సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట (Sandhya Theatre stampede case) ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం కరెక్టేన్నారు. ఘటన జరిగిన రెండో రోజే బాధిత కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడుంటే ఇంత జరిగేది కాదన్నారు. బన్నీ గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నాడని విమర్శించారు.
ప్రతి హీరో అదే చేయాలనుకుంటాడు
సోమవారం నాడు మీడియాతో చిట్‌చాట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రతి హీరో తన సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటారు. అలాగే తన అభిమానులకు అభివాదం చేయాలనుకుంటారు. అయితే థియేటర్‌కు వెళ్లేముందే అల్లు అర్జున్ (Allu Arjun) అక్కడి ఏర్పాట్లు చూసుకోవాల్సింది.
ఇంటికి వెళ్లి పరామర్శించాల్సింది
అభిమాని చనిపోయినప్పుడు వెంటనే వారి ఇంటికి వెళ్లి పరామర్శించాల్సింది. ఇక్కడ మానవతా దృక్పథం లోపించినట్లయింది. రెండో రోజే వెళ్లి మాట్లాడుంటే ఇంత జరిగేది కాదు. అల్లు అర్జున్ కాకపోయినా కనీసం టీమ్ అయినా సంతాపం చెప్పాల్సింది. అలాగే సారీ చెప్పడానికి పలు విధానాలుంటాయి. తన పేరు చెప్పలేదని రేవంత్.. బన్నీని అరెస్టు చేశారనడం కూడా పెద్ద తప్పు. రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత.
తొక్కిసలాట
మనమెంత ప్రముఖులమైనా న్యాయం అందరికీ సమానమే అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్స్‌లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే! ఈ ఘటనపై పోలీసులు థియేటర్ యాజమాన్యంతోపాటు అల్లు అర్జున్‌పైనా కేసు నమోదు చేశారు.
చదవండి: సంధ్య థియేటర్: పవన్ కల్యాణ్ ఎవర్‌గ్రీన్ రికార్డ్‌ను కొట్టేసిన 'పుష్ప'
Comments
Please login to add a commentAdd a comment