
సినీ తారలంతా హోలీ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఫ్యామిలీతో కలిసి రంగులు చల్లుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకుంటున్నారు. అందరిలాగే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సైతం హోలీ పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇవీ చూసిన అభిమానులు ఈ ముద్దుగుమ్మకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
అయితే కొందరు నెటిజన్స్ మాత్రం సోనాక్షిని ట్రోల్ చేశారు. హోలీ వేడుకల్లో మీ భర్త జహీర్ ఇక్బాల్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అయితే నెటిజన్ల కామెంట్స్‌కు సోనాక్షి కూడా స్పందించింది. 'నేను ప్రస్తుతం జటాధర మూవీ షూట్‌లో ఉన్నా.. నా భర్త జహీర్ ముంబయిలో ఉన్నారు.. మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి' అంటూ విమర్శలకు తనదైన స్టైల్లో కౌంటరిచ్చింది.
కాగా.. గతేడాది జూన్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. సోనాక్షి, జహీర్ దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. సల్మాన్‌ఖాన్ నిర్వహించిన పార్టీలో తొలిసారిగా వీరిద్దరు కలుసుకున్నారు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ 'నోట్‌బుక్'తో అరంగేట్రం చేసిన జహీర్.. సోనాక్షితో కలిసి డబుల్ ఎక్స్‌ఎల్ చిత్రంలో నటించారు. గతేడాది జూన్ 23, 2024న ముంబయిలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సల్మాన్ ఖాన్, కాజోల్, విద్యాబాలన్ లాంటి అగ్రతారలు హాజరయ్యారు.
ఇక సినిమాల విషయానికొస్తే సోనాక్షి సిన్హా ప్రస్తుతం జటాధార చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో కనిపించింది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment