ఐ లవ్‌ యు 3000! | Samantha Akkineni and Naga Chaitanya enjoying their Spain | Sakshi
Sakshi News home page

ఐ లవ్‌ యు 3000!

May 9 2019 12:08 AM | Updated on May 9 2019 12:08 AM

Samantha Akkineni and Naga Chaitanya enjoying their Spain - Sakshi

నాగచైతన్య, సమంత

పెళ్లైన తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన తొలి చిత్రం ‘మజిలీ’. ప్రేమికులుగా ఉన్నప్పుడు విజయాలు అందుకున్న ఈ జంట భార్యాభర్తలయ్యాక విజయం అందుకోవడం చాలా స్పెషల్‌గా భావిస్తున్నారు. అయితే ఈ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేసేలోపే ‘వెంకీమామ’ సెట్‌లో జాయినైపోయారు చైతూ. ఇప్పుడు టైమ్‌ దొరకడంతో సమ్మర్‌ వెకేషన్‌ని ప్లాన్‌ చేసుకున్నారు చైతూ అండ్‌ సామ్‌. నచ్చిన ఫ్లేస్‌లో నచ్చిన ఫుడ్‌ లాగిస్తూ, ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు.

స్పెయిన్‌ వీధుల్లో ప్రేమ విహారం చేస్తున్నారు. దొరికిన హాలిడేని మనసారా అస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా సమంత కొన్ని ఫొటోలను షేర్‌ చేశారు. వాటిలో ఓ ఫొటోలో ఓ ఫొటో పై ‘ఐ లవ్‌ యు 3000’ అని చైతూని ఉద్దేశించి పోస్ట్‌ చేశారు సమంత. ఇంతకీ ‘ఐ లవ్‌ యు 3000’ అంటే ఏంటో ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ సినిమా చూసినవాళ్లకు అర్థం అయ్యే ఉంటుంది. అందులో ఐరన్‌ మేన్‌ని అతని కుమార్తె ‘ఐ లవ్‌ యు 3000’ అంటుంది. అంటే.. బోలెడంత ప్రేమ అని అర్థం. సమంతకు కూడా చైతూ అంటే బోలెడంత ప్రేమ. అందుకే అలా అని ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement