వదిన.. మరిది.. ఓ సినిమా | Karthi and sister-in-law Jyothika to join hands for Jeethu Joseph | Sakshi
Sakshi News home page

వదిన.. మరిది.. ఓ సినిమా

Published Sun, Mar 10 2019 5:13 AM | Last Updated on Sun, Mar 10 2019 5:13 AM

Karthi and sister-in-law Jyothika to join hands for Jeethu Joseph - Sakshi

జ్యోతిక, ‘ఖైదీ’ లుక్‌

సూర్య, జ్యోతిక, కార్తీ ఇలా ఫ్యామిలీలో అందరూ సినిమా ఫీల్డ్‌లోనే ఉన్నారు. వీళ్లు కలసి నటించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటూనే ఉన్నారు. ‘స్క్రిప్ట్‌ దొరికితే కచ్చితంగా మా ఫ్యామిలీలో ఎవ్వరమైనా కలిసి స్క్రీన్‌ మీద కనిపిస్తాం’ అని చాలా సందర్భాల్లో పేర్కొంది సూర్య ఫ్యామిలీ.  లేటెస్ట్‌గా అలాంటి స్క్రిప్ట్‌ వాళ్ల ఇంటి డోర్‌ కొట్టిందని సమాచారం. ముగ్గురూ కలసి నటించకపోయినా వదినా మరిదీ జ్యోతిక, కార్తీలు ఓ సినిమాలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే జంటగా కాదని సమాచారం.

మలయాళ ఫిల్మ్‌ మేకర్‌ జీతూ జోసఫ్‌ ఓ ఎగై్జటింగ్‌ స్క్రిప్ట్‌తో రావడం, జ్యోతిక, కార్తీలకు ఈ కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని కోలీవుడ్‌ టాక్‌. తెలుగు సూపర్‌హిట్‌ ‘దృశ్యం’ చిత్రాన్ని మలయాళంలో ఒరిజినల్‌గా జీతూ జోసఫ్‌ రూపొందించిన సంగతి తెలిసిందే. లాజిక్‌ మిస్సవకుండా సినిమాలు తీస్తాడనే పేరు జీతూకి ఉంది. జ్యోతిక, కార్తీల కోసం అలాంటి  సినిమానే ప్లాన్‌ చేశారట. ఈ ఫ్యామిలీ డ్రామాలో జ్యోతిక పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందట

ఖైదీ కార్తీ
‘ఖైదీ’ టైటిల్‌ వినగానే చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ‘ఖైదీ’ చిత్రం గుర్తుకు వస్తుంది. లేటెస్ట్‌గా ఇదే టైటిల్‌తో కార్తీ ఓ చిత్రంలో నటిస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో ౖఖైదీ పాత్రలో కార్తీ కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర ఉండదట. కార్తీ లుక్‌ని కూడా విడుదల చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement