TDP Atrocities
-
‘జగన్ రాజకీయాన్ని టీడీపీవాళ్లే మెచ్చుకున్నారు’
గుంటూరు, సాక్షి: తొమ్మిది నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో చేసిన విధ్వంసాలు అన్నీ ఇన్నీ కావని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీలో కూటమి అరాచక పాలనపై, సంక్షేమ పథకాలు ఆగిపోవడంపై, అలాగే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపైనా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బాబు మోసాలపై.. వైఎస్ జగన్ నిలదీతచంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రజలకు వివరిస్తాంఎన్నికల టైంలో బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రచారం చేశారుఎన్నికల ముందు బటన్ నొక్కడం పెద్ద గొప్పా?.. ముసలావిడ కూడా నొక్కుతుంది అని అన్నారుసూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చారుఔహామీలు గ్యారంటీ అని ఇంటింటికి బాండ్లు కూడా పంచారుఅమలు చేయకపోతే చొక్కా పట్టుకోండి అన్నారు9 నెలల తర్వాత.. బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారెంటీ అని రుజువైందిఆ మేనిఫెస్టోలు, బాండ్లు ఏమయ్యాయి?.. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి?అప్పుల్లో రికార్డు బద్ధలు9 నెలల్లో చేసిన అప్పులు రికార్డు బద్ధలు కొట్టాయి బడ్జెటరీ అకౌఐంట్ అప్పులే రూ.80 వేల కోట్లుఅమరావతి పేరు చెప్పి చేసిన రూ.52 వేల కోట్లు అప్పు చేశారుమార్క్ఫెడ్, సివిల్ సప్లయి ద్వారా మరో రూ.8 వేల కోట్ల అప్పుఏపీఎండీసీ ద్వారా మరో 5 వేల కోట్ల రూపాయల అప్పుమొత్తంగా 1 లక్ష 45 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారుఅన్ని అప్పులు చేసినా.. బటన్లు నొక్కారా? పేదలకు ఏమైనా ఇచ్చారా?1,40,000 వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయిపథకాలన్నీ ఆగిపోయి.. గతప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలేమైనా అమలు చేస్తున్నారా?రైతు భరోసా, వసతి దీవెన పథకాలు నిలిచిపోయాయిమత్స్యకార భరోసా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం.. ఇలా పథకాలన్నీ పోయాయిపిల్లలకు ట్యాబులు ఇచ్చే పథకం ఆగిపోయిందిఉద్యోగాల్లేవ్ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఉద్యోగాలేవీ లేవువలంటీర్లను ఎలా మోసం చేశామో చూశాం.వలంటీర్లకు రూ10 వేలు ఇస్తామని.. చేతులెత్తేశారు2.60 లక్షల మంది వలంటీర్లను ఉద్యోగాల్లోంచి తీసేశారుబేవరేజెస్లో మరో 18 వేల ఉద్యోగాలు తీసేశారుపీఆర్సీ చైర్మన్‌తో బలవంతంగా రాజీనామా చేయించారుఐఆర్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారు?ఉద్యోగులకు మూడు డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయిఎన్నికలకు ముందు ఇచ్చిన ఉద్యోగ హామీలు ఏమయ్యాయి?ఏ నెల ఒకటో తారీఖు జీతాలిస్తున్నారో చెప్పాలిఆర్థిక విధ్వంసం అంటే ఇదే.. ఏపీ అభివృద్ధికోసం మా హయాంలో నాలుగు పోర్టులు నిర్మించాంరామాయపట్నం పోరర్టును 75 శాతం పూర్తి చేశాంపది పిషింగ్ హార్బర్ల నిర్మాణం కూడా చేపట్టాంరెండు హార్బర్లను మా హయాంలోనే ప్రారంభించాం. మరో హార్బర్‌ను ఈ మధ్యే ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించాం కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాంబాబు అధికారంలోకి వచ్చాక ఆస్తులన్నింటిని అమ్మేస్తున్నారుమెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారు ఇవన్నీ రాబోయే తరాలకు రాబడి పెంచేందుకు ఏర్పరిచిన ఆస్తులువీటన్నింటిని ప్రవేట్ పరం చేయాలని చూస్తున్నారు.. ఇది పెద్ద స్కాంజీఎల్ఐ, జీపీఎఫ్కూడా చంద్రబాబే వాడేసుకుంటున్నారుఆర్థిక విధ్వంసం అంటే ఇదేచంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. తన ఆస్తులు, తన వాళ్ల ఆస్తులు పెంచుకోవడమేఇందుకోసం స్కామ్‌లు చేస్తున్నారుసంపద సృష్టి చంద్రబాబు జేబులో జరుగుతోందిఇసుక స్కాంలు జరుగుతున్నాయిమా హయాంలో కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారుప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం షాపులు ప్రైవేయిటైజ్ చేశారుఆ వ్యవహారం ఎలా సాగిందో రాష్ట్రం మొత్తం చూసిందిపైగా లిక్కర్ స్కాంలో ఢిల్లీకి వెళ్లి కేజ్రీవాల్‌ను చంద్రబాబు తిడతారు ఇసుక, మద్యం, ఫ్లై యాష్.. ఇలా అన్ని మాఫియాలేప్రతీ నియోజకవర్గంలో.. మండలంలో, గ్రామంలో పేకాట క్లబ్‌లు నడిపిస్తున్నారుపెద్ద బాబు, చిన్నబాబు ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తున్నాయిపెద్దబాబుకి ఇంత, చిన్నబాబుకి ఇంత, దత్త పుత్రుడికి ఇంత అని నడుస్తోంది వ్యవహారంఅలా అయితేనే వ్యాపారాలే నడిచేదిరివర్స్ టెండరింగ్ రద్దు చేశారుకాంట్రాక్టర్లకు పనులు ఇచ్చే కార్యక్రమంలో.. మొబైల్ అడ్వాన్స్‌ల పేరుతో అన్యాయాలకు తెర తీశారుప్రభుత్వ ఆదాయం తగ్గుతుంటే.. చంద్రబాబు ఆదాయం పెరుగుతోందిఇంక ఆదాయం ఎందుకొస్తది?ఇవన్నీ జరుగుతున్నాయి గనుకే సంపద సృష్టి జరగడం లేదురాష్ట్ర ఆదాయం ఆవిరి అవుతోందిఇన్ని జరుగుతున్నా.. చంద్రబాబును ఎవరూ ప్రశ్నించడం లేదుకారణం.. రెడ్‌బుక్ రాజ్యాంగంప్రశ్నించేవారిని వేధిస్తున్నారుసంపాదించే మార్గం ఉంటే నా చెవిలో చెప్పమని చంద్రబాబు అంటున్నారుఅన్నీ తెలిసి ప్రజలకు మాటిచ్చిన చంద్రబాబు.. ప్రశ్నించే వారితో వెటకారంగా మాట్లాడుతున్నారుమోసాల్లో పీహెచ్డీ చేసిన చంద్రబాబు.. నటనలోనూ మేటినటనలో బాబుకి అవార్డు ఇవ్వాల్సిందే!తాను ఇచ్చిన హామీలు ఎగొట్టి.. ఆవేదన వ్యక్తం చేశారుపరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుందని అంటాడురాష్ట్రం ధ్వంసం అయిపోయిందని అంటాడునటనలో చంద్రబాబుకే అవార్డు ఇస్తే బాగుంటుంది.. ఆ స్థాయిలో నటిస్తారాయనచంద్రబాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే అని ఎన్నికల టైంలో చెప్పాపులి నోట్లో తలపెట్టడమే అని మొత్తుకున్నాఅయినా ప్రజలు పొరపాటు పడ్డారు.. చంద్రబాబు మోసాలను, చంద్రముఖిని నిద్రలేపి ప్రజలు బాధపడుతున్నారుస్లో పాయిజన్ లాగా.. చంద్రబాబు అబద్ధాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారుఅందుకు వాళ్ల అనుకూల మీడియా పని చేస్తుంటుందిఎవరి హయాంలో ఏం జరిగిందంటే.. 2014-19, 2019-2024 మధ్య ఉన్న రెండు ప్రభుత్వాల ఆర్థిక పురోగతిని పోల్చి చూస్తే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు వక్రీకరణ చేస్తున్నారురాష్ట్రం ధ్వంసం అయిపోయిందంటూ నటిస్తున్నారువైఎస్సార్సీపీ, గత టీడీపీ ప్రభుత్వాల మధ్య తేడాలు పోల్చి చూద్దాంకాగ్ నివేదికలే ఇందుకు ఉదాహరణమా హయాంలోనే కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయి.. రెండేళ్లు కొనసాగాయిచంద్రబాబు హయాంలో 2014-19 మధ్య మూల ధన రూ.13, 860 కోట్లుమా హయాంలో మూల ధన వ్యయం రూ. 15,632 కోట్లుసోషల్ సర్వీసెస్ మూల ధన వ్యయం కింద రూ. 2 వేలు కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టిందిమా హయాంలో సోషల్ సర్వీసెస్ మూల ధన వ్యయం కింద రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం తలసరి ఆధాయంలో చంద్రబాబు ప్రభుత్వంలో 18వ స్థానంలో ఉంటే.. మా హయాంలో 15వ స్థానానికి పెరిగాంబాబు హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా 4. 47 శాతం ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా రాష్ట్ర వాటా 4.80కి పెరిగింది.2018-19 మధ్య పారిశ్రామిక రంగంలో ఏపీ 11 స్థానంలో ఉందిమా హయాంలో 2023-2024 నాటికి.. పారిశ్రామిక రంగంలో 9వ స్థానానికి ఎదిగాంచంద్రబాబు దిగిపోయేనాటికి.. జీడీపీ కంటే కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు ఎక్కువగా ఉందిమా హయాంలో దేశ జీడీపీతో పోటీ పడి మెరుగైన ఫలితాలు సాధించాంఈ డాటా ఆధారంగా.. ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగాయో చంద్రబాబు చెప్పాలిరాష్ట్రం ఎవరి హయాంలో ఏపీ ఆర్థిక పురోగతి సాధించిందో, ప్రజలు బాగుపడ్డారో గుర్తించాలిఎప్పుడూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిందే తప్పా.. ఏనాడూ ఆయన హయాంలో జరిగింది చంద్రబాబు ఏనాడూ చెప్పరుచంద్రబాబు హయాంలోనే ఆర్థిక విధ్వంసం జరిగింది.. జగన్ హయాంలో చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించే ప్రయత్నం జరిగింది అప్పుల గురించి పరిశీలిస్తే.. చంద్రబాబువన్నీ అబద్ధాలు, మోసాలేఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం చేశారుమా హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ చంద్రబాబు ఆరోపణలకు చేశారురూ.14 లక్షల కోట్ల అప్పులున్నాయంటూ ఊదరగొట్టారుఎన్నికల ముందు.. ఏపీ శ్రీలంక అయిపోతుందని బండలు వేశారుగవర్నర్ ప్రసంగం వచ్చేసరికి ఆ అప్పుల లెక్క తగ్గిపోయింది(రూ.10 లక్షల కోట్లు)శ్వేత పత్రాల సమయంలో మళ్లీ లెక్కలు మారాయి(రూ.12 లక్షల కోట్లు)చివరాఖరికి తప్పని పరిస్థితుల్లో.. దేశంలో ఎక్కడాల లేని విధంగా నవంబర్‌లో ప్రవేశపెట్టారుబడ్జెట్ పెడితే.. అందులోనూ ఆ లెక్కలు మరింత తగ్గాయి14 లక్షల కోట్ల నుంచి మొదలై.. చివరకు 6 లక్షల కోట్ల రూపాయల దగ్గర ఆగిపోయారుచివరకు.. బడ్జెట్లో అప్పుల లెక్కలతో తాను అబద్ధం చెప్పానని చంద్రబాబు ఒప్పుకున్నారుఅలాంటప్పుడు ఆదాయం ఎందుకు తగ్గింది?చంద్రబాబు హయాంలో రూ.31 వేల కోట్ల అదనపు అప్పులు చేశారుమా హయాంలో రూ.17 వేల కోట్ల అప్పుల భారం తగ్గించాంజూన్ డిసెంబర్ మధ్య ఆదాయం రూ.50 వేల కోట్లుఈ నెలల్లో 0.51 నెగెటివ్ గ్రోత్ వచ్చిందిచంద్రబాబు మాత్రం 13 శాతం జీఎస్డీపీ పెరిగిందని అంటున్నారుజీఎస్డీపీ పెరిగితే ఆదాయం ఎందుకు తగ్గుతుంది?బాబు బిల్డప్‌కు ఈనాడు బాకాఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆయనకేం కొత్త కాదుతప్పుడు ప్రచారం చేయడం ఆయనకు అలవాటే దావోస్ పర్యటనలకు వెళ్లి.. ఎన్నో అబద్ధాలు చెప్పారుఏవోవో కంపెనీలు వస్తున్నాయంటూ ప్రకటనలు ఇచ్చారుఆయన బిల్డప్లకు.. ఈనాడు మామూలు ఎలివేషన్లు ఇవ్వదుఏ తల్లిదండ్రులు తమ పిల్లలకు అబద్ధాలు ఆడమని చెప్పరునిజాయితీగా బతకమని చెప్తారుచంద్రబాబు తన కొడుకు దగ్గరి నుంచి మొదలుపెడితే పార్టీలో ఉన్న అందరికీ.. అందరికీ అబద్ధాలు ఆడమని, వెన్నుపోటు పొడవమని చెబుతుంటారు దావోస్‌లో ఒక్క ఎంవోయూ కుదర్చుకోలేదుపరిశ్రమలు ఇక్కడికి వద్దామనుకుంటే .. పెట్టుబడిదారులను భయపెట్టి, కేసులు పెట్టి.. బెదరగొట్టి.. వెళ్లిపోయేలా చేశారుపక్క రాష్ట్రాలు వాళ్లతో ఎంవోయూలు చేసుకున్నారుపరిశ్రమలను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు?జిందాల్ లాంటి వ్యక్తులను భయపడితే.. వాళ్లు మరో 10 మందికి చెప్పరా?పైగా మా హయాంలో చేసిన ఒప్పందాలను.. ఇప్పుడు తాను చేసినట్లు చంద్రబాబు ప్రచారం చేయించుకుంటున్నారు12 మంది ఎంపీలున్న బీహార్.. బడ్జెట్లో ఎన్నో సాధించుకుందిబడ్జెట్లో ఏపీకి ఏం సాధించారు?కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు సాధించింది ఏదీ లేదుకేంద్ర బడ్జెట్లో చంద్రబాబు ఏం సాధించుకోకపోగా.. ఉన్న పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారుచంద్రబాబు పలుకుబడి ఏపాటిదో ఇక్కడే అర్థమవుతోందిఇది విధ్వంసం కాదా?చంద్రబాబు విధ్వంసాలు అన్నీ విన్నీ కావుఇది విధ్వంసం కాదా?పిల్లలను బడులకు పంపేలా తీసుకొచ్చిన అమ్మ ఒడి ఆపేశారుస్కూళ్లలో నాడు నేడు పనులు ఆపేశారుఇంగ్లీష్ మీడియంకు పిల్లలను దూరం చేస్తున్నారుట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఆపేశారువసతి దీవెనను ఆపేసి, విద్యా దీవెన అరకోరగా అమలు చేయడం.. పిల్లల భవిష్యత్తును నాశనం చేయడం విధ్వంసం కాదా?ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశారు.. ఇది విధ్వంసం కాదా?చేయుత, ఆసరా పథకాలను ఆపేయడం.. విధ్వంసం కాదా?అన్ని వర్గాలకు ఆర్థిక తోడ్పాడు అందించిన సంక్షేమ పథకాలు ఆపేయడం.. విధ్వంసం కాదా?ఉద్యోగాలివ్వకుండా.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడం .. విధ్వంసం కాదా?ప్రభుత్వ ఉద్యోగులతో ఆడుకోవడంరాష్ట్ర ఆదాయం కాకుండా.. తన జేబును పెంచుకునే స్కాంలు చేయడం విధ్వంసం కాదా?రెడ్‌బుక్ రాజ్యాంగంతో గవర్నరెన్స్.. విధ్వంసం కాదా?ప్రశ్నిస్తే దాడులు చేయడం.. విధ్వంసం కాదా?ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు తిరుపతిలో.. ఉప ఎన్నికల టైంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసిందిఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది?వైఎస్సార్సీపీ వాళ్లను బెదిరించి.. పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేశారుఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేశారుచివరకు.. వాళ్లకు వాళ్లే గెలిచినట్లు ప్రకటించారుఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేమా హయాంలో తాడిపత్రిలో ఎన్నికల పారదర్శకంగా జరిపాంటీడీపీ 2 స్థానాల్లో ఎక్కువగా ఉన్న జగన్ ఏం రాజకీయం చేశారో చూడాలిహ్యాట్సాఫ్ జగన్ అని అక్కడి టీడీపీ ఇంఛార్జి చెప్పారుఅధికార బలం ఉందని దోచేయడం దుర్మార్గంహిందూపురంలో జరిగింది చూశాం చంద్రబాబు బావమరిది(బాలకృష్ణను ఉద్దేశించి..) కన్నుసన్నల్లోనే ఎన్నికల జరిగిందిఏదో గొప్పగా సాధించామని ఆయన చెప్పుకుంటున్నారు.. అందుకు సిగ్గుపడాలినందిగామలో ఓ మంత్రి కార్పొరేట్ల ఇంటికి వెళ్లి బెదిరించారుఅలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు? నేరుగా డిక్లేర్ చేసుకోవచ్చు కదా ఆరోజులు త్వరలోనే..జమిలి ఎన్నికలు వస్తున్నాయంటున్నారుఅవి ఎంత త్వరగా వస్తే.. చంద్రబాబును అంత త్వరగా పంపించేయాలని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారుఏపీలో ప్రశ్నించే స్వరాలు పెరిగాయిచొక్కాలు పట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయిప్రజలను వీళ్లను తరిమికొట్టే రోజులు వచ్చే అవకాశం ఉందిలిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం?రాష్ట్రంలో లేని పరిస్థితులు.. ఉన్నట్లు చంద్రబాబు ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారుప్రజా సమస్యలు చెప్పేందుకు చట్ట సభల్లో సమయం ఇవ్వడం లేదు.. అందుకే మీడియా ముందుకు రావాల్సి వస్తోందివైఎస్సార్సీపీ 2.0 పాలన.. కార్యకర్తలకు భరోసా ఇస్తుందని మళ్లీ చెబుతున్నా‘పెద్ద’రెడ్డి.. అంటూ ఈనాడు కథనాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి ఏం సంబంధం?మిథున్ రెడ్డి పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్.. ఆయన తండ్రిది ఏ శాఖ?.. లిక్కర్కేసుతో వాళ్లకేం సంబంధం?ఎవరైనా ఎందుకు డబ్బులు ఇస్తారు? మద్యం రేట్లు మేం పెంచామా?మద్యం బేసిక్ రేట్లు పెంచి.. సరఫరా తగ్గించిన నాకు లంచాలు ఇస్తారా?రేట్లుఉ పెంచి సరఫరా పెంచిన చంద్రబాబుకి మాముళ్లు ఇస్తారా?నాలాగా చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నారు?నాకు డబ్బుపై వ్యామోహం లేదు.. అందుకే డీబీటీతో రెండున్నర లక్షల కోట్ల రూపాయాలు సంక్షేమానికి ఖర్చు చేశాకమీషన్లు ఉండవు కాబట్టే చంద్రబాబు బటన్ నొక్కరు ఎవరో ఒకర్ని ఇరికించడం.. కేసు పెట్టడం వాళ్లు చేస్తోంది ఇప్పుడువిశ్వసనీయత ఉండాలి.. అది ఎవరికైనా!రాజకీయాల్లో క్రెడిబిలిటీ ఉండాలిఫలానా వాళ్లు మా నాయకులని కాలర్ ఎగరేసుకునేలా ఉండాలిబయటకు వెళ్లే ప్రతీ రాజ్యసభ సభ్యుడికి విశ్వసనీయత ఉండాలిభయపడో, ప్రలోభాలకు లొంగోలేకుంటే రాజీపడి అటు పోతే విశ్వసనీయత సంగతి ఏంటి?రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి. ఐదేళ్లు కష్టపడితే మన టైం వస్తుందివిశ్వసనీయత ముఖ్యం.. అది ఎవరికైనా వర్తిస్తుందిలంచాలు లేకుండా ప్రజలకు సంక్షమ పథకాలు అందించాందేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్సార్సీపీ నిలబడిందిస్పీకర్ కోర్టుకు స్పందించడం లేదుఅసెంబ్లీ సమావేశాలను మేం బహిష్కరించలేదుకోర్టుకు వెళ్లాంస్పీకర్ ఎందుకనో కోర్టుకు స్పందించడం లేదుఅన్ని ప్రశ్నలకు వాళ్లే సమాధానం చెప్పాలిఅసెంబ్లీకి వైఎస్సార్సీపీ ఎందుకు వెళ్లడం లేదో.. ఇక స్పీకరే చెప్పాలిజిల్లా పర్యటనల గురించి.. కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలే అవుతోంది జిల్లాల పర్యటనలకు ఇంకా టైం ఉంది ఇదీ చదవండి: జగన్ 2.0.. ఎలా పని చేస్తానో చూపిస్తా! -
విజయవాడ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
గుంటూరు, సాక్షి: విజయవాడ వైఎస్సార్సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను చర్చిస్తున్నారు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఎలాంటి కుట్రలకు దారి తీసిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లలో ఆందోళన నెలకొనగా, వారికి భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారాయన. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే.. వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లతో పాటు మేయర్ భాగ్యలక్ష్మి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, పోతిన మహేష్ తదితరులు హాజరయ్యారు. -
దిక్కుమాలిన పాలన.. 40 ఏళ్ల అనుభవం ఇదేనా చంద్రబాబూ?
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసలు ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసిందని, కూటమి నేతల అరాచకాలపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారాయన. తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై హత్యాయత్నం జరగడంపై ఆయన తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుపతి ఎన్నికలను వాయిదా వేయాలి. ప్రశాంత వాతావరణం లేనప్పుడు ఎన్నికలు నిర్వహించవద్దు. దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికల వ్యవస్థను టీడీపీ అపహాస్యం చేసింది. అలాంటప్పుడు ఇక ఎన్నికలు నిర్వహించటం ఎందుకు?. ఈ పరిస్థితులపై నిన్ననే మేము ఈసీని కలిసి ఫిర్యాదు చేశాం. పోలీసు బలగాలను పెంచాలని కోరాం. మా కార్పొరేటర్లను కాపాడాలని కోరినా ఫలితం లేదు. ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రోడ్డుపైకి ఎలా వస్తారు?. వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారు?. ఏపీలో దిక్కుమాలిన పాలన కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ గుర్తు మీద గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను టీడీపీ తమ వైపు నిస్సిగ్గుగా లాక్కుంటోంది. ప్రలోభాలకు గురిచేయటం, బెదిరించటం, దాడులకు పాల్పడటం అనే మూడు ప్లాన్లతో వ్యవహరిస్తున్నారు. తిరుపతిలో మా కార్పొరేటర్లపై దాడి చేశారు. మావాళ్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారు. బీసీ వర్గానికి చెందిన మేయర్ శిరీష మీద దాడికి యత్నించారు. ఆ బస్సులో మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ఎస్సీ ఎంపీ గురుమూర్తి మీద దాడికి యత్నించారు. తిరుపతి ప్రతిష్టను మళ్లీ దిగజార్చారుతిరుపతి ప్రతిష్టను మరోసారి టీడీపీ నేతలు దిగజార్చారు. మొన్న లడ్డూ వ్యవహారం, గతంలో అమిత్‌షా పై దాడి చేశారు. ఇప్పుడు పట్టపగలే తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక నగరానికి ఉన్న ప్రతిష్టకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది.నిన్న ఈసీని కలిసి కూటమి అరాచకాలపై ఫిర్యాదు చేశాం. పోలీసులపై నమ్మకం లేదని చెప్పాం. ఈరోజు జరిగిన దాడులపై మళ్ళీ ఈసీని కలుస్తాం. కూటమి అరాచకాలను అరికట్టాలని కోరతాం అని అప్పిరెడ్డి అన్నారు. -
Human Rights: నోరు తెరవొద్దు.. పోస్టులు పెట్టొద్దు!
ప్రపంచమంతా మానవ హక్కుల దినోత్సవం నిర్వహించుకుంటున్న వేళ(డిసెంబర్ 10న).. ఏపీలో మాత్రం ఆ హక్కులు ఊసేలేకుండా పోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం పెంచుకున్న పగను.. అధికారంలోకి రాగానే వెల్లగక్కడం మొదలుపెట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే రాష్ట్ర శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేశారు. ఫలితంగానే.. గత ఆరు నెలలుగా దాడులు, హత్యలు, అత్యాచారాలకు నిలయంగా మారింది. భద్రత కరువైన వేళ బతుకుజీవుడా అనుకుంటూ కొందరు ఏపీని విడిచి వెళ్లిపోతుండగా.. ప్రభుత్వ వేధింపులు భరించలేక మరికొందరు బలవనర్మరణాలకు పాల్పడ్డారు.ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్ఛగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరులను సైతం వదలకుండా దాడులకు తమ శ్రేణులను ఉసిగొల్పింది కూటమి. ఇక.. పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక.. ఆ దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. ప్రతిపక్ష నేతలూ, కార్యకర్తల మీద ఏపీ పోలీసులూ.. కూటమి వర్గాల దాష్టీకాలు అన్నీఇన్నీ కావు. దళితులపైనా దారుణమైన దాడులు జరుగుతున్నాయి. విపక్ష నాయకుల నిరసనలపై ఖాకీల ఆంక్షలు సరేసరి.‘ఒక మనిషి స్వేచ్ఛగా, గౌరవంగా బతకడానికి కొన్ని హక్కులు అవసరం. జాతి, కుల, మత, వర్ణ, లింగ, రాజకీయపరమైన వివక్షకు గురవ్వకుండా వ్యక్తుల రక్షణ కోసం రూపొందించినవే మానవ హక్కులు. ఆ హక్కులపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అలాంటి ప్రభుత్వమే ఏపీలో ఆ బాధ్యత మరిచి.. హక్కులను కాలరాస్తోంది’అధికారం చేపట్టాక.. పవన్ కల్యాణ్ ప్రతీకార రాజకీయాల్లాంటివి ఉండబోవని ప్రకటించారు. కానీ, స్వయానా సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రెడ్‌బుక్ పేరిట ఇష్టారాజ్యానికి దిగారు. ఆ ఎర్రబుక్లో ఉన్నవాళ్లను అధికార దుర్వినియోగంతో హింసిస్తున్నారు. తమ అనుకూలురను ప్రొత్సహించే క్రమంలో ఇతరులను బదిలీలు చేయించారు. మాట విననివాళ్లను బలవంతంగా ఇళ్లకు పంపించారు. ఈ పరిణామాలకు భయపడే అధికారులు కళ్లు మూసుకుండిపోయారు.ఇదీ చదవండి: చంద్రబాబు ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహంఏవో కొంపలు మునిగిపోయినట్లే!నచ్చని అంశాలను విమర్శించడం.. ప్రజలకున్న హక్కు. ఆ హక్కు ఎంతంగా వినియోగంలో ఉంటే.. ప్రజాస్వామ్యం అంతగా బలోపేతమవుతుంది. అయితే ఏపీలో రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఏపీలో తూట్లు పొడుస్తున్నారు. ఎన్నికల హామీల గురించి, ప్రజా సమస్యలపై మాట్లాడిన వాళ్లపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సాధారణంగా.. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేయడం సహజం. కానీ, కూటమి ప్రభుత్వ కర్కోటక ఏలుబడిలో మాత్రం అది మహాపాపం. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే- ఏవో కొంపలు మునిగిపోయినట్టు కేసులు పెడుతున్నారు. రాజకీయ ఆసక్తితో పోస్టులు చేస్తున్నవాళ్లనూ వదలడం లేదు. అక్రమ కేసులు బనాయిస్తూ.. స్టేషన్ల చుట్టూ తిప్పుతూ.. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆఖరికి.. ఆడపడుచుల విషయంలోనూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గుతున్న వాళ్లు కొందరైతే.. ధైర్యంగా పోరాడుతున్నవాళ్లు మరికొందరు.ఇదీ చదవండి: టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్యఅన్నింటిని మేనేజ్ చేస్తున్న బాబు!దేశంలో ఎక్కడా లేనంతగా.. చంద్రబాబు సారథ్యంలో ఏపీలో పౌరహక్కుల హననం నిరాటంకంగా సాగుతోంది. ఈ ఆర్నెల్ల కాలంలోనే ఏపీ నుంచి జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు రికార్డు స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. కేంద్ర పెద్దలకు, గవర్నర్ స్థాయి వాళ్లకు స్వయంగా ఫిర్యాదులు అందజేసింది వైఎస్సార్సీపీ. ఇక.. పోలీస్ శాఖకు వెళ్లిన ఫిర్యాదుల సంగతి సరేసరి. అయినా తన పరపతిని ఉపయోగించి చంద్రబాబు ఎక్కడికక్కడే వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు.రాజ్యాంగ నిర్దేశాలను నట్టేట్లో కలుపుతున్న కూటమి ప్రభుత్వం- మానవ హక్కుల హంతకిగా మారింది. ఏపీలో భయోత్పాతాన్ని సృష్టిస్తూ తాను ఆడిందే ఆటగా చెలరేగిపోతోంది. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అధోపాతాళానికి దిగజార్చింది. ఇప్పుడు ఏపీలో మానవహక్కులతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు మిగిలింది హక్కుల కమిషన్ల, న్యాయస్థానాల జోక్యం మాత్రమే!. -
ఏపీలో చీకటి రోజులు.. ప్రజాస్వామ్యం ఖూనీ: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితుల మధ్య రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?. ప్రశ్నించే స్వరం ఉండకూడదని.. అణగదొక్కే చర్యలు కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అన్నారు. అన్ని వర్గాలను మోసం చేశారు. .. మూడు విడతలుగా ఇవ్వాల్సిన విద్యాదీవెన ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను గాలికి వదిలేశారు. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిలయ్యింది... రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉంది. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఐదు నెలల్లో మహిళలు, పిల్లలపై.. 91 ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఏడుగురు బాధితులు చనిపోయారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలే దగ్గరుండి ఈ పనులు చేస్తున్నారు. .. ప్రభుత్వం స్పందించి నేరాల్ని అరికట్టకుండా.. ప్రొత్సహిస్తోంది. తెనాలిలో ఓ అమ్మాయిపై దాడి చేసి చంపారు. నిందితుడు.. టీడీపీకి చెందిన వ్యక్తే. బద్వేల్ ఘటన.. అత్యంత దారుణం. పెట్రోల్ పోసి బాలికను చంపారు. చంద్రబాబు బావమరిది బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో ఘటన జరిగింది. అత్తాకోడలపై అత్యాచారం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఓ ఘటన జరిగింది. ప్రతీచోటా ఇలాంటి ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో సజ్జల కీలక వ్యాఖ్యలు
తాడేపల్లి, గుంటూరు: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిన వేళ.. ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. పార్టీ ముఖ్యనేతలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది. ఏ సోషల్ మీడియా కార్యకర్తకు ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశించారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే.. కేసులు పెడుతున్న వారిపై న్యాయపోరాటం చేద్దాం. ఈ విషయంలో జిల్లా, నియోజకవర్గాల నాయకత్వం వెంటనే స్పందించాలి. పోలీసులు ఎవర్నైనా అరెస్టు చేస్తే న్యాయ సహాయం అందించాలి. ఇందుకోసం ఎక్కడికక్కడ పార్టీ తరఫున సమన్వయ కమిటీలు ఏర్పాటు కావాలి’’ నేతలకు దిశానిర్దేశం చేశారాయన.సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై ప్రయివేటు కేసులు వేస్తామని ఈ సమావేశంలో సజ్జల అన్నారు. ‘‘సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తే పార్టీ లీగల్ టీం వెంటనే పీఎస్ లకు వెళ్లాలి. కావాల్సిన న్యాయ సహాయం అందించాలి. సీనియర్ అడ్వకేట్స్ తో కేంద్ర కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. 24 గంటలూ అందుబాటులో ఉండేలా కొందరు లాయర్లను ఏర్పాటు చేశాం. సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకోవటంలో ఎక్కడా వెనక్కు తగ్గాల్సిన పనిలేదు. వైయస్ జగన్, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటారు’’ అని సజ్జల చెప్పారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, సోషల్ మీడియా, లీగల్ సెల్ ముఖ్య నేతలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. -
బరితెగించిన పచ్చ బ్యాచ్.. మహిళలు, చిన్నారులపై దాడి
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పచ్చ మూక రెచ్చిపోతోంది. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో ఎల్లో బ్యాచ్ అరాచకం సృష్టించింది.ప్రకాశం జిల్లాలోని పొదిలిలో టీడీపీ కార్యకర్తలు బరితెగించి దాడులు చేశారు. పొదిలిలోని నవామిట్టలో వైఎస్సార్సీపీ కార్యకర్త కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా క్రూరత్వంతో రాళ్లు, కర్రలతో కొట్టారు. పచ్చ మూక దాడిలో కుటుంబంలోని ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, వారికి వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లగా అక్కడ వారిని అడ్డుకొని వీరంగం సృష్టించారు. ఇది కూడా చదవండి: శ్రీవారి లడ్డూపై వివాదం.. బాబు పక్కా స్కెచ్‌తోనే.. -
పేరు తొలగించిన మాత్రాన..!
నెల్లూరు, సాక్షి: అధికారం చేపట్టిన వెంటనే.. కొనసాగుతున్న సంక్షేమ పథకాలను ఆపేయడం, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం.. ఆఖరికి గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేయడం పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు. తాజాగా.. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ వద్ద నేమ్ బోర్డులోంచి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును తొలగించడం విమర్శలకు తావిస్తోంది.వైఎస్సార్ హయాంలో 2008లో బ్యారేజ్ పనులు ప్రారంభమైనప్పటికీ.. ఆయన మరణాంతరం ఆ పనులు అటకెక్కాయి. ఆయన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. రూ.131 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీని పూర్తి చేయించారు. అలాగే 1195 మీటర్ల పొడవుతో రెండు లైన్ల బ్రిడ్జి రోడ్ కూడా నిర్మించారు.ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 3.85 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతోంది.నాడు సీఎంగా బ్యారేజ్ వద్ద గౌతమ్ రెడ్డి విగ్రహావిష్కరణలో వైఎస్ జగన్.. మేకపాటి కుటుంబ సభ్యులుఇక.. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణం కోసం నిరంతరం శ్రమించారు. ఆయన హఠాన్మరణం జిల్లావాసులను కలచివేసినా… గౌతంరెడ్డి పేరు చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ బ్యారేజ్‌కు ఆయనపేరు పెట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల నెల్లూరు వాసులు, రైతాంగం హర్షం వ్యక్తం చేశారు. నేడు.. కక్షపూరితంగా ఆ పేరు తొలగించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పేరు చెరిపినా.. ప్రాజెక్టు కోసం ఎవరు నిజంగా కృషి చేశారనే చరిత్రను మాత్రం చెరపలేరని స్థానికులు అంటున్నారు. -
రేపు గుంటూరుకు వైఎస్ జగన్
తాడేపల్లి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరుకు వెళ్లనున్నారు. ఉదయం సబ్ జైలుకి వెళ్లి మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో ములాఖత్ కానున్నారు. ఆపై క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయన్ని పరామర్శిస్తారు. మూడేళ్ల కిందినాటి టీడీపీ మంగళగిరి కార్యాయలంపై దాడి కేసులో.. నందిగం సురేష్‌ను అక్రమంగా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. రిమాండ్ మీద ఆయన గుంటూరు జైలులో ఉన్నారు మరోవైపు.. సాంబిరెడ్డి ఇటీవలె టీడీపీ గుండాల దాడిలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ అధినేతగా వాళ్లకు ధైర్యం చెప్పేందుకు జగన్ పరామర్శించనున్నారు. ఇదీ చదవండి: ఇంత చేతగానితనమా చంద్రబాబు?: వైఎస్ జగన్ ఫైర్ -
అర్ధరాత్రి పచ్చ మూక అరాచకం.. వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. పచ్చ బ్యాచ్ దాడుల్లో మరో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతిచెందాడు. పది మంది టీడీపీ కార్యకర్తలు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.కాగా, పచ్చటి పల్లెలో రాజకీయ చిచ్చు రేగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఎక్కడో ఒక చోట వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పచ్చ మూకల దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత ఆదివారం ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో రాత్రి 11.15 గంటల సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్‌పై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ప్రసాద్ ఈరోజు తెల్లవారుజామున మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు.. ప్రసాద్ మరణ వార్త విని మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అర్దరాత్రి అరాచకం.. టీడీపీ వర్గానికి చెందిన కొందరు ఆదివారం రాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న దాబా హోటల్లో బర్త్‌డే పార్టీ చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బైక్‌లపై గ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో కూన ప్రసాద్ తన బండిపై రామ చెరువు వైపు వెళ్తూ.. వారికి ఎదురుపడడంతో వారంతా ఒక్కసారిగా బైక్ ఆపి తాళం తీసుకుని మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పది మంది కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ భయంతో పరుగులు తీశాడు. అయినా వదలకుండా వెంటాడి మరీ కొట్టారు. చివరకు బీసీ కాలనీలోని సూర కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంటి టెర్రస్‌పైకి ఎక్కితే.. అక్కడకూ వచ్చి దాడి చేశారు. దాడిలో దెబ్బలకు తాళలేక అపస్మారక స్థితికి చేరటంతో విడిచి పెట్టి వెళ్లిపోయారు.అనంతరం గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులకు విషయం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ ఆధ్వర్యంలోని సిబ్బంది అక్కడకు వచ్చారు. అనంతరం 108 వాహనంలో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో పోలీస్ పికెట్ బందోబస్తు సిబ్బంది సంఖ్య పెంచారు. -
అధికార జులుం.. తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
అనంతపురం, సాక్షి: అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతుండడంతో.. నియోజకవర్గంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటన అనంతరం చెలరేగిన హింస నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారక్కడ. ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు నిన్న(మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన. ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో తాడిపత్రి అంతటా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలతో పాటు రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోం శాఖలకు సైతం ఫిర్యాదులు పంపారు. ఈ సందర్భంగా జేసీపై కే. పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు. ‘‘నా హత్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్ర పన్నారు, నన్ను చంపి తాడిపత్రి లో రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేయాలని జేసీ భావిస్తున్నారు. 2006లో మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి హత్య చేయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతా. త్వరలో తాడిపత్రి కి వెళ్లి వైఎస్సార్ సీపీ శ్రేణులకు అండగా ఉంటా అని అన్నారాయన. వంద మంది టీడీపీ గుండాలొచ్చారుదాడి ఘటనపై తాడిపత్రి వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి సాక్షితో మాట్లాడారు. ‘‘జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చంపేందుకు స్కెచ్ వేశారు. నా ఇంటిపై వంద మంది టీడీపీ గూండాలు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి, నా ఇంటికి నిప్పు పెట్టారు. తలుపులు పగులగొట్టి నన్ను చంపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. నాకు లైసెన్స్ తుపాకీ ఉంది.. అయినప్పటికీ కాల్పులు జరపలేదు. ప్రాణ రక్షణ కోసమే తుపాకీ చేతిలో పట్టుకున్నాను. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాకు గన్ మెన్ తొలగించారు అని అన్నారాయన. మురళి భార్య రమా మాట్లాడుతూ.. ఇలా దాడి జరగడం రెండోసారి అని చెప్పారామె.‘‘టీడీపీ గూండాలు మా ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. గంటసేపు బెడ్ రూం లో దాక్కుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాక్కున్నాం. మా ఇంటిపై దాడి టీడీపీ నేతలు దాడి చేస్తే... నా భర్త కందిగోపుల మురళి పై అక్రమ కేసులా?. ఇదెక్కడి న్యాయం?’’:::మురళి భార్య రమాదేవి -
కార్యకర్తలకు అండగా.. విజయవాడలో వైఎస్ జగన్ (ఫొటోలు)
-
ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారు?: వైఎస్ జగన్
ఎన్టీఆర్, సాక్షి: కేవలం ఆధిపత్యం చాటడం కోసం ఒక పథకం ప్రకారం నవాబ్‌పేట్ దాడి ఘటన జరిగిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలిద్దరినీ మంగళవారం సాయంత్రం విజయవాడ ఆస్పత్రిలో జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నవాబ్‌పేటలో ప్లన్ ప్రకారమే కర్రలతో కొట్టారు. సుమారు 20 మంది కలిసి దాడి చేశారు. ఇలాంటి ఘటనలతో చంద్రబాబు ఏం సాధిస్తారు?. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకుంటూ వచ్చాడు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. చివరకు.. మహిళలు, చిన్నారులపైనా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నా.. దాడులు ఆపాలి. మీరు చేసే ఈ కిరాతకాలు, దారుణాల వల్ల ప్రజలేమైనా భయపడతారనుకుంటున్నారా? ఎవరూ భయపడరు. ఇంకా కోపంగా మారుతారు. అలా మారి, చంద్రబాబుగారిని, తెలుగుదేశం పార్టీ.. రెండింటినీ బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులకు దారి తీస్తాయి.కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఏర్పడటానికి కాస్తో కూస్తో టైం పడుతుంది. కానీ, చంద్రబాబు మీద వ్యతిరేకత చాలా వేగంగా పెరిగిపోతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పాలన మీద దృష్టి పెట్టడం లేదు. మేనిఫెస్టోలో హామీల్ని నెరవేర్చడం లేదు. దాడుల్ని ప్రొత్సహిస్తున్నారు. స్కూళ్లు, ఆస్పత్రుల్ని నిర్వీర్యం చేస్తున్నారు. అందరినీ మోసం చేశారురైతులకు పెట్టుబడి సాయం చేస్తానని మోసం చేశారు. ప్రతి సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు. మండల విద్యాధికారులు ఉన్నారు. అయినా కూడా తల్లులను మోసం చేస్తూ, వారికి ఇస్తానన్నది ఎగ్గొట్టేశాడు. ప్రతి పిల్లాడిని చూపి నీకు 15 వేలు, నీకు 15 వేలు, నీకు 15 వేలు ఇస్తామని చెప్పి, ప్రతి పిల్లాడిని మోసం చేశాడు. ప్రతి అక్కచెల్లెమ్మనూ మోసం చేశాడు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కచెల్లెమ్మకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి, వాళ్లనూ మోసం చేశాడు. ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకుంటున్న పిల్లలు.. జనవరి, ఫిబ్రవరి, మార్చి.. క్వార్టర్ ఫీజులు రాలేదు. ఏప్రిల్, మే, జూన్.. రెండో త్రైమాసిక ఫీజులు కూడా రాలేదు. పిల్లలు చదువుకోలని పరిస్థితి, వారు ఫీజులు కట్టలేని పరిస్థితి, కాలేజీల యాజమాన్యాలు ఫీజులు అడుగున్న పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. పిల్లలకు వసతి దీవెన ఎగ్గొట్టేశారు. అక్క చెల్లెమ్మలకు రావాల్సిన సున్నా వడ్డీ.. అది కూడా ఎగ్గొట్టేశాడు. పిల్లలను, అక్కాచెల్లెమ్మలను, తల్లులను.. ఇలా అందరినీ మోసం చేస్తున్నారు. పిల్లలు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఇవేవీ జాప్యం కాలేదు. ప్రజలంతా అడుగుతున్నారుఇవన్నీ కూడా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా, క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తూ వచ్చిన పరిస్థితి. అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, మత్స్యకార భరోసా అయితేనేమి.. ఇవన్నీ కూడా మాకెందుకు ఇవ్వలేదని ప్రజలంతా అడుగుతున్నారు.రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదురాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి భయానక పరిస్థితి కల్పిస్తున్నారు. ఈ అరాచకాలను రాజకీయ పక్షాలకు వివరించాం. జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం. అరాచక పరిస్థితులపై గవర్నర్ దృష్టి పెట్టాలి. చూసీ చూడనట్లు వదిలేయకుండా జోక్యం చేసుకోవాలి. పరిస్థితి చక్కదిద్దడంలో చొరవ చూపాలి. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయమైన ఘటనలు, ఇక్కడి పరిస్థితిని అన్ని రాజకీయ పార్టీలకు వివరించాం. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అన్యాయాలు, అఘాయిత్యాలను చూసి, ఎందుకు రాష్ట్రపతి పాలన విధించకూడదు?. ఈ విషయంలో కచ్చితంగా హైకోర్టు తలుపులు తడుతాం. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడుతాం. భవిష్యత్తులో కష్టమేరాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయం మొదలైంది. దానికి చంద్రబాబునాయుడుగారు తెర తీశారు. ఇది మంచిది కాదు. దాడులు, హత్యలు సరికావు. వెంటనే ఇవన్నీ ఆపాలి. కక్ష సాధించి ఏం సాధిస్తారు?. ఇదే కొనసాగితే భవిష్యత్తులో అదుపు చేయడం కష్టం. ఇవాళ మీరు(చంద్రబాబును ఉద్దేశించి) అధికారంలో ఉండొచ్చు. రేపు మేం అధికారంలోకి వస్తాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అప్పుడు ఆగమన్నా మా కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదు అని హెచ్చరికలు జారీ చేశారు వైఎస్ జగన్. నంద్యాలలోనూ ఈ మధ్య రాజకీయ హత్య జరిగింది. ఈ శుక్రవారం అక్కడికి వెళ్తున్నా. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తా. -
దాడులతో అధైర్యపడొద్దు.. నవాబ్‌పేట్ కార్యకర్తలకు వైఎస్ జగన్ పరామర్శ
ఎన్టీఆర్, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని, ప్రతీకార దాడుల నేపథ్యంలో కుంగిపోకుండా ధైర్యంగా పోరాడాలని, పార్టీ అండగా పోరాటం చేస్తుందని వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం టీడీపీ గుండాల చేతిలో దాడికి గురై చికిత్స పొందుతున్న నవాబ్‌పేట(జగ్గయ్యపేట-ఎన్టీఆర్ జిల్లా) పార్టీ కార్యకర్తలను ఆయన స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆగష్టు 3వ తేదీన వైఎస్సార్సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ దాడికి అడ్డుకోవడానికి వచ్చిన మరో ఇద్దరు కార్యకర్తలనూ తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్.. నేరుగా విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా దాడి జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్న ఆయన.. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని, టీడీపీ నేతల దాడిలో రక్తమోడిన కార్యకర్తల చిత్రాలను చూసి చలించిపోయారు. అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన.. దాడుల్ని వెంటనే ఆపాలంటూ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. నంద్యాలలోనూ జరిగిన రాజకీయ హత్య గురించి ప్రస్తావిస్తూ.. 9వ తేదీన బాదిత కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పారాయన. జగన్‌కు ఘన స్వాగతంబెంగళూరు పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన వైఎస్ జగన్‌కు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. విజయవాడలోని సన్‌రైజ్ ఆస్పత్రికి చేరుకునే క్రమంలోనూ.. దారి పొడవునా ఆయన కోసం అభిమానులు, పార్టీ కార్యకర్తలు బారులు తీరారు. జై జగన్ నినాదాలు చేశారు. వాళ్లను నిరుత్సాహపర్చడం ఇష్టం లేక బయటకు వచ్చి ఆయన అభివాదం చేశారు. అనంతరం.. ఆస్పత్రి వద్ద కూడా ఆయన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఎయిర్పోర్ట్ వద్ద పోలీసుల ఓవరాక్షన్‌వైఎస్ జగన్ రాక నేపథ్యంలో.. గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆయన్ని పోలీసులు లోపలికి అనుమతించారు. హత్యాయత్నం చేసి ఆపై..ఆగష్టు 3వ తేదీన జగ్గయ్యపేట నియోజకవర్గం నవాబ్‌పేట వైఎస్సార్సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద రాత్రి టైంలో టిఫిన్ చేయడానికి ఆగిన ఆయనపై టీడీపీ నేతలు దాడికి దిగారు. బ్లాక్ కలర్ స్కార్పియోలో వచ్చిన టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావు(బుల్లబ్బాయ్) , మరో ఐదుగురు కర్రలతో, రాడ్లతో శ్రీనివాసరావు పై విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిని అడ్డుకోబోయిన శ్రీనివాసరావు అనుచరులు, పార్టీ కార్యకర్తలు డేరంగుల గోపి, దేవి శెట్టి రామకృష్ణ పైనా టీడీపీ గూండాలు విరుచుకుపడ్డారు. ఆపై శ్రీనివాసరావు వాహనాన్ని ధ్వంసం చేశారు. అయితే స్పృహ కోల్పోయిన ముగ్గురినీ చూసి.. చనిపోయారనుకుని అక్కడి నుంచి పారిపోయారు. కొన ఊపిరితో ఉన్న బాధితులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. దీంతో వాళ్లు ప్రాణాలు నిలిచాయి. కొనసాగనున్న పోరాటంటీడీపీ దాడులతో భీతిల్లుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం చెబుతూ వస్తున్నారు. ఆందోళన చెందవద్దని, పార్టీ తరఫున తాను ముందుండి పోరాటం చేస్తానని, మళ్లీ పార్టీకి పునర్వైభవం వస్తుందని భరోసా ఇస్తున్నారు . ఈ క్రమంలో బాధిత కుటుంబాలను కలిసి ఆయన ధైర్యం చెబుతున్నారు. ఇటీవలే పల్నాడు వినుకొండలో నడిరొడ్డు మీద అంతా చూస్తుండగా జరిగిన ఘటన అందరికీ వెన్నులో వణుకు పుట్టించింది. కేవలం వైఎస్సార్సీపీ కోసం పని చేశాడని రషీద్ అనే యువ కార్యకర్తను.. టీడీపీకి చెందిన జిలానీ అనే వ్యక్తి అతికిరాతకంగా చంపాడు. రషీద్ మృతిపై చలించిపోయిన వైఎస్ జగన్.. వినుకొండ వెళ్లి బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. ఆపై టీడీపీ రాక్షస పాలనను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తూ.. ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ సమయంలోనే కూటమి ఆటవిక పాలనపై పోరాటం కొనసాగుతుందని ప్రకటించారాయన. -
YS Jagan: శ్రీనివాసరావుకు పరామర్శ.. విశాఖ నేతలతో కీలక భేటీ
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వంలో దాడులకు గురవుతున్న పార్టీ నేతలకు, కార్యకర్తలకు వైస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం చెబుతూ.. భరోసా ఇస్తున్నారు. తాజాగా.. టీడీపీ శ్రేణుల చేతిలో మూక దాడికి గురైన గింజుపల్లి శ్రీనివాసరావును జగన్ పరామర్శించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్సార్సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. టీడీపీ కార్యకర్తలే ఆయనపై దాడికి పాల్పడినట్లు స్పష్టంగా నిర్ధారణ అయ్యింది కూడా. ఈ నేపథ్యంలో.. రేపు సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం చేరుకోనున్నారు జగన్. అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును పరామర్శించనున్నారు. బాధితుడికి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక.. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేయనున్నారు. బుధ, గురువారాల్లో వరుసగా ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. చంద్రబాబు కుటిల రాజకీయాల నేపథ్యంలో పార్టీ కేడర్‌ను ఆయన అప్రమత్తం చేయనున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, భవిష్యత్తు వైఎస్సార్సీపీదేని భరోసా ఇస్తూనే.. ఎన్నికల్లో వ్యవహారించాల్సిన తీరును ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. -
వైఎస్సార్సీపీ నేతల అక్రమ అరెస్టులు, బెయిల్ రాకుండా సెక్షన్లు మారుస్తున్నారు : పేర్ని నాని
ఏలూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ జెండా మోసిన కార్యకర్తలను టార్గెట్ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజలకు మంచి చేయడం మాని వైఎస్సార్సీపీ కార్యకర్తలతో జైళ్లను నింపే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. నూజివీడు సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పేర్నినానితోపాటు, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పరామర్శించారు. ఆనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.‘చంద్రబాబు సమావేశాల్లో అమరావతి, అభివృద్ధి, సంపద సృష్టి అని కబుర్లు చెబుతున్నారు. కానీ తెరవెనుక జరిగేదంతా మట్టి, ఇసుక దోపిడీ, లే అవుట్ల పేరుతో దోపిడీ చేస్తున్నారు. అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను జైలులో వేస్తున్నారు. 2023 ఫిబ్రవరిలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారు. టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు తిరగబడితే.. ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పటి వరకూ 71 మంది పేర్లను చేర్చారు. ఇంకా ఉన్నారని చెబుతున్నారు. గన్నవరం వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉన్నవారిని పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేయిస్తున్నారు. .. పోలీసులను అడ్డగోలుగా దిగజార్చి వాడుకుంటున్నారు. బెయిల్ రాకుండా చేయడానికి సెక్షన్లు మార్చి జైళ్లలో ఉంచుతున్నారు. అరెస్టైన వారిలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడి తల్లి చనిపోతే దినం చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఏడాది క్రితం జరిగిన కేసులో ఒక్కొక్కరినీ చేరుస్తూ అరెస్ట్ చేస్తున్నారు.పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జైల్లో ఉన్నవారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పాం. అక్రమంగా అరెస్టైన వారి బెయిల్ కోసం పార్టీ ప్రయత్నిస్తోంది. ఎన్ని కేసులు పెట్టినా జెండా వదిలిపెట్టేదిలేదని కార్యకర్తలు ధైర్యంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేసి టీడీపీ నేతలు సునకానందం పొందుతున్నారు. గతంలో కొడాలి నానికి కేన్సర్ అంటూ ప్రచారం చేశారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ వార్తలు వేసి శునకానందం పొందారు. వైఎస్సార్సీపీ కార్యాలయంపైకి బెజవాడ నుంచి గూండాలు దాడికి వస్తే.. వంశీపై అన్యాయంగా కేసు పెట్టారు. వంశీ న్యాయం కోసం పోరాడుతున్నారు. కచ్చితంగా బెయిల్ తీసుకుని వంశీ వస్తారు. టీడీపీ చేస్తున్న మోసాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రజాపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’అని అన్నారు. -
జనసేన నేత వేధింపులతో మహిళ బలవన్మరణం
పల్నాడు, సాక్షి: ఆర్థిక సాయం చేసిన సొమ్ము వెనక్కి ఇవ్వాలంటూ జనసేన నాయకురాలు వేధిస్తుండటంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజర్లలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ కె.నాగేంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికలకు ముందు చేజర్ల గ్రామానికి చెందిన ఉప్పు కృష్ణవేణి (28) కుమారుడు అనారోగ్యం బారినపడ్డాడు. జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి అతడిని పరామర్శించింది. ఈ విషయాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బొర్రా అప్పారావు దృష్టికి తీసుకెళ్లగా.. సుమారు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. కాగా.. ఎన్నికలలో కృష్ణవేణి కుటుంబం జనసేనకు ఓటు వేయలేదని భావించిన జనసేన నాయకురాలు తాడువాయి లక్ష్మి ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని రెండు నెలలుగా వేధిస్తోంది. తాము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, పరిస్థితి కుదుటపడ్డాక చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఒత్తిడి ఆపలేదని మృతురాలి భర్త కోటేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 25న తాను ఇంట్లో లేని సమయంలో తాడువాయి లక్ష్మి ఇద్దరు మహిళలను వెంటబెట్టుకుని తమ ఇంటికి వచ్చిందని, తన భార్యను తీవ్ర వేధింపులకు గురి చేసిందని ఫిర్యాదులో ఆమె భర్త వివరించారు. వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురై తన భార్య ఆత్మహత్య చేసుకుందని కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పేరుతో ఆర్థిక సాయం చేసి.. ఆ డబ్బును తిరిగి ఇవ్వాలంటూ తీవ్ర వేధింపులకు గురి చేసి తన భార్య ఆత్మహత్యకు కారణమైన తాడువాయి లక్షి్మని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో కోరారు.మునిసిపల్ చైర్‌పర్సన్‌పై హత్యాయత్నంఇంటికి వెళ్లి మరీ టీడీపీ కార్యకర్త దాష్టీ కం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చెత్త పత్రిక రోత రాతలపై పరువునష్టం దావాపెద్దాపురం: పెద్దాపురం మునిసిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారుపై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో టీడీపీ కార్యకర్త సానాది సోములు (లింగం) ఇంటి తలుపులను బద్దలుగొట్టి ఆమెను హత్య చేసేందుకు ప్రయతి్నంచాడు. లోపల నుంచి ఆమె వెంటనే పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ యువకుడిని అదుçపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, మునిసిపల్ వైస్‌చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, కౌన్సిలర్లు ఆరెళ్లి వీర్రాఘవులు, సత్యభాస్కర్, విడదాసరి రాజా, తాటికొండ వెంకటలక్ష్మి ఆమెను పరామర్శించారు. అధికారపక్షం రెచ్చగొడితేనే తనపై హత్యాయత్నం జరిగిందని, తనకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కలి్పంచాలని చైర్పర్సన్ పోలీసులను కోరారు. రోత రాతలను సహించం అబద్ధాలు, ఆధారాల్లేని ఊహాగానాలతో ఈనాడు పత్రిక పెద్దాపురం కౌన్సిల్ సభ్యులపై తప్పుడు రాతలు రాసిందని మునిసిపల్ కౌన్సిల్ ధ్వజమెత్తింది. కౌన్సిల్ సమావేశం బుధవారం చైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈనాడులో వచ్చిన తప్పుడు రాతలపై కౌన్సిల్ సభ్యులు ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించారని వచి్చన వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో పత్రిక తేల్చాలన్నారు. పత్రికలో వచి్చన 410 సర్వే నంబర్ పూర్తి జిరాయితీ అయితే 83 సెంట్ల భూమి రూ.4కోట్లు అంటూ తప్పుడు కథనం ఇవ్వడం సమంజసమా అని ప్రశి్నంచారు. ఈ కథనంపై కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కథనం రాసిన పత్రిక ప్రతినిధి ఓపక్క జర్నలిస్ట్‌గా, మునిసిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సర్వేయర్‌గా చలామణి అవుతున్నాడని ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కంటతడితమ కుటుంబ సభ్యుల రేషన్ షాపు తొలగించారని మహిళా కౌన్సిలర్ ఆవేదన షాపు అవసరం లేదని బలవంతంగా సంతకం చేయించుకున్న టీడీపీ నేతలుపుత్తూరు: కూటమి అధికారంలోకి వచి్చనప్పటినుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్‌గా వ్యవహరిస్తున్న టీడీపీ శ్రేణులు రాజకీయ కక్షసాధింపు చర్యల్ని కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడమేగాక వారి ఆధ్వర్యంలో నడుస్తున్న రేషన్ షాపులను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా పుత్తూరులో ఐదేళ్లుగా నిజాయితీగా కార్డుదారులకు సరుకులు ఇస్తూ ఎలాంటి ఆరోపణలు లేని వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న రేషన్ దుకాణాన్ని తొలగించారు. దీనిపై బుధవారం 18వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కె.రాధ కౌన్సిల్ సమావేశంలో కంటతడి పెట్టారు. కక్షసాధింపులు తగవని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎ.హరి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ జీవరత్నం నాయుడు మాట్లాడుతూ కౌన్సిలర్లు అందరూ సమానమేనని, అధికారపక్షం, ప్రతిపక్షం అంటూ తేడాలు ఉండకూడదని చెప్పారు. దీనిపై స్పందించిన కౌన్సిలర్ రాధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన లేకుండా పోయిందని విమర్శించారు. ఇందుకు నిదర్శనం తమ కుటుంబసభ్యులు ఐదేళ్లుగా నిర్వహిస్తున్న రేషన్ షాపును తొలగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తన అక్క మంజుల ఐదేళ్లుగా ఎలాంటి ఆరోపణలు లేకుండా రేషన్ షాపు నడుపుతున్నారని తెలిపారు. రెండురోజుల కిందట టీడీపీ నాయకులు కొందరు రాత్రిపూట ఇంటివద్దకు వచ్చి మంజులను బెదిరించి రేషన్ షాపు అవసరం లేదంటూ బలవంతంగా సంతకం చేయించుకున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు సైతం తమవద్ద ఉన్నాయన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని నిలదీశారు. అటవీ భూముల ఆక్రమణకు టీడీపీ నేతల యత్నంఆక్రమణకు గురైన భూములను పరిశీలిస్తున్న అధికారులుచిల్లకూరు: తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఆరూరు పంచాయతీలోని అటవీ భూముల్ని ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు ప్రయతి్నస్తున్నారు. పలువురు నాయకులు అటవీ భూముల్ని చదును చేస్తున్నారు. చిట్టమూరు మండలంలో సర్వే నంబరు 432లో సుమారు 400 ఎకరాల అటవీభూములు ఉన్నాయి. వీటిలో సగం వరకు ఇప్పటికే ఆక్రమణలకు గురికాగా మిగిలిన భూములను ఆక్రమించేందుకు టీడీపీ నేతలు ప్రయతి్నస్తున్నారు. ఆ భూమిని చదును చేసే పనుల్ని స్థానికులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన చెరువు లోతట్టులో కూడా సుమారు 50 ఎకరాల వరకు దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాలను స్థానికులు గూడూరు ఆర్డీవో కిరణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై వీఆర్వో శ్రీనివాసులను అడగగా.. భూములు ఆక్రమణలకు గురవుతున్న విషయం వాస్తవమేనన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇస్తామని చెప్పారు. మట్టిపోసి వలంటీర్ ఇంటి దారిమూతసత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో వలంటీర్ కంటు బ్రహ్మయ్య ఇల్లు తొలగించాలని టీడీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారు. 20 ట్రాక్టర్ల మట్టిపోసి వలంటీర్ ఇంటికి దారి మూసేశారు. వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ చిన్న టీ హోటల్ నడుపుతూ జీవిస్తున్న బ్రహ్మయ్య 30 సంవత్సరాల నుంచి గ్రామంలో బీసీలకు కేటాయించిన పోరంబోకు స్థలంలో పూరిగుడిసె వేసుకుని ఉంటున్నాడు. బ్రహ్మయ్య వలంటీర్‌గా వైఎస్సార్సీపీకీ అనుకూలంగా పనిచేశాడంటూ కక్షతో అతడి ఇల్లు కూల్చేయాలని టీడీపీ నేతలు కుట్రచేశారు. టీడీపీకీ చెందిన పచ్చ సు«దీర్, పచ్చ అప్పయ్య, నల్లబోతు కోటయ్య, బొడ్డు లింగయ్య, మరో 20 మంది ఈ నెల 29న బ్రహ్మయ్య ఇంట్లోలేని సమయంలో ఆయన ఇంటికి దారిలేకుండా 20 ట్రాక్టర్ల మట్టిపోశారు. బ్రహ్మయ్య ఇంటిముందు ఎనీ్టఆర్ బొమ్మ ఏర్పాటు చేసి అక్కడ అభివృద్ధి చేయాలంటూ ఆ ఇంటిని కూల్చేయాలని ప్రయతి్నస్తున్నారు. -
రెండు నెలలుగా టీడీపీ వేధింపులు: పిఠాపురం మహరాజ కుటుంబం
కాకినాడ, సాక్షి: అధికారం చేపట్టి నాటి నుంచి టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలను కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతల నుంచి సామాన్యుల దాకా కూటమి పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా.. పిఠాపురం మహారాజ కుటుంబం సైతం వేధింపులకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. పిఠాపురం మహారాజా మేనకోడలైన చంద్రలేఖ కుటుంబానికి టీడీపీ నుంచి వేధింపులు ఎదురవుతున్నాయట. తమ ఇంటిని ఖాళీ చేయాలని కొందరు బెదిరిస్తున్నట్లు ఇద్దరు కొడుకులతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. ‘‘1970 నుంచి మా కుటుంబం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఇంట్లో మేం ఉంటున్నాం. ఆ ఆస్తి మీద కొందరు కన్నేశారు. ఆ ఇంటిని ఖాళీ చేయాలని, లేకుంటే.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెడతామని బెదిరిస్తున్నారు. .. ఈ దౌర్యన్యం వెనుక టీడీపీ నేతల సహకారం ఉంది. అందుకే ఫిర్యాదు చేసినా పోలీసులు సైతం పట్టించుకోవట్లేదు అని చంద్రలేఖ కుమారుడు మాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరాం. మాకు న్యాయం జరగకపోతే చావే శరణ్యం అంటోంది చంద్రలేఖ కుటుంబం. -
చంద్రబాబు యూటర్న్ వ్యాఖ్యలపై పవన్ మౌనమా?
తాడేపల్లి,సాక్షి: తన సుదీర్ఘమైన అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు హామీలపై నాలుక మడతేస్తున్నారని.. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడుతున్నారు . సోమవారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యథావిథిగా యూటర్న్ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన ‘సూపర్‌సిక్స్’పై చంద్రబాబు యథావిథిగా యూటర్న్ తీసుకున్నారని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే, భయం వేస్తోందంటూ డ్రామాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆ మాట అన్నా.. కూటమి పథకాల గురించి, నాడు గొప్పగా చెప్పిన జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్.. కనీసం నోరు మెదపలేదని ఆయన ఆక్షేపించారు.టీడీపీ కూటమి ప్రకటించిన పథకాలు అమలు సాధ్యం కాదని, ఎన్నికల ముందు తాము పేర్కొన్నా.. తనకు సంపద సృష్టించడం తెలుసంటూ.. చంద్రబాబు గొప్పలు చెప్పి, ఇప్పుడు కాడి ఎత్తేశారని దుయ్యబట్టారు. సంపద సృష్టించడం అంటే, అప్పులు చేయడమేనా అని నిలదీశారు.ప్రచార ఆర్భాటంచంద్రబాబు ప్రతి విషయంలో ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవ అమలు ఏదీ లేదని మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నామంటూ, ప్రచారం చేశారని, కానీ.. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కంటే, ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని తెలిపారు.తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది అమలు చేయడం లేదని, రైతులు ఖరీఫ్ సాగు ప్రారంభించినా, వారికి ఇప్పటి వరకు పెట్టుబడి సాయం చేయలేదని, పిల్లలకు ఫీజులు చెల్లించలేదని, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం ఇంకా ఇవ్వలేదని.. .. ఇలా అన్ని వర్గాలను టీడీపీ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు.మాట తప్పడం ఆయన నైజంచంద్రబాబు తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇచ్చిన మాటకు కట్టుబడలేదని మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు తేల్చి చెప్పారు. మాట తప్పడం చంద్రబాబు నైజం అని ఆయన గుర్తు చేశారు. అందుకు ఈ 50 రోజుల పాలన, మరో ఉదాహరణ అని పేర్కొన్నారు.కేంద్రం నుంచి సున్నాఇప్పుడు టీడీపీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నా, ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ప్రస్తావించారు. రాజధాని పనుల కోసం రూ.15 వేల కోట్లు, రుణంగా సమకూరుస్తామని చెబితే, ఆ ని«ధులు సాధించినట్లు గొప్పగా ప్రచారం చేసుకున్నారని గుర్తు చేశారు. మరే విషయంలోనూ కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా, స్పందించడం లేదని ఆక్షేపించారు.రెడ్‌బుక్ రాజ్యాంగంరాష్ట్రంలో గత 50 రోజులుగా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న సుధాకర్‌బాబు, ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే, విపక్షంపై దాడులు మొదలయ్యాయని తెలిపారు. ఆరోజు నుంచి ఇప్పటి వరకు హత్యలు, హత్యా యత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం.. యథేచ్ఛగా సాగుతోందని మాజీ ఎమ్మెల్యే చెప్పారు.దానర్థం మార్చారుమరోవైపు శ్వేతపత్రాల పేరుతో పచ్చి అబద్ధాలు చెప్పడం, అన్నింటికీ గత ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ నిందించడం, జగన్‌గారిని వ్యక్తిగత హననం చేయడమే సీఎం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని అన్నారు. నిజానికి శ్వేతపత్రం అంటే.. అన్ని వాస్తవ పరిస్థితులు వివరిస్తూ, వాటికి సంబంధించి, భవిష్యత్తులో తామేం చేస్తామన్నది చెప్పడం అని గుర్తు చేసిన సుధాకర్‌బాబు.. ఇప్పుడు సీఎం చంద్రబాబు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడని ఆక్షేపించారు.ఇకనైనా వైఖరి మార్చుకొండిచంద్రగిరిలో తమ పార్టీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని భయ భ్రాంతులకు గురిచేసి, ఇబ్బంది పెట్టారని మాజీ ఎమ్మెల్యే చెప్పారు. అసలు ఆయన ఏ నేరం చేశారని, ఎయిర్‌పోర్టులో అదుపులోని తీసుకుని, నానా హంగామా చేసి, ఆ తరవాత నోటీసు ఇచ్చి వదిలారని నిలదీ«శారు.ప్రభుత్వ పెద్దలు ఇకనైనా వైఖరి మార్చుకోవాలని, కక్ష సాధింపు చర్యలు విడనాడాలని.. దాడులు, హత్యలు, ఆస్తుల విధ్వంసాన్ని ఆపాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీజేఆర్ సుధాకర్‌బాబు హితవు చెప్పారు. తమను ఎంత వేధించినా, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతామని, ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు.రాష్ట్ చరిత్రలో వైఎస్సార్, జగన్ పేరు వింటే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబు పేరు వింటే ప్రజలకు వెన్నుపోటు, విధ్ంసం, మోసాలు గుర్తొస్తాయి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోతే వైసీపి ప్రశ్నిస్తూనే ఉంటుంది’’ అని సుధాకర్‌బాబు అన్నారు. -
టీడీపీ అరాచకాలపై లండన్‌లో నిరసన
లండన్, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలపై టీడీపీ సాగిస్తున్న అరాచకాలను వైఎస్సార్సీపీ యూకే కమిటీ ఖండించింది. ఇలా హత్యా రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారని చంద్రబాబుపై పార్టీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలుపోటములు సహజమని.. రాష్ట్ర ప్రజలందరినీ సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హితవు పలికారు. ఏపీలో టీడీపీ అరాచక పాలనను ఖండిస్తూ ఆదివారం లండన్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. అనంతరం ప్రదీప్ మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో గెలిచిన పార్టీ నాయకులు.. ఓడిన పార్టీ వారిపై దాడులు చేసి ప్రాణాలు తీయడమేంటి? వీటిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవి ఏ మాత్రం ఆమోదనీయం కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏపీలో శాంతిభద్రతలు నెలకొల్పాలి. దాడులు చేస్తున్న వారిని జైలుకు పంపాలి.. ఏపీలో జరుగుతున్న ఆటవిక పాలనపై లండన్‌లో ప్రవాసాంధ్రులు నిరసన టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాల నుంచి ప్రజలను రక్షించాలని అక్కడ గాంధీజీ విగ్రహం వద్ద ఆందోళనలుఏపీలో హింసను ఆపాలని డిమాండ్#SaveAPFromTDP pic.twitter.com/hPpZuRxzHP— YSR Congress Party (@YSRCParty) July 28, 2024.. ప్రజాస్వామ్యం, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రవాసాంధ్రులంతా ఏకమై వైఎస్ జగన్‌కు తోడుగా నిలవాలని నిర్ణయించాం. కూటమి ప్రభుత్వం హింసాకాండను ఆపకపోతే ప్రపంచం మొత్తానికి ఏపీలో జరుగుతున్న దురాగతాలను తెలియజేస్తాం’ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ఓబుల్‌రెడ్డి పాతకోట, మలిరెడ్డి కిశోర్‌రెడ్డి, అనంత్ పరదేశి, సురేందర్ అలవల, వీరా పులపకూర, సుమన్ కోడూరు, పాలెం క్రాంతి కుమార్ రెడ్డి, కార్తీక్ భూమిరెడ్డి, ప్రతాప్ భీమిరెడ్డి, వెంకట్, సాయితేజ, చలపతి గుర్రం, సాయికృష్ణ, ప్రణయ్ ధీరజ్, నరేందర్, నవీన్ దొడ్డ, కరుణాకర్ రెడ్డి మొండెద్దు, వినయ్ కంభంపాటి, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. -
జగన్ ఉండుంటే.. అనే చర్చ మొదలైంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అమలుకాని హామీలు ఇచ్చి చంద్రబాబు ఇప్పుడు వాటిని అమలుచేయడం లేదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తల్లికి వందనం అని పేరు పెట్టి శఠగోపం పెట్టారు. అలాగే, రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్.కాగా, కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలో ఉండి ఉంటే అమ్మఒడి ఇప్పటికే వచ్చేది. తల్లికి వందనం అని చెప్పి అందరినీ మోసం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ డబ్బులు ఇస్తామని ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయ్యింది. విద్యార్థుల డేటా అంటూ కాలం గడుపుతున్నారు. తల్లికి వందనం అని పేరు పెట్టి శఠగోపం పెట్టారు.వైఎస్ జగన్ ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ సమయానికి వచ్చేదని విద్యార్థులు, తల్లిదండ్రులు అనుకుంటున్నారు. చంద్రబాబు ఇప్పటికీ కూడా విద్యాదీవెన, వసతిదీవెన ఇవ్వలేదు. కొన్ని కాలేజీలు ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుకున్నారు. మా ప్రభుత్వంలో వసతి దీవెన, విద్యాదీవెనకు రూ.18వేల కోట్లు ఖర్చు చేశాం. మేము అధికారంలో ఉండి ఉంటే ఈపాటికి సున్నావడ్డీ రుణాలు కూడా జమ అయ్యేవి. పథకాల అమలుపై ప్రతీ అక్కచెల్లెమ్మ ప్రశ్నిస్తున్నారు.జూన్‌లో 43లక్షల మంది తల్లులకు పథకంలో నిధులు జమ అయి ఉండేవి. ఏమన్నా అంటే వివరాలు సక్రమంగా లేవంటారు. 50 రోజులైంది. ఇంకా డేటా ఏమిటి. అమ్మ ఒడి (తల్లికి వందనం) కోసం 43లక్షల తల్లులు, 82లక్షల పిల్లలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విద్యాదీవెన కింద ఒక త్రైమాసిక ఫీజు వచ్చి ఉండేది. అలాగే, వసతి దీవెన కింద పిల్లలకు ఒక విడత లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద ఆర్థిక సాయం అంది ఉండేది.వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే రైతుభరోసా ఇప్పటికే వచ్చేదని అన్నదాతలు అనుకుంటున్నారు. రైతులకు రూ.20వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. రైతుభరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. మా ప్రభుత్వంలో మేము ఒక్క రైతుభరోసా కిందే రూ.34,378 కోట్లు ఇచ్చాం. వైఎస్ జగన్ ఉంటే మాకు ఇన్సూరెన్స్ వచ్చేదని రైతులు భావిస్తున్నారు. రైతుల తరఫున ఇన్సూరెన్స్ ప్రీమియం ఇప్పటికే చంద్రబాబు కట్టలేదు. మేము కట్టాల్సిన ఇన్సూరెన్స్‌ను కోడ్ ఉందని మీరే ఆపించారు. రాష్ట్రంలో రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడు. మేము గతంలో ప్రతీ ఎకరాకు ఇన్సూరెన్స్ చేశాం. జియో ట్యాగింగ్ చేశాం. ఆర్బీకేల ద్వారా అన్నీ అందాయి. ప్రతీ రైతు చంద్రబాబును నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది. హామీల అమలుపై ఎవరూ ప్రశ్నించకూడదా?. రాష్ట్రంలో పాలనపై జనాల్లో చర్చ మొదలైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సూపర్ సిక్స్ ఏమైంది?ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమైంది? అందులో ప్రకటించిన పథకాలు ఏమయ్యాయి?. తల్లికి వందనం లేదు? మూడు ఉచిత సిలిండర్లు లేవు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఏమయ్యాయి? ఆ వివరాలు ఉన్నాయి కదా?. ఓటర్ల జాబితాలో 18 ఏళ్లు నిండిన వారే ఉంటారు? ఆ జాబితా చాలు కదా? అని ప్రశ్నించారు. -
టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్య
కాకినాడ, సాక్షి: టార్గెట్ వైఎస్సార్సీపీతో కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలను కొనసాగిస్తోంది. ఆ పార్టీ నేతల దగ్గరి నుంచి సానుభూతిపరులదాకా, చివరకు ఓటర్లపైనా భౌతిక దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోంది. మరోవైపు ఆన్లైన్ వేదికగానూ వేధింపులకూ తెగబడుతోంది. ఈ వేధింపులు భరించలేక కాకినాడలో వైఎస్సార్సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో వేట్లపాలెం 10వ వార్డు మెంబర్‌గా వైఎస్సార్సీపీ నేత బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణ ఉన్నాడు. అయితే.. గత కొన్నిరోజులుగా టీడీపీ నుంచి ఆయనకు బెదిరింపులు వస్తున్నాయట. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చెప్పి ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ ఆయనకు వేధింపులు పెరిగిపోయాయి. దీంతో భరించలేని ఆయన తన నివాసంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సత్యనారాయణ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలియగానే స్థానిక వైఎస్సార్సీపీ నేతలు సత్యనారాయణ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తున్నారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల వాంగ్మూలం సేకరిస్తున్నారు. -
అప్పులపై తప్పుడు ప్రచారం.. అంత అధ్వానస్థితిలో చంద్రబాబు సర్కార్: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎటు వైపు వెళ్తుందో ఆలోచించాలని, పురోగతి వైపు వెళ్తుందా?.. తిరోగమనంలో వెళ్తోందా? గమనించాలని ఏపీ ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకాలు, చంద్రబాబు విడుదల చేస్తున్న అబద్ధపు శ్వేత పత్రాలు, వైఎస్సార్సీపీ హయాంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలపై తాడేపల్లిలోని తన కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో గత 52 రోజులుగా దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం కొనసాగుతోంది. ప్రశ్నించే వాళ్లను అణచివేసే ధోరణితో పాలన ముందుకు సాగుతోంది. విధ్వంస పాలన కొనసాగుతుంటే.. పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడు నెలల ఓటాన్ బడ్జెట్ పెడుతోంది. పూర్థిస్థాయి బడ్జెట్ పెట్టే ధైర్యం లేంటే ఎంతటి దారుణమైన, అధ్వానమైన పాలనో అర్థం చేసుకోవాలి. ఫుల్ బడ్జెట్ పెడితే చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలు ఏమైతే ఇచ్చారో.. వాటికి కేటాయింపులు చూపించాల్సిన అవసరం వస్తుంది. అందుకే ఆ పని చేయడం లేదు. .. చంద్రబాబు అంటేనే వంచన, గోబెల్స్ ప్రచారం. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం దగ్గరి నుంచి ప్రజల్నిమోసం చేయడం దాకా అన్నింటా ఇదే జరుగుతోంది. ఇప్పుడు రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని చంద్రబాబు గ్యాంగ్ ప్రచారం చేస్తోంది. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయ్యింది. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదని చంద్రబాబు అంటున్నారు. నిజంగా అయిపోతుందా? అయ్యిందా? గమనిస్తే.. .. ఎన్నికల సమయంలో రూ. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెబుతూ.. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. ఇప్పుడు అధికారం వచ్చాక అది చూపించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. గవర్నర్ ప్రసంగం వరకు వచ్చే సరికి రూ.10 లక్షల కోట్ల అప్పు అయ్యిందని చూపించారు. శ్వేత పత్రాలతో మభ్య పెట్టే యత్నం చేస్తున్నారు. నిజంగా అది ఒకసారి గమనిద్దాం. ఆర్బీఐ, కాగ్, స్టేట్ బడ్జెట్ ప్రకారం గమనిస్తే.. వాస్తవానికి ఈ ఏడాది జూన్ దాకా, అదీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చేంత దాకా చూస్తే అప్పు రూ.5 లక్షల 18 వేల కోట్ల రూపాయలు మాత్రమే. చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి రూ.2 లక్షల 72 వేల కోట్ల అప్పు ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో ఆ అప్పు రూ.5 లక్షల 18 వేల కోట్లకు చేరింది. గ్యారెంటీలు, విద్యుత్ ఒప్పందాలు కలిపినా రూ. 7లక్షల 48 వేల కోట్లు మాత్రమే. అయినా గవర్నర్ ప్రసంగంలో అబద్ధం చెప్పించారు. ఇలా రూ. 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ధర్మమా?. వాస్తవాలపై గవర్నర్‌కు లేఖ రాస్తాం. ఆయనతోనూ అబద్ధాలు చెప్పించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తాం. చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి రూ.7 వేల కోట్లకు పైగా ఖజానా సొమ్ము ఉంది. కానీ, మేం అధికారం చేపట్టేనాటికి రూ.100 కోట్లే ఉంది. ఆ విషయాన్ని ఈనాడు కూడా రాసింది. మేం అధికారంలో ఉండగా మేనిఫెస్టోలో ప్రతీ హామీని అమలు చేశాం. డీబీటీ ద్వారా బటన్ నొక్కి రూ.2.71 లక్షల కోట్లు లబ్ధిదారులకు జమ చేశాం. పార్టీ, ప్రాంతాలు కూడా చూడకుండా అందరికీ సంక్షేమం అందించాం. చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో 12.9 శాతం అప్పు చేశాం. కేంద్ర ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంది. అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమైనట్లు చిత్రీకరించడం ఎంత వరకు సమంజసం?. బడ్జెట్లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదు. అసలు లేని రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ధర్మమా?.చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో 12.9 శాతం అప్పు చేశాం. కేంద్రం ఇచ్చిన అనుమతుల కన్నా తక్కువ అప్పే చేశాం. కోవిడ్ టైంలోనూ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాం. ఆ టైంలో కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గింది. అయినా సంక్షేమం ఆపలేదు. ఈ లెక్కన ఎవరు ఆర్థికంగా ధ్వంసం చేసినట్లు? కేంద్ర ఎకనామిక్ సర్వే మా ప్రభుత్వ పని తీరును మెచ్చుకుంది. కేవలం.. బడ్జెట్లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడం లేదు. ఇదీ చదవండి: సామాన్యులపై కక్ష సాధింపు ఎందుకు?.. జగన్ సూటి ప్రశ్న -
వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
గుంటూరు, సాక్షి: ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జాతీయ మీడియా ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కీలక వ్యాఖ్యలు చేశారు. అమాయక జనాలపై దాడులు ఆపాలని, ఏదైనా ఉంటే తనతో తేల్చుకోవాలని రాజకీయ ప్రత్యర్థులకు ఆయన పిలుపు ఇచ్చారు.ఎన్డీటీవీ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. ‘‘కావాలంటే నన్ను టార్గెట్ చేయండి. అమాయక ప్రజలు, కార్యకర్తల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?. మీకు ఓట్లు వేయని ప్రజల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?. ఇదసలు మానవత్వం అనిపించుకోదు. ఏదైనా ఉంటే.. తేల్చుకోవాలనుకుంటే.. నాతోనే తేల్చుకోండి. నన్ను చంపాలనుకుంటే చంపేయండి. నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు?’’ అని వైఎస్ జగన్ సూటిగా నిలదీశారు. -
గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్.. ఘన స్వాగతం
ఎన్టీఆర్, సాక్షి: టీడీపీ కూటమి అరాచక పాలనపై చేపట్టిన ధర్నా సూపర్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి ఏపీకి చేరుకున్నారు. గురువారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు, నేతలకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జగన్‌ను అభిమానులు చుట్టుముట్టగా.. ఓపికగా ఆయన సెల్ఫీలు దిగారు.ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. హత్యలు, హత్యాచారాలు, దాడులు, వేధింపులు, విధ్వంస ఘటనలు పెరిగిపోయాయి. ప్రత్యేకించి వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని హింసాపర్వం కొనసాగింది. ఈ నరమేధాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అదే సమయంలో.. వినుకొండ హత్యాఘటన, వైఎస్సార్సీపీ ఎంపీ..మాజీ ఎంపీలపై దాడి ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆపై కూటమి పాలన అరాచకాలపై గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో.. ఈ పరిస్థితుల్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్ జగన్ భావించారు. దేశ రాజధానిలో వైస్సార్సీపీ ధర్నాచేపట్టగా.. పలు జాతీయ పార్టీల సంఘీభావంతో అది విజయవంతం అయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ, శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం, ఆప్, అన్నాడీఎంకే.. తదితర పార్టీలు వైఎస్సార్సీపీ ధర్నాకు సంఘీభావం తెలిపాయి. ఆ సమయంలో చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీలో జరుగుతున్న రాజకీయ హత్యలను వైఎస్ జగన్ దేశ రాజధానిలో ఎండగట్టారు. వీడియో, ఫోటో సాక్ష్యాలతో జాతీయ నాయకులకు ఏపీలోని అరాచక పరిస్థితులను వివరించారాయన. ఇదీ చదవండి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది.. అరాచకాన్ని అడ్డుకుందాంచంద్రబాబు గత నెలన్నర పాలనలో జరిగిన నేరాలను ఘోరాలను తెలుసుకుని ఆ నేతలు నివ్వెరపోయారు. ‘‘ఏపీలో రాజ్యాంగబద్ధ పాలన జరుగుతోందా?’’ అని ప్రశ్నించిన ఆయా పార్టీల నేతలు.. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని.. జగన్‌ను మళ్లీ ఆశీర్వదించే అధికారం కట్టబెట్టే అవకాశం ఉందని అన్నారు. అలాగే.. శాంతిభద్రతలు నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో వైఎస్ జగన్ వెంటే ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాయని ఆ పార్టీల నేతలు హామీ ఇచ్చారు. మరోవైపు.. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, కక్షపూరిత రాజకీయాల్ని జాతీయ మీడియా ముందు ప్రస్తావించిన వైఎస్ జగన్, ప్రజాస్యామ్య పరిరక్షణకు అంతా తమకు మద్దతు ప్రకటించాలని జాతీయ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్ర మంత్రులకూ ఏపీలో పరిస్థితులను వివరిస్తామని, రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని జగన్ చెబుతున్నారు. అపాయింట్మెంట్ దొరకగానే త్వరలో జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. క్లిక్ చేయండి: ఈ పోరాటంలో జగన్‌కు మా మద్దతు ఉంది -
నరమేధంపై కన్నెర్ర.. చంద్రబాబు ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం
సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, శివసేన (ఉద్ధవ్), ఆప్, ఏఐఏడీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఐయూఎంఎల్, ఎంఐఎం, వీసీకే సహా పలు పార్టీల మండిపాటు విధ్వంసకాండకు సంబంధించిన వీడియో, ఫొటో ప్రదర్శనలు తిలకించిన నేతలు రాష్ట్రంలో పరిస్థితులపై జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతల విస్మయం వైఎస్సార్సీపీ పోరాటాలకు మద్దతుగా ఉంటామని హామీ ఏపీలో అరాచకాన్ని చూసి విస్తుపోయిన జాతీయ మీడియాఇలాగైతే ఎక్కువ రోజులు అధికారంలో ఉండరుపట్టపగలే దాడులు, హత్యలు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రజా ప్రతినిధులపై ఏకంగా హత్యాయత్నం చేయడం.. ఇలాంటి బుల్డోజర్ సంస్కృతితో ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ఇలాగైతే ఎక్కువ రోజులు అధికారంలో ఉండరు. – ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్యాదవ్ఇది ప్రభుత్వ ఉగ్రవాదంఏపీలో ప్రభుత్వమే స్వయంగా ఉగ్రవాదానికి పాల్పడుతోంది. ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న జగన్‌కు అండగా నిలుస్తాం. – ఐయూఎంఎల్ ఎంపీ వాహబ్కేంద్రం జోక్యం చేసుకోవాలిప్రజలందరినీ రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ, ఏపీలో అది జరగడం లేదు. దౌర్జన్యాలు, అరాచకాలను కేంద్రం అడ్డుకోవాలి– ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదొరై శాంతి భద్రతలను కాపాడాలి ఏపీలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఫొటోలు, వీడియోలు చూశాం. అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేంద్రం శాంతిభద్రతలను కాపాడాలి. – వీసీకే అధినేత తిరుమావలవన్ ఒక్కరోజు కూడా పాలించే అర్హత లేదుఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యమేలుతోంది. అక్కడ అసలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉన్నాయా? ఏపీ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా పాలించే హక్కు లేదు. – శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ఏపీలో పరిస్థితి దిగ్భ్రాంతికరం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఏ స్థాయిలో దౌర్జన్యాలు జరిగాయో చూస్తే బాధ అనిపిస్తోంది. – తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్వారికీ, దేశద్రోహులకు తేడా ఏముంది? ఇది చాలా బాధాకరం. ఎన్నికల్లో గెలిచిన పార్టీ, ఓడిన వారిపై దాడులు చేసి ప్రాణాలు తీయడం ఏంటి? వారికి,దేశద్రోహులకు తేడా ఏముంది? – ఆప్ ఎమ్మెల్యే రాజేంద్రపాల్గౌతమ్సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న నరమేధం, ఆటవిక పాలన, హత్యా రాజకీయాలకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్సార్సీపీ కదంతొక్కింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో టీడీపీ కొనసాగిస్తున్న మారణహోమంపై కన్నెర్ర జేసింది. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సాగుతున్న హత్యలు, విధ్వంసకాండకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వేదికగా బలంగా గళమెత్తింది. హత్యా రాజకీయాలకు ఫుల్ స్టాఫ్ పడేలా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న డిమాండ్‌తో హోరెత్తించింది. టీడీపీ అరాచకంపై పిడికిలి బిగించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, టీఎంసీ, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఆప్, ఏఐడీంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వీసీకే సహా పలు పార్టీల ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న పోరాటానికి సంపూర్ణంగా మద్దుతు ఇస్తామని ప్రకటించారు. పిడికిలి బిగించి, గళమెత్తి..రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులపై సాగుతున్న హత్యలు, హత్యాచారాలు, దాడులు, ఆస్తుల విధ్వంసాలను యావత్తు దేశం దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీలో జంతర్‌మంతర్ వేదికగా బుధవారం వైఎస్ జగన్ చేపట్టిన ధర్నాకు మంచి స్పందన లభించింది. బుధవారం ఉదయం ధర్నాకు ముందు ఢిల్లీలో భారీ వర్షం కాస్త కలవరపాటుకు గురిచేసినా, ఉదయం 11 గంటలకు ముందే పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ధర్నా స్థలికి చేరుకున్నారు. ధర్నా ప్రాంతానికి వైఎస్ జగన్ వచ్చే సమయానికే ఆ ప్రాంతమంతా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది నేతలు, కార్యకర్తలతో నిండిపోయింది. వైఎస్ జగన్ ధర్నా వేదికపైకి వచ్చిన వెంటనే ఆయన్ను కలిసేందుకు నేతలు పోటీపడ్డారు. ఫొటో గ్యాలరీని వైఎస్ జగన్ తిలకిస్తున్న సమయంలో ‘సేవ్ ఏపీ.. ఫ్రమ్ టీడీపీ’, ‘నరరూప రాక్షసుడు.. నారా బాబు’ అంటూ నేతలు, కార్యకర్తలు బిగ్గరగా నినాదాలు చేశారు. కార్యక్రమం ఆసాంతం నేతలు, కార్యకర్తలు టీడీపీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ పాలనపై వైఎస్ జగన్ చేసే పోరాటాలకు వెన్నంటి ఉంటామని పిడికిలి బిగించి మద్దతు పలికారు. సాయంత్రం నాలుగు గంటలకు ధర్నా ముగిసేంత వరకు ఆ ప్రాంగణం నేతలతో కిక్కిరిసిపోయింది. భారీగా నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో వందల సంఖ్యలో ఢిల్లీ పోలీసులు.. పెద్ద సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. దమనకాండను కళ్లకు కట్టిన పోస్టర్లు ధర్నా వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీ రాష్ట్రంలో సాగుతున్న దమనకాండను కళ్లకు కట్టింది. నంద్యాల, పల్నాడు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా నెల్లూరు సహా వివిధ జిల్లాల్లో టీడీపీ కొనసాగించిన విధ్వంసకాండ, హత్యలు, దాడుల ఫొటోలు హత్యా రాజకీయాలను అద్దంలా చూపాయి. ధర్నాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఫొటోలను వీక్షించి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాల్లో జరిగిన దాడుల ఫొటోలను ఇతర జిల్లాల నేతలకు చూపిస్తూ, టీడీపీ నేతల అరాచకాన్ని తూర్పార పట్టారు. ధర్నాను కవర్ చేసిన జాతీయ మీడియా సైతం ఫొటో గ్యాలరీని తమ తమ ఛానళ్లలో చూపించేందుకు ప్రాధాన్యమిచ్చింది. సభా వేదికపై ప్రదర్శించిన వీడియోలు సైతం కార్యక్రమానికి వచ్చిన వారిని తీవ్ర ఉద్వేగానికి గురిచేశాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా వినుకొండలో ఇటీవల హత్యకు గురైన రషీద్ వీడియోను చూసిన వారంతా ఒక్కసారి ఖిన్నులైపోవడం కనిపించింది. ఇంత దారుణాన్ని తమ జీవితంలో చూడలేదని అభిప్రాయపడ్డారు. నరమేధానికి సంబంధించిన ఫొటోలు, ఫ్లకార్డులను సైతం నేతలు, కార్యకర్తలు చేత పట్టుకొని జంతర్ మంతర్ చుట్టూతా ప్రదర్శన నిర్వహించారు. కదిలివచ్చి మద్దతు పలికిన పార్టీలువైఎస్ జగన్ ధర్నాకు మద్దతుగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ సీనియర్ ఎంపీ రాంగోపాల్ యాదవ్, శివసేన (ఉధ్దవ్ థాక్రే)పార్టీ ఎంపీలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, అరవింద్ సావంత్, ఏఐఎడీఎంకే సీనియర్ ఎంపీ తంబిదొరై, మరో ఎంపీ నటరాజన్ చంద్రశేఖరన్, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమా వలవన్, ఆ పార్టీ ఎంపీ రవికుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాజేంద్రపాల్ గౌతమ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీలు అబ్ధుల్ వాహబ్, హ్యారిస్ బీరన్, జేఎంఎం ఎంపీ విజయ్ హన్సక్ తదితరులు వైఎస్ జగన్ ధర్నాకు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్ సహా మిగతా నేతలంతా సభా వేదికపై ప్రదర్శించిన వీడియోలను, ఫొటో గ్యాలరీని వీక్షించారు. ఏపీలోని వివిధ జిల్లాల్లో జరిగిన దమనకాండను వైఎస్ జగన్ స్వయంగా నేతలకు వివరించారు. పార్టీ కార్యాలయాలపై బుల్డోజర్లతో దాడులు, వైఎస్ఆర్ విగ్రహాల విధ్వంసం, కార్యకర్తలను నడిరోడ్డుపై నరికి చంపుతున్న దృశ్యాలను చూసిన నేతలు ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి సైతం దాడులకు తెగబడ్డ వైనాలు, స్వయంగా ఎంపీ మిథున్‌రెడ్డిపై జరిగిన దాడి దృశ్యాలను చూసి రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను చూసిన అనంతరం మాట్లాడిన నేతలు రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని, కేంద్రం చొరవ చూపి ఈ దమనకాండను ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నరమేధానికి చోటు లేదని, నేరమయ రాజకీయాలు మానుకుంటేనే పార్టీలు మనుగడ సాధిస్తాయని అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. బుల్డోజర్ సంస్కృతిని పెంచి పోషిస్తూ, ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని టీడీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వైఎస్ జగన్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వానికి కనీసం ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగే హక్కులేదని ఉధ్దవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి వెంటనే స్పందించి, ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఇదే పార్టీకి చెందిన మరో ఎంపీ అరవింద్ సావంత్ సైతం టీడీపీ మంత్రి నారా లోకేశ్ తీరును తూర్పారబట్టారు. ‘ఏపీలో సీఎం కొడుకు ఏకంగా రెడ్‌బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. విపక్షంపై దాడులను ప్రోత్సహిస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా విధానం ఎంత వరకు సమంజసం?’ అని నిలదీశారు. మిగతా పార్టీల ఎంపీలు సైతం టీడీపీ అరాచకాలను ఖండించారు. నరమేధాన్ని అడ్డుకునే చర్యల్లో భాగంగా వైఎస్ జగన్ చేసే ప్రతి పోరాటానికి మద్దతుగా ఉంటామని సభా వేదికగా ప్రకటించారు. కాగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ కార్యక్రమం అనంతరం వైఎస్ జగన్‌ను విడిగా కలిసి సంఘీభావం తెలిపారు.జగన్ ఇంటర్వ్యూకు పోటాపోటీటీడీపీ అరాచక పాలనపై గళమెత్తిన వైఎస్ జగన్ ఇంటర్వ్యూలను తీసుకునేందుకు జాతీయ మీడియా పోటీ పడింది. ఏఎన్ఐ, పీటీఐ, రిపబ్లిక్ టీవీ, ఇండియా టుడే, ఎన్డీటీవీ సహా పలు ఛానళ్లు ఇంటర్వ్యూలు తీసుకున్నాయి. సాయంత్రం 4 గంటలకు సైతం ఇంకా చాలా మంది జర్నలిస్టులు ఇంటర్వ్యూలకు పోటీ పడుతుండటంతో మిగతా వారికి మరో సమయంలో ఇస్తామని నేతలు సర్ది చెప్పాల్సి వచ్చింది. -
అరాచక పాలనపై ధర్మాగ్రహ జ్వాల.. ఢిల్లీలో జగన్ ధర్నా (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీ ధర్నా.. జగన్‌కు జాతీయ నేతల మద్దతు (ఫొటోలు)
-
ఏపీలో ఇలాంటి ఘోరాలా?.. మీరు చూశారా?
-
ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?: వైఎస్ జగన్
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నా చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతో పాటు, చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికి కూడా విఘాతం కలుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మీడియా ముందుకు రావాల్సి వస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయి. వందల ఇళ్లను ధ్వంసం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా అక్రమ కేసులో పెట్టారు. గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. వైఎస్సార్సీపీని అణగదొక్కడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం అయింది. అందుకే హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహిస్తోంది. మా హయాంలో ఏనాడూ ఇలాంటి దాడులు, దౌర్జన్యాల్ని ప్రొత్సహించలేదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు, ఇలాంటివేమీ చేయలేదు. హత్యలు చేయలేదు. దాడులు చేయలేదు. ఆస్తుల విధ్వంసం చేయలేదు. ఎవరి ఇళ్లలోకి చొరబడి, వారిని వేధించలేదు. వారిపై దాడి చేయలేదు. ఎక్కడా పౌరుల హక్కులకు భంగం కలిగించలేదు. చంద్రబాబు కుమారుడైనా నారా లోకేష్ ఒక మంత్రిగా ఉండి.. రెడ్‌బుక్ పేరిట హోర్డింగ్‌లు పెట్టాడు. ఎవరెవరి మీద దాడుల చేయాలి. ఎవరిని ఎలా వేధించాలి. అన్న అన్ని వివరాలు రాసినట్టు.. అందులో లోకేష్ స్వయంగా ప్రకటించారు. తనకు నచ్చనివారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పోలీసులు కూడా ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే, వాటన్నింటినీ వెంటనే ఆపలేకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడుల, ఆస్తుల విధ్వంసం, చీనీ తోటల ధ్వంసం.. వీటన్నింటిపై ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశాము. వీడియోలు కూడా ప్రదర్శిస్తున్నాం. దయచేసి, ఒక్కసారి ఈ ఫోటోలు, వీడియోలు చూడండి. రాష్ట్రంలో దారుణస్థితిని అర్ధం చేసుకొండి. మా పార్టీ ప్రజా ప్రతినిధులు.. చివరకు ఒక ఎంపీ కూడా తన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి. మా పార్టీ ఎంపీ మిధున్‌రెడ్డిపై పట్టపగలే రాళ్లదాడి జరిగింది. ఆయన వాహనాలు ధ్వంసం చేశారు.ఇన్ని జరుగుతున్నా, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఆ విధంగా రాజ్యాంగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. అంత కంటే దారుణం ఏమిటంటే.. మా రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న వారి నుంచి కాపాడకపోగా.. వారిపై కేసులు నమోదు చేయకపోగా.. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. ఇంత కంటే దారుణం ఇంకా ఎక్కడైనా ఉంటుందా?. దయచేసి, మీరంతా ఇక్కడి ఫోటోలు, వీడియోలు చూడండి. ఇలాంటి ఘటనలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగడం సబబేనా? అన్నది ఆలోచించండి. ఇక్కడ మా నిరసన కార్యక్రమానికి మీరు అండగా నిలవమని కోరుతున్నాను. లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం. అందుకే మరోసారి నేషనల్ మీడియాను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఇక్కడి ఫోటోలు, వీడియోలు చూడండి. ఇలాంటివి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగడం సబబేనా? అన్నది ఆలోచించండి.ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, మీ ఇంట్లోకి చొరబడి, మీపై దాడి చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని మీరెలా ఎదుర్కొంటారు? దానిపై మీరెలా స్పందిస్తారు?. కాబట్టి, దయచేసి ఇక్కడి గ్యాలరీలో ఫోటోలు, వీడియోలు చూడండి. రాష్ట్రంలో దారుణ పరిస్థితి గురించి తెలుసుకొండి. ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి అని జగన్ విజ్ఞప్తి చేశారు. -
YSRCP ధర్నా.. జగన్‌కు జాతీయ నేతల మద్దతు
YSRCP Protest in Delhi Updates సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై ఢిల్లీ వేదికగా చేపట్టిన వైఎస్సార్సీపీ నిరసన ముగిసింది. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులంతా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ ధర్నాకు జాతీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు.సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఉద్దవ్ శివసేన, అన్నాడీఎంకే, జీఎంఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. ఏపీలో విధ్వంసాలపై ప్రతి ఒక్కరూ గళం విప్పాలని వైఎస్ జగన్ అన్నారు. ఏపీలో దాడులను ముక్తకంఠంతో ఖండించారని.. సంఘీభావం తెలిపిన జాతీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. I sincerely thank the @samajwadiparty, @AamAadmiParty, @AIADMKOfficial, @ShivSenaUBT_, @AITCofficial, @VCKofficials, IUML, @yadavakhilesh, @priyankac19, @rautsanjay61, @AdvRajendraPal, @AbdulWahabPV, @proframgopalya1, Thambi Durai, @MdNadimulHaque6, @AGSawant and @thirumaofficial…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2024 జాతీయ మీడియాతో వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతపైనే దాడి చేశారుమాజీ ఎంపీ, దళిత నేత రెడ్డప్ప ఇంటిపై దాడి చేశారు.. కార్లను ధ్వంసం చేశారుఏపీలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. అందుకు తగ్గట్లే దాడుల పర్వం కొనసాగుతోందిప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడుల్ని ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందిజాతీయ పార్టీలకు ఆహ్వానం పంపాం.. ఇక్కడికి వచ్చి టీడీపీ ప్రభుత్వ అరాచకాలను చూడాలని(ఎగ్జిబిషన్ గ్యాలరీ) కోరాంరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి అపాయింట్మెంట్ కోరాం.. వాళ్లకు ఏపీలో జరుగుతున్న హింసను వివరిస్తాంరాష్ట్రపతి పాలన విధించాలి..ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఘటనల వీడియోలు చూసిన తరవాత, నాకు ఒక్కటే అనిపించింది. స్వతంత్య్ర భారతావనిలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో కనీసం వాటిని ఊహించలేము. మరి రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ ఏమైంది? గవర్నర్ ఏం చేస్తున్నారు?. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. విపక్ష పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారు. వారిపై దాడి చేస్తున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి, టీడీపీ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. అందుకే నేను కేంద్రాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా కళ్లు తెరవాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి.-రాంగోపాల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ (రాజ్యసభ)ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలిఎన్నికల తరవాత ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో.. అన్న విషయాలు చూపారు. మాకు చాలా ఆవేదన కలిగింది. రాష్ట్రాల్లో ఏం జరిగినా, ఢిల్లీకి పట్టదు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, ఎప్పుడూ, ఎక్కడా చోటు చేసుకోవడం ఏ మాత్రం సరి కాదు. ఇలాంటి వాటిని మేము కచ్చితంగా వ్యతిరేకిస్తాము. మేమంతా మీకు ఒకే భరోసా ఇస్తున్నాము. ఎక్కడైతే వ్యవస్థలపై దాడులు జరుగుతాయో, పార్టీలపై దౌర్జన్యాలు కొనసాగుతాయో.. ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలుగుతుందో.. ఇండియా కూటమి అక్కడ నిలబడి పోరాడుతుంది. భుజం భుజం కలిపి పని చేస్తుంది. ఎందుకంటే, ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ పోరాటమే కాదు.. మీ పార్టీ కార్యకర్తలకు సంబంధించింది మాత్రమే కాదు.. ఎక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా.. ఇది ఏ ఒక్కరికి మంచిది కాదు. అందుకే మేము అండగా నిలుస్తాము. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్ర గవర్నర్ స్పందించాలి. సుప్రీం కోర్టు కూడా సుమోటోగా కేసు స్వీకరించాలి.-ప్రియాంక చతుర్వేది, శివసేన నాయకురాలుఏపీలో పరిస్థితి చూసి షాక్ తిన్నా..నేను బెంగాల్ నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చూసి, షాక్ తిన్నాను. రాష్ట్రంలో ఏ స్థాయిలో దౌర్జన్యాలు జరిగాయో చూస్తే, బాధ అనిపిస్తోంది. ఇళ్లపై దాడులు చేశారు. ఆ ఘటనలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే కేంద్రం సుమోటోగా చర్య తీసుకోవాలి. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి చక్కదిద్దాలి. మేము జగన్‌గారికి, రాష్ట్ర ప్రజలకు అండగా, తోడుగా నిలబడతాము.-నదిముల్‌హక్ (తృణమూల్ కాంగ్రెస్)ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం..న్యాయం కోసం మీరు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు మేము ఇక్కడికి వచ్చాము. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఫోటోలు, వీడియోల క్లిప్పింగ్స్ అన్నీ చూశాము. నిజంగా షాక్‌కు గురయ్యాము. ఎన్నికలు జరిగిన నెల రోజుల్లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా, అధికార టీడీపీ అనేక దౌర్జన్యాలు చేసింది. వారి ఇళ్లపైన పడిన టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఆస్తులు ధ్వంసం చేశారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. పక్కాగా ప్లాన్ చేసి మరీ ఈ దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన టాప్ లీడర్ల ఆదేశాల మేరకే, ఆ పార్టీ కార్యకర్తలు ఈ దాడులు, దౌర్జన్యాలు చేశారు.ముఖ్యంగా ప్రస్తుత సీఎం కొడుకు, తన పార్టీ కేడర్‌ను ఈ దాడులకు ఉసి గొల్పుతున్నాడు. మా పార్టీ తరపున ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీలో జరుగుతున్న అరాచకాలను కేంద్రం కూడా పరోక్షంగా సమర్థిస్తోంది. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలి. ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలి. మా పార్టీ తరపున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. జగన్‌కు అండగా నిలుస్తాం. ఏపీలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయాలి. సంబంధిత నాయకులపై కేసులు నమోదు చేయాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ దిశలో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేం డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనేలా చూడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలకు చోటు లేదు. అందుకే దీన్ని ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు కూడా ఖండించాలి. మేమ తప్పనిసరిగా మీకు అండగా నిలుస్తాము. న్యాయం కోసం మీరు చేస్తున్న పోరాటంలో మీకు మద్దతునిస్తామని హామీ ఇస్తున్నాను.-తిరుమా వలవన్. వీసీకే పార్టీ అధ్యక్షుడు (తమిళనాడు)వారికి, దేశ ద్రోహులకు తేడా ఏముంది?ఇది చాలా బాధాకరం. దేశం ఎటు పోతుంది? దేశంలో ఏం జరుగుతోంది? నాడు స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ వ్యవస్థను రూపొందించిన వారు, దీన్ని ఆనాడు ఊహించారా?. ఎన్నికల్లో గెల్చిన పార్టీ, ఓడిన పార్టీ వారిపై దాడులు చేసి ప్రాణాలు తీయడం.. ఏమిటిదంతా?. వారికి, దేశ ద్రోహులకు తేడా ఏముంది? దేశ ద్రోహుల కంటే వీరు తక్కువ కాదు. కానీ కేంద్రం ఏం చేస్తోంది. ఎన్డీఏ కూటమి కూడా ఎందుకు స్పందించడం లేదు. ఏపీలో జరుగుతున్న ఘటనలపై కేవలం దాడులు, దౌర్జన్యాల కోణంలోనే కాకుండా, దేశద్రోహ కేసులు నమోదు చేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవి ఏ మాత్రం ఆమోదం కాదు. ఇలా దాడులు చేస్తున్న వారిని వెంటనే జైలుకు పంపాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. వారు దేశానికే ప్రమాదకారిగా మారారు కాబట్టి.. వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.-రాజేంద్రపాల్ గౌతమ్. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో ఫోటో గ్యాలరీని ఎఐఎడిఎంకే ఎంపీ (రాజ్యసభ) చంద్రశేఖర్ సందర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు జరుగుతుంటాయి. ప్రజా తీర్పుకు అనుగుణంగా పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి.అయితే గెల్చిన పార్టీ, ఓడిన పార్టీపై దాడులు చేయడం, వేధించడం సరికాదుఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అంత దారుణంగా ఉందిఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా, అధికారంలోకి వచ్చినా, ప్రజలందరినీ కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కానీ, ఏపీలో అది జరగడం లేదుఅందుకే ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరవాలని.. రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు అరికట్టాలని, శాంతి భద్రతలు కాపాడాలని కోరుతున్నానురాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, శాంతి భద్రతలు బాగు పడడానికి.. మేము, జగన్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించాముఆ దిశలోనే మా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ఇస్తుంది.ఏపీలో క్షీణించిన శాంతి భద్రతలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలిఏపీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలిపరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలిఅత్యాచారాల పైన అందరూ పోరాటం చేయాలిఏపీ తరహాలో తమిళనాడులో దాడులు జరుగుతున్నాయిశాంతిభద్రతలు క్షీణించాయిదాడులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి:::తంబీ దురై, అన్నా డీఎంకే ఎంపీ ఏపీ మణిపూర్ లాగా మారుతోందిఎవరు వెళ్ళిపోయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిలబడ్డారుఎవరికైనా అధికారం వస్తుంది పోతుందిప్రతీకార దాడులు, అత్యాచారాలు దారుణంఈ దాడులు చూస్తే బాధ కలుగుతోందివైఎస్ జగన్ కు మద్దతు ఇస్తున్నాం:::అరవింద్ సావంత్, శివసేన ఎంపీ( ఉద్దవ్ వర్గం)వైఎస్సార్సీపీ పోరాటానికి శివసేన మద్దతువైఎస్ఆర్సీపీ జంతర్ మంతర్ ధర్నాకు మద్దతు పలికిన శివసేన జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్జగన్ పోరాటానికి మద్దతు ప్రకటించిన అరవింద్ సావంత్ వైఎస్సార్సీపీ ధర్నాకు అన్నాడీఎంకే మద్దతుఏపీ కూటమి పాలనపై వైఎస్సార్సీపీ ఢిల్లీలో ధర్నాధర్నాకు మద్దతు తెలిపిన అన్నాడీఎంకే పార్టీజగన్ను కలిసిన అన్నాడీఎంకే ఎంపీ తంబి దొరైఏపీ అరాచకాలను తంబి దొరైకు వివరించిన జగన్ చంద్రబాబుకు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదుఏపీలో చట్ట బద్ద పాలన జరగడం లేదుకేంద్ర హోం శాఖ , ఏపీకి స్పెషల్ టీమ్ పంపి ఈ దారుణ దాడులపై స్వతంత్ర దర్యాప్తు చేయాలిఎవరు అధికారంలో ఉన్నా కార్యకర్తలపై దాడులు సరికాదుఅధికారం రావడం పోవడం సహజంవైఎస్ జగన్ కు మద్దతు ఇస్తున్నాం:::సంజయ్ రౌత్, ఉద్ధవ్ శివసేన ఎంపీ వైఎస్సార్సీపీ పోరాటానికి ఉద్దవ్ శివనసేన మద్దతుజగన్ కలిసి సంఘీభావం తెలిపిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది సంజయ్‌కు రాష్ట్రంలో గతి తప్పిన లా అండర్ ఆర్డర్ పరిస్థితుల్ని వివరిస్తున్న జగన్ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదుప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదువిపక్షాలపై అరాచకాలు మంచి సంప్రదాయం కాదుఅధికారంలో ఉన్నవాళ్లు శాంతియుతంగా ఉండాలిఇవాళ చంద్రబాబు సీఎం.. జగన్ అధికారంలో లేకపోవచ్చు.. కానీ రేపు జగన్ మళ్లీ సీఎం కావొచ్చుఏ పార్టీకైనా కార్యకర్తలే బలంకార్యకర్తల కోసం వైఎస్ జగన్ పోరాడుతున్నారుయూపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది.. బుల్డోజర్ రాజకీయం నడుస్తోందిప్రజాస్వామ్యంలో దాడుల్ని అందరూ ఖండించాలి::: అఖిలేష్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నిరసనకు సమాజ్ వాదీ పార్టీ సంఘీభావంజగన్ ను కలిసి మద్దతు ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఎంపీ రాంగోపాల్ యాదవ్అఖిలేష్కు టీడీపీ హింసకు సంబంధించి వీడియోలు చూపించిన జగన్ వైఎస్ఆర్సీపీ నిరసనకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ సంఘీభావంవైఎస్ జగన్ కలిసి సంఘీభావం ప్రకటించిన వాహబ్ ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు : వైఎస్ జగన్ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా?కూటమి అధికారంలోకి వచ్చాక 30 మందికిపైగా వైఎస్సార్సీపీ కార్యకర్తల హత్యప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు.లోకేష్ రెడ్‌బుక్ హోర్డింగ్‌లు ఏపీలో పెట్టారు.మేం అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదువందల ఇళ్లను ధ్వంసం చేశారు. గిట్టనవారి పంటలను కూడా ధ్వంసం చేశారు.కూటమి ప్రభుత్వం దాడులతో పాలన సాగిస్తోందిఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: వైఎస్ జగన్ నిరసనలో జగన్‌తో పాటు పాల్గొననున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలుజాతీయ స్థాయిలో ఏపీలో కొనసాగుతున్న అరాచకాల్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే నిరసనఏపీ హింసాత్మక ఘటనలపై ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ఏపీలో విధ్వంస పాలన కొనసాగుతోందివైఎస్సార్సీపీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయిప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు::: వంగ గీతా ఏపీలో విధ్వంస పాలన నడుస్తోందిరాక్షస పాలన సాగుతోంది:::దేవినేని అవినాష్ అమాయకులను తీవ్రంగా కొడుతున్నారువైఎస్సార్సీపీ లక్ష్యంగా దాడులు చేస్తున్నారువినుకొండలో రషీద్‌ను నడిరొడ్డు మీద హత్య చేశారు50 రోజుల్లో ఎన్నో ఘోరాలు జరిగాయి కాబట్టే ధర్నా చేస్తున్నాంఅరాచక పాలనను అరికట్టాలని ఢిల్లీ వేదికగా ధర్నా:::అంబటి ఏపీలో టీడీపీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయినిన్న కూడా వైఎస్సార్సీపీ నేతపై దాడి జరిగిందివైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారుఅసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నాయిరాష్ట్రంలో 31 హత్యలు జరిగాయి.. వెయ్యికిపైగా దాడులు జరిగాయిఏపీలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందిఏపీలో అరాచకాలను జాతీయస్థాయిలో తీసుకెళ్లేందుకే ధర్నా::: సజ్జలవైఎస్సార్సీపీ టార్గెట్‌గా దాడులు చేస్తున్నారుఏపీ పరిస్థితులు జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకే ధర్నా::: ఎమ్మెల్సీ భరత్ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందిరాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది::: వరుదు కల్యాణి ఏపీలో జరుగుతున్న హింసాకాండపై ధర్నాఏపీలో 31 హత్యలు జరిగాయి300 హత్యాయత్నాలు, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారుఏపీ పరిస్థితులు దేశ ప్రజలకు తెలిసేందుకే ధర్నా:::పుష్పశ్రీవాణి👉వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు, కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ అరాచక పాలనను.. దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఢిల్లీలో ఇవాళ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5గం. వరకు ఈ నిరసన కొనసాగనుంది.👉ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఆంక్షలు విధించారు. ఏపీ భవన్ గేట్లు మూసేశారు. జగన్ ధర్నా నేపథ్యంలోనే నిషేధాజ్ఞల నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. 👉ఏపీలో ప్రతీకార రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. గతంలో.. ఎన్నడూ ఇలాంటివి జరగలేదు. గత ఐదేళ్లు శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది అవి క్షీణిస్తూ వచ్చాయి. చంద్రబాబు రాష్ట్రంలో చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. TDP కేడర్‌ను ఉసిగొల్పి రాష్ట్రంలో నరమేధాన్ని సృష్టిస్తున్నారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు.. ఆఖరికి ఓట్లు వేశారన్న కారణంగా కూడా దాడులకు తెగబడుతున్నాయి టీడీపీ శ్రేణులు. 👉 ఢిల్లీ ధర్నాలో టీడీపీ కూటమి ఆటవిక పాలనకు నిదర్శనంగా.. ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది వైఎస్సార్సీపీ. ఇప్పటివరకు జరిగిన దాడుల తాలుకా ఫొటోలు, వీడియో ఫుటేజీలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనుంది. తద్వారా ప్రభుత్వ ప్రేరేపిత హత్యాకాండను, రాష్ట్రంలో పరిస్థితి తీవ్రతను దేశం దృష్టికి తీసుకెళ్లనుంది.👉 జంతర్ మంతర్‌లో ఈ ఉదయం వైఎస్సార్సీపీ ధర్నా కార్యక్రమం జరగనుంది. ఈ నిరసన కార్యక్రమానికి పోలీసుల నుంచి వైఎస్సార్సీపీకి అనుమతి లభించింది. వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర కీలక నేతలు అంతా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనపై నిరసన గళం విప్పుతూ.. మీడియాతో జగన్ మాట్లాడనున్నారు. అలాగే.. ఫొటో, వీడియో ఎగ్జిబిషన్ ద్వారా ఏపీలో కొనసాగుతున్న నరమేధాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లనున్నారాయన. 👉టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దాడులు, హత్యలు, హత్యాచారాలు.. హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా వైఎస్సార్సీపీని టార్గెట్ చేసుకుని అధికారి టీడీపీ కూటమి చేస్తున్న దాడులను వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. అధికారం రాకముందు తమ శ్రేణుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లు.. అధికారం చేపట్టాక దాడులపై మౌనం వహించడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 👉ఈ నెలన్నర కూటమి పాలనలో.. రాష్ట్రంలో 36 హత్యలు.. నలుగురిపై అత్యాచారాలు, ఆపై హత్యలు.. 16 హత్యాచారాలు.. వెయ్యికి పైగా దాడులతో రాష్ట్రంలో అధఃపాతాళానికి శాంతి భద్రతలు దిగజారాయి. 👉ఎన్నికల ప్రచారంలో.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, ఇతర కూటమి నేతలు.. వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలంటూ బహిరంగంగానే ఆ పార్టీల కేడర్లకు పిలుపు ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ మేరకు బ్యానర్లు కూడా రాష్ట్రమంతా ఏర్పాటు చేశారు. పర్యవసానంగా వందల సంఖ్యలో దాడులు.. విధ్వంసాలతో కూటమి పార్టీల శ్రేణులు రాష్ట్రాన్ని హడలెత్తిస్తున్నాయి. వినుకొండ ఘటనతో.. ఆ హింస తారాస్థాయికి చేరింది. 👉 ఎన్నికల హామీల అమలుకు కూటమి ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని జగన్ భావించారు. అయితే జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తమై వెంటనే ఆయన రంగంలోకి దిగారు. వైఎస్సార్సీపీ కేడర్‌కు మనోధైర్యం కలిగించడంతో పాటు వినుకొండ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలోనే ఢిల్లీ ధర్నా నిర్ణయాన్ని ప్రకటించారు. 👉ఏపీలో కొనసాగుతున్న ఆటవిక పాలనపై జోక్యం చేసుకోవాలి, గత 50 రోజులుగా రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు సంస్థలతో విచారణ జరపాలని ఆయన కేంద్రాన్ని కోరబోతున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న వైఎస్సార్సీపీ అధినేత.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి, ఇతర కేంద్ర మంత్రల్ని కలుస్తారు. సహేతుమైన కారణాల్ని వాళ్లకు వివరించి.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే పలు జాతీయ పార్టీల నేతల్ని కలిసి ఆయన రాష్ట్రం పరిస్థితి వివరించి.. మద్దతు కోరనున్నారు. 👉టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తోన్న దారుణాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే పోరాటం ప్రారంభించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని.. హత్యలు, హత్యాచారాలు, దాడులతో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారని.. తక్షణమే జోక్యం చేసుకుని శాంతిభద్రతలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 👉మారణకాండకు సంబంధించి ఫొటోలు, వీడియోలు వంటి సాక్ష్యాధారాలున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని ఎత్తిచూపారు. టీడీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకుని, శాంతిభద్రతలను పరిరక్షించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి కోరారు. చట్టసభల్లో నల్ల కండువాలతో నిరసన గళం వినిపించారు. కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని ఇప్పుడు జాతీయ స్థాయిలో పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. -
ఆఖరికి.. ఏపీ అసెంబ్లీలోనూ అబద్ధాలు!
అమరావతి, సాక్షి: ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి రాగానే పాలన మీద ఫోకస్ చేస్తుంది. కానీ, చంద్రబాబు మాత్రం శ్వేత పత్రాల పేరుతో, సమీక్షల పేరిట జగన్ పాలనపై నిత్యం నిందలు వేస్తున్నారు. చూస్తుంటే.. ఇలాగే ఐదేళ్లు గడిపిస్తారేమో అనిపించేలా ఉంది ఆయన వ్యవహారం. అయితే తాజాగా అసెంబ్లీ సాక్షిగా.. అదీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించింది కూటమి ప్రభుత్వం.తన పాలనలో ఏనాడూ సంక్షేమం, కనీస మౌలిక వసతుల గురించి పట్టించుకోని చంద్రబాబు.. విజనరీ నాయకుడని, విభజిత ఏపీ అభివృద్ధికి కృషి చేశారని గవర్నర్ ప్రసంగంలో చెప్పించుకున్నారు. అంతేకాదు 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందని, 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయని, పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో అబద్ధపు ప్రసంగాన్ని చదివించారు. వాస్తవానికి.. జగన్ పాలన చేపట్టే నాటికి అభివృద్ధి కుంటుపడి ఉంది. ఆ కారణంగానే 2019లో అధికార మార్పిడి జరిగింది కూడా. అయితే కరోనా లాంటి విపత్తుతో రెండేళ్లు గడిచినప్పటికీ.. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటి మీద ఫోకస్‌తోనే జగన్ పాలన కొనసాగింది. సంబంధిత వార్త: జగన్ వల్లే పెట్టుబడులు పైపైకి..అమరావతిని కొంత మంది పెట్టుబడిదారుల కోసమే చంద్రబాబు తెర మీదకు తెచ్చారు. కానీ, జగన్ అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. ఈ మూడింటిలో అమరావతి కూడా ఒక రాజధానిగానే ఉంది కదా!. సంబంధిత వార్త: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు సహేతుకమే!గత ఐదేళ్లలో ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న గవర్నర్ ప్రసంగం.. కూటమి ప్రభుత్వంలో గత 45 రోజులుగా శాంతి భద్రతల ఏ స్థాయిలో ఘోరంగా దెబ్బ తిన్నాయో స్పందించలేదు. కనీసం లా అండ్ ఆర్డర్ పునరుద్ధరణ ప్రస్తావన కూడా లేదు. వివిధ రంగాల్లో నష్టాలు వచ్చాయంటూ కాకి లెక్కలతో సాగింది గవర్నర్ ప్రసంగం. పైగా గత ఐదేళ్లుగా అవి ఎల్లో మీడియాలో వచ్చిన ఊహాగాన కథనాలు.. కల్పిత రాతలే. సంబంధిత వార్త: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ ముందడుగుఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించామన్న చంద్రబాబు ప్రభుత్వం.. సూపర్‌సిక్స్ వాగ్దానాలు ఎన్ని నెరవేర్చారో మాత్రం చెప్పలేదు కానీ రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలన్న మాటతో గవర్నర్ ప్రసంగం ముగిసింది. అయితే.. ఇప్పటికే జగన్ వల్లే ఖజానా ఖాళీగా ఉందంటూ చెబుతూ వస్తున్న చంద్రబాబు.. మళ్లీ ఎన్నికలొచ్చేదాకా ఇదే మాట చెబుతారేమో అనే అనుమానాలు ఉన్నాయి. దీనికి తోడు అసెంబ్లీలో శ్వేత పత్రాల పేరుతో అబద్ధాలకు ఆయన రెడీ అయ్యాడు కూడా. జనాలు కోరుకునేది తమకు ఇచ్చిన హామీల అమలు. అంతేకానీ ఇలా నిందలు వేస్తూ వెళ్లడం కాదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం.. చంద్రబాబును, ఆయన మాటలను, కూటమి పాలనను ప్రజలు అసహ్యించుకునే రోజులు తొందరగానే వస్తాయి. -
కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందా?
ఆంధ్రప్రదేశ్‌లో ఆటవిక పాలన సాగుతున్న తీరు, పైశాచికంగా రాజకీయ ప్రత్యర్ధులను నరుకుతున్న వైనం, ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తిపై సైతం దాడులు చేసి ఆయన వాహనాలను ధ్వంసం చేసిన ఘట్టాలు గమనిస్తుంటే రాజకీయాలలో నలభైఆరేళ్ల సీనియర్ చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా ఉందా?అనే భావన కలగక మానదు. పైకి ఎప్పుడూ నీతులు వల్లిస్తూ, రౌడీయిజంను అణచివేస్తా.. అంటూ కబుర్లు చెప్పడం, దారుణమైన అకృత్యాలు జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోవడమే కాకుండా ఆ నేరాలు చేసేవారిని ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేయడం గమనిస్తే, ఏపీ ప్రజలు ఇలాంటి పాలననా కోరుకుంది అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చిన రీతిలో అరాచకంగా మాట్లాడిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్,తదితర టీడీపీ, జనసేన నేతలు అదే అరాచకాన్ని నిజం చేసి చూపుతున్నారు. వారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా మద్దతు ఇస్తున్న పద్దతి నీచాతినీచంగా ఉంది.చివరికి హత్యలు చేసినవారిని, దాడులు చేసి వాహనాలను నాశనం చేసినవారిని సైతం ఈ మీడియా సంస్థలు వెనుకేసుకు వస్తూ జర్నలిజం స్థాయిని పాతాళానికి తీసుకువెళ్లాయి. ఎవరిది తప్పు అయినా వారి గురించి రాయవలసిన వీరు కేవలం టీడీపీనే వెనుకేసుకు రావడానికే మీడియాను నడుపుతున్నారు. అందుకు ఆ మీడియా యజమానులు ఏ మాత్రం సిగ్గుపడడకపోవడం విషాదం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు ఇంతవరకు సాగిన విధ్వంసకాండ ప్రజలను భయబ్రాంతులను చేస్తోంది. వారేదో వైఎస్సార్సీపీ కార్యకర్తల అంతు చూస్తున్నామని భావిస్తున్నారేమో తెలియదు కాని, చివరికి జరిగేది ప్రజలే టీడీపీ వారి అంతు చూస్తే పరిస్థితి వస్తుంది. వినుకొండలో నడిరోడ్డులో కత్తితో వైఎస్సార్సీపీ కార్యకర్తను బహిరంగంగా,పాశవికంగా నరికిన ఘటన చంద్రబాబు రాక్షస పాలనకు అద్దం పడుతుంది. గతంలో జగన్ ప్రభుత్వంపై సైకో పాలన అంటూ ఏది పడితే అది మాట్లాడే ఆయన ఇప్పుడు నిజంగానే సైకో లు అంటే ఎలా ఉంటారో, శాడిజం అంటే ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపిస్తున్నారు. టీడీపీకి ఓట్లు వేసినవారు తమను తాము నిందించుకునే దశకు తీసుకువెళుతున్నారు.వినుకొండలో పాతపగల కారణంగా హత్య జరిగిందని టీడీపీవారు, పోలీసులు, వారికి మద్దతు ఇచ్చే ఈనాడు,ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా ప్రచారం చేశాయి. ఒకే అదే కరెక్టు అనుకుందాం. పాత పగలు ఎప్పటి నుంచో ఉంటే ఇప్పుడే కూటమి అధికారంలోకి వచ్చాకే ఎందుకు కత్తితో నరికాడు.31 మందిని రాష్ట్రంలో టీడీపీ వారు హత్య చేసినా ఏమీ కాలేదు కనుక ఇప్పుడు తనకు ఏమీ కాదులే. తమ ప్రభుత్వమే ఉందిలే అనే ధీమాతో కాదా?అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా?పైగా మంత్రి లోకేష్ విపక్షంలో ఉన్నప్పుడు యువగళం యాత్రలో తిరుగుతూ ఒక్కొక్క టీడీపీ కార్యకర్త కనీసం పన్నెండు కేసులు పెట్టించుకోవాలని బహిరంగంగానే చెబుతూ వచ్చారు.అలా అయితేనే తనను కలవవచ్చని, పదవులు ఇస్తామని ఆయన అనేవారు. దానిని స్పూర్తిగా తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది వాస్తవం అనిపిస్తుంది. ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి ఇస్తామని లోకేష్ ఆఫర్ ఇచ్చేవారు. పుంగనూరులో అరాచకం నానాటికి పెట్రేగిపోతూనే ఉంది. విపక్ష నేతగా చంద్రబాబు ఉన్నప్పుడు పుంగనూరు వద్ద ఆయన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీస్ వాన్ ను కాల్చివేశారు. ఇప్పటికే అదే రీతిలో వ్యవహరిస్తున్నారనిపిస్తుంది. దళిత నేత, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్ద ఉన్న రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన తీరు ఎపిలో పోలీసు యంత్రాంగం ఎంత అసమర్ధంగా ఉన్నదీ తెలియచేస్తుంది. దీనికి ఈనాడు, జ్యోతి తదితర ఎల్లో మీడియా కవరింగ్ ఇవ్వడం గమనిస్తే వీరు ఇంతగా దిగజారారా అనిపిస్తుంది. తాడిచెట్టు ఎందుకు ఎక్కారంటే దూడమేతకు అన్నట్లుగా వీరు ఒక వాదన తయారు చేశారు. కొందరు రైతులతో కలిసి టీడీపీ కార్యకర్తలు పుంగనూరు వచ్చిన రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డిని కలిసి ఆ ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయిర్ల నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరడానికి వెళ్లారట.అక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారట. ఈ కట్టుకధ అల్లడానికి సిగ్గుండాలి. అసలు ఒక ఎంపీ తన కార్యకర్తలతో సమావేశం అవుతుంటే వేరే పార్టీవారు వెళ్లడం ఏమిటి?అంగళ్లు గ్రామం వద్ద విపక్ష నేతగా చంద్రబాబు పర్యటిస్తున్న ప్రాంతానికి కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెళ్లినప్పుడు ఆయన ఎంతగా దూషించింది,టిడిపివారు ఏ రకంగా దాడి చేసింది తెలియదా!ఇప్పుడు టీడీపీ వారు ప్రత్యర్ది పార్టీ నేత ఇంటివద్దకు వెళ్లి రుబాబు చేయడం ఏమిటి? ప్రభుత్వం వైఎస్సార్సీపీది కానప్పుడు మిధున్ రెడ్డి వారి సమస్యను ఎలా తీర్చుతారు. ప్రభుత్వంలో ఉన్నదే టీడీపీ అయితే ,ఆ పార్టీవారు వైఎస్సార్‌సీపీవారిని సమస్యలపై కోరడం ఏమిటి? అంటే టీడీపీ ప్రభుత్వం అంత అసమర్దంగా ఉందని వారు అనుకున్నారా? పైగా రెడ్డప్ప ఇంటి వద్ద ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, వాహనాలపై రాళ్లు వేయడం,ఒక వాహనాన్ని తగులపెట్టడం.. ఇలా చేసినవారిని రౌడీలు అంటారా?లేక రైతులు అంటారా?టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచే ఈ దాడుల సంస్కృతి తీవ్రంగా మారిందా అన్న డౌటు వచ్చేలా పాలన సాగుతోందనిపిస్తుంది. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద పాదిరికుప్పం అనే గ్రామంలో కాంగ్రెస్ కు ఓటేశారన్న కారణంగా దళితులు కొందరిని, బహుశా ఐదుగురిని అనుకుంటా.. టీడీపీ వారు దహనం చేసిన ఘటన తీవ్ర సంచలనం అయింది. 1987 ప్రాంతంలో ప్రకాశం జిల్లా కారంచేడు వద్ద దళితులకు ఒక అగ్రవర్ణ సామాజికవర్గానికి మద్య గొడవలలో దళితులు పలువురు హత్యకు గురయ్యారు.1988లో టీడీపీకి చెందినవారు విజయవాడలో నడిరోడ్డులో నిరాహార దీక్షలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి రంగాను కత్తులు,గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఇలా బహిరంగంగా చంపడం అన్నది టీడీపీ గత చరిత్రలో కూడా ఉందన్నమాట.ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. ఆ సందర్భంలో ఒక సామాజికవర్గంవారితో పాటు టీడీపీ వారు కూడా నష్టపోయారు.వ్యక్తిగత కక్షలతో టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన గొడవలు చాలానే ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మారినప్పుడు గొడవ బీజేపీలు,హింసాకాండ జరగడం మాత్రం ఇదే అని చెప్పాలి. 2019 లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలాంటి ఘర్షణలు దాదాపు లేవనే చెప్పాలి. ఆ తర్వాత కాలంలో అక్కడక్కడా జరిగినా ఈ స్థాయిలో లేవన్నది వాస్తవం. కాకపోతే ఏ చిన్న గొడవ జరిగినా ఈనాడు వంటి మీడియా బూతద్దంలో చూపడం, తెలుగుదేశం పెద్ద ఎత్తున హడావుడి చేయడం జరిగేది.అలాంటిది ఇప్పుడు ఇంత దారుణంగా హత్యాకాండ జరుగుతుంటే సంబంధిత వార్తల వాస్తవాలను ఇవ్వకపోగా , ఎదురు బాధితులపైనే నెపం నెడుతూ ఎల్లో మీడియా కధనాలు ఇవ్వడం శోచనీయం. బాధ్యతాయుతంగా ఉండవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సరైన రీతిలో స్పందించకపోవడం సమాజానికి చెడ్డ సంకేతం పంపిస్తోంది.గతంలో లోకేష్ నేరాలు ఎక్కువ చేసినవారికి పెద్ద పదవులు అన్నట్లుగా ఇప్పుడు మర్డర్ చేయడం మంత్రి హోదా కలిగిన పదవికి టీడీపీలో అర్హత పొందినట్లు అవుతుందేమో తెలియదు. ఇప్పటికే వందలాది మంది టీడీపీ కార్యకర్తలు, నేతలు హింసాకాండలో పాల్గొన్నారు.బహుశా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నది కనుక వారిపై కేసులు పెద్దగా పెట్టి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వీరికి పదవులలో ప్రాధాన్యత ఇవ్వకపోతే వారిలో వారు గొడవలు పడతారో,ఏమో చూడాలి.తాము ఇంతమందిని చంపామని, లేదా ఇంత ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీవారిని కొట్టామని,ఇంత పెద్ద ఎత్తున ఇళ్లపై దాడులు చేశామని, కనుక తమకే పదవులు రావాలని డిమాండ్ చేసేలా ఉన్నారు.ఇప్పటికే కొన్ని వేల కుటుంబాలు టీడీపీ వారి ఘాతుకాలను తట్టుకోలేక ఊళ్లు వదలి వెళ్లిపోయాయి. కోట్ల రూపాయల విలువైన సుమారు 500 టీడీపీ వారు ధ్వంసం చేశారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలో చలనం లేదు. కనీసం ఈ దాడులు జరగకుండా చర్యలు చేపట్టండి అని చంద్రబాబు ప్రభుత్వానికి సలహా ఇవ్వలేని దుస్థితిలో కేంద్రం ఉంది. టీడీపీ ఎంపీల మద్దతు కీలకం కావడంతో బీజేపీ పెద్దలు మౌనం దాల్చారనుకోవాలి. పశ్చిమబెంగాల్ లో బీజేపీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని కేంద్ర బలగాలనుఅక్కడ రంగంలోకి దించారు?మరి ఎపి కి ఎంఉకు పంపలేదు? ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గత ప్రభుత్వ టైమ్ లో తన కార్యకర్తలను రెచ్చగొట్టేవారు. వైఎస్సార్సీపీవారి మెడలు పిసికాలని, కొట్టాలని ..ఇలా ఏవేవో తీవ్రమైన మాటలు చెప్పిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు .ఇందిరాగాంథీ అంతటి గొప్ప నేతే ఎలా ఓటమిపాలైందో చరిత్ర తెలియచేస్తుంది. ఎమర్జన్సీ విదించి ఆమె వందల మంది విపక్షనేతలను జైళ్లలో పెట్టించింది. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జైళ్ల నుంచి విడుదల అయిన విపక్ష నేతలంతా ఒక్కటై,ప్రజల మద్దతు కూడగట్టుకుని ఆమెను పరాజయం పాలు చేశారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. ఆ సంగతులన్నీ తెలిసినా చంద్రబాబు పాలన ఇలా హీనంగా సాగడం వల్ల ఏమి ప్రయోజనం దక్కుతుందో తెలియదు. ఈ ఘటనలతోనే ప్రతిపక్షం లేకుండా పోతుందని భావిస్తే అది భ్రమే అవుతుంది.గత ప్రభుత్వంలో జరిగాయి కనుక ఇప్పుడు ఇంత ఎక్కువ హింస జరుగుతోందని టీడీపీ,లేదా ఎల్లో మీడియా వాదించవచ్చు.అది కరెక్టా?కాదా?అన్నది పక్కనబెడితే , ఒకవేళ అది నిజమే అనుకున్నా,అంతకంటే ఘోరంగా హింసకాండ చేయమని ప్రజలు టీడీపీని ఎన్నుకున్నారా? తమ ప్రభుత్వం వచ్చింది ప్రత్యర్ధులపై కక్ష రాజకీయాలకు పాల్పడడానికే అని బహిరంగంగా చెప్పి చేయడమే మిగిలింది. ఏమి చేస్తాం?. ఇలాంటివారిని ఎన్నుకున్నామని ప్రజలు తమ నెత్తి తాము కొట్టుకోవడం తప్ప. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అసెంబ్లీలో నేడు వైఎస్సార్సీపీ నిరసనలు
అమరావతి, సాక్షి: ఏపీలో కొనసాగుతున్న అరాచకాలపై, హింసాత్మక ఘటనలపై నిరసనలు తెలిపేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలను అందుకు వేదికగా ఎంచుకుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రానున్నారు. గవర్నర్ ప్రసంగించే సమయంలో.. హత్యా రాజకీయాలపై వైఎస్సార్సీపీ నిరసన తెలిపే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. దీంతో శాంతి భద్రతల అంశంపై వైఎస్సార్సీపీ అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టనుంది. వినుకొండ వైస్సార్సీపీ యువకార్యకర్త రషీద్ హత్యా ఘటనతో పాటు వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన హత్యాయత్నాలను ప్రధానంగా ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రస్తావించాలని భావిస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ హామీల అమలు జాప్యాన్ని కూడా నిలదీసే అవకాశం లేకపోలేదు. ఇంకోవైపు..సాధారణంగా.. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంటాయి ప్రభుత్వాలు. ఇందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మూడు-నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గుచూపిస్తుండడం గమనార్హం. అంతేకాదు.. జగన్ పాలనను బద్నాం చేసే కుట్రలో భాగంగా సంక్షేమాన్ని స్కామ్‌లుగా తప్పుడు లెక్కలు చూపిస్తూ సచివాలయంలో శ్వేత పత్రాలు విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆ వ్యవహారం కొనసాగించాలనుకోవడం.. హామీల జాప్యానికే అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అంశంపైనా వైఎస్సార్సీపీ నిలదీసే అవకాశం ఉంది. ఇక.. ఇదీ చదవండి: ‘రెడ్‌బుక్’తో అరాచకం.. అదే రాజ్యాంగం అనే రీతిలో పాలనరషీద్ కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో.. ఏపీలో చంద్రబాబు ఆటవిక పాలనపై ఢిల్లీలో 24వ తేదీన ధర్నా చేస్తామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోపక్క అసెంబ్లీలోనూ తమ నిరసన కొనసాగుతుందని ఆ సమయంలోనే ప్రకటించారాయన. అలాగే.. పార్లమెంట్ సమావేశాల్లోనూ ఏపీ పరిస్థితిని వివరించాలని ఎంపీలకు వైఎస్సార్సీపీ పార్టీ పార్లమెంటరీ సమావేశాల్లోనూ దిశానిర్దేశం చేశారు కూడా.ఏపీలో సామాన్యులపై జరుగుతున్న అకృత్యాలతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి వైఎస్ జగన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఎంపీల నుంచి సామాన్యుల దాకా ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని, ముఖ్యంగా వైఎస్సార్సీపీని అణచివేసే కుట్ర జరుగుతోందని గవర్నర్‌కు నివేదించారు. ఇప్పటిదాకా జరిగిన ఘటనలను వివరాలను ఆధారాలతో సహా గవర్నర్‌కు సమర్పించిన జగన్.. వాటన్నింటిపైనా దర్యాప్తు చేయించాలని కోరారు. కళ్లెదుటే ఘోరాలు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం వాటిని నిలువరించే సాహసం చేయలేకపోతోందని జగన్ ఆ సమయంలో ఆవేదన వ్యక్తం చేశారు. -
చంద్రబాబు... దాడుల్ని తక్షణం ఆపండి: అయోధ్య రామిరెడ్డి
గుంటూరు, సాక్షి: ఏపీలో అరాచక పరిస్థితులు దేశప్రజలందరికీ తెలిసేలా ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చెబుతున్నారు. శనివారం తాడేపల్లిలో జరిగిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాడులు జరుగుతున్నాయి. టీడీపీ దాడులపై పార్లమెంటరీ సమావేశంలో చర్చించాం. టీడీపీ దాడులపై పార్లమెంట్లో లేవనెత్తాలని జగన్ సూచించారు. ఆయన సూచనల మేరకు పార్లమెంట్‌లోనూ మేం పోరాడతాం. రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రిలను కలుస్తాం. ఇక్కడి పరిస్థితులు దేశమంతా తెలిసేలా ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నాం. ఇలాంటి దాడులు సరికాదు.. పైగా ప్రజాస్వామ్యానికి ముప్పు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత చంద్రబాబు మీదే ఉంది. చంద్రబాబు తక్షణం ఈ దాడులు ఆపాలి. ప్రజలకు మంచి చేసేలా పాలన కొనసాగాలని కోరుకుంటున్నాం అని అన్నారాయన. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తోందని, దానిని వైఎస్సార్సీపీ అడ్డుకుని తీరుతుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వినుకొండలో వైఎస్సార్సీపీ యువకార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక సందేశం ఉంచారు.ఈ నెల 24వ తేదీ బుధవారం న్యూఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేపడతాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక గత 45 రోజుల్లో రాష్ట్రంలో అరాచకాలే రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ధర్నా అని స్పష్టం చేశారాయన. We will be holding a peaceful protest in New Delhi on the 24th of this month, the coming Wednesday. This is to draw the nation’s attention to the lawlessness and anarchy that have plagued Andhra Pradesh in the 45 days since the Chandrababu Naidu regime has come to power. We have…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2024అసెంబ్లీలో కూడా నిలదీస్తాంఅలాగే.. చంద్రబాబు ఆటవిక పాలనకు నిరసనగా బుధవారం ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్రంలో 45 రోజుల్లో క్షీణించిన శాంతిభద్రతల అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్తాం. అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, హోంమంత్రి శ్రీ అమిత్‌షా అపాయింట్‌మెంట్లుకూడా కోరాం. అనుమతి రాగానే రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులను వారికి వివరిస్తాం అని తెలుగులో మరో ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆటవిక పాలనకు నిరసనగా బుధవారం ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్రంలో 45 రోజుల్లో క్షీణించిన శాంతిభద్రతల అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్తాం. అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, హోంమంత్రి శ్రీ అమిత్‌షా అపాయింట్‌మెంట్లుకూడా కోరాం.…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2024ఆ తల్లిదండ్రులకు సమాధానమేది?మరోవైపు.. రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన తెలియజేశారు. ‘‘పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో క్రూరమైన హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించాను.రాజకీయ కక్షలతో తన కొడుకును పొట్టనబెట్టుకున్నారంటూ ఆ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధ్యాప్యంలో తోడుగా నిలవాల్సిన కొడుకు దారుణ హత్యకు గురికావడం వారిని మరింత కుంగదీసింది.ఆ తల్లిదండ్రుల ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆటవిక పాలనకు బలైన ఆ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా నిలుస్తుంది.రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందడనడానికి రషీద్ హత్యే ఒక ఉదాహరణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. టీడీపీ వాళ్ల వేధింపులు భరించలేక 37 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 300 మందికి పైగా హత్యాయత్నాలు జరిగాయి అని ట్వీట్ చేశారాయన.పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో క్రూరమైన హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించాను. రాజకీయ కక్షలతో తన కొడుకును పొట్టనబెట్టుకున్నారంటూ ఆ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తంచేశారు. వృద్ధ్యాప్యంలో తోడుగా నిలవాల్సిన కొడుకు దారుణ హత్యకు గురికావడం వారిని మరింత… pic.twitter.com/5mP4MnAYV0— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2024 -
దేశం దృష్టికి ఏపీ అరాచక పాలన.. ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా
పల్నాడు, సాక్షి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దానిని దేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నారు. వినుకొండలో హత్యకు గురైన యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. వ్యక్తిగత కారణాలని క్రియేట్ చేశారు. కానీ, కేవలం వైఎస్సార్సీపీ కోసం పని చేశాడని రషీద్‌ను హత్య చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. హత్యలు చేస్తున్నారు. మా ఎంపీ, ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారు. మిథున్‌రెడ్డి, రెడ్డప్పపై దాడి చేశారు. దాడి చేసింది కాకుండా.. వాళ్లపైనే మర్డర్ కేసు పెట్టారు. గత ఐదేళ్లలో ఎన్నాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. లోకేష్ రెడ్‌బుక్ ప్రకారమే ఇదంతా జరుగుతోంది. దాడులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలి. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తాం. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం... ఏపీలో జరుగుతున్న దాడులపై, అరాచకపాలనపై ప్రధాని మోదీ సహా అందరినీ కలుస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని వివరిస్తాం. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తాం’’ అని అన్నారాయన. ఇక.. వచ్చే బుధవారం ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా జరుగుతుందని, ఇందులో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొంటారని వైఎస్సార్సీపీ ప్రకటించింది.