
‘‘కోర కోర మీసాలతో.. కొదమ కొదమ అడుగులతో.. కొంటె కొంటె చెనుకులతో..’ అంటూ మొదలవుతుంది ‘కొల్లగొట్టినాదిరో..’ పాట లిరికల్ వీడియో. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu): స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ సినిమాలోనిది ఈ పాట. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’.
నిధీ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాబీ డియోల్, నాజర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి పార్టు ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మార్చి 28న రిలీజ్ కానుంది.
కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘కొల్లగొట్టినాదిరో..’ పాట లిరికల్ వీడియోను సోమవారం రిలీజ్ చేశారు మేకర్స్. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహ్రా, యామిని ఘంటసాల, ఐరా ఉడిపి, మోహన భోగరాజు, వైష్ణవీ కన్నన్, సుదీప్ కుమార్, అరుణ మేరీ పాడారు. ఈ సాంగ్‌కి బృందా, గణేష్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment