పవన్ 'హరిహర వీరమల్లు'.. మరో వికెట్ డౌన్? | Cinematographer VS Gnanasekhar Out From Pawan Harihara Veeramallu Movie | Sakshi
Sakshi News home page

Hari Hara Veeramallu: మొన్న డైరెక్టర్‌ క్రిష్ ఔట్.. ఇప్పుడేమో ఏకంగా!

Jun 1 2024 4:19 PM | Updated on Jun 1 2024 4:19 PM

Cinematographer VS Gnanasekhar Out From Pawan Harihara Veeramallu Movie

'హరిహర వీరమల్లు' సినిమా నుంచి మరో వికెట్ డౌన్? అవును మీరు సరిగానే విన్నారు. ఏమైందో ఏమో గానీ ఈ మూవీకి అస్సలు కలిసి రావట్లేదు. ఎందుకంటే ఏళ్లకు ఏళ్లు సెట్స్‌పైనే ఉంది. నిర్మాతలు ఈ ఏడాది వచ్చేస్తుందని అంటున్నారు. కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం డౌట్. ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కాబట్టి. దీనికి తోడు మూవీ టీమ్ నుంచి ఒక్కొక్కరుగా తప్పుకోవడం చూస్తుంటే సినిమాపై లేని పోని సందేహాలు రావడం గ్యారంటీ.

అప్పుడెప్పుడో లాక్‌డౌన్ కంటే ముందు 'హరిహర వీరమల్లు' సినిమా పవన్ ఒప్పుకొన్నాడు. కానీ దీని తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 'భీమ్లా నాయక్', 'బ్రో' రిలీజ్ అయిపోయి ఏళ్లు గడిచిపోయాయి. ఇది పాన్ ఇండియా అని అంటారేమో. చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి గానీ ఎలాంటి మూవీనైనా నెలల్లో కంప్లీట్ చేసేయొచ్చు. కానీ పవన్‌కి ఎందుకో 'వీరమల్లు'పై ఆసక్తి లేనట్లు ఉంది. అందుకే ఇలా జప్యం చేస్తూ వస్తున్నారు.

(ఇదీ చదవండి: విడాకుల బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే?)

ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ని తీసుకున్నారు. కానీ అతడు తప్పుకోవడంతో బాబీ డియోల్‌ని తీసుకొచ్చారు. ఇక రీసెంట్‌గా దర్శకుడిగా క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత రత్నం పెద్ద కొడుకు జ్యోతికృష్ణ మిగిలిన పని పూర్తి చేయనున్నారు. తాజాగా కొత్త షెడ్యూల్ గురించి డిస్కషన్ అని చెప్పి మూవీ టీమ్ ఓ ఫొటో రిలీజ్ చేసింది. ఇందులో సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ బదులు మరో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కనిపించారు.

దీంతో పవన్ సినిమా నుంచి మూడో వికెట్ డౌన్ అయిందని మాట్లాడుకుంటున్నారు. ఇలా నిర్మాణంలో ఉన్నప్పుటే మార్పులు ఎక్కువైతే అది ఫైనల్ ఔట్‌పుట్ మీద పడే అవకాశాలు ఎక్కువ. మరి 'హరిహర వీరమల్లు' సినిమాని ఏం చేస్తారో? ఎప్పుడు థియేటర్లలోకి తీసుకొస్తారో ఆ పెరుమాళ్లకే ఎరుక!

(ఇదీ చదవండి: తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement