Rajesh Khanna
-
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
డింపుల్ కపాడియా… బాలీవుడ్లో ఒకప్పుడు తన అందచందాలతో భారీగా ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న బ్యూటీగా పేరుగాంచింది. డింపుల్ అంటేనే అందం అనేంతగా యూత్ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ దర్శకత్వంలో రిషీ కపూర్‌ను హీరోగా తెరకెక్కించిన ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన డింపుల్. తొలి మూవీతోనే హిట్ కొట్టి ఓవర్ నైట్ బాలీవుడ్ స్టార్ అయిపోయింది. ఆ సినిమా నాటికి ఆమె వయసు 16 ఏళ్లు మాత్రమే. డింపుల్ కపాడియా 'రుడాలి'లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ నిలచింది.16 ఏళ్ల వయసులోనే గర్భండింపుల్ కపాడియా 1957లో బొంబాయిలో ఒక సంపన్న గుజరాతీ వ్యాపారవేత్త కుటుంబంలో జన్మించింది. చిన్నతనంలో ఆమెను అమీనా అని పిలిచేవారు కానీ డింపుల్గానే ఆమె పేరు స్థిరపడింది. బాలీవుడ్ హిట్ చిత్రం బాబీలో నటించిన డింపుల్ తన కంటే 15 ఏళ్లు సీనియర్ అయిన సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాతో డేటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ అయినట్లు కూడా ఆప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో 1973లో డింపుల్ తనకంటే 15 ఏళ్లు పెద్దవాడు అయిన రాజేష్ ఖన్నాను పెళ్లిచేసుకుని వార్తల్లో నిలిచింది. బాబీ సినిమాతోనే ఆమె సినిమా కెరియర్‌కు ఫుల్స్టాప్ పడిపోయింది. తన భర్త కోరిక మేరకు సినిమాలను వదిలేసింది. ఈ సంఘటనలతో ఆమె స్టార్డమ్ ఒక్కసారిగా కోల్పోయింది.స్టార్ హీరోకు అత్తగా..1974లో ట్వింకిల్ ఖన్నాకు ఆమె జన్మనిచ్చింది. అంటే ఆమె 16 ఏళ్ల వయసులోనే గర్భం దాల్చారు. ట్వింకిల్ ఖన్నాను అక్షయ్ కుమార్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు పిల్లనిచ్చిన అత్తగానే కాకుండా ప్రత్యేకమైన పాత్రలతో పలు సినిమాల్లో డింపుల్ కపాడియా బిజీగా ఉంది.పిల్లల కోసం విడాకులకు దూరం1982లో రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా విభేదించి విడిపోయారు. 1985లో ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'నేను, రాజేశ్ ఖన్నా వివాహం చేసుకున్న రోజుతోనే నా జీవితం ముగిసిపోయింది. ఆపై సంతోషం కూడా ముగిసింది.' అని చెప్పింది. రాజేశ్ ఖన్నా తనను మోసం చేశారని డింపుల్ రోపించింది. ఆ ఆరోపణలను రాజేశ్ ఎప్పుడూ ఖండించలేదు. పిల్లల కోసం ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోలేదు. రాజేశ్ ఖన్నా ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయన తరపున ప్రచారం కూడా చేసింది డింపుల్. వీరిద్దరూ విడిపోయిన తర్వాత 1984లో, డింపుల్, రిషి కపూర్ జంటగా సాగర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. తరువాతి 10 సంవత్సరాలలో వరుస హిట్లు అందుకున్న డింపుల్ కపాడియా బాలీవుడ్లో అగ్ర కథానాయికలలో ఒకరిగా స్థిరపడింది.సన్నీ డియోల్‌తో ప్రేమకథరాజేశ్ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్‌కూ సన్నీ డియోల్ మంచి సోల్‌మేట్ అయ్యాడు. కష్టకాలంలోఆమెకు అండగా నిలబడ్డాడు.వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. 1998లో సినిమా ఛాన్స్‌లు తగ్గిపోవడంతో కొవ్వొత్తుల వ్యాపారం ప్రారంభించింది. సన్నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. చివరి దాకా భార్యగా రాజేశ్ కు సపర్యలు చేసింది డింపుల్. 2012 జూలై 18న రాజేశ్ ఖన్నా మరణించారు.ఇప్పుడేం చేస్తుందిదిల్ చాహ్తా హై, లక్ బై ఛాన్స్, కాక్టెయిల్, దబాంగ్, బ్రహ్మాస్త్ర, పఠాన్ వంటి చిత్రాలలో డింపుల్ కనిపించింది. 2020లో, ఆమె 62 సంవత్సరాల వయసులో క్రిస్టోఫర్ నోలన్ హిట్ సినిమా 'టెనెట్'లో సహాయక పాత్ర ద్వారా హాలీవుడ్ అరంగేట్రం చేసింది. 2024లో, ఆమె రెండు చిత్రాలలో కనిపించింది. -
15 ఏళ్లకే పెళ్లి.. నా కడుపులో బిడ్డకు తండ్రెవరని అడిగాడు: నటి
'రోటీ కప్డా ఔర్ మకాన్', 'అనురాగ్' వంటి సినిమాలతో బాగా ఫేమస్ అయింది సీనియర్ నటి మౌసమి చటర్జీ. తన కెరీర్లో వందకుపైగా సినిమాలు చేసింది. ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే ఆమెను దివంగత స్టార్ నటుడు రాజేశ్ ఖన్నా దారుణంగా అవమానించాడట. తాజాగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మౌశమి. నీ బిడ్డకు తండ్రి ఎవరు? మౌసమి మాట్లాడుతూ.. 'నేను గర్భవతిగా ఉన్నప్పుడు రాజేశ్ ఖన్నా ఓ ప్రశ్న అడిగాడు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నీ భర్త జయంత ముఖర్జీయేనా? లేదంటే నటుడు వినోద్ మెహ్రానా? అని ప్రశ్నించాడు. నాకెంత కోపం వచ్చిందో! నిజానికి నటుడు వినోద్ మెహ్రా మంచి వ్యక్తి. అతడు మా పెళ్లికి కూడా వచ్చాడు. అయినా రాజేశ్ ఖన్నా చాలాసార్లు చండాలంగానే మాట్లాడేవాడు. ఈరోజు ఆయన లేరనుకోండి. నేను కూడా ఇచ్చిపడేశా రాజేశ్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆయన అనారోగ్యంతో ఉంటే పరామర్శించడానికి వెళ్లాను. నా కూతురి ముందే నన్ను మెచ్చుకుంటూ ఏదేదో వాగాడు. మీ అమ్మ ఎంత పిచ్చిదంటే తనను చూసి మేమంతా భయపడేవాళ్లం. తను ఏదీ అంత ఈజీగా నమ్మేది కాదని చెప్పాడు. ప్రతిసారి నేనెందుకు భరిస్తాను. తనకు కూడా ఇచ్చిపడేశాను. తన పిల్లల వంక చూస్తూ వీళ్లు నీ పిల్లలా? లేదంటే రిషి కపూర్ సంతానమా? అని అడిగేశా. నా నుంచి ఇది ఊహించని రాజేశ్ నోట మాట రాక షాక్ అయిపోయాడు. కాంప్రమైజ్‌కు ఒప్పుకోలేదని.. ఇకపోతే 'దేశ్ ప్రేమి', 'బర్సాత్ కీ ఏక్ రాత్' వంటి ఎన్నో సినిమాలకు నేను సంతకం చేశాను. కానీ చివరకు నన్ను సినిమా నుంచి తీసేవారు. ఎందుకంటే వాళ్లు అడిగే కాంప్రమైజ్‌కు నేను ఒప్పుకునేదాన్ని కాదు. అడ్డదారిలో నేను సినిమాలు చేయలేను. చాలామంది సీనియర్ హీరోయిన్లు నువ్వింత అందంగా ఉన్నావు, టాలెంట్ ఉంది.. కానీ హీరోల ఫేవరెట్ లిస్టులో మాత్రం లేవని అంటూ ఉండేవారు. అయినా సరే, నాకు నచ్చకుండా ఏ పనీ చేసేదాన్ని కాదు' అని చెప్పుకొచ్చింది మౌసమి. 15 ఏళ్ల వయసులోనే పెళ్లి కాగా రాజేశ్ ఖన్నా హీరోయిన్ డింపుల్ కపాడియాను పెళ్లాడాడు. వీరికి ట్వింకిల్ ఖన్నా, రింక్ల్ ఖన్నా అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. మౌసమి విషయానికి వస్తే ఆమె 15 ఏళ్ల వయసులోనే జయంత్ ముఖర్జీని పెళ్లాడింది. వీరికి మేఘ, పాయల్ అని ఇద్దరు కూతుర్లు సంతానం. పాయల్ చిన్నవయసులోనే మధుమేహం బారిన పడగా 45 ఏళ్ల వయసులో ఆమె మరణించింది. చదవండి: కడుపులో కణతి.. నటికి ఆపరేషన్.. 3 వారాలుగా బెడ్‌పైనే -
తొలి సినిమా రిలీజ్‌కు ముందే సూపర్‌స్టార్‌తో పెళ్లి.. పిల్లలు పుట్టాక..
భారతీయ సినిమా తొలినాళ్లలో ఓ వెలుగు వెలిగిన సూపర్ స్టార్లలో రాజేశ్ ఖన్నా ఒకరు. వరుసగా 15 హిట్లు కొట్టిన రికార్డు ఆయన పేరు మీద ఉంది. ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్న రోజులవి.. ఆ సమయంలో బాబీ(1973) సినిమాతో వెండితెరపై కథానాయికగా మెరిసింది డింపుల్ కపాడియా. ఇది ఆమె తొలి చిత్రం. అయితే ఈ సినిమా రిలీజవడానికి ముందే తన అందచందాల గురించి జోరుగా ప్రచారం జరిగింది. అది రాజేశ్ ఖన్నా చెవిన పడింది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. తన చేయి పట్టుకుని నడిచాడు. అలా 1973లో తనకంటే రెట్టింపు వయసున్న రాజేశ్‌ను పెళ్లాడింది డింపుల్. పెళ్లి తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారనుకున్న ఈ దంపతులు 1984లో విడిపోయారు. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. అప్పటికే వీరికి ట్వింకిల్ ఖన్నా, రింఖీ ఖన్నా జన్మించారు. భర్తతో విడిపోయిన తర్వాత 1985లో సాగర్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది డింపుల్. ఆ సినిమా రిలీజ్ సమయంలో తను ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకోగా ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. 'ఓసారి నేను, రాజేశ్ ఖన్నా చార్టెడ్ ఫ్లైట్‌లో అహ్మదాబాద్ వెళ్తున్నాం. అతడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నాడు. విమానం దిగడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో అతడు నా కళ్లలోకి సూటిగా చూసి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అప్పుడు నా వయసు 16 మాత్రమే! పెళ్లికి సరిగ్గా ఏడు రోజుల ముందు అతడి గురించి పూర్తిగా తెలుసుకున్నాను. చాలా త్వరత్వరగా మా పెళ్లి జరిగిపోయింది. ఏ రోజైతే ఆయనతో నా వివాహం జరిగిందో అప్పుడే నా సంతోషం, జీవితం ముగిసిపోయినట్లనిపించింది. బాబీ సినిమా తర్వాత ఒక్కో ప్రాజెక్టుకు రూ.5 లక్షలిస్తామని ఆఫర్ చేశారు. కానీ ఆ వయసులో కెరీర్ ప్రాధాన్యత అర్థం కాలేదు. రాజేశ్ ఇంట్లో అడుగుపెట్టి ఆశీర్వాదం తీసుకున్న రోజు నాకెందుకో ఈ పెళ్లి వర్కవుట్ కాదేమో అనిపించింది. పలువురు మహిళలు ఆయన జీవితంలోకి వస్తున్నారని తెలిసినా బాధేయలేదు. కానీ మా బంధం బలంగా లేదని మాత్రం అర్థమైంది. పైగా సమానత్వం అనే మాట మా విషయంలో నిజం కాలేదు. అతడి కెరీర్ నెమ్మదిగా డౌన్ అవడంతో మా మధ్య పోట్లాటలు మరింత పెరిగాయి. చివరికి ఇద్దరం విడిపోయాం' అని చెప్పుకొచ్చింది డింపుల్. చిత్రపరిశ్రమలో అందరూ కాకాజీ అని పిలుచుకునే రాజేశ్ ఖన్నా తీవ్ర అనారోగ్యంతో 2012 జూలై 18న మరణించారు. దంపతులుగా విడిపోయినప్పటికీ డింపుల్.. రాజేశ్ ఖన్నాతో స్నేహితురాలిగానే మెదిలేవారు. ఆయన చివరి రోజుల్లోనూ వారిద్దరూ కలిసే ఉన్నారు. చదవండి: డైరెక్టర్ నమ్మలేదు, రెండు ఆడిషన్స్ ఇచ్చాను: హీరోయిన్ -
Dimple Kapadia: భర్తతో విడిపోయినా విడాకులివ్వలేదు, ఎందుకంటే..
Happy Birthday Dimple kapadia: డింపుల్ కపాడియా… ఒకప్పుడు తన అందచందాలతో కుర్రకారులకు నిద్రలేకుండా చేసిన బ్యూటీ. అప్పటి డింపుల్ అందాలను తలచుకొని ఈ నాటికీ పరవశించిపోయేవారెందరో ఉన్నారు. బాలీవుడ్ షో మ్యాన్ రాజ్ కపూర్ దర్శకత్వంలో రిషీ కపూర్‌ను హీరోగా తెరకెక్కించిన ‘బాబీ’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అయిన డింపుల్.. తొలి మూవీతోనే హిట్ కొట్టి ఓవర్ నైట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయింది. అంతేగా కాదు ఉత్తమనటిగా ‘ఫిలిమ్ ఫేర్’ అవార్డును ఎగరేసుకు పోయింది. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఆతర్వాత ‘రుడాలి’లో తన నటవిశ్వరూపం చూపించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగానూ డింపుల్ నిలచింది. ఇదిలా ఉంటే ‘బాబీ’ సినిమా విడుదల కాకముందే, డింపుల్ గురించి బాలీవుడ్లో చర్చలు మొదలయ్యాయి. ఆమె అందం, నటన గురించి బాలీవుడ్ పెద్దలంతా చర్చించుకున్నారు. ఆ విషయం ఆ నోటా, ఈ నోటా ఆ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాను చేరింది. అతను తొలి చూపులోనే డింపుల్‌తో ప్రేమలో పడిపోయాడు. ఇక సూపర్ స్టార్ రాజేశ్‌ను చూశాక, డింపుల్ కూడా ఇష్టపడింది. దీంతో తనకంటే వయసులో 15 ఏళ్ళు పెద్దవాడయినా, రాజేశ్ ఖన్నాను వివాహమాడటానికి అంగీకరించింది డింపుల్. ‘బాబీ’ రిలీజ్ కు కొన్ని నెలల ముందే(1973) రాజేశ్, డింపుల్ పెళ్ళాడారు. పెళ్ళయ్యాక డింపుల్ సినిమాలకు దూరంగా ఉంది. ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా పుట్టిన తరువాత కూడా రాజేశ్, డింపుల్ మధ్య అన్యోన్యబంధమే ఉందని చెప్పవచ్చు. కారణం ఏంటో తెలియదు కానీ ఆ తర్వాత రాజేశ్, డింపుల్ మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. దాంతో పరస్పర అంగీకారంతోనే విడిపోయారు. రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా విభేదించి విడిపోయినా, ఏ నాడూ ఒకరి ఇష్టాలకు మరొకరు అడ్డుగా నిలువలేదు. పిల్లల కోసం ఈ దంపతులు విడాకులు కూడా తీసుకోలేదు. పార్టీల్లో కలుసుకున్నప్పుడు ఫ్రెండ్స్ లా మాట్లాడుకొనేవారు. రాజేశ్ ఖన్నా ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేయగా, ఆయన తరపున ప్రచారం కూడా చేసింది డింపుల్. ఈ ఎన్నికలో రాజేశ్ ఖన్నా విజయం సాధించారు. అందుకే విడాకులు ఇవ్వలేదు రాజేశ్ ఖన్నాతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న డింపుల్‌కూ సన్నీ డియోల్ మంచి సోల్‌మేట్ అయ్యాడు. కష్టకాలంలోఆమెకు అండగా నిలబడ్డాడు.వారిద్దరి ప్రేమకథ చిత్రసీమలో భలేగా చక్కర్లు కొట్టింది. వారి లవ్ ఎఫైర్ ను క్యాష్ చేసుకొనేందుకు నిర్మాతలు, దర్శకులు కూడా సన్నీ, డింపుల్ జోడీని ఎంచుకొనేవారు. అయితే వీరిద్దరు ప్రేమ గురించి తెలిసి సన్నీ భార్య పూజ అప్పట్లో గొడవ కూడా చేసింది. దీంతో ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందిగా సన్నీని కోరిందట డింపుల్. కానీ సన్నీ మాత్రం భార్యకు విడాకులు ఇచ్చేందుకు ఇష్టపడలేదట. సన్నీ నిర్ణయంపట్ల కలత చెందిన డింపుల్... రాజేశ్‌కి విడాకులు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకుందట. సన్నీతో సన్నిహితంగా ఉన్నప్పటికీ.. చివరి దాకా భార్యగా రాజేశ్ కు సపర్యలు చేసింది డింపుల్. -
శభాష్.. రాజేష్ కన్నా!
కేపీహెచ్‌బీకాలనీ: లాక్డౌన్ సందర్భంగా ‘కనెక్ట్– చాన్సలర్’’ పేరుతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆన్లైన్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన జేఎన్టీయూహెచ్ రిసెర్చ్ స్కాలర్ రాజేష్ కన్నాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంస పత్రంతో అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రశంసపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లోని విద్యార్థులకు కనెక్ట్– చాన్సలర్ పేరుతో పోటీలను నిర్వహించగా రాజేష్‌ఖన్నా కవితలు, వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జేఎన్టీయూహెచ్లో స్కాలర్‌గానే కాకుండా సామాజిక స్పృహ కలిగిన రచయితగా రాజేష్‌కన్నా ఇప్పటికే పలు పోటీల్లో ప్రతిభను ప్రదర్శించారు. తాజాగా గవర్నర్ నిర్వహించిన పోటీల్లోనూ ప్రశంస పొందటం పట్ల యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. -
క్యాన్సరే విలన్
విలన్ ఎంత పెద్దవాడైతే వాడి తాట తీసిన హీరోఅంత గొప్పవాడు అవుతాడు. సినిమా కథలు రాసుకునేవాళ్లుసినిమాలు తీసినవాళ్లు.. నమ్మిన విషయం ఇది.సినిమాలోనే కాదు, జీవితంలో కూడావిలన్ని తుదముట్టించినవాళ్లు..విలన్‌తో పోరాడినవాళ్లు. పోరాడుతూ ప్రాణ త్యాగం చేసినవారు.. అసలైన సినిమా హీరోలు! ‘‘కొన్నిసార్లు మనం ఊహించని పరిణామాలను జీవితం మనకు ప్రసాదిస్తుంది. బాగా నొప్పి కారణంగా సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుంటే.. అది సర్వశక్తులతో పోరాడాల్సిన వ్యాధిని నాకు పరిచయం చేసింది.’’.. నిన్నటి తరం బాలీవుడ్ అందాల నటి సోనాలీ బింద్రె తనకు కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయిన తర్వాత చేసిన ట్వీట్ సారాంశం ఇది. తనకు హై గ్రేడ్ క్యాన్సర్ ఉన్నట్టు తేలిందని, దీనిని తాను కనీసం ఊహించను కూడా లేదని, అయినప్పటికీ నా కుటుంబం, స్నేహితులే దన్నుగా ఆశావాహ దృక్పథంతో తాను యుద్ధానికి సిద్ధమయ్యానని ఆమె ప్రశంసనీయమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సోనాలీ.. తనను మింగేయడానికి వచ్చిన రాకాసితో పోరాడి గెలిచేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. ఒకప్పుడు గొప్పగొప్పవాళ్లకే వస్తుందనుకుని క్యాన్సర్‌ను ‘రాచపుండు’ అనేవారు. ఇప్పుడు అందరికీ చుట్టమైపోయిన క్యాన్సర్.. తొలి నుంచీ తెరవేల్పులను గట్టిగానే పీడిస్తోంది. అందాల తారల్ని, గ్లామర్ రంగాన్ని చూసి తనకూ అసూయ పుట్టిందేమో అన్నట్టుగా శరీరంలోని కళాకాంతుల్ని పూర్తిగా నాశనం చేసేద్దామన్నంత కాంక్షగా వారిని ఆక్రమించుకుంటోంది. ఇటీవలి కాలంలో పలువురు సినీ తారలు ఈ వ్యాధి బారిన పడిన ఉదంతాలు, దానిని దీటుగా ఎదుర్కొని జయించిన విజయగా«థలు మనం వింటూ వచ్చాం. నర్గీస్‌దత్: క్యాన్సర్ కాటుకు గురైన అత్యంత ప్రముఖుల్లో చాలా మందికి తెలిసిన పేరు నర్గీస్. ఈ అందాల నటి, మాజీ ఎంపీ సునీల్‌దత్ భార్య. అప్పట్లో.. అంటే 1950ల కాలంలో స్టార్‌గా వెలిగిన నర్గీస్ దత్ పాంక్రియాట్రిక్ క్యాన్సర్ వ్యాధికి గురై న్యూయార్క్‌లో చికిత్స అనంతరం ఇండియాకి తిరిగివచ్చినా.. మళ్లీ ఆసుపత్రి పాలయ్యారు. కోమాలోకి వెళ్లి, ఒక్కరోజులోనే మృతి చెందారు. తెరమీద తన కొడుకు సంజయ్‌దత్‌ని హీరోగా చూడాలన్న కోరిక తీరకుండానే, సంజయ్ తొలి సినిమా విడుదలకు వారం రోజుల ముందే ఆమెను క్యాన్సర్ నిర్ధాక్షిణ్యంగా కబళించేసింది. రాజేశ్‌ఖన్నా: ఇదే వ్యాధికి గురై జీవితాన్ని కోల్పోయిన మరో అగ్రతార రాజేశ్‌ఖన్నా. ఒకనాటి ఈ అమ్మాయిల కలల రాకుమారుడు కూడా క్యాన్సర్ ఆకలికి ఆహారం కాక తప్పలేదు. సినీ, రాజకీయ రంగాల్లో రాణించిన రాజేశ్‌ఖన్నా 2011లో ఈ వ్యాధి బారిన పడి ఏడాది కూడా తిరగకుండానే, తనకు 60 ఏళ్ల వయసులోనే మరణించాడు. ఒకానొక టైమ్‌లో అమితాబ్ వంటి టాప్ స్టార్స్ సరసన చోటు సంపాదించుకున్న వినోద్‌ఖన్నా కూడా అడ్వాన్స్డ్ బ్లాడర్ క్యాన్సర్ బాధితుడిగా మారి.. 70 ఏళ్ల వయసులో దానితో పోరాడలేక మననుంచి దూరమైపోయాడు. ముంతాజ్ : అయితే అలనాటి తారల్లో కూడా క్యాన్సర్‌పై మొక్కవోని దీక్షతో పోరాడుతున్నవారు ఇంకా ఉన్నారు. అలాంటి వారిలో చెప్పుకోవాల్సింది అందాల నటి ముంతాజ్ పేరు. 54 ఏళ్ల వయసులో 2002లో బ్రెస్ట్ క్యాన్సర్‌కి గురైన ముంతాజ్... అరడజను కీమోథెరపీలు, 35 రేడియేషన్ల తర్వాత కూడా ఇంకా దానితో పోరాడుతూనే ఉన్నారు. ‘‘నేనంత తేలికగా దేనినీ వదలను. ఆఖరికి ప్రాణాన్ని కూడా. గుమ్మం దాకా వచ్చిన చావుతో కూడా యుద్ధం చేస్తా’’ అని ఎంతో పట్టుదలగా చెబుతారామె. మనీషా కొయిరాలా: నవతరం తారల్లో కూడా అనేకమంది ఈ ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కోవడంలో పై చేయి సాధిస్తుండటం కనిపిస్తోంది. అలాంటివారిలో మనీషా ఒకరు. 1942 ఎ లవ్‌స్టోరీ, బొంబాయి, భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి 90ల నాటి చిత్రాలతో ఉత్తరాది, దక్షిణాది ప్రేక్షకుల కలల రాణిలా మారి ఎందరికో నిదురను దూరం చేసిన మనీషా కొయిరాలా.. కొంత కాలం తర్వాత నున్నని గుండుతో, పీక్కుపోయిన చెంపలతో వాడిపోయిన వదనంతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేయగా చూసిన ఆమె అభిమానుల గుండెలు బద్దలైపోయాయి. అవును మరి... మనీషా... ఓవెరీన్ క్యాన్సర్ బారినపడ్డారు. మృత్యుముఖం దాకా వెళ్లి , మూడేళ్ల పోరాటం తర్వాత కోలుకున్నారు. అమెరికాలో చికిత్స చేయించుకున్న ఈ 47 ఏళ్ల నటి ప్రస్తుతం క్యాన్సర్ రహిత జీవితం గడుపుతూ... క్యాన్సర్‌పై పోరాటానికి ప్రేరణగా వెలుగుతున్నారు. లీసా రే: శరీరంలో ఎక్కడైనా వ్యాప్తి చెందగలిగిన ఈ ప్రాణాంతక సర్వాంతర్యామి... అందమైన తారల్ని మరింత మోహిస్తుందేమో అనిపిస్తుంది. బోంబే డైయింగ్ మోడల్‌గా, మహేష్‌బాబు సరసన టక్కరిదొంగ హీరోయిన్గా ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వని గ్లామర్ పంచిన లీసా రేపై కూడా ఈ వ్యాధి దాడి చేసింది. టొరంటోలో జన్మించడం, బెంగాలీ తండ్రి, పోలిష్ తల్లికి పుట్టడం లాంటి విశేషవంతమైన జీవితం ఉన్న లిసారేకు సోకిన క్యాన్సర్ కూడా విశేషమైనదే. ఆమె ఎటోబైకోక్ అనే అత్యంత అరుదైన తరహా క్యాన్సర్‌కి గురయ్యారు. యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేసే ప్లాస్మా సెల్స్‌కు సోకే క్యాన్సర్‌కి ఆమె బాధితురాలయ్యారు. ఒక స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స తర్వాత 2010లో తాను క్యాన్సర్ నుంచి కోలుకున్నానని ఆమె ప్రకటించారు. అయితే ఇది పూర్తిగా నయమయ్యే వ్యాధి కానప్పటికీ.. దానికి తలవంచకుండా ఆత్మవిశ్వాసంతో లిసా రే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. గౌతమి: దక్షిణాది కథానాయికగా మనకు చిరపరిచితమైన గౌతమి తాడిమల్ల కూడా ఇదే వ్యాధితో పోరాడి విజయం సాధించారు. తనను కబళించడానికి వచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్‌ను తరిమి కొట్టిన ఆమె తనలా పోరాడే వారికి అవసరమైన మద్దతును అందిస్తున్నారు. దేశ విదేశాల్లో ఈ వ్యాధిపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ‘‘ఈ వ్యాధిపై పోరాడి జయించడంలో మనోబలం చాలా కీలకమైంది. దీనికి కావాల్సింది చుట్టుపక్కలవారి మద్దతు’’ అంటారామె. మమతా మోహన్‌దాస్: కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు.. మరిన్ని ఆశలతో ముందుకు దూసుకుపోతున్నప్పుడు, ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని తేలితే... ఇంకెవరైనా అయితే కుప్పకూలిపోయేవారేమో కాని మన నటి మమతా మోహన్‌దాస్ మాత్రం కాదు. ప్రేక్షకుల రివార్డ్స్‌తో పాటు ఫిల్మ్‌ఫేర్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు కూడా దక్కించుకున్న ఆనందంతో ఉన్న ఆమెను అదే సమయంలో కేన్సర్ పలకరించింది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు హడ్గికిన్ లింఫోమా కేన్సర్ సోకింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా చికిత్స కొనసాగిస్తున్న ఆమె చాలా త్వరగానే ఆ వ్యాధి తాలూకు తీవ్ర ప్రభావం నుంచి బయటపడ్డారు. తన కెరీర్‌ను అలాగే కొనసాగిస్తున్నారు. ఇంతే కాదు... కైట్స్ సినిమాలో హృతిక్‌రోషన్ సరసన మెరిసిన బార్బరామోరి సైతం క్యాన్సర్ బాధితురాలే. అయితే సినిమాల్లోకి రావడానికి ముందే ఆమె ఈ వ్యాధి బారిన పడటం, దానిపై గెలవడం కూడా జరిగిపోయాయి. అదే సినిమాకు దర్శకత్వం వహించిన అనురాగ్ బసు, బార్బరాలు ఇద్దరూ క్యాన్సర్ సర్వైవర్లే. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిరువురూ తమ విజయగాథలను పంచుకున్నారు. ఇర్ఫాన్ ఖాన్: ప్రస్తుతం బాలీవుడ్లో క్రేజీ యాక్టర్‌గా వెలుగుతున్న సమయంలోనే ఇర్ఫాన్ సైతం క్యాన్సర్‌కు గురయ్యాడు. కొన్ని వారాల పాటు తన ఆరోగ్యంపై వచ్చిన వదంతుల అనంతరం ఈ బాలీవుడ్ యాక్టర్... మార్చి 16న తనకు న్యూరాన్ డొక్రైమ్ ట్యూమార్ ఉన్నట్టు ట్వీట్ ద్వారా నిర్ధారించాడు. ప్రస్తుతం లండన్‌లో చికిత్స పొందుతున్నాడు. అలసిపోవడం సహజం. ఆగిపోవడం మరణం. ఊపిరి ఉన్నంత వరకూ ఆశను ఉంచుకో... అంటూ పట్టుదలతో ప్రాణాల్ని పట్టి ఉంచుతున్న ఈ తెరవెలుగుల ప్రయాణం మరెందరికో స్ఫూర్తిని అందిస్తుంది. తారల్లో రేపటి విజేత గురించి రాసేందుకు మరో పేజీని నీ కోసం సిద్ధంగా ఉంచాం... గెట్ వెల్ సూన్ సోనాలి. ఇల్నెస్.. విల్‌పవర్ పాంక్రియాస్ క్యాన్సర్‌కు మూడు నెలల పాటు యు.ఎస్.లో చికిత్స తీసుకుని ఇటీవలే తిరిగి విధులకు హాజరైన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గురువారం నాడు పత్రికా సంపాదకులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్నప్పుడు ప్రస్తావన మాత్రంగా క్యాన్సర్‌తో తనెలా పోరాడిందీ ఎంతో స్ఫూర్తివంతంగా చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత తిరిగి ఆరు రోజుల పాటు చికిత్స కోసం యు.ఎస్.లో ఉండవలసి వస్తుందని చెబుతూ, విల్‌పవర్ ఉంటే ఎవరైనా, ఎలాంటి ‘ఇల్నెస్’నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చునని ఆయన అన్నారు. – సత్యబాబు -
రానా సినిమాలో మెగా హీరో..!
యంగ్ హీరో రానా త్వరలో ఓ బహుభాషా చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. హథీ మేరీ సాథి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన రానా.. సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేశాడు. తాజా సినిమా విశేషాలు తెలియజేసిన దర్శకుడు ప్రభు సాల్మాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ సినిమాలో రానాతో పాటు మరో యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా కీలక పాత్రలో నటించనున్నట్టుగా తెలిపాడు. అది కూడా రానాతో సమానమైన ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అని వెల్లడించాడు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందించి తరువాత తమిళ్ లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నట్టుగా వెల్లడించారు. రానా బందేవ్ పాత్రలో నటిస్తున్న ఈసినిమాను బాలీవుడ్ సీనియర్ నటుడు రాజేష్ ఖన్నాకు నివాళిగా తెరకెక్కిస్తున్నట్టుగా తెలిపారు. -
బాలీవుడ్ క్లాసిక్ రీమేక్ లో రానా
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకుండా విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న యువ నటుడు రానా. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రానా ఇటీవల నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సోలో హీరోగా కూడా ఘనవిజయం సాధించాడు. బహుభాషా నటుడిగా గుర్తింపు రావటంతో రానా కీలక పాత్రలో తెరకెక్కుతున్న సినిమాలన్ని మూడు నాలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. 1945 పేరు తో తెరకెక్కుతున్న పీరియాడిక్ సినిమాలో నటిస్తున్న రానా.. ఆ సినిమా తరువాత ఓ బాలీవుడ్ క్లాసిక్ ను రీమేక్ చేయనున్నాడు. 1971లో రాజేష్ ఖన్నా హీరోగా తెరకెక్కిన ‘హాథీ మేరే సాథీ’ సినిమాను రానా హీరోగా రీమేక్ చేయనున్నారు. ఈసినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా పీరియాడిక్ జానర్ లోనే తెరకెక్కుతోంది. ఈ రోజు (గురువారం) రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగోను రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ ను న్యూ ఇయర్ కానుక 2018 జనవరి 1న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడు రానా. My next is on its way!! #HaathiMereSaathi first look on January 1st 2018!! pic.twitter.com/OqOpdrIKqR — Rana Daggubati (@RanaDaggubati) 13 December 2017 -
మన టార్జాన్!
కిలికిలి భాష గుర్తుందా! అదేనండీ... ‘బాహుబలి’ సినిమాలో కాలకేయులు మాట్లాడారు కదా! ‘బాహుబలి’ మానియా టైమ్‌లో కిలికిలి భాష గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు భల్లాలదేవుడు.. అదేనండీ హీరో రానా మరో భాషపై కాన్సంట్రేట్ చేశారు. కానీ, ఇది మనుషులు మాట్లాడుకునేది కాదట. మరైతే.. ఏమై ఉంటుంది? అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాం. ప్రకృతి భాష అట! ఏనుగులతో మాట్లాడేందుకు ప్రిపేర్ అవుతున్నారు రానా. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రానా హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు హిందీలో ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. హాథీ మేరే సాథీ అంటే ఏనుగుతో సహచర్యం అని అర్థం. 1971లో రాజేష్ ఖన్నా, తనుజా జంటగా వచ్చిన ‘హాథీ మేరే సాథీ’ చిత్రానికి ఇది రీమేక్ అట. ‘‘హాథీ మేరే సాథీ’ చిత్రంలో నటించబోతున్నాను. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించడం నాకిష్టం.. ఒక మనిషికి, ఏనుగుకి మధ్య ఉండే చక్కని రిలేషన్షిప్ నేపథ్యంలో సాగే కథ. ప్రభు సాల్మన్ కథ చెప్పేటప్పుడు నేచర్‌పై అతనికి ఉన్న ఇంట్రెస్ట్ తెలిసింది’’ అని పేర్కొన్నారు రానా. హాలీవుడ్ మూవీ ‘టార్జాన్’ సిరీస్‌లో హీరో ఏనుగుతోనూ దోస్తీ చేస్తాడు. మన టార్జాన్ (రానా) కూడా ఇప్పుడు చేయబోతున్నారు. -
లండన్ వీధుల్లో సీనియర్ నటుల సాన్నిహిత్యం!
బాలీవుడ్ స్టార్స్ సన్నీడియోల్, డింపుల్ కపాడియాలు లండన్ వీధుల్లో షికార్లు చేస్తున్నారు. 80, 90లలో ఐదు సినిమాలో కలిసి నటించిన ఈ జంట చాలా కాలం తరువాత ఇలా కలిసి కనిపించటం బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరి మధ్య అప్పట్లో ఎఫైర్ ఉందనే రూమర్లు వచ్చాయి. ఇప్పుడు వీరు ఇలా సన్నిహితంగా కనిపించడంపై సోషల్‌మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. వీరిద్దరు లండన్ వీధుల్లో షికారు చేస్తున్న వీడియో ఒకటి బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'సన్నీడియోల్, డింపుల్ కపాడియాలు కలిసి తన సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు.. వారి జంట ఎంతో అందంగా ఉంది' అంటూ కామెంట్ చేశారు కేఆర్కే. 2015లో రిలీజ్ అయిన వెల్ కం బ్యాక్ సినిమా తరువాత డింపుల్ వెండితెర మీద కనిపించలేదు. సన్నీడియోల్ రీసెంట్ గా పోస్టర్ బాయ్స్ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. బాలీవుడ్ స్టార్ గా ఉండగానే డింపుల్ బాలీవుడ్ లెజండరీ నటుడు రాజేష్ ఖన్నాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. 2012లో రాజేష్ ఖన్నా ఆరోగ్య సమస్యలతో మృతి చెందిన తరువాత కూడా డింపుల్ నటిగా కొనసాగారు. -
లండన్ వీదుల్లో సన్నీ, డింపుల్
-
నాన్న చెప్పినట్టే మారాను: నటి
ముంబై: ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా, నటి డింపుల్ కపాడియాల ముద్దుల కూతురు ట్వింకిల్ ఖన్నా. తల్లిదండ్రుల బాటలో ట్వింకిల్ కూడా నటనను కెరీర్‌గా ఎంచుకున్నా.. ఆమెను రచయిత్రిగా చూడాలన్నది రాజేష్ ఖన్నా కోరికట. ట్వింకిల్ ఈ విషయాన్ని చెప్పింది. 'నేను రచయిత్రి కావాలన్నది నాన్న కోరిక. నేను రచయిత్రిగా ఉండాలని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. నాన్న కోరికను నెరవేర్చినందుకు గర్వంగా ఉంది' అని ట్వింకిల్ వెల్లడించింది. 1995లో ఆమె బర్సాత్ సినిమా ద్వారా బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. 2001లో హీరో అక్షయ్ కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత ఇంటీరియర్ డిజైనర్‌గా, కాలమిస్ట్‌గా మారింది. -
రాయలపూర్తండాలో యువకుడి ఆత్మహత్య
కౌడిపల్లి మండలం రాయలపూర్తండాలో శుక్రవారం రాజేష్‌ఖన్నా(22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేష్ తన భార్యతో బంగారు నగల విషయమై గొడవపడి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ వివాదం ముగిసిపోయిందండి: హీరో
అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో రాజేశ్ ఖన్నా ఓ అథమస్థాయి నటుడని, అతని వల్ల బాలీవుడ్లో చెత్త సినిమాలు వచ్చాయంటూ తీవ్ర వ్యాఖ్యలతో నసీరుద్దీన్ షా దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలపై రాజేశ్ ఖన్నా అల్లుడు, బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ స్పందించారు. ‘నేను సినీ పరిశ్రమలో 25 ఏళ్లుగా ఉన్నాను. వేరే నటుడిగా గురించి నేను ఎప్పుడైనా మాట్లాడానా చెప్పండి. తెలివైన వారు తమ పని ఏదో తాము చూసుకుంటారని చెప్తారు. నేను కూడా నా పనేదో నేను చూసుకుంటాను. ఇతరుల మీద వ్యాఖ్యలు చేయడానికి నేనెవరిని?’ అని ఆయన పేర్కొన్నారు. తన మామపై వ్యాఖ్యల విషయంలో నసీరుద్దీన్ షా ఉదారంగా క్షమాపణలు చెప్పారని, కాబట్టి ఈ వివాదం ముగిసిపోయినట్టేనని అక్షయ్ అన్నారు. ‘ప్రతి ఒక్కరూ తమకు నచ్చినట్టు మాట్లాడారు. తమ గళాన్ని వినిపిస్తారు. అయినా ఇప్పుడు వివాదం ముగిసిపోయింది. నసీరుద్దీన్ షా క్షమాపణలు చెప్పారు. కాబట్టి ఆ విషయాన్ని మనందరం మరిచిపోవడమే మంచిది’ అని చెప్పారు. -
ఇక చాలు.. ఆపండి: అక్షయ్ కుమార్ భార్య
ముంబై: రాజేశ్ ఖన్నా మంచి నటుడు కాదంటూ నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలపై వివాదం ముగిసిందని రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా పేర్కొన్నారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని తన మద్దతుదారులకు సూచించింది. 'ఇక చాలు. ఈ వివాదం ఇక్కడితో ఆపేయండి. అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ మనకు ఉంది. ఇక అందరం పోకెమాన్ ఆట ఆడుకుందాం' అంటూ ట్వింకిల్ ఖన్నా ట్వీట్ చేసింది. 'ఈ ఆర్టికల్ పోస్ట్ చేసిన తర్వాత నేను కూడా పోకెమాన్ ఆడడానికి వెళతా'నని పేర్కొంది. రాజేశ్ ఖన్నా గొప్ప నటుడు కాదని, అతడి నటన సాధారణ స్థాయికంటే తక్కువగా ఉండేదని ఓ ఇంటర్య్వూలో నసీరుద్దీన్ షా వ్యాఖ్యానించడంతో ట్వింకిల్ ఖన్నా స్పందించారు. ఈ లోకంలోని తన తండ్రిని విమర్శించడం తగదని ఆమె పేర్కొన్నారు. అయితే తాను కావాలని రాజేశ్ ఖన్నాను విమర్శించలేదని వివరణ ఇచ్చిన నసీరుద్దీ షా క్షమాపణ కూడాచెప్పారు. తనకు మద్దతు నిలిచిన వారికి ట్వింకిల్ ఖన్నా ధన్యవాదాలు తెలిపారు. -
సారీ.. కావాలని మీ నాన్నను తిట్టలేదు!
అలనాటి నటుడు రాజేశ్ ఖన్నాపై బాలీవుడ్ విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా చేసిన విమర్శలు బాలీవుడ్లో చిన్నపాటి దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఘాటుగా స్పందించింది. ‘మీరు బతికున్న వారిని గౌరవించకున్నా పర్వాలేదు.. కానీ, చనిపోయినవారికైనా గౌరవమివ్వండి. బదులు ఇవ్వలేని వ్యక్తిని గురించి విమర్శలు చేయడం' దారుణమంటూ ఆమె మండిపడింది. దీంతో ఈ వివాదంపై నసీరుద్దీన్ షా తాజాగా వివరణ ఇచ్చారు. ఎవరినీ వ్యక్తిగతంగా గాయపరిచే ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఎవరినైనా తన వ్యాఖ్యల వల్ల బాధపడితే క్షమించాలని కోరారు. తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, 70 దశకంలోని పరిస్థితి గురించి వ్యాఖ్యానించానని ఆయన చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో రాజేశ్ ఖన్నా గురించి మాట్లాడుతూ.. 'ఆయనో మామూలు నాసిరకం అథమ నటుడు. ఆయన నటన కూడా చాలా పరిమితంగా ఉంటుంది. మేధోపరంగానూ ఆయన గొప్ప వ్యక్తేమీ కాదు. ఆయనకు బొత్తిగా అభిరుచి కూడా లేదు. అందువల్లే 70వ దశకంలో సగటు సినిమాలు వచ్చాయి' అని విమర్శించారు. -
మా నాన్నను చెత్త నటుడంటావా!
1970 దశకంలో బాలీవుడ్‌ను ఏలిన దిగ్గజ నటుల్లో రాజేశ్ ఖన్నా ఒకరు. ఆరాధన (1969), హాథీ మేరే సాథీ (1971), ఆనంద్ (1971) వంటి సినిమాలతో గొప్ప నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ను ఏర్పరుచుకున్న నటుడు ఆయన. ఖన్నా గురించి బాలీవుడ్ విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా తాజాగా విస్మయపరిచే విమర్శలు చేశారు. ఆయనో మామూలు నాసిరకం నటుడని, ఆయన నటన కూడా చాలా పరిమితంగా ఉంటుందంటూ విమర్శించాడు. మేధోపరంగా ఆయన గొప్ప వ్యక్తేమీ కాదని, ఆయనకు బొత్తిగా అభిరుచి కూడా లేదని, ఆయన వల్ల 70వ దశకంలో సగటు సినిమాలే వచ్చాయంటూ షా చెప్పుకొచ్చాడు. సాధారణంగానే సోషల్ మీడియాలో తన గళాన్ని గట్టిగా వినిపించే రాజేశ్ ఖన్నా కూతురు, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా.. ఈ విషయంలో ఘాటుగా స్పందించింది. షా వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన ట్వింకిల్.. ‘మీరు బతికున్న వారిని గౌరవించకున్నా పర్వాలేదు.. కానీ, చనిపోయినవారికైనా గౌరవమివ్వండి. బదులు ఇవ్వలేని వ్యక్తి గురించి విమర్శలు చేయడం నిజమైన సంకుచితత్వం’ అని బదులిచ్చింది. -
రాజేష్ ఖన్నా... ఆ అహం... ఆ తేజం....
నేడు రాజేష్ ఖన్నా వర్థంతి మనుషులతో జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ పూచిక పుల్లలా ఉన్నవాడు రేపు పెద్దవాడు కావచ్చు. టైమ్ బాగుంటే ప్రధాని అంతటి వాడు కూడా కావచ్చు. అయి ఊరుకుంటే పర్లేదు. పూచిక పుల్ల అంటూ తనను అవమానించినవారిని గుర్తు పెట్టుకుంటేనే చిక్కొస్తుంది. ఆపైన ప్రమాదం వస్తుంది. బాలీవుడ్లో రచయితలకు పెద్దగా విలువగానీ డబ్బుగానీ చాలాకాలం వరకూ లేవు. సలీమ్- జావేద్ ఈ విషయాన్ని మార్చాలనుకున్నారు. వీళ్లిద్దరూ రమేష్ సిప్పీ దగ్గర నెలకు రూ.750 రూపాయలకు పని చేసినవారే కావచ్చు కాని ‘హాతీ మేరి సాతీ’ (1971) సినిమాకు రూ. పదివేలు డిమాండ్ చేయగలిగారు. కాని అది కూడా చిల్లర డబ్బుగా భావించారు. ఎందుకంటే ఆ సినిమాలో హీరోగా నటించిన రాజేష్ ఖన్నా పారితోషికం ఎంతో తెలుసా? ఐదు లక్షలు. ఆ డబ్బుతో పోలిస్తే తమకు వచ్చింది చాలా తక్కువ అని జావేద్ అభిప్రాయం. మీ ముఖాలకు అంతకు మించి ఎందుకు నన్ను చూసి కదా వస్తారు అని రాజేష్ ఖన్నా అభిప్రాయం. అతడికి ఆ అభిప్రాయం ఉండటంలో తప్పు లేదు. అప్పటికే ఆరాధన (1969) వచ్చి ఆయన భారతీయ తొలి సూపర్‌స్టార్ అయి ఉన్నాడు. దేశం ఆయన పేరు చెప్తే వెర్రెత్తి పోతూ ఉంది. దేవుడని అంటోంది. ఆ దేవుడికి సలీమ్ జావేద్‌లు అల్పులుగా కనిపించి ఉండవచ్చు. రాజేష్ ఖన్నా తమను దగ్గర తీయలేదని కూడా వారికి బాధ ఉంది. ఇది అమితాబ్‌కు లాభించింది. ‘జంజీర్’ (1973) స్క్రిప్ట్‌కు దర్శకుడు ప్రకాశ్ మెహ్రా రాజేష్ ఖన్నాను ఆలోచించినా వీళ్లిద్దరూ అమితాబ్కే ఓటు వేశారు. అంతే కాదు షోలే, దీవార్ వంటి సూపర్ హిట్స్ రాసి సినిమాలను శాసించే స్థితికి వెళ్లాక వాళ్లు రాజేష్‌ఖన్నాతో ఒక్క సినిమా కూడా చేయలేదని గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. రాజేష్ ఖన్నా తనకు ప్రతిభావంతుల అవసరం ఉందని గుర్తించ లేదు. శక్తి సామంతా, కిశోర్ కుమార్, ఆర్.డి. బర్మన్ ఇలా కొద్ది మంది మాత్రమే అతని కోటరీలో ఉండేవారు. మిగిలిన వాళ్లందరూ ‘చెంచాలు’ (అలా అని ఇండస్ట్రీ అనేది)గా ఉండేవారు. రాజేష్ ఖన్నాకు క్రమశిక్షణ గురించి పట్టింపు లేదు. దర్శకులకు ఇది ఇబ్బంది. రాజేష్‌ఖన్నాతో రోటీ, దాగ్ వంటి సినిమాలు తీసిన మనమోహన్దేశాయ్, యశ్ చోప్రాలు అతడితో వేగలేక అమితాబ్‌ను ఎంచుకున్నారు. టైమ్ అంటే టైమ్‌గానే నడిచే అమితాబ్ బచ్చన్ వ్యవహార శైలి సుఖంగా ఉండటం అందుకు ప్రధాన కారణం ప్రతిభ కంటే. ఇక వ్యక్తిగతంగా అంజు మహేంద్రుతో ప్రేమ, డింపుల్‌తో పెళ్లి కూడా రాజేష్ ఖన్నాను కెరీర్‌పై దృష్టి పెట్టడంలో అంతరాయాన్ని కలిగించాయి. కాలం గడిచిపోయాక ఇలా బేరీజు వేయవచ్చుగాని కాలం గడుస్తూ ఉండగా తప్పొప్పులు అర్థం కావు. రాజేష్ ఖన్నా తాను నడిచిన దారిలో నడిచాడు. అతని రూపం, స్టయిల్, నటన, ప్రతిభ, హుందాతనం, నవ్వే కళ్లు... ఇవన్నీ జనాన్ని నచ్చాయి. ‘అభిమాని ఏర్పడటం’ అనే భావన అతని నుంచే మొదలయ్యింది. జిమ్మిక్కులు, ఎలక్ట్రానిక్ మీడియా సపోర్టు, సోషల్ మీడియాలో ప్రచారం ఇవన్నీ లేకుండానే రాజేష్ ఖన్నా ఈ దేశం మొత్తాన్ని ఊపాడు. ఒక దశలో దేశప్రధాని తర్వాత ప్రతి పౌరుడికీ తెలిసిన వ్యక్తి అయ్యాడు. అతని సినిమాలు ఫ్లాప్ అయి ఉండవచ్చు. కాని అతడు నాసిరకం సినిమాలు చేయలేదు. సినిమాలలో భ్రష్టత్వాలకు పాల్పడలేదు. స్టార్ అతను.... సూపర్‌స్టార్.తప్పు... లోపం... పొరపాటు... ఇవి ఎన్నైనా ఉండవచ్చు. అయినా అతడు ఈ దేశం మెచ్చిన హీరో. ఎప్పటికీ దేశం గుర్తు చేసుకునే హీరో. రాజేష్ ఖన్నా హిట్స్ 1. మేరె సప్నోంకి రాణి కబ్ - ఆరాధన 2. ఏ జో మొహబ్బత్హై - కటి పతంగ్ 3. కోరా కాగజ్ థా యే మన మేరా - కోరా కాగజ్ 4. గులాభీ ఆంఖే జో తేరి దేఖీ - ది ట్రైన్ 5. యూహీ తుమ్ ముజ్ సే బాత్ కర్తీ హో - సచ్చా ఝూటా 6. ఏ రేష్మి జుల్ఫే ఏ షర్బతీ ఆంఖే - దో రాస్తే 7. జిందగీ కా సఫర్ హై ఏ కైసా సఫర్ - సఫర్ 8. చింగారి కోయి భడ్ కే - అమర్ ప్రేమ్ 9. జిందగీ కైసి హై పహేలీ హా యే - ఆనంద్ 10. జిందగీ కె సఫర్ మే గుజర్ జాతె హై - ఆప్ కీ కసమ్ -
పోలీస్ కార్ల ఫ్లాగ్‌పోల్స్ దొంగల అరెస్టు
పంజగుట్ట ఆఫీసర్స్ కాలనీలో ఉన్నతాధికారుల 8 కార్లకు చెందిన బ్రాస్ ఫ్లాగ్‌పోల్స్ తొలగించిన ఇద్దరు నిందితులను, వాటిని కొనుగోలు చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపిన వివరాలప్రకారం ... పంజగుట్ట ఐఏఎస్, ఐపీఎస్ కాలనీలో ఈ నెల 2వ తేదీన 8 మంది ఐఏఎస్ అధికారుల కార్లు బయటపెట్టగా తెల్లారేసరికి వాటికి ఉన్న ప్లాగ్‌పోల్స్ (కారు ముందు భాగంలో జెండా అమర్చే పరికరం) కనిపించకుండా పోయాయి. ఓ ఐఏఎస్ అధికారి కారు డ్రైవర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే కాలనీలో ఓ ఉన్నతాధికారి ఇంట్లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉండే ఓ మహిళ కొడుకు రాజేష్ ఖన్నా అలియాస్ రాకేష్ (19) బ్యాండ్ కొడుతూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఇతని స్నేహితుడు డి. శ్రీనివాస్‌తో కలిసి ఫ్లాగ్‌పోల్స్ దొంగతనం చేసి ద్వారకాపూరి కాలనీలో స్క్రాప్ దుకాణం నిర్వహించే సుధాకర్‌కు అమ్మారు. దీనిని గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను, సుధాకర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
సూపర్ స్టార్ ఇంటిని కూల్చేస్తున్నారు
బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న బంగ్లా ఆశీర్వాద్‌ను కూల్చేస్తున్నారు. రాజేష్ ఖన్నా మరణం తరువాత ఆ బంగ్లాను కొనుక్కున్న శశి కిరణ్ శెట్టి అక్కడ మరో భారీ భవంతి నిర్మించాలనే ఆలొచనతో ఈ ఐకానిక్ బంగ్లాను నేలమట్టం చేసే పనిని మొదలు పెట్టాడు. దశాబ్దాల పాటు కపూర్ల ఫాలోయింగ్‌కి సాక్ష్యంగా నిలిచిన ఆశ్వీరాద్ చరిత్రలో కలిసిపోతుండటం బాలీవుడ్ సినీ అభిమానులు తీవ్రంగా కలిచి వేస్తుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా 1970లో నటుడు రాజేంద్ర కుమార్ నుంచి 3.5 లక్షలకు ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ బంగ్లాకు డింపుల్ అనే పేరుండేది. అయితే రాజేంద్ర కుమార్ అదే పేరుతో మరో బంగ్లాను నిర్మించటంతో రాజేష్ ఖన్నా స్యయంగా తన ఇంటికి ఆశీర్వాద్ అని పేరు పెట్టుకున్నారు. ఆఖరి రోజు వరకు ఖన్నా ఇదే ఇంట్లో నివాసం ఉన్నారు. 2014లో రాజేష్ ఖన్నా వారసులు ట్వింకిల్, రిన్నీలు 90 కోట్లకు ఈ ఐకానిక్ బంగ్లాను శశి కిరణ్ శెట్టికి విక్రయించారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవంతి స్థానంలో కొత్తగా అపార్ట్మెంట్ నిర్మించే ఆలోచనలో ఉన్నాడు శశి కిరణ్, ఇప్పటికే అన్ని రకాల అనుమతులు తీసుకున్న శెట్టి, ఆశీర్వాద్‌ను కూల్చేసే పని కూడా మొదలు పెట్టాడు. -
అనుకున్నామని జరగవు అన్నీ...
ఏ బియ్యపు గింజ మీద ఎవరి పేరు రాసి ఉంటుందో ఎవరికి తెలుసు? సినిమా పాత్రల విషయమూ సరిగ్గా అంతే! ఒక పాత్ర ఒకరి కోసం అనుకున్నా... ఆఖరికి అది వేరెవరికో దక్కడం సినీ రంగంలో సహజం. అలాంటి కొన్ని హిందీ చిత్రాలు... విచిత్రాలు... ‘జంజీర్’ అనగానే మనకు అమితాబ్ గుర్తుకొస్తారు. కానీ, జంట రచయితలు సలీమ్ -జావేద్ ‘జంజీర్’ కథ తయారు చేసి మొదట వినిపించింది దేవానంద్‌కు! ఆ తర్వాత ధర్మేంద్రకు చెప్పారు. ఇద్దరూ నిరాకరించారు. రాజేశ్ ఖన్నాకు చెబుదా మనుకున్నారు. అయితే ‘హాథీ మేరే సాథీ’ షూటింగ్లో రాజేశ్ ఖన్నాకు, వీరికి భేదాభిప్రాయాలు వచ్చాయి. మరి ఈ కథను ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అమితాబ్ బచ్చన్ నటించిన ‘బాంబే టూ గోవా’ చూశారు జావేద్. * ఆ కథకు అతనే హీరో అని నిర్ణయించేసుకున్నారు. అలా అనుకోకుండా దక్కిన ‘జంజీర్’తో అమితాబ్ సూపర్స్టారైపోయారు. * ‘షోలే’లో గబ్బర్‌సింగ్ పాత్రకు మొదట డానీని అనుకున్నారు. ఆయన నిరాకరించడంతో అమ్జాద్ఖాన్కు అవకాశం దక్కింది. * ‘ఆనంద్’ సినిమాను హృషీకేశ్ ముఖర్జీ నిజానికి ఉత్తమ్‌కుమార్‌తో తీయాలనుకున్నారు. కుదర్లేదు. ఆ తర్వాత కిశోర్‌కుమార్, శశికపూర్‌తో చేయాలనుకున్నారు. చివరకు రాజేశ్‌ఖన్నా, అమితాబ్ బచ్చన్‌తో ‘ఆనంద్’ పూర్తి చేశారు. * ‘రజనీగంధ’ చిత్రంలో మొదట శశికపూర్, షర్మిలా టాగూర్, అమితాబ్ బచ్చన్లను తీసుకోవాలనుకున్నారు బాసూ చటర్జీ. కానీ, వారి కాల్షీట్లు దొరకలేదట. అందుకే కొత్త తారలతో చేయాలని నిశ్చయించుకున్నారు. శశికపూర్ వేషానికి అమోల్ పాలేకర్‌ను, షర్మిలా టాగూర్ వేషానికి విద్యను, అమితాబ్ వేషానికి దినేష్ టాగూర్‌ను తీసుకున్నారు. కొత్తవారితో తీసిన ఆ చిత్రం గొప్ప విజయం సాధించింది. * అనిల్‌కపూర్, శ్రీదేవి నటించిన ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలో మొదట హీరోగా అమితాబ్ బచ్చన్‌ను అనుకున్నారు. * షారుక్ ఖాన్ కెరీర్లో మైలురాయి అంటే ‘దిల్ వాలే దుల్హేనియా లేజాయేంగే’చెప్పుకోవాలి. అందులో హీరోగా మొదట అనుకున్నది - సైఫ్ అలీఖాన్ని. * ‘లగాన్, మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రాలకు హీరోగా ముందు షారుక్ ఖాన్‌ను అనుకున్నారు. చివరకు ‘లగాన్’ ఆమిర్‌ఖాన్ చేస్తే, ‘మున్నాభాయ్’ చిత్రాన్ని సంజయ్‌దత్ చేశారు. * వసూళ్లలో సంచలనం సృష్టించిన ‘త్రీ ఇడియట్స్’కు మొదట హీరోగా షారుక్‌ఖాన్‌ను అనుకున్నారు రాజ్‌కుమార్ హిరానీ. అయితే షారుక్ ఖాన్ తన సొంత సంస్థలో చేద్దామని షరతు పెట్టాడు. దాంతో ఆ సినిమా ఆమిర్‌ఖాన్ దగ్గరకు వచ్చింది. * ‘రంగ్ దే బసంతి’ నిజానికి హృతిక్ రోషన్ సినిమా. ఆయన ఈ కథ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆమిర్‌ఖాన్ మాత్రం ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశాడు. -
రాజేష్‌ఖన్నా తొలి గురువు ఎవరంటే..
ప్రేమ- ద్వేషం రాజేష్‌ఖన్నా సూపర్‌స్టార్ కావచ్చు... అతడి కోసం వేలాదిమంది అమ్మాయిలు వెర్రెక్కిపోతుండవచ్చు... కాని ఒకరు మాత్రం అతణ్ణి లెక్క చేసేవారు కాదు. అసలు పట్టించుకునేవారు కూడా కాదు. అతడు మాత్రం ఆమె కోసం వెంపర్లాడేవాడు. ఆమె పేరే అంజు మహేంద్రు. ముంబైలో ఆ రోజుల్లో ఫ్యాషన్ ఐకాన్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గా, నటిగా పేరు పొందిన అంజు మహేంద్రు సినిమా రంగంలో రాజేష్ ఖన్నా పైకి రావడానికి అవసరమైన వేషభాషలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిన తొలి గురువు. ఆమె అతణ్ణి ఇష్టపడింది. అతడు ఆమెను ప్రేమించడమే కాక చాలా కృతజ్ఞతతో ఉండేవాడు. వాళ్లిద్దరూ దాదాపు ఏడేళ్లు కలిసి ఆ రోజుల్లో లివ్ ఇన్ రిలేషన్లో ఉండేవారు. అయితే ఆ జోడి విడిపోయింది. దానికి కారణం రాజేష్‌ఖన్నా పొజెసివ్‌నెస్ కావచ్చు. అంజు మహేంద్రు విస్తృతమైన ఎక్స్పోజర్ కావచ్చు. ఆమె ఎప్పుడూ అతడికి దొరికేది కాదు. పార్టీలు స్నేహాలతో బిజీగా ఉండేది. అంతేకాక బయట జనం అంతా పొగుడుతుంటే ఈమె మాత్రం ఏడ్చినట్టు చేశావ్... అక్కడ ఆ బట్టలు సరి కాదు... ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ సరికాదు అని విమర్శించేది. దాంతో రాజేష్‌ఖన్నా ఇగో బాగా హర్ట్ అయ్యింది. ఎంతగా అంటే అప్పటికి ‘బాబీ’ సినిమా రిలీజ్ కాకపోయినా తన కంటే వయసులో చాలా చిన్నదే అయినా డింపుల్ కపాడియాను పెళ్లి చేసుకునేంత వరకూ (1973) ఒంటి కాలి మీద ఉన్నాడు. అంజు మీద అతడికి ఎంత కచ్చ పెరిగిందంటే పెళ్లి బారాత్ ఆమె ఇంటి మీదుగా వెళ్లాలని పట్టుబట్టి ఆమె ఇంటి ముందు చాలా హంగామా చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత డింపుల్ ఇంటికి పరిమితమైంది. అంజు మహేంద్రు, రాజేష్ ఖన్నా దాదాపు 17 సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదు కూడా. అంజు మీద కోపంతో, అప్పటికే తనకు అందివచ్చిన స్టార్డమ్తో రాజేష్ ఖన్నా ఆమె కెరీర్ మీద ఒత్తిడి తెచ్చాడన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆమెకు నటిగా వేషాలు రాకుండా చేయడం, ఆమె నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుపడటం, వాటిని తనే కొనేసి మూల పడేయడం... జువెల్ థీఫ్ (1967), హస్తే జఖ్మ్ (1973) వంటి సినిమాలలో నటించినా హీరోయిన్గా పతాక స్థాయికి వెళ్లలేకపోవడానికి రాజేష్‌ఖన్నా ఒక కారణం అని చెబుతారు. అయితే ఆ తర్వాత వాళ్లు మళ్లీ స్నేహితులయ్యారు. రాజేష్ ఖన్నా చివరి రోజుల్లో వాళ్లిద్దరూ తరచూ కలిసేవారు. రాజేష్ ఖన్నా జీవితంలో ఆ తర్వాత కూడా చాలామంది స్త్రీలు ఉన్నారు. అతడితో 11 సినిమాలు చేసిన టీనా మునిమ్ (ఇప్పుడు టీనా అంబాని) అతణ్ణి దాదాపు పెళ్లి చేసుకోబోయిందని అంటారు. కాని డింపుల్‌తో చట్టపరంగా విడాకులు కాకపోవడం వల్ల ఇద్దరు ఆడపిల్లలు ఉండటం వల్ల వాళ్ల మీద ఎటువంటి ప్రభావం పడుతుందోనని రాజేష్‌ఖన్నా ఆమె కోరికను తిరస్కరించారని అంటారు. రాజేష్ ఖన్నా జీవితంలో ఏమి జరిగినా ఆయన ఎప్పుడూ కాంట్రవర్శీలకు దూరంగా ఉన్నాడు. ఎప్పుడూ ఏ గొడవలో దూరకుండా తన పనేదో తాను చేసుకుంటూ బతికాడు. ఇప్పటి స్టార్లను చూస్తే ఆ సూపర్‌స్టార్ వ్యక్తిత్వం ముందు కొంచెం చిన్నగానే కనిపిస్తారు. -
కలల రాణి...
‘మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీ థఊ...’ (‘నా కలల రాణీ నువ్వెప్పుడొస్తావ్..’ అని అర్థం) అంటూ ప్రేయసి షర్మిలా ఠాగూర్ని ఉద్దేశించి ‘ఆరాధన’ చిత్రంలో రాజేశ్ ఖన్నా పాడే పాటను మర్చిపోవడం అంత సులువు కావు. లవ్ సాంగ్స్‌లో ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిచిన వాటిల్లో ఈ పాటది అగ్రస్థానం. ఇప్పుడీ పాట ప్రస్తావన ఎందుకంటే... ‘ఎలి’ (ఎలుక అని అర్థం) అనే తమిళ చిత్రం కోసం ఈ పాటను రీమిక్స్ చేశారని సమాచారం. విశేషం ఏంటంటే.. హాస్యనటుడు వడివేలుతో కలిసి నటి సదా ఈ పాటకు కాలు కదిపారు. అదేంటీ అనుకుంటున్నారా? ఈ కామెడీ హీరో, సదా జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. వారిద్దరూ పాల్గొనగా ఇటీవల ఈ పాటను చిత్రీకరించారట. యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. -
మళ్లీ కోర్టుకెక్కనున్న ‘ఆశీర్వాద్’
-
మళ్లీ కోర్టుకెక్కనున్న ‘ఆశీర్వాద్’
బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నాకు ఎంతో ఇష్టమైన 'ఆశీర్వాద్' బంగ్లా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ముంబయి బాంద్రాలోని ఇదే బంగ్లాలో రాజేశ్ ఖన్నా 2012 జూలై 18న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణించిన తర్వాత వారసత్వం కింద కుమార్తెలు ట్వింకిల్, రింకీ ఖన్నాలకు ఆ ఆస్తి సంక్రమించింది. వారు ఇప్పుడు ఆ బంగ్లాను నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు విక్రయించినట్లు సమాచారం. నాలుగు దశాబ్దాలకు పైగా ఆ ఇంట్లో నివసించిన అనుబంధంతో ఆశీర్వాద్‌ను మ్యూజియంగా మార్చాలని ఖన్నా ఆశించారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం తన కూతుళ్లదేనని మరణానికి కొన్నేళ్ల ముందు ఆయన చెప్పారు. ప్రస్తుతం వరదాన్ ఆశీర్వాద్‌గా పిలుస్తున్న ఆ ఇంటిని ఆల్ కార్గో లాజిస్టిక్స్ చైర్మన్ శశికిరణ్ శెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. కాగా బంగ్లా ఆస్తిలో తనకు వాటా ఉంటుందని, రాజేశ్ ఖన్నా తనకు కూడా భర్తేనని ఆయన సహచరి అనితా అద్వానీ గతంలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఖన్నా కుటుంబ సభ్యులకు ఆమె లీగల్ నోటీసులు పంపించారు కూడా. డింపుల్ ఖన్నాతో విడిపోయిన అనంతరం రాజేశ్ ఖన్నా ఎనిమిదేళ్లు అనితా అద్వానీతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఖన్నా మృతి చెందిన అనంతరం ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే.. అనితా అద్వానీకి ఇందులో ఎలాంటి సంబంధం లేదని రాజేశ్ ఖన్నా భార్య డింపుల్, కూతుళ్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా వాదిస్తూ వచ్చారు. ఆశీర్వాద్ బంగ్లా తమ పేరు మీద ఉందని, అందుకే అమ్మకానికి పెట్టినట్లు వారు చెబుతున్నారు. దాంతో ఆశీర్వాద్ బంగ్లా అమ్మకం చెల్లదని పేర్కొంటూ అనితా అద్వానీ మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఇదే వివాదంలో కోర్టులో తనకు అనుకూలంగానే తీర్పు వచ్చిందన్నారు. అయితే కాకాజీ కుటుంబీకులు న్యాయస్థానంపై గౌరవం ఉంచకుండా బంగ్లాను విక్రయించాలనుకోవటం సరికాదన్నారు. దీనిపై తాను తుది వరకూ పోరాడతానకి అనితా అద్వానీ స్పష్టం చేశారు. సముద్రానికి అభిముఖంగా 603 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం రూ.90 కోట్ల వరకు పలుకుతుందని మార్కెట్ వర్గాల కథనం. అయితే ఎవరైనా థర్డ్ పార్టీ.. యాజమాన్య హక్కును కోరడానికి సంబంధించి జారీ చేసిన 14 రోజుల నోటీసు గడువు ముగిసిన తర్వాతే ఈ కొనుగోలు ఒప్పందం పూర్తి అవుతుంద నేది విశ్వసనీయ వర్గాల కథనమని టైమ్స్ ఆఫ్ ఇండియూ పేర్కొంది. 60వ దశకం చివర్లో మరో బాలీవుడ్ దిగ్గజం రాజేంద్రకుమార్ నుంచి ఈ భవనాన్ని కొనుగోలు చేసిన రాజేశ్‌ఖన్నా 80వ దశకంలో దాన్ని పునర్నిర్మించారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - రాజేశ్ ఖన్నా
-
కాకాజీ లేక.. ఒంటరిగా అనిపిస్తోంది: డింపుల్ కపాడియా
ఒకప్పుడు భర్త నుంచి విడిపోయినా.. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మాత్రం ఆయన లేని లోటు తెలుస్తోందట. అలనాటి ప్రముఖ నటి డింపుల్ కపాడియా ఈ మాట చెబుతోంది. రాజేష్ ఖన్నా మరణించి దాదాపు ఏడాది కావస్తుండగా ఆ లోటు డింపుల్‌ను బాగా బాధిస్తోంది. భారతీయ సినిమాలోనే మొట్టమొదటి సూపర్ స్టార్ అయిన రాజేష్ ఖన్నా.. వరుసగా 15 హిట్లు కొట్టి రికార్డు సృష్టించగా ఆ రికార్డుకు దరిదాపుల్లోకి కూడా ఇంతవరకు ఎవరూ వెళ్లలేకపోయారు. 1973లో డింపుల్ కపాడియా - రాజేష్ ఖన్నా పెళ్లి చేసుకున్నా, 1984లో విడిపోయారు. కానీ వాళ్లు విడాకులు మాత్రం తీసుకోలేదు. మళ్లీ రాజేష్ ఖన్నా చివరి రోజుల్లో వాళ్లు కలిసే ఉన్నారు. ఆయనకు విపరీతమైన మానసిక బలం ఉందని, అసలు భయమంటే ఏంటో ఆయనకు తెలియదని డింపుల్ చెప్పింది. మరణిస్తానన్న విషయం ఆయనకు తెలిసినా కూడా చివరకు భయపడలేదంది. ఆయన ఎవరికీ భారంగా ఉండేవారు కారని.. శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఎవరిమీదా ఆధారపడలేదని చెప్పింది. పరిశ్రమలో అందరూ 'కాకాజీ' అని పిలుచుకునే రాజేష్ ఖన్నా.. తీవ్ర అనారోగ్యం పాలై, గత సంవత్సరం జూలై 18న మరణించారు. ఆరేళ్ల నుంచి తనకు కష్టాలు తప్పట్లేదని, తొలుత తన అక్క, తర్వాత అన్న, ఆపై కాకాజీ మరణించారని డింపుల్ అంది. దీంతో ఇప్పుడు తనను పూర్తిగా ఒంటరితనం ఆవరించిందని ఆవేదన వ్యక్తంచేసింది. తన తల్లి ముగ్గురు బిడ్డలను కోల్పోగా తానొక్కదాన్నే మిగిలినట్లు చెప్పింది. అయినా ఆమె ఇప్పటికీ నిబ్బరంగా ఉందని, తాను మాత్రం ఇలా మిగిలిపోయానని వాపోయింది. -
రాజేశ్ ఖన్నా, నేను ప్రేమించుకున్నాం: అనితా అద్వానీ
బాలీవుడ్ నటుడు, సర్గీయ రాజేశ్ ఖన్నాతో చిన్నతనం నుంచే తనకు తెలుసు అని ఆయనతో సహజీవనం చేసిన అనితా అద్వానీ అన్నారు. కలర్ టెలివిజన్ చానెల్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ 7 కార్యక్రమంలో పాల్గొంటున్న అనితా .. వీజే ఆండీతో మాట్లాడుతూ.. మేమిద్దరం ప్రేమించుకున్నామని.. ఆయన భార్య డింపుల్ కపాడియాకు విడాకులు ఇవ్వకపోవడం కారణంగా పెళ్లి చేసుకోలేకపోయాం అని తెలిపారు. బాలీవుడ్ నటి డింపుల్ కపాడియాతో 10 సంవత్సరాల వైవాహిక జీవితం అనంతరం నెలకొన్న విభేదాల కారణంగా రాజేశ్ ఖన్నా ఒంటరిగా జీవితం గడిపారు. మరణాంతరం ఆయన నివసించిన భవనం నుంచి అనితాను రాజేశ్ ఖన్నా కుటుంబ సభ్యులు కోర్టు నోటిస్ పంపడం వివాదంగా మారింది. రాజేశ్ ఖన్నా మరణాంతరం నెలకొన్న డిప్రెషన్ నుంచి బయటపడడానికే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నానని తెలిపారు. -
రాజేశ్‌ఖన్నా విగ్రహావిష్కరణ
ముంబై: బాలీవుడ్లో మొదటి సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్‌ఖన్నా కాంస్య విగ్రహాన్ని నగరంలోని ఓ హోటల్లో ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఆవిష్కరించారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనారోగ్య సమస్యల కారణంగా ఖన్నా గత జూలై 18న మరణించడం తెలిసిందే. యూటీవీ స్టార్స్ చానెల్ ఆయన గౌరవార్థం బాంద్రాలోని బండ్‌స్టాండ్ ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంది. ఇక్కడ ఇది వరకే యశ్‌చోప్రా, రాజ్‌కపూర్, షమ్మీకపూర్, దేవానంద్ విగ్రహాలున్నాయి. ఖన్నా విగ్రహం కుడిచేతిలో రెండు బెలూన్లు కనిపిస్తాయి. ఇది ఆనంద్ చిత్రంలోని ఆయన పోజనే విషయం తెలిసిందే. విగ్రహావిష్కరణకు ఖన్నా మాజీ భార్య డింపుల్ కపాడియా, కూతురు ట్వింకిల్, అల్లుడు అక్షయ్‌కుమార్, ఆయన స్నేహితులు, బాలీవుడ్ ప్రముఖులు రిషికపూర్, జితేంద్ర, హేమామాలిని, రణధీర్ కపూర్, రాకేశ్ రోషన్, ఆశాపరేఖ్, జీనత్ అమన్, ఫర్హాన్ అఖ్తర్ సతీమణి అధునా, ఆమె తల్లి హానీ ఇరానీ, మిథున్ చక్రవర్తి, అంజూ మహేంద్రూ తదితరులు హాజరయ్యారు. ‘కాకాజీ (ఆయనను అంతా ఇలా ప్రేమగా పిలుచుకునేవారు) ఎప్పుడే శక్తిమంతుడే! జీవితాంతం ఎవరికీ భయపడకుండా తనకు నచ్చినట్టు వ్యవహరించారు. సినీపరిశ్రమకు ఆయన అందించిన సహకారం మరువలేనిది. ఆనంద్ పాత్రధారి మాదిరిగానే నిజజీవితాన్ని గడిపారు. ఆయనతో నా ప్రయాణం మధురమైనది. ఖన్నా జీవితభాగస్వామిని అయినందుకు గర్వంగా ఉంది’ అని డింపుల్ పేర్కొన్నారు. ఖన్నా నటించిన చివరి వాణిజ్య ప్రకటనలో ఆయన పలికిన కొన్ని మాటలను కూడా ఆమె ఈ సందర్భంగా వినిపించారు. ఆ ప్రకటనలో ఆయన ‘నా అభిమానులను నా నుంచి ఎవరూ దూరం చేయలేరు’ అని అంటారు. బాంద్రాలోని కార్టర్రోడ్డు లేదా మరేదైనా మార్గానికి ఖన్నా పేరు పెట్టాలని ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి రాజీవ్‌శుక్లాను ఆమె కోరారు. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ట్వింకిల్ ఖన్నా మాట్లాడుతూ నాన్న ఎల్లప్పుడూ తన హృదయంలోనూ ఉంటారని, ఆయన విగ్రహం ప్రతిష్ఠిస్తున్నందుకు తమ కుటుంబం ఎంతగానో సంతోషిస్తోందని చెప్పింది. ఇక అక్షయ్ తన పదేళ్ల కొడుకు రాసిన సందేశాన్ని చదివి వినిపించాడు. తాతతో తనకున్న అనుబంధాన్ని ఈ బాలుడు అందులో పేర్కొన్నాడు. ఆయన గొప్ప మనిషని, ఎప్పుడూ తన వెన్నంటే ఉంటారన్నాడు. ‘విగ్రహంలోని ఆయన చూపులు నిర్భీతి, సంతోషం, స్వేచ్ఛకు సంకేతాలు. జీవితాన్ని ఎప్పుడూ స్వేచ్ఛగా గడపాలని బెలూన్లు సూచిస్తాయి. విగ్రహం కూడా అద్భుతంగా ఉంది’ అని అక్షయ్ వివరించాడు. ఖన్నా బాలీవుడ్‌కు చేసిన కృషికి గుర్తింపు విగ్రహస్థాపన ద్వారా దక్కిందని హమామాలిని అన్నారు. ఆయన తనకు మంచి స్నేహితుడని చెప్పారు. ఖన్నా ప్రముఖ గేయాలు ‘అచ్చా తో హమ్ చల్తే హై’, ‘జిందగీ కా సఫర్’, ‘మేరే సప్నో కీ రాణి’ వంటి వాటిని వినిపించారు. భారత సినీపరిశ్రమ ప్రముఖుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఖన్నా 1962-72 మధ్యకాలంలో వరుసగా 15 హిట్లు ఇచ్చి సంచలనం సృష్టించారు. -
ముంబైలో రాజేశ్ ఖన్నా విగ్రహం ఆవిష్కరణ
బాలీవుడ్ చిత్రసీమలో మకుటంలేని మహారాజుగా వెలుగులు విరజిమ్మిన సుపర్‌స్టార్ రాజేశ్ ఖన్నా ధైర్యానికి ప్రతీక అని ఆయన మాజీ భార్య డింపుల్ కపాడియా పేర్కొన్నారు. ఆయన ఆనంద్ చిత్రంలో నటించడమే కాకుండా ఆనంద్‌లా జీవించారని తెలిపారు. మరణం సమీపించిన తరుణంలో కూడా రాజేశ్ ఖన్నా తన ముఖాన చిరునవ్వు చెక్కుచెదరలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. రాజేశ్ ఖన్నా విగ్రహాన్ని ముంబై నగరంలోని బాంద్రా విధిలో శనివారం ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి ఆయన కుటుంబ సభ్యులు డింపుల్ కపాడియా, కూతుళ్లు ట్వింకిల్ ఖన్న అల్లుడు అక్షయ్ కుమార్‌లు హాజరయ్యారు. చేతిలో బెలూన్లు పట్టుకున్నట్లు ఉన్న రాజేష్ ఖన్న విగ్రహాం చూస్తేంటే ఆనందంగా ఉందని అక్షయకుమార్ తెలిపారు. రాజేష్ ఖన్నా (కాకాజీ)కి ఆ అరుదైన గౌరవం లభించినందుకు ట్వింకిల్ ఖన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాజేశ్ ఖన్నా తనుకు మంచి స్నేహితుడని అందాల నటి హేమమాలిని తెలిపారు. అలాగే ఆయనతోకలసి నటించడం ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని చెప్పారు. రాజేశ్ ఖన్నాతో కలసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన సంగతిని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఆశా ఫరేఖ్, మిధున్ చక్రవర్తి రాకేష్ రోషన్, ఫరాహ్ అక్తర్, జితేంద్ర, జోయ అఖ్తర్, రణదీర్ కపూర్, రిషి కపూర్, జాకీ షరాఫ్, హేమమాలి తదితరులతోపాటు ఆయన అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 2012 జూలై 18న రాజేశ్ ఖన్నా తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.