flag hoisting
-
Republic Day-2025: జమ్ము స్టేడియానికి బాంబు బెదిరింపు
శ్రీనగర్: నేడు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూలోని ఎంఏఎం స్టేడియంలో జెండాను ఎగురవేయనున్నారు. ఇందుకు సన్నాహాలు జరుగున్నాయి. దీనిలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా పాల్గొననున్నారు. అయితే ఇంతలో జమ్ము పోలీసులకు ఎంఏఎం స్టేడియంపై బాంబు దాడి చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్టేడియంలో అణువణువునా తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఏమీ దొరకకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా కశ్మీర్ లోయలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కశ్మీర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) వికె విర్ది మాట్లాడుతూ గణతంత్ర వేడుకలను సురక్షితంగా నిర్వహించడానికి భద్రతా సంస్థలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయని అన్నారు.దేశవ్యాప్తంగా నేడు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 1950లో జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవాన్ని భారత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వానికి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తారు. ప్రధాన కార్యక్రమం ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరుగుతుంది.ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
అంబరాన మహాకుంభ సంబరం
ఆకాశం అంటే అనంతం... అనంతమైన భక్తి కూడా ఆకాశం లాంటిదే. తనలోని అనంతమైన భక్తిని ఆకాశ వేదికగా చాటింది ఇరవై నాలుగు సంవత్సరాల అనామికాశర్మ...ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన స్కైడైవర్ అనామికా శర్మ బ్యాంకాక్ మీదుగా 13 వేల అడుగుల ఎత్తులో మహాకుంభ్ అధికారిక జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించింది. అనామిక డేరింగ్ ఫీట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. విమానం ఎక్కే ముందు ఆత్మవిశ్వాసంతో మహాకుంభ్ జెండాను అనామిక పట్టుకున్న దృశ్యాలు వైరల్ వీడియోలో ఉన్నాయి. అనామిక విమానం నుండి దూకడం, జెండా ఎగరవేస్తూ ‘మహాకుంభ్ 2025’కు ప్రపంచానికి స్వాగతం పలికే దృశ్యాలు, బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే కుంభమేళ న్ట అబ్బురపరుస్తాయి.‘ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సమ్మేళనమైన మహాకుంభ్ 2025కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఆహ్వానిస్తున్నాను’ అని అనామిక శర్మ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోనే చూస్తూ నెటిజనులు అనామికను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.వాటిలో కొన్ని...‘అపూర్వ సాహసం, భక్తిభావం మేళవించిన దృశ్యం’‘మన సంస్కృతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు’‘ఇది స్టంట్ కాదు. ప్రపంచానికి అందించిన శక్తిమంతమైన సందేశం’అనామిక తండ్రి మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తండ్రి ఒడిలో సాహసాల ఓనమాలు నేర్చుకున్న అనామికకు ధైర్యంగా ముందుకు దూసుకెళ్లడమే తెలుసు. తాజా ఫీట్‌తో తన సాహసాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది.పవిత్ర క్షేత్రమైన ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక మన సంస్కృతి, సంప్రదాయాలను వింటూ పెరిగింది. ‘మన సంస్కృతిలోని గొప్పదనం ఏమిటంటే, ఒక మంచి పని కోసం అందరూ ముందుకు వస్తారు. నేనేమిటి? నా స్థాయి ఏమిటి అని ఎప్పుడూ ఆలోచించరు. రామాయణంలో ఉడుత కథ దీనికి ఉదాహరణ. భరతమాత బిడ్డను అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను’ అంటుంది అనామిక.భవిష్యత్‌లో మరెన్నో సాహసాలు చేయడానికి సిద్ధం అవుతున్న అనామిక ట్రైన్డ్ స్కూబా డైవర్ కూడా. మన దేశంలో ‘స్కై సి లైసెన్స్’ ఉన్న యంగెస్ట్ ఫీమెల్ స్కైడైవర్‌గా కూడా తన ప్రత్యేకతను చాటుకుంది.‘వీడియోను చూసి చాలామంది... మీకు భయంగా అనిపించలేదా అని అడిగారు. నిజం చెప్పాలంటే భక్తి భావంతో నాకు భయం కలగలేదు. ఒకటికి పదిసార్లు మనసులో మేరా భారత్ మహాన్ అనుకున్నాను’ అంటోంది అనామిక. -
పంద్రాగస్టు స్పీచ్‌తో సరికొత్త రికార్డు
-
న్యూఢిల్లీ : ఎర్రకోటపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి
-
తెలంగాణ రాజ్ భవన్ లో జెండా ఎగురవేసిన గవర్నర్
-
జెండా ఎగురవేసిన కిషన్ రెడ్డి
-
జాతీయ జెండా ఎగురవేసిన వైఎస్ జగన్
-
‘మంత్రి అతిషి జెండా ఎగరవేయలేరు’
ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిశీ జాతీయ జెండాను ఎగరవేయడానికి అనుమతి లేదని తెలిపింది. ఇక.. సోమవారం సాధారణ పరిపాలన శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేజ్రీవాల్ కోరిక మేరకు రాష్ట్ర మంత్రి అతిశీ జెండా ఎగరవేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే తాజాగా జీఏడీ అదనపు ముఖ్యకార్యదర్శి నవీన్ కుమార్ చౌదరీ స్పందిస్తూ.. జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు చట్టపరంగా చెల్లుబాటు కాదని అన్నారు. ఆ ఆదేశాలము తాము పాటించలేమని స్పష్టం చేశారు. ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. జైలు నిబంధనల ప్రకారం ఇలా చేయటం అనుతించబడదని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఛత్రసల్ స్టేడియం వేదికగా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. సీఎం జ్యుడీషియల్ కస్టడీలో ఉండటంతో జెండా ఎగరవేసే విషయంపై అత్యున్నత అధికారులకు తెలియజేశామని తెలిపారు. వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. -
కేజ్రీవాల్ జైలు నిబంధనలు ఉల్లంఘన!
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాకు లేఖ రాయడాన్ని జైలు అధికారులు తప్పు పట్టారు. జైలు నిబంధనలు ఉల్లంఘించటమేని తెలిపారు. వచ్చే ఆగస్టు 15 తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి అతిశీ జాతీయజెండాను ఎగరవేస్తారని తెలుపుతూ సీఎం కేజ్రీవాల్ ఎల్జీకి లేఖ రాసినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. దీనిపై తిహార్ జైలు నంబర్ 2, సుపరింటెండెంట్ స్పందించారు. సీఎం కేజ్రీవాల్ ఎల్జీకి లేఖ రాసి ఢిల్లీ జైలు నింబంధనలు-2018ను ఉల్లంఘించారని అన్నారు. ఆయన రాసిన లేఖకు సంబంధించిన సమాచారం మీడియాలో రావటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇటువంటి అనుమతిలేని చర్యలు పాల్పడితే.. జైలులో సీఎంకు ఉన్న అధికారాలను కూడా కుదించాల్సి వస్తుందని కేజ్రీవాల్‌కు సూచించారు. కేజ్రీవాల్ ఆగస్టు 6వ తేదీన ఎల్జీకి లేఖ రాసినట్లు జైలు అధికారులు నిర్ధారించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం. ఇక. ఈడీ కేసులో ఇటీవల సుప్రీం కోర్టు ఆయను బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ ఆరెస్ట్ చేయగా ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. మరోవైపు.. అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖ తమకు చేరలేదని ఎల్జీ కార్యాలయం పేర్కొనటం గమనార్హం. ఇదిలా ఉండగా.. స్వాతంత్ర్య దినోత్సవం (అగస్టు15) సందర్భంగా రాష్ట్ర మంత్రి అతిశీ జాతీయ జెండాను ఎగురవేస్తారని సీఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ఓ ప్రకటన విడుదల చేశారు. -
మంత్రి అతిషి జెండా ఎగురవేస్తారు: ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ!
న్యూఢిల్లీ: ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15నాడు తనకు బదులు సీనియర్ మంత్రి అతిషి జాతీయ జెండా ఎగురవేస్తారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి లేఖ రాసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు 15నాడు ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో సీఎం జాతీయ జెండా ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్జైలులో ఉన్నందున జెండా ఎగురవేయలేని పరిస్థితి ఏర్పడింది. -
హనుమాన్ జెండా తొలగింపు వివాదం.. మాండ్యా జిల్లాలో ఉద్రిక్తత
బెంగళూరు: హనుమాన్ జెండా తొలగింపుపై కర్ణాటక మాండ్యా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రాణప్రతిష్ట తర్వాత ధ్వజస్తంభంపై జెండా తొలగించాలని అధికారులు ఆదేశించారు. ఇందుకు గ్రామస్థులు అంగీకరించకపోవడంతో వివాదం చెలరేగింది. జెండా తొలగించే ప్రసక్తే లేదని గ్రామస్థులు భీష్మించుకుని కూర్చోవడంతో ఎట్టకేలకు అధికారులు విరమించారు. గ్రామ పంచాయతీ అనుమతితో కెరగోడు గ్రామంలో గ్రామస్థులు 108 అడుగుల ధ్వజస్తంభంపై హనుమాన్ జెండాను ఎగరవేశారు. ఇందుకు సమీప 12 గ్రామాల ప్రజల నుంచి నిధులు సమీకరించారు. ధ్వజస్తంభంపై హనుమాన్ జెండా ప్రాణప్రతిష్ట కూడా పూర్తి అయ్యాక తొలగించాలని అధికారులు ఆదేశించారు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా ఎగురవేసిన ప్రదేశం గ్రామ పంచాయతీ భవనం పరిధిలోకి వస్తుందని, ఆ జెండాను తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు నేడు గ్రామంలోకి వచ్చి ఆ జెండాను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసుల లాఠీఛార్జీ చేశారు. అధికారుల చర్యకు వ్యతిరేకంగా నిరసనకారులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ వివాదంపై స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. ఆ ప్రదేశంలో హనుమాన్ జెండాను ఎగురవేయడం సరికాదని చెప్పారు. బీజేపీ, జేడీఎస్‌ల కుట్రపూరిత చర్యగా ఆయన ఆరోపించారు. జిల్లా ఇంఛార్జీ చెలువరాయస్వామి ఈ వివాదంపై వివరణ ఇచ్చారు. జెండా ఎగురవేసిన ప్రదేశం పంచాయతీ భవనం ప్రదేశం పరిధిలోకి వస్తుందని అన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగురవేయడానికి మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు. ప్రైవేటు ప్రదేశంలో హనుమాన్ జెండా ఎగురవేయాలని కోరారు. ఇదీ చదవండి: నేడే బిహార్ తొలి కేబినెట్ భేటీ -
Republic Day 2024: అలా అనకూడదని తెలుసా?
Republic Day Celebrations 2024: ఇవాళ జెండా పండుగ. గణతంత్ర దినోత్సవం. అయితే ఇవాళ జెండా ఎగరేయడం అనొద్దు అంట. అది ముమ్మాటికీ తప్పంట. ఆవిష్కరించడం అనలాట. ఈ రెండింటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పైగా ఇవాళ జెండా ఆవిష్కరించబోయేది రాష్ట్రపతి. ఈ వేడుకలకు ప్రధాని హాజరైనా జెండా మాత్రం ఆవిష్కరించరు. ప్రధాని కేవలం స్వాత్రంత్య దినోత్సవం నాడు ప్రధాని జెండా ఎర్రకోటపై ఎగరేయడానికి.. జనవరి 26న రాష్ట్రపతి జెండా ఆవిష్కరించడానికి గల కారణం.. ఆ ఆనవాయితీ ఎన్నేళ్ల నుంచి కొనసాగుతుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి.. జనవరి 26 రిపబ్లిక్ డే, ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే.. ఈ రెండు తేదీలలో దేశవ్యాప్తంగా జెండాను రెపరెపలాడిస్తారు. పంద్రాగష్టున ప్రధాని ఎర్రకోటలో జెండా ఎగరేస్తారు. అయితే ఈ రోజు జనవరి 26న రాష్ట్రపతి న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జెండా ఆవిష్కరిస్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. కాబట్టే దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాం. అదే ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగుతారు. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. కాబట్టే.. జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేశారు. అది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీక. అదలా ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. నేడు రాష్ట్రపతి.. ఆరోజున ప్రధాని.. కారణం ఇదే.. ఇక్కడ గమనించాల్సిన మరో వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling). గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. ఘనంగా పరేడ్ నిర్వహిస్తారు. ఇక.. దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడానికి ప్రత్యేకంగా కారణం చెప్పనక్కర్లేదు. ఎర్రకోటపై జెండా ఎగరేశారక ఆయన ప్రసంగం ఇస్తారు. -
ఇమ్రాన్ ఖాన్ పార్టీ జెండా ఎగురవేసినందుకు.. కన్న కొడుకునే హత్య
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల ముందు ఓ కుటుంబంలో పార్టీ జెండా చిచ్చు పెట్టింది. ఆ చిచ్చు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తనకు నచ్చని పార్టీకి సంబంధించిన జెండాను ఇంటిపై ఎగురువేసినందుకు ఓ తండ్రి తన కన్న కొడుకునే హతమార్చాడు. ఈ ఘటన పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్ శివార్లలో ఉన్న ఓ కుటుంబంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెషావర్ శివార్లలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రి ఎంత వద్దని చెప్పినా కొడుకు తనకు నచ్చిన పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీకి చెందిన జెండాను ఇంటిపై ఎగురవేశాడు. దీంతో తండ్రీ కొడుకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన తండ్రి తుపాకితో కొడుకును కాల్చాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయిన ఫలితం లేదు. మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే కొడుకును చంపిన తండ్రి పారారీలో ఉన్నారుని చెప్పారు. కొడుకును హత్య చేసిన తండ్రి కోసం వెతుకుతున్నామని పోలీసు అధికారి నసీర్ ఫరీద్ మీడియాకు వెల్లడించారు చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు -
జాతీయ జెండా ఆవిష్కరించిన కేసీఆర్
-
Hyderabad: జెండావిష్కరణలో బీజేపీ నేతల బాహాబాహీ
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ విషయంపై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హిమాయత్‌నగర్ కార్పొరేటర్ భర్త గడ్డం రామన్‌గౌడ్ కార్యకర్తల ఎదుట బాహాబాహీకి దిగారు. హిమాయత్‌నగర్ డివిజన్లోని విఠల్‌వాడీలో బీజేపీ కార్యకర్త అనీల్ ఏర్పాటు చేసిన జెండావిష్కరణలో జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇరు వర్గీయులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అనీల్ ఏర్పాటు చేసిన జెండావిష్కరణకు చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్‌కు ఆహ్వానం అందింది. మొదట చింతల రాగా, 20 నిమిషాల పాటు కార్పొరేటర్ కోసం వేచి ఉండగా ఆమె రావడం ఆలస్యమైంది. దీంతో చింతల జెండాను ఆవిష్కరించి వెనుదిరిగారు. ఇదే సమయంలో కార్పొరేటర్ మహాలక్ష్మిగౌడ్ ఆమె భర్త రామన్‌గౌడ్ వారి వర్గీయులు వస్తున్నారు. కార్పొరేటర్ వర్గీయుల్లో ఒకరు ‘మేం రాకుండా జెండా ఆవిష్కరిస్తారా? నువ్వు అంత పెద్ద రాజకీయం చేసేవాడివి అయ్యావా? అంటూ’ అనీల్‌ను ప్రశ్నించగా మీరు రావడం ఆలస్యమైంది సార్ ఇంకో చోటకు వెళ్లాల్సి ఉంది అందుకే ఆవిష్కరించారని జవాబిచ్చారు. అంతే. ఇరు వర్గాల వారు ఒకరికొకరు తిట్టుకోవడంలో రెచ్చిపోయారు. అందరి సమక్షంలో బాహాబాహీకి దిగి ఇరు వర్గాల వారు ముష్టికొమ్ములాటకు దిగారు. చదవండి: తలసరి విద్యుత్‌లో తెలంగాణ నెంబర్ 1.. అసలు నిజం ఇదే! -
నేడు జెండా ఎగరేస్తాం! జనవరి 26న ఆవిష్కరిస్తాం! ఏంటీ తేడా అంటే..
నేడు జెండా ఎగరేయడానికి జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకిలా? ఈ రోజు ప్రధాని న్యూఢిల్లీలో ఎర్రకోట వద్ద జెండా ఎగరేస్తే..జనవరి 26న మాత్రం రాష్ట్రపతి జెండా ఆవిష్కరిస్తారు. నేడు జెండా ఎగరేసాం అంటాం. మరీ గణతంత్ర దినోత్సవం రోజున మాత్రం జెండా ఆవిష్కరిస్తున్నాం అని అంటాం ఎందుకని? వాటి మధ్య ఉన్న తేడా ఏంటంటే.. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు... అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రావడంతో.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే.. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు మాత్రం రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు... కాబట్టి దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. ( గమనిక: ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ). నేడు ప్రధాని.. ఆ రోజు రాష్ట్రపతి చేయడానికి ప్రధాన కారణం దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling). (చదవండి: అక్కడ మాత్రం అర్థరాత్రే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు) -
విజయవాడ: జాతీయ జెండా ఎగురవేసిన సీఎం జగన్ (ఫొటోలు)
-
పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడమూ అంటరానితనమే: సీఎం జగన్
LIVE UPDATES: ► స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఏపీ పోలీసులకు మెడల్స్ ప్రదానం చేసిన సీఎం జగన్ ►అధికారులకు మెడల్స్ ప్రదానం చేసిన సీఎం జగన్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జగన్ ప్రసంగం ►రాష్ట్రంలో కొత్తగా 127 భారీ పరిశ్రమల ఏర్పాటు ►రాష్ట్రానికి వచ్చిన పెట్టబడులు రూ. 67, 196 కోట్లు ►గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ. 13. 42 లక్షల కోట్లకు ఎంవోయూలు ►కొత్తగా ప్రారంభమైన ఎంఎస్ఎంఈ యూనిట్లు 2,00,995 ►శాశ్వత బీసీ కమిషన్‌ను నియమించిన తొలి రాష్ట్రంగా ఏపీ ►139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పోరేషన్లు ►50 నెలల్లో డీబీటీ ద్వారా రూ. 2.31 లక్షల కోట్ల లబ్ధి ►2 లక్షల 6 వేల 638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ►రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టుల నిర్మాణం ప్రారంభం ►భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు కొనసాగుతున్నాయి ►ఈజ్ ఆఫ్ డూయింగ్బిజినెస్లో వరుసగా మూడేళ్లు మనమే నంబర్‌వన్ ►పేదలు చదివే స్కూళ్లను పాడుబడేలా చేయడం అంటరానితనమే ►పేదలు ఇంగ్లీష్ మీడియాం చదువుకోవద్దని వాదించడం అంటరానితనమే ►పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితనమే ►మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశాం ►విద్యావ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నాం ►నాడు-నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్పు ►గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగీష్ మీడియం అమలు ►3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానం ►ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందజేస్తున్నాం ►భోజనం, వసతి ఖర్చుల కోసం రూ.20 వేల వరకు వసతి దీవెన ►రోజుకో మెనూతో పౌష్టికాహారంగా గోరుముద్ద అందిస్తున్నాం ►డిగ్రీ స్థాయిలో 100 శాతం ఫీజు రీయింబర్సమెంట్ ►ట్రిపుల్ ఐటీల్లో పెండింగ్‌లో ఉన్న 3295 టీచింగ్ పోస్టుల భర్తీ ►వైద్యశాఖలో ఏకంగా 53, 126 పోస్టుల భర్తీ ►రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికలు కాలేజీలు నిర్మిస్తున్నాం ►108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాల కొనుగోలు ►పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం కూడా అంటరానితనమే ►పేదల సహనాన్ని పరీక్షించడం కూడా అంటరాని తనమే. ►పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం ►పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు తీసుకొచ్చాం ►98.5 శాతం వాగ్దానాలను అమలు చేశాం ►పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశాం ►మూతపడిన చిత్తూరు డైరీకి జీవం పోశాం. ►భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర సర్వే చేపట్టాం ►వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం ►వడివడిగా పోలవరం పనులు జరుగుతున్నాయి. ►2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి ►వెలిగొండలో మొదటి టన్నెల్ పూర్తి చేశాం ►రెండో టన్నెల్ పనులు త్వరలోనే పూర్తవుతాయి. ►సామాజిక న్యాయం నినాదం కాదు.. దాన్ని అమలు చేసి చూపాం. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత. ►వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం. ►కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. ►అంటరానితనం మీద యుద్ధాన్ని ప్రకటించాం. ►అర్హులందరికీ పథకాలు అందించేందుకు ఏర్పాట్లు. ►రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తున్నాం. ►విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు అండగా నిలుస్తున్నాం. ►రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలు. ►రైతులను ఆదుకునేందుకు పంటల బీమా అమలు చేస్తున్నాం. ►గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం. ►ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదు. ►అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నాం ►గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తెచ్చాం ►సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇస్తున్నాం. ►2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించాం. ►ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు ►స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాన్ని గుర్తు చేస్తూ.. మన జాతీయ జెండా ఎగురుతోంది: సీఎంజగన్ ►76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగమించింది. ►వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో ఎంతో ప్రగతి సాధించింది. ►50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం. ►గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు తెచ్చాం. ►పౌర సేవల్ని ఇంటింటికి తీసుకెళ్లగలిగాం. ►గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చాం ►రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన ►పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్ ► ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు ►జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్ ►సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం జగన్ ► కాసేపట్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకోనున్న సీఎం జగన్. ►జాతీయ జెండాను ఎగురవేయనున్న సీఎం జగన్ ►రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. ►రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన ►సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం ►సాయంత్రం 5.30 ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్ ►స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం. ►విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నిర్వహించనున్న ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం ►ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం జగన్ ►ఈ సందర్భంగా శకటాలతో వివిధ శాఖలు ప్రదర్శన నిర్వహించనున్నాయి. -
Independence Day 2023: స్వాతంత్య్రాన్ని ఇలా ఎంజాయ్ చేయండి!
నేటి టెక్నాలజీ యుగంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని హాలిడేగా తీసుకుని ఆనందించే వారే ఎక్కువ. స్కూలు, కాలేజీ విద్యార్థులైతే జెండా వందనం తరువాత ఇంటికెళ్లిపోవచ్చు అని తెగ సంబరపడిపోతుంటారు. కానీ డెబ్బై ఆరేళ్లుగా విరామం లేకుండ జరుపుకొంటూ నేడు 77వ వసంతంలో అడుగు పెట్టాం. దేశాన్ని పాలించే అధికారులు అధికారికంగా ఈ వేడుకలు జరిపిస్తున్నారు. బాధ్యత గల పౌరులుగా మనం ఇలా సెలబ్రేట్ చేసుకుందాం.... ► ఉదయాన్నే ఎర్రకోటపై జరిగే జెండావందనం, వివిధ కార్యక్రమాలను టీవీలో చూడాలి. డెభ్బై ఏడేళ్ల స్వాతంత్య్ర భారతం ఎంత ఎత్తుకు ఎదిగిందన్న అంశాలను ప్రత్యక్ష ప్రసారాలు చూడడం ద్వారా తెలుసుకోవచ్చు ► తరువాత ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్లేసుకి ఈరోజు వెళ్లండి. ఒక రోజులో వెళ్లిరాగల ప్రాంతానికి వెళ్లి అక్కడ గడిపి మీ ఒత్తిడిని దూరం చేసుకోండి. అక్కడ స్వతంత్ర దినోత్సవాన్ని గుర్తుండిపోయేలా గడపండి. ► రోజూ వేసుకునే దుస్తులు కాకుండా భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలాంటి దుస్తులు ధరించండి. వీలైనంత వరకు డ్రెస్‌లో తెలుపు, కాషాయం, ఆకుపచ్చని రంగులు ఉండేలా చూసుకుని వేసుకోవాలి. అప్పుడు త్రివర్ణ పతాకానికి మరింత వన్నె తెచ్చిన వారవుతారు ► ఎక్కడికీ వెళ్లే ఓపిక లేనప్పుడు ఇంట్లోనే ఉండి దేశభక్తి సినిమాలు చూడండి. మీతోపాటు మీ పిల్లలకు మన దేశ చరిత్ర, ఔన్నత్యాలు తెలుస్తాయి ► మరింత ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే మూడు రంగులు ఉండేలా వెరైటీ డిష్‌లు తయారు చేసుకుని తినండి ► స్వాతంత్య్ర దినోత్సవం అర్థం ఉట్టిపడేలా గాలిపటాలు ఎగరవేయండి. మూడు రంగుల్లో ఉన్న గాలిపటాలను వీలైనంత ఎత్తుకుఎగరేస్తూ మనకొచ్చిన స్వేచ్ఛను ఎంజాయ్ చేయవచ్చు ► పుస్తకాల పురుగులు అయితే దేశభక్తి పుస్తకాలను చదవండి. స్వాతంత్య్ర సమర యోధుల విజయగాధలు, వీరిలో బాగా పాపులర్ అయిన నాయకుల బయోగ్రఫీని చదివి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు ► దేశభక్తి గీతాలు వింటూ కూడా సంబరాలు జరుపుకోవచ్చు. అలనాటి పోరాట, అసామాన్య త్యాగాలను గుర్తుచేసే పాటలను వినాలి. లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ, ఏఆర్ రెహ్మాన్ పాటలు మనలో నిద్రపోతున్న దేశభక్తిని తట్టి లేపుతాయి ► ఇంటి చుట్టుపక్కల వారు లేదా బంధువులు, కుటుంబ సభ్యులతో దగ్గరలో జరుగుతోన్న జెండా పండుగకు వెళ్లి రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి జైహింద్ కొట్టాలి ∙దేశానికి పెద్ద సేవ చేయలేక పోయినప్పటికీ మీ చుట్టుపక్కల ఉన్న వారందరికి స్వీట్లు పంచి, నోరు తీపి చేస్తూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోండి. ► ప్రతి భారతీయుడికి ఎంతో విలువైన బహుమతులు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు. అందుకే వీలైనంత వరకు అందరితో కలిసి జరుపుకోవాల్సిన జెండా పండుగ ఇది. సెలవు దొరికింది అని సంబరపడిపోక వీటిలో ఏ ఒక్కదాన్ని పాటించినా స్వాతంత్య్ర దినోత్సవాన్ని గౌరవించినట్లే. -
రాజ్‌భవన్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. అక్కడే బలగాల పరేడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గణతంత్ర దినోత్సవ వేడుకలపై ఎట్టకేలకు ఓ క్లారిటీ వచ్చింది. రేపు(గురువారం) రాజ్‌భవన్‌లో రిపబ్లిక్ వేడుకలను నిర్వహించనున్నట్టు ఓ ప్రకటన విడులైంది. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై గురువారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లోనే బలగాలు పరేడ్ నిర్వహించనున్నారు. అలాగే, రేపు ఉదయం 6:30 గంటలకు బీఆర్కే భవన్లో గణతంత్ర వేడుకలు జరుగనున్నాయి. బీఆర్కే భవన్లో సీఎస్ శాంతికుమారి.. జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. -
ధ్వజారోహణం.. సకల దేవతలకు ఆహ్వానం
సాక్షి, తిరుమల: విశ్వపతి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ఆరంభమయ్యాయి. ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పతాకావిష్కరణతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. సకల దేవతలు, అష్టదిక్పాలకులు తొమ్మిది రోజులూ సప్తగిరి క్షేత్రంలో ఉంటూ ఉత్సవాలను తిలకించి తన్మయత్వం పొందుతారని పురాణాలు విశదీకరిస్తున్నాయి. చదవండి: నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ధ్వజారోహణానికి ముందు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప, పరివార దేవతలైన ఆదిశేషుడు, గరుత్మంతుడు, విష్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్‌తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. -
వజ్రోత్సవాల్లో జాతీయ పతాకాల వినియోగం.. వాటిని ఇప్పుడేం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా దేశమంతా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఇంటింటికీ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేసింది. స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇంటింటింకే కాదు.. తమ దేశ భక్తి చాటుకోడానికి వాహనాలకు, పబ్లిక్ ప్లేస్ల్లో, పార్కులలో, కార్యాలయాల్లో విస్తృతంగా త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఈసారి పంద్రాగస్టున లక్షల సంఖ్యలో జెండాలను ఘనంగా రెపరెపలాడించారు. కానీ జాతీయ జెండా అతి గౌరవప్రదమైనది. జెండాను ఎగురవేయడంలో, వినియోగించడంలో ఫ్లాగ్ కోడ్ విధిగా పాటించాలి. వజ్రోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తున్నారు. అనంతరం ఈ జెండాలను ఏ విధంగా పరిరక్షిస్తారు, ఫ్లాగ్ కోడ్ నిబంధనలకు అనుగుణంగా అగౌరవపరచకుండా జాగ్రత్తగా భద్రపరచాల్సిన అంశాలపైన అవగాహాన పెరగాల్సిన అవసరముంది. చదవండి: ‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! జెండాల పంపిణీలో ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘనలు పరిరక్షణ బాధ్యతలపై వెలువడని మార్గదర్శకాలు.. ఇంటింటికీ ఎగరేసిన జెండాలను జాగ్రత్తగా, గౌరవంగా చూసుకోవాల్సిన భాద్యత ఆ ఇంటి వారిదే అని నిపుణులు చెబుతున్నారు. ర్యాలీల పేరుతో వాహనాలకు కూడా జాతీయ జెండాను వినియోగించారు. వజ్రోత్సవాల అనంతరం వీటినన్నింటినీ జాగ్రత్తగా భద్రపరచాల్సిన అవసరముంది. ఈ విషయంలో మరింత అవగాహాన పెరగాలని, లేదంటే ఘనంగా నిర్వహించిన వేడుకల పేరుతో జాతీయ పతాకాన్ని అగౌరవపరిచినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్‌లలో, పార్క్‌లు, వీధులు, పాఠశాలలు, కళాశాలలు, ఫుట్‌పాత్, ఫ్లైఓవర్, గ్రౌండ్స్, కూడళ్ల వద్ద భారీస్థాయిలో జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. మరికోద్ది రోజుల్లో వజ్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా జాతీయ జెండా గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదన్న విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. జెండాను అమర్చిన ప్రదేశం, సంస్థలను బట్టి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ నుంచి ఇంకా ఎలాంటి మార్గ నిర్దేశకాలు విడుదల కాలేదు. జాతీయ పతాకాన్ని ఏ మాత్రం అగౌరవ పరచినా చట్టపరమైన చర్యలు, శిక్షలు తప్పవు. కాబట్టి జెండాల విషయంలో పౌరులు సంబంధిత సంస్థలు బాధ్యతాయుంగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. చదవండి: రామంతాపూర్ నారాయణ కాలేజీలో ఎప్పుడేం జరిగింది? -
జెండా పండుగలో విషాదం
యశవంతపుర: జెండా పండుగ వేళ పలుచోట్ల విషాదాలు చోటుచేసుకున్నాయి. గుండెపోటుతో ఒకరు, జెండా కడుతూ కిందపడి మరొకరు ప్రాణాలు విడిచారు. దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా కుట్రుపాడి గ్రామ పంచాయతి ఆఫీసులో సోమవారం ఉదయం జెండాను ఎగురవేస్తుండగా మాజీ జవాన్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మాజీ జవాన్ గంగాధర గౌడను ఈ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించారు. అతిథి ప్రసంగిస్తుండగా గంగాధరగౌడ కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జారిపడి గాయాలతో టెక్కీ మృతి హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇంటిపై జెండా కడుతూ కిందపడి టెక్కీ చనిపోయాడు. ఈ ఘటన బెంగళూరు హెణ్ణూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. దక్షిణకన్నడ జిల్లా సుళ్యకు చెందిన విశ్వాస్‌కుమార్ భట్ (33) బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నాడు. హెచ్బీఆర్ లేఔట్ ఐదో బ్లాక్‌లో భార్య వైశాలితో కలిసి రెండేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఆదివారం ఇంటి మీద పతాకాన్ని కడుతూ అదుపుతప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ సోమవారం మృతి చెందాడు. (చదవండి: కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం ) -
ఈ జంటకు సలాం కొట్టాల్సిందే!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
వైరల్: 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. కేంద్రం ఇచ్చిన హర్ ఘర్ తిరంగా పిలుపు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఎక్కడ చూసినా మూడు రంగుల జెండా రెపరెపలాడుతూ సందడి చేసింది. అయితే.. జెండా ఎగరేసేందుకు ఓ వృద్ధ జంట ప్రయాస పడడంపై ఆనంద్ మహీంద్ర భావోద్వేగమైన పోస్ట్ చేశారు. స్వాతంత్ర దినోత్సవం నాడు ఇంత హడావుడి ఎందుకు చేస్తారనే మీకు ఎప్పుడైనా ఆశ్చర్యంగా అనిపిస్తే.. ఇక్కడున్న ఈ ఇద్దరినీ అడగండి. గొప్ప గొప్ప వక్తలు ఇచ్చే ఉపన్యాసాల కంటే బెటర్‌గా మీకు వీళ్లు వివరిస్తారు. జైహింద్ అని ట్విటర్లో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. పైన ఉన్న ఒకావిడ జెండా మీద దృష్టి పెడితే.. ఆమె పడిపోకుండా కింద డ్రమ్మును పట్టుకుని ఉన్నారు ఓ పెద్దాయన. If you ever were wondering why such a fuss over Independence Day, just ask these two people. They will explain it better than any lecture can. Jai Hind. 🇮🇳 pic.twitter.com/t6Loy9vjkQ — anand mahindra (@anandmahindra) August 14, 2022 Next level it is! Love this young couple ❤️ — Jhony Bravo (@mahesh_s_savita) August 14, 2022 No word yet only Jai Hind 🙏🙏 — ramaekrisshna (@ramakrishna183) August 14, 2022 ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ.. నిజమైన దేశభక్తే ఇదేనంటూ చాలామంది కామెంట్లు చేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటోను మీరూ చూసేయండి. ఇదీ చదవండి: భారత్‌కు పాక్ మ్యూజిషియన్ ఊహించని కానుక -
తాటిచెట్టుపై జాతీయ జెండాల ఆవిష్కరణ
తిరుమలాయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పాతర్లపాడు గ్రామంలో గీతకార్మికులు వినూత్న రీతిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పదిహేను మంది గీతకార్మికులు ఏకకాలంగా తాటిచెట్టుపై నిల్చుని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అరగంట పాటు చెట్టుపై నిలబడి దేశభక్తిని చాటగా, స్థానికులు ఆసక్తిగా పరిశీలించారు. -
జెండా ఎగురవేసి.. కూలి పనికి వెళ్లి..
ఆమె గ్రామ సర్పంచ్. స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండా ఎగరేయడం బాధ్యత. మహిళగా కుటుంబ పోషణ బాధ్యత కూడా ఉంది. రెండు బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం, రాజవరం గ్రామ సర్పంచ్ పోలేపల్లి సైదమ్మ. సర్పంచ్‌ను కదా స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూలీకిపోవడమేంటి అనుకోలేదు. సోమవారంనాడు ముందుగా జెండా ఎగరేసిన సైదమ్మ... అనంతరం రోజూవారీ కూలీగా నాటు వేయడానికి వెళ్లారు. గ్రామంలోని ఓ పొలంలో నాట్లు వేస్తూ ఇలా ‘సాక్షి’కి కనిపించారు. ‘నాటేయడానికి వెళ్తే రోజుకు రూ.500 నుంచి రూ.800 వరకు వస్తాయి. దీనితో కుటుంబం గడుస్తుంది. ఖాళీగా కూర్చుంటే ఏముంటుంది?’అని చెబుతున్నారు. వార్డు మెంబర్ అయినా సరే కాలర్ ఎగరేసుకుని తిరిగే మగవాళ్లలా కాకుండా... పరిపాలనలో మహిళ ఉంటే పరిణామాలు భిన్నంగా ఉంటాయని నిరూపించారు. – తిరుమలగిరి(నాగార్జునసాగర్) -
ఎమ్మెల్యే రాలేదని జెండా ఆవిష్కరణలో గందరగోళం
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో అధికార పార్టీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. కోదాడ మున్సిపాలిటీలో ఉదయం 8:30కు జెండా ఆవిష్కరణ ఉంటుందని మున్సిపాలిటీ అధికారులు, చైర్పర్సన్ పట్టణంలో ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఆ సమయానికే పలువురు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకోగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాత్రం 9గంటలై నా రాలేదు. దీంతో 9:10 నిమిషాలకు మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష కార్యక్రమాన్ని ప్రారంభించగా..ఎమ్మెల్యే వచ్చే వరకు జెండా ఎగుర వేయవద్దని మున్సిపల్ కమిషనర్ అడ్డుతగిలారు. వాగ్వాదాల మధ్యే జెండాను ఆవి ష్కరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మున్సిపాలిటీకి రాకుండానే పక్కనే ఉన్న గాంధీ పార్కుకు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్క రించారు. ఇదే ఆవరణలో ఉన్న కోదాడ గ్రంథాలయం వద్ద జెండా ఆవిష్కరణకు ఎమ్మెల్యే వెళ్లగా అక్కడికి మున్సిపల్ చైర్ పర్సన్ శీరిష కూడా వెళ్లారు. అక్కడ ఆమెను కోదాడ ఎంపీపీ చింతా కవిత, మార్కెట్ చైర్పర్సన్ సుధారాణి నెట్టి వేశారు. దీంతో తనను వేధిస్తు న్నారంటూ మున్సిపల్ చైర్పర్సన్ గాంధీ విగ్రహం ముందు మౌన దీక్షకు దిగారు. -
భూమికి 30 కిలో మీటర్ల దూరంలో జెండా ఆవిష్కరణ: వీడియో వైరల్
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా స్పేస్ కిడ్జి ఇండియా ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఈ మేరకు స్పేస్ కిడ్జ్ ఇండియా భారతీయ జెండాను బెలూన్ సాయంతో అంతరిక్షం అంచుకు పంపింది. అంతేకాదు భూమికి సుమారు 30 కి. మీటర్ల దూరంలో అంతరిక్షం అంచులలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్నాం అని స్పేస్ కిడ్జ్ ఇండియా ట్విట్టర్లో పేర్కొంది. అజాదికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఇలా త్రివర్ణ పతాకన్ని ఆవిష్కరించినట్లు సంస్థ పేర్కొంది. ఇది స్వతంత్ర సమరయోధులందరికి గౌరవార్థం ఇచ్చే నివాళి అని పేర్కొంది. అంతేకాదు ఈ స్పేస్ కిడ్జ్ ఇండియా దేశానికి యువ శాస్త్రవేత్తలు తయారు చేసి ఇచ్చే ఏరోస్పేస్ సంస్థగా అభివర్ణించుకుంటోంది. స్పేస్ కిడ్జ్ ఇండియా ఇటీవల 750 మంది పాఠశాల బాలికలతో రూపొందించిన "ఆజాదిశాట్" ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. కానీ ఆ ఉపగ్రహం అస్థిర కక్ష్యలోకి పంపబడటం వల్ల ఉపయోగపడదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ మేరకు స్పేస్ కిడ్జ్ ఇండియా త్రివరణ పతాకం ఆవిష్కరణకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో నెటిజన్లతో పంచుకుంది. Celebrating 75 Years of Independence by unfurling the Indian Flag @ 30 km in Near Space.@PMOIndia @narendramodi @DrJitendraSingh@isro @INSPACeIND@mygovindia#AzadiKaAmritMahotsov#HarGharTiranga pic.twitter.com/4ZIJMdSZE6 — Space Kidz India (@SpaceKidzIndia) August 14, 2022 (చదవండి: భారత్‌కు అంతరిక్ష కేంద్రం నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు) -
ఎర్రకోటలో రెపరెపలాడిన తిరంగా.. వేడుకల్లో ప్రధాని మోదీ(ఫొటోలు)
-
వీరుల త్యాగఫలమే మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ ఘనంగా జరుగుతున్నాయి. వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. గోల్కోండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీ నుంచి వజ్రోత్సవ వేడుకలను జరపాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తెలంగాణలో ప్రతీ ఇంటా జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, తెలంగాణ త్రివర్ణ శోభితమైంది. ఎందరో వీరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. తెలంగాణ నుంచి స్వాతంత్ర్య ఉద్యమంలో తుర్రేబాజ్‌ఖాన్, రాంజీగోండు, పీవీ సహా అనేక మంది పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశంలోనే అన్ని రంగాల్లో ముందుంది. హైదరాబాద్‌ను గంగాజమునా తెహజిబ్‌గా మహాత్మాగాంధీ అభివర్ణించారని తెలిపారు. Watch live: Hon’ble CM Sri KCR taking part in Independence Day celebrations at Golconda Fort in Hyderabad. #IndiaIndependenceDay #IndiaAt75 #స్వాతంత్ర్యదినోత్సవం https://t.co/tHPxUgwVEc — Telangana CMO (@TelanganaCMO) August 15, 2022 -
ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అటు.. అసెంబ్లీలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. -
ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి..
సాక్షి, హైదరాబాద్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కూడా చేస్తోంది. మువ్వన్నెల పతాక రెపరెపలతో జాతీయ పండుగను ఘనంగా జరపాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. కానీ జాతీయ జెండాను ఎగురవేయాలన్నా, మరే విధంగానైనా త్రివర్ణ పతాకాన్ని వాడుకోవాలన్నా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. జాతీయ జెండా ఉపయోగించే సమయంలో ఫ్లాగ్ కోడ్ 2002 నిబంధనలను పాటించాలి. జెండాను ఉపయోగించే విధానంలో ఫ్లాగ్ కోడ్‌ను ఉల్లంఘించనట్లైతే చట్టం రూపొందించిన ప్రకారం శిక్షలు, జరిమానాలను విధిస్తారు. నిబంధనలకు వ్యతిరేకంగా జాతీయ జెండాను అవమానపరిచినా, అగౌరవపరిచినా మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశముంది. చదవండి: అనగనగా హైదరాబాద్.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద చేతులకు మూడు రంగుల బ్యాండ్లతో అతివల ఆనంద హేల నియమాలివీ.. జాతీయ జెండాను అత్యంత గౌరవప్రదంగా చూసుకోవాలి. జెండాను ఎగురవేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అది చిరిగిపోయి, నలిగిపోయి, పాతగా ఉండకూడదు. మూడు వర్ణాలు, అశోక చక్రం తప్ప మరే వర్ణాలు, రాతలు ఉండకూడదు. కాషాయ రంగు పైకి, ఆకుపచ్చ రంగు దిగువన ఉండాలి. నిలువుగా ప్రదర్శించే సమయంలో కాషా యం రంగు ఎడమ వైపున ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగబడిన జెండాను ఎగురవేయకూడదు. జెండా వందన సమయంలో త్రివర్ణ పతాకానికి సరిసమానంగానూ, దానికన్నా ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదు. జాతీయ జెండాను నేల మీద అగౌరవప్రదంగా పడేయకూడదు. వివిధ అలంకరణ సామగ్రిగా జాతీయ జెండాను ఉపయోగించరాదు. పబ్లిక్ మీటింగుల్లో, సమావేశాల్లో స్టేజ్ పైన కుడి వైపున మాత్రమే (ప్రేక్షకులకు ఎడమ వైపుగా) జెండాను నిలపాలి. జెండాపై ఎలాంటి అలంకరణలు, పూలు పెట్టకూడదు. పతాకం మధ్యలో పూలను వాడవచ్చు. వస్తువులపై, భవనాలపై జెండాను కప్పకూడదు. దుస్తులుగా కుట్టించకూడదు. -
ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు జాతీయ జెండా పంపిన మోహన్ మార్కం, ఎందుకంటే?
రాయ్‌పూర్: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్‌కు జాతీయ జెండాను కొరియర్లో పంపారు ఛత్తీస్‌గఢ్ పీసీసీ అధ్యక్షుడు మోహన్ మార్కం. ఖాదీతో తయారు చేసిన ఆ త్రివర్ణ పతాకాన్ని మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎగురవేయాలని కోరారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు జాతీయ జెండాను తమ డీపీలుగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అలాగే ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని కోరారు. మోదీ పిలుపుతో విపక్ష నాయకులు, ప్రముఖులు ఇప్పటికే తమ డీపీలను మార్చుకున్నారు. కానీ ఆర్ఎస్ఎస్, దాని చీఫ్ మోహన్ భగవత్ మాత్రం డీపీని మార్చలేదు. దీంతో ఆర్ఎస్ఎస్ చీఫ్‌ను సంస్థ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసేలా విజ్ఞప్తి చేయాలని ప్రధాని మోదీని కోరారు మోహన్ మార్కం. గత 52 ఏళ్లుగా ఆ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదని పేర్కొన్నారు. అందుకే ఈసారైనా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు. చదవండి: ఉప రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం -
జెండా ఊంచా రహే హమారా!
జెండా అనేది మన గుర్తింపు. నాగరికత పుట్టినప్పటినుంచే అవి మన అస్తిత్వంలో ప్రధాన పాత్రను పోషించాయి. భారతదేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతున్న అద్భుతమైన సందర్భంలో ఉన్నాం. జెండాలతో భావోద్వేగ బంధాన్ని ఏర్పర్చే లక్ష్యంతో ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటికీ మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దేశవ్యాప్తంగా జెండాలు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. త్రివర్ణ పతాకాన్ని ఇంటిపై రెపరెపలాడించడం ద్వారా భారతీయులందరిలోనూ జాతీయవాద భావన మేల్కొల్పాలనేది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. అప్పుడే దేశమంతా ఒకే తాటిపైకి వస్తుంది. జాతి నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలనే స్ఫూర్తి రగులుతుంది. మహాభారతంలో దుర్యోధనుడి పరాజయంతో కురుక్షేత్ర యుద్ధం ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి రథానికి కట్టిన గుర్రాలను విడిపించి, ఆ రథం నుంచి అర్జునుడిని దూరంగా తీసుకెళ్తాడు. అదే సమయంలో, కురుక్షేత్ర యుద్ధం ఆసాంతం అర్జునుడి రథానికి పైభాగంలో రక్షణ కవచంలా ఉన్నటువంటి హనుమంతుని చిత్రం పతాకం నుంచి మాయమైపోతుంది. ఆ మరుక్షణమే రథం ఒక్క సారిగా నిప్పులు చిమ్ముతూ పేలిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడిని ఉద్దేశిస్తూ జగన్నాథుడు, ‘యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి మహామహులు నీపై వినియో గించిన శక్తిమంతమైన అస్త్రాలతో నీ రథం ఎప్పుడో తునాతునకలు అయి ఉండేది. కేవలం నీ రథం మీద ఉన్న జెండాపై కపిరాజే నీకు నిరంతరం రక్షగా నిలిచాడు’ అని చెబుతాడు. నాగరికత పుట్టినప్పటినుంచే మన అస్తిత్వంలో, మన రక్షణలో జెండాలు పోషించిన పాత్రను తెలియజేసే ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు. వివిధ సందర్భాల్లో ప్రజలు తమ విధేయతను చాటు కునేందుకు కూడా పతాకాలు ఎంతో ఉపయుక్తం అయ్యాయి. మన ధర్మాన్నీ, మన ఆచార వ్యవహారాలనూ ఈ పతాకాలు ప్రతిబింబి స్తాయి. కార్తికేయుడు సేవల్ కోడి పతాకాన్ని వినియోగించడం, రాముడు లంకానగరంపై యుద్ధానికేగినపుడు సూర్యపతాకాన్ని వాడటం, త్రేతాయుగంలో యుధిష్ఠిరుడు బంగారు వర్ణంలోని చంద్రుడి జెండాను వినియోగించడం మొదలుకుని... ఒడిశాలోని పరమ పవిత్రమైన పూరిలోని జగన్నాథాలయంలో వాయుదిశకు వ్యతిరేకంగా రెపరెపలాడే పతాకం (పతితపాబన్ బనా) వరకు యుగయుగాలుగా పతాకాలు మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైపోయాయి. 1947 జూలై 22న రాజ్యాంగ సభ మన జాతీయ పతాకానికి ఆమోదం తెలిపింది. మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొం దించిన జాతీయ పతాకానికి 1921లో మహాత్మా గాంధీ ఆమోదం తెలిపారు. వివిధ మార్పులతో 1947లో త్రివర్ణ పతాకంగా రూపు దిద్దుకుంది. ఇవాళ మనకు నిరంతర స్ఫూర్తిని నింపుతున్న వెంకయ్య ప్రముఖ జాతీయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషా కోవిదుడు కూడా. 1913లో జపనీస్ భాషలో వారు చేసిన అద్భుత మైన ప్రసంగానికిగానూ ‘జపాన్ వెంకయ్య’గా పేరుపొందారు. ఆగస్టు 2న ఆ మహనీయుడి జయంతి సందర్భంగా... మన మువ్వన్నెల జెండాను రూపొందించడంలో వారి కృషిని మనమంతా తెలుసుకుని ప్రేరణ పొందాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఏళ్లు పోరాడి, ఎందరో వీరుల అసమానమైన త్యాగాల అనంతరం స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్న తర్వాత కూడా జాతీయ జెండాతో మన అనుబంధం... భావోద్వేగ బంధం కంటే నియమబద్ధమైన (ఫార్మల్), సంస్థాగతమైన బంధంగా మాత్రమే కొనసాగింది. అలాంటి పరిస్థితిని మార్చి, మువ్వన్నెలను మన జీవితా లతో పెనవేసి, భావోద్వేగ బంధాన్ని ఏర్పర్చే లక్ష్యంతోనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటికీ మువ్వన్నెల జెండా) కార్యక్రమాన్ని రూపొందించారు. భారతదేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతున్న పవిత్రమైన, అద్భుతమైన సందర్భంలో ఉన్నాం. ప్రతి భారతీయుడూ త్రివర్ణ పతాకాన్ని ఇంటిపై రెపరెప లాడించడం ద్వారా జాతీయవాద భావన ప్రతి ఒక్కరిలోనూ మేల్కొ ల్పాలనేది ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ప్రజల భాగస్వామ్యంతోనే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం విజయవంతం అవు తుంది. అప్పుడే దేశమంతా ఒకే తాటిపైకి వస్తుంది. ఈ ఉద్యమంలో రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ, కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలూ సంపూర్ణమైన ఉత్సాహంతో పాల్గొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశమంతా త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను, దేశభక్తిని, భారతీయుల ఐక్యతను ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. జాతీయ జెండా ఎగురవేసేందుకు ఇదివరకున్న నియమ, నిబంధనల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. తద్వారా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ఓ కార్యక్రమంగా మాత్రమే కాకుండా ‘మన దేశం’ అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఇది పెంపొందిస్తుంది. జాతి నిర్మాణంలో మనమంతా భాగస్వాములు కావాలనే బాధ్యతను కూడా ఈ కార్యక్రమం గుర్తుచేస్తుంది. జాతీయ జెండాను చూడగానే ఇవాళ మన దేశ యువతకు దేశ ఉజ్వలమైన భవిష్యత్తు కనబడుతోంది. జాతీయ జెండాను చూసిన పుడు ఓ తల్లికి తనతోపాటు తన కుటుంబానికి ఉన్న విస్తృతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ సైనికుడికి మువ్వన్నెలను చూసిన పుడు... దేశ రక్షణ కోసం ఊపిరున్నంతవరకూ పోరాడాలన్న స్ఫూర్తి అందుతుంది. ఓ ప్రభుత్వాధికారి జెండాను చూసినపుడు ప్రభుత్వ, రాజ్యాంగ లక్ష్యాలను అమలుచేసేందుకు కావాల్సిన ఉత్సాహం, సమాజంలోని చివరి వ్యక్తి వరకూ పథకాల ఫలాలు అందించాలన్న తపన పెరుగుతాయి. ‘ఇంటింటికీ మువ్వన్నెలు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకుగానూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జెండాలు పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రతి పోస్టాఫీసులో 2022 ఆగస్టు 1 నుంచి జాతీయ జెండాలను అందు బాటులోకి తీసుకువస్తోంది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాతీయ జెండాలను ప్రజలకు అందుబాటులోకి ఉంచేందుకు భాగ స్వామ్య పక్షాలతో కలిసి పనిచేస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ ఈ–మార్కెట్లోనూ (జెమ్) జెండాలు అందుబాటులోకి రాను న్నాయి. వివిధ ఈ–కామర్స్ కంపెనీలతో, స్వయం సహాయక బృందాలతోనూ కేంద్రం సమన్వయంతో పనిచేస్తోంది. భౌతికంగా ఇంటిపై జెండా ఎగురవేయాలి. దీంతోపాటుగా వర్చువల్ గా కూడా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు జరుగు తున్నాయి. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన వెబ్సైట్లో ఎవరైనా జెండాను పిన్ చేయడంతోపాటు, ఇళ్లపై ఎగుర వేసిన త్రివర్ణ పతాకంతో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేయవచ్చు. 1947 జూలై 22న రాజ్యాంగ సభలో త్రివర్ణ పతాకంపై తీర్మానం సందర్భంగా సరోజిని నాయుడు మాట్లాడుతూ... ‘ఈ సభలోని ప్రతి ఒక్కరూ మువ్వన్నెల ప్రాధాన్యతను భావ కవితల రూపంలో వెల్లడిం చారు. ఓ కవయిత్రిగా, ఓ మహిళగా నా భావాన్ని వ్యక్తపరుస్తున్నాను. మహిళలం ఎప్పుడూ దేశ ఐక్యత, సమగ్రత కోసం నిలబడతాం. ఈ జెండాకు రాజు, సామాన్యుడు, ధనవంతుడు, పేదవాడు అనే తేడాలే లేవు. ప్రత్యేకమైన హక్కులంటూ ఏమీ లేవు. జెండాను చూసినపుడు దేశం కోసం మనం చేయాల్సిన కర్తవ్యం, బాధ్యత, త్యాగం మాత్రమే మనకు గుర్తుకురావాలి. మనం హిందువులమో, ముస్లింలమో, క్రిస్టియన్లమో, సిక్కులమో, జొరాస్ట్రియన్లమో లేక వేరొక మత స్తులమో కావొచ్చు. కానీ మన భారతమాత హృదయం, ఆత్మ అవిభాజ్యమైనవి. నవభారతంలో జన్మించే ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తారు. తమ గౌరవాన్ని చాటుకుంటారు’ అని పేర్కొన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా మనం జెండా ఎగురవేస్తున్నప్పుడు, సరోజిని నాయుడు చెప్పిన మాటలన్నీ మన గుండెల్లో మార్మోగుతూ ఉండాలి. జాతీయవాద భావన మనలో నిరంతరం స్ఫూర్తి రగిలిస్తూ ఉండాలి. వ్యాసకర్త కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖామాత్యులు -
జాతీయ జెండాపై కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ జెండాకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లాగ్ కోడ్‌కు స్వల్ప మార్పులు చేసింది. ఇకపై మువ్వన్నెల జెండాను పగలే కాకుండా రాత్రివేళ కూడా ఎగురవేయవచ్చు. అలాగే కేవలం చేతితో తయారు చేసిన కాటన్ జెండాలనే కాకుండా.. మెషీన్లతో చేసే పాలిస్టర్ జెండాలను కూడా ఉపయోగించవచ్చు. ఈమేరకు ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971కు సవరణలు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా జాతీయ జెండాను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే ఎగురవేసేందుకు అనుమతి ఉంది. పాలిస్టర్, మెషీన్లతో తయారు చేసిన జెండాలను ఉపయోగించడానికి వీల్లేదు. అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమానికి పిలుపునిచ్చింది కేంద్రం. దేశంలోని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫ్లాగ్ కోడ్‌కు మార్పులు చేసింది. చదవండి: అందుకే నా కూతుర్ని టార్గెట్ చేశారు: స్మృతి ఇరానీ -
ఆగస్టు 13 నుంచి ఏపీలో ఘనంగా హర్ ఘర్ తిరంగా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌పై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ముఖ్యమంత్రులతో సమీక్ష జరిపింది. కాగా, ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంఫ్ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఏపీలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్బంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1.62 కోట్ల జాతీయ పతాకాల ఆవిష్కరించనున్నట్టు పేర్కొన్నారు. దేశభక్తిని, జాతీయభావాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలు జరపనున్నట్టు వెల్లడించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. – ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. సమగ్రమైన కార్యాచరణను రూపొందించింది. – పలు ప్రభుత్వ విభాగాలతో పలుమార్లు సమీక్ష కూడా నిర్వహించాం. – ఈ కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజెప్పడానికి బహుముఖంగా ప్రచారం నిర్వహించాం. – పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగ్స్, పలు గీతాలు రూపొందించాం. చైతన్యం కలిగించేందుకు సినిమా హాళ్లలో సంక్షిప్త చిత్రాలను ప్రదర్శించాం. ర్యాలీలు, సైకిల్‌ర్యాలీలు నిర్వహించాం. పోస్టర్లతోపాటు పలు కథనాలు కూడా ప్రచురించాం. – రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు ఇతర సంస్ధలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు అన్నింటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా వారిని చైతన్యపరిచాం. – సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా వారి ఉద్యోగులకు జాతీయ పతాకాన్ని పంపిణీ చేయాలని నిర్ధేశించాం. – ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని చెప్పాం. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు వారి నివాస సముదాయాల వద్ద కూడా జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పాం. – 5.24 లక్షల రేషన్ దుకాణాలు, 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు, ఆశావర్కర్లు కూడా వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తారు. – 1.20 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, 2.60 లక్షల మంది వాలంటీర్లు కూడా జాతీయ జెండాలను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతారు. 1.62 కోట్ల జాతీయ పతాకాలను ప్రతి ఇంటికీ, ప్రతి సముదాయానికి పంపిణీ చేస్తారు – ప్రతీ ఇంటిపైనా, సముదాయంపైనా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము అని తెలిపారు. -
Russia-Ukraine War: లుహాన్స్క్లో జెండా పాతేశాం: పుతిన్
పొక్రోవ్స్క్: తూర్పు ఉక్రెయిన్‌లోని అత్యంత కీలకమైన డోన్బాస్లో భాగమైన లుహాన్స్క్ ప్రావిన్స్‌లో రష్యా విజయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఖరారు చేశారు. లుహాన్స్క్లో జెండా పాతేశామని అన్నారు. ఈ ప్రాంతంపై రష్యా సైన్యం పూర్తిస్థాయిలో పట్టుబిగించడంతో ఉక్రెయిన్ సేనలు ఆదివారం వెనుదిరిగాయి. లుహాన్స్క్ను మన దళాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు అధ్యక్షుడు పుతిన్‌కు తెలియజేశారు. లుహాన్స్క్ ప్రావిన్స్‌లో పెద్ద నగరమైన లీసిచాన్స్క్ రష్యా వశమయ్యిందని, అక్కడ ఆపరేషన్ పూర్తయ్యిందని పేర్కొన్నారు. కీలక ప్రాంతంలో విజయం దక్కడం పట్ల పుతిన్ హర్షం వ్యక్తం చేశారు. రష్యా సైన్యానికి లక్ష్యంగా మారకుండా లుహాన్స్క్ నుంచి ఉక్రెయిన్ సేనలు వెనక్కి మళ్లాయని స్థానిక గవర్నర్ సెర్హియి హైడై తెలిపారు. మరికొంత కాలం అక్కడే ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. దానికి అధిక మూల్యం చెల్లించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. లుహాన్స్క్లో దక్కిన విజయంతో రష్యా సైన్యం ఇక డొనెట్స్క్లోని సివీరెస్క్, ఫెడోరివ్కా, బఖ్ముత్ వైపు కదిలేందుకు సన్నద్ధమవుతోందని ఉక్రెయిన్ సైనిక వర్గాలు తెలిపాయి. డొనెట్స్క్లో సగం భూభాగం ఇప్పటికే రష్యా నియంత్రణలో ఉంది. స్లొవియాన్స్క్, క్రామటోర్స్క్లో రష్యా వైమానిక దాడులు నానాటికీ ఉధృతమవుతున్నాయి. స్లొవియాన్స్క్లో తాజాగా రష్యా దాడుల్లో తొమ్మిదేళ్ల బాలిక సహా ఆరుగురు మరణించారు. 19 మంది క్షతగాత్రులయ్యారు. క్రామటోర్‌స్క్‌లోనూ రష్యా నిప్పుల వర్షం కురిపించింది. రష్యా దృష్టి మొత్తం ఇప్పుడు డొనెట్స్క్పైనే ఉందని బ్రిటిష్ రక్షణ శాఖ పేర్కొంది. పునర్నిర్మాణం.. ప్రపంచ బాధ్యత: జెలెన్స్కీ లుహాన్స్క్ నుంచి తమ దళాలు వెనుదిరగడం నిజమేనని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఆయుధాలు సమకూర్చుకొని, బలం పుంజుకుని పోరాటం కొనసాగిస్తామన్నారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం ప్రజాస్వామ్య ప్రపంచ ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌లో సోమవారం ‘ఉక్రెయిన్ రికవరీ కాన్ఫరెన్స్’లో ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. రష్యా దాడుల్లో దెబ్బతిన్న తమ దేశ పునర్నిర్మాణం అనేది స్థానిక ప్రాజక్టు లేదా ఒక దేశ ప్రాజెక్టు కాదని అన్నారు. ప్రజాస్వామ్య ప్రపంచంలో నాగరిక దేశాల ఉమ్మడి కార్యాచరణ అని వెల్లడించారు. రష్యాతో యుద్ధం ముగిసి తర్వాత తమ దేశ పునర్నిర్మాణానికి 750 బిలియన్ డాలర్లు అవసరమని ఉక్రెయిన్ ప్రధానమంత్రి అంచనా వేశారు. ఈ మేరకు రికవరీ ప్లాన్ రూపొందించారు. -
సోనియాకు చేదు అనుభవం.. ఒక్కసారిగా కిందపడ్డ జెండా.. ‘ఒట్టి’ చేతులతో..
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వం లేక ఇబ్బందులు పడుతోంది. తల్లి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని పార్టీని ముందుండి నడిపిస్తాడనుకున్న రాహుల్ గాంధీ మధ్యలోనే కాడి వదిలేశారు. రాహుల్‌కే తిరిగి పగ్గాలు అప్పగించాలని కొందరు, లేదు ఫుల్ టైమ్ అధ్యక్షుడు కావాలంటు ‘జీ–23’ (సీనియర్ నేతల అసమ్మతి బృందం) నేతలు అధిష్టానంపై ‘పోరు’పెట్టారు. ఇక ఈ పంచాయితీని పెంచడం ఇష్టం లేక యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీయే తాత్కాలికంగా పార్టీ అధ్యక్ష స్థానంలో కొనసాగుతున్నారు. ఇలా పార్టీ అధిష్టానంలో సఖ్యత కొరవడటంతో శ్రేణులు నీరుగారిపోతున్నాయి. ఈ క్రమంలోనే భారత్‌లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ 137వ ఆవిర్భావ (డిసెంబర్ 28) దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే, పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలో చోటుచేసుకున్న ఓ ఘటన అటు సోనియాకు, సీనియర్ నేతలకు, కార్యకర్తలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. (చదవండి: మదర్ థెరిసా సంస్థ బ్యాంకు ఖాతాల స్తంభన) ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం జెండా ఎగురవేస్తున్నప్పుడు అది ఒక్కసారిగా కిందపడిపోయింది. జెండా ఆవిష్కరణ చేయాల్సిన సోనియా దాన్ని నేలపై పడకుండా చేతులతో పట్టుకున్నారు. అక్కడున్న సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసిన ఆమె జెండాను చేతులతో పైకెత్తి పార్టీ శ్రేణులకు చూపించి మిగతా కార్యక్రమాన్ని కానిచ్చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: రాజ్యసభ ఎంపీ మహేంద్రప్రసాద్ కన్నుమూత) #WATCH | Congress flag falls off while being hoisted by party's interim president Sonia Gandhi on the party's 137th Foundation Day#Delhi pic.twitter.com/A03JkKS5aC — ANI (@ANI) December 28, 2021 -
తాలిబన్లకు నిరసనల సెగ
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సన్నాహాలు చేస్తుంటే వారికి నిరసనల స్వాగతాలు ఎదురవుతున్నాయి. తాలిబన్లకు వ్యతిరేకంగా మహిళలు కూడా రోడ్డెక్కి గట్టిగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అఫ్గానిస్తాన్ స్వాతంత్య్ర దినం (ఆగస్టు 19)కి ఒక్కరోజు ముందు ప్రభుత్వ కార్యాలయాలపై అఫ్గాన్ పతాకం ఎగరాలని డిమాండ్లు మిన్నంటాయి. తాలిబన్లపై ప్రజలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో వారు అత్యంత కఠినంగా నిరసనల్ని అణగదొక్కేస్తున్నారు. జలాలాబాద్‌లో నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాకు బదులుగా తిరిగి అఫ్గాన్ పతాకాన్ని ఎగురవేయాలన్న డిమాండ్‌తో బుధవారం నిరసన ప్రదర్శనలకు దిగారు. అఫ్గాన్ జెండా పట్టుకొని వందలాది మంది నిరసనకారులు నడిచి వెళుతూ ఉంటే, వారిని చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ నిరసనని కవర్ చెయ్యడానికి వచ్చిన జర్నలిస్టుల్ని చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో కాల్పుల శబ్దాలు కూడా స్పష్టంగా వినిపించాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారని, డజన్ల మంది గాయపడ్డారని అల్‌జజీరా ఛానెల్ వెల్లడించింది. మహిళల నుంచే తొలి నిరసనలు కాబూల్‌లో మహిళల రూపంలో తొలిసారిగా తాలిబన్లకు నిరసనల సెగ తగిలింది. సమాన హక్కుల్ని డిమాండ్ చేస్తూ మహిళలు ప్ల కార్డులు పట్టుకొని కాబూల్ వీధుల్లో నిరసనకి దిగారు. వీరి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పక్కనే తాలిబన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా వారు బెదిరిపోలేదు. తమ హక్కుల్ని కాపాడాలని నినాదాలు చేశారు. హిజాబ్ లేదని మహిళని కాల్చి చంపారు! పేరుకే శాంతి మంత్రాన్ని వల్లిస్తున్న తాలిబన్లు ఆచరణలో తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. టఖార్ ప్రావిన్స్‌లో ఒక మహిళ హిజాబ్ (తల కనిపించకుండా వస్త్రంతో చుట్టుకోవడం) లేకుండా బయటకు రావడంతో తాలిబన్లు మంగళవారం ఆమెని కాల్చి చంపినట్టుగా ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. దేశం విడిచి పారిపోవాలని కాబూల్ విమానాశ్రయానికి వస్తున్న వారిపై పదునైన ఆయుధాలతో దాడికి దిగుతున్నారు. ఎయిర్‌పోర్టులో జనాల్ని నియంత్రించడానికి గాల్లోకి కాల్పులు జరపడం, మహిళలు, పిల్లలని చూడకుండా కర్రలతో కొట్టడం వంటివి చేస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. -
జెండా ఎగురవేశాడని దళిత సర్పంచ్‌పై సెక్రటరీ పిడిగుద్దులు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అమానుషమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక దళిత వ్యక్తి జాతీయజెండాను ఎగురవేశాడనే కోపంతో.. ఆ గ్రామ కార్యదర్శి అతనిపై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానికుల ప్రకారం.. ఈ సంఘటన బుందేల్ ఖండ్‌లో జరిగింది. కాగా, నిన్న (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఛత్తర్పూర్లోని ధాంచీ గ్రామస్తులు.. స్థానిక పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో సదరు గ్రామ కార్యదర్శి సునీల్ తివారి సమయానికి రాలేదు. దీంతో గ్రామస్తులు సర్పంచ్ హన్ను బాసర్ను జెండా ఎగురవేయాలని కోరారు. వారి కోరిక మేరకు.. హన్ను బాసర్ జెండాను ఎగురవేశాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న సునీల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తనను కాదని.. నువ్వు జెండా ఎలా ఎగురవేశావని ప్రశ్నించారు. కోపంతో విచక్షణ కోల్పోయిన సెక్రెటరీ.. దళిత సర్పంచ్‌పై పిడిగుద్దులు కురిపిస్తు దాడికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా.. అడ్డు వచ్చిన సర్పంచ్ భార్య.. కోడలిపై కూడా దాడిచేశాడు. ప్రస్తుతం ఈ సంఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కార్యదర్శిపై ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సర్పంచ్, అతని భార్య.. సెక్రెటరీ సునీల్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా ఘటనపై కూడా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
జాతీయ జెండా ఉల్టా పల్టా.. కేరళ బీజేపీ చీఫ్‌పై కేసు నమోదు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. ప్రస్తుతం ఈ సంఘటన రాజకీయంగా కలకలంగా మారింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్నిపురస్కరించుకుని కేరళ బీజేపీ చీఫ్ కె. సురేంద్రన్ తమ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అయితే, సరైన అవగాహన లేకుండా తలకిందులుగా ఉన్న జెండాను అలాగే ఎగురవేశారు. కాసేపటికి దీన్ని గమనించిన అక్కడి నేతలు తిరిగి జెండాను సరిచేసి ఎగురవేశారు. అప్పటికే పలువురు స్థానికులు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ క్లిప్పింగ్‌లు కాస్త వైరల్ కావడంతో పోలీసులు సదరు బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేశారు. అదే విధంగా, మొదటిసారి కేరళలో సీపీఐ (యం) పార్టీ ఆఫీస్‌లో నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ జెండాకు సమానంగా.. తమ పార్టీ జెండాను ఎగురవేశారు. జెండా కోడ్ ప్రకారం.. జాతీయ జెండాకు సమానంగా వేరే ఏ పతాకాలు ఉండకూడదు. దీన్ని సీపీఐ (యం) ఉల్లంఘించిందని, దేశ త్రివర్ణపతాకాన్ని అవమానించారని కాంగ్రెస్‌నేత కె.ఎస్. సబరినాథన్ విమర్శించారు. దీనిపై స్థానిక బీజేపీ నాయకులు కూడా స్పందించారు. వెంటనే సీపీఐ (యం) నాయకులపై జెండాకోడ్ ఉల్లంఘన కింద కేసులను నమోదు చేయాలని పోలీసులను కోరారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. pic.twitter.com/FJUCHAScY9 — ☭ Raihaan Ali ☭ (@Raihaan09816906) August 15, 2021 -
మోదీ, కేసీఆర్‌లను ఓడిస్తేనే స్వాతంత్య్రం: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్రం లో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ను ఓడించినప్పుడే రైతులు, యువతకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అవుతుందని, ఈ ఇద్దరినీ గద్దెదించేందుకు ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గాం«దీభవన్‌లో ఆదివారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, దేశంలోని వెనుకబడిన వర్గాలన్నింటికీ హక్కులు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తే, మోదీ ఫాసిస్టు ప్రభుత్వం మతాల పేరిట ప్రజలను విభజిస్తూ దేశాన్ని ప్రయోగశాలగా మార్చిందని విమర్శించారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి పొన్నాల, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రేవంత్ భేటీ అయ్యారు. -
వచ్చే 25 ఏళ్లలో బీజేపీ లక్ష్యమదే: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాబోయే 25 ఏళ్లలో మోదీ నేతృత్వం లోని బీజేపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా భారత్‌ను విశ్వగురువుగా చేసే ఏకైక లక్ష్యం తో ముందుకు సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సంజయ్‌కుమార్ అన్నారు. ఈ తరుణంలో ప్రతి తెలంగాణ వాది బీజేపీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దాని ద్వారానే మనం నిర్దేశించుకున్న శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమని గుర్తించాలన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సంజయ్ మాట్లాడుతూ, ఈ లక్ష్యసాధనలో దేశప్రజలంతా భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, సినీ నటి విజయశాంతి, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, పొంగులేటి సుధాకరరెడ్డి, గీతామూర్తి, జి.విజయరామారావు, గూడూరు నారాయణరెడ్డి, ఎస్. ప్రకాశ్‌రెడ్డి, బండా కార్తీకరెడ్డి పాల్గొన్నారు. -
ఉత్పాదక రంగంలో అగ్రగామిగా భారత్
సాక్షి, హైదరాబాద్: ఉత్పాదక రంగంలో భారత్ అగ్రగామి కానుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) అమిత్ జింగ్రాన్ చెప్పారు. ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్కిల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచి్చన 75 ఏళ్లలో సూదుల నుంచి విమానాల వరకు, హైడెల్ పవర్ నుంచి సోలార్ పవర్ వరకు, సైకిళ్ల నుంచి లగ్జరీ కార్ల వరకు తయారు చేసే స్థాయికి ఎదిగిందని తెలిపారు. రైల్వేలు, రోడ్డు, మౌలిక సదుపాయాలు, మెట్రో పట్టాలు మొదలైన వాటిలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను సృష్టించిందని తెలిపారు. భారత్ అభివృద్ధిలో ఎస్బీఐ కీలక ప్రాత పోషిస్తోందని పేర్కొన్నారు. -
Hyderabad: అదనపు డీజీ అయినా నో చాన్స్!
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 15, జనవరి 26న దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా వందనం ఉంటుంది. సంబంధిత కార్యాలయ అధిపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అదనపు డీజీ స్థాయిలో ఉండే నగర పోలీసు కమిషనర్‌కు మాత్రం ఆ చాన్స్ ఉండదు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు మాత్రం అప్పుడప్పుడు అవకాశం చిక్కుతుంటుంది. నగర కొత్వాల్‌కు ఉండే కీలకమైన బాధ్యతే అందుకు కారణం. ► హైదరాబాద్ కమిషనరేట్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఏడీజీ) స్థాయి అధికారి, సైబరాబాద్, రాచకొండలకు ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) స్థాయి అధికారి కమిషనర్లుగా ఉంటారు. ప్రస్తుతం మాత్రం ఆ రెండు కమిషనరేట్లకూ ఏడీజీలే కమిషనర్లుగా ఉన్నారు. ► రాష్ట్ర డీజీపీకి సైతం లేని విధంగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సహా వివిధ ప్రత్యేక అధికారాలు ఈ ముగ్గురు కమిషనర్లకూ ఉంటాయి. కీలక హోదా కలిగిన ఈ ముగ్గురికీ జెండా ఎగురవేసే అవకాశం ఉండదు. మిగిలిన ఇద్దరికీ అప్పుడప్పుడూ ఆ చాన్స్ దొరుకుతుంది. ► జీహెచ్ఎంసీలో ప్రధాన కమిషనర్, కలెక్టరేట్లలో కలెక్టర్లు, న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు, జలమండలిలో దాని ఎండీ.. ఇలా వాటి అధిపతులే జాతీయ జెండాలను ఎగురవేస్తారు. కమిషనరేట్లలో మాత్రం ఇతర అధికారులకే ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ► హైదరాబాద్‌లో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్.సుధారాణి, సైబరాబాద్‌లో మహిళా భద్రత విభాగం డీసీపీ సి.అనసూయ ఆదివారం జెండా వందనం చేశారు. రాచకొండలో మాత్రం కమిషనర్ మహేష్ భగవత్ ఎగరేశారు. ఇలానే అప్పుడప్పుడు సైబరాబాద్ కమిషనర్ కూడా జెండాను ఆవిష్కరిస్తుంటారు. హైదరాబాద్ కొత్వాల్ మాత్రం ఎగరేసిన దాఖలాలు లేవు. ► ఆయనకు కీలక బాధ్యతల కారణం హైదరాబాద్ కమిషనర్‌కు జెండా ఎగురవేసే అవకాశం ఉండదు. గణతంత్ర వేడుకలైనా, స్వాతంత్య్ర దినోత్సవమైనా నగరంలో అధికారిక ఉత్సవాలు జరుగుతాయి. వీటికి జనవరి 26న గవర్నర్, ఆగస్టు 15న సీఎం (ఈ రెండు సందర్భాల్లో ఇద్దరూ హాజరైనా అధికారికంగా గౌరవ వందనం స్వీకరించేది ఒకరే) హాజరవుతారు. వారితో పాటే మంత్రులు, అత్యున్నత అధికారులూ వస్తారు. దీంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలి. ► ఈ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసు విభాగంలోని ఇతర ఉన్నతాధికారుల కంటే కమిషనర్‌కే ఎక్కువ. ► ఇలాంటి కీలక బాధ్యతలు ఉన్నందువల్లే హైదరాబాద్ కమిషనర్‌కు ఎప్పుడూ తన కార్యాలయంలో జెండా ఎగురవేసే అవకాశం చిక్కదు. -
లండన్‌లో టీమిండియా 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు; వీడియో వైరల్
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా జట్టు 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా బ్రిటీష్ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. లార్డ్స్ వేదికగా రెండో టెస్టు ఆడుతున్న టీమిండియా ఆదివారం తాము బస చేస్తున్న హోటల్ వద్ద స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రిలు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జట్టు సభ్యులతో కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులు, వారి కుటుంబసభ్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. కాగా శ్రీలంక పర్యటన నుంచి ఇంగ్లండ్‌కు చేరుకున్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లు కూడా ఈ వీడియోలో కనిపించారు. ఈ ఇద్దరు తమ ఐసోలేషన్ పీరియడ్‌ను పూర్తిచేసుకుని జట్టుతో కలిసి ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే మూడవ టెస్ట్ సెలెక్షన్స్ కోసం అందుబాటులో ఉండనున్నారు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆటలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతుంది. 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా ప్రస్తుతం 29 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. On the occasion of India's Independence Day, #TeamIndia members came together to hoist the flag 🇮🇳 🙌 pic.twitter.com/TuypNY5hjU — BCCI (@BCCI) August 15, 2021 -
ప్రశ్నించే గొంతుకలన్నీ ఏకం కావాలి: ఇందిరా శోభన్
సాక్షి, హైదరాబాద్: ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా.. దేశంలో ఇంకా పేదరికం, ఆకలి చావులు కొనసాగుతుండడం దురదృష్టకరమన్నారు. అందరికీ విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మిగిలాయని ఇందిరా శోభన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలోనూ సమానత్వం, భావప్రకటన స్వేచ్ఛ లేకపోవడం మన దౌర్భాగ్యం అన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో నిరుపేదలను అణచివేస్తున్నారని ఆమె వాపోయారు. తెలంగాణ ప్రజలు స్వతంత్రంగా, స్వేచ్ఛగా మెలగాలంటే అది ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రశ్నించే గొంతుకలన్నీ ఏకమై.. అటు దేశాన్ని, ఇటురాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇందిరా శోభన్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అనాథ చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఆకుల ప్రవీణ్, రాజ్ కుమార్, బెట్టీనాలంక, సత్తి సూరిబాబు, మునిరామ్, ప్రశాంత్, మనోజ్, నిఖిల్, శంషోద్దీన్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. -
శత్రు దుర్భేద్యంగా ఢిల్లీ
న్యూఢిల్లీ: డెభ్బై ఐదవ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ అంతటా అనూహ్య రీతిలో భద్రతా బలగాలను మోహరించారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో నిఘాను పెంచారు. ఎనిమిది నెలలుగా సాగు చట్టాలపై రైతులు ఉద్యమిస్తున్న ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లోనూ గస్తీని ఎక్కువచేశారు. వేడుకలకు ప్రధానవేదిక అయిన, ప్రధాని మోదీ ప్రసంగించనున్న ఎర్రకోట వద్ద బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్ టర్మినల్స్ వద్ద పోలీసుల సంఖ్యను పెంచారు. జమ్మూ ఎయిర్‌పోర్టులోని వైమానిక స్థావరంపై ఉగ్ర డ్రోన్ దాడి నేపథ్యంలో ఎర్రకోట వద్ద యాంటీ– డ్రోన్ వ్యవస్థతో బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఉగ్ర కుట్రలను భగ్నంచేసేందుకు యమునా తీరప్రాంతాలుసహా నగరంలోని ముఖ్యప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను అధికంచేశారు. కొత్తగా అద్దెకొచ్చిన వారిని, సిమ్‌కార్డులు, పాత కార్లు, బైక్‌లు అమ్మే డీలర్లను అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో విచారిస్తున్నారు. 16వ తేదీ వరకు హాట్ ఎయిర్బెలూన్లుసహా మరే ఇతర ఎగిరే వస్తువులను ఢిల్లీ గగనతలంపైకి తేవడాన్ని నిషేధించారు. ఆదివారం ఉదయం ఎర్రకోటపై మువ్వన్నెల జాతీయ జెండాను ప్రధాని మోదీ ఎగరేయనున్నారు. ఆ సమయంలో ఆకాశం నుంచి వాయుసేనకు చెందిన ఎంఐ–17 1వీ హెలికాప్టర్లు పూలవర్షం కురిపించనున్నాయి. వేడుకల్లో రెండు ఎంఐ హెలికాప్టర్లు పాల్గొనడం ఇదే తొలిసారి. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. హెల్త్‌వర్కర్ల వంటి కోవిడ్ వారియర్స్‌ను సత్కరించేందుకు దక్షిణం వైపు ప్రత్యేక వేదిక ఏర్పాటుచేశారు. 1.5 కోట్ల మంది జాతీయ గీతం పాడారు.. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 1.5 కోట్ల మంది భారతీయులు జాతీయ గీతం ఆలపిస్తూ వీడియోలు చిత్రీకరించి రాష్ట్రగాన్డాట్ఇన్ అనే వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేశారని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో పాల్గొనాలని గత నెల 25న ప్రధాని నరేంద్ర మోదీ తన మన్‌కీబాత్ కార్యక్రమంలో కూడా పిలుపునిచ్చారు. దీంతో దేశవిదేశాల్లోని భారతీయులు జనగణమన ఆలపిస్తూ వీడియోలు అప్లోడ్ చేశారు. ఇందులో పిల్లల నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసుల వారి వరకు పాల్గొన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
నిరాడంబరంగా విశ్వక్రీడల ముగింపు వేడుకలు
టోక్యో: ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ సజావుగా సాగిన టోక్యో ఒలింపిక్స్ నేటితో ముగిసాయి. కోవిడ్ నిబంధనలు కారణంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలను గతంలో మాదిరిగా అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. జపాన్ జాతీయ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. జపాన్ జాతీయ జెండా ఆవిష్కరణతో వేడుకలు మొదలయ్యాయి. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ భజరంగ్ పునియా భారత బృందం ఫ్లాగ్ బేరర్‌గా ఉన్నాడు. వేడుకల్లో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్‌తో పాటు మరికొంత మంది ప్రముఖులు పాల్గొన్నారు. ప్యారిస్ వేదికగా జరగబోయే తదుపరి(2024) ఒలింపిక్స్ గురించి పది నిమిషాల వీడియోను ప్రదర్శించనున్నారు. చివర్లో ఒలింపిక్స్ టార్చ్‌ను పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులకు అందించడంతో ఈ ముగింపు వేడుకలు ముగిస్తాయి. ఇదిలా ఉంటే, ఈ ఒలింపిక్స్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో మొత్తంగా ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాల అత్యుత్తమ ప్రదర్శనను ప్రస్తుత ఒలింపిక్స్‌లో అధిగమించి మరుపురానిదిగా మలుచుకుంది. ఇక ఈ ఒలింపిక్స్‌లో మొత్తం 85 దేశాలు పతకాల ఖాతా తెరవగా.. భారత్ ఏడు పతకాలు( స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు) సాధించడం ద్వారా పతకాల పట్టికలో 47వ స్థానంలో నిలిచింది. ఇక పతకాల వేటలో టాప్ 3 స్థానాల కోసం ఎప్పటిలాగే అమెరికా, చైనా, జపాన్‌లు పోటీ పడగా.. 39 స్వర్ణాలతో అమెరికా అగ్రస్థానంలో నిలవగా.. 38 స్వర్ణాలతో చైనా రెండో స్థానంలో, 27 స్వర్ణాలతో ఆతిథ్య జపాన్ మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా పతకాల వారిగా చూసుకుంటే అమెరికా 113 పతకాలు(39 స్వర్ణం, 41 రజతం, 33 కాంస్యం), చైనా 88 పతకాలు( 38 స్వర్ణం, 32 రజతం, 18 కాంస్యం), జపాన్ 58 పతకాలు (27 స్వర్ణం, 14 రజతం, 17 కాంస్యం) సాధించాయి. -
వైఎస్సార్ పాలనే లక్ష్యం
తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావాలన్నదే తమ పార్టీ లక్ష్యమని వైఎస్ షర్మిల ప్రకటించారు. తమ వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఎజెండాలో సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం ముఖ్యమైన అంశాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలను మళ్లీ ప్రారంభించడం ద్వారా పేదలను స్వయం సమృద్ధులను చేసి రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపడమే ధ్యేయమని చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 72వ జయంతి సందర్భంగా గురువారం సాయంత్రం హైదరాబాద్ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కేరింతలు, చప్పట్ల మధ్య ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పేరును, ఎజెండాను షర్మిల అధికారికంగా ప్రకటించారు. వైఎస్సార్టీపీ జెండాను తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెండాలోని ముఖ్యాంశాలు వివరించేలా సాగిన లేజర్ షో ఆకట్టుకుంది. సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే వేదిక పక్కన ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..వైఎస్సార్ స్ఫూర్తితో సమానావకాశాలు ‘రుణమాఫీ, ఉచిత విద్యుత్, పావలావడ్డీ, ఆరోగ్యశ్రీ, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే దార్శనికత వైఎస్సార్‌ది. 2004–09 మధ్యలో లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు 11 లక్షలకు పైగా ప్రైవేట్ ఉద్యోగాల కల్పించిన మహానేత వైఎస్సార్. కుల, మతాలకు అతీతంగా, ఆడ..మగ తేడా లేకుండా వైఎస్సార్ ప్రజలందరినీ సమానంగా చూశారు. మేము కూడా అదే స్ఫూర్తితో అందరికీ సమాన అవకా శాలు కల్పించేలా కృషి చేస్తాం. అసెంబ్లీ సహా ఎంపీ స్థానాల్లో మహిళలకు 50% సీట్లు కేటాయిస్తాం. చట్టసభల్లో 50% మహిళలను కూర్చోబెట్టాలనేది మా పార్టీ లక్ష్యం. రాష్ట్ర జనాభాలో 52 శాతమున్న బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన పాలనలో సరైన భాగస్వామ్యం కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు మినహాయించి మిగతా సీట్లలో జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మెనారిటీలకు రక్షణ కవచంగా నిలిచి ఆయా వర్గాల అభివృద్ధికి కృషిచేస్తాం. ఈ రోజు నుంచి వంద రోజుల్లోగా తెలంగాణలో పాదయాత్ర చేపడతా. కేసీఆర్ ఏం జవాబు చెబుతారు? సంక్షేమంలో నంబర్ 1 అని చెప్పుకునే కేసీఆర్ కరోనాతో అప్పుల పాలైన పేదల కుటుంబాలకు ఏమని సమాధానం చెబుతారు? ఆరేళ్లలో 6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు ఏం జవాబిస్తారు? కేసీఆర్ సంక్షేమం అంటే గారడీ మాటలు, గొప్పలు, చేతికి చిప్పలే. ఉపాధి లేక, ఉద్యోగాలు లేక వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే దున్నపోతు మీద వాన పడ్డట్టుగా, తమ కుటుంబానికి నాలుగు ఉద్యోగాలు వచ్చాయి చాలంటూ.. ఇంటికో ఉద్యోగం హామీని కేసీఆర్ మరిచిపోయారు. రాష్ట్రం ఏర్పడ్డాక రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారు. ప్రాజెక్టులపై ఇప్పుడు నిద్ర లేచారా? కృష్ణా నదిపై రెండేళ్ల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే సీఎం కేసీఆర్ ఇప్పుడే నిద్రలేచారా? ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించుకున్నారు కదా. రెండు నిమిషాలు నీటి పంచాయతీపై మాట్లాడుకోలేరా? రెండు రాష్ట్రాల సీఎం లతో చర్చించి పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా? తెలంగాణకు సంబంధించిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా వదులుకోం. పక్క రాష్ట్రానికి కూడా నష్టం జరగనివ్వం. తెలంగాణలో ఇంకా కాంగ్రెస్ నిలబడి ఉందంటే దానికి కారణం వైఎస్సారే. అలాంటి వైఎస్సార్‌ను టీఆర్ఎస్ నాయకులు దూషిస్తుంటే కాంగ్రెస్ నేతలు చేతులు ముడుచుకుని చేతగాని వాళ్లలా కూర్చున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై ఆధారాలున్నాయంటున్న బీజేపీ అధ్యక్షుడు, ఎందుకు బయటపెట్టడం లేదు? కేసులెందుకు పెట్టడం లేదు? టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలే..’ అని షర్మిల విమర్శించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల ఘనంగా నివాళులర్పించారు. తండ్రి సమాధిపై పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, బ్రదర్ అనిల్‌కుమార్, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి పాల్గొన్నారు. నాయకుడంటే వైఎస్సారే : విజయమ్మ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దివంగత నేత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. నాయకుడు అంటే దానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్సార్ అని పేర్కొన్నారు. వైఎస్సార్‌ను చూసి నేర్చుకోవాలని, ఆయనది నిండైన వ్యక్తిత్వమని చెప్పారు. నాయకుడంటే నమ్మకం, భరోసా, ఆప్యాయత, ఆత్మీయతకు చిహ్నమని అన్నారు. తెలుగువారి గుండెచప్పుడు వైఎస్ అని, ఆయనను ఇక్కడి ప్రజలు అమితంగా ప్రేమించారని గుర్తుచేశారు. తెలం గాణను స్వర్ణమయం, సస్యశ్యామలం చేయాలన్నది వైఎస్ కల అని తెలిపారు. ఇది దైవ నిర్ణయం వైఎస్ విశ్వసనీయతను, ఆత్మీయత, హావభావాలను జగన్, షర్మిల పుణికి పుచ్చుకున్నారని విజయమ్మ చెప్పారు. వైఎస్ చిత్తశుద్ధికి, పట్టుదలకు వారు వారసులు అని అన్నారు. వారిప్పుడు వేర్వేరు రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రతినిధులని పేర్కొన్నారు. ఇది దైవ నిర్ణయమని, ప్రజాహితం కోసం జరి గిన నిర్ణయమని అన్నారు. ‘వైఎస్సార్ బిడ్డలు దొంగలు, గజదొంగలు కాదు. మాటకు ప్రాణమిచ్చే వారు. దాచుకోవడం, దోచుకోవడం తెలియదు. పంచడం మాత్రమే తెలుసు..’అని చెప్పారు. షర్మిలను తెలంగాణ ప్రజలు అక్కున చేర్చుకుని ఆశీర్వదించాలని విజయమ్మ కోరా రు. ఈ సభలో పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, ఇందిరా శోభన్ ప్రసంగించారు. బ్రదర్ అనిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిల పార్టీకి ఆల్ ద బెస్ట్: కోమటిరెడ్డి జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వద్ద నుంచి వెళ్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడ ఆగి వైఎస్సార్ అభిమానులతో ముచ్చటించారు. వైఎస్ గొప్ప నేత అని కొనియాడారు. అలాంటి నేత ఇంతకుముందు లేడు, ఇక రాడు అని అన్నారు. షర్మిల పార్టీకి ఆల్ ద బెస్ట్ చెప్పారు. కాగా, వైఎస్ షర్మిల పార్టీకి స్వాగతం చెబుతున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అయోధ్యలో మసీదు నిర్మాణానికి శంకుస్థాపన
లక్నో: 72వ గణతంత్ర దినోత్సవం నాడు అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన జరిగింది. ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ మంగళవారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటి.. మసీదు నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. 2019 సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దాదాపు 5 ఎకరాల విస్తీరణంలో మసీదు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు జాఫర్ అహ్మద్ ఫరూఖీ మాట్లాడుతూ.. మసీదు నిర్మాణ స్థలిలో భూసార పరీక్షలను ప్రారంభించామని, దానికి సంబంధించిన నివేదికలు అందగానే పనులు మొదలుపెడతామని వెల్లడించారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన నమూనాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే మసీదు నిర్మాణం కోసం విరాళాల సేకరణకు పిలుపునిచ్చామని, ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుందని ఆయన తెలిపారు. గత నెలలోనే ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ మసీదు నమూనాను ఆవిష్కరించిందని, సుందరమైన తోట మధ్యలో మసీదు నిర్మాణం జరుగుతుందని, మసీదు నిర్మాణంపై భారీ గాజు గోపురం కలిగివుంటుందని ఆయన వివరించారు. మసీదు వెనుక భాగంలో అత్యాధునిక డిజైన్‌తో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. మసీదు పేరును ఇంకా ఖరారు చేయలేదని, త్వరలోనే ట్రస్ట్ సభ్యులందరూ సమావేశమై మసీదు పేరును నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు. కాగా, మసీదు నిర్మించబోయే స్థలం.. రామ జన్మభూమిలోని రామ మందిర నిర్మాణ స్థలికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామమందిరం, మసీదు రెండూ ఒకే జిల్లాలో ఉండటం విశేషం. -
జెండా ఎగురవేయను.. ముఫ్తీని అరెస్ట్ చేయండి
కశ్మీర్: త్రివర్ణపతాకంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కశ్మీర్లో ప్రత్యేక జెండా ఎగురవేసే అనుమతి వచ్చే వరకు త్రివర్ణ పతాకం ఎగరవేయననటంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 14 నెలల నిర్బంధం తర్వాత బయటకు వచ్చిన ముఫ్తీ నిన్న మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో ఉనికి కోల్పోయిన జమ్మూకశ్మీర్ ప్రత్యేక జెండాను ఐక్య పోరాటంతో తిరిగి సాధించుకుంటామన్నారు. అప్పటి వరకు త్రివర్ణ పతాకం ఎగరవేయనన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఫ్తీపై దేశద్రోహం కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకుడు రవీందర్ రైనా మాట్లాడుతూ.. ‘ఈ భూమిపై ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం.. జమ్ము కశ్మీర్ ప్రత్యేక జెండాను ఎగరవేయడం చేయలేవు. మన జెండా, దేశం, మాతృభూమి కోసం ఎందరో రక్తం చిందించారు. జమ్ము కశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం. కనుక ఇక్కడ ఒకే ఒక్క జెండా ఎగురుతుంది.. అది కూడా త్రివర్ణ పతాకం మాత్రమే’ అన్నారు. అంతేకాక ముఫ్తీ కశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఏదైనా తప్పు జరిగితే ఆమె తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. శాంతి, సాధారణ స్థితి, సోదరభావానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందన్నారు. అలానే కశ్మీరీ నాయకులు భారతదేశాన్ని అసురక్షితంగా భావిస్తే.. పాకిస్తాన్, చైనా వెళ్ళవచ్చు అన్నారు. (చదవండి: ‘నాపై ఎప్పుడైనా దాడి జరుగవచ్చు’) జాతీయ జెండాపై మెహబూబా ముఫ్తీ చేసిన ప్రకటనను కాంగ్రెస్ ఖండించింది. ముఫ్తీ వ్యాఖ్యలు ఆమోదనీయం కాదని.. త్రివర్ణ పతాకం భారతీయుల ఐక్యత, సమగ్రత, త్యాగాలను చాటుతుందని, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయొద్దని కాంగ్రెస్ హితవు పలికింది. -
‘అలా చేయొద్దని చట్టంలో ఎక్కడుంది’
సాక్షి, హైదరాబాద్: జాతీయ జెండాను అవమానించారంటూ యాదాద్రి ఆలయ ఈవోపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టేసింది. యాదాద్రి ఈవోపై న్యాయవాది నర్సింగోజు నరేష్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆగస్టు 15న జెండా ఎగర వేయకుండా గోడకు అతికించారని పిటిషనర్ వాదించారు. అయితే, జాతీయ జెండా కార్యాలయం లోపల గోడకు అతికించవద్దని చట్టంలో ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది. జాతీయ జెండా బయటే ఎగరేయాలని చట్టంలో ఉందా అని సూటిగా ప్రశ్నించింది. కార్యాలయంలో అతికిస్తే జాతీయతను ప్రదర్షించినట్టే కదా అని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ ఆరోగ్యం ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేసింది. (చదవండి: అద్భుతం.. అద్దాల మండపం) -
పతాక ప్రతిష్ట
స్కూల్లో ఫస్ట్. కాలేజ్‌లో ర్యాంక్ స్టూడెంట్. బీటెక్‌లో టాపర్. అకాడమీలో మెడలిస్ట్. ఆర్మీలో మేజర్. ఫ్లాగ్ ఆఫీసర్‌గా ఇప్పుడు.. పతాక ప్రతిష్ట! స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగరేస్తున్నప్పుడు ఆయన పక్కనే ఉన్నారు మేజర్ శ్వేతా పాండే. జెండా ఆవిష్కరణ సమయంలో ప్రధానికి సహాయంగా ఉండటం కోసం దేశ రక్షణ శాఖ కొద్ది రోజుల ముందే ఆమెను ఇండిపెండెన్స్ డే కి ‘ఫ్లాగ్ ఆఫీసర్’గా ఎంపిక చేసింది. సంప్రదాయంగా వస్తున్న ‘21–గన్’ గౌరవ వందనం స్వీకరిస్తూ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ జెండాను ఆవిష్కరిస్తున్నప్పుడు ఆయనకు చేదోడుగా ఉండటం అపూర్వమైన అవకాశమే. ఆ అవకాశం మేజర్ శ్వేతా పాండేకు దక్కింది. రష్యా ‘విక్టరీ డే’ లో భారత పతాకంతో శ్వేత రష్యా రాజధాని మాస్కోలో ఈ ఏడాది జూన్ 24న జరిగిన ఆ దేశపు ‘విక్టరీ డే’ 75వ వార్షికోత్సవానికి ప్రత్యేక ఆహ్వానంపై మన దేశం నుంచి వెళ్లిన భారత సైనిక దళానికి కూడా మేజర్ శ్వేతా పాండేనే నేతృత్వం వహించారు! మన త్రివర్ణ పతకాన్ని చేతబట్టి మన దళాన్ని పరేడ్ చేయించారు. ప్రస్తుతం ఆమె ఇండియన్ ఆర్మీలోని 505 బేస్ వర్క్‌షాప్ సైనిక అధికారి. బేస్ వర్క్‌షాప్‌లో ఆయుధాలు, యుద్ధవాహనాలు, ఇతర సాధన సంపత్తికి అవసరమైన మరమ్మతులు నిరంతరం జరుగుతుంటాయి. ఆ పనులను శ్వేతే స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ఆ విభాగంలో ఇ.ఎం.ఇ. (ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్) ఆఫీసర్ ఆమె. ఈ ఏడాది జరిగిన రెండు విశేష కార్యక్రమాలలోనూ (రష్యా విక్టరీ డే, భారత్ ఇండిపెండెన్స్ డే) దళాధిపతిగా, ప్రధాని సహాయక అధికారిగా శ్వేతకు ప్రాముఖ్యం లభించడానికి కారణం.. ఆమె ప్రతిభా నిబద్ధతలే. శ్వేతా పాండే 2012 మార్చిలో ఆర్మీలోకి వచ్చారు. చెన్నైలోని ‘ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ’లో శిక్షణ తీసుకుంటున్నప్పుడే అధికారులు ఆమెలోని చురుకుదనాన్ని, క్రియాశీలతను గమనించారు. శిక్షణాకాలంలో నేర్చిన రక్షణవ్యూహాలలో శ్వేత అకాడమీలోనే టాపర్‌గా నిలిచి ‘గర్వాల్ రైఫిల్స్’ మెడల్ సాధించారు. ఇక స్కూలు, కాలేజీల్లోనయితే ప్రసంగాలలో, చర్చలలో ఆమె కనబరిచిన ప్రతిభకు దేశ విదేశాలకు చెందిన 75 పతకాలు, 250 వరకు ప్రశంసా పత్రాలు లభించాయి. బి.టెక్ (కంప్యూటర్ సైన్స్, ఆనర్స్) లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యారు. ఆమెలోని ఈ సామర్థ్యాలన్నిటికీ పదును పెట్టింది లక్నోలోని ప్రతిష్టాత్మక ‘సిటీ మాంటిస్సోరీ స్కూల్’. శ్వేత తండ్రి రాజ్ రతన్ పాండే యు.పి. ప్రభుత్వ ఆర్థికశాఖలో అడిషనల్ డైరెక్టర్. తల్లి అమితా పాండే సంస్కృతం, హిందీ భాషల ప్రొఫెసర్. వాళ్లిద్దరి ప్రభావం కూడా శ్వేత కెరీర్‌పై ఉంది. శ్వేత పుణెలోని కాలేజ్ ఆఫ్ మిలటరీ ఇంజనీరింగ్ లో సి.బి.ఆర్.ఎన్. (కెమికల్, బయోలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్) కోర్సును కూడా పూర్తి చేశారు. -
సమన్యాయం కోసమే వికేంద్రీకరణ
రూపం మార్చుకున్న అంటరానితనం ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నేరం. అయినా విద్యాపరంగా అంటరానితనం పాటించాల్సిందే అన్నట్లుగా కొందరి వాదనలు ఉంటున్నాయి. మా పిల్లలు, మా మనవళ్లు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో చదవాలి. పేద పిల్లలు మాత్రం చదవడానికి వీల్లేదు అన్న వాదనలు చూస్తే రూపం మార్చుకున్న అంటరానితనం బాహాటంగా కనిపిస్తోంది. ఇది ధర్మమేనా అని ప్రశ్నించుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సమగ్రాభివృద్ధి చెందేవిధంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా త్వరలోనే విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజన గాయాలు మానాలన్నా, భవిష్యత్తులో మరెన్నడూ అటువంటి గాయాలు తగలకుండా జాగ్రత్త పడాలన్నా పరిపాలన వికేంద్రీకరణే సరైన మార్గమని, ఇందుకోసమే మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చామన్నారు. దేశ 74వ స్వాతంత్య్ర దిన వేడుకలను విజయవాడలో శనివారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ముఖ్యమంత్రి ఆవిష్కరించిన అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదాను సాధించడానికి గట్టిగా ప్రయత్నిస్తూనే ఉంటాం. కేంద్రంలోని ప్రభుత్వానికి పార్లమెంటులో సొంతంగా మెజారిటీ ఉంది. మిగతా పార్టీల మద్దతు మీద ఆధారపడే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు వారు ఇచ్చే అవకాశం కనిపించకపోయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదాను కచ్చితంగా సాధించాలన్న ధృఢ సంకల్పంతో ఉన్నాం. హోదా ఇచ్చేదాకా కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం. 2022 నాటికి పోలవరం పూర్తి – సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులన్నీ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితులలోనూ పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరంలోనే 6 ప్రాధాన్యతా ప్రాజెక్టులు.. వంశధార ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, వెలిగొండ ఫేజ్–1, అవుకు టన్నెల్–2, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం. మన నీటి ప్రయోజనాల విషయంలో రాజీలేదని ఆచరణ ద్వారా చూపిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.9 వేల కోట్ల సబ్సిడీని ఉచిత విద్యుత్‌కు చెల్లిస్తోంది. రైతులకు ఉచిత విద్యుత్ పథకం పది కాలాలు పదిలంగా ఉండేలా కొత్తగా 10 వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ప్రారంభిస్తాం. చదువే నిజమైన ఆస్తి – తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లిష్ మీడియంను ఒక హక్కుగా అమలు చేస్తున్నాం. చదువే నిజమైన ఆస్తి, చదువే నిజమైన సంపద అని నమ్మి విద్యా విధానంలో మార్పులు తీసుకువచ్చాం. విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థల మీద కొరడా ఝళిపించేందుకు రెండు కమిషన్లు.. తల్లిదండ్రులకు, పిల్లలకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పారిశ్రామిక పురోగతి – రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగాన్ని పెంచేలా ఇప్పటికే ఎంఎస్ఎంఈలకు దాదాపు రూ.1,200 కోట్ల ప్రోత్సాహకాలను, గత ప్రభుత్వం వదిలేసిన బకాయిలను చెల్లించాం. కొత్త పారిశ్రామిక విధానంలో కూడా సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పెద్ద పీట వేస్తున్నాం. వైఎస్సార్ వన్ విధానంలో రాష్ట్రంలో 10 రకాల కీలక సేవల్ని ప్రభుత్వం తరపున సమన్వయం చేస్తున్నాం. ప్రైవేటు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలను రిజర్వ్ చేసిన మన ప్రభుత్వం.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా చదువులకు మెరుగులు దిద్ది ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ అక్టోబరు 2వ తారీఖున ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. వారందరికీ సెల్యూట్.. – ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి త్యాగం చేసిన మహానుభావులను, వ్యక్తులను ఇవాళ స్మరించుకుంటున్నాం. అదే పద్ధతిలో కోవిడ్ మహమ్మారి నుంచి మనల్ని కాపాడ్డానికి నిరంతరం సైనికుల్లా పనిచేస్తున్న వారందరికీ ఈ సందర్భంగా అందరం సెల్యూట్ చేద్దాం. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నా. అవి ఎన్నికల పథకాలు కావు – రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఈరోజు చేస్తున్న ఖర్చుకు పూర్తి స్థాయి ఫలాలు, ఫలితాలు మరో 10 నుంచి 20 ఏళ్ల తర్వాతే వస్తాయి. కాబట్టి ఇవి ఎన్నికల పథకాలు కావు. ఇవి మన రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక రాజకీయ చరిత్రలో మెరుగైన మార్పుల కోసం.. బాధ్యతతో, మంచి మనసుతో అమలు చేస్తున్న పథకాలు. ఈ పాలనను దేవుడు ఆశీర్వదించాలి. మీ అందరి దీవెనలు ఉండాలి. -
ప్రజల ముంగిటకే న్యాయం
సాక్షి, హైదరాబాద్: ప్రజల ముంగిటకే న్యాయం అందించాలనే లక్ష్యంతో.. న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు వాదించేందుకు వీలుగా మొబైల్ వ్యాన్స్ ఏర్పాటు చేశామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి వ్యాన్లను ఏర్పాటు చేసిన ఘనత మనదేనన్నారు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ వ్యాన్లను ఏర్పాటు చేశామని, త్వరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దేశంలో మన హైకోర్టులోనే వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా 9 బెంచ్‌లు రోజూ పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సైతం మన పనితీరును ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైకోర్టు ఆవరణలో శనివారం జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీజే మాట్లాడారు. న్యాయ శాఖలో పనిచేస్తున్న 2,119 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.2.5 లక్షల కరోనా కవచ్ బీమా పాలసీని అందించామని తెలిపారు. త్వరలోనే న్యాయస్థానాలు సాధారణంగా పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయ శాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, ఏజీ బీఎస్ ప్రసాద్, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసో సియేషన్ అధ్యక్షుడు సూర్యకరణ్ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రపంచానికి భారత్ మార్గ నిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ఎందరో బలిదానాలు, త్యాగాలు, ఉద్యమాల ద్వారా, అహింసాయుత స్వాతంత్య్ర పోరాటం వల్ల మన దేశానికి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి లభించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారత్ ఒక పేద దేశమని, భిన్నత్వం, వైరుధ్యాలున్నాయని, అభివృద్ధి చాలా కష్టమన్న అపోహలుండేవి. అయితే గత ఏడు దశాబ్దాల్లో భారత్ అనేక రంగాల్లో గొప్ప అభివృద్ధిని సాధించింది. ఒక బలమైన ప్రపంచ శక్తిగా ఎదిగింది’అని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆమె రాష్ట్రంలోని వివిధ రంగాల ప్రముఖులతో రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి భారత్‌కు తొలి కోవిడ్ వ్యాక్సిన్ రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ‘ఎట్ హోమ్’కార్యక్రమం నిర్వహించనందుకు బాధపడ్డాను కానీ ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించినందుకు ఆనందంగా ఉందన్నారు. కాగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై శనివారం రాజ్‌భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. -
జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
-
ప్రత్యేక హోదా సాధనపై ధృడసంకల్పంతో ఉన్నాం: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక వాహనంపై ప్రభుత్వ సంక్షేమ పథకాల శకటాలను సీఎం వైఎస్ జగన్ వీక్షించారు. సంక్షేమ పథకాలు ప్రతిధ్వనించేలా ఏర్పాటు చేసిన శకటాలతో పాటు కరోనా కష్ట కాలంలో ఆరోగ్య సేవలకు గాను ఏర్పాటు చేసిన శకటాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిలో భాగంగా ముందుగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. అనంతరం ప్రసంగిస్తూ ‘స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలి’ అని అన్నారు. సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ♦సామాజిక, ఆర్ధిక భరోసాను రాజ్యాంగం కల్పించింది ♦సమానత్వం పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదు ♦పేదల జీవితాలు మార్చడానికి కృషి చేస్తున్నాం ♦రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఆసరా పథకాలు ప్రవేశపెట్టాం ♦కులం, మతం, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం ♦ప్రజలందరి సంక్షేమమే ధ్యేయంగా 14 నెలల పాలన సాగింది ♦ఆర్ధిక పరిస్థితులు లేకున్నా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం ♦విద్యాపరమైన అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాం ♦ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం ♦రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఆర్ధిక సాయం చేస్తున్నాం ♦పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం ♦అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే పాలనా వికేంద్రీకరణ ♦సమన్యాయం జరిగేలా మూడు రాజధానుల బిల్లును చట్టంగా మార్చాం ♦త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ♦కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ఏర్పాటుకు పునాదులు వేస్తాం ♦పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం.. ప్రత్యేక హోదాను అమలు చేయాలని గట్టిగా అడుగుతూనే ఉంటాం ♦కేంద్ర ప్రభుత్వం మిగతా పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదు.. కాబట్టి ఇప్పటికిప్పుడు హోదా ఇచ్చే అవకాశం కనిపించకపోయినా.. ప్రత్యేక హోదాను ఖచ్చితంగా సాధించాలనే ధృడసంకల్పంతో ఉన్నాం ♦ఈరోజు కాకపోతే భవిష్యత్‌లోనైనా..కేంద్ర ప్రభుత్వం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం ♦అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నాం ♦కేవలం మొదటి 14 నెలల పాలనలోనే వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.46వేల కోట్లు ప్రజలకు నేరుగా అందించాం ♦చెట్టు ఎంత బాగా ఎదిగినా చీడ పురుగు పడితే ఎండిపోతుంది. అవినీతి అనేది చీడపురుగు. అవినీతి వల్ల ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయి ♦ఈ నిజాన్ని గమనించబట్టే రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా రూ.4వేల కోట్లకు పైగా ఆదా చేశాం ♦ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు పూర్తిస్థాయి ఫలాలు మరో 10 నుంచి 20 ఏళ్లకు వస్తాయి. కాబట్టి ఇవి ఎన్నికల పథకాలు కావు ♦రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్ధిక రాజకీయ చరిత్రలో మెరుగైన మార్పుల కోసం.. బాధ్యతతో, మనసుతో అమలు చేస్తున్న పథకాలు ♦స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా దాదాపు 33శాతం పేదలకు చదువుకునే అవకాశం లేదు. విద్యాపరమైన అంటరానితనాన్ని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాం ♦నాడు-నేడు ద్వారా పాఠశాలలు, కాలేజీల రూపురేఖలు మారుస్తున్నాం ♦100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి దీవెన అమలు చేస్తున్నాం ♦ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకు.. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం ♦స్కూల్ విద్యార్ధులకు పుస్తకాలు, షూస్ వరకు అన్నీ ఉచితంగా ఇస్తున్నాం ♦తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంను ఓ హక్కుగా అమలు చేస్తున్నాం ♦చదువే నిజమైన ఆస్తి, సంపద అని నమ్మి విద్యావిధానంలో మార్పులు తీసుకొచ్చాం ♦ప్రత్యేక మెనూతో గోరుముద్ద పథకం అమలు చేస్తున్నాం ♦కంటి వెలుగు కార్యక్రమం ద్వారా విద్యార్ధులకు పరీక్షలు చేస్తున్నాం ♦వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం ♦గతంలో మసకబారిన ఆరోగ్యశ్రీకి కొత్త వెలుగులు తీసుకొచ్చాం. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం. ♦బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా.. సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాం ♦రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 1088 వాహనాలను ఒకేసారి 108, 104 సేవల కోసం పంపాం ♦ఆపరేషన్ అయిన రోగులకు రూ.5వేలు ఆరోగ్య ఆసరా అందిస్తున్నాం ♦దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10వేల పింఛన్ అందిస్తున్నాం ♦కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి నిర్ణయాలు తీసుకున్నాం ♦జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తాం ♦2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం ♦ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్ట్.. రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్ట్‌ల పనులు మొదలుపెట్టబోతున్నాం ♦ఈ ఏడాదిలో వంశధార ఫేజ్-2, వంశధార-నాగావళి అనుసంధానం.. వెలిగొండ ఫేజ్-1, అవుకు టన్నెల్ -2, సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజీల్ని పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాం ♦రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో.. రాజీ లేదని ఆచరణ ద్వారా చూపిస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
షహీన్‌బాగ్‌లో జెండా ఎగురవేసిన బామ్మలు
న్యూఢిల్లీ: గత నెల రోజులుగా జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)లపై నిరసనలు తెలుపుతున్న బామ్మలు సహా 1,000 మంది ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో ఆదివారం జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యూనివర్సిటీలో చదువుతూ ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధికా వేముల, గుజరాత్‌కు చెందిన ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీలు కూడా పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు జాతీయ గీతాన్ని ఆలపించారు. బామ్మల్లో శర్వారి (75), బిల్కిస్ (82), ఆస్మా ఖాటూన్ (90)లు ఉన్నారు. తమ గోడును పట్టించుకోని ప్రధాని తమకెందుకని ప్రశ్నించారు. -
కనుల పండువ... స్వాతంత్య్ర వేడుక...
జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వీధి వీధినా... స్వాతంత్య్రవేడుకలు అత్యంత ఉత్సాహవంతంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ మైదానంలో కనుల పండువగా సాగిన ఉత్సవంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పతాకావిష్కరణ గావించారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు... నాయకులు హాజరైన ఈ ఉత్సవంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రగతిని తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాలు అలరించాయి. విజయనగరం గంటస్తంభం: జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో 73వ స్వాతంత్య్ర వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి ముఖ్య అతిథిగా జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసగించారు. ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కలెక్టర్ ఎం. హరి జవహర్లాల్, జిల్లా పోలీసు సూపరిండెంట్ రాజకుమారితో కలిసి సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసే శకటాలను తిలకించి, స్టాల్స్‌ను సందర్శించి పేదలకు ఆస్తులు పంపిణీ చేశారు. పతాకావిష్కరణతో ఉత్సవాలు ప్రారంభం.. పోలీసు పరేడ్ మైదానంలో ఉదయం 9గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం ఆమెకు పోలీసులు, ఇతర రక్షకభటులు గౌరవ వందనం చేశారు. అనంతరం శాంతికి సూచికగా పావురాలు ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం మూడు నెలల్లో చేసిన కార్యక్రమాలు, రానున్న ఏడాది కాలంలో చేపట్టే కార్యక్రమాల గురించి ఆమె సుదీర్ఘంగా ప్రసంగించారు. పనితీరుకు ప్రశంస.. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బంది, స్వచ్చంద సంస్థలకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన వారికి ఉప ముఖ్యమంత్రి వాటిని అందజేశారు. జిల్లాలో 87 శాఖలు, వివిధ విభాగాలకు చెందిన 430మంది ప్రశంసా పత్రాలు అందికున్నవారిలో ఉన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారంలో మంచి ప్రగతి కనపరిచిన వారికి, పారిశుద్ధ్య కార్యక్రమాలు బాగా చేసిన వారికి, వివిధ శాఖల్లో విధుల్లో మంచి పనితీరు కనపరిచిన వారికి ఈ ప్రశంస దక్కింది. అదరహో అనిపించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎనిమిది పాఠశాలలకు చెందిన పిల్లలు దేశభక్తి పెంపొందించే గీతాలకు నృత్య ప్రదర్శన చేశారు. ఎవరికి వారే పోటీ, ఎవరికి వారే సాటి అన్న రీతిలో సాగిన ప్రదర్శనలు ఆహూతులను అలరించా యి. భారత దేశ సంస్కృతీ, సంప్రదాయాలు, స్వా తంత్య్ర సమరయోధుల పోరాటం, దేశ గొప్పతనం, ప్రజాస్వామ్యం విశిష్టత చాటిచెబుతూ రచించిన గే యాలకు విద్యార్థులు చూడ ముచ్చటగా నృత్యాలను ప్రదర్శించడం విశేషం. ముందుగా వివిధ పాఠశాల విద్యార్థుల మాస్ డ్రిల్‌తో కార్యక్రమం మొదలైంది. తర్వాత విజయనగరం గరŠల్స్ హైస్కూల్ విద్యార్థినులు వందేమాతరం గేయానికి స్థానికంగా ప్రాచుర్యం పొందిన కర్ర, కత్తి సాములు జోడించి ప్రదర్శన ఇచ్చారు. ఫోర్ట్ సిటీ విద్యార్థులు ఐ యామ్ ఇండియన్ గేయానికి, కేజీబీవీ విద్యార్థినులు ఒకే ఒక్క ఓంకారం అన్న గీతానికి, సెయింట్ మేరీస్ విద్యార్థులు దేశభక్తి గీతానికి, ద్వారకా తిరుమల అంధుల పాఠశాల విద్యార్థులు మేరా భారత్, జిల్లా పోలీసు వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులు మేమే ఇండియన్స్, కొత్తవలస ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు పుణ్యభూమి ఈ భరతదేశం, బాడంగి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇండియా వాలా గేయాలకు నృత్య ప్రదర్శన అందించారు. ఇందులో ద్వారకామయి అంధుల పాఠశాల విద్యార్థులు, ఏపీ మోడ ల్ స్కూల్ విద్యార్థులు, కేజీబీవీ విద్యార్థుల ప్రదర్శనలకు వరుసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. బాడంగి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రత్యేక బహుమతి గెల్చుకున్నారు. రూ.336.86కోట్ల ఆస్తులు పంపిణీ.. ఉత్సవంలో భాగంగా పేదలకు రుణాలు, ఆస్తులు పంపిణీ చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, కలెక్టర్ హరి జవహర్లాల్, ఎస్పీ రాజకుమారి తదితరులు వాటిని అందజేశారు. మైదానంలో మొత్తం 18శాఖలు తమ ప్రగతిని, పథకాలను తెలియజేస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఇందులో ఆరుశాఖలు పేదల కు రూ.336.85కోట్ల ఆస్తులు, రుణాలు పంపిణీ చేశా యి. డీఆర్డీఏ–వెలుగు అధికారులు 8642 సంఘాల కు రూ.298.55కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, 4087 మందికి రూ.19.47కోట్ల స్త్రీనిధి రుణాలు అందజేశారు. వైఎస్సార్ బీమా కింద 456 మందికి రూ.8.36కోట్లు సాయం అందజేశారు.252 రైతు సంఘాలకు రూ.1.26 కోట్లు రుణాలు ఇప్పించారు. విభిన్న ప్రతిభావంతులశాఖ ద్వారా 8మందికి రూ.50వేలు వంతున, బీసీ కార్పొరేషన్ ద్వారా 34మందికి రూ.41.04కోట్లు, కెనరాబ్యాంకు, డీసీసీబీ 9మందికి రూ.15లక్షలు, డీపీవో ద్వారా 2289మందికి రూ.4.65కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 68మందికి రూ.2కోట్లు విలువ గల ఆస్తులు, రుణాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విజయనగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఇన్చార్జి జేసీ–2 సాల్మన్‌రాజ్, డీఆర్వో జె.వెంకటరావు, విజయనగరం ఆర్డీవో జె.వి.మురళి, ఇతర అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మజ్జిశ్రీనివాసరావు, పెనుమత్స సురేష్‌బాబు, సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. -
షూ తీయకుండానే జెండా ఎగురవేశారు
సాక్షి, చెన్నారావుపేట(వరంగల్) : భారత దేశంలో ఉండే ప్రతి ఒక్కరు జాతీయ జెండాను గౌరవించాల్సిందే.. ఓ దేవాలయానికి వెళితే దేవును ముందు చెప్పులు దూరంగా విడిచి మొక్కులు చెల్లించడం, పూజలు చేయడం జరుగుతుంది. అలాంటి దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంలో అన్ని మాతాలు గౌరవించే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కొబ్బరికాయ కొట్టే సమయంలో ఏఎస్సై సాంబరెడ్డి వేసుకున్న షూ తీయకుండానే జాతీయ జెండాను అవమానించారు. పైగా అక్కడ ఉన్న పలువురు షూ తీయాలని చెప్పిన ఏమి కాదులే అని అమర్యాదగా మాట్లాడం పలువురిని విస్మయానికి గురిచేసింది. -
కేంద్రం వద్ద జడ్జీల పెంపు ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంపుదల చేయాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ వెల్లడించారు. దీనిపై కేంద్రం త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీతోపాటు 24 నుంచి 42 మందికి సంఖ్య పెంపు ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు.. స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని గురు వారం హైకోర్టు ప్రధాన భవనం వద్ద సీజే జెండా ఎగుర వేసి.. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవం, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించడంలో ఎందరో మహనీయుల త్యాగాలున్నాయన్నారు. హైకోర్టు లో సాంకేతికతను పుణికిపుచ్చుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, హైకోర్టును పేపర్‌లెస్ చేయబోతున్నట్లు తెలిపారు. తీర్పు వెలువడిన ఒకట్రెండు రోజుల్లో తీర్పుల ప్రతులు ఆన్లైన్లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అందరికీ న్యాయ ఫలాలు అందించడంలో కోర్టుల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్య క్షుడు సూర్యకరణ్‌రెడ్డి మాట్లాడారు. పలువురు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన హైకోర్టు ఉద్యోగుల పిల్లలకు సీజే బహుమతులు ప్రదానం చేశారు. -
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
-
జాతీయ జెండాకు అవమానం
గార్ల(ఇల్లందు) : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎగురవేసిన జాతీయ జెండాను అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు అవనతం చేయకుండా అవమానించారు. ఈ సంఘటన గార్ల మండలం మర్రిగూడెం పంచాయతీ కార్యాలయంలో వెలుగుచూసింది. జీపీ స్పెషలాఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ రమేష్ ఆగస్టు 15న జెండా ఎగురవేసి అవతనం చేయకుండా ఉంచారు. కాగా సంబంధిత అధికారులు విచారణ జరిపి జాతీయజెండాను అవమానపర్చిన అధికారులను సస్పెండ్ చేయాలని గ్రామస్తుడు అశోక్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పెషలాఫీసర్ రమేష్‌ను సాక్షి వివరణ కోరగా జాతీయజెండాను అదే రోజు సాయంత్రం అవనతం చేయాలని పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్‌కు తెలిపానని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన చోటుచేసుకుందని తహసీల్దార్ పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శికి విషయం తెలపడంతో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతం లో జెండాను అవనతం చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. -
ఎర్రకోటపై జాతీయజెండాను ఎగురవేసిన మోదీ
-
అల్లూరి విప్లవ గడ్డపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన జగన్
-
శ్రీకాకుళం: జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
-
అమిత్ షా జెండా వందనంలో అపశృతి
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తడబడ్డారు. దేశరాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో షా జెండా ఆవిష్కరిస్తుండగా.. జాతీయ పతాకం ఒక్కసారిగా నేలపై పడిపోయింది. దీంతో వెంటనే తేరుకున్న షా.. జెండా తాడును వేగంగా లాగి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. జెండా ఆవిష్కరణ అనంతరం షా జాతీయ జెండాకు కాకుండా మరోవైపు తిరిగి సెల్యూట్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. జాతీయ పతాకం కిందకు పడిపోవడంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ‘జాతీయ జెండాను సరిగ్గా ఆవిష్కరించలేని వాళ్లు దేశాన్ని ఏం పాలిస్తారు? గత 50 ఏళ్లుగా జాతీయ జెండాను గుర్తించడానికి వారు తిరస్కరించి ఉండకపోతే.. ఇవాళ జాతీయ పతాకం ఇలా నేలపై పడిపోయేదే కాదు’ అని ట్వీట్ చేసింది. భారత మాత తన విచారాన్ని జెండా ద్వారా ప్రకటించిందని ఆప్ ట్వీట్ చేసింది. -
ఉభయ రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుండాలి
-
‘పెన్షన్ రెట్టింపు చేస్తాం’
సాక్షి, హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది.. దేశాన్ని అభివృద్ధి చేసింది.. 60 ఏళ్ల తెలంగాణ కల నిజం చేసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 72 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన గాంధీభవన్‌లో జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వల్లే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తు చేశారు. 60 ఏళ్ల తెలంగాణ కలను నిజం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్, కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రజస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెప్పి ప్రజస్వామ్యాన్ని రక్షించాలని కోరారు. తెలంగాణ శాసన సభ స్పీకర్ ఇద్దరు ఎమ్మెల్యేల శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టిందన్నారు. కానీ స్పీకర్ మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. అప్పుడు మళ్ళీ హై కోర్టే జోక్యం చేసుకోని స్పీకర్‌కు నోటీస్‌లు ఇచ్చిందన్నారు. అంతేకాక వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఇస్తున్న 1000 రూపాయల పెన్షన్‌ను 2000 రూపాయలకు.. 1500 రూపాయల పెన్షన్‌ను 3000 రూపాయలకు పెంచుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క రెడ్డి, ఇంచార్జి కుంతియా పాల్గొన్నారు. -
ఎర్రకోటపై జెండా ఆవిష్కరించిన ప్రధాని
-
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని
-
వివాదస్పదంగా మారిన జెండా వందనం
-
పతాకధారిగా పీవీ సింధు
న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అరుదైన గౌరవం లభించింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ఆమె భారత బృందానికి పతాకధారిగా (ఫ్లాగ్ బేరర్) వ్యవహరించనుంది. ఏప్రిల్ 4న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సింధు త్రివర్ణ పతాకం చేతబూని భారత క్రీడాకారులను ముందుకు నడిపించనుందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) శనివారం ప్రకటించింది. భారత్‌కే చెందిన మరో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చినా... 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన 22 ఏళ్ల సింధువైపే ఐఓఏ మొగ్గు చూపింది. గత మూడు కామన్వెల్త్ గేమ్స్‌లో షూటర్లే భారత బృందాలకు పతాకధారులగా వ్యవహరించడం గమనా ర్హం. 2006 మెల్బోర్న్ గేమ్స్‌లో రాజ్యవర్ధన్ రాథోడ్... 2010 ఢిల్లీ గేమ్స్‌లో అభినవ్ బింద్రా... 2014 గ్లాస్గో గేమ్స్‌లో విజయ్ కుమార్ ఫ్లాగ్ బేరర్లుగా పాల్గొన్నారు. -
ఇందిరాగాంధీ స్టేడియంలో జెండా ఎగురవేసిన గవర్నర్
-
ముందుగా రాష్ట్రంలో గవర్నర్ జెండావిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తొలుత తెలంగాణలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించనున్నారు. అనం తరం ఆయన ఏపీలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు విజయ వాడకు బయలుదేరనున్నారు. ముందు సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొని ఉదయం 9.15 గంటలకు జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడకు బయలుదేరుతారని అధికార వర్గాలు తెలిపాయి. -
వేంపల్లి క్రాస్ రోడ్డు వద్ద జెండా ఆవిష్కరణ
-
జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్
నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నంద్యాలలో అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నంద్యాలలోని బొమ్మల సత్రంలో తాను విడిది చేసిన గృహానికి ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జగన్ ఉప ఎన్నికల ప్రచారానికి బయలుదేరడానికి ముందుగా జాతీయ జెండాను ఎగుర వేశారు. ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన అక్కడి నుంచి ప్రచారానికి బయల్దేరి వెళ్లారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసనసభలో పార్టీ ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ముఖ్య నేతలు కోలగట్ల వీరభద్రస్వామి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.పి.సారథి, నంద్యాల ఉపఎన్నికల్లో పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
కేఈ కృష్ణమూర్తికి మళ్లీ అవమానం!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మళ్లీ అవమానం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జెండా వందనం చేసే మంత్రుల జాబితాను సర్కార్ మంగళవారం విడుదల చేసింది. అయితే కేఈ కృష్ణమూర్తికి జెండా వందనం చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. అన్ని జిల్లాల్లోనూ ఇన్ఛార్జ్ మంత్రులే జెండా ఎగురవేస్తారంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కేఈ సొంత జిల్లా కర్నూలులో కాల్వ శ్రీనివాసులు జెండా వందనం చేయనున్నారు. ఇప్పటికే కేఈకి అన్ని అధికారాల్లోనూ చంద్రబాబు కోత పెట్టిన విషయం తెలిసిందే. కాగా జెండా ఎగురవేసే అవకాశాన్ని కేఈ కృష్ణమూర్తికి ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎంకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కేఈ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఏపీ కేబినెట్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఆయనకు అవమానాలు ఎదురు అవుతూనే ఉన్నాయి. కాగా ఇటీవల జరిగిన జిల్లాల ఇన్చార్జి మంత్రుల నియామకంలో కేఈకి చోటు దక్కలేదు. ఏ జిల్లాకూ ఇన్చార్జి మంత్రిగా ఆయనను నియమించలేదు. కేబినెట్లో అందరికంటే సీనియర్ అయినా కేఈ కృష్ణమూర్తిని చంద్రబాబు పక్కనపెట్టడం గమనార్హం. -
తిరుపతిలో పంద్రాగస్టు వేడుకలు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఆగస్టు 15న అధికారికంగా నిర్వహించే రాష్ట్ర స్థాయి జెండావిష్కరణ వేడుకలను తిరుపతిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తిరుపతిలోని తారకరామ స్టేడియాన్ని పరిశీలిస్తోంది. మంగళవారం తిరుపతి చేరుకున్న పోలీస్ వర్గాలు ఈ మేరకు మైదానం విస్తీర్ణం, గేట్లు, పార్కింగ్ స్థలంపై పరిశీలన జరిపాయి. రాష్ట్ర విభజన తరువాత ఏటా ఒక్కో నగరంలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటి వరకూ విజయవాడ, కర్నూలు, అనంతపురం నగరాల్లో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
‘పచ్చ’పాతంగా సైకిళ్ల పంపిణీ
- టీడీపీ జెండాలతో విద్యార్ధినీలతో ర్యాలీ పిఠాపురం మండలం విరవాడ జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ ‘పచ్చ’పాతంగా చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. స్థానిక పాఠశాల ఆవరణలో బుధవారం బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా 9వ తరగతి చదువుతున్న 65 మంది విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహానికి ఉపాధ్యాయులు తల ఊపడంతో పంపిణీ చేసిన సైకిళ్లకు తెలుగుదేశం పార్టీ జెండాలను కట్టారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని టీడీపీ కార్యక్రమంగా మార్చేసి విద్యార్థినులతో గ్రామంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేశారు. సైకిళ్ల పంపిణీ సమాచారం ఉపాధ్యాయులు తనకు తెలియజేయకపోవడంపై ఆ గ్రామ సర్పంచి బోయి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మానుకోవాలని, ప్రొటోకాల్ పాటించాలని హితవు పలికారు. ఈ విషయంపై పాఠశాల హెచ్.ఎం. నారాయణదాసును వివరణ కోరగా విద్యార్థినులకు అందజేసిన సైకిళ్లకు పార్టీ జెండాలు కట్ట వద్దని తాను వారించినా స్థానిక టీడీపీ నేతలు వినిపించుకోలేదన్నారు.- పిఠాపురం రూరల్ -
విమానయానరంగంలో భారీ అవకాశాలు
సిమ్లా: విమాన ప్రయాణాన్ని సామాన్య ప్రజలకూ అందుబాటులో కితీసుకొచ్చే ప్రణాళిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉడాన్ విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకంలో భాగంగా మొట్టమొదటి ‘ఉడాన్’ ప్రాంతీయ విమానాలను హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని ఇక విమాన ప్రయాణాలు కేవలం ధనికులకు మాత్రమే కాదు, పేదలకు కూడా అందుబాటులోకి వచ్చాయని వ్యాఖ్యానించారు. దేశీయ విమానయారంగం భారీ అవకాశాలతో నిండి ఉందని తెలిపారు. చండీగడ్ విమానాశ్రయంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పంజాబ్ గవర్నర్ వి.పి. బడ్నోర్ హర్యానా గవర్నర్ కెప్టెన్ సింగ్ సోలంకి, ఇతర ముఖ్య అధికారులు మోదీకి స్వాగతం పలికారు. సిమ్లా-ఢిల్లీ మార్గంతో సహా, కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్ మార్గాల్లోనూ ఉడాన్ విమాన సర్వీసులను మోదీ ప్రారంభించారు. ప్రపంచ విమానయాన రంగంలో ఈ తరహా పథకాన్ని ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. సిమ్లాలో ప్రధాని చారిత్రాత్మక రిడ్జ్ మైదాన్ లో ఒక ర్యాలీలో ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టిన అనంతరం సిమ్లాకు రావడం ఇదే మొట్టమొదటి సారి . ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 2003 లో హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో పర్యటించారు. కాగా గంట ప్రయాణానికి రూ.2,500 మాత్రమే వసూలు చేయాలనే ఉద్దేశంతోఅందుబాటులోకి తీసుకువస్తామని మోదీ సర్కార్ గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. Haryana Governor Kaptan Singh Solanki, Punjab Governor VP Badnore, CM @mlkhattar and other dignitaries welcomed PM to Chandigarh. pic.twitter.com/Uy5l5zFs2n — PMO India (@PMOIndia) April 27, 2017 -
నా సినిమా పాక్‌లో విడుదల చేయను
దంగల్ సినిమా చూశారా.. అందులో పతాక సన్నివేశం చాలా కీలకమైనది. ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ జరిగేటప్పుడు ఆమిర్‌ఖాన్‌ను ఒక కోచ్ గదిలో పెట్టి బంధిస్తాడు. దాంతో తన కూతురు అక్కడ ఎలా పెర్ఫామ్ చేస్తోందోనన్న ఆందోళనతో ఆమిర్ కలవరపడుతుంటాడు. అంతలో బౌట్ ముగిసిన తర్వాత భారత జాతీయగీతం వినిపిస్తుంది. కిటికీ లోంచి బయటకు చూస్తే త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ పైన కనిపిస్తుంది. దాంతో తన కూతురు స్వర్ణపతకం సాధించిందన్న విషయం ఆమిర్‌కు తెలుస్తుంది. ఇది చాలా ఉద్వేగభరితంగా ఉండే సీన్. అయితే ఇందులో భారత జాతీయగీతంతో పాటు త్రివర్ణ పతాకం కనిపిస్తుందన్న కారణంతో ఆ సీన్ కట్ చేస్తేనే పాకిస్తాన్లో విడుదల చేయనిస్తామని అక్కడి సెన్సార్ బోర్డు పట్టుబట్టింది. అందులో పాకిస్తాన్‌ను కించపరిచేలా ఎలాంటి సన్నివేశం లేదని, పైగా అది సినిమాకు అత్యంత కీలకమైన సన్నివేశం కాబట్టి దాన్ని తొలగించే ప్రసక్తి లేదని సినిమాకు నిర్మాత కూడా అయిన ఆమిర్ స్పష్టం చేశాడు. అంతేకాదు.. అసలు తన సినిమాను పాకిస్తాన్లో విడుదల చేసేదే లేదని చెప్పేశాడు. ఉడీ ఉగ్రదాడుల తర్వాత భారత్ - పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. దాంతో పాకిస్తాన్లో భారతీయ సినిమాలను విడుదల కానివ్వలేదు. అలాగే పాక్ నటులు భారతీయ సినిమాల్లో నటిస్తే వాటిని విడుదల కానిచ్చేది లేదని శివసేన, ఎంఎన్ఎస్లు పట్టుబట్టాయి. చివరకు కొన్నాళ్ల తర్వాత సమస్య పరిష్కారం కావడంతో ఇక్కడి సినిమాలు అక్కడ విడుదల కావడం మొదలైంది. అలాగే అక్కడి నటీనటులు ఇక్కడ సినిమాల్లో నటిస్తున్నారు. కానీ దంగల్ విషయంలో పాక్ సెన్సార్ బోర్డు ఈ సరికొత్త డిమాండ్ తీసుకురావడంతో ఆమీర్‌కు ఒళ్లు మండింది. సినిమాను అక్కడ విడుదల చేసేందుకు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉండి తమను సంప్రదిస్తున్నారని, కానీ ఆమిర్ మాత్రం సెన్సార్ బోర్డు నిర్ణయం తర్వాత అసలు సినిమాను పాక్‌లో విడుదల చేయడానికే ఇష్టపడటం లేదని ఆయన ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు. దంగల్ సినిమాకు ఇప్పటికే రూ. 385 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. పాక్‌లో విడుదల చేస్తే మహా అయితే మరో 10-12 కోట్లు వస్తాయని, అయినా ఇప్పటికే అక్కడ పైరసీ సీడీలు వచ్చేశాయని.. అందువల్ల ఇక అక్కడ విడుదల చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ప్రతినిధి తెలిపారు. -
నేడే యూపీ ఐదో దశ పోలింగ్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఐదో దశ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. 11 జిల్లాల పరిధిలోని 51 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎస్పీ అభ్యర్థి కనౌజియా మరణంతో ఆలంపూర్ స్థానంలో పోలింగ్ వచ్చేనెల 9న జరగనున్నది. సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు ఆదివారం ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాయి. మొత్తం 608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
పంట పొలాల్లో సర్వే జెండాలు
* బెదిరింపులకు పాల్పడుతున్న సీఆర్డీఏ అధికారులు * తొలగించాలని పట్టుబట్టిన రైతులు * చర్చలకు రావాలని కోరిన డిప్యూటీ కలెక్టర్ * ఎమ్మెల్యే ఆర్కేతో మాట్లాడాలని చెప్పిన అన్నదాతలు * చేసేదేంలేక జెండాలు తొలగించిన అధికారులు పెనుమాక (తాడేపల్లి రూరల్) : రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతుల పంటపొలాల్లో అనుమతి లేకుండా పెనుమాక సీఆర్డీఏ అధికారులు, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు సోమవారం సర్వే జెండాలు పాతారు. విషయం తెలుసుకున్న రైతులు పొలాల వద్దకు చేరుకుని అడ్డుకున్నారు. దాదాపుగా 15 ఎకరాల్లో పాతిన సర్వే జెండాలను సీఆర్డీఏ అధికారులే తొలగించాలని రైతులు పట్టుబట్టారు. సర్వేబృందం జెండాలు తొలగించకుండా సమాచారాన్ని పెనుమాక సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులకు తెలియజేశారు. చర్చలకు రావాలంటూ ఆయన రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. జాయింట్ కలెక్టర్ వస్తున్నారు.. ఆమె చూశాక జెండాలు తీసేస్తామని చెప్పినప్పటికీ రైతులు ఏమాత్రం ఒప్పుకోలేదు. పూలింగ్‌కు ఇవ్వలేదని మీ దగ్గర ఆధారాలున్నాయా.. డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ భూములను మీరు పూలింగ్‌కు ఇవ్వలేదని ఏమైనా ఆధారాలున్నాయా.. అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆగ్రహించిన రైతులు పచ్చని పంటపొలాల్లో, పూలింగ్‌కు ఇవ్వని భూముల్లో రోడ్లు వేయమంటూ ఏమైనా పత్రాలు ఉన్నాయా.. అంటూ చూపించాలని రైతులు నిలదీశారు. పెనుమాకలో రైతులందరూ కోర్టును ఆశ్రయించారని, దానికి సంబంధించిన సమాచారం స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వద్ద ఉందని, మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఆయనతోనే మాట్లాడాలని రైతులు తేల్చి చెప్పారు. జెండాలు తీయకుంటే మిమ్మలను ఇక్కడ నుంచి కదలనిచ్చేదిలేదంటూ రైతులు ఆగ్రహించారు. జేసీ వచ్చే వరకూ ఆగాలంటూ అధికారులు సూచించారు. రైతులు మీ ఇంట్లోకి వచ్చి మేం కూర్చుంటే మీరు ఊరుకుంటారా.. పచ్చని పంట పొలాల్లోకి వచ్చి ఇలా జెండాలు పాతి సర్వేలు చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. జెండాలు తొలగించకుంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుతో పాటు జెండాలు పాతిన వారిపై కోర్టును ఆశ్రయిస్తామంటూ రైతులు తేల్చి చెప్పారు. చివరకు చేసేదేంలేక పంటపొలాల్లో పాతిన సర్వే జెండాలను అధికారులు తొలగించారు. అధికారులూ.. దోషులు కావొద్దు : ఎమ్మెల్యే ఆర్కే అడ్డగోలుగా వ్యవహరించి రైతులను భయభ్రాంతులకు గురి చేయొద్దు.. అలా చేస్తే కోర్టులో మీరు దోషులుగా నిలబడాల్సి వస్తుంది.. అని ఎమ్మెల్యే ఆర్కే అధికారులను హెచ్చరించారు. బహుళ పంటలు పండే ఉండవల్లి, పెనుమాక భూముల్లో రైతులు పంటలు పండించుకోవచ్చని చెప్పారు. సమస్య కోర్టులో ఉండగానే రైతుల పంటపొలాలు నాశనం చేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండొచ్చు.. రేపు మరో ప్రభుత్వం రావొచ్చు. కానీ మీరు మాత్రం జీవితకాలం ప్రజలకు సేవలందిస్తూ ఉండాలి.. వారి అభిప్రాయానికి విరుద్ధంగా వెళ్లొద్దని అధికారులకు ఆయన సూచించారు. -
సరిహద్దుల్లో మీకు స్మశానం నిర్మిస్తాం: బాలకృష్ణ
విశాఖపట్నం: ఒకేసారి వంద థియేటర్లలో గౌతమీపుత్ర శాతకర్ణి పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. విశాఖలోని స్థానిక జ్యోతి థియటర్లో చిత్ర హీరో బాలకృష్ణ పాల్గొని శాతకర్ణి పతాకాన్ని ఆవిష్కరించారు. చిత్రంలోని పలు డైలాగ్‌లను చెప్పి అభిమానుల్ని అలరించారు. 'ఇక్కడ మా ఇంట్లో గదికి గదికి మధ్య గోడలుంటాయి, గొడవలుంటాయి. ఇది మా ఇల్లంటే మా ఇల్లని కొట్టుకుంటాం. కానీ మధ్యలో ఇంకొకడొచ్చి వచ్చి ఇది మా ఇల్లంటే ఎగరేసి నరుకుతాం. సరిహద్దుల్లో మీకు స్మశానం నిర్మిస్తాం, మొండాల మీద మా జెండాని ఎగరేస్తాం' అంటూ ఆవేశంగా డైలాగ్ చెప్పారు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన డైలాగులు మీరు సినిమాలో చూడొచ్చన్నారు. సమయం లేదు మిత్రమా 12న చిత్రం విడుదల కాబోతుందని చెబుతూ బాలకృష్ణ తన ప్రసంగాన్ని ముగించారు. -
ఆంధ్రారోమ్‌లో క్రిస్మస్ జెండా పండుగ
* క్రీస్తు జయంతి వేడుకలకు చిహ్నంగా జెండా ఆవిష్కరణ * హాజరైన విజయవాడ బిషప్ రాజారావు ఫిరంగిపురం: క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని విజయవాడ వేత్రాసన పీఠాధిపతి (బిషప్) తెలగతోటి జోసఫ్ రాజారావు చెప్పారు. ఆంధ్రారోమ్‌గా ప్రసిద్ధి చెందుతున్న ఫిరంగిపురంలోని బాలయేసు దేవాలయంలో క్రీస్తు జయంతి వేడుకల చిహ్నంగా ఆదివారం జెండా ప్రతిష్ట మహోత్సం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బిషఫ్ రాజారావు మాట్లాడుతూ ప్రేమ ,కరుణ, దయ గుణాలతో తోటి వారిని ఆదుకుంటూ క్రీస్తు బోధనలను పాటిస్తూ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. జెండాను ఆశీర్వదించి దివ్యపూజాబలి సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మోషే ప్రవక్త, పునీత అంతోని, పునీత ఇన్యాసి, పునీత చిన్నతేరేజమ్మ విగ్రహాలను బిషఫ్‌తోపాటు ఫాదర్ యువారి అంతోని, ఫాదర్ బెల్లంకొండ జయరాజ్ ఆశీర్వదించారు. కార్యక్రమంలో సహాయ విచారణ గురువులు ఫాదర్ బత్తినేని విద్యాసాగర్, మల్లవరపు బాలశౌరి, స్థానిక క్రైస్తవులు, మత పెద్దలు, కన్యాస్త్రీలు, తదితరులు పాల్గొన్నారు. 15 నుంచి నవదిన ప్రార్థనలు... క్రీస్తు జయంతి మహోత్సవ నవదిన ప్రార్థనలు ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతాయని ఫాదర్ బెల్లంకొండ జయరాజు చెప్పారు. 15న తెనాలి రెక్టర్ ఫాదర్ అల్లం చిన్నపరెడ్డి, 16న ఫాదర్ గాదె రాజశేఖర్, 17న ఫాదర్ మంటి మరియదాసు, 18న ఫాదర్ నెట్టెం రాజేష్‌కుమార్, 19న ఫాదర్ సంగాబత్తుని సుధాకర్, 20న ఫాదర్ మేకల ఆనంద్, 21న ఫాదర్ కొమ్మతోటి అమృతరాజు, 22న ఫాదర్ పత్తి చిన్నారావు, 23న ఫాదర్ కుప్పాల ప్రకాష్ పూజలు నిర్వహిస్తారన్నారు. -
‘పంచాయతీ’కి రాజకీయ రంగు
చంద్రంపాలెం (సామర్లకోట) : గ్రామ పరిపాలనను అపహాస్యం చేసేలా అధికార పార్టీ వ్యవహరించడంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. జనచైతన్య యాత్రల పేరిట చంద్రంపాలెం గ్రామంలో పంచాయతీ కార్యాలయాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ జెండాలతో ముంచెత్తడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఈ యాత్రలను మంగళవారం ఇక్కడ ప్రారంభించారు. ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావుతో పాటు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జేసీ ఎస్.సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఈ విషయమై కలెక్టర్‌కు, డీపీఓకు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్ సీపీ నాయకులు మండపాక దొరబాబు, తేజ తెలిపారు. -
బెంగళూరు ప్రశాంతం
కర్ఫ్యూ తొలగింపు - 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు కొనసాగుతాయన్న ప్రభుత్వం - పోలీసుల అదుపులో 350 మంది.. రేపు తమిళనాడు బంద్ సాక్షి, బెంగళూరు: తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై హింస చెలరేగిన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో బుధవారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. 16 పోలీస్ స్టేషన్ల పరిధిలో విధించిన కర్ఫ్యూను బుధవారం ఉదయం 9 గంటలకు ఎత్తివేశారు. అంతకుముందు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్ సున్నిత ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షించి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినట్లు అంచనా వేసి కర్ఫ్యూను ఎత్తివేశారు. అయితే.. ముందుజాగ్రత్తగా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పరమేశ్వర చెప్పారు. హింసకు సంబంధించి 350 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. బీఎంటీసీ బస్సులు, ట్యాక్సీలు, మెట్రో సర్వీసులు పూర్తిస్థాయిలో పునఃప్రారంభం కావడంతో పాటు వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలను తెరవడంతో బెంగళూరులో జనజీవనం మామూలు స్థితికి చేరుకుంది. అన్ని ఐటీ, బీపీఓ కంపెనీల్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పొరుగు రాష్ట్రం తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయటంపై కర్ణాటకలో కొనసాగుతున్న ఆందోళనలు.. ఈ నెల 12న హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. మండ్యాలో తమిళుల నిరసన... కావేరి జలాల విడుదలపై ఆందోళనలకు కేంద్ర బిందువైన మండ్య నగరంలో.. సుప్రీంకోర్టు ఆదేశాలను నిరసిస్తూ తమిళులు ఖాళీ బిందెలతో ప్రదర్శన నిర్వహించారు. తమిళనాడుకు కావేరి నీటి విడుదలను నిరసిస్తూ గురువారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ రైలోరోకోలకు కన్నడచళువళి వాటాల్ పార్టీతో పాటు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. మరోపక్క.. తమిళనాడులోని పలు వాణిజ్య, రైతు సంఘాలు ఈ నెల 16వ తేదీన (శుక్రవారం) తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు.. డీఎంకే ఇతర ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. సుప్రీంను ఒప్పించేందుకు యత్నిస్తాం కావేరి జలాల విషయంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై, కావేరి బేసిన్లో ప్రజలు నీటి కోసం పడుతున్న కష్టాలపై సుప్రీంకోర్టును ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడుకు నీటి విడుదలకు సంబంధించిన కేసు ఈ నెల 20న విచారణకు వచ్చినపుడు.. కావేరి బేసిన్లో నీటి సమస్య ఎదుర్కొంటున్నామని, తాగు అవసరాలకు మాత్రమే నీరు మిగిలివుందని వివరిస్తామని జలవనరుల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్ చెప్పారు. తమిళనాడు, కర్ణాటకల్లో శాంతిభద్రతలను నెలకొల్పేలా ఆ రెండు రాష్ట్రాలకు, కేంద్రానికి నిర్దేశించాలంటూ సుప్రీంకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. -
జాతిని ఏకంచేసేది తిరంగా జెండానే..
నాంపల్లి: జాతిని ఏకం చేసేది తిరంగా జెండా ఒక్కటేనని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో జై జవాన్ తిరంగా ఉత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి మాట్లాడుతూ.. వీర జవాన్, జాతీయ జెండాను చూస్తే ఏ ఒక్కరిలో కులం, మతం, వర్గం, ప్రాంతం అనే బేధాభిప్రాయాలు రావని గుర్తు చేశారు. దేశ భద్రత, సమగ్రత, సమైక్యతకు ప్రధాని నరేంద్ర మోదీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. యుద్ధం లో గెలవలేని పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని విమర్శించారు. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో స్నేహంగా ఉండేందుకు చర్చలు జరిపి అదుపులోకి తేవాలని భారత్ ఆలోచిస్తోందన్నారు. కార్గిల్ యుద్ధంలో మరణించిన పద్మఫణి చార్య కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్రంతో మాట్లాడి ప్లాట్‌ను ఇప్పిస్తామని చెప్పారు. మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... దేశ ప్రధాని చేపట్టిన జై జవాన్ తిరంగా ఉత్సవ్‌ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పేర్కొన్నారు. అనంతరం పలువురు వీర జవాన్ల కుటుంబ సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో ఎయిర్ వే మేజర్ ప్రకాష్ రావు, మేజర్ జనరల్ గోర్తి, మేజర్ ప్రభాకర్‌రెడ్డి, కల్నల్ రవి చౌదరి, గుప్తా, కాశీ తదితరులు పాల్గొన్నారు. -
నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వే లైన్ ప్రారంభించిన ప్రభు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. రైలుమార్గం ద్వారా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాయలసీమను కలుపుతున్నామన్నారు. మంగళవారం డీఆర్ఎమ్ కార్యాలయంలో కేంద్రమంత్రి సురేష్ ప్రభు... నంద్యాల - ఎర్రగుంట్ల 123 కిలోమీటర్ల రైలుమార్గాన్ని రిమోట్ ద్వారా ప్రారంభించారు. అలాగే నంద్యాల - కడపకు డిమో రైలును సురేష్ ప్రభు, చంద్రబాబుతోపాటు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. నంద్యాల - ఎర్రగుంట్ల మార్గం ద్వారా విజయవాడకు నేరుగా రైలు మార్గం ఏర్పడింది. ఈ రైలు మార్గం నిర్మాణానికి రూ. 967 కోట్లు వ్యయం అయింది. -
దళితులపై దాడులు అమానుషం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో దళితులపై దాడులకు దిగడం అమానుషమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో సోమవారం జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించారని గుర్తుచేశారు. దళితులపై దాడులు దేశానికి మాయనిమచ్చ అని అన్నారు. ఇది దేశంలో అభద్రతా పరిస్థితులను పెంచుతుందని హెచ్చరించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ఉత్తమ్ అన్నారు. జేఏసీ కార్యాలయంలో... స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జేఏసీ కార్యాలయంలో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ప్రహ్లాద్, పిట్టల రవీందర్, ముఖ్యనేతలు పాల్గొన్నారు. -
గోల్కొండ కోటలో ఘనంగా పంద్రాగస్టు
సాక్షి, హైదరాబాద్: కోట గోడ మీద సైనికుల పహారా.. పక్కనే స్వాగత ద్వారంపై భేరీలు, నగారాలు మోగిస్తూ జయజయధ్వానాలు.. సంప్రదాయ వాద్య, సంగీత, నృత్య విన్యాసాలు.. చిందు యక్షగాన మాధుర్యం.. ఒగ్గుడోలు లయబద్ధ శబ్ద విన్యాసం.. వీటన్నింటికీ సొగసులద్దుతున్నట్టుగా లంబాడీ యువతుల నృత్యాలు.. మేమేమీ తీసిపోమన్నట్టు యువకుల గుస్సాడీ నృత్యాలు.. ఆ పక్కనే కొమ్ముబూరల పలకరింపు.. హైదరాబాదీ ప్రత్యేక మార్ఫీ ఉల్లాసం.. రాజన్న డోలు, డప్పుల శబ్దాలు.. ఆ ఊపును మరింత పెంచే షేరీబాజా బృందం.. ఖవ్వాలీ సంగీతం.. ముజ్రా నృత్యం... ఇదీ గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకల దృశ్యం. 70వ స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలు అలరించాయి. అమర జవాన్లకు నివాళులర్పించి.. తొలుత సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ మైదానం వద్ద ఉన్న అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఉదయం పది గంటల సమయంలో గోల్కొండ కోటకు చేరుకున్నారు. పోలీసు సమ్మాన్ గార్డ్స్ స్వాగతిస్తుండగా కోటలోకి వచ్చారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించి, పోలీసు వందనం స్వీకరిం చారు. హరితహారం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వారికి హరితమిత్ర పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్రపతి పోలీసు పతకాలు సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందికి మెడల్స్ ప్రదానం చేశారు. స్థలాభావం.. అంతా హడావుడి.. స్వాతంత్య్ర దినోత్సవం అనగానే పోలీసు వందనం, వివిధ విభాగాల పోలీసులు, ఎన్సీసీ సిబ్బంది కవాతు, ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, చిన్నారుల నృత్య విన్యాసాలు ఉంటాయి. వాటిని వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించినప్పుడు ఆ సందడి కనిపించేది. కానీ గోల్కొండ కోటలో దిగువన రాణీమహల్ వద్ద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్కడ సరిపడినంత స్థలం లేక పోలీసు కవాతు, శకటాలు, నృత్యాలకు అవకాశం లేకుండా పోయింది. సోమవారం వందల మంది కళాకారులు ప్రదర్శించిన సంగీత, నృత్య విన్యాసాలు ఆకట్టుకున్నా... వాటికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. సీఎం కేసీఆర్ కోట వద్దకు కొద్ది సేపట్లో చేరుకుంటారనగా కళాకారులకు అవకాశమిచ్చారు. కానీ రెండు, మూడు నిమిషాల్లోనే ముగించాలనడంతో వారంతా ఉసూరుమన్నారు. తమ విన్యాసాల్లో మునిగిపోయిన కళాకారులకు ‘చాలు.. ఇక ఆపండి’ అని పలుమార్లు సూచించడంతో.. సందర్శకులు విస్మ యం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల చిన్నారులు ప్రత్యేక విన్యాసాలకు సిద్ధమైనా.. ప్రదర్శించే అవకాశం లేకపోవటంతో సీఎం ప్రసంగానికి చప్పట్లు కొట్టడానికే పరిమితమయ్యారు. ప్రసంగం అనంతరం అర నిమిషం పాటు అలల తరహాలో విన్యాసంతో ఆకట్టుకున్నారు. స్థలంలేక సాధారణ సందర్శకులను లోనికి అనుమతించకపోవడంతో కోటకు దూరంగానే ఉండిపోయారు. వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, వారి కుటుంబసభ్యులు, అమెరికా, ఇరాన్ ఎంబసీల ప్రతినిధులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలు వీరే.. హరిత మిత్ర పురస్కారాలు అందుకున్నవారు.. నిజామాబాద్ కలెక్టర్ యోగితారాణా, నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం గిద్ద జెడ్పీ పాఠశాల, సిద్దిపేట పురపాలక సంఘం, ఆర్మూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ, గ్రామీణాభివృద్ది శాఖ జాయింట్ కమిషనర్, హయత్‌నగర్ డిస్పెన్సరీ అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ వంశీకృష్ణారెడ్డి, మెదక్ గ్రామీణ నీటి పారుదల విభాగం ఎస్ఈ విజయ్‌ప్రకాశ్. రాష్ట్రపతి పురస్కారం పొందిన సూక్ష్మ కళాఖండాల నిపుణుడు మారుతికి ప్రశంసా పత్రం అందజేశారు. పోలీసు సేవాపతకాలు పొందినవారు రవి గుప్తా (ఐపీఎస్), నవీన్ చంద్ (ఐపీఎస్), గోవింద్ సింగ్ (ఐపీఎస్), వై.గంగాధర్ (ఐపీఎస్), నాగరాజు (అదనపు డీసీపీ), అనూప్ కుమార్‌మిశ్రా (డీఎస్పీ), ఆర్.వెంకటయ్య (గ్రేహౌండ్స్ అసిస్టెంట్ కమాండర్), బి.జనార్దన్ (డీఎస్పీ), నారాయణ (ఏసీపీ), డి.రామ్‌గోపాల్ (ఇన్స్పెక్టర్), ఎండీ గౌస్ (ఆర్ఎస్ఐ-పీటీసీ), తిరుపతిరెడ్డి (ఏఎస్సై), లక్ష్మారెడ్డి (హెడ్‌కానిస్టేబుల్), వెంకటేశ్వరరావు (హెడ్‌కానిస్టేబుల్), లునావత్ గోపి (కానిస్టేబుల్), ఐలమల్లు (ఫైర్‌మ్యాన్), ఎంఏ రవూఫ్ (డ్రైవర్ ఫైర్ ఆపరేటర్) -
దళితులపై దాడులు కొనసాగుతుంటే స్వాతంత్ర్యం వచ్చినట్లా?
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆవేదన ≈ సీఎం చంద్రబాబుకు అమలాపురం వెళ్లాల్సిన బాధ్యత లేదా? ≈ పదో తరగతి పిల్లాడిని కూడా కట్టేసి తీవ్రంగా కొట్టారు ≈ హామీలతో ఓట్లు వేయించుకుని ఆ తర్వాత మోసం చేస్తున్నారు.. ≈ రాజ్యాంగాన్నే కాలరాస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు ≈ వ్యవస్థలో మార్పు కోసం అందరం కలసికట్టుగా పోరాడాలి ≈ వైఎస్సార్సీపీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్ సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రం సిద్ధించిన డెబ్బై ఏళ్ల తర్వాత కూడా దళితులపై దౌర్జన్యాలు, దాడులు జరుగుతూ ఉంటే స్వాతంత్య్రం వచ్చిందనే అనుకోవాలా? అని ఈ దేశ పౌరులుగా అందరూ తమ గుండెలపై చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. డెబ్బై ఏళ్లవుతున్నా దేశంలోనూ, రాష్ట్రంలోనూ స్వాతంత్య్రం లేని పరిస్థితులే నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అంతకుముందు మహాత్మాగాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు నివాళులర్పించారు. రిజర్వు దళం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో దళితులపై దాడిని ఆయన ప్రస్తావించారు. ‘దాడికి గురైన దళితులను పరామర్శించడానికి నేను తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లా. ఓ రైతు తన చనిపోయిన ఆవును తీసుకు వెళ్లండి అని కొందరు దళితులను కోరితే వారు ఆ ఆవును శ్మశానానికి తీసుకెళ్లి చర్మం తీసుకుంటుంటే దాడి చేశారు. దాడికి గురైనవారిలో పదో తరగతి చదివే ఒక పిల్లవాడు ఉన్నాడు. పిల్లాడని చూడకుండా నిర్దాక్షిణ్యంగా 300 మీటర్లకు పైగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కట్టేసి చెప్పులతో కొట్టారు. ఇలాంటి సంఘటనలు ఇంకా చోటు చేసుకుంటూ ఉంటే మనకు స్వాతంత్య్రం వచ్చినట్లా?’ అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి భరోసా ఏదీ! ఇంత జరిగినా ముఖ్యమంత్రి రాజమండ్రికి వెళతారు గానీ, అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమలాపురానికి మాత్రం వెళ్లరని జగన్ విమర్శించారు. చంద్రబాబు అక్కడికి వెళ్లి ‘మీకు నేను తోడుగా ఉంటాను.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాను’ అని ఆ దళితులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆయన వెళ్లరు. అంటే స్వాతంత్య్ర దినోత్సవం రోజు మనం ఎలాంటి సం దేశం పంపుతున్నామో ఆలోచించండి అని జగన్ అన్నారు. దళితులను దళితులుగా చూసే పరిస్థితి లేకుండా పోతోందని, దళితుడు క్రైస్తవుడు అయినంత మాత్రాన ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వబోమని చెబుతు న్న దేశంలో మనం ఉన్నామంటే సిగ్గుతో తల వంచుకోవాలని అన్నా రు. దళితులు ఏ మతంలో ఉంటే ఏంటి? అని జగన్ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని వెటకారం చేస్తున్నారు ‘ప్రపంచంలోనే అతి గొప్పదని చెప్పుకుంటున్న మన రాజ్యాంగాన్ని వెట కారం చేస్తూ వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను రూ.20 కోట్లు, రూ.30 కోట్లు లంచాలుగా ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అడ్డగోలుగా సంపాదించిన నల్లధనంతో ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారంటే నిజంగా రాజ్యాంగం ఉందా? అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఒక ముఖ్యమంత్రి నల్లధనాన్ని సూట్‌కేసుల్లో తీసుకెళ్లి తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఆడియో, వీడియో టేపులతో సహా అడ్డంగా దొరికి పోయినా... ఆ ముఖ్యమంత్రి అరెస్టు కాకపోవడం అనేది బహుశా ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. కానీ మన దేశంలో ఇక్కడ జరుగుతోంది. ఇవన్నీ చూసినప్పుడే మనకు స్వాతంత్య్రం వచ్చిందా? లేదా? రాజ్యాంగం ఉందా ? లేదా? అని ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. ఈ వ్యవస్థ తీరును చూసి సిగ్గుతో తలదించుకోవాలి. బ్రిటిష్ వారు వెళ్లి పోయారు కదా స్వాతంత్య్రం వచ్చేసిందని అనుకోవద్దు. ఇవాళ్టికి కూడా పాలకుల నుంచి ప్రజలకు స్వాతంత్య్రం రాని పరిస్థితులే ఉన్నాయనే అంశాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి వ్యవస్థలో మార్పు కోసం మనమందరమూ కలసికట్టుగా ఒక్కటై పోరాడుదాం’ అని జగన్ పిలుపునిచ్చారు. పాలకులు తప్పు చేస్తే ప్రజలుగా గట్టిగా నిలదీస్తామని, మాకు (ప్రజలకు) మోసం చేయడం చేతకాదు కానీ మమ్మల్ని మోసం చేస్తే ఊరుకోబోమనే సందేశాన్ని కచ్చితంగా పంపిన రోజే మనకు నిజమైన స్వాతంత్య్రం వస్తుందని అన్నారు. దేశంలోని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అవ్వకూ,తాతకు, ప్రతి అక్కకు, చెల్లికి, అన్నా తమ్ముళ్లకు పేరు పేరునా జగన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఏపీ శాసనమండలిలో పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఇతర నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, వాసిరెడ్డి పద్మ, పుత్తా ప్రతాపరెడ్డి, ఎస్.దుర్గా ప్రసాదరాజు, పార్థసారథి, పేర్ని నాని, కరణం పద్మశ్రీ, బి.గురనాథరెడ్డి, కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, హెచ్.ఏ.రెహ్మాన్, మతీన్ ముజద్దీదీ, విజయచందర్ తదితరులు పాల్గొన్నారు. హామీలిచ్చి నెరవేర్చకుండా మోసం చేశారు ‘ఆనాడు అధికార పక్షం (కాంగ్రెస్), ప్రతిపక్షం (బీజేపీ) రెండూ కలసి రాష్ట్రాన్ని విభజించేటప్పుడు పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి, పని అయిపోయిన తరువాత ఇవ్వబోమని మోసం చేస్తున్న పరిస్థితులు చూస్తుంటే అసలు మనకు స్వాతంత్య్రం వచ్చిందా? అన్పిస్తోంది. ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఉన్నవారు, ఆ పదవుల కోసం రేసులో ఉన్నవారు ఎన్నికల ముందు ఏదైనా మాట ఇస్తే దాన్ని నెరవేర్చాలి. కానీ ప్రజల చేత ఓట్లు వేయించుకున్న తర్వాత ఇచ్చిన మాటను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయితే బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి తెప్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఉద్యోగాల హామీకి దిక్కు లేదు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఇక అక్కా చెల్లెమ్మలను కూడా మోసం చేశారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎగనామం పెట్టారు. మహిళల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి. అందరికీ ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేశారు. ఇన్నిన్ని మోసాలు చేయొచ్చు. ఇన్నిన్ని అబద్ధాలు చెప్పొచ్చు కానీ.. అడిగే అధికారం ప్రజలకు లేదని పాలకులు మాట్లాడుతూ ఉంటే నిజంగా మనం స్వాతంత్య్రంలో ఉన్నామా? అని అనిపిస్తోంది..’ అని ప్రతిపక్ష నేత పేర్కొన్నారు. -
జిల్లా అభివృద్ధికి కృషి
వృద్ధి రేటులో జిల్లాకు 4వ స్థానం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు(పొగతోట): జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, అందుకు ప్రతి ఒక్కరి సహకారం అందించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ పేర్కొన్నారు. సోమవారం 70వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి ప్రసంగించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వసతులు ఉన్నాయన్నారు. పరిశ్రమల స్థాపన విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జిల్లాలో 19 మెగా ప్రాజెక్టులు, 42 భారీ పరిశ్రమలు రూ.30,772 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 48 వేల మందికి ప్రత్యక్షంగా, 32 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. జిల్లాలో రూ.11,354 కోట్ల పెట్టుబడుతలతో 13 పరిశ్రమలు స్థాపనకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. కోట, చిల్లకూరు మండలాల్లో రూ.50 వేల పెట్టుబడులతో చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకానుందన్నారు. 2.30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వృద్ధి రేటు 10.99 శాతం ఉందన్నారు. జిల్లా వృద్ధి రేటు 12.20 శాతంతో నాల్గవ స్థానంలో ఉందని తెలిపారు. వ్యవసాయ రంగంలో గత ఏడాది 19.35 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. వర్షపాతం 43 శాతం తక్కువగా ఉందన్నారు. జిల్లాలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో తగినంత వర్షపాతం ఉన్నందున శ్రీశైలం జలాశయం నుంచి సోమశిల, కండలేరు జలాశయాలకు నీరు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. హర్టికల్చర్ పంటల సాగు అధికం చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇ–మార్కెటింగ్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. నిరుపేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా బ్యాంకుల ద్వారా రూ.751 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. రైతుల పొలాల్లో పంట సంజీవిని ద్వారా రూ.99 కోట్లతో 30 వేల నీటి కుంటలు నిర్మిస్తున్నామని తెలిపారు. రహదారుల అభివృద్ధి కోసం రూ 263 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి మంచినీటిని అందిస్తున్నామన్నారు. వచ్చే మార్చికి నెల్లూరు బ్యారేజి పనులు పూర్తి నెల్లూరు బ్యారేజి, బ్రిడ్జి, సంగం బ్యారేజ్ పనులు వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 20,700 ఎకరాలకు సాగునీరు అందించేలా రూ.53 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. నగరంలోని ప్రజలకు మంచినీటిని అందించడానికి రూ 556 కోట్లు ఖర్చుతో పనులు ప్రారంభమయ్యాయన్నారు. రూ.580 కోట్లతో భూగర్భడ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఎస్పీ విశాల్‌గున్నీ, జాయింట్ కలెక్టర్ ఎ.మహమ్మద్‌ఇంతియాజ్, ఇన్చార్జి డీఆర్ఓ మార్కండేయులు, జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జేసీ–2 రాజ్‌కుమార్, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జెండా వందనంలోనూ పచ్చపాతం
సాక్షి, రాజమహేంద్రవరం : సర్పంచులను కాదని ఎంపీటీసీలతో జెండాను ఎగురవేయాలన్న నిర్ణయం అమలులో జిల్లాలోని టీడీపీ నేతలు వివక్ష చూపించారు. పంచాయతీ సర్పంచులకు బదులుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రాథమిక పాఠశాలల్లో ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో జెడ్పీటీసీలు జెండా వందనం చేయాలని ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో మాత్రం ‘పచ్చ’పాతం చూపించింది. జిల్లాలో టీడీపీ ఎంపీటీసీలు ఉన్న చోట మాత్రం ప్రభుత్వ నిర్ణయం అమలుకాగా వైఎస్సార్సీపీ సభ్యులున్న దగ్గర పలుచోట్ల టీడీపీ సర్పంచులు, ఇతర నేతలు జాతీయ జెండా ఎగురవేశారు. దేవాలయాల్లాంటి పాఠశాలల్లో అధికార పక్ష సభ్యులు పిల్లల సాక్షిగా నిబంధనలను ఉల్లంఘిస్తూ విపక్ష సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సోమవారం 70వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని బలభద్రపురం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యురాలు జి.సత్యవతిని ఒక రోజు ముందుగానే ఉపాధ్యాయులు ఆహ్వానించారు. అయితే జెండా వందనం మాత్రం స్థానిక సర్పంచి సీహెచ్ వీరభద్రం చేశారు. దీనిపై ఎంపీటీసీ జి.సత్యవతి ఉపాధ్యాయులను నిలదీశారు. తాము మాత్రం ఏమి చేయగలమని నిస్సహాయత వ్యక్తం చేశారు. రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం పాఠశాలలో స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీటీసీ చలమల్ల వరలక్ష్మిని కాదని మండల కోఆప్షన్ సభ్యుడితో జెండా ఎగురవేయడానికి టీడీపీనేతలు ప్రయత్నించారు. చివరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాతీయ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ముగించారు. రాజానగరం మండలం జెడ్పీటీసీ అత్యుత్సాహం వల్ల పలు పాఠశాలల్లో స్వాతం త్య దినోత్సవ వేడుకలు మధ్యాహ్నం వర కు జరిగాయి. మండలంలో ఉన్న14 ఉన్నతపాఠశాలల్లో తానే జెండా ఎగుర వేయాలని నిర్ణయించుకున్న జెడ్పీటీసీ పల్లం రత్నం ఆమేరకు పాఠశాలలకు సమాచా రం పంపారు. ఫలితంగా జెడ్పీటీసీ వచ్చే వరకు ఎర్రటి ఎండలో పిల్లలు, ఉపాధ్యాయులు నిలబడాల్సి వచ్చింది. మొత్తం మీద 11చోట్ల జెండా వందనంలో పాల్గొ న్న ఆయన మరో మూడు చోట్ల మాత్రం టీడీపీ నేతలు జెండా ఆవిష్కరణ చేశారు. తుని నియోజకవర్గం తొండంగి మం డలం శృంగవృక్షం పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి స్థానిక ఎంపీటీసీ(వైఎస్సార్సీపీ)దార్ల లక్ష్మి హాజరయ్యారు. అయితే ఎంపీటీసీకి బదులుగా పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ జాతీయ జెండా ఎగురవేశారు. ఉపాధ్యాయుల తీరుపై దార్ల లక్ష్మి మండల విద్యాశాకాధికారికి ఫిర్యాదు చేశారు. -
ఎయిర్‌పోర్టులో భారీ జాతీయ పతాకం ఆవిష్కరణ
విమానాశ్రయం(గన్నవరం) : విమానాశ్రయంలో కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ భవన ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకాన్ని సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం ఆవిష్కరించారు. వంద అడుగుల ఎత్తు కలిగిన స్తంభంపై 30 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కలిగిన డే అండ్ నైట్ పతాకాన్ని ఆయన రిమోట్ బటన్ ద్వారా ఎగురవేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. పతాకం ప్రజల్లో జాతీయభావం, దేశభక్తిని పెంపొందించే విధంగా ఉందన్నారు. ముఖ్యంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య ఈ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం అందరికి గర్హకారణమన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు, విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, కలెక్టర్ బాబు.ఎ, విజయవాడ సీపీ గౌతమ్‌సవాంగ్, ఏఏఐ జీఎం ప్రభహరణ్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.మధుసూదనరావు పాల్గొన్నారు. -
టీఅర్ఎస్ భవన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-
తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్
-
నిజంగా మనకు స్వాతంత్ర్యం వచ్చిందా?
-
జాతీయ జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్.
-
జాతీయ జెండా ఆవిష్కరించిన వైఎస్ జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం లోటస్ పాండ్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నేతల సమక్షంలో ఆయన జెండాను ఎగురవేశారు. ఈ జెండా పండుగలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు స్వాతంత్ర్య పోరాటయోధుల చిత్రపటాలకు వైఎస్ జగన్ నివాళులర్పించారు. -
జెండా వందనంపై మంత్రుల్లో చిచ్చు!
విజయవాడ: దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే జెండా వందనం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో చిచ్చు రాజేసింది. సోమవారం నిర్వహించే జెండా వందనం విషయంలో తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదని సీనియర్ మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పంద్రాగస్టు సందర్భంగా ఆయా జిల్లా కేంద్రాల్లో జిల్లాకు చెందిన మంత్రులు జెండా ఆవిష్కరణ చేపడుతుంటారు. అయితే, ఈ విషయంలో జిల్లా మంత్రులను పట్టించుకోకపోవడం వారిలో అసంతృప్తిని రాజేస్తోంది. విశాఖపట్నంలో మంత్రి యనమల రామకృష్ణుడు జెండా ఎగురవేయబోతున్నారు. అయితే, ఇక్కడ తనకు అవకాశం ఇవ్వకపోవడంపై మంత్రి అయ్యన్నపాత్రుడు కినుక వహించినట్టు తెలుస్తోంది. ఇక ప్రకాశం జిల్లాలో ఉన్న ఏకైక మంత్రి సిద్ధా రాఘవరావుకు చివరినిమిషంలో అవకాశం కల్పించారు. మొదట ప్రకాశంలో జరిగే జెండావందనంలో మంత్రి రావెల కిషోర్‌బాబుకు అవకాశం కల్పించగా.. దీనిపై సిద్ధా రాఘవరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చివరినిమిషంలో ఆయనకు చాన్స్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారాయణ జెండావందనంలో పాల్గొంటారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో దళిత మంత్రి పీతల సుజాతకు అవకాశం దక్కలేదు. ఈ జిల్లాలో మంత్రి మణిక్యాల రావు జెండా ఎగురవేయబోతుండటంతో మంత్రి పీతల సుజాత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. -
జెండా వందనంపై మంత్రుల్లో చిచ్చు!
-
కువైట్ లో ఎగరనున్న భారత జెండా..
కువైట్ః భారత స్వాతంత్ర దినోత్సవానికి కువైట్ ఆహ్వానం పలికింది. ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో జరిగే వేడుకలకు ప్రజలంతా హాజరు కావాలని ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2016 ఆగస్టు 15న జెండా వందనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది. కువైట్ లో ఆగస్టు 15న భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది. 70వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో జెండా వందనం కార్యక్రమం నిర్వహించనుంది. ఈ వేడుకలకు కువైట్ లోని భారతీయులంతా హాజరు కావాలని ఎంబసీ.. పత్రికా ప్రకటనద్వారా ఆహ్వానం పలికింది. జెండా వందనం అనంతరం భారత కువైట్ రాయబారి భారత రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపిస్తారని, వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, దేశభక్తి గీతాలాపన ఉంటుందని తెలిపింది. జెండావందనానికి హాజరైన అతిథులకు, ప్రజలకు అల్పాహార విందును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనలో వివరించింది. కువైట్ లోని భారతీయులందరూ ఈ వేడుకలకు హాజరు కావాలని ఎంబసీ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. ఉదయం 7.30 కల్లా రమ్మంటూ ఆహ్వాన పత్రంలో ప్రత్యేక సూచన కూడా ఇచ్చింది. -
జెండా ప్రదర్శనపై అవగాహన
రొద్దం: ఈ నెల 15న తమిళనాడులోని హŸసూరు, కర్ణాటకలోని బాగలకోటలో అతి పెద్ద జాతీయ పతాకాన్ని మండల కేంద్రానికి చెందిన దొంతి లక్ష్మినారాయణ గుప్తా ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రదర్శనకు వెళ్లే సభ్యులకు అవగాహన కల్పించారు. బాగలకోటలో 650 అడుగులు, హŸసూర్లో 1,500 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
జమలాపురంలో ధ్వజ స్తంభ ప్రతిష్ఠ
జమలాపురం : తెలంగాణ తిరుపతి జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీఅలివేలు మంగ అమ్మవారి ఆలయ ధ్వజ స్తంభం శిథిలమై కూలిపోయింది. దీంతో అర్చకులు, అధికారులు పూజా కార్యక్రమాలను నిర్వహించి తాత్కాలిక ధ్వజ స్తంభాన్ని మంగళవారం పున:ప్రతిష్ఠ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ, ముఖ్య అర్చకులు ఉప్పల విజయ దేవ శర్మ, ప్రభాకర్ శాస్త్రి, అర్చకులు కురవి సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆలయ చైర్మన్ ఉప్పల శివ రాంప్రసాద్, ధర్మకర్త సభ్యులు శ్రీరాంచంద్రమూర్తి, సీనియర్ అసిస్టెంట్ విజయ కుమారి, సిబ్బంది కేవీఆర్ ఆంజనేయులు తదితరులున్నారు. -
ఐసిస్, పాకిస్తాన్ నినాదాలతో కాశ్మీర్లో ఉద్రిక్తత
శ్రీనగర్ః కాశ్మీర్ లో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఆర్మీ కాలనీకి వ్యతిరేకంగా యాసిస్ మాలిక్ ఆధ్వర్యంలోని వేర్పాటువాదులు ఐసిస్, పాకిస్థాన్ జెండాలను ఎగురవేసి ర్యాలీ నిర్వహించడం ఉద్రిక్తంగా మారింది. కాశ్మీర్లో ఆర్మీ, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులను వేరు చేసి, సాధారణ ప్రజలనుంచి విడిగా వారికి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు వారికోసం కాలనీలు కట్టించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వేర్పాటు వాదులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో మిర్వైజ్ ఉమా ఫరూఖ్ నాయకత్వంలో జమ్మూకాశ్మీర్ లోని కాశ్మీరీ పండిట్లు, సైనిక కాలనీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాశ్మీర్లో వేర్పాటు వాదులు మరోసారి ఆందోళనకు దిగారు. ప్రత్యేక కాలనీలు ఏర్పడితే తమ పట్టు సడలిపోతుందన్న భావనలో ప్రజల్లో విద్వేషాలు రేపే ప్రయత్నాలు చేస్తున్నారు. కాలనీలు నిర్మించడానికి వీల్లేదంటూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కాలనీలకు వ్యతిరేకంగా, భారత్ ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్, ఐసిస్ లకు అనుకూలంగా జెండాలను ఊపుతూ, జీవ్ జీవ్ పాకిస్తాన్ అన్న నినాదాలతో నిరసనకారులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ళు రువ్వారు. దీంతో పోలీసులు భాష్పవాయు గోళాలను వారిపై ప్రయోగించారు. దీంతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కాలనీల నిర్మాణానికి కావలసిన భూమిలేదంటూ పీపుల్స్ డెమొక్రెటిక్ పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ భారతీయ జనతాపార్టీ సైనిక, పండిట్ కాలనీల ఏర్పాటును సమర్థించడం స్థానికంగా ఆందోళనకు దారి తీసింది. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం కూడ కాలనీల ఏర్పాటుకోసం శ్రీనరగ్ పుల్వామా, బడ్గమ్ జిల్లాల్లో భూమి అందుబాటులో లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. సైనిక కాలనీకోసం భూమి లేనప్పుడు కాలనీల ఏర్పాటు విషయాన్ని ఎలా అంగీకరిస్తారంటూ ప్రశ్నించారు. -
పోలీస్ కార్ల ఫ్లాగ్‌పోల్స్ దొంగల అరెస్టు
పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలో ఉన్నతాధికారుల 8 కార్లకు చెందిన బ్రాస్ ఫ్లాగ్‌పోల్స్ తొలగించిన ఇద్దరు నిందితులను, వాటిని కొనుగోలు చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాలప్రకారం ... పంజగుట్ట ఐఏఎస్, ఐపీఎస్ కాలనీలో ఈ నెల 2వ తేదీన 8 మంది ఐఏఎస్ అధికారుల కార్లు బయటపెట్టగా తెల్లారేసరికి వాటికి ఉన్న ప్లాగ్‌పోల్స్ (కారు ముందు భాగంలో జెండా అమర్చే పరికరం) కనిపించకుండా పోయాయి. ఓ ఐఏఎస్ అధికారి కారు డ్రైవర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే కాలనీలో ఓ ఉన్నతాధికారి ఇంట్లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉండే ఓ మహిళ కొడుకు రాజేష్ ఖన్నా అలియాస్ రాకేష్ (19) బ్యాండ్ కొడుతూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఇతని స్నేహితుడు డి. శ్రీనివాస్‌తో కలిసి ఫ్లాగ్‌పోల్స్ దొంగతనం చేసి ద్వారకాపూరి కాలనీలో స్క్రాప్ దుకాణం నిర్వహించే సుధాకర్‌కు అమ్మారు. దీనిని గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను, సుధాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
గుండె నిండా పేదల జెండా
♦ పతాకావిష్కరణలు.. సేవా కార్యక్రమాలు ♦ అధికార పార్టీ కుట్రలు.. కుతంత్రాలను ఎదుర్కొందాం ♦ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం ♦ పేదల పక్షాన పోరాటమే దానికి మార్గం ♦ వేడుకల్లో నాయకుల పిలుపు.. కార్యకర్తల ప్రతిన సాక్షి, విశాఖపట్నం: ఉద్యమాలే ఊపిరిగా ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. తమ గుండెల్లో కొలువైన దివంగత వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఏర్పడిన పార్టీ ఐదో పుట్టిన రోజు వేడుకలను శనివారం జిల్లా అంతటా పార్టీ శ్రేణులే కాదు.. వివిధవర్గాల ప్రజలు పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంతోపాటు జిల్లా నలుమూలలా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మారుమూల పల్లెల్లో సైతం పార్టీ జెండాలను ఆవిష్కరించి కేకులు కట్ చేసి.. నిరుపేదలు. వృద్ధులు. అనాధలు, రోగులకు పండ్లు, పాలు, వస్త్రాలు పంపిణీ చేశారు. వైఎస్సార్ సంక్షేమ ఫలాలు మళ్లీ అందాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. కుట్రలు.. కుతంత్రాలు ఛేదిస్తూ నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి తరపున అలుపెరగని పోరాటం సాగిస్తున్న పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి అండగా నిలబడతామని ప్రతినబూనారు. కుట్రలు, కుతంత్రాలను తిప్పికొడదాం: బూడి మహానేత వైఎస్సార్ హఠన్మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు చేసారో... చేస్తున్నారో మనమంతా చూశాం. చూస్తున్నాం.. దొంగ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన వైఎస్సార్సీపీని బలహీనపర్చేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. ైవైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసే వరకు పార్టీ శ్రేణులు అలుపెరగని పోరు సాగించాలని పిలుపునిచ్చారు. దేవరాపల్లి మండలం కలిగొట్ల గ్రామంలో శనివారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బూడి పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. యలమంచలిలో.. కోఆర్డినేటర్ ప్రగడ నాగేశ్వరరావు యలమంచలి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. మునగపాకలో పార్టీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొడ్డెడ ప్రసాద్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పాయకరావుపేటలో.. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఎస్.రాయవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్బంగా బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రానున్నయన్నారు. మాజీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ సెల్ అధ్యక్షుడు డి.వి.సూర్యనారాయణరాజు నక్కపల్లిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ నక్కపల్లిలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. నర్సీపట్నంలో.. పార్టీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకరగణేష్ నర్సీపట్నంలో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఐదు రోడ్లు జంక్షన్లో గల పార్టీ కార్యాలయ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. అబీద్సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు ఆర్పించారు. రావికమతంలో డిసిఎంఎస్ చైర్మన్ ముక్కా మహలక్ష్మినాయుడు పార్టీ నేతలతో కలిసి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పాడేరులో.. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొనడంతో స్థానిక ఎంపీపీ, జెడ్పీ టీసీలు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అనకాపల్లిలో పార్టీ పట్టణాధ్యక్షు డు జానీ పార్టీ నేతలు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. విశాఖ దక్షిణంలో.. గత రెండేళ్లుగా పెదబాబు-చినబాబులు కలిసి రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని.. అవనీతికి తలుపులు బార్లా తెరవడంతో ఆ పార్టీ నేతలు కూడా దండుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ అన్నారు. దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, రాష్ర్ట కార్యదర్శి జాన్ వెస్లీ తదితరులతో కలిసి జగదాంబ సెంటర్లో పార్టీ పతాకాన్ని అమర్నాధ్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఈస్ట్‌లో.. రెండేళ్ల అవినీతి పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని విశాఖ తూర్పు కో ఆర్డినేటర్ వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని పార్టీపతాకాలను ఆవిష్కరించారు. ఆటో డ్రైవర్లకు ఖాకీ దుస్తులు పంపిణి చేశారు. ఉత్తర నియోజకవర్గంలో.. పోరాటాలతో పుట్టిన వైఎస్సార్సీపీదే భవిష్యత్ అని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ అన్నారు. ఉత్తర నియోజకవర్గ పరిధిలోని పలు వార్డుల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో తైనాల పాల్గొని పేదలు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. పలు కూడళ్లలో జెండాలు ఆవిష్కరించారు. గాజువాకలో.. సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి గాజువాక నియోజకవర్గ పరిధిలోని వివిధ వార్డుల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు పండ్లు, పాలు. వస్త్రాలు పంపిణీ చేశారు. పెందుర్తిలో.. సమన్వయకర్త అదీప్‌రాజు నియోజకవర్గంలోని వివిధ వార్డులు, గ్రామాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. 69వ వార్డులో మహానేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. భీమిలిలో.. సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం భీమిలి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని తగరపువలస, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ అంతా వైఎస్సార్‌సీపీదేనని.. జగన్ సీఎం కావడం ఖాయమని చెప్పారు. -
జెండాతో సమస్య పరిష్కారం!!
వ్యతిరేక, అనుకూల ప్రదర్శనలతో ఢిల్లీ వీధులను గత వారం రోజులుగా హోరెత్తించిన జేఎన్‌యూ వివాదానికి ఎట్టకేలకు ప్రభుత్వం పరిష్కారం కనుగొందని, యూనివర్సిటీ క్యాంపస్‌లో జెండా ఎగరవేసి విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని రగిలించడమే ప్రభుత్వం ఉత్తమ మార్గంగా భావించిందంటూ ట్విట్టర్లో ట్వీట్లు వెల్లువెత్తాయి. అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రతిరోజు జాతీయ జెండాను ఎగురవేయాలని, ఆ జెండా 207 అడుగుల ఎత్తులో, బరువు 35 కిలోలు ఉండాలంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆదేశం మేరకు వీసీలు బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా, ప్రతికూలంగాను ట్వీట్లు వెల్లువెత్తాయి. కొంతమంది తమదైన శైలిలో వ్యంగోక్తులు విసిరారు. 'విద్యార్థులు జెండా వందనంలో పాల్గొంటే వారు పాకిస్తానీయులు కాదని, భారతీయులేనని గుర్తించవచ్చు.. జెండాల తయారీకి కుట్టు మిషన్ కొట్టు పెట్టుకోవడానికి ఇదే అదను.. అలాగే జెండాపై అర్ణబ్ గోస్వామి చిత్రాన్ని అతికిస్తే బాగుంటుంది.. ఇది మోదీ సర్కార్ నయా జాతీయవాద మంత్రం. ఓ దళిత విద్యార్థి ఆత్మహత్య, జేఎన్‌యూ వివాదం దీని ముందు దిగదుడుపే... ఆరెస్సెస్‌ను కూడా ప్రతిరోజు జెండా ఎగరవేయమని చెబితే పోలా!...అయ్యో జెండాతో సమస్య పరిష్కారమయ్యాక మరో సమస్య ఏమిటి? రామ్‌దేవ్ బాబా యోగాను కూడా కంపల్సరీ చేస్తే బాగుంటుంది.....జెండా 207 అడుగులు ఎందుకుండాలంటే మనిషిలో 206 ఎముకలు ఉంటాయిగనక....ప్రతి టీవీ ఛానల్ కూడా రాత్రి తొమ్మిది గంటలకు జెండా వందన సమర్పణ చేసి జాతీయ గీతాన్ని ప్రసారం చేయాలనే నిబంధన తీసుకురావాలి'... ఇలా ట్వీట్లు చేశారు. -
జెండా ఆవిష్కరిస్తూ కుప్పకూలిన హెడ్మాస్టర్
కథలాపూర్: కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం గంభీపూర్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే నావెల్టీ పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు భద్రం జెండా ఆవిష్కరిస్తూ కుప్పకూలి మృతి చెందారు. మంగళవారం ఉదయం నేతల చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టి జెండాను ఆవిష్కరించబోతున్న క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలారు. ఆటోలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, అప్పటికే ఆయన మృతిచెందారు. మృతుడు కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. -
గాంధీభవన్ లో గణతంత్ర వేడుకలు
హైదరాబాద్: గాంధీభవన్ లో 67 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత జానారెడ్డి, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జెండా ఆవిష్కరణపై నాయకుల కొట్లాట
భువనగిరి: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ విషయమై కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఒకరిపై ఒకరు చేయి చేసుకుని పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారు. నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జగదేవ్‌పూర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బర్రె జహంగీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతుండగా... నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం అనిల్‌కుమార్‌రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పడంతో వారి మధ్య వాగ్వివాదం జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అనంతరం కంభం అనికుమార్‌రెడ్డి పై జహంగీర్ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు
హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్యాలయంలో 67 వ రిపబ్లిక్ డే వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని జెండా వందనం చేశారు. -
'సాక్షి'లో ఘనంగా జెండావందనం
హైదరాబాద్: 'సాక్షి' ప్రధాన కార్యాలయంలో 67వ గణతంత్ర దినోత్సవం వేడుకలు మంగళవారం ఉదయం ఘనంగా జరిగాయి. 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి కార్యాలయం ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జెండావందనం చేసి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో 'సాక్షి' పాత్రికేయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రేటర్లో తమ్ముళ్ల ఆగ్రహజ్వాలలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అసమ్మతి నాయకుల ఆగ్రహజాల్వలు పెల్లుబికాయి. ఇప్పటికే రెబల్ అభ్యర్థులతో తలలు పట్టుకుంటున్న పార్టీలకు... నాయకుల ఆగ్రహ ఆవేశాలు గెలుపుపై నీళ్లు చల్లే విధంగా మారనున్నాయి. విద్యానగర్ టికెట్ దక్కకపోవడంతో మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి వర్గీయులు స్థానికంగా ఉన్న టీడీపీ జెండా దిమ్మెను కూల్చివేశారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున విద్యానగర్ నుంచి చంద్రమౌళి కార్పొరేటర్‌గా గెలిచాడు. పునర్విభజనలో విద్యానగర్ రద్దయింది. దీంతో చంద్రమౌళి నల్లకుంట డివిజన్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే టీడీపీ వనం మాలతి అనే మరో నాయకురాలికి టికెట్ కేటాయించడంతో ఆగ్రహం చెందిన నాయకులు బీభత్సం సృష్టించారు. సిట్టింగ్ కార్పొరేటర్‌కు కాకుండా మరొకరికి ఎలా కేటాయిస్తారంటూ చంద్రమౌళి వర్గీయులు ప్రశ్నించారు. ఇది గ్రేటర్లో ఏ ఒక్క డివిజన్‌కే పరిమితం కాదు.. పలు డివిజన్లలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. -
పాతబస్తీలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
యాకుత్‌పురా : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో దక్షిణ మండల పోలీసులు శుక్రవారం సాయంత్రం మీర్‌చౌక్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి ప్రారంభమైన మార్చ్ మొఘల్‌పురా కమాన్, శాలిబండ రాజేశ్ మెడికల్ హాల్, లాల్‌దర్వాజా మోడ్, నాగులచింత, సుధా థియేటర్, గౌలిపురా మార్కెట్, సుల్తాన్షాహి, మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్, మస్కతీ దొడ్డి, మొఘల్‌పురా ఓల్టా హోటల్, బీబీబజార్ చౌరస్తా, అలిజాకోట్లా, ఎతేబార్ చౌక్, మీరాలంమండి, పురానీ హవేలి, డబీర్‌పురా వరకు కొనసాగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మార్చ్‌లో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, మీర్‌చౌక్, చార్మినార్, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్ ఏసీపీలు ఎం. శ్రీనివాస్ రావు, అశోక చక్రవర్తి, ఎం.ఎ.బారీ, వి. శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. -
డిసెంబర్ 7న ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే
హైదరాబాద్: భారత జాతి కోసం ప్రాణ త్యాగాలు చేసిన జవాన్లను స్మరించుకోవడానికి డిసెంబర్ 7న ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ను నిర్వహించనున్నారు. దేశం కోసం పోరాడి అమరులైన వారి కుటుంబాలకు, అంగవైకల్యం పొందిన జవాన్లకు, మాజీ సైనికులకు చేయూత నివ్వడం కోసం ఆర్ముడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్‌ను ఏర్పాటు చేశామని, దాతలు సహాయం చేయవలసిందిగా తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ రమేష్ కుమార్ కోరారు. ఆర్మీ ఫ్లాగ్ డేను హైదరాబాద్‌లో ఈనెల 7న ఉదయం11.30కు, సోమాజీ గూడలోని సైనిక్ ఆరమ్ఘర్ కాంప్లెక్స్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలు హాజరు కానున్నారు. -
జాతీయ జెండాకు అవమానం
-
అమరుల త్యాగం వల్లే తెలంగాణ : నాయిని
-
జెండా ఎగురవేయండిలా..
జాగ్రత్తలు తప్పనిసరి పంద్రాగస్టు వేడుకులకు సిద్ధమవుతున్న ప్రజలు దోమ : శనివారం జరుపుకోనున్న 69వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గ్రామగ్రామాన సన్నాహక కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ప్రజలంతా జెండావిష్కరణ వేడుకల్లో పాలుపంచుకునేందుకు తహతహలాడుతున్నారు. ఎక్కడ చూసినా దేశభక్తి ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. వేడుకలకు ఒక్క రోజే మిగిలి ఉండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అయితే కొద్దిపాటి అజాగ్రత్తలతో ఏటా స్వాతంత్య్ర, గణతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఎక్కడో ఓ చోట అపశ్రుతులు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో జాతీయ జెండావిష్కరణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం. భారత పతాక నిబంధనల అవతరణ.. భారత ప్రమాణాల సమితి(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) మూడు దశలలో జారీ చేసిన పత్రాలకు అనుగుణంగా మన దేశ జెండా తయారీ, ప్రదర్శనలను నిర్దేశించే చక్రాలను భారత పతాక నిబంధనలుగా పేర్కొంటారు. 1950 జాతీయ చిహ్నాలు, పేర్లు, నిబంధనల చట్టం, 1971 జాతీయ గౌరవ అవమానాలు నిరోధించే చట్టం కలిసి 2002లో భారత పతాక నిబంధనలుగా అవతరించాయి. జాతీయ జెండావిష్కరణ.. నిబంధనలు.. ► జాతీయ జెండా 3 రంగుల సమాన వెడల్పు గల పట్టీలలో పై పట్టీ కాషాయ(కేసరీ) వర్ణం, మధ్యలో తెలుపు, దిగువన ముదురు ఆకుపచ్చ పట్టీలతో ఉండాలి. ► జెండా పరిమాణం.. అంటే పొడవు, వెడల్పుల నిష్పత్తి 3:2గా ఉండాలి. ► 6300/4200, 3600/2400, 2700/1800, 1800/1200, 1350/ 900, 900 /600, 450 /300, 225/ 150, 150 /100 (పొడవు/ వెడల్పు మిల్లీమీటర్లలో) ఏదైనా ఒక కొలతను కలిగి ఉండాలి. ► 24 చువ్వలు గల నావికా నీలం రంగు గల అశోక చక్రం తెలుపు పట్టీ మధ్యలో ఉండాలి. ► భారత జాతీయ పతాకాన్ని ఖాదీ, చేనేత వస్త్రాలతో మాత్రమే తయారు చేయాలి. ముడి పదార్థాలుగా నూలు, పత్తి, ఉన్ని వాడొచ్చు. ► ఇతర వాటితో తయారుచేస్తే జరిమానాతో పాటు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే వీలుంది. ► జెండా ఎగురవేసినపుడు కాషాయ వర్ణం పైకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ► జెండా పట్టికలు వేదికలు, భవనాల కప్పు, పిట్టగోడలపై నుంచి వేలాడదీయరాదు. ► ఏదైనా సమావేశ స్థానంలో జెండా ప్రదర్శింపదలచుకుంటే ప్రసంగకర్తకు కుడివైపుగా జెండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ► జాతీయ జెండాకు సమానంగా గానీ ఇంకా ఎత్తులో గానీ ఏ ఇతర జెండా ఎగురకూడదు. ► జాతీయ జెండా ఊరేగింపులో గానీ, కవాతులోగానీ ఇతర జెండాలతో కలిసి తీసుకువెళ్లేటప్పుడు వాటికి ముందు మధ్యలో గానీ, కుడివైపున గానీ ఉండేలా చూసుకోవాలి. ► ఏదైనా ఒక ప్రతిమ, జ్ఞాపకం, ఫలకానికి విశేషాలంకారంగానే తప్ప జెండాను ఏ వస్తువుకూ తొడుగుగా వాడరాదు. ఏ వ్యక్తికీ చుట్టబడరాదు. ► జెండా ఎరుగవేత, దించే సమయంలో వ్యక్తులందరూ జెండాకు అభిముఖంగా నిలబడాలి. ► సూర్యాస్తమయానికి ముందే జెండాను కిందికి దించాలి. -
జెండా వందనం ఫొటోలు పంపండి
స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు ఎక్కడున్నా ఆనందంగా, గర్వంగా జరుపుకొంటారు. మువ్వన్నెల జెండా ఎగరేసి వందనం చేస్తారు. అలా మీరు కూడా జెండావందనం చేస్తున్నారా? మీ స్కూలు, కాలేజి, ఆఫీసు, కాలనీ.. ఇలా ఎక్కడైనా సరే జెండా ఎగరేసినట్లయితే.. ఆ ఫొటోలను వివరాలతో పాటు మాకు పంపండి. ఎన్నారైలు కూడా తాముంటున్న దేశాలు, ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా ఎగరేస్తే.. ఆ ఫొటోలు, ప్రాంతం పేరు, మీ పేరుతో sakshinetduty@gmail.com అనే ఈమెయిల్ ఐడీకి పంపండి. వాటిని మీ వివరాలతో గ్యాలరీ రూపంలో అందిస్తాం. -
అప్పన్న ఆలయ ధ్వజస్తంభం తొలగింపు
బయల్పడిన బ్రిటీష్ కాలం నాటి వెండి, రాగి నాణేలు 19వ శతాబ్ధం నాటివిగా నిర్ధారణ ఫిబ్రవరి 9న నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట సింహాచలం: వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ధ్వజస్తంభాన్ని బుధవారం తొలగించారు. 1894లో (120 ఏళ్ల కిందట) ప్రతిష్టించిన ధ్వజస్తంభం కర్ర పుచ్చిపోవడంతో ఈనెల 26 నుంచి తొలగింపు పనులు చేపట్టారు. బుధవారం ధ్వజస్తంభం అడుగుభాగాన్ని పూర్తిగా తొలగించారు. ధ్వజస్తభం అడుగుభాగం వెలికి తీసిన తరువాత గరుడ యంత్రం లభించడంతో దానికి శాస్త్రోక్తంగా హారతులిచ్చి ఆలయంలో స్వామి దగ్గర ఉంచారు. అనంతరం మట్టి తీసే సమయంలో బ్రిటీష్‌కాలం నాటి వెండి, రాగి నాణేలు బయల్పడ్డాయి. ఇవి బ్రిటీష్‌కాలంనాటి నాణేలుగా ఈవో రామచంద్రమోహన్ పేర్కొన్నారు. నాణేలు 1,800 నుంచి 1,890 వరకు ఉన్న సంవత్సరాలు ముద్రించి ఉన్నాయి. మొత్తం చిన్నా, పెద్దా కలిపి 1,658 రాగి నాణేలు, 140 గ్రాములు బరువు ఉన్న 43 వెండి నాణేలు, తీగముక్కలు, నమూనా ధ్వజస్తంభం లభ్యమయ్యాయి. అలాగే 22 గ్రాముల బరువు ఉన్న బంగారం రేకుముక్కలు, నమూనా చిన్న ధ్వజస్తభం లభించాయి. 18 పగడాలు, రెండు ముత్యాలు లభ్యమయ్యాయి. అలాగే అడుగు భాగంలో లభ్యమైన అప్పటి ఆకు ఇంకా పచ్చగానే ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేవాదాయశాఖ విశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇ.వి.పుష్పవర్ధన్, చినగదిలి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, వీఆర్వో సత్యం దొర, దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, డీఈ మల్లేశ్వరరావు, ఏఈవో ఆర్.వి.ఎస్. ప్రసాద్, ఇన్చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, అర్చకులు తొలగింపు పనులు పర్యవేక్షించారు. ఫిబ్రవరి 9న నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట ఫిబ్రవరి 9న నూతన ధ్వజస్తంభం ప్రతిష్టా కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి వెభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. పాంచరాత్ర ఆగమశాస్త్ర పండితులు శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి సూచనల మేరకు నూతన ధ్వజస్తభం ప్రతిష్టను వైభవంగా నిర్వహిస్తామన్నారు. ధ్వజస్తంభం వెలికితీతలో లభ్యమైన నాణేలు నూతన ధ్వజస్తంభం ప్రతిష్టలో తిరిగి వేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా, శాస్త్ర ప్రకారం, వైదికుల సూచనల ప్రకారం నడుచుకుంటామన్నారు. శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నూతన ధ్వజస్తభం ప్రతిష్ట నిర్వహిస్తామని స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. -
నెల్లూరులో శాంతి యాత్రను ప్రారంభించిన మేకపాటి
నెల్లూరు: వందే గాంధీయం పేరుతో శాంతి యాత్రను నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆదివారం స్థానిక గాంధీ విగ్రహాం వద్ద ప్రారంభించారు. పల్లిపాడులోని గాంధీ ఆశ్రమం వరకు ఈ పాదయాత్ర సాగుతుంది. ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో పల్లెపాడు సబర్మతి గాంధీ ఆశ్రమం, నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీలు సంయుక్తంగా ఈ పాదయాత్రను ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీకాంత్, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, సంజీవయ్య, జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డితోపాటు పలువురు నాయకులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమానికి విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశ్యముతో వందే గాంధీయం శాంతి యాత్రను ఏర్పాటు చేశారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో భారీగా విద్యార్థులు, నగర ప్రజలు పాల్గొన్నారు. -
'పటేల్... దేశ సమైక్యతకు మారుపేరు'
హైదరాబాద్: భారత తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు మారు పేరు అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అభివర్ణించారు. కేంద్ర హోం మంత్రిగా ఆయన భారత జాతి గర్వపడేలా పని చేశారని తెలిపారు. శుక్రవారం ఏపీ సచివాలయ ప్రాంగణంలో సర్దార్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఉద్యోగుల చేత ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జాతీయ ఐక్యతా పరుగును జెండా ఊపి ప్రారంభించారు. -
'కుట్రలను ఉక్కుపాదంతో అణిచిన సర్దార్ పటేల్'
న్యూఢిల్లీ: భారతదేశాన్ని ఏకీకృతం చేయడానికే ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్‌పటేల్ జీవితం అంకితం చేశారని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పటేల్ జీవితం ఎందరికో స్పూర్తిదాయకమని చెప్పారు. సర్దార్ వల్లభాయ్‌పటేల్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద నిర్వహించిన జాతీయ ఏక్ తా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన పటేల్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... దేశాన్ని ఐక్యంగా ఉంచే క్రమంలో సర్దార్ పటేల్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. స్వాతంత్య్ర అనంతరం దేశంలోని సంస్థానాల వీలినమే పటేల్‌లో ఉన్న దేశ ఐక్యతకు నిదర్శనమని చెప్పారు. భారతదేశ స్వాతంత్ర కాంక్ష, శక్తిని చాటిన యాత్ర దండియాత్ర. ఆ యాత్రలో మహాత్మునితో కలసి అడుగులోఅడుగు వేసి నడిచిన వ్యక్తి పటేల్ అని మోదీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో దేశంలోని రైతులందరిని ఏకతాటిపై నడిపి వ్యక్తి పటేల్ అని అన్నారు. కొత్త ఉత్సాహం, లక్ష్యంతో అడుగులు వేయాలని యువతకు మోదీ పిలుపు నిచ్చారు. దేశంలో జరిగిన అనేక కుట్రను ఉక్కుపాదంతో అణిచిన వ్యక్తి పటేల్ అని తెలిపారు. అనంతరం ఐక్యమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని మోదీ ఈ సందర్భంగా విజయ్‌చౌక్ వద్ద పాల్గొన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత ఐక్యత పరుగును జెండా ఊపి మోదీ ప్రారంభించారు. ఈ పరుగులో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. -
అప్పన్న ధ్వజ స్తంభం శిథిల రాగం
పుచ్చిపోయిన 150 ఏళ్లనాటి స్తంభం కొత్తది ఏర్పాటుకు మీన మేషాలు టేకు మాను, రాగితాపడం ఎప్పుడో సిద్ధం అధికార, వైదిక వర్గాల తాత్సారం సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ధ్వజస్తంభం మార్చే పనులపై సింహాచల దేవస్థానం అధికార, వైదిక వర్గాలు తాత్సారం చేస్తున్నాయి. ధ్వజస్తం భాన్ని గడిచిన ఉత్తరాయణంలో మార్పు చేస్తామని ప్రకటించిన అధికార, వైదిక వర్గాలు ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్లి, మరో ఉత్తరాయణం సమీపిస్తున్నా ఆ విషయంపై దృష్టి సారించటం లేదు. వివరాల్లోకి వెళ్తే.... రాష్ర్టంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రస్తుత ధ్వజస్తంభం సుమారు 150 ఏళ్ల క్రింతం ప్రతిష్టితమైంది. అది ప్రస్తుతం ఒకైవె పునకు వంగి ఉండటం, లోపల ఉన్న చెక్క పుచ్చిపోవడం వంటి పరిస్థితుల దృష్ట్యా నాలుగేళ్ల కిందటే కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 2011లో అప్పటి ఈవో ప్రేమ్‌కుమార్ హయాంలో విశాఖ జిల్లా లంబసింగి అడవుల నుంచి 72 అడుగుల పొడవైన భారీ టేకు మానును తీసుకొచ్చారు. ఇంతలోనే ఆ పనులకు సంబంధించి కాంట్రాక్టర్ కోర్టు కేసు, టీటీడీతో కుదుర్చుకున్న ఒప్పందం తెరపైకి రావడంతో కొంతకాలం ఆ పనులు నిలిచిపోయాయి. తరువాత ఏడాది క్రితం ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో 2014 సంవత్సరం ఉత్తరాయణంలో కొత్త ధ్వజస్తంభం ప్రతిష్టిస్తామని వైదిక, అధికారులు ప్రకటించారు. ధ్వజస్తంభానికి అవ సరమైన రాగి తాపడాన్ని కూడా 2013 జూన్ నెలలో సిద్ధం చేశారు. మళ్లీ ఉత్తరాయణం సమీపిస్తున్నా ఆ పనులే జరగలేదు. ఇప్పటికే మూడున్నర ఏళ్ల నుంచి భారీ టేకు మాను ఎండకి ఎండి, వానకు తడుస్తోంది. రాగి తాపడం మూలన పడి ఉంది. రానున్న ఉత్తరాయణంలోనైనా నూతన ద్వజస్తంభం ప్రతిష్ట జరగాలని భక్తులు, ఇటు అడవివరం గ్రామస్తులు కోరుతున్నారు. -
కాకతీయుల కోటలో మువ్వన్నెల జెండా
ఖిలా వరంగల్‌లో పంద్రాగస్టు వేడుకలు సర్కారు గోల్కొండ స్ఫూరితో నిర్ణయం సాక్షి ప్రతినిధి, వరంగల్: వ్యవసాయానికి, భక్తికి ప్రాధాన్యత ఇచ్చి సుదీర్ఘపాలన సాగించిన కాకతీయుల రాజధాని కేంద్రం ఖిలావరంగల్‌లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రాష్ర్టంలో తొలిసారిగా జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయి లో గోల్కొండ కోట ఆవరణలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే స్ఫూర్తి తో గత వైభవాన్ని గుర్తు చేసేలా వరంగల్లోనూ కాకతీయ కోటలో ఆగస్టు 15 వేడుకలకు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కోట ప్రాంతం ఆవరణలోని ఖుష్‌మహల్ పక్క న ఖాళీ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు ఖిలావరంగల్ ప్రాంతం స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబవుతోంది. కాకతీయుల్లో ముఖ్యురాలైన రాణిరుద్రమదేవి హయాం(1261)లో ఈ కోట నిర్మాణం పూర్తి అయ్యింది. కాకతీయుల శకం ముగిసిన తర్వాత నిజాం నవాబుల పరిపాలనలో షితాబ్‌ఖాన్ సైన్యాధికారిగా ఉన్నప్పుడు ఖిలావరంగల్‌లో ఖుష్‌మహల్ ను నిర్మించారు. కీర్తి తోరణాలు, ఖుష్‌మహల్ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నాయి. -
జెండా పండుగొచ్చింది!
జెండా పండుగంటే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం, జాతీయ గీతాలాపన, మిఠాయిల పంపిణీ మాత్రమే అందరికీ తెలిసిన విషయం. ఈ పండుగొస్తే నాలుగు రోజుల పాటు తిండిగింజలు సంపాదించుకోవచ్చని ఎదురుచూసే వారు ఇప్పటికీ ఉన్నారన్న సంగతి మాత్రం అనంతపురంలోని రాజీవ్ కాలనీ వాసులను చూస్తేనే తెలుస్తుంది. రానున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విక్రయించేందుకు కాలనీలోని మహిళలు జెండాలను సిద్ధం చేస్తుండగా, కాలనీ వాసులు వాటిని గర్వంగా ప్రదర్శిస్తున్న దృశ్యాలివి.. -
కేజ్రీవాల్ కి 'ఇంటి' పోరు
ఇల్లుకట్టి చూడు అన్నది పాత సామెత. ఇల్లుమారి చూడు అన్నది కొత్త సామెత. ఇల్లు మారే కష్టాలు ఇన్నిన్ని కావు. అదీ ఇల్లు మారే వ్యక్తి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజరీవాల్ అయితే కష్టాలు డబుల్ అవుతాయి. అందరికీ శకునం చెప్పే బల్లి లాంటి కేజ్రీవాల్ ఇల్లు మారడం విషయంలో కుడితిలో పడ్డంత పనిచేశారు. ఆయన ఇప్పుడున్న ఇల్లు ప్రభుత్వానిది. ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయగానే దాన్ని ఖాళీచేయమని నోటీసులు వచ్చాయి. కానీ ఆయన నా కూతురు పరీక్షలు అయ్యేదాకా ఉంటానని చెప్పారు. అయితే దానికి 85000 రూపాయల అద్దె చెల్లించాలని ఢిల్లీ సర్కారు ఆయనకు నోటీసులు ఇచ్చింది. కేజ్రీ మిత్రులు ఆ అద్దెను చెల్లించారు. చివరికి ఎలాగోలా ఢిల్లీ లోని ఫ్లాగ్ స్టాఫ్ రోడ్ లో ఆయన ఒక ఇల్లును వెతికి, అందులో అద్దెకు దిగుతానని ప్రకటించారు. ఇదంతా జూన్ 20 న జరిగింది. ఆ ఇల్లు కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమారుడైన నరేన్ భిక్కు రామ్ జైన్ ది. ఇంక అందులోకి మారడమే తరువాయి అనుకునే లోపు ఆయనకు మరో అడ్డంకి ఎదురైంది. జూన్ 23 న నరేన్ జైన్ తమ్ముడు వీరేందర్ జైన్ ఆ ఇంట్లో సగం నాది. నా అనుమతి లేకుండా అద్దెకి ఇచ్చేది లేదని ఆయన వాదించారు. దీంతో కేజ్రీవాల్ మళ్లీ ఇల్లు లేని వాడయ్యాడు. ఆయన పార్టీ కార్యకర్తలు పనులు మానుకుని ఇల్లు వెతుకుతున్నారు. మిత్రులు సర్కారుకి ఇప్పుడున్న ఇంటికి అద్దెలు కట్టుకుంటున్నారు. -
సిరిసిల్ల వస్త్రానికి ఎన్ని‘కళ’
సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఎన్నికల గాలితాకింది. వరుసగా ఎన్నికలు రావడంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి కళ వచ్చింది. ఇక్కడి వస్త్రోత్పత్తిదారులకు చేతినిండా పని లభిస్తోంది. రాజకీయపార్టీలు వినియోగించే బ్యానర్లు, జెండాలు, కండువాలు తయారీకి అవసరమైన గుడ్డ సిరిసిల్లలోనే ఉత్పత్తికావడంతో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గుడ్డ మన రాష్ట్రంతో పాటు జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలకు ఎగుమతి అవుతోంది. న్యూస్‌లైన్, సిరిసిల్ల,రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 27వేల మరమగ్గాలపై పాలిస్టర్, 7వేల మగ్గాలపై కాటన్ గుడ్డ ఉత్పత్తి అవుతోంది. పాతికవేల కుటుంబాలు వస్త్రోత్పత్తి పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. నూలు ధరలు పెరగడం, ఉత్పత్తి చేసిన గుడ్డకు గిరాకీ లేక వస్త్ర వ్యాపారులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. కరెంటు బిల్లులు పెరిగి విడిభాగాల రేట్లు ఎక్కువై వస్త్రోత్పత్తి గిట్టుబాటు లేని పరిస్థితి గతంలో ఎదురైంది. ఇప్పుడు గుడ్డకు కాస్త ధర పెరగడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకేసారి స్థానిక, మున్సిపల్, సార్వత్రిక న్నికలు రావడంతో వస్త్రవ్యాపారులకు కలిసొచ్చింది. సిరిసిల్లలో నిత్యం 27లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తవుతుండగా, గతంలో వస్త్ర నిల్వలు అమ్మకాల్లేక పేరుకుపోయాయి. ఎన్నికల పుణ్యమా.. అని ఇప్పుడు వస్త్ర నిల్వలన్నీ హైదరాబాద్‌లోని మార్వాడి సేట్లు కొనుగోలు చేయడంతో గుడ్డనిల్వలు లేకుండా పోయాయి. ఎన్నికల పుణ్యమా అని.. ఎన్నికలకు అవసరమైన జెండాలు, బ్యానర్లు, కండువాలు, క్యాప్‌లకు చౌకగా లభించే గుడ్డ అవసరమవుతోంది. సిరిసిల్లలో నాసిరకం గుడ్డ ఉత్పత్తవుతుండగా, జాతీయ మార్కెట్లో సిరిసిల్ల గుడ్డను ఎన్నడూలేని విధంగా ఎన్నికల సమయంలో ఎక్కువగా కొనుగోలు చేయడం పరిపాటి. దీంతో సిరిసిల్ల వస్త్రానికి గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని లభిస్తోంది. పాలిస్టర్ వస్త్రానికి డిమాండ్ ఉండడంతో కార్మికులతో యజమానులు, ఆసాములు పని చేయిస్తున్నారు. సిరిసిల్లలో 8గంటల పని విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్దేశించగా, గుడ్డకు డిమాండ్ ఉండడంతో 12 గంటలు పని చేయిస్తున్నారు. మరో మూడు నెలల వరకు కార్మికులకు పని ఉంటుందని భావిస్తున్నారు. సిరిసిల్లలో తక్కువ ధరకు గుడ్డ దొరుకుతుండగా, ఆ గుడ్డను రంగుల్లో ప్రింట్ చేసేందుకు ప్రాసెసింగ్ చేయడానికి మీటర్ రూ.10 వరకు ఖర్చవుతోంది. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మిల్లుల్లో ప్రాసెసింగ్ చేయడానికి ఎక్కువ ఖర్చవుతోంది. మొత్తంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊరట లభించింది. -
హైటెక్ ప్రచారం
ఎన్నికల ప్రచారం గతానికి భిన్నంగా సాగుతోంది. జెండాలు, వాల్‌పోస్టర్లు, వాల్ రైటింగ్, కరపత్రాలు, భారీ కటౌట్ల స్థానంలో తాజాగా కంప్యూటర్లు, సెల్ఫోన్లు హల్చల్ చేస్తున్నాయి. కనీస కంప్యూటర్ పరిజ్ఞానం లేని నేతలు సైతం ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రసంగ పాఠాలతో సోషల్ మీడియా (సెల్‌ఫోన్, ఇంటర్నెట్) ద్వారా విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల పరిధిలోని కాలనీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యోగులు, వ్యాపారులు, యువజన, కుల, ఉద్యోగ సంఘాల నేతల పేర్లు, ఫోన్ నెంబర్లను సేకరించి అభ్యర్థులే స్వయంగా ఓటర్లతో మాట్లాడుతున్నారు. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. ఓటు ఎందుకు వేయాలో, ఎవరికి వేయాలో సూచిస్తూ ప్రతి రోజూ ఓటర్ల ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. కంప్యూటర్, సెల్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ రంగాల్లో విశేష అనుభవం ఉన్న వారిని ఉద్యోగులుగా నియమించుకుని వారి సేవలను వినియోగించుకుంటున్నారు. హైటెక్ హంగులతో ఎంఐఎం ప్రచారం .. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీకి దీటుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎంఐఎం ప్రచారంలో హైటెక్ హంగులు చోటు చేసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు గుర్తింపు, పనితనంపై కూడళ్లలో భారీ హోర్డింగులతో ప్రచారాస్త్రాన్ని సందిస్తోంది. హోర్డింగ్‌లపై చారిత్రక ప్రదేశాలతో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీల ఫొటోలను ముద్రించారు. సాంస్కృతిక బృందాలు.. కంప్యూటర్ పరిజ్ఞానం లేని, చదువు రాని ఓటర్లను ఆకర్షించేందకు వారికి అర్థమయ్యే రీతిలో అభ్యర్థి గురించి ప్రచారం చేసేందుకు అభ్యర్థులు ఎవరికి వారే స్వతహాగా ప్రత్యేక సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థి గొప్పతనం, ఆయన జీవన శైలి, ఇప్పటి వరకు ఆయన చేసిన సేవ, తదితర అంశాలే ఇతివృత్తంగా చేసుకుని సుప్రసిద్ధ రచయితలతో పాటలు రాయించి, ప్రముఖ గాయకులతో పాడిస్తున్నారు. స్టూడియోల్లో వీటిని రికార్డ్ చేయిస్తున్నారు. మైక్‌ల ద్వారా ప్రచారాన్ని ఊదరగొడుతుండటం విశేషం. ఓటరు దృష్టిని ఆకర్షించేందుకు పార్టీగుర్తు, జెండా రంగులో ప్రత్యేకంగా టీ-షర్టులు, చీరలు తయారు చేయించి కార్యకర్తలకు పంచుతున్నారు. బిజీగా ఫ్లెక్సీ సెంటర్లు.. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతుండటంతో వాటిని ముద్రించే ఫ్లెక్సీ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. నిన్నమొన్నటి వరకూ పనిలేక ఖాళీగా కనిపించిన ఆర్టిస్టులు, పెయింటర్లు ప్రచార రథాలు, బ్యానర్లు, జెండాల తయారీలో బిజీగా మారిపోయారు. ప్రచారానికి భారీ కాన్వాయ్‌తో బయలు దేరుతున్నారు. ఇందు కోసం వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. వివాహాలు, పుట్టిన రోజు వేడుకలకు నెలవైన ఫంక్షన్ హాళ్లు తాజాగా ఎన్నికల ప్రచారానికి వేదికలవుతున్నాయి. సోషల్ మీడియాదే హవా ... ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల సంయుక్తంగా సోషల్ మీడియాపై ఓ సర్వే నిర్వహించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాల్లో 160 సీట్లను ఫేస్బుక్, ఆర్కూట్, ట్విట్టర్ల వంటి సోషల్ మీడియా డామినేట్ చేయబోతున్నాయని తేల్చింది. యువతరం మొత్తం సోషల్ మీడియాకే అతుక్కుపోయినట్ట పేర్కొంది. దేశవ్యాప్తంగా దాదాపు 7.5 కోట్లున్న ఈ సంఖ్య, ఎన్నికల సమయంలో 11 కోట్లు దాటిపోతుందనేది అంచనా. వీరిలో దాదాపు 97 శాతం ఫేస్బుక్ ఖాతాదారులే. సమయం దొరికితే చాలు ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, బ్లాగ్స్, వెబ్‌సైట్స్, వెబ్‌టీవీ...ఏదో ఒకదానికి కనెక్ట్ అవ్వడం సర్వసాధారణమని వెల్లడించింది. రంగంలోకి పీఆర్ ఏజెన్సీలు .. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు తమ ప్రచార బాధ్యతలను పీఆర్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. గెలుపోటములపై ముందే ఓ అభిప్రాయానికి వచ్చేందుకు అంతర్గత సర్వేలు చేయిస్తున్నారు. ఓటరు నాడి తెలుసుకుని వారికి ఏం కావాలో వాటినే ఎన్నికల ఎజెండాలో రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ఏ బస్తీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి. ఏ రోజు ఏ కాలనీలో ప్రచారం చేయాలి. ఏ ఏ అంశాలపై మాట్లాడాలి. ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి. తదితర అంశాలపై ముందే ఓ అవగాహనకు వచ్చి కాలనీల వారిగా ఎన్నికల ఎజెండాలను రూపొందించి అభ్యర్థులకు అందిస్తున్నాయి. -
డీఎండీకేలో ‘జెండా’ పండుగ
సాక్షి, చెన్నై:డీఎండీకే వర్గాలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ జెండా పండుగను ఘనంగా జరుపుకున్నాయి. వాడ వాడలా పార్టీ పతాకాన్ని ఎగురు వేశారు. పేదలకు సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. సినీ నటుడిగా ఉన్న సమయంలో తన అభిమాన సంఘాలను, సంక్షేమ సంఘాలుగా విజయకాంత్ మార్చారు. ఆ సమయంలో తన సంక్షేమ సంఘానికి చిహ్నంగా ఓ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత డీఎండీకే ఆవిర్భావంతో అదే చిహ్నం పార్టీ పతాకంగా మారింది. అప్పటి నుంచి పార్టీ పతాకావిష్కరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 12వతేదీ జరుపుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆ పతాకం ఆవిష్కరించి పదిహేను ఏళ్లు అవుతోంది. దీంతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా మునుపెన్నడు లేని రీతిలో ఈ పర్యాయం కోలాహలంగా పతాకావిష్కరణ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు జరుపుకున్నారు. ఉదయం చెన్నైలోని తన ఇంటి వద్ద పార్టీ పతాకాన్ని ప్రేమలత విజయకాంత్ ఎగుర వేశారు. అక్కడి నాయకులు, కార్యకర్తలతో కలసి అందరికీ ప్రేమలత స్వీట్లు, చాక్లెట్లను పంచి పెట్టారు. పేదలకు చీరలు అందజేశారు. కోయంబేడులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ఆవరణలో జెండాను కోశాధికారి ఇళంగోవన్ ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పార్థసారథి, చంద్రకుమార్, మురుగేషన్, యువజన నేత ఎల్కే సుదీష్ పాల్గొన్నారు. అందరికీ స్వీట్లు పంచి పెట్టారు. పేదలకు సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో వాడవాడలా ఆ పార్టీ శ్రేణులు పతాకాల్ని ఎగుర వేసి పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కో జిల్లాకు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ప్రత్యేక ప్రతినిధులుగా ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. డీఎండీకే యువజన నేత సుదీష్ చెన్నైలో పలు చోట్ల జరిగిన వేడుకకు హాజరై పార్టీ పతాకాన్ని ఎగుర వేశారు. అదే సమయంలో ఏఏ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా వేడుకలు జరిగాయోనని ప్రతినిధులు ఆరాతీయడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులతో చివరి రోజు ఇంటర్వ్యూల్లో బిజీగా ఉండటంతో జెండా పండుగకు విజయకాంత్ దూరంగా ఉన్నారు. -
కేంద్రమంత్రి కోట్ల ఇంట్లో జెండా పండుగ
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయన జాతీయ జెండను ఎగురవేసి అనంతరం సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రైల్వే సిబ్బందితోపాటు ఆయన నివాసంలో విధులు నిర్వహించేవారు పాల్గొన్నారు. అనంతరం మంత్రి అందరికీ మిఠాయిలు పంచారు. ఏటా తన నివాసంలో మంత్రి కోట్ల స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. -
ఘనంగా 65వ గణతంత్ర వేడుకలు
-
వైఎస్ఆర్ సీపీ జెండా ఆవిష్కరణ
-
మేరా భారత్ మహాన్
జాతీయ భావం... సమైక్య వాదం మువ్వన్నెల రెపరెపల నడుమ హోరెత్తిన నినాదం సాక్షి, నెట్వర్క్: మువ్వన్నెల పతాక రెపరెపలకు సమైక్య నినాదం శృతి కలిసింది. సమైక్యాం ధ్ర పరిరక్షణ లక్ష్యంగా ఉద్యమిస్తున్న సకలజనులు గురువారం స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూనే సమైక్యాంధ్ర ఆకాంక్షనూ ఎలుగెత్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగులు అధికారికంగా జరిగిన స్వాతంత్య్రదినోత్సవంలో పాల్గొనకుం డా అక్కడే వేరుగా జాతీయజెండా ఎగురవేశశారు. కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో ‘సమైక్యాంధ్రపై కవి సమ్మేళనం’ నిర్వహించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట, కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంవద్ద జాతీయ, సమైక్య పతాకాలను పక్కపక్కనే ఎగురవేశారు. ముమ్మిడివరంలో జేఏసీ నేతలు పెన్మత్స జగ్గరాజు, కోనా శ్రీనివాసరావు, బీవీఆర్ చౌదరిల ఆధ్వర్యంలో సమైక్యవాదులు గుండు గీయించుకుని నిరసన తెలిపారు. ఆరు రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న మంత్రి తోట నరసింహం సతీమణి వాణి ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు వైద్యులు తెలిపారు. కేంద్రమంత్రి దిగ్విజయ్‌సింగ్‌తోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ... ఫోన్లో మంత్రి తోట నర్సింహం, వాణితో మాట్లాడి దీక్షను విరమించాలని కోరారు. టీడీపీ కి చెందిన రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సీతానగరం కస్తూర్బా ఆశ్రమం ఎదుట గాంధీలా కర్ర చేత పట్టుకుని నిలబడి ఎనిమిది గంటలు దీక్ష చేశారు. శ్రీకాకుళంలో స్వర్ణమంజరి అంధుల పాఠశాల విద్యార్థులు గాంధీ, నెహ్రూ, వివేకానందుడు, అల్లూరి సీతారామరాజు, తెలుగు తల్లి వేషధారణలతో ర్యాలీ తీశారు. జేసీస్ ఫెమీనా ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ కుండలతో ప్రదర్శన నిర్వహించారు. ఇచ్ఛాపురంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు బస్టాండ్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో జెండా వందనం సందర్భంగా సమైక్యాంధ్ర ఆవశ్యకతపై ఉద్వేగంగా మాట్లాడుతూ సర్పంచ్ మల్లిపెద్ది ధనలక్ష్మి స్పృహతప్పి పడిపోయారు. పాలకొల్లులో మూడోరోజూ బంద్ కొనసాగింది. తాడేపల్లిగూడెంలో విద్యార్థులు రాష్ర్ట చిత్రపటం ఆకారంలో కూర్చుని సమైక్యాంధ్ర కు మద్దతు తెలిపారు. విశాఖ ఆంధ్రాయూనివర్సిటీలో ఐక్య విద్యార్థి ఫ్రంట్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం జరిగింది. గోపాలపట్నంలో ఎన్ఎంయూ ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్‌లకు పెద్దకర్మ నిర్వహించారు. ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. అనకాపల్లిలో గుడ్ షెపర్డ్ విద్యార్థులు వెయ్యి అడుగుల భారీ పతాకాన్ని ప్రదర్శించారు. విజయనగరంలో ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక, న్యాయవాదుల సంఘం సభ్యులు, ఎన్జీఓలు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నుంచి ఎత్తుబ్రిడ్జి వరకు ర్యాలీగా వెళ్లి రాజీవ్ విగ్రహం ఎదురుగా భారీ మానవహారం నిర్మించారు. పార్వతీపురంలో సమైక్యవాదులు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. చీపురుపల్లిలో ఆర్ఈసీఎస్ ఉద్యోగులు బైక్ ర్యాలీ, మూడురోడ్ల జంక్షన్లో మానవహారం నిర్వహించారు. వర్షంలోనూ సమైక్యం...: ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నా నెల్లూరు జిల్లాలో ఆందోళనకారులు ఉద్యమాన్ని కొనసాగించారు. నెల్లూరులో ఆర్టీసీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి వంటావార్పు, మానవహారం, ర్యాలీలు నిర్వహించారు. సూళ్లూరుపేటలో ఆందోళనకారులు జాతీయ జెండాకు బదులుగా సమైక్యాంధ్ర జెండాను ఎగురవేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కనిగిరిలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ప్రతిజ్ఞ బూనారు. ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులో శంకర్‌విలాస్‌సెంటర్, హిందూకళాశాల కూడలి, లాడ్జిసెంటర్ వద్ద కార్యకర్తలతో ప్రదర్శన, మానవహారం చేశారు. జిల్లాలో అన్నిచోట్లా వైఎస్ఆర్ సీపీ నేతలు రిలేదీక్షలకు కూర్చొన్నారు. చిలకలూరిపేటలో ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేశారు. తెనాలి, మంగళగిరి, మాచర్లలో వైఎస్సా ర్ సీపీ నేతలు ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మలను ఊరేగించారు. పలువురు ఎన్జీవోలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను తీసుకోలేదు. మున్సిపల్ ఉద్యోగులు విజయవాడలో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు రెండోరోజు కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేట, పెనుగంచిప్రో లు మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. చిల్లకల్లులో గ్రామస్తులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. గంగూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన చేశారు. రెగ్యులర్ వైద్య సేవలు బంద్: అనంతపురంలో పంచాయతీరాజ్ జేఏసీ నేతృత్వంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి మద్దతు పలికారు. ఈనెల 19 నుంచి జరిగే ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని ఎస్కేయూ విద్యార్థి జేఏసీ నాయకులు ప్రకటించారు. శుక్రవారం నుంచి అత్యవసర వైద్యసేవలు మినహా రెగ్యులర్ వైద్య సేవలను బంద్ చేస్తున్నామని వైద్య ఆరోగ్య జేఏసీ నాయకులు తెలిపారు. ధర్మవరంలో వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సమైక్యవాదం ఢిల్లీకి వినిపించేలా ప్రజలందరూ కలిసికట్టుగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్ విజయమ్మ విజయవాడలో చేపట్టనున్న దీక్షకు మద్దతుగా కళ్యాణదుర్గంలో వైఎసార్ కాంగ్రెస్ పార్టీ ట్రే డ్ యూనియన్ నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. రాయదుర్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఎస్ఎస్ వలీకి ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి సంఘీభావం తెలిపారు. కర్నూలులో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 15వ రో జూ కొనసాగాయి. ఆత్మకూరులో జ్యువెలర్స్ అసోసియేషన్ చేపట్టిన రిలేదీక్షలకు వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండాతోపాటు నల్లజెండాను ఎగురవేసి నిరసన తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సమైక్యవాదులు కేంద్రమంత్రుల ఫొటోలను కుక్కలు, గుంటనక్కల రూపాల్లో చిత్రించి నిరసన తెలిపారు. విభజన ఆందోళనతో ఆత్మహత్య గుత్తి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయనే నిరాశతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని జక్కలచెరువుకు చెందిన మోహన్, రంగమ్మ కుమారుడు రంగస్వామి (24) గ్రాడ్యుయేషన్ తరువాత ఐటీఐ చేశారు. విద్యుత్ సంస్థలో పోల్ టు పోల్ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ కొంతకాలం క్రితం ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి గ్రామంలో చిన్న చిన్న విద్యుత్ పనులు చేస్తుండేవాడు. రాష్ట్రం విడిపోతే మళ్లీ ఉద్యోగం రాదనే ఆందోళనతో గురువారం సూసైడ్ నోట్ రాసి.. గ్రామానికి సమీపంలోని పొలానికి వెళ్లి క్రిమి సంహారక మందు తాగాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతడ్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
సలామ్.. ఫ్లాగ్మెన్..!
సాక్షి, ముంబై: సాధారణంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాలపై రోజూ జాతీయ జెండా ఎగురుతూ కనిపిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా జెండావిష్కరణ, అవనతానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడటం మామూలు విషయం కాదు. వాటిని ఉదయం ఎగురవేయడం, సాయంత్రం అవనతం ఎవరు చేస్తున్నారన్న విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోరు. కాని, అటువంటి గురుతర బాధ్యతను దశాబ్దాలుగా నిర్విరామంగా నిర్విఘ్నంగా నిర్వర్తిస్తూ అందరితో మన్ననలందుకొంటున్నారు కొందరు.. ఒక విధంగా వారి జీవితం జాతీయజెండా సేవకే అంకితమని చెప్పవచ్చు. అటువంటి వారిలో కొందరి వివరాలిలా ఉన్నాయి.. అరవింద్ విచారే: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రధాన కార్యాలయంపై గత 25 ఏళ్ల నుంచి అరవింద్ విచారే క్రమం తప్పకుండా జెండా ఎగరవేస్తున్నారు. 125 మెట్లు ఎక్కి ఐదో అంతస్తు టైపై సూర్యోదయం కాగానే జెండా ఎగరవేస్తారు. సూర్యాస్తమయానికి 10 నిమిషాల ముందు కచ్చితంగా అవనతం జరుపుతారు. జెండా ఎలా ఎగరవేయాలో తన తండ్రి శాంతారాం విచారే నుంచి శిక్షణ తీసుకున్నానని ఆయన అన్నారు. బీఎంసీ ప్రధాన కార్యాలయంపై 1972 నుంచి శాంతారాం విచారే జెండావిష్కరణ, అవనతం పనులు చేపట్టారు. కాని 1987లో ఆయన పదవీ విరమణ పొందడంతో ఆ బాధ్యతలు తన భుజస్కంధాలపై వేసుకున్నానని అరవింద్ గర్వంగా చెబుతున్నారు. అంటే దాదాపు 41 సంవత్సరాల నుంచి బీఎంసీ ప్రధాన కార్యాలయంపై విచారే కుటుంబమే జెండావిష్కరణ, అవనతం లాంటి పనులు చేపడుతోంది. బీఎంసీ కార్యాలయంపై జెండా ఆవిష్కరించే పనులు అరవింద్ విచారేతోపాటు జయరాం ఖండములే, రాజేంద్ర భతాణేపై కూడా ఉన్నాయి. వీరిద్దరిలో విధులకు ఎవరు వచ్చినా, రాకపోయినా అరవింద్ విచారే అడుగులు మాత్రమే ఉదయం, సాయంత్రం టైపైకి వెళతాయి. ఉదయం ఎగరవేసే సమయంలో, సాయంత్రం దింపే సమయంలో అది నేలను తాక కుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో జెండా తడిసిపోయి ఇనుప కొయ్యకు అతుక్కుపోతుంది. వేగంగా వీచే ఈదురుగాలులకు అది చినిగిపోయే ఆస్కారముంటుంది. ఇలాంటి సమయంలో ఎంతో సంయమనంతో, జాగ్రత్తగా కిందికి దింపాల్సి ఉంటుందని ఆయన అంటారు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం ఇలా రెండు పర్యాయాలు మాత్రమే జాతీయజెండాను మారుస్తారు. ఈ మధ్యకాలంలో ఒకవేళ జెండాను మార్చాల్సి వస్తే నియమ నిబంధనాల ప్రకారం పూర్తి గౌరవంతో వెంటనే కొత్తదాన్ని అమరుస్తారు. పాత జెండాను ఏం చేస్తారనేది చెప్పడం నిబంధనలకు విరుద్ధమని విచారే వెల్లడించారు. పాశ్వర్ గోసావి : 30 ఏళ్లుగా మాడా కార్యాలయం భవనంపై ఉదయం జెండా ఏర్పాటు, సాయంత్రం అవనతం చేపడుతున్నానని గోసావి అన్నారు. 2011లో పదవీ విరమణ పొందిన తర్వాత కాంట్రాక్టు బేస్‌పై ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులు చూసుకుంటున్నానని తెలిపారు. దీంతో ఇప్పటికీ స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో క్రమం తప్పకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానన్నారు. తనతోసహా తన సహచరులు 10 రోజుల ముందు నుంచి పనుల్లో నిమగ్నమవుతామన్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఈ పనులు చేపట్టడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని అన్నారు. ఇక ముందు కూడా కొనసాగిస్తానని గర్వంగా చెబుతున్నారు. గౌతన్ ననావరే: కొలాబాలో ఉన్న బెస్ట్ ప్రధాన కార్యాలయం భవనంపై 27 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా జెండా ఎగరవేస్తున్నానని గౌతన్ అన్నారు. బెస్ట్ భవనంపై మే ఒకటి, ఏప్రిల్ 13, జాతీయ వారోత్సవాలు, ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ రెండో తేదీన జెండా ఎగురవేస్తారు. ఎంతో అప్రమత్తంగా ఉండి ఈ పనులు చూసుకుంటానని అన్నారు. లక్ష్మణ్ వాఘేలా గత 25 ఏళ్ల నుంచి సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయంపై ప్రతీరోజు ఉదయం జెండా ఎగరవేయడం, సాయంత్రం అవనతం చేయడం తన పని అని చెప్పారు. జెండాను అవనతం చేసిన తర్వాత ఒక పద్ధతిలో మడత పెట్టి, ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ గౌరవంగా దాచి ఉంచాల్సి ఉంటుందన్నారు -
స్వాతంత్య్ర దిన వేడుకల్లో అపశ్రుతులు
ములుగు, వనపర్తి, న్యూస్‌లైన్: మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో స్వాతంత్య్ర దిన వేడుకల్లో గురువారం అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. మెదక్ జిల్లాలో జెండా వందనం ఏర్పాట్లు చేస్తూ ఇద్దరు యువకులు, మహబూబ్‌నగర్ జిల్లాలో జెండాను దించిన తర్వాత ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థి అసువులు బాశారు. వివరాలివీ.. మెదక్ జిల్లా ములుగు మండలం సింగన్నగూడ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట జెండాను ఎగురవేసేందుకు ఉదయం నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన నారె నరేశ్(25), కంచనపల్లి మహేష్ గౌడ్ (26) కలసి జెండా కోసం తయారుచేసిన ఇనుపపైపును గద్దెపై నిలపబోయారు. అయితే, వారి చేతుల్లో ఉన్న పైపు హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తాకి, షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. చికిత్సకోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పట్టణంలోని బండార్నగర్లోని సీవీ రామన్ టాలెంట్ స్కూల్ రెండంతస్తుల భవనంపై ఉదయం జెండాను ఆవిష్కరించారు. పాఠశాల పీఈటీ కృష్ణానాయక్(26), పదో తరగతి విద్యార్థి శరత్ (15)లు సాయంత్రం ఇనుపరాడ్‌కు కట్టిన జాతీయ జెండాను కిందకు దించారు. మెట్ల మీదుగా తీసుకొస్తుండగా సమీపంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్‌వైర్లకు తాకి, వారిద్దరూ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన తర్వాత పాఠశాల నిర్వాహకులు కనిపించకుండాపోయారు.