
బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. చాలా కాలంగా టోనీ బేగ్ అనే వ్యాపారవేత్తతో ఆమె డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరూ పెళ్లితో ఒకటయ్యారు. ‘రాక్‌స్టార్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నర్గీస్ ఫక్రీ మద్రాస్ కేఫ్, డిష్యుం, హౌజ్‌ఫుల్–3...మొదలైన సినిమాలతో అలరించింది. హాలీవుడ్ సినిమా ‘స్పై’లోనూ నటించింది.
‘అమావాస్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె పరిచయమైంది. పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లులో కూడా ఈ బ్యూటీ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ‘రాక్‌స్టార్ యాక్ట్రెస్’గా పిలుచుకునే నర్గీస్ ఫక్రీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

లాస్ ఏంజెల్స్‌లోని ఒక స్టార్ హోటల్‌లో నర్గీస్ ఫక్రీ, టోనీ బేగ్‌ల వివాహం జరిగింది. కానీ, పెళ్లి చేసుకున్న విషయాన్ని వారిద్దరూ అధికారికంగా వెల్లడించలేదు. అయతే, పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కేక్‌తో పాటు స్విట్జర్లాండ్‌కు సంబంధించిన టూర్ ఫొటోలను ఆమె షేర్ చేసింది. అమెరికాలో పెళ్లి చేసుకున్న వారిద్దరూ అక్కడినుంచే స్విట్జర్లాండ్ వెళ్లిపోయారు. టోనీ బేగ్ కశ్మీర్ కుటుంబానికి చెందిన ఒక వ్యాపారవేత్త అని తెలుస్తోంది. అయితే, చాలా ఏళ్ల క్రితమే వారి కుటంబం అమెరికాలో స్థరపడింది. వారిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు ఆమె గతంలో పరోక్షంగా చెప్పిన విషయం తెలిసిందే.