
అక్కినేని యువ జంట నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా మజిలి. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావటంతో మజిలిపై భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిన్నుకోరి ఫేమ్ శివా నిర్వాణ దర్శకుడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఏప్రిల్ 5న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా శాటిలైట్ హక్కలను సన్ నెట్‌వర్క్ సంస్థ 5 కోట్లకు తీసుకుంది. డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ 3.5 కోట్లకు హిందీ అనువాద హక్కులు 4.5 కోట్లకు అమ్ముడయ్యాయి. మీడియం బడ్జెట్ సినిమా కావటంతో డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్‌తోనే నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment