక్షలాది మంది పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. రోడ్లు, వీధుల్లో జెండాలు పట్టుకుని నిరసన తెలియజేశారు. Protest in Tel Aviv - Israel has moved to an intense stage of protests after Netanyahu’s sacking of the defense minister. pic.twitter.com/z6P45VlmV4 — Ashok Swain (@ashoswai) March 26, 2023 విమాన సేవలు నిలిపివేత.. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన ఎయిర్‌పోర్టులో విమాన సేవలు నిలిపివేశారు అధికారులు. ఎయిర్ పోర్టు వర్కర్క్ యూనియన్ సోమవారం సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అతిపెద్ద ట్రేడ్ యూనియన్ సమ్మెకు దిగడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. చదవండి: జనాభా పెరుగుదల కోసం ఆ దేశం పాట్లు.. నిబంధనను బ్రేక్ చేసి మరీ.. -
ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి.. ఫ్యాన్స్ ఆగ్రహం.. ఫ్రాన్స్‌లో ఘర్షణలు..
పారిస్: ఆద్యంతం ఉత్కంఠసాగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఓడిపోడవడంతో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి ఘర్షణలు చెలరేగాయి. పలుచోట్ల అభిమానులు పోలీసులతో బాహాబాహీకి దిగారు. ఫలితంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే హింసకు పాల్పడిన వందల మంది అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే ప్రఖ్యాత ఛాంప్స్-ఎలిసీస్ అవెన్యూకు వేల మంది అభిమానులు తరలివెళ్లారు. దీంతో ఆ ప్రాంతం కిక్కిరిసి ట్రాఫిక్‌ను దారిమళ్లించారు. భద్రత కోసం వేల మంది పోలీసులను మోహరించారు. అయితే మ్యాచ్ జరిగినంతసేపు ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం.. పెనాల్డీ షూటౌట్ ఫ్రాన్స్ ఓడిపోవడంతో ఉద్రిక్తంగా మారింది. వేల మంది అభిమానులు ఆగ్రహంతో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. పోలీసులపైకి బాణసంచా విసిరారు. ఘర్షణకు కూడా దిగారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపుచేశారు. అనంతరం వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. #Lyon : les affrontements après la défaite de la #France en finale de la #FIFAWorldCup se poursuivent, les projectiles pleuvent sur les policiers déployés dans le centre-ville (🎥@JDANDOU @lyonmag) pic.twitter.com/wU40hfENZH — Lyon Mag (@lyonmag) December 18, 2022 ఆదివారం రాత్రి జరిగిన ఫిపా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అదనపు సమయం ముగిసే సరికి ఫ్రాన్స్- అర్జెంటీనా చెరో మూడు గోల్స్ చేసి సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఇందులో 4-2 తేడాతో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం సాధించింది. ఫలితంగా 36 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అయితే తమ జట్టు ఓడినప్పటికీ గర్వపడే ప్రదర్శన చేసిందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మేక్రాన్ పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం తమ టీం సభ్యులను ఓదార్చారు. చదవండి: ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 19 మంది దుర్మరణం.. -
Indonesia: మైదానంలో విషాద క్రీడ
మలాంగ్(ఇండోనేషియా): ప్రపంచ క్రీడా చరిత్రలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. సాకర్ స్టేడియంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు పోలీసులు సహా 125 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఓడిపోయిన జట్టు మద్దతుదారులు క్రీడా స్ఫూర్తిని మర్చిపోయి ఆగ్రహావేశాలతో ఘర్షణకు దిగడం రణరంగానికి దారితీసింది. ఇండోనేషియాలో తూర్పు జావా ప్రావిన్స్‌లోని మలాంగ్ సిటీలో కంజురుహాన్ స్టేడియంలో శనివారం ఈ దారుణం జరిగింది. ఇప్పటిదాకా 125 మంది మృత్యువాత పడ్డారు. తొక్కిసలాటలో మరో 100 మందికిపైగా ప్రేక్షకులు గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భాష్పవాయువు ప్రయోగంతో అలజడి కంజురుహాన్ స్టేడియంలో తూర్పు జావాకు చెందిన అరెమా ఎఫ్ఎస్ జట్టు, సురబయాకు చెందిన పెర్సిబయా జట్టుకు మధ్య శనివారం సాయంత్రం ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. 32,000 మంది ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. వీరంతా అతిథ్య జట్టు అరెమా ఎఫ్ఎస్ మద్దతుదారులే. పెర్సిబయా జట్టు చేతిలో అరెమా జట్టు 3–2 తేడాలో ఓటమి పాలయ్యింది. ఈ పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. క్రీడాకారులపై, సాకర్ అధికారులపై నీళ్ల సీసాలు, చేతిలో ఉన్న వస్తువులు విసిరారు. దాదాపు 3,000 మంది బారికేడ్లు దాటుకొని ప్రధాన మైదానంలోకి ప్రవేశించారు. అరెమా జట్టు మేనేజ్మెంట్తో ఘర్షణకు దిగారు. సొంత గడ్డపై 23 ఏళ్లుగా విజయాలు సాధిస్తున్న అరెమా టీమ్ ఇప్పుడెందుకు ఓడిపోయిందో చెప్పాలంటూ నిలదీశారు. అరుపులు కేకలతో హోరెత్తించారు. మరికొందరు స్టేడియం బయటకువెళ్లి, అక్కడున్న పోలీసు వాహనాలను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో అల్లరి మూకను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. భాష్పవాయువు గోళాలు స్టేడియంలోకి సైతం దూసుకెళ్లాయి. స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానులు భయాందోళనకు గురయ్యారు. బాష్పవాయువును తప్పించుకోవడానికి అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట మొదలయ్యింది. ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడని పరిస్థితి. స్టేడియంలోనే 34 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఆసుపత్రులకు తరలిస్తుండగా కొందరు, చికిత్స పొందుతూ మరికొందరు మృతిచెందారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనతో ఇండోనేషియా సాకర్ అసోసియేషన్ ప్రీమియర్ సాకర్ లీగ్ లిగా–1ను నిరవధికంగా వాయిదా వేశారు. ఇదే చివరి విషాదం కావాలి: జోకో విడోడో ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరగడం, 125 మంది మరణించడం పట్ల ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఇదే చివరి క్రీడా విషాదం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాటి దారుణాలు జరగకూడదని కోరుకుంటున్నట్లు వివరించారు. ప్రజలంతా క్రీడాస్ఫూర్తిని పాటించాలని, మానవత్వం, సోదరభావాన్ని కలిగి ఉండాలని కోరారు. మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కీడ్రలు, యువజన శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకు జోకో విడోడో ఆదేశాలు జారీ చేశారు. ఇండోనేషియా సాకర్ ప్రతిష్టకు మచ్చ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సాకర్ మ్యాచ్‌లకు తాము సన్నద్ధం అవుతున్న తరుణంలో స్టేడియంలో అభిమానులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఇండోనేషియా క్రీడలు, యువజన శాఖ మంత్రి జైనుదిన్ అమాలీ చెప్పారు. ఈ ఘటన తమ దేశ సాకర్ క్రీడా ప్రతిష్టను మసకబార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మే 20 నుంచి జూన్ 11 వరకు జరిగే ఫీఫా యూ–20 ప్రపంచ కప్‌నకు ఇండోనేషియా అతిథ్యం ఇవ్వబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు సైతం ప్రారంభించింది. నిజానికి ప్రపంచ సాకర్ క్రీడా సమాఖ్య ‘ఫిఫా’ నిబంధనల ప్రకారం స్టేడియంలో బాష్పవాయువు ప్రయోగించకూడదు. దేశీయంగా జరిగే క్రీడలపై ఫిఫా నియంత్రణ లేకపోవడం కొన్నిసార్లు పరిస్థితి అదుపు తప్పుతోంది. ఆట చూసేందుకు వచ్చి అనంత లోకాలకు.. ప్రపంచ క్రీడాలో చరిత్రలో ఇప్పటిదాకా ఎన్నో విషాదాలు చోటుచేసుకున్నాయి. మైదానాలు రక్తసిక్తమయ్యాయి. ఆట చూసి ఆనందించేందుకు వచ్చిన అభిమానులు విగతజీవులయ్యారు. ఎంతోమంది క్షతగాత్రులుగా మారారు. విషాదాలు కొన్ని.. 1979 డిసెంబర్ 3: అమెరికాలోని సిన్సినాటీలో రివర్‌ఫ్రంట్ మైదానంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది మృతి చెందారు. 1980 జనవరి 20: కొలంబియాలోని సిన్సిలెజె పట్టణంలో బుల్‌ఫైట్ కోసం తాత్కాలికంగా కర్రలతో నిర్మించిన నాలుగు అంతస్తుల స్టేడియం కూలిపోయింది. ఈ ఘటనలో 200 మంది బలయ్యారు. 1988 మార్చి 13: నేపాల్‌లోని ఖాట్మాండు స్టేడియంలో సాకర్ మ్యాచ్ జరుగుతుండగా అకస్మాత్తుగా వడగళ్ల వాన మొదలయ్యింది. స్టేడియంలో తొక్కిసలాట జరిగి 93 మంది చనిపోయారు. 1989 ఏప్రిల్ 15: ఇంగ్లాండ్‌లోని షెఫీల్డ్‌లో హిల్స్‌బరో స్టేడియంలో అభిమానుల నడుమ ఘర్షణ జరిగింది. 97 మంది మరణించారు. 1996 అక్టోబర్ 16: గ్వాటెమాలాలోని గ్వాటెమాలా సిటీలో సాకర్ ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గ్వాటెమాలా, కోస్టారికా అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 84 మంది విగత జీవులుగా మారారు. 2001 మే 9: ఘనా రాజధాని అక్రాలో స్టేడియంలో ఘర్షణ, అనంతరం తొక్కిసలాట. 120 మందికిపైగా ప్రేక్షకులు బలయ్యారు. -
లంకలో పీక్ స్టేజ్‌కు నిరసనలు.. రాజకీయ నేతలకు బిగ్ షాక్
Sri Lanka Crisis..ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలను ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవలే లంక ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక, గురువారం లంక నూతన ప్రధానమంత్రిగా యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్‌పి) నాయకుడు రణిల్ విక్రమసింఘే ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా.. ఆర్థిక సంక్షోభం కారణంగా లంకలో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో లంకేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న తమపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం, కాల్పులు జరపడంతో వారు ఆందోళనను పెంచారు. ఆగ్రహంతో కొందరు నిరసనకారులు లంక మాజీ మంత్రి, రాజకీయ నేతల కార్లను సరస్సులోకి తోసేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఓ నిరసనకారుడు మాట్లాడుతూ.. మాకు గ్యాస్ లేదు, ఇంధనం లేదు.. అవసరమైన మెడిసిన్ దొరకడం లేదు. నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో ఒక్క పూటే భోజనం చేసి పస్తులు ఉంటున్నాము. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. In Sri Lanka, Anger over the cost of living the public threw politicians' cars into the waters. 🤔🤔 pic.twitter.com/5TLTxPTAzd — 🥀_Imposter_🕸️ (@Imposter_Edits) May 11, 2022 ఇది కూడా చదవండి: మోదీకి ధన్యవాదాలు: శ్రీలంక కొత్త ప్రధాని -
లంక దహనం
లంకకు నిప్పంటుకుంది. దేశం రణరంగంగా మారింది. ఆర్థిక సంక్షోభాన్ని తాళలేక జనంలో నెలకు పైగా నెలకొన్న ఆగ్రహావేశాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులపై సోమవారం ప్రభుత్వ మద్దతుదారుల దాడితో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఆగ్రహించిన జనం దేశవ్యాప్తంగా రోడ్లపైకొచ్చారు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ మద్దతుదారులపై దాడులకు దిగారు. మహింద ఇంటితో పాటు రాజపక్సల పూర్వీకుల ఇంటిని కూడా తగలబెట్టారు. మంత్రులు, మాజీ మంత్రుల ఇళ్లపైనా దాడులకు దిగారు. వాటికి నిప్పు పెట్టారు. నిరసనకారులు చుట్టుముట్టడంతో అధికార పార్టీ ఎంపీ ఒకరు తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మహింద రాజపక్స (76) పదవి నుంచి తప్పుకున్నారు. దేశమంతటా కర్ఫ్యూ విధించారు. కొలంబోలో సైన్యం రంగంలోకి దిగింది. కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితి పూర్తిగా కట్టుతప్పింది. దేశ ఆర్థిక పతనానికి ప్రభుత్వమే కారణమంటూ అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికార నివాసం ముందు నిరసన చేస్తున్న వారిపై ప్రధాని మహింద నివాస సమీపంలో ఆయన అనుచరులు దాడికి దిగారు. నిరసనకారుల టెంట్లు, ప్లకార్డులను ధ్వంసం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించినా లాభం లేకపోయింది. ఈ ఘర్షణల్లో 170 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారు. దాంతో జనం ఒక్కసారిగా రెచ్చిపోయారు. కొలంబో నుంచి తిరిగి వెళ్తున్న రాజపక్సల మద్దతుదారులపై విరుచుకుపడ్డారు. వారి వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు దొరికిని వారిని దొరికినట్టు చితకబాదారు. అంతేగాక దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులపై, రాజపక్స మద్దతుదారులపై నిరసనకారులు దాడులకు దిగారు. కురునెగలలోని ప్రధాని మహింద నివాసంతో పాటు హంబన్‌టోటలోని రాజపక్సల పూర్వీకుల నివాసానికి కూడా నిప్పు పెట్టారు. హంబన్‌టోటలో మహింద, గొటబయల డీఏ రాజపక్స జ్ఞాపకార్థం నిర్మించిన స్మారకాన్ని కూడా ధ్వంసం చేశారు. వాయవ్య శ్రీలంకలోని నిట్టంబువాలో అధికార శ్రీలంక పొడుజన పెరమున (ఎల్ఎల్పీపీ) ఎంపీ అమరకీర్తి (57) కారును అడ్డగించారు. ఆయన తన రివాల్వర్‌తో కాల్పులకు దిగడంతో ఒక నిరసనకారుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. ఆగ్రహించిన నిరనసకారులు వెంబడించడంతో ఎంపీ దగ్గర్లోని భవనంలో తలదాచుకున్నారు. స్థానికులు వేలాదిగా భవనాన్ని చుట్టుముట్టి లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. భయాందోళనలకు లోనైన ఎంపీ తుపాకీతో కాల్చుకుని చనిపోయారని పోలీసులు తెలిపారు. ఆయన భద్రతాధికారి కూడా మరణించాడు. కురునెగలలోని మాజీ మంత్రి జాన్స్టన్ ఫెర్నాండోపై ఆందోళనకారులు దాడికి దిగారు. ఆయన నివాసాలకు, హోటల్‌కు నిప్పుపెట్టారు. నెగొంబోలోని మరో మాజీ మంత్రి నిమల్ లాంజా ఇంటిపై దాడికి పాల్పడ్డారు. మొరటువా మేయర్ సమన్ లాల్ ఫెర్నాండో ఇంటికి కూడా నిప్పుపెట్టారు. కొలంబోలోనూ ఘర్షణలు తారస్థాయికి చేరాయి. అధ్యక్ష భ వనం ముందు నిరసనకారులపై దాడికి నేతృ త్వం వహించిన అధికార పార్టీ కార్మిక విభాగం నేత మహింద కహందగమగె ఇంటిపై దాడి జరిగింది. ఘర్షణలు దేశవ్యాప్తంగా పలు పలుచోట్ల కాల్పులకు దారితీశాయి. వాటిలో కనీసం ఇద్దరు మరణించగా 9 మంది గాయపడ్డట్టు పోలీసులు తెలిపారు. కొలంబోలో రంగంలోకి సైన్యం ఘర్షణలు చెలరేగిన కొద్ది గంటలకే ప్రధాని మహింద అధ్యక్షునికి రాజీనామా లేఖ పంపారు. అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా తప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆయన రాజీనామాతో మంత్రివర్గమూ రద్దయింది. అల్లర్లపై గొటబయ, మహింద విచారం వెలిబుచ్చారు. ‘‘హింసకు హింస పరిష్కారం కాదు. ప్రజలు సంయమనం పాటించాలి’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే మహిందే తనవారిని ఆందోళనకారులపై దాడులకు దిగేలా రెచ్చగొట్టారని విపక్షాలు దుయ్యబట్టాయి. మాజీ అధ్యక్షుడు ప్రేమదాసపైనా వారు దాడులకు దిగారని ఆరోపించాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొలంబోలో సైన్యం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా పోలీసులకు సెలవులను రద్దు చేశారు. రాజపక్స సోదరుల అస్తవ్యస్త విధానాలతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం తెలిసిందే. విదేశీ మారకద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటడమే గాక నిత్యావసరాల ధరలు చుక్కలను కూడా దాటేశాయి. దాంతో జనం కన్నెర్రజేశారు. రాజపక్స సోదరులు అధికారం నుంచి తప్పుకోవాలంటూ ఏప్రిల్ 9న దేశవ్యాప్తంగా వీధులకెక్కారు. అప్పటి నుంచి నెల రోజులుగా ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. Footage of Government supporters assaulting protester at "GotaGoGama" pic.twitter.com/nAxkbQi1nX — NewsWire 🇱🇰 (@NewsWireLK) May 9, 2022 ఇది కూడా చదవండి: ‘ఒక వేళ నేను చనిపోతే?’.. ఎలన్ మస్క్ సంచలన ట్వీట్ -
లంకలో కల్లోలం
కొలంబో: అల్లకల్లోలంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పలు చర్యలను ప్రకటించారు. కేంద్ర కేబినెట్లో చేరాల్సిందిగా ప్రతిపక్షాలను ఆయన సోమవారం ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలను ప్రభుత్వంలో చేరమని గొటబయ ఆహ్వానించడం ఒక డ్రామా అని ప్రతిపక్ష నేత సమగి జన బలవేగయ విమర్శించారు. సజిత్ ప్రేమదాస, మనో గణేసన్ తదితర విపక్ష నేతలు సైతం ఈ అఖిల పక్ష ప్రభుత్వ యోచనను తిరస్కరించారు. గొటబయ తమ్ముడు, లంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రి పదవి నుంచి అధ్యక్షుడు స్వయంగా తొలగించారు. బసిల్ స్థానంలో ప్రస్తుత న్యాయమంత్రి ఆలి సబ్రేను నియమించారు. బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చించేందుకు బసిల్ సోమవారం అమెరికా వెళ్లి ఐఎంఎఫ్‌తో చర్చలు జరపాల్సిఉంది. భారత రిలీఫ్ ప్యాకేజీపై కూడా బసిలే చర్చలు జరిపారు. అయితే బసిల్ చర్యలపై లంక అధికార పక్షం ఎస్ఎల్పీపీ కూటమిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అధ్యక్షుడు బసిల్‌ను తొలగించినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్లోని మొత్తం 26మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం కొత్తగా కొందరు మంత్రులు పదవీ స్వీకారం చేశారు. కేంద్ర బ్యాంకు గవర్నర్ రాజీనామా లంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సోమవారం రాజీనామా చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కబ్రాల్ ఈ పదవిని స్వీకరించారు. గతంలో ఆయన కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2006–15 కాలంలో ఆయన కేంద్రబ్యాంకు గవర్నర్‌గా వ్యవహరించారు. రెండోదఫా గవర్నర్ పదవి స్వీకరించాక ఆయన విదేశీ రుణాలపై ఆధారపడడాన్ని తగ్గించే యత్నాలు చేశారు. సంక్షోభం ముదురుతున్నా బెయిలవుట్‌ను వ్యతిరేకించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరింది. మితిమీరి కరెన్సీ ముదణ్రకు కబ్రాల్ అనుమతివ్వడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. కబ్రాల్ వ్యతిరేకతను పట్టించుకోకుండాప్రభుత్వం ఇటీవల ఐఎంఎఫ్‌ను సాయం ఆర్థించింది. లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగం ప్రధాని మహింద రాజపక్సే ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరకొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగానికి దిగారు. కర్ఫ్యూ ఆదేశాలను లెక్కచేయకుండా దాదాపు 2వేల మందికి పైగా ఆందోళనకారులు తంగాలె లోని మహింద ఇంటిని చుట్టుముట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు. వీరిపై పోలీసులు బలపయ్రోగానికి దిగారు. నిజానికి ఈ ప్రాంతంలో రాజపక్సే కుటుంబానికి చాలా పట్టు ఉంది. అయితే సంక్షోభం ముదిరిపోయి జీవితాలు అస్థవ్యస్థమవుతుండడంతో సాధారణ ప్రజల్లో మహిందపై వ్యతిరేకత ప్రబలిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రాజపక్సే కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గొటబయ రాజీనామా కోరుతూ ప్రజలు వీధుల్లో ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గొటబయ ప్రకటించారు. -
సీఎం ఇంటి ముట్టడికి యత్నం.. టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులతో..
చండీగఢ్: రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టడంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విఫలమయ్యారంటూ.. బీజేవైఎం కార్యకర్తలు సోమవారం పంజాబ్ సీఎం అధికార నివాస ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిరసన కారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. పంజాబ్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాదక ద్రవ్యాలను అరికడతామని సీఎం అమరీందర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే డ్రగ్స్‌ను అరికట్టడంలో పంజాబ్ సీఎం విఫలమయ్యారని పంజాబ్ బీజేవైఎం చీఫ్ భాను ప్రతాప్ రానా ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం వృద్ధి చెందిందని రానా పేర్కొన్నారు. దీనికి నిరసనగా రానా నేతృత్వంలోని ఆందోళనకారులు నిసరస చేపట్టారు. -
స్థానికులు కాదు గూండాలు; వెళ్లేది లేదు!
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆందోళనలు శుక్రవారం కొనసాగాయి. సింఘు, ఘాజీపూర్, టిక్రి సరిహద్దుల వద్ద భారీగా రైతులు మొహరించారు. ప్రభుత్వం శాంతియుతమైన తమ ఆందోళనను ధ్వంసం చేయాలని యత్నిస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. ప్రజలంతా తమకు మద్దతునివ్వాలని, జనవరి 30ని సద్భావనా దివస్‌గా పాటించాలని కోరారు. గాంధీ వర్ధంతైన ఆ రోజున ఉదయం 9– సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. సింఘు వద్ద స్థానికులుగా చెప్పుకుంటున్న సమూహానికి, రైతులకు మధ్య జరిగిన సంఘర్షణ పోలీసులు భాష్పవాయువు ప్రయోగించే స్థాయికి చేరింది. మరోవైపు ఘాజీపూర్‌లోని యూపీగేట్ వద్ద బీకేయూ నిరసనలు కొనసాగాయి. రైతు ఆందోళనకు ఆర్ఎల్డీ మద్దతు తెలిపి మహాపంచాయత్‌లో పాల్గొంది. కొత్త చట్టాలను బుట్టదాఖలు చేయకుంటే ఆందోళన మరింత విస్తృతమవుతుందని కాంగ్రెస్ హెచ్చరించింది. రిపబ్లిక్‌డే రోజు జరిగిన హింసాత్మక కార్యక్రమాలపై విచారణ చేస్తున్న పోలీసులు విచారణకు సహకరించాలని తికాయత్ సోదరులు సహా 9మంది రైతు నేతలను కోరారు. రైతులతో స్థానికుల గొడవ రైతుల ట్రాక్టర్ పరేడ్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగిందని ఆరోపిస్తూ స్థానికులుగా చెప్పుకుంటున్న కొందరు కర్రలతో వచ్చి సింఘును ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయని పోలీసులు చెప్పారు. వీరంతా స్థానికులు కాదని, గూండాలని రైతు నాయకులు ఆరోపించారు. వీరు తమపై పెట్రోల్ బాంబులు, రాళ్లు రువ్వారని, తమ ట్రాలీలను కాల్చేందుకు యత్నించారని ఆరోపించారు. తాము వీరి దుశ్చర్యలను అడ్డుకున్నామని, సమస్య తేలేవరకు సింఘును విడిచిపోమని స్పష్టం చేశారు. కాగా, సింఘు సరిహద్దు వద్ద రైతు నిరసన జరుగుతున్న ప్రాంతంలో ఒక వ్యక్తి కత్తితో చేసిన దాడిలో ఎస్హెచ్ఓ గాయపడారు. యూపీ గేట్ వద్ద ఆగని నిరసన యూపీ గేట్ పరిసరాలను ఖాళీ చేయాలన్న స్థానిక మెజిస్ట్రేట్ ఉత్తర్వును ధిక్కరిస్తూ వందలాదిమంది బీకేయూ(భారతీయ కిసాన్ యూనియన్) సభ్యులు యూపీగేట్ వద్దకు చేరుకుంటున్నారు. వారిని ఖాళీ చేయించేందుకు స్థానిక ప్రభుత్వం కరెంట్ కోతతో సహా పలు యత్నాలు చేస్తోంది. ఘజియాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే నిరసన ప్రదేశాన్ని సందర్శించి..ఆర్ధరాత్రి కల్లా స్థలాన్ని ఖాళీ చేయాలనిమౌఖికంగా ఆదేశించారు. ఎర్రకోటపై మతపరమైన జండా ఎగరవేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దీప్ సిద్ధూ ..నిజాలను బయటపెట్టేందుకు కొంత సమయం కావాలని, విచారణకు సహకరిస్తానని ఫేస్బుక్లో ఒక వీడియోను పోస్టు చేశాడు. ముజఫర్‌నగర్‌లో మహాపంచాయత్ సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) శుక్రవారం ముజఫర్‌నగర్‌లో మహాపంచాయత్ నిర్వహించారు. దీనికి వేలాదిమంది హాజరయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను స్థానిక ప్రభుత్వాలు ఖాళీ చేయిస్తాయన్న ఆందోళన నడుమ ఈ మహాపంచాయత్ జరిగింది. ఘాజీపూర్‌లోని యూపీ గేట్ వద్ద నిరసన తెలియజేస్తున్నవారికి మద్దతుగా వందల ట్రాక్టర్లపై వేలాదిమంది మువ్వన్నెల జెండాలతో సదస్సుకు హాజరయ్యారు. అన్నా దీక్ష... అంతలోనే విరమణ! ముంబై: సాగు చట్టాలకు శనివారం నుంచి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సంఘసేవకుడు అన్నా హజారే(84) శుక్రవారం ప్రకటించారు. అయితే గంటల వ్యవధిలోనే దీక్ష యత్నాలను విరమిస్తున్నానని, తన డిమాండ్లలో కొన్నింటికి కేంద్రం అంగీకరించిందని మరో ప్రకటన చేశారు. మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో తన దీక్ష ఆరంభమవుతుందని తొలుత ఆయన వెల్లడించారు. కొన్ని గంటల అనంతరం మరో ప్రకటన చేస్తూ ‘‘కొన్ని డిమాండ్లు నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించింది. అందువల్ల ఆమరణ దీక్షను పక్కనపెడుతున్నాను.’’ అని చెప్పారు. బాష్పవాయువును ప్రయోగిస్తున్న పోలీసులు ఘాజీపూర్‌లో పోలీసుల బారికేడ్లు