
ఫియర్‌లెస్!
కిటకిటలాడే ముంబై వీధులు... చుట్టూ భారీ జనసందోహం... బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా ధర్నా చేస్తూ కనిపించింది! పైన భానుడు భగభగమంటుంటే... ఓ పక్కన టియర్ గ్యాస్ కమ్ముకొస్తుంటే... జంకు, బెరుకు లేకుండా రోడ్డు మధ్యలో నిలబడి నినాదాలతో అదరగొట్టింది! స్టార్ స్టేటస్... లగ్జరీ లైఫ్... అమ్మడికి రోడ్డెక్కాల్సినంత అవసరం ఏమొచ్చిందనేగా! కూల్..! రియల్‌గా కనిపించినా... ఇదంతా ‘రీల్’ లైఫ్ సన్నివేశం.ప్రస్తుతం ఈ సుందరాంగి చేస్తున్న ‘అకీరా’ సినిమా కోసం ఇంతలా కష్టపడిందనేది ఓ ఆంగ్ల పత్రిక కథనం.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ పిక్చర్ కోసం సోను మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేసిందని సమాచారం. ఆమె రియల్ ఫాదర్ శత్రుఘన్ సిన్హా ఇందులోనూ అదే రోల్ ప్లే చేస్తున్నాడు.