ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిశీ జాతీయ జెండాను ఎగరవేయడానికి అనుమతి లేదని తెలిపింది. ఇక.. సోమవారం సాధారణ పరిపాలన శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేజ్రీవాల్ కోరిక మేరకు రాష్ట్ర మంత్రి అతిశీ జెండా ఎగరవేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అయితే తాజాగా జీఏడీ అదనపు ముఖ్యకార్యదర్శి నవీన్ కుమార్ చౌదరీ స్పందిస్తూ.. జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు చట్టపరంగా చెల్లుబాటు కాదని అన్నారు. ఆ ఆదేశాలము తాము పాటించలేమని స్పష్టం చేశారు. ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. జైలు నిబంధనల ప్రకారం ఇలా చేయటం అనుతించబడదని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఛత్రసల్ స్టేడియం వేదికగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంతో జెండా ఎగరవేసే విషయంపై అత్యున్నత అధికారులకు తెలియజేశామని తెలిపారు. వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment