
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమాల నుంచి పెద్దగా అప్‌డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్‌లో గందరగోళం నెలకొంది. దీంతో ఎట్టకేలకు పవన్.. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపై స్పందించాడు. సోమవారం నాడు ఆయన మాట్లాడుతూ..అభిమానులు ఎక్కడికెళ్లినా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. అవి నాకు బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి.
డేట్స్ ఇచ్చా..
నేను ఒప్పుకున్న సినిమాలకు డేట్స్ ఇచ్చాను. కానీ నిర్మాతలే సరిగా వినియోగించుకోలేదు. హరిహర వీరమల్లు మూవీ (Hari Hara Veeramallu Movie) షూటింగ్ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పెండింగ్‌లో ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా స్క్రిప్టు పనులే జరుగుతున్నాయి. ఈ మూడు చిత్రాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తాను అని తెలిపారు. హరిహర వీరమల్లు విషయానికి వస్తే ఇది పీరియాడిక్ ఫిలింగా తెరకెక్కనుంది.
(చదవండి: అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్)
సినిమా..
క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఓజీ విషయానికి వస్తే సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2025వ సంవత్సరంలో రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
చదవండి: పడుచు హీరోయిన్లతో సీనియర్ హీరోల రొమాన్స్.. 'తప్పేముంది?'