
బాలీవుడ్ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌కు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్రానికి ముందు పాక్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తీసుకొచ్చారు. ఇందులో మనీషా కొయిరాలా, ఆదితిరావు హైదరీతో పాటు ఆరుగురు హీరోయిన్స్ నటించారు.
సినిమాల సంగతి పక్కనపెడితే.. ఇటీవల హీరామండి భామ సోనాక్షి సిన్హా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ సినీతారలు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు.
తాజాాగా ఈ జంట హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. నూతన దంపతులు స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతూ హనీమూన్ ఆస్వాదిస్తున్నారు. కాగా.. జూన్ 23న ముంబయిలో జరిగిన వివాహ వేడుకలో రేఖ, సల్మాన్ ఖాన్, అదితి రావ్ హైదరీ, కాజోల్, రిచా చద్దా వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment