గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది.
బాబు మోసాలపై.. వైఎస్ జగన్ నిలదీత
- చంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రజలకు వివరిస్తాం
- ఎన్నికల టైంలో బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రచారం చేశారు
- ఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్పా?.. ముసలావిడ కూడా నొక్కుతుంది అని అన్నారు
- సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చారుఔ
- హామీలు గ్యారంటీ అని ఇంటింటికి బాండ్లు కూడా పంచారు
- అమలు చేయకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు
- 9 నెలల తర్వాత.. బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారెంటీ అని రుజువైంది
- ఆ మేనిఫెస్టోలు, బాండ్లు ఏమయ్యాయి?.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి?
అప్పుల్లో రికార్డు బద్ధలు
- 9 నెలల్లో చేసిన అప్పులు రికార్డు బద్ధలు కొట్టాయి
- బడ్జెటరీ అకౌఐంట్ అప్పులే రూ.80 వేల కోట్లు
- అమరావతి పేరు చెప్పి చేసిన రూ.52 వేల కోట్లు అప్పు చేశారు
- మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయి ద్వారా మరో రూ.8 వేల కోట్ల అప్పు
- ఏపీఎండీసీ ద్వారా మరో 5 వేల కోట్ల రూపాయల అప్పు
- మొత్తంగా 1 లక్ష 45 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు
- అన్ని అప్పులు చేసినా.. బటన్‌లు నొక్కారా? పేదలకు ఏమైనా ఇచ్చారా?
- 1,40,000 వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయి
పథకాలన్నీ ఆగిపోయి..
- గతప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలేమైనా అమలు చేస్తున్నారా?
- రైతు భరోసా, వసతి దీవెన పథకాలు నిలిచిపోయాయి
- మత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం.. ఇలా పథకాలన్నీ పోయాయి
- పిల్లలకు ట్యాబులు ఇచ్చే పథకం ఆగిపోయింది
ఉద్యోగాల్లేవ్
- ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలేవీ లేవు
- వలంటీర్లను ఎలా మోసం చేశామో చూశాం.
- వలంటీర్లకు రూ10 వేలు ఇస్తామని.. చేతులెత్తేశారు
- 2.60 లక్షల మంది వలంటీర్లను ఉద్యోగాల్లోంచి తీసేశారు
- బేవరేజెస్‌లో మరో 18 వేల ఉద్యోగాలు తీసేశారు
- పీఆర్సీ చైర్మన్‌తో బలవంతంగా రాజీనామా చేయించారు
- ఐఆర్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారు?
- ఉద్యోగులకు మూడు డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి
- ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉద్యోగ హామీలు ఏమయ్యాయి?
- ఏ నెల ఒకటో తారీఖు జీతాలిస్తున్నారో చెప్పాలి
ఆర్థిక విధ్వంసం అంటే ఇదే..
- ఏపీ అభివృద్ధికోసం మా హయాంలో నాలుగు పోర్టులు నిర్మించాం
- రామాయపట్నం పోరర్టును 75 శాతం పూర్తి చేశాం
- పది పిషింగ్ హార్బర్‌ల నిర్మాణం కూడా చేపట్టాం
- రెండు హార్బర్‌లను మా హయాంలోనే ప్రారంభించాం.
- మరో హార్బర్‌ను ఈ మధ్యే ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించాం
- కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం
- ఇవన్నీ రాబోయే తరాలకు రాబడి పెంచేందుకు ఏర్పరిచిన ఆస్తులు
- బాబు అధికారంలోకి వచ్చాక ఆస్తులన్నింటిని అమ్మేస్తున్నారు
- మెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారు
- జీఎల్‌ఐ, జీపీఎఫ్‌కూడా చంద్రబాబే వాడేసుకుంటున్నారు
- ఆర్థిక విధ్వంసం అంటే ఇదే
- చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. తన ఆస్తులు, తన వాళ్ల ఆస్తులు పెంచుకోవడమే
- ఇందుకోసం స్కామ్‌లు చేస్తున్నారు
సంపద సృష్టి చంద్రబాబు జేబులో జరుగుతోంది
- ఇసుక స్కాంలు జరుగుతున్నాయి
- మా హయాంలో కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు
- ప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం షాపులు ప్రైవేయిటైజ్ చేశారు
- ఆ వ్యవహారం ఎలా సాగిందో రాష్ట్రం మొత్తం చూసింది
- పైగా లిక్కర్ స్కాంలో ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్‌ను చంద్రబాబు తిడతారు
- ఇసుక, మద్యం, ఫ్లై యాష్.. ఇలా అన్ని మాఫియాలే
- ప్రతీ నియోజకవర్గంలో.. మండలంలో, గ్రామంలో పేకాట క్లబ్‌లు నడిపిస్తున్నారు
- పెద్ద బాబు, చిన్నబాబు ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తున్నాయి
- పెద్దబాబుకి ఇంత, చిన్నబాబుకి ఇంత, దత్త పుత్రుడికి ఇంత అని నడుస్తోంది వ్యవహారం
- అలా అయితేనే వ్యాపారాలే నడిచేది
- రివర్స్ టెండరింగ్ రద్దు చేశారు
- కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చే కార్యక్రమంలో.. మొబైల్ అడ్వాన్స్‌ల పేరుతో అన్యాయాలకు తెర తీశారు
- ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంటే.. చంద్రబాబు ఆదాయం పెరుగుతోంది
ఇంక ఆదాయం ఎందుకొస్తది?
- ఇవన్నీ జరుగుతున్నాయి గనుకే సంపద సృష్టి జరగడం లేదు
- రాష్ట్ర ఆదాయం ఆవిరి అవుతోంది
- ఇన్ని జరుగుతున్నా.. చంద్రబాబును ఎవరూ ప్రశ్నించడం లేదు
- కారణం.. రెడ్‌బుక్ రాజ్యాంగం
- ప్రశ్నించేవారిని వేధిస్తున్నారు
- సంపాదించే మార్గం ఉంటే నా చెవిలో చెప్పమని చంద్రబాబు అంటున్నారు
- అన్నీ తెలిసి ప్రజలకు మాటిచ్చిన చంద్రబాబు.. ప్రశ్నించే వారితో వెటకారంగా మాట్లాడుతున్నారు
- మోసాల్లో పీహెచ్‌డీ చేసిన చంద్రబాబు.. నటనలోనూ మేటి
నటనలో బాబుకి అవార్డు ఇవ్వాల్సిందే!
- తాను ఇచ్చిన హామీలు ఎగొట్టి.. ఆవేదన వ్యక్తం చేశారు
- పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుందని అంటాడు
- రాష్ట్రం ధ్వంసం అయిపోయిందని అంటాడు
- నటనలో చంద్రబాబుకే అవార్డు ఇస్తే బాగుంటుంది.. ఆ స్థాయిలో నటిస్తారాయన
- చంద్రబాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని ఎన్నికల టైంలో చెప్పా
- పులి నోట్లో తలపెట్టడమే అని మొత్తుకున్నా
- అయినా ప్రజలు పొరపాటు పడ్డారు..
- చంద్రబాబు మోసాలను, చంద్రముఖిని నిద్రలేపి ప్రజలు బాధపడుతున్నారు
- స్లో పాయిజన్ లాగా.. చంద్రబాబు అబద్ధాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారు
- అందుకు వాళ్ల అనుకూల మీడియా పని చేస్తుంటుంది
ఎవరి హయాంలో ఏం జరిగిందంటే..
- 2014-19, 2019-2024 మధ్య ఉన్న రెండు ప్రభుత్వాల ఆర్థిక పురోగతిని పోల్చి చూస్తే..
- గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు వక్రీకరణ చేస్తున్నారు
- రాష్ట్రం ధ్వంసం అయిపోయిందంటూ నటిస్తున్నారు
- వైఎస్సార్‌సీపీ, గత టీడీపీ ప్రభుత్వాల మధ్య తేడాలు పోల్చి చూద్దాం
- కాగ్ నివేదికలే ఇందుకు ఉదాహరణ
- మా హయాంలోనే కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయి.. రెండేళ్లు కొనసాగాయి
- చంద్రబాబు హయాంలో 2014-19 మధ్య మూల ధన రూ.13, 860 కోట్లు
- మా హయాంలో మూల ధన వ్యయం రూ. 15,632 కోట్లు
- సోషల్ సర్వీసెస్ మూల ధన వ్యయం కింద రూ. 2 వేలు కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టింది
- మా హయాంలో సోషల్ సర్వీసెస్ మూల ధన వ్యయం కింద రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం
- తలసరి ఆధాయంలో చంద్రబాబు ప్రభుత్వంలో 18వ స్థానంలో ఉంటే.. మా హయాంలో 15వ స్థానానికి పెరిగాం
- బాబు హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా 4. 47 శాతం ఉంది.
- వైఎస్సార్‌సీపీ హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా రాష్ట్ర వాటా 4.80కి పెరిగింది.
- 2018-19 మధ్య పారిశ్రామిక రంగంలో ఏపీ 11 స్థానంలో ఉంది
- మా హయాంలో పారిశ్రామిక రంగంలో 9వ స్థానానికి ఎదిగాం
- చంద్రబాబు హయాంలో కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉంది
- మా హయాంలో దేశ జీడీపీతో పోటీ పడి మెరుగైన ఫలితాలు సాధించాం
- ఈ డాటా ఆధారంగా.. ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగాయో చంద్రబాబు చెప్పాలి
- రాష్ట్రం ఎవరి హయాంలో ఏపీ ఆర్థిక పురోగతి సాధించిందో, ప్రజలు బాగుపడ్డారో గుర్తించాలి
- ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిందే తప్పా.. ఏనాడూ ఆయన హయాంలో జరిగింది చంద్రబాబు ఏనాడూ చెప్పరు
- చంద్రబాబు హయాంలోనే ఆర్థిక విధ్వంసం జరిగింది.. జగన్ హయాంలో చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించే ప్రయత్నం జరిగింది
అప్పుల గురించి పరిశీలిస్తే..
- చంద్రబాబువన్నీ అబద్ధాలు, మోసాలే
- మా హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ చంద్రబాబు ఆరోపణలకు చేశారు
- రూ.14 లక్షల కోట్ల అప్పులున్నాయంటూ ఊదరగొట్టారు
- ఎన్నికల ముందు.. ఏపీ శ్రీలంక అయిపోతుందని బండలు వేశారు
- గవర్నర్ ప్రసంగం వచ్చేసరికి ఆ అప్పుల లెక్క తగ్గిపోయింది
- శ్వేత పత్రాల సమయంలో మరికొంత తగ్గింది(రూ.12 లక్షల కోట్లు)
- చివరాఖరికి తప్పని పరిస్థితుల్లో.. దేశంలో ఎక్కడాల లేని విధంగా నవంబర్‌లో ప్రవేశపెట్టారు
- బడ్జెట్ పెడితే.. అందులోనూ ఆ లెక్కలు మరింత తగ్గాయి
- చివరకు.. అప్పుల లెక్కలతో తాను అబద్ధం చెప్పానని ఒప్పుకున్నారు(రూ.6 లక్షల కోట్లు)
ఇదీ చదవండి: జగన్ 2.0.. ఎలా పని చేస్తానో చూపిస్తా!
Comments
Please login to add a commentAdd a comment