Kushi Movie
-
అప్పట్లో తెలుగు హిట్ సినిమాల్లో.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా!
ఈమె ప్రముఖ నటి. తెలుగులో దాదాపు 16 ఏళ్లుగా బోలెడన్ని సినిమాలు చేసింది. దక్షిణాదిలో మిగతా భాషల్లో కూడా పలు సినిమాలు చేసింది. అయితే ఈమె పేరు చెబితే సరిగా గుర్తురాకపోవచ్చు. కానీ కొన్ని స్పెషల్ సాంగ్స్ పెడితే మాత్రం ఈమె ఎవరనేది టక్కున గుర్తుపట్టేస్తారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో సడన్‌గా సినిమాలు బంద్ చేసి, ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ఇంతలా చెప్పాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు ముంతాజ్. ముంబయికి చెందిన ఈమె.. టీనేజ్లోనే ఉండగానే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 1999లోనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. చాలా బాగుంది, అమ్మో ఒకటో తారీఖు, ఖుషి, జెమినీ, కూలీ, కొండవీటి సింహాసనం, అత్తారింటికి దారేది, ఆగడు తదితర చిత్రాల్లో అతిథి పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేసింది. చివరగా 2015లో 'టామీ' అనే తెలుగు సినిమాలో కనిపించింది. 'ఖుషీ', 'అత్తారింటికి దారేది' చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో మాస్ స్టెప్పులేసింది ఈమెనే. (ఇదీ చదవండి: నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య) నటిగా కెరీర్ ఓ మాదిరిగా ఉండగానే పూర్తిగా ఇండస్ట్రీని వదిలేసింది. హిజాబ్ ధరించింది. అయితే ఇలా పూర్తిగా నటనని పక్కనబెట్టేయడానికి గల కారణాన్ని కూడా ఒకానొక సందర్భంలో వెల్లడించింది. 'నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నాకు ఖురాన్ బాగా తెలుసు. మొదట్లో ఖురాన్లో పేర్కొన్న విషయాలకు అర్థం తెలియదు . ఒకానొక దశలో దాని అంతరార్థం నాకు అర్థమై నాలో మార్పు వచ్చింది. అందుకే ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అలాగే ఇప్పుడు హిజాబ్ ధరిస్తున్నాను' అని మాజీ నటి ముంతాజ్ చెప్పుకొచ్చింది. సినిమాలు చేయనప్పటిక.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫొటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. అయితే అప్పట్లో ఈమెని చూసి, ఇప్పుడు హిజాబ్‌లో చూసి చాలామంది గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత ముంతాజ్ ఎవరో తెలుసుకుని అవాక్కయ్యారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Mumtaz (@mumtaz_mumo) View this post on Instagram A post shared by Mumtaz (@mumtaz_mumo) -
ఓటీటీలోకి వచ్చి నెల రోజులవుతున్నా ట్రెండింగ్‌లో ఉన్న ఖుషి!
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు, సాంప్రదాయాలు వేరైనా అవి ప్రేమకు అడ్డు రావనే సందేశాన్నిస్తూ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఖుషిని రూపొందించారు దర్శకుడు శివ నిర్వాణ. సెప్టెంబర్ 1 పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్‌లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విప్లవ్‌గా విజయ్, ఆరాధ్యగా సమంత నటన ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఖుషి సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోనూ ఖుషి చిత్రానికి మంచి ఆదరణ వస్తోంది. హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఖుషి మొదటి నుంచి ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న టాప్ 10 చిత్రాల్లో ఉంటూ వస్తోంది. ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన మొదటి వారాల్లో అయితే తొలి స్థానంలో ట్రెండ్ అయింది. మరీ ముఖ్యంగా హిందీ వర్షన్‌కు అమితమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో ఏడో స్థానంలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. చదవండి: రెండో భార్యకు నటుడు విడాకులు.. తొలిసారి స్పందించిన నటి! -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు
శుక్రవారం వస్తుందంటే చాలు చిల్ అవ్వాలి, సినిమాలు చూడాలి అని అందరూ ఫిక్సయిపోతారు. ఈసారి థియేటర్లలో 'స్కంద', 'చంద్రముఖి 2', 'పెదకాపు' లాంటి చిత్రాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో అయితే ఏకంగా ఒక్కరోజే 37 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. దీంతో మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోయారు. (ఇదీ చదవండి: మీదకొచ్చిన శివాజీ.. చాలా ఇబ్బందిపడ్డ లేడీ కంటెస్టెంట్!) సోమవారం ఓటీటీ లిస్ట్ రెడీ చేసినప్పుడు దాదాపు 37 సినిమాలు-సిరీసులు ఉన్నాయి. వాటిలో వారం ప్రారంభంలోనే స్ట్రీమింగ్ కాగా, కొత్తగా మరికొన్ని మూవీస్- వెబ్ సిరీసులు వచ్చి చేరాయి. అలా ఓవరాల్‌గా ఈ వారాంతంలోనూ 37 వరకు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నాయి. దిగువ జాబితాలో స్ట్రీమింగ్ అని ఉన్నవన్నీ కూడా గురవారం రిలీజైనట్లు. మిగతావన్నీ కూడా శుక్రవారం స్ట్రీమింగ్ కాబోతున్నాయని అర్థం. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్/వెబ్ సిరీస్‌లు అమెజాన్ ప్రైమ్ జెన్ వీ - ఇంగ్లీష్ సిరీస్ హూజ్ యువర్ గైనక్ - హిందీ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) డోబుల్ డిస్కోర్షో - స్పానిష్ చిత్రం (స్ట్రీమింగ్) కుమారి శ్రీమతి - తెలుగు సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ఆహా దోచేవారెవరురా - తెలుగు సినిమా పాపం పసివాడు - తెలుగు సిరీస్ డర్టీ హరి - తమిళ చిత్రం హర్కరా - తమిళ సినిమా (అక్టోబరు 01) హాట్‌స్టార్ కిక్ - తమిళ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) కింగ్ ఆఫ్ కొత్త - తెలుగు డబ్బింగ్ సినిమా లాంచ్ ప్యాడ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ తుమ్ సే నా హో పాయేగా - హిందీ సినిమా నెట్‌ఫ్లిక్స్ డునాట్ డిస్ట్రబ్ - టర్కీష్ మూవీ ఫెయిర్ ప్లే - ఇంగ్లీష్ సినిమా చూనా - హిందీ సిరీస్ నో వేర్ - స్పానిష్ సినిమా రెప్టైల్ - ఇంగ్లీష్ మూవీ ద ర్యాట్ క్యాచర్ - ఇంగ్లీష్ చిత్రం పాయిజన్ - ఇంగ్లీష్ మూవీ (సెప్టెంబరు 30) ఖుషి - తెలుగు సినిమా (అక్టోబరు 01) స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ద స్పైడర్-వర్స్ - ఇంగ్లీష్ సినిమా (అక్టోబరు 01) ద ఆస్కార్స్ ఫాంటసీ - తగలాగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ద స్వాన్ - ఇంగ్లీష్ సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్) ద డార్క్నెస్ వితిన్ లా లెజ్ డెల్ ముండో - స్పానిష్ చిత్రం (స్ట్రీమింగ్) ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ - ఇంగ్లీష్ చిత్రం (ఇప్పటికే స్ట్రీమింగ్) సోనీ లివ్ అడియై! - తమిళ సినిమా ఏజెంట్ - తెలుగు మూవీ జీ5 అంగ్షుమాన్ MBA - బెంగాలీ సినిమా ఐ కిల్డ్ బాపూ - హిందీ మూవీ లయన్స్ గేట్ ప్లే సింపతీ ఫర్ ద డెవిల్ - ఇంగ్లీష్ సినిమా జియో సినిమా ద కమెడియన్ - హిందీ షార్ట్ ఫిల్మ్ బిర్హా: ద జర్నీ బ్యాక్ హోమ్ - పంజాబీ షార్ట్ ఫిల్మ్ (సెప్టెంబరు 30) బేబాక్ - హిందీ షార్ట్ ఫిల్మ్ (అక్టోబరు 01) బుక్ మై షో బ్లూ బీటల్ - ఇంగ్లీష్ సినిమా స్కూబీ డూ! అండ్ క్రిప్టో, టూ! - ఇంగ్లీష్ మూవీ సైనా ప్లే ఎన్నీవర్ - మలయాళ చిత్రం (ఇదీ చదవండి: హీరో అవ్వాల్సిన ఆ స్టార్ కొడుకు.. 9 ఏళ్లుగా మంచానికే పరిమితమై!) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 37 సినిమాలు
అందరూ వినాయక చవితి హడావుడిలో బిజీగా ఉన్నారు. ఓవైపు అన్నదానాలు, మరోవైపు నిమజ్జనాలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వారంలోపు దాదాపు నిమజ్జనాలన్నీ అయిపోతాయి. దీంతో మళ్లీ బిజీ లైఫ్. మరోవైపు ఎంటర్టైన్మెంట్ కూడా కావాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లకోసమా అన్నట్లు ఓటీటీల్లో ఈ వారం బోలెడన్ని కొత్త మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: తప్పు ఒప్పుకోని శివాజీ.. ఎలిమినేట్ అయిన దామినితో వాదన!) గత కొన్నివారాలతో పోలిస్తే.. ఈసారి మాత్రం లిస్టు చాలా పెద్దగా ఉంది. ఇందులో తెలుగు హిట్, యావరేజ్ సినిమాలతో పాటు పలు తెలుగు వెబ్ సిరీసులు కూడా ఉన్నాయండోయ్. మిగతా వాటి సంగతి పక్కనబెడితే ఖుషి, ఏజెంట్ చిత్రాలతో పాటు కుమారి శ్రీమతి, పాపం పసివాడు లాంటి సిరీసులు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఈ వారం ఏయే సినిమాలు ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీ చిత్రాలు (సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 01) నెట్‌ఫ్లిక్స్ లిటిల్ బేబీ బమ్: మ్యూజిక్ టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 25 ద డెవిల్స్ ప్లాన్ (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 26 ఫర్గాటెన్ లవ్ (పోలిష్ సినిమా) - సెప్టెంబరు 27 ఓవర్‌హౌల్ (పోర్చుగీస్ మూవీ) - సెప్టెంబరు 27 స్వీట్ ఫ్లో 2 (ఫ్రెంచ్ చిత్రం) - సెప్టెంబరు 27 ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 27 క్యాజల్వేనియా: నోక్ట్రన్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 27 ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 28 లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 28 ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 29 చూనా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 29 నో వేర్ (స్పానిష్ సినిమా) - సెప్టెంబరు 29 రెప్టైల్ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 29 ఖుషి (తెలుగు సినిమా) - అక్టోబరు 01 స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ద స్పైడర్-వర్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 01 అమెజాన్ ప్రైమ్ ద ఫేక్ షేక్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 26 హాస్టల్ డేజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27 డోబుల్ డిస్కోర్షో (స్పానిష్ చిత్రం) - సెప్టెంబరు 28 కుమారి శ్రీమతి (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 28 జెన్ వీ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 29 హాట్‌స్టార్ ఎల్-పాప్ (స్పానిష్ సిరీస్) - సెప్టెంబరు 27 ద వరస్ట్ ఆఫ్ ఈవిల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 27 కింగ్ ఆఫ్ కొత్త (తెలుగు డబ్బింగ్ సినిమా) - సెప్టెంబరు 29 లాంచ్ ప్యాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 29 తుమ్ సే నా హో పాయేగా (హిందీ సినిమా) - సెప్టెంబరు 29 ఆహా పాపం పసివాడు (తెలుగు సిరీస్) - సెప్టెంబరు 29 డర్టీ హరి (తమిళ చిత్రం) - సెప్టెంబరు 29 సోనీ లివ్ చార్లీ చోప్రా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 27 అడియై! (తమిళ సినిమా) - సెప్టెంబరు 29 ఏజెంట్ (తెలుగు మూవీ) - సెప్టెంబరు 29 జీ5 అంగ్షుమాన్ MBA (బెంగాలీ సినిమా) - సెప్టెంబరు 29 బుక్ మై షో బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 29 సైనా ప్లే ఎన్నీవర్ (మలయాళ చిత్రం) - సెప్టెంబరు లయన్స్ గేట్ ప్లే సింపతీ ఫర్ ద డెవిల్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 29 జియో సినిమా ద కమెడియన్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - సెప్టెంబరు 29 బిర్హా: ద జర్నీ బ్యాక్ హోమ్ (పంజాబీ షార్ట్ ఫిల్మ్) - సెప్టెంబరు 30 బేబాక్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 01 (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఖుషి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలై మంచి ఓపెనింగ్స్‌ని అందుకుంది. విజయ్, సామ్‌ల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన విజువల్స్‌కి తోడు మంచి పాటలు, అదిరిపోయే బీజీఎం సినిమా విజయంలో కీలక పాత్రలు పోషించాయి. ఇన్నాళ్లు థియేటర్స్‌లో అలరించిన ఈ చిత్రం..ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సామ్, విజయ్ కలిసి నటించిన ఖుషి సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రిరిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ముఖ్యంగా డిజిటల్ రైట్స్ కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయట. చివరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసింది. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్స్‌లో విడుదలైన నెల రోజుల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఒటీటీ దిగ్గజం ప్రకటించింది. ఓటీటీ రిలీజ్‌పై పలు రూమర్స్ వస్తున్న నేపథ్యంలో నెటిఫ్లిక్స్ ఈ ప్రకటన చేసింది. ఇందులో నిడివి కారణంగా కట్ చేసిన కొన్ని సన్నివేశాలను కూడా యాడ్ చేశారట. ముఖ్యంగా విజయ్, సామ్‌లకు లంభించిన కొన్ని రొమాంటిక్ సీన్స్ ఇందులో చూపించబోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. #Kushi will be streaming from Oct 1 on NETFLIX. pic.twitter.com/03emyGLAgF — Christopher Kanagaraj (@Chrissuccess) September 24, 2023 -
'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?
ఎన్ని రకాల సినిమాలొచ్చినా సరే ఓ మంచి ప్రేమ కథ చూస్తున్నప్పుడే ఆ ఫీలింగే వేరు. అలా ఈ మధ్య కాలంలో లవ్‌స్టోరీతో వచ్చి ఆకట్టుకున్న చిత్రం 'ఖుషి'. విజయ్ దేవరకొండ, సమంత కలిసి అద్భుతమైన కెమిస్ట్రీ పండించిన ఈ చిత్రం.. థియేటర్ల నుంచి దాదాపు సైడ్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఓటీటీ డేట్ బయటకొచ్చింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్!) కథేంటి? విప్లవ్(విజయ్ దేవరకొండ).. నాస్తికుల ఫ్యామిలీకి చెందిన కుర్రాడు. బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం రావడంతో అడిగి మరీ కశ్మీర్లో పోస్టింగ్ వేయించుకుంటాడు. అక్కడ ఆరా బేగం (సమంత)ని లవ్‌లో పడతాడు. కొన్నాళ్లకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే తాను ముస్లిం కాదు హిందు అని, తన పేరు ఆరాధ్య అని ఫ్యామిలీ డీటైల్స్ చెబుతుంది. మరి చివరకు విప్లవ్-ఆరాధ్య ఒక్కటయ్యారా? అసలేం ఏం జరిగింది? అనేదే 'ఖుషి' స్టోరీ. ఓటీటీ డేట్ అదేనా? విడుదలకు ముందే ఓటీటీ డీల్ సెట్ చేసుకున్న 'ఖుషి' సినిమాను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సాధారణంగా ఒప్పందం ప్రకారం తను దక్కించుకున్న సినిమాల్ని నెలలోపే స్ట్రీమింగ్ చేసేస్తూ ఉంటుంది. అయితే 'ఖుషి'ని మాత్రం నెల దాటిన తర్వాత అందుబాటులోకి తీసుకొస్తున్నారట. అంటే అక్టోబరు 6న ఓటటీలో 'ఖుషి' రిలీజ్ కానుందని సమాచారం. మరోవైపు తొలి వీకెండ్లో అద్భుతమైన వసూళ్లు రాబట్టిన ఖుషి.. లాంగ్ రన్లో మాత్రం రూ.10 కోట్ల మేర నష్టపోయినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'చంద్రముఖి 2' దర్శకుడి బర్త్ డే.. గిఫ్ట్‌గా ల్యాప్‌ట్యాప్స్) -
రౌడీ హీరో ఎమోషనల్ స్పీచ్..!
-
మాట నిలబెట్టుకున్న విజయ్.. రూ. కోటి పంపిణీకి లిస్ట్ రెడీ!
ఎంతో కొంత తిరిగిచ్చేయాలి, లేదంటే లావైపోతాం.. ఇది సినిమా డైలాగ్. కానీ విజయ్ దేవరకొండ నిజ జీవితంలోనూ ఈ డైలాగ్ పాటిస్తున్నట్లే కనిపిస్తాడు. తను సక్సెస్‌ను అందుకున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని అభిమానులతో పంచుకుంటాడు. ఈ క్రమంలో ఖుషి సక్సెస్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోవాలనుకున్నాడు రౌడీ హీరో. అందులో భాగంగా వంద కుటుంబాలకు లక్ష చొప్పున కోటి రూపాయలు ఇస్తానని ఖుషి వైజాగ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్లో ప్రకటించాడు. అందుకోసం దరఖాస్తులకు ఆహ్వానించాడు. బోలెడంతమంది దీనికి అప్లై చేసుకోగా తాజాగా వంద లక్కీ కుటుంబాలను అనౌన్స్ చేశారు. గురువారం నాడు 100 మంది లక్కీ ఫ్యామిలీస్‌ను ఎంపికచేసి ఆ లిస్టును రిలీజ్ చేశాడు విజయ్. 'ఖుషి హ్యాపీనెస్ షేర్ చేసుకునేందుకు ఈ వంద మంది ఫ్యామిలీస్‌ను ఎంపిక చేశాం. ఈ లిస్టులో పేరున్న కుటుంబాలు ఎంతో ఆనందిస్తాయని ఆశిస్తున్నా' అని ట్వీట్ చేశాడు. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడులోని ప్రాంతాల నుంచి కూడా విజేతలను ఎంపిక చేయడం విశేషం. త్వరలోనే వీరికి హైదరాబాద్‌లో జరిగే ఖుషి గ్రాండ్ ఈవెంట్లో చెక్స్ పంపిణీ చేయబోతున్నారు. ఖుషి సినిమా విషయానికి వస్తే.. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ నెల 1న రిలీజై హిట్ టాక్ అందుకుంది. The 100 familes we picked this time. I hope it brings cheer to your families ❤️🥰#SpreadingKushi#DevaraFamily pic.twitter.com/9Om8E2dJho — Vijay Deverakonda (@TheDeverakonda) September 14, 2023 చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్, షాక్‌లో ఫ్యాన్స్.. అనారోగ్య సమస్యలే కారణమా? -
'ఖుషి' మూవీ స్టార్స్ తో ఉన్న బంధం గురించి దర్శకుడు..!
-
ఆ సినిమా కలెక్షన్స్ కంటే ఖుషి కలెక్షన్స్ ఎక్కువ..?
-
'రూ.కోటి' ప్రకటనతో రౌడీ హీరోకి కొత్త తలనొప్పులు
హీరో విజయ్ దేవరకొండ 'ఖుషి' హిట్ అయ్యేసరికి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే గత కొన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ ఒక్కటి లేదు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యేసరికి తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. 100 కుటుంబాలకు కలిపి రూ.కోటి ఇస్తానని బంపరాఫర్ ప్రకటించాడు. ఇప్పుడు దీని వల్ల విజయ్ కి కొత్త తలనొప్పులు వస్తున్నాయి. 'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి' సినిమాలతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటి పడలేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ ఇలా చాలా సినిమాల రిలీజ్ కి ముందు మంచి అంచనాలు ఏర్పరుచుకున్నాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఢమాల్ అన్నాయి. తాజాగా విజయ్ రూ.కోటి ఇస్తానని ప్రకటన చేయడంపై ప్రముఖ నిర్మాణ సంస్థ కాంట్రవర్సీ ట్వీట్ చేసింది. (ఇదీ చదవండి: నరేశ్ ముద్దుపేరు ఏంటో చెప్పేసిన పవిత్ర) 'డియర్ విజయ్ దేవరకొండ. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి రూ.8 కోట్లు పోగొట్టుకున్నాం. కానీ ఎవరూ దీనిపై స్పందించలేదు. మీరు ఇప్పుడు.. 100 కుటుంబాలకు ఎంతో పెద్ద మనసుతో రూ.కోటి ఇస్తామని ప్రకటించారు. అలా ఎగ్జిబిటర్ల్, డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యామిలీని ఆదుకుంటారని కోరుతున్నాం' అని అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త ఇండస్ట్రీలో పాత సమస్యల్ని బయటకు తీసుకురావడమే కాదు, విజయ్ దేవరకొండకు కొత్త తలనొప్పుల్ని తీసుకొచ్చేలా కనిపిస్తుంది. అయితే ఓ సినిమా విషయంలో లాభం, నష్టం అనేది డిస్ట్రిబ్యూటర్స్.. నిర్మాతలతో తేల్చుకోవాల్సిన విషయం. మరి ఇలా పబ్లిక్ గా విజయ్ పేరు ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం ఏంటా అని పలువురు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!) Dear @TheDeverakonda , We lost 8 crs in the distribution of #WorldFamousLover, but no one responded over it!! Now as you are donating 1CR to the families with your big heart, Kindly requesting & Hoping for you to save us and our Exhibitors & Distributors families also 🤗❤️… pic.twitter.com/dwFHytv1QJ — ABHISHEK PICTURES (@AbhishekPicture) September 5, 2023 -
నా మీద, నా సినిమాపైన దాడులు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ అందుకున్న హిట్ ఖుషి... ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 70 కోట్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. దీంతో ఖుషి టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఖుషి సక్సెస్ మీట్‌ను వైజాగ్ లో నిర్వహించారు. అక్కడ విజయ్ పలు ఆసక్తకరమైన విషయాలను షేర్ చేశాడు. (ఇదీ చదవండి: ప్రియురాలితో బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా పెళ్లి.. ఫోటోలు వైరల్) తన మీద, ఖుషి సినిమాపైన సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నాయని ఆయన సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ' కొందరు డబ్బులిచ్చి మరీ మా సినిమాపై నెగెటివిటీ తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నో ఫేక్ రేటింగ్స్ వచ్చాయి.. ముఖ్యంగా యూట్యూబ్ ఫేక్ రివ్యూలనూ దాటుకుని ఖుషి సినిమా విజయవంతంగా రన్ అవుతుంది. అందుకు కారణం నా అభిమానులుగా ఉన్న మీ ప్రేమే... మీరిచ్చే ఈ ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడు వాటి గురించి చర్చించి నిరుత్సాహపరచడం ఇష్టం లేదు. వాటి సంగతి మరో రోజు చూసుకుందాం. ఈ సినిమాతో మీ ముఖాల్లో నవ్వులు చూడాలనుకునే నా కోరిక తీరింది. (ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు కోటి విరాళం.. ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్) ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. డబ్బు సంపాదించాలి, అమ్మ, నాన్నలను హ్యాపీగా ఉంచాలి. సమాజంలో గౌరవం కావాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే నేను ఎప్పుడూ పనిచేస్తుంటా. కానీ, ఇప్పుటి నుంచి కొన్ని నిర్ణయాలు మార్చుకుంటున్నా... మీ మీకోసం పనిచేయాలని అనుకుంటున్నా. నాతో పాటుగా మీరూ ఆనందంగా ఉండాలి. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) పది రోజుల్లో అందిస్తా. ఇక నుంచి మనమంతా దేవర ఫ్యామిలీ. నా ఆనందంలో మీరు ఉన్నారు. అలాంటప్పుడు నా సంపాదనలో కొంత భాగాన్ని మీతో పంచుకోకపోతే వేస్ట్.' అని విజయ్ పేర్కొన్నారు. త్వరలో తన అభిమానుల కోసం మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. -
ఫ్యాన్స్‌కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్
అర్జున్ రెడ్డితో స్టార్డమ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. తర్వాత తన పంతాను మార్చి ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కు నచ్చే కథలను ఎంచుకుంటూ అభిమానులను మెప్పిస్తున్నాడు. గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ సరైన విజయం అందుకోలేదు. గత ఏడాది విడుదలైన 'లైగర్' ఘోర పరాజయం చూసిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా విడుదలైన 'ఖుషి'తో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: ప్రియురాలితో బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా పెళ్లి.. శ్రావణి రెడ్డి వివరాలు ఇవే) సమంత కథానాయికగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల రోజు డివైడ్ టాక్ వచ్చినా తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో భారీగా కలెక్షన్స్ వైపు దూసుకుపోతుంది. 'ఖుషి' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న విజయ్, అభిమానులకు కోటి రూపాయల సాయంతో తన ఉదారతను చాటుకున్నాడు. దీంతో పలువురు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మూడు రోజుల్లోనే రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు 'ఖుషి' మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సినిమా ప్రమోషన్ భాగంగా వైజాగ్ చేరుకున్నాడు విజయ్. తన సక్సెస్‌లో అభిమానులను కూడా భాగం చేయడానికి తన రెమ్యూనిరేషన్ నుంచి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు గాను మొత్తం కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ అక్కడ ప్రకటించాడు. దీంతో ఆయన అభిమానులు సర్ప్రైజ్ అయ్యారు. పదిరోజుల్లొ 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి ఒక్కో ఫ్యామిలీకి లక్ష రూపాయల చొప్పున తానే స్వయంగా అందిస్తానని విజయ్ అన్నారు. ఇలా దరఖాస్తు చేసుకోండి 'నా సక్సెస్‌లో, నా హ్యాపీనెస్లో మీరు భాగం పంచుకోవాలి. నా సంపాదనను మీతో షేర్ చేసుకోలేకపోతే అంతా వేస్ట్. మీరంతా నా ఫ్యామిలీనే.. దేవర ఫ్యామిలీ, స్ప్రెడింగ్ ఖుషి అని సోషల్ మీడియాలో ఒక అప్లికేషన్ ఫార్మ్ పెడతా. ఇది ఎలా చెయ్యాలో తెలియదు కానీ, అవసరం ఉన్నవాళ్లకి ఏ హెల్ప్ చేసినా నాకు సంతోషమే. మీరు ఉంటున్న ఇంటి రెంట్, పిల్లల స్కూల్ ఫీజులు ఇలా కొంతైనా నా సాయం ఉండాలనుకుంటున్నా.. నా సోషల్ మీడియా ఖాతా ద్వారా వివరాలు తెలుపుతా.. ఆర్థికసాయం కావాల్సిన వారు అభిమానులతో పాటు ఎవరైనా దరఖాస్తు చేసుకోండి.. వాటిలో 100 ఫ్యామిలీలను ఎంపిక చేసుకొని సరిగ్గా పదిరోజుల్లొ ఈ మొత్తాన్ని అందజేస్తా. అప్పుడే నాకు ఖుషి సక్సెస్ సంపూర్తి అవుతుంది.' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. దీంతో విజయ్ను సోషల్‌మీడియా ద్వారా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. TRULY #SpreadingKushi ❤️ Big hearted @TheDeverakonda announces the distribution of 1 CRORE RUPEES to 100 families to share his #Kushi ❤️ Watch the blockbuster celebrations live now! - https://t.co/mgpbwu8tQp#BlockbusterKushi 🩷 @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic… pic.twitter.com/FmyKqse5uC — Mythri Movie Makers (@MythriOfficial) September 4, 2023 -
ఖుషి సక్సెస్.. యాదాద్రిలో విజయ్ దేవరకొండ.. లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం
హిట్టు కోసం అల్లాడిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ రౌడీ హీరో ఒక్కడేనా? అటు హీరోయిన్ సమంత, ఇటు డైరెక్టర్ శివ నిర్వాణ.. అందరూ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు వీరి ముగ్గురికీ ఖుషి రూపంలో సక్సెస్ దొరికింది. సెప్టెంబర్ 1న విడుదలైన ఖుషి సినిమాకు సానుకూల స్పందన లభిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో విజయ్‌తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఒక అమ్మాయి అయితే ఏకంగా విజయ్ను హత్తుకునేందుకు ప్రయత్నించింది. బాడీగార్డులు ఆమెను అడ్డుకోవడంతో చివరకు ఫోటో దిగి సంతృప్తి చెందింది. దర్శనానంతరం హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'ఈ ఏడాది మా ఫ్యామిలీకి చాలా కలిసొచ్చింది. మా బ్రదర్ బేబీ మూవీ, నేను నటించిన ఖుషి రెండూ సక్సెస్ అయ్యాయి. అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు మా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నాను. కొన్నేండ్ల కిందట నేను యాదాద్రికి వచ్చినప్పుడు గుడి ఇంత బాగా లేదు. పునర్నిర్మాణంలో యాదాద్రిని అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాం. మా మైత్రీ సంస్థకు కూడా ఈ ఏడాది కలిసొచ్చింది. వాళ్ల రెండు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఖుషి హిట్ అయ్యింది. మాలాగే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని దేవుడిని కోరుకున్నా' అని చెప్పాడు. చదవండి: హీరోయిన్ సమంత ఎక్కడ?.. విజయ్ దేవరకొండను ప్రశ్నించిన నాగ్.. రూ.35 లక్షలు ఆఫర్.. -
బాక్సాఫీస్ వద్ద ‘ఖుషి’ జోరు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఎట్టకేలకు విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడింది. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘ఖుషి’. సమంత హీరోయిన్. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం(సెప్టెంబర్ 1) విడుదలై.. తొలిరోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. విజయ్-సమంతల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి సినీ ప్రియులు ఫిదా అయ్యారు. అద్భుతమైన పాటలు, బీజీఎం, విజువల్స్‌తో ‘ఖుషి’ విజయంలో కీలక పాత్ర పోషించాయి. (చదవండి: ‘ఖుషి’మూవీ రివ్యూ) ఫస్ట్ డేనే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. తొలో రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.30.1కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఏరియాల వారిగా చూస్తే.. ‘నైజాం రూ.5.15 కోట్లు, సీడెడ్ రూ.91 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.1.13 కోట్లు, ఈస్ట్ రూ.66 లక్షలు, వెస్ట్ రూ.63 లక్షలు, గుంటూరు రూ. 66 లక్షలు, కృష్ణా రూ. 44లక్షలు, నెల్లూరు రూ.29 లక్షలు, కర్ణాటక-రెస్టాఫ్ ఇండయాలో రూ.85 లక్షలు, ఇతర భాషల్లో రూ.45 లక్షల వసూళ్లను రాబట్టింది. యూస్‌లో ఖుషి జోరు ఇక యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఖుషి జోరు కనిపిస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 8 లక్షల డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. వన్ మిలియన్ మార్క్ వైపు వేగంగా పరుగులు పెడుతోంది. ఖుషికి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే...మరిన్ని సర్ ప్రైజింగ్ బాక్సాఫీస్ నెంబర్స్ సాధిస్తుందని అనుకోవచ్చు. Families Kushi 🥰❤️ Box Office Kushi 🔥 Blockbuster Family Entertainer #Kushi ❤️ Sensational Day 1 with 30.1 CR GROSS WORLDWIDE and a super strong Day 2 on cards 🔥 Book your tickets now! - https://t.co/16jRp6UqHu#BlockbusterKushi 🩷@TheDeverakonda @Samanthaprabhu2… pic.twitter.com/EcD9AcAmoO — Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2023 -
సమంత - విజయ్‌ల మధ్య లిప్‌లాక్ సీన్స్ అవసరమా..?
విజయ్ దేవరకొండ , సమంత జంటగా నటించిన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ, సమంత జోడీ సినిమాకు మంచి ప్లస్ అవడమే కాకుండా ఇందులోని పాటలు బాగా కనెక్ట్ అయ్యాయి అని చెప్పవచ్చు. కానీ ఇందులో క్లైమాక్స్ సీన్ మాత్రమే బాగుంది అంటూ కొందరు పెదవి కూడా విరుస్తున్నారు. (ఇదీ చదవండి: ప్రముఖ నటి అపర్ణ మృతికి భర్తే కారణం.. ఏం జరిగిందంటే) ‘ఖుషి’ సినిమా చూసినవారికి ఊహించని సీన్ ఒకటి పాటలో ఎదురైంది. అదే విజయ్ దేవరకొండ -సమంత మధ్య లిప్ లాక్ సీన్. ఇప్పుడంతా దీని గురించే చర్చ. సమంత సీనియర్ నటి కదా ఇందులో ఏమంత రొమాంటిక్ సీన్స్ ఉండవులే అని వెళ్లిన వారు దీంతో షాక్ అయ్యారు. ఇక్కడ లిప్‌లాక్ సీన్ అవసరమా అని కొందరు కామెంట్ కూడా చేశారు. ఇదే ప్రశ్న దర్శకుడు శివ నిర్వాణకు ప్రెస్మీట్లో ఎదురైంది. అందుకు దర్శకుడు కూడా హుందాగా ఇలా సమాధానం ఇచ్చారు. అక్కడ తాను హీరోయిన్ సమంతను చూడలేదని.. ఖుషి సినిమాలో ఆరాధ్యను మాత్రమే చూశానని శివ నిర్వాణ అన్నారు. సినిమాలో రెండు పాత్రల మధ్య జరిగే సంఘర్షణలో ప్రేమ, ఎమోషన్‌ను చెప్పడానికి లిప్ లాక్ సీన్ అవసరమేనని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా కథలో రెండు పాత్రలు ఒక ఏడాది పాటు కలిసి ప్రయాణం చేసి ఆపై పెళ్లి అవడం జరుగుతుంది. ఇందులో పిల్లల కోసం అని ఒక ఎమోషన్ పెట్టాం. అలాంటప్పుడు ముద్దు అనే ఒక చిన్న ముచ్చట కూడా లేకపోతే అసలు అర్థంపర్థం ఉంటుందా అని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా చూస్తున్నంత సేపు కొంచెం నేచురల్‌గా చూపించాలి కదా. చూసే ప్రేక్షకులు కూడా నమ్మాలికదా. వారిద్దరూ నిజంగానే భార్యాభర్తలుగా ఉన్నారనే ఫీలింగ్ రావాలి కదా. అందుకే ఆ సీన్ పెట్టామని శివ నిర్వాణ తెలిపారు. (ఇదీ చదవండి: Kushi Movie Review: ‘ఖుషి’మూవీ రివ్యూ) విజయ్, సమంతతో ఆ ముద్దు సీన్స్ ఎలా చేయించారని మరో మహిళా జర్నలిస్ట్ అడగగా.. 'ఇందులో ఇబ్బంది ఏముంది..? యాక్షన్ అంటే చేసేశారు.. కట్ అంటే అయిపోయింది.' అని నవ్వుతూ ఆయన సమాధానం ఇచ్చారు. సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా పనిలో భాగమేనని డైరెక్టర్ శివ నిర్వాణ అన్నారు. -
Kushi Review: ‘ఖుషి’మూవీ రివ్యూ
టైటిల్: ఖుషి నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ దర్శకత్వం: శివ నిర్వాణ సంగీతం: హేషామ్ అబ్దుల్ వహాబ్ సినిమాటోగ్రఫీ: మురళి జి. ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేది: సెప్టెంబర్ 1, 2023 యశోద, శాకుంతలం చిత్రాలతో సమంత, లైగర్‌తో విజయ్ దేవరకొండ, టక్ జగదీష్‌తో శివ నిర్వాణ.. ఈ ముగ్గురు తమ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్స్ అందుకున్నారు. వీరి కెరీర్‌కి అర్జెంట్‌గా ఓ హిట్ అవసరం. అందుకే తమకు అచ్చొచ్చిన ప్రేమ కథను ఎంచుకొని ‘ఖుషి’ చేశారు. ప్రేమ కథలను ఎమోషనల్‌గా తెరకెక్కించడంలో శివ నిర్వాణ ఎక్స్పర్ట్. తన కథకు జంటగా విజయ్, సమంతలను ఎంచుకున్నప్పటి నుంచే ‘ఖుషి’పై హైప్ క్రియేట్ అయింది. పాటలు సూపర్ హిట్ కావడం, ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాలతో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నేడు(సెప్టెంబర్ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. ‘ఖుషి’ కథేంటంటే.. లెనిన్ సత్యం(సచిన్ ఖేడేకర్) ఓ నాస్తికుడు. సైన్స్‌ని నమ్మాలని, మూఢ నమ్మకాలతో మోసం పోవద్దని ప్రచారం చేస్తుంటాడు. దేవుళ్లను నమ్మడు. అతని భార్య రాజ్యలక్ష్మీ(శరణ్య) మాత్రం భర్తకు తెలియకుండా పూజలు చేస్తుంటుంది. ఇక అతని చిన్న కొడుకు విప్లవ్ దేవరకొండ(విజయ్ దేవరకొండ) కూడా నాస్తికుడే. బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం రావడంతో అడిగి మరి కశ్మీర్లో పోస్టింగ్ వేయించుకుంటాడు. అక్కడ ఆరా బేగం(సమంత)ను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. తాను పాకిస్తాన్‌కు చెందిన ముస్లిం అమ్మాయి అని తెలిసినా.. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. విప్లవ్ తనపై చూపించే ప్రేమకు ఆరా బేగం ఫిదా అవుతుంది. అప్పుడు తాను ముస్లిం అమ్మాయిని కాదని, బ్రాహ్మిన్ అమ్మాయిని అని, తన అసలు పేరు ఆరాధ్య అని చెబుతుంది. కాకినాడకు చెందిన ప్రవచనకర్త చదరంగం శ్రీనివాసరావు(మురళీ శర్మ) తన తండ్రి అని చెబుతుంది. చదరంగం శ్రీనివాసరావుకు, లెనిన్ సత్యంకు అసలు పడదు. ఒకరు దేవుడి, జోతిష్యాన్ని నమ్మితే.. మరొకరు సైన్స్, టెక్నాలజీని నమ్ముతారు. ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకోరు. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుంటారు విప్లవ్, ఆరాధ్య. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరి మధ్య గొడవలకు కారణం ఏంటి? ఇరు కుటుంబాల పెద్దలు ఊహించినట్లు వీరిద్దరు విడిపోయారా? లేదా కలిసే ఉన్నారా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. భార్యభర్తల మధ్య గొడవలు సహజం. ఏదో ఒక సందర్భంలో ఆలుమగల మధ్య కలహాలు వస్తూనే ఉంటాయి. వాటిని భరిస్తూ, ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగడమే జీవితం అని చాటి చెప్పిన సినిమా ‘ఖుషి’. అంతేకాదు మరో సున్నితమైన అంశాన్ని కూడా ఇందులో చూపించారు. రక్తం పంచుకుపుట్టిన పిల్లలు, ఫ్యామిలీ కంటే సిద్దాంతాలు, శాస్త్రాలు పెద్ద గొప్పవి ఏమి కాదని తెలియజేసే బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ఇది. కథగా చూసుకుంటే ఖుషి కొత్తదేమి కాదు. వేరు వేరు మతాలకు చెందిన అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకోవడం.. వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం.. పేరెంట్స్‌ని ఎదురించి, అష్టకష్టాలు పడి వారు పెళ్లి చేసుకోవడం..ఈ కాన్సెఫ్ట్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. ‘ఖుషి’ కథ కూడా ఇంచుమించు అలాంటిదే. కానీ కథనం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. నిన్నుకోరి, మజిలి చిత్రాల్లో లవ్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తి బాధను చూపించిన దర్శకుడు శివ నిర్వాణ.. ఈ చిత్రంలో పెద్దలను ఎదురించి, ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట మధ్య ఎలాంటి విషయాలు అపార్థాలకు కారణమవుతుంటాయి? భిన్న నేపథ్యం ఉన్న కుటుంబాలను నుంచి వచ్చినవారికి ఆ అపార్థాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది చూపించాడు. ఫస్టాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ చూపిస్తే.. సెకండాఫ్‌లో వైవాహిక జీవితాన్ని చూపించాడు. లెనిన్ సత్యం పాత్రను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హీరో కశ్మీర్‌కి వెళ్లి, హీరోయిన్ని చూసేంత వరకు కథ నెమ్మదిగా సాగుతుంది. ఎప్పుడైతే బేగం ప్రేమలో విప్లవ్ పడతాడో.. అప్పటి నుంచి కథ ఆసక్తిగా సాగుతుంది. బేగం ప్రేమను పొందేందుకు విప్లవ్ చేసే కొన్ని పనులు నవ్వులు పూయిస్తాయి. వెన్నెల కిశోర్, విజయ్‌ల మధ్య సన్నివేశాలు హిలేరియస్‌గా ఉంటాయి. హీరోకి అసలు విషయం తెలియడం.. పెళ్లి కోసం ఇరు కుటుంబాలను ఒప్పించడం..ఇదంతా రొటీన్‌గా సాగుతుంది. పెళ్లి తర్వాత వచ్చే రొమాంటిక్ సాంగ్ యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ తర్వాత కథనం ఎలా సాగుతుందో ఓ అంచనాకు రావొచ్చు. అయినా కూడా సినిమాపై మాత్రం ఆసక్తి తగ్గదు. సెకండాఫ్‌లో కామెడీ మరింత పండించే స్కోప్ ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. టెస్టుల కోసం హీరో ఆస్పత్రికి వెళ్లే సీన్ థియేటర్లలో నవ్వులు పూయిస్తుంది. ఇక చివరి 30 నిమిషాలు అయితే కథ ఎమోషనల్‌గా సాగుతుంది. సైన్స్, శాస్త్రాల కంటే ప్రేమ గొప్పదని చూపించడానికి దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి సున్నితమైన అంశాలను అతి సున్నితంగా తెరపై చూపించాడు. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. కథ, కథనం కొత్తగా లేకున్నా... ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించే సన్నివేశాలు మాత్రం చాలానే ఉన్నాయి. వినసొంపైన పాటలు... అందమైన లొకేషన్స్, విజులవ్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేశాయి. ఎవరెలా చేశారంటే.. విప్లవ్ దేవరకొండ, ఆరాధ్య పాత్రల్లో విజయ్, సమంత జీవించేశారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. విజయ్ గత సినిమాల్లోని షేడ్స్ ఏవి ఇందులో కనిపించవు. పక్కింటి అబ్బాయిలాగా, లవర్‌బాయ్‌గా తెరపై చాలా అందంగా విజయ్ కనిపిస్తాడు. ఫస్టాఫ్‌లో వచ్చీరానీ హింది భాషలో అతను చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. ఇక సమంత కూడా గత సినిమాల మాదిరే తన పాత్రలో ఒదిగిపోయింది. చిన్మయి డబ్బింగ్ తన పాత్రకు మరింత వన్నె తెచ్చింది. హీరో తండ్రి, నాస్తికుడు లెనిన్ సత్యంగా సచిన్ ఖేడేకర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రవచనకర్త చదరంగం శ్రీనివాసరావుగా మురళీ శర్మ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. ఫస్టాఫ్‌లో వెన్నెల కిశోర్ కామెడీ బాగా పండింది. జయరాం, రోహిణి, రాహుల్ రామకృష్ణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం. సినిమా విడుదలకు ముందే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తెరపై కూడా పాటలు వినసొంపుగా, అందగా ఉన్నాయి. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. మురళీ జి. సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు ఆకర్షణ. కశ్మీర్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. ప్రతి సన్నివేశం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Kushi Twitter Review: ‘ఖుషి’ మూవీ ట్విటర్ రివ్యూ
సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రమిది. ఇక ప్రేమ కథలు చేయనని శపథం చేసిన విజయ్.. లైగర్ ఎఫెక్ట్‌తో మళ్లీ లవ్‌స్టోరీకి మొగ్గు చూశాడు. విజయ్‌కి జోడిగా సమంత అని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సూపర్ హిట్ సాధించడంతో ‘ఖుషి’పై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య నేడను (సెప్టెంబర్ 1) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.‘ఖుషి’ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #Kushi Overall A Clean Rom-Com that is simple yet entertaining for the most part! Though the film has a regular story and feels lengthy at times, the entertainment in the film works and the emotional quotient in the last 30 minutes works well. Barring a few hiccups here and… — Venky Reviews (@venkyreviews) August 31, 2023 ఖుషి మూవీకి ట్విటర్లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తర్వాత హిట్ కొట్టామని విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత, విజయ్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. కొన్ని సనివేశాలు సాగదీతగా అనిపించినా.. కామెడీ బాగుందని ఎక్కుమంది చెబుతున్నారు. ఇక చివరి 30 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా సాగుతుందని, అది సినిమాకు చాలా ప్లస్ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. #Kushi lengthy & boring at parts !! Last 20mins of the film was good & engaging , VD & Sam chemistry works well with excellent music . 2.75/5 . https://t.co/KhUtF2legF — . (@Sayiiing_) September 1, 2023 చివరి 30 నిమిషాలు చాలా బాగుంది. విజయ్, సామ్‌ల కెమిస్ట్రీ తెరపై బాగా వర్కౌట్ అయింది. సంగీతం బాగుందంటూ ఓ నెటిజన్2.75 రేటింగ్ ఇచ్చాడు. #Kushi review Commercial rating - 3.5/5 Content rating- 3/5 Good Rom-com. Second half is nice! Story takes time to get into the premise and tests your patience. But second half emotion and comedy work well. @Samanthaprabhu2 - @TheDeverakonda chemistry ❤️❤️ — Nishant Rajarajan (@Srinishant23) August 31, 2023 అసలు కథ ప్రారంభం అవ్వడానికి కాస్త సమయం తీసుకున్నారు. అది మన సహనానికి పరీక్షగా మారుతుంది. కానీ సెకండాఫ్‌లో మాత్రం కామెడీతో పాటు ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. సమంత, విజయ్‌ల కెమిస్ట్రీ అదిరింది అంటూ మరో నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు. Very good first half and a decent 2nd half with good and emotional final act. Lead pair performances outshined all departments throughout the movie.. Sam and VD should do one more movie ❤️❤️🥵 3.5/5#Kushi — Tony (@tonygaaaadu) September 1, 2023 Unanimous positive reports for the movie #Kushi from US Premiers after a long time.. congrats rowdy boy @thedevarakonda, Samantha for superhit. #BlockBusterKushi — Dalapathy On Duty (@dalapathy007) September 1, 2023 Hit kottadra @TheDeverakonda after 5Looong Years 🔥🔥🔥🔥🔥🔥 Hit talk vasthe Box-office etla untado chustharu 👊👊 #Kushi #BlockbusterKushipic.twitter.com/YCOh5LjGGh — #KushiOnSep1st (@Pokiri_Freak) September 1, 2023 #Kushi 👍 (3.25/5) Clean and entertaining first half with seamless comedy, catchy songs, and great BGM. Hesham's music is a major plus! Vijay and Sam shine despite occasional second half lulls. Sam's dubbing felt a bit off. A joyful ride with minor bumps.#Kushi — FIGHTER (@Madhuramaryan) September 1, 2023 #Kushi #KushiReview a poorly written, soulless rom-com that doesn’t have a single good scene/heartwarming moment in its 150 minute runtime. Only positive is Hesham Abdul Wahab’s songs. Trash. — No Name (@bldgcontractor) August 31, 2023 #Kushi Review A well-crafted family entertainer, "KUSHI" stands out as an engaging and refined film. Shiva Nirvana rightly presents a narrative that entertains throughout. A fresh entertainer after months 👏 Rating: 3.5/5 #BlockbusterKushi pic.twitter.com/dQx2iJdEpT — D P V E U (@DPVEU_) September 1, 2023 -
సమంత తెలివైన అమ్మాయి.. ఆమె సలహాతో నాలో మార్పు: విజయ్ దేవరకొండ
‘ఏదైన నాకు నచ్చకుంటే ఓపెన్‌గా చెప్పేస్తాను. డైరెక్టర్ శివ విషయంలోను అదే చేశాను. ఖుషి సినిమా షూటింగ్ మొదలైన నెల రోజుల తర్వాత అతనితో కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ ఏం నచ్చకున్నా బాగాలేదని ఫేస్ మీదనే చెప్పేవాడిని. అది చూసిన సమంత.. ‘విజయ్..ఏం చెప్పాలన్నా ఓ పద్దతి ఉంటుంది. అలా డైరెక్ట్‌గా ఫేస్ మీద చెప్పకూడదు’అని సలహా ఇచ్చింది. సామ్ సలహా నాలో మార్పును తీసుకొచ్చింది’అని స్టార్ హీరో విజయ్ దేవరకొండ అన్నాడు. విజయ్, సమంత జంటగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ అభిమానులతో క్యూ అండ్ ఏ నిర్వహించాడు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఈ క్యూ అండ్ ఏ లైవ్ స్ట్రీమ్ అయ్యింది. ఫ్యాన్స్ తో జరిపిన ఈ ఇంటరాక్షన్ లో ఖుషి హైలైట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ లో తన అభిప్రాయాలు, జీవితాన్ని తాను చూసే పర్సెప్షన్ గురించి చెప్పుకొచ్చాడు. అవేంటో విజయ్ మాటల్లోనే.. శివకు సినిమా పిచ్చి డైరెక్టర్ శివ నిర్వాణతో కనెక్ట్ అయ్యేందుకు నాకు నెల రోజుల టైమ్ పట్టింది. ఆ తర్వాత ఆయన మీద నాకు నమ్మకం ఏర్పడింది. పాటల దగ్గర నుంచి ప్రతీది ఆయన డెసిషన్ కే వదిలేశా. ఎందుకంటే శివకు సినిమా పిచ్చి. తన సినిమా ఎలా ఉండాలో ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఆ ఫ్రేమ్ నుంచి బయటకు రాడు. మనం ఏదైనా బాగుంటుందని చెబితే నచ్చితే తీసుకుంటాడు. అది కథకు అవసరం ఉండదు అనుకుంటే ఎందుకు ఉండదో చెబుతాడు. అందుకే మ్యూజిక్ కన్సర్ట్ ఖుషి సినిమాలో ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ కంటే ఫన్ ను ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ తో మంచి కామెడీ వర్కవుట్ అయ్యింది. అలాగే సెకండాఫ్ లో రాహుల్ రామకృష్ణతో కలిసి నవ్విస్తాను. ఈ సినిమాలోని ఖుషి టైటిల్ సాంగ్ వినగానే బాగా నచ్చింది. ఆ పాట ముందు మోషన్ పోస్టర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనుకున్నాం. ఇంప్రెసివ్ గా ఉండటంతో సామ్, శివ, నేను కలిసి హేషమ్ తో మాట్లాడి దాన్ని ఫుల్ సాంగ్ చేశాం. ఖుషి పాటలను విన్నప్పుడు ఈ మ్యూజిక్ ను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. అలా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాం. ఆ మ్యూజిక్ కన్సర్ట్ టైమ్ లో ఆరోగ్యం బాగా లేకున్నా సమంత పార్టిసిపేట్ చేసింది. ఆ స్టేజీ మీద సమంతతో లైవ్ పర్ ఫార్మ్ చేశాను. సమంత తెలివేన అమ్మాయి సమంత తెలివైన అమ్మాయి. శివ, నేను మూవీ గురించి డిస్కస్ చేసేప్పుడు ఆమె మంచి ఐడియాస్ చెప్పేది. మా ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మేమిద్దరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి డబ్బు,లైఫ్ గురించి ఒకేలా ఆలోచనలు ఉంటాయి. అలాగే మా ఇద్దరికీ హిస్టరీ అంటే ఇష్టం. సమంత దేవుడిని ఆరాధిస్తుంది. నేను మతపరమైనవి, దేవుడి గురించి డౌట్స్ అడుగుతుంటా. సమంతతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంటుంది. డైరెక్షన్ వైపు వెళ్తా.. డైరెక్షన్ చేయడం అనేది ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. లైఫ్ లో కొద్ది కాలం తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుని డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నా. కానీ నా దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్ చదువుతుంటే నటించడం ఆపలేను అనిపిస్తుంటుంది. వయసు ఉంది కాబట్టి ఇప్పుడు ఎంతైనా కష్టపడగలను. ఫ్యూచర్ లో ఏదో ఒక పాయింట్ లో డైరెక్షన్ వైపు వెళ్తా. ఫెయిల్యూర్, సక్సెస్ ఒకేలా చూడాలి లైఫ్ లో ఫెయిల్యూర్ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ అనేది ఏదో ఒక టైమ్ లో తప్పకుండా ఎదురవుతుంది. నేనూ లైఫ్ లో బిగ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ చూశాను. వాటి గురించి బయట చాలా మంది మాట్లాడారు. నా దృష్టిలో ఫెయిల్యూర్, సక్సెస్ ఒకేలా చూడాలి. చేసిన తప్పులు చేయకుండా అపజయాల నుంచి నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. జీవితం అంటే ఓడటం, గెలవడం కాదు జీవించడం. లైఫ్ లో మిమ్మల్ని మీరు ఏ పొజిషన్ లో చూడాలని అనుకుంటున్నారో ఆ గమ్యం వైపు ఒక్కో అడుగు వేస్తూ వెళ్లండి. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం నా ఫేవరేట్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీ, దోశ, బర్గర్, ఛీజ్ కేక్ ఇష్టంగా తింటాను. ఇవన్నీ తిన్నా వర్కవుట్ బాగా చేస్తా. అలా బరువు పెరగకుండా చూసుకుంటా.నాకు ఆర్కిటెక్చర్ ఇష్టం. మా ఇంట్లో డెకరేషన్ ఎలా ఉండాలో నేనే సెలెక్ట్ చేశా. ఫ్యూచర్ లో ఒక ఫామ్ కొని దాన్ని నాకు నచ్చినట్లు డిజైన్ చేయించుకోవాలని అనుకుంటున్నా. బిజినెస్ ఆలోచనలూ ఉన్నాయి నాకు ట్రావెలింగ్, స్పోర్ట్స్ ఇష్టం. ఆ మధ్య మాల్దీవ్స్ వెళ్లాను. హెవెన్ లా అనిపించింది. ఖుషి షూటింగ్ టైమ్ లో కాశ్మీర్ వెళ్లాను. అది నా ఫేవరేట్ ప్లేస్ అయింది. మా ఫ్రెండ్స్ తో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతుంటాం. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. అలాగే బిజినెస్ ఆలోచనలూ ఉన్నాయి. ఈ విషయంపై మా ఫ్యామిలీ, నా టీమ్ తో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. ఎంటర్ ప్రెన్యూర్ లో కొద్ది రోజుల్లోనే నా నుంచి ఒక ప్రకటన వస్తుంది. డ్రీమ్ క్యారెక్టర్స్ లేవు సోషియో ఫాంటసీ మూవీ జానర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే ఆ స్క్రిప్ట్స్ ఆకట్టుకునేలా రాయడం కష్టం. అలాంటి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా నటిస్తా. నాకు డ్రీమ్ క్యారెక్టర్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇప్పుడు చేసిన ఖుషి, తర్వాత చేస్తున్న వీడీ 12, వీడీ 13 సినిమాలకు సూపర్బ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అలాంటి స్క్రిప్ట్స్ లో నటిస్తానని ఊహించలేదు. తమిళ్ డైరెక్టర్స్ అరుణ్ మాతేశ్వరన్, అరుణ్ ప్రభు ఇద్దరూ టాలెంటెడ్. వారితో స్క్రిప్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్స్ లాక్ అయితే వెంటనే మూవీస్ ప్రారంభిస్తా. -
నా భార్య అలా ఉండాలి.. అప్పుడే పెళ్లి చేసుకుంటా : విజయ్ దేవరకొండ
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈ రౌడీ హీరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడన్నది ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై ఖుషి సినిమా ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఓ కార్యక్రమంలో విజయ్ స్పందించాడు. ఖుషి మూవీ ప్రచారంలో భాగంగా బుధవారం నేషనల్ వైడ్ అభిమానులతో క్యూ అండ్ ఏ నిర్వహించారు విజయ్. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఈ క్యూ అండ్ ఏ లైవ్ స్ట్రీమ్ అయ్యింది. (చదవండి: ఓటీటీలో సందడే సందడి.. ఇన్ని సినిమాలు రిలీజవుతున్నాయా?) ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు విజయ్ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ అభిమాని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? ఎలాంటి అమ్మాయి కావాలి? అని అడిగాడు. అతని ప్రశ్నకు విజయ్ ఓపికగా సమాధానం ఇచ్చాడు. ‘నన్ను కేరింగ్ గా చూసుకునే లైఫ్ పార్టనర్ కావాలని కోరుకుంటా. నేను పని లో పడి ఫుడ్ వంటి బేసిక్ థింగ్స్ కూడా మర్చిపోతా. వర్క్ నుంచి బయటకు తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ గుర్తుచేసే భార్య ఉండాలి. ఇప్పుడు మా అమ్మ నా గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఇయర్, నెక్ట్ ఇయర్ అంటూ పెళ్లికి టైమ్, డేట్ ఫిక్స్ చేసుకోలేదు. మ్యారేజ్ చేసుకోవాలని అనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటా. అయితే పెద్ద హడావుడి లేకుండా నా పెళ్లి జరగాలి. కానీ ఎవరికీ తెలియకుండా నేను ఆ విషయాన్ని దాచలేను’అని విజయ్ అన్నారు. డబ్బు, గౌరవం రెండూ ముఖ్యమే నాకు లైఫ్ లో ఎన్నో సాధించాలని ఉంది. అందుకు కావాల్సిన ఇన్సిపిరేషన్ ఉంది. అందుకే నాకు ఎవర్నో చూసి ఇన్స్ పైర్ కావాల్సిన అవసరం రాలేదు. అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలనే డ్రీమ్ ఉండేది. నెలకు ఇంటి అద్దె కంట్టేందుకు కూడా ఇబ్బంది పడిన సందర్భాలు చూశాను. ఇలాంటి వాటి నుంచి బయటపడి కంఫర్ట్ గా ఉండాలనే డ్రీమ్ ఉండేది. అలాగే ఇంట్లో, ఫ్యామిలీలో, సొసైటీలో నేనంటే గౌరవం ఏర్పడాలని కోరుకున్నా. ఇవన్నీ చేయాలంటే మనం ధైర్యంగా ప్రయత్నాలుచేయాలి. లైఫ్ లో డబ్బు, గౌరవం ముఖ్యమని అనుకుంటా. నన్నెవరైనా అగౌరవంగా చూస్తే క్షమించను -
పెళ్లి కబురుతో ఫోటో షేర్ చేసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో విజయ్ దేవరకొండ (34) కూడా ముందు వరుసలో ఉంటారు. ఈ మధ్య శర్వానంద్, వరుణ్‌తేజ్ పెళ్లి తంతు తెరపైకి వచ్చిన వెంటనే విజయ్ పెళ్లి ఎప్పుడు అని ఆయన్నే డైరెక్ట్‌గా చాలామంది అడిగారు. అందుకు సమాధానంగా ఆయన కూడా త్వరలో ఆ శుభకార్యం జరగబోతుందని కూడా చెప్పాడు. ఖుషి సినిమా విడుదల తర్వాత విజయ్ దేవరకొండ పెళ్లిపీటలు ఎక్కడం ఖాయం అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: విజయనిర్మల వేల కోట్ల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నరేష్ కుమారుడు) తాజాగ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ దేవరకొండ ఓ పోస్ట్ చేశారు. అందులో రెండు చేతులు ఉన్నాయి. ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ చేయి మరొకరి చేతిలో ఉంది. మరోకరు ఎవరనేది ఆయన రివీల్ చేయలేదు. కానీ ఆ ఫోటోకు విజయ్ ఇచ్చిన క్యాప్షన్ మాత్రం ఇలా ఉంది. 'జీవితంలో చాలా జరుగుతున్నాయి. కానీ ఇది మాత్రం చాలా స్పెషల్. అన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తా.' అని విజయ్ పేర్కొన్నారు. ఈ విదమైన విషయాలను తన సోషల్‌మీడియా ద్వారా ఆయన ఎప్పుడూ షేర్ చేయలేదు. దీంతో ఇది ఖచ్చితంగా ప్రేమ, పెళ్లికి సంబంధించిన కబురు చెప్పబోతున్నారని నెటిజన్లు ఊహిస్తున్నారు. ఆ చెయి రష్మికదేనా.. విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీలో చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. దీంతో విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫోటోలో ఉన్న మరో చెయి రష్మికదే అని పలువరు పేర్కుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య విజయ్ తల్లిదండ్రులను రష్మిక కలిసిన విషయం తెలిసిందే. దీంతో వారి సందేహాలు కూడా మరింత బలంగా ఉన్నాయి. ముందే క్లూ ఇచ్చిన విజయ్ త్వరలో పెళ్లి చేసుకుంటానని ఖుషి సినిమా ప్రమోషన్ల సమయంలో విజయ్ దేవరకొండ చెప్పిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనందల నటించిన 'బేబీ' సినిమాలోని ఓ సాంగ్ విడుదల కార్యక్రమానికి రష్మిక వచ్చారు. అప్పుడు విజయ్ ఫ్యాన్స్ అందరూ వదిన.. వదిన అంటూ గట్టిగా అరిచినా ఆమె తనలో తాను నవ్వుకుంటూ ఉండింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా గీత గోవిందం,డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ సమయం నుంచి వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అలా వారిద్దరు ప్రేమలో పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. -
‘ఖుషి’ రెమ్యునరేషన్.. మా అమ్మే ఆశ్చర్యపోయింది: డైరెక్టర్
టక్ జగదీష్ మూవీ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ.. ‘ఖుషి’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. (చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ.. కానీ అదే ట్విస్ట్!) ఆ మధ్య చిత్రబృందం నిర్వహించిన మ్యూజికల్ కన్సర్ట్‌తో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. అదే సమయంలో ఈ సినిమాపై రకరకాల పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా రెమ్యునరేషన్లకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ చిత్రానికి గాను హీరోహీరోయిన్లతో పాటు డైరెక్టర్ శివనిర్వాణ కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఈ వార్త సారాంశం. విజయ్ రూ. 23 కోట్లు, సమంత రూ.4.5 కోట్లు పారితోషికంగా పుచ్చుకున్నారట. ఇక డైరెక్టర్ శివనిర్వాణ అయితే ఏకంగా రూ.12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అమ్మే ఆశ్చర్యపోయింది అయితే తన రెమ్యునరేషన్‌పై డైరెక్టర్ శివ నిర్వాణ స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పారితోషికంపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ‘నాకు రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని పలు వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. అది చూసి నేనే షాకయ్యాను. నా స్నేహితులు అయితే ఫోన్ చేసి మరీ అడిగారు. ‘చూస్తే సైలెంట్‌గా ఉంటావు..బానే పుచ్చుకున్నావ్గా’అని సెటైర్లు వేశారు. అంతెందుకు మా అమ్మ కూడా నా రెమ్యునరేషన్ గురించి తెలిసి ఆశ్చర్యపోయింది. ఫోన్ చేసి మరీ అడిగింది. అంత రెమ్యునరేషన్ నాకు ఇస్తే సినిమాలు ఎలా తీస్తారండి?. నాతో పాటు హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ కలిపితేనే రూ.50 కోట్లు అయితే.. ఇక సినిమాకు ఎంత ఖర్చు అవ్వాలి? నాలాంటి డైరెక్టర్ అంత బారీ మొత్తంలో ఏ నిర్మాతలు ఇవ్వలేరు’ అని శివ నిర్వాణ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా కోసం తాను రాసిన పాటలకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించాడు. అయితే రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారనేది మాత్రం ఆయన వెల్లడించలేదు కానీ, రూ.5 కోట్ల వరకు తీసుకునే చాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్. -
సమంత, విజయ్‌ల ఎమోషన్స్ ‘ఖుషి’కి బ్యూటీని తీసుకొచ్చాయి
ప్రేమ గురించి కొన్ని కలలు కనే యువకుడికి లవ్, లైఫ్ అంటే మన ఊహలకు అనుగుణంగా ఉండదని తెలిసిరావడమే ‘ఖుషి’ సినిమా నేపథ్యం. మణిరత్నం సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ చూపించే విజువల్ బ్యూటీ ఈ చిత్రంలో చూస్తారు. అయితే అలాంటి సీన్స్ ను మేము కాపీ కొట్టలేదు. అలాంటి ఫీల్ కలిగించేలా విజువల్స్ ఉంటాయి’అని సినిమాటోగ్రాఫర్ జి.మురళి అన్నారు. విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు . మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి జి.మురళి సినిమాటోగ్రఫీ అందించాడు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మురళీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► నేను 2005 నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను. అందాల రాక్షసి మూవీకి పనిచేశాను. ఆ తర్వాత నేను చేసిన లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఖుషి’నే. మైత్రీ రవి గారి ద్వారా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. ఈ సినిమాకు మైత్రీ మూవీ ప్రొడ్యూసర్స్ బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వారికి సినిమాల మీద ఉన్నంత ప్యాషన్ నేను ఇంకో ప్రొడక్షన్ లోనూ చూడలేదు. సినిమా బాగా వచ్చేందుకు ఏది కావాలన్నా సమకూర్చుతారు. ఫిలిం మేకింగ్ లో వాళ్లు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ► మైత్రీ రవి గారు ఫోన్ చేసి చెన్నైకి డైరెక్టర్ తో కలిసి వస్తున్నాం. మీరు కథ వినండి అని చెప్పారు. అలా శివ గారు కథ చెప్పారు బాగా నచ్చింది. ఆయన ప్రీవియస్ మూవీస్ గురించి తెలుసుకున్నా. అలాంటి మంచి డైరెక్టర్ తో కలిసి పనిచేసే అవకాశం రావడంతో హ్యాపీగా ఫీలయ్యా. ► లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘ఖుషి’ ఉంటుంది. ఇందులో విప్లవ్, ఆరాధ్య క్యారెక్టర్ లలో విజయ్, సమంత నటన మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వాళ్ల క్యారెక్టర్స్ మధ్య వచ్చే సందర్భాల్లో విజయ్, సమంత చూపించిన ఎమోషన్స్, డీటెయిల్స్ సినిమాకు ఒక బ్యూటీ తీసుకొచ్చాయి. క్యారెక్టర్ లో ఎంతవరకు నటించాలో విజయ్ కు బాగా తెలుసు. ‘ఖుషి’లో అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. ఈ సినిమాతో తొలిసారి సమంతతో కలిసి పనిచేశాను. ► దర్శకుడు శివ నిర్వాణ వ్యక్తిగతంగా చాలా మంచివాడు. సినిమా మేకింగ్ మీద ఇష్టం ఉన్న దర్శకుడు. సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. ఆయన మ్యూజిక్ సెన్స్ సూపర్బ్. ఇవాళ ‘ఖుషి’లో ఇంతమంచి మ్యూజిక్ వచ్చిందంటే దానికి శివ నిర్వాణ మ్యూజిక్ టేస్ట్ కారణం. ► నేను పనిచేసిన గత చిత్రాలు కాలా, సార్పట్ట వంటివి చూస్తే రా అండ్ రస్టిక్ గా ఉంటాయి. కానీ ‘ఖుషి’లో బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ విజువల్స్ తెరపైకి తీసుకొచ్చే అవకాశం కలిగింది. ఫుల్ లైఫ్ తెరపై చూపిస్తున్న ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా చూడటం పూర్తయ్యాక మీకొక కొత్త అనుభూతి కలుగుతుంది. కెమెరా ద్వారా ఆ ఎమోషన్ తీసుకొచ్చేందుకు నా ప్రయత్నం చేశాను.