సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (గురువారం) పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన మీడియా సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పరిస్థితులతో పాటు, ప్రజా సంబంధ అంశాలపై మీడియాతో ఆయన మాట్లాడనున్నారు.
రాష్ట్రంలో కూటమి పాలనలో అంతా అరాచకం సాగుతోంది. 9 నెలల్లోనే అన్ని వ్యవస్థలను నాశనం చేసేశారు. సూపర్ సిక్స్ సహా హామీల అమల్లోనూ చంద్రబాబు సర్కార్ విఫలమైంది. కూటమి నేతల ఆగడాలు నానాటికీ శ్రుతి మించిపోతున్నాయి. పట్టపగలే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కిడ్నాప్‌లు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఏపీలో రాజ్యాంగం బదులుగా రెడ్ బుక్ పాలన జరుగుతోంది.
విజయవాడ నగర పాలక సంస్థ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో వైఎస్ జగన్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్‌పై ఆయన మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మళ్లీ గెలుస్తుందని.. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు పరిపాలిస్తామన్నారు. ‘‘ఒక్కటే గుర్తు పెట్టుకొండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పని చేస్తుందో చూపిస్తాం.’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
‘‘జగనన్న1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటగా ప్రజలే గుర్తుకు వచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. వారి కోసమే నా టైం కేటాయించాను. ప్రజల కోసమే అడుగులు వేశాను. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. వారి అవస్థలను చూశాను. అందుకే ఆ కార్యకర్తల కోసం మీ జగన్ అండగా ఉంటాడు’’ అని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘ఛీ.. ఎన్టీఆర్ మాటకు తూట్లు పొడిచి మరీ!
Comments
Please login to add a commentAdd a comment