బన్నీ యాక్షన్‌ పార్ట్‌ బ్రహ్మాండంగా ఉంటుంది | Lagadapati Sridhar about Naa Peru Surya Naa Illu India Movie Action . | Sakshi
Sakshi News home page

బన్నీ యాక్షన్‌ పార్ట్‌ బ్రహ్మాండంగా ఉంటుంది

Published Sat, Apr 14 2018 12:46 AM | Last Updated on Sat, Apr 14 2018 12:46 AM

Lagadapati Sridhar about Naa Peru Surya Naa Illu India Movie Action . - Sakshi

లగడపాటి శ్రీధర్, శిరీషా శ్రీధర్‌

‘‘మా చిత్రంలోని ‘బ్యూటిఫుల్‌ లవ్‌’ అనే పాట నాకు బాగా నచ్చింది. మంచి మెలోడీ. విశాల్‌ శేఖర్‌ అన్ని పాటలు చాలా బాగా ఇచ్చారు. సీతారామ శాస్త్రిగారు మంచి సాహిత్యం అందించారు’’ అని నిర్మాత లగడపాటి శ్రీధర్‌ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత.

ఈ సినిమాలోని ‘బ్యూటిఫుల్‌ లవ్‌’  అంటూ సాగే పాటను నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీషా శ్రీధర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘అల్లు అర్జున్‌ యాక్షన్‌ పార్ట్‌ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. టైటిల్‌కి తగ్గట్టుగా అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో వంశీ తెరకెక్కిస్తున్నారు. ఇంకా వారం రోజులు షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉంది. ఈ నెల 22న గ్రాండ్‌గా ఆడియో రిలీజ్‌ చేస్తున్నాం.

29న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక చేస్తున్నాం. ‘రంగస్థలం’ అద్భుతమైన హిట్‌ సాధించింది. మహేశ్‌బాబు ‘భరత్‌ అనే నేను’ సినిమా కూడా బ్లాక్‌ బస్టర్‌ కావాలి. జాతీయ అవార్డులు గెలుచుకున్న ‘బాహుబలి, ఘాజీ’ టీమ్‌కి కంగ్రాట్స్‌’’ అన్నారు. ‘‘అల్లు అర్జున్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీ. ‘బ్యూటిఫుల్‌ లవ్‌’ సాంగ్‌ వింటే వాల్ట్‌ డిస్నీ సాంగ్‌ విన్నట్టుగా ఉంది. మే 4న మీ ముందుకు వస్తున్నాం. మా చిత్రం అందర్నీ ఎంటర్‌టైన్‌ చేస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు శిరీషా శ్రీధర్‌. అర్జున్, శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్‌ రవి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాబు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement