‘‘చాలా రోజుల తర్వాత నటుడిగా ‘మజిలీ’ చిత్రం సంతృప్తినిచ్చింది. ఈ మూవీ నా లైఫ్‌లో స్పెషల్ జర్నీ’’ అన్నారు నాగచైతన్య. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత, దివ్యాంశా కౌశిక్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మజిలీ’. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడులైంది. ‘మజిలీ’ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఆదివారం విలేకర్ల సమావేశంలో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘దర్శకుడు శివ కథ చెప్పినప్పుడు నేను ఏయే అంశాలకు కనెక్ట్ అయ్యానో అవే అంశాలకు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు.
శివను నేను నమ్మాను. శివ నన్ను నమ్మాడు. పోసానిగారు, రావురమేష్‌గారు కో–స్టార్స్‌గా బాగా సపోర్ట్ చేశారు. సినిమాలోని శ్రావణి క్యారెక్టర్ లాంటి మంచి భార్య కావాలని సోషల్ మీడియాలో కొందరి పోస్టులు చూశాను. నిజంగానే నాకు శ్రావణి లాంటి అమ్మాయి వైఫ్‌గా దొరికింది. శ్రావణి క్యారెక్టర్‌ను సమంత బాగా చేసింది. దివ్యాంశా కౌశిక్ బాగా నటించారు. డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతే తట్టుకోలేను. ఈ సినిమా ఫలితం పట్ల వారు హ్యాపీగా ఉండటం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.
‘‘సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నా రిలీజ్ రోజు ఏదో చిన్న టెన్షన్. సాహుగారు ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోందని చెప్పారు. అరగంటసేపు ఏడ్చాను. స్ట్రెస్ అంతా పోయింది. ‘ఏ మాయ చేశావె’ తర్వాత ‘మజిలీ’ నాకు స్పెషల్ మూవీ. నాగ్‌మామ డైరెక్ట్‌గా ఇంటికి వచ్చి అభినందించారు. చైతూ భార్యగా గర్వపడుతున్నాను’’ అని సమంత అన్నారు. ‘‘ఒక సినిమా మంచి సినిమాగా నిలవడం వేరు, కమర్షియల్‌గా విజయం సాధించడం వేరు.
కానీ ఈ రెండింటినీ ‘మజిలీ’ చిత్రం సాధించింది. డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్ట్‌గా డైరెక్టర్‌కి ఫోన్ చేసి సినిమా రెస్పాన్స్‌ను ఎంజాయ్ చేస్తుంటే ఆ చిత్రం బ్లాక్‌బస్టర్ కింద లెక్క. చైతూగారు నన్ను బాగా నమ్మారు. నిర్మాతలు బాగా సహకరించారు. వీరితోనే మరో సినిమా చేయబోతున్నాను’’ అన్నారు శివ నిర్వాణ. ‘‘సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఈ సినిమాతో చైతన్య ఎంత మంచి నటుడో అందరికీ తెలిసింది.
సమంత నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడు, నాలుగు లొకేషన్స్‌తోనే ప్రపంచం అంతా సినిమా చూపించాడు శివ. ఇలాంటి కథను నాకు ఇచ్చి ఇంత బాగా తీయమంటే నేను తీయలేను’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ‘‘సెట్‌లో నాగచైతన్య చాలా కూల్‌గా ఉంటారు. ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించారు. సమంత, దివ్యాంశ బాగా చేశారు. బాధ కలిగించే అంశాలను కమర్షియల్‌గా స్క్రీన్‌పై బాగా చూపించారు శివ’’ అన్నారు రావు రమేష్. దివ్యాంశా కౌశిక్ మాట్లాడారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment