Nagachaitanya
-
తండేల్ సినిమా సక్సెస్ పార్టీ (ఫోటోలు)
-
రెండు రోజులకు 'తండేల్' కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద తగ్గేదే లే
బాక్సాఫీస్ వద్ద తండేల్ రెండో రోజు కూడా భారీ కలెక్షన్స్ సాధించింది. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం ఉండనుందని బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. చందు మొండేటి డైరెక్షన్‌కు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ తోడైతే ఎలా ఉంటుందో తండేల్ విజయం చూపుతుంది. నాగచైతన్య, సాయి పల్లవి జోడిపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ. 21.27 కోట్లు రాబట్టి నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది.శనివారం వీకెండ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద తండేల్ దెబ్బ బలంగానే పడింది. రెండురోజులకు గాను రూ. 41.20 కోట్లు రాబట్టింది. ఇంకా ఆదివారం సెలవు రోజు ఉంది కాబట్టి సులువుగా రూ. 50 కోట్ల మార్క్‌ను దాటుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు, అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదలకు ముందే తండేల్ పాటలు, డైలాగులతో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమా బాగుందని పాజిటివ్ టాక్ రావడంతో టికెట్ల బుకింగ్‌లో వేగం పెరిగింది. -
నాగ చైతన్య- శోభిత మాంగల్యం తంతునానేనా ఫోటోలు
-
శ్రీకాకుళంలో పర్యటించిన హీరో నాగ చైతన్య, చందు, బన్నీ వాసు (ఫొటోలు)
-
కస్టడీ మూవీ సక్సెస్ ప్రెస్ మీట్లో కృతి శెట్టి..
-
ఆ మైండ్ సెట్ తో వెళ్తే కచ్చితంగా నచ్చుతుంది
-
కస్టడీ టీం ప్లానింగ్ అదుర్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిఫ్లెక్ట్ అయితే మాత్రం..
-
గాయపడ్డ మనసు ఒక మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది
-
నాగచైతన్య, కృతి శెట్టి ఇంటర్వ్యూ
-
మా నాన్న స్టోరీ వినలేదు.. నాన్న కథ విన్నారు
-
ఏజెంట్ సినిమా ఎఫెక్ట్ తో రూట్ మార్చిన అక్కినేని ఫ్యామిలీ
-
లైన్ చెప్పి అడ్వాన్స్ ఇచ్చేస్తే సినిమా చేయను
‘‘ఈ రోజుల్లో మానవ సంబంధాలకు చాలామంది విలువ ఇవ్వడం లేదు. కనీసం సహాయం చేసినవారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ కూడా చెప్పడం లేదు. ఒకవేళ చెప్పినా మొక్కుబడిగా చెప్పినట్లు కనిపిస్తోంది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ‘థ్యాంక్యూ’ లాంటి సినిమా రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ‘థ్యాంక్యూ’ మాటకు ఎంత విలువ ఇవ్వాలో తెలుస్తుంది’’ అని ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ అన్నారు. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ కథానాయికలు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా కెమెరామేన్ పీసీ శ్రీరామ్ చెప్పిన విశేషాలు.. ► నేను ఓ సినిమా ఒప్పుకునే ముందు కథ మొత్తం వింటాను. ఆ కథ నా మనసుకి ఎమోషనల్‌గా నచ్చితేనే సినిమా చేసేందుకు అంగీకరిస్తాను. అంతేకానీ స్టోరీ లైన్ చెప్పి అడ్వాన్స్ చేతిలో పెడితే సినిమా ఒప్పుకోను. కథ పూర్తిగా విన్నప్పుడే దర్శకుడి విజన్ ఏంటో తెలుస్తుంది. అప్పుడే ఆ కథని ఎలా చూపించాలో నాకు అర్థం అవుతుంది. ► ‘థ్యాంక్యూ’ అనే పదంలోనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన హృదయంలోని భావాలను స్వచ్ఛంగా వ్యక్తం చేయగలం. నా తల్లితండ్రులకు నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం వారే. నా వ్యక్తిగత, సినీ ప్రయాణంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సినవారెందరో ఉన్నారు.. ఈ సినిమా చేశాక వారందరకీ థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ► ప్రతి రంగంలో టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. అలాగే సినిమాటోగ్రఫీలోనూ సాంకేతిక పరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. రోజురోజుకీ వందల రకాలుగా టెక్నాలజీ అప్డేట్ అవుతుంటుంది. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా మన క్రియేటివ్ విజన్‌ని బట్టే అది తెరపై కనిపిస్తుంది. దర్శకుడు చెప్పిన కథని నా కోణంలో తెరపైన ఆవిష్కరించడానికే ప్రయత్నిస్తాను. నేను ఏ సినిమా చేసినా, నా వర్కే డామినేట్ చేస్తుందని అనుకోవడంలో నిజం లేదు. కథకి ఏం కావాలో అదే ఇస్తాను. ఎవరైనా అభద్రతా భావంలో ఉంటే నేను డామినేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ► డైరెక్షన్, సినిమాటోగ్రఫీ రెండూ వేర్వేరు. ఈ విభాగాల పని తీరు వేరుగా ఉంటుంది. దర్శకత్వం నా వృత్తి కాదు. అందుకే డైరెక్టర్ (తమిళ చిత్రాలు ‘మీరా, కురుది పునల్, వానమ్ వసప్ప డుమ్’కి దర్శకత్వం వహించారు) గా సక్సెస్ కాలేకపోయాను. భవిష్యత్తులో మెగాఫోన్ పట్టాలన్న ఆలోచన లేదు. -
యంగ్ హీరోస్ డేరింగ్ స్టెప్స్.. ఒక్కసారిగా మారిన ప్లానింగ్!
యంగ్ హీరోస్ అని ఎంత కాలం పిలుపించుకుంటారు. యూత్ ఆడియెన్స్ ను ఎంత కాలం ఎంటర్టైన్ చేస్తారు? అదే పనిగా ఎంత కాలం ప్రేమకథల్లో కనిపిస్తారు? అందుకే ఈ జనరేషన్ యంగ్ హీరోస్ తమ ఇమేజ్ మార్చుకునేందుకు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. స్టార్ హీరోలతో పోటీ పడేందుకు డైరెక్ట్ గా స్టార్ డైరెక్టర్స్ తోనే మూవీస్ కమిట్ అవుతున్న యంగ్ హీరోస్‌పై ఓ లుక్కేద్దాం. హీరోస్‌పై ఓ లనేను శైలజా, ఉన్నది ఒక్కటే జిందగీ హలో గురు ప్రేమ కోసమే లాంటి సినిమాలు చేస్తూ వచ్చిన నర్జిటిక్ స్టార్ రామ్.. పూరి జగన్నాథ్ మేకింగ్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో నయా ఇమేజ్ అందుకున్నాడు. ముఖ్యంగా మాస్ కు బాగా చేరువయ్యాడు. చాక్లెట్ బాయ్ కాస్త ఇప్పుడు ‘వారియర్’ గా మారాడు. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. జూలై 14న ఈ చిత్రం విడుదల కాబోతంది. త్వరలో బోయపాటి తో కలసి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక రామ్ కోరుకుంటున్న ఛేంజ్ ఓవర్.. స్టార్ డైరెక్టర్ తో వచ్చే నయా ఇమేజ్‌ని ఇప్పుడు మిగితా యంగ్ హీరోస్ కావాలనకుంటున్నారు. అందుకే నితిన్ కూడా రామ్ బాట పడ్డాడు. చెక్, రంగ్ దే, మాస్ట్రో లాంటి మూవీస్ తర్వాత నితిన్ చేస్తున్న మాస్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ సురేందర్ రెడ్డితో ఓ మూవీ చేయబోతున్నాడు. అది కూడా పక్కా మాస్ సినిమానే. అలాగే అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమా తెరకెక్కించిన వక్కంతం వంశీతోనూ ఊరమాస్ మూవీ చేస్తున్నాడు. మరోవైపు అక్కినేని నాగచైతన్య కూడా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. వెంకీమామ, లవ్ స్టోరీ, థ్యాంక్యూ చిత్రాల తర్వాత నాగ చైతన్య కూడా ఇప్పుడు స్టార్ డైరెక్టర్ తో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే వెంకట్ ప్రభు తో మూవీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురామ్ తో మూవీ చేయబోతున్నాడు. మొత్తానికి యంగ్ హీరోలు రూటు మార్చి మాస్ బాట పట్టారు. -
లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు: నాగచైతన్య
‘అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను.. ఇక లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు’, ‘నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే..’ అంటూ నాగచైతన్య చెప్పే డైలాగులతో ‘థ్యాంక్యూ’ చిత్రం టీజర్ విడుదలైంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 8న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్‌ని బుధవారం విడుదల చేశారు.‘నువ్వు సెల్ఫ్ సెంట్రిక్ అయ్యావు, నీ లైఫ్‌లో నీకు తప్ప మరో వ్యక్తికి చోటు లేదు’ అంటూ హీరోయిన్ చెప్పే మాటలు కూడా టీజర్లో వినిపిస్తాయి. ‘‘ఈ చిత్రంలో వ్యాపారవేత్త అభిరామ్ పాత్రలో నాగచైతన్య నటిస్తున్నారు. ఓ సక్సెస్ఫుల్ పర్సన్ జీవితంలోని ఫీల్ గుడ్ లవ్ స్టోరీని మా సినిమాలో చూపించబోతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. బీవీఎస్ రవి కథను అందించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: పీసీ శ్రీరామ్. -
గ్లిజరిన్ లేకుండానే ఏడ్చేశాను
Krithi Shetty: ‘‘బంగార్రాజు’ కథని 2020లో విన్నాను. ఆ తర్వాతే ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను చూశాను. అందులోని కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చింది. ఆ రెఫరెన్స్‌తో ‘బంగార్రాజు’ చేసేటప్పుడు ఒత్తిడి అనిపించలేదు. సంక్రాంతి లాంటి చక్కని సినిమా ‘బంగార్రాజు’. ఇందులో తొలిసారి ఫోక్ సాంగ్ చేశాను’’ అని హీరోయిన్ కృతీశెట్టి అన్నారు. అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతీ శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘బంగార్రాజు’లో నాగచైతన్యకి జోడీగా నటించిన కృతీశెట్టి విలేకరులతో మాట్లాడుతూ... ► ‘బంగార్రాజు’ లో నా పాత్ర నాగలక్ష్మి గురించి కల్యాణ్ కృష్ణగారు చెప్పినప్పుడు నవ్వేశాను. ఇలాంటివారు కూడా ఉంటారా? అనిపించింది. అందుకే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నా. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతారనుకుంటున్నా. బీటెక్ చదివిన గ్రామ సర్పంచ్‌గా చేశాను. నా పాత్ర ఫన్‌గా ఉంటుంది. నాగార్జున సార్‌తో సినిమా అన్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో? అనిపించింది. కానీ ఆయన తోటి నటులపై చూపించిన గౌరవం, హుందాతనం చూసి ఆశ్చర్యపోయాను. నేను జూనియర్ అని కాకుండా తోటి టీమ్మేట్లా చూశారు. నాగచైతన్యగారు కూడా చాలా కూల్‌గా, సరదాగా ఉంటారు. ► నేను చదివిన సైకాలజీ సినిమా రంగానికి బాగా ఉపయోగపడింది. సైకాలజీ స్టూడెంట్‌గా అందర్నీ గమనిస్తుంటాను. నాగార్జున సార్ షాట్ లేనప్పుడు చాలా క్లాసీగా మాట్లాడతారు. షాట్ రెడీ అనగానే వెంటనే పాత్రలో లీనమవుతారు.. అది చాలా గ్రేట్. రమ్యకృష్ణగారి నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. ► నేను గ్లిజరిన్ లేకుండా ఏడుపు సీన్స్ చేస్తాను. నటిగా ఎదగడానికి ఉపయోగపడే, నాకు నచ్చిన పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. నాకు సంక్రాంతి గురించి పెద్దగా తెలీదు.. కానీ ‘బంగార్రాజు’ చేస్తున్నప్పుడు తెలిసింది. సంక్రాంతికి ఏ సినిమా విడుదలయినా చూస్తామని నాకు తెలిసిన తెలుగువారు చెప్పడంతో ఇక్కడివారు సినిమాని ఎంతగా ప్రేమిస్తారో అర్థమయింది. ► ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా పూర్తి చేశాను. ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’, రామ్‌తో మరో సినిమా చేస్తున్నాను. లేడీ ఓరియంటెడ్ కథ ఇంకా ఫైనల్ కాలేదు. -
బంగార్రాజు మ్యూజికల్ నైట్ ఈవెంట్ (ఫోటోలు)
-
ప్రతి పాట వజ్రంలా ఉంటుంది
‘‘బంగార్రాజు’ చిత్రంలో ప్రతి పాట ఓ వజ్రంలా ఉంటుంది. ఇది సూపర్ హిట్ ఆల్బమ్. లిరిక్ రైటర్స్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. తెలుగు భాష ఉన్నంత వరకు సాహిత్యం ఉంటుంది’’ అని నాగార్జున అన్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతీ శెట్టి నటించిన చిత్రం ‘బంగార్రాజు’. నాగార్జున నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బంగార్రాజు మ్యూజికల్ నైట్’ లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘అభిమానులందర్నీ ఇక్కడకు పిలవలేకపోయినందుకు క్షమించాలి. జనవరి 14 అన్నపూర్ణ స్టూడియోకు చాలా ముఖ్యమైన తేది. అదే రోజున అన్నపూర్ణ పుట్టింది. యాభై ఏళ్ల క్రితం ‘దసరా బుల్లోడు’తో నాన్నగారు(అక్కినేని నాగేశ్వరరావు) సంక్రాంతికి దుమ్ములేపారు.. ఆ చిత్రం కూడా మ్యూజికల్ హిట్. సినిమా సక్సెస్‌లో సగ భాగం మ్యూజిక్దే. ఆ సగం సక్సెస్‌ను అనూప్‌కు ఇస్తున్నాం. జనవరి 11న ‘బంగార్రాజు’ ట్రైలర్ రాబోతోంది. జనవరి 14 పండుగ రోజున పండుగలాంటి ‘బంగార్రాజు’ ను తీసుకొస్తున్నాం’’ అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ– ‘‘బంగార్రాజు’ ఆడియోను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. అనూప్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. మా లిరిక్ రైటర్స్‌కి థ్యాంక్స్. ఇది పండుగ లాంటి సినిమా. అందరూ చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది’’ అన్నారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ–‘‘సినిమా సక్సెన్ స్థాయిని నిర్ణయించేది సంగీతమే. ‘బంగార్రాజు’ కు ఇంత మంచి సంగీతం ఇచ్చిన అనూప్ రూబెన్స్‌కి థ్యాంక్స్. నాగ్ సర్ ప్రతి సినిమా మ్యూజికల్‌గా బ్లాక్‌బస్టరే. ‘బంగార్రాజు’ పాటలు కూడా అలాగే ఉంటాయి. ఇండస్ట్రీలో బంగార్రాజు అంటే నాగ్ సారే.. ఇప్పుడు ఆయ నకు పోటీగా చిన్న బంగార్రాజు(నాగచైతన్య) ఎక్కడా తగ్గలేదు’’ అన్నారు. ‘‘ఈ మ్యూజికల్ నైట్తోనే సంక్రాంతి ప్రారంభమైనట్టుంది’ అని నిర్మాత జీ స్టూడియోస్ ప్రసాద్ అన్నారు. హీరోలు సుమంత్, సుశాంత్, నిర్మాత నాగ సుశీల, కెమెరామేన్ యువరాజ్, హీరోయిన్లు ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్ మాట్లాడారు. -
ఏపీలో టికెట్ల ధర విషయంలో నాకు ఇబ్బంది లేదు
‘‘ఏపీలోని సినిమా టికెట్ ధరల విషయంలో నాకు ఏ ఇబ్బంది లేదు.. నా సినిమాకు ఇబ్బంది లేదు. టికెట్ల ధరలు తక్కువ ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువగా వస్తాయి. టికెట్ల ధరలు పెరుగుతాయని సినిమాని జేబులో పెట్టుకుని కూర్చోలేం. నెంబర్స్ ప్రతి ఏడాది మారుతూనే ఉంటాయి. ఈ నెంబర్ గేమ్స్ నుంచి నేనెప్పుడో బయటకు వచ్చాను’’ అని నాగార్జున అన్నారు. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ పతాకాలపై నాగార్జున నిర్మించారు. బుధవారం జరిగిన ఈ సినిమా ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ – ‘‘ఇంత పెద్ద సినిమాను టైమ్‌కు రిలీజ్ చేయగలమా అనుకున్నాం. కానీ మా సినిమా రిలీజ్ డేట్‌ను నిన్ననే (మంగళ వారం) ఫిక్సయ్యాం. జనవరి 14న ‘బంగార్రాజు’ని విడుదల చేస్తున్నాం. సినిమా ఇంత తొందరగా ఎలా పూర్తయిందో నాక్కూడా తెలియడం లేదు. ఇందులో ఏదో సూపర్ పవర్ ఉంది. నా టీమ్ కృషి వల్లే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించగలిగాం. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్‌తో బిజీగా ఉండటం వల్లే నాగచైతన్య ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. ఇక ఈ సినిమా విడుదల గురించి నెగటివ్ ఆలోచనలు లేవు. నేనెప్పుడూ పాజిటివ్ ఆలోచనలతోనే ముందుకు వెళతాను. ముందుగా రిలీజ్ డేట్‌ను ప్రకటిద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడే చూసుకుంటాడు’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఆర్ఆర్ ఆర్’, ‘రాధేశ్యామ్’ విడుదల వాయిదా పడటం బాధగా ఉంది. వాళ్లెంత కష్టపడ్డారో నాకు తెలుసు. అయినా ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ ఉన్నా కూడా ‘బంగార్రాజు’ను విడుదల చేసేవాళ్లం. సంక్రాంతికి కనీసం మూడు సినిమాలు రావాలి. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా వచ్చినప్పుడు కూడా 4 సినిమాలు విడుదలయ్యాయి. నా కెరీర్‌కు ‘ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, జానకిరాముడు’లా నాగచైతన్యకు ‘బంగార్రాజు’ ప్లస్ అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు నాగార్జున. ‘‘ఈ సినిమాలో నాగార్జునగారికి, నాగచైతన్యలకు సమానమైన సన్నివేశాలు ఉంటాయి. ప్రసాద్‌గారు నాకు సోదరుడు వంటివారు. బాగా సహకరించారు. అనూప్ రూబెన్స్ అద్భుతమైన పాటలు అందించారు’’ అని కల్యాణ్ కృష్ణ అన్నారు. ‘‘నాగార్జునగారి ఎనర్జీని ఎవ్వరితోనూ మ్యాచ్ చేయలేం. చైతన్యతో పని చేయడం ఈజీ. సర్పంచ్ నాగలక్ష్మి (సినిమాలో కృతీ పాత్ర పేరు) పటాకాలా అనిపిస్తుంది. ఈ పాత్రను ఎంజాయ్ చేస్తూ చేశాను’’ అని కృతీ శెట్టి అన్నారు. ‘‘బంగార్రాజు’ సినిమా ఆఫర్ మాకు రావడంతో ఇది నిజంగానే బంగారం లాంటి సినిమా అనుకున్నాం. నాగార్జునగారు, నాగచైతన్య కలిసి నటించడంతో సినిమా ఇంకా ప్రతిష్టాత్మకంగా మారింది’’ అని జీ అధినేత ప్రసాద్ అన్నారు. ‘‘లడ్డుందా, వాసివాడి తస్సాదియ్యా’ పాటలకు మంచి స్పందన వచ్చింది. ‘సోగ్గాడే..’లో ‘డిక్క డిక్క డుం డుం..’ పాటను నాగ్ సార్‌తో పాడించాం. ఇందులో కూడా పాడించాలని అనుకున్నాం. ‘లడ్డుందా...’ పాట విన్నాక మొత్తం పాడేస్తా అన్నారు నాగార్జునగారు’’ అని సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ అన్నారు. -
ఇలాంటి సమయంలో సెలబ్రేషన్ కావాలి!
‘‘అఖిల్ ఓ సినిమా ఫలితం కన్నా దానికి ప్రిపేర్ అయ్యే విధానాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు.. తనలో అదే నాకు బాగా ఇష్టం. రానున్న ఐదారేళ్లల్లో ఎలాంటి సినిమాలు, ఎలాంటి పాత్రలు చేయాలనే మాస్టర్ ప్లాన్ తన మైండ్‌లో ఉంటుంది. ‘సిసింద్రీ’ నుంచి ఇప్పటివరకు తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. ప్రతి ఏడాది ఇంట్లో కొత్త అఖిల్‌ని చూస్తుంటాను.. తను ఓ సినిమాకి అంత అంకితం అవుతాడు’’ అన్నారు నాగచైతన్య. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో దర్శకడు వాసూ వర్మతో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిపిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘నా తొలి చిత్రం ‘జోష్’కి వాసూ వర్మ దర్శకత్వం వహించారు.. ఆ సినిమాతో చాలా నేర్చుకున్నాను. బన్నీ వాసుతో ‘100›పర్సెంట్ లవ్’ చిత్రం చేశాను. తన ప్రయాణం చూస్తే గర్వంగా ఉంది. అరవింద్‌గారు కథ ఓకే చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అంటారు.. అది అలాగే ఉండాలి. ఒక సక్సెస్ఫుల్ మూవీ తీయాలంటే అంత కేర్ ఉండాలి.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ చూస్తుంటే ఓ సెలబ్రేషన్‌లా అనిపించింది.. ఇలాంటి సమయంలో థియేటర్స్‌లో మన ప్రేక్షకులకు సెలబ్రేషన్ కావాలి.. ఈ సినిమా ఆ సెలబ్రేషన్‌ని ఇస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో అఖిల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పగలను. భాస్కర్ ఈ సినిమాను బాగా తీశాడు’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అంటే రామానాయుడుగారిని చూశాం.. ఇప్పుడు అరవింద్‌గారిని చూస్తున్నాం. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి యూత్‌ఫుల్ సినిమాతో అఖిల్ హిట్ కొట్టబోతున్నాడు’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఓ మంచి సినిమా తీశానని గర్వంగా చెప్పుకోగలిగిన సినిమా ఇది. చైతూగారి ‘100 పర్సెంట్ లవ్’ సినిమాతో నిర్మాతగా మారాను. ఇప్పుడు అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నా కెరీర్‌ను మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘ఈ టీమ్‌లో నన్ను భాగస్వామి చేసిన అరవింద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు వాసూ వర్మ. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘మీ వెనకాల (నాగచైతన్య, అఖిల్) అక్కినేని లాయల్ ఫ్యాన్స్ ఎప్పుడూ ఉంటారు. అయితే అఖిల్‌ని తెలుగు ప్రేక్షకులందరి వద్దకూ చేర్చాలన్నదే నా ప్రయత్నం.. అది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో కచ్చితంగా జరుగుతుంది’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ – ‘‘నాపై నమ్మకం ఉంచిన అక్కినేని అభిమానులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టే వరకు నేను నిద్రపోను.. నాకు నిద్ర రాదు. నేను నిద్రపోలేను. ఇది ఖాయం’’ అన్నారు. హీరోయిన్ పూజా హెగ్డే, నటి ఆమని, సంగీత దర్శకుడు గోపీ సుందర్, దర్శకులు హరీష్ శంకర్, మారుతి, నిర్మాత అల్లు బాబీ, పాటల రచయిత శ్రీమణి తదితరులు పాల్గొన్నారు. -
చైతూ, శేఖర్‌పై ప్రశంసలు కురిపించిన నాగార్జున
‘‘దేశంలో కోవిడ్ మరణాలు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. భారత ప్రభుత్వం కానీ, ప్రత్యేకించి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు, తెలంగాణ సీఎం కేసీఆర్‌గారు మంచి నిర్ణయాలు తీసుకుని కరోనా నివారణకు చర్యలు తీసుకున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీపై కరోనా ప్రభావం కాస్త ఎక్కువ ఉంది. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో థియేటర్లు తెరవలేదు. తెలంగాణలో 100 శాతం, ఆంధ్రాలో అక్కడి పరిస్థితులను బట్టి 50 శాతం థియేటర్లు తెరిశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని మంచి చూపే చూశాయి’’ అన్నారు నాగార్జున. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మ్యాజికల్ సక్సెస్ మీట్ ఆఫ్ లవ్ స్టోరీ’లో నాగార్జున మాట్లాడుతూ –‘‘కొన్ని వారాల క్రితం విడుదలైన ఓ హిందీ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు నాలుగు కోట్లు షేర్ వస్తే.. ‘లవ్‌స్టోరీ’కి ఏడు కోట్లు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కోటి నమస్కారాలు. శేఖర్ సెన్సిటివ్ డైరెక్టర్.. కానీ అదొక్కటే సరిపోదు. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బ్యాలెన్స్ చేసి తీయాలి.. శేఖర్ అది నేర్చుకున్నాడు. చైతన్యను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఈ సినిమా చూశాక ఇంకా సంతోషమేసింది. యాక్టర్ అండ్ స్టార్.. ఇవి రెండూ డిఫరెంట్ పదాలు. చైతూను ఒక స్టార్ యాక్టర్‌గా తయారు చేశాడు శేఖర్. చైతూ.. బాగా నటించావ్. ఈ సినిమా చూసి నేను నవ్వేలా, ఏడ్చేలా చేశావ్. ‘ప్రేమనగర్’ రిలీజ్ టైమ్‌లో తుఫాన్, సైక్లోన్ అన్నీ ఉన్నా నాన్నగారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇప్పుడు తుఫాన్, కోవిడ్, సైక్లోన్‌తో పోరాడి ‘లవ్‌స్టోరీ’ గొప్ప విజయాన్ని సాధించింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్ కావడం టాలీవుడ్‌కు శుభపరిణామం’’ అన్నారు నారాయణ్‌దాస్ నారంగ్. ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లుగా నాతో పాటు ప్రయాణం చేసిన యూనిట్‌కి థ్యాంక్స్. ఇండస్ట్రీకి చిరంజీవిగారు ఎలా పెద్దగా నిలబడ్డారో మా సినిమాకి కూడా అలాగే నిలబడ్డారు.. ఆయన రాకతో మా సినిమాకి మాంచి కిక్ వచ్చింది’’ అన్నారు శేఖర్ కమ్ముల. నాగచైతన్య మాట్లాడుతూ –‘‘ఆడియన్స్ వస్తారా? రారా? అనే టైమ్‌లో వారు థియేటర్స్‌కు వచ్చి మా సినిమాను ఆదరించారు. శేఖర్గారి కంటెంట్ పవర్ ఏంటో సెప్టెంబరు 24న తెలిసింది. సినిమా స్టార్ట్ చేశాక శేఖర్‌గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోని వారి నిజాయతీ చూసి ఈ సినిమా కోసం ఎంతైనా కష్టపడొచ్చని ఫిక్సైపోయాను’’ అన్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ –‘‘మా తాతగారు ‘అన్నమయ్య’ చూస్తున్నప్పుడు.. ఆత్మ దేవునితో ఐక్యమయ్యే సీన్‌ని ఏడుస్తూ.. దండం పెడుతూ చూసేవారు. ఆయన యాక్ట్ చేస్తున్నారు తాతయ్యా అనేదాన్ని. నేను ఇండస్ట్రీ వచ్చాక అర్థం అయ్యింది.. ఒక పాత్రను మనం చేస్తే అది నిలిచిపోయేలా చేయాలని నాకు నేర్పిన మీకు (నాగార్జున) థ్యాంక్స్. ‘లవ్‌స్టోరీ’కి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో అని థియేటర్స్‌కి వెళ్లా. వారి రియాక్షన్ చూసి కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు. సురేశ్ బాబు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కర భట్ల, పవన్ సీహెచ్, మంగ్లీ, రోల్ రైడా, ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు. -
Nagarjuna Bangarraju Movie: మైసూర్లో బంగార్రాజు
‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో నాగార్జున– దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ‘బంగార్రాజు’ ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతోంది. నాగార్జున–నాగచైతన్యలు పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట కల్యాణ్ కృష్ణ. ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీలో నాగార్జున పక్కన గ్రేస్‌ఫుల్‌గా కనిపించిన రమ్యకృష్ణ ‘బంగార్రాజు’ లోనూ నటిస్తున్నారు. నాగచైతన్య సరసన ‘ఉప్పెన’ ఫేమ్ కృతీ శెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకాలపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, సత్యానంద్ స్క్రీన్‌ప్లే సమకూర్చారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
అమీర్‌తో ఖాన్‌కు ఫ్రెండ్‌గా నాగ చైతన్య..
గురువారం నుంచి నాగచైతన్య హిందీ సంభాషణలు పలుకుతున్నారు. అలాగే యుద్ధం కూడా చేస్తున్నారు. హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ కోసమే ఇదంతా. ఇందులో చైతూ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. లాల్‌సింగ్ చద్దా (ఆమిర్ పాత్ర పేరు) ఆర్మీలో ఉన్నప్పుడు అతని స్నేహితుడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలిసింది. చైతూది కూడా ఆర్మీ మ్యాన్ పాత్ర అని టాక్. అందుకే ప్రత్యేకంగా ట్రైనర్‌ని పెట్టుకుని, మేకోవర్ అయ్యారని తెలిసింది. గురువారం లడఖ్‌లో ఆరంభమైన ఈ సినిమా సెట్స్‌లోకి ఆమిర్ ఖాన్, నాగచైతన్య తదితరులు ఎంటరయ్యారు. కొన్ని టాకీ సీన్స్‌తో పాటు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఈ సీన్స్‌ని హాలీ వుడ్ స్టంట్ మాస్టర్స్ డిజైన్ చేస్తున్నారట. దాదాపు 20 రోజులు ఈ చిత్రీకరణలో పాల్గొంటారట నాగచైతన్య. -
బంగార్రాజుకు స్నేహితురాలిగా సీనియర్ నటి?
‘సోగ్గాడే చిన్ని నాయనా’లో బంగార్రాజుగా మంచి జోష్ ఉన్న పాత్రలో నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇది తండ్రి పాత్ర. ఇందులో తనయుడి పాత్రనూ ఆయనే చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సోగ్గాడే...’కి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందనుంది. మొదటి భాగంలో కనిపించినట్లుగానే ఇందులోనూ పలువురు కలర్‌ఫుల్ తారలు కనిపిస్తారట. వాళ్లల్లో జయప్రద ఒకరనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ఉన్న ఒక కీలక పాత్రకు జయప్రదను సంప్రదించారట చిత్రదర్శకుడు కల్యాణ్‌కృష్ణ. మరి.. బంగార్రాజుకు స్నేహితురాలిగా జయప్రద కనిపిస్తారా? లేక వేరే ఏదైనా పాత్రా అనేది తెలియాల్సి ఉంది. జయప్రద ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, డేట్స్ కూడా కేటాయించారని టాక్. ‘సోగ్గాడే..’లో నాగ్‌కి జోడీగా నటించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలోనూ ఆ పాత్రను చేస్తారని తెలిసింది. నాగచైతన్య కూడా ఈ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. షూటింగ్ ఆరంభించడమే ఆలస్యం అని సమాచారం. -
‘లవ్‌స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్ క్లారిటీ
‘లవ్‌స్టోరీ’లో కన్ఫ్యూజన్ ఏం లేదంటున్నారు నాగచైతన్య. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయాలనుకున్నారు. అయితే ‘లవ్‌స్టోరీ’ ఏప్రిల్ 16న విడుదల కావడం లేదనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో మొదలైంది. ఈ విషయంపై చిత్రబృందంæస్పందించింది. ‘‘విడుదల విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ముందు చెప్పినట్లుగానే ఏప్రిల్ 16న విడుదల చేస్తాం. మా ఈ అందమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతం అందించారు. -
రాజమండ్రిలో థ్యాంక్యూ
‘‘చెప్పాల్సిన టైమ్‌లో థ్యాంక్యూ చెప్పడం అవసరం’’ అని కొన్ని రోజుల క్రితం నాగచైతన్య అన్నారు. ప్రస్తుతం ఆయన ‘థ్యాంక్యూ’ అనే సినిమా చేస్తున్నారు. అందుకే అలా అన్నారు. ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్‌తో మళ్లీ నాగచైతన్య చేస్తున్న సినిమా ఇది. వారం క్రితం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రిలో ఆరంభమైంది. మరోవారం పాటు జరుగుతుంది. ఇప్పటికే ఒక పాట చిత్రీకరించారు. ప్రస్తుతం సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇందులో చైతూ సరసన ఇద్దరు నాయికలు నటిస్తారు. ఇంకా కథానాయికలను అధికారికంగా ప్రకటించలేదు. అలాగే ఓ ప్రముఖ హీరోయిన్ కీలక పాత్ర చేస్తారని టాక్. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. -
లవ్ స్టోరీ చిత్రానికే హైలైట్.. ‘సారంగధరియా..’
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరి’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేష¯Œ ్స పతాకాలపై కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఈ చిత్రంలో ‘సారంగధరియా..’ అంటూ సాగే మూడో పాటని హీరోయిన్ సమంత ఈ నెల 28న విడుదల చేయనున్నారు. కె.నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ– ‘‘శేఖర్ కమ్ముల చిత్రంలో పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ‘లవ్ స్టోరి’ చిత్రంలో పాటలకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకు తగినట్లే పవన్ సీహెచ్ మంచి సంగీతం అందించారు. ఇప్పటికే తొలి పాటగా రిలీజ్ చేసిన ‘హే పిల్లా..’ దాదాపు 15 (కోటీ యాభై లక్షలు) మిలియన్ల వ్యూస్ సాధించింది. రెండో పాట ‘నీ చిత్రం చూసి’కి 3 మిలియన్లపైగా వ్యూస్ వచ్చాయి. మూడో పాట ‘సారంగధరియా..’ లవ్ స్టోరీ చిత్రానికే హైలైట్‌గా ఉండబోతోంది. ఈ పాటలో సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి.కుమార్, సహ నిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వరరావు. -
ఫైనల్ విన్నాక ఫైనలైజ్!
అన్నం ఉడికిందా? లేదా అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకు చూస్తే చాలంటారు. అలాగే స్టోరీ బాగుంటుందా? లేదా అని తెలుసుకోవడానికి ‘స్టోరీ లైన్’ వింటే చాలని కొందరు సినీ ప్రముఖులు అంటుంటారు. లైన్ నచ్చితే మొత్తం కథ రెడీ చేయమని అడుగుతారు. ప్రస్తుతం నాగచైతన్యకి ఒక స్టోరీ లైన్ నచ్చిందట. కథ పూర్తి చేసి, ఫైనల్ వెర్షన్ వినిపిస్తే, సినిమా ఫైనలైజ్ చేస్తారట. ఇంతకీ చైతూ ఈ సినిమాని ఎవరితో చేస్తారంటే, ‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్‌తో అని తెలిసింది. ఇటీవల తరుణ్ చెప్పిన లైన్ చైతూకి నచ్చి, ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నారని సమాచారం. అంతా ఓకే అయితే వచ్చే ఏడాది ఈ కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కుతుంది. -
అతిథులు వీళ్లేనా బాస్?
బిగ్‌బాస్ సీజన్ 4 ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. రేపే గ్రాండ్ ఫినాలే. విజేత ఎవరో ప్రకటించే రోజు. ప్రతీ సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌కి హోస్ట్‌తో పాటు ఎవరో ఒక సెలబ్రిటీ గెస్ట్‌గా వస్తుంటారు. సీజన్ 3 ఫైనల్‌కి నాగార్జునతో కలసి చిరంజీవి సందడి చేశారు. ఈసారి నాగార్జునతో పాటు ఫైనల్లో సందడి చేయడానికి ‘లవ్‌స్టోరీ’ జంట రాబోతున్నారని తెలిసింది. నాగచైతన్య, సాయి పల్లవి ఈ సీజన్ ముఖ్య అతిథులుగా ఫైనల్ ఎపిసోడ్లో పాల్గొంటారట. ‘లవ్‌స్టోరీ’ సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరే కాకుండా పలువురు హీరోయిన్లు కూడా కనిపిస్తారట. లక్ష్మీ రాయ్, మెహరీన్లతో పాటు ఇంకొంతమంది హీరోయిన్ల స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటుందని తెలిసింది. ∙ -
ప్రేమతో ఓ బహుమతి
నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్‌స్టోరీ’. కరోనా బ్రేక్ తర్వాత ఇటీవలే మళ్లీ చిత్రీకరణ ప్రారంభం అయింది. ఈ చిత్రబృందం చైతన్య అభిమానులకు ఓ బహుమతి ప్లాన్ చేసిందని సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ నార ంగ్ నిర్మాత. ఈ నెల 20న దివంగత నటులు, నాగచైతన్య తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఓ టీజర్‌ను ఆ రోజు విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ‘లవ్‌స్టోరీ’ను పూర్తి చేస్తున్నారు. మరో వారం రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నారు. ఈ చిత్రానికి పవన్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. -
థియేటర్లోనే ప్రేమకథ
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఎమిగోస్ క్రియేష¯Œ్స, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె.నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. శనివారం నాగార్జున బర్త్ డే సందర్భంగా ‘లవ్ స్టోరీ’ మేకర్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా నుండి ఓ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ‘‘15 రోజులు షూటింగ్ మినహా సినిమా పూర్తయింది. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టాక షూటింVŠ ప్రారంభిస్తాం. సరైన సమయంలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వర రావు. చైతన్య–విక్రమ్‌ల థ్యాంక్యూ నాగచైతన్య హీరోగా తెరకెక్కనున ్న 20వ చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించనున్నారు. ‘‘చైతు, విక్రమ్ కాంబినేష¯Œ లో వచ్చిన క్లాసిక్ మూవీ ‘మనం’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబినేషన్లో మరో సినిమా చేయనుండటం ఆనందంగా ఉంది’’ అని నిర్మాతలు తెలిపారు. -
ఎమర్జెన్సీ నేపథ్యంలో...
సుమంత్, నందితా శ్వేతా జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘కపటధారి’. జి.ధనుంజయన్ సమర్పణలో లలితా ధనుంజయన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. సోమవారం ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి, సినిమా పెద్ద హిట్ కావాలని టీమ్‌కు అభినందనలు తెలిపారు హీరో నాగచైతన్య. పోస్టర్‌పై ఆర్టికల్ 352 అని ప్రత్యేకంగా రాసి ఉంది. అంటే.. ఈ సినిమా ఎమర్జెన్సీ నేపథ్యంలో ఉంటుందని ఊహించుకోవచ్చు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
సినిమా మీద ప్రేమ తగ్గదు
‘‘ముప్పై ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీతో నాకు అనుబంధం ఉంది. చిత్రపరిశ్రమ నాకు తల్లిలాంటిది. ఈ పరిశ్రమ నాపై కొన్ని బాధ్యతలు పెట్టింది. వాటిని సక్రమంగా నెరవేర్చేందుకు కృషి చేస్తాను’’ అని నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ అన్నారు. ఏషియన్ సినిమాస్ సంస్థను ప్రారంభించి 30 ఏళ్లుగా చిత్ర పంపిణీ రంగంలో కొనసాగుతున్న నారాయణదాస్ నారంగ్ పుట్టినరోజు నేడు (జూలై 27). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటిదాకా దాదాపు 650 చిత్రాలను పంపిణీ చేశాను. అందులో చిత్ర పరిశ్రమ గర్వించే ‘బాహుబలి, బాహుబలి 2’ చిత్రాలు ఉండటం విశేషం. సినిమా మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. మహేశ్‌బాబుతో కలిసి ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాను. ఎమిగోస్ క్రియేష¯Œ్స, పి. రామ్మోహన్ రావుతో కలిసి ‘లవ్ స్టోరీ’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా 15 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. మా తర్వాతి సినిమా కూడా శేఖర్ కమ్ములతోనే చేయబోతున్నాం. ఇందులో ఒక పెద్ద హీరో నటిస్తారు’’ అన్నారు. -
ఈ విజయానికి కారణం మా యూనిట్ – వెంకటేశ్
‘‘మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో యూనిట్ అంతా ఎంతో కష్టపడటంతోనే ఇంత పెద్ద సక్సెస్‌ను అందుకున్నాం. ‘వెంకీమామ’ సినిమాను బాగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. చిరంజీవిగాకి, మహేశ్‌బాబుకి కూడా మా సినిమా నచ్చడంతో అభినందించారు.. ఇందుకు వారిద్దరికీ ధన్యవాదాలు’’ అని వెంకటేశ్ అన్నారు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా, పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిరి్మంచిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ గా ఉండేది. విడుదల తర్వాత చాలా సంతోషంగా ఉంది. అందరూ సినిమాను తమదిగా భావించి ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరు మామలు కలిసి కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో నాకు చూపించారు. మాకే కాదు.. ఇది తాతగారి (రామానాయుడు) కల.. తాతగారి సక్సెస్. అందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘నా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూశాను. అంతా బాగా ఎంజాయ్ చేశారు’’ అన్నారు రాశీఖన్నా. ‘‘మనం రేపు మాట్లాడుకునే సినిమాల్లో ‘వెంకీమామ’ ఒకటిగా నిలుస్తుందని కచి్చతంగా చెప్పగలను’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. ‘‘ఈ సక్సెస్ రెండేళ్ల కష్టం. హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నా జీవితంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం. వెంకటేశ్‌గారు, చైతన్యగారి పాజిటివిటీ వల్లే ఈ సినిమా తీయగలిగాను’’ అన్నారు కె.ఎస్.రవీంద్ర. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘వెంకటేశ్‌గారు, చైతన్యగారితో సినిమా అనగానే ఎగ్జయిట్ అయ్యి ‘వెంకీమామ’ చేశాను’’ అన్నారు సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్. ‘‘ఇంటి భోజనం తింటే ఎలా ఉంటుందో ‘వెంకీమామ’ చూస్తుంటే అలా అనిపించింది’’ అన్నారు డైరెక్టర్ నందినీ రెడ్డి. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, చందూ మొండేటి, నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి
‘‘37 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్నాను. మన పాత హిట్ సినిమాలతో పోలిస్తే ఇప్పుడు సినిమాలు సంతృప్తిగా అనిపించవు. హిట్ అవుతాయి. కానీ ఏదో వెలితిగా ఉంటుంది. సొంత యాక్టర్స్‌ని పెట్టి సరైన సినిమాలు తీయకపోతే ప్రేక్షకులు నవ్వుతారనే భయం ఉంటుంది. అందుకే కథలను సులువుగా అంగీకరించలేను’’ అన్నారు సురేశ్‌బాబు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ‘వెంకీ మామ’. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ శుక్రవారం చిత్రం రిలీజ్ సందర్భంగా సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు. సురేశ్‌బాబు మాట్లాడుతూ – ‘‘వెంకీ మామ’ కథను జనార్థన మహర్షి రాశారు. ఐడియా బావుంది. కానీ ట్రీట్మెంట్లో చాలా మార్పులు చేయాల్సి ఉంది. ఈ ఐడియాను కోన వెంకట్‌కు చెప్పాను. వర్క్ చేయొచ్చు అన్నారు. బాబీ పేరుని కోన వెంకట్ సూచించారు. బాబీ తన టీమ్‌తో తన స్టయిల్లో వర్క్ చేసి నాకు చెప్పాడు. మామాఅల్లుడి బంధాన్ని చూపించే ఓ సన్నివేశాన్ని నాకు వివరించగానే నా కళ్లలో నీళ్లు ఆగకుండా వచ్చాయి. ఈ సినిమా చేస్తున్నాం అన్నాను. ‘వెంకీ మామ’ సినిమా సూపర్, బంపర్ అలాంటివి చెప్పలేను. పూర్తి స్థాయి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. వెంకటేశ్, నాగచైతన్య కెమిస్ట్రీ హైలైట్‌గా ఉంటుంది. వెంకీ, చైతన్య ఇద్దరి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా. ఇంతకుముందు కథ విన్న తర్వాత ‘కానీ... ఏదో మిస్ అయింది’ అనేవాణ్ణి. ఇప్పుడు ఏం మిస్ అయిందో చెప్పగలుగుతున్నాను. సినిమా గురించి ఎక్కువ తెలుసుకుంటున్న కొద్దీ అందులో తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కథ చెప్పే దశలోనే ఉన్న సందేహాలు ఎక్కువగా అడిగేస్తుంటాను. కథలు అంత సులువుగా ఓకే చేయనని కూడా అనుకోవచ్చు(నవ్వుతూ). ఇంతకుముందు షూటింగ్‌కి వెళ్లాక కూడా డౌట్స్ అడిగేవాణ్ణి. ఇప్పుడు వేలు పెట్టడం తగ్గించేశాను(నవ్వుతూ). గుణశేఖర్ దర్శకత్వంలో రానా చేసే ‘హిర ణ్య’కు రెండేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్‌ను సక్రమంగా అనుసరించి ఆ సినిమాను తక్కువ టైమ్‌లో వరల్డ్ క్లాస్ మూవీగా రూపొందించనున్నాం. ‘అసురన్’ రీమేక్‌తో పాటు, తరుణ్ భాస్కర్‌తో, త్రినాథరావు నక్కినలతో సినిమాలు చేస్తారు వెంకటేశ్. టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘సురేశ్ ప్రొడక్షన్స్‌తో కలిసి పని చేయడంతో నమ్మకం ఏర్పడింది. ఈ కథను మొదట వివేక్ కూచిభొట్ల విన్నారు. ఆ తర్వాత సురేశ్‌బాబుగారి దగ్గరకు తీసుకెళ్లాం. దేనికైనా ప్లానింగ్ ముఖ్యం. మా బేనర్లో 20 సినిమాల వరకూ సిద్ధం కాబోతున్నాయి’’ అన్నారు. ► ‘వెంకీ మామ’ను దసరాకు రిలీజ్ చేయాలనుకున్నాం. వెంకటేశ్ కాలికి గాయం కావడంతో ఆలస్యం అయింది. నవంబర్ అనుకున్నాం. ఆ తర్వాత డిసెంబర్ 13కి ఫిక్స్ చేశాం. రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యాం. సంక్రాంతి పండక్కి రిలీజ్ చేయాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ లేదు. ► డిజిటల్ మాద్యమాలు అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ రావడంతో థియేటర్‌కి వెళ్లే ప్రేక్షకులు తగ్గుతున్నారు అంటున్నారు. వాళ్లను థియేటర్‌కి రప్పించే సినిమాలు చేయడం మీద దృష్టిపెట్టాలి. హీరోలందరూ ఏడాదికి రెండు సినిమాలు చేస్తే బావుంటుంది. సినిమా మేకింగ్‌లో చాలా శాతం అసమర్థత కనిపిసోంది. దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ► గతంలో దాసరి గురువు పాత్రను పోషించారు. ఇప్పుడు ఎవరూ ఆ బాధ్యతను తీసుకోవడంలేదనే ప్రశ్నకు స్పందిస్తూ – ‘‘దాసరిగారిని గురువులా అందరూ అంగీకరించారు. ఆ స్థానంలో ఇప్పుడు ఎవర్నీ అంగీకరించలేకపోతున్నారు’’ అని అన్నారు. -
ఖమ్మంలో ‘వెంకీ మామ’
సాక్షి, ఖమ్మం: ఖమ్మం పట్టణంలో వెంకీమామ చిత్రబృందం తళుక్కుమంది. హీరోహీరోయిన్లు విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్‌రాజ్‌పుత్‌లు అభిమానులను హోరెత్తించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక శనివారం రాత్రి ఖమ్మంలోని లేక్‌వ్యూ క్లబ్ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బృందంలోని సింగర్స్ పాడిన పాటలు.. సత్యమాస్టర్ బృందం నృత్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్, లేక్‌వ్యూ క్లబ్ అధినేత దొడ్డ రవి పర్యవేక్షణలో జరిగిన ఈ ఉత్సవం హైలెట్‌గా నిలిచింది. ఖమ్మానికి తొలిసారిగా వచ్చిన తమ అభిమాన నటుడు వెంకటేశ్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్‌ను హీరోలు వెంకటేశ్, నాగచైతన్య విడుదల చేశారు. వేదికపై హీరోయిన్లు పాయల్‌రాజ్‌పుత్, రాశీఖన్నాలతో కలిసి హీరోలు, డైరెక్టర్ బాబీ, యాంకర్ శ్రీముఖి చిత్రంలోని కొకొకోలా పెప్సీ.. వెంకీమామ సెక్సీ పాటకు స్టెప్లు వేయడంతో ప్రాంగణం కేరింతలతో హోరెత్తిపోయింది. యాంకర్ శ్రీముఖి, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర చేసిన స్కిట్లు నవ్వుల్లో ముంచెత్తాయి. ఈ సందర్భంగా హీరో వెంకటేశ్ మాట్లాడుతూ వెంకీమామ సినిమా మంచి కథతో ప్రారంభమైందని, దర్శకుడు బాబీ బాగా తీశాడని, పెద్ద హిట్ అవుతుందన్నారు. ఇప్పటివరకు తాను నాగచైతన్యకు మాత్రమే మామనని, వెంకీమామ సినిమా తర్వాత అందరికీ మామనవుతానని పేర్కొన్నారు. అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ మనం, వెంకీమామ సినిమాలు జీవితంలో గుర్తుండిపోయేవని తెలి పారు. థమన్ మ్యూజిక్, బాబీ దర్శకత్వం, సు రేశ్బాబు, టీజీ విశ్వప్రసాద్ల నిర్మాణం ఈ సి నిమాకు అదనపు బలమన్నారు. ప్రొడ్యూసర్లు సురేశ్‌బాబు, విశ్వప్రసాద్, డైరెక్టర్ బాబి మాట్లాడుతూ ఈ నెల 13న విడుదలవుతోందన్నారు. -
నాన్నా... ఈ సినిమా మీ కోసమే
‘‘వెంకీమామ’ పక్కా తెలుగు చిత్రం. వల్గారిటీ తప్ప సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి’’ అన్నారు డి. సురేష్‌బాబు. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. పాయల్‌రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ ‘వెంకీమామ’ ప్రత్యేకమైనది. రానా, నాగచైతన్యలతో కలిసి పని చేయాలనుకుంటాను. ఆ కల నేరవేరిందని చెప్పొచ్చు. నాన్నగారు (డి.రామానాయుడు) మా అందరితో సినిమా చేయాలనుకునేవారు. నాన్నగారు ఉండి ఉంటే ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసేవారు. ‘నాన్నా.. ఈ సినిమా మీ కోసమే’. ఇందులో నాగచైతన్య ఆల్‌రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. మామా అల్లుళ్ల కథను చాలా సెన్సిబుల్‌గా తెరకెక్కించాడు బాబీ. తమన్ మంచి సంగీతం ఇచ్చాడు’’ అన్నారు. ‘‘నేను ఎన్ని సినిమాలు చేసినా ‘మనం, వెంకీమామ’ నాకు మంచి జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. కాస్త ఆలస్యమైనా సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయాలనే నా ఆశ నేరవేరింది. ‘ప్రేమమ్’ సినిమాలో ఓ చిన్న సన్నివేశంలో మామయ్య వెంకటేష్‌గారితో కలిసి నటించినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పుడు ‘వెంకీమామ’లో మామయ్యతో కలిసి చేయడం చాలా సంతోషంగా ఉంది. రాశీతో కలిసి ఇంకా సినిమాలు చేయాలని ఉంది’’ అన్నారు నాగచైతన్య. ‘‘వెంకీమామ’ సినిమా షూటింగ్ టైమ్‌లో నా మామయ్య సురేంద్ర నాకు గుర్తుకు వచ్చారు. అలా ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్ల జీవితాల్లోని వారి మామయ్యలు గుర్తుకు వస్తారు. బాబీ సినిమాను బాగా తీశాడు. నాకు సినిమా అంటే చాలా భయం. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాను. నాకంటూ ఓ అభిప్రాయం ఉన్నప్పటికీ ఇతరుల అభిప్రాయల కోసం కంగారుగా ఎదురుచూస్తుంటాను. ఈ సినిమాను తొలిసారి తమన్ చూశాడు. చాలా ఎమోషనల్‌గా ఉందన్నాడు. వెంకటేశ్, నాగచైతన్యలు కూడా చూసి బాగుందన్నారు. మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమా నచ్చిందన్నారు. చివర్లో వచ్చి సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేసిన ప్రకాశ్‌రాజ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు డి. సురేష్‌బాబు. ‘‘సురేష్‌బాబుగారికి కథ చెప్పబోతున్నాను అన్నప్పుడు కొందరు భయపెట్టారు. ఆయన బుక్ లాంటి వారు అన్నారు. నేను కథ చెప్పిన తర్వాత ‘సూపర్బ్ సూపర్బ్’ అన్నారు. ఈ సినిమా చూసేప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న మేనమామకి తన అల్లుడు, అల్లుడికి తన మామ గుర్తుకు వస్తారు. వెంకటేష్‌గారికి కథ చెప్పినప్పుడు.. చైతూ పాత్రను ఇంకొంచెం బాగా చేయమన్నారు. అప్పడు నాకు మరింత తెలిసింది.. నిజమైన మామాఅల్లుళ్ల బంధం గురించి. ఇద్దరూ బాగా నటించారు’’ అన్నారు బాబీ. ‘‘భావోద్వేగ సన్నివేశాల్లో వెంకటేష్‌గారు మాస్టర్. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించారు’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘‘ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్టైనింగ్ చిత్రం ఇది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘వెంకటేష్‌గారితో నాకు కొన్ని కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. చైతూ మంచి కో–స్టార్’’ అన్నారు రాశీఖన్నా. -
బర్త్‌డేకి మామాఅల్లుళ్లు
వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’ విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చేసింది. మామా అల్లుళ్లను స్కీన్ర్ మీద ఎప్పుడెప్పుడు చూడాలా? అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ ఇచ్చేసింది చిత్రబృందం. కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వెంకీ మామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా కథానాయికలు. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాను ఈ నెల 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్ 13 వెంకటేశ్ బర్త్‌డే. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను దర్శకుడు బాబీ, హీరో రానా ఓ సరదా వీడియో రూపంలో ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
స్మాల్ హాలిడే
షూటింగ్స్‌కి చిన్న బ్రేక్ ఇచ్చారు నాగచైతన్య, సమంత. హాలిడేను ఎంజాయ్ చేయడానికి సింగపూర్ వెళ్లారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్స్‌తో నాగచైతన్య బిజీగా ఉన్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్ షూటింగ్లో జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు సమంత. ఈ మధ్యలో దొరికిన చిన్న బ్రేక్‌ను హాలిడేగా మార్చుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లో హాలిడేయింగ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు సమంత. -
సర్ప్రైజ్ సర్ప్రైజ్
నాగచైతన్య బర్త్‌డేకు (నవంబర్ 23) స్పెషల్ బర్త్‌డే సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ‘వెంకీమామ’ చిత్రబృందం. ఈ నెల 23న నాగచైతన్య పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేయస్ రవీందర్(బాబీ) తెరకెక్కించిన చిత్రం ‘వెంకీమామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లు. ‘కెప్టెన్ కార్తీక్’ పాత్రలో ఆర్మీ ఆఫీసర్‌గా చైతన్య ఈ సినిమాలో నటించారు. ఈ టీజర్లోనే ‘వెంకీమామ’ రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారని తెలిసింది. లవ్‌స్టోరీ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి ఓ ప్రేమకథాచిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. చైతన్య బర్త్‌డేకి ‘లవ్ స్టోరీ’ టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. చైతన్య అభిమానులకు డబుల్ ధమాకా. -
డిసెంబరులో సందడి?
వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వెంకీమామ’. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ చిత్రాన్ని డిసెంబరు 13న విడుదల చేయాలనుకుంటున్నారని తాజా సమాచారం. రియల్‌లైఫ్‌లో మేనమామ, మేనల్లుడు అయిన వెంకటేశ్, నాగచైతన్య రీల్ లైఫ్‌లో మామ, అల్లుడిగా డిసెంబరులో వెండితెరపై సందడి చేయబోతున్నారన్నమాట. రిలీజ్ డేట్‌పై అతి త్వరలో అధికారిక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది. -
రెట్రో స్టెప్పులు
ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లి ‘ఎన్నాళ్లకో..’ అంటూ స్టెప్పులేశారు వెంకటేష్. ఈ రెట్రో స్టెప్పులు ‘వెంకీమామ’ చిత్రం కోసమే. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కె.ఎస్. రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వెంకీమామ’. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ‘వెంకీమామ’ టైటిల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ‘ఎన్నాళ్లకో..’ అనే మరో పాటను నేడు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటని పృథ్వీచంద్ర పాడారు. వెంకటేష్, పాయల్ రాజ్‌పుత్‌లపై తెరకెక్కించిన పాట ఇది. ‘‘1980 నేపథ్యంలో సాగే రెట్రో సాంగ్ ఇది. తమన్ మంచి సంగీతం ఇచ్చారు. ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ∙వెంకటేశ్, పాయల్ రాజ్‌పుత్ -
ప్రేమకథ మొదలు
‘భానుమతి–హైబ్రిడ్ పిల్ల..’ అంటూ సాయి పల్లవితో తెలంగాణ యాస మాట్లాడించి, ఫిదా చేశారు శేఖర్ కమ్ముల. ఇప్పుడు నాగచైతన్యతో కూడా మాట్లాడించబోతున్నారు. చైతూతో తొలిసారి సినిమా చేయబోతున్నారు శేఖర్. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె. నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం మొదలైంది. ఏషియన్ గ్రూప్స్ అధినేత సునీల్ నారంగ్ స్క్రిప్ట్‌ను శేఖర్ కమ్ములకు అందించగా, శేఖర్ తండ్రి శేషయ్య క్లాప్ ఇచ్చారు. డిస్ట్రిబ్యూటర్ సదానంద కెమెరా స్విచాన్ చేశారు. ‘‘మూడు షెడ్యూల్స్‌లో సినిమాని ప్లాన్ చేశాం. ఈ రోజు మొదలైన షెడ్యూల్ పది రోజులు జరుగుతుంది’’ అన్నారు పి. రామ్మోహన్ రావు. ‘‘పల్లెటూరి నుంచి సిటీకి వచ్చి జీవితంలో ఏదో సాధించాలనుకునే ఇద్దరి మధ్య జరిగే ప్రేమకథ ఇది. తెలంగాణ యాసని చైతూ బాగా ఇష్టపడి నేర్చుకున్నాడు. తన పాత్ర సినిమాకు హైలెట్. సాయిపల్లవి ఈ కథకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. నా సినిమాల్లో మ్యూజిక్ బలంగా ఉంటుంది. ఈ సినిమాలో మరింత బలంగా ఉంటుంది. రెహమాన్ స్కూల్ నుంచి వచ్చిన పవన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు’’ అని శేఖర్ కమ్ముల అన్నారు. భరత్ నారంగ్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పవన్, కెమెరా: విజయ్ సి. కుమార్. -
తిరున్నాళ్ల సందడి!
వెంకటేశ్, నాగచైతన్య ఏం చేస్తున్నారో తెలుసా? తిరునాళ్లల్లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ అంతా బోనాల సందట్లో ఉంది. మామాఅల్లుడు కూడా బోనాల పండగలో మునిగి తేలుతున్నారు. ఏ ఏరియాలో అంటే హైదరాబాద్ శివార్లలో వేసిన తిరునాళ్ల సెట్టింగ్‌లో. ‘వెంకీమామా’ చిత్రం కోసం వేసిన ఈ సెట్లో మామాఅల్లుడు వెంకీ, చైతూ జోరుగా షూటింగ్లో పాల్గొంటున్నారు. కె.యస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్రంలోని కీలక తారాగణంతో పాటు ఐదువందల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. తిరునాళ్ల సందట్లో మామాఅల్లుడు ఫైట్ కూడా చేయాల్సి వస్తుందట. ఫైట్మాస్టర్లు రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ ఫైట్ చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూ సరసన రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. -
పోచంపల్లిలో హీరో నాగచైతన్య సందడి
సాక్షి, భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లిలో ఆదివారం హీరో నాగచైతన్య సందడి చేశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ‘వెంకీమామ’ సినిమా షూటింగ్ రెండో రోజు జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ తరగతి గదిలో హీరో నాగచైతన్య, హీరోయిన్లు రాశీఖన్నా, పాయల్ రాజ్‌పూత్, జబర్దస్త్ కామెడీ నటుడు హైపర్ ఆదిపై పలు టాకీ పార్ట్ సన్నివేశాలను చిత్రీకరించారు. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న పాయల్ రాజ్‌పూత్ విద్యార్థులకు చదువు చెబుతుండగా క్లాస్‌రూమ్‌లో హీరో నాగచైతన్య, హైపర్ ఆది సరదాగా గడిపే సన్నివేశాలను దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ) చిత్రీకరించాడు. ఈ సినిమాలో ప్రముఖ హీరో వెంకటేశ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నిర్మాతలు సురేశ్‌బాబు, విశ్వప్రసాద్, వివేక్, కెమెరామన్ ప్రసాద్ మురెళ్ల, సంగీతం తమన్, ప్రొడక్షన్ మేనేజర్ నాగు తదితరులు పాల్గొన్నారు. కాగా హీరో నాగచైతన్యను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో షూటింగ్ లోకేషన్ వద్ద సందడి నెలకొంది. అనంతరం నాగచైతన్య ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో గ్రూప్ ఫొటో దిగారు. అలాగే హైపర్‌ఆదితో పలువురు అభిమానులు పోటీపడి సెల్ఫీలు దిగారు. -
చిల్ సెల్ఫీ
సందడి సందడిగా షూటింగ్లో పాల్గొంటూ షాట్ గ్యాప్‌లో చిల్ అవుతుంటారు నటీనటులు. సరదాగా సెల్ఫీకు ఫొజులిస్తుంటారు కూడా. అలాంటిదే ఇది. ‘వెంకీ మామ’ షూటింగ్ గ్యాప్‌లో నాగచైతన్యతో రాశీఖన్నా క్లిక్ చేసిన సెల్ఫీ ఇది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా కేయస్ రవీందర్ (బాబీ) తెరకెక్కిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్లు. -
స్పెషల్ క్లాస్
స్కూల్లో, కాలేజీలో చదువుకునేటప్పుడు స్పెషల్ క్లాసులకి వెళుతుంటాం. ఇప్పుడు నాగచైతన్య కూడా వెళుతున్నారు. అయితే ఇది సినిమా స్పెషల్‌క్లాస్ అని ఊహించే ఉంటారు. ఈ క్లాస్ ఎందుకంటే.. తెలంగాణలో మాట్లాడటం కోసం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులోనే నాగచైతన్య తెలంగాణ భాష మాట్లాడబోతున్నారు. అమిగోస్ ఫిలింస్ సమర్పణలో ఏషియన్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్‌రావులు నిర్మాతలు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవుతుందట. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సూపర్‌హిట్ చిత్రం ‘ఫిదా’లో మలయాళ ముద్దుగుమ్మ సాయిపల్లవితో తెలంగాణ మాట్లాడిన విషయం తెలిసిందే. ఆమె మాట్లాడిన తీరు అందరికీ నచ్చింది. సాయి పల్లవి అంత పర్ఫెక్ట్గా మాట్లాడటానికి శేఖర్ కమ్ముల కొంతకాలం తర్ఫీదునిచ్చారాయన. ఇప్పుడు నాగచైతన్యకు సెపరేట్ క్లాసులు తీసుకొంటున్నారట. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భాస్కర్ కెమెరా: విజయ్‌కుమార్. -
అమ్మతో గొడవపడ్డ సమంత!
చెన్నై: సమంతకు తన తల్లితో మనస్పర్థలా? ఇలాంటి ప్రచారమే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. టాలీవుడ్లో దూసుకుపోతున్న సమంత చెన్నై చిన్నదన్నవిషయం తెలిసిందే. అయితే హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత భర్తతో పాటు హైదరాబాద్‌లో సెటిలయిపోయింది. ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న సమంతకు మరింత ఆనందకరమైన విషయం తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడం. ఇకపోతే హీరోయిన్ల గురించి ఏదో ఒక ప్రచారం జరగడం సర్వసాధారణం. అదేవిధంగా ఇప్పుడు నటి సమంత గురించి ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సమంతకు తన తల్లికి మధ్య మనస్పర్థలు తలెత్తాయన్నదే ఆ ప్రచారం. సాధారణంగా వదంతుల గురించి పెద్దగా స్పందించని సమంత ఈ విషయంలో మాత్రం వేగంగా స్పందించింది. ఎంతైనా అమ్మ కదా.. ఇలాంటి వదంతులకు అడ్డుకట్ట వేయకపోతే, ఇంకా చిలువలు పలువలు అల్లుతారని భావించిందో ఏమో. తల్లితో తన అనుబంధం గురించి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సమంత పేర్కొంటూ తన తల్లి ప్రార్థనలో మ్యాజిక్ ఉందని తాను నమ్మానని, ఇప్పటికీ నమ్మతున్నానని అంది. చిన్నతనంలో లానే ఇప్పటికీ తనకోసం ప్రార్థన చేయమని అమ్మను కోరతానని చెప్పింది. అమ్మ ప్రార్థన చేస్తే అంతా సరి అయిపోతుందని తెలిపింది. ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే అమ్మ తన కోసం ఎప్పుడూ ప్రార్థన చేసుకోలేదని చెప్పింది. దైవం స్థానంలో ఉండేది అమ్మేనని సమంత పేర్కొంది. దీంతో పాటు సమంత తన తల్లి ఫొటోనూ ఇన్‌స్ట్ర్రాగామ్‌లో పోస్ట్ చేసి తన ప్రేమను మరోసారి చాటు కోవడంతో పాటు, వదంతులు ప్రచారం చేసేవారికి తగన బదులు ఇచ్చింది. దటీజ్ సమంత. ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ బేబీ ఎంత చక్కగున్నావే చిత్రంలో నటిస్తోంది. -
ఐ లవ్ యు 3000!
పెళ్లైన తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన తొలి చిత్రం ‘మజిలీ’. ప్రేమికులుగా ఉన్నప్పుడు విజయాలు అందుకున్న ఈ జంట భార్యాభర్తలయ్యాక విజయం అందుకోవడం చాలా స్పెషల్‌గా భావిస్తున్నారు. అయితే ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేసేలోపే ‘వెంకీమామ’ సెట్లో జాయినైపోయారు చైతూ. ఇప్పుడు టైమ్ దొరకడంతో సమ్మర్ వెకేషన్‌ని ప్లాన్ చేసుకున్నారు చైతూ అండ్ సామ్. నచ్చిన ఫ్లేస్‌లో నచ్చిన ఫుడ్ లాగిస్తూ, ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. స్పెయిన్ వీధుల్లో ప్రేమ విహారం చేస్తున్నారు. దొరికిన హాలిడేని మనసారా అస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా సమంత కొన్ని ఫొటోలను షేర్ చేశారు. వాటిలో ఓ ఫొటోలో ఓ ఫొటో పై ‘ఐ లవ్ యు 3000’ అని చైతూని ఉద్దేశించి పోస్ట్ చేశారు సమంత. ఇంతకీ ‘ఐ లవ్ యు 3000’ అంటే ఏంటో ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ సినిమా చూసినవాళ్లకు అర్థం అయ్యే ఉంటుంది. అందులో ఐరన్ మేన్‌ని అతని కుమార్తె ‘ఐ లవ్ యు 3000’ అంటుంది. అంటే.. బోలెడంత ప్రేమ అని అర్థం. సమంతకు కూడా చైతూ అంటే బోలెడంత ప్రేమ. అందుకే అలా అని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
మస్త్ బిజీ
బ్రేక్ వేయకుండా రయ్రయ్ మంటూ కెరీర్ ఎక్సలేటర్‌ను తొక్కేస్తున్నారు నాగచైతన్య. ఈ ఏడాదిలో ఆల్రెడీ ‘మజిలీ’తో సక్సెస్ అందుకున్నారాయన. ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్లో వెంకటేశ్‌తో కలిసి సందడి చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం పూర్తి కాగానే నూతన దర్శకుడు శశితో ఓ సినిమా స్టార్ట్ చేయనున్నారు. ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా ఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కనుందని తెలిసింది. ఇందులో కథానాయికగా ‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌ను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందని తెలిసింది. ఈ సినిమా తర్వాత ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తారు. సో.. ఈ ఏడాదంతా ఆయన మస్త్ బిజీబిజీ అన్నమాట. -
కోలాహలం
నవ్వులు, సరదాలు, అలకలు, బుజ్జగింపులతో ‘వెంకీమామ’ ఇంట్లో అంతా కోలహలంగా ఉంది. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కెఎస్. రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వెంకీమామ’. వెంకీ సరసన పాయల్‌రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. డి. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ముఖ్య తారాగణంపై కుటుంబ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ కాగానే హైదరాబాద్‌లోనే మరో లొకేషన్లో నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు టీమ్. ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు సాగుతుందని తెలిసింది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్లో ఓ సాంగ్‌ను షూట్ చేశారు. తాజాగా స్టార్ట్ కానున్న నెక్ట్స్ షెడ్యూల్లో మరో సాంగ్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. రియల్ లైఫ్‌లో మాదిరిగానే ఈ సినిమాలో కూడా మామా అల్లుళ్లలా నటిస్తున్నారు వెంకీ, నాగచైతన్య. రైతు పాత్రలో వెంకటేశ్, ఆర్మీ ఆఫీసర్‌గా నాగచైతన్య కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
చై సై?
‘మజిలీ’ సక్సెస్‌తో ఫుల్ జోష్ మీద ఉన్నారు నాగచైతన్య. ప్రస్తుతం తన మేనమామ వెంకటేశ్‌తో కలసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫుల్‌స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య చేయబోయే సినిమా ఏంటంటే.. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఆల్రెడీ అజయ్, చైతూ మధ్య స్టోరీ డిస్కషన్స్ కూడా నడిచాయట. అజయ్ చెప్పిన స్టోరీ లైన్‌కు ఇంప్రెస్ అయిన చైతూ ‘వెంకీ మామ’ సినిమా తర్వాత ఈ సినిమానే స్టార్ట్ చేయనున్నారట. ఈ చిత్రానికి చై సై అన్నారనే వార్త బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మించనున్నారట. -
నా హార్ట్ ఇక్కడే ఉంది
‘‘మజిలీ’ని చాలా కాన్ఫిడెంట్‌గా చేశాం. ఫెయిల్ అయితే లైఫ్ లాంగ్ అది ఓ డ్యామేజ్‌లా ఉండిపోతుంది. అందుకే ఎలాగైనా వర్కౌట్ అవ్వాలనుకున్నాం. పెళ్లితర్వాత కలిసి చేసిన తొలి సినిమా కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో అని కాస్త టెన్షన్ పడ్డాం. మంచి స్పందన వచ్చినందుకు ఇప్పుడు హ్యాపీ’’ అని నాగచైతన్య, సమంత అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత, దివ్యాంశా కౌశిక్ ముఖ్య తారలుగా సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం ‘మజిలీ’. ఈ నెల 5న విడులైంది. శనివారం చైతూ, సమంత ఇద్దరూ కలిసి చెప్పిన ‘మజిలీ’ కబుర్లు. ► మీకు కెరీర్లో విడి విడిగా హిట్స్ ఉన్నాయి. కంబైన్డ్‌గా ఉన్నాయి. ‘మజిలీ’ హిట్ ఎంత స్పెషల్? సమంత: మోర్ స్పెషల్. పెళ్లి తర్వాత ఈ సినిమా హిట్ మాకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. సరైన సమయంలో సరైన సినిమాతో సరైన హిట్ వచ్చిందనుకుంటున్నాను. కథ విన్నప్పుడు, షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో స్పెషల్ జరుగుతోందనే భావన మనసులో ఉంది. అదే ఫీల్‌ని, స్పెషల్‌ని ఆడియన్స్ కూడా ఫీలై మాకు మంచి విజయం అందించారు. వారికి ధన్యవాదాలు. ► సమంత మీ లక్కీఛార్మ్ అని మరోసారి ప్రూవ్ అయిందని నమ్ముతారా? (సమంత అందుకుంటూ....) ఆయనే నాకు ఇంకా లక్కీఛార్మ్. ఎందుకంటే... మ్యారేజ్ తర్వాత నా యాక్టింగ్ కెరీర్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తోందన్న ఫీలింగ్ కలుగుతోంది. చైతన్య: లక్కీఛార్మ్ అనడం కన్నా సపోర్ట్ అంటాను. సక్సెస్ టైమ్‌లో సపోర్టివ్‌గా చాలామంది ఉంటారు. ఫెయిల్యూర్స్ అప్పుడు సపోర్ట్ చాలా ముఖ్యం. ► పెళ్లి తర్వాత కలిసి నటించడానికి బాగా ఆలోచించారా? మళ్లీ నటిస్తారా? చైతూ: యాక్చువల్లీ పెళ్లి తర్వాత ఓ సినిమా చేద్దామని మా అంతట మేము ఏ దర్శక–నిర్మాతలను సంప్రదించలేదు. దర్శకుడు శివ భార్యాభర్తల కథతో మా దగ్గరకు రావడం అనుకోకుండా జరిగింది. ఇప్పుడు ఎలా అయితే మ్యాజిక్ జరిగిందో అలాగే భవిష్యత్‌లో జరిగితే తప్పకుండా మేం ఇద్దరం కలిసి సినిమా చేస్తాం. ‘మనం’ చిత్రానికి కూడా ఇలాంటి మ్యాజిక్కే జరిగింది. ► పూర్ణ (చైతూ పాత్ర పేరు) క్యారెక్టర్‌ను సిల్వర్‌స్క్రీన్‌పై చూసినప్పుడు ఒక ప్రేక్షకురాలిగా మీరెలా ఫీల్ అయ్యారు? సమంత: చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. యాక్టర్‌గా చైతన్యలో పెద్ద గ్రోత్ కనిపించింది. ఒక సినిమా చేసేప్పుడు ఈ సీన్ బాగా చేశాను.. ఈ సీన్ బాగా వచ్చిందని ఫీలింగ్ కలగవచ్చు... కానీ ఫైనల్ ప్రొడక్ట్ చూసేప్పుడు అలా అనిపించకపోవచ్చు. ఈ సినిమాలో నేను లేని సీన్స్‌ను వెండితెరపై చూసినప్పుడు షాక్ అయ్యాను. యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్స్‌లో చైతన్య మంచి వేరియేషన్ చూపించారు. అద్భుతంగా నటించారు. ► సెకండాఫ్‌లో చైతూని సమంత టేకోవర్ చేశారని అంటున్నారు? చైతూ: నా క్యారెక్టర్ ఎలివేట్ అవడానికి కారణం సినిమాలో సమంత చేసిన శ్రావణి క్యారెక్టరే. లవ్‌స్టోరీలో హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్‌స్క్రీన్ అయినా పూర్ణ క్యారెక్టర్‌కు సామ్ మంచి సపోర్ట్. తను ఒప్పుకోదు కానీ క్లైమాక్స్ కంప్లీట్‌గా తనదే. సమంత: అలా ఏం లేదు (నవ్వుతూ). ► ఈ సినిమాలో చైతూకి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చారు. చైతూతో మీకు పెళ్లి అయ్యాక.. మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? చైతూ: నా బర్త్‌డేకి ఓ స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్‌గా ఇచ్చింది. సమంత: అవును.. బైక్ ఇచ్చాను. ► ఈ సినిమా సక్సెస్ గురించి నాగార్జునగారి రియాక్షన్? సమంత: సడన్‌గా ఇంటికి వచ్చేశారు (నవ్వుతూ). చైతూ: ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఫ్యామిలీలో కొంతమందికి చూపించాను. షో అయ్యాక ఎవరూ ఏం మాట్లాడలేదు. ఎర్రబారిన కళ్లతో తలదించుకుంటూ ఇళ్లకు వెళ్లిపోయారు. నాకు నిజంగా అర్థం కాలేదు. ఫస్ట్ టైమ్ ఇలాంటి రియాక్షన్ చూశాం. అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి మాట్లాడలేకపోయారని తర్వాత అర్థమైంది. నెక్ట్స్డే మార్నింగ్ ఫోన్‌చేసి అందరూ మాట్లాడారు. సినిమా బాగుందని అభినందించారు. ఫస్ట్‌టైమ్ నాన్నగారికి లేట్‌గా సినిమా చూపించాను. ఆర్ఆర్ లేట్ అవ్వడం వల్ల ముందే చూపించలేకపోయాను. కథ కూడా అంతగా నాన్నగారికి తెలీదు. ► సాధారణంగా నాగార్జునగారు మీ సినిమాల రషెస్ చూస్తుంటారు. అవసరమైనప్పుడు సలహాలు ఇస్తుంటారు. కానీ ఈ సినిమాను మీకే వదిలేయడం వెనక కారణం ఏంటి? చైతూ: ‘ఏదైనా ఒక పాయింట్ నచ్చినప్పుడు నువ్వు చేసెయ్. నా దగ్గరకు తీసుకు రావొద్దు’ అని ఎప్పట్నుంచో నాన్నగారు చెబుతున్నారు. ‘నీ ఆత్మవిశ్వాసం, నీ నిర్ణయంపై ముందుకు సాగిపో’ అని చెబుతుంటారు. ‘మజిలీ’ కథ విన్నప్పుడు నాకు ఒక్క డౌట్ కూడా లేదు. సెకండ్ ఒపీనియన్ తీసుకుందామా? అనే ఆలోచన రాలేదు. ఎటువంటి డౌట్ లేనప్పుడు మన జడ్జ్‌మెంట్‌ని ఓసారి పరీక్షించుకుందాం అనుకున్నాను. ఒకవేళ డౌట్స్ ఉంటే కథ వినమని నాన్నగారికి చెబుతాను. సమంత: నాకు డౌట్ వచ్చింది. కానీ ఇది చాలా మంచి స్క్రిప్ట్. డైరెక్టర్‌కు సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ ఉండాలి. అది శివగారిలో కనిపించింది. ► మీ కెరీర్లో హయ్యస్ట్ ఫస్ట్‌వీక్ కలెక్షన్స్ (50కోట్లు) ఈ సినిమాకు వచ్చాయి. ఆ ఫీలింగ్ ఎలా ఉంది? చైతూ: చాలా సంతోషంగా ఉంది. సినిమా ఒప్పుకునే ముందు ఇంత వసూలు చేయాలి, అంత వసూలు చేయాలని పెద్దగా ఆలోచించను. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఈ సినిమా ఫస్ట్‌వీక్ కలెక్షన్స్‌తోనే అందరూ ప్రాఫిట్ జోన్లోకి వచ్చారంటుంటే సంతోషంగా ఉంది. ఈ కలెక్షన్స్ పట్ల అభిమానులు, ఫ్యాన్స్ ఇంకా ఎగై్జటెడ్‌గా ఉంటారు. అఫ్కోర్స్ నేను కూడా. ప్రాఫిట్‌తో పాటు సక్సెస్ వస్తే అది అల్టిమేట్ కాంబినేషన్ అవుతుంది. సమంత: ఇంట్లో కలెక్షన్స్ నేను చూసుకుంటాను. ► ఎలక్షన్ టైమ్‌లో కూడా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం గురించి.... చైతూ: స్టార్టింగ్‌లో కొంచెం టెన్షన్ పడ్డాం. సమ్మర్ ఫస్ట్ ఫిల్మ్ తప్పకుండా అడ్వాంటేజ్ ఉంటుంది, రిలీజ్ చేద్దామని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రోత్సహించారు. సినిమా బాగుంటే ఆడియన్స్ సపోర్ట్ తప్పకుండా ఉంటుందన్నారు. ► ‘మజిలీ’ సినిమా తర్వాత ఫస్ట్‌టైమ్ నాగార్జున గారు మీ ఇంటికి వచ్చారు అన్నారు? అంటే ఇంతకుముందు సినిమాలకు రాలేదా? సమంత: చెప్పి వస్తారు. ఆహ్వానిస్తే వస్తారు. కానీ చెప్పకుండా వచ్చారు. చైతూ: ఆ రోజు సడన్‌గా మార్నింగ్ ఫోన్ చేసి ఎక్కడున్నారు? వస్తున్నాను? అని చెప్పి వచ్చేశారు. అలా ఎప్పుడూ రాలేదు. సమంత: చాలా కష్టపడి సినిమా చేశాం. ఆడియన్స్, అభిమానులకు నచ్చింది. కానీ తల్లిదండ్రులను గర్వపడేలా చేయడం వేరు కదా. ► సమంత నటించిన తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ చూశారా? చైతూ: ఫస్ట్ హాఫ్ చూశాను. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందే కథ చెప్పింది. అందుకే పెద్దగా షాక్ అవ్వలేదు. స్టెప్ బై స్టెప్ యాక్టర్‌గా నేను ఇప్పుడే గ్రో అవుతున్నాను. భవిష్యత్‌లో తప్పకుండా ఇలాంటి సినిమాలు చేస్తాను. ► ఒకవేళ ‘సూపర్ డీలక్స్’ లాంటి సినిమా చేయొద్దని చైతన్య చెబితే మీరు ఏం చేస్తారు? సమంత: ఆయన అలా చెప్పరని నాకు తెలుసు. పెళ్లి తర్వాత నా నిర్ణయాలు, నా కాన్ఫిడెన్స్ పట్ల నాకు మరింత నమ్మకం కుదిరింది. ఆ నమ్మకానికి కారణం ఇంట్లోని పరిస్థితులే. చైతూ ప్రోత్సాహం. తెలియకుండానే నాకో బలం వచ్చింది. ► ‘మజిలీ’లో ఓ సీన్లో క్రికెట్ బ్యాట్ పట్టుకున్నారు. నిజంగా ఆడటం వచ్చా? సమంత: నాకు పెద్దగా క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. అయితే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయాలని మాత్రం ఉంది. ► మీరు తమిళంలోకి ఎప్పుడు వెళ్తున్నారు? చైతూ: నాకు తమిళ సినిమాలంటే చాలా ఇష్టం. చెన్నైలో పుట్టి పెరిగాను. చిన్నతనంలో తమిళ సినిమాలు చూస్తూ టైమ్ స్పెండ్ చేశాను. కానీ నా హృదయం ఇక్కడే ఉంది. ఏమో... నటుడిగా ఇక్కడ ఇంకా చాలా ఆకలిగా ఉన్నాను. చాలా హిట్స్ ఇవ్వాలి. మంచి మంచి సినిమాలు చేయాలి. ప్రస్తుతానికి మనసు టాలీవుడ్‌పైనే ఉంది. ► బైలింగ్వల్ సినిమా ఆలోచన ఉందా? చైతూ: అలాంటి స్క్రిప్ట్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. కానీ ప్రస్తుతం తెలుగే. ► ‘యు–టర్న్, ఓ బేబి’... ఇటీవల ‘96’ ఇలా రీమేక్ సినిమాలపై మొగ్గు చూపుతున్నట్లున్నారు? సమంత: రీమేక్స్ అంటే కాస్త రిస్కే. ఇవన్నీ మంచి సినిమాలు. అందుకే నో చెప్పలేకపోయాను. హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్న కథలకు నో చెప్పడం నాకు ఇష్టం లేదు. ► చైతూతో పెళ్లికి ముందు ‘ఏ మాయ చేసావె, మనం, ఆటోనగర్‌సూర్య’ సినిమాలు చేశారు. తాజాగా ‘మజిలీ’. అప్పటి చైతూకి, ఇప్పటి చైతూకి యాక్టింగ్‌లో వచ్చిన తేడా ఏంటి? సమంత: నాకు తెలిసిన చైతన్య ఎందుకు స్క్రీన్‌పై కనిపించడం లేదనే ఫీలింగ్ ఉండేది. అవుట్‌సైడ్ చైతన్య మాటలు, ప్రవర్తన, లుక్స్ అమేజింగ్‌గా ఉంటాయి. అది ‘మజిలీ’ సినిమాలో స్క్రీన్‌పై నాకు కనిపించింది. తన రియల్ పర్సనాలిటీని స్క్రీన్‌పైకి తీసుకువచ్చి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యారు. ఇక యాక్టర్‌గా తను చాలా పరిణితి చెందారు. చైతన్యలో బాగా ఆత్మవిశ్వాసం పెరిగింది. ‘ఏ మాయ చేసావె’ టు ‘మజిలీ’ ఒక పర్సన్‌గా, యాక్టర్‌గా చాలా పాజిటివ్‌గా మారారు. ► ‘బంగార్రాజు’ ఎంతవరకు వచ్చింది? ఇంకా స్క్రిప్టింగ్ జరుగుతోంది. జూలై నుంచి స్టార్ట్ చేయవచ్చు. నేను, నాన్నగారు కలిసి చేస్తాం. ► ‘ఏ మాయ చేసావె’ సినిమా టైమ్‌లో చైతన్యను చూసి ఇన్నోసెంట్ అనుకున్నారా? లేక హ్యాండ్సమ్ అని ఫీల్ అయ్యారా? సమంత: నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా ఇన్నోసెంటే (నవ్వుతూ). అప్పుడు నాకు తెలుగు రాదు. చాలా పెద్ద స్క్రిప్ట్. ఎప్పుడూ డైలాగ్స్ చదువుతూనే ఉండేదాన్ని. సెట్లో ప్రతి రోజూ షివరింగే. గౌతమ్ మీనన్‌గారు కట్ కూడా చెప్పరు. ‘ఏ మాయ చేసావె’ అప్పుడే వేరే ఏ డిస్ట్రాక్షన్స్ లేవు. చైతూ: నాకు ఫొటో చూపించారు. అమ్మాయి చాలా బాగుంది. హీరోయిన్గా పెట్టుకుందాం అనుకున్నాం. కట్ చేస్తే చెన్నైలో లుక్ టెస్ట్. ► నాగార్జునగారి ‘మన్మథుడు –2’లో ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నారని తెలిసింది. నిజమేనా? సమంత: అవును... చేస్తున్నాను. ► సమ్మర్ వెకేషన్ ఎక్కడ ప్లాన్ చేశారు? చైతూ: ఈ నెలాఖరు వరకు ‘వెంకీమామ’ షూటింగ్ ఉంది. మే ఫస్ట్ వీక్‌లో ప్లాన్ చేద్దామనుకుంటున్నాం. సమంత: నాకు వెకేషన్ తప్పకుండా కావాలి. ఈ సినిమా విషయంలో ఇంతవరకు ఎప్పుడూ ఫీల్ అవ్వని స్ట్రెస్ ఫీల్ అయ్యాను. -
నా లైఫ్‌లో మజిలీ స్పెషల్ జర్నీ
‘‘చాలా రోజుల తర్వాత నటుడిగా ‘మజిలీ’ చిత్రం సంతృప్తినిచ్చింది. ఈ మూవీ నా లైఫ్‌లో స్పెషల్ జర్నీ’’ అన్నారు నాగచైతన్య. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత, దివ్యాంశా కౌశిక్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మజిలీ’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడులైంది. ‘మజిలీ’ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఆదివారం విలేకర్ల సమావేశంలో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘దర్శకుడు శివ కథ చెప్పినప్పుడు నేను ఏయే అంశాలకు కనెక్ట్ అయ్యానో అవే అంశాలకు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు. శివను నేను నమ్మాను. శివ నన్ను నమ్మాడు. పోసానిగారు, రావురమేష్‌గారు కో–స్టార్స్‌గా బాగా సపోర్ట్ చేశారు. సినిమాలోని శ్రావణి క్యారెక్టర్ లాంటి మంచి భార్య కావాలని సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూశాను. నిజంగానే నాకు శ్రావణి లాంటి అమ్మాయి వైఫ్‌గా దొరికింది. శ్రావణి క్యారెక్టర్‌ను సమంత బాగా చేసింది. దివ్యాంశా కౌశిక్ బాగా నటించారు. డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతే తట్టుకోలేను. ఈ సినిమా ఫలితం పట్ల వారు హ్యాపీగా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నా రిలీజ్ రోజు ఏదో చిన్న టెన్షన్. సాహుగారు ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని చెప్పారు. అరగంటసేపు ఏడ్చాను. స్ట్రెస్ అంతా పోయింది. ‘ఏ మాయ చేశావె’ తర్వాత ‘మజిలీ’ నాకు స్పెషల్ మూవీ. నాగ్‌మామ డైరెక్ట్‌గా ఇంటికి వచ్చి అభినందించారు. చైతూ భార్యగా గర్వపడుతున్నాను’’ అని సమంత అన్నారు. ‘‘ఒక సినిమా మంచి సినిమాగా నిలవడం వేరు, కమర్షియల్‌గా విజయం సాధించడం వేరు. కానీ ఈ రెండింటినీ ‘మజిలీ’ చిత్రం సాధించింది. డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్ట్‌గా డైరెక్టర్‌కి ఫోన్ చేసి సినిమా రెస్పాన్స్‌ను ఎంజాయ్ చేస్తుంటే ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ కింద లెక్క. చైతూగారు నన్ను బాగా నమ్మారు. నిర్మాతలు బాగా సహకరించారు. వీరితోనే మరో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ సినిమాతో చైతన్య ఎంత మంచి నటుడో అందరికీ తెలిసింది. సమంత నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడు, నాలుగు లొకేషన్స్తోనే ప్రపంచం అంతా సినిమా చూపించాడు శివ. ఇలాంటి కథను నాకు ఇచ్చి ఇంత బాగా తీయమంటే నేను తీయలేను’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ‘‘సెట్లో నాగచైతన్య చాలా కూల్‌గా ఉంటారు. ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించారు. సమంత, దివ్యాంశ బాగా చేశారు. బాధ కలిగించే అంశాలను కమర్షియల్‌గా స్క్రీన్‌పై బాగా చూపించారు శివ’’ అన్నారు రావు రమేష్. దివ్యాంశా కౌశిక్ మాట్లాడారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మా కోసం కథ రాయమని అడగలేదు
‘‘నటుడిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. కానీ రొమాన్స్ జానర్లో ఆడియన్స్ నన్ను ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. వైవిధ్యం ఉన్న కథలు వచ్చినప్పుడు ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. హానెస్ట్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్ కూడా ఉండాలి. ప్రస్తుతం రొమాన్స్ జానర్ నా ఫేవరెట్‌గా ఫీల్ అవుతున్నాను’’ అని నాగచైతన్య అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘మజిలీ’. సమంత, దివ్యాంకా కౌశిక్ కథానాయికలుగా నటించారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► నేను, స్యామ్ (సమంత) కలిసి ‘ఏమాయ చేసావే, మనం, ఆటోనగర్ సర్య’ సినిమాలు చేశాం. అన్నీ ప్రేమకథలే. మా వివాహం తర్వాత విభిన్నమైన కథ ప్రయత్నిస్తే బాగుంటుందనుకున్నాం. సరిగ్గా అలాంటి స్క్రిప్ట్‌నే శివ తీసుకుని వచ్చాడు. పెళ్లి తర్వాత భార్యాభర్తల జీవితాల్లో ఉండే ఎత్తుపల్లాలు ఏంటి? ఎలాంటి సమస్యలు వస్తాయి? వంటి అంశాలతో కూడిన చిత్రం ‘మజిలీ’. ఇలాంటి చిత్రం మా దగ్గరకు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ► నాకు, స్యామ్‌కి కథ రాయమని నేను శివను అడగలేదు. శివ తొలి సినిమా ‘నిన్ను కోరి’ చూశాను. నచ్చింది. ముఖ్యంగా ఆ సినిమా క్లైమాక్స్‌ను శివ హానెస్ట్‌గా డీల్ చేయడం పట్ల ఇంప్రెస్ అయ్యాను. అలాంటి సినిమాలంటే నాకు ఇష్టం. మంచి కథ ఉంటే సినిమా చేసే ఆలోచన ఉందని శివతో అన్నాను. ఓ రెండు నెలల తర్వాత శివ ‘మజిలీ’ స్టోరీ లైన్ చెప్పారు. బాగా ఎగై్జట్ అయ్యాను. అప్పుడే స్యామ్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. సినిమాలో ఓ హీరోయిన్గా స్యామ్‌ను సజెస్ట్ చేసింది శివనే. కథపై దాదాపు 7 నెలలు వర్క్ చేశాం. ఈ ప్రాసెస్‌లో నేను, శివ మంచి మిత్రులైపోయాం. హీరో, డైరెక్టర్ రిలేషన్‌షిప్‌ను బాగా ఎంజాయ్ చేశాను. పూర్ణ క్యారెక్టర్ చేయడం కూడా నాకు ఈజీ అయింది. ► స్క్రిప్ట్ విన్నప్పుడు ఈ క్యారెక్టర్‌కి బాగా హార్డ్‌వర్క్ చేయాలనుకున్నాను. సినిమాలోని పూర్ణ పాత్ర కోసం శివ నన్ను బాగా ప్రిపేర్ చేశాడు. నిజానికి నాకు బ్యాట్ పట్డుకోవడం కూడా రాదు. నాలుగు నెలలు కష్టపడి క్రికెట్ నేర్చుకున్నాను. మ్యాచ్‌లు ఆడలేను కానీ కెమెరా ముందు ఆడతాను. అలాగే పూర్ణ క్యారెక్టర్లో ఏజ్ డిఫరెన్స్ చూపించడానికి పెద్దగా కష్టపడలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని డైట్ ఫాలో అయ్యాను. ► కొత్త హీరోయిన్ అయితే స్నేహం పెరగడానికి కాస్త టైమ్ పడుతుంది. స్యామ్తో అలా కాదు. మంచి కంఫర్ట్, అండర్స్టాండింగ్ ఉంటుంది. తప్పులు అర్థమైపోతాయి. ఒకరికొకరం సహాయం చేసుకుంటాం. ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్స్ కోసం ఇంట్లో కాస్త డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాం. కానీ సాధారణంగా 9–6 వర్క్ మోడ్‌లో ఉంటాం. సాయంత్రం 6కి ఆఫ్ అయిపోతాం. కొత్త కథలు వచ్చినప్పుడు భవిష్యత్‌లో ఇద్దరం కలిసి ఇంకా సినిమాలు చేస్తాం. ► సినిమాలో శ్రావణి క్యారెక్టర్‌ను స్యామ్ చేయడం ప్లస్సే. మంచి ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్. నాకు కూడా అడ్వాంటేజ్ అయ్యింది. స్యామ్ తనకంటే నా గురించే ఎక్కువగా ఆలోచిస్తుంది. అది తన స్వభావం. నాకు నిజంగానే మంచి అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరికింది. ► ఇప్పటివరకు నేను చేసిన 60 శాతం సినిమాల్లో... ఇది కరెక్ట్‌గా వెళ్తుందా? మనం ఫస్ట్ అనుకున్న కథనే తీస్తున్నామా? ఎక్కువ మార్పులు చేశామా? అనే ఆలోచనలు వచ్చాయి. అది నా నటనపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొంచెం డౌట్ ఉంటే నాకు తెలిసిపోతుంది. ఈ సినిమా చేసేప్పుడు నాకు డౌటేమీ లేదు. ► ‘మజిలీ’లాంటి స్క్రిప్ట్‌ని ఓకే చేయాలంటే నిర్మాతలకు ధైర్యం ఉండాలి. నాకు, సమంతకు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కూడా. మన బేనర్లో మీ ఇద్దరితో కలిసి నేను ఎందుకు తీయలేదు? అని నాన్నగారు కూడా ఓ సందర్భంలో అన్నారు. నాన్నగారు ఇంకా సినిమా చూడలేదు. ► కొన్ని సినిమాలు బాగా ఆడతాయనుకున్నాను. ఆడలేదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా జీవితంలో అందరికీ సమస్యలు ఉంటాయి. వైఫల్యాలను తట్టుకుని జీవి తంలో ఎలా నెగ్గుకు వస్తాం అన్నదే ముఖ్యం. సినిమాలోని పూర్ణ క్యారక్టర్ కూడా అలానే ఉంటుంది. సమంత తమిళంలో నటించిన ‘సూపర్ డీలక్స్’ సినిమా చూశాను. బాగా నచ్చింది. సమంతనే కాదు. అందరూ బాగా నటించారు. కథ నచ్చితే ఇలాంటి సినిమాలు చేయడం నాకు ఇష్టమే. ► రేసింగ్ నాకు ఇష్టమైన స్పోర్ట్. ప్రజెంట్ ‘క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ’ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. రేసింగ్‌పై సినిమా గురించి భవిష్యత్‌లో ఆలోచిస్తాను. అయితే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేయడం నాకు ఇష్టమే. ► వెంకటేశ్‌గారి కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలెంజింగ్‌గా ఉంది. ఈ నెల 8నుంచి ‘వెంకీమామ’ సెట్లో జాయిన్ అవుతాను. జూలై కల్లా షూటింగ్‌ను పూర్తి చేసే ప్లాన్‌లో ఉన్నాం. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాన్నగారు ‘సోగ్గాడే చిన్నినాయనా’ రెండో పార్టును ప్లాన్ చేస్తున్నారు. అంతా ఓకే అనుకుంటే ఆగస్టులో సెట్స్‌కు వెళ్లిపోతాం. ఇంకా కథలు వింటున్నాను. -
నాకా ఆందోళన లేదు
‘‘నేను చేసింది రెండు సినిమాలే (నిన్ను కోరి, మజిలీ). నేను ఎప్పుడూ రెండోసారి కథ చెప్పలేదు. సింగిల్ సిట్టింగ్‌లో స్టోరీ ఓకే అవుతుంది. ఆ తర్వాత టీమ్‌తో ఆ కథ గురించి చర్చలు జరుపుతా’’ అని దర్శకుడు శివ నిర్వాణ అన్నారు. నాగచైతన్య హీరోగా శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మజిలీ’. ఈ చిత్రంలో సమంత, దివ్యాంక కౌశిక్ కథానాయికలుగా నటించారు. పూర్ణ పాత్రలో నాగచైతన్య, శ్రావణి పాత్రలో సమంత నటించారు. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శివ నిర్వాణ చెప్పిన విశేషాలు. ► ‘నిన్ను కోరి’ చిత్రానికి మంచి అభినందనలు వచ్చాయి. రవితేజ, మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌గార్లు మాట్లాడారు. ఇలాంటి పాయింట్‌తో కథ చెప్పి ఎలా ఒప్పించావ్? అని ఎక్కుమంది అన్నారు. నేను ఒప్పించడం కాదు. నానీగారు ఒప్పుకోవడం గొప్ప అన్నాను. ► ఆ తర్వాత నాగచైతన్యగారు ఫోన్ చేసి, తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపడా ప్రేమకథ ఏమైనా ఉంటే చెప్పమన్నారు. 20 రోజుల తర్వాత ఐడియాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ‘మజిలీ’ సినిమా తట్టింది. ‘క్రికెట్.. ప్రేమ.. పెళ్లి’ అనే మూడు అంశాలను తీసుకుని మిడిల్ క్లాస్ డ్రామాతో క్లబ్ చేయాలనే ఆలోచనలోంచి ఈ సినిమా కథ వచ్చింది. సింగిల్ నరేషన్లో చైతన్యగారు ఒప్పుకున్నారు. 19 ఏళ్ల కుర్రాడిలా, 34 ఏళ్ల వ్యక్తిలా ఇలా చైతన్యను స్క్రీన్‌పై ఎలాగైనా చూపింవచ్చు. అది కూడా ప్లస్ అయ్యింది. అలా ‘మజిలీ’ ప్రయాణం మొదలైంది. ‘నిన్ను కోరి’ లవ్‌స్టోరీ. ‘మజిలీ’ మాస్ లవ్‌స్టోరీ అని చెప్పగలను. వెంట వెంటనే సేమ్ జానర్లో సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ ‘నిన్ను కోరి’ కంటే ‘మజిలీ’ చిత్రానికి ఎక్కువ కష్డపడ్డాం. ఇది ట్రయాంగిల్ లవ్‌స్టోరీ కాదు. ముగ్గురు (చైతన్య, సమంత, దివ్యాంక) ఒక ఫ్రేమ్‌లో ఉండరు. అదే ‘నిన్ను కోరి’కి, మజిలీ సినిమాకు డిఫరెన్స్. డేట్స్ క్లాష్ వల్ల సంగీత దర్శకుడు గోపీసుందర్‌గారు రీ–రికార్డింగ్ చేయలేకపోయారు. ఆ తర్వాత తమన్‌గారు వచ్చారు. బాగా చేశారు. ► క్రికెటర్ కావాలనుకున్న పూర్ణ లైఫ్‌లో ఫెయిల్ అవుతాడు. అతనికి 30 ఏళ్లు దాటినా గతంలో నుంచి బయటకు రావడానికి ఇష్టపడడు. అలాంటి పూర్ణను గతంలోంచి లాగటానికి అతని భార్య శ్రావణి ఏం చేసిందనే పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. నా సినిమాల్లో నా రియల్‌లైఫ్, నా స్నేహితుల జీవితాల్లోని సంఘటనలు ఉంటాయి. సెన్సిబుల్ కథలను నిర్మాతలు అర్థం చేసుకుంటే ఇంకా మంచిసినిమాలు వస్తాయని నా అభిప్రాయం. ఈ చిత్రనిర్మాతలు బాగా సహకరించారు. ► సమంతగారు ఎప్పుడూ బాగా నటిస్తారు. కానీ చైతన్య ఈ సినిమాలో అద్భుతంగా చేశారు. చైలో ఎంత సామర్థ్యం దాగి ఉందో స్క్రీన్‌పై తెలుస్తుంది. నాగార్జునగారు ఇంకా సినిమా చూడలేదు. ► ట్రైలర్లో గమనిస్తే ఓ షాట్లో చైతన్యకు సమంత గొడుగు పడుతుంది. అది ఇంట్రవెల్లో వస్తుంది. ‘నిజజీవితంలో నిజంగా అలాంటి భార్యలు ఉంటారా?’ అని చాలామంది అడిగారు. మనకు తెలియదు కానీ మన∙లైఫ్‌లో మన వైఫ్లు మన కోసం నిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. మనం గుర్తించం అంతే. అయితే అందరూ గొడుగులు పట్టక్కర్లేదు. అది చెప్పడానికే ట్రై చేశాను. ► వెధవలకు మంచి పెళ్లాలే దొరుకుతారు అనేది పూర్ణ పాత్రను పోసానిగారు చూసిన దృష్టికోణంలోనిది. అది జనరలైజ్ చేసి చెప్పింది కాదు. నటీనటుల ఇమేజ్ గురించి పెద్దగా ఆలోచించను. థియేటర్లోకి ప్రేక్షకులు వెళ్లాక కథలో నాగచైతన్య గుర్తుంటే నేను ఫెయిలైనట్లే. పూర్ణ గుర్తు ఉంటే నేను సక్సెస్ అయినట్లు. ► నా తొలి సినిమా ‘నిన్ను కోరి’ సక్సెస్ అయ్యింది. రెండో సినిమా జాగ్రత్త అని చాలామంది అన్నారు. కానీ నాకా ఆందోళన లేదు. ఈ రెండో సినిమా దాటేస్తే... మూడో సినిమా ఫ్లాప్ కొట్టినా.. పర్లేదా.. నాలుగో సినిమా వస్తుందా? అని అడిగాను. రెండు కథలను పక్కన పెట్టేలా చేసింది ఈ సినిమా. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. ► ప్రస్తుతం నా దగ్గర ఒక కామెడీ, ఓ యాక్షన్ థ్రిల్లర్ కథలు రెడీగా ఉన్నాయి. ఏది చేస్తాను అనేది ‘మజిలీ’ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. -
ట్రైలర్ చూస్తుంటే కన్నీళ్లొచ్చాయి
‘‘ఏ మాయ చేసావె’ సినిమా చూసినప్పుడు చైతు, సమంత చక్కటి జంట అనుకున్నా. ‘మనం’ సినిమాలో వీళ్లిద్దరూ నాతో కలిసి నటించారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని నాకు అప్పుడు తెలియదు. నాకు ఏమాత్రం తెలియకుండా సైలెంట్‌గా రొమాన్స్ చేస్తున్నారని ఆ తర్వాత తెలిసింది’’ అని నాగార్జున అన్నారు. నాగచైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. గోపీ సుందర్ స్వరాలు అందించారు. ఇందులోని తొలి నాలుగు పాటలను నిర్మాత నవీన్ ఎర్నేని, డైరెక్టర్లు పరశురామ్, బాబీ (కె.ఎస్.రవీంద్ర), సందీప్ రెడ్డి వంగా విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్‌ను వెంకటేశ్ ఆవిష్కరించారు. పాటల సీడీని వెంకటేశ్ విడుదల చేసి నాగార్జునకు అందించారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘మజిలీ’ టీజర్లో ‘వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్లాలే దొరుకుతారు’ అనే డైలాగ్ విన్నప్పుడు బాధ కలిగింది. తండ్రిగా నాకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. కానీ, నేను చెప్పేది సినిమా చూడకముందు. కానీ, సినిమా చూసిన తర్వాత మా మంచి అబ్బాయికి, మంచి అమ్మాయి దొరికిందనిపించింది. ఏప్రిల్ 6న మాకు మంచి ఉగాది అవుతుంది. ‘మజిలీ’ ట్రైలర్ చూస్తుంటే రెండుసార్లు కన్నీళ్లొచ్చాయి. సినిమా ఇంకెంత బావుంటుందో’’ అన్నారు. వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘మజిలీ’ టీజర్ చూడగానే చాలా పెద్ద హిట్ అవుతుందనిపించింది. ట్రైలర్ చూడగానే చాలా చాలా పెద్ద పెద్ద హిట్ అవుతుందని అనుకున్నా. ‘సినిమా చూసిన తర్వాత అందరూ చైతూని కౌగలించుకుంటారని’ శివ నిర్వాణ అన్నాడు. నేను ట్రైలర్ చూడగానే కౌగలించుకుంటున్నాను. శ్యామ్, చైతూ, దివ్య చాలా బాగా చేశారు. ఏప్రిల్ 5న ఫ్యాన్స్ ఉగాది పండగను భారీగా చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాల్లో చైతూ, శ్యామ్ అద్భుతంగా నటిస్తారు’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘శివగారు ఈ సినిమా గురించి అడగ్గానే నాకు ఓకే అనిపించింది. శ్యామ్.. నాకు ఇంకో హీరోయిన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు. నాన్న, వెంకీమామ నా పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. శ్యామ్, నేను పెళ్లి తర్వాత ఇంత త్వరగా కలిసి సినిమా చేస్తామనుకోలేదు. నేను ఇప్పటిదాకా పనిచేసిన వాళ్లల్లో శివ హానెస్ట్ ఫిల్మ్ మేకర్. వ్యక్తిగా కూడా నిజాయతీపరుడు. తనతో చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా. సాహు, హరీష్ చాలా మంచి నిర్మాతలు. నాకు, శ్యామ్‌కి ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ సినిమాకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.. కామ్‌గా ఉన్నాం. ‘మజిలీ’ చూసి ఎవరూ అసంతృప్తికి లోనవరు’’ అన్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘నాగార్జున, వెంకటేశ్‌గార్ల వల్ల ఒక పాజిటివ్ నమ్మకం వచ్చింది. వాళ్ల ప్రభావం మా మీద చాలా ఉంది. ప్రతి లవ్ స్టోరీ చాలా యూనిక్‌గా ఉంటుంది. ‘మజిలీ’ నిజమైన లవ్‌స్టోరీ. ‘ఏమాయ చేసావె, మనం’ తర్వాత ‘మజిలీ’ నాకు ఇంపార్టెంట్ సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అందుకు శివగారికి ధన్యవాదాలు. మా ఆయన గురించి నేనే చెబితే బాగోదు. కానీ, ఏప్రిల్ 5 తర్వాత అందరూ చెబుతారు. నేను అది విని ఆనందిస్తాను’’ అన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘నిన్ను కోరి’ చిత్రం తర్వాత జానర్ మారుద్దామనుకున్నా. అప్పుడు నాగచైతన్యగారు ఫోన్ చేసి ‘నీ సినిమా నచ్చింది. నీకు నచ్చిన కథ ఉంటే తీసుకురా చేద్దాం’ అన్నారు. ఆ సమయంలో నా దగ్గర కథ లేదు. 20 రోజుల తర్వాత వచ్చిన ఓ ఐడియాని చైతన్యగారి దగ్గరకు వెళ్లి చెప్పా. సినిమాని మార్కెట్ చేసుకోవాలని చైతన్య, సమంతని పెట్టలేదు. వాళ్ల నటనను గౌరవించి పెట్టా. సమంతగారితో ఎన్ని సినిమాలకు పని చేయడానికైనా నేను సిద్ధమే. అటు ఎలక్షన్, ఇటు ఐపీయల్ ఉన్నా అంతకుమించిన కిక్కు మా సినిమాలో ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాకు మా చైతన్యగారు, సమంతగారు అందించిన సపోర్టు మరువలేనిది. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు నిర్మాత సాహు గారపాటి. నిర్మాత హరీశ్, కథానాయిక దివ్యాంశ కౌశిక్, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు. -
గ్లామర్ పాత్రలకు సిద్ధమే
‘‘మాది ఢిల్లీ. మూడేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. అలా ఆడిషన్స్‌లోనే ‘మజిలీ’ సినిమాకు ఎంపిక అయ్యాను. తెలుగులో నా తొలి చిత్రమిది’’ అని దివ్యాంశా కౌశిక్ అన్నారు. నాగచైతన్య హీరోగా, సమంత, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దివ్యాంశా కౌశిక్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో నా తొలి చిత్రం సిద్ధార్థ్‌తో చేస్తున్నాను. అది మే లేదా జూన్‌లో విడుదలవుతుంది. ‘మజిలీ’ చిత్రంలో నా పాత్ర పేరు అన్షు. చైతన్యను ప్రేమించే అమ్మాయిగా కనిపిస్తాను. నాగచైతన్య డౌన్ టు ఎర్త్ పర్సన్. అమేజింగ్ కోస్టార్. చైతన్యతో కలిసి నటించినందుకు ఆనందంగా ఉంది. ఇందులో సమంతతో కలిసి నటించలేదు. తెలుగులోకి ఎంట్రీ కాకముందు ‘ఏమాయ చేసావె’ సినిమా చూశాను. చైతన్య–సమంత పెయిర్‌ను బాగా ఇష్టపడ్డాను. ‘అర్జున్ రెడ్డి, నిన్ను కోరి’ చిత్రాలు చూశాను. ‘రంగస్థలం, ఆర్ఎక్స్ 100’ సినిమాలు చూడాలి. సమంతగారు నటించిన ‘ఈగ’ సినిమా హిందీ అనువాదాన్ని ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. డైరెక్టర్ శివగారు ఇచ్చిన స్వేచ్ఛ, నాలో నింపిన నమ్మకంతో ‘మజిలీ’లో బాగా నటించాను. తెలుగుతో పోల్చితే తమిళ్లో నటించడం కొంచెం కష్టంగా అనిపించింది. కంటెంట్ ఉన్న సినిమాలే కాదు.. గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. బాలీవుడ్లో ఆలియా భట్, కరీనా కపూర్, అనుష్కా శర్మలను ఇష్టపడతాను. ఇక్కడ సమంత నటనంటే ఇష్టం. కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.. వివరాలు త్వరలో చెబుతా’’ అన్నారు. -
బంగార్రాజు భలే నాయనా
సోగ్గాడే చిన్ని నాయనా.. బొమ్మ అదిరింది నాయనా అని సినిమా చూసినవాళ్లు అన్నారు. మూడేళ్ల క్రితం సంక్రాంతికి సోగ్గాడిగా సందడి చేసిన బంగార్రాజుని మళ్లీ చూపించనున్నారు చిత్రదర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఫస్ట్ పార్ట్‌లో నాగార్జున మాత్రమే సందడి చేశారు. రెండో భాగంలో కొడుకు నాగచైతన్య కూడా కలుస్తున్నారు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ తాతామనవళ్లలా కనిపించనున్నారు. తొలి భాగంలో నాగ్ సరసన నటించిన రమ్యకృష్ణ మలి భాగంలోనూ ఉంటారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట. కథ బాగా కుదిరిందని, ప్రతి పాత్ర ఆడి యన్స్‌కు కనెక్ట్ అయ్యేలా కల్యాణ్ కృష్ణ స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారని తెలిసింది. అంటే ఈసారి బంగర్రాజు భలే నాయనా అనిపిస్తాడన్నమాట. ప్రీ–ప్రొడక్షన్ పనులను త్వరలోనే కంప్లీట్ చేసి సినిమాను జూన్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మన్మథుడు’ సినిమా సీక్వెల్ చేయడానికి నాగార్జున గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా కాకుండా బాలీవుడ్లో ‘బ్రహ్మాస్త్ర’ అనే పీరియాడికల్ మూవీలో నాగార్జున ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
లవ్వింపు.. కవ్వింపు
లవ్వింపులు, కవ్వింపులు, నవ్వింపులు లేని సంసారం ఉంటుందా? చిన్ని చిన్ని అలకలు, పెద్ద పెద్ద గొడవలు లేని జంటలు కూడా ఉండవు. పూర్ణ, శ్రావణిల జీవితంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ భార్యాభర్తల ప్రయాణంలో వచ్చిన మలుపులు ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పూర్ణగా నాగచైతన్య శ్రావణిగా సమంత నటించిన చిత్రం ‘మజిలీ’. పెళ్లయ్యాక తొలిసారి నటించిన ఈ చిత్రంలో ఇద్దరూ భార్యాభర్తల పాత్రల్లోనే కనిపిస్తారు. శివనిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీ¯Œ ్స బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. శివ నిర్వాణ మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే మధ్యతరగతి భర్తగా ఈ చిత్రంలో నాగచైతన్య కనిపిస్తారు. అలాగే సమంత తన నటనతో నవ్విస్తారు... ఏడిపిస్తారు. మరో కథానాయికగా నటించిన దివ్యాంశ కౌశిక్ పాత్ర కూడా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుంది. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మంచి ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు 80 లక్షల వ్యూస్ వచ్చాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు శర్మ. -
సెక్యూరిటీ పెంచారు!
గోదావరి నది ఒడ్డున ‘వెంకీ మామ’ హంగామా షురూ అయింది. అల్లుడు నాగ చైతన్యతో కలసి వెంకటేశ్ ఆటాపాటా మొదలెట్టారు. వీరి అల్లరి చూసి గోదావరి ప్రేక్షకులు తెగ సంబరపడిపోయారు. అక్కడితో ఆగకుండా ఆ ఆనందాన్ని సెల్‌ఫోన్స్‌తో షూట్ చేసి ఆన్లైన్లో పోస్ట్ చేశారు. దీంతో ‘వెంకీ మామ’ టీమ్ కొంచెం గుస్సా అయ్యారని టాక్. కేయస్ రవీందర్ (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ‘వెంకీ మామ’ అనే మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతోంది. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలోనూ మామా, అల్లుడి పాత్రల్లో వెంకీ, చైతన్య కనిపిస్తారు. రైస్ మిల్ ఓనర్ పాత్రలో వెంకీ, మిలటరీ అధికారి పాత్రలో చైతన్య నటిస్తున్నారు. ఇటీవల షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇలా జరగకుండా సెక్యూరిటీ గట్టిగా పెంచాలని ఫిక్స్ అయ్యారట చిత్రబృందం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ‘వెంకీ మామ’ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. -
ఇంట్లో ఇల్లాలు... గ్రౌండ్లో ప్రియురాలు
2017 అక్టోబర్ 6... నాగచైతన్య, సమంత తమ ప్రేమ ప్రయాణంలో పెళ్లి అనే ‘మజిలీ’ని చేరుకున్న రోజు. పెళ్లి తర్వాత వారిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ‘మజిలీ’. ఇందులో ఇద్దరూ భార్యాభర్తలుగానే నటిస్తున్నారు. ‘దేర్ ఈజ్ లవ్.. దేర్ ఈజ్ పెయిన్’ అనేది ఉపశీర్షిక. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్రనిర్మాతలు తెలిపారు. జనవరి 1న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌లో గడ్డంతో సమంత సరసన కనిపించారు చైతూ. సంక్రాంతి సందర్భంగా సోమవారం ఈ చిత్రం సెకండ్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో చేతిలో బ్యాట్, క్లీన్ షేవ్‌తో కనిపించారు చైతూ. అయితే ఈసారి ఫొటోలో సమంత కనిపించడంలేదు. రెండో హీరోయిన్గా చేస్తున్న దివ్యాంశ కౌశిక్ ఆత్మీయంగా చైతూని హగ్ చేసుకుని కనిపిస్తున్నారు. ఇంట్లో ఇల్లాలు సమంత అయితే గ్రౌండ్లో ప్రియురాలు దివ్యాంశ అనుకోవాలేమో. అంటే.. ఇదేమైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? ఏప్రిల్‌లో తెలుసుకుందాం. ఈ చిత్రకథ మాత్రం విశాఖపట్నం నేపథ్యంలో ఉంటుందట. రావు రమేశ్, పోసాని కృష్ణముర ళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: విష్ణు వర్మ. -
హాలిడే ఇంకా అవ్వలేదు
టాలీవుడ్ లవ్లీ కపుల్ నాగచైతన్య, సమంతల న్యూ ఇయర్ హాలిడే ఇంకా ముగిసినట్టుగా లేదు. ఆమ్స్టర్డమ్ అందాలను ఇంకా చూస్తూ గడిపేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం నాగచైతన్య, మరికొంత మంది స్నేహితులతో కలసి హాలిడేకి వెళ్లారు సమంత. అక్కడ తాము చేస్తున్న అల్లరంతా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారామె. తాజాగా ఈ ట్రిప్‌లో పలు ఫొటోలను పంచుకున్నారు. సినిమాల విషయానికి వస్తే సమంత, నాగచైతన్య ప్రస్తుతం ‘మజిలీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భార్యాభర్తలుగానే నటిస్తున్నారు. -
ఇక తెలుగులో జోరుగా..
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ఆఫర్లతో గతేడాది జోరు చూపించారు ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్పైడర్’ చిత్రం తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదామెæ. 2017 సెప్టెంబర్ 27న ఆ సినిమా విడుదలైంది. 2018లో ఆమె నటించిన ఏ ఒక్క సినిమా కూడా తెలుగులో విడుదల కాలేదు. ప్రస్తుతం ఆమె హిందీ, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కొంచెం గ్యాప్ తర్వాత టాలీవుడ్‌పై మళ్లీ దృష్టి సారించినట్టున్నారు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘వెంకీ మామ’లో చైతూతో జోడీ కట్టనున్నారు. ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’ సినిమాలో శ్రీదేవి పాత్ర చేసిన రకుల్ తాజాగా నితిన్ సరసన ఓ సినిమా అంగీకరించారట. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందనున్న చిత్రంలో రకుల్‌ని తీసుకున్నా రట. ఇవి కాకుండా మరికొన్ని తెలుగు సినిమాలకు చర్చలు జరుగుతున్నాయట. -
ప్రేమ మజిలీ
నాగచైతన్య, సమంతల ప్రేమ మజిలీ ఎందాకా వచ్చిందీ అంటే... ‘అదేంటీ.. పెళ్లి చేసుకున్నారు కదా’ అనే సమాధానం వస్తుంది. అది రియల్ లైఫ్‌లో. ఇప్పుడు రీల్ లైఫ్‌లో కూడా వీళ్ల ప్రేమ మజిలీ పెళ్లితోనే మొదలవుతుంది. పెళ్లయ్యాక ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఇందులో ఇద్దరూ భార్యాభర్తలుగానే కనిపిస్తారు. ‘నిన్నుకోరి’ చిత్రంతో డీసెంట్ హిట్‌ను అందించిన దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే డెహ్రాడూన్, వైజాగ్‌లలోని అందమైన లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. ఇప్పటివరకూ జరిపిన షెడ్యూల్స్‌తో దాదాపు సగం షూటింగ్ పూర్తయింది. సినిమా అంతా లవ్ సీక్వెన్స్‌లతో చాలా కొత్తగా ఉండబోతుంది అంటున్నారు చిత్రబృందం. ఈ సినిమాను వచ్చే ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసినట్టు సమాచారం. -
జోడీ కుదిరిందా?
నాగచైతన్యకు కొత్త అత్తయ్య దొరికింది. కొత్త అత్తయ్య ఏంటి? అని కన్ఫ్యూజ్ కావొద్దు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘వెంకీమామ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆల్రెడీ నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్ సింగ్ ఓకే అయ్యారు. గతేడాది వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో కలిసి నటించారు చైతన్య అండ్ రకుల్. ఇక వెంకటేశ్‌కు జోడీగా కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించిన తర్వాత ఫైనల్‌గా శ్రియను కన్ఫార్మ్ చేశారని తాజా సమాచారం. ఇంతకు ముందు ‘సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల’ సినిమాల్లో జంటగా కనిపించారు వెంకీ అండ్ శ్రియ. నిజజీవితంలో మామాఅల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య ఈ సినిమాలో కూడా మామా అల్లుళ్లగానే నటించనున్నారు. ఒకవేళ ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రియ ఫిక్స్ అయితే ఈ చిత్రంలో నాగచైతన్యకు శ్రియ వరసకు అత్తయ్య అవుతారు కదా! ఇలా రీల్‌లైఫ్‌లో నాగచైతన్యకు కొత్త అత్తయ్య దొరికినట్లే? మరి.. మామాఅల్లుళ్లకు జోడీలు కుదిరిన ట్లేనన్నమాట. -
సెలబ్రేషన్@గోవా
నాగచైతన్య, సమంతల పెళ్లి గతేడాది గోవాలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ చైతన్య, సమంత గోవా వెళ్లారు. గురువారం నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా గోవా వెళ్లారు చై, సామ్. బర్త్‌డే వేడుకలను గోవాలో సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘హోమ్ స్వీట్ హోమ్ గోవా’ అని ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో పేర్కొన్నారు సమంత. ఇక సినిమాల విషయానికి వస్తే... ‘మజిలీ’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్, నాగచైతన్యల ‘వెంకీమామ’ సినిమా డిసెంబర్లో స్టార్ట్ కానుంది. అలాగే సమంత నటించనున్న లేడీ ఒరియంటెడ్ మూవీ ‘మిస్. గ్రానీ’కి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. -
అలకలు... బుజ్జగింపులు!
సమంత, నాగచైతన్యల మధ్య మొదలైన గొడవలు ఇంకా సద్దుమణగలేదు. అందుకే శ్రీమతి అలకను తీర్చడానికి వైజాగ్‌లోని బడికి, గుడికి, రైల్వేస్టేషన్‌కి వెళ్లొచ్చారట నాగచైతన్య. అసలు గొడవ ఏంటీ? సమంతను బుజ్జగించేంత తప్పు నాగచైతన్య ఏం చేశారు? అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా ‘మజిలీ’ (వర్కింగ్ టైటి ల్)అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వైజాగ్‌లో ప్రారంభమైన ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. ముఖ్యంగా రైల్వేస్టేషన్లో చైతన్య, సమంతలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే బడి, గుడికి సంబంధించిన సీన్స్ తీశారట. ఈ సీన్స్ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తాయట. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో మాజీ క్రికెటర్‌గా నాగచైతన్య, రైల్వే ఉద్యోగినిగా సమంత కనిపిస్తారని సమాచారం. స్క్రిప్ట్ పరంగా తరచూ గొడవపడే భార్యాభర్తలుగా నటిస్తున్నారు చైతన్య, సమంత. గొడవలన్నీ సినిమా పాత్రలపరంగానే. రియల్ లైఫ్‌లో ఈ ఇద్దరూ హ్యాపీ కపుల్. అన్నట్లు.. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న తాజా సినిమాలో దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నారు. తనికెళ్ల భరణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ స్వరకర్త. అన్నట్లు... ఈ రోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తాజా సినిమా లుక్‌ని రిలీజ్ చేశారు. -
ప్రేమ పేచీలు
‘‘పెళ్లయిన తర్వాత చాలా సంతోషంగా ఉంటున్నాం. గొడవలేం పడటంలేదు. కానీ ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసమే చాలా గొడవలు పడుతున్నాం’’ అంటున్నారు నాగచైతన్య, సమంత. పెళ్లి తర్వాత తొలిసారి ఈ ఇద్దరూ కలసి ‘మజిలీ’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరికపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు. పెళ్లి తర్వాత సాగే మెచ్యూర్డ్ లవ్‌స్టోరీగా ఈ చిత్రకథ సాగుతుంది. ఇందులో సమంత, నాగచైతన్య పాత్రలు ఎక్కువగా గొడవలు పడుతుంటాయి. ఆ పేచీలన్నీ ఎందుకో తెలియాలంటే విడుదల వరకూ ఆగాల్సిందే. హైదరాబాద్‌లో కొంత పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్లాన్ చేశారట చిత్రబృందం. ఓ నాలుగు రోజులపాటు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు దర్శకుడు శివ. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
పెళ్లయ్యాక మారిపోయా
‘‘పెళ్లి తర్వాత లైఫ్‌లో ఒక బ్యాలెన్స్ వచ్చింది. జీవితంలో ఎదురయ్యే ఎత్తు పల్లాలను తట్టుకోగలననే నమ్మకం ఏర్పడింది. హ్యూమన్ బీయింగ్‌గా ఇంకా బెటర్ అయ్యాననిపిస్తోంది’’ అన్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ‘సవ్యసాచి’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు... ‘ప్రేమమ్’ రిలీజ్ తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ‘సవ్యసాచి’ కథ చెప్పాడు చందు. కథ నచ్చింది. ‘ట్విన్ వ్యానిషింగ్ సిండ్రోమ్’ అనే కొత్త పాయింట్‌తో సినిమా కదా అని స్టార్టింగ్‌లో కాస్త భయపడ్డాను. రెండు మూడు షెడ్యూల్స్ తర్వాత ఆ భయం పోయింది. ‘ప్రేమమ్’ సినిమాను రీమేక్ చేద్దామనుకున్నప్పుడు కూడా ఆలోచించుకోమని కొందరు సలహాలు ఇచ్చారు. కానీ వర్కౌట్ చేశాం. నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దాంతో చందూపై ఉన్న నమ్మకం పెరిగింది. యాక్టర్‌గా నాలో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఆయన ఒక కారణం. చందూ కొత్తగా ఆలోచిస్తాడు. అన్నీ కుదిరితే చందుతో మరో సినిమా చేస్తాను. ►మాధవన్‌గారు సూపర్‌గా చేశారు. ‘సఖి’ సినిమాతో ఆయన ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ‘విక్రమ్ వేదా, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాలోనూ అదే చేస్తున్నారు. యాక్టర్‌గా ఆయన దగ్గర్నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. భూమికగారు బాగా చేశారు. కీరవాణిగారి సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. నా బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా మూమెంట్స్‌ను కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్‌కు థ్యాంక్స్. నిధి అగర్వాల్ ఆల్‌రౌండర్. మంచి డ్యాన్సర్. ‘హాలోబ్రదర్’ సినిమాలోని నాన్నగారి(నాగార్జున) క్యారెక్టర్స్‌తో ఈ సినిమాకు సంబంధం లేదు. అక్కడ ట్విన్స్ ఉంటారు. ఇక్కడ ఒకే శరీరంలో ట్విన్స్ ఉంటారు. గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అయ్యింది. ►ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణగారికి ఫ్యాన్‌ని నేను. మా సినిమాకు బాగా వర్క్ చేశారు. నా సినిమానే కాదు ‘అంతరిక్షం’ సినిమా సెట్స్‌ను కూడా చూశాను. ఒక తెలుగు టెక్నీషియన్ ఆ రేంజ్లో చేస్తున్నారంటే అది మంచి పరిణామం. ►నిర్మాణ విలువల పరంగా ఇప్పటివరకు నా కెరీర్లో మైత్రీ మూవీ మేకర్స్‌కు ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. ఎందుకంటే వాళ్లు కంటెంట్‌ని నమ్మి సినిమా తీశారు. నిజాయతీగా చెప్పాలంటే నాకు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌కు అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ పెట్టారు. మార్కెట్ ఏంటీ? ఎంత లాభం అనే విషయాలను ఆలోచించకుండా కథపై నమ్మకంతో ఖర్చు పెట్టారు. ►అసరమైతే రీషూట్ చేయాలన్న నాన్నగారి ఫార్ములాను నేను నమ్ముతాను. కచ్చితంగా రీషూట్స్ చేయాలనే ఫార్ములా లేదు. డౌట్స్ ఉన్నప్పుడు చేయడంలో తప్పులేదు. సినిమా రిలీజైన తర్వాత ఆ సీన్ రీపేర్ చేసి ఉన్నట్లయితే బాగుండేది. ఇప్పుడు ఆడియన్స్ చెబుతున్న ఆ మార్పు అప్పుడే మనకు అనిపించింది కదా. అప్పుడే చేసి ఉంటే బాగుండు అని అంతా అయిపోయాక ఆలోచించడంకన్నా సెట్స్‌లో ఉన్నప్పుడే రీషూట్స్ చేయడం మంచిదే అని నా అభిప్రాయం. ప్రపంచంలో ఉన్న టాప్ యాక్టర్స్, హీరోలు రీషూట్స్ చేస్తారు. రీషూట్స్ అంటే అది బెటర్మెంట్ అని నా అభిప్రాయం. ►‘శైలజారెడ్డి అల్లుడు’ రిజల్ట్ విషయంలో ఓపెనింగ్ కలెక్షన్స్ పరంగా హ్యాపీగానే ఉన్నాను. ప్రతి సినిమా స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అవుతాను. కానీ ఒక లైన్ దాటి వెళ్లకూడదు. అది దర్శకుడికి మనం ఇచ్చే గౌరవంగా నేను ఫీలవుతాను. మారుతిగారు కథ చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యాను. కానీ రిజల్ట్స్‌ను ఊహించలేం కదా. ఇక ఒకే రోజు రిలీజైన ‘శైలజారెడ్డి అల్లుడు, యు–టర్న్’ సినిమాల పోటీ అనేది ఓ డిఫరెంట్ సిట్యువేషన్. రివ్యూస్ పరంగా ‘యు–టర్న్’ గెలిచింది (నవ్వుతూ). ►శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నేను, సమంత దంపతులుగానే నటిస్తున్నాం. స్క్రిప్ట్ పరంగా కథలో నాకు, సమంతకు గొడవలు ఎక్కువ. నటించడానికి అది కొంచెం కష్టంగా ఉంది. రియల్ౖ లెఫ్‌లో లేవు కదా (నవ్వుతూ). శివ మంచి డైరెక్టర్. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా షూటింగ్ పూర్తవుతుందని అనుకుంటున్నాం. ‘మజిలీ’ అనేది వర్కింగ్ టైటిల్‌గా పెట్టుకున్నాం. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ‘వెంకీమామ’ సినిమాను డిసెంబర్లో స్టార్ట్ చేస్తా. పౌరాణికం సినిమాలను టచ్ చేయాలని ఉంది. కానీ ముందు ఓ మూడు నాలుగు హిట్స్ సాధించాలి. ప్రస్తుతానికి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఇంకా సైన్ చేయలేదు. ►నా కెరీర్ స్టార్టింగ్‌లో నాన్నగారు కథలు విన్నారు కానీ ఇప్పుడు నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నాన్నగారు ‘సవ్యసాచి’ సినిమా చూశారు. కొన్ని సలహాలు చెప్పారు. నాన్నగారు చూస్తున్నప్పుడే ఎడిట్ రూమ్‌లో సమంత చూసింది. ►నాన్నగారి ‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ సాంగ్ రీమిక్స్ చేస్తున్నప్పుడు మొదట్లో కాస్త కంగారు పడ్డాను. కానీ అవుట్‌పుట్ చూసి హ్యాపీ ఫీలయ్యా. కీరవాణిగారు మంచి సంగీతం ఇచ్చారు. సెకండాఫ్‌కు ఈ సాంగ్ ప్లస్ అవుతుందన్న నమ్మకం ఉంది. -
హలోబ్రదర్తో సంబంధం లేదు
‘‘దర్శకుడిగా నాకు థ్రిల్‌తో కూడుకున్న డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలే నచ్చుతుంటాయి. అవే ప్రేక్షకులకు చెప్పాలని ప్రయత్నిస్తుంటాను’’ అని చందూ మొండేటి అన్నారు. నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చందూ మొండేటి పలు విశేషాలు పంచుకున్నారు. ► ‘ట్విన్ వానిషింగ్ సిండ్రోమ్’కి సంబంధించిన ఓ ఆర్టికల్‌ని మా ఫ్రెండ్ చూపించాడు. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఈ పాయింట్‌ని నా కథలో మిళితం చేసి చైతన్య, మైత్రీ నిర్మాతలకు చెప్పాను. అందరూ బాగా ఎగై్జట్ అయ్యారు. కొత్తగా ఉంటుందని అనుకున్నాం. అప్పుడే ‘సవ్యసాచి’ అనే టైటిల్ అయితే బావుంటుందనుకున్నాను. ► హీరోకు తెలియకుండానే తన ఎడమ చేయి పని చేస్తుందనే పాయింట్‌ని ట్రైలర్లో చూసి, ‘హలో బ్రదర్’ సినిమాతో పోలుస్తున్నారేమో. కానీ అలాంటిదేమీ లేదు. వీలున్న చోట మాత్రమే ఈ పాయింట్‌ని చూపించాం. కేవలం ఈ ఒక్క పాయింట్ చుట్టూనే కథ తిరగదు. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్స్, ఫైట్స్, మంచి లవ్ స్టోరీ అన్నీ సమపాళ్లలో ఉంటాయి. ► మాధవన్ ప్యాన్ ఇండియా యాక్టర్. ఆయన ఫస్ట్ సినిమా నుంచి చూస్తే అన్నీ విభిన్న సినిమాలే ఉంటాయి. నేను ఓ 45 నిమిషాలు కథ చెప్పగానే బావుంది చేద్దాం అనడంతో నమ్మకం వచ్చింది. ఆ తర్వాత కీరవాణి గారు తోడయ్యారు. ఆయన మార్క్ సంగీతం అందిచారు. ► లెగసీ ఉన్న హీరో మన సినిమాలో ఉన్నప్పుడు వాళ్ల ఫ్యామిలీ వాళ్ల పాటలు పెడితే అభిమానులకు, ప్రేక్షకులకూ సరదాగా ఉంటుంది. ‘నిన్ను రోడ్డు మీద చూసినది...’ రీమిక్స్ సాంగ్ సెకండ్ హాఫ్‌లో వస్తుంది. చైతూ ఫుల్ జోష్‌తో చేశాడు. సాంగ్ టీజర్లో మీరు చూసింది శ్యాంపిలే. ముందుగా ఈ పాటకు తమన్నాని అనుకున్నాం. కానీ మా స్క్రిప్ట్‌కు తగట్టుగా కుదర్లే దని నిధితో చేశాం. నిధీ కూడా మంచి డ్యాన్సర్. ► మేమేదో కొత్త పాయింట్ తీశాం అని చెప్పడం లేదు. ఆల్రెడీ ఉన్న ఓ విషయాన్ని మళ్లీ చూపిస్తున్నాం. ప్రేక్షకులకు కూడా ఓ కొత్త అనుభూతి ఇస్తుందని నమ్మాం. ‘మున్నా మైఖేల్’ చిత్రం చూసి నిధిని సెలెక్ట్ చేసుకున్నాం. బాగా చేసింది. నిర్మాతలు అడిగింది అడిగినట్టు ఇచ్చారు. ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో ఉంచుతారు. భూమికగారి పాత్ర నిడివి తక్కువైనా చాలా బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిత్రం ఆలస్యం అయింది. ► ముందు ‘చాణక్య’ అనే కథ కోసం చైతన్య, నేనూ కలిశాం. కానీ అది చేయడం కుదర్లేదు. ‘ప్రేమమ్’ రీమేక్ చేశాం. ‘సవ్యసాచి’ సినిమా కోసం చైతన్య చాలా కష్టపడ్డాడు. ► నెక్ట్స్ ‘కార్తికేయ 2 ’ లైన్ ఉంది. ఆ పాయింట్‌ని డీల్ చేసే సామర్థ్యం నాకింకా రాలేదనుకుంటున్నాను. నాగార్జునగారి కోసం ఓ స్క్రిప్ట్ రెడీగా ఉంది. కానీ నెక్ట్స్ ఏ సినిమా ఉంటుందో చెప్పలేను. -
‘సవ్యసాచి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
అందుకోసమే చైతుకు అమ్మాయిలు ఫోన్ చేసేవారట!
‘తాతగారు మెదలుపెట్టిన ప్రయాణం ఇది. నాన్నగారికి, సుమంత్ అన్నకు, నాకు, అఖిల్‌కు, సమంతకు ఇలా మా అందరికీ మీ ప్రేమాభిమానాలు, సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. తరాలు మారినా తరగని ప్రేమను అందిస్తున్నారు. కొన్నిసార్లు మిమ్మల్ని నిరుత్సాహపరిచాను, కొన్నిసార్లు ఎనర్జీ ఇచ్చాను. కానీ మనం అందరం ఇలా కలసి ఉండటం నాకు ముఖ్యం’’ అన్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిÔ¶ ంకర్, మోహన్ చెరుకూరి నిర్మించారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘ఈ వేడుకకు వచ్చినందకు కొరటాల శివగారికి, రౌడీ విజయ్‌కు థ్యాంక్స్. ఉదయం లేవగానే ఓ చెడు వార్త వినాల్సి వచ్చింది. మా కుటుంబానికి చాలా సపోర్ట్‌గా ఉన్న శివప్రసాద్‌గారు మనల్ని వదిలేసి వెళ్లిపోయారు. ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం అందరి కంటే చందు ఎక్కువగా కష్టపడ్డాడు. యునిక్ పాయింట్‌కి కమర్షియల్ పాయింట్స్ కలిపి మంచి సినిమా తయారు చేశాడు. కీరవాణిగారు తాతగారితో, నాన్నతో చేశారు. ఆయనతో కలసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీతో నాన్న పంచుకున్న జ్ఞాపకాలు ఎప్పుడూ మాతో పంచుకుంటారు. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నన్ని రోజులు అమ్మాయిలు ఫోన్ చేసి, షూటింగ్‌కి రావచ్చా? మాధవన్‌ని చూడొచ్చా అని అడిగేవాళ్ళు. ‘చెలి’ చూసినప్పటి నా ఫ్రెండ్స్ ఇంకా మిమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నారు. మీరు ఈ సినిమా అంగీకరించడంతో మా నమ్మకం ఇంకా పెరిగింది. మాధవన్ ఓ సినిమాని ఊరికే అంగీకరించరని మాకు తెలుసు. ఏదో కొత్తదనం లేకపోతే ఆయన ఒప్పుకోరు. ని«ధీ.. నువ్వు ఇక్కడ ఉండటానికి ఎన్ని కలలు కన్నావో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. భూమికగారు, ఇలా అందరికీ థ్యాంక్స్. మైత్రీ బ్యానర్ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకువెళ్లారు. మిమ్మల్ని (అభిమానులు) ఆనందపరచడం కోసం నిజాయితీగా పని చేస్తాను. నా కెరీర్లో ఇది పెద్ద సినిమా. కాంబినేషన్‌ని నమ్మి కాదు కంటెంట్‌ని నమ్మి సినిమా తీశారు. ఇలాంటి నిర్మాతలు మనకు కావాలి. ఈ సినిమా నిరుత్సాహపరచదు’’ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ – ‘‘నాగార్జునగారితో పని చేయడం ఎంత ఎంజాయ్ చేశానో చైతన్యతో పని చేయడం కూడా అంతే ఆనందించాను. రచయితలు అందరూ చక్కటి సాహిత్యం అందించారు. నిర్మాతలు ప్రతీది అడిగి తెలుసుకున్నారు. అడిగింది ఇచ్చారు’’ అన్నారు. ‘‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ ఇలా ప్రతీ సినిమాకు నేర్చుకుంటూ, మెరుగుపరుచుకుంటూ వస్తున్నాం. శివ గారికి, విజయ్ దేవరకొండకి ఈ ఈవెంట్‌కి వచ్చినందుకు థ్యాంక్స్. చైతన్యతో ఇంకో లవ్ స్టోరీ సినిమా చేయాలని ఉంది. మాధవన్గారూ.. తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్. ‘బాహుబలి’ తర్వాత కీరవాణిగారు ఈ సినిమానే చేశారు’’ అని నిర్మాతలు అన్నారు. మాధవన్ మాట్లాడుతూ– ‘‘మైత్రీ మూవీస్ వాళ్ల వల్ల స్ట్రయిట్ తెలుగు సినిమా చేశాను. వాళ్లు సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నారు. ఈ సినిమా కూడా సూపర్‌గా ఉంటుంది. సినిమాకు పని చేసిన వాళ్లందరూ సహృదయులు. ముఖ్యంగా నాగ చైతన్య. నేను మీ ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్‌ని చైతన్యా. నీతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. చందూతో పని చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మైత్రీ బ్యానర్ నా ఫ్యామిలీ లానే. పెద్ద హిట్ సాధిస్తారనుకుంటున్నాను. పవర్ఫుల్ టైటిల్‌తో వస్తున్నారు. టీమ్‌కు ఆల్ ది బెస్ట్. చైతన్య చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు’’ అన్నారు దర్శకుడు కొరటాల శివ. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ –‘‘మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రెండు సినిమాలు చేస్తున్నాను. వాళ్ల ప్యాషన్ అద్భుతం. మాధవన్‌గారిని తెలుగులో చూడటం ఆనందంగా ఉంది. చందూ మరో మంచి సినిమా తీశాడని అనుకుంటున్నాను. చైతన్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన హ్యాండ్‌షేక్, నవ్విన తీరుకే నచ్చేశారు. ఇండస్ట్రీలో ఎవరు చైతన్య గురించి మాట్లాడినా మంచి విషయాలే చెబుతారు. వ్యక్తిగా అంత మంచివాడు’’ అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన టీమ్‌కి థ్యాంక్స్. చైతూతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మాధవన్‌గారితో పని చేయడం మర్చిపోలేను’’ అన్నారు నిధి అగర్వాల్. రామకృష్ణ, మోనికా, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కెమెరామేన్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అంత డ్రామా వద్దన్నారు
హైదరాబాద్ టు ముంబై వయా బెంగళూరు... నిధి అగర్వాల్‌కి ఈ మూడు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. పుట్టింది హైదరాబాద్. చదువకున్నది బెంగళూరు. నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది ముంబైలో. ఇప్పుడు ‘సవ్యసాచి’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నాగచైతన్య, నిధి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ చెప్పిన విశేషాలు. ► ‘మున్నా మైఖేల్’ అనే హిందీ చిత్రం ద్వారా కథానాయికగా హిందీలో పరిచయమయ్యాను. అందులో టైగర్ ష్రాఫ్‌కు జోడీగా నటించాను. ఆ సినిమా చూసి చందూ మొండేటి ‘సవ్యసాచి’కి చాన్స్ ఇచ్చారు. హీరో నాగచైతన్య సరసన అవకాశం కావటంతో ఎగిరి గంతేశాను. చైతన్య మంచి కో–స్టార్. చిన్న చిన్న డిటేల్స్‌ను కూడా దర్శకుణ్ణి అడిగి తెలుసుకుంటాడు. సమంత, చైతూ ఇద్దర్ని చాలాసార్లు కలిశాను. వాళ్లిద్దర్నీ చూస్తున్నప్పుడు చైతూ ఎంత లక్కీయో అనిపించేది. ఇద్దరూ సోల్‌మేట్స్. సమంత గ్రేట్ అండ్ బ్యూటిఫుల్. ► ఈ సినిమా కోసం దాదాపు 40 రోజుల పైనే వర్క్ చేశాను. సినిమాలో గ్రాఫిక్స్ పార్ట్ ఎక్కువ. అందుకే ఎక్కువ టైమ్ పట్టింది. నాగార్జునగారి ఓల్డ్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు..’ పాటకు డాన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. కీరవాణి గారి మ్యూజిక్కు ఫిదా అయ్యాను. ఇప్పటివరకు రిలీజైన టీజర్‌ను, ట్రైలర్‌ను కొన్ని వందల సార్లు చూసుకున్నాను. అంత నచ్చాయి. ► నా గురించి చెప్పాలంటే.. మా ఇంట్లో నేను చాలా మొండిదాన్ని. నేను ఏదైనా కోరుకున్నానంటే అది జరిగి తీరాల్సిందే. ఆర్టిస్ట్ అవుతానని పేరెంట్స్ దగ్గర అమాయకంగా అడిగితే, ‘అంత డ్రామా క్రియేట్ చేయకు. నువ్వు ఏది కావాలంటే అదే జరుగుద్ది’ అన్నారు. ‘డోంట్ వర్రీ. మేమంతా నీతో ఉంటాం. కెరీర్‌ని సీరియస్‌గా తీసుకో.. అలాగే ఎంజాయ్ చెయ్’ అని ఎంకరేజ్ చేశారు. ► హ్యాపీగా ఉండాలంటే రోజూ శుభ్రంగా పనిచేయాలి. టైమ్‌కు తిని , చక్కగా నిద్రపోవాలి. హైదరాబాద్‌లో ఉన్నన్ని రోజులు పూర్ణ టిఫిన్ సెంటర్లో ఇడ్లీలు తింటూ (ఎన్నో చెప్పను– నవ్వుతూ), ఐమాక్స్‌లో సినిమాలు చూస్తూ గడిపేస్తాను. ఐ లవ్ హైదరాబాద్. ప్రస్తుతం అఖిల్‌తో ‘మిస్టర్ మజ్ను’ చేస్తున్నాను. కుదిరితే నాగార్జునగారితో కూడా చేయాలని ఉంది. పర్సనల్‌గా దీపికా పదుకోన్గారికి వీరాభిమానిని. ఆమె నాకు ఆదర్శం. బెంగళూర్‌లో చదువుకుని బాలీవుడ్లో అంత ఎత్తుకు ఎదిగారామె. మనం మాత్రం ఎందుకు ఎదగకూడదు? మనమూ ట్రై చేద్దాం అనుకున్నాను. అందుకే ఇండస్ట్రీకి వచ్చా. -
నాగచైతన్య ‘సవ్యసాచి’ ట్రైలర్ లాంచ్
-
కాంబినేషన్‌ని కాదు.. కంటెంట్‌ని నమ్మారు
నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, మోహన్ సీవీయం, రవిశంకర్‌లు నిర్మించారు. ‘కార్తికేయ, ప్రేమమ్’ చిత్రాల దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యం.యం. కీరవాణి సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు సుకుమార్ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చాలా బావుంది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇటువంటి సినిమా ఇంతవరకు రాలేదనుకుంటున్నాను. చాలా వెరైటీ సబ్జెక్ట్. ఇలాంటి సబ్టెక్ట్తో సినిమా చేయటం చందు అదృష్టం. కీరవాణి గారి సంగీతం గురించి నా స్నేహితుడు దేవీశ్రీ ప్రసాద్ ఎంతో గొప్పగా చెబు తుంటాడు. స్పూన్ కిందపడితే వచ్చే శబ్దం కూడా ఏ రాగమో కీరవాణిగారు చెబుతారని, ఆయన అంతటి సంగీత జ్ఞాని అని మేమిద్దరం మాట్లాడుకుంటాం. నిర్మాతల గురించి చెప్పాలంటే ముగ్గురూ మూడు పనులను పంచుకొని చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తారు. నా ‘100 పర్సెంట్ లవ్’ టైమ్‌లో హీరో చైతూ, నేను రెగ్యులర్‌గా 100 పర్సెంట్ టచ్‌లో ఉండేవాళ్లం. ఇప్పుడు సామ్ (సమంత)తో ఉన్నందువల్ల 99 పర్సెంట్ మాత్రమే టచ్‌లో ఉన్నాడు (నవ్వూతూ). ట్రైలర్లో చైతూ చాలా అందంగా ఉన్నాడు’’ అన్నారు. కీరవాణి మాట్లాడుతూ– ‘‘చందూతో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ జర్నీలో ఎన్నో సార్లు తిట్టాను, కసురుకున్నాను కూడా. తన మంచి కోసమే అనుకునేంత మంచి గుణం అతనిది’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మేము ‘ప్రేమమ్’ చేసే టైమ్‌లో వేరే కంట్రీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు చిన్న లైన్లో ఈ కథ చెప్పాడు చందూ. చాలా బావుంది అన్నాను. మా కాంబినేషన్ కంటే కంటెంట్‌ను నమ్మి చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌కు థ్యాంక్స్. ఏ సినిమాకైనా ట్రైలర్ విడుదలైనప్పుడు మెసేజ్‌లు వచ్చేవి. కానీ ఈ సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజవ్వగానే కాంప్లిమెంట్స్ వచ్చాయి’’ అన్నారు. ‘‘ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 27న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించబోతున్నాం. నవంబర్ 2న సినిమాని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు చిత్రనిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని. -
ఔటా? నాటౌటా?
క్రికెట్ గ్రౌండ్లోకి దిగారు నాగచైతన్య. కానీ, బ్యాటింగ్ చేయలేదు. బౌలింగ్ చేయలేదు. ఫీల్డింగ్‌లో బంతి కోసం పరిగెత్తనూ లేదు. కూల్‌గా ఎంపైరింగ్ చేశారట. అదేంటీ.. అంటే ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నమాట. నాగచైతన్య హీరోగా ‘నిన్నుకోరి’ ఫేమ్ శివనిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘మజిలీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగానే నాగచైతన్య ఓ క్రికెట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేశారని సమాచారం. అంపైరింగ్ అంటే సినిమా పరంగా నాగచైతన్య క్యారెక్టర్‌కు చాలా ఏజ్ ఉండాలి. అలాంటప్పుడు సినిమాలో కచ్చితంగా ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఏపిసోడ్ ఉంటుందని ఊహింవచ్చు. ఈ షూట్లో నటుడు సుబ్బరాజ్ కూడా పాల్గొన్నారు. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలున్నాయి. -
సవ్యసాచిలో సగాన్ని
‘ఒకే రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములు అంటారు. ఒకే రక్తం, ఒకే శరీరం పంచుకు పుడితే అద్భుతం అంటారు. వరసకు కనిపించని అన్నని, కడదాకా ఉండే కవచాన్ని. సవ్యసాచిలో సగాన్ని’ అంటున్నారు నాగచైతన్య. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధీ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సవ్యసాచి’. మాధవన్ విలన్‌గా నటించారు. ఈ చిత్రం టీజర్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రెండు చేతులను ఒకే బలంతో ఉపయోగించగలిగే సవ్యసాచిగా నాగచైతన్య కనిపించనున్నారు. టీజర్ చూస్తుంటే మంచి సైంటిఫిక్ కాన్సెప్ట్‌ను కమర్షియల్ చిత్రానికి జోడించినట్టున్నారు దర్శకుడు చందు. ‘‘నేను బాగా ఎగై్జట్ అయిన కాన్సెప్ట్ ఇది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని నాగచైతన్య పేర్కొన్నారు. నవంబర్ 2న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి యం.యం. కీరవాణి సంగీత దర్శకుడు. -
అందరికీ ధన్యవాదాలు
ప్రస్తుతం అక్కినేని కుటుంబం హాలీడే మూడ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య, ఆయన సతీమణి సమంత విదేశాలు వెళ్లారు. ఇద్దరు మాత్రమే కాదు.. వీళ్ల వెంట అఖిల్ కూడా స్పెయిన్ తీరప్రాంతంలోని ఇబిసా ప్రాంతానికి వెళ్లారు. అంతే కాదండోయ్.. నాగార్జున, ఆయన సతీమణి అమల కూడా ఈ సరదా ట్రిప్‌లో జాయిన్ అయ్యారు. ఈ హాలిడే ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సమంత. వీటిపై నెటిజన్లు కొందరు మండిపడుతున్నారు. ముఖ్యంగా సమంత వస్త్రధారణను విమర్శిస్తున్నారు. ఇలాంటి దుస్తుల ద్వారా సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావ్? అంటూ విమర్శించారు. ఈ విమర్శలకు సమంత ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో ఓ మేసేజ్ ఉంచారు. ‘‘నా పెళ్లి తర్వాత నేనెలా ఉండాలో చెబుతున్న వారందరికీ అంటూ... ఓ అసభ్యకరమైన సింబల్‌ని పోస్ట్ చేసి, ధన్యవాదాలు’’ అంటూ ముగించారు. అంటే.. పరోక్షంగా సమంత నా జీవితం.. నా ఇష్టం అనేలా చెబుతున్నట్లు ఉంది కదూ. ఇప్పుడు వీటిపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు అక్కినేని నాగచైతన్య, సమంతల పెళ్లి రోజు దగ్గర పడుతున్న (అక్టోబర్ 6) సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత చేయబోతున్న చిత్రం ఆ రోజు ప్రారంభం అవుతుందట. దీనికి ‘మజిలీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. అలాగే నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నారన్న వార్త కూడా ప్రచారంలో ఉంది. ఇక నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా నవంబర్ 2న విడుదల కానుంది. అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే -
చిన్న విరామం చిటికెలో వచ్చేస్తా
2018 సమంతకు గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఆమె నటించిన ‘రంగస్థలం, మహానటి, ఇరంబుదురై (తెలుగులో అభిమన్యుడు), యు టర్న్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. ఇటు నటన పరంగానూ సమంతకు మంచి పేరు తెచ్చాయి. అందుకే నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసేముందు చిన్న బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. తుర్రుమని విహారయాత్రకు వెళ్లారు. ‘‘ఫైనల్లీ.... వెకేషన్’’ అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారామె. తన భర్త నాగ చైతన్యతో కలసి సమంత ఓ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త చిత్రం చైతూ, సమంత పెళ్లి రోజు (అక్టోబర్ 6) న ఆరంభం కానుంది. ఈ షూటింగ్ స్టార్ట్ కాకముందే చిన్న బ్రేక్.. చిటికెలో రీఫ్రెష్ అయి, సెట్లో జాయిన్ అవ్వనున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తారు. ఇందులో చైతూ, సమంత దంపతుల్లానే కనిపిస్తారట. -
మూడు రోజుల్లో 23 కోట్లు.. నేను నమ్మలేకపోయా!
‘‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ఇచ్చి, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా కలెక్షన్స్ గురించి చెప్పినప్పుడు ముందు నమ్మలేకపోయా. ముఖ్యంగా మౌత్ టాక్ని చాలా పాజిటివ్‌గా స్ప్రెడ్ చేసిన వారికి, చేస్తున్నవారికి థ్యాంక్స్’’ అని నాగచైతన్య అన్నారు. ఆయన హీరోగా, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ, నరేశ్, పృథ్వీ ఇతర పాత్రల్లో నటించారు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో నాగవంశీ. ఎస్, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు 12 కోట్ల రూపాయలు వసూలు చేయగా, మూడు రోజులకి దాదాపు 23 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా లుక్ చాలా ఫ్రెష్‌గా, డిఫరెంట్‌గా, బాడీ లాంగ్వేజ్ చాలా ఎనర్జిటిక్‌గా ఉందని అంటున్నారు. ఒక యాక్టర్‌కి ఇవే బెస్ట్ కాంప్లిమెంట్స్. థ్యాంక్యూ మారుతిగారు. అప్పుడు ‘ప్రేమమ్’, ఇప్పుడు ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాలతో హిట్స్ ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘శైలజారెడ్డి అల్లుడ్ని తెలుగు ప్రేక్షకులు సొంత అల్లుyì లా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం వసూళ్లు మాకు చాలా ఆనందాన్ని, ఎనర్జీని ఇచ్చాయి. నా గత చిత్రాల కంటే ఈ చిత్రం బాగుందని ఫోన్లు చేస్తున్నారు’’ అన్నారు మారుతి. ‘‘ఈ సక్సెస్ మీట్‌కి కారణం ప్రేక్షకులే. వారికి థ్యాంక్స్’’ అన్నారు అనూ ఇమ్మాన్యుయేల్. నటులు నరేశ్, పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫి తదితరులు పాల్గొన్నారు. -
అవే నన్ను నిలబెట్టాయి
‘‘నేను చేసిన వెరైటీ రోల్స్ మాత్రమే నన్ను ఇలా నిలబెట్టాయి. అలాంటివి చేస్తూనే ఉంటాను. ‘శైలజా రెడ్డి అల్లుడు’ రెగ్యులర్‌గా కనిపించే అత్తా, అల్లుళ్లు కామెడీ మూవీలా ఉండదు. చూస్తే కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఇందులో కొత్త అత్త, కొత్త అల్లుణ్ని చూస్తారు’’ అని రమ్యకృష్ణ అన్నారు. నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా గురువారం రిలీజైంది. మంచి ఓపెనింగ్స్ సాధించిందని చిత్రబృందం పేర్కొంది. ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా రమ్యకృష్ణ సినిమా విశేషాలు పంచుకుంటూ – ‘‘నా బర్త్‌డే టైమ్‌లో రిలీజైన మా చిత్రం సూపర్ హిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అందరం జెన్యూన్‌గా కష్టపడ్డాం. ఇందులో మారుతిగారు నా కోసం రెండు షేడ్స్ ఉన్న పాత్ర రాశారు. చాలా స్పీడ్‌గా వర్క్ చేస్తారాయన. నా కెరీర్లో ఫాస్ట్‌గా కంప్లీట్ చేసిన మూవీ ఇదే. కామెడీ సీన్స్ మధ్యలో ఆపేసి మరీ నవ్వేవాళ్లం. నా చుట్టూ కామెడీ జరుగుతుంటే సీరియస్‌గా ఉండటం కష్టంగా అనిపించేది. చైతన్య వెరీ డౌన్ టు ఎర్త్. యాక్టర్‌గా చాలా బాగా ఎదుగుతున్నాడు. నన్ను కన్విన్స్ చేసే సీన్లో బాగా యాక్ట్ చేశాడు. -
వెంకీ మామా ఎప్పుడొస్తావ్?
మామా అల్లుళ్లు కలిస్తే వాతావరణం అంతా సందడి సందడిగా మారిపోతుంది. అలా నవ్వులు పూయించడానికి అక్టోబర్ నుంచి అల్లుడు నాగచైతన్యతో కలిసి రెడీ అవనున్నారు మామ వెంకటేశ్. కేయస్ రవీందర్ (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ కానుందని సమాచారం. ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. సినిమాలోనూ మామా అల్లుడిగా కనిపిస్తారు వెంకీ, చైతన్య. ఈ సినిమాలో వెంకటేశ్‌కి జోడీగా హ్యూమా ఖురేషి, నాగచైతన్యకు జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌కి ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. -
కొన్ని రోజులు డిజార్డర్స్‌కి బ్రేక్
‘‘ఈ మధ్య అన్నీ డిజార్డర్స్ (హీరో క్యారెక్టర్‌కి లోపం) తోనే సినిమాలు చేస్తున్నాం అని అంటున్నారు. ఈ సినిమాలో ఏ డిజార్డర్ ఉండదు. కొన్ని రోజులు డిజార్డర్స్‌కి బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పీడివీ ప్రసాద్, నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మారుతి చెప్పిన విశేషాలు. ► ముందుగా ఈ సినిమాను ఆగస్ట్ 31న రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ కేరళ వరదల కారణంగా కుదర్లేదు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ చుట్టాలు కూడా ఆ వరదల్లో చిక్కుకుపోయారు. దాంతో ఈ సినిమాను వాయిదా వేసేశాం. ► ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే టైటిల్ చూడగానే ఈ సినిమా అత్తా అల్లుడి మధ్య సవాల్ అని ఊహించేసుకుంటారు. కానీ ఇది అత్తా అల్లుడే కాదు వాళ్ల అమ్మాయితో కూడా ఈగో సమస్యల్లో ఇరుకుంటాడు హీరో. సాధారణ మనిషి శైలజా రెడ్డి అల్లుడు ఎలా అయ్యాడని కథ. ఈగోయిస్ట్ మనుషులతో హీరో ఎలా నలిగిపోతాడన్నది మరో కోణం. హీరోకి చాలా సహనం కావాలి. రియల్‌గా కూడా చైతూకి ఓపిక ఎక్కువ. పాజిటివ్ పర్సన్. ► ఫస్ట్ యూత్‌ఫుల్ స్టోరీ (‘ఈ రోజుల్లో’), హారర్ కామెడీ (ప్రేమకథా చిత్రమ్), ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ (‘భలే భలే మగాడివోయ్’) తీశాం. ఇప్పుడు ఫుల్‌లెంగ్త్ ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ చేశాను. ఎప్పటికప్పుడు కొత్త జానర్స్ టచ్ చేస్తే మనం ఇంప్రూవ్ అవుతాం. ► ఎప్పుడూ అత్తలంటే చెడ్డవాళ్లే అనుకుంటాం. కానీ ఇందులో అలా కాదు. చైతూ చాలా కొత్తగా ఉంటాడు. రమ్యకృష్ణగారి పాత్రకు కూడా కథలో ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. ► ‘అల్లరి అల్లుడు’లాంటి పాత టైటిల్స్ పెడదాం అనుకున్నాం కానీ విరమించుకున్నాం. ఇందులో టైటిలే కొంచెం పాతగా ఉంటుంది. సినిమా మాత్రం కొత్తగా ఉంటుంది. చైతూ కూడా క£ý లో భాగం అవుతాడు. మొత్తం నా మీదే నడవాలని అనుకోడు. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు కూడా నాగార్జునగారి ఫ్యామిలీ చేస్తున్న సినిమాల దృష్టిలో పెట్టుకొని కథను అనుకున్నాను. ► అనూ ఇమ్మాన్యుయేల్ బయట ఎలా ఉంటుందో సినిమాలో కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్‌స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఫుల్ ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్స్ నాగ వంశీ, ప్రసాద్‌గార్లు రిచ్‌గా సినిమాని తీశారు. ఈ సినిమా నా కెరీర్లో చాలా రిచ్‌గా ఉంటుంది. ► కొన్నిసార్లు మనం అనుకున్న ఐడియాకు వేరే దర్శకుడు కనెక్ట్ కాకపోవచ్చు. వీళ్లు చేయగలరు అని నాకు నమ్మకం కుదిరితే వేరే డైరెక్టర్స్‌తో సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుతానికి చిన్న సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ సినిమాకైనా అదే హార్డ్ వర్క్ ఉంటుంది. పెద్ద సినిమాకు ఓ నెల శ్రమ ఉంటుంది. చిన్న సినిమాను హిట్ చేయడం గ్రేట్. కొత్తవాళ్ల పోస్టర్స్‌తో ఆడియన్స్‌ను థియేటర్‌కి తీసుకురావడం గ్రేట్. -
క్లాపురం
‘ఏమండీ షాట్ రెడీ’ అంది శ్రీమతి హీరోయిన్. ‘భార్యలు బయలుదేరేటప్పుడు లేట్ చేస్తారంటారు కానీ నువ్వు సూపర్!’ అన్నాడు శ్రీవారు హీరో. ‘సింగిల్ కారు పంపితే చాలు.. వర్కవుట్ అవుద్ది’ అన్నాడు ప్రొడ్యూసర్. ‘ఇంట్లో చిర్రుబుర్రులేమైనా ఇక్కడ చూపిస్తారేమో’ అనుమానంగా అడిగాడు డైరెక్టర్. ‘ఇంటిని మరిపించేలా అందమైన సంభాషణలు రాశాను’ అన్నాడు రైటర్. ఇదీ.. పెళ్లయిన తరువాత కూడా హీరో హీరోయిన్ చేస్తున్న క్లాపురం! సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అందులోని హీరో హీరోయిన్ జోడీ బాగా కుదిరింది. దర్శక, నిర్మాతలు ఆ జంటను స్క్రీన్‌పై రిపీట్ చేయాలనుకుంటారు. అంతలా ఆ స్టార్స్ మధ్యలో కెమిస్ట్రీ వర్కౌట్ అయినప్పుడు ‘కలిసి నటì స్తే బావుండు’ అని ప్రేక్షకులూ కోరుకుంటారు. హీరో హీరోయిన్‌కి కూడా కలిసి నటించడానికి ఓకే. ముందేమో విడి విడిగా సెట్లోకి వెళ్లేవారు. కానీ సినిమా సెట్లోనే అన్నీ సెట్ అయ్యాక, టైటిల్ కార్డ్‌లో పేర్లను పెళ్లి కార్డులో చూసుకోవాలనుకున్నారు కొందరు సెలబ్రిటీలు. పెళ్లికి ముందు జంటగా నటించి, పెళ్లయ్యాక కూడా జంటగా కనిపించిన ‘కపుల్స్’ కహానీ తెలుసుకుందాం. విజయకృష్ణ ‘సాక్షి’ సినిమాలో ఫస్ట్ టైమ్ ఆన్ స్క్రీన్ జోడీగా కనిపించారు కృష్ణ, విజయనిర్మల. పెయిర్ బావుందని ప్రేక్షకులు ఈలలు వేశారు. అంతే... వెంటనే 10–15 సినిమాలు కృష్ణ, విజయనిర్మలకు క్యూ కట్టాయి. సినిమాలు, సెట్లు మారుతున్నాయి. పోస్టర్లో కృష్ణ, విజయ నిర్మల అనే పేరు మారడం లేదు. అలా కలిసి పని చేసే ప్రయాణంలో ఒకరికి ఒకరు దగ్గరయ్యారు. ‘ఎవరే అతగాడు.. అంత అందంగా ఉన్నాడు’ అన్నది కృష్ణని చూడగానే విజయ నిర్మలకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్. విజయ నిర్మల యాటిట్యూడ్ నచ్చి చంద్రమోహన్ ద్వారా ప్రేమ కబురును ఆమెకు పంపారు. ఇలా కాదు డైరెక్ట్‌గా వచ్చి చెబితే ఒప్పుకుంటా అన్నారంట. అలా తిరుపతిలో పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి ట్విస్ట్ ఇచ్చిందీ జోడీ. కృష్ణ, విజయ నిర్మల సుమారు 40 సినిమాలకు కలిసి పని చేశారు. జోడీగా కొన్ని సినిమాలు. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా కొన్ని సినిమాలు. ‘తాళి బొట్టు, పండంటి కాపురం, మూడు పువ్వులు ఆరు కాయలు, అంతం కాదిది ఆరంభం’ వంటి సినిమాలతో అభిమానులను అలరించారు. స్క్రీన్ మీదే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా వీరు ‘విజయకృష్ణ’. ప్లస్సు మైనస్సు కలుసే... అంబరీష్ కొంచెం రెబల్ టైప్. సుమలత ఏమో మృదు స్వభావి. ఒక్క ప్లస్సు మైనసు కలిసినప్పుడే కదా ఈక్వేషన్ సరిగ్గా కుదిరేది. అవును ఈక్వేషన్ కరెక్ట్‌గా కుదిరింది. ‘మాది తొలి చూపులోనే ఏర్పడ్డ ప్రేమ కాదు. సినిమాలు చేస్తూ మెల్లిగా ఒకరినొకరు పూర్తిగా తెలుసుకున్నాం. మా మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైంది అంటే కచ్చితంగా చెప్పలేం. అది ప్రేమ అని తెలిసేలోపే మేం ప్రేమలో మునిగిపోయాం’ అని సుమలత ఓ సందర్భంలో పేర్కొన్నారు. తొలిసారి ఈ జంట కన్నడ సినిమాలు ‘ఆహుతి. అవతార పురుష’లో యాక్ట్ చేశారు. 1991లో పెళ్లి చేసుకున్న ఈ జంట చిరంజీవి ‘శ్రీమంజునాథ’ కన్నడ ‘కల్లరాలి హోఘొ’ సినిమాల్లో జోడీగా కనిపించారు. హీ మ్యాన్ హేమ జపం హేమ మాలినీ బాలీవుడ్ డ్రీమ్ గాళ్. ధర్మేంద్ర హీ మ్యాన్. ఈ ఇద్దరూ ‘షరాఫత్’ అనే సినిమా కోసం ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 1970లో ‘తుమ్ హసీనా మై జవాన్’ సినిమా సెట్లో ఇద్దరూ ఒకరి మీద ఒకరు అభిప్రాయాలు ఏర్పరచుకోవడం మొదలెట్టారట. ధర్మేంద్రకు ఆల్రెడీ పెళ్లయింది. అయినా హేమ మాలినీ అందానికి హీ మ్యాన్ కాస్తా హేమ జపం చేశారు. మెల్లిగా ఒకరంటే ఒకరు ప్రేమను ఏర్పరచుకుని 5 ఏళ్ల లవ్‌ని పెళ్లితో కొనసాగించారు. పెళ్ళి తర్వాత రజియా సుల్తాన్, ఆటంక్, వంటి సినిమాల్లో కలిసి నటించారు. ప్రతిజ్ఞ , ఆలీ బాబా 40 చోర్, రజియా సుల్తాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించారు. స్నేహం–ప్రేమ–పెళ్లి కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సూపర్ స్టార్ రిషీ కపూర్, స్టార్ హీరోయిన్ నీతూ సింగ్ లవ్ స్టోరీ లవ్ ఎట్ ఫస్ట్ సెట్ కాదు. రిషీ కపూర్‌కి బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండేవారట నీతు. అప్పట్లో రిషీ కపూర్‌కి గర్ల్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ. వాళ్ళ సీక్రెట్స్ అన్నీ తెలిసింది నీతూ సింగ్‌కే నట. ఇన్‌ఫ్యాక్ట్ ఎవరైనా గాళ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ అయితే రిషీ కన్నీళ్లు తుడుచుకునే కర్చీఫ్ నీతూదే. తలవాల్చుకునే భుజం కూడా నీతూదే. కానీ అవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అనే విషయం తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. ‘బరూద్’ షూటింగ్ కోసం ప్యారిస్ వెళ్లిన రిషీ కపూర్‌కి ఒంటరితనం అంటే ఏంటో అర్థం అయిందట. ఉండబట్టలేక నీతూకు ఓ టెలీగ్రామ్ వేసేశారట. ‘ఏ సిక్నీ బడీ యాద్ ఆతీ హై’ అని టెలీగ్రామ్ వేశాడట. అంటే.. ఎప్పుడూ గుర్తొస్తున్నావు అని. కానీ పెళ్లికి మాత్రం అప్పుడే సిద్ధంగా లేను అని అనుకున్నారట. ‘నీతో డేటింగ్ చేయగలను కానీ పెళ్లి చేసుకోలేను’ అనేశారు రిషి. అప్పటికే రిషీ మీద పీకల్లోతు ప్రేమలో ఉన్న నీతు నో చెప్పలేకపోయారు. 5 ఏళ్లు డేటింగ్ తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. 19 సినిమాల్లో రిషీ, నీతు కలిసి నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యారు నీతు. రిషీ కపూర్ ఆపేయమన్నారని వార్తలు వచ్చాయి. నా అంతట నేను తీసుకున్న నిర్ణయం అని నీతు అన్నారు. అసలు నిజం ఏంటో వాళ్లింటి నాలుగు గోడలకే తెలుసు. మళ్లీ 25 ఏళ్లకు ‘లవ్ ఆజ్ కల్’ అనే సినిమా ద్వారా స్క్రీన్ షేర్ చేసుకున్నారు రిషీ, నీతు. ఆ తర్వాత షారుక్‌ఖాన్ ‘జబ్ తక్ హై జాన్, కుమారుడు రణ్‌బీర్ సింగ్ ‘బేషరమ్’ సినిమాలో ఈ జంట తళుక్కున మెరిసింది. నిలువెత్తు ప్రేమ బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ల లవ్ స్టోరీ కూడా సినిమా సెట్లోనే మొదలైంది. అయినా అమితాబ్ స్ట్రగ్లింగ్ యాక్టర్‌గా ఉన్నప్పుడు జయా బచ్చన్ సూపర్ స్టార్. కానీ తొలి చూపులోనే అమితాబ్ నన్ను ఆకట్టుకున్నాడని చాలా సందర్భాల్లో పేర్కొన్నారామె. అమితాబ్, జయాబచ్చన్ తొలిసారి కలిసి నటించిన సినిమా ‘గుడ్డి’. ఈ సినిమా వారికి ఓ పరిచయ వేదిక. ఆ తర్వాత సినిమా సినిమాకు వీళ్ళ మధ్య పరిచయం ప్రేమగా మారడం మొదలైంది. సార్ చాలా హైట్. మేడమ్ కొంచెం షార్ట్. అయినా ఇద్దరి మనసులో ఉన్న ప్రేమ ఎత్తు చాలా. ‘జంజీర్’ సినిమా చేస్తున్న టైమ్‌కు ఇద్దరూ ఒకరి మీద ఒకరికి పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. సినిమా హిట్ అయితే లండన్ టూర్‌కి వెళ్దాం అనుకున్న ఈ జంటకు వీసా రిజెక్ట్ అయినట్లు ఇంట్లో వాళ్ల సమ్మతి లభించలేదు. విడిగా అయితే వీల్లేదు.. జాయింట్‌గా వెళ్లాలనుకుంటే వెళ్లండని స్వీట్ ట్విస్ట్ ఇచ్చారు. అనుకున్నదే అదనుగా జయ, అమితాబ్ పెళ్లి చేసుకొని ఆ మరుసటి రోజే డ్యూయెట్ పాడుకోవడానికి లండన్ పయనమయ్యారు. వీళ్లిద్దరూ జంటగా 16 సినిమాలకు పని చేశారు. అందులో ‘షోలే, కభీ ఖుషి కభీ గమ్, జంజీర్’ ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, జయ జోడీగా కనిపించిన లాస్ట్ సినిమా ‘కీ అండ్ కా’. విశేషం ఏంటంటే... ఈ ప్రేమజంట తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా తన కో–స్టార్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ లవ్‌స్టోరీ గురించి కూడా తెలుసుకుందాం సుమా. సెట్ అయింది సాబ్ అజయ్ దేవగన్ చాలా మొహమాటస్తుడు. కాజోల్ అవుట్ స్పోకెన్. ఈ ఇద్దరూ పెళ్లిని అనౌన్స్ చేసినప్పుడు ‘ఈ ఇద్దరికీ సెట్ అవ్వదూ’ అంటూ మీడియా కథనాలు రాశాయి. కానీ ఇప్పటికీ బాలీవుడ్లో వన్నాఫ్ ది బెస్ట్ కపుల్స్‌గా ఉన్నారు కాజోల్ దేవగన్. వీళ్లద్దరికీ సెట్ అయింది సాబ్ అని సరదాగా బాలీవుడ్లో అంటుంటారు. ‘హల్ చల్’ సినిమాలో ఫస్ట్ టైమ్ కలిసి యాక్ట్ చేశారు వీరిద్దరూ. 1999లో ఈ ఇద్దరూ ఒకటయ్యారు. పెళ్ళి తర్వాత యాక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ‘దిల్ క్యా కరే’. అజయ్ దేవగన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఫస్ట్ సినిమా ‘యు మీ ఔర్ తుమ్’ చిత్రంలో కలిసి యాక్ట్ చేశారు. ఈ కాంబినేషన్లో 7 సినిమాలు వచ్చాయి. మనసులు తెలుసుకున్నాకే... తండ్రిలానే తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా తన కో–స్టార్‌నే వివాహమాడారు. అభిషేక్, ఐశ్వర్యా రాయ్ తొలిసారి కలసి నటించిన చిత్రం ‘కుచ్ నా కహా’. అప్పటికే అభిషేక్, కరిష్మా కపూర్ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. మరోవైపు ఐశ్వర్య కూడా కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో లవ్‌లో ఉన్న వార్తలు వచ్చాయి. చెరో దారి అన్నట్లుగా ఉన్న ఈ ఇద్దరిదీ ఒకే దారి అయింది. ‘ఉమ్రో జాన్, గురు, ధూమ్: 2’.. మూడు సినిమాలతో వరసగా మూడేళ్లు ఒకే సెట్లో ఎక్కువ సమయం గడపడంతో ఇద్దరూ ఒకరిని ఒకరు తెలుసుకున్నారు. ‘గురు’ ప్రీమియర్ టైమ్‌లో ఐశ్వర్యారాయ్‌కి అభిషేక్ ప్రపోజ్ చేయడం, ఐష్ కూడా ఆనందంగా ఒప్పుకోవడం జరిగిపోయింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ మణిరత్నం ‘రావణ్’ సినిమాలో కలిసి నటించారు. కానీ జోడీగా కాదు. అయితే యాడ్స్‌లో కలసి నటించారు. లేటెస్ట్గా అభిషేక్, ఐష్ ‘గులాబ్ జామున్’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. పదేళ్ల ప్రేమ మహారాష్ట్ర సీఎం కుమారుడి ఫస్ట్ సినిమా. అది కూడా మలయాళంలో బ్లాక్‌బస్టర్ అయిన ‘నిరం’ (తెలుగులో ‘నువ్వే కావాలి’గా రీమేక్ అయింది). అలా ఫస్ట్ టైమ్ సెట్లో మొట్టమొదటిసారిగా కలుసుకున్నారు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా. సీఎం కొడుకంటే హడావుడి ఉంటుంది అనుకున్నారు జెనీలియా. రితేశ్ మాత్రం చాలా కామ్. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఒకరికొకరు ‘నువ్వే కావాలి’ అనుకున్నారు. కానీ అనుకున్నంత సులువుగా ఈ లవ్ స్టోరీ సెట్ అవ్వలేదు. సినిమాల్లోలానే ఈ సీఎం అంకుల్ కూడా ఫస్ట్ ఈ మ్యారేజ్ ప్రపోజల్‌కి ఒప్పుకోలేదు. అప్పుడు జెన్నీ, రితేష్ తీసుకున్న నిర్ణయం వెయిట్ చేయడం. సుదీర్ఘంగా 10 ఏళ్లు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఫైనల్‌గా సీఎం అంకుల్ని కూడా వీళ్ల ప్రేమ మార్చగలిగింది. 2012లో ఈ జోడీ ఒక్కటయ్యారు. కపుల్స్ అయ్యాక ‘తేరే నాల్ లవ్ హోగయా’ అనే సినిమాలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత రితేష్ చేసిన ‘లాల్ భారీ’ అనే మరాఠీ సినిమాలో కూడా చిన్న గెస్ట్ రోల్లో కనిపించారు. నువ్వు–నేను–ప్రేమ సూర్య, జ్యోతిక జంటగా ఏడు సినిమాల్లో యాక్ట్ చేశారు. సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బాస్టర్గా నిలిచిన ‘కాక్క కాక్క’ చిత్రం నుంచి వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. ఈ సినిమాలో సూర్యని హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్‌కు సజెస్ట్ చేసింది జ్యోతికే. ఆ తర్వాత ‘మాయావి, సిల్లున్ ఒరు కాదల్ (తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’గా విడుదలైంది)’ సినిమాల్లో కనిపించారు. అయితే పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ కలసి నటించలేదు. కానీ సతీమణి కమ్‌బ్యాక్ మూవీ ‘36 వయదినిలే’ని సూర్య నిర్మించారు. ఆ తర్వాత వచ్చిన ‘మగళిర్ మట్టుమ్’ని కూడా సూర్యనే నిర్మించారు. మరి.. మళ్లీ ఆన్ స్క్రీన్ కనిపిస్తారా? కాలమే చెబుతుంది. ఎప్పుడో ముడివేశాడు తండ్రి నాగార్జున లానే తనయుడు నాగ చైతన్య కూడా తన కో–స్టార్‌నే వివాహం చేసుకున్నారు. ఇలాంటివి ప్లాన్ చేసి జరిగేవి కాదు. ఏదో మాయ జరుగుతుంది. ‘ఏ మాయ చేశావే’ సినిమా నాగ చైతన్య–సమంతలను మాయ చేసింది. యూత్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన లవ్ స్టోరీ. ‘జెస్సీ, కార్తీక్’ యూత్ అందర్నీ లవ్‌లో పడేసిన ప్రేమ జంట. ‘పై లోకంలో వాడు ఎపుడో ముడివేశాడు..’ అంటూ సినిమాలో పాడుకున్నారీ జంట. ఆ క్షణం బహుశా వాళ్లు ఊహించి ఉండరు.. తర్వాత జరగబోయేది అదే అని. ఆ పాటను అనంత శ్రీరామ్‌తో అనంత లోకాలకు స్క్రీన్‌ప్లే రాసే రైటరే రాయించుంటాడు. కానీ వాళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ప్రేమగా మారడానికి టైమ్ పట్టింది. ఆ మధ్యలో ‘ఆటోనగర్ సూర్య’లో కూడా కలిసి యాక్ట్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావుకి నివాళిగా కుటుంబం రూపొందించిన ‘మనం’లో కూడా సమంత ఉండటం విశేషం. ఆ తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని తెలుసుకున్నారు ఈ జంట. పబ్లిక్‌గా అనౌన్స్ చేయకపోయినా కలిసి సినిమాలు, షాపింగ్ అంటూ ప్రేక్షకులకు హింట్ ఇచ్చారు. గతేడాది నవంబర్‌లో గ్రాండ్‌గా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్ల్లయ్యాక ‘నిన్ను కోరి’ ఫేమ్ శివా నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాలో కలసి యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత, నాగ చైతన్య పెళ్లైన జంటగానే కనిపించనున్నారు. అన్నట్లు.. రెండు యాడ్స్‌లో కూడా కలసి నటించారు. ప్రేమికులుగా ఉన్నప్పుడు కెమిస్ట్రీ అదిరింది.. భార్యాభర్తల కెమిస్ట్రీ కూడా వండర్ఫుల్ అంటున్నారు. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
డబుల్ ధమాకా
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవి శంకర్ సినీ లవర్స్‌కు ఒకే రోజు డబుల్ ధమాకా ఇచ్చారు. రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, నాగచైతన్య ’సవ్యసాచి’ సినిమాల విడుదల తేదీలను ఒకే రోజున అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మా బ్యానర్లో విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం మంచి హిట్ సాధించింది. మా సక్సెస్ఫుల్ జర్నీలో భాగస్వాములైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన ఈ విజయాలు మా బాధ్యతను మరింత పెంచుతున్నాయి. అలాగే మా సంస్థ నుంచి వస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘సవ్యసాచి’ సినిమాల రిలీజ్ డేట్స్‌ను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాను అక్టోబర్ 5న, నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ సినిమాను నవంబర్ 2న విడుదల చేయబోతున్నాం’’ అని పేర్కొన్నారు మైత్రీమూవీ మేకర్స్ ప్రతినిధులు. -
లవర్‌బాయ్స్
-
ఆ మాట విని సర్ప్రైజ్ అయ్యా
‘‘నిన్ను, నన్ను కలిసి రాహుల్ ఓ కథ చెబుతాడట అని సమంత నాతో చెప్పగానే.. రాహుల్ నటించబోయే సినిమా అనుకున్నా. కానీ, తను దర్శకత్వం చేస్తున్నాడని తెలిసి సర్ప్రైజ్ అయ్యా. కథ చాలా ఫ్రెష్‌గా అనిపించింది’’ అని నాగచైతన్య అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చి..ల.. సౌ’. నాగార్జున, జస్వంత్ నడిపల్లి, భరత్‌కుమార్ మలశాల, హరి పులిజ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రెస్మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఓ రాత్రిలో జరిగే కథ ఇది. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? అనే సందేహం ఉండేది. నీవి, రాహుల్ సెన్సిబిలిటీస్ ఒకేలా ఉంటాయి. నువ్వు తనతో ఓ సినిమా చేయాలని సమంత అంది. ఎలాగైనా ‘చి..ల..సౌ’ లో భాగం అయితే బావుండు అనిపించి నాన్నగారితో (నాగార్జున) చెప్పా. ఆయనకూ సినిమా నచ్చి, భాగస్వామ్యం అయ్యారు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే... సమంత కోసం ఏడేళ్లు ట్రై చేశా. నా సిన్సియారిటీ, నా కష్టం చూసి తను ఆ తర్వాత ఓకే చెప్పారు (నవ్వుతూ). నాకు పెళ్లి కావడంతో రానా, సుశాంత్ హ్యాపీగా ఉన్నారు.. ఎందుకంటే పెళ్లి చేసుకోమని కొద్దిరోజులైనా వాళ్లని నేను వేధించకుండా ఉంటానని (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘నేను, రాహుల్ కలసి చేసిన సినిమా సరిగ్గా ఆడలేదు కానీ, 11ఏళ్లుగా మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. రాహుల్ హార్డ్‌వర్కర్. ‘చి..ల.. సౌ’ సినిమా చూస్తున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రాహుల్ యాక్టర్‌గా నాకు కనెక్ట్ కాలేదు కానీ.. డైరెక్టర్‌గా కనెక్ట్ అయ్యాడు. రుహానీ శర్మ ఫైర్ క్రాకర్‌గా పేరు తెచ్చుకుంటుంది’’ అన్నారు సమంత. ‘‘పెళ్లిచూపులప్పుడు అమ్మాయి, అబ్బాయి.. ఒకరికొకరు కరెక్టా? కాదా? అని అరగంటలో ఎలా నిర్ణయించుకుంటారు. దానికి ఎంత సమయం పడుతుంది? అనే కాన్సెప్ట్‌తో సాగే చిత్రమిది’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘చి..ల..సౌ’ లాంటి కథతో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు సుశాంత్. ‘‘డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకొచ్చి, నిర్మాతనయ్యా. మంచి సినిమా చేశాం’’ అన్నారు నిర్మాత జస్వంత్ కుమార్. కథానాయిక రుహానీ శర్మ, గాయని, రాహుల్ రవీంద్రన్ సతీమణి చిన్మయి పాల్గొన్నారు. -
ఫారిన్ పోదాం
సవ్యసాచి తన గమ్యాన్ని చేరుకోవడానికి జస్ట్ కొంచెం దూరంలోనే ఉన్నాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేంటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు చందు మొండేటి. నాగచైతన్య, నిధీ అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్య యాడ్ ఫిల్మ్ మేకర్‌గా కనిపించనున్నారు. రెండు చేతులను ఒకే సామర్థ్యంతో ఉపయోగించగలిగే సవ్యసాచిలా నాగచైతన్య రోల్ ఉంటుందని తెలిసిన విషయమే. ఈ సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్లో ఉంది. ‘‘టాకీ పార్ట్ ఆగస్ట్ 8తో కంప్లీట్ చేస్తాం. ఒక సాంగ్‌ను ఫారిన్లో షూట్ చేయనున్నాం. అది ఆగస్ట్ 15కల్లా పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సిజీ వర్క్స్ అన్నీ కూడా సెప్టెంబర్ 15 లోపు కంప్లీట్ చేస్తాం. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే, నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఆగస్టు 31న విడుదల కానుంది. -
మారుతి కామెడీ టైమింగ్ కనిపించింది
‘బ్రాండ్ బాబు’ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మారుతిగారి కామెడీ టైమింగ్ చాలా చోట్ల కనిపించింది. ప్రభాకర్ దర్శకత్వ ప్రతిభ తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోకి సుమంత్ శైలేంద్రకు స్వాగతం పలుకుతున్నా. సుమంత్, ఈషా రెబ్బాకు ఈ చిత్రం మంచి హిట్ తీసుకురావాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లుగా ప్రభాకర్ పి. దర్శకత్వంలో ఎస్. శైలేంద్ర నిర్మించిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. డైరెక్టర్ మారుతి కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రం ఆగస్టు 3న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని నాగచైతన్య విడుదల చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్ నాగచైతన్యకు నచ్చడం సంతోషంగా ఉంది. వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్ విడుదల చేసినందుకు నాగచైతన్యగారికి థ్యాంక్స్’’ అన్నారు ఈషా రెబ్బా. ఈ చిత్రానికి సంగీతం: జేబి, కెమెరా: కార్తీక్ ఫలని. -
చైశామ్స్ కొత్త సినిమా
-
సూపర్ బ్యాలెన్స్
‘వ్యాయామం అంటే శరీరాన్ని బలంగా తయారు చేసుకోవడమే కాదు క్రమశిక్షణను అలవరచుకోవడం’ అని ఓ సందర్భంలో సమంత అన్నారు. అన్నట్లుగానే వర్కౌట్స్ చేయడంలో ఆమె రాజీ పడటంలేదు. ఎంతలా వ్యాయామాలు చేస్తారంటే ఎంత బరువైనా అవలీలగా మోసేంత. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 కేజీల బరువు ఎత్తారు. ఇక్కడున్న ఫొటోలో గమనించవచ్చు. అంత బరువును మోయాలంటే బాడీని ఎంతో బ్యాలెన్స్ చేయాలి, అలాగే చేశారు సమంత. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఆమె నటించిన ‘రంగస్థలం, మహానటి, అభిమన్యుడు’ చిత్రాలు రిలీజైన సంగతి తెలిసిందే. తమిళ చిత్రాలు ‘సీమరాజా, సూపర్ డీలక్స్’, తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘యు టర్న్’ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అలాగే పెళ్లి తర్వాత భర్త నాగచైతన్యతో కలిసి ఆమె నటించబోయే సినిమా ఈ నెల 23న స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి శివనిర్వాణ దర్శకత్వం వహిస్తారు. ఇలా ఓన్లీ వర్కౌట్స్లోనే కాదు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ సమంత సూపర్ బ్యాలెన్స్ చూపిస్తున్నారు. ∙వెయిట్‌లిఫ్టింగ్ చేస్తూ... -
పెళ్లి తర్వాత...
నాగ చైతన్య, సమంత ఫస్ట్ టైమ్ కలసి యాక్ట్ చేయబోతున్నారు. అదేంటీ వీళ్లిద్దరూ జంటగా మూడు సినిమాల్లో (‘ఏమాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మనం’) యాక్ట్ చేశారు. లెక్క ప్రకారం ఇది నాలుగో సినిమా అవ్వాలి కదా? అంటే.. పెళ్లి తర్వాత చైతన్య, సమంత జంటగా యాక్ట్ చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఓ చిత్రంలో నాగ చైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ నెల 23న హైదరాబాద్‌లో జరగనుంది. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందనున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య, సమంత పెళ్లైన దంపతుల్లానే కనిపించనున్నారు. పెళ్లి తర్వాత జరిగే సంఘటనలతో ఈ చిత్రం కథాంశం ఉండబోతోందని సమాచారం. రావు రమేశ్, అవసరాల శ్రీనివాస్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కు గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రానికి కెమెరా: విష్ణు శర్మ. -
అల్లుడి జాగారం
అల్లుడు అండ్ టీమ్ నైట్ అంతా నిద్రపోలేదట. ఎవరీ అల్లుడు అంటే.. కేరాఫ్ శైలజారెడ్డి అన్నమాట. మరి... నిద్రపోకుండా ఏం చేశారు? అది మాత్రం సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నైట్ టైమ్ జరుగుతోంది. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. -
అత్త.. అల్లుడొచ్చారు
కుర్చీలో ఠీవీగా కూర్చుని ఓర కంటితో కాసింత కోపంగా అల్లుడు, కూతుర్ని (నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్) చూస్తున్నారు శైలజారెడ్డి (రమ్యకృష్ణ). అల్లుడేమో అత్తని ఆటపట్టిస్తున్నట్లు చిరునవ్వులు చిందిస్తుంటే.. కూతురేమో భర్తవైపు ఆప్యాయంగా చూస్తున్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఎస్. నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని సోమవారం రిలీజ్ చేశారు. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ఫస్ట్ లుక్‌పై నాగచైతన్య స్పందిస్తూ – ‘‘డైరెక్టర్ మారుతిగారు ఆఫ్ స్క్రీన్ నన్ను ఎంటర్టైన్ చేస్తున్నట్లే ఆన్ స్క్రీన్ మిమ్మల్ని (ప్రేక్షకులు) ఎంటర్టైన్ చేయబోతున్నారు. సితార బ్యానర్లో పనిచేయడం నాకు ఎప్పుడూ సౌకర్యంగానే ఉంటుంది. రమ్యకృష్ణగారి పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది’’ అన్నారు. -
జ్ఞాపకాల గుర్తులు
సిల్వర్ స్క్రీన్‌పై భూమిక కథానాయికగా మంచి మార్కులు కొట్టేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆరిస్ట్గానూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కానీ భూమికలో ఓన్లీ యాక్టింగ్ ప్రతిభ మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. స్కూబా డైవింగ్ కూడా బాగా చేస్తారు. ‘‘రీసెంట్గా స్కూబా డైవింగ్ చేసా. ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఆ జ్ఞాపకాల గుర్తులు’’ అంటూ స్కూబా డైవింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారామె. ఇక సినిమాల విషయానికొస్తే... చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘సవ్యసాచి’, సమంత లీడ్ రోల్ చేసిన ‘యు టర్న్’ సినిమాలోనూ భూమిక నటిస్తున్నారు. -
ఆన్ ట్రాక్
జస్ట్ మూడు రోజులు.. అంతే. మామా అల్లుళ్లు రంగంలోకి దిగుతారు. ఎందుకు అంటే? సినిమా కోసం. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 11న జరుగుతుందని సమాచారం. అంటే ఆ రోజు నుంచీ మామా అల్లుళ్లు ఆన్ ట్రాక్ అన్నమాట. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘వెంకీ మామా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. రియల్ లైఫ్ మాదిరిగానే ఈ సినిమాలో మామా అల్లుళ్ల పాత్రల్లో నటించనున్నారట వెంకీ అండ్ చైతూ. ఆల్రెడీ నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ సినిమాలో వెంకీ గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి రెడీ అవుతున్నారు. మామా అల్లుళ్లు సినిమాలో ఎలాంటి సందడి చేస్తారో చూడాలి. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన హ్యూమా ఖురేషి, నాగచైతన్యకు జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్ నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
మస్త్ బిజీ
నాగచైతన్య మల్టీటాస్కింగ్ చేస్తున్నారు. ఓ వైపు ‘సవ్యసాచి’ మరోవైపు ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలను కంప్లీట్ చేస్తూ, మస్త్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘సవ్యసాచి’ సినిమా డబ్బింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. నవీన్ ఎర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ కథానాయిక. 10 రోజుల పాటు కొన్ని సీన్స్, అలాగే ఐటమ్ సాంగ్ మినహా సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా స్పీడ్‌గా కంప్లీట్ చేస్తోందట చిత్రబృందం. ఈ సినిమా కోసం ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది.....’ సాంగ్‌ని రీమిక్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమన్నా, నాగచైతన్యలపై ఈ సాంగ్‌ను జూన్ లాస్ట్ వీక్‌లో షూట్ చేయనున్నారట. సో.. సినిమాకు సంబంధించిన ఆఖరి ఘట్టంలోకి అడుగుపెట్టేసారన్నమాట ఈ సవ్యసాచి. మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి స్వరకర్త. ఈ సినిమాను జూలై లాస్ట్ వీక్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ప్రేమమ్’ లాంటి హిట్ తర్వాత దర్శకుడు చందుతో నాగచైతన్య చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. -
కునుకు కరువాయె...
నిద్రలేకుండా వర్క్ చేస్తున్నారు కొందరు హీరోహీరోయిన్లు. సిల్వర్‌స్క్రీన్‌పై ఎగ్జామ్స్ కోసం నిద్రపోవడం లేదు. కనులకు కునుకుని దూరం చేసి సెట్లో వర్క్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ముందుగా టీ టౌన్లోకి వస్తే.. అల్లుడు నిద్రపోకుండా స్టెప్పులేస్తున్నాడు. అబ్బాయి చిందేస్తుంటే అమ్మాయి ఊరుకుంటుందా? ఆమె కూడా పాదం కలిపి పాట అందుకుంది. ఇంతకీ... ఈ అల్లుడు అడ్రెస్ ఎక్కడో తెలుసా? కేరాఫ్ శైలజారెడ్డి. ఇప్పుడు అర్థం అయ్యింటుంది ఇదంతా ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా గురించి అని. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అత్తయ్య శైలజారెడ్డి పాత్రలో నటి రమ్యకృష్ణ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నైట్ షూట్ జరుగుతోంది. నాగచైతన్య, అనూలపై సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. మరో తెలుగు హీరో కల్యాణ్ రామ్‌కి కూడా నిద్ర నహీ. గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేథా థామస్ కథానాయికగా నటిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా కోసం నైట్ షూట్ చేశారు. ప్రస్తుతం సింగపూర్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోన్న కథానాయిక రాశీ ఖన్నా కూడా రెండు మూడు రోజుల క్రితం కంటిన్యూస్‌గా నైట్షూట్స్లో పాల్గొన్నారు. కానీ తెలుగు సినిమా కోసం కాదు. కోలీవుడ్ సినిమా కోసం. కార్తీక్ తంగవేల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అడంగామారు’ సినిమా చిత్రీకరణను రాత్రివేళ జరిపారు. మరో బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ అయితే ‘అలారం లేకుండా గురువారం హాయిగా నిద్రపోయాను’ అన్నారు. ఆమె ఎందుకలా అన్నారంటే.. కోలీవుడ్‌లో కార్తీ, బాలీవుడ్లో అజయ్‌దేవగన్ సినిమాల షెడ్యూల్స్‌లో పాల్గొని అలసిపోయారు. కార్తీతో చేస్తోన్న సినిమా కోసం చెన్నైలో నైట్ షూట్స్‌లో పాల్గొన్నారామె. ఈ సినిమా చెన్నై షెడ్యూల్ చివరి రోజు తల్లి సెట్స్‌కు రావడంతో ఆమె ఆనందం డబులైంది. తమిళ సినిమా షూట్ కంప్లీటైన వెంటనే అజయ్ దేవగన్æ సినిమా కోసం ముంబై వెళ్లారు రకుల్. ఈ సినిమాకు అకివ్ అలీ దర్శకుడు. ఎలాగూ బీటౌన్ తలుపు తట్టాం కదా. అక్కడ కూడా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నవాళ్ల గురించి చెప్పుకుందాం. నిద్రకు నో చెప్పి, షూటింగ్‌కు యస్ చెప్పారు హృతిక్ రోషన్. ‘సూపర్ 30’లో ఆయన బీహార్ గణిత శాస్త్రవేత్త ఆనంద్‌కుమార్ పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానున్న ఈ సినిమా నైట్ షూట్లో పాల్గొంటూ హృతిక్ డే టైమ్‌లో నిద్రపోతున్నారు. ఇక బాలీవుడ్ భామల విషయానికొస్తే.. ‘నమస్తే ఇంగ్లాండ్’ సినిమా కోసం లండన్‌లో టైమ్‌కి నిద్రపోవడం లేదు కథనాయిక పరిణీతీ చోప్రా. విఫుల్ షా దర్శకత్వంలో అర్జున్ కపూర్, పరిణీతీ చోప్రా జంటగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ నైట్ టైమ్‌లో జరుగుతోంది. ఫోర్ డేస్ బ్యాక్ సాంగ్‌ను కూడా షూట్ చేశారు. నిద్ర లేకుండా వర్క్ చేయడం బాధగా ఉందా? అంటే... ‘అలా ఏం లేదు.. వర్క్ ఈజ్ వర్షిప్’ అంటున్నారు తారలందరూ. ఏం డెడికేషన్ గురూ.సినిమా అంటే నైన్ టు సిక్స్ జాబ్ కాదు. గంటలతో సంబంధం లేదు. రాత్రీ పగలూ తేడా లేదు. ఎప్పుడంటే అప్పుడు షూటింగ్లో పాల్గొనాల్సిందే. మరి.. సినిమానా? మజాకానా? ఆనంద్, రాశీ ఖన్నా, ‘జయం’ రవి తల్లితో రకుల్, అనూ ఇమ్మాన్యుయేల్, హృతిక్ -
మమ్మమ్మాస్..
స్పెషల్ సాంగ్స్‌లో మరింత స్పెషల్‌గా కనిపించడమే కాదు డ్యాన్స్‌లో రెండింతలు రెచ్చిపోతారు తమన్నా. మళ్లీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోవడానికి రెడీ అవుతున్నారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘అల్లరి అల్లుడు’ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణ మమ్మమాస్ అనేలా దుమ్మురేపిన ‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ సాంగ్‌ను ‘సవ్యసాచి’ చిత్రం కోసం రీమిక్స్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్‌లోనే చైతూతో కలిసి స్టేజ్‌ను అదరగొట్టనున్నారు తమన్నా. ఈ సాంగ్‌ను వచ్చే నెలలో షూట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్ వేస్తున్నారు. ఆల్రెడీ తమన్నా ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జై లవకుశ’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటల్లో ఆమె స్టెప్స్ అదుర్స్. ఇప్పుడీ పాటలోనూ మాస్ స్టెప్స్‌తో మెస్మరైజ్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ మిల్కీ బ్యూటీ చైతూకు జోడీగా ‘100 పర్సెంట్ లవ్’, ‘తడాఖా’ చిత్రాల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
చైతూ ఆటా పాటా
న్యూయార్క్‌లో తన మార్క్ కనిపించేలా చిందేస్తున్నారు హీరో నాగచైతన్య. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ప్రవీణ్. ఎమ్ సహనిర్మాత. ‘‘న్యూయార్క్‌లో జరుగుతోన్న ఈ చివరి షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ ముగుస్తుంది. పదిహేను రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో ఒక సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. చైతూ అక్కగా భూమిక, ఓ కీలక పాత్రలో మాధవన్ కనిపించనున్నారు’’ అని పేర్కొంది చిత్రబృందం. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. రావు రమేష్, ‘వెన్నెల’ కిషోర్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: కీరవాణి. -
మహానటి పెద్ద సవాల్
‘‘నేనెప్పుడూ ప్రయోగాలు చేయడానికే ఇష్టపడతాను. నా ప్రతి సినిమాలో చేశాను కూడా. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల వెనక పరిగెత్తకుండా నాకు నచ్చిన సినిమాలే చేస్తుంటాను’’ అన్నారు సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మహానటి’. కీర్తీ సురేశ్, సమంత, నాగచైతన్య, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ముఖ్య తారలుగా నటించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించారు. మిక్కీ జె. మేయర్ స్వరాలు అందించారు. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమాస్ పతాకంపై ప్రియాంకాదత్ నిర్మించిన ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మిక్కీ జె.మేయర్ మాట్లాడుతూ– ‘‘నటిగా సావిత్రిగారు ఏంటి? అనేది అందరికీ తెలుసు. కానీ ఆమె జీవిత విశేషాలు పూర్తిగా ఎవరికీ తెలియవు. ఆ విషయాలు ‘మహానటి’ చిత్రంతో తెలుస్తాయి. ఈ సినిమాకు సంగీత దర్శకునిగా పని చేయడం పెద్ద చాలెంజ్లా అనిపించింది. పాటల కోసం ఏడాదిన్నర కష్టపడ్డాను. సావిత్రిగారి పాత సినిమాలు చూశాను. ఆ సినిమాల్లో సంగీత శైలి, ఆమె నటన ఎలా ఉన్నాయో పరిశీలించాను. సీతారామశాస్త్రిగారు లిరిక్స్ రాశారు. ఆయన నాకు హెల్ప్ చేశారు. ‘మహానటి’ నా కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ సినిమాకు పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నాగ్ అశ్విన్ విజన్ సూపర్. ‘హ్యాపీడేస్’ లాంటి సినిమాలు కెరీర్లో ఒక్కసారే వస్తాయి. ప్రతి సినిమా ‘హ్యాపీడేస్’ అవ్వదు’’ అన్నారు. -
నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు
ఈలలు.. కేకలు.. చప్పట్లతో థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. ఎందుకంటే... ‘అల్లరి అల్లుడు’ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణల ఊర మాస్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు.. నేను రోమియోగ మారినది లగాయితు....’ రీమిక్స్‌లో నాగచైతన్య, నిధి అగర్వాల్ చిందేయనున్నారు. అవును.. ‘సవ్యసాచి’ సినిమా కోసం ఈ పాటను రీమిక్స్ చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. తొంభై శాతం చిత్రీకరణ పూరై్తంది. ఒక సాంగ్‌తో పాటు మూడు సీన్లను చిత్రీకరించేందుకు చిత్రబృందం యూఎస్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. మే 3 నుంచి 15వరకు ఈ షెడ్యూల్ సాగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు’ సాంగ్ రీమిక్స్‌ని చిత్రీకరించనున్నారు. అప్పుడు ‘అల్లరి అల్లుడు’కి ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. ‘సవ్యసాచి’కి మణిశర్మ స్వరకర్త. ఈ రీమిక్స్ సాంగ్ మణిశర్మ స్టైల్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో నాగ్–రమ్యల స్టెప్స్ అదుర్స్. ఇప్పుడు చైతూ–నిధి కూడా అదిరిపోయేలా స్టెప్స్ వేస్తారని ఊహించవచ్చు. -
సావిత్రిగారి పేరే నా పేరు
పేరు మధురవాణి. అమ్మాయి క్యారెక్టర్ గోల్డ్. చదువులో గోల్డ్ మెడలిస్ట్. మధురంగా మాట్లాడుతుంది కదా అని మధురవాణి మాటల మత్తులో పడ్డారో అంతే. మొత్తం కూపీ లాగేస్తుంది. ఎందుకంటే మధురవాణి జర్నలిస్ట్ కాబట్టి. పైన ఉన్న ఫొటో చూశారుగా. ఎన్ని పేపర్స్ అండ్ ఫైల్స్‌తో మధ్యలో మధురవాణి ఉన్నారో. అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహానటి’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించారు. కీర్తీ సురేష్, సమంత, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ తదితరులు నటించారు. షూటింగ్ కంప్లీటైంది. సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. ఏయన్నార్ పాత్రలో నాగచైతన్య నటించగా, మధురవాణి పాత్ర పోషించారు సమంత. ‘‘నా పేరు కన్యాశుల్కంలో సావిత్రిగారి పేరే. మధురవాణి (బీఏ గోల్డ్ మెడల్)’’ అంటూ ‘మహానటి’ సినిమాలో సమంత లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. అన్నట్లు.. మధురవాణి భలేగా ఉన్నారు కదండీ. ‘మహానటి’ సినిమాను మే 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
చార్మింగ్ పెయిర్
మూడు హిట్ సినిమాల తర్వాత మారోసారి జోడీ కట్టనున్నారు వెంకటేశ్, నయనయతార. ‘లక్ష్మీ, తులసి, బాబు బంగారం’.. ఇలా మూడు సార్లు సిల్వర్ స్కీన్‌పై సందడి చేసి, చార్మింగ్ పెయిర్ అనిపించుకున్న ఈ జోడీ ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టారని సమాచారం. కేయస్ రవీందర్ (బాబీ) దర్శకత్వంలో వెంకటేశ్, నాగచైతన్య ఓ మల్టీస్టారర్ మూవీలో యాక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన హీరోయిన్గా నయనతార పేరుని పరిశీలిస్తుందట చిత్రబృందం. నాగచైతన్య పక్కన హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. సురేశ్ ప్రొడక్షన్స్, కోనా ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందట. -
సూపర్ న్యాచురల్ సుబ్రహ్మణ్యపురం
సుమంత్, ఈషా రెబ్బ జంటగా నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. తారస్ సినీకార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాగచైతన్య క్లాప్‌నివ్వగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్రం లోగోను ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, రాజశేఖర్, జీవితా సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు సంతోష్ స్టోరీ న్యారేషన్లోనే సినిమాను చూపించారు. సూపర్ న్యాచురల్ అంశాలున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇలాంటి జోనర్ అంటే నాకు భయం కానీ కథ నచ్చి చేస్తున్నాను. నిర్మాతలు గుర్తు చేసేవరకు ఇది నా 25వ సినిమా అని నాకు తెలియదు. అందుకే సందడిగా ప్రారంభించారు’’ అన్నారు. ‘‘కథ వింటున్నప్పుడు తర్వాత ఏంటి? అనే ఉత్కంఠతో ఎదురు చూశాను. ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను’’ అన్నారు ఈషా. ‘‘నా షార్ట్ ఫిల్మ్స్ చూసి నిర్మాతలు నాకీ అవకాశం ఇచ్చారు. సింపుల్‌గా అవుట్‌లైన్ చెబుదాం అని వెళ్తే క్లియర్‌గా స్టోరీ అంతా చెప్పమన్నారు సుమంత్‌గారు. కథ అంతా విన్న తర్వాత అంగీకరించారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు దర్శకుడు. ‘‘సుమంత్‌గారి 25వ సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. సుధాకర్ రెడ్డిగారు మంచి సహకారం అందిస్తున్నారు’’ అన్నారు ధీరజ్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్ చంద్ర. -
ఫస్ట్ పంచ్ అదిరింది
‘మొహంపై గాయం, గంభీరమైన చూపు. వెనక వలయాకారంలో చేతులు. ఒక్కో చేతికి ఒక్కో ట్యాటూ. ‘చిన్నారి బొమ్మ, క్వొశ్చన్ మార్క్స్, 21, మహా, అక్క, ప్రేమ గుర్తులు’.. ఆ పచ్చబొట్లే నాగచైతన్య ఫస్ట్ పంచ్ విశేషాలు. ‘ప్రేమమ్’ వంటి హిట్ చిత్రం తర్వాత నాగచైతన్య–చందు మొండేటి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రవిశంకర్, నవీన్ ఎర్నేని, సీవీయం మోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ పంచ్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఫస్ట్ పంచ్ పేరుతో రిలీజ్ చేసిన నాగచైతన్య ఫస్ట్ లుక్‌కి ఇటు చిత్రవర్గాల్లో అటు అభిమానుల్లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో హీరో పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ఈ పోస్ట్ర్తోనే చెప్పేసింది చిత్రబృందం. నాగచైతన్య లుక్ చూశాక అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాధవన్, భూమిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
నాన్‌స్టాప్ లవ్ జర్నీ
దిల్ అంతా ఫుల్ ఖుషీతో ఎగై్జట్ అవుతున్నారు సమంత. మరి.. భర్తతో సినిమా అంటే ఆ మాత్రం ఎగై్జట్‌మెంట్ ఉంటుంది కదా. ఉమెన్స్ డే రోజున అనౌన్స్మెంట్ రావడం, అందులోనూ పెళ్లైన తర్వాత నాగచైతన్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారామె. నాగచైతన్య, సమంత జంటగా ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఓ చిత్రం నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘ప్రేయసి’ అనే టైటిల్ అనుకుంటున్నారట. ‘‘సన్‌షైన్ పిక్చర్స్ పతాకంపై శివ దర్శకత్వంలో నా నెక్ట్స్ సినిమా రూపొందనుందని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది. నా బెటరాఫ్ సమంతతో నటించబోతున్నాను. మరో లవ్ జర్నీ స్టార్ట్’’ అని పేర్కొన్నారు నాగచైతన్య. ‘‘రోలింగ్ గ్లోరీ. ఎగై్జటెడ్.. ఎగై్జటెడ్.. ఎగై్జటెడ్. మూవీ విత్ హస్బెండ్’’ అన్నారు సమంత. ‘‘ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది’’ అని నిర్మాతలు తెలిపారు. పెళ్లికి ముందు ‘ఏమాయ చేసావె, ‘ఆటోనగర్ సూర్య, మనం’ చిత్రాలు చేసిన చై–సామ్ పెళ్లి తర్వాత సైన్ చేసిన ఫస్ట్ సినిమా ఇదే. -
సవ్యసాచి వస్తున్నాడు
సేమ్ వపర్. రైట్ హ్యాండ్‌కి ఎంత పవర్ ఉందో.. సేమ్ పవర్ లెఫ్ట్ హ్యాండ్‌కి కూడా ఉందతనికి. మరి ఈ ఎక్స్ట్రా పవర్‌తో అతను ఎక్స్ట్రీమ్గా ఏం చేశాడో తెలుసుకోవాలంటే ‘సవ్యసాచి’ సినిమా చూడాల్సిందే. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ౖమైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నేని నవీన్, ౖవై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మార్చి 18న రిలీజ్ చేసి, చిత్రాన్ని జూన్ 14న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘ప్రస్తుతం నాగచైతన్య, భూమిక, ఇతర ముఖ్య తారాగణంపై హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఆ తర్వాత యూఎస్‌లో మరో కీలక షెడ్యూల్‌ను ప్లాన్ చేశాం. కీరవాణి సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణ’’ అన్నారు నిర్మాతలు. రావు రమేశ్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: యువరాజ్. ప్రేయసిగా శ్రీమతి మూడుముళ్లకు ముందు ముచ్చటగా మూడుసార్లు (ఏమాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మనం) స్క్రీన్ షేర్ చేసుకున్నారు నాగచైతన్య, సమంత. మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారట. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్మాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కలిసి నటించనున్నారని, ఆల్రెడీ సినిమాకు ‘ప్రేయసి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని టాక్. -
ముహూర్తం కుదిరిందా?
‘సవ్యసాచి’ సినిమా రిలీజ్‌కు మూహూర్తం కుదిరిందా? అంటే.. అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో ఇప్పుడు వినిపిస్తోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. నిధి అగర్వాల్ కథానాయిక. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే... ఈ సినిమాను తొలుత రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్గా ‘సవ్యసాచి’ చిత్రాన్ని మే 24న రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ నాగచైతన్య నటించిన ‘100పర్సెంట్ లవ్’, ‘మనం’,‘తడాఖా’, ‘రారండోయ్ వేడుక చుద్దాం’ చిత్రాలు మే నెలలో రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి... నాగచైతన్యకు కలిసొచ్చిన మే మంత్లోనే ‘సవ్యసాచి’ చిత్రం రిలీజ్ అవుతుందా? లేక వేరే రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తారా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. -
సొగసరి అత్త.. గడసరి అల్లుడు
అత్తారింటికెళ్లాడు అల్లుడు. ఆతిథ్యంలో తేడా వస్తే అమ్మాయిపై ఉన్న ప్రేమతోనో, అత్తింటిపై ఉన్న గౌరవంతోనో.. సర్లే అని సర్దుకుంటాడు. కానీ అత్త తనపై పెత్తనం చేయాలంటే ఊరుకుంటాడా? అబ్బే... అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. సొగసరి అత్తకి ఘాటైన రిప్లై ఇచ్చాడు గడసరి అల్లుడు. ఎలా అంటే.. స్క్రీన్‌పై చూడాల్సిందే. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని టాక్. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. రమ్యకృష్ణ అత్త క్యారెక్టర్ చేస్తున్నారని టాక్. రీసెంట్గా హైదరాబాద్‌లో జరిగిన ఫస్ట్ షెడ్యూల్లో కథానాయిక ఇంట్లోని సీన్స్‌ను తెరకెక్కించారు. సినిమా స్టార్టింగ్‌లో హీరో, హీరోయిన్లలపై కాలేజీ అండ్ పార్క్ సీన్స్‌ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 19న స్టార్ట్ కానుందని సమాచారం. -
సెట్స్ మీదకు ‘శైలజా రెడ్డి అల్లుడు’
యంగ్ హీరో నాగచైతన్య, కామెడీ ఎంటర్టైనర్ల స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు మారుతి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫుల్ స్క్రిప్ట్‌తో రెడీ అయ్యాడు. ఈ నెల 19 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నామని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు చైతూ. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో మారుతి సినిమాను లైన్ లో పెట్టాడు. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. శైలజా రెడ్డిగా సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించనున్నారు. pic.twitter.com/Xddgx4rH1M — Maruthi Dasari (@DirectorMaruthi) 17 January 2018 pic.twitter.com/Vs1viqZQsJ — Maruthi Dasari (@DirectorMaruthi) 17 January 2018 -
రెండు రాష్ట్రాల్లో శేష్
50 కోట్లతో తీసిన సినిమా 150 కోట్లు వసూలు చేస్తే తీసినవాళ్లకు, కొన్నవాళ్లకు పండగే పండగ. హిందీ చిత్రం ‘2 స్టేట్స్’ చిత్రనిర్మాత కరణ్ జోహార్‌కు, కొన్నవాళ్లకు అలాంటి బంపర్ ఆఫరే ఇచ్చింది. ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుందని, నాగచైతన్య–సమంత కలిసి నటించబోతున్నారని, టెస్ట్‌షూట్ జరిగిందని ఆ మధ్య ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకున్నారు. అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి అవి వదంతులేమో అనుకోవచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలో అడవి శేష్ నటించనున్నారట. ‘క్షణం’ ‘అమీ తుమీ‘ వంటి హిట్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్న శేష్ రీసెంట్గా ఈ రీమేక్‌కు సైన్ చేశారు. కొత్త దర్శకుడు వెంకట్ రెడ్డి తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ‘గూఢచారి’ సినిమా చేస్తున్నారు శేష్. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్‌కి రిలీజ్ కానుంది. ‘గూఢచారి’ పూర్తయ్యాక ఈ రీమేక్ మొదలవుతుందట. -
ఇల్లు మారారు
నాగచైతన్య ఇంటి నుంచి మాధవన్ ఇల్లు ఎంతో దూరంలో లేదు. ఆ ఇంటికీ ఈ ఇంటికీ చకాచకా వెళ్లిపోవచ్చు. ఇన్నాళ్లూ మాధవన్ ఇంట్లోనే చైతూ, నిధీ అగర్వాల్, ఇంకా చాలామంది సందడి చేశారు. ఇప్పుడు చైతూ అడ్డాలో హంగామా చేయనున్నారు. ఇల్లేంటి? హంగామా ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా రూపొందుతున్న ‘సవ్యసాచి’ మూవీ హంగామా. ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ వంటి హిట్స్ తర్వాత దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మెహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా మాధవన్ ఇంటికి సంబంధించిన సీన్స్ తీశారు. ఈ షెడ్యూల్ వరకూ మాధవన్ వర్క్ కంప్లీట్ అయింది. దాంతో అందరికీ టాటా చెప్పి, చెన్నై చెక్కేశారాయన. ఇప్పుడు నాగచైతన్య ఇల్లు, వర్క్ ప్లేస్ సీన్స్ తీయడానికి ప్లాన్ చేశారు. ఈ నెల 28 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. మరి, క్రిస్మస్ పండగకి సెలవు లేదా? అంటే.. ‘‘ఆ ఒక్క రోజు సెలవు ఇవ్వాలనుకుంటున్నారు’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. జనవరి 4న ఓ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఇంతకీ.. ఇందులో చైతూ రెండు చేతులకు సేమ్ పవర్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరో ఒంటి చేత్తో విలన్లను రఫ్ఫాడిస్తే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఇక, రెండు చేతులతో అంటే.. దుమ్ము దుమారమే. అయినా రెండు చేతులకూ పవర్ ఉండటం ఏంటి? చందు మొండేటికి ఈ ఐడియా ఎలా వచ్చింది? అంటే.. ‘‘భారతంలో అర్జునుడి రెండు చేతులకూ ఒకే సామర్థ్యం ఉంటుంది. అది తెలుసు. నేనొక ఆర్టికల్ చదివాను. అందులో ఒక వ్యక్తి రెండు చేతులకూ సేమ్ పవర్ ఉంటుంది. అది ఇన్స్పైరింగ్గా అనిపించి, హీరో పాత్రను మలిచాను’’ అని చందు మొండేటి తెలిపారు. -
సీతారామ కల్యాణ మొదలు
సిల్వర్ స్క్రీన్‌పై శివ, భ్రమరాంబల పెళ్లి వేడుకను ఈ ఏడాదిలో చూశాం. అదేనండీ.. శివ పాత్రలో నాగచైతన్య, భ్రమరాంబ పాత్రలో రకుల్ ప్రీత్‌సింగ్ నటించారు కదా! ఇప్పుడు మీకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా గుర్తొచ్చే ఉంటుంది. ప్రజెంట్ ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేస్తున్నారు. హర్ష డైరెక్షన్లో నిఖిల్ కుమార్ నటించనున్నారు. ‘సీతరామ కల్యాణ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవం బెంగళూరులో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నిఖిల్ తల్లిదండ్రులు అనితా కుమారస్వామి, హెచ్డి. కుమారస్వామి క్లాప్ ఇచ్చారు. నిఖిల్ కుమార్ ఎవరో తెలుసా? కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తనయుడు. ఇంకా స్ట్రాంగ్‌గా చెప్పాలంటే... భారత మాజీ ప్రధానమంత్రి హెచ్డీ. దేవగౌడ మనవడు. మహాదేవ్ డైరెక్షన్లో నిఖిల్ కుమార్ హీరోగా గత ఏడాది ‘జాగ్వార్’ సినిమా తెలుగు, కన్నడలో రిలీజ్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. -
రెడ్డిగారి అల్లుడికి క్లాప్!
నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రం నిర్మించనుందనీ, ఆ చిత్రానికి ‘శైలజారెడ్డి అల్లుడు’ పేరు పరిశీలిస్తున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. సిన్మా పేరు అదో? కాదో? తెలీదు గానీ... నిన్న కొబ్బరికాయ కొట్టారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ప్రొడక్షన్ నంబర్ 3గా తెరకెక్కనున్న చైతూ–మారుతిల సినిమా శనివారం ఉదయం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఇందులో చైతూ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ నాయికగా నటించనున్నారు. పూజా కార్యక్రమాల తర్వాత హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. ‘‘జనవరి 5న చిత్రీకరణ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు మారుతి. సితార మాతృ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. -
నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభం
-
అంతా సవ్యంగా...
యస్... నాగచైతన్య–చందూ మొండేటి–మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ మూవీకి అంతా సవ్యంగా జరుగుతోంది. బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ. ఆర్టిస్టులు రెడీ. ఇప్పుడు షూటింగ్‌కి కూడా అంతా రెడీ అయిపోయింది. సినిమా టైటిల్ ‘సవ్యసాచి’. అంటే... రెండు చేతులకూ సమాన బలం ఉన్నవాడు అని అర్థం. సినిమాలో చైతూ లెఫ్ట్ హ్యాండ్ అతని మాట వినదు. అసలు కంట్రోల్లో ఉండదు. కానీ, సినిమాని ఫుల్ కంట్రోల్లో తీస్తామని, సవ్యంగా జరిగేలా ప్లాన్ చేశామని చిత్రబృందం అంటోంది. మొత్తానికి చైతూని వెరైటీ రోల్లో చూడబోతున్నామని టైటిల్ చెబుతోంది. వై. నవీన్, వై. రవిశంకర్, మోహన్ (సీవీఎం) నిర్మిస్తోన్న ఈ చిత్రం బుధవారం మొదలైంది. హైదరాబాద్‌లో వేసిన సెట్లో షూటింగ్ మొదలుపెట్టారు. బాలీవుడ్ భామ నిధీ అగర్వాల్ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో మాధవన్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘నాగచైతన్య–చందూ మొండేటి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రేమమ్’ ఎంత హిట్టయిందో తెలిసిందే. అది ప్రేమకథా చిత్రమైతే.. ఇది హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్. హీరో క్యారెక్టరైజేషన్‌కు ‘సవ్యసాచి’ అనేది యాప్ట్ టైటిల్. ఫస్ట్ షెడ్యూల్ 15 రోజుల పాటు జరుగుతుంది. హీరో, హీరోయిన్, ‘వెన్నెల’ కిశోర్, సత్య కాంబినేషన్లో సీన్స్ తీస్తాం. డిసెంబర్లో జరిగే షెడ్యూల్లో మాధవన్ పాల్గొంటారు’’ అన్నారు. రావు రమేశ్, తాగుబోతు రమేశ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం. కీరవాణి, కెమెరా: యువరాజ్, సీఈవో: చిరంజీవి (చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పీటీ గిరిధర్. -
టైమ్ ఫర్ సెలబ్రేషన్స్!
సెలబ్రేషన్... వేడుక! అంటే... ఒక్కసారి జరుగుతుంది. సెలబ్రేషన్స్... వేడుకలు! అంటే... ఒకటికంటే ఎక్కువ. అక్కినేని కొత్త జంట నాగచైతన్య, సమంత (చైతూ–సామ్)ల మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఇంకెన్ని జరుగుతాయో! గోవాలో పెళ్లయ్యాక ఓ రిసెప్షన్ జరిగిందా! తర్వాత చెన్నైలో చైతూ అమ్మ లక్ష్మీ ఓ రిసెప్షన్ ఇచ్చారా! ఇదిగో... హైదరాబాద్‌లో ఇంకో రిసెప్షన్ లేదా గెట్ టుగెదర్ (పెళ్లైన సందర్భంగా) జరిగినట్టుంది. ఎప్పుడు జరిగిందో గానీ... ఫొటోలు ఇప్పుడు బయటకొచ్చాయి. బహుశా... దగ్గుబాటి ఫ్యామిలీ (చైతూ మేనమామలు నిర్మాత డి. సురేశ్‌బాబు, హీరో వెంకటేశ్) ఇచ్చిన రిసెప్షన్ అయ్యుంటుంది! అందులో అందరూ ఎంత సందడి చేశారో చూడండి!! -
ఎక్కువ కాలేదు... తక్కువ కాలేదు... ఎవరూ చావలేదు!
ఎక్కువ కాలేదు... తక్కువ కాలేదు! ఏంటది? వంట అండ్ వంటలోకి కావలసిన దినుసులు గట్రా! సమంత వండిన వంటలో ఏదీ ఎక్కువ కాలేదట... ఏదీ తక్కువ కాలేదట! యస్... శనివారం సమంత ఇంట్లో వంట చేశారు. ఎందుకు? అంటే... షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని! ఖాళీగా ఉండడంతో కిచెన్‌లోకి వెళ్లి... కూరగాయలు కట్ చేశారు. స్టవ్ అంటించి, నాన్‌స్టిక్ కడాయిపై నాన్‌వెజ్ కూడా కుక్ చేశారు. ఆ తర్వాత నా వంట తిని ఎవరూ చావలేదని సమంతే చెప్పారు. ‘నో వన్ డైడ్... యస్... స్స్!!’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమంత పేర్కొన్నారు. షూటింగ్ క్యాన్సిల్ అయితే... ఆ రోజు వంట చేయడమే అని సోషల్ మీడియాలో ఆమె తెలిపారు. పెళ్లికి ముందు నాగచైతన్య వంట చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేసేవారీమె. పెళ్లి తర్వాత తీరిక చిక్కినప్పుడల్లా ముద్దుల శ్రీవారికి సమంతే వంట చేస్తున్నట్టున్నారు. బహుశా... ‘నేను వంట చేశానోచ్’ అని సమంత పబ్లిగ్గా చెప్పుకోవడమూ ఇదే తొలిసారి అనుకుంటా! నా వంట తిని ఎవరూ చావలేదని చెప్పారు గానీ... టేస్ట్ ఎలా ఉందో ఆమె చెప్పలేదు. నెక్ట్స్ టైమ్ సమంత గానీ... చైతన్య గానీ... కలసినప్పుడు అడుగుదాంలెండి!! -
లండన్‌లో హనీమూన్..!
లవ్... నాగచైతన్య సమంతలది! లండన్... వాళ్ల హనీమూన్ డెస్టినేషన్! అంతే కాదు... మ్యారీడ్ లైఫ్‌లో అవుటాఫ్ ఇండియా వెళ్లడమూ ఇదే ఫస్ట్ టైమ్! యస్... ఇప్పుడు చైతూ–సమంత లండన్‌లో ఉన్నారు. నిజం చెప్పాలంటే... వీళ్లిద్దరూ హనీమూన్‌కి న్యూయార్క్ వెళతారనుకున్నారంతా! కానీ, లండన్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. వారం క్రితమే అక్కడికి వెళ్లారు. ఇండియాలో ఏ మూలకు వెళ్లినా... ఎవరోఒకరు గుర్తు పట్టి పలకరిస్తారు. మాంచి క్రేజీ కపుల్ అండ్ స్టార్స్ కూడా కదా! లండన్‌లో అయితే... అంత ఇబ్బంది ఉండదు. అందువల్ల, స్వేచ్ఛగా విహరిస్తున్నారు. తాము స్టార్స్ అనే సంగతి మరిచి, చేతిలో చెయ్యేసుకుని చక్కగా సిటీ అంతటినీ చుట్టేస్తున్నారట. మధ్య మధ్యలో అభిమానుల కోసం కొన్ని అప్డేట్స్ ఇస్తున్నారనుకోండి! అలాగే, చెన్నై రిసెప్షన్‌లోని ఫొటోలను కొన్నిటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సమంత. కొత్తగా పెళ్లైన ఈ జంట ఇంకో వారం రోజులు లండన్‌లోనే ఉంటారట! ఇండియా తిరిగొచ్చిన తర్వాత మళ్లీ ఎవరి షూటింగులతో వాళ్లు బిజీ బిజీ!! -
'సమంత'కమణి
నాగచైతన్య తన స్నేహితురాలి కష్టాలను పంచుకున్నాడు. .. తన సఖి తప్పులను అర్థం చేసుకున్నాడు. .. తన ప్రియురాలి బాధను తుడిచేశాడు. ఇలా.. కాబోయే భార్య జీవితంలో మూడు ముళ్లను తీసేశాడు. అలా... మూడు ముడులు వేసి ప్రేమకు పట్టాభిషేకం చేశాడు. అందుకే సమంతకు ‘చై’ అంటే అంత ఇష్టం! అక్కినేని కుటుంబం నన్ను నన్నుగా గుర్తించింది. నన్ను నన్నుగా స్వీకరించింది.. నన్ను నన్నుగా ఆదరించింది. ఇవే ఆ మూడు ముడులు. మన పిల్లలు కూడా నేర్చుకోవాల్సింది ఇదేనేమో... మనిషిని మనిషిగా గుర్తించడం... స్వీకరించడం... ఆదరించడం... ప్రేమగా ఆరాధించడం. ‘‘నేను అదృష్టవంతురాలిని’’ అని సమంత చెబుతోంది. ‘చే’ ఈజ్ ఆల్సో లక్కీ అని మేము అనుకుంటున్నాం. చే–సమంతల సంస్కారం శమంతకమణి అంతటి విలువైనది. మూడు తరాల వెలుగులను విరాజమానం చేసే సమంతకమణి ‘గాడ్ బ్లెస్ ది కపుల్’! ఇవాళ (శనివారం) సత్యనారాయణ వ్రతం చేశారు కదా. అంతకుముందు వ్రతం చూసి కూడా ఉండరేమో... ఇక చేయడం అంటే చాలా కొత్తగా ఉండి ఉంటుంది! అవునండి. పెళ్లి తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తారని తెలుసు కానీ, నేనెప్పుడూ చూడలేదు. మూడు గంటల సేపు వ్రతం జరిగింది. చాలా బాగా అనిపించింది. ఇవాళ మొత్తం వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తినాలన్నారు. సంప్రదాయాలెప్పుడూ బాగుంటాయండి. జనరల్‌గా పెళ్లయ్యాక లంచ్‌లు, డిన్నర్లు అంటూ ఎవరో ఒకళ్లు పిలుస్తుంటారు... మీక్కూడా అలా జరుగుతోందా? పెళ్లయ్యాక అబ్బాయి–అమ్మాయి ఎందుకు లావు అవుతారో ఇప్పుడు అర్థమవుతోంది. విందు భోజనాలు చేస్తున్నాం. కొంచెం ఎక్కువే తింటున్నా. నేనైతే నా జీవితంలో ఎప్పుడూ ఈ రేంజ్లో తినలేదు (నవ్వేస్తూ). అలాగే లేజీనెస్ అంటే కూడా నాకు తెలియదు. పని చేయకుండా ఒక్క రోజు ఇంట్లో ఉన్నా గిల్టీగా అనిపించేది. అలాంటిది ఇప్పుడు లేజీగా ఫీలవుతున్నా. మరి... క్లైమెట్ వల్లో ఏమో? పని చేయబుద్ధి కావడం లేదు. ఇంకో వారం రోజులు ఇలానే రిలాక్స్ అవ్వాలని ఉంది. తర్వాత ‘మహానటి’ షూటింగ్ మొదలు కాబోతోంది. మళ్లీ షూటింగ్స్‌తో బిజీ అయిపోతా. పెళ్లితో ఆడవాళ్ల ఇంటి పేరు మారుతుంది. ఇల్లు మారుతుంది. పిల్లలు పుట్టాక ఫిజిక్ కూడా మారిపోతుంది. అన్ని మార్పులూ ఆడవాళ్లకే... ఈ చేంజెస్ గురించి? కరెక్టేనండి. మార్పులన్నీ మనకే. అయితే ఆ మార్పులను ఇష్టంగా తీసుకుంటే, మనకు మనంగా ఆ మార్పులను చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. నా వరకు నేను చేసుకున్న మార్పులు గురించి చెబుతాను. పెళ్లి నుంచి వద్దాం. ‘ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిందే’ అని నన్ను మా ఇంట్లో ఫోర్స్ చేయలేదు. ‘చై’ (నాగచైతన్య)ని పెళ్లి చేసుకుందామనుకున్నాను. ఇంట్లో ఒప్పుకున్నారు. చేసుకున్నా. మ్యారేజ్వైజ్గా నా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం నాకు రాలేదు. అలాగే, పెళ్లయ్యాక ‘సమంత అక్కినేని’ అని నా ఇంటి పేరుని నేను ఇష్టంగానే మార్చుకున్నా. రేపు పిల్లలు పుట్టాక నా ఫిజిక్ మారితే ‘ఐయామ్ ఓకే విత్ ఇట్’. కెరీర్ విషయానికొస్తే.. సినిమాలు కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ‘నో’ అని ఎవరూ అనలేదు. మన లైఫ్‌లో జరిగే మార్పులన్నీ మన ఇష్టప్రకారం జరిగితే బాగుంటుంది. నేను అదృష్టవంతురాలిని. దేవుడు నన్ను చల్లగా చూస్తున్నాడు. పెళ్లిలో చైతూ మీ మెడలో మూడు ముళ్లు వేయగానే ఒక్కసారిగా ఏడ్చేశారు. ఎందుకంత ఎమోషనల్ అయ్యారు? అంతకుముందు వరకూ అందరితో నవ్వుతూనే ఉన్నా. కానీ, మెడలో తాళిబొట్టు పడగానే ఎమోషన్ ఆపుకోలేకపోయాను. ఎందుకంటే, నా గురించి మొత్తం తెలిసిన వ్యక్తి నన్ను పెళ్లాడాడన్న ఆనందం. చైకి నా సక్సెస్, నా ఫెయిల్యూర్స్ తెలుసు. నా ఆర్థిక కష్టాలూ తెలుసు. ‘ఏ మాయ చేసావె’ షూటింగ్ న్యూయార్క్‌లో జరిగినప్పుడు నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అది కూడా చైకి తెలుసు. 2010లో ఆ సినిమా వచ్చింది. వెంటనే వెంటనే నాకు బోలెడన్ని ఆఫర్లు. 2012కల్లా ఫైనాన్షియల్‌గా నేను స్ట్రాంగ్ అయ్యాను. అదీ చైకి తెలుసు. నేను ఘోరమైన తప్పులు చేశాను. ఆ తప్పులు సరిదిద్దుకున్నాను. అది కూడా తనకు తెలుసు. మంచి పనులు చేశాను. అవి కూడా తెలుసు. ఇలా నా జీవితం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి నన్ను పెళ్లాడటం నాకు బాగా అనిపించింది. నేను స్టార్‌ని అని తను నన్ను పెళ్లాడలేదు. డబ్బు కోసం నన్ను పెళ్లాడాల్సిన అవసరమే లేదు తనకి. నన్ను నన్నుగా ప్రేమించాడు. అందుకే చై నా మెడలో మూడు ముళ్లు వేసినప్పుడు ఎమోషన్ అయ్యాను. ఎందుకంటే, పెళ్లాడబోయే వ్యక్తి గురించి ఏమీ తెలియకుండానే చాలామందికి పెళ్లైపోతుంది. మా విషయం వేరు. ఒకరినొకరం పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఈ ప్రపంచంలో నా గ్రేటెస్ట్ లక్ ఏంటంటే... చైతో నా పెళ్లి. ఇప్పుడు ‘మిసెస్ చై’ కాబట్టి.. క్యారెక్టర్స్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉంటారా? గ్లామరస్ రోల్స్ తగ్గించేస్తారా? పెళ్లయిందని కాదు కానీ, ఇప్పుడు నేను ‘బృందావనం’, ‘దూకుడు’లో చేసిన క్యారెక్టర్స్ లాంటివి చేయలేను. ఎందుకంటే... నా కెరీర్ గ్రాఫ్‌ని పెంచుకోవాలి. అందుకే ‘రాజుగారి గది–2’లో చిన్న రోల్ అయినా చేశాను. అది చూసి, అలాంటి రోల్స్‌కి నన్ను తీసుకోవాలనుకుంటారు. ఆ క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలా జనాలను ప్రభావితం చేసే క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నా. కమర్షియల్ రోల్స్ మాత్రమే చేసుకుంటూ పోతే నాకు బోర్ కొట్టేస్తుంది. ఒకప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇప్పుడు ఫుల్ రిలాక్స్. ఏమీ చేయకుండా హాయిగా ఇంటిపట్టున ఉండిపోవచ్చు. పెళ్లితో ఆ భరోసా వచ్చినందుకు ఎలా ఉంది? మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఉన్నప్పుడు హ్యాపీగానే ఉండేదాన్ని. బేసిక్‌గా నాకు డబ్బు పిచ్చి లేదు. ఏదో సాధించాలనే కసి. అందుకే, కెరీర్లో నిలదొక్కుకోవడానికి అంత కష్టపడ్డాను. ఆ కసి ఇప్పుడూ ఉంది. నటిగా ఏమీ లేని స్థాయి నుంచి మంచి స్థాయికి వచ్చాను. నేను కలలో కూడా అనుకోనంత ఆ దేవుడు ఇచ్చాడు. అంతమాత్రాన ఆగిపోకూడదు కదా. ఈ స్థాయిని ఇలానే కొనసాగించాలనుకుంటున్నా. మీ పెళ్లి వేడుకల్లో సురేశ్‌బాబు (నాగచైతన్య మేనమామ– రానా తండ్రి) డ్యాన్స్ చేయడం ఓ హైలైట్. ఆయన అంత సరదాగా ఉంటారని ఆల్మోస్ట్ ఎవరూ ఊహించరు... (నవ్వేస్తూ). ఈ ఫ్యామిలీస్ (అక్కినేని, దగ్గుబాటి) గురించి బయటి వ్యక్తులకు చాలా విషయాలు తెలియదు. చాలా సరదాగా ఉంటారు. అయితే ఆ ఫన్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఉన్నప్పుడే. చాలా ఫ్రీగా ఉంటారు. నా ఎక్స్టెండెడ్ (అత్తగారిల్లు) ఫ్యామిలీ వెరీ నైస్. మరి... మీ పుట్టింటివాళ్ల గురించి? భవిష్యత్తులో చైతో నా పెళ్లి జరుగుతుందని ఆ దేవుడు సింబాలిక్‌గా చూపించాడేమో! మా అమ్మ వాళ్లింట్లో నేను యాక్ట్ చేసిన సినిమాల్లో ఒకే ఒక్క సినిమా ఫొటో ఉంది. అది ‘ఏ మాయ చేశావె’ ఫొటో. మా అమ్మగారికి సినిమా ఫీల్డ్ గురించి ఏమీ తెలియదు. ఇక్కడివాళ్ల గురించి అవగాహన కూడా లేదు. మా వాళ్లకు చై మాత్రమే బాగా తెలుసు. తనతో నా పెళ్లి జరిగినందుకు మా వాళ్లు హ్యాపీ. అక్కినేని ఫ్యామిలీ ఎలా ఉంది? అక్కినేని కుటుంబంలో ఎవరి ఫ్రీడమ్ వాళ్లకు ఉంటుంది. ‘ఇలా చెయ్యండి. ఇలా చెయాలి’ అని యంగ్‌స్టర్స్‌కి రిస్ట్రిక్షన్స్ పెట్టరు. తప్పో... ఒప్పో... మీరే నిర్ణయించుకోండి. తప్పుల నుంచి ఒప్పు తెలుసుకోండి అన్నట్లుగా ఉంటుంది. అది బాగా నచ్చింది. ‘ఇది అక్కినేని ఫ్యామిలీ. ఈ లెగసీని మీరు కాపాడాలి. జాగ్రత్తగా క్యారీ చేయాలి’ అని చెప్పరు. అలా ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా భయం ఉంటుంది. ఆ ఫ్రీడమ్‌ని కరెక్ట్‌గా వాడుకోవాలని జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు నాక్కూడా ‘నేను ఇప్పుడు అక్కినేని ఇంటి కోడల్ని. చాలా బాధ్యతగా ఉండాలి’ అనుకుంటున్నాను. అందుకే చై, నేను ల్యావిష్ వెడ్డింగ్ ప్లాన్ చేయలేదు! ఫ్యామిలీ మెంబర్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య పెళ్లి చేసుకోవాలని చై, నేను ముందే అనుకున్నాం. ఎక్కువమందిని పిలిచినప్పుడు, వచ్చిన ప్రతి ఒక్కరూ కంఫర్ట్‌గా ఉన్నారా? అనేది తెలుసుకోవడం కష్టమవుతుంది. అదే తక్కువమంది ఉన్నారనుకోండి.. అప్పుడు అందరి ఫీలింగ్స్ తెలుస్తాయి. వాళ్లు వేసే జోక్స్ నుంచి ప్రతిదీ తెలుస్తుంది. పెళ్లి చేసుకునే మాతో పాటు వేడుకల్లో పాల్గొనే వాళ్లందరూ హ్యాపీగా ఉండాలన్నది మా ఒపీనియన్. అనుకున్నట్లుగానే మా మ్యారేజ్ చాలా హ్యాపీగా జరిగింది. ఇంతకీ వంట నేర్చుకున్నారా? కచ్చితంగా నేర్చుకోవాలండి. ఎందుకంటే, సురేశ్‌బాబుగారి భార్యని, మా చై వాళ్ల అమ్మని చూస్తున్నాను. ఇంకా ఇంట్లో అమలగారు, మిగతా లేడీస్ అంతా ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉన్నారో స్వయంగా చూస్తున్నా. రానా మదర్ లేకపోతే ఇంట్లో ఏమీ కదలదు. సురేశ్‌బాబుగారు ఎంత పెద్ద ప్రొడ్యూసరో తెలిసిందే. కానీ, ఇంట్లో ఆవిడ లేకపోతే ఏమీ జరగదు. రానా సిస్టర్ మాళవిక కూడా సూపర్. తనకో పాప ఉంది. పాప పనులన్నీ భలే చూసుకుంటుంది. మా ఇంట్లో లేడీస్లా నేనూ బాధ్యతగా ఉండాలనుకుంటున్నా. మంచి భార్య, మంచి తల్లి అనిపించుకుంటా. ప్రొఫెషనల్‌గా సక్సెస్ అయ్యాం కదా.. ఇంట్లో ఎలా ఉంటే ఏం? అనుకోవడంలేదు. ఇంటినీ చక్కబెట్టుకోవాలి. ఏ ఉమన్ అయినా అలా చేస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పటివరకూ చైతూ హ్యాపీగా ఉన్న మూమెంట్స్‌ని చూసి ఉంటారు.. ఆ హ్యాపీనెస్కీ, ఇప్పటి హ్యాపీనెస్‌కి తేడా? ఇప్పుడైతే చాలా రిలాక్స్ అయ్యాడు. ఇంకా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. ఆ డిఫరెన్స్ కనిపిస్తోంది. చై ఎప్పుడూ కూల్ పర్సన్. ఇలా పెళ్లయిందో లేదో అలా షూటింగ్స్‌కి డేట్స్ ఇచ్చేశారు.. మరి హనీమూన్ ఎప్పుడు? ఇంకా ప్లాన్ చేయలేదు. ఇయర్ ఎండింగ్లో వెళ్లాలనుకుంటున్నాం. పిల్లల గురించి మాట్లాడటం టూ ఎర్లీ ఏమో కదా? ఇప్పుడే కదా పెళ్లయ్యింది. అప్పుడే పిల్లల గురించి మాట్లాడుకోవడం నిజంగా ఎర్లీయే. సినిమాలోనే ‘చిట్టి తల్లీ’... బయట ‘సామ్’ అని పిలుస్తారు! ‘రాజుగారి గది–2’లో నేరం చేసిన వాళ్లను మీ పాత్ర క్షమిస్తుంది. లెక్క ప్రకారం శిక్షించాలి కదా? సినిమాలో తప్పు చేసిన అమ్మాయి తను చేసిన పని వల్ల అంత సీరియస్ అవుతుందని ఊహించదు. కట్ చేస్తే... వీడియోలో ఉన్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ సినిమా వరకూ తప్పు చేసిన వ్యక్తిని క్షమించడమే రైట్. ఈ సినిమా రెస్పాన్స్ విని, ఎలా ఫీలవుతున్నారు? అందరూ బాగుందంటున్నారు. మంచి సినిమా, మంచి క్యారెక్టర్ చేసినప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తే హ్యాపీగానే ఉంటుంది కదా. పైగా, నాది మంచి ఎమోషనల్ రోల్. ఇష్టపడి చేశాను. ఈ సినిమాలో మీ మామ (నాగార్జున)గారు ‘చిట్టి తల్లీ’ అని పిలుస్తారు.. రియల్‌గా ఎలా పిలుస్తున్నారు? (నవ్వేస్తూ) సామ్ అంటారు. చాలా అందంగా పిలుస్తారు. ఓకే... తప్పు చేసిన వ్యక్తిని సినిమాలో క్షమించారు. కానీ, రియల్ లైఫ్‌లో అమ్మాయిల జీవితాలతో ఆడుకునేవాళ్లను శిక్షించాలా? ఉరి తీయాలనేంత కోపం మీకు ఉంటుందా? అంత కోపం ఉండదు. ఎందుకంటే, మనల్ని పుట్టించింది దేవుడు. తీసుకెళ్లాల్సింది కూడా దేవుడే అనుకుంటా. అలాగని తప్పు చేసినవాళ్లను వదలకూడదు. పనిష్ చేయాలి. ఆ పనిష్మెంట్ చాలా కఠినంగా ఉండాలి. తప్పు చేయాలంటే ఆ పనిష్మెంట్ గుర్తుకు రావాలి. ఆ పనిష్మెంట్ గురించి తెలిసి, తప్పు చేయాలనుకున్నవాళ్లు ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి. ఓకే సామ్.. విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్? థ్యాంక్స్ అండి. – డి.జి. భవాని సంబంధిత వార్తలు : వివాహ బంధంతో ఒక్కటైన చైతూ, సమంత ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. చైతూ, సమంత పెళ్లిసందడి చేసామ్ పెళ్లి -
చైతూ మంచోడు
... సినిమా ఇండస్ట్రీలో ఈ మాట చాలామంది అంటారు. నిజమే.. తానో పెద్ద స్టార్ కొడుకుని అని, పెద్ద హీరోని అనే ఫీలింగ్ నాగచైతన్యకు ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటారు. ఇప్పుడు చైతూ మంచితనం గురించి చెప్పడానికి ఓ కారణం ఉంది. మారుతి దర్శకత్వంలో చైతూ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘మంచోడు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది డిసెంబరులో మొదలుపెట్టనున్నారట. ఈ సినిమాలో నాగచైతన్య సరసన ‘లై’ ఫేమ్ మేఘా ఆకాశ్‌ని కథానాయికగా తీసుకున్నారనే రూమర్లూ వినిపిస్తున్నాయి. ఈ వదంతుల్లో ఎంత నిజం ఉందో నిలకడగా తెలుస్తుంది. -
మామ మామే... అల్లుడు అల్లుడే!
వెంకటేశ్‌కు నాగచైతన్య ఏమవుతారు? మేనల్లుడు! చైతూకి వెంకీ? మేనమామ! ఈ మామా అల్లుళ్లు ఇద్దరూ కలసి నటించిన సినిమా ‘ప్రేమమ్’. అయితే... అందులో వెంకీది అతిథి పాత్రే. కానీ, స్పెషాలిటీ ఏంటంటే.. అందులో వీళ్లిద్దరూ మామా అల్లుళ్లగానే కనిపించారు. దాంతో దగ్గుబాటి–అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ. వాళ్లను మరింత ఖుషీ చేసే మేటర్ ఏంటంటే... మరోసారి మామా–అల్లుడు కలసి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. మళ్లీ తెరపై మామా అల్లుళ్లగానే కనిపించనున్నారు. అయితే... ఈసారి ఎవరూ అతిథి పాత్రలు చేయాలనుకోవడం లేదు. ఇద్దరివీ పూర్తి స్థాయి పాత్రలే. మల్టీస్టారర్ అన్నమాట! ప్రముఖ రచయిత జనార్థన మహర్షి ఈ మామాఅల్లుళ్ల సినిమాకు స్క్రిప్ట్ రాస్తున్నారు. నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’, చైతూతో ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ వంటి హిట్ సిన్మాలు తీసిన కల్యాణ్‌కృష్ణ ఈ క్రేజీ మల్టీస్టారర్‌కు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ప్రస్తుతం కథపై దర్శక–రచయితలు కసరత్తులు చేస్తున్నారు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత చిత్రీకరణ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట! -
విమెన్స్ కాలేజీ బయట వెయిట్ చేసేవాణ్ణి!
‘‘కొత్తవారిని ప్రోత్సహిస్తే ఇండస్ట్రీకి కొత్త కంటెంట్ వస్తుంది. ఇండస్ట్రీ ఎదుగుతుంది. డేర్ చేసి న్యూకమర్స్‌కు ఛాన్స్ ఇచ్చే ప్రొడ్యూసర్స్ రావాలి’’ అన్నారు నాగచైతన్య. ఆయన హీరోగా కృష్ణ ఆర్.వి. మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యుద్ధం శరణం’. వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. ఎస్.ఎస్ రాజమౌళి తనయుడు ఎస్. కార్తికేయ ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్. నేడు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► ‘యుద్ధం శరణం’లో డ్రోన్ మేకర్ పాత్ర చేశాను. డ్రోన్‌ను ఒక క్యారెక్టర్లా డిజైన్ చేశాం. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే లవ్‌స్టోరీ ఇది. సినిమాలో యాక్షన్ అంతా బ్రెయిన్ అండ్ ఇంటెలిజెన్స్ మీద ఉంటుంది. సినిమా అంతా 24గంటల టైమ్ ఫ్రేమ్‌లో ఉంటుంది. స్క్రీన్‌ప్లే, కంటెంట్వైజ్గా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. యూత్ బాగా కనెక్ట్ అవుతారనుకుంటున్నాను. అందుకే యూత్‌లోకి వెళ్లి సినిమా గురించి వాళ్లకు చెప్పి, వాళ్ల సపోర్ట్ కావాలని చెబుదామని కాలేజ్ టూర్స్ ప్లాన్ చేశాం. యూత్‌తో ఇంట్రాక్ట్ అవ్వడం, ముఖ్యంగా భీమవరంలో విమెన్స్ కాలేజీకి వెళ్లినప్పుడు చాలా బాగా అనిపించింది. నేనెప్పుడూ విమెన్స్ కాలేజీ బయట వెయిట్ చేయడమే కానీ, ఫస్ట్ టైమ్ విమెన్స్ కాలేజీ లోపలికి వెళ్లా. వారి రెస్పాన్స్ బాగా అనిపించింది (నవ్వుతూ). ► ఫస్ట్ టైమ్ థ్రిల్లర్ జోనర్ ఎటమ్ట్ చేశాను. కానీ, ఆడియన్స్ అందరికీ నచ్చేలా, సినిమాలో అన్ని రకాల జోనర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. స్క్రీన్‌ప్లే మాత్రం థ్రిల్లర్ ఫార్మాట్లో ఉంటుంది. ప్రతి పది నిమిషాలకు ఏదో ఒక కొత్త ఎలిమెంట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ► డైరెక్టర్ కృష్ణ నాకు మంచి ఫ్రెండ్. నా ఫ్రెండ్ అనే అభిమానంతో ఛాన్స్ ఇవ్వలేదు. అతను డైరెక్టర్ కావాలనే ఆశయాన్ని నమ్మాను. తను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. నాలుగైదేళ్లు వేరే వేరే డైరెక్టర్ల దగ్గర వర్క్ చేశాడు. రెండు, మూడు స్క్రిప్ట్స్ రాశాడు. అవి రిజెక్ట్ అయ్యాయి. ‘యుద్ధం శరణం’ స్క్రిప్ట్ నాకు, ప్రొడ్యూసర్‌కి అందరికీ నచ్చింది. కృష్ణను లాంచ్ చేయాలని కాకుండా, కథ నచ్చి చేశాం. ► సాయి కొర్రపాటిగారు న్యూకమర్స్‌కు ఇచ్చే ప్రోత్సాహానికి హ్యాట్సాప్. ఈ సినిమాలో చాలా మంది కొత్తవారే. కొత్తవారిని ప్రోత్సహిస్తే ఇండస్ట్రీకి కొత్త కంటెంట్ వస్తుంది. ఇండస్ట్రీ గ్రో అవుతూ ఉంటుంది. ఇలా డేర్ చేసి న్యూకమర్స్‌కు ఛాన్స్ ఇచ్చే ప్రొడ్యూసర్స్ ఉండాలన్నది నా అభిప్రాయం. కార్తికేయ ఈ సినిమాకి లైన్‌ప్రొడ్యూసర్. జనరల్‌గా లైన్‌ప్రొడ్యూసర్ అంటే కంటెంట్ మీద అంత గ్రిప్ ఉండదు. ఆ రోజు షూటింగ్‌కి ఏది కావాలి? ఖర్చు ఎలా తగ్గించాలి? అని ఆలోచిస్తారు. కానీ, కార్తికేయకు డైరెక్టర్‌కు ఏం కావాలో, ప్రొడ్యూసర్‌కి ఏ బడ్జెట్లో ఫినిష్ చేయాలో తెలుసు. ► చందూ మొండేటి డైరెక్షన్లో ‘సవ్యసాచి’ చేస్తున్నా. ఈ సినిమాలో హీరో లెఫ్ట్ హ్యాండ్‌కి, బ్రెయిన్‌తో కంట్రోల్ ఉండదు. రైట్ హ్యాండ్లో ఎంత పవర్ ఉంటుందో లెఫ్ట్ హ్యాండ్‌లోనూ అంతే పవర్ ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. సెప్టెంబర్ 20న తాత (అక్కినేని నాగేశ్వరరావు)గారి పుట్టినరోజు నాడు షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. తర్వాత మారుతిగారి డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నా. సింపుల్ వెడ్డింగ్.. గ్రాండ్ రిసెప్షన్ సమంతతో తన వివాహం గురించి నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘అక్టోబర్ 6న గోవాలో పెళ్లి చేసుకోబోతున్నాం. 6న తెలుగు సంప్రదాయం ప్రకారం, 7న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం మా పెళ్లిని సింపుల్‌గా ప్లాన్ చేశాం. రిసెప్షన్‌ని హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతున్నాం’’ అన్నారు. -
చెప్పకుంటే రాఖీ కట్టేస్తా!
తమిళసినిమా: లేకపోతే రాఖీ కట్టేసి అన్నయ్యగా ఫిక్స్ అయిపోతా! ఏమిటి తలా, తోక లేని రాతలు అనుకుంటున్నారా? అయితే రండి విషయంలోకి వెళదాం. చెన్నై చిన్నది సమంత, తెలంగాణ అందగాడు నాగచైతన్య డీప్ లవ్‌లో ఉన్న సంగతి గురించి తెలిసిందే. ఈ లవర్స్ వచ్చే నెల (అక్టోబర్) ఆరో తేదీ అగ్నిసాక్షిగా ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆ అందమైన జంట ప్రేమకు ఎక్కడ బీజం పడిండి, పెళ్లి ఎలా ఖాయం అయ్యిందన్న విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడు నాగచైతన్య తాజాగా లావణ్యా త్రిపాఠితో కలిసి రొమాన్స్ చేసిన చిత్రం యుద్ధం చరణం. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా నాగచైతన్యను సమంతతో ప్రేమాయణం గురించి అడగ్గా చాలా ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.అవేమిటో చూద్దాం. సమంతతో ప్రేమ ఏమాయ చేసావే చిత్ర షూటింగ్ సమయంలోనే ఏర్పడింది. ఆ తరువాత అది దిన దిన ప్రవర్థమానం అవుతూ వచ్చింది. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం కూడా. అయితే మా ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియనీయలేదు. చెబితే ఎలా రియాక్ట్ అవుతారోనన్న భయం. దీంతో చాలా కాలం అలా గడిచిపోయింది. సమంత ప్రేమ విషయం ఇంట్లో చెప్పమని అంటూ ఉండేది. అలా ఒక సారి సడన్‌గా నన్ను కలిసి మన ప్రేమ విషయం మీ ఇంట్లో వెంటనే చెప్పండి లేదా, రాఖీ కట్టేసి అన్నయ్యగా భావించేస్తాను అని పెద్ద షాక్ ఇచ్చింది. ఇక వేరే మార్గం లేక మా ఇంట్లో చెప్పేశాను. పెద్దలు సమ్మతించడంతో ఊపిరి పీల్చుకున్నాం అని నాగచైతన్య జోవియల్‌గా చెప్పిన విషయం ఇప్పుడు సోషల్‌మీడియాల్లో హల్చల్ చేస్తోంది. నాగచైతన్య, సమంత వేర్వేరు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే పెళ్లి హడావుడిలో ఉన్నారు. వీరి పెళ్లి గోవాలో జరగనుంది. -
చైతూకి రెండోది... శర్వాకు మొదటిది!
‘ప్రేమమ్’... నాగచైతన్య నటించిన చక్కటి ప్రేమకథా చిత్రాల్లో ఇదొకటి! సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వెంకటేశ్‌తో ‘బాబు బంగారం’ను నిర్మించిందీ ఈ సంస్థే. ఈ రెండిటికీ సూర్యదేవర నాగవంశీ నిర్మాత. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న ‘హారికా అండ్ హాసిని క్రియేషన్స్’కు ఈ సితార అనుబంధ సంస్థ అన్న విషయం విదితమే. ఈరోజు ‘హారికా అండ్ హాసిని’ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) పుట్టినరోజు సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ రెండు చిత్రాలను ప్రకటించారు. నాగచైతన్య (చైతూ) హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం, శర్వానంద్ (శర్వా) హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో మరో చిత్రం నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ సంస్థలో చైతూకి ఇది రెండో చిత్రం కాగా, శర్వాకు మొదటిది. ‘‘ఈ రెండు చిత్రాలకు సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించి, చిత్రాలను ప్రారంభిస్తాం’’ అని చిత్రసమర్పకులు పీడీవీ ప్రసాద్ తెలిపారు. -
మారుతి డైరెక్షన్లో అక్కినేని హీరో..?
టాలీవుడ్ లో చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి, భలే భలే మగాడివోయ్ సినిమాతో తో రూట్ మార్చిన మారుతి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చిత్రాల మీద దృష్టి పెట్టాడు. సీనియర్ హీరోగా వెంకటేష్ హీరోగా బాబు బంగారంతో పరవాలేదనిపించిన ఈ యంగ్ డైరెక్టర్, ప్రస్తుతం శర్వానంద్ హీరోగా మహానుభావుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత అక్కినేని యువ హీరో నాగచైతన్యతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం యుద్ధం శరణం సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న చైతూ, తరువాత పెళ్లి, హనీమూన్ ల కోసం బ్రేక్ తీసుకోనున్నాడు. బ్రేక్ మారుతి దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట చైతూ. నాగచైతన్య హీరోగా ప్రేమమ్, మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలను తెరకెక్కించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ కాంబినేషన్ ను తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
జస్ట్... చైన్ హ్యాండ్ మారిందంతే!
మంగళవారం మన్మథుడు అక్కినేని నాగార్జున బర్త్‌డే. ఈ సందర్భంగా ‘రాజుగారి గది–2’లోని ఆయన లుక్‌ను విడుదల చేశారు. చూపుల్లో సీరియస్‌నెస్... చేతుల్లో రుద్రాక్షమాల... ఎప్పటిలా హ్యాండ్సమ్గా కనిపించారు నాగ్. రాజుగారి లుక్కు అక్కినేని అభిమానులకు మాంచి కిక్కిచ్చింది. తండ్రి రుద్రా క్షమాలతో కిక్ ఇస్తే.. తనయుడు నాగచైతన్య సైకిల్ చైన్‌తో ఎట్రాక్ట్ చేశారు. నాగ్ కెరీర్లో ఉన్న బెస్ట్ మాస్ మూమెంట్ ఏదని అడిగితే... వెంటనే అక్కినేని అభిమానులకు గుర్తొచ్చేది ‘శివ’ సిన్మాలో సైకిల్ చైన్ లాగే సీనే కదా. అంతలా ప్రేక్షకులపై ఆ సీన్ ఇంపాక్ట్ చూపింది. సరిగ్గా ఆ సీన్‌ను గుర్తు చేసేలా నాగచైతన్య తండ్రికి బర్త్‌డే విషెస్ చెప్పారు. చైతూ నటించిన తాజా సిన్మా ‘యుద్ధం శరణం’. నాగ్ బర్త్‌డే సందర్భంగా చైతూ సైకిల్ చైన్ పట్టుకున్న ఈ సినిమాలోని స్టిల్‌ను విడుదల చేశారు. అటు రుద్రాక్షమాలతో నాగార్జున... ఇటు సైకిల్ చైన్‌తో చైతూ... ఫ్యాన్స్‌కి గూస్బంప్స్ వచ్చాయంటే నమ్మండి! ఈ రెండు స్టిల్స్‌తో వాళ్లు ఫుల్ హ్యాపీ. అన్నట్టు... చైతూ నటించిన ఈ ‘యుద్ధం శరణం’ వచ్చే నెల 8న విడుదలవుతోంది. అప్పుడీ సైకిల్ చైన్ సీన్‌కి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి!! -
నాకోసం నా కుటుంబంతో యుద్ధం చేయిస్తుంటా
– రాజమౌళి ‘‘ట్రైలర్‌ను బట్టి... ఓ సామాన్యుడు శక్తివంతమైన ప్రతినాయకుడితో యుద్ధం చేయడమనేది ఈ చిత్రకథ. నాకది బాగా నచ్చింది. చైతన్య కథల సెలక్షన్ బాగుంది. నేనైతే ఫ్యామిలీ కోసం యుద్ధం చేయను. నా కోసం నా ఫ్యామిలీతో యుద్ధం చేయిస్తుంటా’’ అన్నారు రాజమౌళి. నాగచైతన్య, లావణ్యాత్రిపాఠి జంటగా కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మించిన ‘యుద్ధం శరణం’ ప్రీ–రిలీజ్ వేడుక ఆదివారం జరిగింది. వివేక్ సాగర్ స్వరపరిచిన పాటల సీడీలను యం.యం. కీరవాణి, ట్రైలర్‌ను రాజమౌళి విడుదల చేశారు. తొలి సీడీని రాజమౌళి, డి. సురేశ్‌బాబు అందుకున్నారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘నా సిన్మాలకు తప్ప మా ఆవిడ (రమా రాజమౌళి) ఇతర సిన్మాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేయదు. తనకేదీ ఓ పట్టాన నచ్చదు. నా సిన్మాల్లోనైనా ఏదైనా పాయింట్ బాగోలేదంటే నిర్మొహమాటంగా చెప్తుంది. కృష్ణ చెప్పిన కథ నచ్చడంతో ఈ సిన్మా చేయడానికి ఒప్పుకుంది. ‘‘బాహుబలి’లో ప్రతి పాత్రకు మనమెంత ప్రీ–వర్క్ చేశామో... కృష్ణ కూడా అలానే ఈ సిన్మాలో పాత్రలను డిజైన్ చేశాడు. ఈ సిన్మాకు వర్క్ ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అని చెప్పింది. తొలిసారి తనంత పాజిటివ్‌గా చెప్పడంతో సినిమాపై చాలా నమ్మకం ఏర్పడింది. తర్వాత సెట్‌కి వెళ్లినప్పుడు, ఇందులో కొన్ని డైలాగులు విన్నప్పుడు సినిమా హిట్టని ఫిక్సయ్యా’’ అన్నారు. ‘‘తెలుగులో కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో సాయిగారు కేరాఫ్ అడ్రస్. నేను, కృష్ణ 4వ తరగతి నుంచి క్లాస్మేట్స్. 8వ తరగతిలో ఒక అమ్మాయినే ప్రేమించాం. అప్పుడా యుద్ధంలో నేను గెలిచా. ఇప్పుడీ యుద్ధంలో తనే గెలుస్తాడు. వివేక్‌సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సిన్మాలో హీరో ఎక్కువగా ఏ ఆయుధం వాడడు. కొత్తగా ఉంటుందీ సిన్మా’’ అన్నారు నాగచైతన్య. ‘‘చైతు, కృష్ణకీ మధ్య మంచి వేవ్‌లెంగ్త్ ఉంది. అది సెప్టెంబర్ 8న తెలుస్తుంది. నా సిన్మాల కంటే చైతూ సిన్మాలు బాగా ఆడాలని కోరుకుంటా’’ అన్నారు రానా. ‘‘చైతన్యగారితో నెక్ట్స్ మూవీ చేయాలనుకుంటున్నాం’’ అని మైత్రి మూవీ మేకర్స్ నవీన్ తెలిపారు. నిర్మాతలు శోభు యార్లగడ్డ, లగడపాటి శ్రీధర్, దర్శకుడు ఇంద్రగంటి, దర్శక–నటుడు అవసరాల పాల్గొన్నారు. -
అచ్చంగా అర్జునుడిలా...
అర్జునుడు సవ్యసాచి. కురుక్షేత్ర రణరంగంలో ఈ ధీశాలి రెండు చేతులతో శత్రువులపై బాణాలు సంధించాడు. నాగచైతన్య కూడా అచ్చంగా అర్జునుడిలానే. అప్పుడు అర్జునుడు బాణాలు వేయ గలిగితే, ఇప్పుడు చైతూ రెండు చేతులతో శూలాలు వేయగ లుగుతాడు. ఇదంతా సినిమా కోసమేనని ఊహించే ఉంటారు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ‘సవ్యసాచి’ చిత్రంలో చైతూ పవర్ఫుల్ రోల్ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమా టైటిల్ లోగోను, ప్రీ–లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ‘‘చందు మొండేటి రాసిన హీరో క్యారెక్టరైజేషన్‌కు ‘సవ్యసాచి’ అనేది యాప్ట్ టైటిల్. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తాం. ‘ప్రేమమ్’ తర్వాత నాగచైతన్య, చందు మొండేటిల హిట్ కాంబినేషన్ ఈ చిత్రంతో రిపీట్ అవుతోంది’’ అని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. -
డైరెక్షన్‌కి రెడీ!
యస్... నాగచైతన్య దర్శకుడిగా మారుతున్నారు. త్వరలో మెగాఫోన్ పట్టుకోవడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అయితే... చైతూ దర్శకత్వం వహించబోతున్నది సినిమాలకు కాదు, యాడ్ ఫిల్మ్స్‌కి! అది కూడా రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్లోనట. చందూ మొండేటి దర్శకత్వంలో హీరోగా నటించనున్న సినిమాలో నాగచైతన్య యాడ్ ఫిల్మ్‌మేకర్‌గా కనిపిస్తారట. క్యారెక్టర్ కోసం డైరెక్షన్ చేయడానికి చైతూ రెడీ అవుతున్నారన్న మాట. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో చైతూ క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటాయట! ఆల్మోస్ట్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందనీ, త్వరలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం. -
సమంత ఇంట్లో సంతోషం చేరింది
– నాగచైతన్య ‘తెలుగు చిత్రసీమ చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, రామానాయుడు వంటి దిగ్గజాలు చేసిన కృషి మరువలేనిది. అప్పట్నుంచి చిత్రసీమ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి, సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. ఇక, అవార్డుల విషయానికి వస్తే విలేకరి స్థాయి నుంచి పత్రికాధినేతగా ఎదిగి, 15 ఏళ్లుగా అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహిస్తున్న ‘సంతోషం’ సురేశ్ కొండేటి ఎంతగా కష్టపడ్డాడో అర్థమవుతోంది’’ అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ‘సంతోషం’ సౌతిండియన్ ఫిల్మ్ అవార్డుల వేడుక జరిగింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ప్రేమమ్), నటిగా సమంత (అఆ), దర్శకుడిగా బోయపాటి శ్రీను (సరైనోడు), నిర్మాతగా రాజ్ కందుకూరి (పెళ్లి చూపులు) అవార్డులు అందుకున్నారు. స్వర్గీయ దాసరి నారాయణరావు పేరు మీద ఈ ఏడాది నుంచి దాసరి స్మారక అవార్డులనూ ‘సంతోషం’ సురేశ్ ఇవ్వడం ప్రారంభించారు. నిర్మాతగా అల్లు అరవింద్, నటుడిగా మురళీమోహన్, రచయితలుగా పరుచూరి సోదరులు, విలేకరిగా పసుపులేటి రామారావులు దాసరి స్మారక పురస్కారాన్ని, అల్లు రామలింగయ్య స్మారక అవార్డును సప్తగిరి అందుకున్నారు. నటి రోజా రమణి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ‘‘ప్రేక్షకులు, విమర్శకుల ప్రోత్సాహంతో ‘ప్రేమమ్’కు అవార్డు వచ్చింది. అలాగే, సమంత ఇంటినిండా ఉన్న అవార్డుల్లో సంతోషం అవార్డు కూడా చేరింది’’ అన్నారు నాగచైతన్య. ‘‘దాసరిగారి పేరు మీద తొలిసారిగా సురేశ్ అవార్డు నెలకొల్పడం, అదీ నేను అందుకోవడం సంతోషం’’ అన్నారు అల్లు అరవింద్. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. -
స్క్రీన్ టెస్ట్
♦ ‘ఏ మాయ చేసావె’ అంటే నాగచైతన్య, సమంతే గుర్తొస్తారు. కానీ, దర్శకుడు గౌతమ్ మీనన్ ఫస్ట్ ఛాయిస్ నాగచైతన్య కాదు. ఆయన ఈ కథతో ఏ హీరో దగ్గరకు వెళ్లారో చెప్పుకోండి? ఎ) మహేశ్‌బాబు బి) నాని సి) రామ్‌చరణ్ డి) రామ్ ♦ ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి, కథారచయిత విజయేంద్రప్రసాద్! మరి, ఆ సినిమాకు మాటలు రాసింది ఎవరు? ఎ) పరుచూరి బ్రదర్స్ బి) కోన వెంకట్–గోపీమోహన్ సి) అజయ్–విజయ్ డి) అబ్బూరి రవి ♦ ఏయన్నార్ మనవడు సుమంత్‌కు అఖిల్ ఏమవుతారు? ఎ) బావమరిది బి) తమ్ముడు సి) బావ డి) అన్నయ్య ♦ ఏ సినిమాలోని ఫైట్స్ కోసం అల్లు అర్జున్ థాయ్‌ల్యాండ్ వెళ్లి నాన్‌చాక్‌తో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు? ఎ) సరైనోడు బి) బద్రీనాథ్ సి) దేశముదురు డి) బన్నీ ♦ ‘కృష్ణా నగరే మావా... కృష్ణానగరే మావా’ పాటలో తొలి చరణం ఏ వాక్యంతో మొదలవుతుంది? ఎ) సినిమాలే లైఫ్రమావా లైఫంతా సినిమా మావా బి) పని ఉంటే మస్తుర మావా లేకుంటే పస్తులు మావా సి) ఎన్నెన్నో ఆశలున్నవీ ఏవేవో ఊహలున్నవీ డి) షూటింగే జరిగినప్పుడు ప్రతి రోజూ పెళ్లి సందడే ♦ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో ఫస్ట్ హీరోయిన్గా ఎంపికైంది ఈవిడే... కాజల్ అగర్వాల్ కాదు! షూటింగ్ మొదలయ్యే సరికి సినిమాలో హీరోయిన్ మారారు. ఎ) రెజీనా బి) రకుల్‌ప్రీత్ సింగ్ సి) పూజా హెగ్డే డి) అనీషా ఆంబ్రోస్ ♦ ‘ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నార్రా నాన్నా’ – మహేశ్‌బాబు చెప్పిన ఈ డైలాగ్ ఏ సిన్మాలోనిది? ఎ) అతడు బి) పోకిరి సి) అతిథి డి) అర్జున్ ♦ చిరంజీవి కోటిరూపాయలకు పైగా పారితోషకం అందుకున్న తొలి సినిమా ఏది? ఎ) అత్తకు యముడు అమ్మాయికి మొగుడు బి) ముగ్గురు మొనగాళ్లు సి) జగదేకవీరుడు అతిలోక సుందరి డి) ఆపద్బాంధవుడు ♦ ‘ఓం నమో వేంకటేశాయ’లో ప్రగ్యా జైశ్వాల్ వేసుకున్న ఈ డ్రస్ చాలా బాగుంది కదూ! కానీ, దాన్ని మోయడానికే ప్రగ్యా కొంచెం కష్టపడ్డారు. ఆమెను అంతగా కష్టపెట్టిన ఈ లెహెంగా బరువెంతో తెలుసా? ఎ) 14 కిలోలు బి) 24 కిలోలు సి) 4 కిలోలు డి) 20 కిలోలు ♦ రీసెంట్గా ‘సింక్ సౌండ్’ అనే పదం ఎక్కువ వినపడుతోంది. అంటే ఏంటో తెలుసా? ఎ) షూటింగ్ చేసేటప్పుడే డైలాగులు రికార్డు చేయడం బి) సీన్‌కు తగ్గట్టు రీ–రికార్డింగ్ చేయించడం సి) స్పెషల్ టెక్నిక్‌తో డైలాగులను రీ–క్రియేట్ చేయడం డి) రీ–రికార్డింగ్, డైలాగులను కరెక్ట్‌గా సింక్ చేయడం ♦ రాజశేఖర్ కర్ణుడిగా, శ్రీకాంత్ అర్జునుడిగా నటించిన సినిమా ఏది? ఎ) శ్రీకృష్ణపాండవీయం బి) యమలీల సి) ఘటోత్కచుడు డి) అభిమన్యుడు ♦ ‘అడవి రాముడు’ అంటే ఎన్టీఆర్‌తో పాటు కె. రాఘవేంద్రరావు డైరెక్షన్ గుర్తొస్తుంది. ఎన్టీఆర్‌తో ఆయనది సూపర్‌హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చాయి? ఎ) తొమ్మిది బి) పది సి) పదకొండు డి) పన్నెండు ♦ హీరో జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేశారు. అందులో బాలకృష్ణకు మేనమామగా ఏయన్నార్ నటించారు. ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి! ఎ) ఆత్మబలం బి) భార్యాభర్తలబంధం సి) కథానాయకుడు డి) ముద్దుల మావయ్య ♦ ‘అపరిచితుడు’ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. తమిళంలో హీరో కాకముందు తెలుగులో సినిమాలు చేశారు. దాసరి దర్శకత్వంలో విక్రమ్ ఓ హీరోగా నటించిన సిన్మా ఏది? ఎ) బంగారు కుటుంబం బి) నాన్నగారు సి) ఆడాళ్లా మజాకా డి) చిరునవ్వుల వరమిస్తావా ♦ బ్యాచిలర్ పార్టీలో ముగ్గురు ఫ్రెండ్స్ ఫుల్లుగా మందేసి ఏదేదో చేస్తారు. తీరిగ్గా తెల్లారిన తర్వాత నిద్రలేచి రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకుంటారు! – హాలీవుడ్ ఫిల్మ్ ‘హ్యాంగోవర్’ కాన్సెప్ట్ ఇది. ఈ సిన్మా కంటే నాలుగేళ్ల ముందు ఇంచుమించు ఇదే కాన్సెప్ట్‌తో తెలుగులో ఛార్మీ హీరోయిన్గా వచ్చిన సినిమా ఏది? ఎ) అనుకోకుండా ఒక రోజు బి) కావ్యాస్ డైరీ సి) నగరం నిద్రపోతున్న వేళ డి) మనోరమ ♦ తాప్సీ, తమన్నా... మ్యాగ్జిమమ్ వీళ్లిద్దరికీ డబ్బింగ్ చెప్పేది ఒక్కరే. ఆవిడెవరో తెలుసా? ఎ) ప్రియాంక బి) సౌమ్యా శర్మ సి) హరిత డి) చిన్మయి ♦ ఈ యంగ్ సింగర్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రఘు భార్య! ఎ) మాళవిక బి) ప్రణవి సి) మానస డి) రమ్యా బెహ్రా ♦ ‘మగధీర’లోని ‘ధీర ధీర ధీర మనసాగలేదురా...’ పాటకు కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? చిన్న హింట్: ఈ పాటకు ఆయన నంది అవార్డు అందుకున్నారు. ఎ) శివశంకర్ బి) శోభి సి) ప్రేమ్ రక్షిత్ డి) జానీ ♦ఎన్టీఆర్, సావిత్రి, జమున... ఈ ముగ్గురూ కలసి నటించిన ఈ స్టిల్ ఏ సిన్మాలోనిది? ఎ) మాయాబజార్ బి) దేవత సి) మిస్సమ్మ డి) గుండమ్మ కథ ♦ ఈ ఫొటోలోని చెన్నై చిన్నారి ఇప్పుడు తెలుగు–తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్! ఎ) సమంత బి) శ్రుతీ హాసన్ సి) ప్రియా ఆనంద్ డి) త్రిష మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) సి 3) ఎ 4) బి 5) సి 6) డి 7) బి 8) డి 9) ఎ 10) ఎ 11) సి 12) ఎ 13) బి 14) ఎ 15) ఎ 16) ఎ 17) బి 18) ఎ 19) సి 20) డి -
యుద్ధం.. శరణం
తప్పలేదు... శ్రీకృష్ణుడు అంతటి వ్యూహశాలికి అర్జునుడి చేత యుద్ధం చేయించక తప్పలేదు. న్యాయం కోసం గురువులు, బంధువులు, స్నేహితులపై అర్జునుడు విల్లు ఎక్కు పెట్టక తప్పలేదు. దాంతో మహా భారతంలో అన్నదమ్ముల మధ్య యుద్ధం తప్పలేదు. ఇప్పుడీ నయా భారతంలో నాగచైతన్య కూడా ‘యుద్ధం శరణం’ అంటున్నారు. ఆయన ఎవరిపై విల్లు ఎక్కుపెట్టారనేది వచ్చే నెలలో తెలుస్తుంది. నాగచైతన్య హీరోగా వారాహి చలనచిత్రం పతాకంపై రజని కొర్రపాటి నిర్మిస్తున్న తాజా సినిమాకు ‘యుద్ధం శరణం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కృష్ణ ఆర్.వి. మారిముత్తు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్‌ను ఆదివారం విడుదల చేశారు. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి మాట్లాడుతూ – ‘‘పూర్తి స్థాయి యాక్షన్ చిత్రమిది. కథకు తగ్గ టైటిల్ కుదిరింది. ఇందులో నాగచైతన్య లుక్, యాటిట్యూడ్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఆయనతో పాటు రావు రమేశ్, మురళీశర్మ, రేవతిల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెల 15న టీజర్, తర్వాత ఆడియో విడుదల చేసి, వచ్చే నెలలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాని, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్. నాథన్, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: వివేక్ సాగర్. -
అలా చేసేకన్నా సినిమాలు మానేస్తా!
హీరోయిన్ అన్నాక గ్లామరస్‌గా కనిపించాలని ప్రేక్షకులు కోరుకుంటారు. వాళ్ల కోసమే తాము గ్లామరస్‌గా కనిపిస్తుంటామని కొంతమంది కథానాయికలు అంటుంటారు. లిప్ లాక్, బికినీ సీన్స్ చేసినప్పుడు కథ డిమాండ్ చేసిందంటుంటారు. ముద్దుగుమ్మలు ఏం చెప్పినా వినడానికి బాగుంటుంది. అయితే, మంజిమా మోహన్ ఇలాంటివన్నీ చెప్పనే చెప్పరు.ఎందుకంటే, ఈ బ్యూటీ లిప్ లాక్ సీన్స్ చేయరట. ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నాగచైతన్యతో జోడీ కట్టిన ఈ భామ ఆ తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ నటించలేదు. కాగా, ‘మంజిమా లిప్ లాక్ సీన్లకు, స్కిన్ షో చేయడానికి రెడీ’ అనే వార్త షికారులో ఉంది. దీని గురించి మంజిమా ఘాటుగా స్పందించారు. ‘‘ప్రేక్షకుల అభిరుచుల్లో గతానికి ఇప్పటికీ తేడా వచ్చింది. గ్లామర్– అశ్లీలానికి తేడా వాళ్లకు తెలుసు. అందాల ప్రదర్శనకే ఇష్టపడని నేను లిప్ లాక్ సీన్లు చేస్తానని ఎలా చెబుతాను? అలాంటివి చేస్తేనే అవకాశాలు వస్తాయంటే సినిమాలు మానేసి ఇంట్లో కూర్చోవడానికి సిద్ధమే’’ అన్నారామె. -
క్లైమాక్స్ కూడా రెడీ!
స్టార్టింగ్... ఇంటర్వెల్... క్లైమాక్స్... ఏ సినిమాకైనా ఈ మూడూ ఇంపార్టెంట్. దర్శక–రచయితలు ఎవరికి కథ చెప్పినా... మెయిన్‌గా ఈ మూడూ మిస్ కారు. కానీ, తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ అలా కాదు. ఆయనది సెపరేట్ స్కూల్. ఏ కథ రాసినా, ఇతర రచయితల దగ్గర కథలు తీసుకున్నా... చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు సినిమా క్లైమాక్స్ రాసే అలవాటు ఈయనకు లేదు. సగం షూటింగ్ పూర్తయ్యాక, అప్పటివరకూ వచ్చిన రషెస్ చూసుకుని ఓ ఐడియాకు వచ్చిన తర్వాత క్లైమాక్స్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఓ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే తర్వాతి సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను క్లైమాక్స్‌తో సహా కంప్లీట్ చేశారు గౌతమ్ మీనన్. అదే... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో, నాలుగు భాషల్లోని నలుగురు హీరోలతో తీయనున్న మల్టీస్టారర్ ఫిల్మ్. ఓ పెళ్లిలో కలసిన నలుగురు స్నేహితులు, అక్కణ్ణుంచి అడ్వంచరస్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఏం జరిగిందనేది ఈ చిత్రకథట! గౌతమ్ మీనన్ మాట్లాడుతూ– ‘‘హీరోలు పృథ్వీరాజ్ (మలయాళం), నాగచైతన్య (తెలుగు), పునీత్ రాజ్‌కుమార్ (కన్నడ), హీరోయిన్లు అనుష్క, తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు కూడా చేశారు. శింబు (తమిళం) గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా. మంజిమా మోహన్, నివేదా థామస్లలో ఎవరో ఒకరు సినిమాలో నటించే ఛాన్సుంది. ఫస్ట్ టైమ్ నేను క్లైమాక్స్‌తో సహా స్క్రిప్ట్ వర్క్ చేశా’’ అన్నారు. -
హిట్టయింది.. హాలిడేకి వెళుతున్నాం
‘‘నెల నుంచి ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అమల హాలిడేకి తీసుకువెళ్లమన్నా... తీసుకెళ్లలేదు. నిన్న సినిమా విడుదలైంది. సూపర్ హిట్టయింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ హ్యాపీనెస్లో రేపే హాలిడే ట్రిప్‌కి వెళ్తున్నాం’’ అన్నారు నాగార్జున. నాగచైతన్య, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ సక్సెస్‌మీట్ శనివారం జరిగింది. నాగార్జున మాట్లాడుతూ – ‘‘కుటుంబ ప్రేక్షకుల ఆదరణ వల్లే ఇంత భారీ సక్సెస్ సాధ్యమైంది. బీచ్ సీన్‌కి, చైతూ నటనకు ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తున్నారని తెలిసి హ్యాపీగా ఫీలయ్యా. నటీనటులందరూ బాగా చేశారు. కల్యాణ్‌కృష్ణ, దేవిశ్రీ ప్రసాద్, సత్యానంద్, జీకే మోహన్.. బాగా కష్టపడ్డారు’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకి నా కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. నా పాత్రకు ఇంత పేరొస్తుందంటే కల్యాణ్కృష్ణే కారణం. మా వెన్నంటే ఉండి నడిపించిన నాన్నకు థ్యాంక్స్’’ అన్నారు. కల్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ – ‘‘నాగార్జునగారు లేకుంటే ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్.. వేడుక చూద్దాం’ సినిమాలు, సక్సెస్‌లు ఉండేవి కాదు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయనకు థ్యాంక్స్. శివలాంటి మెచ్యూర్డ్ క్యారెక్టర్లో చైతూ తన నటనతో డబుల్ ఇంపాక్ట్ చూపించాడు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో స్క్రీన్‌ప్లే రచయిత సత్యానంద్, డీఓపీ ఎస్వీ విశ్వేశ్వర్ పాల్గొన్నారు. -
ఫాదర్గానా... ఐ కాంట్!
‘‘నటుడికి ఓ ఇమేజ్ ఉండాలని నేనెప్పుడూ అనుకోను. ఒకవేళ ఇమేజ్ వస్తే దానికి కట్టుబడి సినిమాలు చేయాలి. చైతూ విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు. మొన్న ‘ప్రేమమ్’ చేశాడు. అంతకు ముందు వేరే సినిమాలు చేశాడు. ఇప్పుడో థ్రిల్లర్ చేయబోతున్నాడు. ‘రారండోయ్..’తో అందరికీ దగ్గరవుతాడు’’ అన్నారు నాగార్జున. కుమారుడు నాగచైతన్య (చైతూ) హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘రారండోయ్.. వేడుక చూద్దాం’ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున పాత్రికేయులతో ముచ్చటించారు. ► నేను బాగా ఇష్టపడి చేసిన, నాకిష్టమైన సినిమా ‘నిన్నే పెళ్లాడతా’. అలాంటి ఫ్యామిలీ, ఎమోషన్స్ ఉన్న సినిమా చైతూకి కావాలని ‘రారండోయ్..’ చేశాం. ఇప్పుడు అమ్మాయి–అబ్బాయిల మధ్య రిలేషన్షిప్స్, ఎమోషన్స్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. తండ్రీకొడుకులు, తండ్రీకూతుళ్ల మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయనేది చూపించాం. చక్కని కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ►మనకు ఇలాంటి స్నేహితుడు, ప్రేమికుడు ఉండాలనుకునే పాత్రను చైతూ చేశాడు. జగపతిబాబు–చైతూ మధ్య సీన్స్ అయితే ఆల్మోస్ట్ నేను–చైతూ ఎలా మాట్లాడుకుంటామో అలానే దింపేశాం. ‘మీరే ఆ పాత్ర చెయ్యొచ్చు కదా’ అన్నారు. అఖిల్ సినిమాలోనూ ఫాదర్‌గా చేయమన్నారు. (నవ్వుతూ..) ఐ కాంట్. ►చైతూకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? అని అడగ్గా... ‘‘(నవ్వుతూ) సినిమా అయిన తర్వాత ఇస్తానని చెప్పా. నేను ఇచ్చేదేంటి? ఇదంతా వాళ్లదే కదా!’’ అన్నారు. తనకు ఖర్చులుంటాయి కదా? అంటే... ‘‘అవసరం అయితే అడిగి తీసుకువెళతాడు. సుప్రియను అడగమంటా. తను కరెక్ట్‌గా ఆన్సర్ ఇస్తుంది’’. ►‘మన్మథుడి’కి ‘హి హేట్స్ విమెన్’ అని ట్యాగ్‌లైన్ పెట్టాం. సినిమా చూస్తే కంప్లీట్ రివర్స్‌లో ఉంటుంది. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా? అనడిగితే... ‘‘ట్రైలర్లో డైలాగది. సినిమాలో రాజకుమారుడు ఎవరంటే ‘అమ్మాయిని రాణీలా చూసుకునేవాడు’ అనే డైలాగ్ ఉంది. స్త్రీలకు సినిమా వ్యతిరేకం కాదు’’ ►నిర్మాత అంటే చెక్కుల మీద సంతకం పెట్టడం కాదు. ప్రతి పనినీ దగ్గరుండి చూసుకోవాలి. నాన్నగారు, నాన్నగారి నిర్మాతల నుంచి నేను నేర్చుకున్నది అదే. నేను నిర్మించే ప్రతి సినిమా పనులను దగ్గరుండి చూసుకుంటా. చైతూ, అఖిల్ ఇతర సంస్థల్లో చేస్తుంటే నేను వేలు పెట్టను. వాళ్లతో కంటిన్యూస్‌గా సినిమాలు తీసే ఓపిక నాకు లేదు. వాళ్లిద్దరున్నారు, నేను... ఏడాదికి మా సంస్థలో ఒక్కో సినిమా చేయగలమంతే. ►50 కోట్లు ఎక్కడ? 1500 కోట్లు (‘బాహుబలి–2’ వసూళ్లను ఉదహరిస్తూ) ఎక్కడ? కొన్నాళ్లు అందరూ క్లబ్బుల గురించి మాట్లాడడం మానుకోవాలి. గతేడాదే నేను క్లబ్బుల గురించి మాట్లాడ వద్దని చెప్పా. బడ్జెట్ ఎంత? వసూళ్లెన్ని! అనేవి చూసుకోవాలి. ‘బాహుబలి’తో రాజమౌళి ‘డ్రీమ్ బిగ్. యు మైట్ అచీవ్ ఇట్’ అని చెప్పారు. తెలుగు సినిమా క్వాలిటీని పెంచారు. ‘బాహుబలి’కి ముందు ‘అడవి రాముడు, ప్రేమాభిషేకం, మాయాబజార్’... ఇలా తెలుగు సినిమావాళ్లు ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ► ‘మనం’ చేసినప్పట్నుంచి బాగా జోకులేసుకోవడం నాకు, సమంతకు అలవాటు. అప్పుడు ‘సార్’ అనేది. ఇప్పుడు ఎలాగోలా ఒప్పించి ‘మామా’ అని పిలిపించుకుంటున్నా. ‘మామయ్య’ అంటే మరీ ఓల్డ్‌గా ఉంది కదా! అక్టోబర్‌లో చైతూ–సమంతల పెళ్లి ఉంటుంది. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. ► ‘విక్రమ్’ విడుదలై నేటికి (మంగళవారం) 31 ఏళ్లయ్యిందని నాగార్జునకు గుర్తు చేయగా... ‘‘నిజమా! నాకు నిజంగా గుర్తు లేదు. ఇక్కడికి వస్తుంటే అమల ‘పార్టీ టు నైట్’ అని మెస్సేజ్ పెట్టింది. ఇందుకే అన్నమాట’’ అన్నారు. ►మోహన్‌లాల్ భీముడిగా నటించనున్న ‘మహాభారతం’లో కర్ణుడిగా నటించమని అడిగారు. చిత్రదర్శకుడు శ్రీకుమార్ నాలుగేళ్ల నుంచి ‘మహాభారతం’ తీయాలని ప్లాన్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే ‘మీకు ఇంట్రెస్ట్ ఉందా? అని నన్ను అడిగారు. వాసుదేవ్ నాయర్ నాకు స్క్రీన్‌ప్లే ఇచ్చారు. భీముడి కోణంలో సినిమా తీస్తే నా పాత్రకు ప్రాముఖ్యత ఏముంటుంది? అని శ్రీకుమార్‌ను అడిగితే... ‘‘అన్ని పాత్రలను బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం’’ అన్నారు. చిన్న క్యారెక్టర్ అయినా... ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే చేస్తానని చెప్పా. ఇంకా డిస్కషన్స్‌లో ఉంది. నేను చేస్తానా? లేదా? అనేది చెప్పలేను. -
బ్యాచిలర్ వదినగారు!
శుక్రవారం సమంత పుట్టినరోజు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్... ముగ్గురిలో ఒక్కరంటే ఒక్కరు కూడా త్వరలో అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టనున్న ఈమెకు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ చెప్పలేదు. డైరెక్ట్‌గా కలసి చెప్పారో.. ఫోనులో చెప్పారో... ప్రేక్షకులకు తెలీదు కదా! లైఫ్‌లో ఇటువంటి ఇంపార్టెంట్ డేస్‌ను కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యతో సెలబ్రేట్ చేసుకోవడం... వెంటనే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సమంత సై్టల్. శుక్రవారం ఇలాంటివి ఏమీ కనిపించలేదు. అనాథ బాలలతో కలసి ‘బాహుబలి–2’ చూశారు. మంచి విషయమే అయినా... ఇదంతా చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించింది. అసలు మేటర్ ఏంటంటే... శుక్రవారం సాయంత్రం అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌తో సమంత స్పెషల్‌గా బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. కాబోయే వదినతో దిగిన బర్త్‌డే ఫొటోలను అఖిల్ ట్వీట్ చేసి, విషెస్ చెప్పారు. ‘‘కొత్త అక్కినేనితో నేను. డార్లింగ్ వదినకు హ్యాపీ బర్త్‌డే. ఈ ఏడాది నీకు అంతా మంచే జరుగుతుంది’’ అని అఖిల్ పేర్కొన్నారు. చైతూతో పెళ్లి ఫిక్స్ అయ్యింది కదా! సో, సమంతకు బ్యాచిలర్‌గా ఇదే చివరి బర్త్‌డే కావొచ్చు. -
'సాహసం శ్వాసగా సాగిపో' మూవీ రివ్యూ
టైటిల్ : సాహసం శ్వాసగా సాగిపో జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్ తారాగణం : నాగచైతన్య, మంజిమా మోహన్, బాబాసెహగల్, సతీష్ కృష్ణన్ సంగీతం : ఏ ఆర్ రెహమాన్ దర్శకత్వం : గౌతమ్ మీనన్ నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సాహసం శ్వాసగా సాగిపో. ఈ ప్రేమమ్ కన్నా ముందే రిలీజ్ కావాల్సి ఉన్నా తమిళ వర్షన్ షూటింగ్ ఆలస్యం కావటంతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే గతంలో గౌతమ్ మీనన్, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన ఏంమాయ చేసావే ఘనవిజయం సాధించటంతో సాహసం శ్వాసగా సాగిపో సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా.. కథ : రజనీకాంత్ మురళీధర్ (నాగచైతన్య).. ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైన ఉద్యోగం రాకపోవటంతో ఎంబిఏ చేస్తూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుంటాడు. అదే సమయంలో తన చెల్లెలి కాలేజ్ ఫంక్షన్లో లీలా సత్యమూర్తి(మంజిమా మోహన్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. తరువాత అదే అమ్మాయి కోర్సు చేయటం కోసం తన చెల్లితో కలిసి తన ఇంట్లోనే ఉండటంతో మరింత ఆనందపడిపోతాడు. కొద్ది రోజుల్లోనే లీలాతో రజనీకాంత్‌కు మంచి పరిచయం ఏర్పడుతుంది. అదే సమయంలో తాను కన్యాకుమారిలో సూర్యోదయం చూడటానికి బైక్ మీద వెళుతున్న విషయం లీలాతో చెప్తాడు రజనీకాంత్. లీలా కూడా రజనీకాంత్‌తో కలిసి కన్యాకుమారి బయలుదేరుతుంది. ఈ జర్నీలో ఇద్దరూ మరింత దగ్గరవుతారు. కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చే సమయంలో అనుకోకుండా వాళ్ల బైక్‌కు యాక్సిడెంట్ అవుతుంది. ఇక తను బతకనేమో అన్న భయంతో లీలాతో తాను ప్రేమిస్తున్న విషయం చెప్పేస్తాడు రజనీకాంత్. తరువాత కళ్లు తెరిచే చూసేసరికి ఆస్పిటల్లో ఉంటాడు లీల తనతో ఉండదు. మూడు రోజుల తరువాత హస్పిటల్‌కు ఫోన్ చేసిన లీలా, తమ కుటుంబం ప్రమాదంలో ఉందని, బైక్ యాక్సిడెంట్ కూడా తనను చంపాడానికి కావాలని చేయించిందే అని చెపుతుంది. దీంతో తన ప్రేమించిన అమ్మాయికి తోడుగా నిలబడాలన్న ఆలోచనతో లీలా కోసం బయలుదేరుతాడు రజనీకాంత్. అప్పటికే లీలా తల్లిదండ్రుల మీద హత్యా ప్రయత్నం జరగటంలో వాళ్లు హాస్పిటల్లో ఉంటారు. నాగచైతన్య అక్కడ చేరుకున్న తరువాత మరోసారి లీలా, ఆమె కుటుంబం మీద ఎటాక్ జరుగుతుంది. మొదటి అప్పుడు చైతూ కాపాడిన తరువాత జరిగిన ఎటాక్‌లో లీలా కుటుంబంతో పాటు రజనీకాంత్ ఫ్రెండ్ మహేష్ కూడా చనిపోతాడు. దీంతో ఇదంతా అసలు ఎందుకు జరుగుతుంది..? వాళ్లు లీలాను ఎందుకు చంపాలనుకుంటున్నారు..? దీనికి పోలీసులు కూడా ఎందుకు సహకరిస్తున్నారు..? లాంటి విషయాలన్ని తెలుసుకోవాలనుకుంటాడు రజనీకాంత్. అందుకోసం ఏం చేశాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : ప్రేమమ్ సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్న నాగచైతన్య, మరోసారి యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో తనకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన లవర్ బాయ్ లుక్ లోనూ అలరించాడు. తనకు బాగా అలవాటైన రొమాంటిక్ క్యారెక్టర్లో మరోసారి సూపర్బ్ అనిపించిన చైతూ, ఈ సారి యాక్షన్ హీరోగా కూడా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో మంజిమా మోహన్ మెప్పించింది. డీసెంట్ లుక్‌లో కనిపిస్తూనే సెకండ్ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఆకట్టుకుంది. నాగచైతన్య ఫ్రెండ్ మహేష్‌గా నటించిన సతీష్ కృష్ణన్, మంచి నటనతో పాటు డ్యాన్సర్ గానూ ప్రూవ్ చేసుకున్నాడు. విలన్‌గా బాబా సెహగల్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. సాంకేతిక నిపుణులు : గతంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లు, యాక్షన్ థ్రిల్లర్లు తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సారి రెండు ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. ముందు నుంచి చెపుతున్నట్టుగా ఫస్ట్ హాఫ్ అంతా హర్ట్ టచింగ్ లవ్ స్టోరీతో నడిపించిన గౌతమ్, సెకండ్ హాఫ్‌ను తన మార్క్ థ్రిల్లర్‌గా మలిచాడు. అయితే స్లో నేరేషన్, వెంట వెంటనే వచ్చే పాటలు ఫస్ట్ హాప్లో కాస్త బోర్ కొట్టిస్తాయి. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని సెంకడ్ హాఫ్ కట్టిపడేస్తుంది. బలమైన ప్రతినాయక పాత్ర లేకపోయినా మంచి యాక్షన్ సీన్స్‌తో ఆ లోటును కవర్ చేశాడు దర్శకుడు. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. సినిమా రిలీజ్‌కు ముందు చకోరి, వెళ్లిపోమాకే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాలు స్థాయికి తగట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగచైతన్య ప్రీ క్లైమాక్స్ సంగీతం మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్ స్ట్రాంగ్ విలన్ లేకపోవటం ఓవరాల్‌గా సాహసం శ్వాసగా సాగిపో.. టిపికల్ గౌతమ్ మీనన్ సినిమాలు ఇష్టపడేవారికి మాత్రం బాగానే కనెక్ట్ అవుతుంది. - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
మోదీ నిర్ణయంతో డైలామాలో శుక్రవారం సినిమాలు
500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయం పలు రంగాల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక్కసారిగా నిర్ణయాన్ని ప్రకటించి గంటల వ్యవధిలోనే అమలు చేయటంతో సినీ రంగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాల మీద ఈ ప్రభావం తీవ్రంగా కనిపించనుంది. ఇప్పటికే 500, 1000 రూపాయల నోట్లు చిత్తుకాగితాలుగా మారిపోవటం వంద రూపాయల నోట్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో శుక్రవారం ఎంత మంది ప్రేక్షకులు థియేటర్ల వరకు వస్తారు అన్నది ప్రశ్నగా మారింది. దీంతో ఈ వారం రిలీజ్ అవుతున్న ఇంట్లో దెయ్యం నాకేం భయం, సాహసం శ్వాసగా సాగిపో చిత్రయూనిట్ లు ఆలోచనలో పడ్డారు. మరి ఈ గండం నుంచి అల్లరి నరేష్ నాగచైతన్యలు ఎలా బయట పడతారో చూడాలి. అదే సమయంలో సెట్స్ మీద ఉన్న సినిమాలపై కూడా ఈ ప్రభావం భారీగానే కనిపిస్తోంది. ముఖ్యంగా సినిమా షూటింగ్ సమయంలో ఎక్కువగా రోజువారి పేమెంట్సే ఉంటాయి. అందుకోసం ఎక్కువగా 500, 1000 నోట్లనే వినియోగిస్తుంటారు నిర్మాతలు, ఒక్కసారిగా ఆ నోట్ల వినియోగం ఆగిపోవటంతో షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. -
ఒక్క రోజు ఆలస్యంగా..!
ఈ సారి సోలోగా సత్తా చాటాలనుకున్న అల్లరి నరేష్ ఆశలు మీద నాగచైతన్య నీళ్లు చల్లేశాడు. ఈ శుక్రవారం సోలో రిలీజ్ ప్లాన్ చేసుకున్న నరేష్ కు అదే రోజు నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ అవుతుండటంతో కాస్త ఇబ్బంది ఎదురైంది. దీంతో అనుకున్నట్టుగా శుక్రవారం కాకుండా ఒక్క రోజు ఆలస్యంగా తన సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు నరేష్. ఇటీవల తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో తడబడుతూ వస్తున్న యంగ్ హీరో నరేష్, సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ జానర్ అయిన హర్రర్ కామెడీనే నమ్ముకున్నాడు. కామెడీ స్పెషలిస్ట్ జి నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ శనివారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో నరేష్ తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తున్నాడు. -
మరో ఇంట్రస్టింగ్ ఫోటో పోస్ట్ చేసిన సమంత
పెళ్లి విషయం కన్ఫామ్ అయిన దగ్గర నుంచి స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. నాగచైతన్యతో కలిసున్న ఫోటోలతో పాటు తన వర్క్ అవుట్స్‌కు సంబందించిన వీడియోలను ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ ఆదివారం కూడా తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ ఇంట్రస్టింగ్ ఫోటోనూ పోస్ట్ చేసింది సామ్. సమంత, నాగచైతన్యలతో పాటు యంగ్ కపుల్ అఖిల్, శ్రేయా భూపాల్‌లు కూడా కలిసి ఉన్న ఓ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసిన సమంత, ఫ్యామిలీ అంటూ కామెంట్ చేసింది. పెళ్లికి ఇంకా చాలా సమయం ఉందని చైతన్య చెప్పుతున్ని.. ఇప్పటి నుంచే అక్కినేని కుటుంబంతో కలిసిపోయింది ఈ బ్యూటి. త్వరలో అఖిల్ నిశ్చితార్థం జరగనుండగా.. వచ్చే సంవత్సరం నాగచైతన్య సమంత వివాహం జరగనుంది. -
హిట్ హీరోతో శ్రీనువైట్ల
ఆగడు, బ్రూస్ లీ సినిమాల రిజల్ట్ తో కష్టాల్లో పడ్డ శ్రీనువైట్ల, తిరిగి ఫాంలోకి రావడానికి అన్నిరకాలుగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలు బిజీగా ఉండటంతో యంగ్ హీరోతో వరుస సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా మిస్టర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీను. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. ఓ సూపర్ హిట్ సినిమాతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రేమమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య హీరోగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు శ్రీనువైట్ల. ఇప్పటికే నాగచైతన్య, నాగార్జునలకు కథ వినిపించి ఓకె కూడా చేయించుకున్నాడు. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న చైతూ త్వరలోనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇవ్వనున్నాడు. -
సమంత మతం మారలేదు : చైతూ
త్వరలో ఒక్కటవ్వబోతున్న టాలీవుడ్ యువజంట నాగచైతన్య, సమంతలపై రోజుకో వార్త వినిపిస్తోంది. వచ్చే ఏడాది నాగచైతన్య, సమంతల పెళ్లి జరగబోతోందంటూ అఫీషియల్‌గా కన్ఫామ్ అవ్వటంతో ఇప్పుడు మరిన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల సమంత, చైతూలు ఏదో పూజ చేస్తున్న ఫోటోలో మీడియాలో మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అవి సమంత మతం మార్చుకునేందుకు చేసిన పూజలేనా..? అన్న చర్చ జరిగింది. అయితే ఈ వార్తలపై నాగచైతన్య క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో తన పెళ్లి విషయంలో ముందుగా స్పందించిన చైతూ సమంత మతం మారలేదని తెలిపాడు. నాగార్జున స్టూడియోలో నిర్వహిస్తున్న పూజలో పాల్గొన్నాం అంతే. నాకు మతంతో పని లేదు అంటూ క్లారిటీ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యువ జంటపై వస్తున్న రూమర్స్‌కు బ్రేక్ పడాలంటే ఇద్దరు కలిసి బహిరంగ ప్రకటన చేయాల్సిందే అంటున్నారు సినీ జనాలు. -
సెంటిమెంట్ మీదే అఖిల్ ఆశలు
అఖిల్ సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నటవారసుడు, తొలి సినిమాతో అనుకున్న విజయం సాధించలేకపోయాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన అఖిల్ నిరాశపరచటంతో రెండో సినిమా విషయంలో చాలా రోజులుగా కసరత్తులు చేస్తున్నాడు. అయితే ఇప్పటికే రెండో సినిమా విషయంలో ఓ డెసిషన్‌కు వచ్చారన్న టాక్ వినిపిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. కళ్యాణ్ కృష్ణ మీద నమ్మకంతో పాటు మరో సెంటిమెంట్ కూడా అఖిల్ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ వారసులకు రెండో సినిమా బాగా కలిసొస్తుందన్న నమ్మకం ఉంది. ఎన్టీఆర్‌కు స్టూడెంట్ నెంబర్ 1, అల్లు అర్జున్‌కు ఆర్య, నాగచైతన్యకు ఏం మాయ చేసావే, రామ్ చరణ్‌కు మగధీర ఇలా స్టార్ వారసుల రెండో సినిమాలు భారీ హిట్స్‌గా నిలిచాయి. అఖిల్ రెండో సినిమా కూడా ఇదే లిస్ట్‌లో చేరుతుందన్న ఆశతో ఉన్నారు. మరి సెకండ్ సినిమా సెంటిమెంట్ అఖిల్‌కు వర్క్ అవుట్ అవుతుందో లేదో..? -
నాగ్ కన్ఫామ్ చేశాడు
వరుస సూపర్ హిట్స్‌తో దూసుకుపోతున్న నాగార్జున, తన తనయుల విషయంలో మాత్రం ఆ జోరు చూపించలేకపోతున్నాడు. నాగచైతన్య హీరోగా ఆకట్టుకున్నా, సొంత ఫాలోయింగ్ ను, స్టార్ ఇమేజ్ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఇక భారీ అంచనాల మధ్య తెరకు పరిచయం అయిన చిన్న కొడుకు అఖిల్ కూడా తొలి సినిమాతోనే నిరాశపరచటంతో ఇప్పుడు వారిద్దరి కెరీర్‌ను గాడిలో పెట్టే బాధ్యతను తీసుకున్నాడు నాగ్. అఖిల్ సినిమా తరువాత అక్కినేని నటవారసుడి రెండో సినిమా ఎవరితో అన్న చర్చ భారీగా జరుగుతోంది. అయితే ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ వంశీ, అఖిల్‌ల కథను ఫైనల్ చేయాలంటూ క్లూ ఇచ్చేశాడు నాగ్. అంతేకాదు సోగ్గాడే చిన్ని నాయనా దర్శకుడితో తన సొంత బ్యానర్లో మరో సినిమా ఉంటుందన్న కింగ్, అది నాగచైతన్య హీరోగా తెరకెక్కనుందన్న విషయాన్ని కూడా కన్ఫామ్ చేశాడు. బుధవారం జరిగిన ఊపిరి థ్యాంక్స్ మీట్లో ఈ రెండు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు కింగ్. ప్రస్తుతం ఊపిరి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నాగార్జున, మరోసారి రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చారిత్రక చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి పరమ భక్తుడు హాథీరాం బాబాగా నటించనున్నాడు. ఈ వారంలోనే ప్రారంభం కానున్న ఈ సినిమా, రెండు నెలల తరువాత రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. హాథీరాం బాబా క్యారెక్టర్ కోసం నాగ్ లుక్ మార్చుకోవడానికే ఇంత సమయం తీసుకుంటున్నట్టుగా తెలిపాడు నాగార్జున. -
అది అఫీషియల్ టైటిల్ కాదట..!
మలయాళ సూపర్ హిట్ సినిమా ప్రేమమ్‌కు రీమేక్‌గా నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కార్తీకేయ ఫేం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మజ్ను అనే టైటిల్‌ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ టైటిల్‌పై చిత్ర యూనిట్ పునరాలోచనలో పడ్డారు. దీంతో ఫిబ్రవరి 19న అఫీషియల్‌గా టైటిల్ ఎనౌన్స్ చేస్తామని తెలిపాడు నాగచైతన్య. నాగార్జున కెరీర్లో బిగెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన సినిమా టైటిల్‌ను తన సినిమాకు పెడితే అంచనాలు పెరిగిపోతాయని చైతన్య భయపడుతున్నాడట. దీంతో పాటు మలయాళ ఒరిజినల్ టైటిల్ ప్రేమమ్ తెలుగు కూడా పాపులర్ కావటంతో అదే టైటిల్‌ను తెలుగులో కూడా ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరి ఫస్ట్ లుక్‌లో చైతూ ఏ టైటిల్‌ను రివీల్ చేస్తాడో చూడాలి. నాగచైతన్య సరసన శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేయలని భావిస్తున్నారు. -
అతనితో ఏడేళ్ల స్నేహం: సమంత
అక్కినేని నటవారసుడు నాగచైతన్యకు తొలి సక్సెస్ ఇవ్వటంతో పాటు సమంత లాంటి సక్సెస్ ఫుల్ హీరోయిన్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన సూపర్ హిట్ సినిమా 'ఏం మాయ చేసావే..'. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా సంచలన విజయం నమోదు చేసిన ఈ సినిమాలొ నాగచైతన్య సమంతలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా షూటింగ్ కోసం చైతు, సమంతలు కలుసుకొని ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ' నాగ చైతన్య తో కలిసి ఎదిగిన ఫీలింగ్ కలుగుతోంది. ఏడేళ్లుగా మంచి మిత్రులుగా ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది' అంటూ సమంత ట్విట్టర్ పేజ్ పై పోస్ట్ చేసింది. ఈ కామెంట్ పై స్పందించిన చైతన్య ' కాలం మారినా కొన్ని విషయాలు మాత్రం మారవు సమంత' అంటూ ట్వీట్ చేశాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేసావే ఫిబ్రవరి 26, 2010లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది. -
నాగచైతన్య బర్త్‌డే స్పెషల్ ట్రైలర్