Alluarjun
-
ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. టాలీవుడ్ ప్రముఖుల సంఘీభావం (ఫొటోలు)
-
సంథ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ (ఫొటోలు)
-
చెన్నైలో 'పుష్ప 2' వైల్డ్ ఫైర్ ఈవెంట్ (ఫొటోలు)
-
మిస్టర్ పొలిశెట్టి బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
అల్లు అర్జున్ సెంటిమెంట్ ప్లాన్ అదుర్స్ ఇక పుష్ప2 కలెక్షన్ ఊచకోతే
-
న్యూయార్క్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
న్యూయార్క్ నగరం నడిబొడ్డున ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో చిన్నారుల వేషదారణ చూపరుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సంబరాల్లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని,ప్రముఖ దర్శకుడు హరీశంకర్ అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక తెలుగు వాడిగా దేశం మొత్తం జరుపుకునే ఈపండుగలొ పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం తానా అధ్యక్షులు లావు అంజయ చౌదరి మాట్లాడుతూ..మాతృదేశానికి సేవ చేసేందుకు ఎప్పుడు ముందుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తానా సేవల సమన్వయకర్త రాజా కసుకుర్తి,బోర్డ్ కొశాధికారి లక్ష్మిదెవినెని, తానామాజీ అధ్యక్షులు జయ్ తాల్లూరి, జానినిమ్మలపుడి , శ్రీనివాస్ ఒరుగంటి, విద్య గారపాటి, దిలీప్ముసునూరు, శిరీష, శ్రీ కొనంకి,సుధీర్ నారెపలెపు, శివని, శ్రీ అట్లూరి , శ్రీలక్ష్మి అద్దంకితదితరులు పాల్గొన్నారు. -
Chandrabose: పుష్ప నా కెరీర్‌కే సవాల్ విసిరింది
‘‘పుష్ప’ పాటలు విడుదలయ్యాక ఇండస్ట్రీ నుంచి చాలామంది అభినందిస్తూ మెసేజ్‌లు పంపించారు. అమెరికా నుంచి కొందరు యువకులు ఫోన్ చేసి ‘పుష్ప’ పాటల పల్లవులు, చరణాలు పాడి వినిపించారు. దాంతో నేటి యువత కూడా సాహిత్యాన్ని ఇంతలా ఓన్ చేసుకున్నారా? అని చెప్పలేని సంతోషం కలిగింది’’ అని పాటల రచయిత చంద్రబోస్ అన్నారు. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాటల రచయిత చంద్రబోస్ విలేకరులతో చెప్పిన విశేషాలు. ► సుకుమార్‌గారితో ‘ఆర్య’ నుంచి నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన స్వతహాగా కవి కాబట్టి ఆయన్ని సంతృప్తి పరచడం మరింత సవాల్ అనిపించింది. మనం ఏం రాయాలి అనే దానిపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని రాయాల్సి ఉంటుంది. ► ‘పుష్ప’ సినిమాకు పాటలు రాయటం చాలా కష్టం అనిపించింది. ఈ సినిమా పూర్తీగా చిత్తూరు జిల్లా యాసలో నడుస్తుంది కాబట్టి పాటల్లో కూడా ఆ ప్రాంత స్లాంగ్‌ను, పదాలను వాడాల్సి వచ్చింది. సుకుమార్, అల్లు అర్జున్ గార్లు చిత్తూరు యాసను కష్టపడి ఒంట బట్టించు కుని అందులో లీనం అయిపోయిన విధానం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. వారి స్ఫూర్తితో నేను కూడా కష్టపడి రాశాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రంలోని పాటలు నా కెరీర్‌కే చాలెంజ్ విసిరాయి. ► ‘పుష్ప’లోని ‘దాక్కో దాక్కో మేక, ‘శ్రీవల్లీ’, ‘సామీ సామీ’, ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా..’ పాటలకు చాలా మంచి స్పందన వచ్చింది. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, నా కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాల్లానే ఇందులో కూడా ఓ ఐటమ్ సాంగ్ ఉంది. ‘ఊ అంటావా.. ఊహూ అంటావా..’ అనే ఈ ఐటెమ్ సాంగ్ ప్రేక్షకుల అంచనాల కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. ► ‘రంగస్థలం’ సినిమాకి నేను పాటలు రాయలేదు. కేవలం ఆ సందర్భాలు మాటలను పలికాయి.. అవే పాటలై పోయాయి. నేను వాటిని పేపర్‌పైన పాటల రూపంలో రాసుకోలేదు. లిరికల్ షీట్ విడుదల చేయాలనుకున్నప్పుడు మాత్రమే పేపర్ మీద పాటల రూపాన్ని పెట్టాను. నా 27 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ► మేం ఆమ్స్టర్డ్యామ్లో ఓ బ్రిడ్జి ఎక్కుతున్నప్పుడు వచ్చిన ఆలోచనే ‘చూపే బంగారమాయెనే..’ పాట. 15 రోజుల మేథో మధనం తర్వాత తిరుపతి హోటల్ రూమ్‌లో పుట్టిందే ‘దాక్కో దాక్కో మేక..’ పాట. మా ‘పుష్ప’లోని పాటలు ప్రేక్షకుల హృదయాలను గంపగుత్తగా దోచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ తరంలోనూ నా పాటలు కూడా ట్రెండింగ్‌లో ఉండటం మరింత సంతోషాన్నిస్తోంది. -
రాములో .. రాములా సౌత్ ఇండియా రికార్డ్
సాక్షి, వరంగల్ :‘నాటక రంగం నుంచి రచనా రంగంలోకి వచ్చాను.. మా నాన్న స్టేజీ ఆర్టిస్ట్.. నా చదువు ఎక్కువగా వరంగల్‌లోనే సాగింది.. చిన్నప్పటి నుంచి నాటకాలు, రచనలు అంటే చాలా ఇష్టం.. అదే మక్కువతో రచయితగా మారాను. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నేను రాసిన రాములో... రాముల పాటకు ప్రశంసలు దక్కాయి...’ అంటున్నారు సినీ గేయ రచయిత కాసర్ల శ్యాం! వరంగల్‌కు బుధవారం వచ్చిన ఆయనను ‘సాక్షి’ పలకరించగా తన సినీ ప్రస్థానాన్ని వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.... మాది హన్మకొండ నేను పుట్టి పెరిగింది అంతా వరంగల్‌లోనే. హన్మకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన మా నాన్న గారు మధుసూదన్‌రావు రంగస్థల నటులు. అప్పట్లో మా నాన్న కూడా పలు చిత్రాల్లో నటించారు. దీంతో ఆయనను హన్మకొండ శోభన్‌బాబు అని పిలిచేవారు. దీంతో చిన్నతనం నుంచే నాకు కూడా సాహిత్యం ఇష్టం ఏర్పడింది. క్షీర సాగరమధురం, నటరాజు నవ్వాలి వంటి నాటకాల్లో చిన్నప్పుడే పాత్రలు పోషించాను. జానపదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వరంగల్ శంకర్, సారంగపాణి తమ బృందాల్లో నాకు అవకాశం ఇచ్చారు. తొలుత నాటకరంగంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలైన నా ప్రయాణం, జానపద గేయ రచయితగా, గాయకుడిగా అనేక మలుపులు తిరిగింది. నేను రాసిన, పాడిన పాటల్లో చాలా వరకు ఆడియో క్యాసెట్ల రూపంలో వచ్చాయి. చదివింది ఇక్కడే.. హన్మకొండలోని మచిలీబజార్‌లోని ప్రగతి స్కూల్లో 10వ తరగతి వరకు, ఇంటర్ హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్, యూనివర్సిటీలో చదువుకున్నాను. చదువుకునే రోజుల్లో జ్యోతి కల్చరల్ ఆర్ట్స్‌ను ప్రారంభించి 13 నృత్య నాటికలు రాయడంతో పాటు సమాచార శాఖ ఆధ్వర్యాన ప్రదర్శనలు ఇచ్చాను. వరంగల్ శంకరన్న, సారంగపాణి, మా ఇంట్లో వారి ప్రోత్సాహంతో హైదారాబాద్ వెళ్లాను. అక్కడ తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఫోక్ ఆర్ట్స్‌లో చేరాక ఆకాశవాణిలో యువవాణి కార్యక్రమాన్ని నిర్వహించా. రాములో .. రాములా సౌత్ ఇండియా రికార్డ్ త్రివిక్రమ్ దర్శకత్వంతో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘అల వైకుంఠపురములో..’ సినిమాలో రాములో... రాములా పాట రాశాను. సౌత్ ఇండియాలోనే 24గంటల్లో 8.3 మిలియన్ మంది వీక్షకులు ఈ పాటను యూ ట్యూబ్‌లో వీక్షించారు. 20 రోజుల్లో 50 మిలియన్ మంది వీక్షించారు. ప్రముఖ హీరో వెంకటేష్, నాగచైతన్య నటిస్తున్న వెంకీ మామ, సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతి రోజు పండగే, నితిన్ నటిస్తున్న భీష్మ ఇలా పలు సినిమాల్లోనూ పాటలు రాశాను. ఇక బస్ స్టాప్ సినిమాలోని కలలు.. పాటకు 2012లో సంతోషం అవార్డు, వంశీ ఇంటర్నేషనల్ వారు సినారే అవార్డు, తెలుగు రచయితల అసోసియేషన్ నుంచి విశిష్ట రచన పురస్కారం, సింగిడి అవార్డులు దక్కాయి. ‘కోకోకో కొక్కోరొక్కో’ పాట నేనే రాశా 2003 సంవత్సరంలో దర్శకురాలు బి.జయ తన చంటిగాడు సినిమాలో అవకాశవిుచ్చారు. ఆ సినిమాలో ‘కోకోకో కొక్కోరొక్కో’ పాట నేనే రాశా. ఆ తర్వాత ఏడేళ్లలో ఏడు చిత్రాలకు మాత్రమే పని చేశా. ఓ పక్క ఎంఫిల్... మరోపక్క పాటలు... కష్టమైంది. కృష్ణవంశీ మహాత్మాలో నీలపురి గాజులు... పాటతో బ్రేక్ వచ్చినా అవకాశాలు మాత్రం రాలేదు. ఇక మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో సినిమాలోని రింగ్ ట్రింగ్ పాటతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. దేవిశ్రీప్రసాద్‌తో వర్క్ చేయాలనుకున్న కోరిక ఎఫ్2 సినిమాలోని రెచ్చిపోదాం బ్రదర్ పాట ద్వారా తీరింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో దిమాక్ కరాబ్ నే పాట కూడా మంచి పేరు తీసుకొచి్చంది. ఇప్పటికి 150కు పైగా చిత్రాల్లో 350కు పైగా పాటలు రాశాను. వరంగల్‌కు మంచి గుర్తింపు వరంగల్‌కు చెందిన వారే ప్రస్తుతం ఎక్కువగా సినిమా రంగంలో రాణిస్తున్నారు. పెద్ద డైరెక్టర్లు, మంచి టెక్నీషియన్లు, సంగీత దర్శకులు, గేయ రచయితలు ఎందరో వరంగల్ వారే ఉన్నారు. ఇక్కడ రామప్ప, ఖిలా వరంగల్, లక్నవరం, భద్రకాళి దేవాలయం ఇలా ఎన్నో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. కాగా, సినిమా రంగంలో కొత్తగా వచ్చే వారికి అతి విశ్వాసం ఉండొద్దు. కొత్తవి నేర్చుకుంటూ ముందుకు సాగితే మంచి ఫలితం ఉంటుంది. అవకాశాలు రావడం లేదు కదా అని నిరాశకు లోనైతే ఇబ్బందులు ఎదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగితే తప్పక విజయం వరిస్తుంది. -
అల్లు అర్హా@2
సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చినట్టున్నారు అల్లు అర్జున్. తదుపరి సినిమా షురూ చేయడానికి కంగారు పడటం లేదు. ఈ సమయాన్ని ఫ్యామిలీకి ఎక్కువగా కేటాయిస్తున్నారాయన. బుధవారం అల్లు అర్జున్ కుమార్తె అర్హా పుట్టినరోజు. అర్హా బర్త్‌డేను కుటుంబ సమేతంగా గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు అల్లు అర్జున్. ‘‘నా ^è బ్బీ డాల్ అర్హాకు రెండో బర్త్‌డే శుభాకాంక్షలు. తన బర్త్‌డేను గోవాలో సెలబ్రేట్ చేసుకున్నాం’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్. సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ నెక్ట్స్ త్రివిక్రమ్ దర్శకత్వంలో యాక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. అలాగే తమిళ సూపర్ హిట్ ‘96’ రీమేక్‌లో కూడా అల్లు అర్జున్ కనిపిస్తారని టాక్. -
ఈసారి డైలాగ్ గురూ
దుమ్ము రేపాడు. ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్‌లో సూపర్బ్ పర్ఫార్మెన్స్తో అల్లు అర్జున్ దుమ్ము రేపాడని ప్రేక్షకులు అన్నారు. ఇప్పుడు సినిమాలోని డైలాగ్స్‌కు ఉన్న దమ్మును చూపించేందుకు చిత్రబృందం రెడీ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శీరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ నెల 8న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా డైలాగ్ ఇంపాక్ట్ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. సినిమా మే 4న రిలీజ్ కానుంది. -
ఫారిన్లో డ్యూయెట్
ఇప్పటివరకూ బార్డర్లో దేశం కోసం పోరాడిన సూర్య ఇప్పుడు విదేశాల్లో కొంచెం విశ్రాంతి తీసుకోనున్నారు. విశ్రాంతి ఏంటి అనుకుంటున్నారా? ఇన్ని రోజులు యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొన్న సూర్య ఇప్పుడు తన ప్రేయసితో డ్యూయెట్ పాడుకోవటం కోసం ఫారిన్ వెళ్లారట. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. సోల్జర్ సూర్య పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్‌పై ఒక రొమాంటిక్ సాంగ్‌ను ఫారిన్లో బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో షూట్ చేయనున్నారట చిత్రబృందం. మార్చి 21 నుంచి ఈ సాంగ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉందట. ఆ పాటకు బాలీవుడ్ భామ ఎలీ అవరమ్ డ్యాన్స్ చేయనున్నారు. ఈ సాంగ్ గురించి ఎలీ మాట్లాడుతూ – ‘‘ఇది ఐటమ్ సాంగ్ కాదు. అద్భుతమైన లిరిక్స్, మెసేజ్ ఉండే స్పెషల్ సాంగ్. అల్లు అర్జున్ డ్యాన్స్‌కు నేను పెద్ద ఫ్యాన్. అయితే ఈ పాటలో అల్లు అర్జున్ ఎక్కువ డ్యాన్స్ చేయరు’’ అని పేర్కొన్నారామె. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. మే 4న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. -
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ స్టిల్స్
-
సూర్య కిక్కే వేరప్పా!
యస్.. విలన్స్‌ను రఫ్ఫాడిస్తున్నారు సూర్య. మెయిన్ విలన్‌తో ఢీ అంటే ఢీ అని తలపడుతున్నారు. కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్‌ను స్క్రీన్ పై చూస్తే ఆ కిక్కే వేరప్పా అని చిత్రబృందం అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. ప్రజెంట్ హైదరాబాద్‌లో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య అనే పవర్ఫుల్ రోల్లో అల్లు అర్జున్ నటిస్తున్నారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ‘సింగం 3’, ‘విన్నర్’, ‘రోగ్’ సినిమాల్లో విలన్‌గా నటించిన అనూప్ సింగ్ ఠాగూర్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. ‘‘ఫస్ట్ డే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వంశీ తన స్టైల్లో ముగించాడు. అల్లు అర్జున్‌తో గ్రేట్ కిక్ సీన్ షూట్ చేశాం. మా ఇద్దరి ఎనర్జీస్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు సూపర్‌గా ఉంటాయని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు అనూప్. బాలీవుడ్ ద్వయం విశాల్–శేఖర్ సగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సహ నిర్మాత. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
అమ్మతో అల్లువారి అమ్మాయ్
నో డౌట్... అల్లువారి అమ్మాయి కూడా స్టైలిష్ స్టారే! కావాలంటే... ఫొటో కోసం అమ్మ ఒడిలో చక్కగా నిలబడి అమ్మాయి ఇచ్చిన లుక్కుపై ఓ లుక్కేయండి! ఇప్పుడా అమ్మాయి వయసెంతో తెలుసా? జస్ట్... ఎలెవన్ మంత్స్! కానీ, ఆ నవ్వులోనూ... చూపులోనూ... ఎక్స్ప్రెషన్లోనూ... మంచి స్టైల్ ఉన్నట్టుంది కదూ! ఈ నెల 21న అర్హ (అల్లు అర్జున్–స్నేహ దంపతుల కుమార్తె) పుట్టినరోజు. ఈ సందర్భంగా స్పెషల్ ఫొటోషూట్ చేసినట్టున్నారు. అప్పుడప్పుడూ పిల్లలతో ఇటువంటి స్పెషల్ ఫొటోషూట్స్ చేసి, సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకోవడం అల్లు అర్జున్‌కి అలవాటు. ఈ ఫొటోనూ అదే విధంగా ఫేస్ బుక్‌లో అప్లోడ్ చేశారు. అభిమానుల నుంచి ఈ ఫొటోకి విపరీతమైన స్పందన వచ్చింది... ఒక లక్షా డబ్బై వేల రియాక్షన్లు, పన్నెండు వేల షేర్లు, బోల్డన్ని కామెంట్స్! -
కల నిజమవునా?
అల్లు అర్జున్‌కి ఎప్పటి నుంచో ఓ డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్‌లో ఉన్నది ఏఆర్ రెహమాన్. ఈ సంగీత సంచలనం స్వరపరచిన పాటలకు స్టెప్పులేయాలన్నది అల్లు అర్జున్ కల అట. ఆ కల త్వరలో నెరవేరనుందని సమాచారం. ‘పందెంకోడి’ ఫేమ్ ఎన్. లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్ తెలుగు–తమిళ భాషల్లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంగీతదర్శకునిగా రెహమాను తీసుకోవాలనుకుంటున్నారట. ఈ విషయమై రెహమాన్‌ని సంప్రదిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెన్నై కోడంబాక్కమ్ టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత లింగుస్వామితో చేయనున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందట. -
అభిమానులతో కలిసి సినిమా చూసిన డీజే
-
ఘనంగా అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు
-
బాక్సాఫీస్‌పై మెగా హీరోల దాడి
-
టాలీవుడ్‌కి వెరీ' స్పెషల్ డే'
-
"ఎవడు" ఆడియో రీలిజ్ ఫంక్షన్ హైలెట్స్