Jyothika
-
జ్యోతికను తీసేయమన్నా.. నా మాట వినలేదు: బాలీవుడ్ నటి
ఈ వెబ్ సిరీస్‌లో నటి జ్యోతిక (Jyotika)ను తీసుకోవాలనుకోలేదు. ఆమెను తీసేసి తన స్థానంలో మరొకరిని పెడితే బాగుంటుందనుకున్నా అంటోంది సీనియర్ నటి షబానా అజ్మీ (Shabana Azmi). షబానా, షాలిని పాండే, జ్యోతిక, సాయి తంహంకర్, గజ్రాజ్ రావు, జిస్సు సేన్‌గుప్తా, అంజలి ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ (Dabba Cartel). ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో షబానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.జ్యోతికను తీసేయాలనుకున్నా..ఆమె మాట్లాడుతూ.. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ఈ సిరీస్‌లో ఇద్దరు నటీమణుల్ని తీసేయాలనుకున్నాను. అందులో జ్యోతిక కూడా ఉంది. ఆమెకు ఈ విషయం తెలియదు. తర్వాత నేనే జరిగింది చెప్పాను. అయితే జ్యోతికను తీసేయమని చెప్తే నా మాట వినలేదు. నీకేది నచ్చితే అది చేసుకో.. కానీ జ్యోతికను మాత్రం వదులుకోము అన్నారు. కట్ చేస్తే జ్యోతిక చాలా బాగా నటించింది. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. జ్యోతిక, షబానా అజ్మీనా తప్పే..తనను తీసేయాలనుకోవడం ముమ్మాటికీ నా తప్పే. అదే జరుగుంటే నీతో కలిసి పనిచేసే ఛాన్స్ మిస్సయ్యేదాన్ని. ఈ సిరీస్‌ను నా కొడుకు(సవతి కుమారుడు), కోడలు నిర్మించినందున నేనేమీ ఆలోచించకుండా నటించాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది. హితేశ్ భాటియా దర్శకత్వం వహించిన డబ్బా కార్టెల్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. చదవండి: కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే? -
జ్యోతిక ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్.. ఏ ఓటీటీలో చూడాలంటే?
షబానా అజ్మీ, గజరాజ్, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో వస్తోన్న వెబ్ సిరీస్ 'డబ్బా కార్టెల్' (Dabba Cartel Web Series). ఈ సిరీస్‌ను హితేష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ వెబ్ సిరీస్‌ను క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబయిలో డబ్బావాలా బాగా ఫేమస్. ఆ కోణంలోనే ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫుడ్ డబ్బాల్లో లంచ్‌తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా డబ్బా కార్టెల్ రూపొందించారు. ఈ సిరీస్‌లో అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. They're cooking. And it's criminally good 👀 💸 Watch Dabba Cartel, out 28 February, only on Netflix. pic.twitter.com/ujxywmjaeW— Netflix India (@NetflixIndia) February 18, 2025 -
అగరం కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో సూర్య-జ్యోతిక (చిత్రాలు)
-
న్యాయం కోసం...
జ్యోతిక, సోనాక్షీ సిన్హా ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరు కానున్నారు. కానీ ఇది రియల్ కేసు కాదు... రీల్ కేసు. ఇంతకీ విషయం ఏంటంటే... బాలీవుడ్ దర్శకురాలు అశ్వనీ అయ్యర్ తివారి ఓ కోర్టు రూమ్ డ్రామాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రోడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తయ్యాయి. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను ముంబైలో ప్రారంభించాలనుకుంటున్నారు.ఈ చిత్రంలో జ్యోతిక, సోనాక్షీ సిన్హా లీడ్ రోల్స్‌లో నటించనున్నారని సమాచారం. అయితే ఈ ఇద్దరి హీరోయిన్స్‌లో లాయర్‌గా నటించేది ఎవరు? న్యాయం కోసం పోరాడేది ఎవరు? అనే అంశాలపై మాత్రం ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాకు ముందుగా కరీనా కపూర్, కియారా అద్వానీలను అనుకున్నారని, ఫైనల్‌గా జ్యోతిక, సోనాక్షిలు ఫైనల్ అయ్యారని బాలీవుడ్ టాక్. -
'కంగువ' ఫ్లాప్.. విపరీతమైన దైవభక్తిలో జ్యోతిక-సూర్య
తమిళంలో ఇండస్ట్రీలో సూర్య-జ్యోతిక క్యూట్ కపుల్ అని చెప్పొచ్చు. ద్దగా వివాదాల జోలికి పోకుండా తమ పనేదో తమది అన్నట్లు ఉంటారు. గత కొన్నాళ్లుగా మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జ్యోతిక.. దక్షిణాదిలోని ప్రముఖ దేవాలయాల్ని సందర్శిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమెపై పాత వీడియోల తవ్వి తీసి మరీ ట్రోల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.2020లో ఓ అవార్డ్ ఫంక్షన్లో మాట్లాడుతూ.. దేవాలయాలకు పెయింట్స్ వేయడం, మిగతా ఖర్చులు వృథా. అదే డబ్బుని ఆస్పత్రులు, స్కూల్స్ కోసం ఉపయోగించొచ్చు కదా అని మాట్లాడింది. అయితే డబ్బుని హాస్పిటల్స్, స్కూల్స్ కోసం ఉపయోగించాలని చెప్పడం బాగుంది కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయాల కోసం అంత ఖర్చు ఎందుకని చెప్పడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్)అప్పట్లో అసలు గుడికి ఎందుకు వెళ్లడం అనే స్టేట్మెంట్ ఇచ్చిన జ్యోతిక.. ఇప్పుడు ఏకంగా భర్త సూర్యతో కలిసి కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకుంది. చండీకా యాగం కూడా చేయించింది. కొన్నిరోజుల క్రితం ఇదే దేవాలయానికి ఎన్టీఆర్ కూడా వెళ్లాడు. తాజాగా బుధవారం ఉదయం సుప్రభాత సేవ టైంలో జ్యోతిక.. తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంది.పెద్దగా బయటే కనిపించని జ్యోతిక.. ఇలా వరసగా ప్రముఖ దేవాలయాల్ని సందర్శించడం కాస్త విచిత్రమే. దీంతో గతంలో ఈమె మాట్లాడిన వీడియోలని బయటకు తీసి.. పలువురు నెటిజన్లు జ్యోతికని ట్రోల్ చేస్తున్నారు. కర్మ.. ఎవరినీ వదిలిపెట్టదు అని కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్గా సూర్య 'కంగువ' సినిమా.. థియేటర్లలో రిలీజై ఫ్లాప్ అయింది. భారీ నష్టాలు వచ్చాయి. మరి సినిమా ఫ్లాప్ అయిందని జ్యోతిక-సూర్య.. దేవాలయాల్ని సందర్శిస్తున్నారా? లేదా మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)Three years ago Jo criticised people for spending in TemplesAfter a massive smack for #Kanguva , #Suriya started visiting temples. Both #Suriya & #Jyothika performing Chandi homam in Kollur Mookambikai kovil.#Karma speaks @Suriya_offl , hope this is a lesson for your family pic.twitter.com/lG6fcTVToS— akindtamizhan (@akindtamizhan) November 26, 2024Jyothika in Tirupati. pic.twitter.com/zq9HRnD0se— Manobala Vijayabalan (@ManobalaV) November 27, 2024 -
'కంగువా' రివ్యూలపై జ్యోతిక ఫైర్.. వాటికంటే దారుణమా..
-
'కంగువ'ని తొక్కేస్తున్నారు.. ప్లాన్ చేసి ఇలా: జ్యోతిక
కోలీవుడ్ 'బాహుబలి'గా ప్రచారం చేసిన సూర్య 'కంగువ'.. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చింది. మంచి హైప్‌తో రిలీజైన ఈ సినిమాకు మొదటి సీన్ తర్వాత నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. మూవీలో ప్లస్సులు కంటే మైనస్సులు ఎక్కువైపోవడమే దీనికి కారణం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సూర్య భార్య జ్యోతిక ఇప్పుడు 'కంగువ'పై కుట్ర జరుగుతోందని ఆరోపించింది. కావాలనే మా మూవీని తొక్కేస్తున్నారని అంటోంది.(ఇదీ చదవండి: తల్లి చిరకాల కోరిక నెరవేర్చిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్)జ్యోతిక ఏమంది?'నటుడు సూర్య భార్యగా కాదు నేను ఈ నోట్‌ని జ్యోతికగా, ఓ సినీ ప్రేక్షకురాలిగా రాస్తున్నాను. కంగువ- ఓ అద్భుతమైన సినిమా. సూర్యని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇలాంటి సాహసం చేయాలంటే చాలా ధైర్యముండాలి. తొలి అరగంట సినిమా బాగోలేదు. మ్యూజిక్ కూడా లౌడ్‌గా అనిపించింది. మన సినిమాల్లో తప్పులు సహజమే. మరీ ముఖ్యంగా ఇలాంటి మూవీస్‌లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. మళ్లీ చెబుతున్నా మూడు గంటల సినిమాలో తొలి అరగంట మాత్రమే బాగోలేదు.''మీడియా, పలువురు సినీ ప్రముఖుల నుంచి నెగిటివ్ రివ్యూస్ రావడం చూసి ఆశ్చర్యపోయా. వీళ్లెవరు కూడా అవే పాత స్టోరీలతో తీసిన సినిమాలకు, అమ్మాయిల వెంటపడే, డబుల్ మీనింగ్స్ ఉండే, ఓవర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటే మూవీస్‌కి ఇలా నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం చూడలేదు. మరి 'కంగువ' పాజిటివ్ అంశాల సంగతేంటి? సెకండాఫ్‌లో అమ్మాయిల ఫైట్ సీక్వెన్స్, పిల్లాడి ట్రాక్.. రివ్యూ రాసేటప్పుడు ఇవేవి మీకు కనిపించలేదా?'(ఇదీ చదవండి: గన్నులు కాల్చి స్వాగతిస్తాం.. బిహార్‌లో 'పుష్ప 2' క్రేజ్)'తొలిరోజే 'కంగువ'పై నెగిటివిటీ చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. తొలి షో పూర్తవకముందే ఇలా చేశారు. ఇదంతా చూస్తుంటే సినిమాని కావాలని తొక్కేస్తున్నారా అనిపిస్తుంది. కాన్సెప్ట్, కష్టానికి కనీసం ప్రశంసలు దక్కాలని నాకు అనిపిస్తుంది. నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లకు అలా చేయడం మాత్రమే తెలుసు' అని జ్యోతిక ఇన్ స్టాలో సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది.నవంబర్ 14న పాన్ ఇండియా లెవల్లో రిలీజైన 'కంగువ'సినిమాకు 2 రోజుల్లో రూ.89.32 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. గతంలో ఈ చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా రూ.2000 కోట్ల వసూళ్లు వస్తాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే రూ.500 కోట్లు రావడం కూడా కష్టమే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'లో నటించాలనుకుంటున్నావా? తిలక్-సూర్య డిస్కషన్) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
ఆమెతో మళ్లీ కలిసి నటించాలని ఉంది.. కానీ, ఒక కండీషన్: సూర్య
నటుడు సూర్య ప్రస్తుతం కథానాయకుడిగా చాలా బిజీగా ఉన్నారు. ఈయన తాజాగా నటించిన కంగువ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. నటి దిశాపటాని నాయకిగా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా నటించారు. శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన భారీ బడ్జెట్ కథా చిత్రం ఇది. కాగా నటుడు సూర్య తన 44వ చిత్ర షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఇదే క్రమంలో సూర్య తన 45 చిత్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌కు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే సెట్ పైకి వెళ్లనుంది. ఇకపోతే ప్రస్తుతం కంగవ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సూర్య ఓ భేటీలో పేర్కొంటూ తన భార్య జ్యోతికతో కలిసి మళ్లీ నటించాలన్న కోరిక కలగానే మారిందన్నారు. అది త్వరలోనే జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. అయితే,ఆ సినిమా కథకు జ్యోతిక అయితేనే సెట్ అవుతుంది అనేలా ఉండాలి కానీ, ఏదో సూర్య చెప్పాడని ఇరికించే ప్రయత్నం చేయకూడదన్నారు. తాను మాత్రం ఏ దర్శకుడిని తమ కోసం కథను సిద్ధం చేయమని కోరనన్నారు. సూర్య తన భార్యతో కలిసి మళ్లీ నటించాలన్న కోరికను వ్యక్తం చేయడంతో దర్శక, నిర్మాతలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం నటి జ్యోతిక ఉమెన్స్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా ఈమె తమిళంలో నటించి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నారన్నది గమనార్హం. కాగా సూర్య, జ్యోతిక కెరీర్ ప్రారంభంలో పూవెల్లామ్ కేట్టుప్పార్, ఉయి రిలే కలందదు, కాక్క కాక్క, పేరళగన్, మాయావి, సిల్ల న్ను ఒరు కాదల్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించారు. -
నా కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేది: సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఓ తెగకు చెందిన గిరిజన నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న సూర్య తన భార్య జ్యోతిక గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పరిస్థితులపై కూడా మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సూర్య.. తనకంటే జ్యోతికనే పెద్ద స్టార్ అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. నేను ఆమెను కలిసే సమయానికి నాకంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేదని వెల్లడించారు. హిందీలో డోలీ సజా కే రఖ్నా మూవీ తర్వాత జ్యోతిక తన మొదటి తమిళ చిత్రంలో నాతో కలిసి నటించిందని తెలిపారు. తన రెండో చిత్రం కూడా నాతో చేసిందని.. ఆ తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యామని సూర్య అన్నారు.సూర్య మాట్లాడుతూ..' నారు తమిళ చిత్ర పరిశ్రమలో మార్కెట్ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ అప్పటికే జ్యోతిక సక్సెస్ఫుల్ యాక్టర్‌గా పేరు సంపాదించుకుంది. నేను హీరోగా ఎదిగేందుకు దాదాపు ఐదేళ్లు పట్టింది. అప్పటికే తన జీతం నా కంటే మూడు రెట్లు ఎక్కువ. ఆ సమయంలో నేను ఎక్కడ ఉన్నానో గ్రహించా. కానీ తను నా జీవితంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంది. మా ప్రేమను తన తల్లిదండ్రులు కూడా అంగీకరించారు" అని అన్నారు.ముంబైలో జ్యోతిక, సూర్యకాగా.. జ్యోతిక, సూర్య ప్రస్తుతం ముంబయిలో ఉన్నారు. తమ పిల్లల చదువుల కోసమే షిఫ్ట్ అయినట్లు చాలాసార్లు వెల్లడించారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత చెన్నై నుంచి ముంబయికి మారినట్లు సూర్య అన్నారు. ప్రస్తుతం జ్యోతిక కుటుంబం ముంబయిలో ఉందని..తన తల్లిదండ్రులకు కూడా సమయం కేటాయించినట్లు ఉంటుందని సూర్య తెలిపారు. -
ముంబైకి షిఫ్ట్ కావడంపై తొలిసారి స్పందించిన సూర్య
కోలీవుడ్‌లో బెస్ట్ జోడిగా ఉన్న సూర్య-జ్యోతిక ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. గతేడాదిలో వారు చెన్నై నుంచి అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అయితే, అంశం గురించి గతంలో పలు రకాలుగా రూమర్స్ వచ్చాయి. వారు కుటుంబంతో విడిపోయారంటూ వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. అయితే, ఈ జంట ముంబైలో ఫ్యామిలీ పెట్టడానికి గల కారణాన్ని కంగువ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో సూర్య చెప్పారు.తమ కుటుంబం కోసం జ్యోతిక చాలా వదులుకొని వచ్చిందని సూర్య ఇలా చెప్పారు. 'తనకు 18 ఏళ్ల వయసులో చెన్నైకి జ్యోతిక వచ్చింది. మా వివాహం అయిన తర్వాత అందరం కలిసే చెన్నైలోనే ఉన్నాం. నా కుటుంబం కోసం ఆమె చాలా త్యాగాలు చేసింది. ఒకదశలో సినిమా ఛాన్సులు వచ్చినా ఆమె వదులుకుంది. ముంబైలో పుట్టి పెరిగిన జ్యోతిక అక్కడ తన స్నేహితులను దూరం చేసుకుంది. అయితే, కొవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ముంబైకి షిఫ్ట్ కావాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఆమె కెరిర్ మళ్లీ మొదలైంది. సరికొత్తదనం ఉన్న ప్రాజెక్ట్‌లలో జ్యోతిక పనిచేస్తుంది. తను ఎప్పుడూ కూడా కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి పనిచేయాలని ఆలోచిస్తుంది. బాలీవుడ్లో శ్రీకాంత్, కాదల్- ది కోర్, సైతాన్ వంటి విభిన్నమైన సినిమాల్లో ఆమె మెప్పించింది. మహిళలకు కూడా అన్ని విషయాల్లో స్వాతంత్య్రం ఇవ్వాలని నేనే కోరుకుంటాను. అందరిలా వారికి కూడా స్నేహితులు ఉంటారు. ప్రస్తుతం జ్యోతిక తన కుటుంబంతో పాటు పాత స్నేహితులతో టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలో నేను కూడా రెగ్యూలర్‌గా ముంబై వెళ్తుంటాను. కుటుంబం కోసం ప్రతి నెలలో పదిరోజులకు పైగానే కేటాయిస్తాను.' అని ఆయన పేర్కొన్నారు. -
నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. కూతురిపై జ్యోతిక ప్రశంసలు
కోలీవుడ్ స్టార్ జంట సూర్య- జ్యోతికల కూతురు దియా మరోసారి తన పేరెంట్స్ గర్వపడేలా చేసింది. ఈ మధ్యే పన్నెండో తరగతిలో టాప్ మార్కులు సాధించిన దియా.. తాజాగా ఓ డాక్యుమెంటరీ రూపొందించి తన టాలెంట్ బయటపెట్టింది. ఇండస్ట్రీలో మహిళా టెక్నీషియన్ల ఇబ్బందులను డాక్యుమెంటరీలో ప్రస్తావించింది.వివక్ష..సినిమాలో ఒక సీన్ అద్భుతంగా రావాలంటే నటీనటులకు మంచి టాలెంట్ ఉంటే సరిపోదు. ఆ సీన్ షూట్ చేసే ప్రదేశంలో మంచి లైటింగ్ ఉండాలి. సీన్‌కు తగ్గట్లుగా ఎఫెక్ట్స్ ఉండాలి. అయితే ఇవన్నీ సరిగ్గా ఉండేట్లు చూసుకునే మహిళా టెక్నీషియన్లకు సరైన గుర్తింపు మాత్రం రావడం లేదు. చాలామంది వారిని చిన్నచూపు చూస్తారు. వారి ఇబ్బందులను ప్రస్తావిస్తూ దియా.. లీడింగ్ లైట్: ద అన్‌టోల్డ్ స్టోరీస్ ఆఫ్ ఉమెన్ బిహైండ్ ద సీన్స్ అనే డాక్యుమెంటరీ తెరకెక్కించింది. ఇది దియా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. వెలుగులోకి తీసుకొచ్చినందుకు థాంక్యూఈ విషయాన్ని జ్యోతిక తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ కూతురిపై ప్రశంసలు కురిపించింది. దియా, నిన్ను చూస్తే గర్వంగా ఉంది. లేడీ టెక్నీషియన్స్ ఎదుర్కొంటున్న వివక్షను డాక్యుమెంటరీలో అర్థవంతంగా చూపించావు. ఎన్నాళ్లుగానో మూలుగుతున్న ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చినందుకు థాంక్యూ అని రాసుకొచ్చింది. ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింనకుగానూ దియా ఉత్తమ స్క్రీన్‌రైటర్‌గా త్రిలోక ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం విశేషం. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) చదవండి: ఈ ఇండస్ట్రీలో ఇదే పెద్ద సమస్య.. తప్పు ఆడాళ్లపైకి తోసేస్తారు: హీరోయిన్ -
Dandi Jyothika Sri: గోదావరి తీరం నుంచి ఒలింపిక్స్ దాకా...
జ్యోతిక శ్రీ దండి భారతీయ క్రీడాకారిణి. మహిళల 400 మీ. పరుగులో జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ΄్యారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో 4 x 400 భారత మహిళల రిలే జట్టులో భాగంగా పాల్గొంటోంది. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. జ్యోతిక ఇప్పటి వరకు రెండు అంతర్జాతీయ పతకాలు, ఆరు జాతీయ పతకాలు సాధించింది.అయినా సరే... వెనుకంజ వేయనివ్వలేదు...మేం ఐరన్‌కి సంబంధించిన వర్క్స్ చేస్తాం. జ్యోతిక చిన్నప్పుడు స్థానికంగా జరిగే రన్నింగ్ పోటీలు చూసి, తనూ ఉత్సాహం చూపేది. తన ఆసక్తి చూసి, కోచ్ దగ్గర చేర్చాం. అలా క్రీడలవైపు ్రపోత్సహించాం. 2013లో స్థానికంగా జరిగే పోటీలో పాల్గొంది. అక్కణ్ణుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటూ వచ్చింది. పాల్గొన్న ప్రతి పోటీలో విజేతగా నిలిచింది. వరల్డ్ కాంపిటిషన్స్కి స్కూల్ రోజుల్లోనే వెళ్లింది. టర్కీకి వెళ్లినప్పుడు లక్ష రూపాయలు తప్పనిసరి అన్నారు. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్ చేశారు. ఇంటర్మీడియట్లో మంచి గ్రేడ్ వచ్చింది. చదువును కొనసాగిస్తూనే, ఉద్యోగం తెచ్చుకుంటాను అంది. కానీ, స్పోర్ట్స్‌లోనే ఉండమని, అదే మంచి భవిష్యత్తును ఇస్తుంది అని చె΄్పాను. విజయవాడలోని అకాడమిలో నాలుగేళ్లు, హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో రెండేళ్లు ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా తన పట్టుదల నన్ను వెనుకంజ వేయనివ్వలేదు. రెండేళ్లుగా ఇండియన్ క్యాంపులో ఉండటం వల్ల నాకు కొంచెం వెసులు బాటు వచ్చింది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో తన సత్తా చాటడానికి వెళ్లింది. ఇన్నాళ్ల కృషికి తగిన ఫలితం నేడు చూస్తున్నాం. స్పోర్ట్స్‌లో రాణిస్తూనే డిగ్రీ చదువుతోంది. స్పిరిచ్యువల్ ఆర్ట్స్ వేస్తుంది.దేశానికి పతకం తీసుకురావాలనే లక్ష్య సాధన కోసమే కృషి చేస్తోంది. – దండి శ్రీనివాసరావు, జ్యోతిక శ్రీ తండ్రి, తణుకు, పశ్చిమగోదావరి జిల్లాపిల్లల లక్ష్యం కోసం...మాకు ఇద్దరు కూతుళ్లు. చిన్నప్పుడు జ్యోతిక పరుగు మొదలు పెట్టినప్పుడు ఊళ్లో మాకో బిల్డింగ్ ఉండేది. పిల్లల లక్ష్యాల కోసం ఆ బిల్డింగ్ అమ్మి ఖర్చుపెడుతూ వచ్చాం. పిల్లలే మాకు బిల్డింగ్ అనుకున్నాం. స్పోర్ట్స్ అంటే మంచి పోషకాహారం, ఫిట్నెస్, ట్రయినింగ్ ఉండాలి. ఖర్చు అని చూసుకోలేదు. – లక్ష్మీ నాగ వెంకటేశ్వరి, జ్యోతిక శ్రీ తల్లి -
ఓటీటీలోకి టాప్ రేటింగ్ సినిమా.. అధికారిక ప్రకటన
బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన 'శ్రీకాంత్' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. హిందీ వర్షన్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దృష్టి లోపం కారణంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిర్భయంగా తన కలల్ని సాకారం చేసుకున్నారు శ్రీకాంత్. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.శ్రీకాంత్ బొల్లా పాత్రలో రాజ్‌కుమార్ రావ్ అద్బుతంగా మెప్పించారు. అలయా ఎఫ్ ఈ చిత్రంలో హీరోయిన్గా మెప్పించారు. ఈ చిత్రంలో జ్యోతిక ఒక కీలక పాత్రలో కనిపించారు. తుషార్ హీరానందానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. భూషణ్ కుమార్, నిధి పర్మార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రేటింగ్ పరంగా కూడా ఈ సినిమాకు భారీగా రెస్పాన్స్ వచ్చింది. IMDb 7.9 రేటింగ్‌తో ఈ చిత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. -
ఆ పాట టైంలో విమర్శలు.. డైమండ్ గిఫ్టిచ్చిన జ్యోతిక
చంద్రముఖి సినిమాలో వారాయ్.. సాంగ్ ఎంతో ఫేమస్. ఇందులో జ్యోతిక డ్యాన్స్, ఎక్స్ప్రెషన్ను మాటల్లో వర్ణించలేం. ఈ ఒక్క పాట సినిమాను మరో మెట్టు ఎక్కించింది. తాజాగా ఈ సాంగ్ గురించి కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. రారా(వారాయ్.. నానుడి తేడి) పాట షూటింగ్ సమయంలో నన్ను ఎంతగానో విమర్శించారు. నిజానికి జ్యోతికకు క్లాసికల్ డ్యాన్స్ రాదు. దీనివల్ల ఆమెకు డ్యాన్స్ నేర్పించడానికి కొంత సమయం పట్టింది. రెండు రోజుల్లో పూర్తితర్వాత రెండు రోజుల్లో సాంగ్ పూర్తి చేశాం. రిజల్ట్ మాత్రం అద్భుతంగా వచ్చింది. ఆ పాట ఎడిటింగ్ అయిపోయే సమయానికి జ్యోతిక స్టూడియోలోనే ఓ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చింది. నాట్యమే తెలియనివారు నా శిక్షణ వల్ల అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంటే అంతకన్నా సంతోషం ఇంకేముంటుంది? చంద్రముఖి మలయాళ వర్షన్ చూడకుండానే ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాను. ప్రత్యేకంగా ఈ పాటను మాత్రమే ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు.కొరియోగ్రాఫర్ ఎలా అయ్యానంటే?కమల్ హాసన్ 'పున్నగి మన్నన్' మూవీకి రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్. కానీ అప్పుడు ఆయనకు ఓ తెలుగు సినిమా చేయాల్సి ఉండటంతో పున్నగి చిత్రాన్ని నాకు అప్పగించాడు. అప్పటికి నేనింకా డ్యాన్స్ స్కూల్లో స్టూడెంట్ను మాత్రమే కావడంతో కమల్ హాసన్ సహా అందరూ భయపడ్డారు. తీరా నా డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు అని కళా మాస్టర్ చెప్పుకొచ్చింది. చదవండి: లైలాగా టాలీవుడ్ హీరో.. హీరోయిన్లే కుళ్లుకునేలా.. -
అతిలోక సుందరితో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరో గుర్తుపట్టారా?
పై ఫోటోలో శ్రీదేవితోపాటు కలిసి కూర్చున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు సౌత్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ హీరోయిన్లు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించారు. మెగాస్టార్ చిరంజీవితో ఈ ముగ్గురూ యాక్ట్ చేశారు. ఇంతకీ ఈ కథానాయికలెవరో గుర్తుపట్టారా?తెలుగులో ఆ చిత్రంతో ఎంట్రీఫోటోలో అతిలోక సుందరి శ్రీదేవి పక్కన కూర్చుని క్యూట్‌గా కనిపిస్తున్న ఈ ముగ్గురు నగ్మా, జ్యోతిక, రోషిణి. నగ్మా విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ భాగి: ఎ రెబల్ ఫర్ లవ్ అనే సినిమాతో తన కెరీర్ మొదలైంది. పెద్దింటి అల్లుడు చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, కొండపల్లి రాజా, అల్లరి అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు, అల్లరి రాముడు.. ఇలా అనేక చిత్రాల్లో యాక్ట్ చేసింది.అక్కడ ఫుల్ బిజీజ్యోతిక.. డోలి సజా కే రఖ్ణా అనే హిందీ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తర్వాత బిజీ అయింది మాత్రం తమిళ ఇండస్ట్రీలోనే! ఠాగోర్, మాస్, చంద్రముఖి, షాక్ చిత్రాలతో తెలుగువారికీ దగ్గరైంది. హీరో సూర్యను పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది.తెలుగులో ఫేమస్రోషిణి.. తన ఇద్దరు అక్కల్లా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించలేకపోయింది. శిష్య అనే తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయమైన ఈ మూవీ మాస్టర్, పవిత్ర ప్రేమ, శుభలేఖలు సినిమాతో తెలుగులో ఫేమస్ అయింది. రెండేళ్లు మాత్రమే సినిమాల్లో యాక్టివ్‌గా ఉన్న ఆమె తర్వాత చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పింది.పేరెంట్స్..కాగా ఈ హీరోయిన్ల తల్లి సీమా 1969లో అరవింద్ మొరార్జీని పెళ్లాడింది. వీరికి పుట్టిన కూతురే నగ్మా. మనస్పర్థల వల్ల ఈ దంపతులు 1974లో విడాకులు తీసుకున్నారు. తర్వాతి ఏడాది నిర్మాత చందర్‌ను పెళ్లాడింది. వీరికి ఒక బాబుతో పాటు జ్యోతిక, రోషిణి సంతానం.చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు! -
జ్యోతిక మనసు ఎలాంటిదో ఈ ఇంటర్వ్యూ చూస్తే చాలు..
-
ఇంటర్లో టాప్ మార్కులతో అదరగొట్టిన సూర్య కూతురు
సౌత్ ఇండియాలో బ్యూటిఫుల్ కపుల్స్‌గా సూర్య- జ్యోతిక జంట ఉంటుంది. చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీగా వీరికి గుర్తింపు ఉంది. వీరి కుమార్తె దియా ఇటీవల ముగిసిన 12వ తరగతి సాధారణ పరీక్షలో మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ దంపతలులకు దియా అనే 17 ఏళ్ల కుమార్తెతో పాటు దేవ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు.సూర్య కుటుంబం మొత్తం సినిమా రంగంలో ఉన్నప్పటికీ దియా, దేవ్ ఇద్దరు కూడా సినిమాల్లోకి అడుగుపెట్టలేదు. దియా టెన్నిస్, ఫుట్‌బాల్ ఆటలపై దృష్టి సారిస్తుంటూ.. దేవ్ కరాటే వైపు అడుగులు వేస్తున్నాడు. చదువుతో పాటుగా ఆటలపై కూడా వారు ఆసక్తి చూపుతున్నారు.ఇంటర్లో అదరగొట్టిన దియాసూర్య కూతురు దియా ఈ ఏడాది పన్నెండో తరగతి పరీక్షలు రాసింది. తాజాగా ఫలితాలు కూడా విడుదలయ్యాయి. దియా మంచి మార్కులతో పాస్ అయినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె సాధించిన మార్కులు ఇవే అంటూ కోలీవుడ్‌లో వైరల్ అవుతుంది. తమిళంలో 100కి 96, ఇంగ్లిష్‌లో 97, గణితంలో 94, ఫిజిక్స్‌లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్‌లో 97 మార్కులు సాధించినట్లు తెలుస్తోంది. 600 మార్కులకు గాను 581 మార్కులు సాధించినట్లు సమాచారం. దియా ఇన్ని మార్కులు సాధించినందుకు కుటుంబ సభ్యులు ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారట. ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ఈ సమాచారం ఎంత వరకు నిజమో తెలియదు.2022లో టెన్త్‌లో కూడా సత్తా చాటిన దియా10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కూడా దియా టాప్ మార్క్‌లు సాధించింది. తమిళంలో 95, ఆంగ్లంలో 99, గణితంలో 100, సైన్స్‌లో 98, సోషల్‌లో 95 మార్కులు సాధించింది. 500 మార్కులకు గాను 487 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. -
ఎంతైనా జ్యోతిక... ఆ స్టయిలే వేరు! (ఫొటోలు)
-
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
‘‘పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్ బొల్లా తన లోపాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు? అనేది ‘శ్రీకాంత్’ సినిమా కథ. కళ్లు లేకుండా జీవితాన్ని గెలవడమన్నది చాలా పెద్ద విషయం. అందుకే శ్రీకాంత్‌లాంటి గొప్ప వ్యక్తి కథతో రూపొందిన ‘శ్రీకాంత్’ మూవీలో నటించడం గౌరవంగా ఉంది’’ అని నటి జ్యోతిక అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన శ్రీకాంత్ బొల్లా (అంధ పారిశ్రామికవేత్త) బయోపిక్‌గా రూపొందిన హిందీ చిత్రం ‘శ్రీకాంత్’. శ్రీకాంత్ పాత్రలో రాజ్‌కుమార్ రావు నటించారు.తుషార్ హీరానందని దర్శకత్వం వహించారు. టీ సిరీస్, ఛాక్ అండ్ ఛీస్ ఫిల్మ్ప్రోడక్షన్స్పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, నిధి పర్మార్ హీరానందని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన జ్యోతిక హైదరాబాద్‌లో మాట్లాడుతూ– ‘‘తుషార్గారు ‘శ్రీకాంత్’ కథ చెప్పినప్పుడు షాక్‌కి గురయ్యాను. శ్రీకాంత్ బొల్లాలాంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడా? అనిపించింది. పూర్తి కథ వినగానే కచ్చితంగా ఈ మూవీలో భాగమవ్వాలని వెంటనే ఒప్పుకున్నాను. శ్రీకాంత్‌గారి పాత్రలో రాజ్‌కుమార్ రావు నటన అద్భుతం. ఈ మూవీలో టీచర్ పాత్ర చేశాను. నేను ఉపాధ్యాయురాలిగా నటించిన మూడో చిత్రం ఇది (నవ్వుతూ). శ్రీకాంత్‌ని ప్రభావితం చేసే గొప్ప పాత్ర చేశాను. నా భర్త (హీరో సూర్య) తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నేను తెలుగులో నటించి చాలా రోజులైంది. మంచి పాత్ర కుదిరితే నటిస్తాను’’ అన్నారు. -
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
రాజకీయాల్లోకి తననెవరూ ఆహ్వానించలేదని నటి జ్యోతిక పేర్కొన్నారు. దక్షిణాదిలో ప్రముఖ కథానాయికల్లో ఒకరిగా రాణించిన ఈమె హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనను దూరం పెట్టి సంసార జీవితంపై పూర్తిగా దృష్టి పెట్టారు. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు కలిగారు. పిల్లలు కాస్త పెద్ద అయిన తరువాత జ్యోతిక మళ్లీ నటనపై దృష్టి సారించారు.శ్రీకాంత్ బయోపిక్‌లో..ఇటీవల జ్యోతిక కథానాయికగా హిందీలో నటించిన సైతాన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆమె అంధుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్ల బయోపిక్ శ్రీకాంత్ మూవీలో టీచర్‌గా ముఖ్యపాత్రను పోషించారు. రాజ్‌కుమార్‌రావు టైటిల్ పాత్రను పోషించిన ఈ చిత్రం ఈ నెల 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.అప్పుడే భర్తతో నటిస్తాఈ సందర్భంగా శుక్రవారం ఉదయం చెన్నైలో జ్యోతిక మాట్లాడుతూ తనకు బాగా నచ్చిన చిత్రం శ్రీకాంత్ అని, ఇది తన కెరీర్లో చాలా ముఖ్యమైనదిగా నిలిచిపోతుందని తెలిపారు. దర్శకుడు ఈ చిత్రాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారన్నారు. శ్రీకాంత్ చిత్రంలో తాను భాగం కావడం ఘనతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సూర్యతో కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారని అడుగుతున్నారని, అందుకు మంచి కథ కోసం ఎదురుచూస్తున్నట్లు జ్యోతిక చెప్పారు.రాజకీయాల్లోకి..మీ భర్త అగరం సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, మీరు కూడా సామాజికపరమైన సమస్యలపై స్పందిస్తున్నారని, అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి జ్యోతిక స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే తనని ఎవరూ రాజకీయాల్లోకి ఆహ్వానించలేదని, అయినా ప్రస్తుతం తనకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. -
ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక
లోక్‌సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో మొత్తం 39 స్థానాలకు (ఏప్రిల్ 19) తొలి దశలోనే ఎన్నికలు జరిగాయి. ఎంతో ఉత్కంఠతో కూడిన ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే,బీజేపీ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. అయితే తమిళనాడు లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేసేందుకు నటులు రజనీకాంత్, అజిత్ కుమార్, శివకార్తికేయన్, సూర్య,కార్తీ, ధనుష్ వంటి స్టార్ హీరోలు అందరూ పోలింగ్ బూత్‌లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఆ సమయంలో సూర్య సతీమణి జ్యోతిక మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. అందుకు సంబంధించిన కారణాలను ఆమె తాజాగా స్పందించింది. ఇదే క్రమంలో తన పొలిటికల్ ఎంట్రీపై మనసు విప్పి మాట్లాడింది.సౌత్ ఇండియాలో టాప్ హీరోగా గుర్తింపు ఉన్న సూర్యతో జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. 2015లో మళ్లీ '36 ఏళ్ల వయసులో' అనే సినిమాతో తెరపైకి వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీ తర్వాత మళ్లీ ఆమె పలు ప్రాజెక్ట్‌లతో పుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం జ్యోతిక 'శ్రీకాంత్' అనే హిందీ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో జ్యోతిక బిజీగా ఉన్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఈ సినిమా తమిళ వెర్షన్ ప్రెస్ మీట్లో జ్యోతిక పాల్గొన్నారు. పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు జ్యోతిక స్పందిస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయకపోవడంపై వివరణ ఇచ్చారు. 'గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా నా ఓటు హక్కును వినియోగించుకుంటూనే వచ్చాను. కానీ, కొన్నిసార్లు నేను అత్యవసరమైన పనుల వల్ల చెన్నైకి అందుబాటులో లేకుండా పోవచ్చు. ఆ సమయంలో నేను ఓటు వేయలేను. ఈసారి నేను అనారోగ్యంతో ఉన్నాను. ఇది వ్యక్తిగత విషయం. అందుకే ఓటు వేయలేదు. దానిని అందరూ గౌరవించాలి.' అని అన్నారు. జ్యోతిక ఎక్కువగా సోషల్ కంటెంట్ ఉన్న సినిమాలనే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దీంతో రాజకీయాల్లోకి రావచ్చు కదా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆసక్తి లేదని ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. -
అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
ఫిట్నెస్ మెంటైన్ చేసే విషయంలో కొందరు హీరోయిన్లు తోపు ఉంటారు. ఎందుకంటే మంచి వయసులో ఉన్న చాలామందికి సాధ్యం కానివి చేసి చూపిస్తుంటారు. ఇక వర్కౌట్ లాంటి వాటితో బాడీని మంచి షేప్‌లో ఉంచుతుంటారు. ఇలాంటి బ్యూటీస్‌లో హీరోయిన్ జ్యోతిక ఒకరు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతమైన మూవీస్ చేస్తూ అలరిస్తున్న ఈమె.. ఇప్పుడు ఏ హీరోయిన్‌కి సాధ్యం కానిది చేసేందుకు రెడీ అయిపోయింది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)ముంబయికి చెందిన జ్యోతిక.. దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో వరస సినిమాలు చేసింది. హీరో సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత నటన పక్కనపెట్టేసింది. పిల్లలు కాస్త పెరిగి పెద్దయిన తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. అటు నిర్మాతగా, ఇటు హీరోయిన్గా మంచి దూకుడు చూపిస్తోంది. ప్రస్తుతం పిల్లలతో కలిసి ముంబయిలో ఉంటున్న జ్యోతిక.. ఫిట్నెస్ మెంటైన్ చేసే విషయంలో అస్సలు తగ్గట్లేదు. మొన్నీమధ్య భర్త సూర్యతో కలిసి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఆకట్టుకుంది.ఇకపోతే గతంలో హిమాలయాలు, కశ్మీర్లో ట్రెక్కింగ్ చేస్తూ కనిపించిన జ్యోతిక.. ఇప్పుడు ఏకంగా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించే బిజీలో ఉంది. ప్రస్తుతం బేస్ క్యాంప్ వరకు వెళ్లిన విషయాన్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అక్కడివరకు ఎలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లాను. ఏమేం తిన్నాను. అక్కడ వాతావరణం ఎలా ఉంది లాంటి విజువల్స్‌ని రీల్ చేసి పోస్ట్ చేసింది. ఒకవేళ జ్యోతిక గనుక ఎవరెస్ట్ ఎక్కితే మాత్రం ఈ ఘనత సాధించిన తొలి హీరోయిన్ అయిపోతుంది!(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
జ్యోతిక ఒప్పుకోలేదు.. సూర్య వల్లే అది జరిగింది: డైరెక్టర్
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శ్రీకాంత్. ఇది తెలుగువాడి బయోపిక్. అంధుడైన శ్రీకాంత్ బొల్ల వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడన్నది సినిమాలో చూపించనున్నారు. ఈ మూవీలో శ్రీకాంత్ టీచర్ పాత్రలో నటించేందుకు జ్యోతిక మొదట్లో అస్సలు ఒప్పుకోలేదట! ఈ విషయాన్ని డైరెక్టర్ తుషార్ హీరానందని వెల్లడించాడు. అతడు మాట్లాడుతూ.. నేను జ్యోతిక నటించిన తమిళ సినిమాలు చాలా చూశాను.రిజెక్ట్ చేసిన జ్యోతికఅవన్నీ చూస్తుంటే తను ఒక గొప్ప నటి అనిపించింది. నా సినిమాలో తను యాక్ట్ చేస్తే బాగుంటుందనిపించింది. కానీ శ్రీకాంత్ బయోపిక్‌లో ఆఫర్‌ను తను రిజెక్ట్ చేసింది. తాను చేయలేనని చేతులెత్తేసింది. ఆ మరుసటి రోజు తనే ఫోన్ చేసి సినిమాలో యాక్ట్ చేసేందుకు అంగీకరించింది. సూర్య స్క్రిప్ట్ అంతా చదివాడు.మిస్ చేసుకోవద్దుఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దని మరీ మరీ చెప్పాడు. అందుకే ఒప్పుకుంటున్నా అని వివరించింది. సూర్య-జ్యోతిక ఇంటికి పిలిచి మరీ ఈ విషయం చెప్పారు. చాలాకాలం తర్వాత హిందీలో ఓకే చెప్పిన సినిమా మాదే.. ఆ తర్వాతే షైతాన్ మూవీకి ఓకే చెప్పింది. కానీ మాకంటే ముందు అదే రిలీజైంది' అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.చదవండి: గృహప్రవేశం.. భర్తతో పూజ చేసిన మహాతల్లి.. -
ఓటీటీకి రూ.200 కోట్ల హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
అజయ్ దేవ్‌గణ్, తమిళ స్టార్లు జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సైతాన్. ఇటీవల థియేటర్లలో రీలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మార్చి 8న విడుదలై ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో సైతాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్కు రానుందని టాక్ నడుస్తోంది. కాగా.. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మే 3వ తేదీ నుంచి సైతాన్ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్ అయితే థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత ఓటీటీలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. వర్ష్ అనే గుజరాతీ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని వికాస్ బహ్ల్, జ్యోతి దేశ్‌పాండే, అజయ్ దేవ్‌గణ్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో జానకీ బోడీవాలా, అంగద్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించగా.. అమిత్ త్రివేదీ సంగీతం అందించారు. -
జ్యోతిక సూపర్ హిట్ చిత్రం.. సీక్వెల్‌కు ప్లాన్!
ప్రస్తుతం ఎవర్గ్రీన్ నటిగా రాణిస్తున్న నటి జ్యోతిక. చంద్రముఖి చిత్రం తర్వాత ఆమె నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడారు. ఆ తర్వాత నటనకు కాస్త విరామం ఇచ్చారు. అది కూడా కుటుంబం కోసమే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఈసారి ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రల్లో నటించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలా జ్యోతిక నటించిన 36 వయదినిలే చిత్రం చేసి సూపర్‌హిట్ కొట్టారు. ఆ తరువాత వరుసగా నటనను కొనసాగిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చి సైతాన్ చిత్రంతో అక్కడా సక్సెస్ సాధించారు. దీంతో హిందీలో మరిన్ని అవకాశాలు ఈమె తలుపు తడుతున్నాయని సమాచారం. జ్యోతిక ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ఉడన్ పిరప్పే. నటుడు శశికుమార్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇతి వృత్తంతో ఆర్.శరవణన్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం 2021లో ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను పొందింది. ఇది జ్యోతికకు చాలా నచ్చిన చిత్రం కావడం గమనార్హం. కాగా తాజాగా ఉడన్పిరప్పే చిత్రానికి సీక్వెల్‌ను చేయాలని జ్యోతిక ఆశిస్తున్నట్లు సమాచారం. అందుకు దర్శకుడు శరవణన్ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జ్యోతిక మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడంతో ఈ చిత్రాన్ని ఆ స్థాయిలో చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉడన్పిరప్పే సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
సూర్యతో పోటీపడిన జ్యోతిక.. వీడియో వైరల్
సౌత్ ఇండియాలో జ్యోతిక- సూర్య స్టార్ కపుల్స్ అని చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌తో ఎందరినో ఆకట్టుకున్నారు. ఇద్దరూ సినిమా రంగంలోనే ఉండటంతో ఫిట్నెస్ కూడా చాలా అవసరం. సూర్య పాన్ ఇండియా సినిమాలు తీస్తుంటే.. జ్యోతిక మాత్రం కోలివుడ్ చిత్రాలతో పాటు బాలీవుడ్ మూవీస్ కూడా చేస్తుంది. తాజాగా ఒక వీడియోను జ్యోతిక షేర్ చేసింది. సూర్యతో కలిసి జిమ్‌లో వర్క్ అవుట్స్ చేసిన దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. జిమ్‌లో సూర్యతో పోటీ పడుతూ జ్యోతిక భారీ వర్కౌట్స్ చేసింది. జిమ్‌లో ప్రతి వర్కౌట్‌ను జ్యోతిక చేస్తూ.. అందరినీ ఫిదా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. సూర్యతో సమానంగా జ్యోతిక చేస్తున్న కసరత్తులు చూసి మెస్మరైజ్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇద్దరూ గెలిచారంటూనే పర్ఫెక్ట్ కపుల్స్ అని చెప్పుకొస్తున్నారు. జ్యోతిక ఒకప్పటి దక్షిణాది అగ్ర తార.. అయితే చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతూ, ఆకట్టుకునే అందంతో ఏమాత్రం తగ్గేది లేదంటోందీ ఈ బ్యూటీ. ఈ మధ్య కాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అందరినీ మెప్పిస్తుంది. తాజాగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సైతాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. ఇన్నేళ్లైనా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. చక్కగా నాజుగ్గా ఉండటమే కాకుండా మంచి ఫిట్నెస్గా ఉండటానికి కారణం ఏంటి అంటే రన్నింగ్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడమే జ్యోతిక ఫిట్నెస్ సీక్రెట్ అంట. నిత్యం జిమ్‌కు వెళ్లి వెయిట్ లిఫ్టింగ్, రోప్ ట్రైనింగ్ వంటివి చేస్తూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటుందట. ఈ విషయంలో సూర్య కూడా జ్యోతికనే ఫాలో అవుతాడట. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
నా భర్త అలాంటి సినిమాలనే ఎంచుకుంటారు: జ్యోతిక
సౌత్ ఇండస్ట్రీలో సూర్య, జ్యోతిక దంపతులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తమదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్న జ్యోతిక ఇటీవలే బాలీవుడ్ మూవీ సైతాన్లో నటించింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సైతాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న జ్యోతిక తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా తన భర్త సూర్యపై ప్రశంసలు కురిపించింది. సూర్య మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఉండే స్క్రిప్టులను ఎక్కువగా ఎంపిక చేసుకుంటారని తెలిపింది. ఆ విషయంలో తాను గర్వపడతానని అన్నారు. ఆయన సినిమాల్లో మహిళలను కించపరిచేలా పాత్రలు ఉండవని.. వారి క్యారెక్టర్ మరింత ఉన్నతంగా ఉండేలా చూసుకుంటారని వెల్లడించింది. స్టోరీ డిమాండ్ చేస్తే తన పాత్ర కన్నా.. ఆమె రోల్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నా పట్టించుకోరని.. అందుకు జై భీమ్ చిత్రమే సాక్ష్యమని పేర్కొన్నారు. కాగా.. సైతాన్ మూవీతో జ్యోతిక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు వికాస్ భల్ దర్శకత్వం వహించారు. మరోవైపు సూర్య ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్నారు. శివ దర్శకుడిగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటించింది. ఇటీవలే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
నీ భర్తను నాకిచ్చేయ్... జ్యోతిక సమాధానమిదే!
'మీ మధ్య దూరం పెరిగింది.. మీరు విడిపోయారు' అంటూ పుకార్లు షికార్లు చేసిన ప్రతిసారి అది రాంగ్ అని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు హీరో సూర్య దంపతులు. కొంతకాలం క్రితం వీరు విడాకులు తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరగ్గా జంటగా వెకేషన్లో కనిపించి అందరి నోళ్లు మూయించారు. తమ మధ్య ఉన్న ప్రేమను పదేపదే చెప్పుకోవాల్సిన పని లేదని చెప్పకనే చెప్పారు. షైతాన్ సూపర్ హిట్ సూర్యను పెళ్లి చేసుకున్నాక దాదాపు పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఇచ్చిన జ్యోతిక తర్వాత మళ్లీ మేకప్ వేసుకోవడం మొదలుపెట్టింది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటున్న ఆమె ఇటీవల షైతాన్ మూవీలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.150 కోట్ల మేర రాబట్టింది. ఈ సినిమా గురించి చెప్తూ ఎమోషనలైంది జ్యోతిక. అద్భుతమైన ప్రయాణం 'కొన్ని సినిమాలు కేవలం గమ్యస్థానాలకే తీసుకెళ్తాయి. కానీ షైతాన్ అనేది ఒక అందమైన, సంతోషకరమైన, ఎన్నో జ్ఞాపకాలు రంగరించిన అద్భుత ప్రయాణం. ఈ జర్నీలో ఎంతోమంది స్నేహితులు దొరికారు. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసిన దేవ్‌గణ్ ఫిలింస్, పనోరమ స్టూడియోస్, జియో స్టూడియోస్ నిర్మాణ సంస్థలకు కృతజ్ఞతలు. టీమ్ మొత్తానికి అభినందనలు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో షైతాన్ టీమ్‌తో పాటు హీరో సూర్యతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన్ను ఆరాధిస్తున్నా ఇది చూసిన ఓ అభిమాని.. 'జ్యోతిక మేడమ్.. సిల్లును ఒరు కాదల్ సినిమాలో లాగా మీ భర్తను ఒకరోజు నాకు అప్పుగా ఇస్తారా? 15 ఏళ్లుగా ఆ జెంటిల్మెన్కు పెద్ద అభిమానిని' అని కామెంట్ చేసింది. దీనికి జ్యోతిక.. 'అలాంటివేమీ కుదరదమ్మా..' అని రిప్లై ఇచ్చింది. ఆ రిప్లై చూసి అభిమాని ఎగిరి గంతేసింది. 'నేను సూర్యకు ఎంత పెద్ద అభిమానినో మీరసలు ఊహించి ఉండరు. నా పేరులో కూడా అతడి పేరును యాడ్ చేశాను. ఆయనే నా ఫస్ట్ లవ్.. నేను ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఈ విషయం ఆయనకు చెప్పండి. అయినా మీరు పంచే ప్రేమ ముందు నాదెంతలెండి' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) చదవండి: రుచికరమైన బిర్యానీ వండిన స్టార్ హీరో.. వీడియో వైరల్ -
స్టార్ హీరో సూర్య దంపతుల మొత్తం ఆస్తి అన్ని కోట్లా?
మన హీరోల్లో చాలామంది ఇప్పుడిప్పుడే తెలుగు కాకుండా ఇతర భాషల్లో క్రేజ్ సంపాదిస్తున్నారు. అలాంటిది చాలా ఏళ్ల క్రితం నుంచి తమిళంతో పాటు తెలుగులోనూ స్టార్ హీరోగా సూర్య ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హీరో, నిర్మాతగా బ్లాక్ బస్టర్స్ కొడుతున్నాడు. ఇతడి భార్య జ్యోతిక కూడా రీఎంట్రీ ఇచ్చేసింది. దీంతో ఇద్దరూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే వీళ్ల ఆస్తుల వివరాలు ఇవేనంటూ కొన్ని నంబర్స్ బయటకొచ్చాయి. కెరీర్ ప్రారంభంలో చాలా విమర్శలు ఎదుర్కొన్న సూర్య.. గజిని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, 'సింగం' సిరీస్ చిత్రాలతో తెలుగులో స్టార్ హీరోల మించిన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.25-30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడట. అలా ఇతడి ఆస్తి దాదాపు రూ.206 కోట్ల వరకు ఉందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?) సూర్యతోనే కెరీర్ మొదట్లో హీరోయిన్గా పలు సినిమాలు చేసిన జ్యోతిక.. పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లయింది. ప్రస్తుతం వాళ్లిద్దరూ పెరిగి పెద్దవడంతో నటిగా మళ్లీ జర్నీ షురూ చేసింది. రీసెంట్గా హిందీ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయని ముంబయికి షిప్ట్ అయిపోయింది. ఇకపోతే ఈమె ఆస్తి రూ.331 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే సూర్య-జ్యోతిక మొత్తం ఆస్తి దాదాపు రూ.537 కోట్ల మేర ఉందని తెలుస్తోంది. సూర్య-జ్యోతిక దంపతులకు చెన్నైలో ఓ ఖరీదైన ఇల్లు, ముంబయిలో రూ.70 కోట్లు విలువ చేసే బంగ్లా ఉన్నాయట. ఇక కార్ల విషయానికొస్తే.. రూ.1.38 కోట్లు విలువైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు, రూ.80 లక్షల ఆడీ క్యూ 7, రూ.61 లక్షల బెంజ్ కారు, రూ.1.10 కోట్ల విలువైన జాగ్వార్ కారు.. వీళ్ల దగ్గర ఉన్నాయని అంటున్నారు. తాజాగా ఈ ఆస్తుల వివరాలు బయటకొచ్చాయి. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: అభిమానితో దురుసు ప్రవర్తన? హీరో సూర్య తండ్రిపై విమర్శలు) -
సినీ అవార్డులు.. ఉత్తమ నటిగా జ్యోతికకు పురస్కారం
చెన్నై: ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక వర్గాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏటా అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కాగా గత కొన్నేళ్లుగా ఈ వేడుకలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో 2015 ఏడాదికి గాను ఉత్తమ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం చైన్నెలో ఘనంగా నిర్వహించారు. 2015వ సంవత్సరానికిగానూ.. ఈ వేడుకల్లో తమిళ భాషాభివృద్ధి శాఖ, సమాచార మంత్రి స్వామినాథన్, మంత్రి సుబ్రమణ్యం, మైలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేలు, చైన్నె మహానగరం, ఉప మేయర్ మహేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలతో పాటు బంగారు పతకాలను, నగదు బహుమతులను అందించారు. 2015కు గాను ఉత్తమ చిత్రంగా తనీ ఒరువన్, ద్వితీయ ఉత్తమ చిత్రంగా పసంగ –2, తృతీయ ఉత్తమ చిత్రంగా ప్రభాకు అవార్డులు అందించారు. ఉత్తమ నటుడిగా హీరో మాధవన్ అలాగే మహిళల ఔన్నత్యాన్ని పెంపొందించేలా రూపొందిన 36 వయదినిలే చిత్రానికి ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు. ఇరుది చుట్రు చిత్రానికి గాను హీరో మాధవన్‌కు ఉత్తమ నటుడి అవార్డు, 36 వయదినిలే చిత్రానికి గాను జ్యోతికకు ఉత్తమ నటి అవార్డు, వై రాజా వై చిత్రానికి గాను నటుడు గౌతమ్ కార్తీక్‌కు ప్రత్యేక జూరీ అవార్డు ప్రదానం చేశారు. అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గాన్ని అవార్డులతో సత్కరించారు. కమిటీ ఏర్పాటు చేశాం.. ఈ సందర్భంగా సమాచార శాఖ మంత్రి స్వామి నాథన్ మాట్లాడుతూ.. 2015వ సంవత్సరానికిగానూ 39 మంది కళాకారులకు ఈ వేదికపై అవార్డులను అందించామన్నారు. ఇకపోతే 2016 నుంచి 2023 వరకు చలన చిత్ర అవార్డుల ఎంపిక కోసం ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత ఎంపికైన కళాకారులకు అవార్డులను ప్రదానం చేస్తామన్నారు. చదవండి: 'ప్రేమలు' మూవీ రివ్యూ -
ఉత్తమ సినిమా, హీరో.. అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం
రాష్ట్ర చలనచిత్ర అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 2015 చిత్రాలకు గాను ఈ అవార్డులను ఇవ్వనున్నారు. ఉత్తమ నటుడు, నటి, సాంకేతిక విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చూపిన వారిక తమిళనాడు ప్రభుత్వం 2015 ఫిల్మ్ అవార్డులను మార్చి 6న అందించనుంది. ఇందులో 'తని ఒరువన్' చిత్రానికి గాను అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకుంది. జయం రవి, అరవింద్ సామీ, నయనతార ప్రధానంగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ హిట్‌ను అందుకుంది. ఉత్తమ చిత్రంగా 'తని ఒరువన్' ఎంపిక అయింది. దీంతో పాటుగా పసంగ 2, ప్రభ, పూతిచ్చుచుటు, 36 వయదిలిలే కూడా ఉత్తమ సినిమాలుగా ఎంపికయ్యాయి. తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో 'ధృవ'గా రామ్ చరణ్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. సూర్య- అమలపాల్ జోడీగా నటించిన పసంగ-2 మూవీ తెలుగులో 'మేము' అనే పేరుతో విడుదలైంది. జ్యోతిక నటించిన 36 వయదిలిలే అనే సినిమా కూడా తెలుగులో '36 వయసు'లో అనే పేరుతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఉత్తమ నటుడిగా 'ఇరుది సుట్రు' చిత్రానికి గాను నటుడు 'మాధవన్' ఎంపికయ్యారు. ఈ సినిమాను వెంకటేశ్ 'గురు' పేరుతో రీమేక్ చేశారు. 36 వయదిలిలే చిత్రానికి గాను 'జ్యోతిక' ఉత్తమ నటిగా ఎంపికైంది. 'వై రాజా వై' చిత్రానికి గాను గౌతమ్ కార్తీక్‌కు ఉత్తమ నటుడిగా ప్రత్యేక అవార్డు లభించింది. 'ఇరుది చుట్టు' చిత్రానికి గానూ రితికా సింగ్‌కు ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డు లభించింది. ఉత్తమ విలన్‌గా 'తని ఒరువన్'లో నటించిన అరవింద్ సామీకి దక్కగా.. ఉత్తమ కథా రచయితగా 'తని ఒరువన్' చిత్రానికి మోహన్ రాజా ఎంపికయ్యారు. పాపనాశం, ఉత్తమ విలన్ చిత్రాలకు గాను జిబ్రాన్ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు గెలుచుకున్నారు. 'తని ఒరువన్' చిత్రానికి గానూ రామ్‌జీ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును గెలుచుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ ఎం.జి ఆర్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు కూడా పలు అవార్డులను ప్రరభుత్వం అందించనుంది. అవార్డుల ప్రధానోత్సవం మార్చి 6వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమం రాజా అన్నామలైపురంలో ఉన్న ముత్తమిలిప్ అసెంబ్లీలో జరుగుతుంది. తమిళనాడు అభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.యు.సామినాథన్ అధ్యక్షతన ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు గ్రహీతలకు బంగారు పతకాలు, చెక్కు, జ్ఞాపికలు, ఉత్తమ చిత్రాల నిర్మాతలకు సర్టిఫికెట్లు అందజేస్తారు. -
ఈ ఫొటోలోని నలుగురూ చిరంజీవి హీరోయిన్లే.. ఎవరో చెప్పుకోండి చూద్దాం?
ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ టాలెంట్ ఉన్నోడే నిలబడతాడు. స్టార్ అవుతాడు. తెలుగులో ఇప్పటికే చాలామంది హీరోలు.. తండ్రి బాటలో వచ్చి సక్సెస్ అయ్యారు, అవుతున్నారు. అలా ఓ హీరోయిన్ తొలుత టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈమె ముగ్గురు చెల్లెళ్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లందరూ చిరంజీవితో సినిమాలు చేశారు. మరి వీళ్లెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? మీలో చాలామంది.. పైన కనిపిస్తున్న ఫొటోలో శ్రీదేవిని అయితే గుర్తుపట్టేసుంటారు. ఈమె పక్కన కూర్చున్న ముగ్గురు చిన్నారులు ఆమెకు చెల్లెళ్లు అవుతారు. కుడివైపు ఉన్న అమ్మాయి నగ్మా. ఎడమ వైపు శ్రీదేవి పక్కనే కూర్చున్న పాప జ్యోతిక. ఆ పక్కన ఉన్న చిన్నారి రోషిణి. వీళ్లందరూ మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు మూవీస్ చేశారు. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) చిరు-శ్రీదేవి కాంబోలో 'జగదేకవీరుడు అతిలోక సుందరి', ఎస్పీ పరశురాం, కొండవీటి రాజా తదితర చిత్రాలు వచ్చాయి. చిరు-నగ్మా కలిసి ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు చిత్రాలు చేశారు. చిరు-జ్యోతిక కాంబోలో 'ఠాగూర్' లాంటి బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇక చిరు-రోషిణి కలిసి 'మాస్టర్' చేశారు. ఇలా నలుగురు అక్కా చెల్లెళ్లతో సినిమాలు చేసిన హీరోగా మెగాస్టార్ రికార్డ్ సృష్టించారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ నలుగురు హీరోయిన్లలో శ్రీదేవి చనిపోగా.. నగ్మా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. జ్యోతిక.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. భర్త సూర్యతో కలిసి పలు సినిమాలని నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. రోషిణి మాత్రం ఇప్పుడెక్కడ ఉన్నారనేది పెద్దగా తెలీదు. తాజాగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎవరబ్బా అని నెటిజన్స్ అనుకున్నారు. సో అసలు విషయం తెలిసి మూవీ లవర్స్ రిలాక్స్ అయిపోయారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
స్టార్ హీరో వింటేజ్ లుక్.. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా.. గుర్తుపట్టారా?
కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన హీరోల్ని కూడా వాళ్ల పాత ఫొటోలు చూస్తే గుర్తుపట్టడం కష్టమే. ఎందుకంటే అంత మార్పు ఉంటుంది మరి. ఈ హీరో కూడా సేమ్ అలాంటోడే. పైన కనిపిస్తున్న ఫొటో అలాంటిదే. ఇతడు తెలుగోడు కానప్పటికీ మన దగ్గర వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. హిట్ ఫ్లాప్ అనేది పక్కనబెడితే ప్రతి మూవీతో మెస్మరైజ్ చేస్తుంటాడు. మరి ఇంతలా చెప్పాం కదా ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న హీరో పేరు సూర్య. అవును మీలో చాలామంది ఊహించింది కరెక్టే. ఇతడు అసలు పేరు శరవణన్ శివకుమార్. తండ్రి శివకుమార్ నటుడు కావడంతో ఇండస్ట్రీ గురించి కాస్తోకూస్తో తెలుసు. కానీ నేరుగా హీరో అయిపోలేదు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఎవరనేది చెప్పకుండా బట్టల ఫ్యాక్టరీలో చాలా తక్కువ జీతానికి కొన్నినెలల పాటు పనిచేశాడు. ఫలానా నటుడి అబ్బాయి అని తెలిసిపోవడంతో అక్కడ పనిమానేశాడు. కెరీర్ ప్రారంభంలో నటుడిగా పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలనే సామెతకి తగ్గట్లు నటుడిగా తనని తాను మెరుగుపెట్టుకుంటూ వెళ్లాడు. కాకా, మౌనం పెసియాదే, పితాగమన్, గజిని లాంటి చిత్రాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'గజిని' సినిమా అయితే తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్‌హిట్‌గా నిలచింది. ఆ తర్వాత 7th సెన్స్, వీడొక్కడే, 24, 'సింగం' సిరీస్ చిత్రాలతో.. చాలామంది తెలుగు స్ట్రెయిట్ హీరోల కంటే ఎక్కువ స్టార్డమ్ సంపాదించాడు. త్వరలో 'కంగువ' అనే చిత్రంతో రాబోతున్నాడు. సూర్య ఫ్యామిలీ విషయానికొస్తే.. తనతో పాటు కలిసి హీరోయిన్గా చేసిన జ్యోతికని 2006లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం హీరో కమ్ నిర్మాతగా సూర్య అదరగొట్టేస్తుంటే.. జ్యోతిక కూడా నటిగా రీఎంట్రీ ఇచ్చి హిందీ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించేస్తోంది. తాజాగా ఒకానొక సందర్భంగా సూర్య పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైన ఉన్న ఫొటో అదే. తొలుత చాలామంది గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ సూర్యలో అంత తేడా ఉంది మరి! (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్) -
గుర్తుపట్టలేనంత బొద్దుగా మారిపోయిన స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా?
మహారాష్ట్రకు చెందిన నగ్మ 'పెద్దింటి అల్లుడు' సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చాలా ఏళ్లుగా ఆమె మీడియాకు దూరంగానే ఉన్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. 90వ దశకంలో ఆమె నటనకు, అందానికి యూత్ దాసోహమైపోయింది. దర్శకనిర్మాతలు తన ఇంటిముందు క్యూ కట్టారు. నచ్చిన కథలు సెలక్ట్ చేసుకుంటూ ఏడాదికి ఐదారు సినిమాలు చేసుకుంటూ పోయింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ హీరోయిన్గా రాణించింది. కానీ ఈమె తెలుగు వెండితెరకు దూరమై దాదాపు 20 ఏళ్లవుతోంది. ఆ తర్వాత ఇతర భాషల్లో నటించినప్పటికీ 2008లో నటనకు గుడ్‌బై చెప్పేసి రాజకీయాల్లో ప్రవేశించింది. కానీ ఎప్పుడు సుమారు పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారంలో కనిపించిన నగ్మ తర్వాత ఎక్కడా కూడా పెద్దగా కనిపించలేదు. తాజాగా ఆమె కంట పడింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం నగ్మా వయసు 48 ఏళ్లు కాగా ఇప్పుడు ఆమెను చూడగానే గుర్తుపట్టడం కాస్త కష్టం అని చెప్పవచ్చు. బాగా బొద్దుగా ఆమె కనిపిస్తుంది. ఇప్పుడు ముంబైలో ఒంటరిగానే నగ్మ ఉంటుంది. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఇలా మాట్లాడింది. 'పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన నాకు లేదు. ఇంకా చెప్పాలంటే నాకంటూ ఓ తోడు ఉండాలి, పిల్లలుండాలని నా ఆశ. పెళ్లి ద్వారా ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఉండేది. కాలం కలిసొస్తే త్వరలోనే నా పెళ్లి జరుగుతుందేమో చూద్దాం. నిజంగా పెళ్లయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీలవుతాను. సంతోషమనేది జీవితంలో కొంతకాలానికే పరిమితం కాదు కదా!' అని చెప్పుకొచ్చింది. జ్యోతిక, రోషిణిలకు నగ్మా సోదరి అనే విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
స్టార్ హీరో భార్య సూపర్ హిట్ చిత్రం.. ఐదేళ్ల తర్వాత వస్తోంది!
జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రాక్షసి. ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రకాష్, ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. తమిళంలో హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులోనూ తీసుకొస్తున్నారు. అమ్మ ఒడి టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వడ్డి రామానుజం, వల్లెం శేషారెడ్డి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈనేపథ్యంలో తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే టీచర్ పాత్రలో జ్యోతిక నటించారు. పాడైపోయిన స్కూళ్లను.. పునరుద్దించాలనుకునే పాత్రలో జ్యోతిక నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే వారికి ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రంలో నాగినీడు హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్, సత్యన్ ముఖ్యపాత్రలు పోషించారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. -
వెకేషన్లో కోలీవుడ్ క్యూట్ కపుల్: రూమర్స్‌కు ఫుల్స్టాప్!
ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ సోషల్ మీడియాలో వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తూ ఉంటాయి. అదీ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన వార్తలైతే క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో అలాంటి వాటిల్లో ఒకటి స్టార్ హీరో సూర్య, నటి జ్యోతిక విడాకుల వార్త. తాజాగా ఒక్క పోస్ట్‌తో ఈ ఊహగానాలకు చెక్ చెప్పింది నటి జ్యోతిక. భర్త సూర్యతో కలిసి జ్యోతిక ఫిన్లాండ్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. గడ్డకట్టే చలి, చిల్లింగ్ స్నోలో హాయిగా గడుపుతున్న బెస్ట్ మూమెంట్స్ , క్యూట్ వీడియోని జ్యోతిక తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. జీవితం ఇంద్రధనుస్సులా రంగులమయం. ఒక్కో రంగును వెతికి పట్టుకొని ఆస్వాదిద్దాం. ఇదిగో ప్రకాశ వంతమైన నా శ్వేత వర్ణం అంటూ మంచులో తన సహచరుడితో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. తద్వారా ఈ రియల్ కపుల్ విడిపోతున్నారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది. దీంతో అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కమెంట్స్ చేశారు. కాగా సూర్యతో గొడవల వల్లే ముంబైకి షిప్ట్ అయిపోయిందన్న వార్తలపై స్పందించిన జ్యోతిక వృత్తిపరమైన కారణాల వల్లే తాను ముంబైకి వెళ్లానంటూ క్లారిటీ ఇచ్చింది. రీఎంట్రీ తర్వాత, జ్యోతికకు బాలీవుడ్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత చెన్నైకి తిరిగి వస్తానని కూడా జ్యోతిక స్పష్టం చేసింది. జ్యోతిక చివరిసారిగా జియో బేబీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం కథల్: ది కోర్లో అద్బుతమైన నటనతో ఆకట్టుకుంది. లెజెండరీ నటుడు మమ్ముట్టి సరసన పోటీపడి మరీ నటించి మెప్పించింది. అలాగే వికాస్ బహల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ , ఆర్. మాధవన్ కూడా ప్రధాన పాత్రల్లో వస్తున్న బాలీవుడ్ హారర్/థ్రిల్లర్ షైతాన్‌లో నటిస్తోంది. షైతాన్ గుజరాతీ మూవీ వాష్‌కి రీమేక్‌గా వస్తోంది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) /p> -
జ్యోతిక విడాకుల రూమర్స్.. ముంబైకి షిఫ్ట్.. అసలు కారణం ఇదేనా?
సూర్య-జ్యోతిక.. ఈ జంట బాండింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా చేస్తున్న టైంలో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. వీళ్ల బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ప్రస్తుతం హీరోగా సూర్య చాలామంచి పేరు తెచ్చుకున్నాడు. జ్యోతిక కూడా నటిగా రీఎంట్రీ ఇచ్చింది. అలాంటిది కొన్నిరోజుల క్రితం వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు దీనిలో ఓ కొత్త విషయం బయటపడింది. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) ముంబయిలో పుట్టిపెరిగిన జ్యోతిక.. సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత తమిళనాడులో సెటిలైపోయింది. తాజాగా పిల్లల్ని తీసుకుని ముంబైకి షిఫ్ట్ అయిపోవడంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. అయితే పిల్లల చదువు, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం కోసమే జ్యోతిక.. సొంతింటికి వచ్చేసినట్లు టాక్ వినిపించింది. ఇవి కాకుండా మరో విషయం కూడా ఇప్పుడు అందరికీ తెలిసింది. పెళ్లి తర్వాత యాక్టింగ్ పక్కనబెట్టిన జ్యోతిక... పిల్లలు కాస్త పెద్దోళ్లు అయిన తర్వాత '36 వయదినిలే' సినిమాతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. దాదాపు ఆరేళ్లు తమిళ చిత్రాలే చేసింది. ఈ మధ్యే మలయాళంలో 'కాథల్'తో హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈమె మూడు హిందీ సినిమాలు చేస్తోంది. ఇప్పటివరకు సౌత్ సినిమాలు చేసిన జ్యోతిక.. బాలీవుడ్‌పై ఫోకస్ చేసేందుకే ముంబయి షిఫ్ట్ అయిందట. అంతే తప్ప విడాకులు కారణం కాదనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి) -
Actor Suriya Family Rare Photos: హీరో సూర్య కుటుంబాన్ని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)
-
అలా చేస్తే హీరోయిన్ల పరిస్థితి ఏంటి?: జ్యోతిక
హీరోయిన్ జ్యోతిక 'వాలి' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, శింబు వంటి ప్రముఖ హీరోలకు జంటగా నటించి టాప్ హీరోయిన్గా రాణించింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు పొందింది. పూవెల్లామ్ కేట్టుప్పార్ చిత్రంలో నటిస్తున్న సమయంలో హీరో సూర్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2006లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి దేవ్, దియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబం కోసం కొంత కాలం నటనకు దూరంగా ఉన్న జ్యోతిక మళ్లీ నటించడం మొదలెట్టింది. 36 వయదునిళే చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక తనకు తగిన పాత్రలను ఎంపిక చేసుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటోంది. కాగా ఇటీవల ఈమె ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు పేర్కొంది. నూతన దర్శకులే మహిళా ఇతివృత్తంతో కూడిన చిత్రాలను చేస్తున్నారని, పెద్ద దర్శకులు అలాంటి చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. నిజానికి హీరోల కంటే హీరోయిన్లే 10 శాతం అధికంగా కష్టపడుతున్నారంది. అయినప్పటికీ హీరోలనే ఎక్కువగా మోస్తున్నారని అభిప్రాయపడింది. అలా చేస్తే హీరోయిన్ల పరిస్థితి ఏం కావాలని జ్యోతిక ప్రశ్నించింది. చదవండి: ప్రియాంకని ఏడిపించేసిన బిగ్‌బాస్.. ఒక్కటైపోయిన అర్జున్-యావర్! -
నా అభిమాన హీరో ఆయనే.. సమంత పోస్ట్ వైరల్!
ఖుషి సినిమా తర్వాత సమంత సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే చికిత్స కోసం విదేశాలకు వెళ్లి వచ్చిన భామ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉంటోన్న సామ్ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఓ మూవీని చూసిన సమంత తన రివ్యూను అభిమానులతో పంచుకున్నారు. సామ్ తాజాగా మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన కాథల్-ది కోర్ చిత్రంపై తన రివ్యూను ప్రకటించారు. సమంత ట్విట్టర్లో రాస్తూ.. 'కాథల్-ది కోర్ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఏడాదిలో నేను చూసిన ఉత్తమ చిత్రం ఇదే. తప్పకుండా అందరు కలిసి చూడాల్సిన చిత్రమిది. మమ్ముట్టి నా అభిమాన హీరో. ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మూవీ ఫీల్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నా. మంచి సినిమాలు చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లవ్ యూ జ్యోతిక' అంటూ పోస్ట్ చేసింది. అలాగే మూవీ డైరెక్టర్ జీయో బాబీని లెజెండ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. సమంత పోస్ట్‌పై కాథల్ ది కోర్ చిత్ర నిర్మాణ సంస్థ కూడా స్పందించింది. ఆమెకు ధన్యవాదాలు చెబుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. కాగా.. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్వలింగ సంపర్కుల పట్ల సమాజం ప్రవర్తించే తీరును ప్రధానంగా ఈ మూవీలో చూపించారు. -
సీన్ మారింది
పెళ్లయిన కథానాయికలు సినిమాల్లో కొనసాగాలంటే ‘కీ’ రోల్స్‌తో సరిపెట్టుకోవాల్సిందే అనే సీన్ మారిపోయింది. పెళ్లయినా, తల్లయినా ‘లీడ్’ రోల్స్ చేయొచ్చనే సీన్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఫార్టీకి దగ్గర్లో, ఫార్టీ ప్లస్ తారలు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ లీడ్ లేడీస్‌గా, రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ దూసుకెళుతున్నారు. హాలీవుడ్లో ఫార్టీ, ఫిఫ్టీ ప్లస్ తారలు కూడా లీడ్ రోల్స్ చేస్తున్నట్లు ఇండియన్ హీరోయిన్లు చేయడం ఓ శుభ పరిణామం. ఇక ఆ కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. ►లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార చేతిలో ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలు ఉంటాయి. వాటిలో లేడీ ఓరి యంటెడ్ మూవీస్ మినిమమ్ మూడు అయినా ఉంటాయి. ప్రస్తుతం ఆమె కథానాయికప్రాధాన్యంగా చేస్తున్న చిత్రాల్లో ‘అన్నపూరణి’ (అన్నపూర్ణ), ‘టెస్ట్’ ఉన్నాయి. ‘అన్నపూరణి’ నయనకి 75వ చిత్రం. డిసెంబరు 1న విడుదల కానున్న ఈ చిత్రంలో బ్రాహ్మణ యువతిగా నటించారు నయన. ఈ చిత్రం టీజర్లో మాంసాహారానికి సంబంధించిన బుక్ చదువుతూ కనిపించారామె. ఇక మరో చిత్రం ‘టెస్ట్’. ఇందులో మాధవన్, సిద్ధార్థ్, నయనతార లీడ్ రోల్స్‌లో కనిపిస్తారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురి జీవితాలు క్రికెట్‌తో ఎలా ముడిపడ్డాయనేది ఈ చిత్రం కథాంశం. ► హీరో సూర్యను పెళ్లి (2006) చేసుకుని సుమారు పదేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జ్యోతిక 2015 నుంచి ఇప్పటివరకూ దాదాపు డజను కథానాయికప్రాధాన్యంగా సాగే చిత్రాల్లో నటించారు. ఆ తరహా చిత్రాలు మరిన్ని చేయడానికి కథలు వింటున్న జ్యోతిక ఇరవయ్యేళ్ల తర్వాత ఇటీవల హిందీలో ‘శ్రీ’, ‘బ్లాక్ మ్యాజిక్’ చిత్రాల్లో లీడ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే మలయాళంలో ‘కాదల్–ది కోర్’ అనే చిత్రంలో ముమ్ముట్టితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పదేళ్ల తర్వాత జ్యోతిక మలయాళంలో చేస్తున్న చిత్రమిది. ఇరవయ్యేళ్ల తర్వాత హిందీలో, పదేళ్ల తర్వాత మలయాళంలో సినిమాలు ఒప్పుకున్నారంటే నటిగా తన కెరీర్‌ని ఇంకా విస్తరించేలా జ్యోతిక ప్లాన్ చేసుకుంటున్నారని ఊహించవచ్చు. ►హీరో ఉపేంద్ర భార్య, నటి ప్రియాంక ఓ ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సింగిల్ లెన్స్‌తో తీసిన తొలి చిత్రం ‘క్యాప్చర్’లో ఆమె లీడ్ రోల్ చేశారు. ఒక నటి లీడ్ రోల్ చేసిన ఈ చిత్రానికి లీడ్ రోల్స్ చేస్తూ దూసుకెళుతున్న మరో నటి రాధికా కుమారస్వామి సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా ఏజ్‌తో సంబంధం లేకుండా తగ్గేదే లే అంటూ లీడ్ రోల్స్ చేస్తున్న తారలు ఇంకొందరు ఉన్నారు. ►కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భార్య, నటి రాధికా కుమారస్వామి ఒకేసారి రెండు ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలు ‘అజాగ్రత్త’, ‘భైరా దేవి’లో నటిస్తున్నారు. ‘భైరా దేవి’ సినిమాలో ఆమె అఘోరాగా కనిపించనున్నారు. ఇక ‘అజాగ్రత్త’ ఏడు భాషల్లో విడుదల కానుంది. మామూలుగా స్టార్ హీరోల చిత్రాలు పాన్ ఇండియాగా పలు భాషల్లో విడుదలవు తుంటాయి. కథానాయికప్రాధాన్యంగా సాగే ఓ సినిమా ఏడు భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కావడం అంటే చిన్న విషయం కాదు. ►నలభయ్యేళ్ల వయసులో ఉన్న తారల్లో త్రిష ఒకరు. ఈ బ్యూటీ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో కన్నా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం అజిత్ సరసన తమిళంలో ‘విడా ముయర్చి’, మోహన్‌లాల్‌తో మలయాళంలో ‘రామ్’ చిత్రాల్లో నటిస్తున్నారు త్రిష. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘పొన్నియిన్ సెల్వన్ 2’లో యువరాణిగా కనిపించిన త్రిష గత నెల విజయ్ సరసన ‘లియో’తో పాటు ‘ది రోడ్’ అనే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో కనిపించారు. -
ఈ కారణం వల్లే సూర్యతో పెళ్లి.. మొదటిసారి రివీల్ చేసిన జ్యోతిక
కోలీవుడ్‌లో అందమైన కపుల్స్ అంటే వెంటనే చెప్పే పేరు సూర్య- జ్యోతికలదే. 2006లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. జ్యోతిక స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో సూర్యకు అంతగా గర్తింపు లేదు. కానీ అవన్నీ పట్టించుకోకుండా సూర్యను ప్రేమించి జ్యోతిక పెళ్లి చేసుకున్నారు. అయితే సూర్యను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన తనలో ఎలా వచ్చిందో జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. (ఇదీ చదవండి: Bhagavanth Kesari : ‘భగవంత్ కేసరి’ మూవీ రివ్యూ) తాజాగా అక్టోబర్ 18న జ్యోతిక తన 45వ పుట్టిన రోజు జరుపుకున్నారు. వారి మధ్య ప్రేమ,పెళ్లి అన్నీ కూడా నెల రోజుల్లోనే జరిగిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చారు. తనకు సూర్య ఇచ్చే గౌరవం వల్లే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పూవెల్లమ్ కెట్టుప్పర్ అనే సినిమాలో తాము కలిసి నటించిన సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని జ్యోతిక తెలిపారు. అలా తామిద్దరం కలిసి ఏడు సినిమాల్లో కలిసి నటించామని చెప్పారు. సినిమాలో భాగంగా రొమాంటిక్ సీన్ ఉన్న సమయంలో డైరెక్టర్ సూచన మేరకు మాత్రమే పరిమితం అయి సూర్య నటిస్తాడు. దానిని అదునుగా ఏ మాత్రం తీసుకోడు. అలా మహిళల పట్ల ఆయన ఇచ్చే గౌరవమే తనను ఎక్కువగా ఆకర్షించేలా చేసినట్లు జ్యోతిక పేర్కొన్నారు. సూర్యను పెళ్లి చేసుకునే సమయానికే తాను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు దాటింది. మొదట సూర్యనే చెప్పాడు రోజంతా షూటింగ్ పనుల వల్ల బాగా అలసిపోయేదానిని.. అప్పటికే తనకు అవసరమైనంత మొత్తంలో డబ్బు సంపాదించడమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నట్లు జ్యోతిక చెప్పారు. అలాంటి సమయంలోనే మొదటగా సూర్య తనకు ప్రపోజ్ చేశాడని తెలిపారు. సూర్య గురించి ఇంట్లో తన తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత వారు కూడా తమ పెళ్లికి అంగీకరించారని చెప్పారు. దీంతో తామిద్దరం ఒకటయ్యామని ఆమె వివరించారు. ఆ ఇంటర్వ్యూలో సూర్య గురించి జ్యోతిక ఇలా చెప్పారు . 'ఒక తండ్రిగా సూర్య చాలా సిన్సియర్‌గా ఉంటాడు. భర్తగా సిన్సియర్‌గా ఉండటమే కాకుండా నాకు సరైన గౌరవం ఇస్తాడు. దీంతో సూర్యను చూసిన వారందరూ.. అతన్ని చూసి నేర్చుకోమని తమ భర్తలకు చాలామంది మహిళలు చెప్పడం ప్రత్యక్షంగా నేను చూశాను. సూర్య ప్రతి ఆనందక్షణాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఇలా ప్రతి విషయంలో సూర్య ఎంతో స్పెషల్. నా జీవితంలోకి సూర్య రావడం నా అదృష్టం.' అని జ్యోతిక తెలిపారు. -
సూర్య,జ్యోతిక వేరు కాపురం.. కన్నీళ్లు తెప్పిస్తున్న కార్తీ మాటలు
కోలీవుడ్‌లో అందమైన కపుల్స్ అంటే వెంటనే చెప్పే పేరు సూర్య- జ్యోతికలదే... వారిద్దరినీ అభిమానులు కూడా అన్నావదిన అనే పిలుస్తూ ఉంటారు. కానీ కొద్దిరోజుల క్రితం సూర్య- జ్యోతికలు వేరు కాపురం పెట్టారు. ప్రస్తుతం జ్యోతిక పిల్లలతో ముంబైలో ఉంటుంది. సూర్య మాత్రం ముంబై టూ చెన్నై తిరుగుతున్నాడు. 2006లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పుడు జ్యోతిక కెరీర్ కూడా పీక్‌లో ఉంది. ఎన్నో ఎళ్లుగా కలిసి ఉన్న కుటుంబంలో జ్యోతిక వల్లనే విబేధాలు వచ్చినట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ మరోక వర్గం మాత్రం మొదటి నుంచి సూర్య, జ్యోతికను వివాహం చేసుకోవడం తండ్రి శివ కుమార్‌కు నచ్చలేదని, కొడుకు ఇష్టాన్ని కాదనలేక పెళ్లి చేశాడని అందుకే చాలా ఏళ్ల తర్వాత జ్యోతిక ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా మరికొన్ని విషయాలను కూడా ఇలా చెప్పుకొచ్చారు. సూర్యతో పెళ్లికి ముందే జ్యోతికకు శివకుమార్ ఒక కండిషన్ పెట్టాడని.. పెళ్లి అయిన తర్వాత ఆమె సినిమాల్లో నటించకూడదని ఆయన చెప్పడంతో జ్యోతిక కొన్నేళ్లు సినిమాలకు దూరం అయ్యిందని రూమర్స్ వచ్చాయి. ప్రస్థుతం ఆమె మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టేసరికి మామగారు జీర్ణించుకోలేక పోవడంతో ఇంట్లో గొడవలు వచ్చాయని. కుటుంబంలో జరిగిన గొడవల్లో సూర్య కూడా జ్యోతికకే మద్ధతు ఇవ్వడం వల్ల అది తన తండ్రికి నచ్చలేదని కొందరు చెప్పుకొచ్చారు. దీంతో వారి కుటుంబంలో గొడవలు మరింత తారా స్థాయికి చేరాయని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కార్తీ కూడా తన అన్నకు సపోర్ట్ ఇవ్వలేదని కూడా పలువురు చెప్పుకొచ్చారు. జ్యోతిక గురించి స్పందించిన కార్తీ సూర్య కుటుంబం గురించి రకరకాలుగా కామెంట్లు వస్తున్నా ఇప్పటి వరకు వారి ఫ్యామిలీలో ఎవరూ స్పందించ లేదు. ఈ కుటుంబ విడిపోవడానికి ప్రధాన కారణం జ్యోతికనే అంటూ విపరీతంగా సోషల్ మీడియాలో కామెంట్లు వస్తుండటంతో అది నచ్చక కార్తీ ఇలా స్పందించాడు. ' నేను జ్యోతికను ఒక నటిగా ఎప్పుడూ చూడలేదు. నేను ఆమెను ఆమ్మగానే చూశాను. తను కూడా మమ్మల్ని తన పిల్లలు మాదిరే చూసింది. అమ్మ ఇప్పుడు ముంబైలో ఉండటంతో ఇల్లు అంతా బోసిపోయి ఉంది. ఆమె లేని ఈ ఇంట్లో ఉండటం మా వల్ల కావడం లేదు. అమ్మతో (జ్యోతిక) కలిసి ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇన్నేళ్లపాటు తామందరం కలిసి ఉంటున్నామంటే దానికి ప్రధాన కారణం జ్యోతికనే... కానీ అన్నయ్య పిల్లలు పెద్దలు అవుతున్నారు. వారి చదువుల కోసం మాత్రమే వారు ముంబై వెళ్లారు. వారి చదువులు పూర్తి అయిన తర్వాత తప్పకుండా తామందరం కలిసే ఉంటాం. ఈలోపు ప్రతి పండుగకు కలుస్తూనే ఉంటాం.' అని ఆయన చెప్పాడు. జ్యోతిక గురించి సూర్య సోదరుడు కార్తీ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కుటుంబం గురించి జ్యోతిక ఏం చెప్పింది కార్తీ, సూర్యలకు బృందా అనే సోదరి కూడా ఉంది. తోబుట్టువుల మధ్య బంధం గురించి గతంలో జ్యోతిక ఇలా చెప్పింది. బృందా, కార్తీల మధ్య ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ గొడవ ఉండనే ఉంటుంది. కానీ సూర్య అంటే బృందాకు గౌరవం చూసి భయపడుతుంది కూడా. బృంద కోసం సూర్య ఏమైనా చేస్తాడు. చెల్లి అంటే ఆయనకు ఎనలేని ప్రాణం. కార్తీ అంటే నాకు కొడుకు,తమ్ముడు,స్నేహితుడు ఇలా ఎంతో అనుబంధం ఉంది. కార్తీ ఇంట్లో ఎప్పుడూ ఫన్నీగానే ఉంటాడు.' అని జ్యోతిక చెప్పింది. సూర్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం కంగువా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. మరోవైపు జపాన్ సినిమాతో కార్తీ దూసుకొస్తున్నాడు. -
జ్యోతిక నాకన్నా ఒక మంచి నటి..!
-
ముంబయికి షిఫ్ట్ అయిన ఫ్యామిలీ.. సూర్య ఏమన్నారంటే!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లోనూ సూర్య సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం కంగువా చిత్రంలో నటిస్తోన్న సూర్య కొన్ని నెలలుగా ముంబయిలో ఉంటున్న సంగతి తెలిసిందే. తన భార్య జ్యోతిక, పిల్లలతో కలిసి ముంబయిలో ఉంటున్నారు. సూర్యకి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గతంలో చెన్నై వదిలిపెట్టి.. పూర్తిగా ముంబయికి షిఫ్ట్ అయ్యారని పలుసార్లు కథనాలొచ్చాయి. కానీ వీటిపై ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు. అయితే తాజాగా ముంబయిలో ఓ ఫ్యాన్స్ మీట్‌కు హాజరైన సూర్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడో తెలుసుకుందాం. (ఇది చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?) అభిమానుల మీట్లో సూర్య మాట్లాడుతూ..' తాను ముంబైలో ఉండడం లేదని అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. తన కూతురు, కొడుకు చదువు కోసమే ఇక్కడ ఉంటున్నాం. తాను ఇప్పటికీ తమిళనాడులోనే ఉంటున్నానని నటుడు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జీవితంలో కొత్తది నేర్చుకోవాలనే తపనతో ఉన్నానని వెల్లడించారు. అందుకే తన సహచరుడు మాధవన్‌తో కలిసి గోల్ఫ్ ఆడుతున్నాట్లు తెలిపారు. కాగా.. మాధవన్, సూర్య మంచి స్నేహితులు. కాగా.. జ్యోతికను 2006లో సూర్య వివాహం చేసుకున్నారు. కాగా.. ఇటీవలే కమల్ హాసన్ విక్రమ్‌లోని రోలెక్స్ క్యారెక్టర్ ఆధారంగా ఒక సినిమా కోసం లోకేష్ కనగరాజ్ తనను సంప్రదించారని సూర్య పేర్కొన్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. క్రేజీ రోల్ చిత్రంపై క్లారిటీ!) -
20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోకు ఓకే చెప్పిన జ్యోతిక
నటి జ్యోతిక.. అప్పట్లో అజిత్, విజయ్, శింబు వంటి క్రేజీ హీరోలతో జత కట్టి విజయాలను అందుకున్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రంలో టైటిల్ పాత్రలో సత్తాచాటారు. అలాంటి సమయంలోనే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత నటనకు కొంత కాలం దూరంగా ఉండి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. అలా జ్యోతిక రెండవ ఇన్నింగ్‌లో నటించిన తొలిచిత్రం 36 వయదినిలే (36 వయసులో) మంచి విజయాన్ని సాధించింది. (ఇదీ చదవండి: నానికి నోటిదూల అంటూ.. టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ ఫైర్) ఆ తర్వాత వరుసగా తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ నుంచి గతంలో ఖుషి, తిరుమలై వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అలా చివరిగా 2003లో తిరుమలై చిత్రంలో విజయ్, జ్యోతిక హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో వాస్తవం ఎంతో గానీ 20 ఏళ్ల తర్వాత విజయ్, జ్యోతిక మళ్లీ కలిసి నటించబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. లియో చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్ తదుపరి వెంకట్ ప్రభు దర్శకత్వంలో తన 68వ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలోని విజయ్ సరసన జ్యోతిక నటిస్తున్నట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడ లేదు. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నారు. కాగా లియో చిత్రం అక్టోబర్ 19వ తేదీన తెరపైకి రానుంది. ఈలోగా విజయ్ 68వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: మీ గౌరవం ఏంటో తెలుసుకోండి.. అలా అయితే జీవించనక్కర్లేదు: సమంత) -
విశాల్‌పై పగ ఎప్పటికీ తగ్గదు.. సూర్య వెనకున్న శక్తి ఎవరంటే: అబ్బాస్
ప్రేమదేశం సినిమా సూపర్ హిట్ కాగానే అబ్బాస్‌పై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అప్పట్లో అబ్బాస్ కటింగ్ చేయండని సెలూన్ షాపుల్లో యూత్ క్యూ కట్టేవారు. అబ్బాస్ రొమాంటిక్ హీరోగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ అబ్బాస్ కెరీర్ మాత్రం ఆశించిన స్థాయిలో లేకుండా కొన్ని సినిమాలతోనే ఫుల్స్టాప్ పడిపోయింది. ప్రేమదేశం తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేదు. చేసేదేమి లేక కుటుంబం కోసం చివరికి సహాయక పాత్రలలో నటించడం ఆయన కొనసాగించాడు. అలా అబ్బాస్ ఎక్కువ కాలం సినిమాల్లో కొనసాగలేదు. (ఇదీ చదవండి: బిగ్ హీరోతో సినిమా ఛాన్స్.. ఈ ఒక్క కారణంతో నన్ను తొలగించారు: యంగ్ హీరోయిన్) తర్వాత తన కుటుంబంతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లి అక్కడ కొత్త జీవితాన్ని గడిపాడు. అబ్బాస్ ఎలాంటి సెలబ్రిటీ గుర్తింపు లేకుండా పూర్తిగా సాధారణ వ్యక్తిగా ఇక్కడ జీవించాడు. విదేశాల్లో పెట్రోల్ పంప్ వర్క్, ట్యాక్సీ డ్రైవింగ్, నిర్మాణం వంటి ఉద్యోగాలు చేశానని అబ్బాస్ బాహాటంగానే చెప్పాడు. తాజాగ ఇండియాకు తిరిగొచ్చిన అబ్బాస్ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఒక ఇంటర్వ్యూలో తమిళ స్టార్ హీరోల గురించి అబ్బాస్ చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అజిత్, విజయ్, సూర్య, విశాల్ తదితరుల గురించి అబ్బాస్ ఇలా మాట్లాడారు. అజిత్‌ను వైద్యలు కూడా హెచ్చరించారు కానీ అజిత్‌కు మంచి వ్యక్తిత్వం ఉందని అబ్బాస్ చెప్పారు. ఒకరకంగా అజిత్ తనలాంటి వాడేనని ఆయన అన్నారు. అజిత్ ఏదైన ఒక విషయంపై మాట్లాడితే అవి కత్తిపై చెక్కర పూసిన మాదిరి ఉండవు. ఎలాంటి టాపిక్‌పైనా కానివ్వండి సూటిగా ప్రతిస్పందిస్తాడని అబ్బాస్ ఇలా పంచుకున్నారు. 'అతను మూర్ఖత్వాన్ని సహించడు. అతనిలో ఏ హీరోలో కనిపించని ఉత్సాహం ఉంది. అతనికి ఇప్పటికే అనేక శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్యులు పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించినప్పటికీ అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నాడు. అతనిలో అభిమానుల పట్ల అచంచలమైన అంకితభావం ఉంది. అందుకే అజిత్‌ను ఫ్యాన్స్ అంతగా ఇష్టపడుతారు. వారి ప్రేమే అయన్ను ముందుకు నడిపిస్తుంది.' అని అజిత్ గురించి అబ్బాస్ అన్నారు. విజయ్ సినిమాలంటే ఇష్టం లేదు: అబ్బాస్ విజయ్ మృదుస్వభావి... డౌన్టు ఎర్త్‌గా ఇప్పటికీ ఆలాగే ఉన్నాడు. అతను ఏదైనా అతిగా చేయడు. అయితే మంచి హాస్యం కలవాడని అబ్బాస్ పేర్కొన్నాడు. మొదట్లో విజయ్ సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అతని సినిమాలంటే చాలా ఇష్టమని ఆయన చెప్పాడు. తన సినిమాలు సమాజానికి మంచి సందేశాలు ఇస్తాయని అబ్బాస్ అభిప్రాయపడ్డారు. సూర్యను నడిపించే శక్తి ఎవరంటే: అబ్బాస్ సూర్య గురించి, అబ్బాస్ ఇలా అన్నాడు 'సూర్య తన తొలి చిత్రం 'నెరుక్కు నెర్' నుంచి నాకు తెలుసు. సినిమా కెరీయర్ ప్రారంభంలో అతనిలో చాలా సిగ్గు కనిపించేది. కెమెరా ముందుకు అంత ఈజీగా వచ్చేవాడు కాదు. కానీ రానురాను అతని జీవితంలో అద్భుతమైన పరివర్తనను చూడటం నిజంగా ఆకర్షణీయంగా ఉంది. సినిమాలను ఎంపిక చేసుకోవడంలో సూర్య అద్భుతం, పని పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే. సూర్య విజయానికి జ్యోతిక సపోర్ట్ పెద్ద కారణం. సూర్య నిస్సందేహంగా చెప్పుకోదగ్గ వ్యక్తి అయినప్పటికీ, అతని విజయం వెనుక జ్యోతిక అనే శక్తి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. నటీనటులందరికీ ఆయన బెంచ్‌మార్క్.' అని సూర్య గురించి అబ్బాస్ అన్నారు. విశాల్‌పై అబ్బాస్ పగ చాలా ఏళ్ల క్రితం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విషయంలో విశాల్‌తో గొడవ జరిగిందని అబ్బాస్ మొదటిసారి రివీల్ చేశాడు. 'నా పట్ల విశాల్ వ్యవహరించిన తీరుతో చాలా కోపం వచ్చింది. అతను చేసిన పనికి నేను ఎప్పుడో క్షమించాను కూడా. ఇప్పుడు ఎక్కడైనా ఎదురుపడితే హాయ్ అని కూడా చెబుతాను. కానీ విశాల్‌తో మాత్రం ఎప్పటికీ సన్నిహితంగా ఉండను. సినిమా పరిశ్రమలో బలమైన బంధాన్ని పెంపొందించుకోవడం నా నిరంతర లక్ష్యం. కానీ విశాల్ విషయంలో అది జరగదు. సినీ పరిశ్రమలోని నటులందరూ ఒకేతాటిపైకి తెచ్చేందుకే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభానికి దారితీసింది. (ఇదీ చదవండి: గుండెపోటుతో ప్రముఖ హీరో భార్య మృతి.. దిగ్భ్రాంతి చెందిన సీఎం) నటీనటులందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించాలనేది దీని వెనుక ఉన్న ఆలోచన. అయితే సీసీఎల్ రెండో సీజన్లో అతనితో ఒక గొడవ జరిగింది. అతను (నా గురించి) అసత్యాలు చెప్పడం ప్రారంభించాడు. అంతేకాకుండా ఇతరులను కూడా తన మాటలతో పాడు చేశాడు. నేను ఇష్టపడని వాతావరణంలో ఉండటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో నేను తీవ్రంగా బాధపడ్డాను. బహుశా, ఒకరోజు అతను ఈ విషయంపై గ్రహించాడని అనుకుంటున్న. అంతిమంగా, అతను ఇప్పటికీ (సినిమా) కుటుంబంలో ఒక భాగం. ఒక కుటుంబంలో విభేదాల రావడం సహజం.' అని అబ్బాస్ పేర్కొన్నారు. -
కార్తీ సినిమాకు గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్,నిర్మాత ఎవరో తెలుసా?
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు కార్తీ. ఇటీవల సర్ధార్, పొన్నియిన్ సెల్వన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈయన తాజాగా తన 25వ చిత్రం జపాన్ చిత్రాన్ని పూర్తిచేశారు. రాజుమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మిస్తోంది . ఇప్పుటికే ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదలై చిత్రంపై మంచి అంచనాలు పెంచాయి. ఈ చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: రజనీ సార్ కాపాడండి.. నా కూతురు నగలు కూడా తాకట్టు పెట్టా: నిర్మాత) కాగా ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో నటిస్తున్నారు. తాజాగా కార్తీ 27వ చిత్రానికి సంబంధించిన వార్త కూడా వెలువడింది. దీన్ని చిత్ర వర్గాలు ప్రకటించకపోయినా, ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్ గురువారం తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో కార్తీ 27వ చిత్రానికి తాను ఛాయాగ్రహణం అందించనున్నట్లు చెప్పారు. దీనికి 96 చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారని, సూర్య, జ్యోతికల 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారిక ప్రకటనను నిర్మాణ సంస్థ త్వరలో వెలువడించనుందని ఆయన చెప్పారు. కాగా కార్తీ హీరోగా పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో సర్ధార్ 2, లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ–2 చిత్రాలు రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ఇప్పుటికే ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. -
జిమ్‌లో హీరోయిన్ కసరత్తులు.. ఆశ్చర్యపోయిన భర్త !
నటి జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ నటి నగ్మా చెల్లెలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె తెలుగు, తమిళంలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్గా కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉండగానే తమిళ స్టార్ హీరో సూర్యను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చిన జ్యోతిక ప్రస్తుతం కుటుంబంతో కలిసి ముంబయిలో ఉంటోంది. (ఇది చదవండి: 'ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకుంటే పాపం'.. ఆసక్తిగా ట్రైలర్ ) తాజాగా జ్యోతిక జిమ్‌లో చేసిన కసరత్తులను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారామె. ఆ వీడియోలో స్టన్నింగ్ వర్కవుట్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఇది చూసిన సూర్య సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మై వండర్ వుమెన్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో జ్యోతిక జిమ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం జ్యోతిక జిమ్‌లో కసరత్తులు చేస్తూ చెమడ్చోతున్న వీడియో తెగ వైరలవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోకు భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని జిందా పాటను జోడించింది. కాగా.. జ్యోతిక వెంకట్ ప్రభు దర్శకత్వం తెరకెక్కించబోయే దళపతి-68లో విజయ్‌తో కలిసి నటించనున్నట్లు సమాచారం. గతంలో ఈ జంట 'కుషి', 'తిరుమలై' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించారు. మరోవైపు రాజ్‌కుమార్ రావు రాబోయే చిత్రం శ్రీలో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా అజయ్ దేవగన్ నటిస్తోన్న థ్రిల్లర్ మూవీలో కనిపించనుంది.ఈ చిత్రంలో ఆర్ మాధవన్ కీలక పాత్రలో నటించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తోంది. మరోవైపు శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కంగువ షూటింగ్లో బిజీగా ఉన్నాడు సూర్య. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్గా నటిస్తోంది. (ఇది చదవండి: విషాదం.. యంగ్ టైగర్ వీరాభిమాని మృతి) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) -
సీక్వెల్.. మార్పుల్...
కథ పెద్దదైతే సినిమా రెండు భాగాలవుతుంది.. ఒక్కోసారి మూడు కూడా అవుతుంది. ఇప్పుడలాంటి కథలతో రూపొం దుతున్న సీక్వెల్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఒకటో భాగంలో నటించిన నటీనటులు, తెరకెక్కించిన దర్శకుడు రెండో భాగంలో కంటిన్యూ కావడంలేదు. ఒకటీ హీరో మారుతున్నారు.. లేదా డైరెక్టర్ మారుతున్నారు... లేదా హీరోయిన్ మారుతున్నారు... ఇక మార్పుల్తో రూపొందుతున్న సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. హిట్: ది థర్డ్ కేస్ తెలుగు చిత్ర పరిశ్రమలో ‘హిట్’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలను నిర్మించింది హీరో నాని కావడం విశేషం. కాగా తొలి రెండు భాగాలు నిర్మించిన నాని థర్డ్పార్ట్ ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించనుండటం విశేషం. ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొం దిన ఈ చిత్రంలో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్‌ను (హిట్) లీడ్ చేసే పోలీస్ ఆఫీసర్ రుద్రరాజుపాత్రలో నటుడిగా విశ్వక్ సేన్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. కాగా హిట్ ఫ్రాంచైజీలో రెండో భాగం ‘హిట్: ది సెకండ్ కేస్’లో హీరోగా అడివి శేష్‌ని తీసుకున్నారు శైలేష్. ఎస్పీ కృష్ణదేవ్పాత్రలో అడివి శేష్ తనదైన శైలిలో నటించి, మెప్పించారు. ఈ సినిమా కూడా హిట్. ఇక మూడో భాగం ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరో నాని నటించనున్నట్లు ‘హిట్: ది సెకండ్ కేస్’ చివర్లో రివీల్ చేశారు. పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్పాత్రలో నాని నటిస్తారు. కాగా హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలుంటాయని శైలేష్ కొలను గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చంద్రముఖి–2 ‘చంద్రముఖి’ (2005)లో ‘లక లక లక..’ అంటూ హీరో రజనీకాంత్ రాజు గెటప్‌లో విలనిజమ్ పండించి, డాక్టర్ ఈశ్వర్‌గా మంచితనం కనబరిస్తే ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలకపాత్రలు చేశారు. ‘చంద్రముఖి’ విడుదలైన 18 ఏళ్లకు సీక్వెల్‌కి శ్రీకారం చుట్టారు పి. వాసు. ‘చంద్రముఖి 2’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ ప్లేస్‌లోకి లారెన్స్ వచ్చారు. అలాగే కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించారు. ఇంకా వడివేలు, లక్ష్మీ మీనన్, రాధిక తదితరులు నటించారు. ఇటీవల మైసూర్లో జరిగిన షెడ్యూల్‌తో ఈ మూవీ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరకర్త. యుగానికి ఒక్కడు–2 వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు దర్శకుడు సెల్వ రాఘవన్. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో యుగానికి ఒక్కడు –2010) ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. కార్తీ హీరోగా, ఆండ్రియా, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ (యుగానికి ఒక్కడు 2) తెరకెక్కించనున్నారు సెల్వ రాఘవన్. అయితే ఈ సినిమాలో తన సోదరుడు, హీరో ధనుష్‌ని లీడ్ రోల్‌కి తీసుకున్నారాయన. కార్తీ స్థానంలో ధనుష్ కనిపిస్తారని కొందరు అంటుంటే.. అలాంటిదేం లేదు.. కార్తీ కూడా ఉంటారు.. సీక్వెల్లో ధనుష్పాత్ర యాడ్ అయిందని మరికొందరు అంటున్నారు. మరి ‘యుగానికి ఒక్కడు 2’లో కార్తీపాత్ర ఉంటుందా? లేదా? అనేది చూడాలి. జెంటిల్మన్–2 అర్జున్, మధుబాల జంటగా శంకర్ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్ నిర్మించిన ‘జెంటిల్‌మేన్’ (1993) చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు ముప్పైఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ‘జెంటిల్మన్ 2’ని నిర్మిస్తున్నారు కుంజుమోన్. అయితే రెండో భాగంలో దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడు ముగ్గురూ మారడం విశేషం. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్లో ‘మంత్ర–2, రాజుగారి గది, పెళ్లికి ముందు ప్రేమకథ’ వంటి చిత్రాల్లో నటించిన చేతన్ చీను హీరోగా నటించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొం దనున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ కానుంది. టిల్లు స్క్వేర్ ‘డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు..’ అంటూ హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పెప్పులేస్తే ప్రేక్షకులు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ మూవీ తెరకెక్కుతోంది. అయితే సీక్వెల్‌కి అటు డైరెక్టర్, ఇటు హీరోయిన్ ఇద్దరూ మారడం విశేషం. ‘టిల్లు స్క్వేర్’కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలి భాగంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించి గ్లామర్‌తో మెప్పించారు. అయితే సీక్వెల్లో మాత్రం అనుపమా పరమేశ్వరన్‌ని హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 15న విడుదల చేయాలనుకుంటున్నారు. జిగర్తండా–2 సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ కీలకపాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగర్తండా’ (2014) తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ అయి, ఇక్కడా ఘనవిజయం సాధించింది. కాగా ‘జిగర్తండా’ విడుదలైన దాదాపు తొమ్మిదేళ్లకు ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ పేరుతో కార్తీక్ సుబ్బరాజ్ సీక్వెల్ తీశారు. ఇందులో రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్‌లో నటించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
స్పెషల్ ఫోకస్
బాలీవుడ్‌పై జ్యోతిక స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. వరుసగా ఆమె హిందీ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇరవయ్యేళ్ల తర్వాత ఇటీవల హిందీ చిత్రం ‘శ్రీ’లో నటించారు జ్యోతిక. వ్యాపారవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు టైటిల్ రోల్ చేశారు. అలాగే ఓ హిందీ వెబ్ సిరీస్‌కు జ్యోతిక సైన్ చేశారనే టాక్ కొన్ని నెలల క్రితం బీటౌన్‌లో బలంగా వినిపించింది. తాజాగా మరో హిందీ ప్రాజెక్ట్‌కు జ్యోతిక సై అన్నారు. వికాస్ బాల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా హిందీలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో అజయ్ దేవగన్ భార్య పాత్రలో జ్యోతిక కనిపిస్తారట. గుజరాతీ ఫిల్మ్ ‘వష్’కు ఈ చిత్రం రీమేక్ అని భోగట్టా. -
వెబ్‌సిరీస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ జ్యోతిక
హీరోయిన్ జ్యోతిక వెబ్ ఎంట్రీ ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి హిందీ నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్పై నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సద్వానీ రెండో వెబ్‌సిరీస్ నిర్మించనున్నారు. సోనాలీ బోస్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్‌సిరీస్‌లో ఓ లీడ్ యాక్ట్రస్‌గా జ్యోతికను అనుకున్నారట మేకర్స్. స్క్రిప్ట్ నచ్చడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. ఐదుగురు గృహిణులు రహస్యంగా ఓ వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నదే ఈ వెబ్‌సిరీస్ కథాంశమట. దీనిపై అధికారిక ప్రకటన వెల్లడైతే జ్యోతిక నటించే తొలి వెబ్‌సిరీస్ ఇదే అవుతుంది. -
ఫ్యామిలీకి దూరంగా సూర్య దంపతులు.. నిజంగానే విడిపోయారా?
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల్లో సూర్య ఒకరు. టాలీవుడ్ అభిమానుల్లోనూ సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఈ కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య వైవిధ్యభరిత కథా చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 2డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఇప్పటికే పలు సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించారు. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో వీర్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన 42వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్రం తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. అయితే తాజాగా సూర్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కాగా.. సూర్య 2006లో నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు దియా, దేవ్ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయ్యాక కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక.. పిల్లలు పెద్దయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అందులో సక్సెస్ ఫుల్‌గా రాణిస్తున్నారు. తాజాగా భార్య జ్యోతిక కారణంగానే సూర్య తన తండ్రి, తమ్ముడితో విడిపోయారన్న రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ప్రముఖ తమిళ నటుడు బైల్వాన్ రంగనాథన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు సూర్య ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయ్యాడని.. సూర్యకు ఆయన తండ్రి శివకుమార్‌కు సంబంధాలు సరిగా లేవన్నారు. సూర్య, జ్యోతికల ప్రేమను శివకుమార్ మొదట వ్యతిరేకించారని.. తర్వాతే కుమారుడి కోసం ఒప్పుకున్నారు. అయితే పెళ్లి తర్వాత జ్యోతికను సినిమాల్లో నటించవద్దని ఆదేశించాడు. అందువల్లే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని బైల్వాన్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతిక సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జ్యోతిక మళ్లీ సినిమాల్లో నటించడాన్ని శివకుమార్ స్వాగతించలేకపోతున్నారని సమాచారం. దీనివల్లే తండ్రీ, కొడుకుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సూర్య తన ఫ్యామిలీ నుంచి వేరుపడాలని భావించినట్లు తెలుస్తోంది. కాగా.. సూర్య, జ్యోతిక 2డి అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. ఈ సంస్థ ద్వారా ఎన్నో నాణ్యమైన చిత్రాలను అందిస్తున్నారు. రీల్ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్‌లోనూ సక్సెస్ఫుల్ జంటగా నిలిచిన సూర్య, జ్యోతిక మొదట చెన్నైలో ఉమ్మడి కుటుంబంలోనే జీవించారు. అయితే ఇటీవలే ఇద్దరూ ముంబైలో కొత్త ఇల్లు కొని సెటిల్ అయ్యారు. -
సూర్య భార్య జ్యోతికలో ఈ టాలెంట్ కూడా ఉందా! షాకిచ్చిన నటి
నటి జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ నటి నగ్మా చెల్లెలుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె తెలుగు, తమిళంలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్గా కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉండగానే తమిళ స్టార్ హీరో సూర్యను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చి గృహిణిగా ఇంటి బాధ్యతలు చూసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లైయింది. చదవండి: అంబర్ పేట్ ఘటన: రష్మీని కుక్కతో పోల్చిన నెటిజన్, ఆమె రియాక్షన్ చూశారా? కొంతకాలంగా 2డీ ప్రొడక్షన్‌పై భర్త సూర్యతో కలిసి జ్యోతిక నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో ఆమె అడపదడపా చిత్రాలు చేస్తూ సినిమాల్లోకి రీఎంట్రి ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాతగా, నటిగా రాణిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో జ్యోతిక పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో జ్యోతిక చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా జ్యోతిక తన స్కిల్స్‌తో అందరి చేత ప్రశంసలు అందుకుంది. కొందరు హీరోలకి కూడా సాధ్యం కాని ఓ స్టంట్ చేసి వావ్ అనిపించుకుంటోంది. రీసెంట్గా చెన్నైలో జరిగిన జేఎఫ్డబ్ల్యూ మూవీ అవార్డ్ ఫంక్షన్‌కు జ్యోతిక హాజరైంది. చదవండి: పెద్దగా ఆఫర్స్ లేవు.. అయినా ఆ స్టార్ హీరోలకు నో చెప్పిన సాయి పల్లవి ఈ సందర్భంగా సాంప్రదాయ చీరకట్టులో వచ్చిన జ్యోతిక తన స్కిల్‌తో అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది. స్టేజ్‌పై అవార్డు అందుకున్న అనంతరం చీరలోనే కర్రసాము చేసి షాకిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హోమ్లీగా కనిపించే జ్యోతికలో ఇంతటి టాలెంట్ ఉందా! అంటూ నెటిజన్లు సర్ప్రైజ్ అవుతున్నారు. View this post on Instagram A post shared by JFW Binge (@jfwbinge) -
13 ఏళ్ల తర్వాత మళ్లీ మలయాళంలో జ్యోతిక
దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హీరోయిన్ జ్యోతిక. ఈ నెల 18న జ్యోతిక బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మమ్ముట్టి హీరోగా మలయాళ హిట్ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఫేమ్ జో బేబీ దర్శకత్వంలో ‘కాతల్’ అనే సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలోనే జ్యోతిక హీరోయిన్గా నటించనున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇక ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసిన జ్యోతిక ఇంతకుముందు మలయాళంలో ‘రాఖిలి పట్టు’(2007), ‘సీతాకల్యాణం’ (2009) అనేసినిమాలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
Aditi Shankar: నయనతార స్థానాన్ని భర్తీ చేస్తా..!
సినీ ప్రముఖుల వారసులు ఆ రంగాన్నే ఎంచుకోవడం పరిపాటే. వారి పేరు, పరపతులతో రంగ ప్రవేశం చేసినా నిలదొక్కుకోవడం అనేది.. వారి ప్రతిభను బట్టి ఉంటుంది. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలు అదితి శంకర్ కథానాయికిగా సినీ రంగ ప్రవేశం చేశారు. డాక్టర్ అయిన ఈమె యాక్టర్ కావడంపైనే ఆసక్తి చూపడం విశేషం. కార్తీ కథానాయకుడుగా నటించిన విరుమన్ చిత్రం ద్వారా ఈమె హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. తనను కథానాయికిగా పరిచయం చేసిన నటుడు సూర్య, జ్యోతిక, కార్తీకి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆడిషన్ నిర్వహించి తనను ఎంపిక చేసిన దర్శకుడు ముత్తైయ్యకు ధన్యవాదాలు చెప్పారు. తాను వైద్య విద్యను అభ్యసిస్తూనే సంగీతాన్ని నేర్చుకున్నానన్నారు. అయితే నటనపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉందన్నారు. ఆ కల విరుమాన్ చిత్రం ద్వారా నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో తాను తేన్మొళిగా మధురై యువతి పాత్రలో నటించానన్నారు. సిటీ యువతరైన తనను గ్రామీణ యువతీగా మార్చిన ఘనత దర్శకుడికే చెందుతుందన్నారు. చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్న తర్వాత తన తండ్రి శంకర్‌కు తన నిర్ణయాన్ని చెప్పారన్నారు. ఇదిగా సక్సెస్ కాకపోతే మళ్లీ వైద్య వృత్తిని చేపడతానని చెప్పానన్నారు. దీంతో ఆయన అంగీకరించినట్లు వెల్లడించారు. నెంబర్ వన్ నటిగా రాణించిన నయనతార స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉందనేది తమ భావన అని, దాన్ని మీరు భర్తీ చేయగలరా..? అన్న ఒక విలేకరి ప్రశ్నకు కచ్చితంగా చేస్తానని అయితే అందుకు మీరు అంగీకరిస్తారా అని చిరునవ్వుతో ఎదురు ప్రశ్నించారు. అయితే తనకు అంకెల స్థానంపై నమ్మకం లేదని శ్రమను, అంకిత భావాన్ని నమ్ముకుని పని చేస్తానని అదితి శంకర్ పేర్కొన్నారు. -
నేషనల్ అవార్డ్ విన్నర్ సూర్య ఫొటోలు..
-
జై భీమ్ వివాదం, హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్ఐఆర్
FIR Filed On Hero Suriya Wife Jyothika And Jai Bhim Director: తమిళ స్టార్ హీరో సూర్యపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జైభీమ్ మూవీ వివాదం నేపథ్యంలో హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సమర్ఫించాలని సైదాపేట మెజీస్ట్రేట్ ఆదేశించింది. కోర్డు ఆదేశాల మేరకు వేలచ్చేరి పోలీసులు హీరో సూర్య, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే సూర్యపై వన్నియర్ సంఘం రూ. 5 కోట్ల పరువు నష్టం దాఖలు చేసింది. చదవండి: 'సర్కారు వారి పాట' విజయంపై మహేశ్ బాబు స్పందన.. అయితే సూర్య బేషరుతుగా క్షమాపణ కోరితే.. పరువు నష్టం ఉపసంహరించుకుంటామని వారు తెలిపారు. కాగా జైభీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని రుద్ర వన్నియర్ సేన వ్యవస్థాపకుడు సంతోష్ గతంలో వేలచ్చేరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పోలీసులు స్పందించకోవడంతో ఆయన సైదాపేట మెజీస్ట్రేట్ను ఆశ్రయించాడు. జైభీమ్ హీరో సూర్య, నిర్మాత జ్యోతికతో పాటు దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టలో సమర్పించాల్సిందిగా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశాడు. చదవండి: కంగనా చిత్రాలన్ని ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నా: నటి పాయల్ అయితే పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ ఎవరూ కోర్టుకు హాజరు కాలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురిని కోరింది. కాగా జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. -
పతకాలు ‘దండి’గా!.. అంతర్జాతీయ పతకమే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన యువ అథ్లెట్ దండి జ్యోతికశ్రీ మహిళల 400 మీటర్ల వ్యక్తిగత పరుగు విభాగంలో రికార్డులు సృష్టిస్తోంది. గత సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన తొలి అండర్–23 అథ్లెటిక్ చాంపియన్ షిప్లో 53.05 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణంతో మెరిసి యావత్తు క్రీడాలోకం దృష్టిని ఆకర్షించింది. జాతీయ స్థాయిలో ఏకంగా 18 పతకాలతో సత్తా చాటి భారత ఒలింపిక్ చాంప్ శిక్షణ జట్టులో స్థానం దక్కించుకుంది. చదవండి: ఆండ్రూ సైమండ్స్ గొప్ప ఆల్‌రౌండర్.. కానీ ఆ వివాదాల వల్లే.. 6 నెలలుగా త్రివేండ్రంలోని నేషనల్ అథ్లెటిక్ క్యాంపు (ఎన్ఏసీ)లో అంతర్జాతీయ కోచ్ గలీనా (రష్యా) పర్యవేక్షణలో తర్ఫీదు పొందుతోంది. ఈ ఏడాది చైనాలో జరగాల్సిన ఏషియన్స్లో గేమ్స్ వాయిదా పడటంతో జూలైలో ఇంగ్లాండ్‌లో జరిగే కామన్వెల్త్ పోటీలపై దృష్టి సారించింది. ముందుగా జూన్‌లో జరిగే ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ చాంపియన్ షిప్లో విజయం సాధించి, అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 50 రోజుల క్యాంపులో భాగంగా టర్కీలో మెలకువలు నేర్చుకుంటోంది. శాయ్ సెంటర్లో శిక్షణ.. జ్యోతికశ్రీ 2016 నుంచి సుమారు నాలుగేళ్ల పాటు విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) సెంటర్లో చీఫ్ కోచ్ వినాయక ప్రసాద్ పర్యవేక్షణలో రాటుదేలింది. ఈ క్రమంలో 2017 బ్యాంకాక్‌లో జరిగిన రెండో ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో నాల్గవ స్థానంలో నిలిచింది. అదే ఏడాది కెన్యాలోని నైరోబి నగరంలో జరిగిన ప్రపంచ అండర్–18 చాంపియన్‌షిప్‌లో, 2016 టర్కీ దేశంలోని ట్రాబ్జోన్ నగరంలో వరల్డ్ స్కూల్ గేమ్స్ చాంపియన్ షిప్లో మెరుగైన ప్రదర్శన కనబరచడంతో పాటు జాతీయ పోటీల్లోనూ జూనియర్ విభాగంలో 400 మీటర్ల వ్యక్తిగత పరుగు, రిలే విభాగాల్లో కలిపి ఏకంగా 7 స్వర్ణాలు, 6 రజత, 3 కాంస్య పతకాలను ఒడిసిపట్టింది. ఏడాదిన్నర కిందట హైదరాబాద్‌లోని శాయ్ సెంటర్లో కోచ్ రమేష్ శిక్షణలో సీనియర్ విభాగంలోకి అడుగిడిన తర్వాత ఈ ఏడాది కాలికట్లో జరిగిన 25వ జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. తండ్రే తొలి గురువు.. జ్యోతికశ్రీ తండ్రి శ్రీనివాసరావు బీరువాలు తయారు చేసే వ్యాపారి. బాడీ బిల్డర్ కావాలని కలలు కన్న ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లక్ష్యాన్ని దూరం చేశాయి. అయితే పాఠశాల పరుగు పోటీల్లో చిన్న కుమార్తె జ్యోతికశ్రీలో ప్రతిభను గమనించి క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆయనే తొలి గురువుగా మారి నిత్యం దగ్గరుండి రన్నింగ్ ప్రాక్టీస్ చేయించేవారు. ఈ క్రమంలోనే 7వ తరగతిలోనే జ్యోతికశ్రీ రన్నింగ్‌పై మక్కువ పెంచుకుంది. తొలిసారిగా 2015 విశాఖలో జరిగిన జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్లో 1000 మీటర్ల విభాగంలో కాంస్యంతో అదరగొట్టింది. ఇక శాయ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న తరుణంలో జ్యోతికశ్రీ బయట హాస్టళ్లలో ఉండాల్సి వచ్చేది. ఈ క్రమంలో తండ్రి శ్రీనివాసరావు తనకు వచ్చే ఆదాయంలో నెలకు రూ.20 వేలకుపైగా జ్యోతికశ్రీ శిక్షణకు ఖర్చు చేసేవారు. రైలు ప్రయాణం చేస్తే అలసిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తన కుమార్తె పోటీలకు వెళ్లేటప్పుడు శ్రీనివాసరావు అప్పుచేసి మరీ విమాన టికెట్లు తీసేవారు. అంతర్జాతీయ పతకమే లక్ష్యం జూలైలో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించటంతోపాటు పతకం గెలవటమే లక్ష్యంగా సాధన చేస్తున్నాను. 400, 100 మీటర్ల పరుగు విభాగంలో ఒలింపిక్స్ కోసం సిద్ధం చేస్తున్న 8 మంది క్రీడాకారిణుల జట్టులో తెలుగు రాష్ట్రాల నుంచి నేను ఉండటం గర్వంగా ఉంది. ప్రస్తుతం నా టైమింగ్‌ను మరింత మెరుగుపరచుకుందేకు ప్రయత్నిస్తున్నాను. – దండి జ్యోతికశ్రీ, అథ్లెట్ -
'జై భీమ్' చిత్రానికి మరో రెండు అవార్డులు..
Suriya Jai Bhim Movie Got Indie Spirit Awards At Boston International Film Festival: కరోనా సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై అశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం 'జై భీమ్'. సూర్య హీరోగా టీజే. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల 'దాదా సాహేబ్ పాల్కే ఫిలీం ఫెస్టివల్'లో రెండు అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 'ఉత్తమ చిత్రం'గా నిలవగా, మూవీలో నటించిన మణికందన్‌కు 'బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్' అవార్డు వచ్చంది. తాజాగా 'జై భీమ్' సినిమా మరో రెండు అవార్డులను సాధించింది. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరిగిన 'బోస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'లో జై భీమ్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందులో నటి లియోమోల్ జోస్‌కు 'ఇండీ స్పిరిట్ బెస్ట్ యాక్ట్రెస్' అవార్డు వరించగా, 'ఇండీ స్పిరిట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ' అవార్డును మూవీ కెమెరామెన్ ఎస్.ఆర్. కదీర్ సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్టైన్మెంట్' సంస్థ పేర్కొంది. సూర్య, జ్యోతిక కలిసి '2డీ ఎంటర్టైన్మెంట్' పతాకంపై 'జై భీమ్' చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మించారు. చదవండి: దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో సూర్య, అల్లరి నరేశ్ చిత్రాలకు అవార్డులు The Director of #JaiBhim, @tjgnan Sir handed over #BostonInternationalFilmFestival's Award for the Indie Spirit Best Cinematography to @srkathiir Sir 🥳@Suriya_offl #Jyotika @rajsekarpandian @BostonInterFF pic.twitter.com/M4l6z0jDUT — 2D Entertainment (@2D_ENTPVTLTD) May 6, 2022 #JaiBhim bags the Awards for Indie Spirit Best Actress & Indie Spirit Best Cinematography at the #BostonInternationalFilmFestival Congratulations @jose_lijomol & @srkathiir Sir on the Awards! Thank You @BostonInterFF for the honour@Suriya_offl #Jyotika @tjgnan @rajsekarpandian pic.twitter.com/zyfjdo7Sn2 — 2D Entertainment (@2D_ENTPVTLTD) May 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్ఐఆర్కు కోర్టు ఆదేశం
తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయన నటించిన 'జై భీమ్' చిత్రంపై చెలరేగిన వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో తమ కులాన్ని కించపరిచారని వన్నియార్ సామాజిక వర్గానికి చెందిన కొందరు 2021 నవంబర్‌లో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జై భీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, అతని భార్య జ్యోతిక(జై భీమ్ నిర్మాత) దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. గతంలో పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ ఎవరూ కోర్టుకు హాజరు కాలేదన్న విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాకుండా ఈ కేసుపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ ముగ్గురును కోరింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. -
16 ఏళ్ల తర్వాత.. భర్తతో కలిసి నటిస్తున్న జ్యోతిక
నటుడు సూర్య మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఇంతకుముందు పేరళగన్, వారణం ఆయిరం, వేల్, మాట్రాన్ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇక 24 చిత్రంలో త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. తాజాగా సంచలన దర్శకుడు బాల చిత్రంలో కథానాయకుడిగా డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. ఇందులో రెండు పాత్రల్లో ఒకటి బదిర (మూగ, చెవుడు) పాత్ర అని సమాచారం. సుమారు 16 ఏళ్ల తర్వాత జ్యోతిక భర్త సూర్యతో కలిసి ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. మరో కథానాయిక పాత్రను టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించనున్నారు. టూడి వెంకట్ పతాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. సూర్యకు తొలి రోజుల్లో నంద, ఆ తర్వాత పితామగన్ చిత్రంతో మరో సంచలనం విజయాన్ని అందించిన బాల తాజాగా నిర్మించనున్న ఈ చిత్రంపై ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
కోలీవుడ్ స్టార్ సూర్య సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ!
Uppena Heroine Krithi Shetty To Act With Suriya: కోలీవుడ్ నుంచి హీరోయిన్ కృతీశెట్టికి కబురొచ్చిందట. సూర్య హీరోగా బాల దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేసవిలో ప్రారంభం కానుంది. ఇందులో ఓ హీరోయిన్ పాత్రకు కృతీ శెట్టిని తీసుకున్నారన్నది చెన్నై కోడంబాక్కమ్ టాక్. అలాగే మరో హీరోయిన్గా జ్యోతిక కనిపిస్తారట. ఒకవేళ ఒక హీరోయిన్గా కృతీ శెట్టి పేరు కన్ఫార్మ్ అయితే ఈ బ్యూటీకి సూపర్ చాన్స్ దక్కినట్లే. ఎందుకంటే విలక్షణ దర్శకుడు బాల, స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో సినిమా అంటే కృతీ డైరీలో ఓ భారీ ప్రాజెక్ట్ చేరినట్లే. ఇక తెలుగులో కృతీ హీరోయిన్గా చేసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న రామ్ ‘ది వారియర్’, నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. చదవండి: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో బేబమ్మ రొమాన్స్.. -
జైభీమ్: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్‌ను దాటేసింది
సాక్షి, హైదరాబాద్: సినిమా అంటే ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్‌లు కాదని నిరూపించిన మూవీ జై భీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపిన మూవీ. అంతేకాదు సింపుల్ బడ్జెట్‌తో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సగటు ప్రేక్షకుడిలో ఆలోచన రేకెత్తించిన సినిమాగా ప్రశంసలు దక్కించుకుంది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోత్మకంగా తెరకెక్కించిన వైనం శభాష్ అనిపించుకుంది. ఈ మూవీ బ్లాక్ బ్లస్టర్హిట్ అవ్వడమే కాదు అనేక రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా ఐఎండీబీలో రేటింగ్స్‌లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ ‘ది షాషాంక్ రిడంప్షన్’ అధిగమించి ప్రపంచవ్యాప్తంగా విమర్శకులను ఆకట్టుకుంటోంది. 1994లో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ఐఎండీబీ సినిమాల జాబితాలో టాప్ ఉంది. ప్రస్తుతం 2.5 మిలియన్ల ఓట్లతో 9.3 రేటింగ్‌తో ఉండగా, జై భీమ్ 73 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది తమిళ హీరో సూర్య, నటి జ్యోతిక దంపతులకు వారి మూవీలు, ఫ్యాన్స్‌లో వారికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ ప్రాధాన్యమున్న సినిమాలతో, అనేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టడమే కాదు కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అవుతున్నారు.. ఈ మూవీ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన టాప్ మూవీగా జైభీమ్ నిలిచింది. అరుదైన చిత్రాల జాబితా లిస్టులో చోటు సంపాదించుకుని 9.6 రేటింగ్‌తో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. -
Jai Bhim IMDB Rating: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్‌ను దాటేసింది
-
అందుకే సూర్యను అమ్మాయిలు ఇష్టపడతారు, అదే నా టెన్షన్: జ్యోతిక
Jyothika Interesting Comments On Surya In a Interview: కోలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో సూర్య- జ్యోతిక జంట ఒకటి. సూర్య-జ్యోతికలు ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన జ్యోతిక ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అంతేగాక తమ సొంతబ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ లేడీ బాస్‌గా వ్యవహరిస్తున్నారు. భర్త సూర్యతో కలిసి నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్న జ్యోతిక పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఆమె సూర్య గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఓ నిర్మాతగా ఓటీటీ ప్లాట్‌ఫాం, సౌత్ సినిమాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చదవండి: పునీత్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ వైరల్, ఇవే అప్పు చివరి క్షణాలు! ఈ మేరకు జ్యోతిక, సూర్య గురించి చెబుతూ.. ‘సూర్య చాలా రొమాంటి భర్త. నన్నూ పిల్లలను బాగా చూసుకుంటాడు. భార్య మాటకు విలువ ఇస్తాడు. ప్రొడక్షన్ హౌజ్‌లో నా భాగస్వామ్యాన్ని, సినిమాల పరంగా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంటాడు. ఇక ఉదయాన్నే నాతో కలిసి కాఫీ తాగుతారు. మా ఇద్దరికి ఔట్‌డోర్ జాగింగ్ అంటే ఇష్టం. సూర్య కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇవి సూర్యలో ఉంటే బెస్ట్ క్వాలిటీస్. అందుకే ఆయనను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. సూర్యకు ఉన్న లేడీ ఫాలోయింగ్ చూస్తుంటే నాకు కొంచం టెన్షన్‌గా ఉటుంది(నవ్వుతూ)’ అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: పైసా సంపాదన లేదు.. నా భార్య సంపాదనతో బ్రతికాను అలాగే తను సూర్య కథల గురించి చాలా మాట్లాడుకుంటామని, ఎందుకంటే గట్టిగా చర్చించుకున్నప్పుడే కథలో ఉన్న దమ్ము బయటపడుతుందన్నారు. స్క్రిప్ట్ విషయంలో సూర్య అంత తేలిగ్గా కన్విన్స్ అవ్వరని, తాను మాత్రం కథ వినగానే కొత్తగా ఉందా లేదా అని చూస్తానన్నారు. చాలా వరకు ఫైనల్‌గా తను చెప్పిన మాటకే అందరూ ఓటు వేస్తారని జ్యోతిక పేర్కొన్నారు. ప్రస్తుతం తమ బ్యానర్లో పదిహేను సినిమాలు రూపొందుతున్నాయని, వాటిలో కొన్ని థియేటర్లలో మరికొన్ని ఓటీటీలకు సరిపోయే కథలు ఉన్నాయని చెప్పారు. -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సూర్య దంపతులు, రూ. కోటి విరాళం
Hero Surya And His Wife Jyothika Gave Rs 1 Crore Check To CM MK Stalin: తమిళ స్టార్ హీరో సూర్య-జ్యోతిక దంపతులు మరోసారి తమ గొప్ప మనసు చాటుకున్నారు. తమిళనాడుకు చెందిన ఇరులర్ ట్రైబ్ (ఆదివాసీల) సంక్షేమం కోసం రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను సూర్య దంపతులు కలిసి ఈ చెక్కను అందజేశారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రూ, పాజ్హన్కుడి ఇరులర్ ట్రస్ట్ సభ్యులు అ విరాళాన్ని అందుకున్నారు. కాగా సూర్య సేవ కార్యక్రమాల్లో ముందుంటారని తెలిసిన సంగతే. కరోనా సమయంలో తన తండ్రి, సోదరుడు కార్తీలు సీఎం రిలీప్ ఫండ్‌కు విరాళం ఇచ్చారు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం ‘జేమ్స్’ మేకర్స్ కీలక నిర్ణయం కాగా సూర్య తాజాగా నటించిన చిత్రం జై భీమ్. ఆయన స్వీయ నిర్మాణం 2డీ ఎంటర్టైన్మెంట్లో నిర్మించిన ఈ చిత్రం రేపు(నవంబర్ 2)న విడుదల కానుంది. తమిళనాడులో 1990లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. గిరిజన తెగకు చెందిన సెంగ్గెని, రాజా కను అనే దంపతుల కథతో తెరకెక్కింది. అన్యాయంగా జైలుపాలైన భర్తను కాపాడుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటమే ఈ కథ. న్యాయం చేసే న్యాయవాది పాత్రలో హీరో సూర్య నటించగా.. తనకు వ్యతిరేకంగా వాదించే లాయర్‌గా రావు రమేష్ నటించారు. చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో అలరించే చిత్రాలివే.. Rs. 1Cr was donated towards the welfare of the Irula Tribe, by @Suriya_offl Sir & #Jyotika Ma’am on behalf of 2D in the presence of our Hon'ble Chief Minister of TN @mkstalin the cheque was handed over to Justice K. Chandru (Retd) & members of Pazhangudi Irula Trust.#JaiBhim pic.twitter.com/uvYdGUbo9U — 2D Entertainment (@2D_ENTPVTLTD) November 1, 2021 -
జ్యోతిక బర్త్‌డే స్పేషల్ ఫోటోలు
-
వ్యాక్సిన్ తీసుకున్న హీరో సూర్య దంపతులు
హీరో సూర్య ఆయన భార్య, నటి జ్యోతిక వ్యాక్సిన్ తీసుకున్నారు. మంగళవారం(జూన్ 22) వారిద్దరూ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘వ్యాక్సినేటెడ్’ అంటూ భార్య జ్యోతిక, సూర్య వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోలను ట్విటర్లో షేర్ చేశాడు. కాగా సూర్య ఇటీవల నటించిన ఆకాశం నీహద్దురా సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నాడు. కొంతకాలంగా సక్సెస్ లేని సూర్యకు ఈ మూవీ ఘనవిజయాన్ని అందించింది. ప్రస్తుతం సూర్య సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్య 40వ చిత్రంగా ఇది తెరకెక్కనుంది. ఈ మూవీలో సూర్యకు జోడీగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నట్లు సమాచారం. #Vaccinated pic.twitter.com/3SJG9wYPFD — Suriya Sivakumar (@Suriya_offl) June 22, 2021 -
సలార్: ప్రభాస్‌కు అక్కగా తెరపైకి మరో హీరోయిన్ పేరు!
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఒకటి. ఈ మూవీని డైరెక్టర్ ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించి రూమర్స్ సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ పాత్రపై ఇంతకాలం రకారకాల వార్తలు వినిపించగా.. తాజాగా ప్రభాస్‌కు సోదరి పాత్ర గురించిన రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ప్రభాస్‌కు అక్కగా ప్రముఖ నటి రమ్మకృష్ణ నటించనున్నట్లు నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. ఈ తరుణంలో తాజాగా అక్క పాత్రకు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఇందులో ప్రభాస్ సోదరి పాత్రకు జ్యోతికను అనుకున్నంటున్నట్లుగా ఫిలిం ధూనియాలో టాక్. అంతేగాక ఇప్పటికే మూవీ మేకర్స్ జ్యోతికను కలిసి కథ వివరించినట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనికి జ్యోతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనే దానిపై క్లారిటి రావాల్సి ఉంది. అంత ఒకే అయితే ఆమెను తెలుగు, తమిళం వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కన్నడ వెర్షన్లో మాత్రం నటి ప్రియాంక త్రివేదిని సంప్రదించినట్లు సమాచారం. కాగా, జ్యోతిక తెలుగులో చిరంజీవితో ‘ఠాగూర్’, నాగార్జునతో ‘మాస్’ సినిమాలో హీరోయిన్గా నటించారు. అలాగే చంద్రముఖిలో తన నటనకు ప్రశంసలు దక్కాయి. కాగా ‘కేజీఎఫ్’ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. శృతీ హాసన్ ఈ మూవీతో మొదటి సారిగా డార్లింగ్‌తో జతకడుతోంది. భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనితో పాటు ప్రభాస్ మరో రెండు పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చేస్తుండగా... రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటిస్తున్నాడు. చదవండి: అప్పుడు అమ్మ... ఇప్పుడు అక్క! -
పధ్నాలుగేళ్లకు మళ్లీ...
సూర్య, జ్యోతిక జంటగా ఏడు సినిమాలు చేశారు. ఆ తర్వాత ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత సూర్య, జ్యోతిక కలసి సినిమా ఎప్పుడు చేస్తారు? అనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంది. ‘‘కలిసి కనిపించాల్సిన కథ వస్తే మళ్లీ ఆన్‌స్క్రీన్ మీద మరోసారి జోడీగా కనబడతాం’’ అని పలు సందర్భాల్లో సూర్య చెప్పారు. ఇప్పుడు కథ కుదిరిందని, పధ్నాలుగేళ్ల తర్వాత వీళ్లిద్దరూ స్క్రీన్ మీద కనిపించనున్నారని టాక్. మలయాళ దర్శకురాలు అంజలీ మీనన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందట. తమిళ చిత్రం ‘సిల్లు కరుప్పాట్టి’ దర్శకురాలు హలితా షహీమ్‌తో కలసి అంజలీ మీనన్ కథ సిద్ధం చేస్తున్నారని సమాచారం. -
నటి జ్యోతిక రూ. 25 లక్షల విరాళం
తంజావూర్ ప్రభుత్వాస్పత్రికి నటి జ్యోతిక రూ. 25 లక్షలు విరాళం అందించారు. ఆ మధ్య తాను నటిస్తున్న చిత్ర షూటింగ్ కోసం రాజా మీరసుధార్ ఆస్పత్రికి వెళ్లి అక్కడి సమస్యలను చూశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం అగరం ఫౌండేషన్ ద్వారా ఆస్పత్రి అభివృద్ధికి విరాళాన్ని జ్యోతిక తరఫున దర్శకుడు ఆర్.శరవణన్ అందించారు. పిల్లల వార్డు ఆధునికీకరణ కోసం ఈ మొత్తాన్ని అందజేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతికకు ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. (బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు మహేష్ పిలుపు) -
ఓటీటీలో విడుదల కానున్న జ్యోతిక సినిమా
-
నటులుగా మారిన ప్రముఖ దర్శకులు
హీరోయిన్ జ్యోతిక లీడ్ రోల్లో నటిస్తున్న ‘పొన్మగల్ వంధల్’ త్వరలో అమెజాన్ ప్రైంలో విడుదల కానున్న విషయం తెలిసిందే. కోర్టు కేసు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రముఖ దర్శకులు పార్తీబన్, కె. భాగ్యరాజ్, త్యాగరాజన్, ప్రతాప్ పోటెన్, పాండియన్రాజన్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే సినీ చరిత్రలో ఒకేసారి ఇంతమంది దర్శకులు కెమెరా ముందు నటించడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. హీరో సూర్య సోంత బ్యానర్ 2డీ ప్రోడక్షన్లో రూపొందించిన ఈ సినిమాకు నిర్మాతలు సూరియా శివకుమార్, జేజే ఫ్రెడ్రిక్ తొలిసారిగా దర్శకత్వం వహిరించారు. కోర్టు నేపథ్యంలో సాగే ‘పొన్మగల్ వంధల్’ సస్పెన్స్ థ్రిల్లర్ కేసును చేదించే శక్తివంతమైన మహిళ న్యాయవాదిగా జ్యోతిక కనిపించనున్నారు. దాదాపు 200పైగా దేశాలలో ఈ చిత్రం మే 29న ఓటీటీ ప్లాట్‌ఫాం ఆమెజాన్ ప్రైంలో విడుదల కానుంది. (ఓటీటీకే ఓటు) (చదవండి: బంగారు తల్లి వచ్చింది) -
నటుడు సూర్యకు గాయాలు !
సినీ నటుడు సూర్య గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఆయనకు గాయాలయ్యాన్న వార్త సామాజిక మాధ్యమాల్లో గుప్పుమంటోంది. సుధ కొంగర దర్శకత్వంలో సూరారై పొట్రు చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ఆ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఆయన భార్య జ్యోతిక కథానాయకిగా నిర్మించిన పొన్మగళ్ వందాళ్ చిత్రం ఈ నెల 29న ఓటీటీలో విడుదల కానుంది. లాక్డౌన్ కాలంలో సూర్య వర్కవుట్ చేస్తుండగా గాయాలు అయినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ విషయంపై సూర్య అందుబాటులోకి రాకపోగా, ఆయన బంధు వర్గాలను విచారించగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగతున్నట్లు పెద్దగా గాయాలేమీ కాలేదని వివరించారు. ఇటీవల వర్కవుట్ చేస్తుండగా ఆయన ఎడమ చేతికి గాయమైందన్నారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారని తెలిపారు. ఇప్పుడు సూర్య చేతి గాయం 90 శాతం నయమమైందని చెప్పారు. లాక్ డౌన్ పూర్తి కాగానే హరి దర్శకత్వంలో అరువా చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. చదవండి: త్రీఎఫ్ ఉంటే చాలు! -
జ్యోతికకు రాధిక అభినందనలు
నటి జ్యోతికను సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ అభినందించారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పొన్మగల్ వందాల్. దర్శకుడు కే. భాగ్యరాజ్, పార్దిబన్, పాండ్య రాజ్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రాన్ని 2–డీ ఎంటర్టైనర్ పతాకంపై సూర్య నిర్మించారు. ఈ చిత్రం విడుదలకు ముస్తాబైంది. అయితే లాక్ డౌన్ కారణంగా విడుదలలో జాప్యం జరిగింది. దీంతో నిర్మాత సూర్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ద్వారా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. చదవండి: జగన్ గారికి ధన్యవాదాలు ఈ మేరకు పొన్మగల్ వందాల్ చిత్రం ఈ నెల 29న అమెజాన్ ప్రైమ్ టైమ్ లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఆన్లైన్ లో మీడియా ప్రతినిధులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. జ్యోతిక భేటీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో స్పష్టమైన తమిళ భాషను మాట్లాడిన జ్యోతికకు నటి రాధిక శరత్ కుమార్ అభినందనలు తెలిపారు. ఆమె తన ట్విట్టర్ లో పేర్కొంటూ ఆత్మవిశ్వాసంతో చాలా స్పష్టంగా తమిళంలో మాట్లాడటాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. తను ఎంతగా శ్రమిస్తున్నారో అర్థం అవుతోందని అన్నారు. ఉత్తరాది నుంచి వచ్చి అంత అంకిత భావంతో పని చేస్తున్న ఏకైక నటి జ్యోతిక అని రాధికా శరత్ కుమార్ అభినందించారు. -
ఇప్పటికి ఇదే మంచి నిర్ణయం
సినిమా కథను పూర్తి స్థాయిలో మోసేవారే హీరోలయితే ప్రస్తుతం జ్యోతిక, విద్యాబాలన్ సూపర్ హీరోలయ్యారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సిద్ధమయ్యారు ఈ హీరోయిన్లు. జ్యోతిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పొన్ మగళ్ వందాళ్’. విద్యాబాలన్ లీడ్ రోల్లో గణితశాస్త్రవేత్త శకుంతలా దేవి జీవితం ఆధారంగా రూపొందిన హిందీ సినిమా ‘శకుంతలా దేవి’. ఈ రెండు సినిమాలు వేసవిలో విడుదల కావాలి. లాక్డౌన్ కారణంగా విడుదల కాకపోవడంతో నేరుగా డిజిటల్ (అమేజాన్ ప్రైమ్‌లో) రిలీజ్ చేస్తున్నారు. డిజిటల్లో రిలీజ్ అవుతున్న తొలి తమిళ సినిమా ‘పొన్ మగళ్ వందాళ్’ అయితే హిందీలో డిజిటల్ రిలీజ్ అవుతున్న తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘శకుంతలా దేవి’. ఈ సినిమాలు ఓటీటీలో విడుదలవ్వడంతో థియేటర్‌ను ఓటీటీ దెబ్బ తీస్తుందా? అనే ప్రశ్నకు ఈ ఇద్దరూ ఈ వి«ధంగా సమాధానమిచ్చారు. విద్యాబాలన్ మాట్లడుతూ – ‘‘సినిమాలను ఓటీటీలలో విడుదల చేస్తున్నందుకు సినిమా థియేటర్స్వాళ్లు అసహనానికి గురవుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల సినిమాను థియేటర్లో విడుదల చేసే అవకాశం లేదు. దాంతో మరోదారి లేక ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని థియేటర్స్ యజమానులు అర్థం చేసుకుంటే బావుంటుంది. మళ్లీ థియేటర్స్ ప్రారంభమయ్యాక అంతా ఎప్పటిలానే ఉంటుంది. సినిమాలు థియేటర్‌కే వస్తాయి. కానీ ఇలాంటి చిత్రమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఓటీటీ లాంటివి ఉండటం మంచి పరిణామం’’ అన్నారు. జ్యోతిక మాట్లాడుతూ – ‘‘ఓటీటీలో సినిమా విడుదల చేయడమనేది కేవలం తాత్కాలికమైనది. పరిస్థితుల దృష్ట్యా అలా చేయాల్సి వచ్చింది. ఆర్టిస్టులకు లేదా దర్శకులకు థియేటర్లలో ప్రేక్షకుల కేరింతలు, చప్పట్లు మించిన గొప్ప ఆనందం మరొకటి ఉండదు. దానికి సరితూగే ఆనందం మరెందులోనూ లేదు. మరికొన్ని రోజుల్లో అంతా సవ్యంగా ఉన్నప్పుడు థియేటర్సే మన ఎంటర్టైన్మెంట్కి ప్రధాన ఎంపిక అవుతాయి. కష్టసమయాల్లో ఓటీటీలాంటి ప్లాట్‌ఫామ్స్ ఉండటం బావుంది. ఇప్పటికి ఇదే మంచి నిర్ణయం’’ అన్నారు. ‘పొన్ మగళ్ వందాళ్’ మే 29నుంచి ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. ‘శకుంతలా దేవి’ తేదీని ప్రకటించలేదు. -
జ్యోతిక వ్యాఖ్యలను సమర్థించిన సూర్య..
చెన్నై : ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న ప్రముఖ నటి జ్యోతిక చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆలయాల తరహాలోనే ఆసుపత్రులు, పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న జ్యోతిక వ్యాఖ్యలపై పలువురు హిందూవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై జ్యోతిక క్షమాపణ చెప్పాలని కూడా కొందరు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జ్యోతిక చేసిన వ్యాఖ్యలను ఆమె భర్త, ప్రముఖ హీరో సూర్య సమర్థించారు. తమ కుటుంబం జ్యోతిక అభిప్రాయానికి మద్దతుగా నిలుస్తుందన్నారు. జ్యోతిక ఆలోచనను చాలా మంది స్వాగతిస్తున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి సూర్య సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు. ద్వేషాన్ని కాదని.. ప్రేమను పంచాలని ఆయన కోరారు. ‘చెట్లు ప్రశాంతగా ఉన్నప్పటికీ.. గాలి వాటిని అలాగే ఉండనివ్వదు. ఓ అవార్డు ఫంక్షన్లో నా భార్య చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలాగే తీవ్ర చర్చకు దారితీసింది. దేవాలయాలకు విరాళాలు ఇచ్చిన మాదిరిగానే.. పాఠశాలలకు, హాస్పిటల్స్‌కు కూడా విరాళాలు ఇవ్వాలనేదే ఆమె అభిప్రాయం. కానీ ఓ వర్గం ప్రజలు దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదు. స్వామి వివేకానంద సహా ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు.. మతం కన్నా మానవత్వం గొప్పదని చెప్పారు. నేను ఇదే విషయాన్ని నా పిల్లలకు కూడా చెబుతాను. ఆధ్యాత్మికవేత్తల భోదన నుంచి పొందిన ప్రేరణతో జ్యోతిక చేసిన వ్యాఖ్యలకు మా కుంటుంబం మద్దతుగా నిలుస్తోంది. ఆమె ప్రసంగంలోని సారాంశాన్ని అర్థం చేసుకున్న చాలా మంది ఈ సమయాల్లో కూడా మద్దతుగా నిలిచారు. వారందరి నా కృతజ్ఞతలు’ అని సూర్య పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే.. సూర్యతో పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటున్న జ్యోతిక.. ఇటీవలి కాలంలో నటనుకు ప్రాధాన్యమున్న పాత్రల్లో, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్లామ్ఫామ్లో విడుదల కానుంది. #அன்பைவிதைப்போம் #SpreadLove pic.twitter.com/qjOlh8tHtV — Suriya Sivakumar (@Suriya_offl) April 28, 2020 చదవండి : ఓటీటీకే ఓటు -
ఓటీటీకే ఓటు
థియేటర్స్ మూసేసి నెల రోజులు దాటిపోయింది. దీంతో రిలీజ్‌కి రెడీ అయిన చిత్రాలను ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు కొందరు నిర్మాతలు. ఇందులో భాగంగా సూర్య నిర్మాణంలో జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలనుకున్నారు. ముందు ఈ నిర్ణయాన్ని తమిళ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అంగీకరించలేదు. భవిష్యత్తులో సూర్య నిర్మాణంలో వచ్చే చిత్రాలను ప్రదర్శించబోమని ప్రకటించారు. అయితే ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రాన్ని డిజిటల్ ద్వారా రిలీజ్ చేయడం సరైన నిర్ణయమే అని నిర్మాతల సంఘం అభిప్రాయపడింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘సినిమాను ఎలా రిలీజ్ చేసుకోవాలన్నది నిర్మాత ఇష్టం. చిన్న సినిమాలను మరియు మీడియమ్ బడ్జెట్ సినిమాలను ఆన్ లైన్లో రిలీజ్ చేయడం నిర్మాతలకు కలసి వచ్చే విషయమే. అలాగే లాక్ డౌన్ తీసేసిన తర్వాత రిలీజ్‌కి భారీ క్యూ ఉండి ఇబ్బంది ఏర్పడే పరిస్థితి రాదు’’ అని నిర్మాతల సంఘం పేర్కొంది. -
మీ సినిమాలు మాకొద్దు!
లాక్ డౌన్‌తో థియేటర్స్ అన్నీ మూతబడ్డాయి. రిలీజ్ కి రెడీ అయిన సినిమాల పరిస్థితి అయోమయంలో పడింది. తాజాగా తమిళంలో ఓ సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకముందే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతోంది. జ్యోతిక ముఖ్య పాత్రలో ఫ్రెడ్రిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పొన్ మగళ్ వందాల్’. ఇందులో జ్యోతిక న్యాయవాదిగా కనిపించనున్నారు. ఈ సినిమాను మార్చి 27న విడుదల చేయాలనుకున్నారు. అప్పటికే దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. తాజాగా ఈ సినిమాను డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మే మొదటివారంలో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కానుందట. ఈ వార్తలకు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రతికూలంగా స్పందించింది. ‘‘థియేటర్ లో రిలీజ్ చేయడం కోసం తయారు చేసిన సినిమాలను నేరుగా డిజిటల్ లో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు’’ అని తమిళనాడు డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆర్. పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. ‘‘అలా చేస్తే ఆ నిర్మాణ సంస్థ (ఈ చిత్రాన్ని జ్యోతిక భర్త, హీరో సూర్య నిర్మించారు) నుంచి వచ్చే తదుపరి సినిమాలను థియేటర్స్ లో ప్రదర్శించం. వాళ్ల సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేసుకోవచ్చు. మా థియేటర్స్‌కి వాళ్ల సినిమాలు అక్కర్లేదు’’ అని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. అక్షయ్ సినిమా కూడా? బాలీవుడ్ లో తాజాగా వినిపిస్తున్న టాపిక్ ఏంటంటే.. అక్షయ్ కొత్త చిత్రం ‘లక్ష్మీ బాంబ్’ కూడా థియేటర్ లో కాకుండా డిజిటల్ గా రిలీజ్ కానుందట. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళ ‘కాంచన’కి రీమేక్. జూన్‌లో ఈ సినిమా విడుదల కావాలి. మరి డిజిటల్ రిలీజ్ వార్తలు ఎంత వరకు నిజమో? తెలియాలి.