తెలుగు సినిమా చరిత్రలో సంధ్య థియేటర్‌కి ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న స్క్రీన్‌లో తమ అభిమాని హీరో సినిమా చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటారు. సుమారు 1000 సీట్లతో 70MM స్క్రీన్ ఉంటుంది. ఒకప్పడు ఈ థియేటర్‌లో తమ సినిమా ప్రదర్శిస్తే చాలు అనుకునే హీరోలు చాలామంది ఉన్నారు. అలాంటిది మెగా హీరోలకు అడ్డాగా సంధ్య థియేటర్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
సంధ్య థియేటర్‌లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషి' ఉంది. 2001లో విడుదలైన ఈ చిత్రానికి ఎస్.జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ మూవీ సంధ్య థియేటర్‌లో రూ. 1 కోటి 56 లక్షలు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, సుమారు 23 ఏళ్ల తర్వాత ఆ రికార్డ్‌ను పుష్ప2తో అల్లు అర్జున్ కొల్లగొట్టాడు. 24 రోజులకు గాను రూ. 1 కోటి 59 లక్షలతో పుష్పరాజ్ దాటేశాడు.
అయితే, ప్రభాస్ కల్కి సినిమా కూడా ఇక్కడ రూ. 1 కోటి 43 లక్షలు కలెక్ట్ చేసింది. పవన్ కల్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రం 220 రోజులకు గాను రూ. కోటి 10 లక్షలు వసూళు చేసింది. అలా ఇప్పటి వరకు ఈ థియేటర్‌కు సంబంధించి ఉన్న రికార్డ్స్‌ను పుష్ప2తో బన్నీ అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment