జ్యోతిక, సోనాక్షీ సిన్హా ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరు కానున్నారు. కానీ ఇది రియల్ కేసు కాదు... రీల్ కేసు. ఇంతకీ విషయం ఏంటంటే... బాలీవుడ్ దర్శకురాలు అశ్వనీ అయ్యర్ తివారి ఓ కోర్టు రూమ్ డ్రామాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రోడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తయ్యాయి. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను ముంబైలో ప్రారంభించాలనుకుంటున్నారు.
ఈ చిత్రంలో జ్యోతిక, సోనాక్షీ సిన్హా లీడ్ రోల్స్‌లో నటించనున్నారని సమాచారం. అయితే ఈ ఇద్దరి హీరోయిన్స్‌లో లాయర్‌గా నటించేది ఎవరు? న్యాయం కోసం పోరాడేది ఎవరు? అనే అంశాలపై మాత్రం ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాకు ముందుగా కరీనా కపూర్, కియారా అద్వానీలను అనుకున్నారని, ఫైనల్‌గా జ్యోతిక, సోనాక్షిలు ఫైనల్ అయ్యారని బాలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment