Siva Nirvana
-
నా మీద, నా సినిమాపైన దాడులు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ అందుకున్న హిట్ ఖుషి... ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 70 కోట్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. దీంతో ఖుషి టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఖుషి సక్సెస్ మీట్‌ను వైజాగ్ లో నిర్వహించారు. అక్కడ విజయ్ పలు ఆసక్తకరమైన విషయాలను షేర్ చేశాడు. (ఇదీ చదవండి: ప్రియురాలితో బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా పెళ్లి.. ఫోటోలు వైరల్) తన మీద, ఖుషి సినిమాపైన సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నాయని ఆయన సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ' కొందరు డబ్బులిచ్చి మరీ మా సినిమాపై నెగెటివిటీ తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నో ఫేక్ రేటింగ్స్ వచ్చాయి.. ముఖ్యంగా యూట్యూబ్ ఫేక్ రివ్యూలనూ దాటుకుని ఖుషి సినిమా విజయవంతంగా రన్ అవుతుంది. అందుకు కారణం నా అభిమానులుగా ఉన్న మీ ప్రేమే... మీరిచ్చే ఈ ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడు వాటి గురించి చర్చించి నిరుత్సాహపరచడం ఇష్టం లేదు. వాటి సంగతి మరో రోజు చూసుకుందాం. ఈ సినిమాతో మీ ముఖాల్లో నవ్వులు చూడాలనుకునే నా కోరిక తీరింది. (ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు కోటి విరాళం.. ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్) ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. డబ్బు సంపాదించాలి, అమ్మ, నాన్నలను హ్యాపీగా ఉంచాలి. సమాజంలో గౌరవం కావాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే నేను ఎప్పుడూ పనిచేస్తుంటా. కానీ, ఇప్పుటి నుంచి కొన్ని నిర్ణయాలు మార్చుకుంటున్నా... మీ మీకోసం పనిచేయాలని అనుకుంటున్నా. నాతో పాటుగా మీరూ ఆనందంగా ఉండాలి. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) పది రోజుల్లో అందిస్తా. ఇక నుంచి మనమంతా దేవర ఫ్యామిలీ. నా ఆనందంలో మీరు ఉన్నారు. అలాంటప్పుడు నా సంపాదనలో కొంత భాగాన్ని మీతో పంచుకోకపోతే వేస్ట్.' అని విజయ్ పేర్కొన్నారు. త్వరలో తన అభిమానుల కోసం మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు. -
ఫ్యాన్స్‌కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్
అర్జున్ రెడ్డితో స్టార్డమ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. తర్వాత తన పంతాను మార్చి ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కు నచ్చే కథలను ఎంచుకుంటూ అభిమానులను మెప్పిస్తున్నాడు. గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ సరైన విజయం అందుకోలేదు. గత ఏడాది విడుదలైన 'లైగర్' ఘోర పరాజయం చూసిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా విడుదలైన 'ఖుషి'తో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: ప్రియురాలితో బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా పెళ్లి.. శ్రావణి రెడ్డి వివరాలు ఇవే) సమంత కథానాయికగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల రోజు డివైడ్ టాక్ వచ్చినా తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో భారీగా కలెక్షన్స్ వైపు దూసుకుపోతుంది. 'ఖుషి' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న విజయ్, అభిమానులకు కోటి రూపాయల సాయంతో తన ఉదారతను చాటుకున్నాడు. దీంతో పలువురు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మూడు రోజుల్లోనే రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు 'ఖుషి' మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సినిమా ప్రమోషన్ భాగంగా వైజాగ్ చేరుకున్నాడు విజయ్. తన సక్సెస్‌లో అభిమానులను కూడా భాగం చేయడానికి తన రెమ్యూనిరేషన్ నుంచి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు గాను మొత్తం కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ అక్కడ ప్రకటించాడు. దీంతో ఆయన అభిమానులు సర్ప్రైజ్ అయ్యారు. పదిరోజుల్లొ 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి ఒక్కో ఫ్యామిలీకి లక్ష రూపాయల చొప్పున తానే స్వయంగా అందిస్తానని విజయ్ అన్నారు. ఇలా దరఖాస్తు చేసుకోండి 'నా సక్సెస్‌లో, నా హ్యాపీనెస్లో మీరు భాగం పంచుకోవాలి. నా సంపాదనను మీతో షేర్ చేసుకోలేకపోతే అంతా వేస్ట్. మీరంతా నా ఫ్యామిలీనే.. దేవర ఫ్యామిలీ, స్ప్రెడింగ్ ఖుషి అని సోషల్ మీడియాలో ఒక అప్లికేషన్ ఫార్మ్ పెడతా. ఇది ఎలా చెయ్యాలో తెలియదు కానీ, అవసరం ఉన్నవాళ్లకి ఏ హెల్ప్ చేసినా నాకు సంతోషమే. మీరు ఉంటున్న ఇంటి రెంట్, పిల్లల స్కూల్ ఫీజులు ఇలా కొంతైనా నా సాయం ఉండాలనుకుంటున్నా.. నా సోషల్ మీడియా ఖాతా ద్వారా వివరాలు తెలుపుతా.. ఆర్థికసాయం కావాల్సిన వారు అభిమానులతో పాటు ఎవరైనా దరఖాస్తు చేసుకోండి.. వాటిలో 100 ఫ్యామిలీలను ఎంపిక చేసుకొని సరిగ్గా పదిరోజుల్లొ ఈ మొత్తాన్ని అందజేస్తా. అప్పుడే నాకు ఖుషి సక్సెస్ సంపూర్తి అవుతుంది.' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. దీంతో విజయ్ను సోషల్‌మీడియా ద్వారా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. TRULY #SpreadingKushi ❤️ Big hearted @TheDeverakonda announces the distribution of 1 CRORE RUPEES to 100 families to share his #Kushi ❤️ Watch the blockbuster celebrations live now! - https://t.co/mgpbwu8tQp#BlockbusterKushi 🩷 @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic… pic.twitter.com/FmyKqse5uC — Mythri Movie Makers (@MythriOfficial) September 4, 2023 -
సమంత - విజయ్‌ల మధ్య లిప్‌లాక్ సీన్స్ అవసరమా..?
విజయ్ దేవరకొండ , సమంత జంటగా నటించిన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ, సమంత జోడీ సినిమాకు మంచి ప్లస్ అవడమే కాకుండా ఇందులోని పాటలు బాగా కనెక్ట్ అయ్యాయి అని చెప్పవచ్చు. కానీ ఇందులో క్లైమాక్స్ సీన్ మాత్రమే బాగుంది అంటూ కొందరు పెదవి కూడా విరుస్తున్నారు. (ఇదీ చదవండి: ప్రముఖ నటి అపర్ణ మృతికి భర్తే కారణం.. ఏం జరిగిందంటే) ‘ఖుషి’ సినిమా చూసినవారికి ఊహించని సీన్ ఒకటి పాటలో ఎదురైంది. అదే విజయ్ దేవరకొండ -సమంత మధ్య లిప్ లాక్ సీన్. ఇప్పుడంతా దీని గురించే చర్చ. సమంత సీనియర్ నటి కదా ఇందులో ఏమంత రొమాంటిక్ సీన్స్ ఉండవులే అని వెళ్లిన వారు దీంతో షాక్ అయ్యారు. ఇక్కడ లిప్‌లాక్ సీన్ అవసరమా అని కొందరు కామెంట్ కూడా చేశారు. ఇదే ప్రశ్న దర్శకుడు శివ నిర్వాణకు ప్రెస్మీట్లో ఎదురైంది. అందుకు దర్శకుడు కూడా హుందాగా ఇలా సమాధానం ఇచ్చారు. అక్కడ తాను హీరోయిన్ సమంతను చూడలేదని.. ఖుషి సినిమాలో ఆరాధ్యను మాత్రమే చూశానని శివ నిర్వాణ అన్నారు. సినిమాలో రెండు పాత్రల మధ్య జరిగే సంఘర్షణలో ప్రేమ, ఎమోషన్‌ను చెప్పడానికి లిప్ లాక్ సీన్ అవసరమేనని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా కథలో రెండు పాత్రలు ఒక ఏడాది పాటు కలిసి ప్రయాణం చేసి ఆపై పెళ్లి అవడం జరుగుతుంది. ఇందులో పిల్లల కోసం అని ఒక ఎమోషన్ పెట్టాం. అలాంటప్పుడు ముద్దు అనే ఒక చిన్న ముచ్చట కూడా లేకపోతే అసలు అర్థంపర్థం ఉంటుందా అని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా చూస్తున్నంత సేపు కొంచెం నేచురల్‌గా చూపించాలి కదా. చూసే ప్రేక్షకులు కూడా నమ్మాలికదా. వారిద్దరూ నిజంగానే భార్యాభర్తలుగా ఉన్నారనే ఫీలింగ్ రావాలి కదా. అందుకే ఆ సీన్ పెట్టామని శివ నిర్వాణ తెలిపారు. (ఇదీ చదవండి: Kushi Movie Review: ‘ఖుషి’మూవీ రివ్యూ) విజయ్, సమంతతో ఆ ముద్దు సీన్స్ ఎలా చేయించారని మరో మహిళా జర్నలిస్ట్ అడగగా.. 'ఇందులో ఇబ్బంది ఏముంది..? యాక్షన్ అంటే చేసేశారు.. కట్ అంటే అయిపోయింది.' అని నవ్వుతూ ఆయన సమాధానం ఇచ్చారు. సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా పనిలో భాగమేనని డైరెక్టర్ శివ నిర్వాణ అన్నారు. -
సమంత తెలివైన అమ్మాయి.. ఆమె సలహాతో నాలో మార్పు: విజయ్ దేవరకొండ
‘ఏదైన నాకు నచ్చకుంటే ఓపెన్‌గా చెప్పేస్తాను. డైరెక్టర్ శివ విషయంలోను అదే చేశాను. ఖుషి సినిమా షూటింగ్ మొదలైన నెల రోజుల తర్వాత అతనితో కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ ఏం నచ్చకున్నా బాగాలేదని ఫేస్ మీదనే చెప్పేవాడిని. అది చూసిన సమంత.. ‘విజయ్..ఏం చెప్పాలన్నా ఓ పద్దతి ఉంటుంది. అలా డైరెక్ట్‌గా ఫేస్ మీద చెప్పకూడదు’అని సలహా ఇచ్చింది. సామ్ సలహా నాలో మార్పును తీసుకొచ్చింది’అని స్టార్ హీరో విజయ్ దేవరకొండ అన్నాడు. విజయ్, సమంత జంటగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ అభిమానులతో క్యూ అండ్ ఏ నిర్వహించాడు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఈ క్యూ అండ్ ఏ లైవ్ స్ట్రీమ్ అయ్యింది. ఫ్యాన్స్ తో జరిపిన ఈ ఇంటరాక్షన్ లో ఖుషి హైలైట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ లో తన అభిప్రాయాలు, జీవితాన్ని తాను చూసే పర్సెప్షన్ గురించి చెప్పుకొచ్చాడు. అవేంటో విజయ్ మాటల్లోనే.. శివకు సినిమా పిచ్చి డైరెక్టర్ శివ నిర్వాణతో కనెక్ట్ అయ్యేందుకు నాకు నెల రోజుల టైమ్ పట్టింది. ఆ తర్వాత ఆయన మీద నాకు నమ్మకం ఏర్పడింది. పాటల దగ్గర నుంచి ప్రతీది ఆయన డెసిషన్ కే వదిలేశా. ఎందుకంటే శివకు సినిమా పిచ్చి. తన సినిమా ఎలా ఉండాలో ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఆ ఫ్రేమ్ నుంచి బయటకు రాడు. మనం ఏదైనా బాగుంటుందని చెబితే నచ్చితే తీసుకుంటాడు. అది కథకు అవసరం ఉండదు అనుకుంటే ఎందుకు ఉండదో చెబుతాడు. అందుకే మ్యూజిక్ కన్సర్ట్ ఖుషి సినిమాలో ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ కంటే ఫన్ ను ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ తో మంచి కామెడీ వర్కవుట్ అయ్యింది. అలాగే సెకండాఫ్ లో రాహుల్ రామకృష్ణతో కలిసి నవ్విస్తాను. ఈ సినిమాలోని ఖుషి టైటిల్ సాంగ్ వినగానే బాగా నచ్చింది. ఆ పాట ముందు మోషన్ పోస్టర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనుకున్నాం. ఇంప్రెసివ్ గా ఉండటంతో సామ్, శివ, నేను కలిసి హేషమ్ తో మాట్లాడి దాన్ని ఫుల్ సాంగ్ చేశాం. ఖుషి పాటలను విన్నప్పుడు ఈ మ్యూజిక్ ను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. అలా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాం. ఆ మ్యూజిక్ కన్సర్ట్ టైమ్ లో ఆరోగ్యం బాగా లేకున్నా సమంత పార్టిసిపేట్ చేసింది. ఆ స్టేజీ మీద సమంతతో లైవ్ పర్ ఫార్మ్ చేశాను. సమంత తెలివేన అమ్మాయి సమంత తెలివైన అమ్మాయి. శివ, నేను మూవీ గురించి డిస్కస్ చేసేప్పుడు ఆమె మంచి ఐడియాస్ చెప్పేది. మా ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మేమిద్దరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి డబ్బు,లైఫ్ గురించి ఒకేలా ఆలోచనలు ఉంటాయి. అలాగే మా ఇద్దరికీ హిస్టరీ అంటే ఇష్టం. సమంత దేవుడిని ఆరాధిస్తుంది. నేను మతపరమైనవి, దేవుడి గురించి డౌట్స్ అడుగుతుంటా. సమంతతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంటుంది. డైరెక్షన్ వైపు వెళ్తా.. డైరెక్షన్ చేయడం అనేది ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. లైఫ్ లో కొద్ది కాలం తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుని డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నా. కానీ నా దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్ చదువుతుంటే నటించడం ఆపలేను అనిపిస్తుంటుంది. వయసు ఉంది కాబట్టి ఇప్పుడు ఎంతైనా కష్టపడగలను. ఫ్యూచర్ లో ఏదో ఒక పాయింట్ లో డైరెక్షన్ వైపు వెళ్తా. ఫెయిల్యూర్, సక్సెస్ ఒకేలా చూడాలి లైఫ్ లో ఫెయిల్యూర్ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ అనేది ఏదో ఒక టైమ్ లో తప్పకుండా ఎదురవుతుంది. నేనూ లైఫ్ లో బిగ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ చూశాను. వాటి గురించి బయట చాలా మంది మాట్లాడారు. నా దృష్టిలో ఫెయిల్యూర్, సక్సెస్ ఒకేలా చూడాలి. చేసిన తప్పులు చేయకుండా అపజయాల నుంచి నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. జీవితం అంటే ఓడటం, గెలవడం కాదు జీవించడం. లైఫ్ లో మిమ్మల్ని మీరు ఏ పొజిషన్ లో చూడాలని అనుకుంటున్నారో ఆ గమ్యం వైపు ఒక్కో అడుగు వేస్తూ వెళ్లండి. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం నా ఫేవరేట్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీ, దోశ, బర్గర్, ఛీజ్ కేక్ ఇష్టంగా తింటాను. ఇవన్నీ తిన్నా వర్కవుట్ బాగా చేస్తా. అలా బరువు పెరగకుండా చూసుకుంటా.నాకు ఆర్కిటెక్చర్ ఇష్టం. మా ఇంట్లో డెకరేషన్ ఎలా ఉండాలో నేనే సెలెక్ట్ చేశా. ఫ్యూచర్ లో ఒక ఫామ్ కొని దాన్ని నాకు నచ్చినట్లు డిజైన్ చేయించుకోవాలని అనుకుంటున్నా. బిజినెస్ ఆలోచనలూ ఉన్నాయి నాకు ట్రావెలింగ్, స్పోర్ట్స్ ఇష్టం. ఆ మధ్య మాల్దీవ్స్ వెళ్లాను. హెవెన్ లా అనిపించింది. ఖుషి షూటింగ్ టైమ్ లో కాశ్మీర్ వెళ్లాను. అది నా ఫేవరేట్ ప్లేస్ అయింది. మా ఫ్రెండ్స్ తో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతుంటాం. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. అలాగే బిజినెస్ ఆలోచనలూ ఉన్నాయి. ఈ విషయంపై మా ఫ్యామిలీ, నా టీమ్ తో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. ఎంటర్ ప్రెన్యూర్ లో కొద్ది రోజుల్లోనే నా నుంచి ఒక ప్రకటన వస్తుంది. డ్రీమ్ క్యారెక్టర్స్ లేవు సోషియో ఫాంటసీ మూవీ జానర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే ఆ స్క్రిప్ట్స్ ఆకట్టుకునేలా రాయడం కష్టం. అలాంటి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా నటిస్తా. నాకు డ్రీమ్ క్యారెక్టర్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇప్పుడు చేసిన ఖుషి, తర్వాత చేస్తున్న వీడీ 12, వీడీ 13 సినిమాలకు సూపర్బ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అలాంటి స్క్రిప్ట్స్ లో నటిస్తానని ఊహించలేదు. తమిళ్ డైరెక్టర్స్ అరుణ్ మాతేశ్వరన్, అరుణ్ ప్రభు ఇద్దరూ టాలెంటెడ్. వారితో స్క్రిప్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్స్ లాక్ అయితే వెంటనే మూవీస్ ప్రారంభిస్తా. -
‘ఖుషి’ సమంత రియల్ స్టోరీ కాదు.. అలాంటి సామ్‌ని చూస్తారు: డైరెక్టర్
‘సమంత ప్రస్తుతం డిఫరెంట్ జానర్స్ చేస్తుంది. ఆమె నుంచి ఓ మంచి లవ్‌స్టోరీ వచ్చి చాలా కాలం అవుతుంది. చాలా కాలం తర్వాత లవ్‌స్టోరీ ‘ఖుషి’ చేస్తుంది. తెరపై వింటేజ్ సమంతను చూస్తారు’అని దర్శకుడు శివ నిర్వాణ అన్నారు. ఆయన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► నేను గతంలో తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీలో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చూపించాను. కానీ ఈసారి ఒక ఎంటర్ టైనింగ్, ఎనర్జిటిక్, సరదాగా ఉండే ప్రేమ కథను రూపొందించాలని అనుకున్నాను. నేను వ్యక్తిగతంగా సరదాగా ఉండే పర్సన్ ని. ఈ సినిమాకు సరదా అని, మరికొన్ని టైటిల్స్ అనుకున్నాను. కానీ విజయ్, సమంతకున్న పాన్ ఇండియా ఇమేజ్ కు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఐదు భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అలా ‘ఖుషి’ టైటిల్ ఫిక్స్ చేశాం. ► ‘ఖుషి’ మణిరత్నం ‘సఖి’ లాంటి పాయింట్ అనే వార్తలూ వచ్చాయి కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. ఇవాళ్టి కాంటెంపరరీ సొసైటీలో ఉన్న ఒక ఇష్యూను విజయ్, సమంత లాంటి పాపులర్ స్టార్స్ ద్వారా అడ్రస్ చేయిస్తే బాగుంటుందని నమ్మాను. వాళ్లకూ ఈ పాయింట్ కనెక్ట్ అయ్యింది. ఆ పాయింట్ ఏంటనేది ట్రైలర్ లో మేము చూపించలేదు. థియేటర్ లో చూడాలి. ► ప్రేమ కథను ఎంత కొత్తగా చెప్పాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్. కథ రాసేప్పుడు సెకండాఫ్ రెడీ అయ్యింది. కానీ ఫస్టాఫ్ లో లవ్ స్టోరిని కాలేజీలో చూపించకుండా ఒక ఫీల్ గుడ్ ప్లేస్, ప్లెజంట్ గా ఉండే ప్లేస్ నుంచి మొదలుపెడితే బాగుంటుంది అనిపించింది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య పరిచయం ఫన్ తో సాగాలి అనుకున్నాను. మీరు ట్రైలర్ లో చూసినట్లు హీరో హీరోయిన్ ను బేగమ్ అని ఒకసారి, మరోసారి ఇంకోలా పిలుస్తుంటాడు. ఇవన్నీ సరదాగా ఉంటాయి. ► ‘ఖుషి’ మ్యూజిక్ కోసం హేషమ్ ను కలిసి మాట్లాడినప్పుడు ఆయన మంచి మ్యూజిక్ ఇవ్వగలడని అనిపించింది. విజయ్ కు చెప్పగానే ఆయన కూడా ఓకే అన్నారు. హేషమ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ హిట్. నా రోజా నువ్వే హిందీ సహా అన్ని లాంగ్వేజెస్ లో హిట్టయ్యింది. మ్యూజిక్ కు మంచి పేరొచ్చింది కాబట్టి ఆ మ్యూజిక్ తోనే సినిమా ప్రమోషన్ గ్రాండ్ గా స్టార్ట్ చేయాలని అనుకుని మ్యూజిక్ కన్సర్ట్ పెట్టాం. ఇది విజయ్ చెప్పిన ఆలోచనే. ► విజయ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. పెళ్లి చూపులు, గీత గోవిందంలో ఒకలాంటి కామెడీ టైమింగ్ చూశారు. కానీ ఇందులో స్టైలిష్ కామెడీ చేశాడు. అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు విజయ్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అందరూ ఆయన క్యారెక్టర్ ను ఓన్ చేసుకుంటారు. ‘ఖుషి’ లో హిందూ ముస్లిం మధ్య గొడవలు చూపించడం లేదు. కానీ ఒక వెరీ సెన్సిటివ్ ఇష్యూను కథలో చూపిస్తాం. అది మీకు నచ్చుతుంది. ఒక ప్లెజంట్ ఎట్మాస్పియర్ కోసమే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం. ► ‘ఖుషి’ సినిమా కథకు సమంత రియల్ లైఫ్ కు ఎలాంటి పోలికలు, సంబంధం లేదు. నేను మూడేళ్ల క్రితం రాసుకున్న కథ ఇది. ఆమెతో మజిలీ సినిమా చేశాను కాబట్టి బాగా నటించగలదు అని ఇందులోకి తీసుకున్నాం. నేను రాసిన కథలో ఆమె తన క్యారెక్టర్ ప్లే చేసింది అంతే. ► బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ వంటి సినిమాలన్నీ మనకు నచ్చేలా చేసుకున్న సినిమాలు. ఇతర భాషల వాళ్లు ఇష్టపడి పాన్ ఇండియా అయ్యాయి. నా దృష్టిలో మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చి పాన్ ఇండియా మూవీ అవుతుంది. పాన్ ఇండియాకు చేయాలని మనం ప్లాన్ ముందే చేసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం. ‘ఖుషి’ థియేటర్ లో చూసి ఒక మంచి అనుభూతితో బయటకు వస్తారు. -
‘ఖుషి’ రెమ్యునరేషన్.. మా అమ్మే ఆశ్చర్యపోయింది: డైరెక్టర్
టక్ జగదీష్ మూవీ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ.. ‘ఖుషి’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. (చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ మూవీ.. కానీ అదే ట్విస్ట్!) ఆ మధ్య చిత్రబృందం నిర్వహించిన మ్యూజికల్ కన్సర్ట్‌తో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. అదే సమయంలో ఈ సినిమాపై రకరకాల పుకార్లు మొదలయ్యాయి. ముఖ్యంగా రెమ్యునరేషన్లకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ చిత్రానికి గాను హీరోహీరోయిన్లతో పాటు డైరెక్టర్ శివనిర్వాణ కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఈ వార్త సారాంశం. విజయ్ రూ. 23 కోట్లు, సమంత రూ.4.5 కోట్లు పారితోషికంగా పుచ్చుకున్నారట. ఇక డైరెక్టర్ శివనిర్వాణ అయితే ఏకంగా రూ.12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అమ్మే ఆశ్చర్యపోయింది అయితే తన రెమ్యునరేషన్‌పై డైరెక్టర్ శివ నిర్వాణ స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పారితోషికంపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ‘నాకు రూ. 12 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని పలు వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. అది చూసి నేనే షాకయ్యాను. నా స్నేహితులు అయితే ఫోన్ చేసి మరీ అడిగారు. ‘చూస్తే సైలెంట్‌గా ఉంటావు..బానే పుచ్చుకున్నావ్గా’అని సెటైర్లు వేశారు. అంతెందుకు మా అమ్మ కూడా నా రెమ్యునరేషన్ గురించి తెలిసి ఆశ్చర్యపోయింది. ఫోన్ చేసి మరీ అడిగింది. అంత రెమ్యునరేషన్ నాకు ఇస్తే సినిమాలు ఎలా తీస్తారండి?. నాతో పాటు హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ కలిపితేనే రూ.50 కోట్లు అయితే.. ఇక సినిమాకు ఎంత ఖర్చు అవ్వాలి? నాలాంటి డైరెక్టర్ అంత బారీ మొత్తంలో ఏ నిర్మాతలు ఇవ్వలేరు’ అని శివ నిర్వాణ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమా కోసం తాను రాసిన పాటలకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించాడు. అయితే రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారనేది మాత్రం ఆయన వెల్లడించలేదు కానీ, రూ.5 కోట్ల వరకు తీసుకునే చాన్స్ ఉందని ఇండస్ట్రీ టాక్. -
'ఖుషి' టైటిల్ సాంగ్.. ఈసారి కూడా అదే ఫార్ములా!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా 'ఖుషి'. ఫుల్ లెంగ్త్ ప్రేమకథతో తీస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు అద్భుతమైన రెస్పాన్స్ అందుకోగా, ఇప్పుడు టైటిల్ సాంగ్ విడుదల చేశారు. ఇది కూడా అలానే మెలోడీయస్‌గా ఉంది. అయితే మళ్లీ ఓ విషయాన్ని సేమ్ ఫాలో అయిపోయారు. (ఇదీ చదవండి: ఏప్రిల్‌లో గుండెనొప్పి.. ఇప్పుడేమో స్టేజీపై చలాకీ చంటి!) తొలిపాట 'నా రోజా నువ్వే'లో మణిరత్నం సినిమా పేర్లతో లిరిక్స్ రాశారు. దీన్ని కశ్మీర్ లో షూట్ చేశారు. 'ఆరాధ్య' పాటని భార్యభర్తల ఉండే అనుబంధం నేపథ్యంగా రాశారు. దీన్ని లీడ్ రోల్స్ ఉండే ఇంటిలో షూటింగ్ చేశారు. టైటిల్ సాంగ్ ని టర్కీలో చిత్రీకరించారు. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఈ పాటలో హిందీ లవ్‌స్టోరీ మూవీస్‌లో ఎక్కువగా వినిపించే ప్యార్, ఆషికి లాంటి పదాలు కనిపించాయి. ఇప్పటివరకు రిలీజైన అన్ని పాటల్ని దర్శకుడు శివ నిర్వాణ రాశారు. బహుశా రాబోయే మిగతా సాంగ్స్ కూడా ఆయనే రాసి ఉంటారనిపిస్తుంది. సెప్టెంబరు 1న థియేటర్లలోకి రాబోతున్న మూవీపై పాటల వల్ల మంచి బజ్ క్రియేట్ అవుతోంది. దీన్నిబట్టి చూస్తే ఓపెనింగ్స్ మంచిగానే వస్తాయని అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!) -
భారీ హిట్ కొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వస్తున్న ముగ్గురు డైరెక్టర్లు
సినిమాలు అన్నాక హిట్స్‌తో పాటు ప్లాపులు కూడా సహజం కానీ హిట్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఇంకో హిట్ సినిమా తీసేందకు ప్లాన్ చేయాలి.. ఒకవేళ ప్లాప్ వస్తే మరో భారీ హిట్ కొట్టేందుకు స్కెచ్ వెయ్యాలి. ఇలానే సినిమా ఇండస్ట్రీలో అందరికి ఉంటుంది. ఈ ముగ్గురు దర్శకులు మాత్రం మొదట్లో హిట్ కొట్టి ఆ తర్వాత వచ్చిన సినిమాలతో భారీ డిజాస్టర్‌ను మూటకట్టుకున్నారు. (ఇదీ చదవండి: రాకేష్ మాస్టర్ భార్యపై దాడి.. నడిరోడ్డుపై చితక్కొట్టిన మహిళలు) ఐదేళ్ల క్రితం వచ్చిన 'ఆర్ఎక్స్-100'తో దర్శకుడు అజయ్ భూపతి సినీ ఇండస్ట్రీకి భారీ షాక్ ఇచ్చాడు. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన మహాసముద్రం డిజాస్టర్ అయింది. దాంతో తాజాగా తన సత్తా చాటేందకు పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా మంగళవారం అనే పాన్ ఇండియా సినిమాతో కమ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాడు అజయ్. ఇప్పటికే ఆయన టీజర్ విడుదల చేశారు. దానిని చూసిన వారందరూ ఈసారి హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. మరోవైపు మహేష్ బాబుతో 'బ్రహ్మోత్సవం' సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పటికి కోలుకోలేకపోతున్నాడు. ఆ సినిమా భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కానీ విక్టరీ వెంకటేష్‌తో 'నారప్ప' సినిమా తీసినా అది ఓటీటీకే పరిమితం అయింది. తాజాగా ఆయన నుంచి పెదకాపు ప్రాజెక్ట్‌తో శ్రీకాంత్ వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన రోజు నుంచి యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఇదే కోవలో మరోక దర్శకుడు శివ నిర్వాణ కూడా ఉన్నారు. నానితో 'టక్ జగదీష్' సినిమాను తీసి.. దానిని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు. అక్కడ అది ప్రేక్షకులను నిరాశపరిచింది. అందుకే ఈయన ఈసారి ఇండస్ట్రీలో భారీ హిట్ కొట్టేందుకు పక్కా స్కెచ్‌తో వస్తున్నాడు. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో 'ఖుషి' తీస్తున్నాడు. ఈ సినిమాపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగల్ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. ఈ ముగ్గురి దర్శకులు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. చూద్దాం ఈసారి భారీ హిట్ కొడతారేమో. (ఇదీ చదవండి: లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన యంగ్ హీరో.. ఎన్ని కోట్లంటే?) -
ముస్లిం యువతిగా సమంత.. 'ఖుషి' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు(మంగళవారం)విజయ్ బర్త్‌డే కానుకగా ఖుషి మూవీలోని తొలి పాట 'నా రోజా నువ్వే.. అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు.ఇక ఈ పాటలో సమంతను చూస్తే ఆమె ముస్లిం యువతిగా కనిపించింది. ఇక ఈ పాటకు స్వయంగా శివ నిర్వాణ లిరిక్స్ అందించగా, హీషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు. ఇక ఖుషి సినిమా ప్రేమకథాంశంతో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ముస్లిం యువతి, హిందూ యువకుడి మధ్య లవ్‌స్టోరీనే ఖుషి అని తెలుస్తుంది. ఇంతకుముందు సమంత బర్త్‌డే పోస్టర్లో ఆమె మెడలో తాళితో ఐటీ ఉద్యోగిగా కనిపించింది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్సాంగ్లో ముస్లిం యువతిగా కనిపించింది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
విజయ్, సామ్‌ల 'ఖుషీ' ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం రెడీ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇది వరకే విడుదలైన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లకి మాంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ను వదిలారు. ఖుషీ ఫస్ట్ సింగిల్‌ను మే9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు పోస్టర్‌ను వదిలారు.కాగా ఈ సినిమాను సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. Musical blast begins with the first single of #Kushi on May 9th❤️🔥 In Telugu, Hindi, Tamil, Kannada & Malayalam ❤️#NaRojaaNuvve#TuMeriRoja#EnRojaaNeeye#NannaRojaNeene@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi @saregamasouth pic.twitter.com/1kSZou8xn1 — Mythri Movie Makers (@MythriOfficial) May 4, 2023 -
హిట్ కాంబినేషన్స్ రిపీట్.. ఆ హీరోయిన్సే కావాలంటున్న డైరెక్టర్స్!
ఫిలిం ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్‌కు చాలా క్రేజ్ ఉంటుంది. హిట్ అయిన సినిమాలో హీరో, హీరోయిన్స్ మళ్లీ నటిస్తున్నారన్నా.. సక్సెస్ సాధించిన సినిమా డైరెక్టర్, హీరో కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుందన్నా.. సినీ అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అంతేకాదు బాక్సాఫీస్ వసూళ్లు...మార్కెట్ లెక్కలు మారిపోతుంటాయి. అందుకే ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇలా హీరోయిన్-డైరెక్టర్ కాంబోకి కూడా బాక్సాపీస్ దగ్గర ఫుల్ క్రేజ్ వుంది. ప్రజెంట్ టాలీవుడ్లో చాలా మంది హీరోయిన్స్ తమకు సక్సెస్ అందించిన డైరెక్టర్స్ మూవీస్‌లో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో హీరోయిన్గా నటించింది పూజాహెగ్డే. బుట్టబొమ్మ నటించిన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇక అల వైకుంఠపురంలో సినిమా అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. ఈ సినిమా నుంచే పూజాహెగ్డే బుట్టబొమ్మగా మారిపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వరుసగా రెండు సినిమాల్లో నటించిన పూజా... ఇప్పుడు #SSMB 28 లో మహేశ్‌కు జోడీగా నటిస్తోంది. త్రివిక్రమ్-పూజాహెగ్డే కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న #SSMB 28 సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డిఫరెంట్ స్టోరీతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. మే నెలాఖరు కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ను ఉగాది రోజు వెల్లడించనున్నారు. ఇక సమంతకు డైరెక్టర్ శివనిర్వాణ మజిలీ సినిమాతో మరుపురాని హిట్ అందించాడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఖుషి . ఈ సినిమాలో సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్నారు. మహానటి తర్వాత సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న సినిమా ఇదే. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న ఈ ఖుషి మూవీ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ ఆగస్ట్ తర్వాత ధియేటర్స్ లోకి వచ్చే చాన్స్ వుంది. తన డెబ్యూ మూవీ ఆర్ఎక్స్ 100 తోనే సక్సెస్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమాతోనే తెలుగు తెరకి హీరోయిన్గా పరిచయమైన పాయల్ రాజ్‌పుత్ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో మంగళవారం అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో పాయల్ రాజ్ పూత్ 30 పాత్రల్లో కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని తెలుగుతో పాటు...తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ తన డెబ్యూ మూవీ ఎవడే సుబ్రహ్మణ్యంలో పరిచయం చేసిన హీరోయిన్ మాళవిక నాయర్. నాగ్ అశ్విన్ ఈ సినిమా తర్వాత తెరకెక్కించిన మహానటిలో కూడా మాళవికనాయర్ నటించింది. ఇప్పుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ లో మాళవిక నాయర్ కనిపించనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ఈ బ్యూటీ కన్ఫార్మ్ కూడా చేసింది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న సినిమా సైంధవ్..ఈ పాన్ ఇండియా మూవీలో ముగ్గురు హీరోయిన్స్ లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా రుహానీ శర్మ సెలెక్ట్ అయింది. గతంలో శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమాలో రుహానీ శర్మ నటించింది. క్రేజీ కాంబినేషన్స్ గా రాబోయే ఈ కాంబో మూవీస్ బాక్సాపీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి! -
విజయ్, సమంతల 'ఖుషీ' మూవీపై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సమంత అనారోగ్యం కారణంగా ఇప్పటివరకు షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు సామ్ కోలుకోవడంతో త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది రెండు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి సమ్మర్లో ఖుషీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. తాజాగా ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ శివ నిర్వాణ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. .యాక్షన్ సీక్వెన్స్ తో ఖుషి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది అంటూ పాపులర్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్, ఎడిటర్ ప్రవీణ్ పూడితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ఫిల్మ్‌సర్కిల్స్‌లో అందుతున్న సమాచారం ప్రకారం.. ఈనెల 8 నుంచి ఖుషీ కొత్త షెడ్యూల్ షురూ కానున్నట్లు తెలుస్తుంది. Heading towards next schedules #Kushi Action mode on🔥 With ace stunt master @PeterHeinOffl and my editor @PrawinPudi pic.twitter.com/nVkma5QyaJ — Shiva Nirvana (@ShivaNirvana) March 5, 2023 -
సమంత-విజయ్ దేవరకొండల 'ఖుషీ' సినిమా ఆగిపోయిందా? ట్వీట్ వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషి. మజిలీ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. కానీ సడెన్‌గా సమంత అనారోగ్యం బారిన పడటంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం, తన పాత్రకు తగిన స్క్రీన్ స్పేస్ కేటాయించకపోవడంతో సామ్ కూడా ఈ ప్రాజెక్ట్‌కి డేట్స్ ఇవ్వట్లేదని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో సినిమా ఆగిపోయిందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శివ నిర్వాణ ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ఖుషి రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది అంటూ ట్వీట్ చేశారు. దీంతో సినిమా ఆగిపోయిందనే రూమర్స్‌కి ఫుల్స్టాప్ పెట్టినట్లయ్యింది. #khushi regular shoot will start very soon 👍 everything is going to be beautiful❤️ — Shiva Nirvana (@ShivaNirvana) January 30, 2023 -
సమంత అనారోగ్యంతో సినిమాకు బ్రేక్.. కృతిశెట్టికి ఆఫర్?
విజయ్ దేవరకొండ- సమంత జంటగా నటిస్తున్న సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. సమంత అనారోగ్యం కారణంగా ప్రస్తుతం షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో సమంతతో పాటు మరో హీరోయిన్గా కృతిశెట్టికి అవకాశం దక్కిందట. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ రోల్ సినిమా చివర్లో చాలా ఎమోషనల్‌గా మారుతుందని, ఈ పాత్రలో కృతిశెట్టి నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్మెంట్ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్‌తో కృతిశెట్టి చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది. దీంతో బేబమ్మ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
‘లెహరాయి’ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట రిలీజ్
రంజిత్, సౌమ్యా మీనన్ జంటగా రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లెహరాయి’. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ఎల్ఎస్ మూవీస్‌పై మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘మెరుపై మెరిసావే.. వరమై కలిసావే.. గుండె గిల్లి వెల్లావే..’ అంటూ సాగే రెండో పాటను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మ్యూజిక్ డైరెక్టర్ జీకే (ఘంటాడి కృష్ణ)గారి పాటలను అప్పట్లో యూత్ అంతా పాడుకునేవారు. చాలా రోజుల తర్వాత ఆయన ‘లెహరాయి’ ద్వారా మళ్లీ రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మెరుపై మెరిసావే..’ కి జీకేగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడటం మొదటి సక్సెస్‌గా భావిస్తున్నాను. సినిమాని త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు మద్దిరెడ్డి శ్రీనివాస్. ‘‘మంచి ఫీల్ ఉన్న కథా చిత్రమిది’’ అన్నారు రామకృష్ణ పరమహంస. -
విజయ్, సమంతలకు థ్యాంక్స్ అంటూ డైరెక్టర్ లేటెస్ట్ అప్డేట్!
Khushi Movie Update: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటంగా కలిసి నటిస్తున్న లవ్ స్టోరీ 'ఖుషి'. ప్రేమ కథా చిత్రాలకు మారుపేరైన శివ నిర్వాణ ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కశ్మీర్ తొలి షూటింగ్ షెడ్యూల్‌ను జరుపుకుంటున్ను విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓ అప్డేట్ ఇస్తూ హీరో విజయ్, సమంతలకు డైరెక్టర్ శివ థ్యాక్స్ చెప్పాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘కశ్మీర్లో జరుగుతున్న మా మూవీ(ఖుషీ) తొలి షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. చదవండి: సినిమా టికెట్లు అమ్మాలంటూ వేధింపులు? నిజమేంటంటే? కశ్మీర్ షెడ్యూల్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు సహాకరించిన హీరో విజయ్, హీరోయిన్ సమంత, వెన్నెల కిశోర్‌తో మా మూవీ యూనిట్‌కు ధన్యవాదాలు’ అంటూ శివ రాసుకొచ్చాడు. కాగా ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 23, 2022న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. కాగా ఈ మూవీతో పాటు విజయ్, పూరీ జగన్నాథ్‌తో జనగనమణ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల సామ్ నటించిన కాతువాక్కుల రెండు కాదల్ మూవీ విడుదల కాగా శాకుంతం, యశోద చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటితోపాటు ఓ ఇంటర్నేషనల్ మూవీతో పలు ప్రాజెక్ట్‌లకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. Amazing first schedule in kashmir Thankyou @TheDeverakonda @Samanthaprabhu2 @vennelakishore #saranyapradeep and Whole #khushiteam 👏 congratulations #khushiondec23 #khushi pic.twitter.com/jax2pkYRvS — Shiva Nirvana (@ShivaNirvana) May 23, 2022 -
సమంత, విజయ్‌ల ఫస్ట్‌లుక్ వచ్చేది అప్పుడే
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ను విజయ్ దేవరకొండ షేర్ చేశారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని రేపు(సోమవారం)ఉదయం 9.30నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్లో 11వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి తర్వాత సామ్, విజయ్ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. Tomorrow :) 9:30 AM Muhurtham set by@Samanthaprabhu2 https://t.co/Mc3MEsdVF1 — Vijay Deverakonda (@TheDeverakonda) May 15, 2022 -
సమంతపై యుద్దం ప్రకటించిన విజయ్ దేవరకొండ.. పోస్ట్ వైరల్
సమంత, విజయదేవరకొండ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ‘మహానటి’నుంచి ఏర్పడిన వీరి స్నేహబంధం.. ఇప్పుడు మరింత బలంగా మారింది. దానికి కారణం ఇప్పుడు వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించడమే. శివ నిర్వాణ దర్శకత్వంలో సామ్, విజయ్‌లు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్లో కాస్త విరామం దొరికినా చాలు వీరిద్దరు సరదాగా గేమ్స్ ఆడుతున్నారు. (చదవండి: విజయ్ దేవరకొండపై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) తాజాగా వీరిద్దరు కలిసి వెన్నెల కిశోర్‌తో కలిసి ఓ ఆన్లైన్ గేమ్ ఆడారు. ఇందులో సామ్ విజయం సాధించింది. ఈ విజయాన్ని ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. విజయ్ దేవరకొండ లాంటి ప్రత్యర్థులపై విక్టరీ సాధించడం ఎంతో సంతోషంగా ఉందని సామ్ రాసుకొచ్చింది. దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘యుద్దం ప్రకటిస్తున్నా.. ఇకపై ప్రతి విక్టరీ రికార్డు అవుతుంది’అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_140.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సమంతపై ప్రాంక్.. విజయ్ సర్ప్రైజ్ మామూలుగా లేదుగా
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతుంది. అయితే గురువారం సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. షూటింగ్ సీన్ అంటూ ఒక ఫేక్ డైలాగ్‌ను సమంతతో రిహార్సల్ జరిపించారు. యాక్షన్ అనగానే లవ్ ఫీల్‌తో సామ్ ఆ డైలాగ్‌ను చెబుతుండగా, హ్యాపీ బర్త్‌డే సమంత అంటూ విజయ్ చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇక డైరెక్టర్ శివ నిర్వాణ సహా సెట్లోని వాళ్లంతా హ్యాపీ బర్త్‌డే అంటూ ఒక్కసారిగా అరవడంతో ఇది ఫేక్ రిహార్సల్ అని అర్థమయ్యింది. ఆ తర్వాత సెట్లోనే సామ్ బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను విజయ్ దేవరకొండ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ సర్ప్రైజింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Happy Birthday @Samanthaprabhu2 ❤️ Wishing you full happiness 😊 Let’s make a love story now :) Love and hugs, Vijay. https://t.co/5mEfpp4Wws — Vijay Deverakonda (@TheDeverakonda) April 28, 2022 -
కశ్మీర్లో ల్యాండ్ అయిన సమంత
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తమిళంలో ఆమె నటించిన ‘కాతువాకుల రెండు కాదల్’చిత్రం రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగులో ఇప్పటికే యశోద, శాకుంతలం షూటింగ్స్ కంప్లీట్ చేసిన సమంత తాజాగా శివ నిర్వాణతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కశ్మీర్లో జరగనుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సామ్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ఫ్లయిట్లో వెళ్తూ కశ్మీర్ అందాలను కెమెరాలో బంధించింది. -
సమంత ఫేక్ ఫొటో షేర్ చేసిన విజయ్, పడిపడి నవ్విన సామ్
Vijay Devarakonda Shares Samantha Fake Photo From VD11: విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లు శివ నిర్వాణ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. రీసెంట్గా ఈమూవీ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. #VD11 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈమూవీ పూజా కార్యక్రమాల్లో డైరెక్టర్ శివ నిర్వాణతో పాటు హరీశ్ శంకర్, బుచ్చిబాబు, కొరటాల శివ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కానీ హీరోయిన్గా నటిస్తున్న సమంత మాత్రం మిస్సయ్యింది. చదవండి: హిందీ ‘జెర్సీ’ చూసిన నాని ఏమన్నాడంటే.. దీంతో ఈ ప్రాజెక్ట్ లాంచ్‌కు సామ్ ఎందుకు రాలేదు అన్న చర్చ మొదలైంది. సామ్ ఎక్కిడికెళ్లిందనే విషయంపై ఆరా తీయగా.. సామ్ ప్రస్తుతం దుబాయ్‌లో హాలీడే వేకషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిసిందే. అందువల్లే తను మూవీ ప్రారంభోత్సవానికి హజరు కాలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ ఈ మూవీ పూజ ఫొటోను షేర్ చేశాడు. అయితే ఇందులో విజయ్ పక్కన సమంత కూడా ఉండటం గమనార్హం. దీంతో ఇది చూసి అంతా షాకవుతున్నారు. ఎందుకంటే ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమంత లేకపోయినా విజయ్ షేర్ చేసిన ఫొటో ఎలా వచ్చిందా? అని చూస్తున్నారు. చదవండి: మీలో ఆ టాలెంట్ ఉంటే.. ప్రభాస్ సినిమాలో ఛాన్స్ తీరా అది మార్ఫింగ్ చేసిన ఫొటో అని అర్థమైంది. కేవలం సమంతనే కాదు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణల ఫొటోలను కూడా విజయ్ మార్ఫింగ్ చేసి షేర్ చేశాడు. ఈ ఫొటోను తన ట్వీటర్ ఖాతాలో పంచుకుంటూ.. ‘ఇదే అసలైన పూజ ఫొటో. దీనిని ప్రచురించాల్సిందిగా మీడియాకు నా రిక్వెస్ట్’ అంటూ విజయ్ సరదాగా ట్వీట్ చేశాడు. ఇక విజయ్ ట్వీట్‌కు సమంత స్పందిస్తూ.. పడి పడి నవ్వుతున్న ఎమోజీలను జత చేసి రీట్వీట్ చేసింది. దీందో విజయ్ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 😂😂😂 https://t.co/YYmqUb4xtL — Samantha (@Samanthaprabhu2) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
విజయ్‌తో సినిమా.. లాంచింగ్ ఈవెంట్లో కనిపించని సామ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరెక్షన్లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా సమంత నటించనుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో లాంచనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల్లో డైరెక్టర్ శివ నిర్వాణతోపాటు హరీశ్ శంకర్, బుచ్చిబాబు, కొరటాల శివ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చదవండి: తల్లి బర్త్‌డే సెలబ్రేషన్స్.. మిస్ అయిన మహేశ్ కానీ హీరోయిన్గా నటిస్తున్న సమంత మాత్రం మిస్సయ్యింది. దీంతో ఈ ప్రాజెక్ట్ లాంచ్‌కు సామ్ ఎందుకు రాలేదు అన్న చర్చ మొదలైంది. సామ్ ఎక్కిడికెళ్లిందనే విషయంపై నెట్టింట చర్చ నడుస్తుంది. అసలు ఏమైందంటే.. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం దుబాయ్‌లో హాలీడే ట్రిప్‌లో ఉంది. ఈ కారణంగానే మూవీ లాంచ్ ఈవెంట్‌కు ఆమె రాలేదని సమాచారం. కాగా రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సమంత నటిస్తుండటం, రౌడీ హీరోతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని అంచనాలు పెరిగాయి. చదవండి: ఆ హీరోయిన్ గురించి మనసులో మాటను బయటపెట్టిన యశ్ -
విజయ్ దేవరకొండ, సమంతల ప్రేమకథ షురూ
కెరీర్ పరంగా జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం పూర్తి కాకముందే..పూరితో కలిసి ‘జనగనమణ’ని సెట్స్‌పైకి తీసుకెళ్లిన విజయ్. తాజాగా మరో ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ సినిమా చేయబోతున్నారు. ఇందులో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ సమంత నటించనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తమ 19వ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇవ్వగా...ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్టును మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యేర్నేని దర్శకుడు శివ నిర్వాణకు అందజేశారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని మూవీ యూనిట్ పేర్కొంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే కశ్మీర్ లో మొదలవుతుంది. అక్కడ లెంగ్తీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హైదరాబాద్, వైజాగ్, అల్లెప్పి లలో మిగతా షూటింగ్ జరుపుకుంటుందని మేకర్స్ వెల్లడించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_140.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీజర్: ఫైటింగ్‌కు పెళ్లి కొడుకు రెడీ!
‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 24 నాని బర్త్‌డే. ఈ సందర్భంగా ఒకరోజు ముందే నాని 'టక్ జగదీష్' టీజర్‌ను రిలీజ్ చేశారు. సింగిల్ డైలాగ్ లేకుండా పాటతోనే కథ మొత్తం అర్థమయ్యేలా టీజర్ కొనసాగింది. ఇందులో ఎక్కువగా టక్ వేసుకునే కనిపిస్తున్న హీరో ఏ విషయాన్నైనా స్మార్ట్‌గా డీల్ చేసేట్లు కనిపిస్తున్నాడు. 'అంగి సుట్టు మడతేసి మంచిసెడు వడపోసి..' అని పాటలో చెప్పినట్లుగానే తన చొక్కా మడతెడుతూ పనులు చక్కబెడుతున్నాడీ హీరో. కోళ్ల పందెంలో గాయపడ్డ కోడి కాలికి కట్టు కడుతున్నాడు. చివర్లో కాళ్లకు గోరింటాకు పెట్టుకుని ఫైటింగ్‌కు రెడీ అవుతున్నాడు. అంటే ఓ వైపు పెళ్లి కొడుకుగా ముస్తాబవుతూనే రౌడీల భరతం పడుతున్నాడన్నమాట. అయితే ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవ్వలేదు అన్నమాట రాకూడదు అంటూ లాక్డౌన్లో 'వి' సినిమాతో నిరాశపర్చాడు నాని. దీంతో ఈసారి కమర్షియల్ హంగులద్దిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ టక్ జగదీష్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పైగా ఈసారి తన అభిమానులకు ఫుల్ మీల్స్ తప్పనిసరని చెప్తున్నాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో, నానిని సక్సెస్ బాట పట్టిస్తుందో? లేదో? చూడాలి. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 23న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇదిలా వుంటే నాని మరోవైపు శ్యామ్ సింగరాయ సినిమా చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి, కృతీశెట్టి (‘ఉప్పెన’ ఫేమ్) హీరోయిన్లుగా నటిస్తున్నారు. చదవండి: ఫుల్ స్పీడ్‌లో నాని సినిమా షూటింగ్ -
రాజమండ్రికి జగదీష్
పొల్లాచ్చి నుంచి రాజమండ్రికి మకాం మార్చారు హీరో నాని. ‘నిన్ను కోరి’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘టక్ జగదీష్’. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యారాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరసర ప్రాంతాల్లో జరుగుతోంది. ‘‘పొల్లాచ్చిలో జరిగిన తొలి షెడ్యూల్లో నాని, రీతూ వర్మలతో పాటు కీలక తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేశాం. ఒక పాట, ఓ యాక్షన్ ఎపిసోడ్‌తో పాటుగా ప్రధాన తారాగణం అంతా పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం. -
ద్వితీయ విఘ్నం దాటారండోయ్
ఇండస్ట్రీలో ఒక గమ్మల్తైన గండం ఉంది. ఫస్ట్ సినిమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినా కూడా రెండో సినిమాకు తడబడుతుంటారు దర్శకులు. సినిమా భాషలో దీనికి ‘సెకండ్ మూవీ సిండ్రోమ్’ అనే పేరు కూడా పెట్టారు. ఇండస్ట్రీలో ఇది తరచూ కనిపించేదే. దర్శకులు మొదటి సినిమాతో ఎంతలా మెప్పించినా, రెండో సినిమాతో నిరాశపరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొందరు దర్శకులు మాత్రం సెకండ్ హిట్ కూడా ఇచ్చేస్తారు. అలా తొలి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన కొందరు దర్శకులు ఈ ఏడాది తమ రెండో సినిమాతో వచ్చారు. కానీ ముగ్గురు దర్శకులు మాత్రం ద్వితీయ విఘ్నాన్ని విజయవంతంగా దాటేశారు. ఈ ‘సెకండ్ మూవీ సిండ్రోమ్’ను సక్సెస్‌ఫుల్‌గా దాటేసిన సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ స్టోరీ. శివ మజిలీ ‘నిన్ను కోరి’ (2017) సినిమాతో ఇండస్ట్రీకు పరిచయం అయ్యారు శివ నిర్వాణ. ప్రేమలో ఓడిపోయినా జీవితాన్ని ముందుకు సాగించొచ్చు అని ‘నిన్ను కోరి’లో చెప్పారు. ఈ చిత్రంలో నాని, నివేదా థామస్, ఆది ముఖ్య పాత్రల్లో నటించారు. అద్భుతమైన స్క్రీన్‌ప్లే, టేకింగ్, పాటలు, ఫెర్ఫార్మెన్స్‌లతో ఈ సినిమా సక్సెస్ కొట్టింది. రెండో సినిమాగా టాలీవుడ్ యంగ్ కపుల్ నాగచైతన్య, సమంతలతో ‘మజిలీ’ తీశారు శివ నిర్వాణ. వివాహం తర్వాత చైతన్య, సమంత స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రమిదే. మనం కోరుకున్నవాళ్లు మనకు కొన్నిసార్లు దక్కకపోవచ్చు. మనల్ని కోరుకునేవాళ్లూ మనకోసం ఉండే ఉంటారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు శివ. ఎమోషనల్ మీటర్ కరెక్ట్‌గా వర్కౌట్ అయింది. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం నాగచైతన్య, సమంత గుర్తుంచుకునే చిత్రం అయింది. ప్రస్తుతం తన తొలి హీరో నానీతో ‘టక్ జగదీష్’ చేస్తున్నారు శివ. మళ్ళీ హిట్ మొదటి చిత్రానికి ప్రేమకథను ఎన్నుకున్నారు గౌతమ్ తిన్ననూరి. కథను చెప్పడంలో, కథను ఎంగేజ్ చేయడంలో తనదైన శైలిలో ‘మళ్ళీ రావా’ని తెరకెక్కించారు. ఇందులో సుమంత్, ఆకాంక్షా సింగ్ జంటగా నటించారు. మన ఫస్ట్ లవ్ మళ్లీ మన జీవితంలోకి ప్రవేశిస్తే? ఆమెను వదులుకోకూడదనుకునే ఓ ప్రేమికుడి ప్రయాణమే ఈ సినిమా. ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. రెండో సినిమాగా నానీతో ‘జెర్సీ’ని తెరకెక్కించారు గౌతమ్. వందమందిలో గెలిచేది ఒక్కడే. ఆ ఒక్కడి గురించి అందరూ చర్చించుకుంటారు. మిగతా 99 మందికి సంబంధించిన కథే ‘జెర్సీ’. 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెటర్‌గా టీమ్‌లో సెలక్ట్ కావాలనుకున్న ఓ ప్లేయర్ కల నెరవేరిందా లేదా అనేది కథ. నాని కెరీర్లో మైలురాయిగా ఈ సినిమా ఉండిపోతుంది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు గౌతమ్ తిన్ననూరి. నో కన్ఫ్యూజన్ ‘దర్శకుడిగా వివేక్ ఆత్రేయకు ‘మెంటల్ మదిలో’ తొలి సినిమా. శ్రీవిష్ణు, నివేదా పేతురాజ్ జంటగా నటించారు. ఏ సందర్భంలో అయినా ఏదైనా ఎంపిక చేసుకోవాలంటే కన్ఫ్యూజ్ అయ్యే మనస్తత్వం హీరోది. అలాంటి అతను లైఫ్ పార్ట్నర్ని ఎలా ఎంచుకున్నాడన్నది కథ. హీరో కన్ఫ్యూజ్డ్ అయినప్పటికీ ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కాకుండా బావుందనేశారు. దాదాపు అదే టీమ్‌తో ‘బ్రోచేవారెవరురా’ తెరకెక్కించారు వివేక్. క్రైమ్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా వినోదం పంచింది. లైంగిక వేధింపులు అనే సున్నితమైన సబ్జెక్ట్‌ను ఈ చిత్రంలో అతి సున్నితంగా చర్చించారు వివేక్. ప్రస్తుతం మూడో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ ముగ్గురు దర్శకులూ ద్వితీయ విఘ్నాన్ని దాటేశారు. ప్రస్తుతం మూడో సినిమా పనిలో ఉన్నారు. మూడో హిట్‌ని కూడా ఇస్తే ‘హ్యాట్రిక్ డైరెక్టర్స్’ అనిపించుకుంటారు. – గౌతమ్ మల్లాది -
బ్లాక్‌బస్టర్ బహుమతి
హీరోగా విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక దర్శకునిగా శివ నిర్వాణ తెరకెక్కించిన రెండు చిత్రాలు ‘నిన్నుకోరి (2017), మజిలీ (2019)’ హిట్ సాధించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. బుధవారం (డిసెంబరు 18) నిర్మాత ‘దిల్’ రాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘‘రాజుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. బ్లాక్‌బస్టర్ బహుమతి లోడ్ అవుతోంది’’ అని పేర్కొన్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్, హీరో, ఫైటర్’ సినిమాలతో విజయ్ బిజీ. అలాగే నాని హీరోగా నటిస్తున్న ‘టక్ జగదీష్’తో శివ నిర్వాణ కూడా బిజీ.. సో.. వీరిద్దరు వారి వారి సినిమాలను పూర్తి చేశాక ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఊహించవచ్చు. -
బ్లాక్‌బస్టర్ గిఫ్ట్ లోడ్ అవుతోంది!
‘హ్యాపీ బర్త్ డే రాజు సార్.. మీకు కోసం బ్లాక్ బస్టర్ బహుమతిని లోడ్ చేస్తున్నాము. ప్రేమతో శివ నిర్వాణ, విజయ్ దేవరకొండ’ అంటూ విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. నేడు(డిసెంబర్18) టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టు చేశాడు. ఇలా ఆయనకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలపడమే.. గాకుండా దిల్ రాజు ప్రొడక్షన్లో తన సినిమా రాబోతుందని చెప్పకనే చెప్పాడు ఈ రౌడీ. విజయ్ షేర్ చేసిన ఈ పోస్టులో ‘మజిలి’ దర్శకుడు శివ నిర్వాణను కూడా ట్యాగ్ చేశాడు. ఇది చూసి నెటిజన్లంతా ఈ ముగ్గురు కలిసి అభిమానులకు బ్లాక్ బస్టర్‌ను అందించడానికి రెడీ అయినట్లు అభిప్రాయపడుతున్నారు. Happy Birthday Raju sir 🤗 Blockbuster Gift loading! With love and respect, Shiva Nirvana & Vijay Deverakonda. pic.twitter.com/8EUeU4DFpc — Vijay Deverakonda (@TheDeverakonda) December 18, 2019 ఇక పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో హీట్లు కొట్టి.. విజయ్ క్రేజీ హీరో అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డియర్ కామ్రెడ్ వంటి సినిమాల చేసిన విజయ్‌కి అంతటి క్రేజీ రాలేదని చెప్పుకోవచ్చు. దీంతో మరోసారి క్రేజీ హీరో అనిపించుకుకొవాలని ఆరాటపడుతున్నాడు ఈ రౌడీ. ఈ క్రమంలో నిన్నుకోరి, మజిలీ చిత్రాల విలక్షణ దర్శకుడైన శివ నిర్వాణతో జత కడుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ వార్తలపై అయోమయంలో ఉన్న తన అభిమానులకు విజయ్ ఈరోజు ఓ క్లారిటి ఇచ్చేశాడు. హార్ట్ టచింగ్, ఎమోషనల్ డ్రామాలతో అలరించిన శివ నిర్వాణ..‘అర్జున్‌రెడ్డి’ కోసం ఎలాంటి పాత్ర సృష్టించాడో వేచి చూడాలి మరి. -
వెరైటీ టైటిల్‌తో నాని కొత్త సినిమా
ఒక సినిమా పూర్తవుతుందనగానే మరో సినిమాను ప్రకటిస్తాడు హీరో నాని. ఈ ఏడాది గౌతమ్ తిన్ననూరి దర్వత్వంలో చేసిన ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేస్తున్నాడు. సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావ్ హైదరీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇది చిత్రీకరణలో ఉండగానే నాని తదుపరి సినిమాను ప్రకటించాడు. నానీతో ‘నిన్ను కోరి (2017), నాగచైతన్య, సమంతతో మజిలీ (2019)’ సినిమాలను తెరకెక్కించి, మంచి జోష్ మీద ఉన్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మంగళవారం ఈ సినిమా టైటిల్, ఇతర వివరాలను ప్రకటించారు. ఈ సినిమాకు ‘టక్ జగదీష్’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్లో నాని టక్ చేసుకొని వెనకాల ఉన్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.‘మజిలీ’ నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించనున్నారు. నానికి జోడిగా రీతూ వర్మ నటించనుంది. మరో హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
నాలుగేళ్ల తర్వాత...
‘నిన్ను కోరి’ వంటి హిట్ తర్వాత మళ్లీ హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అంటే? ‘పెళ్ళి చూపులు’ ఫేమ్ రీతూవర్మ. ‘ఎవడే సుబ్రమణ్యం’లో నాని ప్రేయసిగా రీతూవర్మ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ నాలుగేళ్లకు ఇద్దరూ జంటగా నటించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెలలో లాంఛనంగా ప్రారంభం కానుంది. జనవరిలో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తామని చిత్రబృందం పేర్కొంది. -
హిట్ కాంబినేషన్
హీరో నాని తర్వాతి చిత్రం ఖరారైంది. నానీతో ‘నిన్ను కోరి (2017), నాగచైతన్య, సమంతతో మజిలీ (2019)’ సినిమాలను తెరకెక్కించి, మంచి జోష్ మీద ఉన్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘మజిలీ’ నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించనున్నారు. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రారంభోత్సవం జరగనుంది. నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ‘నిన్ను కోరి’ మంచి హిట్ కావడంతో తాజా సినిమాపై అంచనాలు నెలకొనడం సహజం. ఆ అంచనాలను రీచ్ అయ్యేలా కథ తయారు చేశారట. -
డిసెంబర్లో షురూ
సినిమా తర్వాత సినిమా చేస్తూ స్పీడ్‌గా దూసుకెళ్లడం నాని స్టయిల్. ఒక సినిమా విడుదల అవ్వడం.. మరో సినిమా పట్టాలెక్కడం జరుగుతూనే ఉంది. నాని నటించిన ‘గ్యాంగ్‌లీడర్’ చిత్రం ఈ శుక్రవారమే రిలీజ్ అయింది. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని చేస్తున్న ‘వి’ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్‌తో జరుగుతోంది. ఈ వారంలో థాయ్‌ల్యాండ్‌లో జరగనున్న షెడ్యూల్ కోసం ప్రయాణమయ్యారు నాని. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి నాని అంగీకరించారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో షురూ కానుంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తారు. ఇదిలా ఉంటే నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో ‘నిన్ను కోరి’ వంటి హిట్ సినిమా వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. -
మజిలీ సక్సెస్ నాకెప్పుడూ ప్రత్యేకమే: నాగచైతన్య
‘‘నా లైఫ్‌లో, నా కెరీర్లో నిజంగా ఒక క్రూషియల్ పాయింటాఫ్ టైమ్‌లో అందమైన పాత్రను, ఎప్పటికీ మరచిపోలేని సక్సెస్‌ను ఇచ్చాడు శివ నిర్వాణ. ఫ్యూచర్లో సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. కానీ, ఈ సక్సెస్ అన్నది నాకెప్పుడూ ప్రత్యేకమే. థ్యాంక్యూ సో మచ్ బ్రో’’ అని నాగచైతన్య అన్నారు. నాగచైతన్య హీరోగా, సమంత, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘గ్రాండ్ థ్యాంక్స్ మీట్’లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఒక సినిమా సక్సెస్ అన్నది ఎవరో ఒకరి వల్ల అవదు. ఒక డైరెక్టర్ విజన్‌తో స్టార్ట్ అయి, ఆ విజన్‌ని నిర్మాతలు సపోర్ట్ చేసి, ఎంతోమంది నటీనటులు ఆ కథ విని ఓకే చేసి, ఆ తర్వాత సాంకేతిక నిపుణులు జాయిన్ అయ్యి, లాస్ట్‌కి డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూడకుండా జస్ట్ ట్రైలర్స్, టీజర్స్ చూసి, సినిమా కొని, ప్రేక్షకులకు అందించి.. ఫైనల్లీ ఒక మంచి హిట్‌ని అందుకుంటాం. ఈ ప్రాసెస్‌లో ఉన్న అందరూ ఈ రోజు సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారంటే చాలా చాలా సంతోషంగా ఉంది. నా చివరి చిత్రాలు పెద్ద ఎంకరేజింగ్‌గా లేకపోయినా సాహు, హరీష్‌గారు నన్ను ప్రోత్సహించి, పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్. చివరి నిమిషంలో తమన్ ఈ సినిమాని ఒప్పుకుని జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు. డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ... ‘‘శివ నిర్వాణ ‘మజిలీ’ ఐడియా చెప్పినప్పుడు చాలా మంచి సినిమా అని దానయ్యగారితో అన్నాను. మంచి రైటింగ్, సీన్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి, సినిమా కూడా ఇలాగే నేలమీదుండాలి.. అలాంటి కథలు తక్కువ అని శివకి చెప్పాను. వైజాగ్ నేపథ్యం, నటీనటులను ఎంచుకున్న విధానం బాగా నచ్చింది. ఒక్క సీన్లో నటించినవారు కూడా బాగా గుర్తుండిపోయారు. శివది ఎక్స్ట్రార్డినరీ వర్క్. నీలో ఓ చిన్న నొప్పి ఉంది. లైఫ్‌లో ఎవరైనా అమ్మాయి వదిలేసి వెళ్లిపోయిందేమో (నవ్వుతూ).. రావు రమేశ్, పోసానిగారులాంటి నటులు ఉండటం మా ఇండస్ట్రీ అదృష్టం. చైతన్యగారిని స్క్రీన్‌పై చూసినప్పుడు చాలా నిజాయతీగా కనిపిస్తారు. తన బలం, బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు. నిజాయతీగా ఉండటం వల్ల ప్రతి పాత్ర ఆయన చేస్తుంటే గుర్తుండిపోతోంది. ‘మజిలీ’ సినిమా చూసినప్పుడు మీ నటనని నమ్మలేకపోతున్నాను. పూర్ణ (చైతన్య పాత్ర)ని చూస్తుంటే వైజాగ్‌లోని రైల్వే కాలనీలో నిజంగానే అలాంటి పాత్ర ఉందేమో అనిపించింది. సమంతగారు గ్రేట్ ఆర్టిస్ట్. ‘జనతా గ్యారేజ్’కి పనిచేశా. సాహు, హరీష్ మరెన్నో హిట్ సినిమాలు తీయాలి’’ అన్నారు. నటుడు రావు రమేశ్ మాట్లాడుతూ... ‘‘హిట్ అవుతుంది అనుకున్న సినిమా హిట్ అయితే ఆ కిక్కే వేరు. ఈ చిత్రంలో అన్ని పాత్రలను శివ నిర్వాణ ఎంతో ధైర్యంగా డిజైన్ చేసిన విధానం నాకు నచ్చింది. ఫస్టాఫ్‌లో చైతన్య, దివ్యాంశ లవ్‌ట్రాక్ చూస్తే ‘టైటానిక్’ సినిమా చూసినట్టుంది. సెకండాఫ్‌లో చైతు, సమంత ట్రాక్ కూడా చాలా బాగా కుదిరింది’’ అన్నారు. నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ... ‘‘పరుచూరి బ్రదర్స్ వద్ద నేను చెన్నైలో అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఫంక్షన్స్‌కి వెళ్లేవాణ్ణి. సినిమా హిట్టయ్యాక నటీనటులు, సాంకేతిక నిపుణులకు షీల్డ్‌లు ఇచ్చేవారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ‘మజిలీ’ సినిమా హిట్ షీల్డ్ అందుకుంటుండటం హ్యాపీ. నాగచైతన్య.. నీ తొలి సినిమా ‘జోష్’లో నువ్వు బొమ్మలా ఉన్నావ్.. ఈ సినిమాలో అంతకు మించి ఉన్నావ్. కామెడీ, సెంటిమెంట్ పాత్రలు చేయాలని నాకు బాగా కోరిక. నాకు స్కూల్‌డేస్‌లో, యూనివర్శిటీలో బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చింది. నాకు పోలీస్, తండ్రి పాత్రలు నచ్చవు. కానీ, ఆ తండ్రి పాత్రలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే ‘టెంపర్’లో పోలీసు పాత్రతో ఎంత పేరొచ్చిందే, నా జీవితాన్ని ఎంత మలుపు తిప్పిందో అందరికీ తెలుసు. ‘టెంపర్’ కి ఎంత పేరొచ్చిందో ‘మజిలీ, చిత్రలహరి’ సినిమాల్లో తండ్రి పాత్రలకు అంత పేరొచ్చింది’’ అన్నారు. ‘‘8రోజుల్లో ‘మజిలీ’ సినిమాకి నేపథ్య సంగీతం అందించాను. ఎంతో ప్రేమించి పనిచేశా’’ అన్నారు తమన్. శివ నిర్వాణ మాట్లాడుతూ... ‘‘ఇటీవల కొన్ని రోజుల వరకూ నాకు గ్రాస్‌కి, షేర్‌కి తేడా తెలియదు. కానీ 15రోజుల నుంచి కొత్త కొత్త విషయాలు చూస్తున్నా. ఇన్ని కోట్లు వసూలు చేసింది సినిమా అని డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫోన్లు వస్తుండటం, వసూళ్ల నంబర్స్ చూస్తున్నప్పుడు ముఖ్యంగా చైతన్యగారికోసం చాలా సంతోషంగా ఫీలయ్యా. ఆయనకి ఈ రేంజ్లో సక్సెస్ రావడం చాలా హ్యాపీ. చైతన్యగారిలో ఇంత మంచి నటుడు ఉన్నాడని అనుకోలేదు, చాలా బాగా చూపించారని చాలా మంది అన్నారు. ‘ఏమాయ చేసావే’ నుంచి తన నటనని నేను నమ్మాను. తనకు కరెక్ట్ పాత్ర పడితే తనకంటే న్యాయం చేసేవారెవరూ ఉండరని అనుకున్నా. ‘మజిలీ’ లో చైతన్య కాకుండా వేరే ఎవరైనా అయితే బాగుండని ఒక్కరూ అనలేదు. సినిమా చూస్తున్నప్పుడు సమంతగారికి నేను ఫ్యాన్‌గా మారిపోతున్నానేమో అనుకున్నా. క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాల్లో ఆమె చాలా బాగా చేశారు. రేపంటూ ఒక కథ రాస్తే సమంతగారి లాంటి నటిని దృష్టిలో పెట్టుకుని సీన్స్ రాస్తా. ఈ సినిమాకి చైతన్య, సమంతగారు లైఫ్ ఇచ్చారు’’ అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రబృందాన్ని అభినందించారు.ట -
నా హార్ట్ ఇక్కడే ఉంది
‘‘మజిలీ’ని చాలా కాన్ఫిడెంట్‌గా చేశాం. ఫెయిల్ అయితే లైఫ్ లాంగ్ అది ఓ డ్యామేజ్‌లా ఉండిపోతుంది. అందుకే ఎలాగైనా వర్కౌట్ అవ్వాలనుకున్నాం. పెళ్లితర్వాత కలిసి చేసిన తొలి సినిమా కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో అని కాస్త టెన్షన్ పడ్డాం. మంచి స్పందన వచ్చినందుకు ఇప్పుడు హ్యాపీ’’ అని నాగచైతన్య, సమంత అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత, దివ్యాంశా కౌశిక్ ముఖ్య తారలుగా సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం ‘మజిలీ’. ఈ నెల 5న విడులైంది. శనివారం చైతూ, సమంత ఇద్దరూ కలిసి చెప్పిన ‘మజిలీ’ కబుర్లు. ► మీకు కెరీర్లో విడి విడిగా హిట్స్ ఉన్నాయి. కంబైన్డ్‌గా ఉన్నాయి. ‘మజిలీ’ హిట్ ఎంత స్పెషల్? సమంత: మోర్ స్పెషల్. పెళ్లి తర్వాత ఈ సినిమా హిట్ మాకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. సరైన సమయంలో సరైన సినిమాతో సరైన హిట్ వచ్చిందనుకుంటున్నాను. కథ విన్నప్పుడు, షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో స్పెషల్ జరుగుతోందనే భావన మనసులో ఉంది. అదే ఫీల్‌ని, స్పెషల్‌ని ఆడియన్స్ కూడా ఫీలై మాకు మంచి విజయం అందించారు. వారికి ధన్యవాదాలు. ► సమంత మీ లక్కీఛార్మ్ అని మరోసారి ప్రూవ్ అయిందని నమ్ముతారా? (సమంత అందుకుంటూ....) ఆయనే నాకు ఇంకా లక్కీఛార్మ్. ఎందుకంటే... మ్యారేజ్ తర్వాత నా యాక్టింగ్ కెరీర్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తోందన్న ఫీలింగ్ కలుగుతోంది. చైతన్య: లక్కీఛార్మ్ అనడం కన్నా సపోర్ట్ అంటాను. సక్సెస్ టైమ్‌లో సపోర్టివ్‌గా చాలామంది ఉంటారు. ఫెయిల్యూర్స్ అప్పుడు సపోర్ట్ చాలా ముఖ్యం. ► పెళ్లి తర్వాత కలిసి నటించడానికి బాగా ఆలోచించారా? మళ్లీ నటిస్తారా? చైతూ: యాక్చువల్లీ పెళ్లి తర్వాత ఓ సినిమా చేద్దామని మా అంతట మేము ఏ దర్శక–నిర్మాతలను సంప్రదించలేదు. దర్శకుడు శివ భార్యాభర్తల కథతో మా దగ్గరకు రావడం అనుకోకుండా జరిగింది. ఇప్పుడు ఎలా అయితే మ్యాజిక్ జరిగిందో అలాగే భవిష్యత్‌లో జరిగితే తప్పకుండా మేం ఇద్దరం కలిసి సినిమా చేస్తాం. ‘మనం’ చిత్రానికి కూడా ఇలాంటి మ్యాజిక్కే జరిగింది. ► పూర్ణ (చైతూ పాత్ర పేరు) క్యారెక్టర్‌ను సిల్వర్‌స్క్రీన్‌పై చూసినప్పుడు ఒక ప్రేక్షకురాలిగా మీరెలా ఫీల్ అయ్యారు? సమంత: చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. యాక్టర్‌గా చైతన్యలో పెద్ద గ్రోత్ కనిపించింది. ఒక సినిమా చేసేప్పుడు ఈ సీన్ బాగా చేశాను.. ఈ సీన్ బాగా వచ్చిందని ఫీలింగ్ కలగవచ్చు... కానీ ఫైనల్ ప్రొడక్ట్ చూసేప్పుడు అలా అనిపించకపోవచ్చు. ఈ సినిమాలో నేను లేని సీన్స్‌ను వెండితెరపై చూసినప్పుడు షాక్ అయ్యాను. యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్స్‌లో చైతన్య మంచి వేరియేషన్ చూపించారు. అద్భుతంగా నటించారు. ► సెకండాఫ్‌లో చైతూని సమంత టేకోవర్ చేశారని అంటున్నారు? చైతూ: నా క్యారెక్టర్ ఎలివేట్ అవడానికి కారణం సినిమాలో సమంత చేసిన శ్రావణి క్యారెక్టరే. లవ్‌స్టోరీలో హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్‌స్క్రీన్ అయినా పూర్ణ క్యారెక్టర్‌కు సామ్ మంచి సపోర్ట్. తను ఒప్పుకోదు కానీ క్లైమాక్స్ కంప్లీట్‌గా తనదే. సమంత: అలా ఏం లేదు (నవ్వుతూ). ► ఈ సినిమాలో చైతూకి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చారు. చైతూతో మీకు పెళ్లి అయ్యాక.. మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? చైతూ: నా బర్త్‌డేకి ఓ స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్‌గా ఇచ్చింది. సమంత: అవును.. బైక్ ఇచ్చాను. ► ఈ సినిమా సక్సెస్ గురించి నాగార్జునగారి రియాక్షన్? సమంత: సడన్‌గా ఇంటికి వచ్చేశారు (నవ్వుతూ). చైతూ: ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఫ్యామిలీలో కొంతమందికి చూపించాను. షో అయ్యాక ఎవరూ ఏం మాట్లాడలేదు. ఎర్రబారిన కళ్లతో తలదించుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. నాకు నిజంగా అర్థం కాలేదు. ఫస్ట్ టైమ్ ఇలాంటి రియాక్షన్ చూశాం. అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి మాట్లాడలేకపోయారని తర్వాత అర్థమైంది. నెక్ట్స్డే మార్నింగ్ ఫోన్‌చేసి అందరూ మాట్లాడారు. సినిమా బాగుందని అభినందించారు. ఫస్ట్‌టైమ్ నాన్నగారికి లేట్‌గా సినిమా చూపించాను. ఆర్ఆర్ లేట్ అవ్వడం వల్ల ముందే చూపించలేకపోయాను. కథ కూడా అంతగా నాన్నగారికి తెలీదు. ► సాధారణంగా నాగార్జునగారు మీ సినిమాల రషెస్ చూస్తుంటారు. అవసరమైనప్పుడు సలహాలు ఇస్తుంటారు. కానీ ఈ సినిమాను మీకే వదిలేయడం వెనక కారణం ఏంటి? చైతూ: ‘ఏదైనా ఒక పాయింట్ నచ్చినప్పుడు నువ్వు చేసెయ్. నా దగ్గరకు తీసుకు రావొద్దు’ అని ఎప్పట్నుంచో నాన్నగారు చెబుతున్నారు. ‘నీ ఆత్మవిశ్వాసం, నీ నిర్ణయంపై ముందుకు సాగిపో’ అని చెబుతుంటారు. ‘మజిలీ’ కథ విన్నప్పుడు నాకు ఒక్క డౌట్ కూడా లేదు. సెకండ్ ఒపీనియన్ తీసుకుందామా? అనే ఆలోచన రాలేదు. ఎటువంటి డౌట్ లేనప్పుడు మన జడ్జ్‌మెంట్‌ని ఓసారి పరీక్షించుకుందాం అనుకున్నాను. ఒకవేళ డౌట్స్ ఉంటే కథ వినమని నాన్నగారికి చెబుతాను. సమంత: నాకు డౌట్ వచ్చింది. కానీ ఇది చాలా మంచి స్క్రిప్ట్. డైరెక్టర్‌కు సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ ఉండాలి. అది శివగారిలో కనిపించింది. ► మీ కెరీర్లో హయ్యస్ట్ ఫస్ట్‌వీక్ కలెక్షన్స్ (50కోట్లు) ఈ సినిమాకు వచ్చాయి. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చైతూ: చాలా సంతోషంగా ఉంది. సినిమా ఒప్పుకునే ముందు ఇంత వసూలు చేయాలి, అంత వసూలు చేయాలని పెద్దగా ఆలోచించను. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఈ సినిమా ఫస్ట్‌వీక్ కలెక్షన్స్‌తోనే అందరూ ప్రాఫిట్ జోన్లోకి వచ్చారంటుంటే సంతోషంగా ఉంది. ఈ కలెక్షన్స్ పట్ల అభిమానులు, ఫ్యాన్స్ ఇంకా ఎగై్జటెడ్‌గా ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా. ప్రాఫిట్‌తో పాటు సక్సెస్ వస్తే అది అల్టిమేట్ కాంబినేషన్ అవుతుంది. సమంత: ఇంట్లో కలెక్షన్స్ నేను చూసుకుంటాను. ► ఎలక్షన్ టైమ్‌లో కూడా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం గురించి.... చైతూ: స్టార్టింగ్‌లో కొంచెం టెన్షన్ పడ్డాం. సమ్మర్ ఫస్ట్ ఫిల్మ్ తప్పకుండా అడ్వాంటేజ్ ఉంటుంది, రిలీజ్ చేద్దామని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రోత్సహించారు. సినిమా బాగుంటే ఆడియన్స్ సపోర్ట్ తప్పకుండా ఉంటుందన్నారు. ► ‘మజిలీ’ సినిమా తర్వాత ఫస్ట్‌టైమ్ నాగార్జున గారు మీ ఇంటికి వచ్చారు అన్నారు? అంటే ఇంతకుముందు సినిమాలకు రాలేదా? సమంత: చెప్పి వస్తారు. ఆహ్వానిస్తే వస్తారు. కానీ చెప్పకుండా వచ్చారు. చైతూ: ఆ రోజు సడన్‌గా మార్నింగ్ ఫోన్ చేసి ఎక్కడున్నారు? వస్తున్నాను? అని చెప్పి వచ్చేశారు. అలా ఎప్పుడూ రాలేదు. సమంత: చాలా కష్టపడి సినిమా చేశాం. ఆడియన్స్, అభిమానులకు నచ్చింది. కానీ తల్లిదండ్రులను గర్వపడేలా చేయడం వేరు కదా. ► సమంత నటించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ చూశారా? చైతూ: ఫస్ట్ హాఫ్ చూశాను. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందే కథ చెప్పింది. అందుకే పెద్దగా షాక్ అవ్వలేదు. స్టెప్ బై స్టెప్ యాక్టర్‌గా నేను ఇప్పుడే గ్రో అవుతున్నాను. భవిష్యత్‌లో తప్పకుండా ఇలాంటి సినిమాలు చేస్తాను. ► ఒకవేళ ‘సూపర్ డీలక్స్’ లాంటి సినిమా చేయొద్దని చైతన్య చెబితే మీరు ఏం చేస్తారు? సమంత: ఆయన అలా చెప్పరని నాకు తెలుసు. పెళ్లి తర్వాత నా నిర్ణయాలు, నా కాన్ఫిడెన్స్ పట్ల నాకు మరింత నమ్మకం కుదిరింది. ఆ నమ్మకానికి కారణం ఇంట్లోని పరిస్థితులే. చైతూ ప్రోత్సాహం. తెలియకుండానే నాకో బలం వచ్చింది. ► ‘మజిలీ’లో ఓ సీన్లో క్రికెట్ బ్యాట్ పట్టుకున్నారు. నిజంగా ఆడటం వచ్చా? సమంత: నాకు పెద్దగా క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. అయితే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయాలని మాత్రం ఉంది. ► మీరు తమిళంలోకి ఎప్పుడు వెళ్తున్నారు? చైతూ: నాకు తమిళ సినిమాలంటే చాలా ఇష్టం. చెన్నైలో పుట్టి పెరిగాను. చిన్నతనంలో తమిళ సినిమాలు చూస్తూ టైమ్ స్పెండ్ చేశాను. కానీ నా హృదయం ఇక్కడే ఉంది. ఏమో... నటుడిగా ఇక్కడ ఇంకా చాలా ఆకలిగా ఉన్నాను. చాలా హిట్స్ ఇవ్వాలి. మంచి మంచి సినిమాలు చేయాలి. ప్రస్తుతానికి మనసు టాలీవుడ్‌పైనే ఉంది. ► బైలింగ్వల్ సినిమా ఆలోచన ఉందా? చైతూ: అలాంటి స్క్రిప్ట్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. కానీ ప్రస్తుతం తెలుగే. ► ‘యు–టర్న్, ఓ బేబి’... ఇటీవల ‘96’ ఇలా రీమేక్ సినిమాలపై మొగ్గు చూపుతున్నట్లున్నారు? సమంత: రీమేక్స్ అంటే కాస్త రిస్కే. ఇవన్నీ మంచి సినిమాలు. అందుకే నో చెప్పలేకపోయాను. హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్న కథలకు నో చెప్పడం నాకు ఇష్టం లేదు. ► చైతూతో పెళ్లికి ముందు ‘ఏ మాయ చేసావె, మనం, ఆటోనగర్‌సూర్య’ సినిమాలు చేశారు. తాజాగా ‘మజిలీ’. అప్పటి చైతూకి, ఇప్పటి చైతూకి యాక్టింగ్‌లో వచ్చిన తేడా ఏంటి? సమంత: నాకు తెలిసిన చైతన్య ఎందుకు స్క్రీన్‌పై కనిపించడం లేదనే ఫీలింగ్ ఉండేది. అవుట్‌సైడ్ చైతన్య మాటలు, ప్రవర్తన, లుక్స్ అమేజింగ్‌గా ఉంటాయి. అది ‘మజిలీ’ సినిమాలో స్క్రీన్‌పై నాకు కనిపించింది. తన రియల్ పర్సనాలిటీని స్క్రీన్‌పైకి తీసుకువచ్చి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యారు. ఇక యాక్టర్‌గా తను చాలా పరిణితి చెందారు. చైతన్యలో బాగా ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘ఏ మాయ చేసావె’ టు ‘మజిలీ’ ఒక పర్సన్‌గా, యాక్టర్‌గా చాలా పాజిటివ్‌గా మారారు. ► ‘బంగార్రాజు’ ఎంతవరకు వచ్చింది? ఇంకా స్క్రిప్టింగ్ జరుగుతోంది. జూలై నుంచి స్టార్ట్ చేయవచ్చు. నేను, నాన్నగారు కలిసి చేస్తాం. ► ‘ఏ మాయ చేసావె’ సినిమా టైమ్‌లో చైతన్యను చూసి ఇన్నోసెంట్ అనుకున్నారా? లేక హ్యాండ్సమ్ అని ఫీల్ అయ్యారా? సమంత: నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా ఇన్నోసెంటే (నవ్వుతూ). అప్పుడు నాకు తెలుగు రాదు. చాలా పెద్ద స్క్రిప్ట్. ఎప్పుడూ డైలాగ్స్ చదువుతూనే ఉండేదాన్ని. సెట్లో ప్రతి రోజూ షివరింగే. గౌతమ్ మీనన్‌గారు కట్ కూడా చెప్పరు. ‘ఏ మాయ చేసావె’ అప్పుడే వేరే ఏ డిస్ట్రాక్షన్స్ లేవు. చైతూ: నాకు ఫొటో చూపించారు. అమ్మాయి చాలా బాగుంది. హీరోయిన్గా పెట్టుకుందాం అనుకున్నాం. కట్ చేస్తే చెన్నైలో లుక్ టెస్ట్. ► నాగార్జునగారి ‘మన్మథుడు –2’లో ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నారని తెలిసింది. నిజమేనా? సమంత: అవును... చేస్తున్నాను. ► సమ్మర్ వెకేషన్ ఎక్కడ ప్లాన్ చేశారు? చైతూ: ఈ నెలాఖరు వరకు ‘వెంకీమామ’ షూటింగ్ ఉంది. మే ఫస్ట్ వీక్‌లో ప్లాన్ చేద్దామనుకుంటున్నాం. సమంత: నాకు వెకేషన్ తప్పకుండా కావాలి. ఈ సినిమా విషయంలో ఇంతవరకు ఎప్పుడూ ఫీల్ అవ్వని స్ట్రెస్ ఫీల్ అయ్యాను. -
‘మజిలీ’ దర్శకుడితో విజయ్
టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్, తరువాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సక్సెస్‌లతో వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం డియార్ కామ్రేడ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో పాటు తమిళ డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాలతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు విజయ్ దేవరకొండ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. నిన్నుకోరి సినిమా తరువాత మజిలీతో మరో హిట్ సాధించిన శివా నిర్వాణ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందట. హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామాలతో అలరించిన శివా.. విజయ్ కోసం ఎలాంటి కథను రెడీ చేశాడో చూడాలి. -
మా కోసం కథ రాయమని అడగలేదు
‘‘నటుడిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. కానీ రొమాన్స్ జానర్లో ఆడియన్స్ నన్ను ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. వైవిధ్యం ఉన్న కథలు వచ్చినప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. హానెస్ట్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్ కూడా ఉండాలి. ప్రస్తుతం రొమాన్స్ జానర్ నా ఫేవరెట్‌గా ఫీల్ అవుతున్నాను’’ అని నాగచైతన్య అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘మజిలీ’. సమంత, దివ్యాంకా కౌశిక్ కథానాయికలుగా నటించారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► నేను, స్యామ్ (సమంత) కలిసి ‘ఏమాయ చేసావే, మనం, ఆటోనగర్ సర్య’ సినిమాలు చేశాం. అన్నీ ప్రేమకథలే. మా వివాహం తర్వాత విభిన్నమైన కథ ప్రయత్నిస్తే బాగుంటుందనుకున్నాం. సరిగ్గా అలాంటి స్క్రిప్ట్‌నే శివ తీసుకుని వచ్చాడు. పెళ్లి తర్వాత భార్యాభర్తల జీవితాల్లో ఉండే ఎత్తుపల్లాలు ఏంటి? ఎలాంటి సమస్యలు వస్తాయి? వంటి అంశాలతో కూడిన చిత్రం ‘మజిలీ’. ఇలాంటి చిత్రం మా దగ్గరకు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ► నాకు, స్యామ్‌కి కథ రాయమని నేను శివను అడగలేదు. శివ తొలి సినిమా ‘నిన్ను కోరి’ చూశాను. నచ్చింది. ముఖ్యంగా ఆ సినిమా క్లైమాక్స్‌ను శివ హానెస్ట్‌గా డీల్ చేయడం పట్ల ఇంప్రెస్ అయ్యాను. అలాంటి సినిమాలంటే నాకు ఇష్టం. మంచి కథ ఉంటే సినిమా చేసే ఆలోచన ఉందని శివతో అన్నాను. ఓ రెండు నెలల తర్వాత శివ ‘మజిలీ’ స్టోరీ లైన్ చెప్పారు. బాగా ఎగై్జట్ అయ్యాను. అప్పుడే స్యామ్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. సినిమాలో ఓ హీరోయిన్గా స్యామ్‌ను సజెస్ట్ చేసింది శివనే. కథపై దాదాపు 7 నెలలు వర్క్ చేశాం. ఈ ప్రాసెస్‌లో నేను, శివ మంచి మిత్రులైపోయాం. హీరో, డైరెక్టర్ రిలేషన్‌షిప్‌ను బాగా ఎంజాయ్ చేశాను. పూర్ణ క్యారెక్టర్ చేయడం కూడా నాకు ఈజీ అయింది. ► స్క్రిప్ట్ విన్నప్పుడు ఈ క్యారెక్టర్‌కి బాగా హార్డ్‌వర్క్ చేయాలనుకున్నాను. సినిమాలోని పూర్ణ పాత్ర కోసం శివ నన్ను బాగా ప్రిపేర్ చేశాడు. నిజానికి నాకు బ్యాట్ పట్డుకోవడం కూడా రాదు. నాలుగు నెలలు కష్టపడి క్రికెట్ నేర్చుకున్నాను. మ్యాచ్‌లు ఆడలేను కానీ కెమెరా ముందు ఆడతాను. అలాగే పూర్ణ క్యారెక్టర్లో ఏజ్ డిఫరెన్స్ చూపించడానికి పెద్దగా కష్టపడలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని డైట్ ఫాలో అయ్యాను. ► కొత్త హీరోయిన్ అయితే స్నేహం పెరగడానికి కాస్త టైమ్ పడుతుంది. స్యామ్తో అలా కాదు. మంచి కంఫర్ట్, అండర్స్టాండింగ్ ఉంటుంది. తప్పులు అర్థమైపోతాయి. ఒకరికొకరం సహాయం చేసుకుంటాం. ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్స్ కోసం ఇంట్లో కాస్త డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాం. కానీ సాధారణంగా 9–6 వర్క్ మోడ్‌లో ఉంటాం. సాయంత్రం 6కి ఆఫ్ అయిపోతాం. కొత్త కథలు వచ్చినప్పుడు భవిష్యత్‌లో ఇద్దరం కలిసి ఇంకా సినిమాలు చేస్తాం. ► సినిమాలో శ్రావణి క్యారెక్టర్‌ను స్యామ్ చేయడం ప్లస్సే. మంచి ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్. నాకు కూడా అడ్వాంటేజ్ అయ్యింది. స్యామ్ తనకంటే నా గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. అది తన స్వభావం. నాకు నిజంగానే మంచి అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరికింది. ► ఇప్పటివరకు నేను చేసిన 60 శాతం సినిమాల్లో... ఇది కరెక్ట్‌గా వెళ్తుందా? మనం ఫస్ట్ అనుకున్న కథనే తీస్తున్నామా? ఎక్కువ మార్పులు చేశామా? అనే ఆలోచనలు వచ్చాయి. అది నా నటనపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొంచెం డౌట్ ఉంటే నాకు తెలిసిపోతుంది. ఈ సినిమా చేసేప్పుడు నాకు డౌటేమీ లేదు. ► ‘మజిలీ’లాంటి స్క్రిప్ట్‌ని ఓకే చేయాలంటే నిర్మాతలకు ధైర్యం ఉండాలి. నాకు, సమంతకు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కూడా. మన బేనర్లో మీ ఇద్దరితో కలిసి నేను ఎందుకు తీయలేదు? అని నాన్నగారు కూడా ఓ సందర్భంలో అన్నారు. నాన్నగారు ఇంకా సినిమా చూడలేదు. ► కొన్ని సినిమాలు బాగా ఆడతాయనుకున్నాను. ఆడలేదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా జీవితంలో అందరికీ సమస్యలు ఉంటాయి. వైఫల్యాలను తట్టుకుని జీవి తంలో ఎలా నెగ్గుకు వస్తాం అన్నదే ముఖ్యం. సినిమాలోని పూర్ణ క్యారక్టర్ కూడా అలానే ఉంటుంది. సమంత తమిళంలో నటించిన ‘సూపర్ డీలక్స్’ సినిమా చూశాను. బాగా నచ్చింది. సమంతనే కాదు. అందరూ బాగా నటించారు. కథ నచ్చితే ఇలాంటి సినిమాలు చేయడం నాకు ఇష్టమే. ► రేసింగ్ నాకు ఇష్టమైన స్పోర్ట్. ప్రజెంట్ ‘క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ’ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. రేసింగ్‌పై సినిమా గురించి భవిష్యత్‌లో ఆలోచిస్తాను. అయితే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేయడం నాకు ఇష్టమే. ► వెంకటేశ్‌గారి కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలెంజింగ్‌గా ఉంది. ఈ నెల 8నుంచి ‘వెంకీమామ’ సెట్లో జాయిన్ అవుతాను. జూలై కల్లా షూటింగ్‌ను పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్నాం. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాన్నగారు ‘సోగ్గాడే చిన్నినాయనా’ రెండో పార్టును ప్లాన్ చేస్తున్నారు. అంతా ఓకే అనుకుంటే ఆగస్టులో సెట్స్‌కు వెళ్లిపోతాం. ఇంకా కథలు వింటున్నాను. -
నాకా ఆందోళన లేదు
‘‘నేను చేసింది రెండు సినిమాలే (నిన్ను కోరి, మజిలీ). నేను ఎప్పుడూ రెండోసారి కథ చెప్పలేదు. సింగిల్ సిట్టింగ్‌లో స్టోరీ ఓకే అవుతుంది. ఆ తర్వాత టీమ్‌తో ఆ కథ గురించి చర్చలు జరుపుతా’’ అని దర్శకుడు శివ నిర్వాణ అన్నారు. నాగచైతన్య హీరోగా శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మజిలీ’. ఈ చిత్రంలో సమంత, దివ్యాంక కౌశిక్ కథానాయికలుగా నటించారు. పూర్ణ పాత్రలో నాగచైతన్య, శ్రావణి పాత్రలో సమంత నటించారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. ► ‘నిన్ను కోరి’ చిత్రానికి మంచి అభినందనలు వచ్చాయి. రవితేజ, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌గార్లు మాట్లాడారు. ఇలాంటి పాయింట్‌తో కథ చెప్పి ఎలా ఒప్పించావ్? అని ఎక్కుమంది అన్నారు. నేను ఒప్పించడం కాదు. నానీగారు ఒప్పుకోవడం గొప్ప అన్నాను. ► ఆ తర్వాత నాగచైతన్యగారు ఫోన్ చేసి, తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపడా ప్రేమకథ ఏమైనా ఉంటే చెప్పమన్నారు. 20 రోజుల తర్వాత ఐడియాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘మజిలీ’ సినిమా తట్టింది. ‘క్రికెట్.. ప్రేమ.. పెళ్లి’ అనే మూడు అంశాలను తీసుకుని మిడిల్ క్లాస్ డ్రామాతో క్లబ్ చేయాలనే ఆలోచనలోంచి ఈ సినిమా కథ వచ్చింది. సింగిల్ నరేషన్లో చైతన్యగారు ఒప్పుకున్నారు. 19 ఏళ్ల కుర్రాడిలా, 34 ఏళ్ల వ్యక్తిలా ఇలా చైతన్యను స్క్రీన్‌పై ఎలాగైనా చూపింవచ్చు. అది కూడా ప్లస్ అయ్యింది. అలా ‘మజిలీ’ ప్రయాణం మొదలైంది. ‘నిన్ను కోరి’ లవ్‌స్టోరీ. ‘మజిలీ’ మాస్ లవ్‌స్టోరీ అని చెప్పగలను. వెంట వెంటనే సేమ్ జానర్లో సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ ‘నిన్ను కోరి’ కంటే ‘మజిలీ’ చిత్రానికి ఎక్కువ కష్డపడ్డాం. ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కాదు. ముగ్గురు (చైతన్య, సమంత, దివ్యాంక) ఒక ఫ్రేమ్‌లో ఉండరు. అదే ‘నిన్ను కోరి’కి, మజిలీ సినిమాకు డిఫరెన్స్. డేట్స్ క్లాష్ వల్ల సంగీత దర్శకుడు గోపీసుందర్‌గారు రీ–రికార్డింగ్ చేయలేకపోయారు. ఆ తర్వాత తమన్‌గారు వచ్చారు. బాగా చేశారు. ► క్రికెటర్ కావాలనుకున్న పూర్ణ లైఫ్‌లో ఫెయిల్ అవుతాడు. అతనికి 30 ఏళ్లు దాటినా గతంలో నుంచి బయటకు రావడానికి ఇష్టపడడు. అలాంటి పూర్ణను గతంలోంచి లాగటానికి అతని భార్య శ్రావణి ఏం చేసిందనే పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. నా సినిమాల్లో నా రియల్‌లైఫ్, నా స్నేహితుల జీవితాల్లోని సంఘటనలు ఉంటాయి. సెన్సిబుల్ కథలను నిర్మాతలు అర్థం చేసుకుంటే ఇంకా మంచిసినిమాలు వస్తాయని నా అభిప్రాయం. ఈ చిత్రనిర్మాతలు బాగా సహకరించారు. ► సమంతగారు ఎప్పుడూ బాగా నటిస్తారు. కానీ చైతన్య ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. చైలో ఎంత సామర్థ్యం దాగి ఉందో స్క్రీన్‌పై తెలుస్తుంది. నాగార్జునగారు ఇంకా సినిమా చూడలేదు. ► ట్రైలర్లో గమనిస్తే ఓ షాట్లో చైతన్యకు సమంత గొడుగు పడుతుంది. అది ఇంట్రవెల్లో వస్తుంది. ‘నిజజీవితంలో నిజంగా అలాంటి భార్యలు ఉంటారా?’ అని చాలామంది అడిగారు. మనకు తెలియదు కానీ మన∙లైఫ్‌లో మన వైఫ్లు మన కోసం నిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మనం గుర్తించం అంతే. అయితే అందరూ గొడుగులు పట్టక్కర్లేదు. అది చెప్పడానికే ట్రై చేశాను. ► వెధవలకు మంచి పెళ్లాలే దొరుకుతారు అనేది పూర్ణ పాత్రను పోసానిగారు చూసిన దృష్టికోణంలోనిది. అది జనరలైజ్ చేసి చెప్పింది కాదు. నటీనటుల ఇమేజ్ గురించి పెద్దగా ఆలోచించను. థియేటర్లోకి ప్రేక్షకులు వెళ్లాక కథలో నాగచైతన్య గుర్తుంటే నేను ఫెయిలైనట్లే. పూర్ణ గుర్తు ఉంటే నేను సక్సెస్ అయినట్లు. ► నా తొలి సినిమా ‘నిన్ను కోరి’ సక్సెస్ అయ్యింది. రెండో సినిమా జాగ్రత్త అని చాలామంది అన్నారు. కానీ నాకా ఆందోళన లేదు. ఈ రెండో సినిమా దాటేస్తే... మూడో సినిమా ఫ్లాప్ కొట్టినా.. పర్లేదా.. నాలుగో సినిమా వస్తుందా? అని అడిగాను. రెండు కథలను పక్కన పెట్టేలా చేసింది ఈ సినిమా. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. ► ప్రస్తుతం నా దగ్గర ఒక కామెడీ, ఓ యాక్షన్ థ్రిల్లర్ కథలు రెడీగా ఉన్నాయి. ఏది చేస్తాను అనేది ‘మజిలీ’ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. -
ట్రైలర్ చూస్తుంటే కన్నీళ్లొచ్చాయి
‘‘ఏ మాయ చేసావె’ సినిమా చూసినప్పుడు చైతు, సమంత చక్కటి జంట అనుకున్నా. ‘మనం’ సినిమాలో వీళ్లిద్దరూ నాతో కలిసి నటించారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని నాకు అప్పుడు తెలియదు. నాకు ఏమాత్రం తెలియకుండా సైలెంట్‌గా రొమాన్స్ చేస్తున్నారని ఆ తర్వాత తెలిసింది’’ అని నాగార్జున అన్నారు. నాగచైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. గోపీ సుందర్ స్వరాలు అందించారు. ఇందులోని తొలి నాలుగు పాటలను నిర్మాత నవీన్ ఎర్నేని, డైరెక్టర్లు పరశురామ్, బాబీ (కె.ఎస్.రవీంద్ర), సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్‌ను వెంకటేశ్ ఆవిష్కరించారు. పాటల సీడీని వెంకటేశ్ విడుదల చేసి నాగార్జునకు అందించారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘మజిలీ’ టీజర్లో ‘వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు’ అనే డైలాగ్ విన్నప్పుడు బాధ కలిగింది. తండ్రిగా నాకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. కానీ, నేను చెప్పేది సినిమా చూడకముందు. కానీ, సినిమా చూసిన తర్వాత మా మంచి అబ్బాయికి, మంచి అమ్మాయి దొరికిందనిపించింది. ఏప్రిల్ 6న మాకు మంచి ఉగాది అవుతుంది. ‘మజిలీ’ ట్రైలర్ చూస్తుంటే రెండుసార్లు కన్నీళ్లొచ్చాయి. సినిమా ఇంకెంత బావుంటుందో’’ అన్నారు. వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘మజిలీ’ టీజర్ చూడగానే చాలా పెద్ద హిట్ అవుతుందనిపించింది. ట్రైలర్ చూడగానే చాలా చాలా పెద్ద పెద్ద హిట్ అవుతుందని అనుకున్నా. ‘సినిమా చూసిన తర్వాత అందరూ చైతూని కౌగలించుకుంటారని’ శివ నిర్వాణ అన్నాడు. నేను ట్రైలర్ చూడగానే కౌగలించుకుంటున్నాను. శ్యామ్, చైతూ, దివ్య చాలా బాగా చేశారు. ఏప్రిల్ 5న ఫ్యాన్స్ ఉగాది పండగను భారీగా చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాల్లో చైతూ, శ్యామ్ అద్భుతంగా నటిస్తారు’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘శివగారు ఈ సినిమా గురించి అడగ్గానే నాకు ఓకే అనిపించింది. శ్యామ్.. నాకు ఇంకో హీరోయిన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు. నాన్న, వెంకీమామ నా పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. శ్యామ్, నేను పెళ్లి తర్వాత ఇంత త్వరగా కలిసి సినిమా చేస్తామనుకోలేదు. నేను ఇప్పటిదాకా పనిచేసిన వాళ్లల్లో శివ హానెస్ట్ ఫిల్మ్ మేకర్. వ్యక్తిగా కూడా నిజాయతీపరుడు. తనతో చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా. సాహు, హరీష్ చాలా మంచి నిర్మాతలు. నాకు, శ్యామ్‌కి ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ సినిమాకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.. కామ్‌గా ఉన్నాం. ‘మజిలీ’ చూసి ఎవరూ అసంతృప్తికి లోనవరు’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘నాగార్జున, వెంకటేశ్‌గార్ల వల్ల ఒక పాజిటివ్ నమ్మకం వచ్చింది. వాళ్ల ప్రభావం మా మీద చాలా ఉంది. ప్రతి లవ్ స్టోరీ చాలా యూనిక్‌గా ఉంటుంది. ‘మజిలీ’ నిజమైన లవ్‌స్టోరీ. ‘ఏమాయ చేసావె, మనం’ తర్వాత ‘మజిలీ’ నాకు ఇంపార్టెంట్ సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అందుకు శివగారికి ధన్యవాదాలు. మా ఆయన గురించి నేనే చెబితే బాగోదు. కానీ, ఏప్రిల్ 5 తర్వాత అందరూ చెబుతారు. నేను అది విని ఆనందిస్తాను’’ అన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘నిన్ను కోరి’ చిత్రం తర్వాత జానర్ మారుద్దామనుకున్నా. అప్పుడు నాగచైతన్యగారు ఫోన్ చేసి ‘నీ సినిమా నచ్చింది. నీకు నచ్చిన కథ ఉంటే తీసుకురా చేద్దాం’ అన్నారు. ఆ సమయంలో నా దగ్గర కథ లేదు. 20 రోజుల తర్వాత వచ్చిన ఓ ఐడియాని చైతన్యగారి దగ్గరకు వెళ్లి చెప్పా. సినిమాని మార్కెట్ చేసుకోవాలని చైతన్య, సమంతని పెట్టలేదు. వాళ్ల నటనను గౌరవించి పెట్టా. సమంతగారితో ఎన్ని సినిమాలకు పని చేయడానికైనా నేను సిద్ధమే. అటు ఎలక్షన్, ఇటు ఐపీయల్ ఉన్నా అంతకుమించిన కిక్కు మా సినిమాలో ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు మా చైతన్యగారు, సమంతగారు అందించిన సపోర్టు మరువలేనిది. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు నిర్మాత సాహు గారపాటి. నిర్మాత హరీశ్, కథానాయిక దివ్యాంశ కౌశిక్, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు. -
‘మజిలి’ ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్
అక్కినేని యువ జంట నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా మజిలి. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావటంతో మజిలిపై భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిన్నుకోరి ఫేమ్ శివా నిర్వాణ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 5న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా శాటిలైట్ హక్కలను సన్ నెట్వర్క్ సంస్థ 5 కోట్లకు తీసుకుంది. డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ 3.5 కోట్లకు హిందీ అనువాద హక్కులు 4.5 కోట్లకు అమ్ముడయ్యాయి. మీడియం బడ్జెట్ సినిమా కావటంతో డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్‌తోనే నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. -
‘మజిలీ’ మొదలైంది..!
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, తన రీల్, రియల్ లైఫ్ జోడి సమంతతో కలిసి మరో సినిమలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూ-సామ్‌లు కలిసి నటిస్తున్నారు. తాజాగా దర్శకుడు ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చైతూ, సమంతలు విదేశాల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దర్శకుడు మాత్రం హీరో హీరోయిన్లు లేకుండానే షూటింగ్ మొదలెట్టేశాడు. ముందుగా లీడ్ క్యారెక్టర్స్ కనిపించని సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారట టీం. హాలీ డే ట్రిప్ నుంచి తిరిగి వచ్చాక చైసామ్‌లు కూడా ఈ చిత్రయూనిట్‌తో జాయిన్ కానున్నారు. ఈ సినిమాకు మజిలి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
చైతూ.. సమంతల ‘మజిలి’
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, తన రీల్, రియల్ లైఫ్ జోడి సమంతతో కలిసి మరో సినిమలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతు సామ్‌లు కలిసి నటిస్తున్నారు. ఏమాయ చేసావే సినిమాతో తొలిసారిగా మాయ చేసిన ఈ జంట తరువాత టాలీవుడ్లో సూపర్ హిట్ జోడిగా పేరు తెచ్చుకున్నారు. పెళ్లి తరువాత చైతూ సమంతలు కలిసి నటిస్తున్న తొలి సినిమా కావటంతో శివ నిర్వాణ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అందుకే సినిమాకు సంబంధించిన ప్రతీ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘మజిలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. -
క్యాబ్ డ్రైవర్‌గా సమంత!
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లైతే హీరోయిన్ కెరీర్ ముగిసినట్టే అని భావిస్తారు. కానీ స్టార్ హీరోయిన్ సమంత మాత్రం పెళ్లి తరువాత కూడా వరు సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పెళ్లి తరువాత రంగస్థలం, అభిమన్యుడు లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న సమంత త్వరలో డిఫరెంట్ జానర్లో తెరకెక్కుతున్న యు టర్న్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే భర్త నాగచైతన్యతో కలిసి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సమంత క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నారట. పెళ్లి తరువాత చైతూ, సమంతలు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్వకుడు. -
చైతూ, మాధవన్ కాంబినేషన్లో మరో సినిమా
డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మాధవన్, ఇన్నేళ్లలో ఒక్క స్ట్రయిట్ తెలుగు సినిమా కూడా చేయలేదు. అయితే త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న నాగచైతన్య సవ్యసాచి సినిమాతో తొలిసారిగా ఓ స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటిస్తున్నాడు మ్యాడీ. అంతేకాదు ఈ సినిమాలో మాధవన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. తాజాగా సమాచారం ప్రకారం నాగచైతన్య, మాధవన్‌లు మరో సినిమాలో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారట. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటిస్తున్నాడు చైతూ. ఈ సినిమా పూర్తయిన వెంటనే నిన్నుకోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మాధవన్‌ను కీలక పాత్రలో నటింప చేయాలని చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
అఫీషియల్ : చైతూ ప్రేయసి ఆమే..!
ఆన్ స్క్రీన్ బెస్ట్ పెయిర్ అనిపించుకున్న అక్కినేని నాగచైతన్య, సమంతలు రియల్ లైఫ్‌లో కూడా బెస్ట్ జోడి అనిపించుకున్నాడు. ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట మరోసారి వెండితెర మీద సందడి చేసేందుకు రెడీ అవుతుంది. నాని హీరోగా నిన్నుకోరి లాంటి క్లాస్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈసినిమాలో నాగచైతన్యకు జోడి సమంత నటిస్తున్నట్టుగా చిత్రయూనిట్ ప్రకటించారు. షైన్ స్క్రీన్స్ సంస్థ రెండవ ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రేయసి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్న చైతూ.. ఆ సినిమా తరువాత మారుతి దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. -
నాగచైతన్య ‘ప్రేయసి’..?
అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమాలో నటిస్తున్న చైతూ.. ఆ సినిమా తరువాత మారుతి దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు ఈ యంగ్ హీరో. నాని హీరోగా నిన్నుకోరి లాంటి క్లాస్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సమంత నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ప్రేయసి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
సమంత మాయ కొద్దిసేపేనా?
సాక్షి, సినిమా : టాలీవుడ్ సక్సెస్ఫుల్ జోడీ సమంత-నాగ చైతన్య వివాహం తర్వాత తిరిగి కలిసి నటించబోతున్నారన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ ఈ తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టు దాదాపు ఖరారు కాగా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది. ఇందులో సమంత కేవలం అతిథి పాత్రలోనే నటించబోతోందంట. ఈ చిత్రంలో కాసేపు కనిపించే ఓ పాత్ర కోసం దర్శకుడు నటీమణుల కోసం వెతుకుతుండగా.. సామ్ పేరును చైతూ సూచించినట్లు తెలుస్తోంది. ఆ లెక్కన్న హీరోయిన్ రోల్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. రొమాంటిక్ ట్రాక్‌తో శివ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడంట. ప్రస్తుతం సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు చిత్రాలతో బిజీగా ఉన్న చైతూ అవి పూర్తికాగానే శివ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. మరోవైపు సమంత రంగస్థలం, మహానటిలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైపోయింది. -
పెళ్లి తరువాత తొలిసారి..!
అక్కినేని యువ హీరో నాగచైతన్య, అందాల నటి సమంతలది సక్సెస్ఫుల్ జోడి అన్న సంగతి తెలిసిందే. ఏం మాయ చేసావే, మనం లాంటి సినిమాల్లో అలరించిన ఈ జంట నిజజీవితంలోనూ ఒక్కటయ్యారు. పెళ్లి తరువాత ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీ అయిన చైతూ, సమంతలు త్వరలో కలిసి నటించేందుకు అంగీకరించారట. నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివ నిర్వాణ నాగచైతన్య హీరోగా ఓ సినిమాను చేసేందుకు అంగీకరించాడు. నిన్నుకోరి సినిమాను నిర్మించిన దానయ్య, కోన వెంకట్లే నాగచైతన్య, శివ నిర్వాణ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్గా సమంత అయితే కరెక్ట్ అని భావిస్తున్నాడట దర్శకుడు శివ. నాగచైతన్య హీరోగా కావటంతో సమంత కూడా కాదనదన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు సినిమాలు పూర్తయిన వెంటనే కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. -
రామ్‌ని కోరి
సేమ్ బ్యానర్.. సేమ్ డైరెక్టర్.. సేమ్ రైటర్... కానీ హీరో చేంజ్ అయ్యాడట. ఏ బ్యానర్? ఏ డైరెక్టర్? ఏ రైటర్ అంటే.. డీవీవీ బేనర్, శివా నిర్వాణ, కోన వెంకట్. నాని హీరోగా శివా నిర్వాణ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ‘నిన్ను కోరి’ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు కోన వెంకట్ స్క్రీన్‌ప్లే అందించారు. ఇప్పుడు దానయ్య, శివా నిర్వాణ, కోన వెంకట్... రామ్‌ని కోరారు. రామ్ హీరోగా ఈ ముగ్గురూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. శివ చెప్పిన లవ్‌స్టోరీకి ఇంప్రెస్ అయ్యారట రామ్. అంతేకాదు.. ఈ సినిమాకి కూడా కోన వెంకట్నే స్క్రీన్‌ప్లే అందించనున్నారని సమాచారం. -
నాని డైరెక్టర్‌తో మెగా హీరో
ఫిదా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న వరుణ్, మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు ఓకె చెప్పాడు. మాస్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన ఈ యువ నటుడు ముందు లవర్ బాయ్ గా ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే వరుసగా రొమాటింక్ ఎంటర్టైనర్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అదే బాటలో యువ దర్శకుడు శివ నిర్వాణతో ఓ సినిమాకు అంగీకరించాడు. నాని హీరోగా నిన్నుకోరి లాంటి మెచ్యూర్డ్ లవ్ స్టోరిని తెరకెక్కించిన శివ నిర్వాణ వరుణ్‌తో తెరకెక్కించబోయే సినిమాలో మాత్రం కాస్తం ఎంటర్టైన్మెంట్ కూడా జోడిస్తున్నాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను డీవీవీ దానయ్య నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న వరుణ్, సెట్స్ మీద ఉన్న సినిమా పూర్తయిన తరువాతే కొత్త సినిమాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
ఎనిమిదేళ్లు ఎదురుచుశా...!
శ్రీకాకుళం రూరల్: ‘సినీ ఇండ్రస్టీలో ఎనిమిదేళ్లు అవకాశాల కోసం తిరిగాను. రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన రక్తచరిత్ర, పరశురాం డైరెక్షన్లో సోలో చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశా. గ్రామీణా ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్లి లిరిక్ రైటర్‌గా పనిచేస్తూ చివరకు ‘నిన్నుకోరి’ సినిమాతో మీ ముందుకు వచ్చాను..’ అని డైరెక్టర్ ఎల్.శివ నిర్వాణ అన్నారు. గురజాడ విద్యాసంస్థలకు ఇటీవల వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. షార్ట్ఫిల్మస్ వల్ల అవకాశాలున్నాయా? శివ: ప్రస్తుతం ప్రతి ఒక్కరి కెరీర్ స్టార్ట్ అయ్యేది షార్ట్ ఫిల్మ్‌తోనే. నేను కూడా లవ్ ఆల్ జీబ్రా అనే షార్ట్‌ఫిల్మ్ తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేయగా రచయిత కోనవెంకట్ నుంచి పిలుపు వచ్చింది. మనం చేసే ఐదు నిమిషాల షార్ట్‌ఫిల్మ్‌లో మంచి మెసెజ్ ఉంటే సరిపోతుంది. ఇండ్రస్టీలో ఎదురైన అనుభవాలేంటి? శివ:కళామతల్లికి నమ్ముకున్న వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు. ఆ నమ్మకంతోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరగా నిన్నుకోరి చిత్రంతో సక్సెస్ సాధించాను. మీ కుటుంబ నేపథ్యం? శివ:మాది విశాఖలోని సబ్బవరం గ్రామం. గ్రామీణ ప్రాంతం నుంచే ఇండ్రస్టీకి వెళ్లాను. ఎమ్మెస్సీ బీఈడీ చేశాను. రెండేళ్లు టీచర్‌గా పనిచేశాను. ఇంటర్ నుంచే కథలు రాయడం మొదలుపెట్టాను. ‘నిన్నుకోరి’ వెనుక ఏదైనా లవ్‌స్టోరీ ఉందా? శివ:నా ఫ్రెండ్‌కు జరిగిన స్టోరీయే నిన్నుకోరిగా తీశాను. యువతకు మీరిచ్చే సలహా? శివ:చదువుల్లోనైనా, ఉద్యోగంలోనైనా, సినీ ఇండ్రస్టీలోనైనా అనుకున్నది సాధించాలంటే కృషి, పట్టుదల ఉండాలి. అపజయాలకు కుంగిపోవద్దు. -
హడావిడి తగ్గాకే బరిలోకి..!
వరుసగా మూడు నెలలపాటు భారీ సినిమాలు బరిలో ఉండటంతో చిన్న మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాలను కాస్త ఆలస్యం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బాహుబలి, మహేష్ 23ల తో పోటి పడి నష్టపోవటం కన్నా.. హడావిడి తగ్గాక, తీరిగ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యంగ్ హీరో నాని కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం కొత్త దర్శకుడు శివ నిర్వాణా దర్శకత్వంలో నిన్ను కోరి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు నాని. ఇప్పటికే అమెరికాలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలైలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వరుసగా బాహుబలి, డీజే దువ్వాడ జగన్నాథమ్, మహేష్ 23 సినిమాలు ఏప్రిల్, మే, జూన్ నెలలో రిలీజ్ అవుతుండటంతో తన సినిమాను జూలైలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మహేష్, మురుగదాస్‌ల కాంబినేషన్లో వస్తున్న సినిమా రిలీజ్ అయిన రెండు మూడు వారాల తరువాత తన సినిమాను బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.