‘సాంస్కృతిక’ సంరంభం | cultural fest in public garden | Sakshi
Sakshi News home page

‘సాంస్కృతిక’ సంరంభం

Published Tue, Aug 16 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM

‘సాంస్కృతిక’ సంరంభం

‘సాంస్కృతిక’ సంరంభం

  • నేరెళ్ల వేణుమాధవ్‌ ప్రాంగణంలో  ప్రత్యేక కార్యక్రమం
  • హన్మకొండ కల్చరల్‌ :  స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని విద్యా శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హన్మకొండ పబ్లిక్‌ గార్డెన్స్‌లోని నేరెళ్ల వేణుమాధవ్‌ కళాప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏజేసీ తిరుపతిరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నృత్య స్రవంతి కూచిపూడి కళా క్షేత్రం , వరంగల్‌ కృష్ణాకాలనీ హైస్కూల్, హన్మకొండ ప్రాక్టీసింగ్‌ పాఠశాల,  కాజీపేట సెయింట్‌ గ్యాబ్రియల్స్‌ హైస్కూల్,  హసన్‌పర్తి సుజాత విద్యానికేతన్, చాలెంజ్‌ డ్రీమ్‌ డ్యాన్స్‌ స్కూల్, పీఎస్‌ నాచినపల్లి, సీటీసీ ప్లేస్కూల్, కేజీబీవీ వరంగల్, మల్లికాంబ మనోవికాస కేంద్రం, హన్మకొండ తేజస్విని హైస్కూల్, మాస్టర్‌జీ గర్‌్ల్స హైస్కూల్, స్టాండర్డ్‌ పబ్లిక్‌ స్కూల్, సెయింట్‌ పీటర్స్‌ పబ్లిక్‌ స్కూల్, అతిథి మనోవికాస కేంద్రం విద్యార్థుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దూరదర్శన్, ఆల్‌ ఇండియా రేడియో సంయుక్త  ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్‌ పాటల పోటీల్లో సుహిత్‌ ద్వితీయ బహుమతి అందుకున్నారు. పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్,  విద్యాసాగర్, పీవీ మదన్‌మోహన్, నివేదిత, విదుమౌళి, తాడూరి రేణుక పాల్గొన్నారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement