పోలీస్ కార్ల ఫ్లాగ్‌పోల్స్ దొంగల అరెస్టు | Police arrest car flag poles thieves | Sakshi
Sakshi News home page

పోలీస్ కార్ల ఫ్లాగ్‌పోల్స్ దొంగల అరెస్టు

Published Tue, Mar 15 2016 3:09 PM | Last Updated on Tue, Oct 2 2018 7:21 PM

Police arrest car flag poles thieves

పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలో ఉన్నతాధికారుల 8 కార్లకు చెందిన బ్రాస్ ఫ్లాగ్‌పోల్స్ తొలగించిన ఇద్దరు నిందితులను, వాటిని కొనుగోలు చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపిన వివరాలప్రకారం ... పంజగుట్ట ఐఏఎస్, ఐపీఎస్ కాలనీలో ఈ నెల 2వ తేదీన 8 మంది ఐఏఎస్ అధికారుల కార్లు బయటపెట్టగా తెల్లారేసరికి వాటికి ఉన్న ప్లాగ్‌పోల్స్ (కారు ముందు భాగంలో జెండా అమర్చే పరికరం) కనిపించకుండా పోయాయి.
ఓ ఐఏఎస్ అధికారి కారు డ్రైవర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే కాలనీలో ఓ ఉన్నతాధికారి ఇంట్లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉండే ఓ మహిళ కొడుకు రాజేష్ ఖన్నా అలియాస్ రాకేష్ (19) బ్యాండ్ కొడుతూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఇతని స్నేహితుడు డి. శ్రీనివాస్‌తో కలిసి ఫ్లాగ్‌పోల్స్ దొంగతనం చేసి ద్వారకాపూరి కాలనీలో స్క్రాప్ దుకాణం నిర్వహించే సుధాకర్‌కు అమ్మారు. దీనిని గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను, సుధాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement