press meet
-
బాబు బడ్జెట్.. అంకెల గారడీ.. ఏకిపారేసిన జగన్ (చిత్రాలు)
-
మోసాల బడ్జెట్.. బాహుబలి అంటూ బిల్డప్‌లు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో ప్రతీ వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, బడ్జెట్ గారడీతో అది బయటపడిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన చంద్రబాబు చేస్తున్న దగాను వివరించారు.ప్రెస్మీట్లో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 👉అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినడం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టింది. సూపర్ సిక్స్, 143 హామీల కోసం అరకోర కేటాయింపులు చేశారు. అన్నిరకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తోంది.👉బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అయ్యింది. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అంటూ ఊదరగొట్టారు. చంద్రబాబు దత్తపుత్రుడు కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రతీ ఇంటికి బాండ్లు పంచారు. 20 లక్షల ఉద్యోగాలు,. రూ.3 వేల నిరుద్యోగ భృతి సాయం అన్నారు. 👉ఇప్పుడు హామీలపై అడిగితే సమాధానం లేదు. రెండు బడ్జెట్లలోనూ నిధులు కేటాయించలేదు. ప్రజలను మోసం చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తోంది. తొమ్మిది నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని చెప్పారు . గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు. 👉ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా చంద్రబాబు బడ్జెట్ ప్రసంగం ఉంది. తొలిబడ్జెట్‌లో కేటాయిచింది బోడి సున్నా. ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగి భృతి రూ.72 వేలు ఎగనామం పెట్టారు. 2024-25 సోషియో ఎకనమిక్ సర్వేలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 27 లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పారు. బడ్జెట్లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?👉జగన్ చెప్పినదానికంటే ఎక్కువ ఇస్తున్నామని ఫోజులు కొడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తున్నారు. ఏపీ రావాలంటే కంపెనీలు భయపడుతున్నాయి👉చంద్రబాబు ఏది చెప్పినా అబద్ధం.. మోసం. చంద్రబాబు చేసేది.. దగా .. వంచన👉వైఎస్సార్సీపీ హయాంలో వివిధ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 6 లక్షలు. మొత్తం మా పాలనలో అన్నీ రంగాలకు కలిపి 40 లక్షల పైచిలుకు ఉద్యోగాలిచ్చాం. ఆధార్ కార్డులతో సహా ఆ వివరాలు చెప్పగలం. ఇది ఎవరూ కాదనలేని సత్యాలివి👉18 నుంచి 60 ఏళ్ల మహిళకు సంవత్సరానికి రూ.18 వేలు ఆడబిడ్డ నిధి అన్నారు. దానికి ఎగనామం పెట్టారు. ఉచిత బస్సు కోసం మహిళలంతా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రయాణాలు ఎప్పుడెప్పుడు చేస్తామా? అని ఆశగా చూస్తున్నారు. మహిళల సంక్షేమం పేరిట ఈ హామీతో రూ.7 వేల కోట్లు ఎగ్గొట్టారు. 👉స్కూల్‌కి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేల సాయం అన్నారు. ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని అన్నారు. తల్లికి వందనం కోసం మొదటి బడ్జెట్లో రూ. 5, 386 కోట్లు కేటాయింపులు చేశారు. ఈసారి నెంబర్ మోసంతో ప్రజలను మభ్య పెడుతున్నారు. ఎలాగూ మోసం చేసేది కదా అని ఇలా చేస్తున్నారు. చివరికి చిన్న పిల్లాడికి కూడా బకాయిలు పెడుతూ.. ఎగనామం పెడుతున్నారు. 👉అఫ్కోర్స్.. చంద్రబాబుకి రైతులను మోసం చేయడం కొత్తేం కాదు రైతు భరోసా పేరిట రైతన్నలను గతంలోనే కాదు.. ఇప్పుడూ మోసం చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేల సాయం అందిస్తామన్నారు. కిందటి ఏడాది ఎగ్గొట్టారు. ఈసారి కూడా ఆ పని చేస్తే.. రెండు బడ్జెట్లకు కలిపి రూ.40 వేలు ఎగనామం పెట్టినట్లు అవుతుంది. 👉 దీపం పథకం కింద మరో మోసానికి దిగారు. ఎలాగూ ఎగనామం పెట్టేదే కదా.. మోసమే కదా అని కేటాయింపులు చేసుకుంటూ పోయారు.👉 చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం.. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ల విషయంలో మరో 20 లక్షల మంది జత కావాల్సి ఉంది. రెండేళ్లలో రూ.96 వేల చొప్పున మోసం చేశారు. 👉 సూపర్ సిక్స్.. సెవెన్ కింద అన్ని పథకాలకు కలిపి మొత్తం.. దాదాపు రూ.80 వేల కోట్లు(రూ.79,867 కోట్లు) కావాలి. కిందటి ఏడాది రూ.7 వేల కోట్లు పెడితే.. రూ.800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈసారి బడ్జెట్ కేటాయింపులే రూ.17, 179 కోట్లు మాత్రమే. బాబు షూరిటీ.. మోగ్యారెంటీకి ఇదే నిదర్శనం. 👉వైఎస్సార్సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు అన్నారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఇలా.. బహిరంగంగా మాట్లాడతారా?. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటిక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా?. చంద్రబాబు చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అందరూ చూడాలిఎన్నికల టైంలో చంద్రబాబు: జగన్ ఇప్పించిన సంక్షేమం ఆగదు. 143 హామీలు కాకుండా.. మరింత సంక్షేమం ఇస్తాంఅసెంబ్లీలో సీఎంగా చంద్రబాబు: మనం హామీలు ఇచ్చాం. సూపర్ సిక్స్ ఇచ్చాం. చూస్తే భయం వేస్తోంది. ముందుకు కదల్లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి.👉సంక్షేమానికి కేరాఫ్‌గా నిలిచాం. మా హయాంలో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. 10 పిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. విద్యారంగంలో కీలక సంస్కరణలు తెచ్చాం. CBSE నుంచి IB వరకు బాటలు వేశాం. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం. చంద్రబాబు హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యింది👉మా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు అందించాం. బాబు పాలనలో 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు. కొత్తగా ఎవరిని చేర్చకపోగా.. ఉన్నవాళ్లలో 4 లక్షల మంది లబ్ధిదారులను తొలగించారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ పెన్షన్ నిధులు తగ్గించేశారు👉రూ.15 వేలు ఇస్తామని వాహనమిత్రకు ఎగనామం పెట్టారు. ముస్లింలకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షలు ఇస్తామని మోసం చేశారు. 👉దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ క్యాలెండర్ అమలు చేశాం. మా హయాంలో అక్కాచెల్లెళ్లకు భరోసా ఉండేది. తమ కాళ్లపై నిలబడేలా అడుగులు ముందుకు వేశాం. 👉ఇప్పుడు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి పథకాలు లేవు. విద్యాదీవెన పథకానికి నిధులు ఇవ్వలేదు. ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు వదిలేసే పరిస్థితికి వచ్చారు. ఈ పరిస్థితిపై వైఎస్సార్సీపీ పోరాటం చేయనుంది. మార్చి 12న విద్యార్థులు, తల్లిదండ్రుల సమన్వయంతో వైఎస్సార్సీపీ ఫీజు పోరు ఉంటుంది👉కూటమి ప్రభుత్వంలో.. వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రంగాలను నాశనం చేశారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. మేం తెచ్చిన విప్లవాత్మక మార్పులను.. నిర్వీర్యం చేశారు. మిర్చి రైతులను దారుణంగా మోసం చేశారు. సమస్య పరిష్కరించామని అసెంబ్లీలో అబద్ధాలు చెబున్నారను. కేజీ మిర్చి కూడా కొనలేదు.👉ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. కోవిడ్‌లాంటి మహమ్మారి టైంలోనూ మెరుగైన జీతాలు.. అదీ సకాలంలో మేం చెల్లించాం. ఇవాళ జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఏటా ఇచ్చే ఇంక్రిమెంట్లను ఎగ్గొట్టారు. ఐఆర్, పీఆర్సీ, పెండింగ్బకాయిలు ఇవన్నీ ఇవ్వబోమని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది.👉అయ్యా.. పయ్యావులగారూ.. కరోనా టైంలోనూ సాకులు చెప్పకుండా మేం అన్నీ సక్రమంగా నడిపించాం. ఇప్పుడు మీరు ఎగ్గొటడానికి సాకులు వెతుకుతున్నారు.అప్పులపై.. తప్పులు👉2014-19కి రూ.4 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. 2024 నాటికిరూ.6 లక్షల కోట్ల అప్పు ఉంది. కాగ్ లెక్కలు కూడా ఇదే స్పష్టం చేశాయి. కానీ, రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారు. గవర్నర్ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారు. 👉సాధారణంగా.. బడ్జెట్ గ్లాన్స్‌లో పదేళ్ల కిందట అప్పుల లెక్కలు ఉంటాయి. కానీ, లెక్కలు చూపిస్తే ఎక్కడ దొరికిపోతామోనని మొన్నటి బడ్జెట్లో అది చూపించలేదు. అంత దుర్మార్గంగా వ్యవహరించారు చంద్రబాబు.👉ఎందుకింత అబద్ధాలు.. ఎందుకింత మోసాలు?. చంద్రబాబు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరు మీద అప్పులు చేస్తున్నారు. 👉రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు. చంద్రబాబు, ఆయన మనుషుల జేబుళ్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఆర్థికవేత్తల అంచనాకి కూడా అందకుండా చంద్రబాబు ప్రజలపై బాదుడు బాదబోతున్నారు. అయ్యా స్వామీ.. ఏంది ఈ మోసాలు?.. బడ్జెట్ అంతా అంకెల గారడీ.. దీనిని పట్టుకుని బాహుబలి బడ్జెట్ అనడం వాళ్లకు మాత్రమే చెల్లుతుంది👉ఇదీ వాస్తవం. ఇబ్బడిముబ్బిడిగా అప్పు. గత మా ప్రభుత్వంలో కన్నా, ఇప్పుడు ఇబ్బడిముబ్బిడిగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. మా హయాంలో 2023–24లో మేము రూ.62,207 కోట్లు చేస్తే, చంద్రబాబు 2024–25లో చేసిన అప్పు రూ,73,362 కోట్లు. నిజానికి అది ఇంకా ఎక్కువే ఉంది. ఇంకా అమరావతి కోసం చేసిన, చేస్తున్న అప్పులు వేరుగా ఉన్నాయి.ఇబ్బడిముబ్బిడిగా అప్పులు చేస్తున్నారు. మాట్లాడితే, అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అంటాడు. కానీ, బడ్జెట్లోని డిమాండ్, గ్రాంట్స్ చూస్తే.. రూ.6 వేల కోట్లు అమరావతి నిర్మాణం కోసమని చూపారు. మరి అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని ఎందుకు చెప్పాలి?👉రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం (ఎస్ఓఆర్): 2023–24తో 2024–25ను పోలిస్తే రాష్ట్ర సొంత ఆదాయం ఏకంగా 9.5 శాతం పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. ఎస్ఓఆర్ 2023–24లో రూ.93,084 కోట్ల నుంచి రూ.1,01,985 కోట్లకు పెరిగిందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, కాగ్ నివేదిక చూస్తే.. ఎస్ఓఆర్ తగ్గింది. 2025–26లో 37 శాతం పెరుగుదలతో రూ.1,27 లక్షల కోట్లకు ఎస్ఓఆర్ చేరుతాయంటున్నారు. ఇది మరో పచ్చి అబద్ధం. నిజానికి రాష్ట్ర ఆదాయం పెరగడం లేదు. కేవలం చంద్రబాబు, ఆయన మనుషులకే ఆదాయం వస్తోంది. ఖజానాకు సున్నా.👉నాన్ టాక్స్ రెవెన్యూ: 2024–25లో మిస్లీనియస్ జనరల్ సర్వీసెస్ కింద రూ.7,916 కోట్లు ఆదాయం చూపుతున్నారు. ల్యాండ్ రెవెన్యూ కింద రివైజ్డ్ అంచనా మేరకు రూ.1341 కోట్లు అని చూపుతున్నారు. కానీ, నిజానికి ఈ 10 నెలల్లో వచ్చింది కేవలం రూ.196 కోట్లు మాత్రమే. మరి ఏ రకంగా ఆ ఆదాయం పొందబోతున్నారు?👉మూల ధన వ్యయం: 2023–24లో 10 నెలల్లో మూలధన వ్యయం కింద మేము రూ.20,942 కోట్లు ఖర్చు చేస్తే, అదే చంద్రబాబు హయాంలో 2024–25లో తొలి 10 నెలల్లో చేసిన వ్యయం కేవలం రూ.10,854 కోట్లు అంటే మైనస్ 48 శాతం. ఇది వాస్తవం. కానీ రివైజ్డ్ అంచనాలో మరో రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపారు.👉ఈ బడ్జెట్ అంకెల గారడీ కాదా?: చంద్రబాబు వచ్చాక ఆదాయం తగ్గింది. రాష్ట్ర సొంత ఆదాయం ఎస్ఓఆర్ పెరగలేదు. అది పెరగకపోగా, చాలా తగ్గింది. మూల ధన వ్యయం కూడా దారుణంగా తగ్గింది. ఇలాంటి పరిస్థితులున్నా, చంద్రబాబు ఏమంటున్నాడు. జీఎస్డీపీ 12.94 శాతం నమోదు అవుతుందని చెబుతున్నాడు. ఎలా సాధ్యం?. వాస్తవాలు ఇలా ఉంటే, ఈ ఏడాది బడ్జెట్ రూ.3,22,359 కోట్లు ఎలా సాధ్యం? ఇది అంకెల గారడీ కాదా?. పైగా దీన్ని బాహుభళీ బడ్జెట్ అనడం మీకే చెల్లింది. 👉ప్రతిపక్షం ఈ మేర చెప్పలేకపోతే.. ఎలా?. ప్రతిపక్షంలో ఉన్న వారిని అధికారంలో ఉన్నవారు గుర్తించకపోతే.. ఏం సాధించడం కోసం అసెంబ్లీ నడపడం👉ఇంత ప్రసంగంలోనూ నేను ఎవరినీ తిట్టలేదు. లెక్కలతో సహా చూపించాం. మరి సమాధానాలు చెబుతారా? చూద్దాం👉ఎమ్మెల్సీ ఫలితాలపై..ఎమ్మెల్సీ విజయంతో ప్రజల్లో తమకు సానుకూలత ఉందన్న కూటమి ప్రభుత్వ వాదనపై జగన్ స్పందించారు. ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఫలితాల్లో రిగ్గింగ్ చేసేవాళ్లను ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడే చూశా. అయినా ఉత్తరాంధ్ర స్థానంలో టీచర్లు కూటమికి బాగా బుద్ధి చెప్పారు. అక్కడ రిగ్గింగ్ కుదరదు కాబట్టి ఓడిపోయారు👉అసెంబ్లీలో రెండే పక్షాలు ఉన్నాయి.. ఒకటి అధికారం.. మరొకటి ప్రతిపక్షం . ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు కాకుంటే ఇంకెవరికి ఇస్తారు? . రెండు వైపులా మీరే కొడతామంటే.. ఇదేమైనా డబుల్ యాక్షన్ సినిమానా?👉గతంలో టీడీపీ నుంచి ఐదుగురు మా వైపు వచ్చారు. మరో పది మందిని లాగుదామంటే నేనే వద్దన్నా.. ఏం మాట్లాడతావో మాట్లాడు.. నేను వింటా అని చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా ఇచ్చా. ఇదే ఆయనకు నాకు తేడా👉మైక్ ఇస్తేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అది ఇవట్లేదు కాబట్టే ఇలా మీడియా ముందుకు రావాల్సి వస్తోందిపవన్పై సెటైర్లు..👉టీడీపీ తర్వాత జనసేన అతిపెద్ద పార్టీ అని.. కాబట్టి తాము ఉండగా ఈ ఐదేళ్లు వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారని మీడియా ప్రతినిధులు జగన్ వద్ద ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ. జీవిత కాలంలో ఒక్కసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు అని జగన్ సెటైర్ వేశారు. -
వైఎస్ఆర్ సీపీ నేతల ప్రెస్ మీట్
-
రాష్ట్రంలో దిగజారిన లా అండ్ ఆర్డర్‌కు వంశీ అరెస్టు ఒక నిదర్శనం
-
జనసేన కిరణ్ రాయల్ బాధితురాలు సంచలన ప్రెస్ మీట్
-
దావోస్‌లో ఒక్క MOU జరగలేదు: వైఎస్ జగన్
-
Watch Live: ఏపీ రాజకీయాలపై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
‘జగన్ రాజకీయాన్ని టీడీపీవాళ్లే మెచ్చుకున్నారు’
గుంటూరు, సాక్షి: తొమ్మిది నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో చేసిన విధ్వంసాలు అన్నీ ఇన్నీ కావని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీలో కూటమి అరాచక పాలనపై, సంక్షేమ పథకాలు ఆగిపోవడంపై, అలాగే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపైనా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాబు మోసాలపై.. వైఎస్ జగన్ నిలదీతచంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రజలకు వివరిస్తాంఎన్నికల టైంలో బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రచారం చేశారుఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్పా?.. ముసలావిడ కూడా నొక్కుతుంది అని అన్నారుసూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చారుఔహామీలు గ్యారంటీ అని ఇంటింటికి బాండ్లు కూడా పంచారుఅమలు చేయకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు9 నెలల తర్వాత.. బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారెంటీ అని రుజువైందిఆ మేనిఫెస్టోలు, బాండ్లు ఏమయ్యాయి?.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి?అప్పుల్లో రికార్డు బద్ధలు9 నెలల్లో చేసిన అప్పులు రికార్డు బద్ధలు కొట్టాయి బడ్జెటరీ అకౌఐంట్ అప్పులే రూ.80 వేల కోట్లుఅమరావతి పేరు చెప్పి చేసిన రూ.52 వేల కోట్లు అప్పు చేశారుమార్క్ఫెడ్, సివిల్ సప్లయి ద్వారా మరో రూ.8 వేల కోట్ల అప్పుఏపీఎండీసీ ద్వారా మరో 5 వేల కోట్ల రూపాయల అప్పుమొత్తంగా 1 లక్ష 45 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారుఅన్ని అప్పులు చేసినా.. బటన్లు నొక్కారా? పేదలకు ఏమైనా ఇచ్చారా?1,40,000 వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయిపథకాలన్నీ ఆగిపోయి.. గతప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలేమైనా అమలు చేస్తున్నారా?రైతు భరోసా, వసతి దీవెన పథకాలు నిలిచిపోయాయిమత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం.. ఇలా పథకాలన్నీ పోయాయిపిల్లలకు ట్యాబులు ఇచ్చే పథకం ఆగిపోయిందిఉద్యోగాల్లేవ్ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలేవీ లేవువలంటీర్లను ఎలా మోసం చేశామో చూశాం.వలంటీర్లకు రూ10 వేలు ఇస్తామని.. చేతులెత్తేశారు2.60 లక్షల మంది వలంటీర్లను ఉద్యోగాల్లోంచి తీసేశారుబేవరేజెస్లో మరో 18 వేల ఉద్యోగాలు తీసేశారుపీఆర్సీ చైర్మన్‌తో బలవంతంగా రాజీనామా చేయించారుఐఆర్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారు?ఉద్యోగులకు మూడు డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయిఎన్నికలకు ముందు ఇచ్చిన ఉద్యోగ హామీలు ఏమయ్యాయి?ఏ నెల ఒకటో తారీఖు జీతాలిస్తున్నారో చెప్పాలిఆర్థిక విధ్వంసం అంటే ఇదే.. ఏపీ అభివృద్ధికోసం మా హయాంలో నాలుగు పోర్టులు నిర్మించాంరామాయపట్నం పోరర్టును 75 శాతం పూర్తి చేశాంపది పిషింగ్ హార్బర్ల నిర్మాణం కూడా చేపట్టాంరెండు హార్బర్లను మా హయాంలోనే ప్రారంభించాం. మరో హార్బర్‌ను ఈ మధ్యే ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించాం కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాంబాబు అధికారంలోకి వచ్చాక ఆస్తులన్నింటిని అమ్మేస్తున్నారుమెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారు ఇవన్నీ రాబోయే తరాలకు రాబడి పెంచేందుకు ఏర్పరిచిన ఆస్తులువీటన్నింటిని ప్రవేట్ పరం చేయాలని చూస్తున్నారు.. ఇది పెద్ద స్కాంజీఎల్ఐ, జీపీఎఫ్కూడా చంద్రబాబే వాడేసుకుంటున్నారుఆర్థిక విధ్వంసం అంటే ఇదేచంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. తన ఆస్తులు, తన వాళ్ల ఆస్తులు పెంచుకోవడమేఇందుకోసం స్కామ్‌లు చేస్తున్నారుసంపద సృష్టి చంద్రబాబు జేబులో జరుగుతోందిఇసుక స్కాంలు జరుగుతున్నాయిమా హయాంలో కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారుప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం షాపులు ప్రైవేయిటైజ్ చేశారుఆ వ్యవహారం ఎలా సాగిందో రాష్ట్రం మొత్తం చూసిందిపైగా లిక్కర్ స్కాంలో ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్‌ను చంద్రబాబు తిడతారు ఇసుక, మద్యం, ఫ్లై యాష్.. ఇలా అన్ని మాఫియాలేప్రతీ నియోజకవర్గంలో.. మండలంలో, గ్రామంలో పేకాట క్లబ్‌లు నడిపిస్తున్నారుపెద్ద బాబు, చిన్నబాబు ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తున్నాయిపెద్దబాబుకి ఇంత, చిన్నబాబుకి ఇంత, దత్త పుత్రుడికి ఇంత అని నడుస్తోంది వ్యవహారంఅలా అయితేనే వ్యాపారాలే నడిచేదిరివర్స్ టెండరింగ్ రద్దు చేశారుకాంట్రాక్టర్లకు పనులు ఇచ్చే కార్యక్రమంలో.. మొబైల్ అడ్వాన్స్‌ల పేరుతో అన్యాయాలకు తెర తీశారుప్రభుత్వ ఆదాయం తగ్గుతుంటే.. చంద్రబాబు ఆదాయం పెరుగుతోందిఇంక ఆదాయం ఎందుకొస్తది?ఇవన్నీ జరుగుతున్నాయి గనుకే సంపద సృష్టి జరగడం లేదురాష్ట్ర ఆదాయం ఆవిరి అవుతోందిఇన్ని జరుగుతున్నా.. చంద్రబాబును ఎవరూ ప్రశ్నించడం లేదుకారణం.. రెడ్‌బుక్ రాజ్యాంగంప్రశ్నించేవారిని వేధిస్తున్నారుసంపాదించే మార్గం ఉంటే నా చెవిలో చెప్పమని చంద్రబాబు అంటున్నారుఅన్నీ తెలిసి ప్రజలకు మాటిచ్చిన చంద్రబాబు.. ప్రశ్నించే వారితో వెటకారంగా మాట్లాడుతున్నారుమోసాల్లో పీహెచ్డీ చేసిన చంద్రబాబు.. నటనలోనూ మేటినటనలో బాబుకి అవార్డు ఇవ్వాల్సిందే!తాను ఇచ్చిన హామీలు ఎగొట్టి.. ఆవేదన వ్యక్తం చేశారుపరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుందని అంటాడురాష్ట్రం ధ్వంసం అయిపోయిందని అంటాడునటనలో చంద్రబాబుకే అవార్డు ఇస్తే బాగుంటుంది.. ఆ స్థాయిలో నటిస్తారాయనచంద్రబాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని ఎన్నికల టైంలో చెప్పాపులి నోట్లో తలపెట్టడమే అని మొత్తుకున్నాఅయినా ప్రజలు పొరపాటు పడ్డారు.. చంద్రబాబు మోసాలను, చంద్రముఖిని నిద్రలేపి ప్రజలు బాధపడుతున్నారుస్లో పాయిజన్ లాగా.. చంద్రబాబు అబద్ధాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారుఅందుకు వాళ్ల అనుకూల మీడియా పని చేస్తుంటుందిఎవరి హయాంలో ఏం జరిగిందంటే.. 2014-19, 2019-2024 మధ్య ఉన్న రెండు ప్రభుత్వాల ఆర్థిక పురోగతిని పోల్చి చూస్తే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు వక్రీకరణ చేస్తున్నారురాష్ట్రం ధ్వంసం అయిపోయిందంటూ నటిస్తున్నారువైఎస్సార్సీపీ, గత టీడీపీ ప్రభుత్వాల మధ్య తేడాలు పోల్చి చూద్దాంకాగ్ నివేదికలే ఇందుకు ఉదాహరణమా హయాంలోనే కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయి.. రెండేళ్లు కొనసాగాయిచంద్రబాబు హయాంలో 2014-19 మధ్య మూల ధన రూ.13, 860 కోట్లుమా హయాంలో మూల ధన వ్యయం రూ. 15,632 కోట్లుసోషల్ సర్వీసెస్ మూల ధన వ్యయం కింద రూ. 2 వేలు కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టిందిమా హయాంలో సోషల్ సర్వీసెస్ మూల ధన వ్యయం కింద రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం తలసరి ఆధాయంలో చంద్రబాబు ప్రభుత్వంలో 18వ స్థానంలో ఉంటే.. మా హయాంలో 15వ స్థానానికి పెరిగాంబాబు హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా 4. 47 శాతం ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా రాష్ట్ర వాటా 4.80కి పెరిగింది.2018-19 మధ్య పారిశ్రామిక రంగంలో ఏపీ 11 స్థానంలో ఉందిమా హయాంలో 2023-2024 నాటికి.. పారిశ్రామిక రంగంలో 9వ స్థానానికి ఎదిగాంచంద్రబాబు దిగిపోయేనాటికి.. జీడీపీ కంటే కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉందిమా హయాంలో దేశ జీడీపీతో పోటీ పడి మెరుగైన ఫలితాలు సాధించాంఈ డాటా ఆధారంగా.. ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగాయో చంద్రబాబు చెప్పాలిరాష్ట్రం ఎవరి హయాంలో ఏపీ ఆర్థిక పురోగతి సాధించిందో, ప్రజలు బాగుపడ్డారో గుర్తించాలిఎప్పుడూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిందే తప్పా.. ఏనాడూ ఆయన హయాంలో జరిగింది చంద్రబాబు ఏనాడూ చెప్పరుచంద్రబాబు హయాంలోనే ఆర్థిక విధ్వంసం జరిగింది.. జగన్ హయాంలో చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించే ప్రయత్నం జరిగింది అప్పుల గురించి పరిశీలిస్తే.. చంద్రబాబువన్నీ అబద్ధాలు, మోసాలేఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేశారుమా హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ చంద్రబాబు ఆరోపణలకు చేశారురూ.14 లక్షల కోట్ల అప్పులున్నాయంటూ ఊదరగొట్టారుఎన్నికల ముందు.. ఏపీ శ్రీలంక అయిపోతుందని బండలు వేశారుగవర్నర్ ప్రసంగం వచ్చేసరికి ఆ అప్పుల లెక్క తగ్గిపోయింది(రూ.10 లక్షల కోట్లు)శ్వేత పత్రాల సమయంలో మళ్లీ లెక్కలు మారాయి(రూ.12 లక్షల కోట్లు)చివరాఖరికి తప్పని పరిస్థితుల్లో.. దేశంలో ఎక్కడాల లేని విధంగా నవంబర్‌లో ప్రవేశపెట్టారుబడ్జెట్ పెడితే.. అందులోనూ ఆ లెక్కలు మరింత తగ్గాయి14 లక్షల కోట్ల నుంచి మొదలై.. చివరకు 6 లక్షల కోట్ల రూపాయల దగ్గర ఆగిపోయారుచివరకు.. బడ్జెట్లో అప్పుల లెక్కలతో తాను అబద్ధం చెప్పానని చంద్రబాబు ఒప్పుకున్నారుఅలాంటప్పుడు ఆదాయం ఎందుకు తగ్గింది?చంద్రబాబు హయాంలో రూ.31 వేల కోట్ల అదనపు అప్పులు చేశారుమా హయాంలో రూ.17 వేల కోట్ల అప్పుల భారం తగ్గించాంజూన్ డిసెంబర్ మధ్య ఆదాయం రూ.50 వేల కోట్లుఈ నెలల్లో 0.51 నెగెటివ్ గ్రోత్ వచ్చిందిచంద్రబాబు మాత్రం 13 శాతం జీఎస్డీపీ పెరిగిందని అంటున్నారుజీఎస్డీపీ పెరిగితే ఆదాయం ఎందుకు తగ్గుతుంది?బాబు బిల్డప్‌కు ఈనాడు బాకాఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆయనకేం కొత్త కాదుతప్పుడు ప్రచారం చేయడం ఆయనకు అలవాటే దావోస్ పర్యటనలకు వెళ్లి.. ఎన్నో అబద్ధాలు చెప్పారుఏవోవో కంపెనీలు వస్తున్నాయంటూ ప్రకటనలు ఇచ్చారుఆయన బిల్డప్లకు.. ఈనాడు మామూలు ఎలివేషన్లు ఇవ్వదుఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు అబద్ధాలు ఆడమని చెప్పరునిజాయితీగా బతకమని చెప్తారుచంద్రబాబు తన కొడుకు దగ్గరి నుంచి మొదలుపెడితే పార్టీలో ఉన్న అందరికీ.. అందరికీ అబద్ధాలు ఆడమని, వెన్నుపోటు పొడవమని చెబుతుంటారు దావోస్‌లో ఒక్క ఎంవోయూ కుదర్చుకోలేదుపరిశ్రమలు ఇక్కడికి వద్దామనుకుంటే .. పెట్టుబడిదారులను భయపెట్టి, కేసులు పెట్టి.. బెదరగొట్టి.. వెళ్లిపోయేలా చేశారుపక్క రాష్ట్రాలు వాళ్లతో ఎంవోయూలు చేసుకున్నారుపరిశ్రమలను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?జిందాల్ లాంటి వ్యక్తులను భయపడితే.. వాళ్లు మరో 10 మందికి చెప్పరా?పైగా మా హయాంలో చేసిన ఒప్పందాలను.. ఇప్పుడు తాను చేసినట్లు చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారు12 మంది ఎంపీలున్న బీహార్.. బడ్జెట్లో ఎన్నో సాధించుకుందిబడ్జెట్లో ఏపీకి ఏం సాధించారు?కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు సాధించింది ఏదీ లేదుకేంద్ర బడ్జెట్లో చంద్రబాబు ఏం సాధించుకోకపోగా.. ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారుచంద్రబాబు పలుకుబడి ఏపాటిదో ఇక్కడే అర్థమవుతోందిఇది విధ్వంసం కాదా?చంద్రబాబు విధ్వంసాలు అన్నీ విన్నీ కావుఇది విధ్వంసం కాదా?పిల్లలను బడులకు పంపేలా తీసుకొచ్చిన అమ్మ ఒడి ఆపేశారుస్కూళ్లలో నాడు నేడు పనులు ఆపేశారుఇంగ్లీష్ మీడియంకు పిల్లలను దూరం చేస్తున్నారుట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఆపేశారువసతి దీవెనను ఆపేసి, విద్యా దీవెన అరకోరగా అమలు చేయడం.. పిల్లల భవిష్యత్తును నాశనం చేయడం విధ్వంసం కాదా?ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశారు.. ఇది విధ్వంసం కాదా?చేయుత, ఆసరా పథకాలను ఆపేయడం.. విధ్వంసం కాదా?అన్ని వర్గాలకు ఆర్థిక తోడ్పాడు అందించిన సంక్షేమ పథకాలు ఆపేయడం.. విధ్వంసం కాదా?ఉద్యోగాలివ్వకుండా.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడం .. విధ్వంసం కాదా?ప్రభుత్వ ఉద్యోగులతో ఆడుకోవడంరాష్ట్ర ఆదాయం కాకుండా.. తన జేబును పెంచుకునే స్కాంలు చేయడం విధ్వంసం కాదా?రెడ్‌బుక్ రాజ్యాంగంతో గవర్నరెన్స్.. విధ్వంసం కాదా?ప్రశ్నిస్తే దాడులు చేయడం.. విధ్వంసం కాదా?ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు తిరుపతిలో.. ఉప ఎన్నికల టైంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసిందిఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది?వైఎస్సార్సీపీ వాళ్లను బెదిరించి.. పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేశారుఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేశారుచివరకు.. వాళ్లకు వాళ్లే గెలిచినట్లు ప్రకటించారుఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేమా హయాంలో తాడిపత్రిలో ఎన్నికల పారదర్శకంగా జరిపాంటీడీపీ 2 స్థానాల్లో ఎక్కువగా ఉన్న జగన్ ఏం రాజకీయం చేశారో చూడాలిహ్యాట్సాఫ్ జగన్ అని అక్కడి టీడీపీ ఇంఛార్జి చెప్పారుఅధికార బలం ఉందని దోచేయడం దుర్మార్గంహిందూపురంలో జరిగింది చూశాం చంద్రబాబు బావమరిది(బాలకృష్ణను ఉద్దేశించి..) కన్నుసన్నల్లోనే ఎన్నికల జరిగిందిఏదో గొప్పగా సాధించామని ఆయన చెప్పుకుంటున్నారు.. అందుకు సిగ్గుపడాలినందిగామలో ఓ మంత్రి కార్పొరేట్ల ఇంటికి వెళ్లి బెదిరించారుఅలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు? నేరుగా డిక్లేర్ చేసుకోవచ్చు కదా ఆరోజులు త్వరలోనే..జమిలి ఎన్నికలు వస్తున్నాయంటున్నారుఅవి ఎంత త్వరగా వస్తే.. చంద్రబాబును అంత త్వరగా పంపించేయాలని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారుఏపీలో ప్రశ్నించే స్వరాలు పెరిగాయిచొక్కాలు పట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయిప్రజలను వీళ్లను తరిమికొట్టే రోజులు వచ్చే అవకాశం ఉందిలిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం?రాష్ట్రంలో లేని పరిస్థితులు.. ఉన్నట్లు చంద్రబాబు ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారుప్రజా సమస్యలు చెప్పేందుకు చట్ట సభల్లో సమయం ఇవ్వడం లేదు.. అందుకే మీడియా ముందుకు రావాల్సి వస్తోందివైఎస్సార్సీపీ 2.0 పాలన.. కార్యకర్తలకు భరోసా ఇస్తుందని మళ్లీ చెబుతున్నా‘పెద్ద’రెడ్డి.. అంటూ ఈనాడు కథనాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం?మిథున్ రెడ్డి పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్.. ఆయన తండ్రిది ఏ శాఖ?.. లిక్కర్కేసుతో వాళ్లకేం సంబంధం?ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు? మద్యం రేట్లు మేం పెంచామా?మద్యం బేసిక్ రేట్లు పెంచి.. సరఫరా తగ్గించిన నాకు లంచాలు ఇస్తారా?రేట్లుఉ పెంచి సరఫరా పెంచిన చంద్రబాబుకి మాముళ్లు ఇస్తారా?నాలాగా చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు?నాకు డబ్బుపై వ్యామోహం లేదు.. అందుకే డీబీటీతో రెండున్నర లక్షల కోట్ల రూపాయాలు సంక్షేమానికి ఖర్చు చేశాకమీషన్లు ఉండవు కాబట్టే చంద్రబాబు బటన్ నొక్కరు ఎవరో ఒకర్ని ఇరికించడం.. కేసు పెట్టడం వాళ్లు చేస్తోంది ఇప్పుడువిశ్వసనీయత ఉండాలి.. అది ఎవరికైనా!రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉండాలిఫలానా వాళ్లు మా నాయకులని కాలర్ ఎగరేసుకునేలా ఉండాలిబయటకు వెళ్లే ప్రతీ రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలిభయపడో, ప్రలోభాలకు లొంగోలేకుంటే రాజీపడి అటు పోతే విశ్వసనీయత సంగతి ఏంటి?రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి. ఐదేళ్లు కష్టపడితే మన టైం వస్తుందివిశ్వసనీయత ముఖ్యం.. అది ఎవరికైనా వర్తిస్తుందిలంచాలు లేకుండా ప్రజలకు సంక్షమ పథకాలు అందించాందేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్సీపీ నిలబడిందిస్పీకర్ కోర్టుకు స్పందించడం లేదుఅసెంబ్లీ సమావేశాలను మేం బహిష్కరించలేదుకోర్టుకు వెళ్లాంస్పీకర్ ఎందుకనో కోర్టుకు స్పందించడం లేదుఅన్ని ప్రశ్నలకు వాళ్లే సమాధానం చెప్పాలిఅసెంబ్లీకి వైఎస్సార్సీపీ ఎందుకు వెళ్లడం లేదో.. ఇక స్పీకరే చెప్పాలిజిల్లా పర్యటనల గురించి.. కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలే అవుతోంది జిల్లాల పర్యటనలకు ఇంకా టైం ఉంది ఇదీ చదవండి: జగన్ 2.0.. ఎలా పని చేస్తానో చూపిస్తా! -
నటుడిగా సంతృప్తినిచ్చింది – అక్కినేని నాగచైతన్య
‘‘తండేల్’ అందమైన ప్రేమకథా చిత్రం. ఈ కథలో ఆ ప్రేమ వెనుకే మిగతా లేయర్స్ ఉంటాయి. నా కెరీర్లో కథ, నా పాత్ర పరంగానే కాదు... బడ్జెట్ పరంగా పెద్ద సినిమా ఇది. ఇప్పటికే మా యూనిట్ అంతా సినిమా చూశాం... విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రత్యేకించి సెకండ్ హాఫ్, చివరి 30 నిమిషాలు, భావోద్వేగా లతో కూడిన క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నటుడిగా నాకు బాగా సంతృప్తి ఇచ్చిన చిత్రం ‘తండేల్’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ‘తండేల్’ రేపు (శుక్రవారం) తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం నాగచైతన్య విలేకరులతో చెప్పిన విశేషాలు ఈ విధంగా... → ‘ధూత’ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ‘తండేల్’ మూవీ లైన్‌ని విక్రమ్ కె. కుమార్‌గారు చెప్పారు. ఈ కథని వాసుగారు గీతా ఆర్ట్స్‌లో హోల్డ్ చేశారని తెలిసింది. ఈ కథని డెవలప్ చేసి, ఫైనల్ స్టోరీని చెప్పమని వాసుగారికి చెప్పాను. సినిమాటిక్ లాంగ్వేజ్‌లోకి మార్చిన ‘తండేల్’ కథ విన్నాక అద్భుతంగా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా చేయాలని ఉండేది. పైగా ఇది మన తెలుగోళ్ల కథ కావడంతో రాజు పాత్ర చేయాలనే స్ఫూర్తి కలిగింది. → ‘తండేల్’ అంటే లీడర్. ఇది గుజరాతీ పదం. ఈ సినిమాని దాదాపు సముద్రంలోనే చిత్రీకరించాం. రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయడం నటనకి కూడా ప్లస్ అవుతుంది. జైలు సెట్లో చిత్రీకరించిన ఎపిసోడ్స్ చాలా భావోద్వేగంగా ఉంటాయి. రాజు పాత్రకి తగ్గట్టు నేను మారాలంటే మత్స్యకారుల జీవన శైలి తెలుసుకోవాలి. అందుకే శ్రీకాకుళం వెళ్లి వాళ్లతో కొద్ది రోజులు ఉండి... హోం వర్క్ చేశాక ఈ పాత్ర చేయగలననే నమ్మకం వచ్చాకే ‘తండేల్’ జర్నీ మొదలైంది. నటుడిగా తర్వాతి స్థాయికి వెళ్లే చాన్స్ ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్ఫర్మేషన్ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాసలో మాట్లాడటం సవాల్‌గా అనిపించింది. → చందు, నా కాంబోలో ‘తండేల్’ మూడో సినిమా. నన్ను కొత్తగా చూపడానికి ప్రయత్నిస్తాడు. ‘‘100 పర్సెంట్ లవ్’ మూవీ తర్వాత గీతా ఆర్ట్స్‌లో మళ్లీ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటుంటే.. ‘తండేల్’తో కుదిరింది. అరవింద్‌గారు, వాసుగారు సినిమాలు, ఎంచుకునే కథలు చాలా బాగుంటాయి. → ‘తండేల్’ షూటింగ్ కోసం కేరళ వెళ్లినప్పుడు అక్కడి కోస్ట్ గార్డ్స్ కెమేరామేన్, కొందరు యూనిట్‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇలా కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవార్డులు, రికార్డులు, వసూళ్ల గురించి ఆలోచించలేదు. ప్రేక్షకులను అలరించడమే నాకు ముఖ్యం. అయితే అరవింద్‌గారు మాత్రం ‘తండేల్’ రిలీజ్ తర్వాత నేషనల్ అవార్డ్స్‌కి పంపిస్తానని అన్నారు. సినిమా కోసం నా కాస్ట్యూమ్స్‌ని డిజైనర్స్ సెలక్ట్ చేస్తుంటారు. వ్యక్తిగత విషయానికొస్తే... ట్రిప్‌లకు వెళ్లినప్పుడు షాపింగ్ చేసి, నాకు నచ్చినవి కొనుక్కుంటాను. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాను. అయితే ప్రస్తుతం నా డ్రెస్‌లను నా భార్య శోభిత సెలెక్ట్ చేసి, నాకు సర్ప్రైజ్ ఇస్తోంది. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (గురువారం) పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన మీడియా సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పరిస్థితులతో పాటు, ప్రజా సంబంధ అంశాలపై మీడియాతో ఆయన మాట్లాడనున్నారు.రాష్ట్రంలో కూటమి పాలనలో అంతా అరాచకం సాగుతోంది. 9 నెలల్లోనే అన్ని వ్యవస్థలను నాశనం చేసేశారు. సూపర్ సిక్స్ సహా హామీల అమల్లోనూ చంద్రబాబు సర్కార్ విఫలమైంది. కూటమి నేతల ఆగడాలు నానాటికీ శ్రుతి మించిపోతున్నాయి. పట్టపగలే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కిడ్నాప్‌లు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఏపీలో రాజ్యాంగం బదులుగా రెడ్ బుక్ పాలన జరుగుతోంది.విజయవాడ నగర పాలక సంస్థ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో వైఎస్ జగన్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్‌పై ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మళ్లీ గెలుస్తుందని.. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు పరిపాలిస్తామన్నారు. ‘‘ఒక్కటే గుర్తు పెట్టుకొండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పని చేస్తుందో చూపిస్తాం.’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.‘‘జగనన్న1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటగా ప్రజలే గుర్తుకు వచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. వారి కోసమే నా టైం కేటాయించాను. ప్రజల కోసమే అడుగులు వేశాను. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. వారి అవస్థలను చూశాను. అందుకే ఆ కార్యకర్తల కోసం మీ జగన్ అండగా ఉంటాడు’’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘ఛీ.. ఎన్టీఆర్ మాటకు తూట్లు పొడిచి మరీ! -
ఎన్కౌంటర్లో ట్విస్ట్.. కంగుతిన్న పోలీసులు
కోట: రాజస్థాన్‌లోని కోటలో జరిగిన ఎన్కౌంటర్ ఊహించని మలుపుతిరిగింది. ఎన్కౌంటర్లో మృతిచెందాడని భావిస్తున్న 24 ఏళ్ల నేరస్తుడు బతికే ఉన్నాడని, ఇప్పటికీ పరారీలో ఉన్నాడని తేలిడంతో పోలీసులు కంగుతిన్నారు. ఆదివారం నాడు పోలీసులు అతని ఇంటిని చుట్టుముట్టినప్పుడు అతను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు భావించారు. అయితే ఈ ఉదంతంలో చోటుచేసుకున్న మలుపును పోలీసులు మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరస్తుడు రుద్రేష్ అలియాస్ ఆర్డీఎక్స్ ఆదివారం నాడు కోట పరిధిలోని నయా నోహ్రాలోని ఒక ఇంట్లో దాక్కున్నప్పుడు పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ సమయంలో రుద్రేష్ తనను తాను కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నడని పోలీసులు భావించారు. కాగా ఆ సమయంలో రుద్రేష్ సహచరుడు కూడా అదే ఇంట్లో ఉన్నాడు.ఈ ఘటన అనంతరం పోలీసులు అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే సోమవారం రుద్రేష్ కుటుంబ సభ్యులు మృతుడిని ప్రీతమ్ గోస్వామి అలియాస్ టీటీగా గుర్తించారు. అతను కూడా పేరుమోసిన నేరస్తుడేనని డిఎస్పీ లోకేంద్ర పలివాల్ తెలిపారు. ఇంతలో రుద్రేష్ తన స్నేహితుల్లో ఒకరికి పోన్ చేసి, తాను బతికే ఉన్నానని తెలియజేశాడు. ఈ విషయాన్ని ఆ మిత్రుడు రుద్రేష్ కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.సీసీటీవీ ఫుటేజ్‌లోని ఫీడ్ ప్రకారం పోలీసు బృందం రాకముందే రుద్రేష్ అక్కడి నుంచి పారిపోయాడని డీఎస్పీ తెలిపారు. అతని ముఖం ఛిద్రమై ఉండటం, గదిలో అతని వస్తువులు కొన్ని కనిపించడంతో, ఆ మృతదేహాన్ని పోలీసులు రుద్రేష్గా గుర్తించారు. పోలీసులు రుద్రేష్ ఇంటి నుంచి మూడు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రుద్రేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: Delhi Assembly Election: అణువణువునా గస్తీ.. 35 వేల పోలీసులు మోహరింపు -
గుక్కపెట్టి ఏడ్చిన ఎంపీ.. రాజీనామా చేస్తానంటూ..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దళిత బాలిక హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై అయోధ్యకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో ఆయన గుక్కపెట్టి ఏడవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పక్కనే కూర్చున్న మాజీ ఎంపీ పవన్ పాండే.. అవధేష్‌ను ఊరడిస్తూ కనిపించారు.హత్యకు గురైన బాధిత దళిత బాలిక కుటుంబ సభ్యులను శనివారం అవధేష్ ప్రసాద్(Avadhesh Prasad) కలిశారు. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో అవధేష్ మాట్లాడుతూ ‘లోక్‌సభలో ప్రధాని మోదీ ముందు ఈ అంశాన్ని లేవనెత్తుతాను. ఈ విషయంలో న్యాయం జరగకపోతే రాజీనామా చేస్తాను. మన బిడ్డ గౌరవాన్ని కాపాడుకోవడంలో మనం విఫలమవుతున్నాం. ఇది దేశంలో అత్యంత బాధాకరమైన ఘటన. यह जघन्य अपराध बेहद दुःखद हैं।अयोध्या के ग्रामसभा सहनवां, सरदार पटेल वार्ड में 3 दिन से गायब दलित परिवार की बेटी का शव निर्वस्त्र अवस्था में मिला है, उसकी दोनों आँखें फोड़ दी गई हैं उसके साथ अमानवीय व्यवहार हुआ है।यह सरकार इंसाफ नही कर सकती। pic.twitter.com/aSvI3N74Kl— Awadhesh Prasad (@Awadheshprasad_) February 2, 2025అయోధ్యలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక దళిత బాలికపై అత్యాచారం జరిపి, ఆపై దారుణంగా హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని నగ్న స్థితిలో కాలువలోకి విసిరేశారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది’ అని చెబుతూ అవధేష్ మీడియా ముందు గుక్కపెట్టి ఏడ్చారు. కాగా అయోధ్య జిల్లాలోని మిల్కిపూర్ అసెంబ్లీ స్థానా(Milkipur Assembly constituency)నికి ఫిబ్రవరి 5న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో అవధేష్ ప్రసాద్ కుమారుడు బరిలో ఉన్నారు. అటువంటి స్థితిలో అవధేష్ రోదిస్తున్న వీడియో వైరల్(Video goes viral) అయ్యింది. దీంతో అతని తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఫిబ్రవరి 5న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కిపూర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్టికానున్నాయి. మిల్కిపూర్ సీటును గెలుచుకునేందుకు అటు సమాజ్‌వాదీ పార్టీ, ఇటు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది కూడా చదవండి: రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు.. సోనియా గాంధీపై కేసు నమోదు -
అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది: ఫరియా అబ్దుల్లా
డ్యాన్స్ లవర్స్‌ను మెప్పించిన ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’(Dance Ikon) కు కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2(Dance Ikon 2) వైల్డ్‌ఫైర్’ రానుంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ షో ఆహా ఓటీటీలో ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. ఈ షోకు ఓంకార్(Ohmkar), హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్‌ఫైర్’ షోలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటారని, హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్‌తో ఈ డ్యాన్స్ షో వీక్షకులను అలరిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘డ్యాన్స్ ఐకాన్ 2’ షో ప్రెస్మీట్లో హోస్ట్స్‌లో ఒకరైన ఓంకార్ మాట్లాడుతూ– ‘‘డ్యాన్స్ ఐకాన్ 2–వైల్డ్‌ఫైర్’లో ఐదుగురు కంటెస్టెంట్స్ సర్ప్రైజ్ చేస్తారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పెర్ఫార్మెన్స్లు చర్చనీయాంశమవుతాయి. ముగ్గురు హోస్ట్‌లతో పాటు సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2: వైల్డ్ ఫైర్’ వీక్షకులకు హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో’’ అని అన్నారు.ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ–‘‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’కు కూడా నన్ను హోస్ట్‌గా అడిగారు. కానీ, ఆ సమయంలో చేయలేకపోయాను. ఇప్పుడు ఓంకార్, శేఖర్ మాస్టర్లతో కలిసి హోస్ట్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఈ షో వీక్షకులకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని గ్యారంటీగా చెప్పగలను’’ అని తెలిపారు. ‘‘ఈ షోలో వీక్షకులను సర్ప్రైజ్ చేసే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు ఉంటాయి’’ అని చె΄్పారు శేఖర్ మాస్టర్. ఈ కార్యక్రమంలో మెంటార్ యశ్, మెంటార్ మానస్, సింగర్ జాను లైరి, మెంటార్ ప్రకృతి మాట్లాడారు. -
‘ప్రేమిస్తావా’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
ఈ పెట్టుబడుల వల్ల వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి: Revanth Reddy
-
'మదగజరాజా'మూవీ ప్రెస్మీట్లో హీరోయిన్ అంజలి,వరలక్ష్మి (ఫొటోలు)
-
సందు దొరికితే చాలు వైఎస్ జగన్ పై బురద చల్లాలనే ప్రయత్నమే
-
స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలకు YSRCP మద్దతుగా నిలిచింది
-
కూతురి ఫస్ట్ మూవీ.. ఏడ్చేసిన సుకుమార్ భార్య (ఫోటోలు)
-
కార్చిచ్చుపై ప్రెస్మీట్లో ముత్తాతనయ్యానని జో బైడెన్ ప్రకటన
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలెస్‌తో పాటు దక్షిణ కాలిఫోర్నియా మొత్తాన్ని భీకర కార్చిచ్చు చుట్టుముట్టి పెను నష్టం చేస్తున్న విషయం తెలిసిందే. దాని ధాటికి ఇప్పటికే లక్షన్నర మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇళ్లతో పాటు సర్వం బుగ్గి పాలై భారీగా ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా లాస్ ఏంజెలెస్‌లో హాలీవుడ్ తారలతో పాటు ప్రముఖులుండే అతి సంపన్న ఆవాసాలు పెద్ద సంఖ్యలో అగ్నికి ఆహుతిగా మారాయి. ఈ విపత్తుపై స్థానిక శాంటా మోనికాలో బైడెన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉన్నట్టుంది వ్యక్తిగత ప్రకటన చేశారు. తనకు ముని మనవడు పుట్టాడని చెప్పుకొచ్చారు. ‘ఈ ప్రతికూల వార్తల నడుమ ఒక శుభవార్త. ఈ రోజే నేను ముత్తాత అయ్యాను. చాలా కారణాలతో నాకీ రోజు గుర్తుండిపోతుంది‘ అని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘పేరుకేమో అగ్ర రాజ్య అధ్యక్షుడు. కనీసం ఎక్కడేం మాట్లాడా లో తెలియదా?‘ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాస్ ఏంజెలెస్ మంటల్లో బైడెన్ కుమారుని ఇల్లు కూడా బుగ్గిగా మారినట్టు వార్తలొచ్చాయి. ‘అది పూర్తిగా కాలిపోయిందని తొలుత చెప్పారు. బానే ఉందని ఇప్పుడంటున్నారు‘ అంటూ ఈ వార్త లపై బైడెన్ స్పందించారు.ప్రెస్ మీట్‌కు ముందే...మీడియా సమావేశానికి ముందే బైడెన్ స్థాని క ఆస్పత్రిలో ముని మనవడిని చూసి వచ్చారు. ఆ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. పదవిలో ఉండగా ముత్తాత అయిన తొలి అమెరికా అధ్యక్షునిగా కూడా 82 ఏళ్ల బైడెన్ రికార్డు సృష్టించడం విశేషం. పెద్ద వయసులో అధ్యక్షుడు అయిన రికార్డు ఆయన పేరిటే ఉండటం తెలిసిందే. 77 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 78 ఏళ్ల ట్రంప్ ఇప్పుడా రికార్డును తిరగరా యనున్నారు. ఈ నెల 20న ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే. -
LIVE: తిరుపతి ఘటనపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
‘డాకు మహారాజ్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
ఫిబ్రవరి 15తో ముగియనున్న ఢిల్లీ అసెంబ్లీ
-
టాలీవుడ్ పెద్దల ప్రెస్ మీట్
-
మోహన్ లాల్ 'బరోజ్' మూవీ ప్రెస్‌మీట్ (ఫోటోలు)
-
విజయ్ సేతుపతి ‘విడుదల-2’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
మా నాన్నను విష్ణు ట్రాప్ చేసాడు
-
నాన్న తరఫున మీడియా మిత్రులకు క్షమాపణలు కోరుతున్నా: మంచు మనోజ్
-
ఏపీ సచివాలయంలో రగడ.. వెంకట్రామిరెడ్డి ప్రెస్‌మీట్ అడ్డగింత
సాక్షి, గుంటూరు: తమను వేధించడమే చంద్రబాబు సర్కార్ పనిగా పెట్టుకుందని సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పోలీసుల హడావుడితో రగడ చోటుచేసుకుంది. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రావడంతో వారికి, ఉద్యోగుల సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిన్న(గురువారం) ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై కూడా పోలీసులు దాడులు చేశారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర దుమారం రేగింది. నేడు వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ జరగకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిన్న ఏం జరిగిందంటే..రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వారిని ఇబ్బందులకు గురిచేశారు. డిన్నర్ చేస్తున్న సమయంలో 50 మంది వరకు పోలీసులు.. ఉద్యోగులను చుట్టుముట్టారు. ప్లాన్ ప్రకారం డిన్నర్ పార్టీపై ఏడు పోలీసు స్టేషన్ల సిబ్బంది దాడులు చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ ఉద్యోగులపై కేసులు పెట్టారు.అనంతరం ఉద్యోగులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. గురువారం అర్ధరాత్రి వరకు వారిని పీఎస్‌లోనే ఉంచారు. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులను వేధిస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బొంకుల బాబు పవర్ బాగోతం.. బయటపెట్టిన వైఎస్ జగన్.. భజన మీడియాకూ సీరియస్ వార్నింగ్ (ఫొటోలు)
-
నితిన్ 'రాబిన్‌హుడ్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
వైఎస్ఆర్ సీపీ MLCల ప్రెస్ మీట్
-
విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
Vidadala Rajini: కూటమి ప్రభుత్వం మాత్రం ఆరోగ్య శ్రీని పట్టించుకోవడం లేదు
-
లగచర్ల బాధితులతో NHRCని కలిసిన బీఆర్ఎస్ నేతలు
-
LIVE : వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
LIVE : వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
మీడియా ముందుకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా ముందుకు రానున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఏపీ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం.. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేయిస్తూ వేధింపులకు సంగతి తెలిసిందే. అలాగే శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో.. ఈ పరిణామాలపై వైఎస్ జగన్ తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడనున్నారు. 🚨 #Breaking Former Chief Minister, YSRCP Chief Sri @ysjagan Garu will address an important press conference today.📍Central Office, Tadepalli 🕒3:00 PM#StayTuned ❗https://t.co/RSawyrTK0MLive Link👆🏻#WeStandWithYSRCPSM#YSJagan pic.twitter.com/TDXHh2XQTa— YSR Congress Party (@YSRCParty) November 7, 2024 -
తండేల్ రిలీజ్ డేట్ ప్రెస్మీట్లో మెరిసిన చైతూ, సాయి పల్లవి (ఫోటోలు)
-
షర్మిలను తెలంగాణ ప్రజలు నమ్మలేదు.. ఏపీ ప్రజలు నమ్మలేదు
-
జగన్ ప్రెస్ మీట్ లో ఫ్యాన్స్ హంగామా..
-
సూర్య ‘కంగువ’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
LIVE : టీడీపీ అరాచకాలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో ఎన్నో దారుణాలు జరిగాయి
-
ఖడ్గంలో నన్ను తీసుకోవద్దన్నారు: శ్రీకాంత్
‘‘ఖడ్గం’ సినిమాలో నన్ను తీసుకోవద్దని నిర్మాత మధు మురళిగారు అన్నారు. కానీ కృష్ణవంశీ ధైర్యం చేసి, ఆయన్ని ఒప్పించి నన్ను తీసుకున్నారు. నా జీవితంలో ఈ సినిమాని మర్చిపోలేను. తరాలు మారినా దేశభక్తి చిత్రాలన్నింటిలో ‘ఖడ్గం’ గొప్ప చిత్రం. ఈ మూవీ మళ్లీ విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, శివాజీ రాజా, షఫీ, సోనాలీ బింద్రే, సంగీత తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘ఖడ్గం’. కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధు మురళి నిర్మించిన ఈ సినిమా 2002 నవంబర్ 29న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.కాగా ఈ నెల18న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టాను’’ అని చెప్పారు. ‘‘ఖడ్గం’లో నేను చేయనని చెప్పాను. కానీ, ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నిటిలో నాకు మంచి పేరు వచ్చింది మాత్రం ఈ సినిమాతోనే’’ అన్నారు శివాజీ రాజా. ‘‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివి ఏడేళ్లుగా అవకాశం కోసం వేచి చూస్తున్న సమయంలో నాకు దొరికిన అవకాశం ‘ఖడ్గం’. ఈ సినిమాలో చాన్స్ ఇచ్చి నా వనవాసం ముగింపునకు కారణమైన కృష్ణవంశీగారికి కృతజ్ఞతలు’’ అని నటుడు షఫీ తెలిపారు. -
చంద్రబాబు పాపం బయటకు రావాలి: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
LIVE: తిరుమల పర్యటన పై జగన్ కీలక ప్రెస్ మీట్
-
నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడి దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునేందుకు చూస్తున్నారని.. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు..రాష్ట్రంలో రాక్షస రాజ్యంరాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది. దేవుడి దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం నా రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదు. దేవుడి దర్శనానికి వెళ్తుంటే కూడా అడ్డుకుంటున్నారు. అందుకే ఇది రాక్షస రాజ్యం.ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులకు నోటీసులు ఇచ్చారు.ఇక ఆ నోటీసులో ఏం రాశారంటే అంటూ.. చదివి వినిపించారు.‘మాజీ సీఎం వైయస్ జగన్ తిరుమల తిరుపతి సందర్శనకు, సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున, మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో, మరియు మీ సొంత వాహనాల్లో బయలుదేరి తిరుపతి చేరుకుని, వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమంలో పాల్గొనడం, చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తున్న నోటీస్’.అంటే, జగన్ అనే వ్యకి మాజీ ముఖ్యమంత్రి. ఆయన తిరుమల తిరుపతి దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తుంటే, అందుకు మీకు పర్మిషన్ లేదు. మీరు వెళ్తే అరెస్టు చేస్తామని నోటీసులు ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచనే చేయండి.ఏ ప్రపంచంలో ఉన్నాం. ఇది రాక్షస రాజ్యం కాదా? ఒకవైపున ఏమో, నన్ను వెళ్లనీయకుండా, వైయస్సార్సీపీ శ్రేణులు వెళ్లకుండా నోటీసులు ఇస్తున్నారు. మరోవైపున టీవీల్లో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారు. ఇది పార్టీ నాయకత్వానికి తెలుసో? లేదో?వేల మంది పోలీసులను మొహరించారు. ఎందుకంతగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు? టాపిక్ డైవర్షన్ కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు?.చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలు అని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తున్నాయి. ఆ కనిపించే నేపథ్యంలో, 100 రోజుల పాలన మీద డైవర్ట్ చేస్తూ, లడ్డూల టాపిక్ తీసుకొచ్చారు. అడ్డగోలుగా తప్పు చేసి, గుడి పవిత్రత దెబ్బతీస్తూ అడ్డంగా దొరికిపోయే సరికి, లడ్డూల టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు.ఒకసారి గమనించినట్లయితే, తిరుమల పవిత్రత, స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్భుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారైనట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్లుగా.. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా.. నిజంగా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్దాలు ఆడుతూ, అసత్యాలు పలుకుతూ.. స్వామి వారి పేరు ప్రఖ్యాతలను, తిరుపతి లడ్డూ విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం, సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రి చేస్తుంటే.. ఇంత కంటే దారుణం, అధర్మం ఎక్కడైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి వాటికి సంబం«ధించిన అన్ని విషయాలు చెబుతాను. చంద్రబాబు అనే వ్యక్తి ఏ రకంగా అబద్దాలు చెప్పి, రెక్కలు కట్టాడనేది ఆధారాలతో చూపిస్తా. దీన్ని రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలంతా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను.అది రొటీన్ ప్రాసెస్తిరుమలలో లడ్డూల కోసం నెయ్యి కొనుగోల చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకోసారి రొటీన్‌గా, దశాబ్ధాలుగా జరుగుతోంది. ఆరు నెలలకు ఒకసారి ఈ–టెండర్ పిలుస్తారు. అర్హులు బిడ్ వేస్తారు. ఇప్పుడు కొత్తగా నియమాలు పెట్టలేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తిరుపతి లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ టేస్ట్ మరెక్కడా ఉండదు. ఆరు నెలలకోసారి ఈ–టెండర్. బిడ్లు వేస్తే, ఎల్–1 గా వచ్చిన వారికి టెండర్ ఖరారు చేస్తారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు.టీటీడీ బోర్డు ఒక ప్రసిద్ధి గాంచిన బోర్డు. అందులో సభ్యుల కోసం కేంద్ర మంత్రులు, చుట్టుపక్కల రాష్ట్రాల సీఎంలు కూడా రికమెండ్ చేస్తారు. వారి వారి రాష్ట్రాల్లో ప్రముఖులను సిఫార్సు చేస్తారు. అంత మంచి లక్షణాలు ఉన్న వారితో బోర్డు ఏర్పాటవుతుంది. వారంతా ప్రసిద్ధి పొందిన వారు. దేవుడికి ఇంకా సేవ చేయాలని, భక్తులకు మంచి చేయాలని నిర్ణయాలు తీసుకుంటారు. చెడు చేయాలన్నా చేయబోరు. అక్కడ నెయ్యి సరఫరా కోసం ఆరు నెలలకోసారి ఈ–టెండర్లు పిలుస్తారు. ఎల్–1గా వచ్చిన వారికి కూడా పూర్తి టెండర్ ఖరారు చేయరు. 65 శాతం వారికిచ్చి, మిగతా వారిని కూడా రేటు తగ్గించమని చెప్పి, వారికి టెండర్ ఇస్తారు.సరఫరాలో రొబస్ట్ పద్ధతితిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో కూడా రొబస్ట్ (ధృఢమైన) విధానం ఉంటుంది. నెయ్యి సరఫరా చేసేవారు, ప్రతి ట్యాంకర్‌తో ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబరేటరీస్) సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్ తీసుకొస్తారు. అలా వచ్చిన నెయ్యిని కూడా ప్రతి ట్యాంకర్ నుంచి శాంపిల్ తీసి, మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే, ట్యాంకర్‌ను ముందుకు పంపుతారు. ఒక్క టెస్టు ఫెయిల్ అయినా ట్యాంకర్‌ను వెనక్కు పంపిస్తారు.చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య 14 నుంచి 15 ట్యాంకర్లు అలా వెనక్కు పోయారు. అంటే ఎవరూ తప్పు చేయని విధంగా అక్కడ రొబస్ట్ విధానం ఉంది. మా ప్రభుత్వ హయాంలో కూడా 18 ట్యాంకర్లు వెనక్కు పంపారు. ఏ సరుకైనా సరే, క్వాలిటీ టెస్టులో ఫెయిల్ అయితే వెనక్కు పంపిస్తారు.ఇప్పుడు ఏం జరిగింది?ఇప్పుడు కూడా అదే జరిగింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్ 12 నుంచి సరఫరా మొదలుపెట్టారు. అంటే, అప్పటికే చంద్రబాబుగారి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాతే నెయ్యి సరఫరా మొదలైంది. అలా జూన్ 12, జూన్ 21, జూన్ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టుల్లో పాస్ అయి, ముందుకు కదిలాయి. వాటిని లడ్డూల తయారీలో వాడారు.ఆ తర్వాత జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 12న మరో రెండు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి, టీటీడీ టెస్టుల్లో ఫెయిల్ కావడంతో, వెనక్కు పంపడానికి సిద్ధం చేశారు. మరోసారి ఆ శాంపిల్స్ పరీక్ష కోసం మామూలుగా మైసూర్‌లోని సీఎఫ్టీఆర్ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)కు పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్‌లోని ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్)కి పంపారు. ఇది టీటీడీ చరిత్రలో తొలిసారి. టీటీడీ పంపించిన శాంపిల్స్‌పై ఎన్డీడీబీ వారు జూలై 23న రిపోర్ట్ పంపారు. నెయ్యిలో కల్తీ ఉందన్న విషయం చెప్పారు. దాంతో ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అలా 4 ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు.ఇప్పుడు నేను అడుగుతున్నానుఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా, రెండు నెలల తర్వాత సెప్టెంబరు 18న, చంద్రబాబుగారు ఆ నెయ్యిని వాడారని ఉద్దేశపూర్వకంగా ఎందుకు అన్నారు?. ఇప్పుడు ఒకసారి, చంద్రబాబు నియమించిన టీటీడీ ఈఓ, ఆ నెయ్యి నాణ్యత గురించి జూలై 23న ఏమన్నారో చూద్దాం అంటూ.. ఆ వీడియో చూపారు.ఆ రెండు ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం. షోకాజ్ నోటీస్ ఇచ్చామని, వాటిలో వనస్పతి ఆయిల్ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఈఓ చెప్పినా.. రెండు నెలల తర్వాత చంద్రబాబుగారు సెప్టెంబరు 18న ఏ రకంగా అబద్ధాలు మాట్లాడారో చూడండి.. అంటూ ఆ వీడియో కూడా ప్రదర్శించి చూపారు.ఘీకి బదులు జంతువుల కొవ్వు వాడారని, లడ్డూలు తయారు చేశారని, వాటిని భక్తులు తిన్నారని అన్నీ తెలిసినా, చంద్రబాబు అబద్దాలు చెప్పారు.టీడీపీ ఆఫీస్‌లో కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్చంద్రబాబుగారు సెప్టెంబరు 18న ఆ ఆరోపణలు చేస్తే, ఆ మర్నాడే.. అంటే సెప్టెంబరు 19న తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో ఎన్డీడీబీ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. నిజానికి అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. అయినా దాన్ని టీడీపీ ఆఫీస్‌లో రిలీజ్ చేశారు.ఆ వెంటనే, మర్నాడు, అంటే సెప్టెంబరు 20 టీటీడీ ఈఓ మళ్లీ ఏం మాట్లాడాడో చూద్దాం.. అంటూ వీడియో ప్రదర్శించారు.ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని తేలినందువల్ల, ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. అంతే కాకుండా, సెప్టెంబరు 22న ఈఓ, తాను స్వయంగా సంతకం చేసి, ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారని చెబుతూ.. అందులోని అంశాలు చదివి వినిపించారు.కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కు పంపాం. ఆ కంపెనీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చామని.. తమకు ఎన్డీడీబీ రిపోర్టు చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు. అయినా దాన్ని, అంతకు ముందే తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో రిలీజ్ చేశారు.అది అపవిత్రత కాదా?మళ్లీ సెప్టెంబరు 22న మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, అవే పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కల్తీ నెయ్యి వాడారని చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి ప్రతిష్టను, శ్రీ వెంకటేశ్వరస్వామివారి ప్రసాద పేరు ప్రఖ్యాతలను, ఈ మాదిరిగా అబద్దాలతో తగ్గించడం, కుట్ర పూరితంగా వ్యవహరించడం.. అపవిత్రత కాదా?.ఎన్డీడీబీ రిపోర్ట్ డిస్క్లెయిమర్పోనీ.. ఆ ఎన్డీడీబీ రిపోర్టు అయినా కచ్చితమైందా? అని చూస్తే, ఆ రిపోర్టులో వాళ్లే డిస్‌క్లెయిమర్ రాశారు.‘నెయ్యిలో ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా.. శాంపిల్స్‌లోని స్టాండర్డ్ వాల్యూస్‌లో డీవియేషన్స్ ఉన్నాయి. అయినా, ఈ పరిస్థితుల్లో ఒక ఫాల్స్ పాజిటివ్ ఫలితం కూడా రావొచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. అంటూ.. పాల సేకరణ, ఆవులు, వాటి దాణ గురించి ప్రస్తావించారు. అలాగే ఆవులకు సరైన ఆహారం లేనప్పుడు, అవి సరిగ్గా తినకుండా బలహీనంగా ఉన్నప్పుడు తీసిన పాల నుంచి కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని రాశారు’.పచ్చి అబద్ధాలు. అపవిత్రం కాదా?ఇవన్నీ తెలిసినా చంద్రబాబు కావాలని అబద్దాలు ఆడుతూ, తిరుమల వెంకటేశ్వరస్వామివారి విశిష్టతను, ప్రసాదాల పవిత్రతను దగ్గరుండి, కావాలని అబద్దాలు చెప్పి, అనుమానపు బీజాలు ప్రసాదం స్వీకరించే ప్రతి ఒక్కరిలో లేపడం దుర్మార్గం కాదా? అపవిత్రం కాదా?నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తున్నావు. స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తున్నావు. జరగనిది జరిగినట్లుగా, జంతువుల కొవ్వుతో ప్రసాదం తయారు చేసినట్లుగా ఒక అబద్దాన్ని ప్రచారం చేస్తున్నావు. ధర్మమేనా?.మీ హయాంలో ఎందుకు వాడలేదు?నందిని బ్రాండ్ ఎందుకు వాడడం లేదని అంటున్నారు. మరి చంద్రబాబు పాలన సమయంలో 2015 నుంచి 2018 అక్టోబరు వరకు కెఎంఎఫ్‌కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి ఎందుకు లేదు? అప్పుడు కూడా టెండర్లు పిల్చారు కదా? నందిని వాళ్లు ఇష్టం వచ్చినప్పుడే టెండర్లలో పాల్గొంటారు.అప్పుడు ఇంత కంటే తక్కువ ధరఇంకొకరు అంటారు. రూ.320కి కిలో నెయ్యి ఎలా వస్తుందని అంటారు. మరి చంద్రబాబుగారి కూడా 2014–19 మధ్య నెయ్యిని ఏ ధరకు సేకరించారు? ఇప్పుడు కూడా అదే క్వాలిటీ నెయ్యి కదా? దశాబ్దాలుగా అదే క్వాలిటీ. అదే నెయ్యి. మరి చంద్రబాబు హయాంలో 2015లో కిలో నెయ్యిని రూ.276కి కొన్నారు. అదే 2019 జనవరిలో కిలో ఆవు నెయ్యిని రూ.324కు కొన్నారు. మరి ఇక్కడ రూ.320కి కొంటే తప్పేం జరిగింది?.అదే చంద్రబాబు కుట్రమీ హయాం అంతా అవే రేట్లకు కొన్నారు. మరి ఇప్పుడు కూడా అవే ధరలు. చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ కోసం, పాలు కార్టల్ ఫామ్ చేసి, నెయ్యి రేట్లు పెంచేసి, ఆ కార్టల్‌లో చంద్రబాబునాయుడు, హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో, కొత్తగా రేట్లు పెంచడం కోసం మాట్లాడుతున్నాడు. అదే క్వాలిటీ నెయ్యి. అవే స్పెఫికేషన్స్. అప్పుడు ఇప్పుడూ ఒకటే. తిరుపతి లడ్డూ చాలా టేస్టు ఉంటుందని గొప్పగా చెప్పుకుంటాం. ఆ లడ్డూ అప్పుడూ, ఇప్పుడూ ఒకటే.చంద్రబాబుగారి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో, ప్రజలంతా కూడా ఆయనను వేలెత్తి చూపే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో.. లడ్డూ టాపిక్‌లో చంద్రబాబు చేసిన తప్పును ప్రశ్నించడం మొదలు పెట్టారో.. వారికి వాస్తవాలు తెలియడం మొదలైందో.. ఆ పెద్దమనిషి ఏం చేస్తున్నారు.నా డిక్లరేషన్ కోరడం ఏమిటి?టాపిక్ డైవర్షన్ కోసం డిక్లరేషన్ అంటున్నాడు. జగన్ ఏమైనా కొత్తనా? రాజశేఖర్‌రెడ్డిగారు కొత్తనా? ఆయన ఏమిటో తెలియదా?నా మతం ఏమిటో రాష్ట్రంలో కానీ, దేశంలో తెలియదా? నా కులం ఏమిటో తెలియదా? రాజశేఖర్‌రెడ్డిగారు సీఎంగా 5 ఏళ్లు వరసగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన కొడుకునే కదా?నేను గతంలో చాలాసార్లు వెళ్లాను కదా? సీఎం కాక ముందు కూడా వెళ్లాను కదా?అంతెందుకు నా పాదయాత్ర మొదలుపెట్టే ముందు కూడా స్వామివారిని దర్శించుకున్నాను. 3648 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా, తిరుపతి నుంచి కొండ ఎక్కాను. స్వామివారిని దర్శించుకున్న తర్వాతే ఇంటికి వెళ్లాను. అప్పుడు ఉన్నది చంద్రబాబుగారి ప్రభుత్వం. నేను ప్రతిపక్ష నాయకుడిని. రెండుసార్లు స్వామివారిని దర్శించుకున్నాను కదా?ఆ తర్వాత సీఎంగా వరసగా 5 ఏళ్లు, స్వామివారికి భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాను కదా?తొలిసారి ఎవరైనా వెళ్తుంటే, ఇలా అడగొచ్చు. కానీ 10, 11 సార్లు పోయిన తర్వాత, ఈరోజు నేను తిరుపతి వెళ్తానంటే. అడ్డుకుంటూ నోటీసులు ఇవ్వడం ఏమిటి?. డిక్లరేషన్ అడగడం ఏమిటి? మా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు నోటీసులు పంపడం ఏమిటి?రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాను. 5 ఏళ్లు బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాను. ఎన్నోసార్లు స్వామి వారిని దర్శించుకున్నాను.నా మతం మానవత్వం. అదే నా డిక్లరేషన్ఈరోజు నేను వెళ్లకూడదట. కారణం నా మతం అంటున్నారు.అసలు నా మతం ఏమిటని అడుగుతున్నాను. నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. తప్పేముంది? బయటకు పోతే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తాను. గౌరవిస్తాను. ఇస్లాంను అనుసరిస్తాను. గౌరవిస్తాను. సిక్కిజమ్‌ను అనుసరిస్తాను. గౌరవిస్తాను.నా మతం ఏమిటి అంటున్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్‌లో రాసుకుంటారేమో రాసుకొండి.దేశ రాజ్యాంగంలో ఏం చెప్పారు. నేను చదువుతాను వినండి.‘ఇండియా ఈజ్ ఎ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమొక్రటిక్ రిపబ్లిక్’.సెక్యులర్ అంటే అర్ధం తెలుసా?. నీ మతం చెప్పకపోతే గుడిలోకి రావొద్దు అంటున్నావు. ఇది సెక్యులర్ దేశం అంటున్నాం.సీఎంగా పని చేసిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటే, దళితుల పరిస్థితి ఏమిటి? దళితులను గుడిలోకి పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తాం?చంద్రబాబును ఎందుకు సమర్థిస్తున్నారు?మతం పేరుతో రాజకీయం చేయడం ఎంత దౌర్భాగ్యం? బీజేపీని అడుగుతున్నాను. తామే హిందుత్వానికి ప్రతినిధులం అంటారు. మిమ్మల్నే అడుగుతున్నాను.మీ కళ్ల ఎదుటే, మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే, శ్రీ వెంకటేశ్వరస్వామి విశిష్టతను, తిరుపతి లడ్డూ పేరు ప్రఖ్యాతలను, స్వామి వారి వైభవాన్ని, దగ్గరుండి అబద్ధాలు చెబతూ, జంతువుల కొవ్వు వాడకపోయినా, వాడి లడ్డూలు తయారు చేసినట్లుగా.. ఇన్ని ఆధారాలతో సహా, రుజువు అవుతున్నా.. అబద్ధాలతో దుష్ప్రచారం చేసి, వెంకటేశ్వరస్వామివారిని అపవిత్రం చేసిన ఈ వ్యక్తిని ఎందుకు మందలించడం లేదు? ఎందుకు వెనకేసుకొస్తున్నారు?.అంటే మీ వాళ్లు ఏం చేసినా ఫరవాలేదు. మిగిలిన వారు ఏం చేసినా తప్పే? ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇదెక్కడి హిందుత్వం?. హిందుత్వానికి మీకు టార్చ్ బేరర్స్ అంటారు. అందరూ ఆలోచించండి. నిజంగా హిందుత్వం ఏమిటంటే, మానవత్వం చూపడమే. అలా మానవత్వాన్ని చూపలేని వారు మంచి హిందువును అని చెప్పుకోలేరు.తానే దోషి. తానే జడ్జీ. ఇదెక్కడి ధర్మం?చంద్రబాబునాయుడే తప్పు చేస్తాడు. ఆయనే సిట్ వేస్తాడు. ఆయన చెప్పుచేతుల్లో ఉన్న అధికారులతో సిట్ అంటాడు. ఇదెక్కడి ధర్మం? ఇదెక్కడి పద్ధతి?. చంద్రబాబు ఈ మాదిరిగా హిందూ ధర్మం మీద దుష్ప్రచారం చేస్తూ, రాజకీయం చేయడం ధర్మమేనా? ఆలోచించండి.ఇదే అందరికీ నా విజ్ఞప్తినేను గుడికి వెళ్లకపోయినా ఫరవాలేదు. కానీ, చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మన పార్టీ తరపున మీమీ ఊళ్లలో పూజలు చేయండి. తప్పు చేసింది మేం కాదు. చంద్రబాబు అని వేడుకొండి. అందుకే ఆ కోపాన్ని ప్రజలపై కాకుండా, చంద్రబాబుపై చూపమని వేడుకొమ్మని కోరుతున్నాను.ఒకవైపున మా నాయకులు, ప్రజాప్రతినిధులకు నోటీస్‌లు ఇస్తూ, హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ కార్యకర్తలను రప్పించి, గొడవలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు.అలా టాపిక్‌ను డైవర్ట్ చేసేందుకు, చంద్రబాబునాయుడు తాను చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారు.అందుకే నా పర్యటన వాయిదాఈ పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్లి, టాపిక్ డైవర్ట్ చేయడం ఇష్టం లేక, వెంకటేశ్వరస్వామిని ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా, టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో.. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని అబద్దాలతో, అవమానించి, అగౌరవపర్చాడో.. లడ్డూపై దుష్ప్రచారం చేశాడో.. చేసిన తప్పు ఆధారాలతోసహా కనిపిస్తున్న ఈ సత్యం బయటకు రావాలి.చంద్రబాబునాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. అది రాష్ట్ర ప్రజల మీదకు రావొద్దు. పాపం చేసిన చంద్రబాబు మీదే కట్టడి కావాలి.దాని కోసం, టాపిక్ డైవర్ట్ కాకూడదన్న ఉద్దేశంతో నా పర్యటనను వాయిదా వేసుకున్నాను.పూజలు చేయమని కోరుతున్నానురాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్సీపీ అభిమానులే కాదు, ప్రజలందరిని కోరుతున్నాను. చంద్రబాబు చేసిన పాపం వల్ల, వెంకటేశ్వరస్వామికి కోపం వచ్చి రాష్ట్రం మీద చూపకుండా, కోపం కేవలం చంద్రబాబుమీదే చూపించే విధంగా పూజలు చేయండి.ఎందుకంటే, జరిగింది ఘోర అపచారం. వెంకటేశ్వరస్వామిని పలచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ.. జరగనిది జరిగినట్లుగా.. జంతువుల కొవ్వు వాడనిది వాడినట్లుగా, ఆ లడ్డూలు పంపిణీ చేసినట్లుగా.. పచ్చి అబద్దాలు ఆడుతూ, ఇంత ఘోరం చేసిన వ్యక్తి. ఆ పాపం కడగబడాలి. అందుకే అందరినీ కోరుతున్నాను. పూజలు చేయమని వేడుకుంటున్నాను.ఏ మెస్సేజ్ ఇస్తున్నారు?బీజేపీవారిలో సిన్సియారిటీ ఉంటే, ఇంత ఘోరం చేసిన చంద్రబాబును రిప్రిమాండ్ చేయకుండా, టీటీడీ పేరు ప్రఖ్యాతలు మంట కలిపిన ఈ వ్యక్తిని ఎలా ఉపేక్షిస్తున్నారు? ఎందుకు బుద్ధి చెప్పడం లేదు? ఎందుకు మందలించడం లేదు?. చేసింది మన వాడే అనుకుని వదిలేస్తే.. ఏ మెసేజ్ ఇస్తున్నట్లు?మళ్లీ ఘోరమైన తప్పులు జరగొద్దు. అందుకు చంద్రబాబుకు తిట్లు పడాలి. మతాన్ని, దేవుణ్ని రాజకీయాల్లోకి తీసుకురాకుండా, ఆయనను మందలించాలి. సుప్రీంకోర్టు నుంచి ప్రధాని నుంచి పడాలి. అప్పుడైనా ఈ మనిషికి జ్ఞానం కలుగుతుందని శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు. -
#Devara : ఎన్టీఆర్ 'దేవర'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
మా కెరీర్ కు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్
-
‘జనక అయితే గనక’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
హీరో నాని ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
రాజ్ తరుణ్ ‘తిరగబడరసామీ’ సినిమా ప్రమోషన్ (ఫొటోలు)
-
చంద్రబాబు ఆటవిక పాలనను ఎండగడుతూ జగన్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
అప్పులపై తప్పుడు ప్రచారం.. అంత అధ్వానస్థితిలో చంద్రబాబు సర్కార్: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎటు వైపు వెళ్తుందో ఆలోచించాలని, పురోగతి వైపు వెళ్తుందా?.. తిరోగమనంలో వెళ్తోందా? గమనించాలని ఏపీ ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకాలు, చంద్రబాబు విడుదల చేస్తున్న అబద్ధపు శ్వేత పత్రాలు, వైఎస్సార్సీపీ హయాంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపై తాడేపల్లిలోని తన కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. ప్రశ్నించే వాళ్లను అణచివేసే ధోరణితో పాలన ముందుకు సాగుతోంది. విధ్వంస పాలన కొనసాగుతుంటే.. పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడు నెలల ఓటాన్ బడ్జెట్ పెడుతోంది. పూర్థిస్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం లేంటే ఎంతటి దారుణమైన, అధ్వానమైన పాలనో అర్థం చేసుకోవాలి. ఫుల్ బడ్జెట్ పెడితే చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఏమైతే ఇచ్చారో.. వాటికి కేటాయింపులు చూపించాల్సిన అవసరం వస్తుంది. అందుకే ఆ పని చేయడం లేదు. .. చంద్రబాబు అంటేనే వంచన, గోబెల్స్ ప్రచారం. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం దగ్గరి నుంచి ప్రజల్నిమోసం చేయడం దాకా అన్నింటా ఇదే జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని చంద్రబాబు గ్యాంగ్ ప్రచారం చేస్తోంది. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయ్యింది. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదని చంద్రబాబు అంటున్నారు. నిజంగా అయిపోతుందా? అయ్యిందా? గమనిస్తే.. .. ఎన్నికల సమయంలో రూ. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతూ.. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. ఇప్పుడు అధికారం వచ్చాక అది చూపించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. గవర్నర్ ప్రసంగం వరకు వచ్చే సరికి రూ.10 లక్షల కోట్ల అప్పు అయ్యిందని చూపించారు. శ్వేత పత్రాలతో మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. నిజంగా అది ఒకసారి గమనిద్దాం. ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ ప్రకారం గమనిస్తే.. వాస్తవానికి ఈ ఏడాది జూన్ దాకా, అదీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చేంత దాకా చూస్తే అప్పు రూ.5 లక్షల 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే. చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి రూ.2 లక్షల 72 వేల కోట్ల అప్పు ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో ఆ అప్పు రూ.5 లక్షల 18 వేల కోట్లకు చేరింది. గ్యారెంటీలు, విద్యుత్ ఒప్పందాలు కలిపినా రూ. 7లక్షల 48 వేల కోట్లు మాత్రమే. అయినా గవర్నర్ ప్రసంగంలో అబద్ధం చెప్పించారు. ఇలా రూ. 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ధర్మమా?. వాస్తవాలపై గవర్నర్‌కు లేఖ రాస్తాం. ఆయనతోనూ అబద్ధాలు చెప్పించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తాం. చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి రూ.7 వేల కోట్లకు పైగా ఖజానా సొమ్ము ఉంది. కానీ, మేం అధికారం చేపట్టేనాటికి రూ.100 కోట్లే ఉంది. ఆ విషయాన్ని ఈనాడు కూడా రాసింది. మేం అధికారంలో ఉండగా మేనిఫెస్టోలో ప్రతీ హామీని అమలు చేశాం. డీబీటీ ద్వారా బటన్ నొక్కి రూ.2.71 లక్షల కోట్లు లబ్ధిదారులకు జమ చేశాం. పార్టీ, ప్రాంతాలు కూడా చూడకుండా అందరికీ సంక్షేమం అందించాం. చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో 12.9 శాతం అప్పు చేశాం. కేంద్ర ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంది. అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమైనట్లు చిత్రీకరించడం ఎంత వరకు సమంజసం?. బడ్జెట్లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదు. అసలు లేని రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ధర్మమా?.చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో 12.9 శాతం అప్పు చేశాం. కేంద్రం ఇచ్చిన అనుమతుల కన్నా తక్కువ అప్పే చేశాం. కోవిడ్ టైంలోనూ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాం. ఆ టైంలో కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గింది. అయినా సంక్షేమం ఆపలేదు. ఈ లెక్కన ఎవరు ఆర్థికంగా ధ్వంసం చేసినట్లు? కేంద్ర ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంది. కేవలం.. బడ్జెట్లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదు. ఇదీ చదవండి: సామాన్యులపై కక్ష సాధింపు ఎందుకు?.. జగన్ సూటి ప్రశ్న -
ఐఫా-2024 ప్రెస్మీట్లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)
-
Sudheer Babu: కథలో నుంచి హీరో పుట్టాలి
‘‘నాకు కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టమే. కానీ హీరో కోసం కథలో ప్రత్యేకమైన కమర్షియల్ అంశాలు ఉండకూడదు. కథలో నుంచి హీరో పుట్టాలి. అలాంటి కథలను ఎంచుకోవడానికి ఇష్టపడతాను . ‘హరోం హర’ ఈ తరహా చిత్రమే. తెలుగు సినిమాలోని మొదటి పది యాక్షన్ సినిమాల్లో ఎప్పటికీ ‘హరోం హర’ ఉంటుందని నమ్ముతున్నాను. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’’ అని సుధీర్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సుధీర్‌బాబు పంచుకున్న విశేషాలు. ⇒ ఈ చిత్రంలో నా ΄ాత్ర పేరు సుబ్రహ్మణ్యం. కుప్పంలోని ఓ మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం. అక్కడో సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటి? సుబ్రహ్మణ్యం ఎందుకు గన్స్ మేకింగ్‌లోకి రావాల్సి వచ్చింది? అన్నదే ఈ చిత్రకథ. కథలో కొన్ని లేయర్స్ ఉన్నాయి. అందులో మైథాలజీ అంశాలు కూడా ఉన్నాయి. నాకు తెలుగు భాష వచ్చు కాబట్టి కుప్పం యాసలో డైలాగ్స్ చెప్పడం పెద్దగా కష్టం అనిపించలేదు. ⇒ జ్ఞానసాగర్ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇంత పెద్ద కథను చేయగలడా? అనిపించింది. కానీ నాకు చెప్పిన కథను చెప్పినట్లుగా విజువల్‌గా తెరపై చూపించాడు. ఈ విషయంలో అతనికి నూటికి నూరు మార్కులు వేస్తాను. అదే విధంగా ఇటీవలి కాలంలో తెలుగులో ‘హరోం హర’లాంటి సినిమా రాలేదని నా నమ్మకం. ఈ సినిమాలో ఓ సస్పెండెడ్ ΄ోలీస్ కానిస్టేబుల్ పళని ΄ాత్రను సునీల్‌గారు చేశారు. సుబ్రహ్మణ్యంకు స΄ోర్టివ్గా ఉండే ΄ాత్ర ఇది. ఈ సినిమా కథ డిమాండ్ చేసిన మేరకు ఖర్చు పెట్టారు నిర్మాత సుమంత్. ‘హరోం హర’కు సీక్వెల్ తీసే స్కోప్ ఉంది. స్టోరీ లైన్ ఉంది. అయితే ఈ సినిమా రిజల్ట్‌పై స్వీకెల్ ఆధారపడి ఉంటుంది. ⇒ జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్‌కి చాలా హెవీ వెపన్స్, గాడ్జెట్స్ తయారు చేస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ మన ఊర్లో ఉంటే, మన పక్కింటి కుర్రాడు గన్స్ తయారు చేయాల్సి వస్తే కొంచెం నాటుగా ఉంటుంది. అందుకే ‘హరోం హర’ సినిమాను జేమ్స్ బాండ్ బ్యాక్‌డ్రాప్ ఇన్ కుప్పం అనొచ్చు. ⇒ సూపర్‌స్టార్ కృష్ణగారు నన్ను మాస్ యాక్షన్ మూవీలు చేయమని చెప్పేవారు. ఆయన మంచి మాస్ హీరో. గతంలో నేను చేసినవి చాలావరకు క్లాస్ చిత్రాలు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే ‘హరోంహర’ నేను చేసిన మంచి యాక్షన్ మూవీ అని నమ్మకంగా చూపించేవాడిని. ⇒ నా గత చిత్రాల్లో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. అవి ‘హరోం హర’ సినిమాలో పునరావృతం కాకుండా చూసుకున్నానని అనుకుంటున్నాను. నా ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడతాను. అయితే కొన్నిసార్లు మనం ఊహించిన ఫలితాలు రాక΄ోవచ్చు. కానీ ఏదో ఒక మోటి వేషన్ను తీసుకుని ముందుకు వెళ్తుంటాను. -
సంపదను సృష్టించడం ముఖ్యం: ఏపీ సీఎం చంద్రబాబు
తిరుపతి, సాక్షి: మన దేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శమని, అలాంటి వ్యవస్థ కలకాలం ఉండాలని దేవుడ్ని ప్రార్థించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు, పార్టీ పరివారంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. 93 శాతం స్ట్రైక్‌రేట్‌తో ఇలాంటి విజయాన్ని ఎన్నడూ చూడలేదు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే ఈ విజయం సాధించాం. 2003లో వెంకటేశ్వరస్వామి నన్ను రక్షించారు. దేవాన్ష్ పుట్టినప్పటి నుంచి అన్నదానం పథకానికి విరాళం ఇస్తున్నాం. ఇప్పుడు వెంకటేశ్వరస్వామి ముందు సంకల్పం చేసుకుని ముందుకు వెళ్తాను... సంపదను సృష్టించడం ముఖ్యం. ఆ సంపద పేదలకు అందాలి. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. పేదరికం లేని సమాజం కోసం నిత్యం పని చేస్తాను. నేను అందరివాడిని.. ఐదు కోట్ల మందికి ప్రజాప్రతినిధిని. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. .. నేటి నుంచి ప్రజా పాలన మొదలైంది. రాజకీయం ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదు. మంచివారిని కాపాడుకోవాలి.. చెడ్డవారిని శిక్షించాలి. పరిపాలనలో ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తా. తిరుమల మొత్తం ప్రక్షాళన చేస్తాం. ఏపీని దేశంలోనే నెంబర్ వన్‌గా నిలబెడతా. మా కుటుంబానికి నేనీమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలవాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తిరుమల కొండపై రాజకీయాలు వద్దంటూ గగ్గోలు పెట్టిన టీడీపీ అండ్ కో.. ఇప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు తొలి ప్రెస్ మీట్‌పై ఏం సమాధానం చెబుతాయో చూడాలి. -
ఇటీవలే విడాకులు తీసుకున్న స్టార్ జంట.. మళ్లీ కలవడమేంటి?
ఏ జంట అయినా విడాకులు తీసుకుంటే దాదాపు కలవడానికి కూడా ఇష్టపడరు. ఎక్కడైనా పొరపాటున బయట ఎదురుపడినా పలకరించడం లాంటివి కూడా జరగవు. చాలా జంటలు విడాకుల తర్వాత కలిసి మాట్లాడుకోవడం జరిగే అవకాశం చాలా తక్కువ. మరీ విడాకుల తర్వాత ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది. అంతే కాదు ఏకంగా ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉంటుంది. అలాంటిదే తాజాగా జరిగింది. ఓ స్టార్ జంట తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.శాండల్‌వుడ్ జంట నివేద గౌడ, చందన్ శెట్టి ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఏడాది క్రితమే వీరిద్దరూ విడాకులకు పిటిషన్ వేయగా.. ఇటీవలే కోర్టు విడాకులు మంజూరు చేసింది. శాండల్‌వుడ్‌లో క్యూటెస్ట్ కపుల్‌గా పేరున్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో ఫ్యాన్స్ డివోర్స్ గల కారణాలపై తెగ ఆరా తీస్తున్నారు. చందన్ శెట్టి, నివేద గౌడ ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఏమిటి? ఇలాంటి విషయాలపై ప్రతిరోజూ అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.తాజాగా విడిపోయిన తర్వాత కూడా నివేద గౌడ, చందన్ శెట్టి సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ బెంగళూరులోని ఓ మాల్లో నిర్వహించే ప్రెస్మీట్లో తాము విడిపోవడానికి గల కారణాలను వివరించనున్నారు. ఈ సమావేశంలో చందన్ శెట్టి, నివేద గౌడ పాల్గొని విడాకులపై మాట్లాడనున్నారు. ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇవ్వనున్నారు.కాగా.. టిక్‌టాక్ స్టార్ నివేదా గౌడ బిగ్ బాస్ సీజన్- 5తో గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత రాపర్‌గా రాణిస్తున్న చందన్ శెట్టి.. నివేదా గౌడపై బొంబే బొంబే అనే పాట రాసి అందరినీ అలరించాడు. మైసూర్‌లోని జరిగిన దసరా వేడుకల్లో నివేద గౌడకు ప్రపోజ్ చేశాడు. అప్పట్లోనే అతని తీరు వివాదానికి దారితీసింది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వీరిద్దరు నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. -
విజయ్ సేతుపతి మహారాజా మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
సీత కళ్యాణ వైభోగమే మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
వరదరాజు గోవిందం మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
మంచి చేశాం.. ఊహించని ఫలితమిది.!: వైఎస్ జగన్
-
దేశవ్యాప్తంగా కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశాం
-
Watch Live: ఏపీ ఎన్నికల ఫలితాలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
-
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
-
బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోంది: కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం(మే11) తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.‘ప్రజాగ్రహం కాంగ్రెస్‌ను ముంచేయబోతోంది. కరెంటు విషయంలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. రెండు జాతీయ పార్టీలను మించి సీట్లు గెలవబోతున్నాం. చిల్లర రాజకీయాల కోసం టైమ్ వేస్ట్ చేశారు. కరెంట్‌ను ఎందుకు దెబ్బతీశారో అర్థం కావడం లేదు. నేనుండే చోట 7-8సార్లు కరెంటు పోయింది.పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాం గ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తారా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళతారా చూద్దాం. పైన తథాస్తు దేవతలు ఉంటారు. ఏదైనా జరగొచ్చు. కేసులు అటు ఇటైతే రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వెళతాడు. 26 నుంచి 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా వాళ్లతో టచ్‌లో ఉన్నారు. ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫాం చేద్దామంటున్నరు.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొన్ని అద్భుత పథకాలు తీసుకొచ్చారు. మహానుభావుడు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలను ప్రవేశ పెట్టారు’ అని కొనియాడారు. -
తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్
-
పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు
-
మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం
-
హత్యలకు కుట్రలు ఆధారాలతో పోసాని
-
Watch Live: మీడియాతో ఎంపీ అవినాష్‌రెడ్డి
-
సోలో బాయ్ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
కథ వినగానే మా నాన్న గుర్తొచ్చారు
‘‘మనకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ధైర్యం చెప్పే వ్యక్తి కుటుంబంలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో ఫ్యామిలీ స్టార్ మా నాన్న గోవర్ధన్. ‘ఫ్యామిలీ స్టార్’ కథ వింటున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు. అందుకే ఈ సినిమాలో హీరో పాత్రకి గోవర్ధన్ అనే పేరు పెట్టమని పరశురామ్‌కి చెప్పాను. ఈ నెల 8న మా నాన్న పుట్టినరోజు. ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నాను’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించారు. వాసు వర్మ క్రియేటివ్ ప్రోడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘రాజుగారి బ్యానర్లో నేను ‘కేరింత’ సినిమా ఆడిషన్‌కు వెళ్లి, సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ చేశాను. లాక్ డౌన్లో నా స్టాఫ్ జీతాలు, మెయింటెనెన్స్‌కి ఇబ్బంది కలిగింది. అప్పుడు రాజుగారే పంపించారు.. ఆయనకు సినిమా చేయాలని అప్పుడే అనుకున్నా. ఈ సినిమాకి నాకు పేరొస్తే ఆ క్రెడిట్ పరశురామ్‌కి ఇస్తాను’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘విజయ్, పరశురామ్ కలిసి ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ చేశారు. ‘ఫ్యామిలీ స్టార్’ కూడా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఏర్పడింది. విజయ్ ఈ సినిమాలో 360 డిగ్రీస్ క్యారెక్టర్ చేశాడు. నిర్మాతల గురించి ఆలోచించే హీరో విజయ్. అందుకే అతనితో మరో రెండు సినిమాలు చేయబోతున్నా’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ స్టార్’లో ఇందు పాత్రను పోషించగలనా? లేదా అని భయపడ్డాను. కానీ, విజయ్, ‘దిల్’ రాజు, డైరెక్టర్గార్లు సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు మృణాల్ ఠాకూర్. -
Family Star Press Meet: ‘ఫామిలీ స్టార్’ మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు
-
‘డీజే టిల్లు-2’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
సాయి ధరమ్ తేజ్ 'సత్య' ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
నందిగం సురేష్ బాబు ప్రెస్ మీట్
-
మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ లైవ్