![Actor Surya Is Rumored To Be Suffering From Injuries - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/27/surya.jpg.webp?itok=YeRJg4q7)
సినీ నటుడు సూర్య గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ఆయనకు గాయాలయ్యాన్న వార్త సామాజిక మాధ్యమాల్లో గుప్పుమంటోంది. సుధ కొంగర దర్శకత్వంలో సూరారై పొట్రు చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ఆ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. అదే విధంగా ఆయన భార్య జ్యోతిక కథానాయకిగా నిర్మించిన పొన్‌మగళ్ వందాళ్ చిత్రం ఈ నెల 29న ఓటీటీలో విడుదల కానుంది. లాక్‌డౌన్ కాలంలో సూర్య వర్కవుట్ చేస్తుండగా గాయాలు అయినట్లు ప్రచారం సాగుతోంది.
ఈ విషయంలో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ విషయంపై సూర్య అందుబాటులోకి రాకపోగా, ఆయన బంధు వర్గాలను విచారించగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగతున్నట్లు పెద్దగా గాయాలేమీ కాలేదని వివరించారు. ఇటీవల వర్కవుట్ చేస్తుండగా ఆయన ఎడమ చేతికి గాయమైందన్నారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారని తెలిపారు. ఇప్పుడు సూర్య చేతి గాయం 90 శాతం నయమమైందని చెప్పారు. లాక్ డౌన్ పూర్తి కాగానే హరి దర్శకత్వంలో అరువా చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. చదవండి: త్రీఎఫ్ ఉంటే చాలు!
Comments
Please login to add a commentAdd a comment