Hari Hara Veera Mallu Movie
-
‘రాజా సాబ్’ చూడాలంటే.. నా పక్కన ఒకరు ఉండాల్సిందే: నిధీ అగర్వాల్
‘‘నేను తెలుగు బాగా మాట్లాడగలను. కేవలం ‘అందరికీ నమస్కారం’ అనే బ్యాచ్ కాదు’’ అన్నారు హీరోయిన్ నిధీ అగర్వాల్. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో ‘రాజా సాబ్’, పవన్ కల్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ సమయం కుదిరినప్పుడల్లా నెటిజన్లతో ముచ్చటిస్తుంటారు. అయితే కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేని నిధీ అగర్వాల్ చాలా విరామం తర్వాత ‘ఆస్క్ నిధి’ పేరుతో నెటిజన్లతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కెరీర్, వ్యక్తిగత విషయాలపై నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. మీకు తెలుగు మాట్లాడటం వస్తుందా మేడం? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘నాకు తెలుగు మాట్లాడటం బాగా వస్తుంది. కేవలం ‘అందరికీ నమస్కారం’ అంటూ జస్ట్ అలా మాట్లాడే బ్యాచ్ కాదు’’ అంటూ సూటిగా జవాబిచ్చారు. ‘తెలుగులో ఎందుకు తక్కువ సినిమాలు చేస్తున్నారు?’ అనే మరో ప్రశ్నకు.. ‘‘నేను మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. మీకు బోర్ కొట్టకుండా మీ అభిమానం పొందే చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నా. అయితే 2025లో తెలుగులో నేను నటించిన ఎక్కువ సినిమాలు విడుదలవుతాయి’’ అని చెప్పారు. ‘జీవితంలో ఏది చాలా ముఖ్యం అనుకుంటారు?’ అనే మరో ప్రశ్నకు ‘‘ప్రశాంతత’’ అంటూ సమాధానం ఇచ్చారు. ‘ఓ నటిగా మీకు చాలా కష్టంగా అనిపించేది ఏంటి?’ అని ఓ నెటిజన్ అడగ్గా.. ‘‘పీఆర్ మెయింటేన్ చేయడం నాకు చాలా కష్టమైన పనిగా అనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు. ‘మీకు హారర్ సినిమాలంటే ఇష్టమేనా? ఒంటరిగా కూర్చొని చూస్తారా?’ అనే ప్రశ్నకు ‘‘అస్సలు చూడలేను. నాతో పాటు ఎవరో ఒకరు ఉండాల్సిందే. ‘రాజా సాబ్’ (హారర్ నేపథ్యంలో రూపొందుతోంది) సినిమా చూడ్డానికి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో థియేటర్స్‌కి రండి’’ అని బదులిచ్చారు. అలాగే మరికొందరు నెటిజన్ల ప్రశ్నలకు నిధీ అగర్వాల్ స్పందిస్తూ– ‘‘ప్రభాస్‌గారితో కలిసి నటించిన ‘రాజా సాబ్’ సినిమా సెట్లో ఎంతో సరదాగా పని చేశాం. ఈ మూవీ టీమ్‌లో ఎంతో నిజాయతీ ఉంది. ‘హరి హర వీరమల్లు’ సెట్లో పవన్ కల్యాణ్‌గారితో ఇటీవల ఓ సెల్ఫీ తీసుకున్నాను... త్వరలోనే ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను. రాబోయే నూతన సంవత్సరంలో నేను నటించిన ‘ది రాజా సాబ్’, ‘హరి హర వీరమల్లు’ విడుదలవుతాయి.. ఆ సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువవుతాను. ఆ రెండు చిత్రాలతో పాటు మరో సర్ప్రైజింగ్ మూవీ కూడా ఉంది.. త్వరలోనే ఆ మూవీ ప్రకటన కూడా వస్తుంది’’ అంటూ తెలిపారు నిధీ అగర్వాల్. -
'హరి హర వీరమల్లు' విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ మళ్లీ పట్టాలెక్కింది. ఈ క్రమంలోనే విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సుమారు నాలుగేళ్ల క్రితం షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, విజయవాడలో ఈ చిత్రం కోసం ఒక భారీ సెట్‌ను మేకర్స్ వేశారు. దీంతో నేటి నుంచి 'హరి హర వీరమల్లు' కొత్త షెడ్యూల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా 'హరి హర వీరమల్లు' ప్రాజెక్ట్‌ను క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్-1 మాత్రం వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు అధికారికంగా ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్,నోరాహి ఫతేహి, నిధి అగర్వాల్, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త కీలక పాత్రలలో నటించారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
పవన్ 'హరిహర వీరమల్లు'.. మరో వికెట్ డౌన్?
'హరిహర వీరమల్లు' సినిమా నుంచి మరో వికెట్ డౌన్? అవును మీరు సరిగానే విన్నారు. ఏమైందో ఏమో గానీ ఈ మూవీకి అస్సలు కలిసి రావట్లేదు. ఎందుకంటే ఏళ్లకు ఏళ్లు సెట్స్‌పైనే ఉంది. నిర్మాతలు ఈ ఏడాది వచ్చేస్తుందని అంటున్నారు. కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం డౌట్. ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కాబట్టి. దీనికి తోడు మూవీ టీమ్ నుంచి ఒక్కొక్కరుగా తప్పుకోవడం చూస్తుంటే సినిమాపై లేని పోని సందేహాలు రావడం గ్యారంటీ.అప్పుడెప్పుడో లాక్డౌన్ కంటే ముందు 'హరిహర వీరమల్లు' సినిమా పవన్ ఒప్పుకొన్నాడు. కానీ దీని తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 'భీమ్లా నాయక్', 'బ్రో' రిలీజ్ అయిపోయి ఏళ్లు గడిచిపోయాయి. ఇది పాన్ ఇండియా అని అంటారేమో. చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి గానీ ఎలాంటి మూవీనైనా నెలల్లో కంప్లీట్ చేసేయొచ్చు. కానీ పవన్‌కి ఎందుకో 'వీరమల్లు'పై ఆసక్తి లేనట్లు ఉంది. అందుకే ఇలా జప్యం చేస్తూ వస్తున్నారు.(ఇదీ చదవండి: విడాకుల బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే?)ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ని తీసుకున్నారు. కానీ అతడు తప్పుకోవడంతో బాబీ డియోల్‌ని తీసుకొచ్చారు. ఇక రీసెంట్గా దర్శకుడిగా క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత రత్నం పెద్ద కొడుకు జ్యోతికృష్ణ మిగిలిన పని పూర్తి చేయనున్నారు. తాజాగా కొత్త షెడ్యూల్ గురించి డిస్కషన్ అని చెప్పి మూవీ టీమ్ ఓ ఫొటో రిలీజ్ చేసింది. ఇందులో సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ బదులు మరో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కనిపించారు.దీంతో పవన్ సినిమా నుంచి మూడో వికెట్ డౌన్ అయిందని మాట్లాడుకుంటున్నారు. ఇలా నిర్మాణంలో ఉన్నప్పుటే మార్పులు ఎక్కువైతే అది ఫైనల్ ఔట్పుట్ మీద పడే అవకాశాలు ఎక్కువ. మరి 'హరిహర వీరమల్లు' సినిమాని ఏం చేస్తారో? ఎప్పుడు థియేటర్లలోకి తీసుకొస్తారో ఆ పెరుమాళ్లకే ఎరుక!(ఇదీ చదవండి: తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?) -
పవన్ కల్యాణ్‌కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నాడు. గెలుస్తాడో లేదో పక్కనబెడితే ఇతడిని నమ్ముకున్న దర్శక నిర్మాతలు మాత్రం మెంటలెక్కిపోతున్నారు. అలాంటిది సడన్‌గా 'హరిహర వీరమల్లు' టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు వరస అప్డేట్స్ ఇస్తున్నారు. దీనిపై ఫ్యాన్స్ నుంచి ఏమంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ఈ సినిమా ఒకటి ఉందనే చాలామంది మర్చిపోయారు. ఇవన్నీ కాదన్నట్లు డైరెక్టర్ విషయంలో సరికొత్త రూమర్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)2019 ఎన్నికల టైంలో పూర్తిగా సినిమాలే చేయనని చెప్పిన పవన్.. భీమవరం, గాజువాకలో పోటీ చేసిన చిత్తుగా ఓడిపోయాడు. దీంతో మాట మార్చేసి మళ్లీ మూవీస్ చేశాడు. అలా ఒప్పుకొన్న వాటిలో 'హరిహర వీరమల్లు' ఒకటి. మూడు నాలుగేళ్ల క్రితం సెట్స్‌పైకి వెళ్లిన ఈ పాన్ ఇండియా చిత్రానికి క్రిష్ దర్శకుడు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. అయితే దీని తర్వాత ఒప్పుకొన్న వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు రిలీజై పోయాయి గానీ 'హరిహర' మాత్రం మూలకి పడిపోయింది.దీంతో అభిమానులతో సహా ప్రేక్షకులు 'హరిహర..' సినిమా ఉందనే విషయమే మర్చిపోయారు. ఇప్పుడు ఉన్నఫలంగా టీజర్ అని చెప్పి నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో నిర్మాత, నిర్మాణ సంస్థ పేర్లు మాత్రమే ఉన్నాయి. డైరెక్టర్ క్రిష్ పేరు ఎక్కడా లేదు. తాజాగా రిలీజ్ చేసిన మరో పోస్టర్లోనూ లేకపోవడం షాకిచ్చింది. అయితే ఆలస్యం అవుతుండటం వల్ల క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడని, అతడి బదులు నిర్మాత కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వం చేస్తారని అంటున్నారు. అయితే క్రిష్ కావాలనే తప్పుకొన్నాడా? లేదంటే తప్పించారా? అనే టాక్ నెటిజన్ల మధ్య నడుస్తోంది. మరి కారణం ఏమై ఉంటుందంటారు?(ఇదీ చదవండి: పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్‌పై క్లారిటీ ఇచ్చిన నటి) -
అజ్ఞాతవాసి పొలిటికల్ సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్.. ఈ రెండు పేర్లు కూడా ఆయనవే. కానీ 2024 ఎన్నికలు జరగక ముందే 'పవర్ స్టార్' అవతారంలో ఫిక్సయ్యేలా కనిపిస్తున్నాడు పవన్. అదే అభిప్రాయం ఆయన అభిమానుల్లో కూడా కలుగుతోంది. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఒక ఇబ్బంది ఉంది. అదేంటంటే వాళ్లు సినిమాలు వదులుకోలేరు. రాజకీయాలను.. ముఖ్యంగా అధికారాన్ని చెలాయించాలనుకుంటారు. రెండూ కావాలని వస్తే ప్రజలు ఊరుకోరు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను రెండు చోట్ల ప్రజలు ఓడగొట్టారు. (ఇదీ చదవండి: లగేజీ ప్యాక్ చేసుకున్న మెగా బ్రదర్స్.. పరుగులు పెడుతున్న పవన్) పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పొలిటిషియనా? లేక సినిమాలు పార్ట్ టైమా? అనే విషయంలో పవన్‌కు ఓ క్లారిటీ ఉన్నట్టుంది. గత రెండేళ్ల కాలం చూస్తే పవన్ కళ్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసిపోతుంది. వారం క్రితం జెండా సభ అంటూ స్టేజీపై రెచ్చిపోయిన పవన్ ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆ సభకు ముందు కూడా ఆయన రాజకీయాల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. కనీసం ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో పవన్ ఉన్నాడు. 50 రోజుల్లో ఎన్నికలు ఉండగా ఏ పార్టీ అధినేత కూడా ఇలా చేయడు. వారాహి యాత్ర అంటూ ఊదరగొట్టినా.. ఆరు నెలల నుంచి ఆ వాహనం ఎక్కడికి వెళ్లిందో తెలియదు. తెలంగాణ ఎన్నికల్లో అతి కష్టమ్మీద 8 మంది అభ్యర్థులను దించినా.. చివరాఖరి వరకు పవన్ ప్రచారమే చేయలేదు. షూటింగ్‌లు లేనప్పుడు మాత్రమే పవన్‌కు రాజకీయాలు గుర్తొస్తాయంటారు జనసైనికులు. అధికారం కోసం అల్లాడిపోయే.. పవన్.. రాజకీయాలకు ఎంత సమయం కేటాయిస్తున్నడన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. గత మూడేళ్లుగా ఆయన సినిమాల లిస్టు ఒకసారి పరిశీలిద్దాం. 2019 - సినిమా నెరేషన్ 2021 - వకీల్ సాబ్ 2022 - భీమ్లా నాయక్ 2023 - బ్రో 2024 - ఓజీ, హరిహర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్(?) 2024 ఎన్నికల కోసం నానా హంగామా చేస్తోన్న పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఓజి సినిమా కోసం ఇంకా కనీసం 30 రోజులు షూటింగ్ వర్క్ చేయాల్సి ఉంది. ఈ సినిమాకు బాగా మార్కెట్ కావాలని తెగ ప్రచారం చేశారు. ఇప్పటికే ఓజి సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. అనుకున్న సమయానికి రీలీజ్ చేయాలంటే ఎన్నికలు అయిన వెంటనే పవన్ రాజకీయాలను ప్యాకప్ చేసి సినిమాల కోసం మేకప్ వేసుకోవాలి. పవన్ చేతిలో హరిహరవీరమల్లు (క్రిష్) , ఓజీ (సుజిత్) , ఉస్తాద్ భగత్ సింగ్ (హరీష్ శంకర్) వంటి టాప్ ప్రాజెక్టులున్నాయి. వీటిలో హరిహరవీరమల్లు, ఓజీ చిత్రాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి. రెండు నెలల క్రితం ఫుల్ బిజీగా ఈ సినిమాల షూటింగ్ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు కోసం పార్ట్‌టైమ్ జాబ్ మాదిరి టీడీపీలో స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ ఉన్నాడు. ఎన్నికల్లో పవన్ రోల్ ముగిసిన తర్వాత వెంటనే మళ్లీ రెగ్యూలర్ షూటింగ్స్‌లోకి వెళ్లడం ఖాయం. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మోసం చేశారు: ట్రాన్స్‌జెండర్) తాజాగా నిర్మాత దానయ్య కూడా పవన్‌ను కలిసిన విషయం తెలిసిందే.. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఓజి సినిమా పూర్తి చేస్తానని పవన్ మాట ఇచ్చారట. ఈ భారీ ప్రాజెక్ట్‌తో పాటు.. పవన్ పూర్తి చేయాల్సిన సినిమాలు మరో రెండు వున్నాయనే విషయం తెలిసిందే. ఇలా మొత్తం మూడు సినిమాలు చేయాలి.. సాధారణంగా ఒక టాప్ హీరోకు చెందిన సినిమా తర్వాత మరో సినిమా థియేటర్లోకి రావాలంటే సుమారు రెండేళ్లు అయినా పడుతుంది. అలాంటిది పవన్ ఒప్పుకున్న సినిమాలు మూడు ఉన్నాయి. అంటే ఈ లెక్కన పవన్ వచ్చే ఎన్నికల వరకు మళ్లీ సినిమాలతోనే బిజీగా ఉంటారు. ఉన్న ప్రాజెక్ట్‌లతోనే ఆయన బిజీగా ఉంటే మరో సినిమాను సెట్ చేయడానికి పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే భవిష్యత్‌లో సినిమాలు కొనసాగించాలనే పవన్ నిర్ణయించుకున్నారని స్పష్టంగా ఎవరికైనా అర్థం అవుతుంది. చంద్రబాబు కోసం... తాను రాజకీయం చేస్తున్నానని పదేపదే చెబుతున్న పవన్.. అందుకు తగ్గట్టు తాజాగా జరిగిన జెండా సభలో కూడా బాబును ఉద్ధండుడిగా అభివర్ణించాడు. అక్కడి వరకు జనసేన కార్యకర్తలకు ఇబ్బంది లేదు కానీ.. నన్నెలా ప్రశ్నిస్తారంటూ సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపైనే పవన్ విరుచుకుపడడం .. జనసైనికులను షాక్‌కు గురి చేసింది. తాను అసలు రాజకీయాలు చేస్తాడా? ఎన్నికల తర్వాత పార్టీ నడుపుతాడా? అన్న విషయంలో స్పష్టత ఇవ్వడు. సింగిల్‌గా పోటీ చేయి, వచ్చే ఎన్నికల నాటికి నాయకుడిగా ఎదుగుతావని బీజేపీ పెద్దలు చీవాట్లు పెట్టారని తానే స్వయంగా చెప్పుకున్నాడు. అంత హితబోధ చేసినా.. పవన్ మాత్రం జై బాబు మత్తులోనే ఉన్నాడు. మరి రాజకీయాలైనా సీరియస్‌గా చేస్తాడా.. అదీ లేదు. ఏదేమైనా 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి ఓడిపోతుందని పవన్, ఆయన దత్తతండ్రికి ముందే తెలుసంటున్నారు. అన్ని లెక్కలు పవన్ వద్ద ఉన్నాయి కాబట్టే సినిమాలు వదులుకోకుండా వచ్చే ఐదేళ్ల వరకు పలు ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాడు. తాను ఇక సినిమాల్లో నటించనని ఒకప్పుడు పవన్ అన్నాడు. కానీ ఆ మాట అన్న తరువాతే ఆయన నటించడం ఎక్కువైంది అన్నది ఫిలింనగర్లో పిల్లాడిని అడిగినా చెబుతాడు. పవన్ పొలిటికల్ సినిమాకు అప్పటివరకు భశుం. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ వీక్నెస్ ఏంటో గానీ.. మరీ ఇంత దిగజారుడా..!?) -
అలాంటి సీన్స్ చేయాలంటే నా డ్రెస్ మాత్రం తీయను: హీరోయిన్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. పెద్ద సినిమాలు థియేటర్లో సందడి చేస్తుండగా.. చిన్న సినిమాలు మాత్రం నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో వచ్చే సినిమాలకు సెన్సార్ లేకపోవడంతో కొన్ని సీన్స్ మరింత బోల్డ్‌గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓటీటీలో వచ్చే సినిమాల్లో శృంగార సన్నివేశాలు ఎక్కువగానే చూపిస్తున్నారని అన్నారు. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) అయితే ఓటీటీలో అలాంటి సీన్స్ పట్ల తాజాగా తన అభిప్రాయం చెప్పుకొచ్చింది నర్గీస్ ఫక్రీ. అయితే ప్రస్తుతం నర్గీస్ ఫక్రీ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి ఓటీటీలో బోల్ట్ కంటెంట్‌పై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. వెబ్ సిరీస్‌లో శృంగార సన్నివేశాల్లో నటించాల్సి వస్తే తన దుస్తులు తీసివేయనని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలో నర్గీస్ మాట్లాడుతూ.. 'నాకు నగ్నంగా ఉండాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏ ప్రాజెక్ట్‌లోనూ నగ్నంగా నటించను. అలాంటి సీన్స్ చేయాల్సి వస్తే తన దుస్తులు మాత్రం తీసివేయను. అంతే కాకుండా స్క్రీన్‌పై లెస్బియన్‌గా నటించడం, మరొక స్త్రీని వివాహం చేసుకున్న స్త్రీగా చూపించడం తనకు ఇష్టముండదు. నేను దానిని పట్టించుకోను కూడా. ఏ పాత్ర అయినా అది కచ్చితంగా నటనలో ఓ భాగం.' అని అన్నారు. (ఇది చదవండి: టమాటా ధరల ఎఫెక్ట్.. స్టార్ హీరో అభిమానులు ఏం చేశారంటే?) కుటుంబ సభ్యులతో కలిసి ఓటీటీ కంటెంట్ చూడటం అసౌకర్యంగా అనిపిస్తోందా? అని ప్రశ్నించగా.. అది వారి వ్యక్తిగత విషయమని చెప్పుకొచ్చింది. కాగా.. నర్గీస్ ఫక్రీ త్వరలోనే పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లులో కనిపించనుంది. అంతే కాకుండా ఓటీటీల వల్ల నటీనటులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు అవకాశముందని చెప్పారు. -
Nidhi Agarwal Photos: క్యూట్ లుక్ తో అదరగొడుతున్న నిధి అగర్వాల్ (ఫొటోలు)
-
పవన్ కల్యాణ్ సినిమా సెట్లో అగ్నిప్రమాదం
పవన్ కల్యాణ్ సినిమా సెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని దుండిగల్ పరిధిలోని బౌరంపేట్‌లో ఆదివారం అర్ధరాత్రి షూటింగ్ జరుగుతుండగా సెట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన చిత్రయూనిట్ వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సెట్లో మంటలను ఆర్పేశారు. గతంలో వర్షానికి సెట్ కూలగా దానికి మరమ్మత్తులు చేసే క్రమంలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఎవరికీ ఏం కాలేదని తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చదవండి: ది కేరళ స్టోరీపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు -
‘హరి హర వీరమల్లు’లో బాలీవుడ్ స్టార్.. స్పెషల్ వీడియో వైరల్
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పవన్ లుక్కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సెట్లో మరో స్టార్ హీరో అడుగుపెట్టాడు. ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ నేడు ఈ చారిత్రాత్మక చిత్ర బృందంలో అధికారికంగా చేరారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్న ఆయన.. చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ ను రూపొందించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ దర్బార్ సెట్ లో చిత్రీకరించనున్నారు. బాబీ డియోల్ కి ఘన స్వాగతం పలుకుతూ హరి హర వీర మల్లు బృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో ఆయన లుక్ ఆకట్టుకుంటోంది. -
హరిహర వీరమల్లు క్రేజీ అప్డేట్.. నవరాత్రుల్లో నవ ఉత్తేజం అంటూ..!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. నవరాత్రుల్లో నవ ఉత్తేజం అంటూ సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారడంతో పవర్ స్టార్ లుక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో పవన్ మొదటిసారి ఓ వారియర్‌గా కనిపించనున్నారు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫోటోతో షూటింగ్‌కు సంబంధించిన వర్క్‌షాప్ ప్రారంభమైనట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. (చదవండి: Pawan Kalyan: 'ఫ్యాన్స్‌కు పండగే..'హరిహర వీరమల్లు' నుంచి పవర్ గ్లాన్స్ వచ్చేసింది) With HHVM himself 😊 నవరాత్రులలో నవ- ఉత్తేజం ! pic.twitter.com/4VNoPdpJ2G — mmkeeravaani (@mmkeeravaani) September 30, 2022 -
ఫ్యాన్స్‌కు పండగే..'హరిహర వీరమల్లు' నుంచి పవర్ గ్లాన్స్ వచ్చేసింది..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. నేడు(శుక్రవారం)పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్ గ్లాన్స్‌ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. చదవండి: పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ మెడల్ని వంచి కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పెట్టుకొని తొడకొట్టాడో .. తెలుగోడు అనే పాటతో పవన్ ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక భీమ్లా నాయక్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుందిఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం,కననడం, మలయళం,హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. చదవండి: థియేటర్‌పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రాళ్లదాడి.. అద్దాలు ధ్వంసం -
టార్గెట్ సంక్రాంతి... బాక్సాఫీస్ బరిలో చిరు, పవన్, ప్రభాస్!
మామూలు సమయంలో ఆడియెన్స్ థియేటర్స్ కు రప్పించడం కష్టంగా మారుతోంది. ఎంత ప్రమోషన్ చేసినా సరే ప్రేక్షకులు తాము చూడాలనుకున్న సినిమాలను మాత్రమే థియేటర్స్ లో చూస్తున్నారు.అయితే సంక్రాంతి పండక్కి మాత్రం ఈ కండీషన్స్ పక్కన పెడుతున్నారు. ఫెస్టివల్ టైమ్ కు థియేటర్స్ వైపు చూస్తున్నారు.పొంగల్ కు విడుదలైన ప్రతి సినిమాను ఆదరించడం కొన్నేళ్లుగా ట్రెండ్ గా మారింది. (చదవండి: ‘గుడ్‌బై’ చెప్పడం ఇష్టం లేదు : రష్మిక) అందుకే వచ్చే సంక్రాంతి పండగని టార్గెట్ గా చేసుకుంటూ హీరోలు క్యూ కడుతున్నారు.ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో వస్తున్నట్లు తెలిపాడు. మరోవైపు విజయ్ నటిస్తున్న వారసుడుతో పాటు ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాను కూడా ఇదే సీజన్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఆదిపురుష్, వారసుడు, వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రాలు మాత్రమే కాదు.. రానున్న రోజుల్లో ఈ లిస్ట్ ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కూడా సంక్రాంతి బరిలోకి దిగబోతుంది. అంతే కాదు అన్ని కుదిరితే అన్నయ్యతో పాటు ఈసారి తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా హరిహర వీరమల్లు తో సంక్రాంతి బరిలోనే దిగే అవకాశాలు ఉన్నాయట.అదే నిజమైతే మెగా బ్రదర్స్ మధ్య సంక్రాంతి యుద్ధం నెక్ట్స్ లెవల్లో ఉండనుంది. -
'హరిహర వీరమల్లు' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. నేడు(ఆదివారం) శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తున్న పవన్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక శ్రీరామ నవమి సందర్భంగా “హరి హర వీర మల్లు” సెట్స్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు చిత్రబృందం. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Let’s celebrate the symbol of chivalry & virtue on this auspicious day of #SriRamaNavami by adherence to truth and Dharma 🏹 - Team #HariHaraVeeraMallu @PawanKalyan @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra #ThotaTharani pic.twitter.com/8jV4BvzGJm — Mega Surya Production (@MegaSuryaProd) April 10, 2022 -
హరిహర వీరమల్లు పునఃప్రారంభం !.. స్క్రిప్ట్ పనులపై చర్చ
Pawan Kalyan Hari Hara Veera Mallu Restart With Action Sequence: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ కరోనా వేవ్స్ కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం. 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని భారీ యాక్షన్ సీన్లతో పుఃనప్రారంభించనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ సీక్వెన్స్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పవన్ కల్యాణ్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏంఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనువిందు చేయనున్నట్లు సమాచారం. -
పవర్ స్టార్ సినిమా నుంచి జాక్వెలిన్ ఔట్.. హాట్ బ్యూటీకి ఛాన్స్ !
Director Krish Clarifies About Cast Change In Pawan Kalyan Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరి హర వీర మల్లు'. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ పాత్రకు మొదటగా శ్రీలంక ముద్దుగుమ్మ, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ఓ కేసులో జాక్వెలిన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జాక్వలెన్ సమస్యల్లో చిక్కుకుంది. దేశం విడిచి వెళ్లకుండా కూడా ఈడీ ఆదేశాలు ఇచ్చింది. అయితే అందుకే జాక్వెలిన్‌ను పవన్ సినిమా నుంచి తొలగించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లపై దర్శకుడు క్రిష్ జాగర్లమూడి స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. 'డేట్స్ ఇష్యూ వల్లే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మా సినిమా చేయలేకపోయింది. డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆమెకు కష్టమైంది. అందుకే గతేడాదే ఆమె సినిమా నుంచి తప్పుకుంది. జాక్వెలిన్ స్థానంలో మేం నర్గిస్ ఫక్రిని ఎంపిక చేశాం. జాక్వెలిన్ ఇప్పుడు వార్తల్లో నిలిచేసరికి అనవసరంగా మా సినిమా ప్రస్తావన తీసుకొస్తున్నారు.' అని క్రిష్ తెలిపారు. పవన్ నటిస్తున్న హరి హర వీర మల్లు చిత్రంలో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రోషనార పాత్రలో నర్గిస్ ఫక్రి కనిపించనుంది. ఆమె లుక్ చాలా అందంగా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో 17వ శతాబ్దపు కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి విధితమే. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఏఎమ్ రత్నం సినిమాను నిర్మిస్తున్నారు. -
ఫ్యాన్స్‌కు మరో బిగ్ సర్ప్రైజ్ అందించిన పవన్ కల్యాణ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే(సెప్టెంబర్ 2) సందర్భంగా ఆయన మూవీలకు సంబంధించి వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్ ఇస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇప్పటికే ఆయన హీరోగా నటిస్తున్న ‘భీమ్లానాయక్’నుంచి టైటిల్ సాంగ్, ‘హరిహర వీరమల్లు’నుంచి కొత్త లుక్, రిలీజ్ డేట్ ప్రకటించి సర్ప్రైజ్ చేసిన పవన్.. తాజాగా తన 29వ ప్రాజెక్ట్‌కి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌కి మరింత ఆనందాన్ని అందించాడు. పవన్ కల్యాణ్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనిలో పవన్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఎస్ ఆర్ టీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. Presenting to you all our proud association with @PawanKalyan Gaaru for the prestigious #ProductionNo9 💥 @SRTmovies @itsRamTalluri @DirSurender @VamsiVakkantham#HBDJanaSenaniPawanKalyan pic.twitter.com/c1Hgm7tr8n — SRT Entertainments (@SRTmovies) September 2, 2021 -
పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు ‘హరిహర వీరమల్లు’ బిగ్ సర్ప్రైజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు(సెప్టెంబర్ 2) పురస్కరించుకొని ఆయన హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’విడుదల తేదిని ప్రకటించింది చిత్ర యూనిట్. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ వజ్రాలదొంగ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. అలాగే, ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడెక్షన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.