నా హార్ట్‌ ఇక్కడే ఉంది | samantha naga chaitanya interview about majili movie | Sakshi
Sakshi News home page

నా హార్ట్‌ ఇక్కడే ఉంది

Published Sun, Apr 14 2019 12:28 AM | Last Updated on Sun, Apr 14 2019 4:28 PM

samantha naga chaitanya interview about majili movie - Sakshi

సమంత, నాగచైతన్య

‘‘మజిలీ’ని చాలా కాన్ఫిడెంట్‌గా చేశాం. ఫెయిల్‌ అయితే లైఫ్‌ లాంగ్‌ అది ఓ డ్యామేజ్‌లా ఉండిపోతుంది. అందుకే ఎలాగైనా వర్కౌట్‌ అవ్వాలనుకున్నాం. పెళ్లితర్వాత కలిసి చేసిన తొలి సినిమా కాబట్టి రిజల్ట్‌ ఎలా ఉంటుందో అని కాస్త టెన్షన్‌ పడ్డాం. మంచి స్పందన వచ్చినందుకు ఇప్పుడు  హ్యాపీ’’ అని నాగచైతన్య, సమంత అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత, దివ్యాంశా కౌశిక్‌ ముఖ్య తారలుగా  సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన చిత్రం ‘మజిలీ’. ఈ నెల 5న విడులైంది. శనివారం చైతూ, సమంత ఇద్దరూ కలిసి చెప్పిన ‘మజిలీ’ కబుర్లు.

► మీకు కెరీర్‌లో విడి విడిగా హిట్స్‌ ఉన్నాయి. కంబైన్డ్‌గా ఉన్నాయి. ‘మజిలీ’ హిట్‌ ఎంత స్పెషల్‌?
సమంత: మోర్‌ స్పెషల్‌. పెళ్లి తర్వాత ఈ సినిమా హిట్‌ మాకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. సరైన సమయంలో సరైన సినిమాతో సరైన హిట్‌ వచ్చిందనుకుంటున్నాను. కథ విన్నప్పుడు, షూటింగ్‌ స్టార్ట్‌ చేసినప్పుడు ఏదో స్పెషల్‌ జరుగుతోందనే భావన మనసులో ఉంది. అదే ఫీల్‌ని, స్పెషల్‌ని ఆడియన్స్‌ కూడా ఫీలై మాకు మంచి విజయం అందించారు. వారికి ధన్యవాదాలు.

► సమంత మీ లక్కీఛార్మ్‌ అని మరోసారి ప్రూవ్‌ అయిందని నమ్ముతారా?
(సమంత అందుకుంటూ....) ఆయనే నాకు ఇంకా లక్కీఛార్మ్‌. ఎందుకంటే... మ్యారేజ్‌ తర్వాత నా యాక్టింగ్‌ కెరీర్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్తోందన్న ఫీలింగ్‌ కలుగుతోంది.
చైతన్య: లక్కీఛార్మ్‌ అనడం కన్నా సపోర్ట్‌ అంటాను. సక్సెస్‌ టైమ్‌లో సపోర్టివ్‌గా చాలామంది ఉంటారు. ఫెయిల్యూర్స్‌ అప్పుడు సపోర్ట్‌ చాలా ముఖ్యం.

► పెళ్లి తర్వాత కలిసి నటించడానికి బాగా ఆలోచించారా? మళ్లీ నటిస్తారా?
చైతూ: యాక్చువల్లీ పెళ్లి తర్వాత ఓ సినిమా చేద్దామని మా అంతట మేము ఏ దర్శక–నిర్మాతలను సంప్రదించలేదు. దర్శకుడు శివ భార్యాభర్తల కథతో మా దగ్గరకు రావడం అనుకోకుండా జరిగింది. ఇప్పుడు ఎలా అయితే మ్యాజిక్‌ జరిగిందో అలాగే భవిష్యత్‌లో జరిగితే తప్పకుండా మేం ఇద్దరం కలిసి సినిమా చేస్తాం. ‘మనం’ చిత్రానికి కూడా ఇలాంటి మ్యాజిక్కే జరిగింది.

► పూర్ణ (చైతూ పాత్ర పేరు) క్యారెక్టర్‌ను సిల్వర్‌స్క్రీన్‌పై చూసినప్పుడు ఒక ప్రేక్షకురాలిగా మీరెలా ఫీల్‌ అయ్యారు?
సమంత: చైతన్య కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌. యాక్టర్‌గా చైతన్యలో పెద్ద గ్రోత్‌ కనిపించింది. ఒక సినిమా చేసేప్పుడు ఈ సీన్‌ బాగా చేశాను.. ఈ సీన్‌ బాగా వచ్చిందని ఫీలింగ్‌ కలగవచ్చు... కానీ ఫైనల్‌ ప్రొడక్ట్‌ చూసేప్పుడు అలా అనిపించకపోవచ్చు. ఈ సినిమాలో నేను లేని సీన్స్‌ను వెండితెరపై చూసినప్పుడు షాక్‌ అయ్యాను. యంగ్‌ అండ్‌ మిడిల్‌ ఏజ్డ్‌ క్యారెక్టర్స్‌లో చైతన్య మంచి వేరియేషన్‌ చూపించారు. అద్భుతంగా నటించారు.

► సెకండాఫ్‌లో చైతూని సమంత టేకోవర్‌ చేశారని అంటున్నారు?
చైతూ: నా క్యారెక్టర్‌ ఎలివేట్‌ అవడానికి కారణం సినిమాలో సమంత చేసిన శ్రావణి క్యారెక్టరే. లవ్‌స్టోరీలో హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్‌ కూడా అంతే ముఖ్యం. ఆఫ్‌ స్క్రీన్‌ అయినా ఆన్‌స్క్రీన్‌ అయినా పూర్ణ క్యారెక్టర్‌కు సామ్‌ మంచి సపోర్ట్‌. తను ఒప్పుకోదు కానీ క్లైమాక్స్‌ కంప్లీట్‌గా తనదే.
సమంత: అలా ఏం లేదు (నవ్వుతూ).

► ఈ సినిమాలో చైతూకి బైక్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. చైతూతో మీకు పెళ్లి అయ్యాక.. మీరు  ఇచ్చిన ఫస్ట్‌ గిఫ్ట్‌ ఏంటి?
చైతూ: నా బర్త్‌డేకి ఓ స్పోర్ట్స్‌ బైక్‌ గిఫ్ట్‌గా ఇచ్చింది.
సమంత: అవును.. బైక్‌ ఇచ్చాను.

► ఈ సినిమా సక్సెస్‌ గురించి నాగార్జునగారి రియాక్షన్‌?
సమంత: సడన్‌గా ఇంటికి వచ్చేశారు (నవ్వుతూ).
చైతూ: ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఫ్యామిలీలో కొంతమందికి చూపించాను. షో అయ్యాక ఎవరూ ఏం మాట్లాడలేదు. ఎర్రబారిన కళ్లతో తలదించుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. నాకు నిజంగా అర్థం కాలేదు. ఫస్ట్‌ టైమ్‌ ఇలాంటి రియాక్షన్‌ చూశాం. అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యి మాట్లాడలేకపోయారని తర్వాత అర్థమైంది. నెక్ట్స్‌డే మార్నింగ్‌ ఫోన్‌చేసి అందరూ మాట్లాడారు. సినిమా బాగుందని అభినందించారు. ఫస్ట్‌టైమ్‌ నాన్నగారికి లేట్‌గా సినిమా చూపించాను. ఆర్‌ఆర్‌ లేట్‌ అవ్వడం వల్ల ముందే చూపించలేకపోయాను. కథ కూడా అంతగా నాన్నగారికి తెలీదు.

► సాధారణంగా నాగార్జునగారు మీ సినిమాల రషెస్‌ చూస్తుంటారు. అవసరమైనప్పుడు సలహాలు ఇస్తుంటారు. కానీ ఈ సినిమాను మీకే వదిలేయడం వెనక కారణం ఏంటి?
చైతూ: ‘ఏదైనా ఒక పాయింట్‌ నచ్చినప్పుడు నువ్వు చేసెయ్‌. నా దగ్గరకు తీసుకు రావొద్దు’ అని ఎప్పట్నుంచో నాన్నగారు చెబుతున్నారు. ‘నీ ఆత్మవిశ్వాసం, నీ నిర్ణయంపై ముందుకు సాగిపో’ అని చెబుతుంటారు. ‘మజిలీ’ కథ విన్నప్పుడు నాకు ఒక్క డౌట్‌ కూడా లేదు. సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకుందామా? అనే ఆలోచన రాలేదు. ఎటువంటి డౌట్‌ లేనప్పుడు మన జడ్జ్‌మెంట్‌ని ఓసారి పరీక్షించుకుందాం అనుకున్నాను. ఒకవేళ డౌట్స్‌ ఉంటే కథ వినమని నాన్నగారికి చెబుతాను.
సమంత: నాకు డౌట్‌ వచ్చింది. కానీ ఇది చాలా మంచి స్క్రిప్ట్‌. డైరెక్టర్‌కు సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌ ఉండాలి. అది శివగారిలో కనిపించింది.

► మీ కెరీర్‌లో హయ్యస్ట్‌ ఫస్ట్‌వీక్‌ కలెక్షన్స్‌ (50కోట్లు) ఈ సినిమాకు వచ్చాయి. ఆ ఫీలింగ్‌ ఎలా ఉంది?
చైతూ: చాలా సంతోషంగా ఉంది. సినిమా ఒప్పుకునే ముందు ఇంత వసూలు చేయాలి, అంత వసూలు చేయాలని పెద్దగా ఆలోచించను. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఈ సినిమా ఫస్ట్‌వీక్‌ కలెక్షన్స్‌తోనే అందరూ ప్రాఫిట్‌ జోన్‌లోకి వచ్చారంటుంటే సంతోషంగా ఉంది. ఈ కలెక్షన్స్‌ పట్ల అభిమానులు, ఫ్యాన్స్‌ ఇంకా ఎగై్జటెడ్‌గా ఉంటారు. అఫ్‌కోర్స్‌ నేను కూడా. ప్రాఫిట్‌తో పాటు సక్సెస్‌ వస్తే అది అల్టిమేట్‌ కాంబినేషన్‌ అవుతుంది.
సమంత: ఇంట్లో కలెక్షన్స్‌ నేను చూసుకుంటాను.

► ఎలక్షన్‌  టైమ్‌లో కూడా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్‌ రావడం గురించి....
చైతూ: స్టార్టింగ్‌లో కొంచెం టెన్షన్‌ పడ్డాం. సమ్మర్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ తప్పకుండా అడ్వాంటేజ్‌ ఉంటుంది, రిలీజ్‌ చేద్దామని డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ ప్రోత్సహించారు. సినిమా బాగుంటే ఆడియన్స్‌ సపోర్ట్‌ తప్పకుండా ఉంటుందన్నారు.

►  ‘మజిలీ’ సినిమా తర్వాత ఫస్ట్‌టైమ్‌ నాగార్జున గారు మీ ఇంటికి వచ్చారు అన్నారు? అంటే ఇంతకుముందు సినిమాలకు రాలేదా?
సమంత: చెప్పి వస్తారు. ఆహ్వానిస్తే వస్తారు. కానీ చెప్పకుండా వచ్చారు.
చైతూ: ఆ రోజు సడన్‌గా మార్నింగ్‌ ఫోన్‌ చేసి ఎక్కడున్నారు? వస్తున్నాను? అని చెప్పి వచ్చేశారు. అలా ఎప్పుడూ రాలేదు.
సమంత: చాలా కష్టపడి సినిమా చేశాం. ఆడియన్స్, అభిమానులకు నచ్చింది. కానీ తల్లిదండ్రులను గర్వపడేలా చేయడం వేరు కదా.

►  సమంత నటించిన తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’ చూశారా?
చైతూ: ఫస్ట్‌ హాఫ్‌ చూశాను. సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యే ముందే కథ చెప్పింది. అందుకే పెద్దగా షాక్‌ అవ్వలేదు. స్టెప్‌ బై స్టెప్‌ యాక్టర్‌గా నేను ఇప్పుడే గ్రో అవుతున్నాను. భవిష్యత్‌లో తప్పకుండా ఇలాంటి సినిమాలు చేస్తాను.

► ఒకవేళ ‘సూపర్‌ డీలక్స్‌’ లాంటి సినిమా చేయొద్దని చైతన్య చెబితే మీరు ఏం చేస్తారు?
సమంత: ఆయన అలా చెప్పరని నాకు తెలుసు. పెళ్లి తర్వాత నా నిర్ణయాలు, నా కాన్ఫిడెన్స్‌ పట్ల నాకు మరింత నమ్మకం కుదిరింది. ఆ నమ్మకానికి కారణం ఇంట్లోని పరిస్థితులే. చైతూ ప్రోత్సాహం. తెలియకుండానే నాకో బలం వచ్చింది.

► ‘మజిలీ’లో ఓ సీన్‌లో క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకున్నారు. నిజంగా ఆడటం వచ్చా?
సమంత: నాకు పెద్దగా క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. అయితే స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయాలని మాత్రం ఉంది.

► మీరు తమిళంలోకి ఎప్పుడు వెళ్తున్నారు?
చైతూ: నాకు తమిళ సినిమాలంటే చాలా ఇష్టం. చెన్నైలో పుట్టి పెరిగాను. చిన్నతనంలో తమిళ సినిమాలు చూస్తూ టైమ్‌ స్పెండ్‌ చేశాను. కానీ నా హృదయం ఇక్కడే ఉంది. ఏమో... నటుడిగా ఇక్కడ ఇంకా చాలా ఆకలిగా ఉన్నాను. చాలా హిట్స్‌ ఇవ్వాలి. మంచి మంచి సినిమాలు చేయాలి. ప్రస్తుతానికి మనసు టాలీవుడ్‌పైనే ఉంది.

► బైలింగ్వల్‌ సినిమా ఆలోచన ఉందా?
 చైతూ: అలాంటి స్క్రిప్ట్‌ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. కానీ ప్రస్తుతం తెలుగే.

►  ‘యు–టర్న్, ఓ బేబి’... ఇటీవల ‘96’ ఇలా రీమేక్‌ సినిమాలపై మొగ్గు చూపుతున్నట్లున్నారు?
సమంత: రీమేక్స్‌ అంటే కాస్త రిస్కే. ఇవన్నీ మంచి సినిమాలు. అందుకే నో చెప్పలేకపోయాను. హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్న కథలకు నో చెప్పడం నాకు ఇష్టం లేదు.

►  చైతూతో పెళ్లికి ముందు ‘ఏ మాయ చేసావె, మనం, ఆటోనగర్‌సూర్య’ సినిమాలు చేశారు. తాజాగా ‘మజిలీ’. అప్పటి చైతూకి, ఇప్పటి చైతూకి యాక్టింగ్‌లో వచ్చిన తేడా ఏంటి?
సమంత: నాకు తెలిసిన చైతన్య ఎందుకు స్క్రీన్‌పై కనిపించడం లేదనే ఫీలింగ్‌ ఉండేది. అవుట్‌సైడ్‌ చైతన్య మాటలు, ప్రవర్తన, లుక్స్‌ అమేజింగ్‌గా ఉంటాయి. అది ‘మజిలీ’ సినిమాలో స్క్రీన్‌పై నాకు కనిపించింది. తన రియల్‌ పర్సనాలిటీని స్క్రీన్‌పైకి తీసుకువచ్చి ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడంలో బాగా సక్సెస్‌ అయ్యారు. ఇక యాక్టర్‌గా తను చాలా పరిణితి చెందారు. చైతన్యలో బాగా ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘ఏ మాయ చేసావె’ టు ‘మజిలీ’ ఒక పర్సన్‌గా, యాక్టర్‌గా చాలా పాజిటివ్‌గా మారారు.

► ‘బంగార్రాజు’ ఎంతవరకు వచ్చింది?
ఇంకా స్క్రిప్టింగ్‌ జరుగుతోంది. జూలై నుంచి స్టార్ట్‌ చేయవచ్చు. నేను, నాన్నగారు కలిసి చేస్తాం.

►  ‘ఏ మాయ చేసావె’ సినిమా టైమ్‌లో చైతన్యను చూసి ఇన్నోసెంట్‌ అనుకున్నారా? లేక హ్యాండ్‌సమ్‌ అని ఫీల్‌ అయ్యారా?
సమంత: నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా ఇన్నోసెంటే (నవ్వుతూ). అప్పుడు నాకు తెలుగు రాదు. చాలా పెద్ద స్క్రిప్ట్‌. ఎప్పుడూ డైలాగ్స్‌ చదువుతూనే ఉండేదాన్ని. సెట్‌లో ప్రతి రోజూ షివరింగే. గౌతమ్‌ మీనన్‌గారు కట్‌ కూడా చెప్పరు. ‘ఏ మాయ చేసావె’ అప్పుడే వేరే ఏ డిస్ట్రాక్షన్స్‌ లేవు.
చైతూ: నాకు ఫొటో చూపించారు. అమ్మాయి చాలా బాగుంది. హీరోయిన్‌గా పెట్టుకుందాం అనుకున్నాం. కట్‌ చేస్తే చెన్నైలో లుక్‌ టెస్ట్‌.

►  నాగార్జునగారి ‘మన్మథుడు –2’లో ఓ స్పెషల్‌ రోల్‌ చేయబోతున్నారని తెలిసింది. నిజమేనా?
సమంత: అవును... చేస్తున్నాను.

►  సమ్మర్‌  వెకేషన్‌ ఎక్కడ ప్లాన్‌ చేశారు?
చైతూ: ఈ నెలాఖరు వరకు ‘వెంకీమామ’ షూటింగ్‌ ఉంది. మే ఫస్ట్‌ వీక్‌లో ప్లాన్‌ చేద్దామనుకుంటున్నాం.
సమంత: నాకు వెకేషన్‌ తప్పకుండా కావాలి. ఈ సినిమా విషయంలో ఇంతవరకు ఎప్పుడూ ఫీల్‌ అవ్వని స్ట్రెస్‌ ఫీల్‌ అయ్యాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement