యస్.. విలన్స్‌ను రఫ్ఫాడిస్తున్నారు సూర్య. మెయిన్ విలన్‌తో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్‌ను స్క్రీన్ పై చూస్తే ఆ కిక్కే వేరప్పా అని చిత్రబృందం అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. ప్రజెంట్ హైదరాబాద్‌లో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య అనే పవర్‌ఫుల్ రోల్‌లో అల్లు అర్జున్ నటిస్తున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ‘సింగం 3’, ‘విన్నర్’, ‘రోగ్’ సినిమాల్లో విలన్‌గా నటించిన అనూప్ సింగ్ ఠాగూర్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు.
‘‘ఫస్ట్ డే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వంశీ తన స్టైల్లో ముగించాడు. అల్లు అర్జున్‌తో గ్రేట్ కిక్ సీన్ షూట్ చేశాం. మా ఇద్దరి ఎనర్జీస్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు సూపర్‌గా ఉంటాయని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు అనూప్. బాలీవుడ్ ద్వయం విశాల్–శేఖర్ సగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సహ నిర్మాత. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment