Anu Emmanuel
-
అనూ ఇమ్మాన్యుయేల్ కొత్త సినిమా వివరాలివే
అనూ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలో, శివ కందుకూరి మరో లీడ్ రోల్ ఓ థ్రిల్లింగ్ మూవీ తెరకెక్కుతోంది. సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, మై 3 ఆర్ట్స్ పతాకాలపై లండన్ గణేష్, డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల నిర్మిస్తున్న సినిమా ఇది. బుధవారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి, లండన్ లొకేషన్స్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని యూనిట్ తెలిపింది. ‘‘ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. వైవా హర్ష, వెన్నెల కిశోర్, ఎస్. నివాసిని, ‘షకలక’ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్. -
చీరలో అను అందం.. సెల్ఫీతో క్యూట్‌గా రమ్య!
పట్టుచీరలో బుట్టబొమ్మలా నభా నటేశ్ఒయ్యారాలతో వావ్ అనిపిస్తున్న బిగ్ బాస్ స్రవంతి'మిస్టర్ బచ్చన్' జ్ఞాపకాల్లోనే హాట్ బ్యూటీ భాగ్యశ్రీసోదరుడి నిశ్చితార్థంలో హీరోయిన్ ప్రియాంక చోప్రాచీరలో అందాలన్నీ చూపించేస్తున్న అను ఇమ్మాన్యుయేల్పెళ్లి ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ అమీ జాక్సన్ఫారెన్ ట్రిప్ ఫొటోలతో బాలీవుడ్ హీరోయిన్ మానుషి చిల్లర్ View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Mangli chauhan (@iammangli) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Sujithar (@sujithadhanush) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Ed Westwick (@edwestwick) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Megha Chowdhury (@megha.chowdhury) View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) -
ప్రాపర్టీ షోలో నటి అను ఇమ్మాన్యుయల్ సందడి (ఫొటోలు)
-
Anu Emmanuel: అందానికి చీర కడితే అను ఇమ్మాన్యుయేల్లా ఉంటుందేమో (ఫోటోలు)
-
Anu Emmanuel Pics: అను ఇమ్మాన్యుయేల్ టెంప్టింగ్ ఫోజులు (ఫొటోలు)
-
Japan Review: ‘జపాన్’ మూవీ రివ్యూ
టైటిల్: జపాన్ నటీనటులు: కార్తి, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు నిర్మాణ సంస్థ: : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు దర్శకత్వం: రాజు మురుగన్ సంగీతం: జీవి ప్రకాష్ కుమార్ సినిమాటోగ్రఫి: ఎస్. రవి వర్మన్ ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్ విడుదల తేది: నవంబర్ 10, 2023 కథేంటంటే.. జపాన్ ముని అలియాస్ జపాన్(కార్తి) ఓ గజదొంగ. గోడలకు కన్నం వేసి దొంగతనం చేయడం.. గుర్తుగా అక్కడ ఓ బంగారు కాయిన్‌ను పెట్టి వెల్లడం అతని స్పెషాలిటీ. ఓ సారి హైదరాబాద్‌లోని రాయల్ అనే నగల దుకాణం నుంచి రూ. 200 కోట్ల విలువ చేసే గోల్డ్‌ని కొట్టేస్తారు. ఆ గోల్డ్ షాపులో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి(కేఎస్ రవికుమార్) షేర్ కూడా ఉండడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఈ కేసు విచారణకై స్పెషల్ ఆఫీసర్స్ భవాని(విజయ్ మిల్టన్), శ్రీధర్(సునీల్) రంగంలోకి దిగుతారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ దొంగతనం ఎవరు చేశారు? జపాన్ దొంగగా మారడానికి గల కారణం ఏంటి? దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? శ్రీధర్‌తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు జపాన్‌కి ఎందుకు సహాయం చేశారు? పోలీసులకు చెందిన రహస్యాలు జపాన్ దగ్గర ఏం ఉన్నాయి? చివరకు జపాన్ జీవితం ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘జపాన్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కార్తి నటించిన 25వ సినిమా కావడంతో ‘జపాన్’పై ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రం కచ్చితంగా ఢిపరెంట్‌గా ఉంటుందని భావించారు. అయితే సినిమా మాత్రం ఆ రేంజ్లో లేదనే చెప్పాలి. ఓ భారీ నగల దుకాణంలో దొంగతనం సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఈ కేసును ఛేదించడానికి భవానీ, శ్రీధర్ పాత్రలు రావడం..వారికి సంబంధించిన సీన్స్ చూసి ఇది సీరియస్‌గా సాగే పోలీసు-దొంగ కథలా అనిపిస్తుంది. అయితే హీరో ఎంట్రీ తర్వాత మాత్రం ఇది క్యాట్- మౌస్ తరహాలో సాగే యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ అని అర్థమవుతుంది. దొంగతనం చేసిన డబ్బులతో హీరోగా సినిమాలు చేసే వ్యక్తిగా కార్తిని పరిచయం చేశారు. కార్తి డైలాగ్ డెలివరీ, గెటప్ రెండూ డిఫరెంట్‌గా ఉండడంతో కథపై ఆసక్త పెరుగుతుంది. ఒక పక్క జపాన్ స్టోరీ నడిపిస్తూనే.. మరోపక్క ఇన్వెస్టిగేషన్ పేరుతో సామాన్యుడు గంగాధర్‌ని పోలీసులు పెట్టే టార్చర్‌ని చూపిస్తూ.. ఏదో జరుగబోతుందనే ఆసక్తిని కలిగించారు. ఊహించని ట్విస్టులేవో ఉంటాయనుకున్న ప్రేక్షకుడి అక్కడ నిరాశే కలుగుతుంది. హీరోకి ఎయిడ్స్ ఉందని స్టార్టింగ్‌లోనే చెప్పించి.. ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిగించారు. కానీ దానికి సరైన ముగింపు ఇవ్వలేదు. వెన్నుపోటు సన్నివేశాలను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ సంజుతో జపాన్ లవ్‌ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ కొన్ని చోట్ల మాత్రమే నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా కథ అంటూ తను దొంగగా ఎందుకు మారాడో చెప్పే సీన్ ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఎమోషనల్‌కు గురిచేస్తాయి. ఎవరెలా చేశారంటే.. కార్తి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు. జపాన్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన గెటప్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉంటాయి. సినిమా కోసం కార్తి పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. హీరోయిన్ సంజు పాత్రకు అను ఇమ్మాన్యుయేల్ ఉన్నంతలో న్యాయం చేసింది. ఆ పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. పోలీసు అధికారి శ్రీధర్‌గా సునీల్ కొన్ని చోట్ల భయపెట్టాడు..మరికొన్ని చోట్ల తేలిపోయాడు. అయితే ఆయన పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. భవాని పాత్రకు విజయ్ మిల్డన్ న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. జపాన్ కోసం పోలీసులు అరెస్ట్ చేసిన సామాన్యుడు గంగాధర్ పాత్రను పోషించిన వ్యక్తి నటన బాగుంది. కెఎస్ రవికుమార్‌తో పాటు మిగిలి నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం పర్వాలేదు. పాటలు ఆకట్టుకోలేదు కానీ నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సిందే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
అవార్డుల కంటే ప్రేక్షకుల గుర్తింపే ముఖ్యం
‘‘అవార్డుల కోసం సినిమాలు తీయాలనే ఆలోచన నాకు ఉండదు. ప్రేక్షకులు ఇచ్చే గుర్తింపు, ప్రేమ, అభిమానం, ఆప్యాయత చాలా ముఖ్యం. అవార్డులు వస్తే అదనపు బోనస్‌గా భావిస్తాను. ప్రేక్షకుల ప్రేమ, అభిమానంతో పాటు ‘జోకర్’ చిత్రానికి జాతీయ అవార్డు తీసుకోవడం నాకు గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ‘జపాన్’ కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని దర్శకుడు రాజు మురుగన్ అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా రాజు మురుగన్ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి రావడానికి చార్లీ చాప్లిన్‌గారే స్ఫూర్తి. మూకీ చిత్రాలతోనే ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలను రేకెత్తించారు ఆయన. ఇక కార్తీగారిని దృష్టిలో పెట్టుకునే ‘జపాన్’ కథ రాశాను. కార్తీ, నిర్మాతలు ప్రభు, ప్రకాశ్‌గార్ల సహకారంతోనే ‘జపాన్’ చిత్రం ఇంత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. ఒక దర్శకుడిగా చిన్నా పెద్దా అని కాకుండా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
దీపావళి నాకు కలిసొచ్చిన పండగ.. జపాన్ విజయం ఖాయం: కార్తీ
క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాముఖ్యతనిచ్చే నటుడు కార్తీ. అందుకే నటుడిగా పరిచయం అయ్యి సుమారు 18 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పుటికి 25 చిత్రాలే చేశారు. అయితే ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఈయన ఇటీవల నటించిన విరుమాన్, సర్థార్, పొన్నియిన్‌సెల్వన్ పార్టు 1, 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించారు. కాగా కార్తీ తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం జపాన్. ఇది ఈయన 25వ చిత్రం కావడం విశేషం. రాజుమురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మించిన ఈ భారీ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని ,రవివర్మన్ ఛాయాగ్రహణను అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి పండగ సందర్భంగా శుక్రవారం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటుడు కార్తీ చైన్నెలో మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ జపాన్ చిత్రం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు. దర్శకుడు రాజుమురుగన్ కథ,సంభాషణలు తనకు చాలా నచ్చాయన్నారు. జపాన్ చిత్రంలో కార్తీ కనిపించడని, పాత్రే కనిపిస్తుందని అన్నారు. ఇంతకు ముందు కాశ్మోరా చిత్రంలో భిన్నమైన పాత్రను పోషించినా జపాన్‌లో పూర్తిగా వైవిధ్యభరిత కథా పాత్రను చేసినట్లు చెప్పారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతం, రవివర్మన్ ఛాయాగ్రహణ చిత్రానికి పక్కా బలంగా ఉంటాయన్నారు. నటుడు సునీల్, విజయ్ మిల్టన్ లతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇక దీపావళి తనకు కలిసొచ్చిన పండగ అని, ఈ పండగ సందర్భంగా జపాన్ చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉందని చెప్పారు. జపాన్ చిత్ర విజయంపై చాలా నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని కార్తీ వ్యక్తం చేశారు. -
చిల్ అవుతున్న వరలక్ష్మీ.. లుక్ మార్చిన నభా
బీచ్‌లో చిల్ అవుతున్న వరలక్ష్మీ శరత్ కుమార్ బ్లాక్ డ్రస్‌లో రెచ్చిపోయిన హీరోయిన్ తమన్నా 'జపాన్' సినిమాతో వచ్చేస్తున్న అను ఇమ్మాన్యుయేల్ భూటాన్‌లో చికిత్స తీసుకుంటున్న హీరోయిన్ సమంత పసుపు పచ్చ రంగు డ్రస్‌లో మెరిసిపోతున్న శ్రీలీల షాడో వెలుగులో మతి పోగొడుతున్న నభా నటేశ్ జిగేలు మంటున్న బుల్లితెర బ్యూటీ నియా శర్మ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో యంగ్ హీరోయిన్ మెహ్రీన్ View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by Shaneem (@shaneemz) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Athiya Shetty (@athiyashetty) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) -
'జపాన్'లో చాలా సర్ ప్రైజ్ రోల్ చేశాను: అను ఇమ్మాన్యుయేల్.
హీరో కార్తిని పొగడ్తలతో ముంచేస్తోంది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. అతను గొప్ప నటుడు మాత్రమే కాదని,ఆఫ్ స్క్రీన్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అని అంటోంది. కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘జపాన్’. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్.. 'దీపావళి' కానుకగా నవంబర్ 10న విడుదత కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మీడియాతో ముచ్చటిస్తూ.. హీరో కార్తి గురించి, జపాన్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ► కార్తి అద్భుతమైన నటుడు. తను టీం ప్లేయర్. ఏదైనా సన్నివేశం చేసే ముందు చర్చించుకునే వాళ్ళం. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఆయన చాలా కేర్ తీసుకుంటారు. చాలా సపోర్ట్ చేస్తారు. కార్తి గారు గ్రేట్ కో స్టార్. ఆఫ్ స్క్రీన్ అందరితో చాలా చక్కగా మాట్లాడుతాడు. స్టార్లా కాకుండా సాధారణ వ్యక్తిగా ఆయన ప్రవర్తన ఉంటుంది. ► 'జపాన్'ట్రైలర్ చూస్తేనే ఇదొక యూనిక్ సినిమా అని అర్ధమైపోతుంది. కార్తి గారే కాదు ఇలాంటి పాత్రని గతంలో ఎవరూ చేయలేదు. జపాన్ దీపావళికి పర్ఫెక్ట్ ఫిల్మ్. ఇది గొప్ప థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే చిత్రం. తప్పకుండా అందరూ థియేటర్స్ లోనే చూడాలి. జపాన్ చాలా క్రేజీగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. ► ఈ చిత్రంలో నా పాత్ర ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంటుంది. దాని గురించి ఇప్పుడే ఎక్కువగా రివిల్ చేయకూడదు. ఇందులో నటిగా కనిపిస్తాను. నా పాత్ర జపాన్ జీవితంలో కీలకంగా ఉంటుంది. కార్తి, నా పాత్రకు మధ్య చాలా ఆసక్తికరమైన ట్రాక్ ఉంటుంది. తప్పకుండా అందరినీ అలరిస్తుంది. ► రాజు మురుగన్ చాలా వైవిధ్యమైన దర్శకుడు. తన ప్రతి సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. జపాన్ కథ, పాత్ర చాలా యూనిక్. ఇలాంటి కథని గతంలో వినలేదు. ఇలాంటి సినిమాని చూడడానికి ఆడియన్ గా కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ►నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలు చేయాలని ఉంటుంది. అలాంటి మంచి పాత్రలు, కథలు రావాలని కోరుకుంటాను -
జపాన్ సంతృప్తి ఇచ్చింది
‘‘మా డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఒకదానికొకటి భిన్నమైన చిత్రాలను నిర్మిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందడం నిర్మాతగా చాలా ఆనందాన్ని ఇస్తోంది. ‘జపాన్’ సినిమా పట్ల యూనిట్ అంతా చాలా సంతృప్తిగా ఉన్నాం. సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని నిర్మాత ఎస్ఆర్ ప్రభు అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 10న విడుదలవుతోంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తోంది. ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ–‘‘రాజు మురుగన్ ఏదైనా విషయాన్ని నవ్విస్తూనే ఆలోజింపజేసేలా చెబుతారు. ‘జపాన్’ లో మానవత్వం గురించి చెప్పారు. ఇందులో కార్తీగారి జపాన్ పాత్ర ప్రేక్షకుల మనసులో చాలా కాలం నిలిచిపోతుంది. నాగార్జునగారు ‘జపాన్’ టీజర్, ట్రైలర్ చూసి ‘ఇలాంటి వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎలా చేయగలుగుతున్నావ్’ అంటూ కార్తీగారిని అభినందించారు. సినిమా విషయంలో నిర్మాత సుప్రియగారు, మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి’’ అన్నారు. -
Anu Emmanuel: ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన అనూ ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)
-
కార్తీ ‘జపాన్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
నన్ను తమిళ అబ్బాయిలా ఉన్నావనేవారు
‘‘ఈగ’ సినిమా తమిళంలో విడుదలైన తర్వాత నేను ఎప్పుడు చెన్నై వెళ్లినా.. నన్ను తమిళ అబ్బాయిలా ఉన్నావనేవారు. అలాగే కార్తీని చూస్తే చాలామంది తెలుగు ప్రేక్షకులు తెలుగబ్బాయిలా ఉన్నాడంటారు. నాకు తెలిసి తెలుగు ప్రేక్షకులు కార్తీని సొంతం చేసుకున్నారు. వరుసగా మూడు హిట్స్ సాధించి ఇప్పుడు ‘జపాన్’తో ముందుకొస్తున్నాడు కార్తీ. దీపావళికి వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని హీరో నాని అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 10న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ – ‘‘జపాన్’ లాంటి చిత్రం తీసి ప్రేక్షకుల్ని మెప్పించడం అంత సులభం కాదు. కానీ, ఈ మూవీ ట్రైలర్ చూశాక టీమ్ ఎనర్జీ, నమ్మకం నాకు కనిపించింది. అనూ ఇమ్మాన్యుయేల్ నా ‘మజ్ను’ సినిమాతో పరిచయమైంది. ‘జపాన్’ ట్రైలర్ చూసినప్పుడు చాలా మంచి సినిమాలో భాగస్వామ్యం అయినట్లు అనిపించింది. ప్రభుగారు మంచి సినిమాలు నిర్మిస్తుంటారు. లెక్కలు చూసుకుని పని చేసే నిర్మాత కాదు.. ఫ్యాషన్‌తో,ప్రాణం పట్టి పనిచేసే నిర్మాతలాగా అనిపిస్తారు. ఇలాంటి మంచి సినిమా తీసిన డైరెక్టర్ రాజు మురుగన్‌కి అభినందనలు’’ అన్నారు. ‘‘జపాన్’ నా మనసుకు బాగా దగ్గరైంది’’ అన్నారు కార్తీ. ‘‘జపాన్’ అంతా రాజు మురుగన్ శైలిలో ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. అన్నపూర్ణ స్టూడియోస్ భాగస్వామ్యంలో తెలుగులో ఈ సినిమా విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అని ఎస్ఆర్ ప్రభు అన్నారు. రాజు మురుగన్ మాట్లాడుతూ– ‘‘కళకు భాషతో సంబంధం లేదు. తెలుగు ప్రేక్షకులు సినిమాని పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. భారతీయ సినిమాకి ఐకానిక్‌గా గుర్తింపు పోందింది టాలీవుడ్’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత సుప్రియ, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటులు సునీల్, రాకేందు మౌళి, పాటల రచయిత భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు. -
కార్తీ 'జపాన్' గుర్తుండేలా.. వాళ్లకు రూ 1.25 కోట్ల విరాళం
కార్తీక్ శివకుమార్... ముద్దుగా కార్తీ అని అభిమానులు పిలుస్తుంటారు.. తమిళనాడులో తనకు ఏ రేంజ్లో ఫ్యాన్స్ ఉన్నారో టాలీవుడ్లో కూడా అదే రేంజ్లో ఉన్నారు. వరుస హిట్ సినిమాలు చేస్తూ.. తన అభిమానులకు ట్రీట్ ఇస్తున్న కార్తీ.. గతేడాది పొన్నియన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో మెప్పిస్తే.. ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ 2 తో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దివాళి సందర్భంగా కార్తీ నటించిన 25వ సనిమా జపాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తీ కెరియర్లో ఈ సినిమా ఒక బెంచ్ మార్క్ లాంటిది. కాబట్టి ఈ సినిమా తన అభిమానులకు మరింత స్పెషల్‌గా ఉండాలని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. (ఇదీ చదవండి: ఆరు 'నిబ్బా నిబ్బీ' లవ్ స్టోరీలు ఉన్నాయి.. నేను లోకేష్ కనగరాజ్ కాదు: సాయి రాజేష్) తన అన్నయ్య సూర్య లాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని కార్తీ నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా రూ. 1.25 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అనాథాశ్రమాలు, పేద వారికి అన్నదానాలు ఏర్పాటుచేయడానికి ఈ భారీ మొత్తాన్ని వినియోగించేందుకు ఏర్పాట్లు చేశారు. జపాన్ తన కెరియర్లో 25వ సినిమా కావడంతో 25 మంది సామాజిక కార్యకర్తలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు, 25 పాఠశాలను సెలెక్ట్ చేసి ఒక్కో పాఠశాలకు రూ. లక్ష రూపాయలు. అలాగే 25 ఆస్పత్రులకు 25 లక్షలు విరాళంగా అందజేశారు. మిగిలిన మొత్తాన్ని 25 రోజుల పాటు పేదవారికి అన్నదానం చేయాలని ఆయన ఏర్పాట్లు చేశారు. వీటిలో ఇప్పటికే అన్నదానం కార్యక్రం జరుగుతుంది. కనీస అవసరాల కోసం 25 ఆస్పత్రులు,స్కూళ్లను గుర్తించి వాటికి లక్ష రూపాయల చొప్పున కార్తీ సాయం చేయనున్నారు. రాజు మురుగన్ దర్శకత్వంలో వస్తున్న జపాన్ సినిమాలో కార్తీ దొంగగా నటిస్తున్న విషయం తెలిసిందే.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 12న దివాళీ సంబర్భంగా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Karthi Sivakumar (@karthi_offl) -
హీట్ పెంచిన హాట్ బ్యూటీ.. అలా కాక రేపుతున్న ఐశ్వర్య!
హాట్నెస్ పెంచుతున్న 'టైగర్ నాగేశ్వరరావు' బ్యూటీ ఎర్ర చీరలో క్యూట్‌గా అను ఇమ్మన్యుయేల్ స్కిన్ టైట్ డ్రస్ లో కాక రేపుతున్న దక్ష సెలబ్రేషన్ చేసుకుంటున్న హీరోయిన్ మెహ్రీన్ అందాల విందు చేస్తున్న ఐశ్వర్యా మేనన్ డిఫరెంట్‌గా కనిపించిన హీరోయిన్ శ్రుతిహాసన్ స్విమ్ సూట్లో అబ్బా అనిపిస్తున్న హంస నందిని గోల్డెన్ డ్రస్సులో మెరిసిపోతున్న హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ View this post on Instagram A post shared by Anukreethy Vas (@anukreethy_vas) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by ESTHER ANIL (@_estheranil) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
జపాన్ ట్రైలర్.. దొంగగా రెచ్చిపోయిన కార్తి
పొన్నియన్ సెల్వన్ తర్వాత కార్తి జపాన్ అనే సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జపాన్’ . అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సునీల్ కీలకపాత్రని పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కార్తి విభిన్నమైన లుక్‌తో కనిపించారు. ఇందుకోసం ఆయన తన లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు. ఇవే విషయాలు ట్రైలర్లో తెలుస్తుంది. ఇందులో కార్తి బంగారం స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. కామెడీ జోడించి, కొత్త అవతారంలో ఆయన అలరించనున్నారు. సముద్రం ఒడ్డున నివసించే జపాన్ (కార్తీ) చిన్నప్పుడే తన తల్లి కోసం దొంగగా మారినట్టు ట్రైలర్ ఆరంభంలో ఉంది. చేపగా మొదలైన జపాన్ జర్నీ.. తిమింగలంలా ఏలా మారింది అనే కథతో ట్రైలర్ ఆరంభమవుతుంది. తన దొంగతనాలతో పోలీసులు, ప్రభుత్వంలో జపాన్ అలజడి సృష్టిస్తాడని ట్రైలర్లో ఉంది. జపాన్ను పట్టుకునేందుకు పోలీసులతో పాటు చాలా మంది ప్రయత్నిస్తారు. అయితే.. 'సొరచేపలు చుట్టుముట్టాయి. కానీ ఎన్ని ప్లాన్లు వేసినా తిమింగలం వలలో పడదుగా' అంటూ జపాన్ చెప్పే డైలాగ్ బాగా పేలింది. ఆ తర్వాత 'సింహం కాస్త సిక్ అయితే.. పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసిపెట్టాయట' అంటూ కార్తి చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమిళనాడులోని అనేక బంగారు దుకాణాల నుంచి కొన్ని కిలోల బంగారాన్ని దొంగలించిన ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జపాన్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. జపాన్ సినిమా దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ పేర్కొంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం) -
కార్తీ 'జపాన్' సినిమా కోసం నాగార్జున కీలక నిర్ణయం
కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దీపావళికి విడుదల కానుంది. కార్తీకి జపాన్ 25వ చిత్రం. తన కెరీయర్లో ఇదొక బెంచ్‌మార్క్ లాంటి మూవీ. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుంది. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) నాగార్జున అక్కినేని కాంపౌండ్ నుంచి ఈ సినిమా తెలుగులో విడుదల కానున్నడంతో మార్కెట్‌కు ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి 200 కోట్ల దోపిడీకి పాల్పడే కథాంశంతో ఉంటుందని టీజర్‌తో ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా ఇండియా అంతటా జపాన్‌పై (కార్తీ పాత్ర పేరు) 182 కేసులున్నాయని, అతనొక గజదొంగ అంటూ పాత్రను రివీల్ చేశారు. తమిళనాడులోని ఒక దొంగ జీవితాన్ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగార్జున- కార్తీ ఇద్దరూ కలిసి ఊపిరి సినిమాలో మెప్పించారు. ఆ సినిమా నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. జపాన్ సినిమాను అన్నపూర్ణ సంస్థ విడుదల చేయనున్నడంతో కార్తీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. సినిమా విడుదల తప్పకుండా భారీ ఎత్తున ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
జపాన్ రేంజే వేరు
‘హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒకడు కన్నమేసి రెండు వందల కోట్ల రూపాయల విలువ చేసే నగలు ఎత్తుకుపొతే మీ లా అండ్ ఆర్డర్ లాఠీ ఊపుతూ కూర్చుందా?’ అనే డైలాగ్‌తో ‘జపాన్’ చిత్రం టీజర్ విడుదలైంది. కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ని బుధవారం విడుదల చేశారు. ‘‘ఇండియా అంతటా జపాన్‌పై (కార్తీ పాత్ర పేరు) 182 కేసులున్నాయి. నాలుగు రాష్ట్రాల పొలీసులు వాడి కోసం వెతుకుతున్నారు. కానీ, ఒక్కసారి కూడా వాడు ఎవ్వరికీ దొరకలేదు’, ‘జపాన్ రేంజే వేరు’ వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
'జపాన్' ఓ క్రేజీ దొంగ.. టీజర్ మాత్రం అదిరింది!
హీరో కార్తీ మంచి నటుడు. పేరుకే తమిళ హీరో కానీ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. కార్తీ నుంచి ఓ మూవీ వస్తుందంటే చాలా మన ఆడియెన్స్ అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే కాన్సెప్టులు కాస్త డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు 'జపాన్'గా మాములు సందడి చేయలేదు. (ఇదీ చదవండి: భగవంత్ కేసరి సినిమా రిలీజ్‌కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?) టీజర్ ఎలా ఉంది? కార్తీ హీరోగా నటిస్తున్న 25వ సినిమా 'జపాన్'. దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. టీజర్లో భాగంగా కథేంటి? సినిమా ఎలా ఉండబోతుందనేది ఆల్మోస్ట్ చెప్పేశారు. కార్తీ లుక్ దగ్గర నుంచి డైలాగ్ మాడ్యులేషన్ వరకు అన్నీ వింటేజ్ స్టైల్లో డిఫరెంట్‌గా ఉన్నాయి. బంగారం దొంగతనం, బంగారు పళ్లతో కార్తీ కనిపించడం అన్నీ చూస్తుంటే.. 'జపాన్' బంగారం చుట్టూ తిరిగే ఓ యాక్షన్ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. కథేంటి? 'జపాన్' అనే దొంగ. రూ.200 కోట్ల విలువైన నగల్ని ఓ బంగారం షాప్ నుంచి దొంగిలిస్తాడు. అతడిపై అప్పటికే 182 కేసులు ఉంటాయి. 4 రాష్ట్రాల పోలీసులు వెతుకుంటారు. ఇక మనోడికి గోల్డ్, అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అలాంటోడు పోలీసులు దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది కథలా అనిపిస్తుంది. టీజర్ చూస్తుంటే ఈసారి కార్తీ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. టీజర్ చివర్లో.. 'రేయ్ ఎన్ని బాంబులేసిన ఈ జపాన్ని ఎవరూ ఏం పీకలేరురా' అని కార్తీ చెప్పిన డైలాగ్ వెరైటీగా ఉంది. (ఇదీ చదవండి: కార్తీ 25వ సినిమా.. 25 వేల మందికి అన్నదానం) -
Anu Emmanuel: వికారాబాద్ లో సినీ తార అను ఇమ్మాన్యుయల్ సందడి (ఫోటోలు)
-
షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవంలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)
-
డబ్బింగ్ షురూ
కార్తీ హీరోగా నటించిన అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘జపాన్’. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సునీల్, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో నటించారు. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయని వెల్లడిస్తూ, ఇందుకు సంబంధించిన ఓ వీడియోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ‘‘కార్తీ పుట్టినరోజు (మే 25) సందర్భంగా విడుదల చేసిన ‘జపాన్’ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ చిత్రంలో కార్తీ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా ‘జపాన్’ చిత్రంలో గోల్డ్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో కార్తీ కనిపిస్తారని కోలీవుడ్ టాక్. -
ఇండస్ట్రీలో నన్నూ అలాంటి కోరికే కోరారు: ఇమ్మానుయేల్
సినీ పరిశ్రమలో సర్దుకుపోవడం (కాస్టింగ్ కౌచ్) అనే పదం ఇటీవల మళ్లీ ఎక్కువగా వినిపిస్తోంది. నటి అను ఇమ్మానుయేల్ కూడా అలాంటి సంఘటనలను ఎదుర్కొన్నాను అని పేర్కొంది. చదువుకునే రోజుల్లోనే బాలనాటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ మలయాళీ బ్యూటీ ఆ తర్వాత 2016లో నిఫిన్ బాలికి జంటగా యాక్షన్ హీరో బిజూ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయింది. ఆ తర్వాత 2016లోనే 'నాని' కథానాయకుడిగా నటించిన 'మజ్ను' చిత్రంలో కిరణ్మై పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ సరసన 'నమ్మవీట్టు పిళ్లై' చిత్రంలో కథానాయకిగా నటించింది. ఈ చిత్రం తర్వాత అక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించింది. అయితే ఆ చిత్రం విజయాన్ని సాధించిన అను ఇమ్మానుయేల్‌ను మాత్రం అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. ఇక్కడ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అలా అజ్ఞాతవాసి,నా పేరు సూర్య,గీత గోవిందం వంటి సినిమాలు చేసినా ఈ అమ్మడిని ఎప్పటికీ స్టార్ ఇమేజ్ వరించలేదని చెప్పాలి. తాజాగా కార్తీక్ జంటగా 'జపాన్' చిత్రంలో నటించింది. త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న ఈ చిత్రంపై అను ఇమ్మానుయేల్ చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సర్దుకుపోవడం అనే అంశంపై స్పందిస్తూ. అను ఇమ్మానుయేల్ తనకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది. అయితే ఇలాంటి ఘటనలను కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కొన్నానని చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో సమస్యను ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కోవడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
కార్తీ 'జపాన్' సినిమాకు భారీ బిజినెస్.. ఎన్ని కోట్లో తెలిస్తే!
కోలీవుడ్‌లో పరుత్తివీరన్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయిన కార్తీ ఇప్పటికి 24 చిత్రాల్లో నటించారు. వీటిలో 90 శాతం హిట్ చిత్రాలు కావడం విశేషం. ఇటీవల కార్తీ నటించిన విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్దార్ చిత్రాలు వరుసగా విడుదలై హిట్ కావడంతో హ్యాట్రిక్ సాధించారు. కాగా తాజాగా తన 25వ చిత్రం జపాన్ పూర్తి చేశారు. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి అనూ ఇమాన్యుల్ నాయకిగా నటిస్తున్న జపాన్ చిత్ర టైటిల్‌కు విశేష స్పందన వచ్చింది. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ) అదేవిధంగా ఇందులో కార్తీ వివిధ గెటప్పులు ధరించడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో జరుపుకుంటున్న ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ జరగాల్సి ఉంది. కాగా దీపావళి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కాగా విచిత్ర వ్యాపారం ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. జపాన్ చిత్ర ప్రీ బిజినెస్ మాత్రమే రు.150 కోట్లు జరిగిందని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. (ఇదీ చదవండి: ఫీమేల్ గెటప్‌లో మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్న హీరోలు) ఇప్పటివరకు కార్తీ నటించిన చిత్రాలన్నిటికంటే అత్యధికంగా వ్యాపారం జరిగిన చిత్రం ఇదే అవుతుంది. కాగా నటుడు కార్తీ ప్రస్తుతం తన 26వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి నలన్ కుమార సామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్‌లో పూర్తి అవుతుందని సమాచారం. తదుపరి 96 చిత్రం ఫ్రేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇది నవంబర్‌లో సెట్ పైకి వెళ్లనుంది ఆ తర్వాత కార్తీ నటించే సర్దార్– 2, ఖైదీ– 2 చిత్రాలు 2024లో ప్రారంభం అవుతాయని సమాచారం. -
'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్‌కి అక్క?
తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వాళ్లలో చాలా కొద్దిమంది మాత్రమే ప్రేక్షకుల్ని ఆకర్షిస్తారు. కరెక్ట్‌గా చెప్పాలంటే మనసు దోచుకుంటారు. అలా ఇప్పుడు శ్రీవిష్ణు 'సామజవరగమన'లో నటించిన రెబా మోనికా జాన్.. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. అయితే తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఓ హీరోయిన్‌కు ఈమె కజిన్(అక్క) అని అంటున్నారు. అసలు ఇంతకీ ఇందులో నిజమెంత? రెబా ఏం చెప్పింది? (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) ఎవరీ భామ? బెంగళూరులోని ఓ మలయాళ కుటుంబంలో పుట్టిన రెబా మోనికా జాన్.. మాస్టర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే మోడలింగ్ చేసిన రెబా.. పలు యాడ్స్ లోనూ నటించింది. 2016లో మలయాళంలో నివిన్ పౌలీ హీరోగా నటించిన 'జాకోబింటే స్వర్గరాజ్యం' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తొలి చిత్రంతో హిట్ కొట్టి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా దాదాపు నాలుగేళ్లపాటు తమిళ, మలయాళంలో వరసగా మూవీస్ చేస్తూ వచ్చింది. గతేడాది జీమోన్ జోసెఫ్ అని వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకుంది. తెలుగులోకి అలా! దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో విజిల్) సినిమాలో ఓ పాత్రలో నటించింది. యాసిడ్ దాడికి గురైనా సరే పట్టుదలగా మైదానంలో దిగి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జట్టుని గెలిపించే రోల్ లో కనిపించింది ఈమెనే. ఇలా డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మధ్యే నేరుగా ఓటీటీలో రిలీజైన 'బూ'లోనూ ఓ హీరోయిన్ గా చేసింది. అయితే 'సామజవరగమన'.. ఈమెకు తెలుగులో ఫస్ట్ సినిమా. ఇందులో క్యూట్ గా యాక్ట్ చేసి అలరించింది. ఆ హీరోయిన్‌తో బంధుత్వం? రెబా మోనికా జాన్‌కు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. వరసగా అక్క అవుతుందని గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. నిజానికి వీళ్లిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. స్వయంగా ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెబా చెప్పుకొచ్చింది. 2016లో ఒకేసారి మలయాళంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చామని, దాంతో అప్పుడు ఓ వ్యక్తి రూమర్ క్రియేట్ చేశారని, అది అలానే ఇప్పటికే కంటిన్యూ అవుతోందని రెబా చెప్పుకొచ్చింది. వికిపీడియా, గూగుల్ లోనూ అలానే చూపిస్తోందని.. అయితే దీనిపై తమకు ఎలాంటి సమస్య లేదని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) -
షాపింగ్‌లో బిజీగా అను ఇమ్మాన్యుయేల్.. మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్!
►షాపింగ్ ఎంజాయ్ చేస్తోన్న అను ఇమ్మాన్యుయేల్ ►ఒళ్లంతా డ్రెస్‌తో కప్పేసుకున్న శృతిహాసన్ ►రానా సతీమణి మిహికా బజాజ్ స్టన్నింగ్ లుక్స్ ►కలర్ ఫుల్ గౌనులో రష్మీ గౌతమ్ హోయలు ►ట్రెండింగ్ లుక్‌లో సింగర్ గీతామాధురి ►యోగాసనాలు చేస్తున్న శ్రియా శరణ్ View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) -
రావణాసుర విజయంపై నమ్మకం ఉంది
‘‘రావణాసుర’ చిత్రం నన్నెంతో అలరించింది. కచ్చితంగా ప్రేక్షకులందర్నీ కూడా అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు రవితేజ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’ టైటిల్, ఆ టైటిల్ డిజైన్ క్రెడిట్ నిర్మాత అభిషేక్‌కు దక్కుతుంది. అతను మల్టీటాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలుగా మాకు మంచి పేరు రావాలని, భవిష్యత్‌లో మేమిద్దరం కలిసి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హిట్‌తో సుధీర్ వర్మ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాలి. ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యాక్‌బోన్స్ అయిన శేత, నమ్రత, వింధ్యా రెడ్డిగార్లకు థ్యాంక్స్. నా ఉత్సాహం, నా ప్రోత్సాహం నా అభిమానులే’’ అని అన్నారు. ‘‘రవితేజగారి నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకు కష్టపడాలని చెప్పారు. సుధీర్‌వర్మ అద్భుతమైన దర్శకుడు. ఆయన నన్ను కొత్తగా చూపించారనే అనుకుంటున్నాను’’ అన్నారు సుశాంత్. ‘‘రావణాసుర’ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘రవితేజగారి ‘ఆంజనేయులు’ సినిమాకు దర్శకత్వ విభాగంలో వర్క్ చేశాను. దర్శకుడిగా ఆయనతో ఓ సినిమా చేయాలనుకున్నాను. ‘రావణాసుర’ వంటి మంచి స్టోరీకి డైరెక్టర్‌గా నన్ను సెలక్ట్ చేసుకున్న రవితేజగారికి ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ హండ్రెండ్ పర్సెంట్ థ్రిల్ అవుతారు’’ అన్నారు సుధీర్‌వర్మ. మేఘా ఆకాష్, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ. మ్యూజిక్ డైరెక్టర్స్ హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, రైటర్ శ్రీకాంత్ విస్సా తదితరులు పాల్గొన్నారు. -
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు...
‘వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే.. ముల్లోకాల ఏ మూల ఉన్నా నీ అందాల సంకీర్తనే’ అని పాడుతున్నారు రావణాసుర. రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘రావణాసుర’. సుశాంత్ కీ రోల్ చేసిన ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లు. రవితేజ, అభిషేక్ నామా నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఈ చిత్రంలోని ‘వెయ్యిన్నొక్క జిల్లాల..’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. వెంకటేశ్ ‘సూర్య ఐపీఎస్’ చిత్రంలోని ‘వెయ్యిన్నొక్క జిల్లాలకు..’ పాటకు ఇది రీమిక్స్ వెర్షన్. అప్పట్లో ఈ పాటకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అనురాగ్ కులకర్ణి ఈ లేటెస్ట్ వెర్షన్‌ను పాడారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్. -
మాస్ హీరో రవితేజ ‘రావణాసుర’ టీజర్ స్టిల్స్ (ఫోటోలు)
-
రవితేజ ‘రావణాసుర’ థీమ్ సాంగ్ విన్నారా?
రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర చేస్తున్నారు. అభిషేక్ నామా, రవితేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ‘రావణా..’ అంటూ సాగే థీమ్ సాంగ్‌ని విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ థీమ్ సాంగ్‌ని కంపోజ్ చేయగా, పాపులర్ మ్యూజిక్ వేదిక్ బ్యాండ్ శాంతి పీపుల్, నోలిక్ ఈ థీమ్ సాంగ్‌ని ఆలపించారు. ‘‘హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’. రవితేజను లాయర్ పాత్రలో చూపిస్తున్నారు సుధీర్ వర్మ. కథలో ఊహించని మలుపులుంటాయి. ఏప్రిల్ 7న మా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
జపాన్ : మేడ్ ఇన్ ఇండియా!
బంగారు చొక్కా, మెడలో బంగారు గొలుసు, ఒక చేతిలో బంగారు తుపాకీ, మరో చేతిలో గోల్డెన్ గ్లోబ్... ఇదీ హీరో కార్తీ కొత్త గెటప్. ఇదంతా ‘జపాన్’ సినిమా కోసమే. కార్తీ కెరీర్లో 25వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. రాజు మురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్ నటిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్లో కార్తీ రెండు గెటప్‌లతో కనిపిస్తుండటం విశేషం. ‘‘ఓ చమత్కారమైన వ్యక్తి పాత్రలో నటిస్తూ ఓ కొత్త సినిమా జర్నీని స్టార్ట్ చేయడం ఆసక్తికరంగా ఉంది. జపాన్: మేడ్ ఇన్ ఇండియా’’ అని పేర్కొన్నారు కార్తీ. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, డీవోపీ: రవివర్మన్. -
ఆసక్తికర టైటిల్‌తో కార్తీ కొత్త సినిమా
విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్దార్ చిత్రాలు విజయంతో మంచి జోష్‌లో ఉన్న నటుడు కార్తీ తాజాగా కొత్త చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి జపాన్ అనే టైటిల్ నిర్ణయించారు. దీనిని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాష్, ప్రభు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇంతకుముందు కార్తీ హీరోగా శకుని, కాష్మోర, ధీరన్ అధికారం ఒండ్రు, సుల్తాన్ తదితర సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించారన్నది గమనార్హం. తాజాగా వీరి కాంబినేషన్లో రూపొందుతున్న జపాన్ ఆరో చిత్రం అవుతుంది. కాగా ఈ సంస్థ ఇంతకుముందు రాజు మురుగన్ దర్శకత్వంలో నిర్మించిన జోకర్ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకుంది. కాగా తాజాగా కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న జపాన్ చిత్రానికి రాజు మురుగన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇందులో నటి అను ఇమ్మానియేల్ కథానాయికగా నటిస్తుండగా టాలీవుడ్ నటుడు సునీల్, చాయాగ్రాహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం, రవివర్మ చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్‌ను తూత్తుకుడిలో నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు. త్వరలోనే చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. కాగా కార్తీ, దర్శకుడు రాజమురుగన్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో రూపొందుతున్న జపాన్ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటి నుంచే మంచి అంచనాలు నెలకొంటున్నాయి. -
అప్పటి వరకు అల్లు శిరీష్ ఎవరో కూడా తెలియదు: అను ఇమ్మాన్యుయేల్
నటి అను ఇమ్మానుయేల్ కోలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడిందని చెప్పవచ్చు. టాలీవుడ్లో పలు చి త్రాల్లో నటించిన ఈమె తమిళంలో విశాల్‌కు జంటగా తుప్పరివాలన్ చిత్రంతో పరిచయం అయింది. ఆ చిత్రంలో ఈమె పాత్ర పరిమితమే. గుర్తింపు అంతంత మాత్రమే. ఆ తర్వాత శివ కార్తికేయన్‌కు జంటగా నమ్మవీటి పిళ్లై చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో కనిపించలేదు. అయితే తాజాగా కార్తీకి జంటగా జపాన్ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. చదవండి: Anushka Shetty: ‘నేను యోగ టీజర్‌గా పనిచేశానని అందరికి తెలుసు.. కానీ అది ఎవరికి తెలియదు’ చిత్రం సోమవారం పూజా కార్య క్రమం చెన్నైలో ప్రారంభమైంది. కాగా అను ఇమ్మానుయేల్ గురించి ఇటీవల ఒక వదంతి వైరల్ అవుతోంది. ఈమె తెలుగులో అల్లు శిరీష్ జంటగా ఊర్వశివో.. రాక్షసివో చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ఫుల్ గా ప్రదర్శింపబడుతుంది. ఇక్కడ వర కు బాగానే ఉంది. అసలు కథ ఏంటంటే అను ఇమాన్యుల్ నటుడు అల్లు శిరీష్‌తో ప్రేమాయణం అంటూ ప్రచారం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. దీనిపై స్పందించిన ఆమె తాను అనుకోకుండానే ఈ రంగంలోకి ప్రవేశించానని చెప్పింది. కొన్ని సక్సెస్ఫుల్ చిత్రాల్లోనూ ప్లాప్ చిత్రాల్లోనూ నటించానని చెప్పింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే తాజాగా తెలుగులో అల్లు శిరీష్ సరసన నటించడంతో ఆయనతో ప్రేమలో పడ్డట్టు వదంతులు పుట్టిస్తున్నారని చెప్పింది. ఇలాంటి వాటిని తాను అస్సలు పట్టించుకోనని, అయితే తన తల్లి ఏడ్చేసిందని తెలిపింది. దీంతో అమ్మ వేదన చూసి తనకు బాధ కలిగిందని చెప్పింది. నిజానికి ఊర్వశివో.. రాక్షసివో చిత్రం షూటింగ్‌కు ముందు అల్లు శిరీష్ గురించి తనకు తెలియదని ఆయన్ని చూసింది కూడా లేదని చెప్పింది. చిత్ర షూటింగ్ పూజ సమయంలోనే తాను అల్లు శిరీష్‌ను కలిశానని చెప్పింది. ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి కాఫీ తాగితే కూడా రకరకాలుగా కట్టు కథలను అల్లేస్తున్నారని నటి అను ఇమ్మానుయేల్ ఆవేదన వ్యక్తం చేసింది. -
'ఊర్వశివో రాక్షసివో' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఈ రోజు కోసమే ఎదురు చూశాను : అల్లు అర్జున్
‘‘నా సినిమా హిట్ అయినా కూడా నేను ఇంత ఆనందంగా ఉండను.. నా తమ్ముడు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ తో హిట్ కొట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది.. ఈ రోజు కోసమే నేను ఎదురు చూశాను’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలయింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఊర్వశివో రాక్షసివో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఈ సినిమా మా గీతా ఆర్ట్స్‌కి, మా నాన్న–అమ్మలకు, నాకు, శిరీష్‌కి చాలా స్పెషల్ ఫిల్మ్. ఇకపై ఈ బ్యానర్లో ఎన్ని హిట్స్ వచ్చినా ‘ఊర్వశివో రాక్షసివో’ మరచిపోలేని అనుభూతి. ఈ హిట్ ఇచ్చిన రాకేష్ శశికి కృతజ్ఞతలు. శిరీష్‌తో హిట్ కొట్టిన మా నాన్నకి కంగ్రాట్స్. ఈ చిత్రంలో శిరీష్ నటన బాగుందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. ఈ సినిమా తనని మరో మెట్టు ఎక్కించింది. ‘పుష్ప 1’ తగ్గేదే లే.. ‘పుష్ప 2’ అస్సలు తగ్గేదే లే. ఈ సినిమా పాజిటివ్‌గా ఉంటుంది’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘ఐకాన్‌స్టార్‌గా ఆల్ ఇండియా స్థాయికి వెళ్లిపోయిన మన బన్నీ(అల్లు అర్జున్). ఇప్పుడిప్పుడు సక్సెస్ చూస్తూ స్టార్‌గా ఎదుగుతున్న మన శిరీష్. వాళ్లిద్దరూ ఇక్కడ ఉంటే నాకంటే ఆనంద పడేవారు ఎవరుంటారు. ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘20 ఏళ్ల క్రితం ‘ఆర్య’ సినిమాతో నేను, సుకుమార్, బన్నీ కలిసి ప్రయాణం స్టార్ట్ చేశాం. ఈ రోజు మేము, మా సంస్థ పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయాం. ‘ఆర్య’ చేసేందుకు ముఖ్య కారణం అల్లు అరవింద్‌గారు. ‘ఊర్వశివో రాక్షసివో’తో మంచి సక్సెస్ అƇదుకున్న టీమ్‌కి అభినందనలు. శిరీష్‌తో నేను ఓ సినిమా చేయాలి.. త్వరలో చేసి, తన బాకీ తీర్చేస్తాను’’ అన్నారు. ‘‘ఊర్వశివో రాక్షసివో’ ప్రయాణంలో నాకు సపోర్ట్ చే సిన అరవింద్, బన్నీవాస్గార్లకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇంత మంచి హిట్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని. ‘‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా సక్సెస్‌ని అల్లు శిరీష్గారిని అభిమానించే వారికి అంకితం ఇస్తున్నాను’’ అన్నారు రాకేష్ శశి. ‘‘అరవింద్‌గారి అబ్బాయిగా పుట్టడం నా అదృష్టం. బన్ని అన్న.. నన్ను ఓ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తాడు.. తన తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం’’ అన్నారు శిరీష్. ఈ వేడుకలో దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత ఎస్కేఎన్, నటుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
Urvasivo Rakshasivo: తమ్ముడికి సపోర్ట్‌గా అల్లు అర్జున్
ఎట్టకేలకు అల్లు శిరీష్ ఖాతాలో ఓ హిట్ పడింది. శుక్రవారం విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఓపెనింగ్స్ భారీ రేంజ్లో రాకపోయినా.. రెండో రోజు మాత్ర భారీ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంది. సునీల్, వెన్నెక కిశోర్‌ల కామెడీ, శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్‌ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్రబృందం ఫుల్ హ్యాపీగా ఉంది. శుక్రవారం సాయత్రమే సక్సెస్ మీట్ పెట్టి తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: ఊర్వసివో రాక్షసివో మూవీ రివ్యూ) ఇక ఆదివారం ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. తమ్ముడికి సపోర్ట్‌గా అన్న వస్తుండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. శిరీష్‌కు జోడీగా అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్గా నటించింది. సునీల్, వెన్నెల కిశోర్, ఆమని ఇతర కీలక పాత్రలు పోషించారు. 𝑰𝑪𝑶𝑵 𝑺𝑻𝑨𝑹 @alluarjun garu to grace the 𝒀𝑶𝑼𝑻𝑯𝑭𝑼𝑳 𝑩𝑳𝑶𝑪𝑲𝑩𝑼𝑺𝑻𝑬𝑹 celebrations of #UrvasivoRakshasivo as chief guest on Nov 6th @ JRC Convention, Hyd. 🤩@AlluSirish @ItsAnuEmmanuel @rakeshsashii @tanvirmir #AchuRajamani @anuprubens @GA2Official pic.twitter.com/s8GAY8Otsi — Geetha Arts (@GeethaArts) November 5, 2022 -
Urvasivo Rakshasivo Review: ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీ రివ్యూ
టైటిల్: ఊర్వశివో రాక్షసివో నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిశోర్, ఆమని, అనీష్ కురువిల్లా తదితరులు నిర్మాణ సంస్థలు: జీఏ2 పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాతలు: తమ్మారెడ్డి భరద్వాజ, ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎం సమర్పణ: అల్లు అరవింద్ దర్శకత్వం: రాకేశ్ శశి సంగీతం: అచ్చు రాజమణి (మాయారే పాట: అనూప్ రూబెన్స్) సినిమాటోగ్రఫీ: తన్వీర్ ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: నవంబర్ 4, 2022 గౌరవం’సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఊర్వశివో రాక్షసివో'తో నేడు(నవంబర్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మూడేళ్ల విరామం తర్వాత అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో' చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శ్రీకుమార్ అలియాస్ శ్రీ(అల్లు శిరీష్) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీకి పక్క ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్న సింధూజ అలియాస్ సింధు(అనూ ఇమ్మాన్యుయేల్) అంటే చాలా ఇష్టం. సింధూ..కెరీర్లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. అమెరికాలో చదువుకొని ఇండియా వచ్చి మోడ్రన్ లైఫ్‌ని గడుపుతుంది. ఆమెకి పెళ్లి అంటే నచ్చదు. కానీ శ్రీకుమార్‌ని ఇష్టపడుతుంది. ఇద్దరు కలిసి సహజీవనం చేసేందుకు సిద్ధపడతారు. దీని కోసం శ్రీ తన ఇంటికి దగ్గరలో ఓ ఇల్లుని అద్దెకు తీసుకుంటాడు. మరోవైపు శ్రీకుమార్కి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో సంబంధాలు చూస్తుంటారు అతని తల్లిదండ్రులు (ఆమని, కేదార్ శంకర్). శ్రీ మాత్రం తల్లిదండ్రుల దగ్గర సహజీవనం చేస్తున్న విషయాన్ని దాచి, సింధూని పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆమె అందుకు ఒప్పకోదు. కొడుకు పెళ్లి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీ తల్లి ఓ రోజు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత శ్రీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తల్లి కోసం పెళ్లి చేసుకున్నాడా? లేదా ప్రేయసిని దక్కించుకోవడం కోసం సహజీవనాన్ని కొనసాగించాడా? కొడుకు తప్పిపోయాడని శ్రీ పేరెంట్స్ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు? సహజీవనం విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా ఉంచడానికి శ్రీ పడిన కష్టాలేంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఎలాంటి గోల్ లేకుండా సాధారణ జీవితాన్ని గడిపే ఓ అమాయకపు యువకుడికి, కెరీర్ ఓరియెంటెడ్ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే యూత్ టార్గెట్‌గా తీసిన మూవీ అని అర్థమవుతుంది. కథనం కూడా అలాగే సాగుతుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక రొమాంటి సీన్‌తో ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ప్రస్తుతం చాలా మంది యువతీయువకులు లివింగ్ లైఫ్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే పాయింట్‌తో దర్శకుడు రాకేశ్ శశి ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ కథలో కొత్తదనం ఏమి ఉండదు.. కానీ ఫుల్ కామెడీ, రొమాంటిక్ సీన్స్‌తో సాగడంతో ఎక్కడా బోర్కొట్టినట్లు అనిపించదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ని ఓ వర్గం ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి సాగదీత లేకుండా సినిమా స్ఠార్టింగ్ నుంచే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ సాగుతుంది. ప్రేమించిన అమ్మాయి.. తను పని చేసే ఆఫీస్‌లోకి రావడం.. తన ప్రేమ విషయాన్ని ఆమెతో చెప్పడానికి హీరో పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్ మొత్తం సహజీవనం చుట్టే సాగుతుంది. హీరో హీరోయిన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, కామెడీ ఆకట్టుకుంటాయి. సహజీవనం ఎపిసోడ్‌ని క్రికెట్ కామెంట్రీతో ముడిపెట్టి చెప్పడంతో కామెడీ బాగా పండింది. అయితే ఈ చిత్రంలో ఎమోషన్స్‌ని కూడా యాడ్ చేశారు కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. హీరోయిన్ పెళ్లి ఎందుకు వద్దనుకుంటుందో అనేదానికి బలమైన కారణాన్ని చూపించలేదు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు కానీ..యూత్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. చాలా కాలం తర్వాత అల్లు శిరీష్ తెరపై కనిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన చాలా మెరుగుపడింది. మిడిల్ క్లాస్ యువకుడు శ్రీకుమార్ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీతో అదరగొట్టేశాడు. మోడ్రన్ అమ్మాయి సింధూ పాత్రకి అనూ ఇమ్మాన్యుయేల్ న్యాయం చేసింది. తన గ్లామర్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. శిరీష్, అనూల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం సునీల్, వెన్నెల కిశోర్‌ల కామెడీ. వీరిద్దరు కలిసి పండించిన కామెడీకి ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. పొసాని కృష్ణమురళి ఒకటి రెండు సీన్స్‌లో కనిపించినా.. తనదైన శైలీ కామెడీతో నవ్వించాడు. హీరో తల్లిగా ఆమని మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించారు.కేదార్ శంకర్, పృథ్వితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అచ్చు రాజమణి సంగీతం బాగుంది. పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. తన్వీర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి, వెబ్‌డెస్క్ -
అల్లు అరవింద్ అలా అడిగేసరికి షాక్ అయ్యాను : అను ఇమ్మానుయేల్
మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయైన బ్యూటీ అను ఇమ్మానుయేల్. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ అల్లు శిరీష్‌తో డేటింగ్లో ఉందంటూ కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ లేకపోయినా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని తిరగుతున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తుంది. ఇదే విషయం గురించి అను ఇమ్మానుయేల్‌ని పిలిచి మరి అల్లు అరవింద్ డైరెక్ట్‌గా అడిగేశాడట. ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అను ఇమ్మానుయేల్ మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టేసింది. శిరీష్‌తో ప్రేమలో ఉన్నానంటూ వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ మూవీ ఓపెనింగ్ రోజు పూజలోని శిరీష్‌ని నేను కలిశాను. ఆ తర్వాత మూవీ కోసం ఓసారి కాఫీ షాప్‌లో మాట్లాడకున్నాం. ఆ మాత్రానికే డేటింగ్ అంటూ వార్తలు రాసేశారు. అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య మూవీలో నటించాను. అప్పటి నుంచి ఆ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది అంతే. అల్లు అరవింద్ కూడా ఓసారి నన్ను నా కొడుకుతో డేటింగ్లో ఉన్నావా అని అడిగారు. ఆ తర్వాత చాలా సేపు దీని గురించి మాట్లాడి నవ్వుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. -
అందాలతో మత్తెక్కిస్తున్న అను ఇమ్మానియేల్ (ఫొటోలు)
-
సినిమా ఇండస్ట్రీ ఓ కుటుంబం
‘‘సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కుటుంబం. మనుషుల జీవితాల్లో సినిమా కూడా నిత్యసాధనం అయిపోయింది. ఇలాంటి సమయాల్లో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందేలా దర్శక–నిర్మాతలు కృషి చేయాలి’’ అన్నారు హీరో బాలకృష్ణ. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం బిగ్ టికెట్‌ను బాలకృష్ణకు అందించారు అల్లు అరవింద్. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘అరవింద్‌గారి అసోసియేషన్‌తో నేను చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’కు మంచి స్పందన లభిస్తోంది. అల్లు రామలింగయ్యగారితో వర్క్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. శిరీష్, అను, దర్శకుడిగా రాకేశ్ బాగా చేశారనిపిస్తోంది. ప్రతి మనిషిలో విభిన్నకోణాలు ఉంటాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. ఓ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా ఆ తాలూకు బరువు, బాధ్యతలన్నీ మహిళల చేతుల్లోనే ఉంటాయి. కాలంతో ఇప్పుడు కొన్ని పరిస్థితులు, అభిరుచులు కూడా మారుతున్నాయి. సహజీవనం, ఎఫైర్స్ అనేవి కూడా నడుస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ‘ఊర్వశివో రాక్షసివో..’ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శిరీష్ మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఈ మూవీలో నటించాడు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పుట్టిన సినిమా ఇది. మంచి ఎంటర్టైనర్ అండ్ ఓ ఇన్‌డెప్త్ డిస్కషన్ ఈ సినిమాలో ఉంది.. దాన్ని తెరపైనే చూడాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి 60వ బర్త్ డే వేడుకల్లో బాలకృష్ణగారు పాల్గొన్నారు. కొంత సమయం తర్వాత ఆ ఫంక్షన్లో మా జోష్ తగ్గింది కానీ బాలకృష్ణగారి జోష్ తగ్గలేదు. ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాల తర్వాత నాన్నగారితో ముచ్చటగా మూడోసారి నేను చేసిన ఈ చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అల్లు శిరీష్. ‘‘శిరీష్‌గారు, అను వల్ల ఈ సినిమా మేకింగ్ చాలా సాఫీగా జరిగింది’’ అన్నారు రాకేష్ శశి. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, కొరియోగ్రాఫర్ విజయ్, దర్శకులు మారుతి, పరశురామ్, చందూ మొండేటి, వశిష్ఠ్, వెంకటేశ్ మహా, దర్శక–నిర్మాత, రచయిత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్, ‘గీతాఆర్ట్స్’ బాబు, సత్య, పూర్ణా చారి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు మాధవ్, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రిపోర్టర్‌పై అను ఇమ్మాన్యుయేల్ ఫైర్.. అడగడానికి వేరే ప్రశ్నలు లేవా?
-
రిపోర్టర్‌పై హీరోయిన్ ఫైర్.. అడగడానికి వేరే ప్రశ్నలు లేవా?
మజ్ను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది అను ఇమ్మాన్యుయెల్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా అల్లు శిరీష్‌తో జతకట్టింది. వీరిద్దరూ కలిసి నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్‌పై హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ ఫైర్ అయ్యింది. ''మీరు అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య చేశారు. ఇప్పుడు శిరీష్‌తో 'ఊర్వశివో రాక్షసివో' చేశారు... అన్నదమ్ములిద్దరిలో ఎవరు క్యూట్, ఎవరు నాటీ''? అని రిపోర్టర్ అడిగాడు. దీంతో అసహనానికి గురైన అను మీ దగ్గర ఇంతకన్నా మంచి ప్రశ్నలేం లేవా.. అడగడానికి అంటూ కోప్పడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో అనూకి అంత కోపం ఎందుకో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కాగా అను, శిరీష్ ఇద్దరు లవ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. -
పోరీల ఎంటపోకు ఫ్రెండూ అని పాడుతున్న అల్లు శిరీష్
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ బ్యానర్లో రాబోతున్న నెక్స్ట్ మూవీ "ఊర్వశివో రాక్షసివో". అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శిరీష్ సరసన "అను ఇమ్మాన్యూల్" హీరోయిన్గా నటించింది. ఇదివరకే రిలీజ్ చేసిన "ఊర్వశివో రాక్షసివో" చిత్ర టీజర్ కు, సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది. తాజాగా ఈ మూవీలో ‘మాయారే’ అంటూ సాగే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. రాహుల్ సిప్లీగంజ్ ఆలపించిన ఈ పాటను కాసర్య శ్యామ్ రచించారు. అనూప్‌రూబెన్స్,అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. చదవండి: ఒంటరిగా రమ్మన్నాడు, కొలతలు అడిగి నీచంగా -
‘ఊర్వశివో రాక్షసివో’.. నుంచి ఫస్ట్ లవ్‌సాంగ్ వచ్చేసింది
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటించిన చిత్రం "ఊర్వశివో రాక్షసివో". రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే టీజర్‌ను రిలీజ్ చేయగా,అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ని విడుదల చేసింది. ‘‘దీంతననా దీంతననా నీ చూపుల దాడి.. చేసిందే చేసిందే ఈ గారడీ’’అంటూ సాగే ఈ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ ఆలపించారు. -
అను ఇమ్మాన్యుయేల్‌కు మరో చాన్స్
తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ గ్లామరస్ కథానాయకిగా ముద్ర వేసుకున్న నటి అను ఇమ్మాన్యుయేల్. తెలుగులో అల్లుఅర్జున్, నాగచైతన్య వంటి స్టార్ హీరోలతో జతకట్టింది. అయినా సరైన సక్సెస్ కోసం ఇంకా ఎదురు చూస్తునే ఉంది. ఇక తమిళంలోనూ విశాల్, శివకార్తికేయన్ సరసన నటించింది. ఇక్కడ కూడా సరైన గుర్తింపు కోసం ఎదురుచూసోంది. తాజాగా ఓ సూపర్ చాన్స్ ఈ అమ్మడిని వరించినట్లు తెలుస్తోంది. విరుమాన్, పొన్నియిన్ సెల్వన్ వంటి వరుస విజయాలతో ప్రేక్షకులను అలరించిన నటుడు కార్తీ. తాజాగా దీపావళికి సర్ధార్ చిత్రంతో సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి రాశీఖన్నా, రెజీనా విజయన్ హీరోయిన్లుగా నటించారు. కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా ఈయన నూతన చిత్రానికి రెడీ అవుతున్నారు. రాజు మురుగన్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో బాలీవుడ్ నటి నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా నటి అను ఇమ్మాన్యుయేల్‌కు ఈ అదృష్టం వరించిందని సమాచారం. -
యూత్‌ని ఆకట్టుకునేలా అల్లు శిరీష్ ‘ఊర్యశివో రాక్షసివో’ టీజర్
అల్లు శిరీష్ , అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఊర్యశివో రాక్షసివో’. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు మేకర్స్. యూత్‌ని టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ లోని కొన్ని డైలాగ్స్, అలానే కొన్ని సీన్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయని చెప్పొచ్చు. అంతర్లీనంగా ప్రేమకి,స్నేహానికి ఉన్న తేడాను దర్శకుడు ఆవిష్కరించినట్లు అర్ధమవుతుంది. గీతాఆర్ట్స్ 2 బ్యానర్‌పై పై ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రావణాసుర షురూ
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ షురూ అయింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం భోగి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు చిరంజీవి క్లాప్ ఇచ్చారు. దర్శకులు కేయస్ రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు కె. రాఘవేంద్ర రావు స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. ఈ సందర్భంగా ‘రావణాసుర’ పోస్టర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్లో పేర్కొంది చిత్రబృందం. ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా ‘రావణాసుర’ రూపొందనుంది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని అభిషేక్ నామా అన్నారు. సుశాంత్ కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్, కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సీఈఓ: పోతిని వాసు. -
చీర కట్టులో మెరిసిపోతున్న అను ఇమాన్యుయేల్.. ధరెంతో తెలుసా!
‘కళ్లు మూసి తెరిచేలోపే, గుండెలోకే చేరావే..’ అంటూ అభిమానుల మనసు దోచుకొని మజ్నూలుగా మార్చేసిన నటి.. అమెరికా అమ్మాయి.. అను ఇమాన్యుయేల్. ఆమె మదిలో స్థానం సంపాదించుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. మెరో జ్యూయెలరీ రాజస్థాన్‌లో ‘మెరో’ అంటే ‘గని’ అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే ఇదొక ఆభరణాల ఖని. అంతరించిపోతున్న గిరిజన, సంప్రదాయ ఆభరణాల డిజైన్స్‌ను శోధించి, సాధిస్తుంది ఈ బ్రాండ్. ఎక్కువగా హస్తకళ, శిల్పకళల సంప్రదాయ వారసత్వం నుంచి ప్రేరణ పొందిన డిజైన్స్ ఇక్కడ లభిస్తాయి. బంగారు ఆభరణాలు కూడా దొరుకుతాయి. కానీ, వెండితో తయారు చేసిన వాటికే గిరాకీ ఎక్కువ. ఆభరణాల నాణ్యతతో సంబంధం ఉండదు. డిజైన్‌ను బట్టే ధర ఉంటుంది. ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల్లో ఈ బ్రాండ్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ మెరో జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: మెరో జ్యూయెలరీ ధర: రూ. 8,000 సాక్షం అండ్ నీహారిక సాక్షం, నీహారిక బిజినెస్ పార్ట్‌నర్సే కాదు.. మంచి స్నేహితులు కూడా. ఫ్యాషన్‌పై వారికి ఉన్న అభిరుచులు, ఆలోచనలు ఒక్కటే కావడంతో కలసి కెరీర్‌ను స్టార్ట్ చేశారు. న్యూఢిల్లీలోని ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి, 2017లో ఇద్దరి పేరుతో ఓ ఫ్యాషన్ హౌస్ ప్రారంభించారు. ఎక్కువగా చేనేత కళాకారులు నేసిన ఫ్యాబ్రిక్‌నే ఉపయోగిస్తారు. సూరత్, జైపూర్ కళాకారులతో కుట్లు, అల్లికలు, రంగు అద్దకాల డిజైన్స్ వేయిస్తుంటారు. ఇక సున్నితమైన సంప్రదాయ డిజైన్స్‌లో వీరికి పెట్టింది పేరు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంటుంది. చీర బ్రాండ్: సాక్షం అండ్ నీహారిక ధర: రూ. 36,990 - దీపిక కొండి చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే.. -
సమయం వృథా చేయాను.. అందుకే అప్పుడు ఏడ్చేశా: అదితీరావు
‘‘నాకు చాలెంజింగ్ పాత్రలంటే చాలా ఇష్టం. ఆ విషయంలో మణిరత్నంగారు నా గురువు. నేను స్టార్లా సెట్‌కు రాను.. ఓ నటిగా వస్తాను. దర్శకులు చెప్పింది చేస్తాను. ‘మహాసముద్రం’లో మహా పాత్రకు ప్రాణం పోసేందుకు ప్రయత్నించాను’’ అని అదితీరావు హైదరీ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్, అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ ముఖ్య పాత్రల్లో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహాసముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదితీరావు హైదరీ మాట్లాడుతూ – ‘‘రెండేళ్ల క్రితం అజయ్ భూపతి నాకు ‘మహాసముద్రం’ స్క్రిప్ట్‌ను వినిపించారు. కథ బాగా నచ్చింది. నేను చేసిన మహా పాత్ర స్వీట్, హార్డ్ వర్కింగ్.. నిజాన్ని చెప్పే గుణం ఉంటుంది. నాకు ప్రేమకథలంటే చాలా ఇష్టం. సరైన కథ, సరైన దర్శకుడి కోసం ఎదురుచూస్తుంటాను. అజయ్‌గారు ప్రేమకథ అని చెప్పడంతో ఎంతో సంతోషించాను. ఈ సినిమా రెండు ట్రైలర్లు చూసినా స్టోరీని ఎవ్వరూ ఊహించలేకపోయారు. నేను హైదరాబాద్‌లో పుట్టాను. కానీ, పెరిగింది నార్త్‌లోనే. నాకు తెలుగు అంతగా రాదు. అయితే నాకు డైలాగ్స్ ఇచ్చి, అర్ధరాత్రి లేపి సీన్ నంబర్ చెబితే ఇట్టే చెబుతాను.. అంతలా బట్టీపట్టేస్తాను. ఎందుకంటే సెట్‌కు వచ్చినప్పడు మిగతా వాళ్ల సమయం వృథా చేయాలనుకోను. ఓసారి డైలాగ్ ప్రాక్టీస్ చేసేలోపు పిలవడంతో వెంటనే చెప్పలేకపోయాను.. అప్పుడు ఏడ్చేశాను. బయోపిక్స్‌లో నటించడం నాకు ఇష్టం. ఎంఎస్ సుబ్బలక్ష్మీ, రేఖగార్ల బయోపిక్ అయితే బాగుంటుంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్–బృందా మాస్టర్‌తో ఓ చిత్రం చేస్తున్నాను. హిందీలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమాతో పాటు మరికొన్ని ఉన్నాయి’’ అన్నారు. -
మహా సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
పండగకి వచ్చిన ప్రతిసారీ హిట్ సాధించా..
‘‘మహాసముద్రం’ శర్వా సినిమా అని సిద్ధూ అన్నాడు. కానీ నేను ఒప్పుకోను. ఈ సినిమాకు కథే హీరో. ఓ సందర్భంలో రావు రమేష్‌గారు దర్శకుడు అజయ్ భూపతి దగ్గర ఓ కథ ఉందని, కానీ హీరోలు కుదరడం లేదనీ అన్నారు. మంచి హిట్ ఇచ్చిన దర్శకుడికి హీరోలు కుదరకపోవడం ఏంటి? అనుకున్నాను. ఆ తర్వాత నేను కథ విని ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పాను. అనిల్ సుంకర్‌గారు కూడా కథ వినగానే ఓకే చెప్పారు’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ నెల 14న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా పాల్గొన్న హీరో కార్తికేయ సినిమా సెకండ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘తొమ్మిది మంది జీవితాల్లో జరిగే కథ ఇది. మహా (అదితి) క్యారెక్టర్ చుట్టూ తిరిగే కథ. మహాలాంటి క్యారెక్టర్ చేయడం కష్టం. అదితీ అద్భుతంగా చేశారు. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా బాగా చేశారు. ‘అంతఃపురం’లో జగపతిబాబుగారి యాక్టింగ్ చూసి, ఫ్యాన్ అయిపోయాను. ఆయనతో యాక్ట్ చేయాలన్న నా కల ఈ చిత్రంతో నిజమైంది. నేను పండక్కి వచ్చిన ప్రతిసారీ అందరం పండగ చేసుకున్నాం. ఒక సంక్రాంతికి ‘ఎక్స్‌ప్రెస్ రాజా’తో, ఇంకో సంక్రాంతికి ‘శతమానంభవతి’తో, ఒక దసరాకు ‘మహానుభావుడు’తో హిట్ సాధించా. ఈ దసరాకు ‘మహాసముద్రం’తో వస్తున్నాం. హిట్ కొడుతున్నాను’’ అన్నారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ – ‘‘ఏ స్టార్ (నక్షత్రం)కీ సొంత వెలుగు ఉండదు. ఏ స్టార్ అయినా సూర్యుడి వెలుగు తీసుకోవాలి. నా సూర్యులు తెలుగు ప్రేక్షకులు. అందరూ ఇది మల్టీస్టారర్ ఫిల్మ్ అంటున్నారు. కానీ నా దృష్టిలో ఇప్పుడు కాదు.. ఎప్పటికీ ‘మహాసముద్రం’ శర్వానంద్ సినిమానే. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత అజయ్ భూపతి స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మన అభిమాన స్టార్ స్క్రీన్‌పై వచ్చారని చప్పట్లు కొట్టకుండా.. వారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేశారో చూసి చప్పట్లు కొట్టే సినిమా ఇది’’ అన్నారు. అజయ్ భూపతి మాట్లాడుతూ– ‘‘ఇది భావోద్వేగాల ప్రేమకథ. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో కూడిన కొందరి జీవితాలు ఎవరి వల్ల ఏ విధంగా ప్రభావితం అయ్యాయి అనే అంశం కూడా ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీయే హీరో. భావోద్వేగాలు నిండిన కళ్లతో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ‘ఆర్ఎక్స్ 100’ అప్పుడు కూడా ఇలానే మాట్లాడితే ఓవర్‌గా మాట్లాడుతున్నాడన్నారు. అప్పుడు ఆడియన్స్‌ను థియేటర్స్‌కు తీసుకుని రావాలని ప్రయత్నించాం. కానీ ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నా ఫర్వాలేదు. ‘మహాసముద్రం’ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ – ‘‘అజయ్ చెప్పిన కథ నాకు కొత్తగా అనిపించింది. శర్వా, సిద్ధార్థ్, అను, అదితీ ఈ సినిమాకు నాలుగు పిల్లర్లు. ‘మహాభారతం’లో యుద్ధానికి శకుని కారణం అయితే.. ఈ సినిమాలో అలాంటి శకుని గూని బాజ్జీ పాత్ర చేశారు రావు రమేష్‌గారు. సినిమాలు తీసేది థియేటర్స్‌లో విడుదల చేయడానికే. కుదరకపోతే తప్ప... కుదిరినప్పుడు సినిమాను తప్పకుండా థియేటర్స్‌లోనే రిలీజ్ చేయాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో స్మిత క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతిగారికి, నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. ‘‘మహా క్యారెక్టర్ ఇచ్చిన అజయ్ భూపతికి, సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్న అనిల్ సుంకరగారికి ధన్యవాదాలు’’ అన్నారు అదితీరావు హైదరీ. ‘‘నేనేంటో నిరూపించుకోవడానికి ‘మహాసముద్రం’ లాంటి సినిమా ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘మహా సముద్రం’ మూవీ స్టిల్స్
-
ప్రీ లుక్‌తోనే షాకిస్తున్న అల్లు శిరీష్.. అస్సలు తగ్గట్లేదుగా
ఇటీవల సిక్స్ ప్యాక్‌తో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్య పరిచిన అల్లు శిరీష్.. ఇప్పుడు తన కొత్త సినిమాకి సంబంధించి ప్రీలుక్లలో షాకిస్తున్నాడు. ఇప్పటికే అద్దం చాటున అను ఇమ్మాన్యుల్కి ముద్దులు ఇస్తున్న పోస్టర్ని విడుదల చేసి రచ్చ చేసిన ఈ యంగ్ హీరో.. తాజాగా మరో రొమాంటిక్ లుక్‌ని వదిలాడు. ఇందులో మరింత రెచ్చిపోయాడు శిరీష్. ఈ లేటెస్ట్ నయా ప్రీ లుక్ వైరల్ అయింది. మే 30న(శిరీష్ బర్త్‌డే)న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు ప్రీలుక్ ద్వారా తెలియజేసింది. ఇప్పటి వరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్లని శిరీష్.. ఈ సినిమాలో రెచ్చిపోయినట్లు ప్రీ లుక్ పోస్టర్లు చూస్తే అర్థమవుతంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్‌తో కనిపించబోతున్నట్లు సమాచారం. Here's our second prelook. Excited to share the title & first look our film tomorrow at 11am. #sirish6 @GA2Official @ItsAnuEmmanuel #rakeshsashii pic.twitter.com/7nKTuiyJNJ — Allu Sirish (@AlluSirish) May 29, 2021 చదవండి: సిగరెట్ కాలుస్తూ హీరో నిఖిల్.. మహానటి జ్ఞాపకాలు.. ఆ తర్వాతే ఊపిరి పీల్చుకున్న: కీర్తి -
అద్దం చాటున శిరీష్ ముద్దులు.. రొమాంటిక్ లుక్ రిలీజ్
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. మే 30న(శిరీష్ బర్త్‌డే)న ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు ప్రీలుక్ ద్వారా తెలియజేసింది. ఇందులో శిరీష్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ను అద్దం చాటున ముద్దు పెడుతున్నట్లు ఉంది. ఇప్పటి వరకు రొమాన్స్ జోలికి పెద్దగా వెళ్లని శిరీష్.. తాజా చిత్రంలో లిప్ లాక్ ఇచ్చినట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ క్రింద బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్‌తో కనిపించబోతున్నట్లు సమాచారం. Here’s a movie that gives a refreshing perspective to love and relationship. Presenting the Pre Look of @AlluSirish & @ItsAnuEmmanuel's #Sirish6 💞#Sirish6FirstLook 👉🏻 May 30th at 11 am! ✅ Advance Birthday Wishes to #AlluSirish 🥳#AlluAravind @GA2Official pic.twitter.com/18CIGvgeW6 — Geetha Arts (@GeethaArts) May 27, 2021 -
ఐదెకరాల పొలంతో పాటు ఓ స్కూటర్ ఉంది..నన్ను పెళ్లిచేసుకుంటావా?
నాచురల్ స్టార్ నాని సరసన మజ్ను మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమాన్యుయేల్ ఆ తర్వాత అల్లు అర్జున్, పవన్‌కల్యాణ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టినా ఈ అమ్మడికి పెద్దగా కలిసిరాలేదు. కెరీర్‌తో ఇంతరకు ఆశించిన స్థాయిలో హిట్ పడలేదు. అయితే ఈ మధ్య కుర్రహీరో అల్లు శిరీష్‌తో లవ్ ట్రాక్ కొనసాగిస్తుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఇప్పటివరకు ఏ హీరోయిన్‌తోనూ రూమర్స్ రాని శిరీష్ ఈ మధ్యకాలంలో అను ఇమాన్యుయేల్‌తో క్లోజ్ అయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు ఇద్దరూ స్పందించకపోవడంతో ఆ వార్తలకు ఫుల్స్టాప్ పడటం లేదు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫోటో షూట్లతో ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా లాంగ్ వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను షేర్ చేయగా ఓ నెటిజన్ నుంచి ఊహించని విధంగా రియక్షన్ వచ్చింది. మీరు నన్ను పెళ్లిచేసుకుంటారా? నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. గార్డెన్తో కూడిన ఓ అందమైన ఇళ్లు ఉంది. అలాగే ఓ స్కూటర్ కూడా ఉంది. వీటన్నింటికి మించి మీపై బోలెడంత ప్రేమ ఉంది అంటూ లవ్ ప్రపోజ్ చేశాడు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చదవండి : కొన్నాళ్లుగా హీరోయిన్‌తో రిలేషన్షిప్లో ఉన్న అల్లు శిరీష్! అను ఇమాన్యుయేల్‌తో అల్లు శిరీష్ చాట్ వైరల్ -
హీరోయిన్‌కు అల్లు శిరీష్ స్పెషల్ గిఫ్ట్, స్పెషలేంటో?
అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ 2013లో ఇండస్ర్టీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి రూమర్స్ లేవు. అయితే గత కొంతకాలంగా హీరోయిన్ అను ఇమాన్యుయేల్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ సెట్లోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరేస్తూ ఇద్దరూ కలిసి కాఫీ షాపులు, పార్టీలు అంటూ కెమెరాలకు చిక్కుతున్నారు. అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే శిరీష్..ఇమాన్యుయేల్‌తో ఇంత క్లోజ్‌గా మూవ్ అవ్వడంతో వీరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఇక ఇటీవలె అను ఇమాన్యుయేల్ బర్త్‌డే సందర్భంగా అల్లు శిరీష్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. హ్యాపీ బర్త్‌డే సైకో అంటూ అల్లు శిరీష్ స్పెషల్ విషెస్ చెప్పారు. ఇప్పడు మరోసారి వీరిద్దరి టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ప్రయసిగా ప్రచారంలో ఉన్న అను ఇమాన్యుయేల్‌కు అల్లు శిరీష్ ప్రత్యేకంగా గిఫ్ట్ పంపారు. ప్రెట్టీ లిటిల్ సైకో అంటూ టీషర్ట్‌పై ప్రింట్ చేయించి అను ఇమాన్యుయేల్‌కు పంపాడు. దీనిపై స్పందించిన ఈ భామ..సైకో అని ఉన్నా దీన్ని క్లాంపిమెంట్గానే తీసుకుంటానని చెబుతూ అల్లు శిరీష్‌ని వియర్డో అంటూ సంభాషించింది. దీన్ని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన శిరీష్..వియర్డోనా...మనలో చాలా కామన్ విషయాలు ఉన్నాయి అంటూ స్వీట్‌గా ఈ భామపై సెటైర్ వేశారు. అంతేకాకుండా ఎనీవే యూ ఆర్ వెల్కమ్ మై ఫేవరేట్.. అంటూ షేర్ చేశారు. ప్రస్తుతం అల్లు శిరీష్-అను ఇమాన్యుయేల్ మధ్య జరిగిన ఈ చాట్ సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. శిరీష్ తన పోస్టులో మై ఫేవరెట్...అంటూ గ్యాప్ ఇవ్వడంతో వీరి మధ్య ఏదో ఉందని, అందుకే ఇంత క్లోజ్‌గా నిక్ నేమ్స్ కూడా పెట్టుకున్నారని నెట్టింట ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్స్‌పై ఇప్పటిదాకా శిరీష్ స్పందించలేదు. చదవండి: కొన్నాళ్లుగా హీరోయిన్‌తో రిలేషన్షిప్లో ఉన్న అల్లు శిరీష్! తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. కారణం ఇదే -
అను ఇమ్మాన్యుయేల్ గ్లామరస్ ఫోటోలు
-
హీరోయిన్‌తో అల్లు శిరీష్ డేటింగ్ ? ఫోటోలు వైరల్
ఇండస్ర్టీలో హీరోయిన్లతో ప్రేమ విషయానికి వస్తే కొందరు హీరోలు గుర్తొస్తారు. కొన్నాళ్ల పాటు వారి లవ్ స్టోరీ ఇండస్ర్టీ మొత్తం హాట్ టాపిక్ అవుతోంది. ఇంకొందరేమో అమ్మాయిలంటేనే చాలా దూరంగా ఉంటారు. ఈ కోవలోకే వస్తారు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్. 2013లో ఇండస్ర్టీలోకి ఇచ్చిన ఈయనపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ లేవు. అయితే తాజాగా శిరీష్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌తో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి.. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాల్లో నటించింది ఈ భామ.. ఇప్పుడు అల్లు శిరీష్‌తో ప్రేమలో ఉందని ఇండస్ట్రీలో వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి కొంతకాలంగా వీరి మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. లేటెస్ట్గా అల్లు శిరీష్ షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. రెండు రోజుల క్రితం మార్చి28న నటి అను ఇమ్మాన్యుయేల్ పుట్టినరోజు కావడంతో అల్లు సిరిష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. లేట్‌గా విషెస్ చెబుతున్నానని నాకు తెలుసు..కానీ ఈ వీడియోతో రావడానికి లేట్ అయ్యింది. హ్యాపీ బర్త్‌డే సైకో అంటూ శిరీష్ విషెస్ చెప్పారు.ఎప్పుడూ సినిమాలు లేదా ఫిట్‌నెస్‌పై మాత్రమే దృష్టి పెట్టే శిరీష్..కొన్నాళ్లుగా అను ఇమ్మాన్యుయేల్‌తో డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించనున్నారని కూడా తెలుస్తుంది.ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న మహా సముద్రం సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా, శిరీష్ ఓ సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) చదవండి : వకీల్‌సాబ్ ట్రైలర్ లాంచ్.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ దర్శకుడితో ప్రేమలో ప్రముఖ హీరోయిన్! -
మిల్కీ బ్యూటీ అందాల విందు.. సెగలు రేపుతున్న మాళవికా
► సముద్రతీరంలో సరదాగా గడుపుతోంది అను ఇమ్మాన్యుయెల్ ► కాలానికి.. ప్రపంచానికి దూరంగా.. అంటూ మాళవిక మోహనన్ ఒక ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసింది ► పింక్ కలర్ డ్రెస్‌లో ఫోటోకి ఫోజులిచ్చి కుర్రకారుల మతులు పొగొడుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా ► సండే రెస్ట్‌డే అంటూ తన పెట్ డాగ్‌పై తలపెట్టి నిద్రపోతున్న సమంత View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
దర్శకుడితో ప్రేమలో ప్రముఖ హీరోయిన్!
తెర మీద హీరోహీరోయిన్లు ప్రేమించుకుంటారు. తెర వెనుక కూడా చాలామంది హీరోహీరోయిన్లు ప్రేమలో పడతారు. అయితే కొన్నిసార్లు దర్శకులు హీరోయిన్లు కూడా ప్రేమపాఠాలు చెప్పుకుంటారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఓ దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె 2017లో నటించిన 'ఆక్సిజన్' సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణతో డేటింగ్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారిందని అంటున్నారు. ఇక ఈ వార్తలపై అను ఇమ్మాన్యుయేల్ కానీ, జ్యోతి కృష్ణ కానీ ఇంతవరకు స్పందించనేలేదు. కాగా ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం కుమారుడే ఈ జ్యోతి కృష్ణ. అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ విషయానికి వస్తే.. 'యాక్షన్ హీరో బైజు' చిత్రంతో హీరోయిన్గా అడుగు పెట్టిందీ బ్యూటీ. ఇది మలయాళ సినిమా అయినప్పటికీ అనుకు ఆఫర్లు వచ్చింది మాత్రం తెలుగులోనే. అలా టాలీవుడ్లో తొలి చిత్రం 'మజ్ను'లో నాని సరసన నటించి మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా హిట్టవ్వలేదు. ఇక 'శైలజా రెడ్డి' అల్లుడు తర్వాత ఇక్కడ పూర్తిగా స్లో అయిన అను ఈ మధ్యే బెల్లంకొండ శ్రీనివాస్ సరసన 'అల్లుడు అదుర్స్'లో నటించింది. కానీ అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కోలీవుడ్‌లోనూ రెండు, మూడు సినిమాల్లో తళుక్కుమని మెరిసింది. ప్రస్తుతం ఈ అమ్మడు శర్వానంద్, సిద్దార్థ్ కలిసి నటిస్తున్న 'మహాసముద్రం'లో ఓ హీరోయిన్గా నటిస్తోంది. దీనికి 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆమెకు ఏమేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి! చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’.. -
‘అల్లుడు అదుర్స్’ సక్సెస్ మీట్
-
ఈ అల్లుడు బెదుర్స్!
చిత్రం: ‘అల్లుడు అదుర్స్’; తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేశ్, ప్రకాశ్ రాజ్, సోనూసూద్, అనూ ఇమ్మాన్యుయేల్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కెమేరా: ఛోటా కె. నాయుడు; ఫైట్స్: రామ్ – లక్ష్మణ్, స్టన్ శివ; ఎడిటింగ్: తమ్మిరాజు; నిర్మాత: గొర్రెల సుబ్రహ్మణ్యం; దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్; రిలీజ్: జనవరి 14 అల్లుడు పాత్ర తెలుగు సినిమాకు మంచి కమర్షియల్ ఎలిమెంట్. సంక్రాంతికి అత్తారింటికి కొత్త అల్లుళ్ళు వచ్చినట్టే... ఈ సినీ సంక్రాంతికి థియేటర్లకు వచ్చిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. కానీ, అన్నిసార్లూ అల్లుడి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? విలన్ మామ గారిని ఒప్పించి, హీరోయిన్‌తో ప్రేమ పెళ్ళి చేసుకున్న హీరో కథలు కొన్ని వందల సినిమాల్లో చూశాం. మరోసారి ఆ ఫార్ములాను వాడి, తీసిన సినిమా ఇది. కథేమిటంటే..: ఫ్యాక్షనిస్ట్ తరహా లీడర్ – నిజామాబాద్ జైపాల్ రెడ్డి (ప్రకాశ్ రాజ్). అతనికి ఇద్దరు కూతుళ్ళు. పెద్దమ్మాయి వసుంధర (అనూ ఇమ్మాన్యుయేల్). చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ అయిన ఆ అమ్మాయంటే శీను (బెల్లంకొండ సాయి శ్రీనివాస్)కు ఇష్టం. కానీ, ఆమె రియల్ ఎస్టేట్ గజ (సోనూసూద్)ను ప్రేమిస్తుంది. ఇది ఇలా ఉండగా, తెలియకుండానే వసుంధర చెల్లెలు కౌముది (నభా నటేశ్)తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడతాడు హీరో. ఆ పెళ్ళి వద్దనే ఆడపిల్ల తండ్రిని మన హీరో ఎలా మెప్పించి, ఒప్పించాడన్నది కథ. సోనూసూద్‌కూ, ప్రకాశ్ రాజ్‌కూ మధ్య సినిమా కథలో సంబంధం ఏమిటి? సోనూసూద్ విఫల ప్రేమకథ ఎలా చివరకు సక్సెసైంది అన్నది ఓపిగ్గా చూడాల్సిన మెయిన్ కథలోని కీలక ఉపకథ. ఎలా చేశారంటే..: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎప్పటిలానే డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశారు. హిందీ డబ్బింగ్, శాటిలైట్ మార్కెట్ ఉన్నందు వల్లనో ఏమో – ఒకటి రెండు హిందీ డైలాగులూ చెప్పారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ‘‘శీనుగాడు నా ఫ్రెండు. యాక్షన్ సీన్లలో వీడిది సెపరేట్ ట్రెండు’’ (హీరో గురించి వెన్నెల కిశోర్) లాంటి మాస్ డైలాగులూ పెట్టారు. ఫైట్స్‌తో పాటు కామెడీ పండించేందుకు హీరో తెగ ప్రయత్నించారు. నభా నటేశ్ ఓకే అనిపిస్తారు. అనూ ఇమ్మాన్యుయేల్‌ది నిడివి పరంగా చిన్న పాత్రే. ప్రకాశ్ రాజ్, సోనూసూద్ తదితరులు – ఈ పాత్రల్లో ప్రత్యేకించి చేయడానికీ, నిరూపించుకోవడానికీ ఇవాళ కొత్తగా ఏమీ లేదు. హీరో తల్లి పాత్రలో ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ, హీరో ఇంట పనిమనిషి రత్తాలుగా హరితేజ లాంటి వాళ్ళూ ఉన్నారు. ఎలా తీశారంటే..: సినిమాటోగ్రఫీ నుంచి దర్శకత్వం వైపు వచ్చిన సంతోష్ శ్రీనివాస్‌కు దర్శకుడిగా ఇది నాలుగో సినిమా. తొలి చిత్రం ‘కందిరీగ’ విజయంతోనే ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఆయన... ఆ సక్సెస్ ఫార్ములాను ఇవాళ్టికీ వదులుకోలేకపోవడం అర్థం చేసుకోదగినదే. అందుకే, ఆ ఫార్ములానే వీలైనంత తిరగేసి, మరగేసి, బోర్లేసి... ‘అల్లుడు అదుర్స్’గా మరోసారి వండి వడ్డించారు. దానికి లారెన్స్ ‘కాంచన’ సినిమాతో పాపులరైన హార్రర్ కామెడీని కలిపారు. కానీ, ఎంత సక్సెస్ఫుల్ సూత్రమైనా, పదే పదే వాడితే చీకాకే. అది ఈ సినిమాకున్న పెద్ద ఇబ్బంది. దానికి తోడు ప్రేమకథను సాఫీగా కాకుండా, పలు పాత్రలు, సంఘటనల మధ్య అటూ ఇటూ తిప్పి, తిప్పి చెప్పే కథనం సహనానికి పరీక్ష పెడుతుంది. సెకండాఫ్‌లో వచ్చే హార్రర్ కామెడీ, ప్రకాశ్ రాజ్ – సత్యల ఊహా ప్రపంచం సీన్లు మాత్రం హాలులో అడపాదడపా బాగానే నవ్వులు పూయిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్న ఈ సినిమాలో ఛోటా కె. నాయుడు కెమెరా వర్క్, దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం ప్రత్యేకించి స్పష్టంగా తెలుస్తాయి. సినిమాకు కొంత బలంగా నిలుస్తాయి. తెర నిండా సుపరిచితులైన నటీనటులు కనిపిస్తారు. వినోదం కోసం సత్య, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, చమ్మక్ చంద్ర – ఇలా చాలామందే వస్తూ పోతూ ఉంటారు. ఇటీవల కరోనా కాలంలో మరణించిన నటులు జయప్రకాశ్ రెడ్డి, కమెడియన్ వేణుగోపాల్ కోసూరి లాంటి వాళ్ళూ తెరపై తమ చివరి సినిమాల్లో ఒకటిగా ఇందులో ఎదురవుతారు. ‘బిగ్ బాస్4’ ఫేమ్ మోనాల్ గజ్జర్ చేసిన ఐటమ్ సాంగ్ ‘రంభ ఊర్వశి మేనక అందరు కలిసి నేనిక...’ లాంటివి మాస్‌ను ఆకర్షిస్తాయి. కాశ్మీర్‌లోని పహల్ గావ్ ప్రాంతాల్లో ఇటీవలే ఈ జనవరి చలిలో తీసిన హీరో, హీరోయిన్ల డ్యుయట్... మంచు కురిసే దృశ్యాలు విజువల్‌గా బాగున్నాయి. ఏ విదేశాల్లోనో తీసిన ఫీలింగ్ కలిగిస్తాయి. అయితే, అన్నీ ఉన్నా... అల్లుడి... అదేదో అన్నట్టు స్క్రిప్టులోని బలహీనతలు ఈ సినిమాకు శాపం. కామెడీ చేస్తున్నాం అనుకొని దర్శక, రచయితలు కథన విధానంలో లేనిపోని కన్ఫ్యూజన్లు పెట్టుకున్నారు. ఎంత సక్సెస్ఫుల్ ఫార్ములా వాడుకున్నా, దాన్ని ఆకట్టుకొనేలా చెప్పడానికి ప్రయత్నించకపోవడంలో పొరపాటు జరిగిందనిపిస్తుంది. ఇది ‘కందిరీగ’కు మరో రీమేక్ అనే కామెంట్‌నూ భరించాల్సి వస్తుంది. వెరసి, రెండున్నర గంటల సాగదీతను భరించాలంటే... జనం బెదుర్స్ అనాలనిపిస్తుంది. కొసమెరుపు: ‘కందిరీగ’ ఫార్ములా + ‘కాంచన’ హార్రర్ కామెడీ = ‘అల్లుడు అదుర్స్’ బలాలు: ∙హీరో చేసిన డ్యాన్సులు, ఫైట్లు ∙తెర నిండా నటీనటులు, నిర్మాణ విలువలు ∙నేపథ్య సంగీతం, కెమెరా వర్కు బలహీనతలు: ∙చాలా ప్రిడిక్టబుల్ ఫార్ములా ∙పాత సినిమాలే చూస్తున్న ఫీలింగిచ్చే స్క్రిప్టు ∙సహనాన్ని పరీక్షించే సా....గ దీత కథనం ∙దర్శకత్వ లోపం ∙కన్ఫ్యూజింగ్... కామెడీ -రివ్యూ: రెంటాల జయదేవ -
అల్లుడు అదుర్స్ మూవీ రివ్యూ
టైటిల్ : అల్లుడు అదుర్స్ జానర్ : రొమాంటిక్ కామెడీ నటీనటులు : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్, సోను సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సత్య అక్కల, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మజీ నిర్మాణ సంస్థ : సుమంత్ మూవీస్ నిర్మాత : గొర్రెల సుబ్రహ్మణ్యం దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : చోటా కె. నాయుడు ఎడిటర్ : తమ్మిరాజు విడుదల తేది : జనవరి 14, 2021 వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న సమయంలో 'రాక్షసుడు' సినిమాతో కెరీర్లోనే మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ మూవీ ఫలితం ఇచ్చిన జోష్‌తో అతడు ప్రస్తుతం ఎనర్జిటిక్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్‌తో 'అల్లుడు అదుర్స్' అనే సినిమా చేశాడు. సంక్రాంతి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అల్లుడిని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ శ్రీను( బెల్లం కొండ శ్రీనివాస్ ) చిన్నప్పుడే వసుందర ( అను ఇమాన్యుల్ )ను ప్రేమిస్తాడు. కాని ఆమె మాత్రం ఇతన్ని ఇష్టపడదు. తన తొలి ప్రేమ విఫలం అవడంతో శ్రీను ఇక అమ్మాయిలకు దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ పెద్దవాడైన తర్వాత కౌముది ( నభనటేష్ )తో మరోసారి ప్రేమలో పడతాడు.ఇదే సమయంలో శ్రీను జీవితంలోకి గజా( సోనూసూద్ ) అడుగు పెడతాడు. మరోవైపు తన ప్రేమను దక్కించుకునే క్రమంలో కౌముది తండ్రి జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్)తో ఓ ఒప్పందానికి రావాల్సి వస్తుంది.అసలు శ్రీను చేసుకున్న ఒప్పందమేంటి? ఈ గజా ఎవరు ? అతనికి వసుంధరకి సంబంధం ఏమిటీ ? చివరకు శ్రీను తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు ? అనేదే మిగత కథ. నటీనటులు గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో మంచి నటనను కనబరిచాడు. ముఖ్యంగా ఫైట్స్, యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. రియల్ హీరో సోనూ సూద్ తన నటన మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు. ప్రకాష్ రాజు ఎప్పటిలాగే తండ్రి పాత్రలో పరకాయప్రవేశం చేశాడు. మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ మెయిన్ హీరోయిన్ కాకపోయినప్పటికీ కథలో కీలక మలుపు తిప్పే పాత్రను చేజిక్కించుకుంది. కమెడియన్స్ శ్రీనివాస్ రెడ్డి, సత్య, చమ్మక్ చంద్ర రోల్స్ కామెడీ పార్ట్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలపరిధి మేరకు నటించారు. విశ్లేషణ 'కందిరీగ' లో కన్ఫ్యూజింగ్ కామెడీ చూపించి హిట్ కొట్టిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. ఈ సినిమాకు కూడా అలాంటి కామెడినే నమ్ముకున్నాడు. కథనంలో ఎక్కడా కామెడీని మిస్ కాకుండా నడిపించాడు. కందిరీగ సినిమాలో ఎలాగైతే కన్ఫ్యూజింగ్ హౌస్ కామెడీని హైలైట్ చేశారో ఇందులో కూడా అదే రిపీట్ చేశారు. కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకున్నా డిఫరెంట్ నెరేషన్‌తో సినిమా ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు.సినిమా ఇంట్రస్ట్ గా మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అలాగే నవ్మశక్యం కాని సన్నివేశాలను పెట్టి ప్రేక్షకులు తలలు పట్టుకునేలా చేశాడు. అలాగే సినిమాలో ఎక్కడా బలమైన కంటెంట్ లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. తన పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లానే ఉంటుంది. ఎడిటింగ్ బాగున్నా, ఎడిటింగ్ బాగున్నా, సెకండాఫ్‌లోని సాగతీత సీన్లను తొలగిస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. -
సినిమా చూసి సంతోషంగా ఇంటికి వెళతారు
‘‘కరోనా లాక్డౌన్ తర్వాత విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’కి మంచి ప్రేక్షకాదరణ లభించడంతో మా అందరికీ ధైర్యం వచ్చింది. సంక్రాంతి అనేది అల్లుళ్ల పండుగ. అల్లుడు ఎలాంటివాడైనా అత్తమామలకు అదుర్సే.. అందుకే ఈ సంక్రాంతికి ‘అల్లుడు అదుర్స్’ టైటిల్‌తో వస్తున్నాం’’ అని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, నభానటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అల్లుడు అదుర్స్’ కథ చెప్పగానే బెల్లంకొండ సురేష్‌గారు ‘రాక్షసుడు’ తర్వాత సాయితో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ జోనర్ సినిమా చేయాలని చూస్తున్నాను. తప్పకుండా మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు. నా ‘కందిరీగ’ సినిమాలో ఉన్నట్టే ఇందులో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఫుల్‌గా ఎంజాయ్ చేసి సంతోషంగా ఇంటికెళ్తారు. కరోనా తర్వాత సోనూ సూద్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆయన పాత్రలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాం. దేవిశ్రీ ప్రసాద్‌గారి సంగీతంతో మా సినిమా రేంజ్ పెరిగింది. బేసిక్‌గా నేను సినిమాటోగ్రాఫర్‌ని కాబట్టి 150 రోజుల్లో తీసే సినిమాని 110 రోజుల్లో పూర్తి చేయగలను. ఈ సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలూ మంచి విజయం సాధించి ఇండస్ట్రీకి మంచి రెవెన్యూ వస్తే ఫిబ్రవరిలో మరికొన్ని మంచి సినిమాలు వస్తాయి. ‘కందిరీగ’ సీక్వెల్ ‘కందిరీగ 2’ ఐడియా రెడీగా ఉంది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి’’ అన్నారు. -
సంక్రాంతికి మంచి వినోదం ఇస్తాం
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేశ్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 15న విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక తారాగణం పాల్గొనగా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ ఆధ్వర్యంలో పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ ప్రత్యేక పాటలో మోనాల్ గజ్జర్ నర్తిస్తున్నారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘అల్లుడు శ్రీను’ తర్వాత నేను చేస్తున్న కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అల్లుడు అదుర్స్’. సంక్రాంతికి మా సినిమా ప్రేక్షకులందరినీ వినోదంతో అలరిస్తుంది’’ అన్నారు. ‘‘ఫుల్ ఫన్‌తో మా సినిమా విందుభోజనంలా ఉంటుంది’’ అన్నారు సంతోష్ శ్రీనివాస్. ‘‘నిర్మాత బెల్లంకొండ సురేశ్‌గారు చాలా సపోర్ట్ చేశారు. మా సినిమాతో పాటు విడుదలయ్యే అన్ని సినిమాలను ప్రేక్షకులు థియేటర్లో చూడాలని కోరుకుంటున్నా’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ‘‘ఇంత మంచి సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు సోనూ సూద్. ‘‘దాదాపు ఐదేళ్ల తర్వాత నేను పెర్ఫామ్ చేస్తున్న సినిమా ఇది’’ అన్నారు మోనాల్ గజ్జర్. -
ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’..
‘‘ఎనిమిదేళ్ల తర్వాత ‘మహాసముద్రం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమాకి ఈ నెల నుంచి పని చేయబోతున్నాను.. చెప్పినట్లుగానే నేను తిరిగి వస్తున్నాను. ఒక గొప్ప టీమ్‌తో, గొప్ప సహనటీనటులతో పని చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సిద్ధార్థ్. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా అదితీరావ్ హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
మహా సముద్రంలో..
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అదితీ రావ్ హైదరీ ఒక హీరోయిన్గా నటించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. మరో హీరోయిన్ పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేసినట్లు సోమవారం ప్రకటించింది చిత్రబృందం. యాక్షన్ లవ్ డ్రామాగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సుంకర రామబ్రహ్మం నిర్మాత. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సోనూ సూద్ ఎంట్రీ
‘రాక్షసుడు’ సినిమాతో మంచి విజయాన్ని సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ప్రస్తుతం ఆయన ‘అల్లుడు అదుర్స్’ అనే సినిమాలో నటిస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్న నటుడు సోనూ సూద్ సోమవారం షూటింగ్లో ఎంటర్ అయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు విడుదలైన ‘అల్లుడు అదుర్స్’ టైటిల్‌కు, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు చక్కని రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, ప్రకాశ్ రాజ్, సోనూ సూద్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, కెమెరా: చోటా.కె. నాయుడు. -
అల్లుడు షూటింగ్ షురూ
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో సోమవారం పునఃప్రారంభమైంది. బెల్లంకొండ శ్రీనివాస్, ప్రకాష్ రాజ్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం గొర్రెల మాట్లాడుతూ– ‘‘పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ‘అల్లుడు అదుర్స్’ టైటిల్‌కు, ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం. 2021 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఛోటా కె. నాయుడు, సమర్పణ: రమేష్‌కుమార్ గంజి. -
వేరే ప్రపంచంలో...
‘‘ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో నిరాశకు గురి కాకుండా ఆశావహ దృక్పథంతో ఉండాలి. చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కోవాలి’’ అంటున్నారు అనూ ఇమ్మాన్యుయేల్. యూఎస్‌లో పుట్టి, పెరిగి హీరోయిన్ కావాలనే ఆలోచనతో ఇండియా వచ్చారు అను. తెలుగులో ‘మజ్ను’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘శైలజారెడ్డి అల్లుడు’ తదితర చిత్రాల్లో నటించారీ బ్యూటీ. తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఈ లాక్డౌన్లో ఎక్కువ సమయాన్ని పుస్తకాలు చదవడానికి కేటాయిస్తున్నానని అనూ ఇమ్మాన్యుయేల్ చెబుతూ – ‘‘మనం చదివే ప్రతి పుస్తకంలోనూ కొత్త కథ ఉంటుంది. అవి చదువుతున్నప్పుడు ఆ కథల్లో ఉన్న పాత్రల ప్రపంచంలోకి మనం వెళతాం. అలా వేరే ప్రపంచంలోకి వెళ్లడం బాగుంటుంది. షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడానికి కుదరదు. ఎన్ని పుస్తకాలు చదివితే అంత జ్ఞానం సంపాదించుకోవచ్చు’’ అన్నారు. -
హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ ఫోటోలు
-
అల్లు శిరీష్‌తో.. అనూ ఇమ్మాన్యుయేల్..!
‘శైలజారెడ్డి అల్లుడు (2018)’ తర్వాత తెలుగులో కాస్త స్లో అయినట్లున్నారు హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్. మళ్లీ స్పీడ్‌ను అందుకోవాలనే ఆలోచనతో తాజాగా ఓ తెలుగు సినిమాకు అను సైన్ చేశారట. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్ హీరోగా పరిచయమైన ‘విజేత’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అను హీరోయిన్గా నటించబోతున్నారని సమాచారం. ఇందులో అల్లు శిరీష్ హీరోగా నటిస్తారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట శశి. -
చిన్న గ్యాప్ తర్వాత
‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు అనూ ఇమ్మాన్యుయేల్. చిన్న గ్యాప్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారామె. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జి. సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాలో నభా నటేశ్ ఓ కథానాయిక. ఇప్పుడు అనూ ఇమ్మాన్యుయేల్‌ని మరో హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్లో అనూ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘‘సినిమాలో ఇద్దరి కథానాయి కలకూ ప్రాధాన్యముంటుంది. వేసవిలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. -
‘నమ్మవీట్టు పిళ్లై’ రిలీజ్ ఎప్పుడంటే!
నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం నమ్మవీట్టుపిళ్లై. ఆయనకు జంటగా అనుఇమ్మాన్యువేల్ నటించింది. ఈ బ్యూటీ చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో నటించిన చిత్రం ఇది. ఇకపోతే ఇందులో మరో నటి ఐశ్వర్యరాజేశ్ శివకార్తికేయన్‌కు చెల్లెలిగా ముఖ్య పాత్రలో నటించింది. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన మరో గ్రామీణ కథా చిత్రం నమ్మవీట్టుపిళ్లై. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు భారతీరాజా, సముద్రకని ప్రధాన పాత్రల్లో నటించారు. వారితో పాటు నట్టి, ఆర్కే.సురేశ్, సూరి, యోగిబాబు, వేలరామమూర్తి, నాడోడిగళ్ గోపాల్, సుబ్బుపంజు, అర్చన, షీలా, సంతానలక్ష్మి ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందనను తెచ్చుకున్నాయి. దీనికి నీరవ్‌షా ఛాయాగ్రహణం అందించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్ పొందింది. కాగా నమ్మవీట్టుపిళ్లై చిత్రాన్ని ఈ నెల 27వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం శుక్రవారం అధికారపూర్వకంగా ప్రకటించారు. ఈ చిత్రంపై నటుడు శివకార్తికేయన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆయన చిత్రాలు వరుసగా నిరాశపరచడమే ఇందుకు కారణం. అదీ కాకుండా శివకార్తికేయన్ తొలి రోజుల్లో పాండిరాజ్ దర్శకత్వంలో మెరినా, కేడీబిల్లా కిల్లాడిరంగా చిత్రాల్లో నటించారు. అవి మంచి సక్సెస్ అయ్యాయి. తాజాగా నటించిన నమ్మవీట్టుపిళ్లై వీరి కాంబినేషన్లో రూపొందిన మూడవ చిత్రం అవుతుంది. ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్ హీరో చిత్రంలో నటిస్తున్నారు. -
నమ్మవీట్టు పిళ్లైకి గుమ్మడికాయ కొట్టారు!
నమ్మవీట్టు పిళ్లై చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నమ్మవీట్టుపిళ్లై. నటి అనుఇమ్మాన్యువేల్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా నమ్మవీట్టు పిళ్లై చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆ చిత్ర హీరోయిన్ అనుఇమ్మాన్యువేల్ తన ఇస్స్ట్రాగామ్లో పేర్కొంది. కడైకుట్టిసింగం వంటి విజయవంతమైన చిత్రం తరువాత పాండిరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం నమ్మవీట్టు పిళ్లై ఈయన ఇంతకుముందు శివకార్తికేయన్ హీరోగా మెరినా, కేడీబిల్లా కిల్లాడిరంగా వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ నమ్మవీట్టు పిళ్లై చిత్రం వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం అవుతుంది. ఇకపోతే ఈ చిత్రం శివకార్తికేయన్‌కు, నటి అనుఇమ్మాన్యువేల్ల కెరీర్లకు కీలకంగా భావిస్తున్నారు. నటుడు శివకార్తికేయన్ సరైన హిట్ చూసి చాలాకాలమైంది. ఆయన నటించిన సీమదురై, మిస్టర్ లోకల్ వంటి చిత్రాలు చాలా నిరాశపరిచాయి. ఇక నటి అనుఇమ్మాన్యువేల్కు కోలీవుడ్‌లో చెప్పుకోతగ్గ చిత్రం లేదు. ఇంతకుముందు రెండు చిత్రాల్లో నటించినా గుర్తింపు రాలేదు. భారీ తారాగణంతో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న నమ్మవీట్టు పిళ్లై చిత్రంపై కోలీవుడ్‌లో మంచి అంచనాలే నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ ఈ నెలలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. View this post on Instagram Wrap! for #nammaveettupillai See you in theatres very soon 🤗 A post shared by Anu Emmanuel (@anuemmanuel) on Sep 6, 2019 at 11:17pm PDT -
శివకార్తికేయన్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్
అతి తక్కువ కాలంలో అత్యంత పాపులర్ అయిన హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం. సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. దీంతో పాటు చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ఆ పేరే నమ్మ వీట్టు పిళ్లై. వరుత్తపడాద వాలిభర్ సంఘం చిత్రం తరువాత శివకార్తీకేయన్ గ్రామీణ యువకుడి పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. నటి అనుఇమాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తుండగా, శివకార్తికేయన్‌కు చెల్లెలుగా ఐశ్వర్యరాజేశ్ కీలక పాత్రలో నటిస్తోంది. ఆమెకు జంటగా నట్టి నటిస్తున్నారు. డీ.ఇమాన్ సంగీతాన్ని, నిరవ్‌షా ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్లో శివకార్తికేయన్ గ్రామీణ పాత్రలో మాస్ గెటప్‌లో కనిపించాడు. ఇక రెండో పోస్టర్లో దర్శకుడు పాండిరాజ్ మార్క్ కనిపించేలా చిత్రంలోని పాత్రలన్నింటిని పొందుపరిచి ఒక కుటుంబంలా కనిపించేలా ఉంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. కాగా కార్తీ హీరోగా కడైకుట్టిసింగం వంటి విజయవంతమైన చిత్రం తరువాత పాండిరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం నమ్మ వీట్టు పిళ్లై. చిత్రంపై శివకార్తికేయన్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా తదుపరి శివకార్తికేయన్ హీరో అనే చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఇరుంబుతిరై చిత్రం ఫేం పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు. అదే విధంగా ఇండ్రు నేట్రు నాళై చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న చిత్రంతో పాటు విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనున్నారు. దీన్ని లైకా సంస్థ నిర్మించనుంది. వీటి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. -
మళ్లీ పిలుపొచ్చింది
కోలీవుడ్ నుంచి హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్‌కి మళ్లీ కబురొచ్చింది. రెండేళ్ల క్రితం విశాల్ ‘తుప్పరివాలన్ (2017)’లో నటించిన అనూ ఇప్పుడు శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా నటించనున్నారు. ‘అజ్ఞాతవాసి (2018), నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018), శైలజారెడ్డి అల్లుడు’ (2018) చిత్రాల్లో నటించిన అనూ ఇమ్యాన్యుయేల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆ తర్వాత తెలుగులో వేరే సినిమాలు సైన్ చేయలేదీ బ్యూటీ. అయితే తమిళంలో శివకార్తికేయన్ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా అంగీకరించారామె. ఇందులో ఐశ్వర్యా రాజేష్ మరో హీరోయిన్గా నటిస్తారు. భారతీరాజా, సముద్రఖని, నటరాజన్, ఆర్కే సురేశ్, యోగిబాబు, సూరి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తారు. రూరల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. -
సింహపురిలో సినీ నటి సందడి
నెల్లూరు(బృందావనం): ‘నా పేరు సూర్య’.. ‘మజ్ఞు’.. ‘అజ్ఞాతవాసి’, తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించిన అనూ ఇమాన్యుయెల్ శుక్రవారం నగరంలో సందడి చేశారు. నగరంలోని మాగుంట లేఅవుట్లో గల కంచి లలిత శిల్క్స్ వంద రోజుల వేడుకల్లో భాగంగా చేపట్టిన కాస్ట్ టు కాస్ట్ సేల్ అమ్మకాలను ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ అధినేత సంగటి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఈ నెల 23 వరకు తమ కంచి లలిత శిల్క్స్‌కు చెందిన సొంతమగ్గాలపై తయారైన వస్త్రాలను ఉత్పత్తి ధరలకే కస్టమర్లకు విక్రయించనున్నామని తెలిపారు. సొంత మగ్గాలపై పట్టుతో నేయించిన చీరలను చాలెంజ్ ధరలకు విక్రయిస్తున్నామని వివరించారు. నెల్లూరు మహిళా లోకం, యువతులు మెచ్చే పలు రకాల డిజైన్లతో వస్త్రాలను విక్రయిస్తున్నామని తెలిపారు. కంచి లలిత శిల్క్స్ మేనేజర్ సత్యనారాయణరాజు పాల్గొన్నారు. పట్టు చీరలకు పెట్టింది పేరు కంచి లలిత శిల్క్స్ మేలిమి పట్టుతో నేసిన కంచి పట్టు చీరలకు నెల్లూరు కంచి లలిత శిల్క్స్ పేరుగాంచిందని అనూ ఇమ్మానుయెల్ తెలిపారు. కంచిపట్టు చీరలను ధరించి ముసిముసి నవ్వులతో అభిమానుల కేరింతల నడుమ ఫొటోలకు పోజులిచ్చారు. నెల్లూరు అంటేనే తనకు ఎంతో అభిమానమని, నెల్లూరు రుచులు మరవలేనివన్నారు. నెల్లూరు బిరియానీ, చేపల పులుసును తాను ఎంతో ఇష్టపడతానని, నగరానికి రావడం ఇది రెండో సారని చెప్పారు. అనూ ఇమ్మానుయెల్‌ను చూసేందుకు తరలివచ్చిన అభిమానులతో మాగుంటలేవుట్లో కోలాహలం నెలకొంది. కొందరు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. -
అలాగైతేనే రండి!
సినిమా: అలాగైతేనే రండి అంటోంది నటి అను ఇమ్మానుయేల్. ఈ విదేశీ బ్యూటీ మోడలింగ్ రంగం నుంచి వెండితెరకు ఎదిగిన నటి అన్నది తెలిసిందే. తొలుత మాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి, ఆపై టాలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. తెలుగులో నటించిన మజ్ను లాంటి చిత్రాలు సక్సెస్ అవడంతో స్టార్ హీరోల దృష్టిలో పడింది. అయితే అక్కడ పవన్‌కల్యాణ్‌తో నటించిన అజ్ఞాతవాసి, అల్లుఅర్జున్‌తో రొమాన్స్ చేసిన నా పేరు సూర్య వంటి భారీ చిత్రాల ఢమాల్ అనడంతో ఈ అమ్మడి డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆ తరువాత నటించిన శైలజారెడ్డి లాంటి చిత్రాలు అనుఇమ్మానుయేల్కు ఏ మాత్రం ప్లస్ అవలేదు. దీంతో చేతిలో ప్రస్తుతం నాగార్జునతో జత కడుతున్న ద్విభాషా చిత్రం ఒక్కటే ఉంది. ఇక తమిళంలో ఈ అమ్మడికి పెద్దగా క్రేజే లేదు. ఆ మధ్య విశాల్‌కు జంటగా తుప్పరివాలన్ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయినా, ఇక్కడ పట్టించుకున్న వారు లేరు. గ్లామర్ విషయంలో అభ్యంతరాలు పెట్టకపోయినా అవకాశాలు రాకపోవడం ఏమిటో ఈ బ్యూటీకి అర్థం కావడం లేదట. దీంతో పునరాలోచనలో పడ్డ అనుఇమ్మానూయేల్ తాజాగా ఒక నిర్ణయానికి వచ్చిందట. నటనకు అవకాశం ఉన్న పాత్రలు కాకుండా గ్లామర్ డాల్ పాత్రలను పోషించడం వల్లే తనకు అవకాశకాలు రావడం లేదని భావించిన అనుఇమ్మానూయేల్ ఇకపై అలాంటి పాత్రలపై దృష్టిసారించాలని తీసుకుందట. దీంతో ఇటీవల తనను కలిసి కథ చెప్పాలని ప్రయత్నించిన దర్శకులకు తన పాత్ర మాత్రమే కాకుండా పూర్తి కథను వినిపించాలని చెబుతోందట. అంతే కాదు ఇకపై పూర్తి బైండ్ స్క్రిప్ట్‌తోనే తనను కలవాలని షరతులు విధిస్తోందట. ఇంతకు ముందు హీరోహీరోయిన్లకు దర్శకులు కథను వినిపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పూర్తి బైండ్ స్క్రిప్ట్ తయారు చేసుకుని రమ్మంటున్నారు. ఇప్పుడు నటి అనుఇమ్మానూయేల్ అదే దారిలో పయనించాలని నిర్ణయించుకుందట. అయితే అసలే అవకాశాలు ముఖం చాటేస్తున్న పరిస్థితుల్లో ఈ అమ్మడి షరుతులు వర్కౌట్ అవుతాయా అన్నదే చర్చ. ప్రస్తుతం నటిస్తున్న ద్విభాషా చిత్ర నిర్మాణమే నత్త నడకన నడుస్తోందన్నది గమనార్హం.