'జపాన్'లో చాలా సర్ ప్రైజ్ రోల్ చేశాను: అను ఇమ్మాన్యుయేల్‌. | Anu Emmanuel Talk About Hero Karthi And Japan Movie | Sakshi
Sakshi News home page

Anu Emmanuel: కార్తి గ్రేట్‌ కో స్టార్‌.. ఆఫ్‌ స్క్రీన్‌ అలా ప్రవర్తిస్తాడు

Published Tue, Nov 7 2023 6:07 PM | Last Updated on Tue, Nov 7 2023 6:24 PM

Anu Emmanuel Talk About Hero Karthi And Japan Movie - Sakshi

హీరో కా​ర్తిని పొగడ్తలతో ముంచేస్తోంది హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌. అతను గొప్ప నటుడు మాత్రమే కాదని,ఆఫ్ స్క్రీన్ గ్రేట్‌  హ్యూమన్ బీయింగ్ అని అంటోంది.  కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘జపాన్‌’. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్.. 'దీపావళి' కానుకగా నవంబర్ 10న విడుదత కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్  మీడియాతో ముచ్చటిస్తూ.. హీరో కార్తి గురించి, జపాన్‌ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.  

కార్తి  అద్భుతమైన నటుడు. తను టీం ప్లేయర్. ఏదైనా సన్నివేశం చేసే ముందు చర్చించుకునే వాళ్ళం. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఆయన చాలా కేర్ తీసుకుంటారు. చాలా సపోర్ట్ చేస్తారు. కార్తి గారు గ్రేట్ కో స్టార్.  ఆఫ్‌ స్క్రీన్‌ అందరితో చాలా చక్కగా మాట్లాడుతాడు. స్టార్‌లా కాకుండా సాధారణ వ్యక్తిగా ఆయన ప్రవర్తన ఉంటుంది. 

► 'జపాన్'ట్రైలర్ చూస్తేనే ఇదొక యూనిక్ సినిమా అని అర్ధమైపోతుంది. కార్తి గారే కాదు ఇలాంటి పాత్రని గతంలో ఎవరూ చేయలేదు. జపాన్ దీపావళికి పర్ఫెక్ట్ ఫిల్మ్. ఇది గొప్ప థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం. తప్పకుండా అందరూ థియేటర్స్ లోనే చూడాలి. జపాన్ చాలా క్రేజీగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు.

► ఈ చిత్రంలో నా పాత్ర ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా  ఉంటుంది. దాని  గురించి ఇప్పుడే ఎక్కువగా రివిల్ చేయకూడదు. ఇందులో నటిగా కనిపిస్తాను. నా పాత్ర జపాన్ జీవితంలో కీలకంగా ఉంటుంది. కార్తి, నా పాత్రకు మధ్య చాలా ఆసక్తికరమైన ట్రాక్ ఉంటుంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది.

► రాజు మురుగన్ చాలా వైవిధ్యమైన దర్శకుడు. తన ప్రతి సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. జపాన్ కథ, పాత్ర చాలా యూనిక్. ఇలాంటి కథని గతంలో వినలేదు. ఇలాంటి సినిమాని చూడడానికి ఆడియన్ గా కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. 

నాకు డ్రీమ్‌ రోల్స్ అంటూ ఏమీ లేవు. ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలు చేయాలని ఉంటుంది. అలాంటి మంచి పాత్రలు, కథలు రావాలని కోరుకుంటాను

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement