ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట జూన్‌లో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తోంది బాలీవుడ్ భామ. దీంతో నెటిజన్స్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సోనాక్షి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ కూడా తెగ వైరలవుతున్నాయి.
ఈ సందర్భంగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది సోనాక్షి. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం గర్భవతిని కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేమిద్దరం సరదాగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నామని చెప్పింది. పెళ్లి తర్వాత తాను కొంత బరువు పెరగడంతో పాటు లావుగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది. అందువల్లే తనను గర్భవతి అంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారని వివరించింది. ప్రస్తుతం తామిద్దరం వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నామని సోనాక్షి తెలిపింది.
కాగా.. తన భర్త బర్త్ డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్. డిసెంబర్ 10న జరిగిన జహీర్ ఇక్బాల్ పుట్టిన రోజు వేడుకలో సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా హాజరయ్యారు. ఈ ఏడాది జూన్ 23న ఒక ప్రైవేట్ వేడుకలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు, సన్నిహితులు హాజరయ్యారు. వీరిద్దరి రిసెప్షన్ వేడుకలో రేఖ, సల్మాన్ ఖాన్, అదితి రావ్ హైదరీ, హుమా ఖురేషి, ఆదిత్య రాయ్ కపూర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment