Na peru Surya na illu india
-
మా ఇల్లు ఇండియా
-
పెట్టిన డబ్బుకు పదింతల వేల్యూ ఉన్న సినిమా
‘‘రోజూ 5 సినిమాలు చూసి నిద్రపోతాను. ఈ సినిమా చూసి చాలా స్ఫూర్తి పొందాను. ఇలాంటి కథను అల్లు అర్జున్‌గారు ఐడెంటిఫై చేశారు. అన్ ఇమాజినబుల్. ట్రైలర్, పోస్టర్లతో ఇంపాక్ట్ ఇచ్చాం. ఫైనల్‌గా సినిమాతో చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చాం. మలయాళ, తమిళ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటోంది’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యూయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా శిరీషా శ్రీధర్ సినిమా విశేషాలు పంచుకున్నారు. శ్రీధర్ మాట్లాడుతూ – ‘‘కథ విన్నప్పుడు, ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు హిట్ మూవీ అనుకునే చేశా. నా కన్నా ముందు ఆడియన్స్ చూడాలనుకున్నా. అభిమానులు సినిమా గురించి గొప్పగా చెబుతుంటే వెళ్లి చూశా. అన్బిలీవబుల్. ఈ కలియుగంలో దశాబ్దానికో మంచి కథ వస్తుంది. ఈ కథ అలాంటిదే. ఇల్లు శుభ్రం చేసినా, స్నానం చే సినా ఎంత శుభ్రంగా ఉంటుందో ఈ సినిమా చూసినప్పుడు మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. పెట్టిన డబ్బుకు పదింతల వేల్యూ ఉన్న సినిమా ఇది. అల్లు అర్జున్‌గారి యాక్టింగ్‌కు తిరుగులేదు. ఈ సినిమా ఓ పేజీ కాదు మంచి పుస్తకం. మంచి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పారు వక్కంతం వంశీ. మొదటిరోజు 45కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ‘బాహుబలి’ వేసిన పాత్లో మేమూ నడుస్తున్నాం. సోమవారం నుంచి సక్సెస్ టూర్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు. ‘‘పర్ఫెక్ట్ మూవీ అందించినందుకు గర్వంగా ఉంది. వర్క్ అంటే కమిట్మెంట్ ఉన్న సూపర్ స్టార్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. దేశభక్తి సబ్జెక్ట్‌ను ఎంటర్టైనింగ్గా చెబితే ఎవ్వరైనా యాక్సెప్ట్ చేస్తారని నిరూపించింది ఈ సినిమా. ఓ స్టార్ హీరో రోల్ గురించి, ఫ్యాన్స్ గురించి ఆలోచించకుండా కథను నమ్మినప్పుడు ఇలాంటి సినిమాలు వస్తాయి. వంశీ యూనిక్ పాయింట్‌తో వచ్చారు. యూత్ అంతా బాగా కనెక్ట్ అవుతున్నారు’’ అన్నారు నిర్మాత శిరీషా. -
అందుకు బాధపడుతున్నా..!
‘‘సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్న టైమ్‌లో అరవింద్‌గారు ‘నువ్వు నిర్మాతగా మళ్లీ సినిమా చేయాలి’ అన్నారు. నాకు అవసరమా అనిపించింది. బన్నీ కూడా ‘మీరు సినిమా చేయాలి’ అని అడగ్గానే ఆలోచించా. లగడపాటి శ్రీధర్‌గారితో ఇదివరకే వర్క్ చేశాను. అప్పటికే బన్నీ సినిమాకు కావల్సినవన్నీ రెడీ చేసుకున్నారు. సో.. నా పని తేలికైపోయింది. మళ్లీ సినిమాలు చేయాలనే ధైర్యం ఇచ్చింది మాత్రం అరవింద్‌గారే’’ అన్నారు నాగబాబు. అల్లు అర్జున్, అన్యూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. ‘బన్నీ’వాసు సహనిర్మాత. ఈ చిత్రం మే 4న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నాగబాబు చెప్పిన విశేషాలు. ∙‘ఆరెంజ్’ సినిమాతో నిర్మాతగా వచ్చిన నష్టం కంటే చరణ్‌కు హిట్ ఇవ్వలేకపోయానని ఎక్కువగా బాధపడ్డాను. ‘మగధీర’ వంటి సూపర్ హిట్ తర్వాత హిట్ ఇవ్వలేదని ఫిల్మ్ మేకర్‌గా అన్‌ఫిట్ అని ఫీల్ అయ్యాను. అందుకే నిర్మాణానికి దూరంగా ఉండి సీరియల్స్, షోస్ చేస్తున్నాను. కొన్నిసార్లు అనిపిస్తుంది. ‘ఆరెంజ్’ ఇప్పుడు రిలీజ్ అయ్యుంటే హిట్ అయ్యేదేమో అని. ∙‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’లో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఫుల్ సీరియస్‌గా, నిబద్ధతతో ఉండే పాత్ర. తన సీరియస్‌నెస్ వల్ల కుడా కొంచెం కామెడీ క్రియేట్ అవుతుంది. దాసరిగారి దగ్గర దర్శకుడు వంశీ పనిచేసినప్పటినుంచి తెలుసు. మంచి ఎమోషన్స్‌తో ప్రేక్షకులకు సినిమాని కనెక్ట్ చేయించగలడు. తన తదుపరి సినిమా కూడా మా కాంపౌండ్లోనే ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు ప్లాన్ ప్రకారం జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మాత్రమే నేను సెట్స్‌కి వెళ్లాను. అంతా ‘బన్నీ’వాసు చూసుకున్నాడు. సినిమా రిలీజ్ కాకముందే నెగటివ్ టాక్ ప్రచారం చేయడం బాధగా అనిపించింది. అరవింద్‌గారు, నేను బాగా హర్ట్ అయ్యాం. ∙నా కెరీర్లో ఇది బెస్ట్ ఫేజ్ అనొచ్చు. మా అబ్బాయి వరుణ్ సక్సెస్‌లో ఉన్నాడు. నిహారిక మంచి రోల్స్‌తో కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది. నేను ‘జబర్దస్త్’ షో జడ్జిగా బిజీగా ఉన్నా. ఈ ఫేజ్ ఇలానే ఉండాలనుకుంటున్నా. వరుణ్‌తో సినిమా ప్లాన్ చేయలేదు. ఫ్యూచర్లో వాడితో సిని మా చేయొచ్చేమో. వరుణ్ ఇమేజ్ను క్యాష్ చేసుకోవాలనుకోవడం లేదు. వరుణ్ బయట ప్రొడ్యూసర్స్‌కి అందుబాటులో ఉండాలి. వరుణ్‌తో కలిసి యాక్ట్ చేయడం గురించి నిర్ణయించుకోలేదు. ∙రిలీజ్ అయిన మూడు వారాలకే సినిమా డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో రావడం వల్ల సినిమాకు ఇబ్బంది ఉండదు. మూడు వారాలకు ఆడియన్స్ అందరూ సినిమా చూసేస్తారు. ప్రస్తుతం సినిమాలకు త్రీ వీక్స్ మించి లైఫ్ ఉండటంలేదు కూడా. ∙ఇండస్ట్రీ న్యూస్ చానెల్స్ని బంద్ చేస్తోంది అని వినపడుతోంది. ఆ ఆలోచన మాకు లేదు. ఇండస్ట్రీకు ఎలాంటి మంచి పనులు చేయాలని డిస్కస్ చేసుకున్నాం. మా ఫ్యాన్స్‌ను అనవసరమైన విషయాల మీద రియాక్ట్ అవ్వొద్దని చెబుతున్నాం. ప్రతి ఒక్కరు పబ్లిసిటీ కోసం వాగి, ఆ తర్వాత మీ ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేసుకొమ్మని సలహా ఇస్తున్నారు. అది ఎంతవరకు సమంజసమో వాళ్లకే తెలియాలి. ∙ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమాల్లో ఓ కీ రోల్ చేస్తున్నా. విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ తీస్తున్న సినిమాలో కుడా యాక్ట్ చేస్తున్నాను. -
మీరు బ్రతకండి.. మమ్మల్ని బ్రతకనివ్వండి
‘‘చిరుత’ ఇంకా రిలీజ్ అవ్వలేదు. డాడీ బన్నీని పిలిచి అన్నారు. ‘రేయ్ మన ఫ్యామిలీకి డ్యాన్స్ వచ్చు అని ఒక పేరు ఉంది. చిన్నప్పటినుంచి నుంచి వీడు ఎక్కడా డ్యాన్స్ చేయలేదు. వీడికి డ్యాన్స్ చేయడం వచ్చా? లేక మన పరువు తీస్తాడా?’ అని అడిగారు. ‘నువ్వు మర్చిపో మామా. ధైర్యంగా ఉండు. నాకు ప్రైవేట్‌గా తెలుసు’ అని మా నాన్నకు నమ్మకం ఇచ్చాడు బన్నీ. అప్పటి నుంచి డాడీ నన్ను తిట్టడం మానేశారు’’ అన్నారు రామ్ చరణ్. అల్లు అర్జున్, అన్యూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించారు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. విశాల్‌శేఖర్ పాటలు స్వరపరిచారు. సినిమా మే 4న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘సినిమాల్లోకి రాకముందు బర్త్‌డే పార్టీల్లో నేనెక్కువ డ్యాన్స్ చేసేవాణ్ణి కాదు. మా డాడీ తిట్టేవారు. బన్నీ డ్యాన్స్ చూసి నేర్చుకోరా అని. బన్నీలో ఒక కసి ఉంటుంది. తను చేసిన గోన గన్నారెడ్డి చిన్న క్యారెక్టర్. తక్కువ సమయం అయినా ఎన్ని అవార్డ్స్ కొట్టాడో మీరే చూశారు. అదే గోన గన్నారెడ్డి రెండున్నర గంటలు ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. దానికి ఇంకా ఎన్ని అవార్డ్స్, ఎంత మెప్పు పొందుతాడా అని ఎదురు చూస్తున్నాను. లాస్ట్ రెండేళ్లుగా క్రిటికల్ అప్రిషియేషన్ వచ్చిన సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. నా ‘రంగస్థలం’ కూడా. మన ఇండస్ట్రీ ప్రౌడ్ మూమెంట్లో ఉంది. దానికి మరో ఎగ్జాంపుల్ ‘నా పేరు సూర్య’ అవ్వాలి. నా ‘ఎవడు’ సినిమాకు రాసిన వంశీ ఈ సినిమా డైరెక్టర్. తన రైటింగ్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ సినిమా చూస్తుంటే ఇన్స్పైరింగ్ కాన్సెప్ట్‌లా ఉంది. నా బ్రదర్ బన్నీ చేసిన ఈ ఆర్మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనకున్న హానెస్ట్ దర్శకుల్లో వంశీ ఉండాలని కోరుకుంటున్నాను. మామ (అల్లు అరవింద్) ఏదో ఒక కాంట్రవర్శీ లేకుండా మాట్లాడడు. కానీ ఆయన పెయిన్‌ని నేను అర్థం చేసుకోగలను. అవినీతి లేని ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీయే. ఇక్కడ అందరం కష్టపడతాం. యాక్టర్స్ ఉదయాన్నే లేస్తాం. జిమ్‌కి వెళ్తాం. మేకప్ వేసుకొని ఎండల్లో వానల్లో షూటింగ్ చేస్తాం. బన్నీకి ఎన్నో దెబ్బలున్నాయి. డ్యాన్స్, ఫైట్స్‌లో దెబ్బలు తగులుతుంటాయి. మహేశ్, తారక్, ప్రభాస్... మా అందరికీ దెబ్బలు తగులుతుంటాయి. ప్రభాస్‌కి రెండు సార్లు భుజానికి సర్జరీ అయింది. మా నాన్నగారికి, బాలకృష్ణగారికి కూడా భుజానికి సర్జరీ జరిగింది. ఒళ్లు హూనం చేసుకుంటాం. ఇందులో అవినీతి ఎక్కడైనా కనిపిస్తుందా? మీడియా కొన్నిసార్లు ఇష్టం వచ్చినట్టుగా రాస్తోంది. లాస్ట్ రెండు నెలలుగా జరిగిన వాటిని చూసినవాళ్లు ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటారే తప్ప ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు, నమ్మరు. మీరు (మీడియా) మాకు బిగ్గెస్ట్ సపోర్ట్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు బ్రతకండి హ్యాపీగా, మమ్మల్ని బ్రతకనివ్వండి హ్యాపీగా’’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘ఇండియన్ ఆర్మీకి థ్యాంక్స్. మీరు లేకపోతే ఈ స్థాయిలో మేము సినిమా తీసేవాళ్లం కాదు. ఈ కథను నా దగ్గరకు తీసుకొచ్చిన నల్లమలుపు బుజ్జిగారికి థ్యాంక్స్. ఒక స్టార్ డైరెక్టర్‌కు ఎంత ఖర్చుపెడతారో ఒక దర్శకుడు పరిచయం అవుతున్న ఈ సినిమాకు అంతే ఖర్చుపెట్టారు శ్రీధర్‌గారు. నాకు నచ్చిన వ్యక్తి నాగబాబుగారికి సినిమా చేసే స్థాయిని ప్రేక్షకులు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఈ సినిమా సహనిర్మాత ‘బన్నీ’ వాసుకు థ్యాంక్స్. రేపు సినిమా సక్సెస్ అయితే.. వంద కారణాలు ఉంటే అవన్నీ డైరెక్టర్‌గారే. నేను చేసిందల్లా ఆయన్ను నమ్మడమే. ‘రంగస్థలం’ సినిమాతో ఈ స్థలం నాది అని ప్రూవ్ చేశావ్ చరణ్. అలాగే ‘భరత్ అనే నేను’ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అలాగే ‘నా పేరు సూర్య...’తో ఈ సమ్మర్ ఒక హ్యాట్రిక్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘కథ విన్నప్పటి నుంచి వంశీ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు బన్నీ. ఈ మధ్య ఇండస్ట్రీలో మనసు కలిచి వేసే సంఘటనలు జరిగాయి. దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవల్సి వచ్చింది. ఆ నిర్ణయాల వల్ల కొంతమంది ఈ సినిమాను తప్పుదోవ పట్టించడానికో, క్రిటిసైజ్ చేయడానికో ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాన్ని దాటగలిగినవారు మీరే (ప్రేక్షకులు) ఈ స్క్రీన్ వెనకాలే కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక స్టాండ్ తీసుకోవల్సి వచ్చింది. ఆ స్టాండ్ తీసుకోవడానికి నమ్మకం మీరందరు (ప్రేక్షకులు). సినిమా రషెస్ చుశాక అర్థం అయ్యింది. ఈ సినిమాలోని పాత్ర అర్జున్నే చేయాలని. నా మేనల్లుడు, నా కొడుకు ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ‘‘శ్రీధర్‌గారితో కలిసి ఈ సినిమా చేయి అని చేయించిన అరవింద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు నాగబాబు. ‘‘సినిమాల్లోకి వెళ్తా అంటే ఎవ్వరూ ప్రొత్సహించరు. కానీ మా ఇంట్లో ప్రోత్సహించారు. ఈరోజు నేనిలా నిలబడటానికి మా అమ్మగారు, నా భార్యే కారణం. పర్సనల్‌గా ఆర్మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తుంటా. బన్నీ ద్వారా వాళ్ల మీద సినిమా తీసే చాన్స్ వచ్చింది. ఇంత మంచి సినిమా ఇచ్చిన హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ వక్కంతం వంశీలకు రుణపడి ఉంటాను. సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ బన్నీ. కొత్త డైరెక్టర్‌తో 100కోట్లు రిస్క్ చేయడం మామూలు విషయం కాదు’’ అన్నారు నిర్మాత శ్రీధర్. ‘‘ప్రతి సినిమాకు డబ్బు, పేరు వస్తుంది కానీ ఈ సినిమా ద్వారా గౌరవం కూడా వస్తుంది అనుకుంటున్నాను’’అన్నారు సహనిర్మాత ‘బన్నీ’ వాసు. ‘‘సినిమా డైరెక్టర్ ఎప్పుడవుతావురా? అన్న మా అమ్మానాన్నలు ఇక్కడ ఉన్నారు. అయ్యానమ్మా. సినిమా ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావుగారికి కృతజ్ఙతలు. ఆయన లేరు. ఈ బాధలో కూడా ఆనందం ఏంటంటే.. ఆయన పుట్టినరోజు నాడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మంచి సినిమా తీశాను అన్న తృప్తితోనే ఈ ఫంక్షన్లో నిల్చున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొన్నారు. -
ఇండస్ట్రీలో బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది
ఈ నెల 29న జరగనున్న మా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్ రానుండటం ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్‌ను బిగ్ రేంజ్లో ప్లాన్ చేశాం. ఇటీవల జరిగిన ఆడియో ఫంక్షన్‌కు చిరంజీవిగారిని ఆహ్వానించాలని వెళ్లి కలిశాను. ‘‘సినిమా గురించి, బన్నీ కష్టం గురించి విన్నాను. బట్.. ఆడియో ఫంక్షన్‌కు రాలేను. అమెరికా వెళ్తున్నాను’’ అన్నారు. సినిమాకు మీ ఆశీర్వాదం కావాలి సర్ అంటే.. సెట్స్‌కు వచ్చారు చిరంజీవిగారు. టీమ్ అంతా హ్యాపీ ఫీలయ్యాం. ఆడియో ఫంక్షన్‌కు రాలేకపోతున్నానని ఆయన ఫీలయ్యారు’’ అన్నారు. ‘‘దేశం మనకేం చేసింది అన్నది కాదు.. దేశానికి మనం ఏం చేశాం అన్నది ముఖ్యం అనే పాయింట్‌తో ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ ఉంటుంది. దేశానికి సేవ చేయాలనుకునే హీరోకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది సినిమాలో ఆసక్తికరం. దేశానికి సేవ చేస్తే ఎలాంటి సంతృప్తి కలుగుతుంది అన్న విషయం ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ‘రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాల రేంజ్లో మా సినిమా కూడా ఉంటుందని నా నమ్మకం’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. మే 4న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ– ‘‘పదేళ్ల క్రితం మీతో సినిమా చేస్తానని బన్నీ (అల్లు అర్జున్) మాటిచ్చాడు. ఇప్పుడు ఇంత స్టార్డమ్ ఉన్నప్పుడు పిలిచి సినిమా చేశాడు. ఈ సినిమాలోని సూర్య క్యారెక్టర్ అల్లు అర్జున్‌కే సూట్ అవుతుంది. ఇండస్ట్రీలో ఈ సినిమా బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. హిందీలో డబ్ చేసే ఆలోచన ఉంది. నాగబాబుగారు బాగా çసహకరించారు. బన్నీ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఒకడు మారాడు అనే కంటే ఎలా మారాడు? అన్న విషయాన్ని ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్‌గా చూస్తారు. దేశానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అని కల కనే యువకుడి కథ ఇది. టైటిల్లోనే ‘నా ఇల్లు ఇండియా’ అనే మాట వాడాం అంటే సినిమా స్పాన్‌ను అర్థం చేసుకోవచ్చు. థియేటర్స్‌లో ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ బిగ్ ఎస్సెట్ అవుతుంది. ముఖ్యంగా ‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో..’ సాంగ్ హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. ‘ఇరగ.. ఇరగ..’ సాంగ్‌కు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మంచి స్టెప్స్ ఇచ్చారు. బన్నీ ఇరగదీశాడు. అనూ ఇమ్మాన్యుయేల్ బాగా నటించింది. డ్యాన్స్ కూడా అదరగొట్టింది. విశాల్–శేఖర్ మంచి సంగీతం ఇచ్చారు. సినిమా బాగా రావడంలో సహనిర్మాత ‘బన్నీ’ వాసు పాత్ర ఉంది. ప్రొడక్షన్ వైపు చాలా కష్టపడ్డారు. వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా అబ్బాయి (విక్రమ్) హీరోగా కష్టపడి పైకి రావాలనుకుంటున్నాను. ‘ఎవడి గోల వాడిది 2’ చేయాలని ఉంది. ‘స్టైల్ 2’ కథ చేయాలనుకుంటున్నాను. తమిళ సినిమా ‘గోలీసోడా’ని ‘ఎవడూ తక్కువ కాదు’ పేరుతో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం’’ అన్నారు. -
మిలటరీవారంటే అందుకే గౌరవం
‘‘వంశీగారు చెప్పిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కథలో అన్నిటికంటే నాకు ఎక్కువ నచ్చిన విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోకి ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్న గోల్ ఉంటుంది. ఒక వ్యక్తి సమాజానికి అంకితమయ్యే జీవితాన్ని బతుకుదామనుకోవడం గొప్ప విషయం. అందుకే నాకు మిలటరీవారంటే ప్రత్యేక గౌరవం’’ అని అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషాశ్రీధర్ నిర్మాతగా, ‘బన్ని’ వాసు సహ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం మే 4న విడుదలకానుంది. విశాల్–శేఖర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మిలట్రీ మాధవరం గ్రామంలో ఆదివారం విడుదల చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చేయడం వల్ల నేను తెలుసుకునన విషయం ఏంటంటే.. మా ఆంధ్రప్రదేశ్‌లో.. మా వెస్ట్‌గోదావరి జిల్లాలో.. మా ఊరి దగ్గర్లో మాధవరం అనే ఊరు ఉందనీ, జనాలు ‘మిలట్రీ మాధవరం’ అని పిలుస్తారని నాకు తెలియదు. తెలుసుకున్నాక ఎంత కష్టమైనా ఈ ఫంక్షన్ ఇక్కడే చేద్దామనుకున్నాం.. చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నా. నన్ను నమ్మి అడిగిందల్లా ఇచ్చిన శ్రీధర్‌గారికి ధన్యవాదాలు. ఎప్పుటి నుంచో నాగబాబుగారికి సినిమా చేయాలనుకుంటున్నా. ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేనెంత ఇబ్బంది పెడతానో నాకే తెలుసు. నా టార్చర్ భరించి నాతో సినిమా తీసినందుకు ‘బన్ని’ వాసుకి థ్యాంక్స్. మేం ఎంత మంది హీరోలున్నా అందరం మెగా కుటుంబమే. ‘రంగస్థలం’ హిట్ అయినందుకు రామ్‌చరణ్‌కి, యూనిట్‌కి కంగ్రాట్స్’’ అన్నారు. చిత్ర సమర్పకులు నాగబాబు మాట్లాడుతూ– ‘‘ఒక మనిషి తెలివైనవాడా? గొప్పవాడా? అన్నది ముఖ్యం కాదు. ఎంత మంచివాడు.. ఎంత మంచి మనసు ఉన్నవాడు అన్నదే ముఖ్యం. అలాంటి వ్యక్తి ఎప్పటికైనా టాప్ రేంజ్‌కి వెళ్తాడు. బన్నీ అలాంటివాడే. మెగా హీరోలకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి చిరంజీవిగారు. థ్యాంక్స్ అన్నయ్యా.. మంచి జీవితం ఇచ్చావ్’’ అన్నారు. ‘‘మిలట్రీ మాధవరం సైనికులు దేశభక్తిని యావత్ ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ చిత్రంలో ‘ఇరగ ఇరగ’ పాట ఉంది. ఈ సినిమా చూశాక ఆల్మోస్ట్ జాతీయగీతంలా మీరు పాడుకుంటారని అనుకుంటున్నా. వంశీ రాబోయే కాలంలో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అవుతాడు’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. ‘‘మిలట్రీ మాధవరం లాంటి ఊరు ఉన్న తెలుగు గడ్డపై ఓ తెలుగు వాడిగా నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా. చాలా సినిమాలకు రైటర్‌గా పనిచేసినా దర్శకునిగా మొదటి సినిమా. నా మూడున్నరేళ్ల కలని తీర్చిన మగాడు అల్లు అర్జున్. నాలో రచయితని మాత్రమే కాదు.. డైరెక్టర్ ఉన్నాడని నమ్మాడు. నాకు తెలిసి ఏ కొత్త డైరెక్టర్‌కి ఇంత అదృష్టం పట్టి ఉండదు. ఓ పది సినిమాల సూపర్‌హిట్ డైరెక్టర్‌తో పనిచేస్తే ఎలా ఉంటాడో ఫస్ట్‌టైమ్ డైరెక్టర్‌తో కూడా అలాగే ఉన్నాడాయన. సూర్య పాత్ర కనీసం ఓ పదేళ్లు మీ గుండెల్లో నిలిచిపోతుంది. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. గొప్ప సినిమా చూశామని తలెత్తుకుని థియేటర్ల నుంచి బయటికెళతారని చెప్పగలను’’ అన్నారు. అనంతరం మిలట్రీ మాధవరంలోని వీర జవానుల భార్యలకు సత్కారం చేశారు. సహ నిర్మాత ‘బన్ని’ వాసు, దర్శకుడు మెహర్ రమేశ్ పాల్గొన్నారు. -
ఇరగ.. ఇరగ.. ఇంప్రెస్
మాములుగానే బన్నీ డ్యాన్స్ అదుర్స్. థియేటర్లో ఆడియన్స్ విజిల్స్. వన్స్ మోర్ కేకల్స్. అలాంటిది డ్యాన్స్‌లో తనకు ఇన్స్పిరేషన్గా ఉండే చిరంజీవి ఎదురుగా ఉంటే...బన్నీ ఆగుతాడా? ఇంకాస్త రెచ్చిపోడు. అలాగే రెచ్చిపోయి ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ‘ఇరగ.. ఇరగ...’ సాంగ్‌లో డ్యాన్స్ ఇరగదీసి చిరంజీవిని ఇంప్రెస్ చేశాడట. అల్లు అర్జున్ (బన్నీ) హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. అనూ ఇమ్మాన్యూయేల్ కథానాయిక. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ‘‘సెట్స్‌కి చిరంజీవిగారు, అల్లు అరవింద్‌గారు రావడం చాలా హ్యాపీగా ఉంది. బన్నీ డ్యాన్స్ చేస్తున్నంత సేపు చిరంజీవిగారు ఎంజాయ్ చేశారు. సాంగ్ బాగుందని మెచ్చుకున్నారు. సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 22న ఆడియో వేడుకను, 29న హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ను జరపనున్నాం. సినిమాను మే 4న రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
బన్నీ యాక్షన్ పార్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది
‘‘మా చిత్రంలోని ‘బ్యూటిఫుల్ లవ్’ అనే పాట నాకు బాగా నచ్చింది. మంచి మెలోడీ. విశాల్ శేఖర్ అన్ని పాటలు చాలా బాగా ఇచ్చారు. సీతారామ శాస్త్రిగారు మంచి సాహిత్యం అందించారు’’ అని నిర్మాత లగడపాటి శ్రీధర్ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఈ సినిమాలోని ‘బ్యూటిఫుల్ లవ్’ అంటూ సాగే పాటను నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శిరీషా శ్రీధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘అల్లు అర్జున్ యాక్షన్ పార్ట్ చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. టైటిల్‌కి తగ్గట్టుగా అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో వంశీ తెరకెక్కిస్తున్నారు. ఇంకా వారం రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ నెల 22న గ్రాండ్‌గా ఆడియో రిలీజ్ చేస్తున్నాం. 29న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక చేస్తున్నాం. ‘రంగస్థలం’ అద్భుతమైన హిట్ సాధించింది. మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావాలి. జాతీయ అవార్డులు గెలుచుకున్న ‘బాహుబలి, ఘాజీ’ టీమ్‌కి కంగ్రాట్స్’’ అన్నారు. ‘‘అల్లు అర్జున్‌తో సినిమా చేయడం చాలా హ్యాపీ. ‘బ్యూటిఫుల్ లవ్’ సాంగ్ వింటే వాల్ట్ డిస్నీ సాంగ్ విన్నట్టుగా ఉంది. మే 4న మీ ముందుకు వస్తున్నాం. మా చిత్రం అందర్నీ ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు శిరీషా శ్రీధర్. అర్జున్, శరత్‌కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ రవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు. -
క్రిష్‌తో బన్నీ...ప్రయోగానికి సిద్ధమేనా..?
అల్లు అర్జున్ సినిమా అంటే అదిరిపోయే ఫైట్స్, స్టెప్స్, ఐటంసాంగ్, పంచ్ డైలాగ్స్ ఉండాల్సిందే. స్టైలీష్ స్టార్ సినిమా..సినిమాకు తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. సరైనోడు లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఎన్నో హిట్ చిత్రాలకు కథను అందించిన వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ ప్రయోగానికి సిద్ధమయ్యాడు. బన్నీ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. మొన్నటి వరకు తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయబోతున్నాడని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు క్రిష్‌తో సినిమా చేయబోతున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రిష్‌తో సినిమా అంటే కమర్షియల్ ఫార్మట్‌కు దూరంగా ఉంటుంది. రెగ్యులర్‌గా ఉండే మాస్ మసాలా, హీరోయిజం, ఫైట్లు, ఐటంసాంగ్‌లు ఉండవు. గతంలో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో చేసిన ఓ పాత్రతో బన్నీకి మంచి నటుడిగా గుర్తింపు వచ్చింది. కానీ ఆ సినిమా కమర్షియల్‌గా మాత్రం అంత విజయం సాధించలేదు. అసలే వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్న ఈ టైంలో బన్నీ క్రిష్‌తో సినిమా అంటే చేస్తాడో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి క్రిష్ బాలీవుడ్ మూవీ మణికర్ణిక షూటింగ్లో ఉన్నాడు. త్వరలోనే షూటింగ్ పూర్తి కాబోతోంది. -
అందమైన కానుక
హీరో అల్లు అర్జున్ బర్త్‌డే ఇవాళ. ‘గంగోత్రి’ టు ‘డీజే’.. బన్నీ ప్రయాణం పదిహేనేళ్లు. ఈ 15 ఏళ్లల్లో హీరోగా ఇప్పటివరకు 18 సినిమాలు చేశారు. ఇక బన్నీ బర్త్‌డే విషయాని కొస్తే.. విశాఖపట్నం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అక్కడి ఆర్కే బీచ్‌లో 5 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత మానస్ శేషు ఆధర్వంలో ఈ సైకత శిల్పం రూపొందింది. ‘‘అల్లు అర్జున్ అభిమానుల కోరిక మేరకు తయారు చేసిన అందమైన కానుక ఇది’’ అన్నారు మానస్. ఈ సంగతి ఇలా ఉంచితే.. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా డైలాగ్ ఇంపాక్ట్‌ను ఈ రోజు విడుదల చేయనున్నారు. ఈ చిత్రం మే 4న రిలీజ్ కానుంది. -
ఈసారి డైలాగ్ గురూ
దుమ్ము రేపాడు. ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్‌లో సూపర్బ్ పర్ఫార్మెన్స్తో అల్లు అర్జున్ దుమ్ము రేపాడని ప్రేక్షకులు అన్నారు. ఇప్పుడు సినిమాలోని డైలాగ్స్‌కు ఉన్న దమ్మును చూపించేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శీరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ నెల 8న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా డైలాగ్ ఇంపాక్ట్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. సినిమా మే 4న రిలీజ్ కానుంది. -
ఫారిన్లో డ్యూయెట్
ఇప్పటివరకూ బార్డర్లో దేశం కోసం పోరాడిన సూర్య ఇప్పుడు విదేశాల్లో కొంచెం విశ్రాంతి తీసుకోనున్నారు. విశ్రాంతి ఏంటి అనుకుంటున్నారా? ఇన్ని రోజులు యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్న సూర్య ఇప్పుడు తన ప్రేయసితో డ్యూయెట్ పాడుకోవటం కోసం ఫారిన్ వెళ్లారట. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. సోల్జర్ సూర్య పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్‌పై ఒక రొమాంటిక్ సాంగ్‌ను ఫారిన్లో బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో షూట్ చేయనున్నారట చిత్రబృందం. మార్చి 21 నుంచి ఈ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఆ పాటకు బాలీవుడ్ భామ ఎలీ అవరమ్ డ్యాన్స్ చేయనున్నారు. ఈ సాంగ్ గురించి ఎలీ మాట్లాడుతూ – ‘‘ఇది ఐటమ్ సాంగ్ కాదు. అద్భుతమైన లిరిక్స్, మెసేజ్ ఉండే స్పెషల్ సాంగ్. అల్లు అర్జున్ డ్యాన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్. అయితే ఈ పాటలో అల్లు అర్జున్ ఎక్కువ డ్యాన్స్ చేయరు’’ అని పేర్కొన్నారామె. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. మే 4న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
‘ఎన్ పేరు సూర్య’ అంటూ కోలీవుడ్‌కు..
తమిళసినిమా: ఎన్ పేరు సూర్య ఎన్ వీడు ఇండియా అంటూ టాలీవుడ్ యువ స్టార్ హీరో అల్లు అర్జున్ కోలీవుడ్ తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. ఈయన తెలుగులో స్టార్ హీరో. అంతే కాదు మాలీవుడ్‌లో ఈయన చిత్రాలు కలెక్షన్లను కొల్లగొడతాయి. కేరళలో అల్లు అర్జున్ చిత్రాలకు పిచ్చ క్రేజ్. అదే పేరును కోలీవుడ్‌లోనూ పొందాలన్నది ఈ స్టైలిష్ స్టార్ చిరకాల కోరిక. ఆ మధ్య తమిళంలో నేరుగా ఒక చిత్రాన్ని చేయడానికి సిద్ధం అయ్యారు కూడా. విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు కూడా.కారణాలేమైనా ఆ చిత్రం తెరరూపం దాల్చలేదు. తాజాగా తెలుగులో ఆయన కథానాయకుడిగా నిర్మాణం అవుతున్న భారీ చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని తమిళంలోనూ ఎన్ పేరు సూర్య ఎన్ వీడు ఇండియా పేరుతో ఏక కాలంలో విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహం చేస్తున్నాయి. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కే.నాగబాబు, పి.వాసు సహ నిర్మాతలుగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సైనికుడిగా నటిస్తున్న అల్లుఅర్జున్‌కు జంటగా అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో శరత్‌కుమార్, యాక్షన్‌కింగ్ అర్జున్ నటిస్తున్నారు. విశాల్–శేఖర్ ద్వయం సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర తమిళ వర్షన్‌కు గీతరచయిత పా.విజయ్ సంభాషణలను అందిస్తున్నారు. చిత్రం తెలుగు, తమిళం భాషల్లో సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది.మరి తమిళంలో ఈ చిత్రం అల్లుఅర్జున్ను ఏ స్థాయిలో నిలబెడుతుందో చూడాలి. -
బన్నీ కొత్త సినిమా ఓకే చేశాడా..?
డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా మే 4న రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమాపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా కోలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. కమర్షియల్ విజయాలు లేకపోయినా.. అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో బన్నీ తన నెక్ట్స్ సినిమాను చేయబోతున్నాడట. గతంలో క్రిష్ దర్శకత్వంలో వేదం సినిమాలో నటించిన బన్నీకి నటుడిగా మంచి పేరు వచ్చింది. తాజాగా మరోసారి అదే డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాకు అహం బ్రహ్మాస్మి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
గాటు కథేంటి గురూ!
నోట్లో సిగార్... చేతిలో స్టీరింగ్.. డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తోపాటు కండలు తిరిగిన దేహంతో ఫ్యాన్స్‌కి ‘హోలీ’ ఫీస్ట్ ఇచ్చాడు సూర్య. ‘పోస్టర్ ఇంపాక్ట్’ అంటూ ఈ పోస్టర్ని చిత్రబృందం రిలీజ్ చేసింది. అల్లు అర్జున్ టైటిల్ రోల్లో వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. గురువారం రిలీజైన పోస్టర్లో సూర్య ఎడమ కంటిపై గాటు ఉంది గమనించారా? ఇప్పుడు చర్చంతా ఆ గాటు గురించే. గాటు కథేంటి గురూ అని ఎవరికి తోచిన కథలు వాళ్లు అల్లుతున్నారు. అసలు కథ ఏంటో మే 4న తెలిసిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను హైదరాబాద్‌లో షూట్ చేస్తున్నారు. ఈ నెల 14వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీక్రియేషన్స్ పతాకంపై శిరీషాశ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. -
భారీ టన్నల్‌లో బన్నీ ఫైట్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆవేశపరుడైన ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. తాజాగా ఈ సినిమాలో కీలకమైన ఓ పోరాట సన్నివేశానికి సంబంధించిన అప్ డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్ చల్ చేస్తోంది. విరామం సమయంలో వచ్చే ఈ సినిమా సన్నివేశం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ దగ్గర ఓ భారీ టన్నల్ సెట్‌ను నిర్మించారట. ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలట్‌గా నిలుస్తుందంటున్నారు చిత్రయూనిట్. బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాను లగడపాటి శ్రీధర్, నాగబాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్లు స్వరాలందిస్తున్నారు. -
అండర్స్టాండింగ్
వార్ తప్పదు. సూర్య, భరత్‌కు బాక్సాఫీసు వార్ తప్పదనుకున్నారంతా. ఈ వార్ రెండు కాంపౌండ్ల మధ్య గొడవకు దారి తీస్తుందని, వినోదం చూడొచ్చని ఔత్సాహికరాయుళ్లు ఆసక్తిగా ఎదురు చూశారు. అది మాత్రం జరగకూడదని ఇండస్ట్రీ మేలు కోరుకునేవాళ్లు ఆకాంక్షించారు. చివరికి వాళ్లు అనుకున్నదే జరిగింది. ఔత్సాహికుల ఆసక్తి మీద బిందెడు నీళ్లు చల్లినట్లయింది. మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ సినిమాల మధ్య వార్ లేదు. రెండు చిత్రాల నిర్మాతలు ఫ్రెండ్లీగా మాట్లాడుకుని, ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చారు. భరత్.. సూర్య.. కాలా కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమతి డి. పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. తొలుత ఈ రెండు సినిమాలను ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సడన్‌గా మధ్యలో ‘కాలా’ దూసుకొచ్చాడు. అంతే ముక్కోణపు వార్ స్టారై్టంది. ఎందుకంటే.. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘కాలా’ చిత్రాన్ని కూడా ఏప్రిల్ 27నే రిలీజ్ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. అంతే.. డబుల్.. ట్రిపుల్ అయ్యింది. అంటే.. బాక్సాఫీసు వద్ద ముక్కోణపు పోటీ అన్నమాట. అయితే ‘కాలా’తో రాకుండా భరత్, సూర్య ఒక్కరోజు ముందుకొచ్చారు. ఏప్రిల్ 26న ‘భరత్ అనే నేను’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందాలు ప్రకటించాయి. కానీ, రెండు సినిమాల మధ్య పోటీ కూడా సరికాదని చాలామంది భావించారు. ఇప్పుడా చింత లేదు. ఎందుకుంటే.. భరత్, సూర్య చిత్రబృందాలు కూడా స్నేహపూర్వకంగానే వార్‌కు ప్యాకప్ చెప్పారు. రెండు సినిమాల రిలీజ్ డేట్స్‌ను మార్చుకున్నట్లు గురువారం నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఫైనల్‌గా ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని ఏప్రిల్ 20న, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని మే 4న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు చెప్పారు. ఇప్పుడు బాక్సాఫీస్ వార్ లేదు. ఉన్నదల్లా స్నేహపూర్వకమైన వాతావరణం మాత్రమే. -
అప్పుడలా.. ఇప్పుడిలా!
మహేశ్‌బాబు ప్లేస్‌లోకి అల్లు అర్జున్ వచ్చారు. ఎలా అంటారా? ఇలా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘డీజే’ (దువ్వాడ జగన్నాథమ్) చిత్రం గతేడాది జూన్ 23న రిలీజైంది. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ డేట్‌ను ‘స్పైడర్’ చిత్రం కోసం బుక్ చేసుకున్నారు. కానీ.. కొన్ని కారణాల వల్ల ‘స్పైడర్’ సినిమా వాయిదా పడటంతో సభ్య సమాజానికి మేసేజ్ అంటూ ఆ ప్లేస్‌లోకి ‘డీజే’ వచ్చాడు. అలా గతేడాది మహేశ్‌బాబు ప్లేస్‌లోకి అల్లు అర్జున్ వచ్చారు. ఇప్పుడు..సూర్య వర్సెస్ భరత్‌లో మహేశ్ ముందొచ్చారు. అదేనండీ.. ముందు మహేశ్ ‘భరత్ అనే నేను’, తర్వాత ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ వస్తున్నాయి కదా. అప్పుడలా.. ఇప్పుడిలా. -
భరత్..సూర్య..లో ఎవరు ముందు?
భరత్ అను నేను, నా పేరు సూర్య సినిమాలతో వేసవికి టాలీవుడ్ కూడా వేడెక్కబోతోందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి మారింది. మొదట ఈ రెండు భారీ సినిమాలను ఒకే రోజున( ఏప్రిల్ 27) విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ రెండు సినిమాలు రెండు వారాల వ్యవధితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. భరత్ అను నేను ఏప్రిల్ 20న , నా పేరు సూర్య మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేశ్ బాబు కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘భరత్ అను నేను’పై మామూలుగానే అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. మహేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ వచ్చిన ఆడియో ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. ఇక డీజే లాంటి హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వక్కంతం వంశీ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్, సాంగ్స్ అభిమానులను ఉరకలు పెట్టిస్తున్నాయి. -
మండే సూర్యుడిలా..
హడావిడిగా జిప్సీలో బయల్దేరారు సూర్య. గేర్లు మార్చుకుంటూ రయ్యిమని రోడ్డుపై దూసుకెళ్తున్న సూర్య సడన్‌గా బ్రేక్ వేశాడు. రోడ్డుపై ఫుల్ ట్రాఫిక్. జస్ట్.. అలా దిగాడు. నోట్లో సిగార్ కూడా ఉందట. అటు ఇటు చూశాడట. బడికెళ్లే పిల్లలు, ఆఫీసుకు వెళ్లే పెద్దలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అసలే... సూర్యకు కోపం ఎక్కువ. పైగా బోర్డర్ బ్యాగ్రౌండ్. ప్రాబ్లమ్ ఏంటీ అని ఆరా తీస్తే.. ఎవరో ఇద్దరు అమాయకుల్ని విలన్ రోడ్డుపై కొడుతున్నాడు. అంతే.. మండే సూర్యుడయ్యాడు సూర్య. ఆ తర్వాత హైవే పై ఏం జరిగింది? అంటే.. సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. ఇలాంటి సీన్ ఒకటి ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ సినిమాలో ఉందట. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషాశ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. బన్నీ వాసు సహనిర్మాత. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. సోల్జర్ సూర్య పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. సెట్లో అల్లు అర్జున్ వాలీబాల్ ఆడుతున్న ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. ఏప్రిల్ 26న సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఒక్కరోజు ముందుకు
... వస్తున్నారు భరత్ అండ్ సూర్య. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి. పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ సినిమా షూటింగ్‌కు మార్చి 27న ప్యాకప్ చెప్పనున్నారు చిత్రబృందం. సీయం భరత్ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో, శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. సైనికుడు సూర్య పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ‘భరత్ అనే నేను’, ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ సినిమాలను ముందుగా ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు రెండు సినిమాలు ఏప్రిల్ 26న విడుదల కానున్నాయి. మరి.. ఇద్దరూ ఒకరోజు ముందుకు రావడానికి రజనీకాంత్ ‘కాలా’ కారణం అయ్యుంటుందా? అనే చర్చ జరుగుతోంది. ‘కాలా’ 27న విడుదల కానుంది. ఆ సంగతలా ఉంచితే ‘‘మహేశ్‌బాబు–కొరటాల శివ కాంబినేషన్లో సినిమా చేయడం చాలా హ్యాపీ. ఇది మా బేనర్‌కి ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేస్తాం’’ అని డీవీవీ దానయ్య అన్నారు. ‘‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ ఫెస్టివల్‌ను ఒక్కరోజు ముందుకు తీసుకొస్తున్నాం. ఏప్రిల్ 26న విడుదల చేస్తున్నాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాలోని రెండో సాంగ్ ‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో’ను ఈరోజు విడుదల చేస్తున్నారు. -
చచ్చేంత దేశభక్తి!
సైనికుడిగా దేశసేవ చేయాలనుకునేవాళ్లు బోర్డర్లో ఉంటారు. దేశం కోసం చచ్చేంత దేశభక్తి ఉన్న సైనికుడు సూర్య మాత్రం బోర్డర్ నుంచి రావాల్సి వచ్చిందట. ఎందుకు? అంటే సిల్వర్ స్క్రీన్‌పైనే చూడాలి అంటున్నారు ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ చిత్రబృందం. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషాశ్రీధర్ నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సహ నిర్మాత. ఈ సినిమా క్లైమాక్స్ షూట్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో స్టార్ట్ చేశారు. సోల్జర్ సూర్య పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ‘‘క్లైమాక్స్ పార్ట్‌ను భారీ స్థాయిలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాం. అలాగే వాలెంటెన్స్ డే సందర్భంగా సినిమాలోని ‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో’ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నాం. రచయిత రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన అద్భుతమైన లిరిక్స్‌కు విశాల్–శేఖర్ అద్భుతమైన ట్యూన్ అందించారు. శేఖర్ గొంతుతో ఈ పాట మరింత శ్రావ్యంగా తయారయ్యింది. ఏప్రిల్ 27న సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం.’’ అన్నారు నిర్మాతలు. -
మాట నిలబెట్టుకుంటున్న బన్నీ
అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ఒక్క క్షణం సినిమా కమర్షియల్ గా ఆకట్టుకోకపోయినా.. తెలుగు తెర మీద సరికొత్త ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది. గతంలో ఎప్పుడూ రాని ప్యారలల్ లైఫ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శిరీష్‌కు మంచి ఇమేజ్ తీసుకువచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు వీఐ ఆనంద్‌తో అల్లు అర్జున్ సినిమా ఉంటుందన్న టాక్ బలంగా వినిపించింది. ఒక్క క్షణం సక్సెస్ సాధిస్తే వెంటనే బన్నీతో సినిమా ఉంటుదన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ లోగా బన్నీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో బిజీ కావటంతో ఆ టాపిక్ అంతా మర్చిపోయారు. తాజాగా మరోసారి బన్నీ, వీఐ ఆనంద్‌లో కాంబినేషన్ తెర మీదకు వచ్చింది. అన్న మాట ప్రకారం వీఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు స్టైలిష్ స్టార్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఇప్పటికే బన్నీకి లైన్ వినిపించి ఓకె చేయించుకున్నాడట ఆనంద్. దీంతో ఈ కాంబినేషన్లో త్వరలోనే సినిమా ఓకె అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. -
కవర్ పేజ్‌పై బన్నీ స్టైలిష్ లుక్
స్టైలిష్ స్టార్‌గా అల్లు అర్జున్‌కు ఉన్న ఇమేజ్ సంగతి తెలిసిందే. ఇప్పటికే తన స్టైల్స్‌లో యూత్‌ను కట్టిపడేస్తున్న బన్నీ ఓ మ్యాగజైన్ కవర్ పేజ్‌పై కనిపించి అభిమానులను మరోసారి ఫిదా చేశాడు. మ్యాక్సిమ్ స్టీడ్ ఫిబ్రవరి ఎడిషన్ కవర్ పేజ్‌పై డీసెంట్ లుక్‌లో దర్శనమిచ్చాడు బన్నీ. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కోసం చేయించుకున్న డిఫరెంట్ హెయిర్ కట్ తో ఉన్న బన్నీ అదే మేకోవర్‌లో కవర్ పేజ్ పై కనిపించాడు. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ నటుడు శరత్ కుమార్‌లు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. MAXIM STEED . FEB 2018. Thank You ! pic.twitter.com/zWHkUVHIHv — Allu Arjun (@alluarjun) 8 February 2018 -
దేశభక్తికి సరిహద్దుల్లేవ్
సరిహద్దులు దేశానికి ఉంటాయి. దేశభక్తికి కాదు. అందుకే శత్రువు తూటాకన్నా, సైనికుడి కళ్లలోనే పవర్ ఎక్కువ. దేశభక్తి ముందు వారికి ప్రాణం మీద తీపి తక్కువ. పరిస్థితులు ఏవైనా, ప్రాంతం ఏదైనా అలుపెరుగని పోరాటం చేసే ధీరుడు సైనికుడు. ఇలాంటి సైనికుడి పాత్రలోనే అల్లు అర్జున్ నటిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ ఇంపాక్ట్, మేకింగ్ వీడియో, ‘సైనిక’ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. దీనికి కొనసాగింపుగానే ఫిబ్రవరి 14న మరో సాంగ్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో మైనస్ 12 డిగ్రీల వాతావరణంలో షూటింగ్ చేస్తున్నాం. విశాల్–శేఖర్ మంచి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 27న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబు. -
తెగువగు ధీరుడివని!
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతటి రిస్క్‌కైనా సై అంటారు అల్లు అర్జున్. ఇందుకు ఆయన నటించిన గత చిత్రాలే నిదర్శనం. టాలీవుడ్ తొలి సిక్స్ ప్యాక్ హీరో బన్నీ. లాంగ్ హెయిర్‌తో ‘ఆర్య–2’లో కొత్త స్టైల్లో, ‘బద్రినాథ్’లో మరో స్టైల్లో, ‘సరైనోడు’, ‘డీజే’లో ఇంకో స్టైల్లో.. ఇలా డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తారు. తాజాగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో పవర్ఫుల్ సోల్జర్‌గా కనిపించనున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాలోని ‘సైనిక’ సాంగ్‌ను ఈ రోజు ఉదయం 8 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ‘ఇల్లే ఇండియా..దిల్లే ఇండియా.. నీ తల్లే ఇండియా, ‘తెగువగు ధీరుడివని.. బలమగు భక్తుడని.. వేలెత్తి ఎలుగెత్తి భూమి... పిలిచింది నీ శక్తిని నమ్మి’ ఇటువంటి లిరిక్స్‌తో సాగే ఈ సాంగ్ సూపర్‌గా ఉండబోతుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 13న రిలీజ్ చేయనున్నారన్న వార్తల్లో వాస్తవం లేదంటున్నారు బన్నీ వాసు. ‘‘ప్రస్తుతానికైతే ముందు చెప్పినట్లుగానే ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు బన్నీ వాసు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్–శేఖర్ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. -
ఆవేశమే ఆయుధం
కారణం లేని కోపం ప్రమాదం అంటారు. అది శత్రువుకు అవకాశం అని చెబుతారు. కానీ సూర్యాకి ఆవేశమే ఆయుధం. అదెలా అనేది స్క్రీన్‌పై చూడాల్సిందే. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ సినిమాలో సూర్య అనే సైనికుడి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ భారీ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ కోసం కోటి రూపాయలతో సెట్ వేయడం విశేషం. విశేషం ఏంటంటే.. డైరెక్టర్ కావాలనుకుంటున్న ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఈ మధ్య ఫైట్ మాస్టర్‌గా సినిమాలు ఒప్పుకోవడం లేదట. కానీ ఈ చిత్రకథ విని, ఒప్పుకున్నారట. ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతం తీస్తున్న ఇంటర్వెల్ ఫైట్ ‘అదరహో’ అనే విధంగా ఉంటుందట. ఈ సినిమాలో నాలుగు మేజర్ ఫైట్స్ ఉన్నాయని టాక్. మిగిలిన ఫైట్‌ను రామ్–లక్ష్మణ్, రవి వర్మ, బ్యాంకాక్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కిచా డిజైన్ చేశారు. బన్నీ కెరీర్లో ఇది హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా నిలుస్తుందని టాక్. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రంలోని ‘సైనికా..’ అనే పాటను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బన్నీ’వాసు సహ నిర్మాత. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
సూర్య అంటే యాంగర్
బుల్లెట్ లాంటి కళ్లు. భయం లేని చూపులు. ఉక్కులాంటి బాడీ. పిడుగుల్లాంటి దెబ్బలు.. ఇవి చాలు శత్రువును జయించడానికి... కానీ సూర్య అనుకున్నది సాధించడానికి బలహీనత ఒకటి అడ్డు తగులుతుంది. అదే అతని ఆవేశం. ఆ ఆవేశం దేశం కోసమే. కానీ అదే ఆవేశం శత్రువుకు బలం. మరి... శత్రువు బలాన్ని సూర్య ఎలా ఢీ కొన్నాడు? అంటే.. స్క్రీన్ పైనే చూడాలి. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ సినిమాలో సైనికుడు సూర్య పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారు. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్‌ను రిలీజ్ చేశారు. ‘నీకు సూర్య సోల్జర్.. కానీ ప్రపంచానికి సూర్య అంటే యాంగర్’, ‘చచ్చిపోతాను.. కానీ ఇక్కడ కాదు బోర్డర్లో..’ అన్న డైలాగ్స్ సూపర్బ్‌గా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. చిత్ర సమర్పకుడు నాగబాబు మాట్లాడుతూ– ‘‘బన్నీ కెరీర్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. వక్కంతం వంశీ కంప్లీట్ ప్యాకేజ్‌తో తెరకెక్కిస్తున్నారు. దానికి ఉదాహరణే ఫస్ట్ ఇంపాక్ట్. హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు. ‘‘బన్నీగారి డెడికేషన్, వంశీ విజన్ ఏంటో ఫస్ట్ ఇంపాక్ట్‌లో తెలుస్తోంది. ముఖ్యంగా డైలాగ్స్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటుండడం ఆనందంగా ఉంది. ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు శిరీషా శ్రీధర్. ‘‘న్యూ ఇయర్‌కు ఫస్ట్ ఇంపాక్ట్‌ను డబుల్ బొనాంజాగా ఫ్యాన్స్ భావిస్తున్నారు’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ఈ సినిమాకు సంగీతం: విశాల్ –శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు. ఈ రీల్‌లైఫ్ విషయాలు కాస్త పక్కనపెట్టి బన్నీ పర్సనల్ లైఫ్ దగ్గరకు వస్తే..న్యూ ఇయర్‌కు ఆయన సతీమణితో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్సెట్లో మీరు చూస్తున్న ఫొటో అదే. -
పేరులో ఇండియా
దేశం మనకేమిచ్చిందన్నది కాదు. పౌరులుగా దేశం కోసం మనమేం చేశామన్నదే ముఖ్యం. సరిగ్గా ఇలాంటి ఆలోచనతో కూడిన వ్యక్తిత్వం ఉన్నవాడే సూర్య. దేశం కోసం నేను సైతం అంటూ సూర్య ఏం చేశాడన్నది సిల్వర్ స్క్రీన్ పైనే చూడాలంటున్నారు చిత్రబృందం. అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకం పై శిరీష శ్రీధర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. ఇందులో అల్లు అర్జున్ పాత్ర పేరు సూర్య. ప్రస్తుతం గోవాలో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్ రేపటితో కంప్లీట్ అవుతుందని సమాచారం. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌తో పాటు, ఫైట్ మాస్టర్ రవివర్మ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘‘ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ స్పెషల్‌గా ఉంటుంది. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. సినిమా చూసిన తర్వాత వాళ్ల పేరులో ముందుగానీ, వెనకగానీ ఇండియా అని యాడ్ చేసుకోవాలన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత ఎమోషనల్ స్టోరీ. వాస్తవానికి సినిమా షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేశాం. కానీ, అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటే షూటింగ్ ఆలస్యం అవుతుందని గోవాలో జరుపుతున్నాం’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. శరత్‌కుమార్, అర్జున్, అనూప్‌సింగ్ ఠాకూర్ ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ ద్వయం విశాల్–శేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ఏప్రిల్ వార్... వెనక్కి తగ్గేదెవరు?
వేసవి రావడానికి ఇంకా టైమ్ ఉంది. కానీ హీట్ ఇప్పుడే మొదలైంది. వేడి మొదలైంది వెదర్లో కాదు. బాక్సాఫీస్ బరిలో. ఆల్రెడీ ఏప్రిల్‌లో పోటీ పడేందుకు నాగార్జున, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, కంగనా రనౌత్‌ల సినిమాలు రెడీ అవుతున్నాయి. ‘మేం ముందే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాం.. మహేశ్‌బాబు సినిమా వెనక్కి తగ్గితే’ బాగుంటుంది అని అల్లు అర్జున్ కాంపౌండ్ అనుకుంటోంది. ఇంకా ఈ విషయమే సెటిల్ కాలేదు. ఈలోపు రజనీకాంత్ ‘రోబో 2.0’ లైన్లోకొచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ బరిలో దించనున్నట్లు లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధికారికంగా ఎనౌన్స్ చేసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో వేరే సినిమాలు ‘ఢీ’ కొంటాయా? వెనక్కి తగ్గుతాయా? అన్నది ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్. డైలమాలో పడేసిన ‘2.0’ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘2.0’ చిత్రాన్ని స్టార్ట్ చేసి చాలా కాలం అయ్యింది. ఈ ఏడాది దీపావళికి రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. వచ్చే జనవరి 25న రిలీజ్ అన్నారు. అయితే ఆదివారం ఏప్రిల్‌లో రిలీజ్ అని రాజు మహాలింగం పేర్కొన్నారు. వాస్తవానికి జనవరిలో ఈ సినిమా వచ్చే చాన్స్ లేదని ‘2.0’లో విలన్‌గా నటించిన అక్షయ్‌కుమార్ తాను హీరోగా నటించిన హిందీ చిత్రం ‘ప్యాడ్ మ్యాన్’ రిలీజ్ జనవరి 26న అని ఎనౌన్స్ చేసినప్పుడే అర్థమైంది. దీంతో ‘2.0’ సినిమా పోస్ట్‌పోన్ అయ్యిందన్న ఊహగానాలు ఊపందుకున్నాయి. తమిళ సంవత్సరం స్టార్ట్ అయ్యే ఏప్రిల్ 13న 2.0 ను రిలీజ్ చేస్తారని కొందరు అనుకున్నారు. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ‘2.0’ ఏప్రిల్ 27న రిలీజ్ అని చేసిన ట్వీట్‌ను రిట్వీట్ చేశారు రాజమహాలింగం. సో.. ఈ సినిమా ఏప్రిల్ 27న ఖాయం అంటున్నాయి కోలీవుడ్ సినీ వర్గాలు. తరణ్ ఆదర్శ్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ ‘‘బాహుబలి’ టీమ్ తరఫున ‘2.0’ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అని భల్లాలదేవుడు.. అదేనండీ రానా ట్వీట్ చేయడం విశేషం. ‘బాహుబలి’ ఈ ఏడాది ఏప్రిల్ 28న విడుదలైన విషయం గుర్తుండే ఉంటుంది. ఏది ఏమైనా ‘2.0’ని ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో మిగతా చిత్రాలు డైలమాలో పడ్డాయి. భరత్ చెప్పినట్లు చేస్తాడా? అక్టోబర్ 26న తెలుగు ఇండస్ట్రీలో మహేశ్ వర్సెస్ బన్నీ అని ఒకటే చర్చ. ఎందుకంటే మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా (‘భరత్ అనే నేను’ టైటిల్ పరిశీలనలో ఉంది) ను ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్రనిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ అధికారికంగా ప్రకటించింది. దాంతో అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా నిర్మాతల్లో ఒకరైన ‘బన్నీ’ వాసు ఒక సినిమా ప్రెస్మీట్లో అసహనం వ్యక్తం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘రిలీజ్ డేట్ ముందే మేం ప్రకటించాం. ఒకే తేదీన రెండు సినిమాలు విడుదల కావడం సరి కాదు. మాతో దానయ్యగారు ఒక్క మాట అయినా చెప్పి ఉండాల్సింది’’ అని ‘బన్నీ’ వాసు అన్నారు.అయితే ఫైవ్ డేస్ బ్యాక్ మహేశ్ సినిమాను ఏప్రిల్ 27నే రిలీజ్ చేయనున్నట్లు డివీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ సినిమా షెడ్యూల్స్‌తో కూడిన ఓ పోస్టర్‌ను ట్విట్టర్లో రిలీజ్ చేసింది. అప్పుడు అందరూ మహేశ్ వర్సెస్ బన్నీ ఫిక్స్ అనుకున్నారు. అయితే ఆ రోజే రిలీజ్ డేట్ లేని మరో పోస్టర్ ఆన్లైన్లో కనిపించింది. సో.. బాక్సాఫీసు వద్ద బన్నీ వర్సెస్ మహేశ్ లేనట్లేనా? ఇద్దరు సినిమాల నిర్మాతలు ఓ అండర్స్టాండింగ్ వచ్చారని ఫిల్మ్‌నగర్ టాక్. రేసుగుర్రంలా దూసుకెళ్తాడా? అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. రామలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మిస్తున్నారు.‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది జూన్‌లో స్టార్ట్ చేశారు. సెట్స్‌పైకి వెళ్లిన వెంటనే ఏప్రిల్ 27న తమ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ‘2.0’ సడన్‌గా సీన్లోకొస్తుందని నిర్మాతలు ఊహంచలేదు. మరి.. ఇప్పుడు ‘నా పేరు సూర్య ఆ ఇల్లు ఇండియా’ కూడా రిలీజ్ డేట్ మార్చుకోవాలా? మహేశ్‌బాబు సినిమా రిలీజ్ ఎప్పుడు? అనే చర్చ జరుగుతోంది. వీర వనిత వెనక్కి తగ్గాలా? వీర వనిత రాణీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ టైటిల్ రోల్లో రూపొందుతున్న సినిమా ‘మణికర్ణిక’. ఆల్మోస్ట్ 60 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. అసలు ఏప్రిల్ బరిలో సినిమాను నిలిపింది ఫస్ట్ ఈ టీమ్‌నే. మే నెలలో వారణాసిలో జరిగిన ప్రోగ్రామ్‌లో ‘మణికర్ణిక’ అధికారిక పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఆ పోస్టర్‌పై ఈ సినిమా రిలీజ్ తేదీ ఏప్రిల్ 27 అని ఉంది. మరి.. మణికర్ణిక వెనక్కి తగ్గుతారా? అన్న ప్రశ్నకు చిత్రబృందం దగ్గరే సమాధానం ఉంది. జీ స్టూడియోస్, కమల్‌జైన్, నిశాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వర్మ మనసు మార్చుకుంటారా? నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. ‘శివ’ వంటి ట్రెండ్ సెట్టర్ మూవీ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో తాజా సినిమాపై బోలెడన్ని అంచనాలు నెలకొన్నాయి. ‘‘నవంబర్‌లో షూటింగ్‌ను స్టార్ట్ చేసి ఫిబ్రవరి కల్లా ఫినిష్ చేసి, ఏప్రిల్‌లో విడుదల చేస్తాం. ఆ తర్వాతే ఏన్టీఆర్ బయోపిక్ స్టార్ట్ చేస్తా’’ అని ఫేస్బుక్లో పేర్కొన్నారు వర్మ. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్‌లోనే. ఏప్రిల్ 20న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ఊహాగానాలు నెలకొన్నాయి. వర్మ మైండ్‌సెట్ మారుతుందా? తెలుసుకోవాలంటే వెయిట్ చేయక తప్పదు. కంపెనీ పతాకంపై సుధీర్‌చంద్రతో కలిసి రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సేమ్ సీన్! 2017 ఆగస్టు 11 2018 ఏప్రిల్ 27? తేజ దర్శకత్వంలో రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’, హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘లై’, బెల్లంకొండ శ్రీనివాస్ నటించన ‘జయజానకి నాయక’ చిత్రాలు ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ అయ్యాయి. రిలీజ్ డేట్స్‌లో తేడా లేకపోవడం వల్ల ఈ సినిమాల కలెక్షన్స్ దెబ్బతిన్నాయన్న గుసగుసలు ఫిల్మ్‌నగర్‌లో వినిపించాయి. మరి.. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? ఇప్పటివరకు ‘2.0’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘మణికర్ణిక’ సినిమాల రిలీజ్ డేట్స్‌ను 27నే ఫిక్స్ చేశారు. ‘బన్నీ’ వాసు, దానయ్య మాట్లాడుకోవడం వల్ల మహేశ్‌బాబు సినిమా రిలీజ్ డేట్ మారిందని టాక్. ఒకవేళ ‘2.0’ రిలీజ్ డేట్ ఏప్రిల్ 27 అయితే మిగతా మూడు సినిమాల సంగతేంటి? తేదీ మార్చుకుంటాయా? ఈ మూడు ఒకే తేదీన విడుదలవుతాయా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. పోటీ పడకూడదని... ‘‘వచ్చే ఏప్రిల్, మే నెలల్లో మా సినిమాలు విడుదల చేయాలనుకున్న నిర్మాతలందరం మా మధ్య ఎలాంటి పోటీ ఉండకూడదని కలసి, కూర్చుని చర్చించుకుంటున్నాం. ఇలాంటి సమయంలో ‘2.0’ విడుదల తేదీని హఠాత్తుగా ప్రకటించడంతో అన్ని తెలుగు సినిమాలూ డైలమాలో పడ్డాయి. తెలుగు పరిశ్రమ ఎప్పుడూ ఇతర భాషల చిత్రాలను గౌరవించింది, ఆహ్వానించింది. అయితే ‘2.0’ లాంటి పెద్ద ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ మారడం వల్ల తెలుగు నిర్మాతల మధ్య కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ట్రేడ్ బాడీస్ కలిసి ఒక నిర్ణయానికి రావాలి. సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలి’’ అని మహేశ్‌బాబు హీరోగా (‘భరత్ అనే నేను’) తాజా సినిమా నిర్మిస్తోన్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత డీవీవీ దానయ్య సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళతా ‘‘లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘2.0’ చిత్రాన్ని గౌరవిస్తున్నాం. కానీ, సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో మీరు (‘2.0) నిర్మాతలు) చేస్తున్న మార్పులు ప్రాంతీయ చిత్రాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఆల్రెడీ రిలీజ్ డేట్స్ ఈ విషయంలో (‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ – సహ నిర్మాత), డీవీవీ దానయ్య (మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’ నిర్మాత) ఒక అండర్ స్టాండింగ్‌కి రావడానికి చర్చించుకుంటున్నాం. ఈ విషయాన్ని (‘2.0’ రిలీజ్) నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నా. తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌తో చర్చిస్తాం. మా రిలీజ్ డేట్స్ కమిట్మెంట్కు కట్టుబడి ఉండాలనుకుంటున్నాం. ఈ నిర్ణయం రాబోయే ప్రాంతీయ చిత్రాలకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. – డి.జి. భవాని ముసిమి శివాంజనేయులు -
ఇంట్లో పండగ
అవును.. సూర్య ఇంట్లో పండగ చేసుకున్నారు. పండ గలంటే మనం పిండి వంటలు చేసుకుంటాం. సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. మహా అయితే ఏదైనా ఆటలు ఆడతాం. అదే సినిమాల్లో అయితే వీటన్నింటితో పాటు పాటలు కూడా పాడుకుంటారు. సూర్య కూడా తన ఫ్యామిలీతో కలసి పాట పాడారు. అందరూ డ్యాన్స్ చేశారు. మనోడు స్టెప్పేశాడంటే సూపర్ అనాల్సిందే. మరి.. అల్లు అర్జునా? మజాకా? సూర్య గురించి చెబుతూ అల్లు అర్జున్ అంటున్నారేంటి? అని అనుకోరు. ఎందుకంటే.. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ పేరుతో బన్నీ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవీ మర్చంట్ ఈ చిత్రం కోసం రెండు పాటలు కంపోజ్ చేస్తున్నారు. ఒకటి పైన చెప్పిన ఫ్యామిలీ సాంగ్. ఇంకోటి లవ్ సాంగ్. సూర్య ఇంటి సెట్లో ఈ ఫ్యామిలీ సాంగ్‌ని నైట్ ఎఫెక్ట్‌లో తీశారు. ఈ పాటలో కీలక తారాగణంతో పాటు వంద మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం రొమాంటిక్ సాంగ్ తీస్తున్నారు. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
సూర్య కిక్కే వేరప్పా!
యస్.. విలన్స్‌ను రఫ్ఫాడిస్తున్నారు సూర్య. మెయిన్ విలన్‌తో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్‌ను స్క్రీన్ పై చూస్తే ఆ కిక్కే వేరప్పా అని చిత్రబృందం అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. ప్రజెంట్ హైదరాబాద్‌లో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య అనే పవర్ఫుల్ రోల్లో అల్లు అర్జున్ నటిస్తున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ‘సింగం 3’, ‘విన్నర్’, ‘రోగ్’ సినిమాల్లో విలన్‌గా నటించిన అనూప్ సింగ్ ఠాగూర్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. ‘‘ఫస్ట్ డే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వంశీ తన స్టైల్లో ముగించాడు. అల్లు అర్జున్‌తో గ్రేట్ కిక్ సీన్ షూట్ చేశాం. మా ఇద్దరి ఎనర్జీస్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు సూపర్‌గా ఉంటాయని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు అనూప్. బాలీవుడ్ ద్వయం విశాల్–శేఖర్ సగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సహ నిర్మాత. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
...ఆన్ ఏప్రిల్ 27
యస్... ఏప్రిల్ 27నే! అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను ఆ రోజునే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చిత్రనిర్మాత లగడపాటి శిరీషా శ్రీధర్ వెల్లడించారు. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమ తాజా షెడ్యూల్ వచ్చే నెల 5న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. చిత్రసమర్పకులు కె. నాగబాబు మాట్లాడుతూ– ‘‘నెల రోజుల పాటు హైదరాబాద్ షెడ్యూల్ జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ సీన్స్‌తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రమిది. ఏప్రిల్ 27... అల్లు అర్జున్ అభిమానులు పెద్ద పండగ చేసుకునే రోజు. వరల్డ్ వైడ్‌గా అత్యధిక థియేటర్లలో ఆ రోజున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని సహనిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా, తమిళ నటుడు అర్జున్, శరత్‌కుమార్ ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్–లక్ష్మణ్, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, కెమెరా: రాజీవ్ రవి, సంగీతం: విశాల్–శేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబు. -
అమ్మకు ఓ ముద్దు
అల్లు అర్జున్ ఆదివారమంతా అమ్మాయి అర్హ, అబ్బాయి అయాన్, అర్ధాంగి స్నేహలతో ఆడుతూ పాడుతూ గడిపారట. అదీ హైదరాబాద్‌లో కాదు, ఊటీలో! అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ షూటింగ్ ఊటీలో జరుగుతోంది. అసలే అల్లువారి హీరోకి పిల్లలంటే ఎంతో ప్రేమ. ఎక్కువ రోజులు వాళ్లకు దూరంగా ఉండాలంటే కష్టమే. అందువల్ల, పిల్లలతో కలసి స్నేహ రెండు రోజుల క్రితమే ఊటీ వెళ్లారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పిల్లలతో ఆడుతూ రిలాక్స్ అవుతున్నారట అర్జున్. ఆదివారం ఉదయం ఓ రెస్టారెంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత... అమ్మకు మురిపెంగా అర్హ ఓ ముద్దిస్తుంటే, కుమార్తెను ఎత్తుకున్న అర్జున్ ఎంతో ఆనందపడుతున్న సమయంలో ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరు కెమెరా కళ్లకు పని చెప్పారు. నెట్టింట్లోని ఈ ఫొటోలు అభిమానుల్ని ఆకర్షిస్తున్నాయి. -
ఫ్రమ్ తమిళనాడు... కేరళ!
అల్లు అర్జున్–అనూ ఇమ్మాన్యుయేల్–పోసాని కృష్ణమురళి ముగ్గురి మధ్య ఓ ఇంపార్టెంట్ విషయం జరుగుతోంది. ముగ్గురూ ఊటీలో ఉన్నారు. ఎందుకంటే, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కోసం. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఊటీలో నైట్ షూట్ చేస్తున్నారు. బన్నీ–అను–పోసాని పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కి బన్నీ అభిమానులు వెళుతున్నారు. జనరల్‌గా షూటింగ్ జరిగేటప్పుడు ఎక్కువమందిని చూడనివ్వరు... సినిమాకి సంబంధించిన కీలకమైన సమాచారం ఏదైనా బయటికొస్తుందేమోనని. కానీ, బన్నీ మాత్రం ఫ్యాన్స్‌ని షూటింగ్ చూడనిచ్చారు. అది మాత్రమే కాదు.. వాళ్లకు లొకేషన్లో లంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ వీళ్లంతా తెలుగు ఫ్యాన్స్ కాదు. ఫ్రమ్ తమిళనాడు, కేరళ. బన్నీకి అక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు మరి. -
నయా లుక్!
లైట్‌గా ఫేస్‌కట్ ఛేంజైంది. ఆర్మీ హెయిర్ స్టైల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఫిజిక్ కాస్త పెరిగింది. మొత్తంగా అల్లు అర్జున్ న్యూ లుక్ అదిరింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. ఇందులో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. క్యారెక్టర్ పేరు సూర్య. ఈ పాత్ర కోసమే అల్లు అర్జున్ ఇలా మేకోవర్ అయ్యారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఊటీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్–శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు సన్మానం
టాలీవుడ్ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను బళ్లారి జిల్లా సంఘం నేతలు సన్మానించారు. హంపీ సందర్శనకు కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన్ను శ్రీయోగి నారాయణ బలిజ సంఘం జిల్లా అధ్యక్షుడు కాండ్రా సతీష్ ఆదివారం ఉదయం కమలాపురంలోని ఓ హోటల్లో కలిసి సన్మానించారు. త్వరలో బళ్లారికి రావాలని అల్లు అర్జున్ను కోరారు. బళ్లారిలో ఆయనకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా బలిజ సంఘం నేతలు వేణుమాధవ్, మంజు, కుమార్, ప్రసాద్, గణేష్ పాల్గొన్నారు. డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్న బన్నీ, ప్రస్తుతం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. -
బన్నీ కొత్త సినిమా మొదలైంది
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్ పూర్తి చేసిన అల్లు అర్జున్, ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తన నెక్ట్స్ సినిమాను స్టార్ట్ చేశాడు. స్టార్ రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను ప్రారంభించాడు. లగడపాటి శ్రీధర్, నాగబాబులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్‌ను సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న డీజేను ఈ నెల 23న భారీగా రిలీజ్ చేస్తున్నారు. తొలిసారిగా అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న డీజే పై భారీ అంచనాలు ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. -
బన్నీ సినిమా పేరు మారుతోందా..?
త్వరలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆ తరువాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. స్టార్ రైటర్‌గా పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో బన్నీ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖరున సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు 'నా పేరు సూర్య.. నా ఇళ్లు ఇండియా' అనే టైటిల్‌ను ఫైనల్ చేసినట్టుగా చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్రయూనిట్ ఈ సినిమాకు మరో టైటిల్‌ను నిర్ణయించాలని భావిస్తుందట. కొత్త టైటిల్‌ను సినిమా ఓపెనింగ్ రోజే ఎనౌన్స్ చేసే అవకాశం ఉందంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు, లగడపాటి శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు.