రాజేశ్ ఖన్నా, మౌసమి చటర్జీ, వినోద్ మెహ్రా
'రోటీ కప్‌డా ఔర్ మకాన్', 'అనురాగ్' వంటి సినిమాలతో బాగా ఫేమస్ అయింది సీనియర్ నటి మౌసమి చటర్జీ. తన కెరీర్‌లో వందకుపైగా సినిమాలు చేసింది. ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే ఆమెను దివంగత స్టార్ నటుడు రాజేశ్ ఖన్నా దారుణంగా అవమానించాడట. తాజాగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మౌశమి.
నీ బిడ్డకు తండ్రి ఎవరు?
మౌసమి మాట్లాడుతూ.. 'నేను గర్భవతిగా ఉన్నప్పుడు రాజేశ్ ఖన్నా ఓ ప్రశ్న అడిగాడు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నీ భర్త జయంత ముఖర్జీయేనా? లేదంటే నటుడు వినోద్ మెహ్రానా? అని ప్రశ్నించాడు. నాకెంత కోపం వచ్చిందో! నిజానికి నటుడు వినోద్ మెహ్రా మంచి వ్యక్తి. అతడు మా పెళ్లికి కూడా వచ్చాడు. అయినా రాజేశ్ ఖన్నా చాలాసార్లు చండాలంగానే మాట్లాడేవాడు. ఈరోజు ఆయన లేరనుకోండి.
నేను కూడా ఇచ్చిపడేశా
రాజేశ్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆయన అనారోగ్యంతో ఉంటే పరామర్శించడానికి వెళ్లాను. నా కూతురి ముందే నన్ను మెచ్చుకుంటూ ఏదేదో వాగాడు. మీ అమ్మ ఎంత పిచ్చిదంటే తనను చూసి మేమంతా భయపడేవాళ్లం. తను ఏదీ అంత ఈజీగా నమ్మేది కాదని చెప్పాడు. ప్రతిసారి నేనెందుకు భరిస్తాను. తనకు కూడా ఇచ్చిపడేశాను. తన పిల్లల వంక చూస్తూ వీళ్లు నీ పిల్లలా? లేదంటే రిషి కపూర్ సంతానమా? అని అడిగేశా. నా నుంచి ఇది ఊహించని రాజేశ్ నోట మాట రాక షాక్ అయిపోయాడు.
కాంప్రమైజ్‌కు ఒప్పుకోలేదని..
ఇకపోతే 'దేశ్ ప్రేమి', 'బర్సాత్ కీ ఏక్ రాత్' వంటి ఎన్నో సినిమాలకు నేను సంతకం చేశాను. కానీ చివరకు నన్ను సినిమా నుంచి తీసేవారు. ఎందుకంటే వాళ్లు అడిగే కాంప్రమైజ్‌కు నేను ఒప్పుకునేదాన్ని కాదు. అడ్డదారిలో నేను సినిమాలు చేయలేను. చాలామంది సీనియర్ హీరోయిన్లు నువ్వింత అందంగా ఉన్నావు, టాలెంట్ ఉంది.. కానీ హీరోల ఫేవరెట్ లిస్టులో మాత్రం లేవని అంటూ ఉండేవారు. అయినా సరే, నాకు నచ్చకుండా ఏ పనీ చేసేదాన్ని కాదు' అని చెప్పుకొచ్చింది మౌసమి.
15 ఏళ్ల వయసులోనే పెళ్లి
కాగా రాజేశ్ ఖన్నా హీరోయిన్ డింపుల్ కపాడియాను పెళ్లాడాడు. వీరికి ట్వింకిల్ ఖన్నా, రింక్‌ల్ ఖన్నా అని ఇద్దరు కూతుర్లు జన్మించారు. మౌసమి విషయానికి వస్తే ఆమె 15 ఏళ్ల వయసులోనే జయంత్ ముఖర్జీని పెళ్లాడింది. వీరికి మేఘ, పాయల్ అని ఇద్దరు కూతుర్లు సంతానం. పాయల్ చిన్నవయసులోనే మధుమేహం బారిన పడగా 45 ఏళ్ల వయసులో ఆమె మరణించింది.
చదవండి: కడుపులో కణతి.. నటికి ఆపరేషన్.. 3 వారాలుగా బెడ్‌పైనే
Comments
Please login to add a commentAdd a comment