
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు కార్తీ. ఇటీవల సర్ధార్, పొన్నియిన్ సెల్వన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈయన తాజాగా తన 25వ చిత్రం జపాన్ చిత్రాన్ని పూర్తిచేశారు. రాజుమురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మిస్తోంది . ఇప్పుటికే ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌లు విడుదలై చిత్రంపై మంచి అంచనాలు పెంచాయి. ఈ చిత్రం దీపావళికి తెరపైకి రానుంది.
(ఇదీ చదవండి: రజనీ సార్ కాపాడండి.. నా కూతురు నగలు కూడా తాకట్టు పెట్టా: నిర్మాత)
కాగా ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో నటిస్తున్నారు. తాజాగా కార్తీ 27వ చిత్రానికి సంబంధించిన వార్త కూడా వెలువడింది. దీన్ని చిత్ర వర్గాలు ప్రకటించకపోయినా, ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్ గురువారం తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అందులో కార్తీ 27వ చిత్రానికి తాను ఛాయాగ్రహణం అందించనున్నట్లు చెప్పారు. దీనికి 96 చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారని, సూర్య, జ్యోతికల 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు.
దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారిక ప్రకటనను నిర్మాణ సంస్థ త్వరలో వెలువడించనుందని ఆయన చెప్పారు. కాగా కార్తీ హీరోగా పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో సర్ధార్ 2, లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ–2 చిత్రాలు రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ఇప్పుటికే ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment