టక్ జగదీష్ మూవీ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ.. ‘ఖుషి’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
(చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ.. కానీ అదే ట్విస్ట్!)
ఆ మధ్య చిత్రబృందం నిర్వహించిన మ్యూజికల్ కన్సర్ట్‌తో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. అదే సమయంలో ఈ సినిమాపై రకరకాల పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా రెమ్యునరేషన్లకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ చిత్రానికి గాను హీరోహీరోయిన్లతో పాటు డైరెక్టర్ శివనిర్వాణ కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఈ వార‍్త సారాంశం. విజయ్ రూ. 23 కోట్లు, సమంత రూ.4.5 కోట్లు పారితోషికంగా పుచ్చుకున్నారట. ఇక డైరెక్టర్ శివనిర్వాణ అయితే ఏకంగా రూ.12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి.
అమ్మే ఆశ్చర్యపోయింది
అయితే తన రెమ్యునరేషన్‌పై డైరెక్టర్ శివ నిర్వాణ స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పారితోషికంపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ‘నాకు రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని పలు వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. అది చూసి నేనే షాకయ్యాను. నా స్నేహితులు అయితే ఫోన్ చేసి మరీ అడిగారు. ‘చూస్తే సైలెంట్‌గా ఉంటావు..బానే పుచ్చుకున్నావ్‌గా’అని సెటైర్లు వేశారు.
అంతెందుకు మా అమ్మ కూడా నా రెమ్యునరేషన్ గురించి తెలిసి ఆశ్చర్యపోయింది. ఫోన్ చేసి మరీ అడిగింది. అంత రెమ్యునరేషన్ నాకు ఇస్తే సినిమాలు ఎలా తీస్తారండి?. నాతో పాటు హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ కలిపితేనే రూ.50 కోట్లు అయితే.. ఇక సినిమాకు ఎంత ఖర్చు అవ్వాలి? నాలాంటి డైరెక్టర్ అంత బారీ మొత్తంలో ఏ నిర్మాతలు ఇవ్వలేరు’ అని శివ నిర్వాణ చెప్పుకొచ్చారు.
అలాగే ఈ సినిమా కోసం తాను రాసిన పాటలకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించాడు. అయితే రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారనేది మాత్రం ఆయన వెల్లడించలేదు కానీ, రూ.5 కోట్ల వరకు తీసుకునే చాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్.
Comments
Please login to add a commentAdd a comment