Sonakshi Sinha
-
హోలీ వేడుకల్లో సోనాక్షి సిన్హా.. ఆయన ఎక్కడంటూ నెటిజన్ల ట్రోల్స్!
సినీ తారలంతా హోలీ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఫ్యామిలీతో కలిసి రంగులు చల్లుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకుంటున్నారు. అందరిలాగే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సైతం హోలీ పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ఇవీ చూసిన అభిమానులు ఈ ముద్దుగుమ్మకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.అయితే కొందరు నెటిజన్స్ మాత్రం సోనాక్షిని ట్రోల్ చేశారు. హోలీ వేడుకల్లో మీ భర్త జహీర్ ఇక్బాల్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అయితే నెటిజన్ల కామెంట్స్‌కు సోనాక్షి కూడా స్పందించింది. 'నేను ప్రస్తుతం జటాధర మూవీ షూట్లో ఉన్నా.. నా భర్త జహీర్ ముంబయిలో ఉన్నారు.. మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి' అంటూ విమర్శలకు తనదైన స్టైల్లో కౌంటరిచ్చింది.కాగా.. గతేడాది జూన్‌లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. సోనాక్షి, జహీర్ దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. సల్మాన్‌ఖాన్ నిర్వహించిన పార్టీలో తొలిసారిగా వీరిద్దరు కలుసుకున్నారు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ 'నోట్‌బుక్'తో అరంగేట్రం చేసిన జహీర్.. సోనాక్షితో కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. గతేడాది జూన్ 23, 2024న ముంబయిలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సల్మాన్ ఖాన్, కాజోల్, విద్యాబాలన్ లాంటి అగ్రతారలు హాజరయ్యారు.ఇక సినిమాల విషయానికొస్తే సోనాక్షి సిన్హా ప్రస్తుతం జటాధార చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో కనిపించింది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
తెలుగులో ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్‌పై మనసు పారేసుకున్నారు. వరుసగా స్టార్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. కల్కి 2989 ఏడీ సినిమాతో దీపికా పదుకొణె, దేవరతో జాన్వీ కపూర్, లైగర్‌తో అనన్య పాండే.. ఇలా అక్కడి బ్యూటీలందరూ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తాజాగా సోనాక్షి సిన్హ (Sonakshi Sinha) సైతం టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మహిళా దినోత్సవం సందర్భంగా..సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న జటాధర సినిమా (Jatadhara Movie)లో ముఖ్య పాత్రలో నటిస్తోంది. నేడు (మార్చి 8న) మహిళా దినోత్సవం సందర్భంగా జటాధర చిత్రబృందం సోనాక్షి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. అందులో ఈ బ్యూటీ కళ్లకు కాటుక, చిందరవందరగా ఉన్న జుట్టుతో ఆగ్రహంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 14న లాంఛనంగా ప్రారంభమైంది. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.అనంత పద్మనాభస్వామి ఆలయం నేపథ్యంలో..ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్‌బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మిస్తున్నారు. జటాధర సినిమా కథ అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమా కోసం బాడీని పెంచే పనిలో ఉన్న సుధీర్‌బాబు అందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. View this post on Instagram A post shared by Zee Studios (@zeestudiosofficial) చదవండి: అది కూడా తప్పేనా? నాకు స్టార్‌గా ఉండాలని లేదు: అక్షయ్ కుమార్ -
సిటీలో గాలి పీల్చడం అంటే సిగిరెట్ తాగడమే:ఏకీభవించిన హీరోయిన్
సగటు మనిషితో పోలిస్తే సెలబ్రిటీలకు మరింత సామాజిక బాధ్యత ఉంటుంది. లక్షలాది మందిని ప్రభావితం చేయగలిగిన సినిమా నటీనటులు ఆ సామాజిక బాధ్యతను గుర్తించి మసలుకోవడాన్ని దురదృష్టవశాత్తూ మనం అరుదుగానే చూస్తుంటాం. తరచుగా సోషల్ మీడియాను తమ సినిమాల ప్రచారానికో, మరోరకమైన సంపాదనకో వాడుకునే సెలబ్రిటీలు సామాజిక సమస్యలపై స్పందించడం తక్కువే. కాలుష్యం వంటి సమస్యలపై తాము స్పందిస్తే ప్రభుత్వాలకు తమ మీద కోపం వస్తుందనే భయపడేవారే ఎక్కువ. ఇలాంటి వారి మధ్య అరుదుగా కొందరు మాత్రం తమదైన శైలిని నిలబెట్టుకుంటారు.ప్రముఖ హిందీ నటుడు స్టాండ్–అప్ కమెడియన్‌గానూ పేరొందిన వీర్ దాస్(Vir Das ) ఇటీవల ముంబై నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై తరచుగా పోస్ట్‌ల ద్వారా తన ఆందోళన తెలియజేస్తున్నాడు. ఆ పోస్ట్స్ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ఆయన తాజాగా సోషల్ మీడియా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ముంబై నగరంలో శ్వాస పీల్చడం అంటే సిగరెట్ తాగడంతో సమానం అని అన్నారు.‘నేను సరదా కోసం లేదా సోషలైజింగ్‌లో భాగంగా సంవత్సరానికి కేవలం పదిహేను రోజులు మాత్రమే సిగరెట్ తాగుతాను. కానీ మిగిలిన రోజులు కూడా పొగ తాగుతున్నట్టే ఉంది ఎందుకంటే నేను శ్వాస పీల్చుకునేది ముంబైలో కదా. అదే రుచి. ఈ రోజు ముంబై ఒక మార్ల్బోరో లైట్‘ అని వీర్ ఇన్‌స్ట్రాగామ్‌లో రాశాడు. తాను పీల్చుకునే శ్వాస తాను తాగే సిగిరెట్ బ్రాండ్ మార్ల్‌బరో లైట్ ఒకేలా ఉన్నాయనే అర్ధం వచ్చేలా ఆయన ఈ పోస్ట్ చేశాడు.అయితే ముంబై మహానగరంలో కనుమరుగవుతున్న గాలి నాణ్యతపై వీర్ దాస్ ఆందోళన వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో, అతను ఇన్‌స్ట్రాగామ్‌లో కూడా విపులంగా పోస్ట్ పెట్టాడు, ‘ఇప్పుడు ఉదయం7:30 గంటలు... ఈ సమయంలో గాలి నాణ్యత ఎక్యుఐ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) 170. ఇది పిల్లలు పాఠశాలకు పెద్దవాళ్లు వాకింగ్‌లకు వెళుతున్న సమయం. ప్రభుత్వం ఏదైనా కఠినంగా చేయకపోతే, వారసత్వంగా కాలుష్యం మాత్రమే మన జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఇప్పుడే పుట్టిన తరంతో పాటు వృద్ధాప్యంలో ఉన్న వారిపై కూడా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుందని మనం గ్రహించాలి. దీన్ని అడ్డుకోవడానికి ‘కొన్ని కఠినమైన విధాన నిర్ణయాలు జరగాలి. అలాంటి నిర్ణయాలు బహుశా స్వల్పకాలంపాటు మనల్ని తీవ్ర అసంతృప్తికి గురిచేయవచ్చు. కొత్త విమానాశ్రయాలు కొత్త వంతెనలు వచ్చేటప్పుడు కూడా మనం నసపెడతాం, కానీ చివరికి అది విలువైనదే అవుతుంది. గాలి మీ ఆదాయ స్థితిని పట్టించుకోదు, గాలి మతపరమైనది కాదు, గాలి దేశభక్తి కాదు, గాలి ఓటు వేయదు, కానీ సరిదిద్దాల్సింది ఏదైనా ఉందీ అంటే అది గాలి మాత్రమే’’ అంటూ ఆయన రాశారు. ఈ పోస్ట్ సాధారణ నెటిజన్స్‌తో పాటు పలువురు సహచర నటీనటులను కూడా ఆకర్షించింది. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా(Sonakshi Sinha ) తదితరులు తన ఇన్‌స్ట్రాగామ్ పోస్ట్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేస్తూ వీర్‌తో ఏకీభవించారు. -
లావుగా ఉన్నానని హీరోయిన్గా పక్కనపెట్టేశారు: సోనాక్షి
తమ శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడానికి సెలబ్రిటీలు నిత్యం వర్కవుట్లు చేస్తూ ఉంటారు. ఏమాత్రం బొద్దుగా తయారైనా ఆఫర్లు అందుకోవడం గగనమే అవుతుంది. కొందరైతే బరువు తగ్గడానికి, అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి షార్ట్కట్లు కూడా వెతుకుతారు. ఎందుకంటే వాళ్లకు నచ్చినట్లుగా ఉంటే ఆఫర్లు రావడం అంత ఈజీ కాదు. తన విషయంలోనూ ఓసారి ఇదే జరిగిందంటోంది హీరోయిన్ సోనాక్షి సిన్హ (Sonakshi Sinha). తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి మాట్లాడుతూ.. ఓసారి ఏమైందంటే నేను లావుగా ఉన్నానని రిజెక్ట్ చేశారు.అత్త ఒడిలో తలపెట్టి ఏడ్చా..అప్పుడు నా మనసు ముక్కలైంది. ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాను. కాస్త లావయ్యానని కథానాయిక పాత్రకు నన్ను తిరస్కరించారు. ఆ పాత్రలో నేను బాగోనని, కావాలంటే ఏదైనా చిన్నాచితకా పాత్రలు చేసుకోమని సలహా ఇచ్చారు. నాకు చాలా బాధేసింది. నేను ఇంటికి వెళ్లేసరికి మా అత్త అక్కడే ఉంది. దేవుడు నన్నెందుకిలా పుట్టించాడు? నాకెందుకిలా చేస్తున్నాడు? అంటూ నాకు నేనే ప్రశ్నలు వేసుకుంటూ అత్త ఒడిలో తలపెట్టి ఏడ్చాను. బాధపోయేవరకు ఏడుస్తూనే ఉన్నాను. మరుసటి రోజే మళ్లీ మామూలు మనిషయ్యాను అని చెప్పుకొచ్చింది.సినిమాసోనాక్షి చివరగా కకుడా (Kakuda Movie) అనే హారర్ చిత్రంలో కనిపించింది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన హీరామండి: ద డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది. ప్రస్తుతం హీరామండి రెండో సీజన్లో యాక్ట్ చేస్తోంది. గతేడాది సోనాక్షి నటుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుంది.చదవండి: ఓటీటీలో 'షకీలా' బయోపిక్ స్ట్రీమింగ్.. అలాంటి కంటెంట్ కావడంతో.. -
దుబాయ్‌లో సోనాక్షి సిన్హా ఫోజులు.. నెట్టింట ఫోటోలు వైరల్
-
న్యాయం కోసం...
జ్యోతిక, సోనాక్షీ సిన్హా ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరు కానున్నారు. కానీ ఇది రియల్ కేసు కాదు... రీల్ కేసు. ఇంతకీ విషయం ఏంటంటే... బాలీవుడ్ దర్శకురాలు అశ్వనీ అయ్యర్ తివారి ఓ కోర్టు రూమ్ డ్రామాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రోడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తయ్యాయి. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను ముంబైలో ప్రారంభించాలనుకుంటున్నారు.ఈ చిత్రంలో జ్యోతిక, సోనాక్షీ సిన్హా లీడ్ రోల్స్‌లో నటించనున్నారని సమాచారం. అయితే ఈ ఇద్దరి హీరోయిన్స్‌లో లాయర్‌గా నటించేది ఎవరు? న్యాయం కోసం పోరాడేది ఎవరు? అనే అంశాలపై మాత్రం ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాకు ముందుగా కరీనా కపూర్, కియారా అద్వానీలను అనుకున్నారని, ఫైనల్‌గా జ్యోతిక, సోనాక్షిలు ఫైనల్ అయ్యారని బాలీవుడ్ టాక్. -
భారీ లాభానికి లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మేసిన సోనాక్షి, ఫోటోలు
-
Sonakshi Sinha: పులిని నిద్రపుచ్చుతూ.. సింహం పక్కనే సేదతీరుతూ.. (ఫోటోలు)
-
ఆస్ట్రేలియాలో భర్తతో విన్యాసాలు.. భయపడిపోయిన సోనాక్షి సిన్హ (ఫోటోలు)
-
షూటింగ్లో సేద తీరుతున్న బ్యూటీ.. భయపడిపోయిన సోనాక్షి
భర్తతో బంగీ జంప్.. కేకలు పెట్టిన సోనాక్షిహంపిలో బిగ్‌బాస్ బ్యూటీ దివిరెడ్ డ్రెస్‌లో రాయ్ లక్ష్మిపింక్ చీరలో శ్రీలీలపిల్లలతో మన్నారా చోప్రా క్రిస్మస్ సెలబ్రేషన్స్డిసెంబర్ సంగతుల్ని ఫోటోల రూపంలో షేర్ చేసిన పరిణతీ చోప్రా View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Mannara Chopra (@memannara) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
2024లో ఇంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారా? (ఫొటోలు)
-
ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట జూన్‌లో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తోంది బాలీవుడ్ భామ. దీంతో నెటిజన్స్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సోనాక్షి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ కూడా తెగ వైరలవుతున్నాయి.ఈ సందర్భంగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది సోనాక్షి. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం గర్భవతిని కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేమిద్దరం సరదాగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నామని చెప్పింది. పెళ్లి తర్వాత తాను కొంత బరువు పెరగడంతో పాటు లావుగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది. అందువల్లే తనను గర్భవతి అంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారని వివరించింది. ప్రస్తుతం తామిద్దరం వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నామని సోనాక్షి తెలిపింది.కాగా.. తన భర్త బర్త్ డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్. డిసెంబర్ 10న జరిగిన జహీర్ ఇక్బాల్ పుట్టిన రోజు వేడుకలో సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా హాజరయ్యారు. ఈ ఏడాది జూన్ 23న ఒక ప్రైవేట్ వేడుకలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు, సన్నిహితులు హాజరయ్యారు. వీరిద్దరి రిసెప్షన్ వేడుకలో రేఖ, సల్మాన్ ఖాన్, అదితి రావ్ హైదరీ, హుమా ఖురేషి, ఆదిత్య రాయ్ కపూర్ పాల్గొన్నారు. -
పెళ్లి తర్వాత మరింత గ్లామరస్‌గా సోనాక్షి (ఫొటోలు)
-
‘ఇటాలియన్ మాఫియా’ : ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట (ఫొటోలు)
-
భర్త క్షేమం కోసం...
డిజైనర్ చీరలు, చుడీదార్లు, గౌనులు, నగలు, నుదుట ఎర్రని సింధూరం, చేతులకు మెహిందీతో కొందరు బాలీవుడ్ తారలు చాలా అందంగా ముస్తాబయ్యారు. కర్వా చౌత్ పండగ సందర్భంగా ఈ తారలు ఇలా కళకళలాడారు. ఈ పండగకు భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడు కనిపించాక, భర్త ముఖాన్ని జల్లెడలోంచి చూసిన తర్వాతే భోజనం చేస్తారు. ఉత్తరాదినపాటించే ఆచారం ఇది. ఈ కర్వా చౌత్‌కి బాలీవుడ్లో ఇలా భర్త క్షేమం కోసం ఉపవాసం ఆచరించి, పూజ చేశారు కొందరు తారలు. ఆ విశేషాల్లోకి...‘‘నీ ఆయురారోగ్యాల కోసం ఈరోజు మాత్రమే కాదు.. ప్రతి రోజూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను... కర్వా చౌత్ శుభాకాంక్షలు. మన శాశ్వతమైన ప్రేమకు, మన బలమైన బంధానికి చిహ్నంగా ఈ మంగళసూత్రం ఓ గుర్తు’’ అంటూ భర్త జహీర్ ఇక్బాల్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు సోనాక్షీ సిన్హా. నటుడు జహీర్ ఇక్బాల్‌తో సోనాక్షీ వివాహం ఈ ఏడాది జూన్‌లో జరిగింది. తొలి కర్వా చౌత్‌ను ఇష్టంగా జరుపుకున్నారు సోనాక్షి. ఇక ఈ ఏడాది తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో రకుల్ ప్రీత్‌సింగ్ ఉన్నారు. నటుడు–నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగింది.కాగా ఇటీవల వర్కౌట్ చేస్తుండగా రకుల్‌కి గాయమైంది. వెన్నెముకకు గాయం కావడంతో ఆమె బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. అయితే కర్వా చౌత్ సందర్భంగా చేతికి భర్త పేరులోని ‘జె’ అక్షరం, ఒక పువ్వు డిజైన్‌తో మెహిందీ పెట్టించుకుని, ‘బెడ్ రెస్ట్వాలా ఫస్ట్ కర్వా చౌత్’ అంటూ ఆ ఫొటోను షేర్ చేశారు రకుల్. అలాగే అదితీ రావ్ హైదరీకి కూడా ఇది తొలి కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ తో అదితి వివాహం ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగింది. ఇంకా తొలి కర్వా చౌత్ జరుపుకున్న వారిలో కృతీ కర్భందా ఉన్నారు. నటుడు పుల్కిత్ సామ్రాట్‌తో ఆమె పెళ్లి ఈ ఏడాది మార్చిలో జరిగింది. ఇక కియారా అద్వానీకి ఇది రెండో కర్వా చౌత్. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె వివాహం జరిగింది.రెండో కర్వా చౌత్‌కి భర్త పేరులోని ‘ఎస్ఎమ్’ అక్షరాలను మెహిందీ డిజైన్‌గా పెట్టించుకుని, ఆ ఫొటోను, జల్లెడలోంచి భర్త ముఖాన్ని చూస్తున్న ఫొటోలను షేర్ చేశారు కియారా. పరిణీతీ చో్ర΄ాకి కూడా ఇది రెండో కర్వా చౌత్. గత ఏడాది సెప్టెంబర్‌లో రాఘవ్ చద్దాతో ఆమె వివాహం జరిగింది. చేతి వెనకాల రెండు హార్ట్ సింబల్స్‌తో మెహిందీ పెట్టించుకున్న ఫొటోను షేర్ చేశారు పరిణీతి. మరోవైపు సోనమ్ కపూర్ కూడా భర్త ఆనంద్, కుమారుడు వాయు పేర్లను మెహిందీ డిజైన్‌గా పెట్టించుకుని, ఆ ఫొటోను షేర్ చేశారు. 2018లో ఆనంద్, సోనమ్‌ల వివాహం జరిగింది.అయితే ఫాస్టింగ్ ఉండనని, ఈ పండగ సందర్భంగా మెహిందీ పెట్టించుకోవడం, రుచికరమైన వంటకాలు తినడం ఇష్టం అని పేర్కొన్నారు సోనమ్. కాగా నటుడు అనిల్ కపూర్ భార్య సునీతా కపూర్ ప్రతి ఏడాదీ ఘనంగా కర్వా చౌత్ జరుపుకుంటారు. అందర్నీ ఆహ్వానిస్తుంటారు కూడా. ఈ ఏడాది శిల్పా శెట్టి, రవీనా టాండన్ వంటివారు సునీతతో కలిసి ఆమె ఇంట్లో పండగ చేసుకున్నారు. ఇలా కర్వా చౌత్ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖుల సందడి జోరుగా కనిపించింది. -
చుక్కల డ్రస్‌లో సోనాక్షి గ్లామర్ ట్రీట్.. తగ్గేదే లే (ఫొటోలు)
-
‘స్పెక్టాక్యులర్ సౌదీ’ ఈవెంట్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ఎన్నేసి మాటలన్నారు.. ఒక్క వీడియోతో ఆన్సరిచ్చిన హీరోయిన్
ప్రేమకు కులమత బేధాలు లేవు. ఈ విషయాన్ని నిరూపించిన ఎంతోమందిలో సోనాక్షి సిన్హ- జహీర్ ఇక్బాల్ జంట ఒకటి. వీరిద్దరూ ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పినవారి కంటే విమర్శలతో బురద చల్లినవారే ఎక్కువ!వినాయక చవితి సెలబ్రేషన్స్తిట్లను సైతం కొత్త జంట ఆశీర్వాదంగా తీసుకుంది. తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అప్పటినుంచి ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా వీరు వినాయక చవితి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. సోనాక్షి సాంప్రదాయాలను ఇక్బాల్ గౌరవిస్తూ అతడి ఇంట్లోనే వినాయకుడిని ప్రతిష్టించారు. ఇద్దరూ కలిసి పండగను కన్నుల వేడుకగా జరుపుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వీళ్లిద్దరూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.ఫ్యాన్స్ సంబరంఅందమైన డెకరేషన్ మధ్యలో బొజ్జ గణపయ్యను పూజించిన వీడియోను చూసి ఫ్యాన్స్ సంబరపడిపోయారు. ఇరు వర్గాల సాంప్రదాయాలను గౌరవించుకుంటూ, అన్ని పండగలను కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ మీరు అందరికీ ఆదర్శంగా నిలవండి అని పలువురూ సూచిస్తున్నారు. ఇకపోతే సోనాక్షి చివరగా హీరామండి అనే నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Sonakshi Sinha: అమెరికాలో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ సోనాక్షి (ఫొటోలు)
-
పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తున్న స్టార్ హీరోయిన్
హీరోయిన్ సోనాక్షి సిన్హా మొన్నీ మధ్యే జూన్ 23న పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ వేడుకంతా ముంబయిలోని బాంద్రా ఏరియాలో ఉన్న సోనాక్షి అపార్ట్మెంట్లోనే జరిగాయి. ఇప్పుడు ఆ ఇంటినే అమ్మకానికి పెట్టేసింది. ఈ విషయం ఆమె చెప్పలేదు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పోస్ట్ చేసిన వీడియో వల్ల ఇది బయటపడింది.(ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. కొత్త వీడియోతో నటి హేమ)ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ 'దబంగ్' మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. దక్షిణాదిలోనూ రజినీకాంత్ 'లింగా' సినిమాలో హీరోయిన్గా చేసింది. ఆడపదడపా సినిమాలు చేస్తోన్న ఈమె.. గతంలో తనతో పాటు నటించిన జహీర్ ఇక్బాల్‌తో చాన్నాళ్ల క్రితమే ప్రేమలో పడింది. ఈ ఏడాది జూన్‌లో పెళ్లికి కొన్నిరోజుల ముందు ఈ విషయం బయటపడింది.ఇక 2020లో బాంద్రాలో ఓ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన సోనాక్షి.. అదే బిల్డింగ్‌లో మరో అపార్ట్‌మెంట్‌ని గతేడాది మే నెలలో సొంతం చేసుకుంది. తాజాగా అందులోనే తన పెళ్లిని గ్రాండ్‌గా జరుపుకొంది. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ దీన్ని రూ.25 కోట్ల రేటుకి అమ్మకానికి పెట్టింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి జరిగిన ఇంటిని మరి సోనాక్షి ఎందుకు అమ్మాలనుకుందనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: వెయిట్ చేయండి.. సర్ప్రైజ్ ఇస్తా: హీరోయిన్ సమంత) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
సోనాక్షి బ్యాచిలరేట్ పార్టీ.. ఆ డ్రెస్సును గుర్తు పట్టారా? (ఫొటోలు)
-
గత నెలలో పెళ్లి.. భర్తతో విదేశాలకు చెక్కేసిన హీరోయిన్ (ఫోటోలు)
-
అప్పగింతల్లో ఏడ్చేసిన తల్లి.. ఓదార్చిన హీరోయిన్.. కానీ ఇప్పుడు..
పెళ్లి అంటే ఓ పక్క సంతోషం, మరోపక్క బాధ ఏ అమ్మాయికైనా ఉండేదే! జీవితాంతం తోడుండే అర్ధాంగి దొరికినందుకు సంతోషిస్తూనే.. పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు కన్నీళ్లు రాలుస్తుంటారు. హీరోయిన్ సోనాక్షి సిన్హ కూడా అంతే! ప్రేమించినవాడినే పెళ్లి చేసుకున్నందుకు సంతోషించింది. అంతలోనే పుట్టింటికి దూరమైనందుకు బాధపడుతోంది.ఈ మేరకు తన పెళ్లిలో జరిగిన అప్పగింతల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను ఇక మీదట ఇంట్లో కనిపించను, వెళ్లిపోతున్నానన్న బాధతో అమ్మ(పూనం సిన్హ) పెళ్లిలో ఏడ్చేసింది. అప్పుడు నేను.. ఏం కాదమ్మా.. బాధపడకు, నేను ఎంతోదూరం వెళ్లట్లేదు. జుహు నుంచి బాంద్రా కేవలం 25 నిమిషాలు మాత్రమే అని చెప్పాను. కానీ ఎందుకో ఈ రోజు వాళ్లను ఇంకా ఎక్కువ మిస్ అవుతున్నాను. అప్పుడు అమ్మను ఓదార్చినట్లే నన్ను నేను ఓదార్చుకుంటున్నాను. ఈ రోజు ఇంట్లో సింధి కూర చేశారనుకుంటున్నాను. త్వరలోనే వాళ్లను కలుస్తాను అని రాసుకొచ్చింది. కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోతుంటే ఆ తల్లి మనసు ఎంత అల్లాడిపోతుందోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) చదవండి: పేరెంట్స్‌కు హెచ్చరిక జారీ చేసిన సాయిధరమ్ తేజ్ -
Sanam Ratansi: 'సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్'గా పాపులర్..
సోనాక్షీ సిన్హా తన పెళ్లితో టాక్ ఆఫ్ ద సోషల్ మీడియా అయింది. అంతకుముందు నుంచే సనమ్ రతన్సీ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయింది సోనాక్షీ సిన్హా వెన్నంటే ఉంటూ! ఎందుకంటే సనమ్.. సోనాక్షీ పర్సనల్ స్టయిలిస్ట్! అంతేకాదు ఆమెకు సోనాక్షీతో మరో పర్సనల్ రిలేషన్ కూడా ఉంది. ఆమె.. సోనాక్షీ సిన్హా ఆడపడచు! ఇక్కడ మాత్రం సనమ్ పరిచయం స్టార్ స్టయిలిస్ట్గానే!ఎడిటోరియల్ స్టయిలింగ్, సెలబ్రిటీ స్టయిలింగ్ రెండూ వేటికవే ప్రత్యేకం. అయితే ఎడిటోరియల్ స్టయిలింగ్ కొంచెం కూల్. సెలబ్రిటీ స్టయిలింగ్ కాస్త స్ట్రెస్ఫుల్! కానీ చాలెంజింగ్‌గా ఉంటుంది. కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. నేను స్టయిలింగ్ చేసే సెలబ్రిటీల్లో నాకు అదితీ రావ్ హైదరీ అంటే ఇష్టం. నా పని మీద ఆమెకు నమ్మకం ఎక్కువ.నేనేది చెప్పినా ఆమె లుక్స్‌ని ఎన్హాన్స్ చేయడానికే చెబుతానని ఆమెకు తెలుసు. అందుకే నేను ఏ కాస్ట్యూమ్ తెచ్చినా ట్రై చేస్తుంది. స్టయిలింగ్ రంగంలోకి రావాలనుకునే వారికి ఒకటే సలహా.. కొత్త కొత్త ట్రెండ్స్‌ని గమనిస్తూండాలి. మంచి స్టయిలిస్ట్‌ల దగ్గర ట్రైన్ అవ్వాలి. వాళ్ల వర్క్‌తో ఇన్స్పైర్ అవ్వాలి. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ప్రయోగాలకు వెనుకాడకూడదు! – సనమ్ రతన్సీసనమ్.. క్రియేటివ్ జీన్‌తో సంపన్న కుంటుంబంలో పుట్టిపెరిగింది. ఆమె తండ్రి.. ఇక్బాల్ రతన్సీ స్వర్ణకారుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి. క్రియేటివ్ జీన్‌ని తండ్రి నుంచే పొంది ఉంటుంది సనమ్. ఆమెకు ఊహ తెలిసేనాటికే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్‌కి వెళ్లే వయసులోనే నిశ్చయించుకుంది పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని! అనుకున్నట్టుగానే ఫ్యాషన్ రంగంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక ఫ్యాషన్ మ్యాగజైన్స్‌లో పనిచేసింది.ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయిన అనాయితా ష్రాఫ్‌ని కలసింది. ఆమెతో సంభాషణ సనమ్‌లో స్టయిలింగ్ పట్ల ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది. అప్పుడు అనాయితా ఒక బ్రాండ్ అడ్వర్టయిజ్మెంట్ కోసం దీపికా పదుకోణ్‌కి స్టయిలింగ్ చేస్తోంది. ఆ షూటింగ్ విరామంలోనే అనాయితాను సనమ్ కలసింది. స్టయిలింగ్ పట్ల సనమ్ చూపిస్తున్న ఉత్సుకతను గుర్తించిన అనాయితా ఆ షూటింగ్లో తన పనిని గమనించమని సనమ్‌కి చెప్పింది.షూటింగ్ పూర్తయ్యాక అడిగింది ‘స్టిల్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టయిలింగ్?’ అని! ‘ఎస్.. వెరీమచ్!’ అని బదులిచ్చింది సనమ్. ‘అయితే నా దగ్గర జాయినై పో.. రేపటి నుంచే వచ్చేసెయ్’ అంటూ తన కంపెనీ ‘స్టయిల్ సెల్’లో సనమ్‌కి జాబ్ కన్ఫర్మ్ చేసింది అనాయితా. తెల్లవారి నుంచే ‘రా–వన్’ షూటింగ్‌కి బయలుదేరింది సనమ్.. అనాయితాకు అసిస్టెంట్‌గా! ఆ సినిమా హీరో షారుఖ్ ఖాన్‌కి అనాయితా స్టయిలింగ్ చేస్తోందప్పుడు.ఆ ప్రాజెక్ట్ తర్వాత అవకాశాల కోసం వెదుక్కోవలసిన అవసరం లేకపోయింది సనమ్‌కి. ఇంకెవరి రికమండేషన్ పనీ పడలేదు. సెలబ్రిటీ ఇండివిడ్యువల్ పర్సనాలిటీని హైలైట్ చేసే ఆమె వర్క్ స్టయిల్ ఎంతోమంది స్టార్స్‌కి నచ్చింది. సైఫ్ అలీ ఖాన్, అదితీ రావ్ హైదరీ, హుమా ఖురేషీ, రాజ్‌కుమార్ రావు, మనీషా కోయిరాలా, జహీర్ ఇక్బాల్, అలయా ఎఫ్, రియా చక్రవర్తి, కత్రినా కైఫ్‌లాంటి వాళ్లెందరో కోరి మరీ సనమ్‌ను తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. ఫితూర్, ద గర్ల్ ఆన్ ద ట్రైన్, మలాల్ వంటి సినిమాలకూ పనిచేసింది. తన కీర్తిని పెంచుకుంది. -
హిందీలో ‘మర్యాద రామన్న’ సిక్వెల్.. సోనాక్షి ప్లేస్‌లో మృణాల్!
సన్నాఫ్ సర్దార్‌గా అజయ్ దేవగన్ అతి త్వరలో స్కాట్లాండ్ వెళ్లనున్నారని బాలీవుడ్ సమాచారం. అజయ్ దేవగన్, సోనాక్షీ సిన్హా, సంజయ్ దత్ లీడ్ రోల్స్‌లో అశ్వినీ ధీర్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్’ (2012). రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’కు హిందీ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత ‘సన్నాఫ్ సర్దార్’కు సీక్వెల్‌గా ‘సన్నాఫ్ సర్దార్ 2’ చిత్రం రానుందని సమాచారం. తొలి భాగంలో లీడ్ రోల్స్‌లో నటించిన అజయ్ దేవగన్, సంజయ్ దత్ సీక్వెల్లోనూ నటించనున్నారని, హీరోయిన్గా మాత్రం సోనాక్షీ సిన్హా ప్లేస్‌లో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారని భోగట్టా. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ని స్కాట్లాండ్లో జరిపేలా ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ దాదాపు యాభై రోజులకు పైగా ఉంటుందని, అజయ్ దేవగన్–మృణాల్ ఠాకూర్ల కాంబినేషన్ ట్రాక్ అంతా విదేశాల్లోనే చిత్రీకరిస్తారని టాక్. ఈ సినిమాకు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ప్రియుడితో పెళ్లి.. హనీమూన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్!
బాలీవుడ్ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌కు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్రానికి ముందు పాక్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను తీసుకొచ్చారు. ఇందులో మనీషా కొయిరాలా, ఆదితిరావు హైదరీతో పాటు ఆరుగురు హీరోయిన్స్ నటించారు.సినిమాల సంగతి పక్కనపెడితే.. ఇటీవల హీరామండి భామ సోనాక్షి సిన్హా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ సినీతారలు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు.తాజాాగా ఈ జంట హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోనాక్షి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. నూతన దంపతులు స్విమ్మింగ్ పూల్‌లో చిల్ అవుతూ హనీమూన్ ఆస్వాదిస్తున్నారు. కాగా.. జూన్ 23న ముంబయిలో జరిగిన వివాహ వేడుకలో రేఖ, సల్మాన్ ఖాన్, అదితి రావ్ హైదరీ, కాజోల్, రిచా చద్దా వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. View this post on Instagram A post shared by HT City (@htcity) -
హీరోయిన్ చెప్పులు మోసిన భర్త.. ఇలాగే ఉంటుంది మరి!
ప్రేమకు అర్థం ఏదంటే.. నిన్ను, నన్నే చూపిస్తానంటోంది హీరోయిన్ సోనాక్షి సిన్హ. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ సుందరి భర్త గురించే ఈ పాట పాడుతోంది. ప్రియుడు జహీర్ ఇక్బాల్ భర్తగా మారినా తనపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదంటోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో సోనాక్షి హీల్స్ (చెప్పులు)ను ఇక్బాల్ తన చేతులతో పట్టుకుని ముందు నడుస్తున్నాడు. పెళ్లిపై ట్రోలింగ్భార్యపై చిరాకు పడకుండా నవ్వుతూనే చెప్పులు మోశాడు. కరెక్ట్ పర్సన్‌ను పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది అని హీరోయిన్ రాసుకొచ్చింది. ఇకపోతే సోనాక్షి- ఇక్బాల్ పెళ్లిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఇద్దరూ విభిన్న వర్గానికి చెందినవారు కావడంతో ఈ జంటపై నెటిజన్లు విషం చిమ్మారు. కొత్త జంటను ఆశీర్వదించాల్సింది పోయి అనరాని మాటలు అన్నారు.సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హఆస్పత్రిలో తండ్రిమరోవైపు హీరోయిన్ పెళ్లి జరిగిన రెండు రోజులకే తండ్రి, నటుడు శత్రుఘ్న సిన్హా ఆస్పత్రిపాలయ్యాడు. సర్జరీ చేయించుకోబోతున్నాడని రూమర్లు రాగా వాటిని ఆయన కుమారుడు లవ్ సిన్హ కొట్టిపారేశాడు. తీవ్ర జ్వరం కారణంగానే ఆస్పత్రిలో చేరాడని, సర్జరీ వంటిదేమీ లేదని స్పష్టం చేశాడు.చదవండి: ప్రభాస్ 'కల్కి' రేర్ రికార్డ్.. ఇది కదా అసలైన మాస్ అంటే -
ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్‌కు కౌంటరిచ్చిన హీరోయిన్!
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టింది. సోనాక్షి, జహీర్ వేర్వేరు వర్గానికి చెందినవారు కావడంతో నెటిజన్లు ఈ జంటను దుమ్మెత్తిపోస్తున్నారు. కొత్త జంటను ఆశీర్వదించాల్సింది పోయి పెళ్లైన మరుక్షణం నుంచే విమర్శల బాణాలు ఎక్కుపెట్టి సూటిపోటి మాటలతో చిత్రవధ చేస్తున్నారు. ఈ వ్యతిరేకత తారా స్థాయిలో ఉండటంతో సోనాక్షి, ఇక్బాల్ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కామెంట్ సెక్షన్‌ను సైతం ఆఫ్ చేశారు. కరెక్ట్‌గా చెప్పావ్అయినప్పటికీ సోషల్ మీడియాలో కొత్త జంటపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రసాద్ భట్ అనే ఆర్టిస్టు సోనాక్షి- ఇక్బాల్ దంపతుల గ్రాఫిక్ పిక్‌ను డిజైన్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలాడు. అన్నింటికంటే ప్రేమ అనే మతమే గొప్పది అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన సోనాక్షి.. చాలా కరెక్ట్‌గా చెప్పావు అని రిప్లై ఇచ్చింది. ఈ కామెంట్‌తో ఆమె ట్రోలర్స్‌కు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది.నా కూతురు ఏ తప్పూ చేయలేదుమరోవైపు తన కూతురిని ట్రోల్ చేస్తున్నవారిపై సోనాక్షి తండ్రి, నటుడు శతృఘ్న సిగ్న ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఉద్యోగం సద్యోగం ఏదీ లేకుండా ఉన్నవాళ్లందరూ ఇలా అవతలివారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. నా కూతురు ఏ తప్పూ చేయలేదు. పెళ్లి అనేది ఇద్దరు మనుషుల ఇష్టం. అందులో తలదూర్చే హక్కు ఎవరికీ లేదు. విమర్శించేవాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ముందు వెళ్లి మీ జీవితాన్ని చక్కబెట్టుకోండి. ఏదైనా పనికొచ్చే పని చేయండి' అని మండిపడ్డాడు. View this post on Instagram A post shared by Prasad Bhat (Graphicurry) (@prasadbhatart)చదవండి: హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే? -
నేరుగా ఓటీటీకి హారర్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల కాలంలో హారర్, కామెడీ చిత్రాలకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీల్లో ఇలాంటి కంటెంట్‌కు మంచి డిమాండ్ ఉంది. తాజాగా అలాంటి చిత్రం ద్వారా అలరించేందుకు వస్తోంది బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. కకుడా అనే మూవీతో అభిమానులను పలకరించునుంది. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్, సాక్విబ్ సలీమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హారర్ కామెడీ కథాంశంతో మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోట్దర్ ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. జూలై 12వ తేదీ నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. తాజా పోస్టర్ చూస్తే దెయ్యం ప్రధాన అంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది సోనాక్షి. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ తారలు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. Purushon Ke Hit Mein Jaari ⚠️- #Kakuda aa raha hai ‘12 July’ ko, toh ghar pe rahein aur theek 7:15 baje, darwaza khula rakhna naa bhoolein. 👻Kyunki #AbMardKhatreMeinHai, #Kakuda only on #ZEE5#KakudaOnZEE5 pic.twitter.com/wzHOVtE4j8— ZEE5 (@ZEE5India) June 21, 2024 -
ఏడేళ్ల సావాసం.. ప్రియుడితో పెళ్లి.. అంతలోనే మొదటిదెబ్బ! (ఫోటోలు)
-
బాలీవుడ్ బ్యూటీ పెళ్లి.. సొంత అన్నయ్యలే గైర్హాజరు.. ఇష్టం లేదనే!
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ పెళ్లికూతురిగా ముస్తాబయింది. చేతికి ఎర్రగా పండిన గోరింటాకు, ఎర్రటి పట్టుచీర, చీరకు తగ్గట్లుగా రెడ్ బ్యాంగిల్స్.. సాంప్రదాయానికి పెద్ద పీట వేస్తూ ఎంతో అందంగా రెడీ అయింది. ఏడేళ్లుగా డేటింగ్ చేస్తున్న జహీర్ ఇక్బాల్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ వివాహ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే తన పెళ్లికి సోనాక్షి అన్నలిద్దరూ హాజరవలేదు. లవ్ సిన్హా, ఖుష్ సిన్హా ఎక్కడని అంతా ఆరా తీశారు. కానీ సమాధానం దొరకలేదు. చెల్లి పెళ్లిని ముందుండి జరిపించాల్సిన వారు కనిపించకుండా పోవడమేంటని అతిథులు సైతం ఆశ్చర్యపోయారు.పెళ్లికి డుమ్మాసోనాక్షి పెళ్లికి తన పేరెంట్స్ హాజరయ్యారు కానీ ఆమె సోదరులిద్దరూ అటు వివాహానికి, ఇటు రిసెప్షన్‌కు దేనికీ హాజరవలేదని తెలుస్తోంది. వ్యాపారి ఇక్బాల్ రతాన్సీ కుమారుడు జహీర్‌ను సోనాక్షి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఆమె అన్నలిద్దరూ ఈ కార్యక్రమానికి రాలేదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి లవ్ సిన్హాకు ప్రశ్నలు ఎదురవగా అతడు ఇలా స్పందించాడు. ఒక రెండు రోజులు సమయం ఇవ్వండి. నాకు బదులివ్వాలని అనిపిస్తే అప్పుడు మీరడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని దాటవేశాడు.మీ అన్నయ్యలెక్కడ?కాగా పెళ్లికూతురి సోదరుడు చేయాల్సిన కొన్న పనులను సోనాక్షి స్నేహితుడు, నటుడు సఖీబ్ సలీమ్ తన భుజాన వేసుకున్నాడు. ఆమెను మండపానికి తీసుకొచ్చేటప్పుడు పూల చద్దర్‌ను సఖీబ్ పట్టుకుని నడిచాడు. ఈ వీడియో వైరల్‌గా మారగా.. అదేంటి నీకు ఇద్దరన్నలు ఉన్నారు.. వాళ్లు ఎక్కడా కనిపించడం లేదేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. Most Beautiful And Happiest Moments For Sonakshi Sinha And Zaheer Iqbal Congratulations 🎉👏 शादी मुबारक" ❤️💫#SonakshiSinha_Weds_ZaheerIqbal #SaiKetanRao#SonakshiSinha #ZaheerIqbal pic.twitter.com/UA2ou5WxHn— 𝐊𝐡𝐚𝐧 𓅋 (@Itsmesany_) June 23, 2024 చదవండి: కల్కి 2898 ఏడీ.. కారులో కూర్చొని సినిమా చూసేయొచ్చు! -
బనారస్ చీరలో బాలీవుడ్ బ్యూటీ రిసెప్షన్.. ధరెంతంటే?
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. మనసారా ప్రేమించిన జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ఇరుకుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఆదివారం(జూన్ 23న) ఈ రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. ఈ పెళ్లి సింపుల్‌గా చేసినా రిసెప్షన్ గ్రాండ్‌గా నిర్వహించారు.సోనాక్షి హంగూఆర్భాటాలకు వెళ్లకుండా తల్లి పెళ్లినాటి చికంకారీ చీరను, నగలను తన వివాహానికి ధరించింది. అమ్మ పెళ్లి చీరలో మెరిసిన ఈ బ్యూటీ రిసెప్షన్‌కు మాత్రం సింధూరం రంగులో ఉన్న బనారస్ పట్టు చీరను ఎంచుకుంది.చాంద్ బుట్టా, జరీ బార్డర్ చీరకే ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. ఈ ఎర్ర చీర ఖరీదు రూ.79,800 అని తెలుస్తోంది. ఈ చీరకు మ్యాచింగ్‌గా మామూలు రెడ్ జాకెట్ ధరించింది. జడ కొప్పు వేసుకుని మల్లెపూలు పెట్టుకుంది. నుదుటన సింధూరంతో సోనాక్షి ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. రిసెప్షన్లో భర్తతో కలిసి డ్యాన్స్ చేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) View this post on Instagram A post shared by Star Style Story 🦋 (@starstylestory) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona)చదవండి: పవన్‌తో భేటీ కానున్న టాలీవుడ్ నిర్మాతలు.. అది అసలు విషయం -
నటి సోనాక్షి సిన్హా వివాహం.. ఫొటోలు వైరల్
-
ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడింది. ఏడేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట ముంబయిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోనాక్షి తన అభిమానులతో పంచుకున్నారు. తన జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోతుందని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా సోనాక్షిని చేతిని ఇక్బాల్ ముద్దాడుతున్న ఫోటోను పంచుకున్నారు. ఇది చూసిన అభిమానులు, సినీతారలు సోనాక్షికి అభినందనలు చెబుతున్నారు.సోనాక్షి తన ఇన్‌స్టాలో రాస్తూ.. " సరిగ్గా ఏడేళ్ల క్రితం (23.06.2017) ఇదే రోజున మేము ప్రేమలో పడ్డాం. ఈ రోజు ఆ ప్రేమ అన్ని సవాళ్లను దాటి విజయం సాధించాం. ఇది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఈ క్షణం. మా ఇద్దరి కుటుంబాలు, దేవుళ్ల ఆశీర్వాదంతో మేము ఇప్పుడు భార్యాభర్తలం అయ్యాం. ఇక్కడ నుంచి ఎప్పటికీ ఒకరికొకరు ప్రేమతో పాటు అన్ని విషయాలు కలిసికట్టుగా ఉంటాం.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. వీరిద్దరు 2022లో విడుదలైన డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. సోనాక్షి ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన హీరామండి వెబ్ సిరీస్‌లో మెప్పించింది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
హీరోయిన్ సోనాక్షిపెళ్లికి రెడీ,మెహెందీ ఫోటోలు వైరల్
-
పెళ్లికి స్టార్ హీరోయిన్ రెడీ.. మెహందీ ఫోటో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతోంది. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్‌ను ప్రేమ వివాహం చేసుకోబోతుంది. రేపే(జూన్ 23) వీరి పెళ్లి జరుగుతుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, పెళ్లి గురించి ఈ జంట ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. రహస్యంగానే పెళ్లి పనులు షూరు చేశారు. తాజాగా ముంబైలోని సోనాక్షి ఇంట మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలా ప్రేమలో పడి.. ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో సోనాక్షి, ఇక్బాల్ జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే తమ ప్రేమ విషయాన్ని మాత్రం బహిరంగంగా ప్రకటించాలేదు. బాలీవుడ్లో వార్తలు వచ్చిన స్పందించకపోవడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం అందరికి తెలిసింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు ఇటీవల తరచు వినిపించాయి. కానీ సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా మాత్రం...తన కూతురు ప్రేమ, పెళ్లి గురించి తెలియదని చెప్పడంతో అంతా షాకయ్యారు. ఈ పెళ్లి అతనికి ఇష్టంలేదనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇటీవల కాబోయే అల్లుడుని హత్తుకొని ఫోటో దిగి.. తమ మధ్య ఎలాంటి విభేధాలు లేవని చెప్పకనే చెప్పారు. అంతేకాదు తన ఒక్కగానొక్క కుమార్తె పెళ్లినే తానే దగ్గరుండి ఘనంగా చేస్తానని ప్రకటించాడు. View this post on Instagram A post shared by Prachi Mishra Raghavendra (@mishraprachi) -
నా ఏకైక కుమార్తె పెళ్లి.. మీకు అనవసరం: హీరోయిన్ తండ్రి
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవల హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెళ్లికి రెడీ అయిపోయింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడనుంది. ఈనెల 23 ముంబయిలోని బాస్టియన్‌లో ఈ జంట ఒక్కటి కానుంది. చాలా ఏళ్లుగా వీరిద్దరు సీక్రెట్‌గా డేటింగ్లో ఉన్నారు. అయితే గతంలోనే సోనాక్షి పెళ్లి గురించి తమకేలాంటి సమాచారం లేదని ఆమె తండ్రి శతృఘ్న సిన్హా అన్నారు. దీంతో ఆయన కూతురి పెళ్లికి వెళ్లడం లేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఆయన తనపై వచ్చిన వార్తలను ఖండించారు. తన కూతురి వివాహానికి వెళ్తున్నట్లు తెలిపారు. ఇది మీకు సంబంధం లేని విషయం.. మీ పని మీరు చేసుకుంటే మంచిదని హితవు పలికారు.శతృఘ్న సిన్హా మాట్లాడుతూ..' సోనాక్షి నా ఏకైక కుమార్తె. ఆమె అంటే నాకు పిచ్చి ప్రేమ. నేనే తన బలం అని చాలాసార్లు చెప్పింది. తప్పకుండా తన పెళ్లికి వెళ్తాను' అని అన్నారు. అయతే మరోవైపు ఆమె తల్లి పూనమ్ సిన్హా, ఆమె సోదరుడు లవ్ సిన్హా ఈ పెళ్లికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాలోను సోనాక్షి సన్హాను అన్ ఫాలో చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. కాగా.. ప్రస్తుతం సోనాక్షి.. తన కాబోయే భర్త కుటుంబంతోనే ఉంది. -
మరికొద్ది రోజుల్లో పెళ్లి.. ప్రియుడి ఇంట్లో ప్రత్యక్షమైన హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ ఇటీవలే 37వ పడిలోకి అడుగుపెట్టింది. ఇంతకాలంగా కెరీర్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది మాత్రం పర్సనల్ లైఫ్‌పై శ్రద్ధ పెట్టింది. సింగిల్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టి మ్యారీడ్ లైఫ్‌కు వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతోంది.వారం రోజుల్లో పెళ్లిఈ నెల 23న ప్రియుడు, నటుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మేరకు ఓ వెడ్డింగ్ కార్డ్ కూడా నెట్టింట వైరలయింది. ఇప్పటివరకు రూమర్డ్ లవ్ బర్డ్స్‌లా ఉన్నాం. ఇకమీద భార్యాభర్తలుగా మారబోతున్నాం. జూన్ 23న రోజు మీకు ఏ పని ఉన్నా దాన్ని పక్కన పెట్టి మా పెళ్లి వేడుకకు వచ్చేయండి అని ఇన్విటేషన్ కార్డులో రాసుకొచ్చారు.ఫాదర్స్‌డే.. ప్రియుడి ఇంట్లోఆదివారం (జూన్ 16) ఫాదర్స్ డే సందర్భంగా జహీర్ ఇక్బాల్ సోదరి, సెలబ్రిటీ స్టైలిస్ట్ సనం రతంసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేసింది. ఇందులో జహీర్ తన కుటుంబంతో కలిసి ఫోటోకు పోజిచ్చాడు. ఆ ఫోటోలో సోనాక్షి సిన్హ కూడా ఉండటం విశేషం. ఈ ఒక్క పిక్‌తో వీళ్ల పెళ్లి నిజమేనని ఖరారైపోయింది.చదవండి: నా భర్త ఫెయిల్యూర్ హీరో కాదు: వితికా షెరు -
నా కూతురి పెళ్లి గురించి తెలియదు: సోనాక్షి తండ్రి కామెంట్స్ వైరల్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈనెల 23న వివాహాబంధంలోకి అడుగుపెట్టనుంది. తన ప్రియుడు, నటుడైన జహీర్ ఇక్బాల్‌తో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. ముంబయిలో జరిగనున్న వీరి వివాహానికి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. సోనాక్షి పెళ్లి వార్తల నేపథ్యంలో తాజాగా ఆమె తండ్రి, నటుడు శత్రుఘ్న సిన్హా చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. తన కూతురు సోనాక్షి పెళ్లి గురించి తనకు ఎలాంటి విషయం తెలియదని పేర్కొన్నారు. సోనాక్షి, జహీర్‌ల వివాహం గురించి తనకు తెలియదని.. అయితే వారి బంధానికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. పెళ్లి విషయం నాకు తెలిసినప్పుడు ఆ జంటను ఆశీర్వదిస్తానని శత్రుఘ్న సిన్హా అన్నారు.శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ.."నేను ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నా. నా కుమార్తె పెళ్లి గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. తన పెళ్లి గురించి నాతో ఏం చెప్పలేదు. నేను కూడా మీడియాలో చదివి మాత్రమే తెలుసుకున్నా. ఒకవేళ తాను మాకు చెబితే నేను, నా భార్య ఆశీస్సులు అందిస్తాం. మేము కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాం. తనకు స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంది. ఈ రోజుల్లో చాలామంది పెళ్లికి తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడం లేదు.' అని చెప్పారు.కాగా.. సోనాక్షి, జహీర్ చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు తమ రిలేషన్ గురించి సోషల్ మీడియా ద్వారా ఎప్పుటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. కాగా.. సోనాక్షి ఇటీవలే సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సోనాక్షి, జహీర్ 2022లో వచ్చిన డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో కలిసి నటించారు. -
పెళ్లి చేసుకోబోతున్న హీరామండి నటి.. వరుడు ఎవరంటే?
బాలీవుడ్ భామ, హీరామండి నటి సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. నటుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నారు. ముంబయిలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. కాగా..కొన్నేళ్లుగా సోనాక్షి, జహీర్ డేటింగ్లో ఉన్నారు. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పకుండా జాగ్రత్తపడ్డారు.ఇటీవల సోనాక్షి సిన్హా బర్త్ డే సందర్భంగా ప్రియుడు జహీర్ ఇక్బాల్ విషెస్ తెలిపారు. ఇన్‌స్టా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లికి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో హాజరు కానున్నారు. వీరితో పాటు హీరామాండి నటీనటులను కూడా వివాహానికి ఆహ్వానించారు. కాగా.. సోనాక్షి సిన్హా చివరిసారిగా సంజయ్ లీలా భాన్సాలి తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించింది. View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
మరో మహిళతో రొమాన్స్.. చాలా ఎగ్జైట్ అయ్యానన్న సోనాక్షి
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం 1920 నుంచి 1940 ల మధ్య కాలంలో లాహోర్‌లో రెడ్‌లైట్ ప్రాంతంగా పేరున్న హీరామండిలోని వేశ్యల జీవితాల నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు భన్సాలీ. (చదవండి: హీరామండి రివ్యూ)మనీషా కోయిరాలా , అదితిరావ్ హైదరీ, సోనాక్షి సిన్హా , ఫర్ధీన్ ఖాన్ లాంటి స్టార్స్ ఇందులో నటించారు. ప్రతి ఒక్కరు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సోనాక్షి సిన్హా పోషించిన ఫరీదాన్ పాత్ర వెబ్ సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ పాత్ర పోషించినందుకుగాను సోనాక్షిపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే కొంతమంది మాత్రం ఆమె పాత్రను తప్పుపట్టారు. దానికి కారణం ఆమె మరో మహిళతో కలిసి శృంగారంలో పాల్గొనడమే. ఆ ఇంటిమేట్ సీన్స్, దానికి గల కారణం సరిగ్గా చూపించలేదంటూ కొంతమంది విమర్శించారు. తాజాగా దీనిపై సోనాక్షి క్లారిటీ ఇచ్చింది. ఫరీదాన్ అనే పాత్ర స్వలింగ సంపర్కురాలు అని.. అందుకే ఆమె మరో మహిళతో రొమాన్స్ చేసిందని చెప్పుకొచ్చింది. ‘భన్సాలీ నాకు కథ చెప్పినప్పుడే ఫరీదాన్ పాత్ర గురించి పూర్తిగా వివరించాడు. కథ విని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇందులో నేను స్కలింగ సంపర్కురాలు పాత్ర పోషించాను. అందుకే అలాంటి సీన్స్ ఉన్నాయి’ అని సోనాక్షి చెప్పుకొచ్చింది.అలాగే ఇందులో నటుడు ఇంద్రేష్ మాలిక్‌తో కలిసి సోనాక్షి ఇంటిమేట్ సీన్స్‌లో నటించింది. ఈ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అసౌకర్యానికి గురయ్యాయని, సోనాక్షినే తనకు ధైర్యం చెప్పి,సపోర్ట్ చేసిందని ఓ ఇంటర్వ్యూలో ఇంద్రేష్ చెప్పాడు. -
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
ఐస్‌లా కూల్ లుక్‌తో హాట్ బ్యూటీ అషూరెడ్డిటైట్ ఫిట్ డ్రస్సులో మెంటలెక్కిస్తున్న రితికఓరకంట చూస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన తృప్తి దిమ్రితెగ కష్టపడుతున్న సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్వంగి మరీ అందాల విందు చేస్తున్న అనన్య పాండేబుక్ చదువుతూ వయ్యారాలు ఒలకబోస్తున్న మాళవిక View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) -
దుమ్మురేపుతున్న ‘హీరామండి’.. భన్సాలీకి భారీ రెమ్యునరేషన్?
బాలీవుడ్లో భారీ చిత్రాలకు కేరాఫ్ సంజయ్ లీలా భన్సాలీ. ఆయన సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. ఎంత భారీగా ఖర్చు చేస్తాడో అంతకు మించిన కలెక్షన్స్‌ను రాబడతాడు. అందుకు ఆయన తెరెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’ చిత్రాలే నిదర్శనం. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫిక్స్‌లో ఈ భారీ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించాడు భన్సాలీ. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల లాంటి భారీ తారాగణంతో పిరియాడిక్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించాడు.(చదవండి: 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ) స్వాతంత్య్రానికి పూర్వం ‘హీరామండి’ వేశ్యా వాటికలో చోటు చేసుకున్న పలు సంఘటనల ఆధారంగా తెరక్కించిన ఈ వెబ్ సీరిస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకెళ్తోంది. భన్సాలీ మేకింగ్‌పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం భన్సాలీ చాలా కాలంపాటు కష్టపడ్డారు. అందుకు తగ్గట్టే నెట్‌ఫ్లిక్స్ భారీ రెమ్యునేరేషన్ ఇచ్చిందట. ఈ వెబ్ సిరీస్ కోసం భన్సాలీ దాదాపు రూ. 70 కోట్ల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన ఆరుగురు హీరోయిన్లకు కూడా భారీగానే రెమ్యునరేషన్ అందింట. ఈ సిరీస్‌లో ఫరిదాన్ పాత్రను పోషించిన సోనాక్షి సిన్హాకు అత్యధికంగా రూ. 2 కోట్ల పారితోషికంగా అప్పగించిందట నెట్ఫిక్స్. అలాగే మల్లికా జాన్ పాత్రలో నటించిన మనిషా కొయిరాలాకి కోటి రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మరో కీలక పాత్రను అదితిరావు హైదరి పోషించింది. ఇందుకుగాను ఆమె రూ. కోటిన్నర వరకు తీసుకుందట. అలాగే లజ్జోగా నటించిన రిచా చంద్దా రూ. 1 కోటి, వహిదాగా నటించిన సంజీదా షేక్ రూ. 40 లక్షలు, ఆలంజేబుగా నటించిన షర్మిన్ సెగల్ రూ. 35 లక్షలు పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
Sonakshi Sinha Photos: వెల్వెట్ డ్రెస్‌లో అందంగా.. సోనాక్షి (ఫొటోలు)
-
అజంతా శిల్పంలా మెరిసిపోతున్న సోనాక్షి సిన్హా (ఫొటోలు)
-
అభిమానులతో గైటీ గెలాక్సీలో సందడి చేసిన సోనాక్షి సిన్హా (ఫోటోలు)
-
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
'స్కంద' బ్యూటీ వయ్యారాలు.. లుక్ మార్చిన సోనాక్షి
క్యూట్ పోజుల్లో 'అమిగోస్' బ్యూటీ ఆషిక ఒంపుసొంపులతో కవ్విస్తున్న 'స్కంద' హీరోయిన్ జైలర్ పాటకు స్టెప్పులేసిన అషూరెడ్డి రోజురోజుకీ మరింత అందంగా మీనాక్షి చౌదరి డ్రస్‌తో మెరిసిపోతున్న హీరోయిన్ అమీ జాక్సన్ కలర్‌ఫుల్ చిలకలా జిగేలుమంటున్న సోనాక్షి సిన్హా View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసిన దబాంగ్ బ్యూటీ.. ఎన్ని కోట్లంటే?
దబాంగ్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తొలి చిత్రంతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా గారాల పట్టిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ దహాద్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. సోనాక్షికి ఇది తొలి వెబ్ సిరీస్. ఇందులో అంజలి భాటి అనే పోలీసు పాత్రలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఈ దబాంగ్ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త బీటౌన్‌లో వినిపిస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి!) సోనాక్షి సిన్హా ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. బాంద్రా ప్రాంతంలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం సముద్ర పక్కనే ఉండడంతో సినీ ప్రముఖులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. సోనాక్షి అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయడానికి దాదాపు రూ. 11 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. బాంద్రాలోని ఆరియాట్ భవనంలో ఓ లగ్జరీ ఫ్లాట్ కోసం రూ.55 లక్షల విలువైన స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించింది. ఈ ఏడాది ఆగస్టులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. అపార్ట్మెంట్ సౌకర్యాలు అపార్ట్మెంట్లో నాలుగు కార్లకు పార్కింగ్ సౌకర్యం, లాబీతో పాటు ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ కూడా ఉంది. 2020లో కూడా రూ. 14 కోట్లకు బాంద్రాలో విలాసవంతమైన ఓ ఫ్లాట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సోనాక్షి రాబోయే సినిమాలు సోనాక్షి చివరిసారిగా విజయ్ వర్మ, గుల్షన్ దేవయ్య కలిసి నటించిన వెబ్ సిరీస్ దహాద్లో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్‌లో నటించనుంది. దీనికి ఆమె సోదరుడు కుష్ సిన్హా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హీరామండిలో సోనాక్షి కూడా కీలక పాత్రలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
అదిరిపోయే అందాలతో మెస్మరైజ్ చేస్తున్న సోనాక్షి సిన్హా (ఫొటోలు)
-
వేశ్యల జీవిత కథ ఆధారంగా హీరామండిలో..
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘హీరామండి’. మనీషా కొయిరాల, సోనాక్షీ సిన్హా, అదితీ రావ్ హైదరీ, రిచా చద్దా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ గ్లింప్స్‌ను శనివారం విడుదల చేశారు. లాహోర్ బ్యాక్‌డ్రాప్‌లో ఒకప్పటి వేశ్యల జీవితాల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. త్వరలో స్ట్రీమింగ్ కానుంది. -
ఒకే ఫ్రేంలో అందాల తారలు.. కనుల పండుగగా హీరామండి ఫస్ట్‌లుక్
బాలీవుడ్లో దిగ్గజ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. వాస్తవిక కథలను, హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్టా. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, దేవదాస్, ‘బాజీరావ్ మస్తానీ’వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను కళ్లకు కట్టినట్లుగా ప్రేక్షకులకు అందించారు. ఇక ఆయన ఓ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పలువురు అగ్ర నటిమణులతో హీరామండి అనే వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున ఈ సిరీస్ వేశ్యల కథ నేపథ్యంలో కొనసాగనున్నట్టు తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సిరీస్‌ను నుంచి అప్డేట్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ క్వీన్స్ గెటప్‌లలో రాయల్ లుక్‌లో కనిపించారు. అందమైన తారలంతా ఒకే ఫ్రేంలో రాయల్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ అంత కనుల పండుగా చేసుకుంటున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. కాగా స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను అంశాలుగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. Another time, another era, another magical world created by Sanjay Leela Bhansali that we can’t wait to be a part of. Here is a glimpse into the beautiful world of #Heeramandi 💫 Coming soon! pic.twitter.com/tv729JHXOE — Netflix India (@NetflixIndia) February 18, 2023 -
అందాలు ఆరబోస్తున్న బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా (ఫొటోలు)
-
హ్యూమా ఖురేషీతో కలిసి చిందేసిన శిఖర్ ధవన్
దక్షిణాఫ్రికాతో జరగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శిఖర్ ధవన్ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. టీ-సిరీస్ సంస్థ నిర్మిస్తున్న డబుల్ ఎక్సెల్ సినిమాతో గబ్బర్ సినిమాల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. View this post on Instagram A post shared by Huma Qureshi (@iamhumaq) చిత్ర కధానాయికల్లో ఒకరైన హ్యూమా ఖురేషీ.. గబ్బర్‌తో కలిసి రొమాంటిక్ డ్యాన్స్ చేస్తున్న సీన్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. క్యాట్ ఈజ్ ఔట్ ఆఫ్ ది బ్యాగ్... ఫైనల్లీ అంటూ శిఖర్ ధవన్‌ను ట్యాగ్ చేస్తూ క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ క్రికెట్ అభిమానులతో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. When Rajshri from Meerut and Saira from Delhi found each other, it was time for double trouble. Be prepared for double the fun. Double the excitement. Double the entertainment. 😍#Double XL in cinemas near you on 4th November 2022. #baatmeinWAZANhai pic.twitter.com/8SRbfxo6wI — Huma Qureshi (@humasqureshi) October 10, 2022 సినిమా విషయానికొస్తే.. సత్రమ్ రమణి దర్శకత్వంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న డబుల్ ఎక్సెల్ చిత్రం అధిక బరువు అమ్మాయిలు ఎదుర్కొనే సమస్యల ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులు కాగా.. గబ్బర్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలోని పాత్రల కోసం హ్యూమా, సోనాక్షి భారీగా బరువు పెరిగారు. డబుల్ ఎక్సెల్ తెలుగులో ఆనుష్క నటించిన సైజ్ జీరోకు దగ్గరగా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. -
ముద్దు వద్దు.. ఆ హీరోలతో మాత్రమే నటిస్తా: స్టార్ హీరోయిన్ల డిమాండ్
క్రియేటివ్ ఫీల్డ్‌లోని క్రేజీనెస్ ఎంత హైలో ఉంటుందో.. ఆ రంగాన్ని ఏలుతున్న సెలెబ్రిటీల డిమాండ్స్ కూడా అంతే హెచ్చుగా ఉంటాయి. స్క్రీన్ మీద స్క్రిప్ట్‌ను.. సెట్స్‌లో ప్రొడ్యూసర్స్నూ అంతే బ్యాలెన్స్డ్గా డిమాండ్ చేస్తూంటారు. ఆ జాబితాలో సోనాక్షీ సిన్హా, కరీనా కపూర్ ఉన్నారు.. దబాంగ్ నాయిక సోనాక్షీ సిన్హా.. వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తాను సినిమాల్లోకి వచ్చేముందే ఓ నిర్ణయం తీసుకుందట.. ఎంత అద్భుతమైన సినిమా అవనీ.. ఎంతలా స్క్రిప్ట్ డిమాండ్ చేయనీ.. ముద్దు సన్నివేశంలో నటించకూడదని. తన దగ్గరకు సినిమా ఆఫర్లతో వచ్చిన నిర్మాత, దర్శకులు అందరికీ ఆ నిర్ణయాన్ని చెప్పి.. ముద్దు సన్నివేశాలు లేకుండా ముందే జాగ్రత్తపడుతుందట. ఇప్పటి వరకైతే ఇలా సాగుతోంది.. మున్ముందు ముద్దు డిమాండ్ చేస్తే సినిమా వద్దనుకుంటుందో.. తన నిర్ణయాన్ని మూట కడుతుందో తెలీదు అంటారు బాలీవుడ్ వర్గీయులు. రాజ్‌కపూర్ మనవరాలు అనే ప్రివిలేజ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా.. తన నటనాకౌశలాన్ని నిరూపించుకుంటూ కొనసాగుతున్న నటి కరీనా కపూర్. తమ సినిమాల్లో కథానాయికగా కరీనాయే కావాలి అని హీరోలు పట్టుబట్టే స్థాయికి రాగానే తానూ ఓ డిమాండ్ లిస్ట్‌ను ప్రొడ్యూసర్స్‌కు పంపడం మొదలుపెట్టింది కరీనా. ‘ఏ గ్రేడ్ ఆర్టిస్ట్‌ల సరసనే నటిస్తా.. బి గ్రేడ్ ఆర్టిస్ట్‌ల సరసన నటించను. సో నన్ను తమ సినిమాల్లో హీరోయిన్గా కావాలి అనుకుంటున్న హీరోల రేంజ్ చూసుకున్నాకే నాకు చెప్పండి’ అంటూ. దాంతో మంచి మంచి సినిమాలెన్నింటిలోనో నటించే చాన్స్‌ను కోల్పోయిందట కరీనా. అయినా నో రిగ్రెట్స్.. గ్రేడ్ ఓన్లీ మ్యాటర్స్ అంటూ ముందుకెళ్లిపోతోంది ఇప్పటికీ! చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే మా నాన్న కల నిజం అయినందుకు హ్యాపీ: కేతికా శర్మ -
Sonakshi Sinha: నా బ్యూటీ సీక్రెట్ అదే! ఇలా చేస్తే మచ్చలు, మొటిమలు మాయం!
కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ఆరంభించింది సోనాక్షి సిన్హా. మేరా దిల్ లేకే దేఖోతో సినిమాకు డిజైనర్‌గా పనిచేసింది. ఇక ‘దబాంగ్’ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ స్టార్ కిడ్. అందం, అభినయంతో ఆకట్టుకుని తొలి సినిమాకే ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది. ఇక సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తున్న 35 ఏళ్ల సొనాక్షి తన సౌందర్యానికి అమ్మ చెప్పిన సహజమైన చిట్కాలే కారణం అంటోంది. నా బ్యూటీ సీక్రెట్ అదే! ‘‘నా చిన్నప్పుడు చూసేదాన్ని అమ్మ తన మొహానికి అలోవెరా రాసుకోవడం. ఆ ఆకు జిగురును అలా ఎందుకు రాసుకుంటుందో అప్పుడు అర్థం కాలేదు కానీ సినిమాల్లోకి వచ్చాక అర్థమైంది. ప్లస్ ఆమ్మ గ్లోయింగ్ స్కిన్ రహస్యమేంటో కూడా తెలిసింది. నా బ్యూటీ సీక్రెట్ కూడా అదే. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా రోజుకు రెండు సార్లు మొహానికి అలోవెరా రాసుకుంటాను. అప్లయ్ చేసుకున్నాక ఇరవై నిమిషాలకు చల్లటి నీళ్లతో మొహం కడుక్కోవాలి. ఈ అలవాటును దినచర్యలో భాగం చేసుకుంటే మొటిమలు, మచ్చలు, ట్యాన్, పిగ్మెంటేషన్ ఎట్సెట్రా జీవితంలో దరిచేరవు’’ అని చెప్పింది సోనాక్షి సిన్హా. చదవండి: Actress Poorna: ‘పర్ఫెక్ట్ బ్రాండ్’... పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు! ప్రత్యేకత ఏమిటంటే! Radhika Madan: నా చర్మ సౌందర్య రహస్యం ఇదే.. వారానికోసారి ఇలా చేశారంటే.. -
సోదరుడి దర్శకత్వంలో సోనాక్షీ సిన్హా కొత్త చిత్రం
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘నిఖితా రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్నెస్’ అనే టైటిల్ ఖరారు చేశారు. పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కీలక పాత్రలు షోషించనున్నారు. ఈ సినిమాకు సోనాక్షీ సిన్హా సోదరుడు ఖుష్ సిన్హా దర్శకత్వం వహించనున్నారు. ఖుష్ సిన్హాకు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘‘సోనాక్షీ సిన్హా మంచి ప్రతిభావంతురాలు. నటిగా ఆమె ఎదుగుదలను చూస్తూ పెరిగాను. ఇప్పుడు సోనాక్షీ కెరీర్లో నా వంతు భాగస్వామ్యం ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు ఖుష్ సిన్హా. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
నా పెళ్లి గురించి మీకెందుకు అంత తొందర?: సోనాక్షి
అమ్మాయిలకు తరచూ ఎదురయ్యే ప్రశ్న పెళ్లెప్పుడు?. అందులోనూ సెలబ్రిటీలు ఎవరితోనైనా క్లోజ్‌గా కనిపించారంటే చాలు త్వరలోనే సదరు హీరోయిన్ పెళ్లి అంటూ కథనాలు రాసేస్తుంటారు. అంతేకాదు కథానాయికను సైతం పదేపదే ఇదే ప్రశ్న అడుగుతూ విసిగిస్తుంటారు. ఇదే విషయంలో దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ చిర్రెత్తిపోయింది. అసలూ లేదు, కొసరూ లేదు.. అప్పుడే పెళ్లంటున్నారేంటని విరుచుకుపడింది. ఇంట్లో వాళ్ల కన్నా జనాలకే తన పెళ్లి మీద ఎక్కువ ఆసక్తి ఉందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి తన జీవితాన్ని ప్రపంచానితో పంచుకునేందుకు రెడీగా లేనని తెలిపింది. తానెప్పుడూ సినిమాల గురించే మాట్లాడినా, ఎదుటివారు మాత్రం వ్యక్తిగత విషయాలనే ఆరా తీస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పైగా అక్కడితో ఆగకుండా ఎవరికి వారే ఏదేదో ఊహించుకుని ఇష్టమొచ్చిన రూమర్లు వ్యాప్తి చేస్తారని చెప్పుకొచ్చింది. కాగా సోనాక్షి ప్రస్తుతం కాకుడ, దహడ్(ఓటీటీ డెబ్యూ) సినిమాలతో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Sushant Divgikr/ Rani KoHEnur (@sushantdivgikr) చదవండి: ప్రియుడిని పెళ్లాడిన నటి, వెడ్డింగ్ ఫొటోలపై ఫ్యాన్స్ అసంతృప్తి! ఆ వేటను లైఫ్‌లో మరచిపోలేనంటున్న హీరోయిన్ -
తమ రిలేషన్‌ను అధికారికంగా ప్రకటించిన లవ్‌బర్డ్స్
గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, హీరో జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను కొట్టిపారేసింది ఈ జంట. అయినా వీరిద్దరి రిలేషన్‌పై రూమార్స్ వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా చక్కర్లు కొట్టడం, విందులు, వినోదాలకు హజరవ్వడమే. అంతేకాదు ఇద్దరు క్లోజ్‌గా దిగిన ఫొటోలను కూడా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వారు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ ఫిక్సయిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల సోనాక్షి బర్త్‌డే సందర్భంగా తమ సీక్రెట్ రిలేషన్‌ను అఫిషీయల్ చేసింది ఈ జంట. చదవండి: ‘విక్రమ్’.. 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఈ సందర్భంగా సోనాక్షితో కలిసి విమానంలో పయనిస్తున్న ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసిన ఇక్బాల్ ఆమెకు పబ్లిక్‌గా లవ్యూ చెప్పాడు. ‘హ్యాపీ బర్త్ డే. నన్ను చంపనందుకు థాంక్యూ. ఐ లవ్యూ’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీనిపై సోనాక్షి సైతం స్పందించింది. ‘ఐ లవ్యూ. ఇప్పుడు నేను నిన్ను చంపడానికి వస్తున్నా’ అని అతడి పోస్ట్‌పై కామెంట్ చేసింది. దీంతో వీరిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నారని స్పష్టమైంది. ఇది చూసిన వీరి ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్బాల్ పోస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పదించారు. కాగా ఇటీవల సోనాక్షి చేతికి డైమండ్ రింగ్ పెట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ తన డ్రీమ్ నిజమైందంటూ క్యాప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని: బాలీవుడ్ డైరెక్టర్ అంతేకాదు ఈ ఫొటో పక్కనే ఉన్న వ్యక్తి కనిపించకుండ జాగ్రత్త పడింది. దీంతో ఇక్బాల్‌కు తనకు నిశ్చితార్థమైందని ఒక్కసారిగా వార్తలు గుప్పమనగా.. మిమ్మల్ని ఫూల్ చేశానంటూ మరో పోస్ట్ చేసింది సోనాక్షి. అది రింగ్ కాదని, తన కొత్త బ్రాండ్ నెయిల్ పాలిష్‌ను ప్రమోట్ చేశానంటూ నెటిజన్లకు షాకిచ్చింది. దబాంగ్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షికి పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె ఏడాది ఒక సినిమా చేస్తూ వస్తోంది. ఇక జహీర్ ఇక్బాల్ 2019లో నోట్‌బుక్ మూవీతో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ వెంటనే డబుల్ ఎక్సెల్ మూవీ చేశాడు. ఇందులో సోనాక్షితో జతకట్టాడు. ఈ మూవీ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
ఎంగేజ్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హా
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలు షేర్ చేస్తూ తన వేలికి ఉన్న డైమండ్ రింగ్ హైలెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలకు ‘ఇది నాకు బిగ్ డే.. ఈరోజు నాకున్న పెద్ద కల నెరవేరబోతోంది, దాన్ని మీతో పంచుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చదవండి: బాలీవుడ్‌పై మహేశ్ కామెంట్స్, స్పందించిన బోనీ కపూర్, ఆర్జీవీ అంతేకాదు ఈ ఫొటోలో ఓ వ్యక్తి పక్కనే నిలుచుని అతడు కనపబడకుండా జాగ్రత్త పడింది. దీంతో సోనాక్షి సింగిల్ లైప్ ఫుల్స్టాప్ పెట్టి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబతోందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అదే నిజమనుకున్నారు నెటిజన్లు, ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా తన ఎంగేజ్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది సోనాక్షి. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెడుతూ.. మిమ్మల్ని బాగా ఆటపిట్టించానని అనుకుంటున్నాను అంటూ కామెంట్ చేసింది. చదవండి: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది: అల్లు అరవింద్ ‘ఒకే ఒకే.. నేను మిమ్మల్ని బాగా ఆటపట్టించానని అనుకుంటున్నా. నేను ఒక్క అబద్దం కూడా చెప్పకుండ మీకు ఎన్నో క్లూలు ఇచ్చాను. అవును నేను చెప్పినట్లుగా ఆ రోజు నాకు బిగ్డే.. ఎందుకంటే నా సొంత నెయిల్ పాలిష్ బ్రాండ్ సోయిజీని ప్రారంభించే రోజు నాకు గొప్ప రోజే. అందమైన నెయిల్స్ కోసం ప్రతి అమ్మాయికి ఇదే చివరి గమ్మం అవుతుంది. నేను వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి నా బిగ్గేస్ట్ డ్రీమ్‌ను నిజం చేసుకున్న. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా ఉండలేకపోయాను. సోయిజీ నెయిల్ పాలిష్ వేసుకున్న పిక్స్‌తో చివరిగా నా ప్రేమను పంచుకున్న. మీరు ఏమనుకున్నారు? హాహ్హాహ్హా.. లవ్ యూ గాయ్స్! మీరు ఇచ్చిన సపోర్ట్‌కు థ్యాంక్స్’ అని రాసుకొచ్చింది. ఇక సోనాక్షి తీరుకు కొంతమంది నెటిజన్లు మండిపడుతుండగా మరికొందరు కొత్తగా బిజినెస్‌లోకి అడుగుపెట్టిన తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
బాలీవుడ్ హీరోయిన్ నిశ్చితార్థం!? ఫొటోలు వైరల్
'దబాంగ్' బ్యూటీ సోనాక్షి సిన్హా సింగిల్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్. సోనాక్షి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలు షేర్ చేసింది. అందులో ఆమె వేలికి ఉన్న డైమండ్ రింగ్‌ను చూపిస్తూ మురిసిపోయింది. అంతేకాదు ఓ వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వుతోంది. 'ఇది నాకు బిగ్ డే.. ఈరోజు నాకున్న పెద్ద కల నెరవేరబోతోంది, దాన్ని మీతో పంచుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇది జరిగిందంటే నమ్మలేకపోతున్నాను' అని రాసుకొచ్చింది. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ కచ్చితంగా ఆమె తన పెళ్లివార్తను చెప్పబోతుందంటూ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వేలికి రింగ్‌తో పాటు తన పక్కనున్న వ్యక్తిని క్రాప్ చేసిందంటే అతడు కచ్చితంగా సోనాక్షికి కాబోయేవాడని కామెంట్లు చేస్తున్నారు. కానీ కొద్దిమంది మాత్రం ఇదేదో ప్రమోషనల్ స్టంట్ అయ్యుంటుందిలే అని తేలికగా తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే జహీర్ ఇక్బాల్, సోనాక్షి డేటింగ్ చేసుకుంటున్నారంటూ గతకొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! దీనిపై రెండురోజుల క్రితమే జహీర్ స్పందిస్తూ.. మీరేమనుకున్నా నేను పట్టించుకోను. నేను ఆమెతో ఉండటం మీకు సంతోషాన్ని కలిగిస్తే ఆనందించండి, లేదంటే దానికోసం ఆలోచించడమే మానేయండి, కానీ నేను మాత్రం ఈ విషయాన్నసలు పట్టించుకోను అని చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే అషూకి హ్యాండ్ ఇచ్చిన బాబా! ఫస్ట్ ఫైనలిస్ట్ ఇతడేనా? -
సోనాక్షి సిన్హాతో డేటింగ్‌పై స్పందించిన హీరో..
Jaheer Iqbal Reacts To Dating Rumours With Sonakshi Sinha: గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, హీరో జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లపై జహీర్ స్పందించాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమ రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ పుకార్లను పట్టించుకోనని పేర్కొన్నాడు. 'ఇదంతా జరిగి చాలా కాలం అయింది. నేను అదంతా పట్టించుకోను. మీరు ఏది అనుకుంటే అది అనుకోండి. అలాగే ఆలోచించండి. అదే మీకు మంచిది అయితే అలాగే చేయండి. నేను ఆమెతో ఉండటం మీకు సంతోషాన్ని కలిగిస్తుందా ? నన్ను క్షమించండి. దాని గురించి ఆలోచించడం మానేయండి.' అని జహీర్ తెలిపాడు. ఇంకా ఈ విషయంపై జహీర్ మాట్లాడుతూ 'ఇదంతా సినీ పరిశ్రమలో ఒక భాగం. నేను పరిశ్రమకు రాకముందే తను తెలుసు. ఈ పరిశ్రమలో నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. వారిని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను. ఇలా జరిగినప్పుడు ఎక్కువగా రాస్తారు, దానిపై పెద్దగ శ్రద్ధ పెట్టవద్దని సల్మాన్ ఖాన్ ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కాబట్టి నేను నిజంగా ఈ విషయాన్ని పట్టించుకోను.' అనిపేర్కొన్నాడు. ఇదిలా ఉంటే 2010లో 'దబాంగ్' సినిమాతో సోనాక్షి సిన్హా తెరంగేట్రం చేయగా జహీర్ ఇక్బాల్ 'నోట్‌బుక్' మూవీతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఇది చదవండి: ఆయుష్మాన్ ఖురానా, జేడీ చక్రవర్తి మధ్య హిందీ భాషపై చర్చ.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటీటీలకు తారల గ్రీన్ సిగ్నల్.. ఏకధాటిగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు
Cine Celebrities On OTT Digital Platform: కరోనా లాక్డౌన్లో ఓటీటీల హవా మొదలైంది. స్టార్స్ సైతం ఓటీటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థియేటర్స్ రీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఓటీటీ ప్రాజెక్ట్స్‌కు చాలా మంది యాక్టర్స్ పచ్చ జెండా ఊపుతూనే ఉన్నారు. తాజాగా కొందరు బాలీవుడ్ తారలు యాక్టర్స్ ‘ఓటీటీ.. మేం రెడీ’ అంటూ డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తీసిన ‘ది ఫ్యామిలీ మేన్ సీజన్ 1’ వెబ్ సిరీస్‌కి, దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’కి మంచి ఆదరణ దక్కింది. దీంతో కొందరు బాలీవుడ్ తారలు ఈ డైరెక్టర్స్‌తో వెబ్‌సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా షాహిద్ కపూర్‌తో రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే వెబ్ సిరీస్ చేశారు. రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి ఇతర లీడ్ రోల్స్ చేశారు. షాహిద్‌కు ఓటీటీలో ఇదే తొలి ప్రాజెక్ట్. ఇకపోతే వరుణ్ ధావన్ ఓటీటీ ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోని ఓ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వరుణ్ ధావన్ బర్త్ డే (ఏప్రిల్ 24) సందర్భంగా రాజ్ అండ్ డీకే సోషల్ మీడియాలో వరుణ్, సమంతల ఫొటోను షేర్ చేసి ‘యాక్షన్ ప్యాక్డ్ ఇయర్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో వరుణ్ డిజిటల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని బీ టౌన్ టాక్. అదేవిధంగా రాజ్ అండ్ డీకే డైరెక్షన్లోనే దుల్కర్ సల్మాన్ కూడా డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 1990 బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘గన్స్ అండ్ గులాబ్స్’ వెబ్ సిరీస్‌లో దుల్కర్‌తోపాటు రాజ్‌కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ లీడ్ రోల్స్ చేశారు. షూటింగ్ పూర్తయిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌పై త్వరలో ఓ క్లారిటీ రానుంది. ఇక గత ఏడాది ఆగస్టులో ఓటీటీలో రిలీజైన సిద్ధార్థ్ మల్హోత్రా ‘షేర్షా’ చిత్రానికి వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో మరో ఓటీటీ ప్రాజెక్ట్‌కి సైన్ చేశారు సిద్ధార్థ్. రోహిత్ శెట్టి డైరెక్షన్లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో తెరకెక్కుతోన్న వెబ్‌సిరీస్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. మరో బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్ సైతం ఓటీటీ బాటకే ఓటేశారు. బ్రిటీష్ పాపులర్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ఓటీటీ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ చేస్తున్నారు ఆదిత్య. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైంది. ఇందులో అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ్ల కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ప్రాజెక్ట్‌లో హృతిక్ రోషన్ నటిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా ఫైనల్‌గా ఆదిత్యారాయ్ కపూర్ రంగంలోకి దిగారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు ఆలియా భట్. టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ ఫిల్మ్‌లో ఇంగ్లీష్ యాక్టర్స్ గాల్ గాడోట్, జామీ డోర్నన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్ సోనాక్షీ సిన్హా కూడా ఓటీటీ ఫిల్మ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘ది ఫాలెన్’గా వస్తున్న ఈ వెబ్ ఫిల్మ్‌కు రీమా కాగ్తీ దర్శకురాలు. ఈ ప్రాజెక్ట్‌లో సోనాక్షి పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్‌తోనే కెరీర్‌ను స్టార్ట్ చేసే సాహసం చేశారు స్టార్ కిడ్స్ అగస్త్య నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్‌ల చిన్న కుమార్తె), సునైనా ఖాన్ (షారుక్‌ఖాన్ కుమార్తె). ‘ది ఆర్చీస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)గా తెరకెక్కుతోన్న ఈ వెబ్ ఫిల్మ్‌కు జోయా అక్తర్ దర్శకురాలు. ఆల్రెడీ ఊటీలో షూటింగ్ మొదలైంది. బాలీవుడ్‌లోని మరికొంతమంది యాక్టర్స్ ఓటీటీ బాటపడుతున్నారని లేటెస్ట్ టాక్. ఇక.. కొందరు సీనియర్ యాక్టర్స్‌లో అక్షయ్ కుమార్ ‘ది ఎండ్’ అనే భారీ ఓటీటీ ప్రాజెక్టుకి ఓకే చెప్పారు. కానీ వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ‘సేక్రెడ్ గేమ్స్’తో సైఫ్ అలీఖాన్, ‘రుద్ర’తో అజయ్ దేవగన్ వంటి సీనియర్స్ డిజిటల్ వ్యూయర్స్ ముందుకు వచ్చారు. సీనియర్ హీరోయిన్స్‌లో ‘ఆర్య’తో సుష్మితాసేన్, ‘మెంటల్‌హుడ్’తో కరిష్మా కపూర్, ‘ది ఫేమ్ గేమ్’తో మాధురీ దీక్షిత్ ఇప్పటికే డిజిటల్లోకి వచ్చేశారు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’తో శిల్పాశెట్టి, కరీనా కపూర్ (సుజోయ్ ఘోష్ దర్శకత్వంలోని సినిమా..), ‘చక్ ద ఎక్స్‌ప్రెస్’తో (మహిళా క్రికెటర్ జూలన్ గోస్వామి బయోపిక్) అనుష్కా శర్మ వంటివారు డిజిటల్ వ్యూయర్స్‌ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
హీరోయిన్ బాత్రూమ్లోకి చొరబడ్డ ఫ్యాన్.. పెళ్లి చేసుకోకుంటే చస్తానని బెదిరింపు
Sonakshi Sinha Fan Threatens Her In The Khatra Khatra Show: సల్మాన్ ఖాన్ 'దబాంగ్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి అశేష అభిమానులన్ని సంపాదించుకుంది. అయితే తాజాగా తన అభిమాని నుంచి వింత అనుభవాన్ని చవిచూసింది సోనాక్షి. 'ది ఖత్రా ఖత్రా' షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి సిన్హాకు తన ఫ్యాన్ ఒకరు తనను పెళ్లి చేసుకోమ్మని, లేకుంటే తన గొంతు కోసుకుంటానని బెదిరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వెరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సోనాక్షి సిన్హా తన వ్యానిటీ వ్యాన్‌లో ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో వాష్ రూమ్ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి 'మేడమ్ నేను మీకు పెద్ద అభిమానని. మీకోసమే రాత్రి నుంచి ఇక్కడ ఎదురుచూస్తున్నా' అని చెబుతాడు. చదవండి: నాలుగో తరగతిలో లైంగిక వేధింపులు.. ఆ దెబ్బతో మళ్లీ చూడలేదు తర్వాత సోనాక్షి సిన్హా అని పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపిస్తాడు. అనంతరం సోఫాలో కూర్చుని 'నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి.' అని అంటాడు. తర్వాత అక్కడ పరిస్థితులు అంతాగా బాగాలేనట్లు కనిపించింది. అద్దంపై లిపిస్ట్క్తో 'ఐ లవ్ యూ సోనా' అని రాశాడు. అంతేకాకుండా 'ఇది నా రక్తంతో కూడా రాయగలను' అని సోనాక్షితో ఆ అభిమాని చెబుతాడు. ఇదంతా అర్థంకానీ సోనాక్షి అదేం వద్దూ అని చేతులతో సైగ చేస్తూ చెబుతుంది. దీంతో ఆవేశానికి లైనైనా ఆ అభిమాని అక్కడున్న వస్తువులను విసిరేయడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా తన జేబులో నుంచి కత్తి తీసి 'నువ్ నన్ను పెళ్లి చేసుకోకుంటే నా గొంతు కోసుకుంటాను' అని సోనాక్షిని బెదిరిస్తాడు. దీంతో షాక్‌కు గురైన సోనాక్షి కేకలు వేయడంతో వీడియో ముగుస్తుంది. చదవండి: జిమ్ ఫొటో షేర్ చేసిన హీరో.. భార్య రియాక్షన్ ఏంటో తెలుసా ? అయితే ఈ వీడియో అంతా 'ది ఖత్రా ఖత్రా' షో ప్రచారంలో భాగంగా సోనాక్షికి తెలియకుండా తనపై ప్రాంక్ చేశారని తెలుస్తోంది. ఈ షోలో భారతీ సింగ్, హర్ష్ లింబాచియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ స్పెషల్ హోస్ట్‌గా కనువిందు చేయనున్నారు. ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా.. హ్యూమా ఖురేషీ, జహీర్ ఇక్బాల్‌తో కలిసి డబుల్ ఎక్స్ఎల్ సినిమాలో నటించనుంది. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) చదవండి: నా నటన చూసి నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్ కపూర్ -
సోనాక్షిపై నాన్ బెయిలబుల్ వారెంట్, స్పందించిన హీరోయిన్
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైందని, తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై సోనాక్షి స్పందించిన సోనాక్షి వాటిని ఖండించింది. తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు వచ్చిన కథానాల్లో ఎమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ ప్రకటన ఇచ్చింది. ‘నాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. నాపై కావాలనే అబ్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చదవండి: రాధేశ్యామ్ షూటింగ్లో ప్రభాస్‌తో గొడవ, క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే దీనిపై నా స్టెంట్మెంట్ కూడా తీసుకోలేదు. ఇది పూర్తిగా కల్పితం. ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర చేస్తున్నాడు. కాబట్టి అన్ని మీడియా హౌజ్‌లు, జర్నలిస్టులకు నా వినతి ఏమిటంటే. ఈ కల్పిత వార్తను ప్రసారం చేయవద్దు. ఒకరి వ్యక్తిగత అజెండాకు వేదిక కల్పించవద్దు. సదరు వ్యక్తి ప్రచారం కోసం, నా నుంచి డబ్బును రాబట్టేందుకు.. ఎన్నో ఏళ్లుగా నేను సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠలపై దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ అంశం మురాదాబాద్ కోర్టు పరిధిలో ఉంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. చదవండి: కండోమ్ టెస్టర్‌గా రకుల్, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే.. కోర్టు ధిక్కారం కింద సదరు వ్యక్తిపై నా న్యాయ బృందం చర్యలు తీసుకుంటుంది. కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఈ అంశంపై నా వివరణ ఇదే’ అంటూ సోనాక్షి తెలిపింది. కాగా ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న సోనాక్షి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా ఈవెంట్ నిర్వాహకుడు అడగడంతో సోనాక్షి మేనేజర్ నిరాకరించినట్లు అతడు ఆరోపించాడు. దీంతో సోనాక్షిపై కేసు నమోదైంది. -
చిక్కుల్లో సోనాక్షి సిన్హా.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా వివాదంలో చిక్కుకుంది. చీటింగ్ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఓ కార్యక్రమం కోసం యూపీకి చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రమోద్ శర్మ సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఇందుకు గాను ముందుగానే రూ. 37లక్షలు చెల్లించాడు. అయితే డబ్బులు తీసుకున్న దబాంగ్ నటి ఆ కార్యక్రమానికి మాత్రం హాజరు కాలేదు. దీంతో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని అడిగినా అందుకు సోనాక్షి మేనేజర్ తిరస్కరించాడు. ఈ విషయంపై సోనాక్షిని స్వయంగా సంప్రదించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆమెపై చీటింగ్ కేసు దాఖలు చేశాడు. కేసు విచారణ నిమిత్తం సోనాక్షి మొరాబాద్‌కు రావాల్సి ఉండగా ఆమె హాజరు కాలేదు. దీంతో స్థానిక కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. -
సల్మాన్‌తో సీక్రెట్ పెళ్లిపై స్పందించిన హీరోయిన్
దబాంగ్ జంట సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ కొన్నిరోజులుగా వార్తలు ఊదరగొడుతున్న సంగతి తెలిసిందే! కొందరు ఆకతాయిలు మార్ఫింగ్ టెక్నిక్‌తో సల్మాన్.. సోనాక్షి వేలికి ఉంగరం తొడుగుతున్నట్లు సృష్టించారు. ఇది నిజమని భ్రమపడిన చాలామంది దాన్ని సోషల్ మీడియాలో తెగ షేర్లు చేశారు. తాజాగా ఈ సీక్రెట్ పెళ్లి వార్తలపై స్పందించింది సోనాక్షి. సల్మాన్, తనకు ఉంగరం తొడుగుతున్నట్లుగా ఉన్న వైరల్ ఫొటో కింద దాన్ని నిజమని నమ్మినవాళ్లని మూర్ఖులుగా అభివర్ణించింది. చదవండి: సల్మాన్ ఖాన్ సీక్రెట్ పెళ్లి, వైరల్‌గా మారిన ఫొటోలో నిజమెంత? 'రియల్ ఫొటోకు, మార్ఫింగ్ ఫొటోకు తేడా తెలియలేనంత మూర్ఖంగా తయారయ్యారా?' అంటూనే మూడు లాఫింగ్ ఎమోజీలను తన కామెంట్‌కు జత చేసింది. దీనిపై కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతూ సోనాక్షి స్పందించకుండా ఉంటే సరిపోయేది, ఈ అటెన్షన్ కోసమే వాళ్లిదంతా చేసింది, చివరకు వాళ్లు అనుకున్నదే జరిగింది అని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో ఫైనల్‌గా సోనాక్షి క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి ఇప్పటికైనా ఈ రూమర్ వ్యాపించదు అని అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Bollywood Tashan (@bollywood_tashan) -
హీరోయిన్‌తో సల్మాన్ ఖాన్ రహస్య వివాహం, ఫొటో వైరల్!
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్, బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాక్షి సిన్హా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ ఓ ఫొటో నెట్టింట తెగ గింగిరాలు తిరుగుతోంది. ఈ ఫొటో చూసిన సల్మాన్ అభిమానులు చడీచప్పుడు లేకుండా మా హీరో పెళ్లి చేసుకోవడమేంటి? అది కూడా రహస్యంగానా? ఏదో తేడా కొడుతోందంటూ చర్చలు మొదలుపెట్టారు. అంత పెద్ద హీరో సడన్‌గా, ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా పెళ్లిపీటలెక్కేశాడంటే నమ్మబుద్ధి కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు. నిజమేంటంటే సల్మాన్ ఓ ఇంటివాడయ్యాడంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అతడింకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్గానే ఉన్నాడు. సోనాక్షితో వివాహం అంటూ వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం. ఇక ఆ ఫొటో సంగతంటారా? అది కేవలం మార్ఫింగ్ ఫొటో లేదా ఏదైనా సినిమా స్టిల్ అయ్యుంటుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. కాగా సల్మాన్, సోనాక్షి దబాంగ్ సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో 'కబీ ఈద్ కబీ దివాళి' సినిమా చేస్తున్నాడు. ఇది ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. -
పెళ్లెప్పుడు చేసుకుంటారు? అన్న ప్రశ్నకు హీరోయిన్ ఆన్సరిదే
కరోనాకు ముందు సెలబ్రిటీలు క్షణం తీరిక లేకుండా షూటింగ్‌ల వెంట తిరిగేవారు. పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా పట్టించుకునే వారే కాదు. కానీ కరోనా వచ్చాక విధించిన లాక్డౌన్ల వల్ల వారికి బోలెడంత టైం దొరికింది. ఇంకే.. ఇదే అదను అనుకున్న ఎంతోమంది తారలు బ్యాచ్‌లర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. కానీ కొందరు మాత్రం ఇప్పటికీ పెళ్లి ఊసెత్తట్లేదు. ఈ క్రమంలో ఓ నెటిజన్ బాలీవుడ్ తార సోనాక్షి సిన్హాకు పెళ్లి చేసుకోమని ఉచిత సలహా ఇవ్వగా ఆమె దానికి వ్యంగ్యంగా బదులిచ్చింది. సోనాక్షి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారడిగే ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అందులో ఓ నెటిజన్ 'సోనాక్షి మేడమ్.. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు. మరి మీవంతు ఎప్పుడొస్తుందో?' అని ప్రశ్నించాడు. దీనికి హీరోయిన్ తనదైన స్టైల్లో ఆన్సరిచ్చింది. 'అందరికీ కోవిడ్ వస్తోంది. నాక్కూడా రావాలా? ఏంటి?' అని కౌంటరిచ్చింది. -
సల్మాన్ ఖాన్ కోడలిగా హీరోయిన్ సోనాక్షి సిన్హా!
Sonakshi Sinha Wedding: ఎప్పుడూ సినిమా సినిమా అంటూ కెరీర్‌పై ఫోకస్ పెట్టే బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ మధ్య వ్యక్తిగత విషయాల మీద కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు స్టార్ జంటలు పెళ్లికి సిద్ధమవుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ తారలు రాజ్‌కుమార్ రావు-పత్రలేఖలు, అనుష్క రంజన్- ఆదిత్య సీల్ పెళ్లిపీటలెక్కగా తర్వలో విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్నారు. రణ్‌బీర్ కపూర్, అలియాభట్ కూడా త్వరలోనే షాదీ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా మరో హీరోయిన్ సోనాక్షి సిన్హ కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా సెలబ్రిటీల మేనేజర్ బంటి సచ్దేవ్తో సోనాక్షి డేటింగ్ చేస్తోందట. మూడు, నాలుగేళ్లుగా వీరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పలుమార్లు మీడియా కంట పడ్డారట! తాజాగా వీరు తమ బంధాన్ని మరోమెట్టు ఎక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక బంటి సచ్దేవ్ సల్మాన్‌కు ఎలా సన్నిహితుడంటే.. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్.. అతడి భార్య సీమాఖాన్ సోదరుడే బంటి సచ్దేవ్. కాగా సోనాక్షి.. సల్మాన్ నటించిన 'దబాంగ్' చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: ఆ జాకెట్ వేసుకున్నా వేసుకోనట్లే ఉంది, అంత అవసరమా? -
ఓర చూపుతో మతి పొగొడుత్ను ‘బంగారు బొమ్మ’ సోనాక్షి సిన్హా
-
స్కూల్ల్లోనే ప్రేమలో పడ్డాను! అతడితో 5 ఏళ్లు రిలేషన్ షిప్: హీరోయిన్
Sonakshi Sinha About Her Relationship In Schooling and College: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా స్కూల్ టైంలోనే ప్రేమలో పడ్డానని, ఆ వ్యక్తితో రిలేషన్ షిప్లో ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్న సిన్హా ముద్దుల తనయ అయినా సోనాక్షి ‘దబాంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పలు సనిమాల్లో నటించిన ఆమె నటిగా నిరూపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా రిలేషన్ షిప్లో ఉన్నారా? అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికరంగా బదులు ఇచ్చింది. చదవండి: భయపడుతూనే నటుడి బనియన్ వేసుకున్నా: ఊర్మిళ ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘స్కూల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయితో రిలేషన్ షిప్లో ఉన్నాను. అయితే అది కొద్ది రోజులకే ఎండ్ అయ్యింది. ఇక నేను 21, 22 వయసులో ఉన్నప్పుడు సీరియస్ రిలేషన్ షిప్‌ను కొనసాగించాను. ఆ వ్యక్తితో అయిదేళ్లకు పైగా రిలేషన్ షిప్లో ఉన్నాను. ప్రతి రిలేషన్ షిప్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. వయసు పెరిగే కొద్దీ కొత్త అనుభవాలు ఎదురవుతాయి. మనల్ని ప్రేమించే వ్యక్తులను వెతుక్కోవాలి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చదవండి: ‘జేమ్స్ బాండ్’ కోసం లండన్ థియేటర్ మొత్తం బుక్ చేసిన బాలీవుడ్ నిర్మాత -
అర్జున్‌కపూర్-షాహిద్‌తో సోనాక్షి బ్రేకప్ స్టోరీ
థప్పడ్ సే డర్ నహీ లగ్తా సాబ్.. ప్యార్ సే లగ్తా హై! (చెంప దెబ్బంటే భయం లేదు సర్.. ప్రేమంటేనే భయం!) డైలాగ్‌తో పాపులర్ అయిన కథానాయిక.. అర్థమైపోయి ఉంటుంది ఎవరో?! అవును.. సోనాక్షీ సిన్హా. ఈ వారం ‘మొహబ్బతే’కి నాయిక కూడా! ఆమె ప్రేమ జీవితం.. అందులో వైఫల్యం.. సాక్ష్యాధారాలతో ఎక్కడా లేవు. హిందీ, ఇంగ్లిష్ పత్రికలు, వెబ్ మీడియాలో వచ్చిన వార్తలు.. వంటి రూమర్స్‌ని కూర్చి ఇస్తున్న కథనం ఇది. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్. రాజ్‌కుమార్’ సినిమా గుర్తుందా? అందులో సోనాక్షీ సిన్హా, షాహిద్ కపూర్ హీరోహీరోయిన్లు. ఆ సెట్స్‌లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పుకారు. ‘నా జీవితంలో ఇద్దరే ఇద్దరిని ప్రాణప్రదంగా ప్రేమించాను’ అని షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ ఇద్దరిలో ఒకరు కరీనా.. ఇంకొకరు సోనాక్షీ అనే నిర్ధారణకొచ్చారు షాహీద్, సోనాక్షీ జంటను అభిమానించే కొంతమంది. ఇందుకు కారణం లేకపోలేదు. ‘కాఫీ విత్ కరణ్ షో’లో ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతిసారి షాహిద్ కపూర్ ఆ సమయంలో తను ఎవరితోనైతే రిలేషన్లో ఉన్నాడో ఆ సహచరితో వచ్చేవాడని.. అలా సెకండ్ సీజన్లో కరీనా కపూర్, థర్డ్ సీజన్లో ప్రియాంక చోప్రా, ఫోర్త్ సీజన్లో సోనాక్షీ సిన్హా, చివరకు భార్య మీరా రాజ్‌పుత్‌తో వచ్చాడని కామెంట్ చేశాడు షో హోస్ట్ కరణ్ జోహార్. ఇదే విషయమై షాహిద్‌ను అడిగాడు కూడా.. ‘నువ్వు కరీనా, ప్రియాంకతో డేట్ చేశావ్ కదా.. సోనాక్షీతో కూడా డేటింగ్లో ఉన్నావని రూమర్స్ వినిపిస్తున్నాయి’ అని. కాదని తోసిపుచ్చలేదు షాహిద్ కపూర్. అంతేకాదు ‘ఆర్. రాజ్‌కుమార్’ సెట్స్‌లో షూటింగ్ తర్వాత సోనాక్షీ, షాహిద్ సరదాగా షికారుకెళ్లేవారని, పార్టీలూ చేసుకున్నారనీ బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. దీనికి ఉదాహరణగా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ‘షాహిద్‌ను ముద్దు పెట్టుకుంటున్న సోనాక్షీ సిన్హా’ ఫొటోను చూపిస్తారు. ఇదంతా నిజమే అయితే ఆ ప్రేమ పెళ్లి వరకు ఎందుకు రాలేదో.. వాళ్లెందకు విడిపోయారో తెలియదు. కానీ వాళ్లిద్దరు మాత్రం విడివిడిగా ‘మేం మంచి స్నేహితులం.. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ’ అని చెప్తారు మీడియా ఎప్పుడు ప్రశ్నించినా! ప్యాకప్ అవగానే పార్టీలు.. హ్యాంగవుట్స్ సోనాక్షీ సిన్హా, అర్జున్ కపూర్ జంట కలసి నటించిన ‘తేవర్’ సినిమా షూటింగ్ అప్పుడే వాళ్లు ప్రేమలో పడ్డారని బాలీవుడ్ సినిమా పత్రికల కథనం. షూటింగ్ ప్యాకప్ అవగానే పార్టీలు.. హ్యాంగవుట్స్, ముంబై శివారులోని థియేటర్లలో సినిమాలకూ వెళ్లేవారట. ఆ టైమ్‌లో పాపరాజీ కెమెరాలకూ చిక్కారనీ మీడియా కవరేజ్. అయితే ‘తేవర్’ సినిమా పూర్తవడంతోనే వీళ్ల ప్రేమా ముగిసిపోయిందనీ బాలీవుడ్ మాట. ఈ ఇరువురి మనస్తత్వాల్లోని వైరుధ్యమే ఆ బ్రేకప్‌కి రీజన్ అని ఇద్దరి సన్నిహితులు చెప్తారు. సోనాక్షీది అలాంటి తత్వమే.. ‘సోనాక్షీ చాలా ఎమోషనల్. ఏ ఫీలింగ్స్‌నూ దాచుకోలేదు. బేషరతుగా ప్రేమిస్తుంది. అర్జున్ కపూర్ ఇందుకు కాస్త భిన్నం. అతను గుంభనంగా ఉంటాడు. సోనాక్షీ స్ట్రాంగ్ ఎమోషన్స్‌ను సంభాళించలేకపోయాడు’ అని ఒక సోర్స్ కామెంట్. ‘ప్రేమ విషయంలో సోనాక్షీది సాధారణ అమ్మాయిల తత్వమే. అర్జున్ చుట్టే తన ప్రపంచాన్ని అల్లుకుంది. ఇది అర్జున్ను ఊపిరాడనివ్వకుండా చేసింది. ఏమైనా వాళ్ల బ్రేకప్‌కు ఆ ఇద్దరిలో ఎవరినీ బ్లేమ్ చేయలేం.. అదలా జరిగిపోయింది అంతే!’ అంటూ ఇంకో సోర్స్ విశ్లేషణ. సోనాక్షీ మాత్రం.. ‘సినిమా రంగంలోని అబ్బాయిని కాకుండా కాస్త మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిని చూసుకోమని మా పేరెంట్స్ చెప్తుంటారు. చూద్దాం.. అలాంటి వ్యక్తి తారసపడితే తప్పకుండా నా ప్రేమ విషయాన్ని ముందు మీకే షేర్ చేస్తాను’ అంటూ మీడియా ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుంటూ ఉంటుందెప్పుడూ! ∙ఎస్సార్ -
భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా: మేమున్నాం!!
డిసెంబర్ 8, 1971 ఇండియా-పాక్ యుద్ధకాలం..బాంబుల భయంతో వణుకుతున్న ఊరు. బాంబులు కురిసినా సరే దేశం కోసం చనిపోయినా పరవాలేదనే సాహసోపేత నిర్ణయం. ‘మేమున్నాం’ అంటూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది వీర నారీమణుల తెగువ. 72 గంటల వ్యవధిలో ఎయిర్‌ఫోర్స్ బేస్ పునరుద్ధరణ. ప్రాణాలకు తెగించి మరీ దేశభక్తిని చాటుకున్న వైనం! అంతేనా.. ప్రభుత్వ అవార్డు సొమ్మును దానం చేసిన దాతృత్వం.. జయహో.. వీరమహిళలు!! చలి పులిలా విజృంభిస్తుంది. కాని ఆ ఊరు చలితో కాదు ‘బాంబుల భయం’తో వణికిపోతుంది. అందరూ ఆకాశం వైపు భయం భయంగా చూస్తున్నారు. పాకిస్థాన్ జెట్స్ భుజ్ (కచ్ జిల్లా, గుజరాత్)లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై బాంబులు వేశాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌బేస్‌ను పునరుద్ధరించడానికి భారత వైమానిక దళం బీఎస్ఎఫ్ జవాన్ల సహాయం కోరింది. పునరుద్ధరణ తక్కువ సమయంలో జరగాలంటే ఎక్కువమంది శ్రామికులు కావాలి. వారిని వెదికిపట్టి తీసుకురావడానికి సమయం లేదు. దగ్గరి గ్రామాల్లోని వారి సహాయం కోరాలి.ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్లు ఉన్న ఆ సమయంలో ఎవరు బయటకు వస్తారు? వచ్చినా సహాయపడతారా?రకరకాల సందేహాలను పటాపంచలుచేస్తూ... ఒక్కరు కాదు ఇద్దరు కాదు మాదపూర్ గ్రామానికి చెందిన 300 మంది స్త్రీలు ‘మేమున్నాం’ అంటూ ముందుకువచ్చారు. పునరుద్ధరణ పనుల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. డిసెంబర్ 8, 1971 ఇండియా-పాక్ యుద్ధకాలం నాటి దృశ్యం ఇది. ఆనాటి భుజ్ ఎయిర్ బేస్‌ను పునర్నిర్మించిన 300 మంది మహిళలను సగౌరవంగా గుర్తు తెచ్చుకుంటుంది ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ చిత్రం. (అజయ్ దేవ్‌గణ్, సంజయ్‌దత్, సోనాక్షిసిన్హా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా వోటీటీలో విడుదలైంది) ఈ నేపథ్యంలో ఆనాటి జ్ఞాపకాలు ఆసక్తికరంగా మారాయి. ‘చనిపోయినా సరే, దేశం కోసం చనిపోయాను అనే తృప్తి మిగులుతుంది...అని ఒకరికొకరం ధైర్యం చెప్పుకొని పనిలోకి దిగాము’ అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది సెఘాని అనే మహిళా యోధురాలు. ఆ 300 మంది మహిళలలో ఒకరైన హిరూ బుదియాలో మొదట ఒక సందేహం...‘వెళుతున్నాను సరే, కూలిపని తప్ప నాకు ఏది తెలియదు. నేను చేయగలనా?’ఆ తరువాత భయం... ‘పనిలో ఉండగా పై నుంచి బాంబులు పడితే... ఇంకేమైనా ఉందా!’తనలోని ధైర్యానికి, సందేహాలతో కూడిన భయానికి మధ్య ఆ సమయంలో పెద్ద యుద్ధమే జరిగింది. కాని చివరికి ధైర్యమే గెలిచింది. దేశభక్తి గొప్పతనం అదే కదా! (చదవండి : Mirabai Chanu: ట్రెడిషనల్ ఔట్ఫిట్, ట్వీట్ వైరల్) ‘చిన్నచిన్న విషయాలకే భయపడే నాకు అంతధైర్యం ఎలా వచ్చిందో తెలియదు. ఏదో శక్తి ఆవహించినట్లు అనిపించింది’ అని ఆరోజును గుర్తు తెచ్చుకుంటుంది వీరు లఖాని. 72 గంటల వ్యవధిలో ఎయిర్‌ఫోర్స్ బేస్‌ను పునరుద్ధరించే పని పూర్తయింది.యుద్ధం పూర్తయిన తరువాత గ్రూప్ అవార్డ్‌గారూ. 50,000 ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ మొత్తాన్ని గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్ కోసం ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు వీరమహిళలు. -
భుజ్ ట్రైలర్: నా పేరు సిపాయి, నేను చావడానికే పుట్టాను
Bhuj: The Pride Of India Trailer: 1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగణ్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, షరద్ కేల్కర్, ప్రణీతా సుభాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్ దుధయ్యా దర్శకత్వం వహించారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. 'మరాఠాలకు చావడం లేదా చంపడం.. ఈ రెండే తెలుసు', 'చివరి రక్తపు బొట్టు వరకు మేము పోరాడుతూనే ఉంటాం', 'నా పేరు సిపాయి, నేను చావడానికే పుట్టాను' వంటి డైలాగులు ట్రైలర్లో తూటాల్లా పేలాయి. చంటిపాపను ఎత్తుకున్న సోనాక్షి ఒంటిచేత్తో చిరుతపులిని హతమార్చడం ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. కాగా యుద్ధం సమయంలో గుజరాత్‌లోని భుజ్ అనే ఎయిర్పోర్ట్ ధ్వంసమవగా అప్పటి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ విజయ్ కార్నిక్ అక్కడి స్థానిక మహిళల సాయంతో పాడైపోయిన ఆ ఎయిర్‌పోర్ట్‌ను బాగు చేసి, భారత సైన్యం వినియోగించుకునేలా చేశారు. భారత సైన్యానికి సాయపడేందుకు 299 మంది మహిళలను తనతో తీసుకువెళ్లిన ధైర్యవంతురాలైన సామాజిక కార్యకర్త సుందర్ బెన్ పాత్రలో సోనాక్షి సిన్హా నటించింది. ఈ సినిమా ఆగస్టు 13న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో భుజ్ విడుదల కానుంది. ట్రైలర్ ఈ రేంజ్లో ఉంటే సినిమా ఇంకే రేంజ్లో ఉంటుందోనని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. -
ఏడేళ్ల తర్వాత సోనాక్షి, తొలిసారి నవాజుద్దీన్
దాదాపు ఏడేళ్ల తర్వాత బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా సౌత్‌లో ఓ సినిమా ఒప్పుకున్నారు. అది కూడా తెలుగు సినిమా కావడం విశేషం. చిరంజీవి సరసన జోడీ కట్టనున్నారామె. 2014లో రజనీకాంత్ సరసన చేసిన ‘లింగా’ తర్వాత దక్షాణాదిన సోనాక్షి చేయనున్న సినిమా ఇదే కావడం విశేషం. మరో విశేషం ఏంటంటే... ఈ సినిమాలో చిరంజీవికి విలన్‌గా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించనున్నారు. రజనీ ‘పేట’ తర్వాత దక్షిణాదిన నవాజుద్దీన్ చేయనున్న సినిమా ఇదే. చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఓ సినిమా తెరకెక్కించనుంది. ఈ సినిమాతో సోనాక్షీ కథానాయికగా, నవాజుద్దీన్ ప్రతినాయకుడిగా తెలుగులోకి మెగా ఎంట్రీ ఖరారైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు చిరంజీవి. మలయాళ హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్, మెహర్ రమేశ్ సినిమాలు కూడా లైనప్‌లో ఉన్నాయి గనక చిరంజీవి–బాబీ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి కాస్తంత సమయం పట్టేలా ఉంది. చదవండి: అందుకే విడాకులు రద్దు చేసుకుంటున్నాను: నటుడి భార్య -
మెగాస్టార్‌తో బాలీవుడ్ భామ రొమాన్స్!
డైరెక్టర్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో బాబీ, చిరు కోసం ప్రత్యేకంగా రేడి చేసిన ఈ స్క్రిప్ట్ చిరుకు నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాడు. అంతేగాక బాబీతో ఓ మూవీ చేయబోతున్న అంటూ మెగాస్టార్ స్వయంగా ప్రకటించడం విశేషం. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అసక్తికర అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందులో చిరుకు జోడీగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాబీ టీం సోనాక్షిని సంప్రదించి కథ వివరించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా చిరు ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ మోహన్ రాజా డైరెక్షన్లో తెరకెక్కబోయే లూసిఫర్ రీమేక్‌లో నటించనున్నాడు. అనంతరం బాబీతో సినిమాను చిరు ప్రారంభించనున్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. -
ఆ హీరోయిన్ని ప్రేమిస్తున్నా : వైష్ణవ్ తేజ్
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్‌తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ హీరో.. తనదైన నటనతో ఒక్క సినిమాతోనే లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ‘ఉప్పెన’సినిమా చూసిన వాళ్లంతా వైష్ణవ్‌కు ఇది తొలి సినిమా అంటే నమ్మలేరు. అంతలా నటించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ యంగ్ హీరో తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా తమ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటినీ వైష్ణవ్ ముందు ఉంచారు నెటిజన్లు. వాటన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చాడు వైష్ణవ్. ఈ క్రమంలో ‘సోనాక్షి సిన్హా అంటే మీకు ఎందుకు ఇష్టం’అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఆమె అంటే ఇష్టం కాదు ప్రేమని చెప్పాడు. ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తూనే ఉన్నానని వైష్ణవ్ అన్నాడు. ఇక అభిమాన హీరో ఎవరని ప్రశ్నించగా.. రజనీ కాంత్ అని, ఆయన నటించిన శివాజీ మూవీని చాలా సార్లు చూశానని చెప్పాడు. సమంత గురించి ఏమైనా చెప్పండని ఓ నెటిజన్ అడగ్గా.. ఫ్యామిలీ మేన్-2లో సమంత నాకెంతో నచ్చేసిందన్నాడు. కృతిశెట్టిలో నటన కాకుండా దాగి ఉన్న మరో టాలెంట్ ఏంటని ప్రశ్నించగా.. ఆమె మంచి సింగర్ అని చెప్పాడు. తన తరువాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని, ఆ తర్వాత గిరీశయ్య దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కనుందని తెలిపాడు. చదవండి: బన్నీ అస్సలు తగ్గట్లేదుగా.. క్రేజీ ప్రాజెక్టులతో దండయాత్రకు రెడీ ఆ హీరోయిన్ను కాపీ కొడతాను: సమంత -
చిరు, బాలయ్యలతో బాలీవుడ్ భామ రొమాన్స్!
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా చిత్రాలవైపే మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్లో తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. దీనికోసం తమ సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లను పెట్టుకుంటున్నారు. పేరున్న హీరోయిన్ అయితే బాలీవుడ్లో పబ్లిసిటీకి ఈజీ అవుతుందని భావిస్తున్నారు. దీంతో బీ టౌన్లో ఫేమస్ అయిన హీరోయిన్స్‌పై తెలుగు దర్శకనిర్మాతలు కన్నేశారు. తమ సినిమాల్లో వారిని నటింపజేసేందుకు భారీ మొత్తంలో పారితోషికాలు చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ భామలు టాలీవుడ్లో రాణిస్తుండగా, తాజాగా మరో యంగ్ హీరోయిన సోనాక్షి సిన్హా కూడా ఇక్కడ సత్తాచాటేందుకు రెడీ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ ఒకేసారి ఇద్దరు బడా హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అందులో చిరంజీవి హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా కాగా, మరొకటి గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న బాలకృష్ణ సినిమా. ఒకేసారి అటు చిరంజీవి, ఇటు బాలకృష్ణతో ఈ భామ రొమాన్స్ చేయబోతుంది. ఈ రెండు ఆఫర్స్ సోనాక్షి వరకు చేరాయని, డేట్స్ విషయంలో ఆమె ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో కలిసి బిబీ3లో నటిస్తున్నాడు. చదవండి: తలైవి ట్రైలర్ చూస్తే గూస్‌బంప్సే.. తూటాల్లా డైలాగులు ముద్దు వీడియోపై నటి ప్రీతి జింటా రియాక్షన్ -
సోషల్ హల్చల్: హీటెక్కిస్తున్న నియా, చెట్టెక్కిన హెబ్బా
♦ గాగ్రాలో బొంగరాలు తిరుగుతున్న అదితి బుద్దకోటి ♦ మరో రోజు, మరో అడ్వెంచర్‌తో అంటూ ఎయిర్‌పోర్టులో నికిత శర్మ ♦ అనవసరమైనవి పట్టించుకోవడం మానేస్తే లైఫ్ ఎంత బాగుంటుందో అంటున్న అమలాపాల్ ♦ బ్లూటిఫుల్ డే అంటోన్న శిల్పా శెట్టి ♦ అమ్మ తీసిన ఫొటోను పంచుకున్న శ్రద్దా కపూర్ ♦ ఇది శుక్రవారమా? కాదా? అని అడుగుతోన్న సోనాక్షి సిన్హా ♦ గుడ్ మార్నింగ్ అంటూ వీడియో షేర్ చేసిన అమీషా పటేల్ ♦ ఎక్కడైనా కాఫీ తాగొచ్చంటూ చెట్టెక్కిన హెబ్బా పటేల్ ♦ హీటెక్కించే పోజులో నియా శర్మ View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) -
సోషల్ హల్చల్: పిల్లందం కేక.. కేక..
► ఎర్రటి డ్రెస్సులో రచ్చరంబోలా చేస్తున్న జాన్వీ కపూర్ ► టాప్‌లెస్ ఫొటోతో హీటెక్కిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ► మ్యాచింగ్ మ్యాచింగ్ అంటున్న తమిళ హీరోయిన్ అతుల్య రవి ► ఎర్రటి చీరలో ఆసమ్ లుక్‌లో దీప్తి సునయన ► చూపు తిప్పుకోనివ్వని ఊర్వశి రౌతేలా ► వైట్ డ్రెస్‌లో టాప్ లేపుతున్న మలైకా అరోరా ► జస్ట్ చిల్లింగ్ అంటోన్న రాశీ ఖన్నా ► నవ్వులతోనే బాణం వేస్తోన్న మేఘాఆకాశ్ ► సెల్ఫీతో మత్తెక్కిస్తున్న సోనాక్షి సిన్హా ► రేపటి కోసం నడుస్తున్నానంటున్న బాలీవుడ్ భామ మౌనీ రాయ్ ► హాట్ ఫొటోను షేర్ చేసిన లక్ష్మీ రాయ్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
రాజకీయాల్లోకి యువత రావాలి
‘‘మీ అమ్మా, నాన్నా (శత్రుఘ్న సిన్హా, పూనమ్ సిన్హా,) ఇటీవలే సొదరుడు (లవ్ సిన్హా) కూడా రాజకీయాల్లోకి వచ్చారు. మీక్కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా?’’ అనే ప్రశ్నను సోనాక్షీ సిన్హా ముందుంచింతే –‘‘నాకలాంటి ఆలోచనలు ఏమీ లేవు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘అన్నయ్య రాజకీయాల్లోకి వెళ్లడం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే తనకు రాజకీయాల మీద మంచి అవగాహన ఉంది. ఫలితం మేం అనుకున్న విధంగా రాలేదు. అయినా తన ప్రయత్నం తను చేశాడు. అలానే రాజకీయాల్లోకి యువత ఇంకా ఎక్కువ మంది రావాలి’’ అన్నారు సోనాక్షి. కొత్త సంవత్సరం వేడుకల గురించి చెబుతూ – ‘‘కొత్త సంవత్సరాన్ని విదేశాలకు వెళ్లి చేసుకోవడం నాకు అలవాటు. కానీ ఈసారి న్యూ ఇయర్‌కి హాలిడే లేదు. కోవిడ్ వల్ల చాలా రోజులు షూటింగ్స్ ఆగిపోయాయి. నా డిజిటల్ షో చిత్రీకరణతో బిజీగా ఉంటాను. న్యూ ఇయర్ రోజు మాత్రం దగ్గర్లో ఎక్కడికైనా వెళ్లి వెంటనే వచ్చేయాలనుకుంటున్నాను’’ అన్నారామె. -
సామాజిక కార్యకర్త
1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, షరద్ కేల్కర్, ప్రణీతా సుభాష్ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. యుద్ధం సమయంలో గుజరాత్‌లోని భూజ్ అనే ఎయిర్పోర్ట్ ధ్వంసమైంది. అప్పటి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ విజయ్ కార్నిక్ అక్కడి స్థానిక మహిళల సాయంతో పాడైపోయిన ఆ ఎయిర్‌పోర్ట్‌ను బాగు చేసి, భారత సైన్యం వినియోగించుకునేలా చేశారు. ఈ స్థానిక మహిళలకు నేతృత్వం వహించారు సుందర్బెన్ జెతా మదర్పార్య. ఈ సుందర్బెన్ పాత్రలోనే నటించారు సోనాక్షీ సిన్హా. సినిమాలోని ఆమె లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘భారత సైన్యానికి సాయపడేందుకు 299 మంది మహిళలను తనతో తీసుకువెళ్లిన ధైర్యవంతురాలైన సామాజిక కార్యకర్త సుందర్ బెన్ పాత్రలో సోనాక్షి నటించారు. చరిత్రలోని ఓ అద్భుత సంఘటన వెండితెరపై ఆవిష్కృతం కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ చిత్రం ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. అభిషేక్ దు«ధయ్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. -
ట్విటర్ నుంచి వైదొలగిన హీరోయిన్!
ముంబై: సోనాక్షి సిన్హా ట్విటర్ అకౌంట్ ఇకపై కనిపించదు. ఎందుకంటే దబాంగ్ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయిన ఈ ముద్దు గుమ్మ నెగిటివిటికి దూరంగా ఉండాలి అనుకుంటుందంట. మనఃశాంతిని కాపాడు కోవడానికి, నెగిటివిటికి దూరంగా ఉండటానికి ట్విటర్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేశానని సోనాక్షి తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా శనివారం వెల్లడించింది. (సల్మాన్‌ఖాన్‌తో సాన్నిహిత్యం పెరిగింది) ‘మీ మనఃశాంతిని కాపాడుకుకోవడానికి మొదట చేయవలసింది నెగిటివిటికీ దూరంగా ఉండటం. ఇది ట్విటర్ కంటే ఎక్కువ ఇంకెక్కడ ఉండదు. ఛలో, నేను నా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేస్తున్నాను’ అని సోనాక్షి పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు కామెంట్ సెక్షన్‌ను కూడా సోనాక్షి డిసేబుల్ చేసింది. ఇప్పటి వరకు సోనాక్షి 1320 పోస్టులను చేశారు. ఆమెకు 18.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో స్టార్ కిడ్స్‌ని అన్ ఫాలో చేస్తూ, ట్రోల్ చేస్తున్న ఈ తరుణంలో సోనాక్షి ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. (ఐ వాన్న అన్‌ఫాలో యు) -
ఆర్ట్ బై సోనాక్షీ
కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో హీరోహీరోయిన్లందరూ హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. కుకింగ్, రీడింగ్, క్లీనింగ్... ఇలా ఏదో ఒకటి చేస్తు టైమ్‌పాస్ చేస్తున్నారు. హీరోయిన్ సోనాక్షీ సిన్హా రోజుకో బొమ్మ గీస్తున్నారు. ‘‘కొన్నేళ్ల క్రితమే బొమ్మలు గీయడం అలవాటు చేసుకున్నాను. ఈ అలవాటు నాకు మెడిటేషన్లా అనిపిస్తోంది. నాకు సరైన స్ట్రెస్ బస్టర్ పెయింటింగ్. నేను చాలా పెయింటింగ్స్ వేశాను’’ అని పేర్కొన్నారు సోనాక్షీ. ఇటీవల ఆమె వేసిన డ్రాయింగ్స్‌ను ‘ఆర్ట్ బై సోనాక్షీ’గా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు సోనాక్షీ గీసినవే. -
సల్మాన్‌ఖాన్‌తో సాన్నిహిత్యం పెరిగింది
దబంగ్‌లో ‘రాజో’గా అమాయకంగా కనిపించినా... లింగలో ‘మణిభారతిగా’ మెరిసినా....‘అకీరా’లో మార్షల్ ఆర్ట్స్‌తో గర్జించినా...‘నూర్’లో యంగ్ జర్నలిస్ట్‌గా ఆకట్టుకున్నా... అది సోనాక్షికే సొంతం. ఆ అమ్మడి ముచ్చట్లు ఆమె మాటల్లోనే... దబంగ్ నుంచి దబంగ్ వరకు... దబంగ్ నుంచి దబంగ్3 వరకు నేను పెద్దగా మారింది ఏమీలేదు. అయితే సల్మాన్‌ఖాన్‌తో సాన్నిహిత్యం పెరిగింది. అప్పటితో పోల్చితే ఇప్పుడు వచ్చిన మార్పు ఏమిటంటే, అప్పుడు సల్మాన్‌తో మాట్లాడటానికి భయపడేదాన్ని. వీలైనంత మౌనంగా ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం ఆయనతో స్వేచ్ఛగా మాట్లాడుతున్నాను. నా మనసులో భావాలను పంచుకోగలుతున్నాను. అలా ఎప్పుడూ అనుకోలేదు... ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘సెట్’కు వెళ్లాలనే ఉత్సాహం కూడా ఎప్పుడూ ఉండేది కాదు. నేను సినిమాలు చూస్తూ పెరగలేదు... ఆటలు అంటే మాత్రం చాలా ఇష్టం. అందుకే కెమెరాను ఫేస్ చేయడం అనేది నాకు బొత్తిగా కొత్త విషయంలా అనిపించింది.ఇప్పుడు ఫీల్డ్‌కు వస్తున్న కొత్తవాళ్లు వర్క్‌షాప్, యాక్టింగ్ క్లాస్‌లకు వెళ్లి బాగా ప్రిపేరై వస్తున్నారు. నేను మాత్రం అన్ప్రిపేర్డ్గా కెమెరా ముందుకు వచ్చాను. అయితే నటన విషయంలో సల్మాన్‌ఖాన్ చాలా సలహాలు ఇచ్చారు. నచ్చినవి మెచ్చినవి దీపికా పదుకొనే, ప్రియాంకచోప్రా లాంటి వాళ్లు తమ అభిరుచికి నచ్చిన సినిమాలు తీయడానికి నిర్మాతలుగా మారారు. నేను కూడా వారిలాగే భవిష్యత్‌లో నాకు నచ్చిన సినిమాలను తీయాలనుకుంటున్నాను. మంచి సబ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. ఏఆర్ మురగదాస్ ‘అకీర’లో నేను చేసిన క్యారెక్టర్ ‘మోస్ట్ చాలెంజింగ్ క్యారెక్టర్’ అని చెప్పవచ్చు. నేను మార్షల్ ఆర్టిస్ట్‌ను కాదు. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సి వచ్చింది. ‘నూర్’లో నేను చేసిన జర్నలిస్ట్ క్యారెక్టర్ కూడా నాకు బాగా నచ్చింది. ఈ కాలం మహిళ పాత్ర అది. అప్పుడే కదా! ఒక డైరెక్టర్ ‘లూటేరా’లాంటి సినిమా తీస్తే నేను గుర్తుకు రావాలి, అదే డైరెక్టర్ ‘దబంగ్’లాంటి సినిమా తీసినా నేను గుర్తుకు రావాలి. ప్రతి క్యారెక్టర్ నేను చేయగలగాలనేది నా కోరిక. ప్రతి జానర్లోనూ నటించాలని ఉంది. ఖందాని షఫఖానా, కలంక్, మిషన్ మంగల్, దబంగ్3... ఈ నాలుగు చిత్రాల్లో భిన్నమైన పాత్రలు పోషించే అవకాశం వచ్చింది. ఒకదానికొకటి భిన్నమైన ఇలాంటి క్యారెక్టర్లు చేయగలిగినప్పుడు పని మీద మరింత ఉత్సాహం పెరుగుతుంది. -
‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’
సోనాక్షి సిన్హా పేరును కేవలం ఉదాహరణగా మాత్రమే ప్రస్తావించానని బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేష్ ఖన్నా సమాధానమిచ్చాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం దూరదర్శన్‌లో పునఃప్రసారమవుతున్న రామాయణం, మహాభారతం వంటి కార్యక్రమాలు భారత సంస్కృతి, సాహిత్యం గురించి తెలియని సోనాక్షి వంటి వారికి ఉపయోగపడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై స్పందించిన సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా.. ముకేష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. (వినూత్న వేషం.. 150 కిమీ నడక ) రామాయణంపై సోనాక్షిని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం ఎవరికో సమస్యగా ఉందని, ఆ వ్యక్తికి రామాయణంపై నిపుణుడిలా వ్యవహరించడానికి ఏ అర్హత ఉందంటూ ఘూటు విమర్శలు చేశారు. హిందూ మతం సంరక్షకుడిగా అతడిని ఎవరు నియమించారని, సోనాక్షి వంటి కూతురుకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. రామాయణ ప్రశ్నకు సోనాక్షి సమాధానం ఇవ్వకపోవడం ఆమెను హిందువు కాదని చెప్పలేదని, ఆమెకు ఎవరి నుంచి అర్హత పత్రం అవసరం లేదని శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. (ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు) తన వ్యాఖ్యలపై శత్రుఘ్న ఫైర్ అవ్వడంతో తాజాగా సోనాక్షిపై చేసిన వ్యాఖ్యలను ముకేష్ ఖన్నా సమర్థించుకున్నాడు. సోనాక్షి సిన్హా పేరును ఒక ఉదాహరణగా మాత్రమే వెల్లడించానని, ఆమెను కించపరిచే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు. సోనాక్షి జ్ఙానాన్ని ప్రశ్నించలేదని, ఆమెను టార్గెట్ చేయడం తన ఉద్ధేశ్యం కాదని తెలిపారు. తన మాటలను శత్రుఘ్న తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తమ మధ్య (శత్రుఘ్న ) చాలా కాలం నుంచి పరిచయం ఉందని. శత్రుఘ్న పట్ల తనకు గౌరవం ఉందన్నారు. అలాగే ‘రామాయణం, హిందూ సాహిత్యానికి సంరక్షకుడిని అని నేను అనడం లేదు. ప్రస్తుత తరం కేవలం హ్యారీ పోటర్, టిక్‌టాక్ పైనే ఆసక్తి కనబరుస్తున్నారు. భారత పౌరుడిగా దేశ చరిత్రను, సాహిత్యాన్ని వారికి తెలియజేయడం మన కర్తవ్యం. ఇందుకు సోనాక్షి పేరును ఉపయోగించడం శత్రుఘ్న తప్పుగా భావిస్తున్నాడు. కానీ అది నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు’. అని తన వ్యాఖ్యాలపై సమధానమిచ్చారు. (శ్రియ భర్తకు కరోనా లక్షణాలు? ) -
‘డేటింగ్లో లేము.. అప్పటికే నాకు!’
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాతో గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నట్లు వస్తున్న పుకార్లను నటుడు జహీర్ ఇక్బాల్ ఖండించాడు. దీనిపై ఓ ఇంటర్యూలో జహీర్ స్పందిస్తూ.. ‘నేను సోనాక్షి ప్రేమలో ఉన్నామంటు వచ్చిన వార్తలను చదివి మేమిద్దరం నవ్వుకున్నాం. ఇది నా మొదటి రుమర్ అందుకే ఎలా స్పందించాలో నాకర్థం కాలేదు’ అని చెప్పాడు. ‘‘తరచూ ఇద్దరం కలిసి వివిధ పార్టీలకు, డిన్నర్లకు వెళ్లేవాళ్లం. అది చూసి అంతా సోనాక్షి, నేను డేటింగ్లో ఉన్నామని భావించి ఉంటారు. నాకు తెలిసి అందువల్లే ఈ పుకార్లు పుట్టుకొచ్చి ఉంటాయి. అయితే ప్రజలు అది మాత్రమే కాదు ఇంకా మా మధ్య ఎముందో కూడా తెలుకోవాలి’’ అంటూ చెప్పుకొచ్చాడు. (నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి) ఇక తమపై వచ్చిన పుకార్లను చూసి సోనాక్షి, తాను చర్చించుకున్నామని చెప్పాడు. ఇక అందరికి తెలియని విషయం ఏటంటే తాను అప్పటికే మరొకరితో ప్రేమలో ఉన్నానని చెప్పాడు. ఆ విషయం సోనాక్షికి కూడా తెలుసని, దీంతో తమపై వచ్చిన ఈ రూమర్ వల్ల సోనాక్షి చాలా ఇబ్బంది పడిందన్నాడు. అయితే ప్రస్తుతానికి తాను సింగిల్‌గా ఉన్నానని చెప్పాడు. కాగా జాహీర్ గతేడాది దర్శకుడు నితిన్ కక్కర్, రూపొందించిన ‘నోట్‌బుక్’ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేశాడు. ఈ చిత్రంలో జాహీర్కు సరసన మోహ్నీష్ బహ్ల్ కూతురు ప్రణుతాన్ బహ్ల్ నటించారు. కాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. (కరోనా కాలంలో షేక్ హ్యాండ్ ఇచ్చిన హీరో!) -
ముకేష్‌పై శత్రుఘ్న సిన్హా ఘాటు వ్యాఖ్యలు
ముంబై : బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్షాపై నటుడు ముఖేష్ కన్నా చేసిన వ్యాఖ్యలపై ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా ఘాటుగా స్పందించారు. సోనాక్షికి తండ్రిగా ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఇక బిగ్‌బీ హోస్టుగా వ్యవహరించిన ‘కోన్ బనేగా కరోడ్ పతి’ షోకు అతిథిగా వచ్చిన సోనాక్షి రామాయణాయానికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమధానం ఇవ్వలేకపోయిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన ఆ ఒక్క సమాధానం ఇవ్వనంతా మాత్రాన ఆమెకు హిందు పురాణాలపై అవగాహన లేదని ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. కాగా దేశంలో విధించిన లాక్డౌన్ నేపథ్యంలో రామాయణం, మహా భారతం వంటి ఇతిహాసాలను దూరదర్శన్‌లో మరోసారి ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దీనిపై బాలీవుడ్ సీనియర్ నటుడు ముకేష్ ఖన్నా స్పందిస్తూ.. రామాయణం, మహాభారతం పునఃప్రసార కార్యక్రమం భారత సంస్కృతి, సాహిత్యం గురించి తెలియని సోనాక్షి వంటి వారికి ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. (నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి) ఇక ముకేష్ ఖన్నా వ్యాఖ్యలపై స్పందించిన సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా.. పరోక్షంగా ముకేష్ ఖన్నాపై తీవ్ర విమర్శలు చేశారు. ఎవరి పేరును ప్రస్తావించకుండా ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శత్రుఘ్న ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రామాయణంపై అడిగిన ఒక ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పకపోవడం ఎవరికో సమస్యగా ఉందని నేను అనుకుంటున్నాను. ముందుగా ఆ వ్యక్తికి రామాయణంపై నిపుణుడిలా వ్యవహరించడానికి ఏ అర్హత ఉంది. హిందూ మతం సంరక్షకుడిగా అతడిని ఎవరు నియమించారు’ అని పరోక్షంగా ముకేష్‌పై విరుచుకుపడ్డారు. (పోలీసు బిడ్డగా వారికి సెల్యూట్ చేస్తున్నా: చిరు) అలాగే.. ‘సోనాక్షితో సహా తన ముగ్గురు పిల్లలకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. సోనాక్షి కెరీర్‌ను నేను ప్రారంభించాల్సిన అవసరం లేదు. తన సొంత కాళ్లపై నిలబడి స్టార్ అయ్యింది. తను కుమార్తెగా ఉన్నందుకు ఏ తండ్రి అయినా గొప్పగా ఫీల్ అవుతాడు. రామాయణ ప్రశ్నకు సోనాక్షి సమాధానం ఇవ్వకపోవడం ఆమెను హిందువు కాదని చెప్పలేదు. ఆమెకు ఎవరి నుంచి అర్హత పత్రం అవసరం లేదు.’ అని ముకేష్ మాటలకు ఘాటుగా సమాధానమిచ్చారు. (ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో) -
నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి
ముంబై : భారత్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం సాయంత్రం వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1600కు పైగా చేరుకోగా, 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కరోనా సంక్షోభంలో చిక్కకున్న భారత్‌ను ఆదుకునేందుకు సెలబ్రిటీలు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. రాజకీయ, వ్యాపార, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు అందజేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి విరాళాన్ని ప్రకటించలేదని.. నెటిజన్లు సోనాక్షిని టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. (హలో! ఇప్పుడే క్లారిటీకి రాకండి: పూజా హెగ్డే) సోనాక్షి కోస్టార్స్ అందరూ పీఎం సహాయనిధికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేస్తూంటే.. ఆమె మాత్రం అసలు పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన సోనాక్షి నెటిజన్ల ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘‘ కొంతమంది మంచి పని చేసి చెప్పుకుంటారు. మరికొంత మంది చెప్పుకోడానికి ఇష్టపడరు. నేను రెండో సిద్ధాంతాన్ని పాటిస్తాను. నన్ను ట్రోల్స్ చేసే వారికి ఒక నిమిషం మౌనం పాటిస్తున్నా. ఆపద సమయంలో ఇలాంటి ట్రోల్స్ చేయడం కంటే.. మీ సమయాన్ని మంచి పని చేయడం కోసం ఉపయోగించండి. విరాళం ప్రకటించడం అనే అంశం నా వ్యతిగత విషయం.’’ అంటూ బదులిచ్చారు. అయితే దీనికంటే ముందు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన అమితాబ్.. ట్విటర్ ద్వారా తనపై వచ్చిన ట్రోల్స్‌ను తిప్పికొట్టారు. (అమలాపాల్ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి) Minute of silence for trolls who think that just because it wasn't announced,contributions weren't made.Neki kar dariya mein daal,suna toh hoga?Kuch log actually follow karte hai!Ab shaant ho jao & use ur time 2 do some actual good(announcing or not is a personal preference)😊 — Sonakshi Sinha (@sonakshisinha) March 31, 2020 -
అది అస్సలు నచ్చేది కాదు: హీరోయిన్
కరీనా కపూర్ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హాజరైంది. ఈ సందర్భంగా తన తండ్రి రాజకీయాల్లో అడుగుపెట్టడం వల్ల ఎదురైన ఇబ్బందులను పేర్కొంది. తన వెంట సెక్యురిటీ గార్డులు రావడం అస్సలు ఇష్టం ఉండేది కాదని చెప్పుకొచ్చింది. ‘నా తండ్రి శతృఘ్న సిన్హ మంత్రైన తర్వాత ఒక్కసారిగా నా చుట్టూ వాతావారణం మారిపోయింది. నేను స్కూలుకు వెళ్తే నా వెనకాలే కొంతమంది రక్షణగా వచ్చేవారు. అది నాకు విచిత్రంగా తోచేది. అప్పుడు నేను ఆరో, ఏడో తరగతి చదువుతున్నాననుకుంటా. సరిగ్గా ఆ సమయంలోనే నాన్నకు మంత్రి పదవి దక్కింది. ఇంకేముంది, గన్మెన్లు మేం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవారు. (ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా?!) నేను బడికి వెళ్లే జీపు నిండా సెక్యూరిటీ గార్డులు ఉండేవారు. వారి చేతుల్లో పెద్ద పెద్ద గన్స్ ఉండేవి. ఇలా వెళ్లడం నాకు అస్సలు నచ్చేది కాదు. నేను స్కూల్లో జీపులో నుంచి దిగుతుంటే అందరూ వింతగా చూసేవారు. ఇలా కాదింక అని, వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టాలని అమ్మతో నా గోడు వెల్లబోసుకున్నా. సెక్యూరిటీ గార్డులను నాతో పంపించకపోతేనే స్కూలుకు వెళ్తా.. లేదంటే మానేస్తానని బెదిరించా. ఆ కల నిజమైనప్పుడే నాకు నిజమైన స్వాతంత్య్రం అని భావించాను. ఆ తర్వాతి కాలంలో నేను ఇంటికి దూరంగా ఉన్న కాలేజీ ఎంచుకున్నాను. దీంతో నా చుట్టూ ఏ సెక్యూరిటీ గార్డు లేకుండానే ఎంచక్కా రైలులో వెళ్లేదాన్ని’ అని చెప్పుకొచ్చింది. కాగా ఆమె సల్మాన్‌ఖాన్‌తో కలిసి నటించిన ‘దబాంగ్ 3’ వసూళ్లు కురిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘భుజ్: ది ప్రైడ్ఆఫ్ ఇండియా’ చిత్రంలో నటిస్తోంది.(నమ్మలేకపోతున్నా!) -
పడిపోయారు!
వయసులో ఉన్నవాళ్లను ఉద్దేశించి పడిపోయారు అంటే.. ప్రేమలో పడ్డారేమో అనుకోవడం సహజం. సోనాక్షీ సిన్హా పడిపోయారు. అయితే ప్రేమలో కాదు.. వెబ్ సిరీస్‌లో పడ్డారు. ‘ఫాలెన్’ (పడిపోయారు) పేరుతో రూపొందనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారామె. రాధికా ఆప్టే, కియారా అద్వానీ, ప్రియాంకా చోప్రా.. ఇలా స్టార్ హీరోయిన్లందరూ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఫాలెన్’తో సోనాక్షీ కూడా వీరి జాబితాలో చేరిపోయారు. క్రీడా నేపథ్యంలో అక్షయ్‌కుమార్‌తో ‘గోల్డ్’ వంటి సూపర్ హిట్ సినిమా తీసిన లేడీ డైరెక్టర్ రీమా కగ్తి ఈ వెబ్ సిరీస్‌కి దర్శకురాలు. వచ్చే నెలలో ఈ థ్రిల్లర్ చిత్రీకరణ ఆరంభం కానుంది. వెబ్ సిరీస్ చేయడం థ్రిల్‌గా ఉందన్నారు సోనాక్షీ. -
అది సల్మాన్ దగ్గరే నేర్చుకున్నా: సోనాక్షి
అదృష్టవశాత్తూ ఈ ఏడాది ఎంతగానో కలిసివచ్చిందంటూ సంతోషం పట్టలేకపోతుందీ బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హ. 2019 తనకు ఎంతో ఇచ్చిందంటూ ఈ ఏడాదికి సంతోషంగా గుడ్‌బై చెప్తోంది. ఆమె తాజాగా నటించిందిన ‘దబాంగ్ 3’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీనికన్నా ముందు సోనాక్షి నటించిన కళంక్, ఖాందానీ, శఫఖానా, మిషన్ మంగళ్’ విడుదలయ్యాయి. అయితే వీటన్నింటిలోనూ భిన్న రకాల పాత్రలు చేసానని సోనాక్షి చెప్పుకొచ్చింది. అయితే దబాంగ్‌లో చుల్‌బుల్‌పాండే(సల్మాన్ ఖాన్) భార్య రాజో పాత్ర తనకు ఎంతో ఇష్టమైన పాత్రగా అభివర్ణించింది. తొలిపాత్రతోనే గుర్తింపు తెచ్చుకుకోవడం మరిచిపోలేనని పేర్కొంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి చెప్తూ అతను సినిమా కోసం ఎంతగానో కష్టపడతాడని పేర్కొంది. ముఖ్యంగా సల్మాన్ దగ్గర నుంచి చేసే పని పట్ల అంకితభావాన్ని కల్గి ఉండటాన్ని నేర్చుకున్నానంది. తాను నటన కోసం ప్రత్యేకంగా ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేన, షూటింగ్ సమయంలోనే నటనలో మెళకువలు నేర్చుకున్నానని తెలిపింది. కాగా ప్రస్తుతం సోనాక్షి సిన్హ యాక్షన్ మూవీ ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’లో అజయ్ దేవ్గన్తో జోడీ కడుతోంది. -
తెలుగు ‘దబాంగ్ 3’ ప్రీ–రిలీజ్ వేడుక
-
ఆటకైనా.. వేటకైనా రెడీ
సల్మాన్‌ఖాన్ హీరోగా ‘దబాంగ్’ సిరీస్‌లో తెరకెక్కిన చిత్రం ‘దబాంగ్ 3’. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఇందులో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటించారు. అర్బాజ్ ఖాన్, నిఖిల్ ద్వివేది, సల్మాన్‌ఖాన్ నిర్మించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రేపు విడుదల కానుంది. సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్ సౌజన్యంతో సురేష్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ ‘దబాంగ్ 3’ తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుక బుధవారం జరిగింది.ఈ వేడుకకు హీరోలు వెంకటేష్, రామ్ చరణ్ అతిథులుగా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ – ‘‘వెంకీమామ.. అంటే వెంకటేష్‌గారు.. నాకు పాతికేళ్లుగా స్నేహితులు. రామ్‌చరణ్ నాన్నగారు చిరంజీవి నాకు చాలా క్లోజ్. రామ్‌చరణ్ నాకు తమ్ముడులాంటివాడు. చరణ్ కూడా నాకు క్లోజే. ఈ సినిమాలో హీరోగా నా స్థాయిని పెంచేలా నటించారు కన్నడ నటుడు సుదీప్. ‘దబాంగ్ 3’ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అంటూ చిత్రంలోని ‘ఆటకైనా.. వేటకైనా రెడీ’ అనే డైలాగ్ చెప్పారు. వెంకటేష్- ‘‘దబాంగ్ 3’లో సల్మాన్ డైలాగ్స్ మామూలుగా లేవు. సల్మాన్‌ను ప్రేమించే అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను ’’ అన్నారు వెంకటేష్. రామ్‌చరణ్- ‘‘సల్మాన్‌భాయ్ నుంచి ఎన్ని నేర్చుకుంటున్నానో వివరించడానికి ఒక వేదిక, కొన్ని మాటలు సరిపోవు. సల్మాన్, సుదీప్, వెంకటేష్‌గారు, చిరంజీవిగారు.. ఇలాంటి సూపర్ స్టార్లు అందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అది యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ కాదు... క్రమశిక్షణ గురించి చెబుతున్నాను. వీరి నుంచి మా తరం క్రమశిక్షణను నేర్చుకుంటాం. నాతో పాటు చాలామందికి స్ఫూర్తిగా నిలిచిన సల్మాన్‌ఖాన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు రామ్‌చరణ్. ‘‘దబాంగ్ 3’ మన తెలుగు సినిమాలానే ఉంటుంది. థియేటర్లో చూసి ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేయాలి’’ అన్నారు ప్రభుదేవా. ‘‘సల్మాన్గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు సుదీప్. ‘‘ఇది మా అందరికీ చాలా ప్రత్యేకమైన సినిమా’’ అన్నారు సోనాక్షీ సిన్హా. ‘‘ఈ చిత్రంలో ‘హుడ్ హుడ్, గుభాళించనే’ అనే పాటలు రాసే అవకాశం ఇచ్చిన సల్మాన్, ప్రభుదేవాగార్లతో పాటు సంధానకర్తగా వ్యవహరించిన రాజేశ్వరీ సుధాకర్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు రచయిత రామజోగయ్య శాస్త్రి. ‘‘జీవితంలో కండలు పెంచాలనే కోరిక ఉండేది. అది తీరలేదు. కానీ కండల వీరుడికి పాట రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇందులో ‘ఊ కొడితే, తొలిగా తొలిగా..’ అనే పాటలు రాశాను. ప్రభుదేవా, వీవీవీ రాయుడుగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు రచయిత అనంత శ్రీరామ్. సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధి జగదీష్, ఏషియన్ సునీల్ నారంగ్, భరత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నా బ్యాగ్‌ను ఖరాబు చేశారు: హీరోయిన్ ఆగ్రహం
ముంబై: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో విమానంలో ప్రయాణించిన ఆమె.. విమాన ప్రయాణంలో తన ఖరీదైన లగేజ్ బ్యాగ్ డ్యామేజ్ చేశారని, బ్యాగ్ హ్యాండిల్, వీల్స్ విరిగిపోయాయంటూ ఓ వీడియోను షేర్ చేశారు. పటిష్టమైన బ్యాగ్‌ను ధ్వంసం చేసిపారేశారంటూ ఆమె మండిపడ్డారు. మంచి బ్యాగ్‌ను తీసుకొని మీ ఇండిగో విమానంలో ప్రయాణిస్తే.. ప్రయాణం ముగిసేసరికి బ్యాగ్ రెండు హ్యాండిల్స్ విరిగిపోయానని, వీల్స్ పూర్తిగా ఊడిపోయానని, మీ ధాటికి సామ్‌సొనైట్ బ్యాగ్ తట్టుకోలేకపోయిందంటూ ఇండిగో సిబ్బందికి సోనాక్షి వ్యంగ్యంగా కృతజ్ఞతలు తెలిపారు. బాలీవుడ్లో వరుస సినిమాలతో సోనాక్షి ప్రస్తుతం దూసుకుపోతున్నారు. అక్షయ్‌కుమార్‌తో కలిసి మిషన్ మంగళ్ సినిమాలో నటించిన ఈ అమ్మడు త్వరలో సల్మాన్ ఖాన్ సరసన ‘దబాంగ్-3’ లో అలరించనున్నారు. -
ఖాకీ వేస్తే పోలీస్... తీస్తే రౌడీ
‘‘ప్రతి సినిమా విజయం సాధించాలనే కష్టపడి చేస్తాం. ఆ ఒత్తిడి మాపై ఉంటుంది. కానీ ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటేనే విజయం దక్కుతుంది. మేం స్టార్స్ కావడానికి వారి ఆశీర్వాదమే కారణం’’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ హీరోగా ‘దబాంగ్’ సిరీస్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘దబాంగ్ 3’. సోనాక్షీ సిన్హా హీరోయిన్గా నటించారు. అర్బాజ్‌ఖాన్, నిఖిల్ ద్వివేది, సల్మాన్‌ఖాన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ హిందీ, కన్నడ భాషల్లో డిసెంబరు 20న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘ఖాకీ వేస్తే పోలీస్.. తీస్తే రౌడీ.. టోటల్‌గా ఆల్ రౌండర్ని’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్ కిక్ ఇచ్చేలా ఉంది. ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిమానులు, విలేకరులతో ‘దబాంగ్ 3’ కీలక చిత్రబృందం మాట్లాడారు. ఈ సందర్భంగా సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఇది క్లాస్ మాస్ ఫిల్మ్. సౌత్ సినిమా ఫార్మాట్‌కు దగ్గరగా ఉంటుంది. గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో నేను చేసిన ‘వాంటెడ్’ తెలుగు ‘పోకిరి’ చిత్రానికి రీమేక్. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ చిత్రాలకు బాలీవుడ్లో మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం సౌత్ సినిమాలు హిందీలో అనువాదం అవుతున్నాయి. అందరూ చూస్తున్నారు. హిట్ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌కు వస్తాను’’ అన్నారు. ప్రభుదేవా ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్‌ను కలిసే ప్రయత్నం చేస్తా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సల్మాన్. ‘‘దబాంగ్ 3’పై ఏర్పడ్డ అంచనాలను అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు ప్రభుదేవా. -
భర్త క్షేమం కోరి...
కర్వా చౌత్... ఉత్త రాదిన పాటించే ఆచారం ఇది. కర్వా చౌత్ నాడు భర్త ఆయురారో గ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడిని చూశాక భోజనం చేస్తారు. హిందీ పరిశ్రమలో ప్రతి ఏడాదీ ఉపవాసం ఆచరించి, పూజలు చేసే తారలు చాలామందే ఉన్నారు. గురువారం కర్వా చౌత్ సందర్భంగా కొందరు తారలు ఉపవాసం ఉన్నారు. తన భార్య జయా బచ్చన్ ఉపవాసం ఉన్న విషయాన్ని అమితాబ్ ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. గతంలో తామిద్దరూ దిగిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో తాను కనిపించకుండా జయబాధురి కనిపించేట్లు ఫొటో పెట్టి, ‘బెటర్ హాఫ్. మిగతా సగం ఇక్కడ అనవసరం. అందుకే కనిపించడంలేదు’’ అని సరదాగా అన్నారు. అనిల్ కపూర్ తాను పరిగెడుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘‘ఇన్నేళ్లుగా నువ్వు (భార్య సునీతను ఉద్దేశించి) చూపిస్తున్న ప్రేమ, చేస్తున్న పూజలు, ఆచరిస్తున్న ఉపవాసాలే నన్ను వేగంగా పరిగెత్తేలా చేస్తున్నాయి. ప్రతిరోజూ నేను ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాయి. హ్యాపీ కర్వా చౌత్’’ అని పేర్కొన్నారు. ‘‘ఉపవాసం కోసం అంతా సిద్ధం చేసుకున్నాను. కొందరు కనిపించని, ఎప్పటికీ కలవని దేవుళ్ల కోసం ఉపవాసం ఉంటారు. కానీ నేను బతికి ఉన్నవాళ్ల కోసం చేస్తుంటాను. నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా తల్లిదండ్రులు, నా భర్త, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అన్నారు రవీనా టాండన్. ఫిట్నెస్కి బాగా ప్రాధాన్యం ఇచ్చే శిల్పా శెట్టి.. ఉపవాసం ఉంటున్న వాళ్ల కోసం ‘లౌకీ కీ ఖీర్’ అనే పోషకాలు ఉన్న స్వీట్‌ని ఎలా తయారు చేయాలో చెప్పారు. సొరకాయతో ఈ ఖీర్ తయారు చేస్తారు. ప్రతి ఏడాదీ కర్వా చౌత్‌ని బాగా చేసుకుంటారు శిల్పా శెట్టి. ఈ ఏడాది కూడా ఫాస్టింగ్ ఉన్నారు. బార్సిలోనాలో శ్రియ పండగ చేసుకున్నారు. గత ఏడాది మార్చిలో రష్యాకి చెందిన వ్యాపార వేత్త ఆండ్రీ కొషీవ్ని ఆమె పెళ్లాడారు. ‘‘అందరికీ కర్వా చౌత్ శుభాకాంక్షలు. మా అమ్మగారిని మిస్ అవుతున్నాను. అయితే పండగ సందర్భంగా తను పంపించిన ‘గోటా పట్టి’ చీర కట్టుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రియ. ఇంకా షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ కూడా భర్త కోసం ఉపవాసం ఉన్నారు. ఇలా గురువారం తారల డిజైనర్ శారీస్, నగలతో ఉత్తరాదిన కర్వా చౌత్ సందడి కనిపించింది. ఇంకో విషయం ఏంటంటే...పండగ సందర్భంగా ‘దబాంగ్ 3’లో సోనాక్షీ సిన్హా లుక్‌ని విడుదల చేశారు. మామూలుగా కర్వా చౌత్ రోజున జల్లెడ లోంచి చంద్రుడ్ని చూస్తారు. ఈ లుక్ కూడా అలానే ఉంది. సో.. సినిమాలో భర్త సల్మాన్ ఖాన్ కోసం సోనాక్షీ కర్వా చౌత్ ఆచరించే సీన్ ఉంటుందన్న మాట. జయా బచ్చన్ ఆండ్రీ, శ్రియ -
నటిని పశువుతో పోల్చిన అధికారి
లక్నో: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా విపరీతంగా ట్రోల్ అవుతున్న సంగతి తెలిసిందే. గత వారం కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి హాజరైన సోనాక్షి.. రామాయణానికి సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. నాటి నుంచి సోషల్ మీడియాలో, బయట జనాలు సోనాక్షిని విపరీతంగ్రా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యూపీ అధికారి సోనాక్షిని ధన పశువు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వివరాలు.. సునిల్ భరాలా అనే సీనియర్ అధికారి ఒకరు.. ‘ఆధునిక కాలంలో ఇలాంటి జనాలు కేవలం డబ్బు సంపాదన గురించి మాత్రమే ఆలోచిస్తారు. డబ్బు సంపాదించడం.. దాన్ని కూడా తమ కోసమే ఖర్చు పెట్టడం గురించి మాత్రమే వీళ్లు ఆలోచిస్తారు. ఇలాంటి వారికి చరిత్ర గురించి కానీ, దేవుడి గురించి కానీ ఎలాంటి అవగాహన ఉండదు. తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించారు. వీరంతా ధన పశువులు. వీరిని చూసి చింతించడం తప్ప ఏం చేయలేం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేబీసీ కార్యక్రమానికి హాజరైన సోనాక్షిని, అమితాబ్ బచ్చన్ రామాయణానికి సంబంధించి ఎవరికోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు అని ప్రశ్నించి, నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు. కానీ సోనాక్షి సమాధానం చెప్పలేక లైఫ్‌లైన్ వినియోగించుకున్న సంగతి తెలిసిందే. సోనాక్షి తీరు పట్ల బిగ్ బీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీ ఇంటికి రామాయణం అని పెట్టుకున్నారు. అన్నిటింకి మించి రాముడి సోదరుల్లో ఒకరి పైరైనా శత్రుఘ్న పేరును మీ తండ్రి పెట్టుకున్నాడు. అయినా నీకు ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా అంటూ బిగ్ బీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
‘మీమ్స్ అంటే పిచ్చి..ఇంకొన్ని కావాలి’
ఎవరైనా పని లేని వాళ్లు ఉంటే తన మీద మరిన్ని మీమ్స్ సృష్టించాలని కోరుతున్నారు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. మీమ్స్‌ను పిచ్చిగా ప్రేమిస్తానని...తన మీద జోకులు వేయడాన్ని ఆస్వాదిస్తానని పేర్కొన్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. అమితాబ్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో సోనాక్షి ఇటీవల పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాట్సీట్లో కూర్చున్న సోనాక్షికి బిగ్ బీ...ఎవరికోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు? అని ప్రశ్న సంధించాడు. ఇందుకు.. ఏ. సుగ్రీవుడు, బి.లక్ష్మణుడు, సీ. సీత, డీ. రాముడు అని నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు కూడా. అయితే సోనాక్షి మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకున్నారు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. వీటిపై హుందాగా స్పందించిన.. ‘ప్రియమైన ట్రోల్స్...నాకు పైథాగరస్ సిద్ధాంతం, మర్చంట్ ఆఫ్ వెనిస్, పిరియాడిక్ టేబుల్, మొఘల్ వంశం.. ఇంకా చాలా చాలా గుర్తుకులేవు. అసలు గుర్తులేని విషయాలేంటో కూడా మర్చిపోయాను. మీకు పనేమీ లేకపోతే..ఈ విషయలాన్నింటిపై మీమ్స్ సృష్టించండి. ఐ లవ్ మీమ్స్ అంటూ ఘాటు సమాధానమిచ్చారు. ఈ ట్వీట్‌పై స్పందించిన సోనాక్షి అభిమానులు..భలే కౌంటర్ ఇచ్చారు మేడమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Dear jaage hue trolls.I don't even remember the Pythagoras theorem,Merchant of Venice,Periodic Table,Chronology of the Mughal Dynasty,aur kya kya yaad nahi woh bhi yaad nahi. Agar aapke paas koi kaam nahi aur Itna time hai toh please yeh sab pe bhi memes banao na. I love memes 😂 — Sonakshi Sinha (@sonakshisinha) September 21, 2019 -
ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా?!
ముంబై: దేశంలో రామాయణం, మహాభారతం గురించి తెలియని చాలా తక్కువగా ఉంటారు. హిందు మత ఇతిహాసాలైన ఈ గ్రంథాల గురించి.. సినిమాలు, సీరియళ్లతోపాటు నవలలు ఇప్పటికీ వెలువడుతూనే ఉన్నాయి. కానీ, రామాయణానికి సంబంధించి ఓ చిన్న ప్రశ్నకు ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సమాధానం చెప్పలేకపోయారు. ఇటీవల ఆమె ప్రముఖ క్విజ్ రియాలిటీ షో కౌన్ బనేగా కరోడపతిలో పాల్గొన్నారు. గత రాత్రి ప్రసారమైన ఈ షోలో ‘హాట్ సీట్’లో కూర్చున్న సోనాక్షిని హోస్ట్ అమితాబ్ బచ్చన్ రామాయణానికి సంబంధించి ఓ ప్రశ్న అడిగారు. ఎవరికోసం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు? అని అడిగిన అమితాబ్.. ఏ. సుగ్రీవుడు, బీ.లక్ష్మణుడు, సీ. సీత, డీ. రాముడు అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. సోనాక్షి మాత్రం ఈ ప్రశ్న సమాధానం చెప్పలేక.. ఒక లైఫ్‌లైన్‌ను ఉపయోగించుకున్నారు. దీంతో ఇంత చిన్న ప్రశ్నకు సమాధానం తెలియదా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నల ఆధారంగా సాగే క్విజ్ షో అయిన కౌన్ బనేగా కరోడపతి షోకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. -
నమ్మలేకపోతున్నా!
బాలీవుడ్లో అగ్రకథానాయికల జాబితాలో పేరు సంపాదించుకున్నారు నటి సోనాక్షీ సిన్హా. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్’ (2010) సినిమాతో సోనాక్షి హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. హీరోయిన్గా తొమ్మిదేళ్ల సక్సెస్ జర్నీని కంప్లీట్ చేశారామె. ఈ సందర్భంగా సోనాక్షి మాట్లాడుతూ – ‘‘హీరోయిన్గా నా తొలి చిత్రం ‘దబాంగ్’ విడుదలై అప్పుడే తొమ్మిదేళ్లు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నాను. అంత టైమ్ ఇంత త్వరగా గడిచిపోయిందా? అనిపిస్తోంది. ఏదో నిన్ననే ‘దబాంగ్’ చిత్రం విడుదలైన ఫీలింగ్‌లో ఉన్నా. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ నటిగా అద్భుతమైన నా జర్నీని ఇలానే కొనసాగించడానికి కష్టపడతాను’’ అన్నారు. ప్రస్తుతం ‘దబాంగ్ 3’ చిత్రంలో సల్మాన్‌ఖాన్, సోనాక్షి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 20న విడుదల కానుంది. -
ఒక్క సెల్ఫీ భాయ్!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ముంబై రోడ్లపై సైకిల్ తొక్కారు. పెద్ద పెద్ద కార్లలో ప్రయాణించే సల్మాన్ సడన్‌గా ఇలా సైకిల్‌తో రోడ్డు ఎక్కడానికి కారణం ఉంది. ముంబైలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘దబాంగ్ 3’ చిత్రీకరణ ముంబైలోనే జరుగుతోంది. వర్షాల వల్ల కారులో వెళితే ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయని సల్మాన్ ఊహించి ఉంటారు. అందుకే సైకిల్‌పై ‘దబాంగ్ 3’ సెట్స్‌కు వెళ్లారు. సల్మాన్ వంటి సూపర్‌స్టార్ రోడ్డుపై కనిపిస్తే అభిమానులు ఊరుకోరు కదా.. వెంటనే ఒక్క సెల్ఫీ భాయ్ అని అడిగారు. స్మైల్‌తో సల్మాన్ పోజిచ్చారు. ఇలా చాలా మంది సెల్ఫీస్‌లో బందీ అయిపోయారు సల్మాన్. ఇక ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘దబాంగ్ 3’ సినిమాలో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్
అవును.. నన్ను అరెస్టు చేశారు అంటున్నారు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. అస్లీసోనాఅరెస్టెడ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో నిన్నటి నుంచి ఓ వీడియో ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. ‘ మీరు నన్ను ఇలా అరెస్టు చేయకూడదు. అసలు నేనెవరో తెలుసా? నేనే తప్పూ చేయలేదు. ఇలా ఎలా అరెస్టు చేస్తారు’ అంటూ సోనాక్షి నిలదీస్తున్నట్లుగా ఉన్న వీడియోను చూసి ఆమె అభిమానులు బెంబేలెత్తిపోయారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని తెలుసుకుని హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. మైగ్లామ్ అనే మేకప్ కలెక్షన్ బ్రాండ్ తరఫున సోనాక్షి ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా ఆమె అరెస్టు అయినట్లుగా ఉన్న వీడియోను రూపొందించారు. ఈ క్రమంలో తన కొత్త యాడ్ విశేషాలను సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘ అవును నన్ను అరెస్టు చేశారు. ఎందుకో అడగండి?- ఎందుకంటే ఇంత అందంగా కనిపించడం నేరం కాబట్టి.!!! మై గ్లామ్ తరఫున ప్రచారం చేస్తున్నానని చెబుతున్నందుకు ఉద్వేగానికి లోనవుతున్నా. దీని ఉత్పత్తులతో మీరు ఎంతో అందంగా కనిపిస్తారు. ఎప్పుడైనా..ఎక్కడైనా’ అని మరోసారి ప్రోడక్ట్‌ను ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను సోనాక్షి అక్షరాలా పాటిస్తోందని.. అయితే అందుకు ఆమె చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు కాస్త చిరాకు తెప్పిస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram YEAH... I got arrested!!! WHY, you ask? - BECAUSE ITS A CRIME TO LOOK THIS GOOD!!!! SO excited to announce that I'm the face for POSE by @myglamm , their new collection of camera-ready HD makeup. It makes you look so good, you can POSE whenever, wherever! #MyGlamm #POSE #POSEMakeup #POSEHDMakeup #HDMakeup #Makeup #CameraReady #InstaMakeup #CrueltyFreeMakeup #VeganBeauty #AsliSonaArrested #WhereIsSonakshiSinha A post shared by Sonakshi Sinha (@aslisona) on Aug 6, 2019 at 10:50pm PDT -
అది మా అందరి వైఫల్యం
సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్, సోనాక్షీ సిన్హా ముఖ్య పాత్రల్లో అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కళంక్’. ఎన్నో అంచనాలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలయిన ఈ చిత్రం నిరాశపరచించి. ఈ చిత్ర వైఫల్యం గురించి వరుణ్ ధావన్ స్పందించారు. ‘‘కళంక్’ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదంటే అది బ్యాడ్ ఫిల్మ్ అని అర్థం. ఎక్కడో మా టీమ్ అందరూ ఫెయిల్ అయ్యాం. సినిమా అనేది టీమ్ అందరి కష్టం. కేవలం దర్శకుడినో, నిర్మాతనో తప్పుబట్టడం సరికాదు. టీమ్‌లో భాగమైనందుకు నేను కూడా నిందని తీసుకుంటున్నాను. ఫెయిల్యూర్ని మన కచ్చితంగా ప్రభావం చూపాలి. లేదంటే మనం చేస్తున్న పనిని ప్రేమతో చేస్తున్నట్టు కాదని నా ఉద్దేశం’’ అన్నారు. -
ఐటమ్ భాయ్?
మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలకు స్పెషల్ అట్రాక్షన్ ‘ఐటమ్ సాంగ్’. ఆ స్పెషల్ సాంగ్‌ను టాప్ హీరోయిన్స్ లేదా ఐటమ్ గాళ్స్‌తో డ్యాన్స్ చేయించాలనుకుంటారు దర్శక–నిర్మాతలు. తాజాగా ‘మా సినిమాలో ఐటమ్ సాంగ్‌కు ఎవ్వరూ అవసరం లేదు’ అనుకుంటున్నారట సల్మాన్ ఖాన్, ‘దబాంగ్ 3’ చిత్రబృందం. బాలీవుడ్ భాయ్ సల్మాన్ తన కొత్త చిత్రం ‘దబాంగ్ 3’ కోసం ఐటమ్ భాయ్ కాబోతున్నారని బాలీవుడ్ టాక్. ‘దబాంగ్’లో ‘మున్నీ బద్నామ్ హుయి డార్లింగ్ తేరేలియే....’ అంటూ సాగే స్పెషల్‌సాంగ్ ఆ సినిమాకే హైలైట్. మలైకా అరోరా వేసిన స్టెప్స్ స్పెషల్ అట్రాక్షన్. ‘దబాంగ్ 2’లో కరీనా కపూర్‌తో ‘ఫేవికాల్ సే’ సాంగ్‌ను తెరకెక్కించారు. ఆ పాట కూడా సూపర్ హిట్. తాజాగా ‘దబాంగ్ 3’లో ఐటమ్ నంబర్ ఎలా ఉంటుందని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘దబాంగ్ 3’ స్పెషల్ సాంగ్‌లో కాలు కదపడం లేదని మలైకా స్పష్టం చేశారు. ఇప్పుడు స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తారని చూస్తుంటే ఓ క్రేజీ న్యూస్ తెలిసింది. ‘దబాంగ్’ ఐటమ్ సాంగ్ సిరీస్‌లో ట్విస్ట్ వచ్చింది. ‘దబాంగ్’ ఫస్ట్‌పార్ట్‌లో ఉన్న ‘మున్నీ బద్నామ్...’ను మున్నాగా మార్చి కొత్త పాట రాస్తున్నారట. ఈ కొత్త లిరిక్స్‌కు మ్యాచింగ్‌గా సల్మానే స్టెప్స్ వేయబోతున్నారట. ఇదే నిజమైతే సల్మాన్ ట్రేడ్‌మార్క్ స్టెప్స్ అభిమానులకు విందు అవుతాయని చెప్పొచ్చు. డిసెంబర్ 20న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయిక. -
తల్లి తరఫున ప్రచారంలో బాలీవుడ్ నటి
లక్నో: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఎన్నికల ప్రచారంలో సందడి చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోక్‌సభ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) తరఫున తన తల్లి పూనమ్ సిన్హా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడంతో పూనమ్ సిన్హా విజయాన్ని కోరుతూ.. శుక్రవారం లక్నో వీదుల్లో నిర్వహించిన ర్యాలీలో సోనాక్షి సిన్హా పాల్గొన్నారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి, కన్నౌజ్ ఎంపీ అభ్యర్థి డింపుల్ యాదవ్‌తో కలిసి సోనాక్షి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజాసేవ కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన తల్లిని గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. పూనమ్‌తో పాటు సోనాక్షి, డింపుల్ రావడంతో వారిని చూసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక లక్నో లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పూనమ్, బీజేపీ నుంచి కేంద్రమంత్రి, సిటింగ్ ఎంపీ రాజ్‌నాథ్ సింగ్ పోటీ పడుతుండగా, కాంగ్రెస్ నుంచి గురు ఆచార్య ప్రమోద్ కిృష్ణణ్‌ను బరిలో నిలిచిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రాతినిథ్యం వహించిన లక్నోలో 1991 నుంచి ఇప్పటి వరకు బీజేపీ మినహా మరేపార్టీ విజయం సాధించలేదు. 1991 నుంచి 2009 వరకు వాజ్‌పేయీ ఇక్కడ విజయం సాధించగా.. 2014లో రాజ్‌నాథ్ సింగ్ గెలుపొందారు. ఎస్పీ, బీఎస్పీ కూటగా పోటీ చేస్తుండడంతో ఈ స్థానం ఎన్నిక ఉత్కంఠంగా మారింది. కాగా సోనాక్షి తండ్రి శత్రుష్ను సిహ్హా బిహార్‌లోని పట్నాసాహెబ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
వారు నన్ను ఓ స్టార్లా చూడరు..
ముంబై : తన కుటుంబ సభ్యులు, స్నేహితులు తనను ఎన్నడూ ఓ స్టార్‌గా చూడలేదని ప్రముఖ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా కుమార్తె, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా చెప్పారు. తన సన్నిహితులు తనను చూసే విధానం తాను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రతి మూవీని తాను తన తొలి చిత్రంగానే భావించి కష్టపడతానని తెలిపారు. తాను తన పాత్రను ఆకళింపు చేసుకుని అందులోకి తనను తాను నిమగ్నమయ్యేలా కసరత్తు చేస్తానని సోనాక్షి వెల్లడించారు. నిజజీవితంలో తల్లితండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, చిన్ననాటి స్నేహితులు ఎవరూ తనను ఓ స్టార్‌గా చూడరని, వారికి తాను తమకు తెలిసిన సోనాగానే ఉంటానని చెప్పారు. తన చుట్టూ చేరిన వారు యస్ మేడమ్ అనడం వాస్తవం కాదని, తనను ప్రేమించే వారు అదే సమయంలో సద్విమర్శలు చేయడం సహజత్వమని సోనాక్షి సిన్హా అన్నారు. ఈ ఏడాది తొలి మూవీగా తాను నటిస్తున్న కళంక్ విడుదల కానుందని , మరో మూడు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. -
‘దబాంగ్3’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ దబాంగ్ మూవీ రికార్డులను క్రియేట్ చేయగా.. సినిమాలోని తన పాత్రపై సల్మాన్ ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నారు. దీనిలో భాగంగానే సీక్వెల్‌ను కూడా తీశారు. అయితే.. సీక్వెల్‌గా తీసిన దబాంగ్2 అంతగా మెప్పించలేకపోయింది. మళ్లీ మూడో సిరీస్‌ను సిద్దం చేస్తున్నాడు సల్మాన్ భాయ్. ప్రభుదేవా డైరెక్షన్లో ‘దబాంగ్3’ చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ మూవీ మొదటి షెడ్యూల్‌ను మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో ప్రారంభించాడు. అక్కడ షూటింగ్ చేస్తుండగా.. ఓ పురాతన విగ్రహం ధ్వంసమైందనే వార్త వైరల్ అయింది. అయితే మొత్తానికి దబాంగ్3 చిత్రబృందం మొదటి షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఇందులో కూడా సోనాక్షి సిన్హానే హీరోయిన్గా తీసుకున్నారు. వాంటెడ్ చిత్రం తరువాత ప్రభుదేవా డైరెక్షన్లో సల్మాన్ ‘దబాంగ్3’ని చేస్తున్నాడు. -
‘నాన్న.. ఈ పని ఎప్పుడో చేయాల్సింది ’
ముంబై : బీజేపీని వీడి తన తండ్రి మంచి పనిచేశారని బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా అన్నారు. గౌరవం లేని చోట ఉండే బదులు కనీస మర్యాద పాటించే వారి సమక్షంలో ఉండటం ఉత్తమమని పేర్కొన్నారు. మూడు దశాబ్ధాల పాటు బీజేపీలో కొనసాగిన బీజేపీ రెబల్ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఏప్రిల్ 6న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన కూతురు సోనాక్షి సిన్హా మాట్లాడుతూ.. ‘ నాకు తెలిసి చాలా ఏళ్ల క్రితమే మా నాన్న ఈ పని చేయాల్సింది. ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీలో ఆయనకు తగిన గౌరవమర్యాదలు ఎప్పుడూ లభించలేదు’ అని వ్యాఖ్యానించారు. కాగా బిహార్‌లోని పట్నాసాహిబ్ లోకసభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందిన శత్రుఘ్న సిన్హాకు బీజేపీ ఈ సారి టికెట్ నిరాకరించింది. ఆ సీటును కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేటాయించింది. దీంతో తనకు టికెట్ నిరాకరించిన బీజేపీ నాయకత్వానికి తానూ అదేస్ధాయిలో బదులిస్తానని సిన్హా ఇదివరకే స్పష్టం చేశారు. అద్వానీకి గాంధీనగర్ నుంచి తిరిగి పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం పట్లా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దిగ్గజ నేతను రాజకీయాల నుంచి వైదొలిగేలా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. రవిశంకర్‌కు పోటీగా కాంగ్రెస్ శత్రుఘ్న సిన్హాను బరిలో దించనున్నట్లు తెలుస్తోంది. -
మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో యువ దర్శకుడు అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్న మహేష్ ఆ సినిమా పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి సినిమాను పట్టాలెక్కించే ఆలోచన ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా చాలా మంది తారల పేర్లు తెర మీదకు వస్తున్నాయి. ముందుగా మహేష్‌కు జోడిగా సాయి పల్లవి నటిస్తుందన్న టాక్ వినిపించింది, తరువాత రష్మిక పేరు తెర మీదకు వచ్చింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా ఓ బాలీవుడ్ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నారన్న వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. మహేష్ సరసన హీరోయిన్గా సోనాక్షి సిన్హాను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట అనిల్ రావిపూడి. గతంలో క్రిష్ దర్శకత్వంలో మహేష్, సోనాక్షిలు హీరో హీరోయిన్లుగా ఓ సినిమా రూపొందనుందటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. మరి అనిల్ సినిమాతో అయిన ఈ జంట అభిమానులను అలరిస్తుందేమో చూడాలి. -
హీరోయిన్ అరెస్ట్‌పై హైకోర్టు స్టే..!
లక్నో: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అరెస్ట్‌పై అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చింది. మొరాబాద్‌కు చెందిన ఓ ఆర్గనైజర్ గత నెలలో సోనాక్షిపై క్రిమినల్ కేసును దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన హైకోర్టు కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి వేధింపులకు, ఇబ్బందులకు గురిచేయ్యవద్దనే ఉద్దేశంతోనే స్టే విధిస్తున్నామని అలహాబాద్ హైకోర్టు వివరించింది. నవంబర్ 24న సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెప్టెంబర్ 30న ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సోనాక్షి రూ. 37 లక్షలు తీసుకున్నారని, చివరి నిమిషంలో ఈవెంట్రి ఆమె హాజరుకాలేదని ఆరోపిస్తూ ప్రమోద్ శర్మ అనే ఆర్గనైజర్ ఫిర్యాదు చేశారు. ఆమె రాకపోవడంతో తనకు భారీఎత్తున నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసుని విచారించిన న్యాయముర్తి ఆమె అరెస్ట్‌పై స్టే విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో సోనాక్షి సహా 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
స్త్రీ శక్తి
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి బహార్ బేగం, రూప్, సత్యలు వచ్చేశారు. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో సంజయ్‌దత్, వరుణ్ ధావన్, ఆదిత్యా కపూర్, మాధురీ దీక్షిత్, సోనాక్షీ సిన్హా, ఆలియా భట్ ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ పీరియాడికల్ మూవీ ‘కళంక్’. 1921 నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలిసింది. గురువారం ఈ సినిమాలోని మేల్ యాక్టర్స్ లుక్స్, రోల్స్ వివరాలను వెల్లడించింది. చిత్రబృందం. బల్రాజ్ చౌదరిగా సంజయ్‌దత్, జాఫర్‌గా వరుణ్ ధావన్, దేవ్‌గా ఆదిత్యాకపూర్లు కనిపిస్తారు. శుక్రవారం ఫిమేల్ ఆర్టిస్టుల వివరాలను తెలిపారు. బహార్ బేగం, సత్య, రూప్ పాత్రల్లో మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్ నటించారు. ఈ ముగ్గురివీ శక్తిమంతమైన పాత్రలని సమాచారం. ఇక్కడున్న ఈ ముగ్గురి ఫొటోలు సినిమాలోని లుక్స్‌కి సంబంధించినవే. హీరోయిన్లు కృతీ సనన్, కియారా అద్వానీలు ఈ సినిమాలో ప్రత్యేకపాత్రలు చేశారు. దాదాపు 21ఏళ్ల తర్వాత సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్ కలిసి నటించిన చిత్రమిది. ఇంతకుముందు మాధురి, సంజయ్ 1997లో ‘మహానతా’ అనే సినిమాలో నటించారు. ఇక తాజా చిత్రం ‘కళంక్’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. -
కలలకు సంకెళ్లు!
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి తన కలలను నిజం చేసుకోవాలనుకుంటుంది. కానీ ఆమె కలలకు కుటుంబ బాధ్యతలు సంకెళ్లు వేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? ఆమెకు కుటుంబం నుంచి ఎలాంటి సహకారం లభించింది అనే అంశాల ఆధారంగా హిందీలో ఓ సినిమా రూపొందనుంది. సోనాక్షీ సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తారు. ఈ సినిమాతో శిల్పీ దాస్ గుప్తా దర్శకునిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా షూటింగ్ నేడు పంజాబ్‌లో ప్రారంభం అవుతుంది. ‘‘మన చుట్టూ ఉండే ఎందరో అమ్మాయిల కథే ఈ సినిమా. ఇందులో నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో కేవలం ఎమోషన్స్ మాత్రమే కాదు.. ఫన్ కూడా ఉంటుంది. షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు సోనాక్షీ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా నవ్విస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తుంది. ప్రతి క్యారెక్టర్‌తో ఆడియన్స్ లవ్‌లో పడిపోతారు’’ అని నిర్మాతల్లో ఒకరైన భూషణ్‌కుమార్ పేర్కొన్నారు. ఇటీవలే ‘కళంక్’ మూవీ షూట్‌ను కంప్లీట్ చేసిన సోనాక్షి ప్రస్తుతం ‘మిషన్ మంగళ్’ సినిమాలో నటిస్తున్నారు. -
ఆ ఫీలింగ్ కలగలేదు!
ఇప్పటివరకు సౌత్‌లో సత్తా చాటి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కథానాయిక నిత్యామీనన్. ఈ ఏడాది ఆమె నార్త్ వైపు(బాలీవుడ్) కూడా దృష్టిసారించారు. ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మార్స్ మిషన్ ఆధారంగా తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘మిషన్ మంగళ్’ సినిమాలో నిత్యామీనన్ శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, సోనాక్షీ సిన్హా, తాప్సీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హిందీలో ఆమె ‘బ్రీత్ 2’ అనే వెబ్ సిరీస్‌లో అభిషేక్ బచ్చన్‌కు జోడీగా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇన్ని రోజులు సౌత్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన మీరు ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారు అన్న ప్రశ్నను నిత్యామీనన్‌ను అడిగినప్పుడు–‘‘హిందీ పరిశ్రమలో నేను ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను కానీ ఇక్కడి వారికి నేను తెలుసు. నా సినిమాలు కొన్ని హిందీలో డబ్ అయ్యాయి. న్యూ కమర్‌ని అని, అవుట్‌సైడర్‌ని అన్న ఫీలింగ్ కలగలేదు నాకు. తక్కువ కాలంలోనే స్నేహితులుగా కలిసిపోయాం. ఇప్పుడు నేను హిందీలో చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్‌కు కెమెరామెన్స్ తమిళులే. వారితో నేను తమిళంలోనే మాట్లాడుతున్నాను. అక్కడ కంఫర్ట్‌గానే ఉంది. ‘మిషన్ మంగళ్’ సినిమాలో నా షూటింగ్ పూర్తికావొచ్చింది. బ్రీత్ వెబ్‌సిరీస్ ‘బ్రీత్ 2’లో నటిస్తున్నా. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘ఐరన్‌లేడీ’ సినిమాలో లీడ్ రోల్ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు. -
అబ్బే అదేం లేదు
.. అంటున్నారు బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఏ వార్తను ఇలా కొట్టిపారేస్తున్నారంటే.. బాలీవుడ్ యంగ్ హీరో జహీర్ ఇక్బాల్‌తో తాను లవ్‌లో ఉన్నాననే విషయాన్ని. 2018 సోనాక్షికి వృత్తి రీత్యా సరిగ్గా కలసి రాలేదు. వ్యక్తిగతంగా మాత్రం ఈ యంగ్ హీరోతో ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కథనాలు రాసుకొచ్చింది. ఇంతకీ జహీర్ ఇక్బాల్ ఎవరంటే.. త్వరలోనే బాలీవుడ్‌కు పరిచయం కానున్న హీరో. సల్మాన్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘నోట్‌బుక్’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. జహీర్, సోనాక్షీ కలవడానికి కారణం కూడా సల్మాన్‌ఖానే అని టాక్. రీసెంట్గా జరిగిన సల్మాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో జహీర్‌తో కలసి పార్టీకు కూడా హాజరు అయ్యారట సోనాక్షి. అయితే ఈ వార్తలను సోనాక్షి కొట్టిపారేశారు. ‘మేం రిలేషన్లో లేము. మా ఇద్దరి మధ్యలో రొమాన్స్ ఏం లేదు’ అని సమాధానమిచ్చారు. మరి ఏమీ లేకుండా కలిసి ఎందుకు తిరుగుతున్నట్లబ్బా? అని కొందరి సందేహం. ఆ సంగతలా ఉంచి, సినిమాల విషయానికి వస్తే సోనాక్షి ‘ కళంక్’ అనే పీరియాడికల్ చిత్రంలో నటించారు. జహీర్ ‘నోట్‌బుక్’ చిత్రం మార్చిలో విడుదల కానుంది. -
హీరోయిన్‌కి షాక్ ఇచ్చిన అమెజాన్
ఆన్లైన్ బిజినెస్‌లు పెరుగుతున్న కొద్ది మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆన్లైన్లో ఏదైన వస్తువు బుక్ చేసిన వారికి ఆ వస్తువులకు బదులు రాళ్లు, సబ్బులు లాంటవి రావటం మనం తరుచూ వార్తల్లో చూస్తుంటాం. తాజాగా ఇలాంటి అనుభవమే ఓ బాలీవుడ్ హీరోయిన్‌కు ఎదురైంది. సోనాక్షి సిన్హా అమెజాన్‌లో బోస్ కంపెనీ ఇయర్ ఫోన్స్ బుక్ చేశారు. అయితే ఆ ప్యాక్ ఇయర్ ఫోన్స్‌కు బదులు ఓ ఇనుప ముక్క ఉండటంతో సోనాక్షి షాక్‌కు గురయ్యారు. ఈ విషయంపై అమెజాన్ కస్టమర్ కేర్‌ను సంప్రదించే ప్రయత్నం చేసిన వారు సరిగ్గా స్పందించకపోవటంతో ఆమె సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేశారు. ‘అమెజాన్.. నేను బోస్ ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే ఏమో వచ్చాయో చూడండి. బయటకు బాక్స్ మంచి ప్యాక్ చేసిన నీట్‌గా సీల్‌వేసి ఉంది. మీ కస్టమర్ సర్వీస్ కూడా సాయం చేసేందుకు సిద్ధంగా లేదు’ అంటూ ట్వీట్ చేశారు. ఈవిషయంపై స్పందించిన అమెజాన్, సోనాక్షిని క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేయటంతో పాటు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. Hey @amazonIN! Look what i got instead of the @bose headphones i ordered! Properly packed and unopened box, looked legit... but only on the outside. Oh and your customer service doesnt even want to help, thats what makes it even worse. pic.twitter.com/sA1TwRNwGl — Sonakshi Sinha (@sonakshisinha) 11 December 2018 Anybody want to buy a brand new shiny piece of junk for 18,000 bucks? (Yup, its a steal) Dont worry, im selling, not @amazonIN, so ull get exactly what you’re ordering. pic.twitter.com/3W891TA7yd — Sonakshi Sinha (@sonakshisinha) 11 December 2018 Uh-oh! This is unacceptable! Apologies for the recent ordering experience and the subsequent correspondence with our support team. Please share your details here: https://t.co/vIE01Lj9nJ, we'll get in touch with you directly. ^JC — Amazon Help (@AmazonHelp) 11 December 2018 -
స్టార్టింగ్ అప్పుడేనా?
బాలీవుడ్ ‘దబాంగ్’ ఫ్రాంచైజీలో రానున్న థర్డ్ పార్ట్ ‘దబాంగ్ 3’. ఈ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు టీమ్. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లే షెడ్యూల్స్ గురించి క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 4న మొదలవుతుందని బాలీవుడ్ టాక్. ‘దబాంగ్ 3’ సినిమాలో సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తారు. ప్రభుదేవా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సోనాక్షీ సిన్హా కథానాయికగా నటిస్తారు. ప్రస్తుతం ‘భారత్’ సినిమాతో బిజీగా ఉన్నారు సల్మాన్‌ఖాన్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో కత్రినా కైఫ్ కథానాయిక. -
భలే చాన్సులే!
‘మిషన్ మంగళ్’ అంటూ స్పేస్‌లోకి వెళ్తున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. అంతేనా? తనతో పాటుగా ఐదుగురు హీరోయిన్స్‌ని తోడుగా తీసుకెళ్తున్నారు. జగన్ శక్తి అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా, కృతీ కుల్హారీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘మిషన్ మంగళ్’. భారతదేశం చేసిన మిషిన్ మార్స్ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ ఐదుగురు హీరోయిన్స్‌తో పాటు మరో భామ కూడా ఈ చిత్రానికి తోడయ్యారు. ‘నర్తనశాల’ ఫేమ్ కష్మీరా పరదేశి కూడా ఈ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేశారు. -
పాంచ్ పటాకా!
ధోని బయోపిక్‌తో బాలీవుడ్లో మంచి బ్రేక్ అందుకున్నారు యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఈ హీరో వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు కానీ ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా స్క్రీన్‌పై కనిపించలేదు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటించిన ‘వెల్కమ్ న్యూయార్క్’లో చిన్న గెస్ట్ రోల్ చేశారంతే. ఈ ఏడాది కనిపించని గ్యాప్‌నంతా వచ్చే ఏడాది పూర్తి చేయడానికి ఫిక్స్ అయినట్లున్నారు సుశాంత్. వచ్చే ఏడాది ఏకంగా ఐదు రిలీజ్‌లతో బాక్సాఫీస్ వద్ద పాంచ్ పటాకా పేల్చనున్నారు. వచ్చే ఏడాది ‘డ్రైవ్, కేథార్నాథ్, సోంచిరియా, కిజీ ఔర్ మ్యానీ, చిచోరా’ సినిమాలతో సందడి చేయనున్నారు. -
మాధురీతో పోటీ
ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కోసం బల్గేరియాలో ఉన్నారు కథానాయిక ఆలియా భట్. ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే ఆమె ఏం చేస్తారంటే ‘కళంక్’ సినిమా సెట్లో జాయిన్ అవుతారు. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’. సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆదిత్యారాయ్ కపూర్, సోనాక్షీ సిన్హా ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ పీరియాడికల్ మూవీలో మాధురీ దీక్షిత్, ఆలియా భట్ కాంబినేషన్లో కథక్ డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సాంగ్ ఉందట. ఆల్రెడీ పండిట్ బిర్జు మహారాజ్ వద్ద మాధురి కథక్ నేర్చుకున్నారు. ఇక ఆలియా భట్ కూడా ఈ సాంగ్ కోసం ఎప్పటి నుంచో కథక్ నేర్చుకుంటున్నారట. అంతేకాదు సాంగ్ షూట్ టైమ్ దగ్గర పడుతుండటంతో రెండు నెలలుగా కఠోర సాధన చేస్తున్నారట ఆలియా. ఏమైనా డౌట్స్ వస్తే మాధురి దగ్గర క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నారట. సీనియర్‌తో ఈ పోటీలో ధీటుగా నిలవాలనుకుంటున్నారట. మరి.. ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందనేది వెండితెరపై చూడాల్సిందే. ‘కళంక్’ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అలాగే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, డింపుల్ కపాడియా ముఖ్య తారలుగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. -
తొమిదేళ్ల తర్వాత తొలిసారి!
తొలిసారి డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా. అదేంటీ.. ఒకటా రెండా సోనాక్షి డ్యాన్స్‌తో అదరగొట్టిన పాటలు బోలెడు ఉన్నాయి కదా అనుకుంటు న్నారా? అది నిజమే. అయితే కెరీర్లో ఆమె తొలిసారి ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అవుతున్నారని బాలీవుడ్ టాక్. ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్షి ముఖ్య తారలుగా నటిస్తున్న సినిమా ‘టోటల్ ధమాల్’. ఇంద్రకుమార్ దర్శకత్వంలో ధమాల్ సిరీస్‌లో వస్తోన్న థర్డ్ పార్ట్ ఇది. ఈ సినిమాలోనే స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారట సోనాక్షీ సిన్హా. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు తొమిదేళ్ల తర్వాత ఆమె ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం విశేషమే మరి. -
మా బంగ్లా పేరు సీక్రెట్ అదే! : నటి
ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా గారాల పట్టి, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తమ బంగ్లా పేరు వెనుక ఉన్న సీక్రెట్ చెప్పేశారు. ‘దబంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సరైన హిట్లులేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ సింగింగ్ షోకి గెస్ట్‌గా హాజయ్యారు సోనాక్షి. ఇందిరా దాస్ అనే కంటెస్టెంట్ ప్రతిభకు ముగ్ధురాలైన సోనాక్షి.. ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో ఇందిరా దాస్, ఆమె తల్లితో సోనాక్షి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మీ బంగ్లాకు రామాయణ్ అనే పేరు ఎందుకు పెట్టారంటూ’ ఇందిర తల్లి సోనాక్షిని అడిగారు. ‘ఎన్నో ఏళ్లుగా, ఎంతో మంది ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. కానీ ఈ రోజు మీ కోసం ఆ రహస్యాన్ని చెప్పేస్తున్నా. మా నాన్న పేరు మీకందరికీ తెలిసిందే. ఆయన అన్నదమ్ముల పేర్లు... రామ్, లక్ష్మన్, భరత్. ఇక నా అన్నదమ్ములు లవ్, కుశ. కాబట్టి రామాయణ్ అనే పేరు మా బంగ్లాకు సరిగ్గా సరిపోతుందని కుటుంబ సభ్యులు భావించారు. అందుకే ఆ పేరు పెట్టారు. ఈ రకంగా చూస్తే మా ఇంట్లో నేను, మా అమ్మే(పూనం) బయటివాళ్లం అన్పిస్తోంది కదా. కానీ ఒక్కోసారి మహాభారత సంఘటనలు(యుద్ధం) కూడా ‘రామాయణ్’లో సృష్టించగల సత్తా మాకుంది’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. -
నా పేరు చిన్ చిన్ చూ
ఏదైనా ప్రాంతంలో కథ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన స్పెషాలిటీని కథలో జోడించడానికి ప్రయత్నిస్తుంటారు దర్శక–నిర్మాతలు. ఆ ప్రాంతపు యాస కావచ్చు, లేదా అక్కడ ఫేమస్ పాట కావచ్చు. అదే చేశారు బాలీవుడ్ దర్శకుడు ముద్దాసర్ అజీజ్. సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగి’. 2016లో రిలీజ్ అయిన ‘హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగి’ చిత్రానికి సీక్వెల్ ఇది. పెళ్లి నుంచి తప్పించుకునే పెళ్లి కూతురికి సంబంధించిన కథతో ఈ సినిమా సాగనుంది. ఎక్కువ శాతం సినిమా చైనా బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందట. అందుకే 1950లో ‘హౌరా బ్రిడ్జ్’ సినిమాలో హాట్ డ్యాన్సర్ హెలెన్ చేసిన సూపర్ హిట్ డ్యాన్స్ నంబర్ ‘మేరా నామ్ చిన్ చిన్ చూ’ (నా పేరు చిన్ చిన్ చూ) పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. విశేషం ఏంటంటే ఈ పాటలో హెలెన్లా స్టెప్పులేయడమే కాకుండా పాటను కూడా పాడారు సోనాక్షి. ఈ రీమిక్స్ గురించి ఆమె మాట్లాడుతూ –‘‘హెలెన్ ఆంటీ చేసిన సాంగ్‌ను నేను మళ్లీ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తనని కాపీ చేయాలనో, తనలా చేయాలనో అనుకోలేదు. ఈ సాంగ్‌ను ఎంజాయ్ చేస్తూ చేశాను. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు. సోనాక్షీ వేసిన స్టెప్పులకు యూనిట్ ఫిదా అయ్యారట. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. -
స్క్రీన్ టెస్ట్
1. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘చెలియా’ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ హైదరాబాదీ అమ్మాయి ఎవరో తెలుసా? ఎ) అదితీ రావు హైదరీ బి) కలర్స్ స్వాతి సి) అంజలి డి) బిందు మాధవి 2. ‘మోసగాడు’ చిత్రంలో హీరోయిన్ శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసారు. శోభన్‌బాబు హీరోగా నటించారు. అందులో విలన్‌గా నటించిన ఆర్టిస్ట్ తర్వాతి కాలంలో శ్రీదేవి సరసన హీరోగా నటించారు. ఎవరా హీరో? ఎ) మోహన్‌బాబు బి) చిరంజీవి సి) రాజేంద్రప్రసాద్ డి) కృష్ణ 3. రజనీకాంత్ నటించిన ‘లింగా’ సినిమాలో హీరోయిన్గా నటించి, మార్కులు కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ ఎవరో కనుక్కోండి? ఎ) సోనాక్షి సిన్హా బి) దీపికా పదుకోన్ సి) ఐశ్వర్యా రాయ్ డి) అమీ జాక్సన్ 4. ‘యాక్షన్ జాక్సన్’ అనే బాలీవుడ్ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. అందులో ఓ సాంగ్‌లో టాలీవుడ్ టాప్ స్టార్ స్టెప్పులేశారు. ఎవరా హీరో? ఎ) ప్రభాస్ బి) వెంకటేశ్ సి) రానా డి) నానీ 5. ‘అనసూయ రామలింగం’ అనే పాత్రలో నటించిన నటి ఎవరో గుర్తు తెచ్చుకోండి? (చిన్న క్లూ.. ఈ సినిమాలో హీరో నితిన్) ఎ) కాజల్ అగర్వాల్ బి) సమంతా అక్కినేని సి) శ్రుతీహాసన్ డి) అనుపమ పరమేశ్వరన్ 6. దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తన కెరీర్లో మొత్తం ఐదు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన ఐదు సినిమాల్లోనూ నటించిన ఒకే ఒక్క ఆర్టిస్ట్ ఎవరో కనుక్కోండి? ఎ) జయసుధ బి) అలీ సి) ప్రభు డి) ప్రకాశ్‌రాజ్ 7. ‘రేసుగుర్రం’ చిత్రంలో ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ అంటూ ‘కిల్‌బిల్‌పాండే’ పాత్రలో కామెడీ పండించిన నటుడెవరో చెప్పండి? ఎ) తనికెళ్ల భరణి బి) బ్రహ్మానందం సి) శ్రీనివాస రెడ్డి డి) పోసాని కృష్ణమురళి 8 రాజీవ్ కనకాల అనగానే ఈ హీరోకు చాలా క్లోజ్ అని అందరూ అనుకుంటారు. ఏ హీరోకు ఈయన క్లోజ్? ఎ) ఎన్టీఆర్ బి) అల్లు అర్జున్ సి) సిద్ధార్థ్ డి) రామ్ చరణ్ 9. 2008లో జరిగిన ‘ఫెమీనా మిస్ ఇండియా’ పోటీల్లో ‘మిస్ ఫ్రెష్ ఫేస్’, ‘మిస్ బ్యూటీఫుల్ స్కిన్’ రెండు అవార్డులను సొంతం చేసుకున్న బ్యూటీ ఎవరో కనుక్కోండి? ఎ) జెనీలియా బి) తాప్సీ సి) యామీ గౌతమ్ డి) చార్మీ 10. ‘పెట్ర తాయ్’ అనే తమిళ సినిమా కోసం సింగర్ ఏ.యం.రాజాతో పాటు అదే సినిమా తెలుగు వెర్షన్ ‘కన్నతల్లి’ కోసం సింగర్ ఘంటసాలతో డ్యూయట్ ద్వారా అరంగేట్రం చేసిన పాపులర్ సింగర్ ఎవరో తెలుసా? ఎ) యస్.జానకి బి) పి. సుశీల సి) జిక్కీ డి) రావు బాలసరస్వతి 11. తెలంగాణలోని యాదగిరి గుట్ట నరసింహ స్వామి టెంపుల్ పునరుద్ధరణకు ప్రభుత్వం ఓ తెలుగు సినిమా ఆర్ట్ డైరెక్టర్‌ను నియమించింది. ఆయనెవరు? ఎ) తోట తరణి బి) ఆనంద్ సాయి సి) ఏయస్. ప్రకాశ్ డి) చంటి అడ్డాల 12. ‘శంభో శంకర’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న కమెడియన్ ఎవరో తెలుసా? ఎ) ధన్‌రాజ్ బి) ‘వెన్నెల’ కిశోర్ సి) సప్తగిరి డి) ‘షకలక’ శంకర్ 13. హీరో నాని నటించిన ‘స్నేహితుడా’ చిత్రంలో హీరోయిన్గా నటించిందెవరో గుర్తుందా? ఎ) కలర్స్ స్వాతి బి) మాధవీ లత సి) వేద డి) మధు శాలిని 14. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రదీప్ రావత్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడెవరో తెలుసా? ఎ) వీవీ వినాయక్ బి) బోయపాటి శ్రీను సి) పూరి జగన్నాథ్ డి) ఎస్.ఎస్. రాజమౌళి 15 ‘బళ్లారి బావ...’ అంటూ రానాతో కలిసి ఓ స్టార్ హీరో చిందేశారు. ఆయన ఎవరు? ఎ) వెంకటేశ్ బి) నాగార్జున సి) నాగచైతన్య డి) అఖిల్ 16. ‘‘వియ్ ఆర్ లివింగ్ ఇన్ సొసైటీ. ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలి..’’ అనే డైలాగ్‌ను రాసిందెవరో తెలుసా? ఎ) కొరటాల శివ బి) అబ్బూరి రవి సి) కోన వెంకట్ డి) అనిల్ రావిపూడి 17. అఖిల్ హీరోగా వస్తున్న మూడో చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) వెంకీ కుడుముల బి) సుధీర్ వర్మ సి) వెంకీ అట్లూరి డి) విక్రమ్ కుమార్ 18. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’ చిత్రానికి దర్శకుడెవరో తెలుసా? ఎ) చందు మొండేటి బి) సందీప్ రెడ్డి సి) మారుతి డి) మíహీ వి.రాఘవ్ 19. ఈ ఫొటోలోని హీరోయిన్ ఓ తమిళ హీరో భార్య. ఎవరా హీరోయిన్? ఎ) విజయ్ బి) సూర్య సి) అజిత్ డి) ధనుష్ 20. ఈ పక్కనున్న ఫొటోలోని హీరోయిన్ ఎవరో చెప్పండి? ఎ) స్నేహా ఉల్లాల్ బి) కత్రినాకైఫ్ సి) సోహా అలీఖాన్ డి) ఆలియా భట్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) ఎ 4) ఎ 5) బి 6) డి 7) బి 8) ఎ 9) బి 10) బి 11) బి 12) డి 13) బి 14) డి 15) ఎ 16) ఎ17) సి 18) ఎ19) సి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
ఖాళీ దొరికితే ...
రీసెంట్గా ‘హ్యాపీ ఫిర్ బాగ్ జాయేగీ’ సినిమా కోసం మినీ ట్రక్ స్టీరింగ్ తిప్పిన బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇప్పుడు కిచెన్‌లోకి వెళ్లి గరిటె తిప్పారు. ఎగ్ కర్రీ వండారు సోనాక్షి. ఇప్పుడైతే ఈ వంటకం చేశారు కానీ గతంలో ఏదో స్వీట్ ఐటమ్ ట్రై చేశారట. ఖాళీ దొరికినప్పుడల్లా డిఫరెంట్ వంటకాలను ట్రై చేయడం సోనాక్షి అలవాటు. ఇక... సోనాక్షి చేస్తున్న ‘హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ’ సినిమా విషయానికొస్తే... రెండేళ్ల క్రితం వచ్చిన ‘హ్యాపీ భాగ్ జాయేగీ’ సినిమాకి సీక్వెల్ ఇది. ఇందులో సోనాక్షి సిన్హా, డయానా పెంటీ, జిమ్మీ షెర్గిల్, అలీ ఫజల్, అభయ్ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ప్చ్.. టైమ్ బాగాలేదు
‘హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ’ మూవీ టీమ్‌కి టైమ్ బాగాలేనట్లుంది. ఎక్కడ షూటింగ్ స్టార్ట్ చేసినా ఏదో ఒక కారణంతో బ్రేక్ పడుతోంది. సోనాక్షి సిన్హా, డయానా పెంటీ, అభయ్ డియోల్, అలీ ఫాజల్ ముఖ్యతారలుగా ముదసర్ అజీజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘హ్యాపీ ఫిర్ భాగ్ జాయేగీ’. రెండేళ్ల కిత్రం అజీజ్ దర్శకత్వంలోనే వచ్చిన ‘హ్యాపీ భాగ్ జాయేగీ’ సినిమాకు సీక్వెల్ ఇది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్‌ను థాయ్‌ల్యాండ్‌లో స్టార్ట్ చేశారు. కానీ అక్కడ లొకేషన్స్‌కు పర్మిషన్స్ ప్రాబ్లమ్స్‌తో షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. నెక్ట్స్ మలేసియాలో కొత్త షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. కానీ అక్కడి కౌలాలంపూర్‌లో వెదర్ బాగాలేక ప్రజెంట్ షూటింగ్ ఆగిపోయింది. వెదర్ కండీషన్స్ షూటింగ్‌కు అనుకూలించకపోతే టీమ్ ముంబై రావాలని ప్లాన్ చేస్తోందట. ఆల్రెడీ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే అనుకున్నట్లుగా షూటింగ్ సాగకపోవడంతో ‘ప్చ్.. టైమ్ బాగాలేదు’ అనుకుంటున్నారట చిత్రబృందం. -
ముంబైలో ఢిల్లీ!
ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లడానికి దాదాపు 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. ఫ్లైట్‌లో వెళ్లినా రెండుగంటల టైమ్ పడుతుంది. కానీ ‘కళంక్’ టీమ్ మెంబర్స్ మాత్రం అరగంటలోపే వెళ్లగలరు. అందుకోసం దాదాపు 17 కోట్లు ఖర్చుపెట్టారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. మేటర్ కంటిన్యూ చేస్తే క్లారిటీ దొరుకుతుంది. హిందీ మూవీ ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, ఆలియా భట్, సంజయ్‌దత్, మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, అదిత్యా రాయ్ కపూర్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘కళంక్’. ఈ నెల 18న మూవీని స్టార్ట్ చేశారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల కోసం ముంబైలోని ఓ స్టూడియోలో ఢిల్లీ సెట్ వేశారు. అదీ అసలు విషయం. ఢిల్లీ వెళ్లకుండా ముంబైలోనే ఢిల్లీని చూస్తోంది ఈ యూనిట్. శుక్రవారం నుంచి మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ‘‘కళంక్’ సినిమా సెట్లో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ‘బక్కెట్ లిస్ట్’ మూవీ తర్వాత కరణ్ జోహార్‌తో అసోసియేట్ అయిన రెండో చిత్రమిది’’ అన్నారు మాధురీ దీక్షిత్. ఆమె లీడ్ రోల్ చేసిన మరాఠి సినిమా ‘బక్కెట్ లిస్ట్’ వచ్చే నెల 25న రిలీజ్ కానుంది. అంతేకాదు మరాఠీలో ఒక చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారామె. ‘కళంక్’ సినిమాతో పాటు ‘టోటల్ ధమాల్’ అనే హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారు మాధురీ. ‘టోటల్ ధమాల్’ ఈ ఏడాది డిసెంబర్లో, ‘కళంక్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానున్నాయి. -
టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన తారలు
-
రజనీలా కష్టపడే వ్యక్తి సల్మాన్...
... అంటున్నారు నటుడు, దర్శకుడు ప్రభుదేవా. సల్మాన్‌ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘వాంటెడ్’ చిత్రం హిట్‌గా నిలిచింది. ఇది మన తెలుగు ‘పోకిరి’కి రీమేక్. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సల్మాన్ హీరోగా ప్రభుదేవా ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సూపర్ హిట్ సిరీస్ ‘దబాంగ్’లో మూడో భాగం ఇది. ‘దబాంగ్–3’ పేరుతో తెరకెక్కించనున్నారు. కాగా, ‘దబాంగ్ టూర్’ పేరుతో సల్మాన్ పలు ప్రదేశాల్లో పర్యటిస్తున్నారు. ప్రభుదేవా కూడా ఆయనతో ఉన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ గురించి ప్రభుదేవా మాట్లాడుతూ– ‘‘సల్మాన్‌తో సినిమా అంటే నాకు ఛాలెంజ్‌తో కూడుకున్న పని. ఛాలెంజ్‌ని నేనెప్పుడూ ఒత్తిడిగా భావించను. సినిమా రిలీజ్ టైమ్‌లో మాత్రం ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారా? అనే విషయంలో ఒత్తిడికి గురవుతుంటా. సల్లూ భాయ్ బాగా కష్టపడే వ్యక్తి. ఆయనలో సూపర్‌స్టార్ రజనీకాంత్ లక్షణాలు చాలా ఉన్నాయి. ఇద్దరికీ ఓ విభిన్నమైన స్టైల్ ఉంది. వారెప్పుడూ ఇతరులను మెప్పించాలనుకోరు. వారిని తెరపై చూసి మనమే మెస్మరైజ్ అవుతుంటాం’’ అన్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హా కథానాయిక. ‘దబాంగ్’ కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిదే అన్న సంగతి తెలిసిందే. -
వాంటెడ్ దబాంగ్
సల్మాన్‌ఖాన్–ప్రభుదేవా దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘వాంటెడ్’ సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. మరోసారి వీరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది. అది కూడా సల్మాన్‌కి మాంచి హిట్స్ ఇచ్చి కలెక్షన్ల వర్షం కురిపించిన ‘దబాంగ్’ సిరీస్ కావడం విశేషం. ‘దబాంగ్’ కి అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, ‘దబాంగ్ 2’ ని సల్మాన్ సోదరుడు అర్బాజ్‌ఖాన్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో ‘దబాంగ్ 3’ రాబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై అర్బాజ్‌ఖాన్‌తో పాటు పలువురి పేర్లు వినిపించాయి. అయితే.. ఆ అవకాశం ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవాని వరించింది. ఈ విషయాన్ని ప్రభుదేవా స్వయంగా ప్రకటించారు. ‘‘దబాంగ్ 3’ సినిమాకు సంబంధించి గత వారం ముంబాయిలో చర్చలు జరిపాం. ఈ చిత్రానికి నన్నే దర్శకత్వం వహించమని సల్మాన్‌ఖాన్, అర్బాజ్ ఖాన్ కోరారు. నేనే దర్శకత్వం వహిస్తున్నా. కథానాయిక సోనాక్షీసిన్హా నటిస్తారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ పాతవారే ఉంటారు’’ అన్నారు ప్రభుదేవా. -
అందర్నీ ఇంప్రెస్ చేయలేం
‘దబంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ‘రౌడీ రాథోడ్, సన్నాఫ్ సర్దార్, దబంగ్ 2’ అంటూ వరుస విజయాలతో గోల్డెన్ రన్ చూశారు బొద్దుగుమ్మ సోనాక్షి. ఇటీవల ఆమెకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘యాక్షన్ జాక్సన్‘ తర్వాత వరుస బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ చూస్తున్నారామె. మధ్యలో ‘లుటేరా, అకీరా, నూర్’ వంటి సినిమాల్లో మంచి పెర్ఫార్మెన్స్ చేసినా సినిమాలు హిట్స్ కాలేకపోయాయి. ఈ వరుస వైఫల్యాల గురించి సోనాక్షి మాట్లాడుతూ – ‘‘ఈ మధ్య నా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా ఆడట్లేదు కానీ యాక్టర్‌గా నేను చేస్తున్న రోల్స్ నాకు చాలా సంతృప్తి ఇచ్చాయి. ‘అకీరా, నూర్, లుటేరా’ వంటి సినిమాల్లో భాగమైనందుకు నేనెంతో గర్వపడుతున్నాను. కమర్షియల్ సినిమాలతో సక్సెస్ సాధించినప్పుడు అందులో నేను చేసింది ఏమీ లేదన్నారు. ఇప్పుడు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంటే కమర్షియల్ సినిమాలు ఎందుకు చేయట్లేదు? అంటున్నారు. ఈ రెండు రకాల మాటలు విన్న తర్వాత నాకు అర్థం అయ్యిందేంటంటే.. మన వర్క్‌తో అందర్నీ ఇంప్రెస్ చేయలేమని, అందర్నీ సంతృప్తి పరచలేమని, విమర్శించేవాళ్లు విమర్శిస్తూనే ఉంటారు. అందుకే నాకు నచ్చింది, నన్ను చాలెంజ్ చేసే పాత్రలే చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. హ్యాపీగా, బ్యాలెన్డ్స్‌గా ఉన్నప్పుడే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. అందుకే నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటా’’ అని పేర్కొన్నారు సోనాక్షి. -
కట్ చేశారా
‘మెటీరియల్ సెలెక్ట్ చేశారా? లెంగ్త్ సరిగ్గా చూసుకున్నారా? జాగ్రత్తగా... కరెక్ట్‌గా కట్ చేయండి!’ సినిమాల్లోకి రాకముందు తన గ్రూప్‌తో సోనాక్షీ సిన్హా ఇలాంటి మాటలే మాట్లాడేవారు. ఎందుకంటే తను అప్పుడు ఫ్యాషన్ డిజైనర్. సినిమాల్లోకి వచ్చాక వేరే డిజైనర్స్‌తో కాస్ట్యూమ్స్ డిజైనింగ్ చేయించుకుంటున్నారీ బ్యూటీ. ఇప్పుడు మళ్లీ ఫ్యాషన్ డిజైనర్ అవతారం ఎత్తారు. అదీ సినిమా కోసమే. ‘వెల్కమ్ టు న్యూయార్క్’ అనే సినిమాలో సోనాక్షి ఈ పాత్రను చేస్తున్నారు. ఇందులో దిల్జిత్ హీరో. ‘‘రియల్ లైఫ్‌లో ఫ్యాషన్ డిజైనర్ స్టూడెంట్‌ని. ఇప్పుడు రీల్‌పై ఆ పాత్ర చేస్తున్నాను. కట్టింగ్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ వంటి అంశాలపై నాకు గ్రిప్ ఉంది. అప్పట్లో మా బ్యాచ్‌లో టాపర్ నేనే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది నాకు’’ అన్నారు సోనాక్షి. సో.. ఈ పాత్రలో జీవించేస్తారన్నమాట. పైగా ఆమె పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయట. ఈ చిత్రానికి మన తెలుగు కుర్రాడు చక్రి తోలేటి దర్శకుడు. కమల్‌హాసన్ ‘ఈనాడు’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అయ్యారు చక్రి. ఆ తర్వాత అజిత్ ‘బిల్లా 2’కి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నయనతార ‘కొలైయుదిర్ కాలమ్’కి, అదే చిత్రం హిందీ వెర్షన్ ‘కామోషీ’కి దర్శకత్వం వహిస్తున్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఇత్తే ఫాక్
-
అక్క ఎక్కడ?
కృతీ సనన్‌కి ఒక చెల్లెలు ఉన్నారు. పేరు నూపుర్ సనన్. ఈ అక్కాచెల్లెళ్లిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పార్టీలు చేసుకున్న ఫొటోలు, షికారుకెళ్లినప్పుడు దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు కృతీ తన అక్క ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారట. చిన్నప్పుడు తిరనాళ్లల్లో ఆమె అక్క తప్పిపోయారనుకుంటున్నారా? అదేం కాదు. కృతీ తెలుసుకోవాలనుకుంటున్నది ఆన్ స్క్రీన్ తన అక్కగా నటించబోయే అమ్మాయి గురించి. ‘‘నా అక్క ఎవరో త్వరగా చెప్పండి. తనతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి’’ అని దర్శకుడు విశాల్ భరద్వాజ్‌ను సతాయిస్తున్నారట కృతి. ‘‘సోనాక్షి సిన్హా, శ్రద్ధా కపూర్, వాణీ కపూర్, భూమి పెడ్నేకర్‌ని సంప్రదించాను. ఇంకొన్ని పేర్లు అనుకుంటున్నాను. మీ అక్కయ్యను త్వరలోనే ఫైనలైజ్ చేస్తా’’ అని కృతీ సనన్‌ను బుజ్జగిస్తున్నారట విశాల్. అక్కాచెల్లెళ్ల గొడవలను బేస్ చేసుకుని బాలీవుడ్లో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు దర్శకుడు విశాల్ భరద్వాజ్. హిందీలో ‘హైదర్, రంగూన్’ వంటి చిత్రాలను రూపొందించారాయన. తన తాజా చిత్రంలో చెల్లెలి పాత్రకు కృతీ సనన్ ఓకే చేశారు. మరి.. కృతి అక్క ఎవరో వేచి చూద్దాం. -
పారిపోతున్నా..!
...అంటున్నారు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఆమె ఎవరితో పారిపోతున్నారని ఎగై్జటింగ్‌గా ఆలోచించకండి. ఆమె పారిపోవడానికి రెడీ అయ్యింది రీల్ లైఫ్‌లో. ఇంతకీ మేటర్ ఏంటంటే... ముదసర్ అజీజ్ దర్శకత్వంలో డైనా, అభయ్ డియోల్, జిమ్మీ షెర్గిల్, అలీ ఫజల్ ముఖ్య తారలుగా గతేడాది బాలీవుడ్లో రూపొందించిన చిత్రం ‘హ్యాపీ భాగ్ జాయేగి’. ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అజీజ్. ‘హ్యాపీ భాగ్ జాయేగి రిటర్న్స్’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే ఇందులో ఫస్ట్ పార్ట్ నటీనటులతోపాటు సోనాక్షి సిన్హా కూడా నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. మంగళవారం రెండో షూట్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. ‘‘హ్యాపీ భాగ్ జాయేగి రిటర్న్స్ సెకండ్ షెడ్యూల్ స్టార్టయ్యింది. ఇట్స్ టైమ్.. రెడీ టు రన్’’ అని పేర్కొన్నారు సోనాక్షి సిన్హా. ఫస్ట్ పార్ట్‌లో హ్యాపీ క్యారెక్టర్లో నటించిన డైనా ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ప్రేమికుణ్ని కలవడానికి పాకిస్తాన్ పారిపోతుంది. ఫైనల్‌గా కథ సుఖాంతం అవుతుంది. ఇప్పుడు సోనాక్షి సిన్హా లీడ్ రోల్ చేస్తున్నారు. అంటే.. సోనాక్షి సిన్హా ఎక్కడికి పారిపోతున్నారో తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్లో బొమ్మపడేంత వరకు వెయిట్ చేయక తప్పదు. -
మరో డెబ్బై ఏళ్లు కూడా నటిస్తాను: హీరోయిన్
ముంబయి : తాను మరో 70 ఏళ్లు కూడా బాలీవుడ్ చిత్ర సీమలో ఉండగలనని ప్రముఖ నటి సోనాక్షి సిన్హా అన్నారు. తాను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఆదివారంనాటికి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఈ విషయం ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన అభిమానుల ద్వారానే ఇండస్ట్రీలో ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. తొలిసారి దబాంగ్ చిత్రం (2010) ద్వారా సల్మాన్‌ఖాన్ సరసన నటిస్తూ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు, నాయకుడు శత్రఘ్నసిన్హా కూతురు అయిన సోనాక్షి తొలినాళ్లలో నటించిన చిత్రాలు అన్నీ కూడా వరుసగా బంపర్ హిట్లు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆమె బాలీవుడ్లో ఫేమస్ హీరోయిన్గా మారిపోయారు. ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తవడంతో ట్విట్టర్ ద్వారా తనకు దబాంగ్‌లో అవకాశం ఇచ్చిన సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, అభినవ్ కశ్యప్‌కు ధన్యవాదాలు చెప్పారు. అలాగే, తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 'నాపైన ప్రేమ చూపిస్తున్న మీకు ధన్యవాదాలు. మరో 70 ఏళ్లు కూడా ముందుకు సాగగలనని చెప్పగలుగుతున్నానంటే అది మీవల్లే' అని తెలిపారు. -
బీబర్ వేదికపై నా ప్రదర్శన లేదు: నటి
ముంబయి: త్వరలో ముంబయిలో జరగనున్న హాలీవుడ్ పాప్ యువ కెరటం జస్టిన్ బీబర్ నిర్వహించే సంగీత కార్యక్రమ వేదికపై తాను ఉండటం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్పష్టం చేసింది. వచ్చే మే నెలలో ముంబయిలో బీబర్ పాప్ గీతాలతో ఉర్రూతలూరించనున్నాడు. ఈ కార్యక్రమంలో సోనాక్షి కూడా పాలుపంచుకోబోతుందంటూ బాలీవుడ్లో కోడై కూస్తున్నారు. దీంతో ఇక లాభం లేదనుకున్నా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ‘ముందుగా మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. బీబర్ కచేరిలో నా ప్రదర్శన లేదు. ఇప్పటికే నేను ఈ విషయం పలు విధాలుగా చెప్పాను. మీడియా ద్వారా కూడా చెప్పాను. నేను పాల్గొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అదంతా కూడా ఊహగానామే’ అంటూ ఆమె తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. తనకు సంగీతం అంటే చాలా ఇష్టం అని, ప్రదర్శన ఇవ్వడాన్ని ఇష్టపడతానని, పాడేందుకు కూడా ఆసక్తి ఉంటుందని చెప్పారు. -
బుక్... లక్!
‘అమ్మాయి.. నువ్వు పుస్తకాలు చదివితే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది’... నాలుగైదేళ్ల క్రితం సోనాక్షీ సిన్హాకు ఓ పెద్ద జ్యోతిష్కుడు ఇచ్చిన సలహా ఇది. వెంటనే ఈ బ్యూటీ బోల్డన్ని పుస్తకాలు కొన్నారేమో అనుకుంటున్నారా? అదేం లేదు. సోనాక్షి ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ, ఈ మధ్య ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయట. ఆ విషయం గురించి సోనాక్షీ మాట్లాడుతూ – ‘‘నేను జాతకాలను నమ్మను. ఆ జ్యోతిష్కుడు నన్ను బుక్స్ చదవమన్నా చదవలేదు. విచిత్రం ఏంటంటే.. మూడేళ్ల క్రితం నేను చేసిన ‘లుటేరా’ రచయిత ఒ. హెన్రీ రాసిన కథ ఆధారంగా తీసినది. ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ‘నూర్’ సబా ఇంతియాజ్ రాసిన నవల ఆధారంగా తీసిన చిత్రం. ‘లుటేరా’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు మంచి విజయం సాధించింది. ‘నూర్’ ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. సినిమా కూడా హిట్టవుతుంది. ఈ ఆరేళ్లల్లో నేను 20కి పైగా సినిమాలు చేస్తే, వాటిలో ‘లుటేరా’, ‘నూర్’ నా హార్ట్‌కి బాగా దగ్గరయ్యాయి. సో.. పుస్తకాలకూ, నాకూ నిజంగానే ఏదైనా కనెక్షన్ ఉండి ఉంటుందా? ఆ జ్యోతిష్కుడు చెప్పినట్లు పుస్తకాలు నాకు కలిసొస్తాయా? ఏమో.. ఇలాంటివాటి మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. ఏదో యాదృచ్ఛికంగా జరిగిందనిపిస్తోంది’’ అన్నారు. -
సల్మాన్‌ను ఆ ప్రశ్న అడుగుతా!
సల్మాన్ ఖాన్ని సోనాక్షి సిన్హా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నారు. ఆ ప్రశ్న ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తున్నారా? మరేం లేదు. ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని అడుగుతారట. అసలు సల్మాన్‌ని సోనాక్షి ఈ ప్రశ్న ఎందుకు అడగాలనుకున్నారనే విషయానికొస్తే.. ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘నూర్’. వచ్చే నెల ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సోనాక్షి సిన్హా జర్నలిస్ట్ రోల్లో యాక్ట్ చేశారు. పాకిస్తాన్ రైటర్ సబా ఇంతియాజ్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్న సోనాక్షీని.. ‘మీరే కనుక రియల్‌గా జర్నలిస్ట్ అయితే మీ నాన్నగారు శతృఘ్న సిన్హాను ఏం ప్రశ్న అడుగుతారు’ అని కొందరు జర్నలిస్టులు అడగ్గా... ‘ఖామోష్ అని మా నాన్న తిరిగి బదులు చెప్పని ప్రశ్న అడుగుతా’ అన్నారు. మరి, సల్మాన్ ఖాన్‌ను ఏ ప్రశ్న అడుగుతారని అడగ్గా.. ‘వేరే ఏం ఉంది. అందరూ అడిగేదే. మీకు తెలిసిందే. అదేనండి. సల్మాన్‌ని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుం టారు? అని అడుగుతా’ అని సోనాక్షి సమాధానం ఇచ్చారు. మరి.. సల్మాన్‌ని సోనాక్షీ డైరెక్ట్‌గా ఈ ప్రశ్న అడిగితే ఆయన్నుంచి ఏం సమాధానం వస్తుందో? -
అవకాశమొస్తే ఆయనతో చేస్తా!
ఆ కథానాయకుడితో నటించడానికి ఏ మాత్రం సందేహించను అంటున్నారు నటి సోనాక్షిసిన్హా. దక్షిణాది భామలు బాలీవుడ్ మోహంలో పడుతుంటే. అక్కడి బ్యూటీస్ దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపుతుండడం విశేషం. నటి దీపికాపదుకునే, సోనాక్షి సిన్హా, ప్రియాంకాచోప్రా, కంగనారావత్ వంటి బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఇప్పటికే కోలీవుడ్ చిత్రాల్లో నటించారన్నది తెలిసిందే. వీరంతా మళ్లీ తమిళ చిత్రాల్లో నటించాలని ఆశపడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా వారసురాలైన సోనాక్షి సిన్హా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా లింగా చిత్రంలో నటించారు. ఇక దీపికాపదుకోనే కోచ్చడైయాన్ చిత్రంలో సూపర్‌స్టార్‌తో రొమాన్స్ చేశారు. వీరిద్దరిని మళ్లీ మళ్లీ కోలీవుడ్ చిత్రాల్లో నటించాలని ఇక్కడి దర్శక నిర్మాతలు కోరుకుంటున్నారు. ఇప్పటికే సంఘమిత్ర అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో జయంరవి, ఆర్యలకు జంటగా నటించజేయడానికి దర్శకుడు సుందర్.సీ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటి సోనాక్షిసిన్హాను ఇళయదళపతి విజయ్ సరసన నటింపజేసే ఆలోచనలో దర్శకుడు ఏఆర్.మురుగదాస్ ఉన్నట్లు తాజాసమచారం. విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయన 61వ చిత్రం. దీని తరువాత ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇందులో సోనాక్షిసిన్హాను నాయకిగా ఎంపక చేసే పనిలో యూనిట్ వర్గాలు ఉన్నట్లు సమాచారం. దీని గురించి ఇటీవల చెన్నైకి వచ్చిన సోనాక్షిసిన్హాను అడగ్గా విజయ్‌కు జంటగా నటించడానికి తాను ఏ మాత్రం సంశయించను అన్నారు. అదీ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటించడం అంటే చాలా ఇష్టం అన్నారు. ఆయన దర్శకత్వంలో ఇప్పటికే హిందీలో అకిరా, హాలీడే చిత్రాల్లో నటించాను. తనను హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటింపజేసిన దర్శకుడాయన. ఇంకా చెప్పాలంటే తనకు తమిళ చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి చాలా ఉందన్నారు. తమిళంలో తింగా చిత్రంలో నటించానని, ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడం వల్ల తాను బాధ పడడం లేదని అన్నారు. కారణం అందులో కొందరు అద్భుత వ్యక్తులతో పని చేసే అవకాశం కలిగిందని అన్నారు. రజనీకాంత్‌తో నటించడం చాలా గొప్ప అనుభూతిగా పేర్కొన్నారు. రజనీకాంత్, ఏఆర్,.మురుగదాస్ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే వదులుకోనని అన్నారు. తాను విజయ్ నటించిన తుపాకీ, కత్తి చిత్రాలను చూశానన్నారు. విజయ్ ఉత్తమ నటుడని పొగడ్తల్లో ముంచెత్తారు.ఆయనతో నటించే అవకాశం వస్తే ఏ మాత్రం సందేహించకుండా అంగీకరిస్తానని సోనాక్షిసిన్హా పేర్కొన్నారు. -
వారిద్దరు సంఘమిత్రలో నటిస్తారా?
సంఘమిత్ర చిత్రంలో నటించే హీరోల కోసం చాలా చర్చలే జరిగాయి. ఇళయదళపతి విజయ్, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నుంచి చాలా మంది ప్రముఖ స్టార్ నటులను సంప్రదించారు. అందరూ కథ సూపర్ అన్నారే గానీ అందులో నటించడానికి సందేహించారు. కారణం ఇప్పటి వరకూ భారతీయ సినీ చరిత్రలోనే రూపొందించనంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న సంఘమిత్ర చిత్రానికి 250 రోజుల కాల్షీట్స్ అవసరం అవడమే. మొత్తానికి యువ స్టార్స్ జయంరవి, ఆర్య ఈ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఇక హీరోయిన్లు ఎవరన్న చర్చ మొదలైంది. ఆ పాత్రల కోసం చాలా మంది టాప్ స్టార్స్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇది తమిళం, తెలుగు, హిందీ భాషలో తెరకెక్కుతున్న బ్రహ్మాండ చారిత్రక కథా చిత్రం కావడంతో అందుకు తగ్గట్టుగా కథానాయికలు ఉండాలని చిత్రయూనిట్ వర్గాలు భావిస్తున్నారు. అందుకు బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనే, సోనాక్షి సిన్హా కరెక్ట్‌గా ఉంటారని భావించిన దర్శక నిర్మాతలు వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఈ ముద్దుగుమ్మలిద్దరూ ఇప్పటికే కోలీవుడ్‌లో రజనీకాంత్ సరసన ఒక్కో చిత్రంలో నటించిన అనుభవం ఉండడం కూడా వారిని సంఘమిత్ర చిత్రంలో నాయికలుగా ఎంపిక చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ అందాల భామలు అంగీకరిస్తారా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి సుందర్.సీ దర్శకత్వం వహించనున్నారు. సంగీతమాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని, సబుసిరిల్ కళా దర్శకత్వాన్ని, కమల్ కన్నన్ గ్రాఫిక్స్, హిందీ చిత్రం భాజీరావ్ మస్తాని ఫేమ్ సందీప్ చటర్జీ ఛాయాగ్రహణం అందించనున్నారు. రచయిత ప్రభాకరన్, దర్శకుడు బద్రి సంఘమిత్రకు కథా సహకారం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
యస్...అంటున్నారా?
సౌతిండియాలో సోనాక్షి సిన్హా ఒక్కటంటే ఒక్క సినిమా ‘లింగ’లో నటించారు. అది కూడా సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జోడీగా నటించే అవకాశం రావడంతో మరో ఆలోచన లేకుండా ‘యస్’ అనేశారు. మరి, ఇప్పుడూ ‘యస్’ అంటున్నారా? లేదా? అనేది ఎదురు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడీ బాలీవుడ్ బ్యూటీని ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు, అందగాడు అరవింద్ స్వామికి జోడీగా నటించమని అడిగారు. సిద్ధిఖీ దర్శకత్వంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన మలయాళ సినిమా ‘భాస్కర్ ద రాస్కెల్’ను తమిళంలో రీమేక్ చేయనున్నారు. ఇందులో అరవింద్ స్వామి హీరో. మొదట రజనీకాంత్‌ను ఈ రీమేక్‌లో నటించమని సంప్రదించారు. ఆయన ‘నో’ చెప్పేసరికి, అరవింద్ స్వామికి అవకాశం వచ్చింది. మాతృక తీసిన సిద్ధిఖీనే ఈ తమిళ రీమేక్‌కీ దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో కూడా నయనతారను నటించమని అడగ్గా.. ఓసారి చేసిన పాత్రలో రెండోసారి నటించే ఉద్దేశం లేదని చెప్పారట! దాంతో సోనాక్షి పేరు పరిశీలనలోకి వచ్చింది. ఆమె కూడా కథ వినడానికి అంగీకరించారట. మరి, విన్నాక సోనాక్షి ఏమంటారో? వెయిట్ అండ్ సీ. -
ఆ హీరోతో నేను డేటింగ్ చేయలేదు: సోనాక్షి
బాలీవుడ్లో గాసిప్‌లకు ఏమాత్రం కొరత లేదు. ఒకప్పుడు బాగా కలిసి తిరిగిన అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా ఆ తర్వాత విడిపోయారు. తొలిసారిగా వీళ్ల బంధం విషయం 2015లో బయటపడింది. అప్పట్లో అర్జున్ కపూర్, రణవీర్‌సింగ్ కలిసి ఒక కార్యక్రమం నిర్వహించారు. దానికి వచ్చిన కమెడియన్ అబీష్ మాథ్యూ... సోనాక్షి సిన్హాతో డేటింగ్ చేస్తున్నందుకు కంగ్రాట్స్ అని చెప్పగా, దానికి అర్జున్ నవ్వుతూ తలాడించాడు. వాళ్ల బంధం ఇప్పుడు ముగిసిన కథ అనుకోవాలో.. లేదా ఇంకా కొనసాగుతోందని భావించాలో మాత్రం అర్థం కావట్లేదు. ప్రస్తుతం జాన్ అబ్రహంతో కలిసి తాను నటిస్తున్న ఫోర్స్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మంచి బిజీగా ఉన్న సోనాక్షిని మీడియావాళ్లు అర్జున్ కపూర్ సంగతేంటని అడిగారు. ఇద్దరూ కలిసి ఒంటరిగా ఒక ద్వీపానికి వెళ్లారా అన్న ప్రశ్న అడిగినప్పుడు.. అబ్బే, అలా ఏమీ వెళ్లలేదని చెప్పింది. సోనాక్షితో బంధం తెగిపోయిందన్న బాధతో ఉన్న అర్జున్ కపూర్.. తాజాగా అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మలైకా అరోరా ఖాన్ ఇంటి బయట కనిపించాడట! రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆ ఇంట్లోకి వెళ్లి, మూడున్నర గంటల తర్వాత అతడు బయటకు వస్తుంటే కెమెరాలు అతగాడి వెంటపడ్డాయి. -
నో రింగ్.. నో కామెంట్స్!
బంటీ సచ్దేవ్.. ఇటీవల బాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. ఎవరీ అబ్బాయి అంటే.. సల్మాన్‌ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ బ్రదర్ ఇన్లా. పలువురు సినిమా తారలకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ బంటీ సచ్దేవ్తో సోనాక్షి సిన్హా ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఓ అడుగు ముందుకేసి, నిశ్చితార్థం కూడా జరిగిందంటున్నారు. పార్టీలు, పబ్బుల్లో వీరిద్దరూ కలసి కనిపించడంతో ఈ రూమర్లు నిజమే అనుకుంటున్నారట. తాజా ఇంటర్వ్యూలో బంటీ సచ్దేవ్తో మీ నిశ్చితార్థం జరిగిందట కదా? అనే ప్రశ్న సోనాక్షి ముందుంచితే.. ‘‘ఏవండీ... సరిగ్గా చూడండి. నా వేలికి ఉంగరం (ఎంగేజ్మెంట్ రింగ్) ఏమైనా మీకు కనిపిస్తోందా? లేదు కదా? మీ ప్రశ్నకు సమాధానం లభించినట్టేనా? ఇక దీనిపై నో కామెంట్స్’’ అన్నారు. -
బాయ్ ఫ్రెండ్ తో ఆ హీరోయిన్ మళ్లీ!
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రేమలో ఉందని, బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తోందని కొన్ని రోజుల కిందట వదంతులు ప్రచారమయ్యాయి. అయితే ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్ కు సోనాక్షి సిన్హా హాజరయింది. ఇదే ఈవెంట్లో ఆమె బాయ్ ఫ్రెండ్ బంటీ సాజ్డే కూడా పాల్గొన్నాడు. దీంతో అందరిదృష్టి వీరిపై పడింది. స్పోర్ట్ అండ్ టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి యజమాని అయిన బంటీతో బొద్దుగుమ్మ సోనాక్షికి కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడింది. అయితే రెండు నెలల కిందట వీరిద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా మరోసారి సోనాక్షి తన బాయ్ ఫ్రెండ్ బంటీ సాజ్డేతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైందని బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. సోనాక్షి బ్లూ బాడీవేర్ లో కనిపించగా, బంటీ గ్రే టీషర్ట్ ధరించినట్లు ఫొటోలో కనిపిస్తుంది. ప్రియుడు ఉంటే విదేశీ బీచ్ లలో హాయిగా సేదతీరాలని ఉందని గతంలో పలుమార్లు సోనాక్షినే ప్రస్తావించింది. దీంతో ఆమె ప్రేమలో ఉందని ఇండస్ట్రీ కోడై కూసింది. ఆగస్టులో ఇదే విషయంపై వదంతులు రావడంతో.. మా ఇంట్లో వాళ్లకు తెలిసేలా చేసినందుకు థ్యాంక్స్ అంటూనే అందులో నిజం లేదంటూ చమత్కరించిన విషయం తెలిసిందే. సోనాక్షి ప్రస్తుతం ఫోర్స్ 2 మూవీలో నటిస్తుంది. జాన్ అబ్రహాం, తాహిర్ షా, ఇందులో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. -
సోషల్ మీడియాలో నటి ఫొటోలు హల్ చల్!
సాగర తీరంలో సేద తీరితే మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని ఎప్పుడూ చెబుతుండేది బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. ప్రస్తుతం ఈ బాలీవుడ్ భామ అదే పనిలో ఉంది. అయితే స్వదేశీ బీచ్ లకు వెళితే తనను గుర్తుపట్టే అవకాశం ఉందని గతంలో చెప్పిన సోనాక్షి.. ఏకంగా తూర్పు ఆఫ్రికా బీచ్ లలో హాయిగా సేదతీరుతోంది. ప్రస్తుతం సోనాక్షి వెకేషన్ టూర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మ తన ట్రిప్ ఫొటోలను అలా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిందో లేదో.. అంతే వేల లైక్స్ ను గంటల్లోనూ సంపాదించుకుంది. గతంలో బుల్లితెర నటీమణులు కొందరు ఇలాగే హాలిడే స్పాట్స్ ఫొటోలతో పాపులర్ అయిన విషయం తెలిసిందే. మురుగదాస్ దర్శకత్వంలో చేసిన యాక్షన్ మూవీ ‘అఖీరా’కి సోనాక్షి చాలానే కష్టపడింది. పవర్ఫుల్ ఫైట్స్ చేసి అలసిపోయిన ఈ బ్యూటీ ఈ సినిమా విడుదల కావడంతో ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయింది. దీంతో నెక్ట్స్ సినిమా మొదలుపెట్టే ముందు కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని భావించి తనకెంతో ఇష్టమైన బీచ్‌లు చూసేందుకు వెళ్లింది. సోనాక్షి ఫొటోలు చూస్తే మనకు కూడా బ్యాగ్ ప్యాక్ చేసి ఎక్కడికైనా టూర్ వెళ్లాలనిపిస్తుంది. అంతగా ఆమె బీచ్ లలో ఎంజాయ్ చేస్తూ... బోటు షికారు చేసి సరదాగా గడిపింది. మొదట అక్కడ ఎయిర్ పోర్టులో కాలుపెట్టగానే సిబ్బందితో కలిసి ఓ ఫొటో దిగింది. ఆ తర్వాత బీచ్ నీళ్లలో కేరింతలు కొడుతూ.. అక్కడి అందాలను తనకు నచ్చిన తీరుగా కామెంట్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు షేర్ చేసింది. తనకు ఆ ప్రాంతం మరో స్వర్గంలా అనుభూతినిచ్చిందని రిసార్ట్స్ వద్ద దిగిన ఫొటో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె ఫాలోయర్స్ మాత్రం సోనాక్షి సో హాట్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. -
సరదాగా..సోనాక్షి సిన్హా,సాక్షి మలిక్
-
ఆయనతో అలా అలా... అలలతో సరదాగా!
గాసిప్ సాగర తీరంలో సేద తీరితే మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అదే పక్కన లవర్ ఉంటే ఇక ప్రపంచం మొత్తం పసందుగా అనిపిస్తుంది. ప్రస్తుతం సోనాక్షీ సిన్హాకు అలానే అనిపిస్తోందట. మురుగదాస్ దర్శకత్వంలో చేసిన యాక్షన్ మూవీ ‘అఖీరా’కి సోనాక్షి చాలానే కష్టపడ్డారు. పవర్ఫుల్ ఫైట్స్ చేసి అలసిపోయిన ఈ బ్యూటీ ఈ సినిమా విడుదల కావడంతో ఒక్కసారిగా రిలాక్స్ అయిపోయారు. నెక్ట్స్ సినిమా మొదలుపెట్టే ముందు కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనుకున్నారు. సోనాక్షీకి బీచ్‌లంటే చాలా ఇష్టం. స్వదేశీ బీచ్‌లకు వెళితే జనాలు చుట్టుముట్టేస్తారు కదా. అందుకే విదేశీ బీచ్‌కి వెళ్లాలనుకున్నారు. వెళ్లిపోయారు కూడా. సోలోగా కాదు.. ప్రియుడు బంటీ సజ్దేతో కలసి వెళ్లారని సమాచారం. ఈ బంటీ ఎవరో కాదు.. సోనాక్షీతో పాటు మరికొంతమంది ప్రముఖ తారలకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌కి బంధువు కూడా. గత కొంత కాలంగా సోనాక్షీ, బంటీ ప్రేమాయణం సాగిస్తున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. అదేం లేదని సోనాక్షీ కొట్టి పారేస్తున్నప్పటికీ ‘అదేం కాదు.. ఏదో ఉంది’ అని కొంతమంది అంటున్నారు. నిజమే కదా.. నిప్పు లేనిదే పొగ ఎలా వస్తుందబ్బా? -
రెండో రోజు కాస్త పెరిగిన కలెక్షన్లు
తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన అకీరా సినిమా కలెక్షన్లు రెండో రోజు కొంచెం పెరిగాయి. అకీరా విడుదలైన తొలిరోజు శుక్రవారం 5.15 కోట్ల రూపాయల వసూళ్లు రాగా, శనివారం 5.30 కోట్ల రూపాయలు వచ్చాయి. ఈ సినిమా తొలి రెండు రోజుల్లో కలిపి మొత్తం 10.45 కోట్లు రూపాయలు రాబట్టింది. ఆదివారంతో పాటు సోమవారం వినాయకచవితి పండగ సెలవు కావడంతో మరో రెండు రోజులు ఇదే తరహాలో కలెక్షన్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. మురుగదాస్ బాలీవుడ్లో గజని, హాలిడే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. అయితే ఆయన తాజా చిత్రం అకీరాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ భారీ యాక్షన్ డ్రామా సినిమాను దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. అకీరాలో సోనాక్షి ప్రధాన పాత్ర పోషించగా, అనురాగ్ కశ్యప్, కొంకనా సేన్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు.