Indipendence day
-
ప్రధాని మోదీ వ్యాఖ్యలు అవమానకరం: జైరాం రమేశ్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 78వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ గురువారం ‘ఎక్స్’ వేదికగా మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘యూసీసీ గురించి మోదీ మాట్లాడుతూ ఇప్పటివరకు మనకు కమ్యూనల్ సివిల్ కోడ్ ఉందనటం చాలా అవమానకరం. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మోదీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానపరిచారు. చరిత్రను కించపర్చటంలో ప్రధాని మోదీకి ఎటువంటి హద్దు లేకుండా పోయింది. 1950లో అంబేద్కర్ హిందూ చట్టాల్లో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారు. అప్పుడు ఆ సంస్కరణలను ఆర్ఎస్ఎస్, జన్ సంఘ్ తీవ్రంగా వ్యతిరేకించాయి’అని అన్నారు. మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసగంలో.. ‘దేశంలో సెక్యులర్ సివిల్ కోడ్ ఉండాల్సిన అవసరం చాలా ఉంది. తనం మతపరమైన సివిల్ కోడ్‌తో 75 ఏళ్లు జీవించాం. ఇప్పుడు మనం సెక్యులర్ సివిల్ కోడ్ వైపు వెళ్లాలి. అప్పుడే దేశంలో మతపరమైన వివక్ష అంతం అవుతుంది. దీంతో సామాన్య ప్రజల మధ్య విభజన పరిస్థితులు దూరం అవుతాయి’అని అన్నారు.మరోవైపు.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం మీడియాతో మట్లాడారు. బీజేపీ ప్రభుత్వం విభజన ఆలోచనలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వం మన దేశ బలమే తప్ప బలహీనత కాదు. మనకు స్వాతంత్య్రం తేలికగా వచ్చిందని కొందరు ప్రచారం చేస్తారు. కానీ, లక్షల మంది త్యాగాలు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది’’అని అన్నారు. -
‘మంత్రి అతిషి జెండా ఎగరవేయలేరు’
ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిశీ జాతీయ జెండాను ఎగరవేయడానికి అనుమతి లేదని తెలిపింది. ఇక.. సోమవారం సాధారణ పరిపాలన శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేజ్రీవాల్ కోరిక మేరకు రాష్ట్ర మంత్రి అతిశీ జెండా ఎగరవేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే తాజాగా జీఏడీ అదనపు ముఖ్యకార్యదర్శి నవీన్ కుమార్ చౌదరీ స్పందిస్తూ.. జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు చట్టపరంగా చెల్లుబాటు కాదని అన్నారు. ఆ ఆదేశాలము తాము పాటించలేమని స్పష్టం చేశారు. ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. జైలు నిబంధనల ప్రకారం ఇలా చేయటం అనుతించబడదని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఛత్రసల్ స్టేడియం వేదికగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంతో జెండా ఎగరవేసే విషయంపై అత్యున్నత అధికారులకు తెలియజేశామని తెలిపారు. వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. -
‘నా కల సాకారమైన వేళ..’ అరబిందో స్ఫూర్తిదాయక సందేశం!
అరబిందో ఘోష్.. ప్రముఖ భారతీయ తత్వవేత్త, యోగి, మహర్షి, కవి, పాత్రికేయుడు. 1872 ఆగస్టు 15న అరబిందో ఘోష్ జన్మించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆల్ ఇండియా రేడియో, తిరుచిరాపల్లి అభ్యర్థన మేరకు అరబిందో స్వాతంత్ర్య ఉద్యమ సందేశాన్ని అందించారు. అది 1947 ఆగస్టు 14న రేడియోలో ప్రసారమయ్యింది. ‘ఈ రోజే నా పుట్టినరోజు యాదృచ్చికం’ ‘ఆగస్ట్ 15 నా పుట్టినరోజు. దేశానికి స్వాతంత్ర్యం దక్కిన రోజే నా పుట్టినరోజు కావడం సహజంగానే నాకు సంతోషాన్నిస్తుంది. నేను ఈ యాదృచ్చిక సంఘటనను సాధారణమైనదిగా కాకుండా, నేను చేపడుతున్న పనుల విషయంలో నా దశలను మార్గనిర్దేశం చేసే దైవిక శక్తి ఆమోద ముద్రగా తీసుకుంటాను. ఈ రోజున నేను నా జీవితకాలంలో నెరవేరాలని ఆశించిన అతిపెద్ద కలను చూడగలిగాను. గతంలో అవి ఆచరణ సాధ్యం కాని కలల మాదిరిగా కనిపించాయి. ఇప్పుడు అవి ఫలించాయి. సాధించే మార్గంలోనూ కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమాలన్నింటిలో స్వేచ్ఛా భారతదేశం అనేది అగ్రగామిగా నిలిచింది. ‘భారత్ శక్తిమంతం కానుంది’ నేను కన్న కలలలో మొదటిది స్వేచ్ఛాయుత ఐక్య భారతదేశాన్ని సృష్టించడం. భారతదేశం నేడు స్వేచ్ఛగా ఉంది. కానీ ఐక్యతను సాధించలేదు. బ్రిటిష్ ఆక్రమణకు ముందు ఉన్న ప్రత్యేక రాష్ట్రాల గందరగోళం తిరిగి చోటుచేసుకుంటుందనే భావన ఏర్పడుతోంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ముప్పు తప్పే చర్యలు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో యూనియన్ స్థాపితమవనప్పటికీ, ఇది శక్తివంతమైనదిగా మారనున్నదని తెలుస్తోంది. రాజ్యాంగ సభ తీసుకున్న తెలివైన, కఠినమైన విధానం అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి దోహదపడేలా ఉంది. అలాగే విభేదాలు, చీలికలు లేకుండా పరిష్కారానికి అవకాశం ఏర్పడనుంది. ఇది కూడా చదవండి: సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకొటకు 1800 మంది ప్రత్యేక అతిథులు.. ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్.. ‘మతపరమైన విభజన భావన తగదు’ అయితే హిందువులు, ముస్లింలు అనే మతపరమైన విభజన ఇప్పుడు దేశంలో శాశ్వత రాజకీయ విభజనగా మారింది. ఈ వాస్తవం తాత్కాలిక అంగీకారంగానే ఉండాలి. ఒకవేళ ఇదే కొనసాగితే భారతదేశం తీవ్రంగా బలహీనపడవచ్చు. అప్పుడు అంగవైకల్యం బారినపడినట్లవుతుంది. అలాంటప్పుడు దేశపౌరుల మధ్య కలహాలు ఎల్లప్పుడూ కొనసాగుతాయి. కొత్త దండయాత్రలు, విదేశీ ఆక్రమణలకు కూడా ఆస్కారం ఏర్పడుతుంది. భారతదేశ అంతర్గత అభివృద్ధికి, శ్రేయస్సుకు ఆటంకం ఏర్పడుతుంది. విదేశాలలో భారత్ స్థానం బలహీనపడవచ్చు. దేశ విభజన జరగాలి. అయితే శాంతి, సామరస్యాల ఆవశ్యకతను గుర్తించడం ద్వారా దేశంలో ఐక్యత ఏర్పడుతుంది. ఇది భారతదేశ భవిష్యత్తుకు ఎంతో అవసరం. ‘స్వేచ్ఛాయుత పోరాటాల్లో భారత్ కీలకం’ నేను కన్న మరో కల ఆసియావాసుల పునరుజ్జీవనం, విముక్తి. మానవ నాగరికత గొప్ప పురోగతి సాధించడం. ఆసియా ఉద్భవించింది. చాలా దేశాలు ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా ఉన్నాయి. మరికొన్ని విముక్తి పొందుతున్నాయి. కొన్ని దేశాల్లో స్వేచ్ఛ కోసం పోరాటాలు సాగుతున్నాయి. నేడోరోపో వారి కలలు నెరవేరనున్నాయి. వీటిలో భారతదేశం తన కీలక పాత్రను పోషించవలసి ఉంది. శక్తి , సామర్థ్యాలను చాటాల్సిన అవసరం ఉంది. ఇది వినూత్న అవకాశాలను అందించడమే కాకుండా, వివిధ దేశాల కౌన్సిల్లో ప్రత్యేక స్థానాన్ని నిలబెడుతుంది. ‘ప్రపంచ ఏకీకరణ అత్యవసరం’ నా మూడవ కల మానవ ప్రపంచ ఏకీకరణ. ఇది ప్రస్తుతం జరుగుతోంది. దీనిలో కూడా భారతదేశం ప్రముఖ పాత్రను పోషించడం ప్రారంభించింది. ప్రస్తుత వాస్తవాలు, తక్షణ అవకాశాలకు మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తును గుర్తించి, రాజనీతిజ్ఞతను పెంపొందించుకోగలిగితే దేశ ఉనికి మరింతగా గుర్తింపు పొందుతుంది. ఏకీకరణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది ఒక అనివార్య ఉద్యమం. అన్ని దేశాలకు దాని ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఐక్యత లేనప్పుడు చిన్నచిన్న దేశాల స్వేచ్ఛ ఏ క్షణంలోనైనా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే ఇందుకు అంతర్జాతీయ స్ఫూర్తి, దృక్పథం మరింతగా పెరగాలి. ద్వంద్వ లేదా బహుపాక్షిక పౌరసత్వం, వివిధ సంస్కృతుల స్వచ్ఛంద కలయిక వంటి పరిణామాలు జరగాలి. ఏకత్వపు స్ఫూర్తి మానవ జాతి ప్రగతికి ఆధారంగా నిలుస్తుంది. నాకున్న మరో కల ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మిక బహుమతిని అందివ్వాలి. అది ఇప్పటికే ప్రారంభమైంది. భారతదేశ ఆధ్యాత్మికత యూరప్, అమెరికాలో నానాటికీ మరింతగా ప్రవేశిస్తోంది. కేవలం బోధనలకు మాత్రమే పరిమితం కాకుండా మానసిక, ఆధ్యాత్మిక సాధనలకు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. ‘పశ్చిమ దేశాలలో భారత్‌కు పట్టు’ నా చివరి కల నాగరికతా పరిణామంలో మరో అడుగు. ఇది మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకు వెళుతుంది. వ్యక్తిగత పరిపూర్ణత, పరిపూర్ణ సమాజం ఏర్పాటుకు దారితీస్తుంది. సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుంది. ఈ దిశగా కదులుతున్న భారతదేశం.. పశ్చిమ దేశాలలో పట్టు సాధించడం ప్రారంభించింది. ఘనమైన సంకల్పం ఉంటే అన్ని సమస్యలు సమసిపోతాయి. ఈ పరిణామం చోటుచేసుకోవాలంటే ప్రజలు అంతర్గత స్పృహను కలిగివుంటూ ముందుకు సాగాలి. ఈ చొరవ భారతదేశం నుండే మొదలుకావచ్చు. భారతదేశానికి విముక్తి కలిగిన రోజున నా ఆశ ఎంతవరకు నేరవేరుతుందనేది స్వేచ్ఛాయుత భారతదేశంపై ఆధారపడి ఉంటుంది’ అని అరబిందో పేర్కొన్నారు. అరబిందో ఘోష్ 1950 డిసెంబర్ 5న కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ‘ఇసుకపై చంద్రయాన్-3’.. వినూత్నరీతిలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు -
భారత స్వాతంత్ర్య దినోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు..ఇంకా ఇతర అప్డేట్స్
-
న్యూయార్క్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
న్యూయార్క్ నగరం నడిబొడ్డున ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో చిన్నారుల వేషదారణ చూపరుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సంబరాల్లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు ప్రముఖ నిర్మాత నవీన్ యెర్నేని,ప్రముఖ దర్శకుడు హరీశంకర్ అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక తెలుగు వాడిగా దేశం మొత్తం జరుపుకునే ఈపండుగలొ పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం తానా అధ్యక్షులు లావు అంజయ చౌదరి మాట్లాడుతూ..మాతృదేశానికి సేవ చేసేందుకు ఎప్పుడు ముందుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తానా సేవల సమన్వయకర్త రాజా కసుకుర్తి,బోర్డ్ కొశాధికారి లక్ష్మిదెవినెని, తానామాజీ అధ్యక్షులు జయ్ తాల్లూరి, జానినిమ్మలపుడి , శ్రీనివాస్ ఒరుగంటి, విద్య గారపాటి, దిలీప్ముసునూరు, శిరీష, శ్రీ కొనంకి,సుధీర్ నారెపలెపు, శివని, శ్రీ అట్లూరి , శ్రీలక్ష్మి అద్దంకితదితరులు పాల్గొన్నారు. -
1947, ఆగస్టు 15 నాటి పలు దిన పత్రికల హెడ్ లైన్స్ ఇవే..
సాక్షి, వెబ్‌డెస్క్ : అఖండ భారతావనికి స్వాతంత్ర్యం సిద్ధించి రేపటితో 75 ఏళ్లు. ఈ 75 ఏళ్లుగా మనం అనువభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు.. స్వాతంత్ర్య సమర యోధుల వందల ఏళ్ల పోరాట ఫలం. లాఠీ దెబ్బలు.. బుల్లెట్ గాయాలు.. రక్తపుటేర్లు.. బంధిఖానాలు.. బలిదానాలు రవి అస్తమించని బ్రిటీష్ పాలనలో నిత్య కృత్యాలు. కశ్మీర్లో అన్యాయం జరిగితే కన్యాకుమారిలోని ఇంట్లో కూర్చుని తెలుసుకోవాటానికి.. అక్కడి నుంచే ప్రశ్నించటానికి ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ లాంటి జెట్ స్పీడ్ సోషల్ మీడియా లేని రోజులవి. టీవీలు, రేడియోలు ఉన్నా.. సామాన్య ప్రజలకు అందుబాటులో లేవవి. అలాంటి రోజుల్లో నిన్న ఏం జరిగిందో..రేపు ఏం జరగబోతోందో తెలుసుకోవటానికి.. జాతిని ఏకం చేయటానికి.. ఉద్యమ వీరులకు, సామాన్య ప్రజలకు వారధులుగా నిలవటానికి వార్తా దిన పత్రికలు ముఖ్య భూమిక పోషించాయి. ప్రజల్లో ఉద్యమ కాంక్షను రగిలించాయి. సుత్తి లేకుండా.. సూటిగా వార్తలను.. కాదు,కాదు సంఘటనలను జనాలకు అందించాయి. అలాంటి దినపత్రికలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఉదయం ప్రజల్ని ఎలా పలకరించాయి.. ఏఏ శీర్షికలు పెట్టాయంటే.. 1947, ఆగస్టు 15న దేశ వ్యాప్తంగా ఉన్న పలు దినపత్రికల్లోని హెడ్డింగ్స్... ఫొటో క్రెడిట్: ఆంధ్రపత్రిక ఫొటో క్రెడిట్ : మలయాళ మనోరమ ఫొటో క్రెడిట్ : హిందుస్తాన్ ఫొటో క్రెడిట్ : గుజరాత్ సమాచార్ ఫొటో క్రెడిట్ : ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఫొటో క్రెడిట్ : హిందూస్తాన్ టైమ్స్ ఫొటో క్రెడిట్ : టైమ్స్ ఆఫ్ ఇండియా ఫొటో క్రెడిట్ : ది హిందూ కన్నడ పత్రిక ఫొటో క్రెడిట్ : ది ట్రిబ్యున్ -
పంద్రాగస్టుకు ముస్తాబవుతున్న ఢిల్లీ
-
భారత్–బంగ్లా బంధాన్ని విడగొట్టలేరు
ఢాకా: 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో (ముక్తి జుద్దో) బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ నాయకత్వంతోపాటు భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రశంసనీయమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకున్నారు. భారత్‌లో కరోనా మహమ్మారి బయటపడ్డాక మోదీ మరో దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఢాకాలోని నేషనల్ పరేడ్ స్క్వేర్‌లో దేశ 50వ స్వాతంత్య్ర దినోత్సవంతోపాటు బంగబంధు శత జయంతి వేడుకల్లో అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధానమంత్రి షేక్ హసీనాతోపాటు మోదీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో భారత సైన్యం పోషించిన పాత్రను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. బంగ్లాదేశ్ అమర వీరుల రక్తం, భారత సైనికుల రక్తం కలిసి పారుతున్నాయని చెప్పారు. ఈ రక్తం రెండు దేశాల నడుమ గొప్ప అనుబంధాన్ని ఏర్పర్చిందని, దాన్ని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ విడగొట్టలేరని తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్ విముక్తి వెనుక అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ కృషి మరువలేనిదన్నారు. రాబోయే 25 ఏళ్లు అత్యంత కీలకం బంగబంధు నాయకత్వంలో బంగ్లాదేశ్ సామాన్య ప్రజలు ఒక్క తాటిపైకి వచ్చారని, ముక్తి వాహినిగా మారారని మోదీ అన్నారు. 1970వ దశకంలో తూర్పు పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్) ప్రజలపై పాకిస్తాన్ సైన్యం సాగిస్తున్న అకృత్యాలకు సంబంధించిన చిత్రాలు భారతీయులను కలచి వేసేవని గుర్తుచేశారు. అప్పట్లో తన వయసు 20–22 అని, బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటానికి మద్దతుగా మిత్రులతో కలిసి సత్యాగ్రహం చేశానని వివరించారు. రాబోయే 25 సంవత్సరాలు భారత్, బంగ్లాదేశ్‌కు అత్యంత కీలకమని చెప్పారు. మన వారసత్వాన్నే కాదు అభివృద్ధిని, లక్ష్యాలను, అవకాశాలను కూడా పరస్పరం పంచుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో భారత్, బంగ్లాదేశ్‌కు ఒకే తరహా అవకాశాలు ఉన్నట్లే, ఉగ్రవాదం లాంటి ఉపద్రవాలు కూడా పొంచి ఉన్నాయని మోదీ హెచ్చరించారు. వాటిని ఎదిరించడానికి ఉమ్మడిగా కృషి చేయాలన్నారు. ఇండో–బంగ్లా సంబంధాలకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా 50 మంది బంగ్లాదేశీ పారిశ్రామికవేత్తలను ప్రధాని భారత్‌కు ఆహ్వానించారు. అంతకుముందు భారత్ నుంచి ప్రత్యేక విమానంలో ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఘన స్వాగతం పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ‘పొరుగు ప్రథమం’ భేష్ దక్షిణాసియాలో రాజకీయ స్థిరత్వానికి, ఆర్థిక ప్రగతికి చొరవ తీసుకోవాలని భారత ప్రభుత్వానికి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ 50వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రసంగించారు. భారత ప్రధాని మోదీ అమలు చేస్తున్న ‘పొరుగు ప్రథమం’ విధానంపై ప్రశంసల వర్షం కురిపించారు. బంగ్లాదేశ్‌తోపాటు ఇరుగు పొరుగు దేశాలకు కోవిడ్–19 వ్యాక్సిన్లను భారత ప్రభుత్వం సరఫరా చేస్తుండడం గొప్ప విషయమని అన్నారు. ఢాకా–న్యూఢిల్లీ మధ్య సంబంధాలు ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరాయని తెలిపారు. బంగబంధుకు గాంధీ శాంతి బహుమతి షేక్ ముజిబుర్ రెహ్మాన్‌కు భారత ప్రభుత్వం ప్రకటించిన గాంధీ శాంతి బహుమతిని ఆయన కుమార్తెలు షేక్ రెహానా, షేక్ హసీనాకు ప్రధాని మోదీ అందజేశారు. ఈ వేడుకల్లో ముజిబుర్ రెహ్మాన్‌కు నివాళిగా ఖాదీ బట్టతో తయారైన నల్లరంగు ముజీబ్ జాకెట్‌ను మోదీ ధరించారు. ఢాకాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సావర్‌లోని జాతీయ అమరవీరుల స్మారకం వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఢాకాలో అధికార మహాకూటమి నేతలు, రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఆందోళనల్లో నలుగురి మృతి మోదీ రాకను నిరసిస్తూ ఇస్లామిక్ సంఘాలు పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం ఆందోళన చేపట్టాయి. పొలీసులతో ఘర్షణకు దిగాయి. చిట్టగాంగ్‌లో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులతో సహా మొత్తం నలుగురు మరణించినట్లు తెలిసింది. అలాగే మరో 12 మంది గాయపడ్డారు. ఢాకాలో జరిగిన ఘర్షణలో 50 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు. -
స్వాతంత్య్ర దినం.. అమృత మహోత్సవం
అహ్మదాబాద్: 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమంలో శుక్రవారం ప్రారంభించారు. జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన చరిత్రాత్మక దండియాత్రను స్మరించుకుంటూ సబర్మతీ ఆశ్రమం నుంచి పాదయాత్రకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. ఈ యాత్రలో 81 మంది పాల్గొంటున్నారు. వీరంతా 386 కిలోమీటర్లు నడిచి ఏప్రిల్ 5వ తేదీ నాటికి నవసరీ జిల్లాలోని దండికి చేరుకుంటారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా మహాత్మాగాంధీ 78 మంది అనుచరులతో కలిసి 1930 మార్చి 12న దండియాత్రలో మొదటి అడుగు వేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యానికి తల్లి.. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు 2022 ఆగస్టు 15 వరకూ కొనసాగుతాయని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. దేశంలో ఎంతోమంది మహనీయులు తగిన గుర్తింపునకు నోచుకోలేకపోయారని, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో గత ఆరేళ్లుగా వారి చరిత్రను పదిలపర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంప్రదాయాలు మనకు గర్వకారణమని చెప్పారు. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది భారత్ అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని వ్యాఖ్యానించారు. మనం సాధించిన ఘనతలు, విజయాలు మనకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా వెలుగులు పంచుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. మనం ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్’తో ప్రపంచ అభివృద్ధి ప్రయాణం వేగం పుంజుకుంటుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అవి మన చోదక శక్తులు ‘‘ఐదు స్తంభాలు.. స్వాతంత్య్ర పోరాటం, ఆలోచనలు, విజయాలు, చర్యలు, తీర్మానాలు అనేవి మనం ముందుకు సాగడానికి తోడ్పడే చోదకశక్తులు. మహనీయుల చరిత్రను వెలికి తీసి, పదిలపరుస్తున్నాం. దండియాత్రతో ముడిపడి ఉన్న ప్రాంతానికి, అండమాన్‌లో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ త్రివర్ణ పతాకం ఎగురవేసిన ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చాం. అలాగే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు సంబంధించిన స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేశాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. నా అంకితభావం బలోపేతం అంతకుముందు ఢిల్లీ నుంచి విమానంలో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన నరేంద్ర మోదీ నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఆశ్రమంలో 1918 నుంచి 1930 వరకు గాంధీజీ తన భార్య కస్తూర్బాతో కలిసి నివసించిన హృదయ్‌కుంజ్ అనే ఇంటిని మోదీ సందర్శించారు. ‘ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్’ మన స్వాతంత్య్ర సమర యోధులకు, స్వాతంత్య్ర పోరాటానికి ఒక నివాళి అని సందర్శకుల పుస్తకంలో రాశారు. జాతి నిర్మాణం పట్ల తన అంకితభావం సబర్మతీ ఆశ్రమానికి రావడంతో, బాపూజీ స్ఫూర్తితో మరింత బలోపేతమయ్యిందని అందులో పేర్కొన్నారు. స్వావలంబన(ఆత్మ నిర్భరత), ఆత్మ విశ్వాసం అనే సందేశాన్ని బాపూజీ ఇక్కడి నుంచే ఇచ్చారని గుర్తుచేశారు. సబర్మతీ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను నరేంద్ర మోదీ తిలకించారు. వోకల్ ఫర్ లోకల్.. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభం కంటే ముందు ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ఏదైనా స్థానిక ఉత్పత్తిని కొనుగోలు చేసి, ఆ ఫొటోను ‘వోకల్‌ఫర్‌లోకల్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టు చేయాలని సూచించారు. సబర్మతీ ఆశ్రమంలో ఒక చరఖాను ఏర్పాటు చేస్తామని, ఆత్మనిర్భరతకు సంబంధించిన ప్రతి ట్వీట్‌కు ఇది ఒక పూర్తివృత్తం తిరుగుతుందని చెప్పారు. స్థానిక ఉత్పత్తుల కొనుగోలును ప్రోత్సహించే దిశగా ఇదొక ఉత్ప్రేరకంగా పని చేస్తుందని ట్వీట్లో పేర్కొన్నారు. ‘వోకల్‌ఫర్‌లోకల్’ గాంధీజీకి, మన స్వాతంత్య్ర సమరయోధులకు గొప్ప నివాళి అవుతుందని వెల్లడించారు. -
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ చేరాలి
హైదరాబాద్/విజయవాడ సిటీ: స్వాతంత్య్ర ఫలాలు అందరికీ చేరాలని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతోమంది వీరుల చరిత్రను చూసి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దేశ 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘72 ఏళ్ల స్వాతంత్య్రంలో మనం 74 శాతం మాత్రమే అక్షరాస్యత సాధించాం. అక్షరాస్యత ఉన్నచోట ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. ఆ విషయాన్ని దివంగత సీఎం వైఎస్సార్ గుర్తించి ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ పాదయాత్ర చారిత్రాత్మకమైనది. వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఉభయ రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుండాలి’ అని ఆకాంక్షించారు. త్వరలోనే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవిని చేపడుతారని, దేశ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించే వ్యక్తిగా తయారవుతారని తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, రెహమాన్, వాసిరెడ్డి పద్మ, లక్ష్మీ పార్వతీ, నదీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కాగా, విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ కన్న కలలను సాకారం చేయడానికి వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ కృషి చేస్తోందన్నారు. -
ఈ రోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే కాదు : అనసూయ
స్వాతంత్ర్య దినోత్సవం రోజే ప్రముఖ యాంకర్, నటి అనసూయ ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో తీవ్ర నిరాశకు గురయ్యారు. నెటిజన్ల నెగటివ్ కామెంట్లపై స్పందిస్తూ.. తనకు ఈ రోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే కాదన్నారు. అంతకు ముందు 72వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు తొలిసారి జెండా ఎగురవేసినందుకు ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా ఈ అవకాశం ఇచ్చిన భువనగిరిలోని హోటల్ వివేరా యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, జెండా ఎగురవేసిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో, అది కూడా జాతీయ జెండాను ఎగిరేసే సమయంలో ఆ డ్రెస్ ఏంటి అంటూ నెటిజన్ల నుంచి కామెంట్ల రూపంలో విమర్శలు వచ్చాయి. అసలేం జరిగిందంటే.. అనసూయ కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా బుధవారం ట్రిప్‌కు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో హోటల్ వివేరాలో టిఫిన్ చేయడానికి ఆగారు. అదే సమయంలో హోటల్ వివేరా యాజమాన్యం వారు స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేయడానికి ఏర్పాట్లు చేశారు. అనసూయ సెలబ్రిటీ కావడంతో ఆమెను జెండా ఎగరవేయాల్సిందిగా కోరారు. దీనికి అనసూయ కూడా అంగీకరించి, జాతీయ జెండాను ఎగురు వేశారు. అనుకోకుండా అప్పటికప్పుడు హోటల్ యాజమాన్యం వారు తనను జాతీయ జెండా ఎగురవేయాలని కోరడంతో జెండా ఎగురవేశానని అనసూయ తెలిపారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి కామెంట్లను చదివి వినిపిస్తూ.. ఒకానొక సమయంలో అనసూయ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తన వస్త్రాధరణపై నెగటివ్‌గా కామెంట్లు పెడుతున్నవారిని బ్లాక్ చేస్తూ, తనలా ఆలోచించే వాళ్లు పదిమంది ఫాలోవర్లు ఉన్నా చాలని తెలిపారు. తన పోస్ట్‌లో (#HappyorNot) హ్యాపీ ఆర్ నాట్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించారు. ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పోస్ట్ చేసిన వీడియోను కొద్దిసమయం తర్వాత అనసూయ డిలీట్ చేశారు. -
‘విజయ’ విశ్వ‘తిరంగ’
నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్య్ర సంబరాల వెనుక ఎంతో మంది ప్రాణ త్యాగముంది. నాటి సమరాంగణంలో ఉత్తుంగ తరంగాలై విజృంభించిన వీరులందరి కృషి ఉంది. స్వరాజ్యలక్ష్మిని కాంక్షించి అశువులు బాసిన త్యాగధనులు... బ్రిటీష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన మన్యం చిరుతలు... ఎంతోమంది ఈ విజయనగర గడ్డపై జన్మించారు. ఎక్కడ విప్లవ జ్యోతి వెలిగినా ఆ కాంతిలో జిల్లా యోధులు నడిచారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహ పిలుపునందుకుని ఇక్కడా దీక్షలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు స్పూ ర్తితో తెల్ల దొరల నిరంకుశత్వంపై గెరిల్లా యుద్ధం చేశారు. ఎన్నిసార్లు ఈ విషయాలు మననం చేసుకున్నా... నెమరువేసుకున్నా... శరీరమంతా రోమాంఛితమై... వారిపట్ల మనకున్న అచంచల గౌరవాన్ని మరింతగా పెంపొందింపజేస్తూనే ఉంటుంది. ఈ ఏడు స్వాతంత్య్ర వేడుక జరుపుకుంటున్న వేళ ఆ వివరాలు మరోసారి... సాక్షి ప్రతినిధి, విజయనగరం : క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటికే కటక్ నుంచి పిఠాపురం వరకూ విస్తరించిన కళింగ రాజ్యంలో అంతర్భాగంగా ఉండే విజయనగర ప్రాంతం బలమైన నాగరికత పునాదులపై నిర్మితమైంది. 1565లో తళ్లికోట యుద్ధంతో గోల్కొండ నవాబుల ఏలుబడిలోకి వెళ్లింది. ఫౌజిదారుల కాలంలోనే విజయనగరం, బొబ్బిలి సంస్థానాలు పుట్టుకొచ్చాయి. నిజాం మరణం తర్వాత ఫ్రెంచ్ సేనాని బుస్సీ సాయంతో సలాబత్‌జంగ్ అధికారంలోకి వచ్చా డు. దానికి ప్రతిగా శ్రీకాకుళం నుంచి కొండపల్లి సర్కారు వరకూ నాలుగు సర్కార్లను ఫ్రెంచ్ వారు రాయించుకున్నారు. కానీ తర్వాత ఈ ప్రాంతమంతా తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా ఆంగ్లేయుల వశమైంది. 1757, జనవరి 24న జరిగిన బొబ్బిలి యుద్ధం చరిత్రలో నేటికీ ఓ సంచలనం. ఈ యుద్ధం తర్వాత మొదలైన చిన విజయరామరాజు పాలనపై ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం చెలాయించింది. దానికి ఆయన ఎదురుతిరిగారు. 1794లో తిరుగుబావుటా ఎగురవేశారు. అదే పద్మనాభ యుద్ధం. ఈ యుద్ధంలో విజయనగర రాజులు ప్రాణాలు వదిలారు. కానీ మద్రాసు అప్పటి గవర్నర్ విజయనగరం కోటను చిన విజయరామరాజు తనయుడు గజపతికి అప్పగించారు. అప్పుడే విజయనగర సాంస్కృతిక శకం ఆరంభమైంది. ఆది నుంచీ అటువైపే అడుగులు బ్రిటీష్ పాలనపై తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా పేరుగాంచిన 1830 సిపాయిల తిరుగుబాటు సందర్భంలో మన జిల్లాలోనూ విప్లవాగ్ని రాజు కుంది. ముఖ్యంగా గిరిజనుల్లో చైతన్యం వచ్చింది. గిరిజన ప్రాంత ప్రత్యేక పాలన (ఏజెన్సీ అడ్మినిస్ట్రేషన్) ఉద్యమం చెలరేగింది. సాలూరు ప్రాంతానికి చెందిన గిరిజన నాయకుడు కొర్రా మల్లయ్య 1900లో విప్లవ జెండా ఎగురవేశారు. ఈ విప్లవాన్ని బ్రిటిష్ పాలకులు దారుణంగా పోలీస్ చర్యతో అణచివేశారు. ఎంతో మంది గిరిజనుల ప్రాణాలు తీశారు. కొర్రా మల్లయ్య, అతని కుమారుడిని అరెస్ట్ చేసి చనిపోయేంత వరకూ జైలు శిక్ష విధించారు. 1905లో బెంగాల్ విభజన, 1920లో సహాయ నిరాకరణోద్యమం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమాల్లో జిల్లా ప్రజలు కీలక భూమిక పోషించారు. మన జిల్లాలోని ధర్మవరం గ్రామానికి చెందిన భాట్టం శ్రీరామమూర్తి ఎంఆర్ కళాశాలలో విద్యార్ధి సంఘ నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి స్వాతంత్య్రోద్యమకారునిగా మారి రాజకీయ వేత్తగా ఎదిగారు. గాంధీజీకి జిల్లా బాసట 1930, మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి 78 మంది అనుచరులతో మహాత్మా గాంధీ నేతృత్వంలో ప్రారంభమైన సత్యాగ్రహ యాత్ర 375 కిలో మీటర్లు సాగి ఏప్రిల్ 6న దండి గ్రామం చేరింది. 24 నాలుగు రోజుల పాటు సాగిన ఉప్పు సత్యాగ్రహంలో విజయనగరం పాలుపంచుకుంది. స్వాతంత్య్ర సమరయోధునిగా, 1952లో విజయనగరం నుంచి మొదటి లోక్‌సభ మెంబర్‌గా ఎన్నికై దేశానికి సేవలందించిన ఖండాల సుబ్రహ్మణ్య తిలక్ ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్నారు. దండి యాత్రకు మద్దతుగా విజయనగరంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటైంది. అక్కడ గాంధీజీ సత్యాగ్రహం చేస్తున్న సమయంలోనే ఇక్కడా సత్యాగ్రహం జరిగేలా అప్పట్లో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అనేక అడ్డంకులను నాటి పాలకులు కల్పించారు. అయినప్పటికీ మన జిల్లాలోని స్వతంత్ర సమరయోధులు తమ నిరసనను విజయవంతంగా వ్యక్తీకరించి గాంధీజీకి బాసటగా నిలిచారు. అల్లూరి మదిలో మెదిలి తెల్ల దొరల గుండెల్లో సింహ స్వప్నమై... గిరిజనం గుండెల్లో దేవుడై స్వాతంత్య్ర సంగ్రామంలో విప్లవ జ్యోతిగా వెలిగాడు మన్యం వీరుడు అల్లూరి సీతామరామరాజు. ఆ మహా వీరుడు ఆనాడు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల మన్యం ప్రాంతంలో గిరిజనుల స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించాడు. అయితే ఆయన మదిలో విజయనగరం పేరు మెదలడం గొప్ప విశేషం. విద్యాభ్యాసం అనంతరం 1921లో చిట్టిగాంగ్ వెళ్లి బెంగాల్ విప్లవకారులతో చర్చలు జరిపి కె.డి.పేట సమీపంలో తాండవ నది ఒడ్డున నీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ‘శ్రీరామ విజయనగరం’ అనే ఆశ్రమాన్ని అల్లూరి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాతే ఆంగ్లేయుల ముత్తదారీ పద్ధతి, అటవీ నిబంధనలతో పాటు చింతపల్లి తహసీల్ధార్ సెబాస్టియన్, అతని కాంట్రాక్టర్ సంతానం పిళ్లైల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించాడు. జాతీయోద్యమ కాలంలోనే విజయనగరాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్ ఉండేది. కానీ బ్రిటీష్ పాలకులు దానిని పట్టించుకోలేదు. దీంతో 1979 వరకూ విశాఖ జిల్లాలో అంతర్భాగంగానే ఉండిపోయింది. -
నేడు సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోస్వాతంత్య్ర వేడుకలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బుధవారం జిల్లా యంత్రాంగం పంద్రాగస్టు వేడుకలను నిర్వహించనుంది. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన జాతీయ జెండా ఎగురవేయనున్నారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డులు అందజేస్తారు. మంత్రి మహేందర్‌రెడ్డి శుభాకాంక్షలు.. జిల్లా ప్రజలకు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సాంతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పేదల దరికి చేర్చాలని పిలుపునిచ్చారు. -
ఇండిగో ఇండిపెండెన్స్ డే సేల్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద క్యారియర్ ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా ఇండిపెండెన్స్ డే ఆఫర్ ప్రకటించింది. స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా ఇతర విమానయాన సంస్థలు డిస్కౌంట్ స్కీమ్‌లను ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇండిగో కూడా రూ. 981కే విమాన టికెట్‌ను అందిస్తోంది. ఎంపిక చేసిన మార్గాల్లో పరిమితకాల ఆఫర్ కింద పరిమిత సీట్లను అందిస్తున్నట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 15లోపు మాత్రమే ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇలా బుక్ చేసుకున్నటికెట్ల ద్వారా సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 8 మధ్య ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. వెబ్సైట్ అందించిన సమాచారం శ్రీనగర్, జమ్ము మధ్య రూ.981 టికెట్‌ను అందిస్తుండగా హైదరాబాద్-అహ్మదాబాద్ (రూ.1,992), హైదరాబాద్-లక్నో (రూ.2,456), కోల్‌కతా-బెంగళూరు (రూ .3,634), కోలకతా-భువనేశ్వర్ (రూ .1,379), కోలకతా-ఢిల్లీ (రూ. 2,836), కోలకతా-హైదరాబాద్ (రూ.2,594) ముంబై-బెంగళూరు (రూ.1,748), ముంబై-ఢిల్లీ (రూ .2,255), బెంగళూరు-ఢిల్లీ (రూ .2,929) అహ్మదాబాద్-బెంగళూరు (రూ.2,078), అహ్మదాబాద్-ఢిల్లీ (రూ.1,415), బాగ్డోగ్ర-కోల్‌కతా (రూ .1,613), బెంగళూరు-గోవా (రూ.1,782), బెంగళూరు-గోవా (బెంగళూరు) రూ.1,782), గౌహతి-కోల్‌కతా (రూ .1,793) ధరల్లో విమాన టికెట్లు లభ్యం కానున్నాయి. -
స్వాతంత్య్ర ఉత్త(త్స)వాలు
స్వాతంత్య్ర దినోత్సవం వచ్చిందంటే పాఠశాలలో సందడే సందడి. పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడం, బహుమతులు అందించడం, మువ్వ నెన్నల జెండాలు ఎగురవేయడం, చాక్లెట్లు, స్వీట్లు అందించడం.. దేశభక్తిని, జాతీయ నాయకులను స్మరించుకునే అంశం. కానీ ఈ ఏడాది ఆటల పోటీల విజేతలకు బహుమతులివ్వాలన్నా, చిన్నారులకు చాక్లెట్లు అందించాలన్నా ప్రధానోపాధ్యాయులు అప్పులు చేయాల్సిందే. సీఎం పర్యటనలు, ఆర్బాటపు కార్యక్రమాల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. పాఠశాలల్లో సంబరాల కోసం నయాపైసా విదల్చలేదు. కానీ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. బద్వేలు : పాఠశాలల నిర్వహణ నిధులు (మెయింటెనెన్స్ గ్రాంట్)ను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో స్వాతంత్య్ర వేడుకలను ఎలా నిర్వహించాలో తెలియక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల బ్యాంకు ఖాతాలో చూస్తే చిల్లిగవ్వ లేదు. ఈ నెల15న 72వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వానికి నిధులు ఇవ్వాలనే అంశం గుర్తుకు రాలేదా అంటూ ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిధుల మంజూరు ఇలా.. పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ఏటా సర్వ శిక్ష అభియాన్ ద్వారా నిధులు అందించేది. విద్యా సంవత్సరం ప్రారంభంలో స్కూల్ గ్రాంట్, మెయింటెనెన్స్ గ్రాంట్లను పాఠశాల స్థాయిని బట్టి విడుదల చేసి ప్రధానోపాధ్యాయుని ఖాతాకు జమ చేస్తుంటారు. ఈ నిధులతో పాఠశాలకు రంగులు వేయడం, విద్యా బోధనకు అవసరమైన చార్టులు, బొమ్మలు, చాక్‌పీసులు, డస్టర్లు, పాఠశాలకు అవసరమైన రికార్డులు, విద్యార్థుల హాజరు పట్టిలు కొనుగోలు చేస్తారు. విద్యుత్ బిల్లులు, స్వాతంత్య్ర వేడుకలు, ఇతర జాతీయ పండుగలు జరుపుకోవడానికి అవసరమైన చిన్న పాటి ఖర్చులకు వీటిని వినియోగించే వారు. సాధారణంగా జూన్, జులై నెలల్లో విడుదల చేసేవారు. కానీ ప్రస్తుత ఏడాది మూన్నెల్లు గడిచినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పాఠశాలలో గతేడాది మిగులు నిధులుండగా.. వాటిని కూడా గత నెలలో ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. రూ.4.60 కోట్ల పైనే.. జిల్లాలో మొత్తం 3,275 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 2,589, ప్రాథమికోన్నత పాఠశాలలు 295, ఉన్నత పాఠశాలలు 391 ఉన్నాయి. వీటిలో 4.16 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటికి స్కూల్ గ్రాంటు కింద ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.12 వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.7 వేలు ఇవ్వాలి. మెయింటెనెన్స్ గ్రాంట్ క్రింద ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10 వేల వంతున ఇవ్వాల్సి ఉంది. ఈ నిధుల కింద జిల్లాకు ప్రస్తుతం రూ.4.60 కోట్ల నిధులు అందాల్సి ఉంది. అయితే వీటిలో ఇప్పటి వరకు నయాపైసా కూడా విడుదల కాలేదు. చాలా మంది ఉపాధ్యాయులు సొంత నిధులతో చాక్ఫీసులు, డస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. కరెంట్ బిల్లులను సైతం చేతి నుంచే కడుతున్నారు. నిధులు లేకుంటే పాఠ్యాంశాల బోధనకు ఉపయోగపడే టీఎల్ఎంలను సిద్ధం చేసుకోగలమని వారు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా ఎలా జరపగలమని పేర్కొంటున్నారు. నిధుల కోసం ఎదురుచూపులు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ఇప్పటికే ఆటల పోటీలు, క్విజ్, వ్యాసరచన, డిబేట్ తదితర పోటీలను నిర్వహించడం ఆనవాయితీ. విజేతలకు సైతం బహుమతులు ఇస్తుంటారు. ప్రస్తుతం నిధులు లేకపోవడంతో చాలా మంది హెచ్ఎంలు సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలో వేడుకలకు కనీసం రూ.20 వేల వరకు అవసరమవుతాయి. దాతలు ఎవరైనా ముందుకొస్తారేమోనని వారు ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల విద్యార్థులే చందాలు వేసుకుని ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. చేతి నుంచే ఖర్చు ప్రస్తుతం స్వాతంత్య్ర దినోత్సవాల కోసం విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహిస్తున్నాం. నిధులు రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ వేడుకలకు కనీసం రూ.8 వేల వరకు అవసరమవుతాయి. – ఓబయ్య, హెచ్ఎం, ఉన్నత పాఠశాల, కలసపాడు ఉన్నవే తీసుకున్నారు ఎస్ఎస్ఏ నిధులు గతేడాదివి రూ.10 వేలు అకౌంట్లో ఉండగా వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం స్వాతంత్య్ర వేడుకలకు కొందరు దాతలు సహకరిస్తుండగా, మిగిలిన నిధులను సొంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. – పుల్లయ్య, హెచ్ఎం, బాలుర జెడ్పీహెచ్ఎస్, బద్వేలు నిధులను వెంటనే అందించాలి ప్రభుత్వం పాఠశాలలకు మెయింటెనెన్స్ గ్రాంట్, స్కూల్ గ్రాంట్స్‌ను వెంటనే విడుదల చేయాలి. జెండా ఎగురవేయడం, చిన్నారులకు స్వీట్లు అందించాలంటే సొంతంగా నిధులను వెచ్చించాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. చాక్ఫీసులకూ నిధుల్లేని పరిస్థితి. – సీవీ ప్రసాద్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
స్వాతంత్య్ర వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు
ఏలూరు (మెట్రో): జిల్లాలో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్బంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా మంగళవారం ఏలూరు పోలీస్ పేరెడ్ గ్రౌండ్స్‌లో 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉదయం 8.30 గంటల నుండి ప్రారంభమవుతాయని, 8.45 గంటలకు జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్, 8.50 గంటలకు కలెక్టర్ కాటంనేని భాస్కర్, 8.55 గంటలకు ఏలూరు రేంజ్ డీఐజీ పీవీఎస్ రామకృష్ణల పోలీస్ పేరెడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఉదయం 8.59 గంటలకు మంత్రి గ్రౌండ్‌కు చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. పేరెడ్ కమాండర్ బీ.చంద్రశేఖర్, డీఎస్పీ ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఆధ్వర్యంలో మార్చ్ఫాస్ట్ నిర్వహించబడుతుంది. విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి మంత్రి ప్రశంసాపత్రానలను బహుకరిస్తారు. -
మొరాయించిన మైకు.. ఉద్యోగుల గైర్హాజరు
ఇదీ గ్రేటర్లో స్వాతంత్య్ర వేడుకల తీరు ఏఈ సస్పెన్షన్, డీఈకి నోటీసు గైర్హాజరైన వారికి కూడా నోటీసులు వరంగల్ అర్బన్ : స్వాతంత్య్ర దినోత్సవమంటే అందరికీ ఉత్సాహమే.. కానీ ఎందుకో తెలియదు కానీ గ్రేటర్ అధికారులు ఇదేమీ పట్టలేదు. సోమవారం ఉదయం 7–10గంటలకు వరంగల్ బల్దియా కార్యాలయానికి మేయర్ నన్నపునేని నరేందర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ చేరుకున్నారు. కాసేపు వారి చాంబర్లలో ఉండి 7–25 గంటలకు జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రధాన కార్యాలయం ఎదుటకు వచ్చారు. కానీ అప్పటి వరకు కూడా అడిషనల్ కమిషనర్, గ్రేటర్ కార్యదర్శి, ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు, కొందరు వింగ్ అధికారులు, సూపరింటెండెంట్లు రాలేదు. అయినా సరే మేయర్ జాతీయ జెండా ఎగురవేసి తన ప్రసంగాన్ని ప్రారంభించగానే మైకు మొరాయించింది. ఎలక్ట్రికల్ సిబ్బంది మరమ్మతులు చేసినా అది ససేమిరా అనడంతో మేయర్ మైకు లేకుండానే తన ప్రసంగం కానిచ్చేశారు. ఆ తర్వాత తాపీగా అధికారులు, ఉద్యోగులు ఒక్కరొక్కరుగా కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో మేయర్ నరేందర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అడిషనల్ కమిషనర్ షాహిద్ మసూద్‌కు ఫోన్ చేసిన కమిషనర్.. మైకు విషయంలో ఏఈ రవీందర్ సస్పెండ్ చేయాలని, డీఈ లక్ష్మారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా నిర్ణీత సమయం 7–30 గంటల్లోగా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరు కాని అధికారులు, సూపరింటెండెంట్లకు షాకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచిం చారు. ఇక బల్దియా ప్రధాన కార్యాలయం కార్యక్రమం పూర్తయిన తర్వాత కమిషనర్ పబ్లిక్ గార్డెన్‌కు వెళ్లగా ఉద్యానవన అధికారి మినహా ఎవరూ లేరు. దీంతో కమిషనర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించి కనీసం ఆహ్వాన పత్రాలను ముద్రించకుండా కార్పొరేటర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. -
‘సాంస్కృతిక’ సంరంభం
నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం హన్మకొండ కల్చరల్ : స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని విద్యా శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏజేసీ తిరుపతిరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నృత్య స్రవంతి కూచిపూడి కళా క్షేత్రం , వరంగల్ కృష్ణాకాలనీ హైస్కూల్, హన్మకొండ ప్రాక్టీసింగ్ పాఠశాల, కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్స్ హైస్కూల్, హసన్‌పర్తి సుజాత విద్యానికేతన్, చాలెంజ్ డ్రీమ్ డ్యాన్స్ స్కూల్, పీఎస్ నాచినపల్లి, సీటీసీ ప్లేస్కూల్, కేజీబీవీ వరంగల్, మల్లికాంబ మనోవికాస కేంద్రం, హన్మకొండ తేజస్విని హైస్కూల్, మాస్టర్జీ గర్‌్ల్స హైస్కూల్, స్టాండర్డ్ పబ్లిక్ స్కూల్, సెయింట్ పీటర్స్ పబ్లిక్ స్కూల్, అతిథి మనోవికాస కేంద్రం విద్యార్థుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ పాటల పోటీల్లో సుహిత్ ద్వితీయ బహుమతి అందుకున్నారు. పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్, విద్యాసాగర్, పీవీ మదన్మోహన్, నివేదిత, విదుమౌళి, తాడూరి రేణుక పాల్గొన్నారు. -
భారతమాతకు జేజేలు.. బంగరు భూమికి జేజేలు
-
దేశభక్తి
70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని టౌన్ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు 500 అడుగుల భారీ జాతీయ పతకాన్ని ప్రదర్శించారు. గురువారం ఉదయం పదిన్నర గంటలకు కళాశాలలో ప్రిన్సిపాల్ చెన్నయ్య జెండా ఊపీ ప్రదర్శనను ప్రారంభించారు. అక్కడి నుంచి తెలుగుతల్లి విగ్రహం, చిన్నపార్కు, జెడ్పీ మీదుగా రాజ్ విహార్‌కు, మళ్లీ రాజ్‌విహార్ నుంచి కళాశాలలకు వరకు కొనసాగిన జాతీయ పతాక ప్రదర్శనలో దాదాపు 1000 మంది విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. – కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) -
ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయండి
అనంతపురం అర్బన్: జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి 70వ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేయాలని అధికారులకు కలెక్టర్ కోన శశిధర్ సూచించారు. ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్సీ రాజశేఖర్‌బాబుతో కలిసి అధికారులతో సమీక్షించారు. గతంలో కర్నూలు, విశాఖపట్నంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలను సీడీ ద్వారా వీక్షించారు. అనంతరం పీటీసీలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. సిబ్బందికి తగిన సూ^è నలను ఇచ్చారు. అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని ఆదేశించారు. దాదాపు ఎనిమిది నుంచి పది వేల మంది వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజామొహిద్ధీన్, డీఐజీ ప్రభాకర్‌రావు, బెటాలియన్ డీఐజీ ప్రసాద్‌బాబు, కమాండెంట్ విజయకుమార్, డీఆర్ఓ మల్లీశ్వరిదేవి -
‘అనంత’ కీర్తిని చాటేలా స్వాతంత్య్ర వేడుకలు
► ‘సాక్షి’తో కలెక్టర్ కోన శశిధర్ (సాక్షిప్రతినిధి, అనంతపురం) స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తోంది. ఇన్నేళ్లలో రాష్ట్రస్థాయి వేడుకలు రాజధానిలో జరగడం చూశాం. కానీ ఈసారి తొలిసారిగా ‘అనంత’లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు, వీఐపీల రాక, అభివృద్ధి పనులు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌ను ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలివీ.. సాక్షి: రాష్ట్రస్థాయి వేడుకలు జిల్లాలో జరగడం ఇదే ప్రథమం. ఎలా నిర్వహిస్తున్నారు? కలెక్టర్: ‘అనంత’లో నిర్వహిస్తామని ప్రభుత్వం చాలా తక్కువ సమయంలో ప్రకటన చేసింది. అప్పటికి 15రోజులు మాత్రమే సమయం ఉంది. వేడుకల నిర్వహణ ద్వారా జిల్లాకు ఏదో ఒక మేలు జరగాలని కాంక్షిస్తున్నాం. అందుకే రూ.2.7 కోట్లతో పీటీసీ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నాం. సాక్షి: తక్కువ సమయంలో పెద్దపనికి పూనుకున్నారు.. ఉద్యోగుల సహకారం ఎలా ఉంది? కలెక్టర్: నిజానికి 15 రోజులనేది చాలా తక్కువ సమయం. వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు రాగానే పీటీసీ ప్రిన్సిపల్‌ను పిలిపించి ఏం కావాలని అడిగాం. ఆయన సూచనలు పరిగణనలోకి తీసుకున్నాం. స్టేడియానికి శాశ్వత పైకప్పు, గ్యాలరీ, రోడ్లు, మొత్తం ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా టైల్స్‌తో స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి ఆర్అండ్బీ అధికారులు చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. రాత్రికి రాత్రి విజయవాడ, హైదరాబాద్‌కు వెళ్లి కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు చేయిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు. వారితో పాటు జిల్లాలోని ఉద్యోగులు ఇది బాధ్యత అని కాకుండా జిల్లాలో వేడుకలు జరుగుతున్నాయని గర్వంగా ఫీలయి విధులు నిర్వర్తిస్తున్నారు. సాక్షి: స్టేడియంలో టర్ఫ్ వేయిస్తే శాశ్వతంగా క్రికెట్ మ్యాచ్‌లకు ఉపయోగపడుతుంది కదా? కలెక్టర్: కచ్చితంగా.. ఆ ఆలోచనలో ఉన్నాం. వేడుకలు ముగిసిన తర్వాత, టర్్ఫతో పాటు ఫ్లడ్‌లైట్లు వేయాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడే ఫ్లడ్‌లైట్లు వేయాలనుకున్నాం. సమయం తక్కువగా ఉన్నందున సాధ్యపడడం లేదు. జిల్లాలో మంచి స్టార్‌హోటల్స్ కూడా నిర్మితమవుతున్నాయి. స్టేడియాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ స్థాయిలో అండర్–19 పోటీలు నిర్వహించే అవకాశం ఉంటుంది. సాక్షి: వేడుకలకు ఎంతమంది హాజరుకావచ్చు? ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? కలెక్టర్: పదివేలమంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. ఇందులో వెయ్యిమంది వీఐపీలు ఉంటారు. మూడువేల మంది పాఠశాల విద్యార్థులు, తక్కిన వారు జిల్లా ప్రజలు. అందరికీ సరిపడేలా గ్యాలరీలు వేర్వేరుగా నిర్మిస్తున్నాం. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సాక్షి: సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? కలెక్టర్: ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. పాఠశాల విద్యార్థులతో మంచి కార్యక్రమాలు రూపకల్పన చేశాం. విద్యార్థులకు జాతీయజెండా సింబల్‌తో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల టీషర్టులు ఇస్తున్నాం. వేడుకల్లో ఇది ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే పదిభారీ బెలూన్లను స్టేడియంపైన వదులుతాం. సాక్షి: నగరాన్ని ప్రత్యేకంగా అలంకరించబోతున్నారా? కలెక్టర్: అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు లైటింగ్ ఉంచాలని సూచించాం. ఇప్పటికే చాలా వరకూ లైటింగ్‌లో మెరుస్తున్నాయి. ప్రైవేటు లాడ్జీలు, దుకాణాలకు కూడా లైటింగ్ వేస్తే బాగుంటుంది. నగరాన్ని కూడా అందంగా ముస్తాబు చేస్తాం. సాక్షి: రాష్ట్రస్థాయి వేడుకలు మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎలా ఫీలవుతున్నారు? కలెక్టర్: అదృష్టంగా భావిస్తున్నా! స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు వేడుకలు అక్కడ జరిగాయి. తర్వాత రాజధానిలోనే జరుగుతూ వచ్చాయి. తిరిగి అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే అక్కడ జరుగుతాయి. అనంతపురంలో నేను ఉన్నపుడు నిర్వహిస్తుండడం, అందులో నా పాత్ర ఉండటం గర్వంగా ఉంది. భవిష్యత్తులో మళ్లీ అనంతలో జరుగుతాయో, లేదో తెలీదు. వేడుకలను అవకాశంగా తీసుకుని 30 ఏళ్లకిందట నీలం సంజీవరెడ్డి గారు నిర్మించిన స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఆ తృప్తి నాకుంది. ‘అనంత’ గర్వపడేలా వేడుకల నిర్వహణ ఉంటుంది. -
వారం రోజులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి నెల్లూరు(బారకాసు): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు రాష్ట్రంలో వారం రోజుల పాటు ‘తిరంగా’ పేరుతో వేడుకలు నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి తెలిపారు. ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని అన్ని వర్గాల ప్రజల్లో నింపేందుకు అన్ని మండల కేంద్రాల్లో జాతీయ జెండా చేతపట్టి ఈ తిరంగా యాత్రలను నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల అనుగుణంగా పార్టీ అవసరాల మేరకు ఇతర పార్టీల నుంచి వచ్చేవారు ఎవరైనా సరే తమ పార్టీలో చేర్చుకోవాలని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాల మేరకు ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్లనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి జిల్లాకు ఒక్కో కేంద్ర మంత్రి చొప్పున మొత్తం 13 మంది కేంద్ర మంత్రులతో ఆయా జిల్లా కేంద్రంలో సందర్శించి కార్యకర్తల, మేధావుల సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో ఏలూరులో రైతు ర్యాలీ, కడపలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. çబీజేపీ నేతలు సుధాకర్‌రెడ్డి, మధు, శేషారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నగరంలో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నగరంపై పోలీసులు డేగ కన్ను ఉంచారు. అందులో భాగంగా అనుమానం ఉన్న చోట్లలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. షాపింగ్ మాల్స్, స్కూళ్లపై ప్రధానంగా దృష్టిని నిలిపి అప్రమత్తమవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. -
ఈసారి స్వీట్లు పంచుకోవట్లేదు
న్యూఢిల్లీ: ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత్ సైనికులు పాక్ సైనికులతో కరచాలనం చేయడం లేదు. ఇరువైపుల తీపి పదార్థాల పంపకాలు జరగడం లేదు. సాధారణంగా ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్-పాక్ మధ్య ఉన్న వాఘా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు కరచాలనం చేసుకోవడం, వందనం చేసుకోవడంతోపాటు స్వీట్లు పంచుకుంటారు. కానీ, ఈసారి ఆ సంప్రదాయానికి గండపడింది. అందుకు ప్రధాన కారణం ఇటీవల పాక్‌కు చెందిన ఉగ్రవాదులు బీఎస్ఎఫ్కు చెందిన ఇద్దరు జవాన్లపై కాల్పులు జరపడంతో వారు ప్రాణాలుకోల్పోయారు. ఈ ఘటనను పాక్ ఖండించకపోవడంతోపాటు, పలుమార్లు సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతున్నా చూసిచూడనట్లు వ్యవహరించింది. అందుకు నిరసనగా ఈసారి స్వీట్ల పంపకాన్ని ఆపేశారు.