karthi
-
మా రెమ్యునరేషన్‌తోనే ఈ బిల్డింగ్ నిర్మించాం: సూర్య
కోలీవుడ్ టాప్ హీరో సూర్య, కార్తీ కుటుంబ సభ్యులు అందరూ చెన్నైలోని ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి కుటుంబ ఆద్వర్యంలో నడుస్తున్న అగరం ఫౌండేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవంలో సందడిగా కనిపించారు. ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి నటుడు శివకుమార్, సోదరి బృందా, జ్యోతికతో పాటు వారి పిల్లలు అందరూ పాల్గొన్నారు. సుమారు ఏడాది తర్వాత ఈ కార్యక్రమం కోసం ముంబై నుండి చెన్నైకి జ్యోతిక పిల్లలతో పాటు వచ్చారు. అగరం ఫౌండేషన్ అనేది నటుడు సూర్య నేతృత్వంలోని ఎడ్యుకేషనల్ ఫౌండేషన్. గత 20 సంవత్సరాలుగా, అతని కుటుంబ సభ్యులు అట్టడుగు ఆర్థిక వర్గాల విద్యార్థులకు వారి కలలను సాధించడంలో సహాయం చేస్తున్నారు. చెన్నైలో ఫౌండేషన్ కొత్త కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు. తమిళంలో అగరం అంటే 'అ'కారం... అంటే తొలి అక్షరం అని సూర్య తెలిపారు. ఈ ఫౌండేషన్‌కు తెలుగువారు భారీ స్థాయిలో విరాళాలు అందించినట్లు గతంలో సూర్య ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి తమ సొంత డబ్బుతో నిర్మించామన్నారు. సుమారు 20 ఏళ్ల పాటు కష్టానికి ప్రతిఫలం ఈ భవనం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. పిల్లల విద్య కోసం తమ సంస్థకు వచ్చిన విరాళాల నుంచి ఒక్క రూపాయి కూడా బిల్డింగ్ నిర్మాణం కోసం ఉపయోగించలేదన్నారు. సినిమా నుంచి తమకు వచ్చిన రెమ్యునరేషన్లో కొంత మొత్తాన్ని దాచిపెట్టి నిర్మించామన్నారు. ప్రస్తుతం ఏడాదికి 700-800 మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నామని ఆయన అన్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్యను పెంచేందుకే ఈ భవన నిర్మాణం చేశామని ఆయన తెలిపారు.సూర్య తండ్రి శివకుమార్ అతని కుటుంబ సభ్యులు చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తారు. ఈ ఫోటోలలో ఆయన సతీమణి లక్ష్మితో పాటు వారి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. ప్రస్తుతం నెట్టింట వీడియోలతో పాటు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. • Exclusive - @Karthi_Offl , @Suriya_offl With Family At Inaugration Of New @agaramvision 's Office | #Karthi #VaaVaathiyaar #Sardar2 #Karthi29 #Kaithi2 #Retro pic.twitter.com/w5qvDxukqW— MKB Santhosh (@MKB_SANTHOSH23) February 16, 2025 -
కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కార్తీ (ఫోటోలు)
-
ఖైదీలో..?
ప్రముఖ నటుడు కమల్‌హాసన్(kamal haasan) ‘ఖైదీ 2’(Khaidi2) సినిమాలో నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. కార్తీ(karthi) హీరోగా లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. 2019లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘ఖైదీ 2’ రూపొందనుంది. ఈ మూవీలోనూ కార్తీ హీరోగా నటించనుండగా లోకేశ్ కనగరాజే దర్శకత్వం వహించనున్నారు.కాగా ఈ సీక్వెల్లో కమల్‌హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్. కమల్‌హాసన్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘విక్రమ్’ (2022) సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్పుడు వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. దీంతో ‘ఖైదీ 2’లోని ఓ కీలక పాత్ర చేయాలని కమల్ని లోకేశ్ అడగడం.. ఆ పాత్ర కూడా ఆయనకు బాగా నచ్చడంతో చేసేందుకు కమల్ ఓకే అన్నారని తమిళ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలో ఈ చిత్రం ఆరంభం కానుంది. -
కోలీవుడ్‌లో సీక్వెల్ సందడి
కోలీవుడ్‌లో సీక్వెల్ హవా బాగా వీస్తోంది. కోలీవుడ్ హీరోలందరూ సీక్వెల్ జపం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో పదికి పైగా సీక్వెల్స్ సినిమాలు ఉండటమే ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి... ఈ సీక్వెల్స్, ఫ్రాంచైజీ చిత్రాలతో బిజీగా ఉన్న తమిళ హీరోలు ఎవరో తెలుసుకుందాం...జైలర్ తిరిగి వస్తున్నాడురజనీకాంత్ హీరోగా చేసిన ‘జైలర్’ (2023) మూవీ బ్లాక్‌బస్టర్ హిట్. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీలో రజనీ కొత్త తరహా స్టైల్, స్వాగ్, మేనరిజమ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. వీటికి అనిరు«ధ్ రవిచందర్ మ్యూజిక్, ఆర్ఆర్ ప్లస్ అయ్యాయి. దీంతో ‘జైలర్’ మూవీ రజనీ ఖాతాలో ఓ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా మూవీ రిలీజ్ తర్వాత ‘జైలర్ 2’ ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహాలను నిజం చేస్తూ నెల్సన్ దిలీప్‌కుమార్ ఇటీవలే ‘జైలర్ 2’ సినిమాను ప్రకటించారు. రజనీకాంత్ హీరోగా చేయనున్న ‘జైలర్ 2’ చిత్రీకరణ ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కానుందని తెలిసింది. కాగా ‘జైలర్’లో రమ్యకృష్ణ, మీర్నా మీనన్ కీ రోల్స్‌లో, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ గెస్ట్ రోల్స్‌లో నటించారు. వీరందరి పాత్రలు ‘జైలర్ 2’లోనూ కొనసాగుతాయని కోలీవుడ్ టాక్. అంతే కాదు... బాలకృష్ణ, ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి ‘జైలర్ 2’లో యాడ్ అవుతారట. ఈ సీక్వెల్ 2026 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.వీర శేఖరన్ పోరాటంహీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) మూవీ 1996లో విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. 28 సంవత్సరాల తర్వాత కమల్, శంకర్ కాంబినేషన్లోనే 2024లో విడుదలైన ‘ఇండియన్ 2’ సినిమా మాత్రం ఆడియన్స్‌ను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ‘ఇండియన్ 2’ సినిమా తీస్తున్న సమయంలోనే ‘ఇండియన్ 3’ చిత్రీకరణను కూడా దాదాపు పూర్తి చేశారు దర్శకుడు శంకర్.ఈ ఏడాదే ‘ఇండియన్ 3’ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ పేర్కొన్నారు. ‘ఇండియన్, ఇండియన్ 2’ చిత్రాల్లో సేనాపతిగా కనిపించారు కమల్‌హాసన్. కానీ ‘ఇండియన్ 3’ మాత్రం సేనాపతి తండ్రి వీరశేఖరన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథనం ఉంటుంది. స్వాతంత్య్రం కోసం బ్రిటీషర్లతో వీరశేఖరన్ ఏ విధంగా పోరాడారు? అన్నది ‘ఇండియన్ 3’ స్టోరీ అని కోలీవుడ్ సమాచారం. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో వీరశేఖరన్ భార్యగా కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ఇండియన్ 3’కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.ఇటు సర్దార్... అటు ఖైదీతండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన స్పై యాక్షన్ మూవీ ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ 2022లో విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ‘సర్దార్’ సినిమా క్లైమాక్స్‌లో ‘మిషన్ కంబోడియా’ అంటూ ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ను కన్ఫార్మ్ చేశారు పీఎస్ మిత్రన్. అలాగే జూలైలో ‘సర్దార్’కు సీక్వెల్‌గా పీఎస్ మిత్రన్ డైరెక్షన్లోనే ‘సర్దార్ 2’ ప్రారంభమైంది.కార్తీ హీరోగా ఎస్జే సూర్య, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ ప్రధాన తారాగణంగా నటిస్తారని ఆల్రెడీ మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్స్‌లో చూడొచ్చు. అప్పుడు మిషన్ కంబోడియా వివరాలు కూడా తెరపైన కనిపిస్తాయి. ఇక ‘ఖైదీ’లో కార్తీ చేసిన దిల్లీ రోల్‌ను మర్చిపోరు ఆడియన్స్. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రం 2019లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో వెంటనే కార్తీతో ‘ఖైదీ 2’ చేయాలని లోకేశ్ ప్లాన్ చేశారు. కానీ లోకేశ్‌కు కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’, రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమాల ఆఫర్స్ రావడంతో ‘ఖైదీ’ సీక్వెల్ షూటింగ్‌ను కాస్త ఆలస్యం చేశారు. రజనీకాంత్ ‘కూలీ’ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. దీంతో లోకేశ్ నెక్ట్స్ మూవీ కార్తీ ‘ఖైదీ 2’నే ఉండొచ్చు. ఇలా రెండు సీక్వెల్స్‌తో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు కార్తీ.రెండు దశాబ్దాల తర్వాత..!‘7/జీ రెయిన్బో కాలనీ’ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ ‘7/జీ బృందావన కాలనీ’ అంటే మాత్రం చాలామంది తెలుగు ఆడియన్స్‌కు ఈ సినిమా గుర్తొస్తుంది. 2004లో సెల్వ రాఘవన్ డైరెక్షన్లో రూపొందిన ‘7/జీ రెయిన్బో కాలనీ’ తెలుగులో ‘7/జీ బృందావన కాలనీ’గా అనువాదమై, సూపర్‌హిట్‌గా నిలి చింది. ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటించారు. ఏఎమ్ రత్నం నిర్మించారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ‘7/జీ బృందావన కాలనీ’ సినిమాకు సీక్వెల్‌గా ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా తీస్తున్నారు దర్శకుడు సెల్వ రాఘవన్.తొలి భాగంలో నటించిన రవికృష్ణనే మలి భాగంలోనూ హీరోగా చేస్తుండగా, అనశ్వర రాజన్ హీరోయిన్గా చేస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. జయరామ్, సుమన్ శెట్టి, సుధ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ ప్రకటన రానుంది. ఇక సెల్వ రాఘవన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో ‘యుగానికి ఒక్కడు’) సినిమా గుర్తుండే ఉంటుంది.కార్తీ, రీమా సేన్, పార్తీబన్, ఆండ్రియా లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ 2010లో విడుదలై, బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ సినిమాను 2021 జనవరి 1న ప్రకటించారు సెల్వ రాఘవన్. ఈ సీక్వెల్లో ధనుష్‌ను హీరోగా ప్రకటించారు. ఈ చిత్రం 2024లో రిలీజ్ అవుతుందని, అప్పట్లో ధనుష్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. ఇక ‘ఆయిరత్తిల్ ఒరువన్’ సీక్వెల్ గురించి మరో అప్డేట్ రావాల్సి ఉంది.అమ్మోరు తల్లినయనతార నటించిన ‘ముకుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) 2020 నవంబరులో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ముక్కుత్తి అమ్మన్ 2’ను ప్రకటించింది వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ. ‘ముక్కుత్తి అమ్మన్’లో నటించిన నయనతారనే సీక్వెల్లోనూ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘ముక్కుత్తి అమ్మన్’కు నటుడు ఆర్జే బాలాజీ–ఎన్జే శరవణన్ దర్శకత్వం వహించగా, ‘ముకుత్తి అమ్మన్ 2’ను మాత్రం నటుడు–దర్శకుడు సుందర్ .సి తెరకెక్కించనున్నారు. సుందర్.సి నేతృత్వంలోని మరో ఫ్రాంచైజీ ‘కలగలప్పు’లోని ‘కలగలప్పు 3’ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కామెడీ డ్రామాగా ‘కలగలప్పు’కు తమిళ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది.హారర్ ఎఫెక్ట్!ఇవే కాదు... కమల్‌హాసన్ ‘విక్రమ్ 2’, ధనుష్ ‘వడ చెన్నై 2’ వంటి చిత్రాలతో పాటు మరికొన్ని తమిళ చిత్రాల సీక్వెల్స్ వచ్చే అవకాశం ఉంది.ఈసారి హారర్ జానర్ సీక్వెల్స్ కోలీవుడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాయి. రాఘవా లారెన్స్ ఆధ్వర్యంలో ఆడియన్స్‌ను అలరిస్తున్న ‘కాంచన’ సిరీస్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్‌లో మరో చిత్రంగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు ‘కాంచన 4’ రానుందని కోలీవుడ్ సమాచారం. రాఘవా లారెన్స్ నటించి, దర్శకత్వం వహించనున్న ‘కాంచన 4’లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి... ‘కాంచన 4’లో ఎవరు నటిస్తారనే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక సుందర్ .సి సారథ్యంలో నడుస్తున్న హారర్ ఫ్రాంచైజీ ‘అరణ్మణై’ గురించి చెప్పుకోవాలి. తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించిన ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘డాకు’) ఆడియన్స్‌ను మెప్పించింది. దీంతో ఈ ఏడాదిలోనే ‘అరణ్మణై 5’ను కూడా తీయాలని సుందర్ .సి ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. అలాగే హారర్ జానర్లో సంతానం చేస్తున్న హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘డీడీ’ నుంచి నాలుగో మూవీగా ‘డీడీ నెక్ట్స్ లెవల్’ చిత్రం రానుంది. ఎస్. ప్రేమ్ ఆనంద్ డైరెక్షన్‌లోని ఈ మూవీలో సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ మేలో రిలీజ్ కానుంది. ఇక 2014లో మిస్కిన్ డైరెక్షన్లో వచ్చిన ‘పిశాసు’ (తెలుగులో ‘పిశాచి’) చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకోగలిగింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పిశాసు’ సినిమాకు సీక్వెల్‌గా ‘పిశాసు 2’ తీస్తున్నారు మిస్కిన్. సీక్వెల్లో ఆండ్రియా మెయిన్ లీడ్ రోల్ చేశారు. మార్చిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ‘డీమాంటి కాలనీ’ ఫ్రాంచైజీ గురించి హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి తెలిసే ఉంటుంది. గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘డీమాంటి కాలనీ 2’ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేసింది. కాగా ‘డీమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీ దర్శకుడు అజయ్.ఆర్ జ్ఞానముత్తు ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్‌గా ‘డీమాంటీ కాలనీ 3’ని ఆల్రెడీ ప్రకటించారు. ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది. రిలీజ్ మాత్రం 2026లో ఉండొచ్చు.ప్రకటించారు... కానీ..!కోలీవుడ్‌లో కొన్ని హిట్ ఫిల్మ్స్‌కు సీక్వెల్స్ ప్రకటించారు మేకర్స్. కానీ ఈ సినిమాలు ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ సినిమాలేవో చదవండి.విదేశాల్లో డిటెక్టివ్ విశాల్ కెరీర్‌లోని వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌లో ‘తుప్పరివాలన్’ ఒకటి. మిస్కిన్ డైరెక్షన్‌లోని ఈ మూవీ తెలుగులో ‘డిటెక్టివ్’గా విడుదలై, ప్రేక్షకులను మెప్పించింది. అప్పట్నుంచే ఈ మూవీకి సీక్వెల్ తీయానులనుకున్నారు విశాల్. మిస్కిన్ డైరెక్షన్లోనే ‘డిటెక్టివ్ 2’ను ప్రకటించారు విశాల్. అయితే కథ విషయంలో మిస్కిన్కు, విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నారు. ఆ తర్వాత ‘డిటెక్టివ్ 2’కి తానే దర్శకత్వం వహించాలనుకున్నారు విశాల్.తన స్టైల్ ఆఫ్ ‘డిటెక్టివ్ 2’తో తాను దర్శకుడిగా పరిచయం కాబోతున్నానని, ఇది తన పాతికేళ్ల కల అని, ఇందుకోసం లండన్, అజర్ బైజాన్, మాల్తా వంటి లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నానని గత ఏడాది మార్చిలో విశాల్ పేర్కొన్నారు. కానీ ‘డిటెక్టివ్ 2’ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదని తెలుస్తోంది. ఇలా విశాల్ నుంచి ‘డిటెక్టివ్ 2’ అప్డేట్ రావాల్సి ఉంది. అలాగే విశాల్ హీరోగా పీఎస్ మిత్రన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇరంబుదురై’ మూవీ 2018లో రిలీజై, హిట్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ రానుందనే టాక్ వినిపిస్తోంది. బాక్సింగ్ రౌండ్ 2 నాలుగు సంవత్సరాల క్రితం కరోనా సమయంలో ‘సార్పట్టై పరంబర’ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. పా. రంజిత్ డైరెక్షన్‌లోని ఈ మూవీకి వీక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో ‘సార్పట్టై పరంబర’ సినిమా సీక్వెల్‌ను థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని పా. రంజిత్ భావించారు. 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర’ సినిమాకు సీక్వెల్‌గా ‘సార్పట్టై రౌండ్ 2’ ప్రకటించారు. అయితే ఈ మూవీపై మరో అప్డేట్ రావాల్సి ఉంది.తని ఒరువన్ 2 రవి మోహన్ (‘జయం’ రవి తన పేరును ఇటీవల రవి మోహన్‌గా మార్చుకున్నారు) హీరోగా మోహన్ రాజా డైరెక్షన్లో వచ్చిన ‘తని ఒరువన్’ మూవీ గుర్తుండే ఉంటుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ మూవీ 2015లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘తని ఒరువన్ 2’ని ప్రకటించారు మోహన్ రాజా. అయితే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్’తో రవి మోహన్ బిజీగా ఉండటం వల్ల ‘తని ఒరువన్ 2’ చేయడానికి వీలు పడలేదు. ఈ ఏడాది ఈ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లే సాధ్యసాధ్యాలను రవి మోహన్ పరిశీలిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాని కూడా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇక ‘తన్ ఒరువన్’ మూవీ తెలుగులో ‘ధృవ’ (రామ్ చరణ్ హీరోగా నటించారు)గా రీమేక్ అయి, విజయం సాధించిన సంగతి తెలిసిందే. – ముసిమి శివాంజనేయులు -
కంగువ లో నటించి సర్ ప్రైజ్ ఇచ్చిన కార్తీ..
-
కార్తీ కొత్త మూవీ టీజర్.. టైటిల్ వింతగా ఉందేంటి?
ఇటీవల సత్యం సుందరం మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ కార్తీ. గతనెల విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో అరవింద్ స్వామి కీలకపాత్ర పోషించారు.అయితే కార్తీ తాజాగా మరో సినిమాకు రెడీ అయిపోయారు.కార్తీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం వా వాతియార్. ఇందులో ఉప్పెన భామ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.కాగా.. ఈ చిత్రానికి సంతోశ్ నారాయణన్ సంగీతమందిస్తున్నారు. వా వాతియార్ మూవీలో సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జీఎం సుందర్, రమేష్ తిలక్, పీఎల్ తేనప్పన్, విద్యా బోర్గియా, నివాస్ అద్ధితన్, మధుర్ మిట్టల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
డిల్లీతో రోలెక్స్
తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో సూర్య, కార్తీలకు ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములైన వీరు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ‘ఖైదీ 2’ సినిమాలో ఈ అన్నదమ్ములిద్దరూ తెరని పంచుకోనున్నారు. కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఖైదీ’. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో తొలి మూవీగా వచ్చిన ‘ఖైదీ’ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో 2019 అక్టోబరు 25న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని కార్తీ, లోకేష్ కనగరాజ్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమా తెరకెక్కిస్తున్నారు లోకేశ్ కనగరాజ్. ఈ చిత్రం తర్వాత లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ‘ఖైదీ 2’ మూవీ చేస్తారట లోకేశ్. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది.అయితే ఈ సినిమాలో హీరో సూర్య కీలక పాత్రలో నటించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా వచ్చిన ‘విక్రమ్’ చిత్రంలో రోలెక్స్ అనే డాన్ గా అతిథి పాత్రలో మెరిశారు సూర్య. ‘ఖైదీ 2’ లోనూ రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తారని టాక్. పైగా ‘ఖైదీ 2’లో రోలెక్స్‌ను డిల్లీ (’ఖైదీ’ చిత్రంలో కార్తీ చేసిన పాత్ర పేరు డిల్లీ) నేరుగా కలవాల్సి ఉందని ఇటీవల కార్తీ చెప్పడంతో వీరిద్దరూ కలిసి నటించడం పక్కా అని ఖుషీ అవుతున్నారు అభిమానులు. తమ్ముడు కార్తీతో కలిసి ‘ఖైదీ– 2’లో తాను నటిస్తానని సూర్య కూడా ఇటీవల ఓ సందర్భంలో చెప్పడంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలో ఫుల్ క్రేజ్ నెలకొంది. -
'ఖైదీ' సీక్వెల్లో మరో పాన్ ఇండియా హీరో
కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన కెరియర్లో రెండవ సినిమాగా ఖైదీ విడుదలైంది. నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు లోకేష్ కనకరాజ్, నటుడు కార్తీ చెప్పారు. అయితే ఆ చిత్రం తర్వాత ఈ ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ అయ్యారు. అదే విధంగా లోకేష్ కనకరాజ్ నటుడు కమలహాసన్ కథానాయకుడిగా తెరకెక్కించిన విక్రమ్ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది ఆ చిత్రం చివరిలో నటుడు సూర్య రోలెక్స్ పాత్రలో డాన్‌గా మెరిశారు. అదేవిధంగా ఖైదీ చిత్రంలో కార్తీ పాత్ర పేరు ఢిల్లీ. కాగా అన్నదమ్ములైన సూర్య, కార్తీ కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. దీంతో సూర్య, కార్తీలను ఎప్పుడు చూసినా రోలెక్స్, డిల్లీ కలిసి నటించే విషయం గురించే అడుగుతుంటారు. ఇటీవల నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలో జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో కార్తీ అతిథిగా పొల్గొన్నారు. దీంతో అభిమానులు మరోసారి రోలెక్స్, డిల్లీ కలిసి ఎప్పుడు నటిస్తారు అంటూ ప్రశ్నించారు. దీంతో సూర్య త్వరలోనే ఖైదీ – 2 చిత్రం ప్రారంభం అవుతుందని అందులో తమ్ముడు కార్తీతో కలిసి తాను నటిస్తానని చెప్పారు. అదేవిధంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా వచ్చే ఏడాది ఖైదీ– 2 చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని ఒక భేటీలో చెప్పారు. దీంతో సూర్య, కార్తీ కలిసి నటించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ నటుడు రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఆయన చేసే చిత్రం ఖైదీ– 2 నే అవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
థియేటర్స్ లో ఫ్లాప్.. ఓటీటీలో బిగ్ సక్సెస్..!
-
'ఖైదీ' సీక్వెల్‌పై లోకేశ్ కనకరాజ్ ట్వీట్
ఖైదీ–2 చిత్రం గురించి తాజా అప్డేట్ వచ్చేసింది. కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం అప్పట్లో భారీ విజయం అందుకుంది. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తన కెరియర్లో రెండో చిత్రంగా డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. విశేషం ఏమిటంటే..? ఈ చిత్రంలో కథానాయకి లేదు, డ్యూయెట్లు ఉండవు, ఇంకా చెప్పాలంటే అసలు గ్లామర్ వాసన లేని చిత్రం ఖైదీ. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తి నటన హైలెట్. ఖైదీ చిత్రానికి సీక్వెల్‌గా ఉంటుందని అటు దర్శకుడు లోకేశ్ కనకరాజ్, ఇటు కార్తి చెబుతూనే ఉన్నారు. దీంతో ఖైదీ–2 చిత్రం కోసం కార్తి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖైదీ చిత్రం విడుదలై 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తన ఎక్స్ మీడియాలో పోస్ట్చేస్తూ.. ‘అంతా ఇక్కడ నుంచే ప్రారంభమైంది. కార్తి, ఎస్ఆర్ ప్రభులకు ధన్యవాదాలు. వీరి వల్లే లోకేశ్ యూనివర్శల్ సాధ్యమైంది. త్వరలోనే ఢిల్లీ (ఖైదీ చిత్రంలో కార్త్తి పాత్ర పేరు) తిరిగి రానున్నారు అని పేర్కొన్నారు. అలా ఆయన త్వరలోనే ఖైదీ–2 చిత్రం తెరకెక్కనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో కార్తి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఖైదీ–2కు సిద్ధమయ్యే అవకాశం ఉందని భావించవచ్చు. It all started from here! 💥💥Grateful to @Karthi_Offl sir, @prabhu_sr sir and the ‘universe’ for making this happen 🤗❤️Dilli will return soon 🔥#5YearsOfKaithi pic.twitter.com/Jl8VBkKCju— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 25, 2024 -
ఓటీటీలో 'సత్యం సుందరం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
కార్తి - అరవింద్ స్వామి కాంబినేషన్లో వచ్చిన సినిమా 'సత్యం సుందరం'. ఫీల్‌గుడ్ చిత్రంగా ప్రేక్షకుల నుంచి మించి రివ్యూస్‌నే దక్కించుకుంది. సూర్య-జ్యోతిక తక్కువ బడ్జెట్లో ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 28న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దీంతో 'సత్యం సుందరం' అభిమానుల్లో సంతోషం కనిపిస్తుంది.తమిళంలో '96' వంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ బాషల్లో అందుబాటులో ఉండనుంది. థియేటర్లో చూడలేకపోయిన వారు తమ ఫ్యామిలీ, స్నేహితులతో తప్పక చూడాల్సిన సినిమాగా నెటిజన్లు చెప్పుకొచ్చారు. కథ అయితే, చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సుమారు 3 గంటలపాటు ప్రేక్షకులను దర్శకుడు మెప్పించాడు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతికలు దీనిని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 60 కోట్లు రాబట్టిన 'సత్యం సుందరం' మంచి లాభాలను అందించారు. చిత్రంలో అరవింద్ స్వామి, కార్తి.. బావ-బావమరిదిగా నటించడం విశేషం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
ఎన్టీఆర్ 'దేవర'తో పాటు ఓ తమిళ డబ్బింగ్ సినిమా రిలీజైంది. అదే 'సత్యం సుందరం'. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కార్తీ ఇందులో హీరోగా నటించాడు. ఫీల్ గుడ్ స్టోరీతో తీసిన ఈ మూవీకి అద్భుతమైన స్పందన వచ్చింది. చూసినోళ్లందరూ మెచ్చుకున్నారు. కానీ 'దేవర' వల్ల ఎక్కువమందికి చూడలేకపోయారు. ఇప్పుడు ఇది ఓటీటీలోకి వచ్చేయడానికి సిద్ధమైపోయింది.'96' సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ తీసిన లేటెస్ట్ మూవీ 'సత్యం సుందరం'. తమిళంలో మైయళగన్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు వరకు వచ్చేసరికి టైటిల్ మార్చారు. ఓ రాత్రిలో జరిగే కథతో దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. లెక్క ప్రకారం దీపావళికి స్ట్రీమింగ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఓ వారం ముందే తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారట.(ఇదీ చదవండి: సాయిపల్లవి.. నన్ను అన్నయ్య అనేసరికి బాధపడ్డా: స్టార్ హీరో)అక్టోబర్ 25 నుంచే 'సత్యం సుందరం' సినిమా తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా విషయానికొస్తే.. సత్యం (అరవింద స్వామి) అనే వ్యక్తి కొన్ని పరిస్థితుల వల్ల సొంతూరిని వదిలిపెట్టి వెళ్లిపోతాడు. చిన్నాన్న కూతురు పెళ్లి కోసం దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడు. ఆ పెళ్లిలో సుందరం (కార్తి) బావ అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి జర్నీ ఎలా సాగిందనేదే స్టోరీ.ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథేం ఉండదు. కానీ చిన్న అనుభూతుల్ని కూడా ఎంతో అందంగా చూపించిన విధానం, అలానే కుటుంబం, బంధాల్ని ఎష్టాబ్లిష్ చేసిన విధానం కన్నీళ్లు పెట్టిస్తుంది. మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టమున్నవాళ్లు మాత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత దీన్ని అస్సలు మిస్సవ్వొద్దు.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా) -
కార్తీ తప్పు లేకపోయినా సారీ చెప్పించారు: ప్రకాశ్ రాజ్
గత కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ వరస ట్వీట్స్ వేస్తున్నారు. 'జస్ట్ ఆస్కింగ్' పేరుతో చాలా ప్రశ్నలు సంధిస్తున్నారు. దేనికి కూడా పవన్ నుంచి సమాధానం లేదు. ఇక రీసెంట్గా ఓ తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. హీరో కార్తీతో పవన్ సారీ చెప్పించుకున్న విషయం గురించి మాట్లాడారు. తప్పు లేకపోయినా క్షమాపణ చెప్పించుకున్నారని అన్నారు.(ఇదీ చదవండి: కొండా సురేఖపై పిటిషన్.. కోర్టులో నాగార్జున స్టేట్మెంట్)అసలేం జరిగింది?కార్తీ హీరోగా నటించిన 'సత్యం సుందరం'.. సెప్టెంబరు 28న తెలుగులో రిలీజైంది. అంతకు కొన్నిరోజుల ముందు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. ఇందులో యాంకర్, లడ్డు గురించి ఓ ప్రశ్న అడగ్గా.. అది సెన్సిటివ్ మేటర్ వద్దులేండి అని కార్తి అనేశాడు. ఇందులో ఏం లేనప్పటికీ.. పవన్ ఈ విషయాన్ని ఓ ప్రెస్మీట్లో చెప్పారు. ఎందుకొచ్చిన సమస్యలే అని కార్తి క్షమాపణ చెప్పాడు. అంతటితో అది అయిపోయింది.ప్రకాశ్ రాజ్ ఏమన్నారు?దీని గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. కార్తీ ఎలాంటి అనవసర వ్యాఖ్యలు చేయలేదని, తప్పు లేకపోయినా సరే సారీ చెప్పించుకున్నారని అన్నాడు. నార్మల్ అయితే క్షమాపణ చెప్పకపోయేవాడు. సినిమా రిలీజ్ ఉంది, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్ తదితరులకు ఇబ్బంది రాకూడదని చెప్పి ఉంటాడని అన్నాడు. సూర్య పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయించుకుని మరీ సారీ చెప్పినట్లు పవన్ కల్యాణ్ ప్రచారం చేసుకున్నారని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో క్లిప్ కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందన్న టాలీవుడ్ హీరోయిన్)కార్తిది తప్పు లేకపోయినా ఆయన చేత పవన్ కళ్యాణ్ సారి చెప్పించుకున్నాడు సూర్య పేరుతో ఫేక్ అకౌంట్ Create చేసి సారీ చెప్పినట్లు ట్విట్టర్ లో ప్రచారం చేశారు -@prakashraaj 🔥🔥🔥 pic.twitter.com/1gFGL0vioV— MBYSJTrends ™ (@MBYSJTrends) October 7, 2024 -
బాలపిట్టలూ బయటికెగరండి
Dasara holidays: తెలిసిన ఊరే. దసరా సెలవుల్లో కొత్తగా హుషారుగా అనిపిస్తుంది. మేనమామ కొడుకు మనం ఎప్పుడొస్తామా... ఊరంతా తిప్పి ఎప్పుడు చూపుదామా అని ఉంటాడు. మేనత్త కూతురి దగ్గర బోలెడన్ని బొమ్మలు. ఒకరోజు అందరూ కూడి బొమ్మల పెళ్లి కూడా చేయొచ్చు. చిన్న ఊరే. కాని మిఠాయి కొట్టు దగ్గరకు వెళ్లి మిఠాయి కొనుక్కోవడం... పాత సినిమా హాల్లో ఆడే పాత సినిమాను చూడటం... వీధిలోని కుర్రాళ్లను పిలవనవసరం లేకుండా మన బంధుగణంలోని పిల్లలే సరిపోయే విధంగా క్రికెట్ ఆడటం... సరే... ఓటీటీలో సినిమాలు చూడటం.సెలవులొచ్చేది మనవాళ్లను కలవడానికి. కలిసి ఆటలు ఆడటానికి. పెద్దయ్యాక గుర్తు చేసుకోవడానికి. పూర్వం దసరా కోసం పిల్లలు కాచుకుని కూచునేవారు. ఇవాళ రేపు సెలవులొచ్చినా మంచి ర్యాంకుల కోసం తల్లిదండ్రులు ‘ఎక్కడికీ కదిలేది లేదని’ అదిలిస్తున్నారు. మరికొందరికి పిల్లల్ని తీసుకొని బంధువుల ఇంటికి వెళ్లడానికి తీరికే ఉండటం లేదు. కొందరికసలు బంధువులే లేరు. అంటే లేరని కాదు. ఉన్నా లేనట్టుగా వీరుంటారు. లేదా వారుంటారు. నడుమ అనుబంధాలు తెగేది పిల్లల మధ్య.పెద్దయ్యాక జ్ఞాపకాలు ఏమీ ఉండవు. ఉన్నా అవి చెప్పుకోదగ్గవి కావు. జ్ఞాపకాలంటే బాల్యమే. బాల్యంలో ఇష్టంగా గడిపే రోజులు సెలవులు. పిన్ని ఇల్లు, పెద్దమ్మ ఊరు, బాబాయి మిద్దె, పెదనాన్న వాళ్ల తోట, తాతయ్య వాళ్ల చేను, సొంతపల్లెలోని చెరువు గట్టు... ఇవన్నీ కజిన్స్‌తో... దగ్గరి బంధువులతో తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది.ఇటీవల వచ్చిన ‘సత్యం సుందరం’ ఈ బాల్యాన్నే చూపుతుంది. సత్యం అనే పేరుండే అరవింద స్వామి ఇంటికి సుందరం అనే కార్తీ చిన్నప్పుడు సెలవుల్లో వస్తాడు. ఆ సెలవుల్లో చిన్న అరవింద స్వామి, చిన్న కార్తీ కలిసి ఎన్నో ఆటలు ఆడతారు. సినిమాలు చూస్తారు. ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. ఆ అభిమానమే కార్తీని పెద్దయ్యాక కూడా అరవింద స్వామి అంటే ప్రాణం ఇచ్చేలా చేస్తుంది. ప్రేమ పంచేలా చూస్తుంది. చిన్నప్పుడు వీళ్లు ఆడుకున్న ఆట ఏమిటో తెలుసా? చిన్న అరవింద స్వామిని కూరగాయలు తెమ్మని ఇంట్లో చెప్తే పిల్లలనందరినీ తీసుకొని బయలుదేరుతాడు. ఒకడి పేరు బెండకాయ అని పెడతాడు. ఎన్ని కిలోల బెండకాయలు తేవాలో పట్టిక అవసరం లేకుండా ఆ బెండకాయ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇంకొకడి పేరు వంకాయ అని పెడతాడు. ఒకమ్మాయి పేరు కాకర. మరి కార్తీకి ఏం పేరు పెడతాడు? సినిమా చూస్తే తెలుస్తుంది.‘చిన్నప్పుడు ఎంత బాగుండేది’ అని ఏ కాలంలో అయినా పిల్లలు అనుకునేలా వారి ఆటపాటలు సాగేలా పెద్దలు చూడాలి. ఆ ఆట΄ాటలన్నీ అయినవాళ్లతో జరగాలి. దసరా సెలవులు బంగారు గనులు. ఆ గనుల్లోకి పిల్లల్ని పంపండి. మర్చిపోవద్దు. -
ఆ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డా : అరవింద్ స్వామి
‘సత్యం సుందరం’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అరవింద్ స్వామి. గతంలో రోజా, బొంబాయ్ లాంటి సినిమాలతో అలరించిన అరవింద్ స్వామి.. చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై మెరిశాడు. ఈ చిత్రంలో అరవింద్‌తో పాటు కార్తి కూడా ప్రధాన పాత్రలో నటించాడు. సెప్టెంబర్ 28న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విడుదలై వారం దాటినా అటు కార్తితో పాటు ఇటు అరవింద్ స్వామి కూడా వరుస ఇంటర్యూలు ఇస్తూ తమ సినిమాను మరికొంత మందికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ స్వామి తన కెరీర్‌పై ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు మణిరత్నం ఇచ్చిన అవకాశంతోనే తన రీఎంట్రీ సాఫీగా సాగిపోతుందని చెప్పారు. ‘కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో కొన్ని సినిమాలను చేయలేకపోయాను. వెన్నెముకకు గాయం కావడంతో రెండేళ్ల పాటు రెస్ట్ తీసుకున్నాను. ఆ సయమంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డా. అదే సమయంలో నా కాలికి పాక్షికంగా పక్షవాతం వచ్చింది. దీంతో దాదాపు 13 ఏళ్ల పాటు నటనకు దూరంగా ఉన్నాను. మళ్లీ సినిమాల్లో నటించాలనుకోలేదు. మణిరత్నం ఆఫర్ ఇవ్వడంతో ఏ ప్లాన్ లేకుండానే రీఎంట్రీ ఇచ్చాను. కడల్(తెలుగులో కడలి) సినిమాతో నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యాక నా సంతృప్తి కోసం రెండు హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నాను. సత్యం సుందరం చాలా ఇష్టంతో చేశాను. తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ప్రస్తుతం నా కెరీర్ చాలా బాగుంది’ అని అరవింద్ స్వామి అన్నారు. -
కార్తి ‘సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
కార్తీ మూవీకి సూపర్ హిట్ టాక్.. మేకర్స్ షాకింగ్ నిర్ణయం!
కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'మెయిజగన్'. ఈ చిత్రాన్ని సత్యం సుందరం పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు సి.ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.(ఇది చదవండి: డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్: నాగార్జున)ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 57 నిమిషాలుగా ఉంది. దీంతో నిడివి ఎక్కువ ఉండడంపై పలువురు విమర్శలు చేశారు. హిట్ టాక్ వచ్చినప్పటికీ రన్‌టైమ్‌పై విమర్శలొస్తున్నాయి. అందువల్లే కొన్ని సీన్స్ మేకర్స్ తొలగించినట్లు సమాచారం. దాదాపు 15 నుంచి 18 నిమిషాల వరకు సినిమాను కట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.తాజాగా ట్రిమ్ చేసిన వర్షన్ ఈ రోజు నుంచే థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. ప్రస్తుతం ఈ మూవీ రన్ టైమ్ రెండు గంటల 40 నిమిషాలుగా ఉంది. కాగా.. ఈ చిత్రంలో శ్రీ దివ్య, రాజ్‌కిరణ్, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీరంజని, ఇళవరసు, కరుణాకరన్ కీలక పాత్రలు పోషించారు. -
అమ్మవారి సేవలో స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ హీరో కార్తీ ప్రస్తుతం సత్య సుందరం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మూవీకి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా హీరో కార్తీ, చిత్రబృందం విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు.మూవీ సూపర్ హిట్ కావడంతో విజయవాడలో సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బెజవాడ చేరుకున్న కార్తీ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టమని తెలిపారు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ వచ్చాను.. మా సినిమా చూసి నాగార్జన అభినందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. టాలీవుడ్ మూవీ ఊపిరితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నాగార్జునకు తమ్ముడి పాత్రలో అభిమానులను మెప్పించారు.(ఇది చదవండి: డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్: నాగార్జున)కాగా.. కార్తి , అరవింద స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మెయ్యజగన్. ఈ చిత్రాన్ని సత్యం సుందరం పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమాను దర్శకుడు సి.ప్రేమ్‌కుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాను 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య, జ్యోతిక దీనిని నిర్మించారు. ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతమందించారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న కార్తీ ✨🙏#Karthi #SathyamSundaram #PremKumar #TeluguFilmNagar pic.twitter.com/vnflnQV50R— Telugu FilmNagar (@telugufilmnagar) September 30, 2024 -
డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్: నాగార్జున
కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్టైన్మెంట్పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదలైంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసింది. తమిళ్లో '96' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.కుటుంబ కథా చిత్రంగా విడుదలైన ‘సత్యం సుందరం’ పట్ల ప్రేక్షకులు ఆధరణ భారీగానే ఉంది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేస్తుంది. దీంతో తాజాగా ఈ చిత్రాన్ని చూసిన అక్కినేని నాగార్జున.. చిత్ర యూనిట్‌ను అభినందించారు. సినిమాకు ప్రధాన బలం అయిన కార్తీ, అరవింద్ స్వామి నటనకు ఆయన ఫిదా అయ్యారు.'డియర్ కార్తీ, నిన్న రాత్రి 'సత్యం సుందరం' సినిమా చూశాను!! మీరు, అరవింద్ స్వామి చాలా బాగా నటనతో మెప్పించారు. సినిమాలో నువ్వు కనిపించిన ప్రతిసారి నేను నవ్వుతూనే ఉన్నాను. అనంతరం ఆ చిరునవ్వుతోనే ప్రశాంతంగా నిద్రపోయాను. ఈ సినిమా ద్వారా ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేశావ్... అలాగే మన సినిమా 'ఊపిరి' రోజులను కూడా గుర్తుచేశావ్. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ చిత్రానికి ప్రశంసలు అందుతున్నాయి. ఇది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. చిత్ర యూనిట్ అందరికీ నా అభినందనలు.' అని ఆయన మెచ్చుకున్నారు.అయితే, కార్తీ కూడా ఇలా స్పందించారు. థ్యాంక్యూ అన్నయా.. మీ మాటలతో అందించే ప్రోత్సాహం మాలో ఆనందాన్ని నింపింది. సినిమా మీకు నచ్చినందుకు సంతోసిస్తున్నాం. ఈ చిత్రంపై మీరు చూపించిన ఆదరణ మా అందరికీ ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది.' అని ఆయన అన్నారు. -
Satyam Sundaram Review: ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యం సుందరంనటీనటులు: కార్తి, అరవింద్ స్వామి, కిరణ్, దివ్య, జయ ప్రకాశ్నిర్మాతలు: సూర్య, జ్యోతిక దర్శకత్వం: ప్రేమ్ కుమార్సంగీతం: గోవింద్ వసంత్విడుదల తేది: సెప్టెంబర్ 28, 2024ఈ వారం బరిలో ఎన్టీఆర్ ‘దేవర’ ఉండడంతో ఇక్కడ మరో చిత్రమేది రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నా.. దేవర ఎంట్రీతో వెనక్కి తగ్గాయి. కానీ ఒక డబ్బింగ్ మూవీ మాత్రం టాలీవుడ్లో దేవరతో పోటీ పడేందుకు సిద్ధమైంది. అదే సత్యం సుందరం. తమిళ స్టార్ హీరోలు కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే...ఈ కథ 1996-2018 మధ్యకాలంలో సాగుతుంది. రామలింగం(జయ ప్రకాశ్) ఇంట్లో ఆస్తి తగాదాలు వస్తాయి. దీంతో పూర్వికుల నుంచి వచ్చిన ఇంటిని, సొంత ఊరిని వదిలి కొడుకు సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి), భార్యతో కలిసి వైజాగ్‌కి వెళ్తాడు. 22 ఏళ్ల తర్వాత బాబాయ్ కూతురు భువన పెళ్లి కోసమై సత్య మళ్లీ తన సొంతూరు వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంతో సత్య ఊరికి వెళ్తాడు. తనకు ఇష్టమైన చెల్లి భువన పెళ్లిలో కనబడి వెంటనే వైజాగ్‌కి తిరిగి వద్దామనుకుంటాడు. అయితే పెళ్లిలో బావా..అంటూ ఓ వ్యక్తి(కార్తి) వచ్చి సత్యను ఆప్యాయంగా పలకరిస్తాడు. అతను ఎవరో సత్యకు తెలియదు. (చదవండి: దేవర మూవీ రివ్యూ)ఈ విషయం తెలిస్తే బాధపడతాడని తెలిసిన వ్యక్తిగానే ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే చిన్ననాటి విషయాలేవి గుర్తుకు రాకున్నా ఏదోలా మ్యానేజ్ చేస్తుంటాడు. తాను వెళ్లాల్సిన బస్ మిస్ అవ్వడంతో ఓ రాత్రంతా ఆ వ్యక్తితో గడపాల్సి వస్తుంది. ఆ వ్యక్తి పరిచయంతో సత్య జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? పేరు కూడా తెలియని వ్యక్తి చూపించే అతి ప్రేమకు సత్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అసలు ఆ వ్యక్తి పేరు సుందరం అని సత్యకు ఎప్పుడు,ఎలా తెలిసింది? సత్యాని సుందరం అంత ఆప్యాయంగా చూసుకోవడానికి గల కారణం ఏంటి? సత్యతో సుందరానికి ఉన్న బంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కే చిత్రం ఏ భాషలోనైనా విజయం సాధించడం తథ్యం. ఈ విషయం డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌కి బాగా తెలుసు. అప్పుడు 96, ఇప్పుడు సత్యం సుందరం.. ఈ రెండు సినిమాల కథలు నేచురల్‌గా ఉంటాయి. హీరో పాత్ర మన చుట్టు ఉండే ఓ వ్యక్తిలాగానో లేదా మనలోనే చూసుకునేలా ఉంటుంది. 96 సినిమా మాదిరే సత్యం సుందరం కథ కూడా చాలా చిన్నది. అందరికి తెలిసిన, చూసిన కథ. అయినా కూడా తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. ఇది సినిమా లాగా కాకుండా ఎవరో మన ఆత్మీయులను చూస్తున్నట్లుగా, వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన మనకే జరిగిన అనుభూతి కలిగిస్తుంది.సినిమా ప్రారంభం అయినా కాసేపటికే మనం కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో కనెక్ట్ అయిపోతాం. వారిద్దరి మధ్య వచ్చే సంభాషణలు..సన్నివేశాలన్నీ మన ఇంట్లోనో..లేదా మనకు తెలిసివాళ్ల ఇంట్లోనో జరిగినట్లుగా అనిపిస్తుంది. ఇద్దరు కలిసి కొన్ని చోట్ల నవ్విస్తారు..మరికొన్ని చోట్ల ఏడిపిస్తారు. స్క్రీన్ మీద పండించిన ఎమోషన్‌కి సీట్లలో ఉండే ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాళ్లు చెప్పుకునే చిన్ననాటి ముచ్చట్లు..మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇక సత్య తన చెల్లి భువనకు పట్టీలు పెట్టే సీన్ అయితే గుండెను బరువెక్కిస్తుంది. అతి ప్రేమను చూపించే వ్యక్తి పేరు తెలియక సత్య పడే బాధను చూసి మనకు కన్నీళ్లు వస్తాయి. సుందరం అమాయకత్వం, మంచితనం చూసి నవ్వుతూనే మనలో ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయా లేదా అని వెతుక్కుంటాం. వాళ్లు ఇద్దరు కలిసి మందేస్తే.. మత్తు మనకెక్కుతుంది. సైకిల్ సీన్ చూసి.. మనకు తెలియకుండానే కళ్లు తడిసిపోతాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో ప్రేక్షకుడు ప్రయాణం అయ్యేలా చేయడం దర్శకుడు వందశాతం సక్సెస్ అయ్యాడు. అయితే, ప్రేమ్ కుమార్ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ నరేషన్ మరీ స్లో ఉండడం. సినిమా నివిడి చాలా ఎక్కువ. అందుకే కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించిన కార్తి, అరవింద్ స్వామి ఇద్దరు బడా హీరోలే. కానీ ఆ ఇమేజ్ మాత్రం తెరపై ఏ మాత్రం కనిపించదు. తెరపై మనకు సత్యం, సుందరం పాత్రలే కనిపిస్తాయి కానీ ఎక్కడా కార్తి, అరవింద్ స్వామి గుర్తుకురారు. ప్రేమ్ కుమార్ రాసిన సహజ కథకు తమదైన సహస నటనతో ఇద్దరూ న్యాయం చేశారు. ఎమోషనల్ సీన్లలో ఇద్దరూ పోటీ పడీ నటించారు. ఇక కార్తి అయితే తన అమాయకత్వపు నటనతో కొన్ని చోట్ల నవ్వించాడు. కిరణ్, దివ్య, జయ ప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ మరోసారి తనదైన మ్యూజిక్‌తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అతను అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రాఫర్ మహేందిరన్ జయరాజు పని తీరు చాలా బాగుంది. ప్రతిఫేమ్ని తెరపై చాలా అందంగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 3.25/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కార్తీ 'సత్యం సుందరం' HD మూవీ స్టిల్స్
-
ఆ ఇద్దరే ఈ సినిమాకి పెద్ద బలం : డైరెక్టర్ సి. ప్రేమ్‌కుమార్
‘‘నేను తీసిన ‘96’ సినిమా ప్రేమకథ. కానీ, ‘సత్యం సుందరం’ కుటుంబ కథా చిత్రం. కార్తీ, అరవింద్ స్వామిగార్ల పాత్రల మధ్య ఒక రాత్రిలో జరిగే కథ. వాళ్ల మధ్య అనుబంధం ఏంటి? ఆ ఒక్క రాత్రిలో వారి మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ ఫ్యామిలీ డ్రామా బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ సి. ప్రేమ్‌కుమార్ అన్నారు. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్టైన్మెంట్పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సి. ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘సత్యం సుందరం’ నవలని సినిమా స్క్రిప్ట్లాగానే రాశాను. కార్తీ, అరవింద్ స్వామిగార్లు ముందు నవలని చదివారు... వారికి బాగా నచ్చింది. ఆ నవలని స్క్రిప్ట్‌గా మలచడం సులభంగా అనిపించింది. కార్తీ, అరవింద్ స్వామిగార్లలో ఏ ఒక్కరు అంగీకరించకపోయినా ఈ సినిమా చేసేవాడిని కాదు. వాళ్లిద్దరే అలా నటించగలరు. వాళ్ల కెమిస్ట్రీ, కాంబినేషన్ ఈ సినిమాకి పెద్ద బలం. సూర్యగారికి సినిమా అంటే చాలా ప్యాషన్. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం నిర్మించారు. గోవింద్ వసంత ‘96’కి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారో అందరికీ తెలుసు. ‘సత్యం సుందరం’కి కూడా అంతే అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ డబ్బింగ్ అద్భుతంగా వచ్చింది’’ అన్నారు. -
అందులో ఉన్న ఆనందం ఏంటో.. పవన్‌కి ప్రకాశ్ రాజ్ మరోసారి కౌంటర్!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి కౌంటర్ ఇచ్చాడు. హీరో కార్తీని పవన్ టార్గెట్ చేయడాన్ని తప్పు పడుతూ.. ‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్...’ అని ట్వీట్ చేశాడు.(చదవండి: దయచేసి ఆ వీడియోని ఇప్పుడు వాడకండి : యాంకర్ రష్మి)తిరుమల లడ్డు వివాదంపై పవన్ కల్యాణ్ చేస్తున్న రాద్ధాంతాన్ని ప్రకాశ్‌రాజ్ మొదటి నుంచి తప్పుపడుతున్నాడు. ‘జస్ట్ ఆస్కింగ్’అంటూ పవన్ చర్యలను తప్పుపడుతూ ట్వీట్ చేశాడు. ప్రకాశ్ రాజ్ పోస్టులపై పవన్ అసహనం వ్యక్తం చేశాడు. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ హెచ్చరించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ కల్యాణ్ప్రశ్నలకు సమాధానమిస్తానని, ఆలోపు వీలైతే తను చేసిన ట్వీట్స్ మళ్లీ ఒకసారి చదవండి’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. కార్తీ వివాదం ఏంటి?‘సత్యం సుందరం’ ప్రీరిలీజ్ ఈవెంట్లో యాంకర్ లడ్డు కావాలా అంటూ కార్తిని అడుగుతుంది. దానికి కార్తి నవ్వుతూ.. ‘లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైంది’ వద్దులే అన్నాడు. ఆయన సరదా అన్నట్లు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం కార్తి వ్యాఖ్యలను తప్పపడుతూ.. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దని హెచ్చరించాడు. ఈ వివాదం పెద్దది కావొద్దనే ఉద్దేశంతో కార్తి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశాడు. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్... #justasking— Prakash Raj (@prakashraaj) September 25, 2024 -
కార్తి ఇంత రిస్క్ అవసరమా... దేవర ముందు నిలుస్తాడా
-
ఒకే మూవీలో నటించబోతున్న కార్తి-సూర్య!?
-
#Karthi : నటుడు కార్తీ ఫ్యామిలీ ఫొటోలు
-
ఆయనేమన్నాడు.. ఈయన ఏమనుకున్నాడు?
-
రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్ కావాలి
‘‘కార్తీగారంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని మన తెలుగు హీరో అని చెప్పుకుంటాం. ‘96’ సినిమాకి పెద్ద ఫ్యాన్‌ని. ప్రేమ్ కుమార్‌గారు నా కలల దర్శకుడు. వారిద్దరూ కలిసి చేసిన ‘సత్యం సుందరం’ సినిమాని ఈ 28న చూడండి. అలాగే 27న ‘దేవర’ చిత్రం చూడండి. ఈ రెండు సినిమాలూ పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. కార్తీ, అరవింద్ స్వామి ప్రధానపాత్రల్లో శ్రీదివ్య కీలకపాత్రలో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది.ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్స్ ఎల్ఎల్పీ తెలుగులో విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ రిలీజ్‌కి విశ్వక్ సేన్, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ– ‘‘కొన్ని నెలల క్రితం కార్తీగారిని కలిసి, కథ చెప్పాను. ఆయన ఓకే చేయడమే మిగిలి ఉంది. ‘సత్యం సుందరం’ ట్రైలర్, టీజర్ చాలా నచ్చాయి. ఈ సినిమా చూడ్డానికి ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.‘‘యుగానికి ఒక్కడు’ సినిమా చూసినప్పుడే కార్తీగారు నాకు చాలా నచ్చేశారు. నాకు ఇష్టమైన హీరోతో పని చేయడం హ్యాపీ. మా సినిమాని చూడండి’’ అని శ్రీదివ్య తెలిపారు. ‘‘ఆర్య, జగడం’ సినిమాలతో నా కెరీర్‌ని తెలుగులో ప్రారంభించాను. ఆ తర్వాత తమిళ పరిశ్రమకు వెళ్లాను. ఈ నెల 28న అందరం థియేటర్స్‌లో కలుద్దాం’’ అని పేర్కొన్నారు ప్రేమ్ కుమార్. ‘‘చాలా హార్ట్‌ఫుల్‌గా తీసిన సినిమా ‘సత్యం సుందరం’’ అని నిర్మాత సురేష్ బాబు చెప్పారు. రచయిత, నటుడు రాకేందు మౌళి మాట్లాడారు. -
కార్తీ ‘సత్యం సుందరం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'సత్యం సుందరం' ట్రైలర్.. మరో హిట్ ఖాయం
కార్తి - అరవింద్ స్వామి కాంబినేషన్లో వస్తున్న సినిమా 'మెయిళగన్'. తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో థియేటరలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. సూర్య-జ్యోతిక నిర్మించారు. ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, కార్తి.. బావ-బావమరిదిగా నటించడం విశేషం. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానుంది.తమిళంలో '96' వంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్‌కుమార్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతికలు దీనిని నిర్మించారు. -
సుతిమెత్తగా అభిమానులకు క్లాస్ పీకిన సూర్య
ఒకప్పుడు సినిమా 50, 100 రోజుల పాటు థియేటర్లలో ఆడేది. దానిబట్టి హిట్టా ఫ్లాప్ అనేది నిర్ణయించేవాళ్లు. కానీ ఇప్పుడు సినిమా ఎలా ఉన్నా సంబంధం లేదు. కోట్లకు కోట్లు వచ్చాయా.. మా మూవీ హిట్ అయిపోయిందో అని నిర్మాతలు చెప్పేసుకుంటున్నారు. ఇప్పుడంతా వసూళ్ల బట్టే ఫలితాన్ని నిర్ణయిస్తున్నారు. ఫ్యాన్స్ గొడవలు పడేది కూడా ఈ వసూళ్ల గురించే.మా హీరో సినిమాకు తొలిరోజు ఇన్ని కోట్లు వచ్చాయని ఒకడంటే.. మా హీరో చిత్రానికి తొలిరోజు మీ వాడికంటే ఎక్కువనే వచ్చాయని మరో ఫ్యాన్ అంటాడు. ఇలాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి అభిమానులపై తమిళ హీరో సూర్య కౌంటర్లు వేశాడు. మూవీకి వచ్చే కలెక్షన్స్ గురించి మీకెందుకు అని అడిగాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ నాలుగు డోంట్ మిస్)కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మెయిళగన్'. సూర్య-జ్యోతిక నిర్మించారు. తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో థియేటరలో రిలీజ్ చేస్తున్నారు. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా తమిళనాడులో జరిగింది. ఇందులో మాట్లాడిన సూర్య.. 'సినిమాలోని స్టోరీ, కంటెంట్, పాత్రల గురించి మాట్లాడుకోండి. వాటి గురించి సెలబ్రేట్ చేసుకోండి. వసూళ్ల గురించి మీకు(ఫ్యాన్స్) ఎందుకు? వాటి గురించి ఆలోచించడం ఆపండి' అని చెప్పాడు.వసూళ్ల గురించి ఫ్యాన్స్ గొడవ పడుతుంటారని దాదాపు అందరు హీరోలకు తెలుసు. కానీ ఏ ఒక్కరూ దాని గురించి మాట్లాడరు. సూర్య మాత్రం మరీ కొట్టినట్లు చెప్పనప్పటికీ చెప్పాల్సిన విషయాన్ని అయితే చెప్పాడు. మరి దీన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారో చూడాలి?(ఇదీ చదవండి: 'కల్కి' సినిమాపై గరికపాటి విమర్శలు.. ఏమన్నారంటే?)This is to all the fans who fight day in and day out about the Box Office numbers. pic.twitter.com/YPqdDAi6wb— Aakashavaani (@TheAakashavaani) September 23, 2024 -
వారికి కృతజ్ఞతలు.. రెడ్‌కార్డ్ ఎత్తివేతపై ధనుష్
కోలీవుడ్ హీరో ధనుష్‌పై తమిళ చిత్రపరిశ్రమ ప్రయోగించిన రెడ్‌కార్డ్‌ను ఎత్తివేసిన విషయం తెలిసిందే. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో నడిగర్ సంఘం చర్చలు జరిపి ధనష్తో ఉన్న వివాదాన్ని పరిష్కరించింది. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ ధనుష్ ఒక నోట్ విడుదల చేశారు. రెమ్యునరేషన్ తీసుకుని షూటింగ్‌కు సహరించని నటీనటులకు తమిళ ఇండస్ట్రీ రెడ్‌కార్డులు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే ధనుష్‌పై రెడ్‌కార్డ్ జారీ అయింది.ధనుష్‌పై తమిళ నిర్మాత మండలి రెడ్ కార్డ్ ప్రయోగించిన వెంటనే నడిఘర్ సంఘం అధ్యక్షుడు నాజర్ తప్పుబట్టారు. నిర్మాతలు అలాంటి నిర్ణయం తీసుకుంటే ఇండస్ట్రీకి చాలా నష్టమని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ధనుష్ వల్ల ఇబ్బుందులు పడుతున్నామని ఆరోపించిన త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ అధినేతలతో చర్చలు జరిపారు. దీంతో గతంలో వారి నుంచి తీసుకున్న డబ్బు ధనుష్ తిరిగి చెల్లించేందుకు ఓకే చెప్పడంతో లైన్ క్లియర్ అయింది.ఇదే విషయం గురించి ధనుష్ ఒక నోట్ విడుదల చేశారు. 'నా నిర్మాతలు,త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ చేసిన ఫిర్యాదులను పరిష్కరించడంలో నాకు అండగా నిలిచిన నడిఘర్ సంఘానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో జోక్యం చేసుకుని నిజాయితీగా సమస్యను పరిష్కరించారు. దీంతో మేము కొత్త సినిమా ప్రాజెక్ట్‌ను వెంటనే తిరిగి ప్రారంభించకలిగాము. నాజర్, కార్తీ,విశాల్, కరుణాస్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమస్యలను పరిష్కరించి మాకు సహాయపడటమే కాకుండా పరిశ్రమకు మంచి ఉదాహరణగా నిలిచారు.' అని తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. -
తమిళ స్టార్ హీరోలు.. కార్తీని చూసి కాస్త నేర్చుకోండి!
తమిళ దర్శకనిర్మాతలకు తెలుగు ప్రేక్షకులంటే మరీ అలుసు. బయటకు ఆహా ఓహో అని చెబుతారు. కానీ సినిమాల్లో కథ దగ్గర నుంచి టైటిల్ వరకు ప్రతి దానిలోనూ తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. గతంలో ఇలా ఉండేది కాదు. సినిమాకు పెట్టే పేరు దగ్గర నుంచి డబ్బింగ్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్లు. కానీ రీసెంట్ టైంలో ఆ పద్ధతి పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు కార్తీ తన కొత్త మూవీతో తెలుగు ఆడియెన్స్‌కి కాస్త గౌరవం ఇస్తున్నాడా అనిపిస్తుంది.రీసెంట్ టైంలో తమిళ డబ్బింగ్ చిత్రాలు తెలుగులోనే చాలానే రిలీజయ్యాయి. వీటిలో అయలాన్, బాక్, రాయన్, తంగలాన్ ఉన్నాయి. ఈ టైటిల్‌కి అర్థం ఏంటంటే ఒక్కడూ చెప్పలేడు. తమిళంలో ఏదైతే పెట్టారే దాన్ని యధాతథంగా అనువదించేశారు. ఏ పేరు పెట్టినా తెలుగు ప్రేక్షకుడు చూస్తాడులే అని అలుసు కావొచ్చు. త్వరలో రిలీజయ్యే రజనీకాంత్ 'వేట్టయాన్', సూర్య 'కంగువ' సినిమాలది కూడా ఇదే తీరు.(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)ఇకపోతే కార్తీ లేటెస్ట్ తమిళ మూవీ 'మైళగన్'. తమిళనాడులోని తంజావుర్‌లో ఓ రాత్రి ఇద్దరు వ్యక్తులు (బావ-బావమరిది) మధ్య జరిగిన స్టోరీతో దీన్ని తీశారు. తెలుగులోనూ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. తమిళ పేరుని ఉన్నది ఉన్నట్లు కాకుండా 'సత్యం సుందరం' అని టైటిల్ పెట్టారు. ఉద్దండరాయుని పాలెం ఊరిలో కథని జరిగినట్లు చూపించారు. ఊరి పేర్లతో సహా బండి నంబర్ ప్లేట్ల విషయంలో టీమ్ కాస్త శ్రద్ధ తీసుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే ఇవన్నీ అర్థమవుతున్నాయి.అయితే ఈ సినిమా ఎన్టీఆర్ 'దేవర' సినిమా రిలీజైన ఒకరోజు తర్వాత అంటే సెప్టెంబరు 28న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్తీ తీసే సినిమాలు అంతో ఇంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంటాయి. అయితే 'దేవర'తో పోటీగా వస్తున్నాడు. ఏం చేస్తాడో చూడాలి? సరే ఇదంతా పక్కనబెడితే తమిళ స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఇప్పటికైనా కాస్త టైటిల్స్ విషయంలో శ్రద్ధ తీసుకుంటే బెటర్!(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
వీటిలో ఒక్క సినిమా హిట్ అయితే.. కృతిశెట్టికి మళ్లీ వరుస ఛాన్సులు
ఇటీవల విజయాల కోసం ఎదురుచూస్తున్న నటీమణుల్లో కృతిశెట్టి ఒకరు. 2019లో సూపర్ 3డీ అనే హిందీ చిత్రంతో తెరపై మెరిశారు. ఆ తర్వాత ఉప్పెనలా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న ఈమె టాలీవుడ్లో టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో ఉంటుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించి వరుస విజయాలను అందుకున్నారు. అయితే ఆ తర్వాతనే కృతిశెట్టి కెరియర్ అపజయాల బాట పట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ఇప్పటివరకు విజయాన్ని చూడలేదన్నది నిజం. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో ప్రత్యేక ఫొటో షూట్ నిర్వహించుకొని ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేస్తున్నా, కృతిశెట్టికి తెలుగులో అవకాశాలు రావడం లేదు. ఎంతో ఆశతో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నాగచైతన్యకు జంటగా నటించిన ద్విభాషా (తెలుగు తమిళ్ ) చిత్రం కస్టడీ ఈమెను పూర్తిగా నిరాశపరిచింది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ కృతిశెట్టి పూర్తిగా వదిలేసినా, తమిళ చిత్రపరిశ్రమ మాత్రం ఈమెను ఆదరిస్తుండడం విశేషం. కస్టడీ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైనా, ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అలా కార్తీ సరసన 'వా వాద్దియార్' చిత్రంలోనూ, ప్రదీప్ రంగనాథ్ జంటగా 'ఎల్ఐకే' చిత్రంలోనూ, జయంరవి సరసన 'జీనీ' చిత్రంలో కృతిశెట్టి నాయకిగా నటిస్తున్నారు. వీటిలో ఏ ఒక్క చిత్రం సక్సెస్ అయిన ఇక్కడ ఆమెకు రూట్ క్లియర్ అయినట్లే. అందుకే ఆమె ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమనే నమ్ముకున్నారు. అయితే మలయాళంలో ఒక చిత్రంలో కృతిశెట్టి నటిస్తున్నారు. ఈమె అక్కడ నటిస్తున్న తొలి చిత్రం ఇదే అన్నది తెలిసిందే. -
సర్దార్ సీక్వెల్లో...
‘సర్దార్’ స్పై టీమ్‌లో చేరారు హీరోయిన్ రజీషా విజయన్. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సర్దార్’ (2022) మంచి హిట్‌గా నిలిచింది.ప్రస్తుతం కార్తీ, మిత్రన్ కాంబినేషన్లోనే ‘సర్దార్’కి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ తెరకెక్కుతోంది. ఎస్జే సూర్య, మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. హీరోయిన్ రజీషా విజయన్ మరో లీడ్ రోల్లో నటించనున్నట్లు గురువారం మేకర్స్ తెలిపారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
చిరంజీవితో సినిమా తర్వాత మరో ఛాన్స్ కొట్టేసిన ఆషికా రంగనాథ్
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ఇప్పటికే మెగాస్టార్ విశ్వంభరలో ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీకి సౌత్ ఇండియా స్టార్ హీరో సినిమాలో ఎంట్రీ ఇచ్చేసింది. 'సర్దార్ 2' సినిమా కోసం కార్తితో ఆషికా రంగనాథ్ జోడీ కట్టనున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే, ఆమె పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా పోస్ట్ చేసింది.ఆషికా రంగనాథ్‌ను సర్దార్2 ప్రాజెక్ట్‌లోకి స్వాగతిస్తున్నట్లు తెలియజేస్తూ మేకర్స్ ఒక పోస్టర్‌ను కూడా వివడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాలో మాళవిక మోహనన్ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది.అమిగోస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆషిక ఈ ఏడాదిలో నాగార్జున సరసన ‘నా సామిరంగ’లో మెప్పించింది. దీంతో తెలుగులో రెండు సినిమాల అనుభవంతోనే తన మూడో సినిమా మెగాస్టార్‌తో నటించే అవకాశం అందుకుంది. ‘విశ్వంభర’లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కార్తితో ఆమెకు ఛాన్స్ దక్కడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. -
సర్దార్కి జోడీగా...
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్’ (2022) సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ హిట్ కాంబినేషన్లోనే ‘సర్దార్ 2’ రూపొందుతోంది. ఈ మూవీలో కార్తీకి జోడీగా మాళవికా మోహనన్ నటిస్తున్నట్లు శుక్రవారం మేకర్స్ ప్రకటించారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.‘‘సర్దార్’ తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందిస్తున్న ‘సర్దార్ 2’ షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఎస్జే సూర్య ఓ పవర్ఫుల్పాత్ర చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. -
కంగువలో కనిపించనున్న కార్తీ..
-
ఎన్టీఆర్ దేవర పై పోటీకి సై అంటున్న తమిళ స్టార్ హీరో..
-
సర్దార్ 2 సెట్స్‌లో ప్రమాదం.. ఒకరి మృతి
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్దార్ 2’ చిత్ర షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక భారీ ఫైట్ సీన్ షూట్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్ -2 ప్రకటన వచ్చిన కొద్దిరోజుల్లోనే షూటింగ్‌ను ప్రారంభించారు.మిషన్ కంబోడియా నేపథ్యంలో సాగే సర్దార్ 2 పూజా కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది. జులై 15 నుంచి సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక ఫైట్ సీన్‌ను తెరకెక్కిస్తున్న క్రమంలో సెట్స్‌లో ప్రమాదం జరిగింది. ఎజుమలై అనే ఫైట్ మాస్టర్ సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మరణించారు. ఎక్కువ ఎత్తు నుంచి కిందపడటంతో ఆయన ఛాతీ భాగంలో తీవ్ర గాయం అయింది. దీంతో ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడం వల్లే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అయితే, ప్రమాదం జరిగన సమయంలో హీరో కార్తీ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కంగువ, భారతీయుడు, దేవర వంటి సినిమా చిత్రీకరణ సమయంలో కూడా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అలాంటి సమయంలో ఎక్కువగా ఫైట్ మాస్టర్స్ గాయపడటం వల్ల చిత్రపరిశ్రమను ఆందోళనకు గురిచేస్తుంది. -
అన్న దారిలో తమ్ముడు నెక్స్ట్ ఇయర్ ఖైదీ సీక్వెల్ స్టార్ట్..
-
మూడోసారి అలాంటి పాత్రలో కార్తీ.. హిట్ కొడతాడా?
తమిళ హీరో కార్తీ మరోసారి పోలీసుగా కనిపించబోతున్నాడు. 'ఖాకీ', 'సర్దార్' సినిమాల్లో పోలీస్‌గా ఆకట్టుకున్న ఇతడు ఇప్పుడు మరోసారి అలాంటి రోల్ చేయబోతున్నాడు. ఈ మూవీకి 'వా వాతియార్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నలన్ కుమార స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ కాగా సత్యరాజ్, రాజ్ కిరణ్ తదితరులు కీలక పాత్రధారులు.(ఇదీ చదవండి: నన్ను అలాంటి డ్రెస్సుల్లో ఎవరూ చూడొద్దనుకుంటాను.. కానీ!: జాన్వీ కపూర్)కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్గా కార్తీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోలీసు దుస్తుల్లో కార్తీ, కూలింగ్ కళ్లజోడు, ఆయన వెనక నిలబడ్డ ఎంజీఆర్ పాత్రలతో కూడిన పోస్టర్ ట్రెండీగా ఉంది.ఇకపోతే కార్తీ ఇంతకుముందు పోలీసుగా చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇది కూడా మంచి విజయం సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.(ఇదీ చదవండి: ఫైనల్లీ 'కల్కి' షూటింగ్ పూర్తయింది.. వాళ్లందరికీ స్పెషల్ గిఫ్ట్స్) -
'96' దర్శకుడితో కార్తీ మూవీ.. మళ్లీ అలాంటి కాన్సెప్ట్
సూర్య తమ్ముడిగా పరిచయమైనప్పటికీ తనదైన యాక్టింగ్‌తో తెలుగులోనూ అద్భుతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు కార్తీ. వరస సినిమాలతో అలరించే ఇతడు ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తున్నాడు. తాజాగా ఇతజి పుట్టిన రోజు సందర్భంగా వాటి నుంచి అప్డేట్స్ వచ్చాయి. కార్తీ-'96' మూవీ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'మెయ్యళగన్' టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో అరవింద స్వామి ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. సూర్య-జ్యోతిక నిర్మిస్తున్నారు.(ఇదీ చదవండి: ఆయన దుస్తులు లేకుండానే పక్కన వచ్చి కూర్చుంటాడు: స్టార్ హీరోయిన్)ఇక షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకొంటోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో కార్తీ ఎద్దుతో ముచ్చటిస్తున్నట్లు ఒకటి ఉండగా, కార్తీ-అరవిందస్వామి సైకిల్లో వెళుతున్నట్లుగా మరో పోస్టర్ కనిపించింది. ఈ రెండింటిని చూస్తుంటే ఈ పోస్టర్లను చూస్తుంటే 'మెయ్యళగన్' గ్రామీణ నేపథ్యంలో సాగే వింటేజ్ మూవీ అనిపిస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది హీరోయిన్లు చెబుతుంటారు. కానీ డాక్టర్ కోర్స్ చదువుతూనే శ్రీలీల హీరోయిన్ అయిపోయింది. 'పెళ్లి సందడి' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా సక్సెస్ కానప్పటికీ వరస అవకాశాలు ఈమెని వరించాయి. రవితేజ 'ధమాకా'తో రూ.100 కోట్ల హిట్ అందుకుంది. మహేష్ బాబుతో 'గుంటూరు కారం'లోనూ నటించి ఆకట్టుకుంది.(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)అయితే తెలుగులో వరస ఫ్లాప్స్ దెబ్బకు ఈమెకు టాలీవుడ్లో ఛాన్సులు కరువయ్యాయి. లేదంటే ఈమె వద్దనుకుందో తెలియదు గానీ మన సినిమాలు ఇప్పట్లో చేసే సూచనలు కనిపించట్లేదు. అదే టైంలో తమిళంలో విజయ్, అజిత్ చిత్రాల్లో నటించే అవకాశం వరించిందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి.కాగా శ్రీలీలకు ఇప్పుడు మరో భారీ అవకాశం తలుపు తట్టినట్లు తెలిసింది. కార్తీ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందని, ఇందులో హీరోయిన్గా ఈమెని తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమై, మూవీ హిట్ అయితే మాత్రం తమిళంలో శ్రీలీల క్రేజ్ పెరగడం ఖాయం.(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య) -
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
సూపర్ హిట్ మూవీ.. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్
హీరో కార్తీ సూపర్ హిట్ చిత్రాల్లో పైయ్యా ఒకటి. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహించారు. తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుభాష్‌చంద్రబోస్ నిర్మించారు. మది ఛాయాగ్రహణం, యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. రోడ్ ట్రావెల్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇందులోని పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఇది తెలుగులో ఆవారాగా రిలీజై ఇక్కడ కూడా హిట్ అందుకుంది. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్ తాజాగా పైయ్యా చిత్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయడానికి తిరుపతి బ్రదర్స్ సంస్థ అధినేత సుభాష్ చంద్రబోస్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ చేయనున్నట్లు దర్శకుడు లింగుసామి ఇంతకు ముందే చెప్పారన్నది గమనార్హం. తాజాగా పైయ్యా చిత్రం రీ రిలీజ్ గురించి ఆయన మాట్లాడుతూ.. కార్తీకి ఒక హోటల్లో కథ చెప్పడం మొదలు పెట్టిన కొద్ది సేపటికే చాలా బాగుంది.. మనం చిత్రం చేస్తున్నాం అని చెప్పారన్నారు. ఆయనకు కథలపై చాలా నాలెడ్జ్ ఉందన్నారు. కెమిస్ట్రీ వర్కౌట్ అయింది సినిమాలో లవ్, యాక్షన్, చేజింగ్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు బాగా కుదిరాయన్నారు. కార్తీ, తమన్నాల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందన్నారు. ఇకపోతే పైయ్యా చిత్రానికి సీక్వెల్ చేస్తానని, కథ కూడా సిద్ధం చేశానన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే దీనికంటే ముందు ఒక పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నట్లు చెప్పారు. ఇది మహాభారతంలోని శ్రీకృష్ణుడు, అర్జునుడు పాత్రల నేపథ్యంలో ఉంటుందని చెప్పారు. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని లింగుసామి పేర్కొన్నారు. చదవండి: హీరోయిన్ అరుంధతి ప్రస్తుతం ఎలా ఉందో చెప్పిన సోదరి -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టనున్న కోలీవుడ్ హీరో..!
కోలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. గతేడాది కార్తీ నటించిన 25వ చిత్రం జపాన్ పూర్తిగా నిరాశపరచడంతో ఆయన ఇప్పుడు స్పీడ్ పెంచారు. చిత్రాల విషయంలో జెడ్ స్పీడ్‌లో పరుగెడుతున్నారనే చెప్పాలి. ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వాద్ధియారే, 96 చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి ఖైదీ 2, సర్ధార్ 2 చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటిలో సర్ధార్ -2 చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. కాగా ఇలాంటి పరిస్థితుల్లో కార్తీ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా.. అర్జున్‌రెడ్డి, యానిమల్తో సంచలన హిట్స్ కొట్టిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో నటించనున్నారన్నదే లేటేస్ట్ టాక్. మరోవైపు ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సందీప్ సన్నాహాలు చేస్తున్నారు. ఆ తరువాత నటుడు కార్తీ హీరోగా ఓ చిత్రం చేయనున్నట్లు ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు వైరలవుతోంది. అయితే ఈ క్రేజీ కాంబోలో రూపొందే చిత్రానికి ఇంకా చాలా టైమ్ ఉంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. -
స్టార్ హీరో పక్కన సినిమా ఛాన్స్.. నో చెప్పిన 'సూర్య' చెల్లెలు
మాధవన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో 'అమృత' సినిమా తెలుగులో వచ్చింది. తమిళ టైగర్స్ నేపథ్యంలో తెరకెక్కిన 'అమృత' సినిమా ఒక మాస్టర్ పీస్‌లా నిలిచిపోయింది. తమిళ్లో మొదట 'కన్నతిల్ ముత్తమిట్టల్' అనే పేరుతో విడుదలైంది. ఈ సినిమాకు ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులు , మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ , ఏడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులు, ఆరు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది . ఈ అవార్డ్స్ చాలు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పడానికి. ఇలాంటి సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్‌ను బృందా శివకుమార్ మిస్ చేసుకుంది. కోలీవుడ్ టాప్ హీరోలు అయిన సూర్య, కార్తీలకు ఆమె ముద్దుల చెల్లెలు అనే విషయం తెలిసిందే. మాధవన్ సరసన సిమ్రాన్ అదిరిపోయే నటనతో మెప్పించిన సిమ్రాన్ స్థానంలో బృందా ఉండాల్సింది. డైరెక్టర్ మణిరత్నం కూడా బృందా అయితే సరిగ్గా కథకు సెట్ అవుతుందని అనుకున్నారట.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సూర్య, కార్తీ ఇద్దరూ కోలీవుడ్ సినిమాల్లో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కార్తీ.. నేడు పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకున్నాడు. మొదట్లో తనకు నటించడం తెలియదనే విమర్శలను ఎదుర్కొన్న సూర్య నేడు కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ ఒక్కగానొక్క సోదరి మాత్రం సినీరంగంలో గాయనిగా అరంగేట్రం చేసి పలు చిత్రాల్లో పాటలు కూడా పాడింది. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అదే విధంగా, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర తమిళ వెర్షన్లో అలియా భట్‌కి బృందా డబ్బింగ్ కూడా చెప్పింది. ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉన్న బృందా శివకుమార్‌కి హీరోయిన్గా అవకాశం వచ్చినా ఆమె తిరస్కరించింది. అందుకు తగ్గట్టుగానే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'కన్నతిల్ ముత్తమిదళ్' (అమృత) చిత్రంలో మాధవన్ సరసన నటించేందుకు బృందాని మొదట సంప్రదించారు. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సుధా కొంగర ద్వారా బృందాతో సంప్రదింపులు జరిపారు. కానీ తనకు నటనపై ఆసక్తి లేదని బృందా రిజెక్ట్ చేయడంతో సిమ్రాన్‌ను ఆ పాత్రలో తీసుకున్నారు. మణిరత్నం తెరకెక్కించిన 'కన్నతిల్ ముత్తమిట్టల్' చిత్రంలో నటించే అవకాశాన్ని సూర్య చెల్లెలు తిరస్కరించిందనే వార్త అప్పట్లో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. -
ఖైదీ రెండవ భాగం ఎప్పుడు రాబోతుంది అంటే
-
కార్తీలో జపాన్ తెచ్చిన మార్పు
జపాన్ అనే ఒక్క చిత్రం ద్వారా నటుడు కార్తీలో చాలా మార్పు తెచ్చిందనిపిస్తోంది. ఆయన చాలా నమ్మకం పెట్టుకున్న 25వ చిత్రం జపాన్. అయితే అందరి అంచనాలను తారు మారు చేసి చిత్రం నిరాశ పరచింది. ఇక ఇంతకు ముందెప్పూడూ లేని విధంగా కార్తీ చేతిలో 7 చిత్రాలు ఉన్నాయంటే సాధారణ విషయం కాదు. కాగా కార్తీ నటిస్తున్న 26వ చిత్రాన్ని నలన్ కుమారసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు సూదు కవ్వుమ్, కాదలుమ్ కడందు పోగుమ్ వంటి విజయవంతమైన చిత్రాలను తెర కెక్కించారు. కాగా కార్తీ 26వ చిత్రాన్ని స్డూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న చిత్రం కావడంతో దీనిపై నానాటికీ భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా శరవేగంగా నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పుటికి 50 శాతం పూర్తి అయ్యిందని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాటు చిత్ర ప్రారంభోత్సవ దృశాలతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కథా, కథనాలను సరికొత్త బాణీలో తెరపై ఆవిష్కరించే దర్శకుడు నలన్ కుమారసామి. ఈ చిత్రాన్ని తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారని యూనిట్ వర్గాలు చెప్పారు. కాగా ఈ చిత్రంలో నటించే ఇతర తారాగణం, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతల వర్గం పేర్కొన్నారు. -
కోటి రూపాయలు సాయం చేసిన కమల్.. హీరో కార్తీ చేతికి చెక్
దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధుల కోసం కోలీవుడ్ స్టార్ హీరోలు తీవ్రంగానే కష్టపడుతున్నారు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. సుమారుగా రూ. 40 కోట్ల రూపాయలతో నిర్మితం అవుతున్న భవనం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కానీ ప్రస్తుతం నిధుల కొరత కారణంగా ఈ పనులు పూర్తి కాలేదు. దీంతో సౌత్ ఇండియా స్టార్ హీరో కమల్ హాసన్ కోటి రూపాయాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు సంబంధించిన చెక్కును హీరో కార్తీ చేతికి ఆయన అందించారు. ఆ సమయంలో కార్తీతో పాటుగా ప్రధాన కార్యదర్శి విశాల్, వైస్ ప్రెసిడెంట్ పూచీ మురుగన్‌తో కమల్ సమావేశం అయ్యారు. నడిగర్ సంఘం భవన నిర్మాణానికి సాయం చేయాలని గతంలో విశాల్ విన్నపం చేశారు. దీంతో కొద్ది రోజుల క్రితం తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే.. ఇప్పటికే సూర్య రూ. 25లక్షలు, కార్తీ కోటి రూపాయలు, విశాల్ రూ.25 లక్షలు భవన నిర్మాణం కోసం తమ వంతుగా అందించారు. త్వరలోనే ఈ సంఘం నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. -
లియో డైరెక్టర్ సూపర్ హిట్ మూవీ.. సీక్వెల్‌పై క్రేజీ అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గతంలో నటించిన చిత్రం ఖైదీ. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. హీరోయిన్ అంటూ ఎవరూ లేని ఈ చిత్రం రగ్గడ్ పాత్రలో నటించిన కార్తీలోని మరో నటుడిని ఆవిష్కరించింది. 2019లో విడుదలైన ఖైదీ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే దీనికి సీక్వెల్ ఉంటుందని.. దర్శకుడు లోకేశ్ కనకరాజ్, కార్తీ చెబుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. రియో చిత్రం తరువాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక నటుడు కార్తీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవల నటించిన జపాన్ చిత్రం నిరాశ పరిచినా.. ప్రస్తుతం నలన్ కుమారసామి దర్శకత్వంలో వావాద్థియారే అనే చిత్రంతోపాటు 96 చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. దీని తరువాత సర్ధార్– 2 చిత్రం లైన్లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఖైదీ 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న ప్రశ్నకు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటుడు కార్తీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఖైదీ-2 చిత్రంలో నటిస్తానని చెప్పారు. ఈ లోగా దర్శకుడు లోకేశ్‌కనకరాజ్ రజనీకాంత్ హీరోగా నటించే చిత్రాన్ని పూర్తి చేస్తారని పేర్కొన్నారు. కాగా ఖైదీ– 2 చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని కార్తీ స్పష్టం చేశారు. -
తమ్ముడు తరువాత అన్నయ్యతో అదితి
ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ విరుమాన్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. నటుడు కార్తీతో జతకట్టిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అదితి శంకర్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయి. విరుమాన్ చిత్రం తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం విజయవంతం అయ్యింది. ప్రస్తుతం దివంగత నటుడు మురళి రెండో కొడుకు మురళీ ఆకాశ్‌తో జత కడుతున్నారు. విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా త్వరలో నటుడు సూర్య సరసన నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత కార్తీతో నటించిన అదితి శంకర్ తదుపరి ఆయన అన్నయ్యతో జత కట్టనున్నారన్నమాట. అయితే సూర్య సరసన నటించే విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదన్నది గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో అదితి శంకర్‌ను తాజాగా మరో అవకాశం వరించింది. శ్రీవారి ఫిలిం పతాకంపై పి రంగనాథన్ నిర్మిస్తున్న చిత్రంలోని నటుడు అధర్వ మురళి కథానాయకుడుగా నటించనున్నారు. దీనికి ఎం రాజేష్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో అదితి శంకర్ కథానాయకిగా నటించనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించారు. దీని గురించి మీడియాతో నటుడు అధర్వ పేర్కొంటూ శ్రీవారి ప్రిలిమ్స్ సంస్థ అధినేత పి రంగనాథన్ చిత్ర పరిశ్రమలో ఎంతో అనుభవం గడించిన నిర్మాత, పంపిణీదారుడు అని అన్నారు. ప్రేక్షకులకు నచ్చేలా చిత్రాలను నిర్మించడంలో ఈయనకు అందేవేసిన చెయ్యి అని అన్నారు. అలాంటి నిర్మాత వద్ద పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. మంచి జనరంజకమైన కథనం ఎంపిక చేసి, అందుకు అవసరమైన ఖర్చు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. దర్శకుడు ఎం రాజేష్ దర్శకత్వంలో పి రంగనాథన్ నిర్మిస్తున్న చిత్రంలో తాను నటించడం గర్వంగా భావిస్తున్నట్లు నటుడు అధర్వ మురళి పేర్కొన్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రాలను ఆశించే ప్రేక్షకులకు ఈ చిత్రం కచ్చితంగా నిరాశ పరచదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. లేకపోతే విష్ణువర్ధన్ దర్శకత్వంలో మురళీఆకాష్ సరసన నటిస్తున్న నటి అదితి శంకర్ ఇప్పుడు ఆయన అన్నయ్య అధర్వ మురళితో జతకట్టబోతున్నారన్నమాట. -
కార్తి సోదరిగా నటించబోతున్న యంగ్ హీరోయిన్
తమిళసినిమా: ఇంతకుముందు పలు విజయవంతమైన చిత్రాల్లో కథానాయకిగా నటించిన నటి శ్రీదివ్య. ఇప్పుడు అక్క, చెల్లెలి పాత్రలకు పరిమితం అవుతుందా అంటే అవుననే చెప్పాలి. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన తెలుగింటి అమ్మాయి శ్రీ దివ్య. ఆ తర్వాత కార్తీ, విష్ణు విశాల్, విశాల్, జీవీ ప్రకాష్‌కుమార్ వంటి హీరోల సరసన నాయకిగా నటించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలాంటిది ఆ తరువాత ఈ అమ్మడు అనూహ్యంగా తెరమరుగైన పరిస్థితి. కారణాలు ఏమైనా నటిగా చాలా గ్యాప్ తీసుకున్న శ్రీదివ్య ఆ మధ్య విక్రమ్‌ప్రభు సరసన రైడ్ చిత్రంలో మెరిసింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా కార్తీ సరసన నటించే అవకాశం వరించినట్లు ప్రచారం జరిగింది. కార్తీ ప్రస్తుతం తన 27వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి 96 ఫ్రేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని నటుడు సూర్య, జ్యోతిక తమ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఇందులో శ్రీదివ్య కథానాయకిగా నటించడం లేదన్నది తాజా సమాచారం. ఇందులో ఆమె నటుడు కార్తీకి సోదరిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇది ఆమె అభిమానులకు నిరాశ పరిచే విషయమే అవుతుంది. అయితే కార్తీకి జంటగా స్వాతికొండే నటిస్తున్నట్లు సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం నుంచి కుటుంబ బంధాలతో కూడిన ఎంటర్టైనర్గా ఉంటుందని తెలిసింది. -
హీరో కార్తీకి రూ. కోటి చెక్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్
దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధుల కోసం ప్రముఖ హీరో విశాల్ తీవ్రంగానే కష్టపడుతున్నారు. 2019లో నడిగర్ సంఘం ఎన్నికలు జరగగా వాటి ఫలితాలను 2022లో ప్రకటించారు. అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. అసోసియేషన్ భవనం నిర్మించడం కోసం నిధుల కొరత ఉందని గతంలో విశాల్ తెలిపాడు. నిర్మాణ విషయంలో మూడేళ్లు ఆలస్యమవ్వడం వల్ల 25 శాతం పనులు పెరిగాయని అందుకు బడ్జెట్ కూడా పెరిగిందని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరూ సాయం చేయాలని విశాల్ కోరాడు. భవన నిర్మాణ కోసం అవసరమైతే భిక్షాటన కూడా చేస్తానని ఆయన అన్నారు. తాజాగా నటీనటుల సంఘం భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ రూ. కోటి నిధలు మంజూరు చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. పూర్తి చేసేందుకు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటామని ఇప్పటికే నటీనటుల సంఘం సమావేశంలో తీర్మానం చేయగా.. మంత్రి ఉదయనిధి స్టాలిన్ వారికి ఆర్థిక సాయం చేశారు. కోశాధికారి కార్తీకి ఉదయనిధి స్టాలిన్ ఆ చెక్‌ను అందజేశారు. భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని విశాల్ నిశ్చయించుకున్న విషయం తెలిసిందే. ప్రియమైన ఉదయ, మా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిర్మాణ ప్రయత్నాలకు మీ సహకారం అందించడమే కాకుండా ఇలా వీలైనంతలో సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు స్నేహితుడిగా, నిర్మాతగా, నటుడుగా, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ క్రీడా మంత్రిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అని ఆయన తెలిపాడు. Dear Udhaya, I sincerely thank u as a friend, producer, actor and now sports minister of Tamil Nadu govt for your contribution to our South Indian artistes association building efforts and your willingness to finish it as early as possible and also coming forward to help in any… pic.twitter.com/H40q6HAzvo — Vishal (@VishalKOfficial) February 15, 2024 -
స్టార్ హీరో గొప్పమనసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు!
పరుత్తివీరన్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు కార్తీ. సూర్య సోదరుడిగా పలు సూపర్ హిట్ చిత్రా లలో నటించారు. గతేడాది జపాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇప్పటిదాకా 25 సినిమాలు చేసిన భారీ ఎత్తున సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్తీ -25 పేరుతో జరిగిన వేడుకలో సమాజంలో మంచి కార్యక్రమాల కోసం రూ.కోటి వెచ్చించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతే కాదు చెప్పిన విధంగానే పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న 25 మందిని ఎంపిక చేసి వారికి తలా రూ.లక్ష సాయం చేసే కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రారంభించారు. ఇందులో స్వచ్ఛందంగా అనాథ పిల్లలను ఆదుకుంటున్న వారికి, విద్య, వైద్య సేవలను అందిస్తున్న వారికి, దివ్యాంగులను ఆదుకుంటున్న వారికి అంటూ 25 మందిని ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు. వారిలో ఒక్కొక్కరికి రూ.లక్ష నగదు సాయాన్ని అందించారు. అనంతరం కార్తీ మాట్లాడుతూ.. తాను నటుడిగా 25 చిత్రాలను పూర్తి చేసిన సందర్భంగా రూ.కోటి రూపాయలతో సహాయ కార్యక్రమాలను నిర్వహించాలని భావించానన్నారు. అందులో భాగంగా ఇటీవల తన అభిమాన తమ్ముళ్లతో చైన్నెలోని ముఖ్యమైన ప్రాంతాల్లో రోజుకు 1000 మందికి చొప్పున 25 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తమ్ముళ్ల ఆలోచన ప్రకారం వివిధ రంగాల్లో స్వచ్ఛంద సేవలను అందిస్తున్న వారిని ప్రోత్సహించే విధంగా నగదు సాయం చేయాలని తలపెట్టిన కార్యక్రమమని పేర్కొన్నారు. ఆ విధంగా సేవాతత్పరులు 25 మందికి రూ.లక్ష అందించినట్లు చెప్పారు. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలను తన ఉళవన్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా చేపట్టునున్నట్లు కార్తీ తెలిపారు. -
కార్తీ సరసన తెలుగమ్మాయికి హీరోయిన్గా ఛాన్స్
నటి శ్రీదివ్యకు మరో లక్కీచాన్స్ తలుపు తట్టింది. శివకార్తికేయన్‌కు జంటగా వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన తెలుగు నటి శ్రీదివ్య. తెలుగులోనూ నటిగా పరిచయమైన ఈ బ్యూటీ ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకోవడంతో వరుసగా అవకాశాలు వరించాయి. అలా ఈమె ఇక్కడ నటించిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి కూడా. అలాంటిది ఆ మధ్య అవకాశాలు ముఖం చాటేశాయి. చాలా గ్యాప్ తరువాత విక్రమ్‌ప్రభు సరసన నటించిన రైడ్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. అలా మళ్లీ వార్తల్లోకి వచ్చిన శ్రీదివ్య అవకాశాలపై దృష్టిపెట్టింది. మొత్తం మీద తాజాగా లక్కీచాన్స్ ఈ అమ్మడిని వరించింది. కార్తీతో రొమాన్స్ చేయబోతోంది. 96 చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయకి ఎవరన్నది ఇప్పుటి వరకూ ప్రకటించలేదు. తాజాగా గురువారం శ్రీదివ్య పేరును అధికారికంగా యూనిట్ వర్గాలు ప్రకటించాయి. ఈ అమ్మడు ఇంతకుముందు కార్తీ సరసన కాశ్మోరా చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంతో మరోసారి ఈ జంట తెరపై మెరవనున్నారన్నమాట. మొత్తం మీద శ్రీదివ్య మళ్లీ దారిలో పడిందన్నమాట. -
హిట్ డైరెక్టర్ తో కార్తీ.. కొత్త సినిమా క్రేజీ అప్డేట్స్
-
కార్తీ, కమల్ ప్రాజెక్ట్‌లను కాదని కమెడియన్‌తో సినిమా తీస్తున్న స్టార్ డైరెక్టర్
హిట్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన దర్శకుడు హెచ్.వినోద్. అజిత్‌తో వలిమై,తెగింపు చిత్రాలతో పాటు బాలీవుడ్ హిట్ సినిమా అయిన పింక్ చిత్రాన్ని కూడా తమిళ్లో వినోద్ డైరెక్ట్ చేశాడు. కార్తీతో ఖాకీ చిత్రాన్ని తీసి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తదుపరి ప్రాజెక్ట్ కమలహాసన్ కథానాయకుడిగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఓ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిగాయి. ఇది వ్యవసాయ నేపథ్యంలో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం తెరకెక్కించడానికి మరింత సమయం పట్టనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా ఇంతకు ముందు నటుడు కార్తీతో ఖాకీ చిత్రానికి సీక్వెల్ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో నటుడు కార్తీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమలహాసన్ హీరోగా చేసే చిత్రం కూడా వాయిదా పడడంతో హెచ్.వినోద్ మధ్యలో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు యోగిబాబు హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
హిట్ డైరెక్టర్‌తో కార్తీ.. కొత్త సినిమాకు క్రేజీ టైటిల్
'విరుమాన్', 'సర్దార్', 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలతో వరస హిట్లు కొట్టిన కార్తీ.. 'జపాన్'తో ఘోరమైన ప్లాఫ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా సరే దీన్ని పట్టించుకోకుండా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో డైరెక్టర్ నలన్ కుమారస్వామి తీస్తున్న మూవీ ఒకటి కాగా.. '96' ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శత్వం వహిస్తున్న చిత్రం మరొకటి. (ఇదీ చదవండి: ఎక్స్పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా) కార్తీ లేటెస్ట్ మూవీని ఇతడి అన్న సూర్యనే నిర్మిస్తున్నాడు. గతంలో రెండు చిత్రాలు చేశాడు. ఇది హ్యాట్రిక్ మూవీ. ఇకపోతే కార్తీ-ప్రేమ్ కుమార్ కాంబోలో తీస్తున్న సినిమాకు గోవింద్ వసంత సంగీతమందిస్తున్నారు. ఇది తంజావూర్ ప్రజల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమాకు 'దమెయ్యళగన్' టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'గుంటూరు కారం'.. అదే ట్విస్ట్ ఇవ్వబోతున్నారా?) -
సోనీ స్పోర్ట్స్ చిత్రాలకు WWE రింగ్‌లోకి దిగిన హీరో కార్తీ..
భారతదేశంలో డబ్ల్యుడబ్ల్యుఇ అధికారిక ప్రసారకర్త అయిన సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ WWE ఫ్యాన్స్‌కు మరింత దగ్గర కానుంది. డబ్ల్యుడబ్ల్యుఇ అభిమాని, సౌత్ సినీ సూపర్ స్టార్ కార్తీ నటించిన రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను సోనీ స్పోర్ట్స్ ప్రారంభించింది. ఇది దక్షిణాది మార్కెట్లలో డబ్ల్యుడబ్ల్యుఇ చుట్టూ కస్టమైజ్డ్, స్థానికంగా క్యూరేటెడ్ కంటెంట్‌కు దాని నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది. డబ్ల్యుడబ్ల్యుఇ కోసం కార్తి తన గొంతును అందించడమే కాకుండా ఆ కార్యక్రమానికి ప్రచారకార్యకర్తగా కూడా ఉన్నారు. 'హీరోలు vs విలన్లు, అనే టైటిల్‌తో పాటు 'బలం vs విన్యాసాలు' అనే రెండు కాన్సెప్ట్‌లతో ఇవి రానున్నాయి. డబ్ల్యుడబ్ల్యుఇని అభిమానులు సాదరంగా స్వాగతిస్తున్నారు. దీనిని చాలామంది ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. దక్షిణాది మార్కెట్లో సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ WWE ప్రసారాలు మాత్రమే కాకుండా ఇంకా చాలా ఎక్కువ ప్రోగ్రామ్‌లు అందించడానికి కట్టుబడి ఉంది. ఈ చిత్రాలు ప్రేక్షకులు వారి అభిమాన డబ్ల్యుడబ్ల్యుఇ స్టార్లకు దగ్గరగా ఉంచడంలో పాటుపడుతుంది. ప్రతి వారం వారు తీసుకువచ్చే అన్ని మైండ్ బ్లోయింగ్ యాక్షన్లకు అదనంగా ఈ చిత్రాలు ఉన్నాయి. సోనీ నెట్ వర్క్ ఛానల్స్‌లలో WWE లైవ్ ద్వారా ప్రసారం అవుతుంది. ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా డిస్ట్రిబ్యూషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్, స్పోర్ట్స్ బిజినెస్ విభాగాధిపతి రాజేష్ కౌల్ మాట్లాడుతూ, 'డబ్ల్యుడబ్ల్యుఇకి దక్షిణ భారతదేశంలో చాలా బలమైన అభిమానులు ఉన్నారు. ఇక్కడ దీని కోసం భారీగా రీచ్ ఉంది. సుమారు 41% వాటా ఉంది. భారతదేశంలో డబ్ల్యుడబ్ల్యుఇ నివాసంగా, కార్తీతో కలిసి పనిచేయడానికి, ప్రేక్షకులను ప్రతిధ్వనించే తమిళ, తెలుగులలో అసాధారణ కథలను అందించడానికి మా ప్రయత్నాలను కొనసాగించడానికి మేము ఎంతో ఉత్సుకతతో ఉన్నాము. ఈ చిత్రాలు డబ్ల్యుడబ్ల్యుఇ ఆకర్షణను పునఃసమీక్షిస్తాయి. ఇది హై-ఆక్టేన్ విన్యాసాలతో పాటు ఆకర్షణీయమైన పాత్రలతో నడుస్తుంది. మా ప్రేక్షకులకు ఉత్తమమైన, స్వచ్ఛమైన స్పోర్ట్స్ వినోదాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.' అని చెప్పారు. ఈ సందర్భంగా దక్షిణాది సూపర్ స్టార్ కార్తీ మాట్లాడుతూ.. 'డబ్ల్యుడబ్ల్యుఇలో హీరోలు, విలన్ల పాత్రలను పోషించడం ఖచ్చితంగా నాకు మరపురాని అనుభవం. వారిని యాక్షన్ లో చూడటం చాలా ఆనందంగా ఉంది. డబ్ల్యుడబ్ల్యుఇకి భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఒక అభిమానిగా, సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్, డబ్ల్యుడబ్ల్యుఇతో కలిసి పనిచేయడం నాకు థ్రిల్లింగ్ గా ఉంది.' అని తెలిపారు. ఇంతకుముందు భారతీయ సినిమాల్లో హీరోలు, విలన్ల పాత్రలు పోషించిన కార్తీ.. ఆ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో కూడా హీరోలు, విలన్ల శక్తిని పూర్తిగా చూపించాడు. కార్తీ తన అభిరుచి, మచ్చలేని రోల్ ప్లేతో, సౌత్ మార్కెట్లో డబ్ల్యుడబ్ల్యుఇకి అంకితమైన అభిమానుల కోసం సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రచారానికి జీవం పోశాడు. క్రియేటివ్ కాన్సెప్ట్, సినిమాలకు దర్శకత్వం సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ నిర్వహించింది. -
విజయ్‌కాంత్ లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా: కార్తీ
దివంగత నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్‌కు దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం తరపున ఈ నెల 19న సంస్మరణ సభను నిర్వహించనున్నట్లు హీరో, ఆ సంఘం కోశాధికారి కార్తీ తెలిపారు. గత నెల 28న విజయ్‌కాంత్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించగా.. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉండటం కారణంగా సంతాపం తెలుపలేకపోయారు. అందులో హీరో కార్తీ ఒకరు. గురువారం చైన్నెకి చేరుకున్న ఆయన తన తండ్రి శివకుమార్, సోదరుడు సూర్యతో కలిసి స్థానిక కోయంబేడులోని డీఎండీకే పార్టీ కార్యాలయ ఆవరణలో విజయకాంత్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయ్‌కాంత్ మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన్ని కలిసినప్పుడు చాలా ఉత్సాహంగా మాట్లాడారని పేర్కొన్నారు. అధ్యక్షుడు అంటే మార్గదర్శిగా నిలవాలన్నది విజయ్‌కాంత్ నుంచే నేర్చుకున్నట్లు తెలిపారు. కాగా జనవరి 19న తమ సంఘం తరపున విజయ్‌కాంత్‌కు సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. • Exclusive - #Sivakumar Sir, @Karthi_Offl Anna At Captain #Vijayakanthsir 's Home For Grieving The Loss Of Their Loved One | @prabhu_sr #Karthi pic.twitter.com/pzMldSMoez — Yogesh Yogi (@YogeshY16480498) January 5, 2024 చదవండి: ఒక కన్నులో ధైర్యం, మరో కన్నులో కరుణ.. అంటూ బోరున ఏడ్చిన సూర్య -
మా గుండెల్లో ఉంటావ్ అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య
గతేడాది చివర్లో కోలివుడ్ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తమిళనాడును విషాదంలో ముంచెత్తింది. నటుడిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా ప్రజల మనసు గెలుచుకున్న విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. తమ ప్రియతమ సహ నటుడికి నివాళులు అర్పించేందుకు సామాన్య ప్రజలతో పాటు తమిళ సినీ ప్రపంచం కూడా తరలి వచ్చింది. ఆ సమయంలో రాలేని వారు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. ప్రస్తుతం హీరో సూర్య విజయకాంత్‌కు నివాళులు అర్పించిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. విజయకాంత్ స్మారక స్థూపం వద్దకు చేరుకోగానే సూర్య తీవ్రమైన భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఏడుస్తూ ఆ వీడియోలో ఉన్నారు. విజయకాంత్ ఇంటికి చేరుకున్న సూర్య ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్తీ కూడా అక్కడే ఉన్నాడు. విజయకాంత్ మరణించే సమయంలో సూర్య విదేశాల్లో ఉన్నారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక వీడియో ద్వారా విజయకాంత్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. సూర్య కెరీర్ తొలి చిత్రం విజయకాంత్తోనే మొదలైంది. వారిద్దరూ కలిసి నటించిన పెరియన్నలో సూర్య టైటిల్ క్యారెక్టర్‌గా నటించాడు. మొదటి చిన్న పాత్ర అని సూర్యను తీసుకున్నారు.. కానీ సూర్య టాలెంట్‌ను గుర్తించిన విజయకాంత్ అతని రోల్ మరింత సమయం ఉండేలా డైరెక్టర్ ఎస్.ఏ చంద్రశేఖర్‌కు చెప్పారట. అలా అతిధి పాత్రలో అనుకున్న సూర్య ఆ సినిమాలో ప్రధాన పాత్రధారిగా కనిపించారు. అలా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. కానీ ఈ సినిమా సూర్య కెరీయర్లో 4వ చిత్రంగా వచ్చింది. విజయకాంత్ స్మారక స్థూపం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సూర్య ఇలా మాట్లాడారు.. 'ఆయనతో కలిసి పని చేస్తూ, మాట్లాడి, తింటూ గడిపిన రోజులు ఎప్పటికీ మరువలేను.. సాయం అడిగిన ఎవ్వరికీ నో చెప్పలేదు. లక్షలాది మందికి సాయం చేసి వారందరికీ పురట్చి కలైంజర్గా మారిన నా సోదరుడు విజయకాంత్ మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఇక లేరనే బాధ నాలో ఎప్పటికీ ఉంటుంది. ఒక కన్నులో ధైర్యం, మరో కన్ను కరుణతో జీవించిన అరుదైన కళాకారుడు. ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికి సాయం చేశాడు. పిరాట్చి కలైంజర్ మా గుండెల్లో కెప్టెన్ అయ్యాడు. అన్న విజయకాంత్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని సూర్య సంతాపం తెలిపారు. View this post on Instagram A post shared by Galatta Media (@galattadotcom) View this post on Instagram A post shared by Galatta Media (@galattadotcom) -
సీక్వెల్స్ పై ఫోకస్ పెట్టిన కార్తీ
-
Actor Suriya Family Rare Photos: హీరో సూర్య కుటుంబాన్ని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)
-
స్టార్ హీరో కొత్త సినిమా.. ఏనుగు స్పెషల్ క్యారెక్టర్
తమిళ స్టార్ కార్తీ.. ఈ మధ్యే 'జపాన్' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ హిట్ కొట్టలేకపోయాడు. ప్రస్తుతం ఓ రెండు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇందులో ఓ దానికి '96' మూవీ ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్. ఈ ప్రాజెక్టుని కార్తీ అన్న, స్టార్ హీరో సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నాడు. (ఇదీ చదవండి: బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?) ఇటీవల షూటింగ్ మొదలవగా, శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమాలో ఓ ఏనుగు కీలకపాత్రలో నటిస్తోందట. ఇందుకోసం కేరళ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఓ గజరాజుని ఇక్కడికి రప్పించారట. దీని సంరక్షణ కోసం ఓ వైద్యుడు ఒక మావటితో పాటు ఏకంగా 10 మంది వెంట వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. (ఇదీ చదవండి: కీరవాణి ఇంటి కోడలిగా మురళీ మోహన్ మనవరాలు..) -
ఖాకి చిత్రానికి సీక్వెల్ రెడీ.. !
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో ఇటీవల హిట్ చిత్రాలకు సీక్వెల్స్ రూపొందించడంపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈ తరహా చిత్రాలు అధికం అవుతున్నాయి. అలా ఇటీవల కమలహాసన్ నటించిన విక్రమ్, పొన్నియిన్‌సెల్వన్ చిత్రానికి సీక్వెల్‌తో పాటు జిగర్ తండ మూవీకి కూడా సీక్వెల్‌గా 'జిగర్ తండ డబుల ఎక్స్' చిత్రం మంచి విజయాన్ని సాధించాయి. కాగా నటుడు కార్తీ హీరోగా నటించిన ఖైదీ, సర్ధార్ చిత్రాలకు సీక్వెల్స్ రూపొందించనున్నట్లు ఆ చిత్రాలు దర్శక, నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. తాజాగా నటుడు కార్తీ మరో సీక్వెల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈయన ఇంతకు ముందు హెచ్. వినోద్ దర్శకత్వంలో 'ఖాకి' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. నటి రకుల్ ప్రీత్‌సింగ్ నాయకిగా నటించిన ఈ చిత్రం 2018లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కాగా ఐదేళ్ల తరువాత కార్తీ హెచ్. వినోద్ కాంబోలో ఖాకి చితత్రానికి సీక్వెల్‌ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. కార్తీ నటించిన జపాన్ చిత్రం ఇటీవలే తెరపై వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన వాద్దియారే (టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఖైదీ–2, సర్ధార్ –2 చిత్రాలు చేయాల్సి ఉంది. ఇదేవిధంగా హెచ్ వినోద్ ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తరువాత కార్తీ హీరోగా 'ఖాకి' సీక్వెల్‌పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
మిచౌంగ్ ఎఫెక్ట్.. గొప్ప మనసు చాటుకున్న స్టార్ హీరోలు!
'మిచౌంగ్' తుపాను వల్ల చెన్నై వణికిపోతుంది. గత నెట 27న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. నిన్న తెల్లవారుజాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు పడుతున్నాయి. మధ్య-పశ్చిమ బంగాళాఖాతంలో చెన్నైకి తూర్పు-ఈశాన్య దిశగా 100 మీటర్ల దూరంలో దీని ప్రభావం ఎక్కవగా ఉంది. ఇదీ నేడు తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో తుపాను ప్రభావం మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. 'మిచౌంగ్' తుపాను ప్రభావంతో చెన్నైలో నివసించే సాదారణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురౌతున్నారు. నగరం మొత్తం కూడా జలమయమైంది. టి.నగర్ టన్నెల్, అరంగనాథన్ టన్నెల్, వడపళని మురుగన్ టెంపుల్ చెరువు, అన్నానగర్, కోడంబాక్కం, నుంగంబాక్కం వంటి వివిధ ప్రాంతాలు చెరువులుగా మారాయి. దీంతో కట్టుబట్టలతో వారందరూ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. వారికి సరైన ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వసతిని ప్రభుత్వం కల్పిస్తోంది. అక్కడి ప్రభుత్వం కూడా యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. అయితే ఆహారం విషయంలో సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తక్షణ సాయం క్రింద వారు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. తమ అభిమాన సంఘాల ద్వారా బాధిత ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. చిన్న పిల్లలకు పాలు , మెడిసిన్స్ అందిస్తున్నారు. పరిస్థితి చక్కబడకపోతే మరింత సాయం చేసేందేకు తాము వెనుకాడమని కార్తి తెలిపాడు. ఇప్పటికే మరో హీరో విశాల్ కూడా రోడ్డుపైకి వచ్చి తన వంతుగా ప్రజల కోసం సాయం చేస్తున్నాడు. -
కార్తి హీరోగా మొదటి సినిమా.. వివాదంపై సముద్రఖని ఆగ్రహం!
కోలీవుడ్‌లో కొంతకాలంగా వివాదాల పర్వం నడుస్తోంది. ఇప్పటికే గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ధృవనచ్చితిరం సినిమా రిలీజ్ విషయంలోనూ అదే జరిగింది. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోజే అభిమానులకు షాక్ తగిలింది. ఈ సినిమా సమస్య కాస్తా కోర్టుకు చేరడంతో మరోసారి వాయిదా పడింది. ఇదిలా ఉండగా తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి ఏకంగా 16 ఏళ్ల క్రిత రిలీజైన సినిమా విషయంలో ఇప్పుడు వివాదం మొదలైంది. అదేంటో తెలుసుకుందాం. కోలీవుడ్ నటుడు, నిర్మాత సముద్రఖని మరో నిర్మాత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కార్తి నటించిన చిత్రం ‘పరుత్తివీరన్’. ఈ చిత్రం ద్వారానే కార్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా వివాదంపై సముద్రఖని మండిపడ్డారు. అయితే ఈ సినిమా విషయంలో కొన్నిరోజులుగా దర్శకుడు ఆమిర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పరుత్తివీరన్ దర్శకుడికి మద్దతుగా సముద్రఖని ఓ లేఖ విడుదల చేశారు. సముద్ర ఖని లేఖలో ప్రస్తావిస్తూ.. 'పరుత్తివీరన్‌లో నేను కూడా నటించా. ఆ సినిమా టైంలో డైరెక్టర్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. నిర్మాతగా ఒక్కరోజు కూడా జ్ఞానవేల్ సెట్‌కు రాలేదు. సినిమా బడ్జెట్ విషయంలోనూ డైరెక్టర్‌కు సహకరించలేదు. నా వద్ద డబ్బుల్లేవంటూ షూటింగ్ మధ్యలోనే చేతులెత్తేశావు. బంధువుల దగ్గర నుంచి అప్పులు చేసి మరీ ఆమిర్ షూటింగ్ పూర్తి చేశాడు. దీనికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఎంతో కష్టపడి సినిమా తీస్తే పేరు మాత్రం నువ్వు పొందావు. ఈ రోజు నువ్వు అమిర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నావు. ఈ పద్ధతితేం బాగాలేదు. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు.' అని సముద్రఖని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ లేఖ కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఇటీవలే కార్తి హీరోగా నటించిన చిత్రం ‘జపాన్’. ఈ సినిమాకు జ్ఞానవేల్ రాజా దీనికి నిర్మాతగా వ్యవహరించారు. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కార్తితో ఇప్పటివరకూ సినిమాలు చేసిన దర్శకులందరూ హాజరయ్యారు. అయితే ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఆమిర్ మాత్రం ఈవెంట్‌కు రాలేదు. దీనిపై ఆయన ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కార్తి జపాన్ మూవీ ఈవెంట్‌కు నాకు ఆహ్వానం అందలేదు. సూర్య - కార్తితో నాకు రిలేషన్స్ అంత బాగాలేవు.. జ్ఞానవేల్ వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అమిర్ అన్నారు. అయితే అమిర్ వ్యాఖ్యలపై జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. 'అమిర్‌కు ఆహ్వానం పంపించాం. పరుత్తివీరన్ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు నాతో ఖర్చుపెట్టించాడు. సరైన లెక్కలు చెప్పకుండా డబ్బులు దండుకున్నాడు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దీంతో వీరిద్దరి వివాదం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. pic.twitter.com/JYfQNIgfcw — P.samuthirakani (@thondankani) November 25, 2023 -
కార్తి సినిమాలో హీరోయిన్గా సీరియల్ నటి
కోలీవుడ్ హీరో కార్తి ఇటీవల నటించిన జపాన్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం ఆయన వరుసగా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. అందులో కార్తి 26 చిత్రం ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లింది. ఇందులో ఆయనకు జోడీగా నటి కీర్తిసురేష్ నటిస్తున్నారు. కార్తి 27వ చిత్రం కూడా లైన్లో ఉంది. దీనికి 96 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మరో ప్రధాన పాత్రలో అరవింద్‌స్వామి నటిస్తున్నారు. ఇది కుటుంబ నేపథ్యంలో సాగే అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా ఇందులో నటుడు కార్తికి హీరోయిన్ ఉండదనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయనకు జోడీ ఉంటుందని సమాచారం. ఇంతకుముందు ఒక కన్నడ చిత్రంలో కథానాయకిగా నటించిన స్వాతి కొండెకు ఈ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ఆ సినిమా తరువాత అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై ఆమె దృష్టి సారించింది. తీరమాన రోజావే అనే సీరియల్లో ప్రధాన పాత్రతో మెప్పిస్తుంది. ఈ సీరియల్‌తో స్వాతి కొండె బాగా పాపులర్ అయ్యింది. అలా ఇప్పుడు మళ్లీ హీరోయిన్గా కార్తితో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు టాక్. -
ఓటీటీకి స్టార్ హీరో మూవీ.. నెల రోజుల్లోపే!
కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దీపావళి సందర్భంగా నవంబర్ 10న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. తమిళనాడులోని ఒక దొంగ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. విడుదలై నెలరోజులు కాకముందే ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1 న లేదా 8న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలోనే ప్రకటన చేయనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అసలు కథేంటంటే.. జపాన్ ముని అలియాస్ జపాన్(కార్తి) ఓ గజదొంగ. గోడలకు కన్నం వేసి దొంగతనం చేయడం.. గుర్తుగా అక్కడ ఓ బంగారు కాయిన్‌ను పెట్టి వెల్లడం అతని స్పెషాలిటీ. ఓ సారి హైదరాబాద్‌లోని రాయల్ అనే నగల దుకాణం నుంచి రూ. 200 కోట్ల విలువ చేసే గోల్డ్‌ని కొట్టేస్తారు. ఆ గోల్డ్ షాపులో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి(కేఎస్ రవికుమార్) షేర్ కూడా ఉండడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఈ కేసు విచారణకై స్పెషల్ ఆఫీసర్స్ భవాని(విజయ్ మిల్టన్), శ్రీధర్(సునీల్) రంగంలోకి దిగుతారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ దొంగతనం ఎవరు చేశారు? జపాన్ దొంగగా మారడానికి గల కారణం ఏంటి? దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? శ్రీధర్‌తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు జపాన్‌కి ఎందుకు సహాయం చేశారు? పోలీసులకు చెందిన రహస్యాలు జపాన్ దగ్గర ఏం ఉన్నాయి? చివరకు జపాన్ జీవితం ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే జపాన్ సినిమా చూడాల్సిందే. -
హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమా చేస్తున్న విజయ్ సేతుపతి
కోలీవుడ్ నటుడు విజయ్‌సేతుపతి కెరీర్లో చాలా ముఖ్యమైన చిత్రం సూదు కవ్వుమ్. తమిళ్ విడుదలైన ఈ సినిమా ఆయన తొలి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. దీనిని దర్శకుడు నలన్ కుమారసామి తెరకెక్కించాడు. ఆ తరువాత వీరి కాంబినేషన్లో రూపొందిన కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రం కూడా కోలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించింది. దీంతో విజయ్‌సేతుపతి, దర్శకుడు నలన్ కుమార్స్వామిల చిత్రం అంటే చాలా అంచనాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాంటి హిట్ కాంబినేషన్ రిపీట్ కానున్నదని తాజా సమాచారం అందుతుంది. దర్శకుడు నలన్ కుమారస్వామి ప్రస్తుతం నటుడు కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనికి టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కార్తీ నటిస్తున్న 26వ చిత్రం. ఇందులో ఆయన ఎంజీఆర్ అభిమానిగా నటిస్తున్నట్టు తెలిసింది. నటి కీర్తిసురేష్ నాయకిగా నటిస్తున్న ఈ క్రేజీ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియాలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదే సంస్థ తర్వాత విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నలన్ కుమారస్వామి దర్శకత్వంలో చిత్రాన్ని చేయనున్న ట్లు సమాచారం. దీనికి సంబంధించిన సింగిల్ లైన్ స్టోరీ కూడా సిద్ధమైనట్లు తెలిసింది. ఇందులో మరో ముగ్గురు స్టార్ నటులు నటించే అవకాశం వున్నట్లు సమాచారం. ప్రస్తుతం కార్తి చిత్రం షూటింగ్ పూర్తి అయిన తరువాత విజయ్‌సేతుపతి హీరోగా నటించే మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం వున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. వారిద్దరి గత చిత్రాలు తమిళం వరకే పరిమితం అయ్యాయి. కానీ ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయనున్నారు. -
కార్తి హిట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్
తమిళంలో కెరీర్ ప్రారంభించిన కార్తి.. కొన్నాళ్లకే టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో యుగానికొక్కడు, నాపేరు శివ,ఊపిరి,సుల్తాన్,సర్దార్, ఖాకీ, ఖైదీ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగువారికి ఆయన ఎంతో దగ్గరయ్యాడు. తాజాగా కార్తి కెరియర్లో 25వ సినిమా అయిన జపాన్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో తర్వాతి ప్రాజెక్ట్‌ను ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు. 2017లో కార్తి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచిన ఖాకి చిత్రానికి సీక్వెల్‌ను దర్శకుడు ప్రకటించారు. 1995-2006 మధ్యకాలంలో జరిగిన 'ఆపరేషన్ బవారియా' మిషన్ ఆధారంగా ఖాకి సినిమాను తెరకెక్కించారు. తమిళనాడు పోలీసుల నిజ జీవిత ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఖాకీ సినిమా స్క్రీన్ ప్లే ఎడ్జ్ ఆఫ్ యువర్-సీట్ అనేలా ఉంటుంది. సినీ విమర్శకుల నుంచి కూడా ఖాకీ మూవీపై ప్రశంసలు వచ్చాయి. ఖాకి సినిమాకు దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రానికి సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. డైరెక్టర్ వినోద్ ప్రస్తుతం కమల్ హాసన్ KH233 పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత కార్తితో ఖాకి సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అక్కడి సినీ జర్నలిస్ట్‌లతో వినోద్ తెలిపారట. ఈ సినిమా సీక్వెల్ కోసం ఇప్పటికే కథ కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. దానిని కార్తికి కూడా చెప్పాడని తెలుస్తోంది. కమల్ హాసన్‌తో తన ప్రస్తుత చిత్రం KH233 పూర్తి చేసిన తర్వాత మాత్రమే తాను ఖాకి- 2 కథను పూర్తి చేస్తానని హెచ్ వినోద్ తెలియజేశాడట. ఈ ఏడాదిలో అజిత్‌తో తెగింపు సినిమాను వినోద్ తెరకెక్కించి హిట్ కొట్టాడు. As per Vikatan,#TheeranAdhigaramOndru Sequel Oncards 🔥 - HVinoth has written the one liner and narrated to #Karthi🤝 - After completing #KH233, HVinoth will complete the entire story of TheeranAdhigaram-2 & going to be filmed soon🎬⌛ - Part 1 has been one of the best cop… pic.twitter.com/SEKagwzSkm — AmuthaBharathi (@CinemaWithAB) November 17, 2023 -
జపాన్ డిజాస్టర్‌తో కీలక నిర్ణయం తీసుకున్న కార్తి
కోలివుడ్లో కార్తి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే గుర్తింపు ఉంది. తాజాగా ఆయన నటించిన జపాన్ సినిమా దీపావళి కానుకగా విడుదలైంది. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. స్క్రీన్‌ప్లే, మేకింగ్ విషయంలో సినిమా పూర్తిగా ఫెయిల్ అయిందని టాక్ రావడం వల్ల జపాన్‌కు వ్యతిరేక రివ్యూలు వచ్చాయి. దీంతో జపాన్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో కార్తీ కీలక నిర్ణయం తీసుకుని తదుపరి దశకు సిద్ధమయ్యాడు. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు) నవంబర్ 10వ తేదీన విడుదలైన జపాన్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ. 23.34 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 12.15 కోట్లు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. సుమారు రూ. 27 కోట్లకు పైగా నష్టం రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కార్తి కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా జపాన్ నిలిచింది. కార్తికి 25వ సినిమాగా జపాన్ విడుదలైంది. మొదటి ఆట నుంచే నెగిటివ్‌గా ట్రోల్స్ రావడంతో కార్తీ కూడా కీలక నిర్ణయం తీసుకుని అందుకు తగ్గట్టుగానే తన 27వ సినిమా షూటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కోలివుడ్ బిగ్గెస్ట్ హిట్ సినిమా అయిన '96'తో ఫేమస్ అయిన డైరెక్టర్ ప్రేమ్‌కుమార్‌తో సినిమా షూటింగ్‌ను నేడు ప్రారంభించనున్నాడు. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డి సంస్థ నిర్మిస్తోంది. ఈ సందర్భంలో, కార్తీ 27 షూటింగ్ నేటి నుంచి కుంభకోణంలో ప్రారంభమవుతుంది. ఇందులో కార్తీతో పాటు అరవింద్ సామీ కూడా నటించనున్నాడని సమాచారం. ఈరోజు ప్రారంభం కానున్న షూటింగ్ కూడా శరవేగంగా జరగనుందని అంటున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో కార్తీ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరోవైపు నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ 26లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్న కార్తీ.. జపాన్‌తో వచ్చిన డ్యామేజిని కంట్రోల్ చేసే పనిలో కార్తి ఉన్నాడని తెలుస్తోంది. -
Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ
టైటిల్: జపాన్ నటీనటులు: కార్తి, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు నిర్మాణ సంస్థ: : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు దర్శకత్వం: రాజు మురుగన్ సంగీతం: జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫి: ఎస్. రవి వర్మన్ ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్ విడుదల తేది: నవంబర్ 10, 2023 కథేంటంటే.. జపాన్ ముని అలియాస్ జపాన్(కార్తి) ఓ గజదొంగ. గోడలకు కన్నం వేసి దొంగతనం చేయడం.. గుర్తుగా అక్కడ ఓ బంగారు కాయిన్‌ను పెట్టి వెల్లడం అతని స్పెషాలిటీ. ఓ సారి హైదరాబాద్‌లోని రాయల్ అనే నగల దుకాణం నుంచి రూ. 200 కోట్ల విలువ చేసే గోల్డ్‌ని కొట్టేస్తారు. ఆ గోల్డ్ షాపులో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి(కేఎస్ రవికుమార్) షేర్ కూడా ఉండడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఈ కేసు విచారణకై స్పెషల్ ఆఫీసర్స్ భవాని(విజయ్ మిల్టన్), శ్రీధర్(సునీల్) రంగంలోకి దిగుతారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ దొంగతనం ఎవరు చేశారు? జపాన్ దొంగగా మారడానికి గల కారణం ఏంటి? దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? శ్రీధర్‌తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు జపాన్‌కి ఎందుకు సహాయం చేశారు? పోలీసులకు చెందిన రహస్యాలు జపాన్ దగ్గర ఏం ఉన్నాయి? చివరకు జపాన్ జీవితం ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘జపాన్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కార్తి నటించిన 25వ సినిమా కావడంతో ‘జపాన్’పై ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రం కచ్చితంగా ఢిపరెంట్‌గా ఉంటుందని భావించారు. అయితే సినిమా మాత్రం ఆ రేంజ్లో లేదనే చెప్పాలి. ఓ భారీ నగల దుకాణంలో దొంగతనం సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఈ కేసును ఛేదించడానికి భవానీ, శ్రీధర్ పాత్రలు రావడం..వారికి సంబంధించిన సీన్స్ చూసి ఇది సీరియస్‌గా సాగే పోలీసు-దొంగ కథలా అనిపిస్తుంది. అయితే హీరో ఎంట్రీ తర్వాత మాత్రం ఇది క్యాట్- మౌస్ తరహాలో సాగే యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది. దొంగతనం చేసిన డబ్బులతో హీరోగా సినిమాలు చేసే వ్యక్తిగా కార్తిని పరిచయం చేశారు. కార్తి డైలాగ్ డెలివరీ, గెటప్ రెండూ డిఫరెంట్‌గా ఉండడంతో కథపై ఆసక్త పెరుగుతుంది. ఒక పక్క జపాన్ స్టోరీ నడిపిస్తూనే.. మరోపక్క ఇన్వెస్టిగేషన్ పేరుతో సామాన్యుడు గంగాధర్‌ని పోలీసులు పెట్టే టార్చర్‌ని చూపిస్తూ.. ఏదో జరుగబోతుందనే ఆసక్తిని కలిగించారు. ఊహించని ట్విస్టులేవో ఉంటాయనుకున్న ప్రేక్షకుడి అక్కడ నిరాశే కలుగుతుంది. హీరోకి ఎయిడ్స్ ఉందని స్టార్టింగ్‌లోనే చెప్పించి.. ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించారు. కానీ దానికి సరైన ముగింపు ఇవ్వలేదు. వెన్నుపోటు సన్నివేశాలను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ సంజుతో జపాన్ లవ్‌ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ కొన్ని చోట్ల మాత్రమే నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా కథ అంటూ తను దొంగగా ఎందుకు మారాడో చెప్పే సీన్ ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎమోషనల్‌కు గురిచేస్తాయి. ఎవరెలా చేశారంటే.. కార్తి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు. జపాన్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన గెటప్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటాయి. సినిమా కోసం కార్తి పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్ సంజు పాత్రకు అను ఇమ్మాన్యుయేల్ ఉన్నంతలో న్యాయం చేసింది. ఆ పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. పోలీసు అధికారి శ్రీధర్‌గా సునీల్ కొన్ని చోట్ల భయపెట్టాడు..మరికొన్ని చోట్ల తేలిపోయాడు. అయితే ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. భవాని పాత్రకు విజయ్ మిల్డన్ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. జపాన్ కోసం పోలీసులు అరెస్ట్ చేసిన సామాన్యుడు గంగాధర్ పాత్రను పోషించిన వ్యక్తి నటన బాగుంది. కెఎస్ రవికుమార్‌తో పాటు మిగిలి నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం పర్వాలేదు. పాటలు ఆకట్టుకోలేదు కానీ నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సిందే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Japan Twitter Review : ‘జపాన్’ ట్విటర్ రివ్యూ
విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తి. కథలో కొత్తదనం..పాత్రలో వైవిధ్యం ఉండే చిత్రాల్లోనే నటిస్తాడు. అందుకే నటుడిగా కెరీర్ ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా..ఇప్పటికి కేవలం 24 చిత్రాలను మాత్రమే పూర్తి చేశాడు. ఆయన హీరోగా నటించిన 25వ చిత్రం ‘జపాన్’. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్లో కూడా ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ‘జపాన్’పై ఇక్కడ కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా నేడు(నవంబర్ 10) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. జపాన్ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ‘జపాన్’ చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ చిత్రం బాగుందని కొంతమంది చెబుతుంటే... మరికొంత మంది బాగోలేదని కామెంట్ చేస్తున్నారు. జపాన్ #Japan A well executed heist movie from #Rajmurugan#Karthi just nailed it in this character..🥰🥰 An above average first half followed by good top second half ..🤝🤝 Bgm by #GVPrakash works 💥💥 Vishuals 🔥🔥#Japanmovie #JapanReview#Karthi #AnuEmmanuel#Rajmurugan pic.twitter.com/O6AHSPRDix — Neha Upa (@NehaUpa19061714) November 9, 2023 హీస్ట్ మూవీ జపాన్ను దర్శకుడు రాజ్ మురుగన్ అద్బుతంగా తీశాడు. ఫస్టాఫ్ యావరేజ్‌గా, సెకండాఫ్ టాప్ లేపింది. కార్తి తన పాత్రలో ఒదిగిపోయాడు. జీవీ ప్రకాశ్ సంగీతం సూపర్‌గా ఉంది. సినిమాటోగ్రఫి అదరగొట్టింది అని నెటిజన్ ట్వీట్ చేశాడు. Cringe பய #karthi ன்.. மொக்க படம் #Japan Utter flop ஆக மனதார வாழ்த்துகிறேன்..#JapanMovie #JapanFromTomorrow #JapanDiwali #JigarthandaDoubleX #JigarthandaDoubleXfromNov10 pic.twitter.com/uqpXgpfnhM — Manikandan (@Mani20081996) November 9, 2023 జపాన్ క్రింజ్‌లా ఉందని, అట్టర్ ఫ్లాప్ మూవీ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #JapanReview#Japan Its a story of a heist & a cat-mouse chase action comedy entertainer by mixed with romance, emotions #Karthi just show his best in the epic entertainer Dynamic scenes are filmed by extremely well blended with an epic bgm by #GVPrakash My Rating 🌟4/5 pic.twitter.com/EKxCl8HzQY — Haritha (@Pt54936312) November 9, 2023 జపాన్ సినిమా హీస్ట్, క్యాట్- మౌస్ తరహాలో సాగే యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో రొమాన్స్, ఎమోషన్స్ మిక్స్ చేశారు. కార్తీ ఫెర్ఫార్మెన్స్‌తో ఎపిక్ ఎంటర్టైనర్గా మారింది. డైరెక్టర్ సీన్లను అద్బుతంగా తీశాడు. జీవీ ప్రకాశ్ మూవీ ఈ సినిమా హైలెట్ అంటూ 4 రేటింగ్ ఇచ్చారు ఓ నెటిజన్. #JapanReview In & out full karthi show.. Really enjoyed the movie.. The character played by karthi is more interesting.. Some of the sickest action scenes I've ever scene.. Also loved the vishuals and bgm Sure shot entertainer#Japan #Karthi #Anuimmanel #Rajmurugan pic.twitter.com/Sse2Rcw1RN — Amal babu (@amalbabu1322) November 9, 2023 #Japan#JapanReview#Karthi25 An engaging commercial entertainer.. Good screenplay with some twist & turns. Superb music and Bgm by #GVP.. Top notch filmography from #Ravivarman Written & directed by #Rajmurugan pic.twitter.com/L48ZKLZpSU — Muhammed (@Muhamme60625316) November 9, 2023 #JapanReview Nice movie like it & interesting Top beautiful vishual treat with awesome bgm and one another best entertainer from #karthi Worth to watch#Japan#Rajmurukan@Karthi_Offl pic.twitter.com/8gzwoRMNLL — soosy (@SSrkgirl) November 9, 2023 #JapanReview If there karthi in a movie, entertainment is sure shot guaranteed.. He just stole the whole movie with his native mannerisms.. First half : superb 👌👌 Second half : 🥵💥 One of the best theaterical experience.. Rating 4 out of 5 ⭐️⭐️⭐️⭐️ pic.twitter.com/MSoiN51n6E — Jyothi Ps (@ps_jyothi) November 9, 2023 -
అవార్డుల కంటే ప్రేక్షకుల గుర్తింపే ముఖ్యం
‘‘అవార్డుల కోసం సినిమాలు తీయాలనే ఆలోచన నాకు ఉండదు. ప్రేక్షకులు ఇచ్చే గుర్తింపు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత చాలా ముఖ్యం. అవార్డులు వస్తే అదనపు బోనస్‌గా భావిస్తాను. ప్రేక్షకుల ప్రేమ, అభిమానంతో పాటు ‘జోకర్’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ‘జపాన్’ కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని దర్శకుడు రాజు మురుగన్ అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా రాజు మురుగన్ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి రావడానికి చార్లీ చాప్లిన్‌గారే స్ఫూర్తి. మూకీ చిత్రాలతోనే ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలను రేకెత్తించారు ఆయన. ఇక కార్తీగారిని దృష్టిలో పెట్టుకునే ‘జపాన్’ కథ రాశాను. కార్తీ, నిర్మాతలు ప్రభు, ప్రకాశ్‌గార్ల సహకారంతోనే ‘జపాన్’ చిత్రం ఇంత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఒక దర్శకుడిగా చిన్నా పెద్దా అని కాకుండా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
Karthi Stills: కార్తి ‘జపాన్’ మూవీ స్టిల్స్
-
దీపావళి నాకు కలిసొచ్చిన పండగ.. జపాన్ విజయం ఖాయం: కార్తీ
క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాముఖ్యతనిచ్చే నటుడు కార్తీ. అందుకే నటుడిగా పరిచయం అయ్యి సుమారు 18 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పుటికి 25 చిత్రాలే చేశారు. అయితే ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఈయన ఇటీవల నటించిన విరుమాన్, సర్థార్, పొన్నియిన్‌సెల్వన్ పార్టు 1, 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించారు. కాగా కార్తీ తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం జపాన్. ఇది ఈయన 25వ చిత్రం కావడం విశేషం. రాజుమురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మించిన ఈ భారీ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని ,రవివర్మన్ ఛాయాగ్రహణను అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి పండగ సందర్భంగా శుక్రవారం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటుడు కార్తీ చైన్నెలో మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ జపాన్ చిత్రం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. దర్శకుడు రాజుమురుగన్ కథ,సంభాషణలు తనకు చాలా నచ్చాయన్నారు. జపాన్ చిత్రంలో కార్తీ కనిపించడని, పాత్రే కనిపిస్తుందని అన్నారు. ఇంతకు ముందు కాశ్మోరా చిత్రంలో భిన్నమైన పాత్రను పోషించినా జపాన్‌లో పూర్తిగా వైవిధ్యభరిత కథా పాత్రను చేసినట్లు చెప్పారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతం, రవివర్మన్ ఛాయాగ్రహణ చిత్రానికి పక్కా బలంగా ఉంటాయన్నారు. నటుడు సునీల్, విజయ్ మిల్టన్ లతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇక దీపావళి తనకు కలిసొచ్చిన పండగ అని, ఈ పండగ సందర్భంగా జపాన్ చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉందని చెప్పారు. జపాన్ చిత్ర విజయంపై చాలా నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని కార్తీ వ్యక్తం చేశారు. -
'జపాన్'లో చాలా సర్ ప్రైజ్ రోల్ చేశాను: అను ఇమ్మాన్యుయేల్.
హీరో కార్తిని పొగడ్తలతో ముంచేస్తోంది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. అతను గొప్ప నటుడు మాత్రమే కాదని,ఆఫ్ స్క్రీన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని అంటోంది. కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘జపాన్’. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్.. 'దీపావళి' కానుకగా నవంబర్ 10న విడుదత కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మీడియాతో ముచ్చటిస్తూ.. హీరో కార్తి గురించి, జపాన్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ► కార్తి అద్భుతమైన నటుడు. తను టీం ప్లేయర్. ఏదైనా సన్నివేశం చేసే ముందు చర్చించుకునే వాళ్ళం. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఆయన చాలా కేర్ తీసుకుంటారు. చాలా సపోర్ట్ చేస్తారు. కార్తి గారు గ్రేట్ కో స్టార్. ఆఫ్ స్క్రీన్ అందరితో చాలా చక్కగా మాట్లాడుతాడు. స్టార్లా కాకుండా సాధారణ వ్యక్తిగా ఆయన ప్రవర్తన ఉంటుంది. ► 'జపాన్'ట్రైలర్ చూస్తేనే ఇదొక యూనిక్ సినిమా అని అర్ధమైపోతుంది. కార్తి గారే కాదు ఇలాంటి పాత్రని గతంలో ఎవరూ చేయలేదు. జపాన్ దీపావళికి పర్ఫెక్ట్ ఫిల్మ్. ఇది గొప్ప థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం. తప్పకుండా అందరూ థియేటర్స్ లోనే చూడాలి. జపాన్ చాలా క్రేజీగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. ► ఈ చిత్రంలో నా పాత్ర ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంటుంది. దాని గురించి ఇప్పుడే ఎక్కువగా రివిల్ చేయకూడదు. ఇందులో నటిగా కనిపిస్తాను. నా పాత్ర జపాన్ జీవితంలో కీలకంగా ఉంటుంది. కార్తి, నా పాత్రకు మధ్య చాలా ఆసక్తికరమైన ట్రాక్ ఉంటుంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది. ► రాజు మురుగన్ చాలా వైవిధ్యమైన దర్శకుడు. తన ప్రతి సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. జపాన్ కథ, పాత్ర చాలా యూనిక్. ఇలాంటి కథని గతంలో వినలేదు. ఇలాంటి సినిమాని చూడడానికి ఆడియన్ గా కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ►నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలు చేయాలని ఉంటుంది. అలాంటి మంచి పాత్రలు, కథలు రావాలని కోరుకుంటాను