న్యూయార్క్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు! | Independence Day Celebration In New York Organized By Tana | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Published Tue, Aug 23 2022 9:34 PM | Last Updated on Wed, Aug 24 2022 2:35 PM

Independence Day Celebration In New York Organized By Tana - Sakshi

న్యూయార్క్‌ నగరం నడిబొడ్డున ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో చిన్నారుల వేషదారణ చూపరుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సంబరాల్లో ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో పాటు ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని,ప్రముఖ దర్శకుడు హరీశంకర్‌ అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక తెలుగు వాడిగా దేశం మొత్తం జరుపుకునే ఈపండుగలొ పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. 

అనంతరం తానా అధ్యక్షులు లావు అంజయ చౌదరి మాట్లాడుతూ..మాతృదేశానికి సేవ చేసేందుకు ఎప్పుడు ముందుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తానా సేవల సమన్వయకర్త రాజా కసుకుర్తి,బోర్డ్ కొశాధికారి లక్ష్మిదెవినెని, తానామాజీ అధ్యక్షులు జయ్ తాల్లూరి, జానినిమ్మలపుడి , శ్రీనివాస్ ఒరుగంటి, విద్య గారపాటి, దిలీప్ముసునూరు, శిరీష, శ్రీ కొనంకి,సుధీర్ నారెపలెపు, శివని, శ్రీ అట్లూరి ,  శ్రీలక్ష్మి అద్దంకితదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement